స్నేహితుల ప్రభావం (Influence of friends)

friendsహదీథ్ ׃ 12

: స్నేహితుల ప్రభావం : تأثير الأصدقاء على الإنسان

عَنْ أَبِىْ مُوْسى الْأَشْعَرِي  رَضِي الله عَنْهُ قَالَ،  قَالَ رَسُوْلُ  اللهِ  صَلَّى اللهُ عَلَيهِ وَسَلَّمْ  : ” إِنَّمـَا مَثَلُ الْـجَلِيْسِ الصَّالِحِ وَ الْسُّوْءِ كَحَامِلِ  الـْمِسْكِ،  وَنَافِخِ الْكِيْرِ،  فَحَامِلُ  الْـمِسْكِ،  إِمَّا أَنْ يـُحْذِيَكَ،  وَ إِمَّا أَنْ  تَبْتَاعَ  مِنْهُ،  وَإِمَّا أَنْ تَـجِدَ مِنْهُ  رِيْـحًا طَـيِّـبـَةً،  وَنَافِخُ  الْكِيْرِ  إِمَّا أَنْ يـُّحْرِقَ  ثِيَابَكَ،  وَ إِمَّا أَنْ تـَجِدَ  رِيـْحًا خَبِيْثَةً “ .رواه البخارى

అన్ అబి మూసా అల్ అష్అరీ రదియల్లాహు అన్హు ఖాల, ఖాల రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం: “ఇన్నమా మథలుల్  జలీసిశ్శాలెహి వస్సూయి, కహామిలిల్ మిస్కి , వ నాఫిఖిల్ కీర్, ఫహామిలుల్ మిస్కి, ఇమ్మా ఐయుహ్ దియక, వ ఇమ్మా అన్   తబ్ తాఅ  మిన్ హు, వ ఇమ్మా అన్ తజిద మిన్ హు రీహన్ తయ్యిబ, వ నాఫిఖుల్ కీరి, ఇమ్మా అన్ యుహ్ రిఖ థియాబక్, వ ఇమ్మా అన్ తజిద రీహన్ ఖబీథతన్” బుఖారి.

తాత్పర్యం :- అన్ = ఉల్లేఖించారు, అబి మూసా అల్ అషఅరీ = ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివసల్లం  యొక్క సహచరుడు. రదియల్లాహు అన్హు = అల్లాహ్ ఆయనను ఆమోదించుగాక, ఖాల = చెప్పారు, ఖాల  రసూలల్లాహ్ =  ప్రవక్త తెలిపారు, సల్లల్లాహు అలైహివసల్లం = అల్లాహ్ ఆయనపై శాంతి పంపుగాక,  ఇన్నమ =  నిశ్చయంగా, మథలుల్ = ఉదాహరణ,  జలీసి = తో ఉండటం (కలిసి), శ్శాలెహి = పుణ్యవంతులు, వస్సూయి = దుర్గుణాలు కలవారు(పాపాత్ములు), క = పోలిక, హామిలిల్ మిస్కి = కస్తూరి (వంటి సుగంధాలు) అమ్మేవారు, వ = మరియు, నాఫిఖిల్ కీరి =కమ్మరివాడు.

ఫ = అలాగే, హామిలుల్ మిస్కి = కస్తూరి (వంటి సుగంధాలు) అమ్మేవారు, ఇమ్మా = రెంటిలో ఒకటి (అదిగాని, ఇదిగాని), ఐ యుహ్ దియక = బహుమతిగా పొందటం, వ = మరియు, ఇమ్మా = లేక,  అన్ తబ్ తాఅ = కొనటం,  మిన్ హు = అతని వద్ద నుంచి, వ = మరియు, ఇమ్మా = లేక,  అన్ తజిద = పొందటం, లభించటం, మిన్ హు = అతని వద్ద నుంచి, రీహన్ = వాసన, తయ్యిబ = మంచి, వ = మరియు, నాఫిఖుల్ కీరి = కమ్మరివాడు, ఇమ్మా = లేక, అన్ యుహ్ రిఖ = కాల్చబడటం, థియాబక = దుస్తులు, వ = మరియు, ఇమ్మా = లేక, అన్ తజిద = పొందటం, లభించటం, రీహన్ = వాసన, ఖబీథన్ = దుర్వాసన

అనువాదం:-అబి మూసా అల్ అష్ అరీ రదియల్లాహు అన్హు ఇలా ఉల్లేఖించారు – ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు “పుణ్యపురుషుల మరియు దుర్గుణాలు కలవారి సహచర్యం యొక్క ఉదాహరణ కస్తూరి (వంటి సుగంధాలు) అమ్మేవారి మరియు కమ్మరి పని చేసే వారి సహచర్యంతో పోలి ఉన్నది. కస్తూరి (వంటి సుగంధాలు) అమ్మేవారి నుండి బహుమతిగా (ఉచితంగా) మీకు కస్తూరి లభించవచ్చు లేక మీరు అతడి నుండి కస్తూరిని కొనుక్కోవచ్చు లేక మీకు సువాసన లభిస్తుంది (మీ దుస్తులు సువాసనను పీల్చుకుంటాయి). దీనికి భిన్నంగా కమ్మరి పని చేసే వారి దగ్గర ఉండటం (అగ్ని రవ్వలు పడటం) వలన మీ దుస్తులు కాలి పోతాయి లేక వాని నుండి చెడువాసన (దుర్గంధం) లభిస్తుంది.

వివరణ:- ఈ హదీథ్ లో మంచి గుణాలుకలవారి మరియు పుణ్యపురుషుల సహచర్యం యొక్క ఆవశ్యకత చాలా వివరంగా ఉదాహరణలతో తెలుపబడినది. ఇదేవిధంగా చెడు వారి (దుర్గుణాలు కలవారి) నుండి దూరంగా ఉండమనే హెచ్చరిక కూడా చేయబడినది. మంచివారితో చేసే స్నేహాన్ని సుగంధాలమ్మే వారి స్నేహంతో మరియు చెడువారితో చేసే స్నేహం కమ్మరిపని చేసేవారి స్నేహంతో పోల్చబడినది. అదేవిధంగా పుణ్యపురుషులతో ఉండటం వలన మంచి పనులు చేయటంలో ప్రోత్సాహం లభిస్తుంది. అలాగే  చెడువారితో ఉండటం వలన చెడు పనులు చేయటంలో ప్రోత్సాహం లభిస్తుంది.

ఈ హదీథ్ వలన కలిగే లాభలు:-

 1. మంచి వారితో కలసి ఉండవలెను మరియు మన పిల్లలను కూడా మంచి వాళ్ళతో కలసి ఉండేటట్లు చూడవలెను.
 2. మంచి మరియు చెడు అలవాట్లు అలవర్చుకోవటంలో మన మీద మన స్నేహితుల ప్రభావం ఉంటుంది.
 3. అల్లాహ్ చూపిన దారిలో నడిచేవారితో ఉండటం వలన మీకు ఉపయోగం కలుగుతుంది.
 4. పుణ్యపురుషులు మంచిపనులు చేయటానికి మరియు చెడు పనులు చేయకుండా ఉండటానికి సహాయం చేస్తారు.
 5. మనతోటి ముస్లిం సోదరులను నమాజు చదవకుండా ఉండేవాళ్ళ స్నేహం నుండి, సిగరెట్ తాగటం, జూదం ఆడటం వంటి చెడు అలవాట్లు ఉన్నవాళ్ళ స్నేహం నుండి ఆపటం,కాపాడటం ప్రతి ముస్లిం బాధ్యత.

హదీథ్  ఉల్లేఖించినవారి పరిచయం:- అబు మూసా అబ్దుల్లాహ్ బిన్ ఖైస్ బిన్ ముస్లిం అల్ అషఅరీ రదియల్లాహు అన్హు ప్రసిద్ధి చెందిన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహచరులలోని వారు. కూఫాపట్టణ గవర్నర్ గా  పనిచేసారు. 50హి సంవత్సరంలో చనిపోయారు. వీరు మృదుమధురంగా ఖుర్ఆన్ పఠనం చేసేవారు.

ప్రశ్నలు

 1. “ఇన్నమ మథలుల్  జలీసిశ్శాలెహి వస్సూయి, కహామిలిల్ మిస్కి , వ నాఫిఖిల్ కీరి, ఫహామిలుల్ మిస్కి, ఇమ్మా ఐ ________, వ ఇమ్మా అన్ ________మిన్ హు, వ ఇమ్మా అన్ తజిద మిన్ హు రీహన్ ________, వ నాఫిఖుల్ కీరి, ఇమ్మా అన్ ________ థియాబక, వ ఇమ్మా అన్ తజిద రీహన్ ________” బుఖారి.
 2. పుణ్యపురుషుల యొక్క స్నేహం ________ అమ్మేవారితోటి స్నేహం లాంటిది.
 3. ______________యొక్క స్నేహం కొలిమిలో పని చేసే కమ్మరివారి స్నేహం లాంటిది.
 4. కస్తూరి (వంటి సుగంధాలు) అమ్మేవారి నుండి మీకు ఏ ఏ లాభాలు కలగవచ్చు?
 5. కమ్మరి పని చేసే వారి దగ్గరకు పోవటం వలన మీకు ఏ ఏ నష్టాలు కలగవచ్చు?
 6. మంచి గుణాలుకలవారి స్నేహం మంచిదా లేక దుష్టుల స్నేహం మంచిదా?
 7. కనీసం 5 మంచిగుణాలను, 5 చెడుగుణాలను వ్రాయండి.
 8. మంచిగుణం మరియు చెడు గుణం నిర్వచించండి.
 9. చెడువారి (దుర్గుణాలు కలవారి) నుండి ________ ఉండవలెను.
 10. పుణ్యపురుషులతో ఉండటం వలన ________ చేయటం లో ప్రోత్సాహం లభిస్తుంది.
 11. చెడువారితో ఉండటం వలన ________ చేయటం లో ప్రోత్సాహం లభిస్తుంది.
 12. మంచి వారితో ________ ఉండవలెను మరియు మన పిల్లలను కూడా మంచి వాళ్ళతో _______  ఉండేటట్లు చూడవలెను.
 13. మంచి మరియు చెడు అలవాట్లు అలవర్చుకోవటంలో మన మీద మన స్నేహితుల ________  ఉంటుంది.
 14. అల్లాహ్ చూపిన దారిలో నడిచేవారితో ఉండటం వలన మీకు _____  కలుగుతుంది.
 15. పుణ్యపురుషులు మంచిపనులు చేయటానికి మరియు చెడు పనులు చేయకుండా ఉండటానికి ________  చేస్తారు.
 16. మనతోటి ముస్లిం సోదరులను నమాజు చదవకుండా ఉండేవాళ్ళ స్నేహం నుండి, సిగరెట్ తాగటం మరియు జూదం ఆడటం వంటి చెడు అలవాట్లు ఉన్నవాళ్ళ స్నేహం నుండి కాపాడటం ప్రతి ముస్లిం ________
 17. అబు మూసా అబ్దుల్లాహ్ అల్ అషఅరీ రదియల్లాహు అన్హు గురించి వ్రాయండి.

Source : హదీథ్ – మొదటి స్థాయి (రబువ జాలియాత్ – రియాద్)
అనువాదం : –  సయ్యద్ యూసుఫ్ పాషా

%d bloggers like this: