2.12 – వ్యాధులు & వైద్యం – మహా ప్రవక్త మహితోక్తులు

మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్) (Al-Lulu-wal-Marjaan) .  

1411 – حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: الْعَيْنُ حَقٌّ
__________
أخرجه البخاري في: 76 كتاب الطب: 36 باب العين حق

1411. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేశారు:- “దిష్టి తగలడం వాస్తవమే”. (సహీహ్ బుఖారీ:- 76వ ప్రకరణం – తిబ్, 3వ అధ్యాయం-ఆల్ ఐను హఖ్ )

1412 – حديث عَائِشَةَ، قَالَتْ: كَانَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ سُحِرَ، حَتَّى كَانَ يَرَى أَنَّهُ يَأْتِي النِّسَاءَ وَلاَ يَأْتِيهِنَّ قَالَ سُفْيَانُ (أَحَدُ رِجَالِ السَّنَدِ) وَهذَا أَشَدُّ مَا يَكُونُ مِنَ السِّحْرِ إِذَا كَانَ كَذَا فَقَالَ: يَا عَائِشَةُ أَعَلِمْتِ أَنَّ اللهَ قَدْ أَفْتَانِي فِيمَا اسْتَفْتَيْتُهُ فِيهِ أَتَانِي رَجُلاَنِ فَقَعَدَ أَحَدُهُمَا عِنْدَ رَأْسِي، وَالآخَرُ عِنْدَ رِجْلَيَّ، فَقَالَ الَّذِي عِنْدَ رَأْسِي لِلآخَرِ: مَا بَالُ الرَّجُلِ قَالَ: مَطْبُوبٌ قَالَ: وَمَنْ طَبَّهُ قَالَ: لُبَيْدُ ابْنُ أَعْصَمَ، رَجُلٌ مِنْ زُرَيْقٍ، حَلِيفٌ لِيَهُودَ، كَانَ مُنَافِقًا قَالَ: وَفِيمَ قَالَ: فِي مُشْطٍ وَمُشَاقَةٍ قَالَ: وَأَيْنَ قَالَ: فِي جُفِّ طَلْعَةٍ ذَكَرٍ تَحْتَ رَعُوفَةٍ، فِي بِئْرِ ذَرْوَانَ قَالَتْ: فَأَتَى النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ الْبِئْرَ حَتَّى اسْتَخْرَجَهُ فَقَالَ: هذِهِ الْبِئْرُ الَّتِي أُرِيتُهَا وَكَأَنَّ [ص:60] مَاءَهَا نُقَاعَةُ الْحِنَّاءِ، وَكأَنَّ نخْلَهَا رُؤُوسُ الشَّيَاطِينِ قَالَ: فَاسْتُخْرِجَ قَالَتْ: فَقُلْتُ أَفَلاَ، أَي، تَنَشَّرْتَ فَقَالَ: أَمَا وَاللهِ فَقَدْ شَفَانِي، وَأَكْرَهُ أَنْ أُثِيرَ عَلَى أَحَدٍ مِنَ النَّاسِ شَرًّا
__________
أخرجه البخاري في: 76 كتاب الطب: 49 باب هل يستخرج السحر

1412. హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం:-

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు చేతబడి చేయబడింది. దాని ప్రభావం వల్ల ఆయన తన భార్యలను కలుసుకోకపోయినా కలుసుకున్నానేమోనని అనుమానించేవారు – ఈ హదీసు ఉల్లేఖకుల్లో హజ్రత్ సుఫ్యాన్ (రహిమహుల్లాహ్) దీనిపై వ్యాఖ్యానిస్తూ, “ఎవరికైనా ఇలాంటి పరిస్థితి వస్తే అది చాలా తీవ్రమైన చేతబడి అని భావించాలి” అని అన్నారు –

తరువాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నాతో (అంటే హజ్రత్ ఆయిషా రదియల్లాహు అన్హాతో) ఇలా అన్నారు. ఆయిషా! నీకు తెలుసా? నేను అల్లాహ్ ని ఈ బాధ నుండి విముక్తి కలిగించమని వేడుకుంటే ఆయన దీనికి పరిష్కార మార్గం చూపించాడు.

(కలలో) నా దగ్గరికి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. వారిలో ఒకడు నా తలవైపు, మరొకడు నా కాళ్ళవైపు కూర్చున్నాడు. తలవైపు కూర్చున్నవాడు “ఇతనికి ఏమయింది?” అని అడిగాడు రెండవ వ్యక్తిని. “ఇతనికి చేతబడి చేశారు” అన్నాడు రెండవ వ్యక్తి. “ఎవరు చేశారు?” అడిగాడు మొదటి వ్యక్తి. “లుబైద్ బిన్ ఆసిమ్ చేశాడు” అన్నాడు రెండవ వ్యక్తి. (లుబైద్, బనీ జరఖ్ తెగకు చెందిన వాడు, కపట విశ్వాసి, యూదుల పక్షపాతి). “ఈ చేతబడి ఎందులో చేశాడు?” మొదటి వ్యక్తి ప్రశ్నించాడు. “దువ్వెన, దువ్వెనతో రాలిన వెండ్రుకలలో” సమాధానమిచ్చాడు రెండవ వ్యక్తి. “ఎక్కడ చేశాడు?” అడిగాడు మొదటి వ్యక్తి, “పోతు ఖర్జూరపు గుత్తి పొరలో పెట్టి జర్వాన్ బావిలో ఒక రాతి క్రింద అదిమి పెట్టాడు” అన్నాడు రెండవ వ్యక్తి.

ఆ తరువాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చేతబడిని (వస్తువుల్ని) తీసి వేయించడానికి (అనుచరుల్ని వెంట బెట్టుకొని) ఆ బావి దగ్గరకు వెళ్ళారు. “నాకు (కలలో) చూపించబడిన బావి ఇదే” అన్నారు ఆయన. ఆ బావిలోని నీరు గోరింటాకు రంగులా (ఎర్రగా) మారిపోయింది. అక్కడి ఖర్జూర చెట్లు కూడా పిశాచ తలలు మాదిరిగా తయారయిపోయాయి. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆజ్ఞతో ఆ బావిలోని చేతబడి (వస్తువుల)ని తీసివేయడం జరిగింది. ఆ తరువాత నేను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)తో మాట్లాడుతూ “మీరు చేతబడికి విరుగుడు ఎందుకు చేయలేదు?” అని అడిగాను. దానికి ఆయన సమాధానమిస్తూ, “దైవసాక్షి! అల్లాహ్ నాకు స్వస్థత చేకూర్చినప్పుడు, నేను అనవసరంగా ఇతరుల మీద లంఘించి జనంలో అలజడి సృష్టించడం బాగుండదు. అలా చేయడం నాకిష్టం లేదు” అని అన్నారు.


(సహీహ్ బుఖారీ:- 76వ ప్రకరణం – తిబ్, 49వ అధ్యాయం – హల్ యుస్తఖ్రజ్ అస్-సిహ్ర్)