మీలో ఎవరూ నిలబడి నీళ్ళు త్రాగరాదు [వీడియో]

మీలో ఎవరూ నిలబడి నీళ్ళు త్రాగరాదు | బులూగుల్ మరాం | హదీస్ 1246
https://youtu.be/K_dzRSUXsPQ [5 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

1246. హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రబోధించారు: “మీలో ఎవరూ నిలబడి నీళ్ళు త్రాగరాదు.” (ముస్లిం)

సారాంశం: నిలబడి నీళ్ళు త్రాగటాన్ని ఈ హదీసు వారిస్తుంది. ఈ వారింపును మెజారిటీ విద్వాంసులు నహీయె తన్జీహీ’గా పరిగణించారు. అయితే ఇబ్నె హజమ్ గారు నిలబడి నీరు త్రాగటం నిషిద్ధం (హరామ్) అని అభిప్రాయపడ్డారు. మరికొంతమంది పండితులు నిలుచుని నీళ్ళు త్రాగటాన్ని ‘మక్రూహ్’ (అవాంఛనీయం, అయిష్టకర విషయం)గా తలపోశారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు జమ్ జమ్ జలాన్ని నిలబడి త్రాగినట్లు ఆధారముంది. బహుశా ఈ కారణంగానే మెజారిటీ విద్వాంసులు ఈ వారింపును ‘నిషిద్దాంశం’గా పేర్కొనలేదేమో!

యూట్యూబ్ ప్లే లిస్ట్ – బులూగుల్ మరాం – కితాబుల్ జామి :
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV266FkpuZpGacbo51H-4DV3

మా యూట్యూబ్ ఛానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి ఇన్ షా అల్లాహ్:
http://www.youtube.com/user/teluguislam?sub_confirmation=1

భోజనం చేస్తే, మీ చేతిని స్వయంగా నాకి తిననంత వరకూ శుభ్రం చేయకూడదు [వీడియో]

భోజనం చేస్తే, మీ చేతిని స్వయంగా నాకి తిననంత వరకూ శుభ్రం చేయకూడదు | బులూగుల్ మరాం | హదీస్ 1241
https://youtu.be/KsVqBgnFwmo [9 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

1241. హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ఉపదేశించారు:

మీలో ఎవరయినాసరే భోజనం చేస్తే, మీ చేతిని స్వయంగా నాకి తిననంత వరకూ, లేక నాకి తినిపించనంత వరకూ శుభ్రం చేయకూడదు.” (బుఖారీ, ముస్లిం)

సారాంశం:

ఈ హదీసులో భోజన మర్యాదల్లోని ఒకానొక మర్యాద తెలుపబడింది. హదీసు పదజాలం కొందరికి సంస్కార విహీనం అనిపించవచ్చు. కాని ధార్మికంగా అందులో ఎన్నో పరమార్థాలు ఇమిడి ఉన్నాయి. మనిషి భుజించే ఆహారం అల్లాహ్ ప్రసాదితం. అల్లాహ్ ప్రసాదితం పట్ల మనిషిలో నిర్లక్ష్య వైఖరి ఏమాత్రం శోభాయమానం కాదు. అన్నం తినే సమయంలో అతనెంతో వినయంగా, సంస్కారవంతునిలా కూర్చోవాలి. మెతుకులు క్రింద పడకుండా తినాలి. కంచంలో భోజన పదార్థాలను ఎంగిలిచేసి వదలకుండా పూర్తిగా తినాలి. చేతివ్రేళ్లకు తగిలి వున్న పదార్థం సయితం వృధా కాకుండా శుభ్రంగా నాకి తినాలి – ఈ చేష్టలన్నీ అల్లాహ్ అనుగ్రహం పట్ల అతనికున్న శ్రద్ధాభక్తులను, కృతజ్ఞతా భావాన్ని సూచిస్తాయి. మనిషిలోని అహంకారాన్ని, మిడిసిపాటును త్రుంచటం కూడా ఇందలి పరమార్థాల్లో ఒకటి. అదీగాక, అతను తినే భోజనంలో అల్లాహ్ ఏ భాగంలో ‘శుభాన్ని’ పొందుపరచి ఉంచాడో దాసునికి తెలీదు. అందుకే ఈ విధంగా తాకీదు చేయటం జరిగింది.

యూట్యూబ్ ప్లే లిస్ట్ – బులూగుల్ మరాం – కితాబుల్ జామి :
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV266FkpuZpGacbo51H-4DV3

మా యూట్యూబ్ ఛానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి ఇన్ షా అల్లాహ్:
http://www.youtube.com/user/teluguislam?sub_confirmation=1

Other Links:

డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినవచ్చా? [వీడియో]

బిస్మిల్లాహ్

[2 నిముషాలు ]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

తిన్న తర్వాత, త్రాగిన తర్వాత అల్‌హందు లిల్లాహ్‌ అనండి

తిన్నత్రాగిన తర్వాత అల్‌ హందులిల్లాహ్‌ అనండి: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలిపారని అనస్‌ బిన్‌ మాలిక్‌ ఈ ఉల్లేఖించారు: “మానవుడు ఏదైనా తిన్న తర్వాత లేదా ఏదైనా త్రాగిన తర్వాత అల్‌ హందు లిల్లాహ్‌ అనడం అల్లాహ్‌కు చాలా ఇష్టం. (ముస్లిం 2734). [పుణ్యఫలాలు| ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, జుల్ఫీ].

ఆహారంలో లోపం ఎత్తి చూపకూడదు

1336. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం :-

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఎన్నడూ ఏ ఆహారంలో కూడా లోపం ఎత్తి చూపలేదు. ఆయనకు ఇష్టమయితే తినేవారు, ఇష్టం లేకపోతే మానేసేవారు. (అంతేగాని అందులో అది బాగా లేదు, ఇది బాగా లేదని లోపం ఎత్తి చూపేవారు కాదు).

[సహీహ్ బుఖారీ : 61 వ ప్రకరణం – మనాఖిబ్, 23 వ అధ్యాయం – సిఫతిన్నబియ్యి (సల్లల్లాహు అలైహి వసల్లం)]

పానీయాల ప్రకరణం : 35 వ అధ్యాయం – అన్నంలో లోపం ఎత్తి చూపకూడదు
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) Vol. 1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్