ఖతీబ్: మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ, జుబైల్, సౌదీ ఆరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామిఈ
‘ఇస్లామీయ జుమా ప్రసంగాలు’ అనే పుస్తకం నుండి – రచన: మాజిద్ బిన్ సులైమాన్ అర్రస్సీ
ఖుత్బా అంశము:
ప్రవక్త ముహమ్మద్(సల్లల్లాహు అలైహి వసల్లం)యొక్క హక్కు: ఆయన కుటుంబీకులను గౌరవించడం
إنَّ الْحَمْدَ لِلهِ نَحْمَدُهُ وَنَسْتَعِينُهُ وَنَسْتَغْفِرُهُ، وَنَعُوذُ بِاللهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وَمِنْ سَيِّئَاتِ أَعْمَالِنَا، مَنْ يَهْدِهِ اللهُ فَلاَ مُضِلَّ لَهُ، وَمَنْ يُضْلِلْ فَلاَ هَادِىَ لَهُ، وَأَشْهَدُ أَنْ لاَ إِلَهَ إِلاَّ اللهُ وَحْدَهُ لاَ شَرِيكَ لَهُ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُه
يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ ٱتَّقُواْ ٱللَّهَ حَقَّ تُقَاتِهِۦ وَلَا تَمُوتُنَّ إِلَّا وَأَنتُم مُّسۡلِمُونَ١٠٢
يَٰٓأَيُّهَا ٱلنَّاسُ ٱتَّقُواْ رَبَّكُمُ ٱلَّذِي خَلَقَكُم مِّن نَّفۡسٖ وَٰحِدَةٖ وَخَلَقَ مِنۡهَا زَوۡجَهَا وَبَثَّ مِنۡهُمَا رِجَالٗا كَثِيرٗا وَنِسَآءٗۚ وَٱتَّقُواْ ٱللَّهَ ٱلَّذِي تَسَآءَلُونَ بِهِۦ وَٱلۡأَرۡحَامَۚ إِنَّ ٱللَّهَ كَانَ عَلَيۡكُمۡ رَقِيبٗا١
يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ ٱتَّقُواْ ٱللَّهَ وَقُولُواْ قَوۡلٗا سَدِيدٗا٧٠ يُصۡلِحۡ لَكُمۡ أَعۡمَٰلَكُمۡ وَيَغۡفِرۡ لَكُمۡ ذُنُوبَكُمۡۗ وَمَن يُطِعِ ٱللَّهَ وَرَسُولَهُۥ فَقَدۡ فَازَ فَوۡزًا عَظِيمًا٧١
మొదటి ఖుత్బా :-
స్తోత్రాలు మరియు దరూద్ తరువాత :
అన్నిటి కంటే ఉత్తమమైన మాట అల్లాహ్ మాట, మరియు అందరి కంటే ఉత్తమమైన పద్ధతి ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి పద్ధతి. అన్నిటి కంటే నీచమైనది ఇస్లాంలో కొత్తగా సృష్టించబడినవి, మరియు ఇస్లాంలో కొత్తగా సృష్టించబడిన ప్రతీ కార్యము బిద్అత్ క్రిందికే వస్తుంది మరియు ప్రతీ బిద్అత్ మార్గభ్రష్టత్వము మరియు ప్రతీ మార్గభ్రష్టత్వము నరకంలోకి తీసుకువెళ్ళేదే.
ఓ ముస్లిం లారా! అల్లాహ్ యొక్క దైవభీతిని కలిగి ఉండండి, ఆయనకు విధేయత చూపండి, ఆయన అవిధేయత నుండి జాగ్రత్త వహించండి. మరియు తెలుసుకోండి! మహా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారి హక్కులలో ఒక హక్కు మరియు అహ్లె సున్నత్ వల్ జమాఅత్ యొక్క అఖీదా ఏమిటంటే ఆయన కుటుంబ సభ్యులను (ఇంటి వారిని) గౌరవించాలి, ప్రేమించాలి మరియు వారి గురించి ప్రవక్త గారు చేసిన హితోపదేశానికి కట్టుబడి ఉండాలి.
ఈ ప్రాథమిక (అఖీదా)కి సంబంధించి అనేక ఆధారాలు ఉన్నాయి జైద్ బిన్ అర్ఖమ్ (రదియల్లాహు అన్హు) గారు ఉల్లేఖించారు మరియు ఈ విధంగా తెలియపరిచారు: ఒకసారి మహా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు మక్కా మరియు మదీనా మధ్యలో ఉన్నటువంటి “ఖమ్” అనే నీటి ప్రదేశం వద్ద నిల్చుని ప్రసంగించసాగారు. మొదటగా ఆయన అల్లాహ్ కు పొగడ్తలు తెలిపారు, ఆయనను ప్రశంసించారు ఆతర్వాత ఉపదేశించారు; ఈ విధంగా అన్నారు – “ఓ ప్రజలారా! నేను కూడా మీలాంటి మనిషినే. అతి త్వరలోనే అల్లాహ్ యొక్క మరణ దూత కూడా నా వద్దకు రావచ్చు మరియు నేను దానిని స్వీకరించవచ్చు. కాబట్టి నేను మీ మధ్యన రెండు గొప్ప విషయాలను వదిలి వెళుతున్నాను. మొదటిది అల్లాహ్ యొక్క గ్రంథము ఖురాన్. ఇందులో సన్మార్గం మరియు నూర్ ఉంది. కాబట్టి మీరు అల్లాహ్ గ్రంధాన్ని దృఢంగా పట్టుకోండి. మరియు రెండవ విషయం నా కుటుంబీకులు వీరి విషయంలో నేను మీకు అల్లాహ్ ను గుర్తు చేస్తున్నాను”. ఈ విధంగా మూడు సార్లు అన్నారు.
హుస్సేన్ అన్నాడు, ఓ జైద్! మీలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం వారి (అహ్లె-బైత్) కుటుంబీకులు ఎవరు? ఇందులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారి సతీమణులు లేరా? జైద్ అన్నారు “ప్రవక్త గారి సతీమణులు కూడా ఉన్నారు కానీ ఆయన కుటుంబీకులు ఎవరంటే జకాత్ నిషేధించబడిన వారు”. (ముస్లిం)
అబూబకర్ సిద్దిక్ (రదియల్లాహు అన్హు) ఇలా అన్నారు: “ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి కుటుంబీకులను రక్షించండి“. (బుఖారి)
ప్రవక్త కుటుంబం యొక్క సద్గుణాలకు సంబంధించిన అనేక హదీసులు ఉన్నాయి, అవి సహీహ్, సునన్, మసానిద్ హదీసు గ్రంథాలలో వివరంగా పేర్కొనబడ్డాయి.
ఇబ్న్ తైమియా (రహిమహుల్లాహ్) ఈ విధంగా తెలియపరిచారు: ఈ విషయంలో ఎటువంటి సందేహానికి తావు లేదు, అదేమిటంటే ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క అహ్లె-బైత్కు ఉమ్మత్ పై హక్కు ఏమిటంటే అందులో వారికి భాగస్వాములు ఎవరూ లేరు. వీరిపై ఉన్న ప్రేమకు మరియు సంరక్షణకు మరెవరు అర్హులు కాలేరు అని నమ్మడం. ప్రేమ మరియు సంరక్షతత్వానికి వీరు అర్హులైనట్లుగా మరే తెగవారు అర్హులు కాజాలరు. అదేవిధంగా ప్రేమ మరియు సంరక్షణకు అరబ్బులు అర్హులైనట్లుగా మరే ఇతర ఆదం సంతతి అర్హులు కాజాలరు. మరియు పండితుల యొక్క ఏకాభిప్రాయం ఏమిటంటే ఇతర దేశాలపై అరబ్బులకు, ఇతర అరబ్ తెగల కంటే ఖురేష్లకు మరియు మొత్తం ఖురైష్లపై బను హాషిమ్కు గొప్ప ఆధిక్యత సంతరించి ఉంది. (మిన్ హాజ స్సున్నహ్)
ఆ తర్వాత ఆయన వాసిలా బిన్ సఖా గారి హదీసుని తెలియజేశారు. ఇది పైన పేర్కొన్న ఘనతను సూచిస్తుంది. హదీసులో ఈ విధంగా ఉంది: నేను ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు తెలియజేస్తుండగా విన్నాను; “నిశ్చయంగా అల్లాహ్ తఆలా ఇస్మాయిల్ యొక్క సంతతిలో కినానా నీ ఎంపిక చేశాడు, కినానా ఖురేష్ ని ఎన్నుకున్నాడు, మరియు ఖురైష్ నుండి బనూహాషిమ్ ను ఎంపిక చేసి, బనూహాషిమ్ నుండి నేను ఎన్నుకోబడ్డాను”. (ముస్లిం)
ఓ విశ్వాసులారా! ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి సతీమణులు ఆయన కుటుంబీకుల లోని వారే. అల్లాహ్ దివ్య ఖురాన్ లో ఇలా సెలవిచ్చాడు:
﴿إنما يريد الله ليذهب عنكم الرجس أهل البيت ويطهركم تطهيرا﴾
(ఓ ప్రవక్త ఇంటివారలారా! మీ నుండి (అన్ని రకాల) మాలిన్యాన్ని దూరం చేయాలన్నది, మిమ్మల్ని పూర్తిగా పరిశుద్ధపరచాలన్నది అల్లాహ్ అభిలాష)
ఇబ్నే కసీర్ (రహిమహుల్లాహ్) వారు ఇలా వ్రాసారు: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి సతీమణులు ఆయన కుటుంబీకులలోని వారే. దీనికి ఆధారం ఈ వాక్యం. ఇది ఆయన భార్యల గురించి వెల్లడి చేయబడింది.
ఓ ముస్లింలారా! ప్రవక్త (సల్లల్లాహు అలైహివ సల్లం) యొక్క కుటుంబం పై సదఖా మరియు జకాత్ నిషిద్ధం. అల్లాహ్ వారి స్థానం మరియు ఔన్నత్యాన్ని పరిగణనలోకి తీసుకుని వారిపై నిషేధించాడు. ఎందుకంటే సదఖా మరియు జకాత్ అనేది ఒక మలినం. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ఇలా తెలియజేశారు: “ముహమ్మద్ కుటుంబీకుల కొరకు సదఖా అనుమతి లేదు. ఎందుకంటే ఇది ప్రజల సొమ్ము యొక్క మలినం.”
సదఖా మరియు జకాత్ నిషేధించబడిన ప్రవక్త (సల్లల్లాహు అలైహివ సల్లం) కుటుంబీకుల యొక్క రెండు తెగలు: బను హాషిమ్ బిన్ అబ్దే మునాఫ్ మరియు బనూ ముత్తలిబ్ బిన్ అబ్దే మునాఫ్.
ఓ విశ్వాసులారా! ప్రవక్త గారి కుటుంబీకుల ఘనతలో భాగంగా వారి గురించి ఉమ్మత్ కు ఆజ్ఞాపించబడినటువంటి విషయం ఏమిటంటే వారు తషహ్హుద్ లో ఈ దుఆ పటించాలి:
اللهم صل على محمد وعلى آل محمد كما صليت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد.
اللهم بارك على محمد وعلى آل محمد كما باركت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد.
(ఓ అల్లాహ్ నీవు ఎలాగైతే ప్రవక్త ఇబ్రాహీం, వారి సంతానాన్ని కనికరించావో అలాగే ప్రవక్త ముహమ్మద్, వారి సంతానాన్ని కనికరించు, నిశ్చయముగా నీవే పొగడ్తలకు అర్హుడవు, గొప్ప ఘనతలు కలవాడవు. ఓ అల్లాహ్ ఎలాగైతే నీవు ప్రవక్త ఇబ్రాహీం, వారి సంతానానికి శుభాన్ని ప్రసాదించావో అలాగే ప్రవక్త ముహమ్మద్, వారి సంతానంపై శుభాన్ని ప్రసాదించు, నిశ్చయముగా నీవే పొగడ్తలకు అర్హుడవు, గొప్ప ఘనతలు కలవాడవు.)
అల్లాహ్ ఖుర్ఆన్ యొక్క శుభాలను మనజీవితాలలో వర్షింప చేయుగాక. ఆయన వివేకంతో కూడిన సూచనల ద్వారా హితబోధ పొందే భాగ్యం ప్రసాదించుగాక. అల్లాహ్ మనందరిని క్షమించుగాక. మీరు కూడా అల్లాహ్ ను క్షమాపణ వేడుకోండి, నిశ్చయంగా ఆయన (తౌబా) పశ్చాత్తాపం చెందే వారిని తప్పక మన్నిస్తాడు.
రెండవ ఖుత్బా
స్తోత్రం మరియు దరూద్ తరువాత:
మీరు తెలుసుకోండి. అల్లాహ్ మీపై కరుణించు గాక! సలఫే సాలిహీన్ వారు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి కుటుంబీకుల యొక్క ఘనతలో గొప్ప ఉదాహరణలు తెలియపరిచారు.
అబూబకర్ సిద్దీఖ్ (రదియల్లాహు అన్హు) గారు ఈ విధంగా తెలియజేశారు: “ఎవరి చేతిలో నా ప్రాణం ఉందో ఆయన సాక్షి! నిశ్చయంగా నా బంధువుల పట్ల దయ చూపడం కంటే, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి బంధువుల పట్ల దయ చూపటం నా వద్ద ఎంతో ప్రియమైనది“.(బుఖారి ముస్లిం)
ఓ ముస్లింలారా! విశ్వాసులు అహ్లెబైత్ ను తప్పక ప్రేమిస్తారు! అయితే రాఫిజీలు మరియు షియా వర్గీయులు మాత్రమే వారిని ప్రేమిస్తారు, మిగతా వారందరూ వారిని ద్వేషిస్తారు అనే వాదన సరి అయినది కాదు.
వాస్తవానికి రవాఫిజ్ మరియు షియా వర్గీయులు అహ్లె-బైత్ పై ఘోరమైన దౌర్జన్యానికి పాల్పడ్డారు. వారిని అవమానపరిచి వారిని మోసం చేశారు. అహ్లె బైత్ కి సంబంధించినటువంటి అనేక హదీసులు తిరస్కరణకు దారి తీసాయి, దీనికి గల కారణం ఏమిటంటే వీరు అహ్లె బైత్ పై అబద్దాలను మోపారు. మరియు రవాఫిజ్ అహ్లె బైత్ లో అందరినీ కాకుండా కొందరిని మాత్రమే ప్రేమిస్తారు. కానీ సున్నతుని ప్రేమించేవారు దానిపై స్థిరంగా ఉండేవారు (అహ్లె సున్నత్ వల్ జమాఅత్) అహ్లె బైత్ వారందరి ని ప్రేమిస్తారు.
మరియు ఇది కూడా తెలుసుకోండి. అల్లాహ్ ఆయనపై తన కారుణ్యాన్ని కురిపించు గాక అల్లాహ్ మీకు ఒక గొప్ప సత్కార్యం గురించి తెలియచేశాడు. అల్లాహ్ ఈ విధంగా ఆజ్ఞాపించాడు.
(إن اللَّهَ وَمَلَائِكَتَهُ يُصَلُّونَ عَلَى النَّبِيِّ يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا صَلُّوا عَلَيْهِ وَسَلِّمُوا تسليما)
(నిశ్చయంగా అల్లాహ్, ఆయన దూతలు కూడా దైవప్రవక్తపై కారుణ్యాన్ని పంపిస్తున్నారు. ఓ విశ్వాసులారా! మీరు కూడా అతనిపై దరూద్ పంపండి. అత్యధికంగా అతనికి ‘సలాములు’ పంపుతూ ఉండండి.)
ఓ అల్లాహ్! నీ దాసుడు మరియు నీ ప్రవక్త అయిన ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై నీ కారుణ్యాన్ని అవతరింపచేయి. ఆయన ఖలీఫాలు, తాబయీనులను పూర్తి చిత్తశుద్దితో అనుసరించే వారిని ఇష్టపడు ప్రేమించు.
ఓ అల్లాహ్! ఇస్లాం, ముస్లింలకు గౌరవ మర్యాదలు ప్రసాదించు. షిర్క్, ముష్రిక్ లను అవమాన బరుచు. నీవు నీ ధర్మం అయిన ఇస్లాంకు శత్రువులు ఎవరైతే ఉన్నారో వారిని సర్వ నాశనం చేయి మరియు ఏకేశ్వరోపాశకులకు నీ సహాయాన్ని అందించు.
ఓ అల్లాహ్! మా దేశాలలో భద్రతను ప్రసాదించు. మా నేతల వ్యవహారాన్ని సరిదిద్దు, సన్మార్గం చూపే మరియు సన్మార్గము పై నడిచే వారీగా చేయి. ఓ అల్లాహ్! మా పరిపాలకులకు నీ గ్రంధానికి కట్టుబడి ఆజ్ఞాపాలన చేసే భాగ్యాన్ని ప్రసాదించు.
ఓ అల్లాహ్! మా పాపాలను మరియు మా ఆచరణలో ఏర్పడిన కొరతను క్షమించు, ఓ అల్లాహ్! మమ్ములను ఆ నరకాగ్ని నుంచి రక్షించు,మాకు మోక్షాన్ని ప్రసాదించు
ఓ అల్లాహ్! మాకు ఈ ప్రపంచంలో పుణ్యాన్ని పరలోకంలో సాఫల్యాన్ని ప్రసాదించు, నరక శిక్షల నుండి మమ్ములను కాపాడు.
سُبۡحَٰنَ رَبِّكَ رَبِّ ٱلۡعِزَّةِ عَمَّا يَصِفُونَ وَسَلَٰمٌ عَلَى ٱلۡمُرۡسَلِينَ وَٱلۡحَمۡدُ لِلَّهِ رَبِّ ٱلۡعَٰلَمِين
—
ఖతీబ్: మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ, జుబైల్, సౌదీ ఆరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామిఈ
‘ఇస్లామీయ జుమా ప్రసంగాలు’ అనే పుస్తకం నుండి – రచన: మాజిద్ బిన్ సులైమాన్ అర్రస్సీ
క్రింది లింక్ కూడా చదవండి :
ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇంటివారి ప్రాశస్త్యం, వారి హక్కులు – డా. సాలెహ్ బిన్ ఫౌజాన్ అల్ ఫౌజాన్ [PDF]