క్షమాగుణం & సహనశీలత్వం (Patience & Forgiveness)

హదీథ్׃ 11

క్షమాగుణం & సహనశీలత్వం العفو والتسامح

عَنْ عَاﺋِـشَةَ رضى الله عنها أَنَّهَا قَالَتْ : مَا خُيِّرَ رَسُوْلُ اللهِ ^  بَيْنَ أَمْرَيْنِ ﺇِلاَّ أَخَذَ أَيْسَرَهُمَا مَا لَـمْ يَكُنْ ﺇِثْماً ، فَإِنْ كَانَ ﺇِثْماً كَانَ أَبْعَدَ النَّاسِ مِنْهُ ، وَ مَا اَنْتَقَمَ رَسُولُ اللهِ ^ لِنَفْسِهِ ﺇِلاَّ أَنْ تُنْتَهَكَ حُرْمَةُ اللهِ فَيَنْـتَـقِمُ ِللهِ بِهَا (رواه البخارى)

అన్ ఆయిషత  రదియల్లాహు అన్హా  అన్నహా ఖాలత్ – మా ఖుయ్యిర ర్రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం,  బైన అమరైని, ఇల్లా అఖద ఐసర హుమా మాలమ్ యకున్ ఇథ్మన్, ఫఇన్ కాన, ఇథ్మన్, కాన అబ్ అదన్నాసి మిన్హు, వమా అన్ తఖమ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం లినఫ్ సిహి, ఇల్లా అన్ తున్ తహక, హుర్ మతుల్లాహి ఫయన్ తఖిము లిల్లాహి బిహా” రవాహ్ బుఖారి మరియు ముస్లిం.

తాత్పర్యం:- అన్ =ఉల్లేఖన, ఆయిషత  రదియల్లాహు అన్హా = ఆయిష అనే పేరు గల ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క భార్య, అన్నహా, ఖాలత్ = ఖచ్ఛితంగా ఆవిడ చెప్పారు, మా ఖుయ్యిర = ఎన్నుకునేవారు కాదు,  రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం = ప్రవక్త, బైన = మధ్య, అమరైని = రెండు విషయాల, ఇల్లా = కాని (తప్పక), అఖద = ఎన్నుకున్నారు, ఐసర హుమా = ఆ రెండు విషయాలలో తేలికైనది (సులభమైనది), మాలమ్ యకున్ = అప్పటివరకు జరగకపోవటం,  ఇథ్మన్ = అపరాథం, ఫఇన్ = కాని,  కాన = జరగటం , ఇథ్మన్ = అపరాధం, కాన = ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లమ్) ఉండేవారు, అబ్ అదన్నాసి = ప్రజలలో అందరికంటే దూరంగా, మిన్హు = దానినుండి , వ = మరియు ,  మా ఇన్ తఖమ = ప్రతీకారం తీసుకోలేదు, రసూలుల్లాహి = ప్రవక్త,  సల్లల్లాహు అలైహి వసల్లం  = అల్లాహ్ ఆయనను ఉన్నతస్థానానికి చేర్చుగాక, లి నఫ్ సిహి = తనకోసం, ఇల్లా = కాని, అన్ తున్ తహక = నష్టం కలిగించటం, హుర్ మతుల్లాహి = అల్లాహ్ ద్వారా నిషేధించబడినవి, ఫయన్ తఖిము = వారు ప్రతీకారం తీసుకునేవారు, లిల్లాహి బిహా = కేవలం అల్లాహ్ కోసం. సహీబుఖారి మరియు సహీముస్లిం హదీథ్ గ్రంథాలలో రికార్డుచేయబడినది.

అనువాదం:- ఆయిష రదియల్లాహు అన్హా  ఇలా ఉల్లేఖించారు – ఎప్పుడైనా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రెండు విషయాలలో ఏదో ఒకటి ఎన్నుకునే అవకాశం ఉన్నట్లైతే, అపరాధం (దైవశాసనానికి వ్యతిరేకం) కానంతవరకు వారు తేలికైన విషయాన్నే ఎంచుకునేవారు. కానీ ఒకవేళ అది అపరాధమైనదైతే (దైవశాసనానికి వ్యతిరేకమైన విషయమైతే), ప్రజలందరిలోను ఆయనే దానికి ఎక్కువ దూరంగా ఉండేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన (వ్యక్తిగత కారణాల) కోసం ఎప్పుడూ ఏ విషయంలోనూ ప్రతీకారం తీర్చుకోలేదు. కానీ ఎప్పుడైతే అల్లాహ్ యొక్క ఆదేశాలకు నష్టం కలుగుతుందో అటువంటి సందర్భాలలో వారు అల్లాహ్ కోసం ప్రతీకారం తీర్చుకునే వారు. [బుఖారి మరియు ముస్లిం ]

వివరణ:- ఇస్లాం సౌలభ్యతకు, తద్వారా శాంతికీ, సహనానికి ఉదాహరణ అని ఈ హదీథ్ తెలియపర్చుచున్నది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడూ ఉత్తమమైన విషయాలనే బోధించారు. అపరాధపు గుర్తులు ఏమాత్రం కనిపించినా మిగతా వారందరి కంటే ముందుగా అటువంటి విషయాలకు దూరమయ్యేవారు. అదే విధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తనపై జరిగిన ఏవిధమైన హింసాయుత సంఘటనకు, అందులో పాల్గొన్నవారిపై ఎప్పుడూ ప్రతీకారం తీర్చుకోలేదు. పైగా వారిని శిక్షించే అవకాశమున్నా  వారిని క్షమించి వదిలివేసారు. తన పై కత్తి దూసి దుర్భాషలాడిన అరబ్ ఎడారి వాసినీ, తన మెడలో కండువా (అంగవస్త్రం)వేసి – కనుగ్రుడ్లు ఉబికి వచ్చేటంత విపరీతంగా చుట్టి (మెలివేసి), గుంజి, తన ప్రాణాలు తీయాలని ప్రయత్నించిన మరో వ్యక్తినీ క్షమించి వదిలివేయడం – ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క క్షమాగుణానికి, సహనానికి ప్రతీకలు.

అల్లాహ్ యొక్క పవిత్రతకు, ఔన్నత్యానికీ, గౌరవానికీ భంగం కలిగించిన వారి విషయంలో అల్లాహ్ కోసం తప్ప తన వ్యక్తిగత కారణాలకోసం ఎప్పుడూ ఎవరిపైనా ప్రతీకారం తీర్చుకోని కరుణామూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని పై ఉదాహరణలు స్పష్టం చేస్తున్నాయి.

ఈ హదీథ్ అమలు చేయడం వలన కలిగే లాభాలు :-

 1. ఇస్లాం – అపరాధం (అల్లాహ్ శాసనానికి వ్యతిరాకం) కానంతవరకూ, అన్ని విషయాల్లోనూ సౌలభ్యానికీ, సహనానికీ పెద్దపీట వేసే ధర్మం అని గమనించాలి
 2. క్షమాగుణం, సహనం ముస్లింలలో సామరస్యానికీ, భ్రాతృత్వానికీ దారి తీస్తాయి.
 3. క్షమాగుణం, సహనం, ఓర్పు పాటించడంలో  ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ను  ఉదాహరణగా తీసుకోవాలి.
 4. విశ్వాసులలో ఇతరులను క్షమించే గుణం కలవారు, సహనశీలురు అల్లాహ్ వద్ద గొప్ప ప్రతిఫలం పొందుతారనే విషయాన్ని గర్తుంచుకోవాలి.
 5. క్షమాగుణం, సహనశీలత అనేవి మానవహక్కులకు సంబంధించినవే కానీ, భగవద్దత్తమైన (Divine Rights) హక్కులు కావు అని గమనించండి.
 6. క్షమాగుణం, సహనశీలత అనేవి చేతగానితనం, బలహీనత, పిరికితనం వల్ల బయటపడే గుణాలు కావు. కేవలం అల్లాహ్ వద్ద ప్రతిఫలం పొందే ఆకాంక్ష మాత్రమే వాటిని ప్రేరేపిస్తుంది.
 7. చెడును వ్యతిరేకించకపోవడం క్షమాగుణం, సహనశీలత కానేకావు.

హదీథ్  ఉల్లేఖించినవారి పరిచయం :- ఆయిషత  రదియల్లాహు అన్హా  విశ్వాసులందరికీ తల్లిలాంటివారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం భార్యలలో ఒకరు. వీరు అబూబకర్ సిద్ధీఖ్ రదియల్లాహు అన్హు కుమార్తె. ఇస్లాం కు సంబంధించిన విషయంలో వీరు ఒక గొప్ప విద్యావేత్త (ఫఖీ) గానూ, నిష్ణాతురాలిగానూ పేరు గాంచారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హదీథులలో చాలా వరకు వీరు ఉల్లేఖించినవే.

ప్రశ్నలు

 1. ఎప్పుడైనా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రెండు విషయాలలో ఏ ఒక్కదానినైనా ఎన్నుకోవలసివస్తే, ______________________ కానంతవరకు వారు __________ విషయాన్నే ఎన్నుకునేవారు. కానీ ఒకవేళ అది ________________, దానిని పరిహరించడంలో (వర్జించు, దాని నుండి తొలగి ఉండు), చాలా__________ ఉండేవారు.
 2. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తనపై ___________  అరేబియన్ ఎడారివాసినీ, తన మెడలో కండువా (అంగవస్త్రం)వేసి, కనుగ్రుడ్లు ఉబికి వచ్చేటంత కఠినంగా విపరీతంగా చుట్లుచుట్టి (మెలివేసి) గుంజి, తనను ___________  మరో వ్యక్తినీ క్షమించి వదిలివేశారు.
 3. తన మెడలో ________ వేసి, _________ ఉబికి వచ్చేటంత విపరీతంగా చుట్లుచుట్టి (మెలివేసి) గుంజిన మరో వ్యక్తినీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం క్షమించి వదిలివేశారు.
 4. ఇస్లాం – ___________ ___________  కానంతవరకూ, అన్ని విషయాల్లోనూ ___________, ___________  పెద్దపీట వేసే మతం అని గమనించాలి.
 5. _________, _________ముస్లింలలో సామరస్యానికీ, భ్రాతృత్వానికీ దారి తీస్తాయి.
 6. ______________, ______________ పాటించడంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ఉదాహరణగా తీసుకోవాలి.
 7. విశ్వాసులలో – ఇతరులను ________గుణం కలవారు, _________ అల్లాహ్ వద్ద గొప్ప    _________  పొందుతారనే విషయాన్ని గర్తుంచుకోవాలి.
 8. క్షమాగుణం, సహనశీలత అనేవి ______________ సంబంధించినవే కానీ, భగవద్దత్తమైన  (Divine Rights) హక్కులు కావు అని గమనించండి.

Source : హదీథ్ – మొదటి స్థాయి (రబువ జాలియాత్ – రియాద్)
అనువాదం : –  సయ్యద్ యూసుఫ్ పాషా

%d bloggers like this: