71:10 فَقُلْتُ اسْتَغْفِرُوا رَبَّكُمْ إِنَّهُ كَانَ غَفَّارًا “నేనిలా అన్నాను – క్షమాపణకై మీ ప్రభువును వేడుకోండి. నిశ్చయంగా ఆయన అమితంగా క్షమించేవాడు.”
71:11 يُرْسِلِ السَّمَاءَ عَلَيْكُم مِّدْرَارًا “ఆయన ఆకాశం నుంచి మీపై ధారాపాతంగా వర్షం కురిపిస్తాడు.”
71:12 وَيُمْدِدْكُم بِأَمْوَالٍ وَبَنِينَ وَيَجْعَل لَّكُمْ جَنَّاتٍ وَيَجْعَل لَّكُمْ أَنْهَارًا “మీ సిరిసంపదల్లోనూ, పుత్ర సంతతిలోనూ పురోభివృద్ధిని వొసగుతాడు. మీ కొరకు తోటల్ని ఉత్పన్నం చేస్తాడు. ఇంకా మీ కోసం కాలువలను ప్రవహింపజేస్తాడు.”
సూరా 11.హూద్ , అయతులు 3, 52
11:3 وَأَنِ اسْتَغْفِرُوا رَبَّكُمْ ثُمَّ تُوبُوا إِلَيْهِ يُمَتِّعْكُم مَّتَاعًا حَسَنًا إِلَىٰ أَجَلٍ مُّسَمًّى وَيُؤْتِ كُلَّ ذِي فَضْلٍ فَضْلَهُ ۖ وَإِن تَوَلَّوْا فَإِنِّي أَخَافُ عَلَيْكُمْ عَذَابَ يَوْمٍ كَبِيرٍ ఇంకా మీరు మీతప్పుల మన్నింపుకోసం మీప్రభువును వేడుకోండి. తర్వాత (పశ్చాత్తాపంతో) ఆయన వైపుకే మరలండి. ఒక నిర్థారిత కాలం వరకూ ఆయన మీకు మంచి (జీవన) సామగ్రిని సమకూరుస్తాడు. ఎక్కువగా ఆచరణచేసే ప్రతిఒక్కరికీ ఎక్కువ పుణ్యఫలం ప్రసాదిస్తాడు. ఒకవేళ మీరు గనక విముఖత ప్రదర్శించిన పక్షంలో ఒకానొక మహాదినాన మిమ్మల్ని చుట్టుముట్టే శిక్ష గురించి నేను భయపడుతున్నాను.
11:52 وَيَا قَوْمِ اسْتَغْفِرُوا رَبَّكُمْ ثُمَّ تُوبُوا إِلَيْهِ يُرْسِلِ السَّمَاءَ عَلَيْكُم مِّدْرَارًا وَيَزِدْكُمْ قُوَّةً إِلَىٰ قُوَّتِكُمْ وَلَا تَتَوَلَّوْا مُجْرِمِينَ “ఓ నా జాతి వారలారా! మీ పోషకుని (అంటే అల్లాహ్) సమక్షంలో మీ తప్పుల మన్నింపుకై ప్రార్థించండి. ఆయన సన్నిధిలో పశ్చాత్తాపం చెందండి. ఆయన మీపై (ఆకాశం నుండి) ధారాపాతంగా వర్షం కురిపిస్తాడు. మీకున్న బలిమికి మరింత శక్తినీ, బలాన్నీ చేకూరుస్తాడు. మీరు మాత్రం అపరాధులుగా తిరిగిపోకండి.”
క్రింద ఇచ్చిన లింకులు సందర్శించి మరింత జ్ఞానం పెంచుకోండి:
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
153 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اسْتَعِينُوا بِالصَّبْرِ وَالصَّلَاةِ ۚ إِنَّ اللَّهَ مَعَ الصَّابِرِينَ ఓ విశ్వాసులారా! సహనం మరియు నమాజు ద్వారా సహాయం అర్థించండి. అల్లాహ్ సహనం పాటించేవారికి తోడుగా ఉంటాడు.
2:154 وَلَا تَقُولُوا لِمَن يُقْتَلُ فِي سَبِيلِ اللَّهِ أَمْوَاتٌ ۚ بَلْ أَحْيَاءٌ وَلَٰكِن لَّا تَشْعُرُونَ అల్లాహ్ మార్గంలో చంపబడినవారిని మృతులు అని అనకండి. వారు బ్రతికే ఉన్నారు. కాని ఆ విషయం మీకు అర్థం కాదు.
2:155 وَلَنَبْلُوَنَّكُم بِشَيْءٍ مِّنَ الْخَوْفِ وَالْجُوعِ وَنَقْصٍ مِّنَ الْأَمْوَالِ وَالْأَنفُسِ وَالثَّمَرَاتِ ۗ وَبَشِّرِ الصَّابِرِينَ మేము ఏదో ఒక విధంగా మిమ్మల్ని తప్పకుండా పరీక్షిస్తూ ఉంటాము – భయంతో, ఆకలిదప్పులతో, ధన ప్రాణాల నష్టంతో, పండ్ల కొరతతో (పరీక్షిస్తాము)! ఈ సహనమూర్తులకు శుభవార్త ఇవ్వండి.
2:156 الَّذِينَ إِذَا أَصَابَتْهُم مُّصِيبَةٌ قَالُوا إِنَّا لِلَّهِ وَإِنَّا إِلَيْهِ رَاجِعُونَ వారికెప్పుడు ఏ ఆపద వచ్చిపడినా, “మేము ఖుద్దుగా అల్లాహ్‌కు చెందినవారము, మేము మరలిపోవలసింది కూడా ఆయన వద్దకే కదా!” అని అంటారు.
2:157 أُولَٰئِكَ عَلَيْهِمْ صَلَوَاتٌ مِّن رَّبِّهِمْ وَرَحْمَةٌ ۖ وَأُولَٰئِكَ هُمُ الْمُهْتَدُونَ వారిపై వారి ప్రభువు దయానుగ్రహాలు, కారుణ్యం ఉన్నాయి. సన్మార్గాన్ని పొందినవారు కూడా వీరే.
2:158 إِنَّ الصَّفَا وَالْمَرْوَةَ مِن شَعَائِرِ اللَّهِ ۖ فَمَنْ حَجَّ الْبَيْتَ أَوِ اعْتَمَرَ فَلَا جُنَاحَ عَلَيْهِ أَن يَطَّوَّفَ بِهِمَا ۚ وَمَن تَطَوَّعَ خَيْرًا فَإِنَّ اللَّهَ شَاكِرٌ عَلِيمٌ నిస్సందేహంగా సఫా మర్వాలు అల్లాహ్ చిహ్నాలలోనివి. కనుక కాబా గృహాన్ని (సందర్శించి) హజ్ ఉమ్రహ్‌లు చేసేవారు వాటి మధ్య ప్రదక్షిణ చేస్తే అందులో ఏ మాత్రం తప్పులేదు. స్వచ్ఛందంగా ఎవరైనా ఏదైనా సత్కార్యం చేస్తే అల్లాహ్ ఆదరించేవాడు, తెలుసుకునేవాడు.
2:159 إِنَّ الَّذِينَ يَكْتُمُونَ مَا أَنزَلْنَا مِنَ الْبَيِّنَاتِ وَالْهُدَىٰ مِن بَعْدِ مَا بَيَّنَّاهُ لِلنَّاسِ فِي الْكِتَابِ ۙ أُولَٰئِكَ يَلْعَنُهُمُ اللَّهُ وَيَلْعَنُهُمُ اللَّاعِنُونَ మేము అవతరింపజేసిన నిదర్శనాలను మరియు సన్మార్గాన్ని ప్రజల కొరకు గ్రంథంలో విశదపరచిన తరువాత కూడా వాటిని దాచిపెట్టే వారిని అల్లాహ్ శపిస్తాడు. ఇంకా, వేరే శపించే వారు కూడా వారిని శపిస్తారు.
2:160 إِلَّا الَّذِينَ تَابُوا وَأَصْلَحُوا وَبَيَّنُوا فَأُولَٰئِكَ أَتُوبُ عَلَيْهِمْ ۚ وَأَنَا التَّوَّابُ الرَّحِيمُ అయితే పశ్చాత్తాపం చెంది, తమ ప్రవర్తనను సంస్కరించుకుని, సత్యాన్ని బహిర్గతం చేసిన వారి పశ్చాత్తాపాన్ని నేను స్వీకరిస్తాను (వారి తప్పును మన్నిస్తాను). నేను పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాణ్ణి, అపారంగా కనికరించేవాణ్ణి.
2:161 إِنَّ الَّذِينَ كَفَرُوا وَمَاتُوا وَهُمْ كُفَّارٌ أُولَٰئِكَ عَلَيْهِمْ لَعْنَةُ اللَّهِ وَالْمَلَائِكَةِ وَالنَّاسِ أَجْمَعِينَ నిశ్చయంగా అవిశ్వాసానికి పాల్పడి, అవిశ్వాస స్థితిలోనే మరణించిన వారిపై అల్లాహ్ మరియు ఆయన దూతల, ఇంకా జనులందరి శాపం పడుతుంది.
2:162 خَالِدِينَ فِيهَا ۖ لَا يُخَفَّفُ عَنْهُمُ الْعَذَابُ وَلَا هُمْ يُنظَرُونَ అందులోనే వారు ఎల్లకాలం ఉంటారు. వారి శిక్షను తగ్గించటం గానీ, వారికి కొంత విడుపు ఇవ్వటంగానీ జరగదు.
2:163 وَإِلَٰهُكُمْ إِلَٰهٌ وَاحِدٌ ۖ لَّا إِلَٰهَ إِلَّا هُوَ الرَّحْمَٰنُ الرَّحِيمُ మీ అందరి ఆరాధ్య దైవం ఒకే ఆరాధ్య దైవం. ఆయన తప్ప మరో ఆరాధ్య దైవం లేనేలేడు. ఆయన అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడు.
2:164 إِنَّ فِي خَلْقِ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَاخْتِلَافِ اللَّيْلِ وَالنَّهَارِ وَالْفُلْكِ الَّتِي تَجْرِي فِي الْبَحْرِ بِمَا يَنفَعُ النَّاسَ وَمَا أَنزَلَ اللَّهُ مِنَ السَّمَاءِ مِن مَّاءٍ فَأَحْيَا بِهِ الْأَرْضَ بَعْدَ مَوْتِهَا وَبَثَّ فِيهَا مِن كُلِّ دَابَّةٍ وَتَصْرِيفِ الرِّيَاحِ وَالسَّحَابِ الْمُسَخَّرِ بَيْنَ السَّمَاءِ وَالْأَرْضِ لَآيَاتٍ لِّقَوْمٍ يَعْقِلُونَ భూమ్యాకాశాల సృష్టిలో, రేయింబవళ్ళ (నిరంతర) మార్పిడిలో, ప్రజలకు లాభం చేకూర్చే వస్తువులను మోసుకుంటూ సముద్రాలలో నడిచే ఓడలలో, ఆకాశం నుంచి అల్లాహ్ వర్షపు నీటిని కురిపించి మృతభూమిని బ్రతికించటంలో, ఇంకా అందులో అన్ని రకాల ప్రాణులను వ్యాపింపజేయటంలో, వీచే పవనాల దిశలు మార్చటంలో, భూమ్యాకాశాల మధ్య (దేవుని) నియమ నిబంధనలకు కట్టుబడి మసలుకుంటున్న మేఘాలలో బుద్ధిమంతులకు (దేవుని శక్తి సామర్థ్యాలకు సంబంధించిన) ఎన్నో సూచనలున్నాయి.
2:165 وَمِنَ النَّاسِ مَن يَتَّخِذُ مِن دُونِ اللَّهِ أَندَادًا يُحِبُّونَهُمْ كَحُبِّ اللَّهِ ۖ وَالَّذِينَ آمَنُوا أَشَدُّ حُبًّا لِّلَّهِ ۗ وَلَوْ يَرَى الَّذِينَ ظَلَمُوا إِذْ يَرَوْنَ الْعَذَابَ أَنَّ الْقُوَّةَ لِلَّهِ جَمِيعًا وَأَنَّ اللَّهَ شَدِيدُ الْعَذَابِ కాని అల్లాహ్‌ను కాదని ఆయనకు సహవర్తులుగా ఇతరులను నిలబెట్టి, అల్లాహ్‌ను ప్రేమించవలసిన విధంగా వారిని ప్రేమించేవారు కూడా ప్రజలలో కొందరు ఉన్నారు. అయితే విశ్వసించినవారు అల్లాహ్‌ను అంతకంటే ప్రగాఢంగా (అధికంగా) ప్రేమిస్తారు. సర్వశక్తులూ అల్లాహ్ అధీనంలోనే ఉన్నాయనీ, అల్లాహ్ చాలా కఠినంగా శిక్షించేవాడన్న యదార్థాన్ని ముష్రిక్కులు, అల్లాహ్ విధించే శిక్షలను చూసిన తరువాత తెలుసుకునే బదులు, ఇప్పుడే తెలుసుకుంటే ఎంత బాగుంటుంది! (తెలుసుకుంటే వారు ఈ షిర్క్ పాపానికి ఒడిగట్టరు).
2:166 إِذْ تَبَرَّأَ الَّذِينَ اتُّبِعُوا مِنَ الَّذِينَ اتَّبَعُوا وَرَأَوُا الْعَذَابَ وَتَقَطَّعَتْ بِهِمُ الْأَسْبَابُ ఆ సమయంలో, వీళ్ళచేత అనుసరించబడిన నాయకులు తమ అనుచరులతో తమకు ఏ మాత్రం సంబంధం లేనట్లుగా ప్రవర్తిస్తారు. ఇంకా వారు శిక్షను కళ్ళారా చూసుకుంటారు. వారి మధ్య ఉండే సంబంధ బాంధవ్యాలన్నీ తెగిపోతాయి.
2:167 وَقَالَ الَّذِينَ اتَّبَعُوا لَوْ أَنَّ لَنَا كَرَّةً فَنَتَبَرَّأَ مِنْهُمْ كَمَا تَبَرَّءُوا مِنَّا ۗ كَذَٰلِكَ يُرِيهِمُ اللَّهُ أَعْمَالَهُمْ حَسَرَاتٍ عَلَيْهِمْ ۖ وَمَا هُم بِخَارِجِينَ مِنَ النَّارِ అప్పుడు (కనువిప్పు కలిగిన) అనుచరులు ఇలా అంటారు: “మేమే గనక మరోసారి ప్రాపంచిక జీవితం వైపుకు మరలించబడటమంటూ జరిగితే వీరు (ఈ అయ్యవార్లు) మా పట్ల ఇక్కడ విసుగును ప్రదర్శించినట్లే మేమూ వీరిపట్ల విసుగును ప్రదర్శించేవారం.” ఈ విధంగా వారు సిగ్గుతో కుంచించుకుపోయే విధంగా అల్లాహ్ వారి కర్మలను వారికి చూపిస్తాడు. అయినాసరే వారు నరకం నుంచి బయట పడటమన్నది అసంభవం.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
248. “అల్లాహ్ సాక్షిగా! నేను ప్రతి దినము డెబ్బైసార్లకంటే ఎక్కువ అల్లాహ్ ను మన్నింపుకై వేడుకుంటాను, మరియు పశ్చాత్తాపంతో ఆయన వైపునకు మరలుతుంటాను” అని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సెలవిచ్చారు. (బుఖారీ). [అల్ బుఖారీ, అల్ అస్ఖలాని ఫత్-హుల్ బారీ 11/101]
249. “ప్రజలారా! పశ్చాత్తాపంతో అల్లాహ్ వైపునకు మరలండి నేనయితే రోజుకు వందేసి సార్లు క్షమాపణకై అర్థిస్తూ ఉంటాను” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు? (ముస్లిం 4/2076).
250. ఎవరయితే “అస్తగ్ ఫిరుల్లాహల్ అదీమల్లదీ లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూము వ అతూబు ఇలైహి” అని పలుకుతారో అల్లాహ్ అతన్ని క్షమిస్తాడు. ఒకవేళ అతను యుద్ధభూమి నుండి పారిపోయిన వాడైనా సరే అని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సెలవిచ్చారు. (అబూదావూద్, అహ్మద్, తిర్మిదీ 3-182).
అస్తగ్ ఫిరుల్లాహల్ అదీమల్లదీ లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూము వ అతూబు ఇలైహి
నేను మహోన్నతుడు అయిన అల్లాహ్ మన్నింపు కోరుతున్నాను. ఆయన తప్ప (నిజ) ఆరాధ్యుడు ఎవరూ లేరు. అయన నిత్యుడు. శాశ్వతుడు. నేను అయన సమక్షంలోనే తౌబా చేస్తున్నాను.
[దీనిని అబుదావూద్ ఉల్లేఖించారు. 2/85, అత్తిర్మిదీ 5/569, అల్ హాకిం 1/115 సహీహ్ మరియు అజ్జహబీ ఏకీభవించారు. అల్బానీ గారు దీనిని సహీహ్ అన్నారు. చూడుము సహీహ్ అత్తిర్మిదీ 3/182 జామిఆ అల్ ఉసూల్ లి అహాదీథుర్రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం 4/389–390 అల్ అర్నావూత్ శోధన.]
251. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రకటించారు: “రాత్రి చివరి గడియలలో ప్రభువు దాసునికి అతి చేరువలో ఉంటాడు. ఆ వేళ అల్లాహ్ ను స్మరించే వారిలో మీరు కూడా చేరాలనుకుంటే చేరండి.”
[దీనిని అత్తిర్మిదీ, అన్నిసాఈ 1/279, మరియు అల్ హాకిం ఉల్లేఖించారు. చూడుము అల్ అల్బానీ సహీహ్ అత్తిర్మిదీ 3/183 మరియు జామిఅ అల్ ఉసూల్ లి అహాదీథుర్రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం, అల్ అర్నావూత్ శోధన 4/144. ]
252. “సజ్దా స్థితిలో దాసుడు అల్లాహ్ కు అతి చేరువలో ఉంటాడు. కనుక ఆ స్థితిలో మీరు (అల్లాహ్ ను) ఎక్కువగా వేడుకోండి” అని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సెలవిచ్చారు. (ముస్లిం 1/350, అబుషేబా).
253. “అప్పుడప్పుడు నా మనసుకు ఏదో ఆవహించినట్టు అనిపిస్తుంది. అప్పుడు నేను రోజుకు నూరుసార్లు అల్లాహ్ క్షమాపణకై అర్థిస్తూ ఉంటాను” అని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సెలవిచ్చారు. (ముస్లిం).
[దీనిని ముస్లిం ఉల్లేఖించారు 4/2075, ఇబ్నుల్ అధీర్ అలా అన్నారు: “లయుఘాను అలా ఖల్ బీ” నాహృదంపై మీద పొర వచ్చినప్పుడు అంటే, దీని అర్థం : తప్పిదం పొరపాటు (మరచిపోవుట) : ఎందుకంటే రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఎల్లప్పుడు అధికంగా స్మరణలో నిమగ్నులై ఉండేవారు, అయితే ఎప్పుడైనా కొన్ని సమయాలలో వారు మరచిపోతే దానిని వారు తన తప్పిదముగా లెక్క కట్టేవారు మరియు క్షమాభిక్ష వేడుకునేవారు. చూడుము జామిఅ అల్ ఉసూల్ 4/386.]
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
హదీసులు క్రింద ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి చదవండి: పశ్చాత్తాపం (తౌబా) [PDF]
హదీసులు మీ సౌకర్యం కోసం క్రింద ఇవ్వ బడ్డాయి:
విద్వాంసుల స్పష్టీకరణ : జరిగిపోయిన ప్రతి పాపానికి తప్పనిసరిగా పశ్చాత్తాపం చెందాలి, దాసుని పాపం అల్లాహ్‌కు మరియు ఆ దాసునికే పరిమితమై సాటి మానవుల హక్కుకి దానితో ఎలాంటి సంబంధం లేనట్లయితే అలాంటి వ్యక్తి పశ్చాత్తాపం అంగీకరించబడటానికి మూడు షరతులు ఉన్నాయి.
ఒకటి : పశ్చాత్తాపం చెందుతున్న పాపానికి తను పూర్తిగా స్వస్తి పలకాలి.
రెండు : జరిగిపోయిన పాపానికి సిగ్గుతో కుమిలిపోవాలి,
మూడు : భవిష్యత్తులో ఇంకెప్పుడూ అలా చేయనని గట్టిగా నిశ్చయించుకోవాలి.
ఈ మూడు నియమాల్లో ఏ ఒక్కటి లోపించినా అతని పశ్చాత్తాపం సరైనది కాదు.
ఒకవేళ జరిగిన పాపం తోటి మానవుల హక్కులకు సంబంధించినదైతే పశ్చాత్తాపం దైవ సన్నిధిలో అంగీకరించబడటానికి నాలుగు నిబంధనలున్నాయి.
పై మూడు నిబంధన లతో పాటు నాల్గవ నిబంధన ఏమిటంటే, అతను తోటి మానవుని హక్కుని అతనికి తిరిగి ఇచ్చివేయాలి. పరులనుండి ధనం లేక మరేదైనా వస్తువు అధర్మంగా తీసుకొనివుంటే దాన్ని వాపసుచేయాలి. తోటి వ్యక్తులపై నీలాపనిందలు ఇత్యాదివి మోపి వున్నట్లయితే వారి శిక్షను తాను అనుభవించాలి లేదా క్షమాభిక్ష కోరి వారిని సంతోషపరచాలి. తోటి మనిషి వీపు వెనక చాడీలు చెప్పివుంటే అతణ్ణి నిర్దోషిగా నిలబెట్టాలి.
అయితే పాపాలన్నిటిపై పశ్చాత్తాపం చెందటం మాత్రం తప్పనిసరి. ఏవో కొన్ని పాపాలపై మాత్రమే పశ్చాత్తాపపడితే అహ్లే సున్నత్ వారి దృష్టిలో ఆయా విషయాల్లో అతని పశ్చాత్తాపం సరైనదే గాని ఇతర పాపాలు మాత్రం ఇంకా అతనిపై మిగిలే వుంటాయి.
పాపాలపై పశ్చాత్తాపం అవసరమన్న విషయమై ఖుర్‌ఆన్ హదీసుల్లో అనేక ఆధారాలున్నాయి. వాటిపై ముస్లిం సమాజ ఏకాభిప్రాయమూ ఉంది.
అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : “ఓ విశ్వాసులారా! మీరంతా కలసి (పశ్చాత్తాప భావంతో) అల్లాహ్ వైపుకు మరలండి, దీనివల్ల మీకు సాఫల్యం కలగవచ్చు.” (నూర్ – ౩7)
మరోచోట అల్లాహ్ ఉపదేశిస్తున్నాడు : “మీరు క్షమాభిక్ష కోసం మీ ప్రభువును వేడుకోండి. ఆయన వైపుకే మరలండి (పాపాల పశ్చాత్తాపపడండి).” (హూద్ – ౩)
ఇంకొకచోట ఇలా అంటున్నాడు : “విశ్వసించిన ఓ ప్రజలారా! చిత్తశుద్ధితో కూడిన పశ్చాత్తాపంతో అల్లాహ్ వైపుకు మరలండి.” (తహ్రీమ్ – 8)
13. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చెబుతుండగా తాను విన్నానని హజ్రత్ అబూ హురైరా (రది అల్లాహు అన్హు) తెలిపారు:
“అల్లాహ్ సాక్షి! నేను రోజుకు డెబ్భైకన్నా ఎక్కువసార్లు మన్నింపు కోసం వేడుకుంటూ, పాపాలపై పశ్చాత్తాపపడుతూ ఉంటాను.” (బుఖారీ)
(సహీహ్ బుఖారీలోని ప్రార్ధనల ప్రకరణం.)
ముఖ్యాంశాలు:
1. ఈ హదీసులో నిత్యం పాపాలపై పశ్చాత్తాపం చెందుతూ మన్నింపు కోసం వేడుకుంటూ ఉండాలని పురికొల్పడం జరిగింది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అత్యంత పునీతులు. అల్లాహ్ ఆయన వెనుకటి పాపాలను, జరగబోయే పాపాలను అన్నింటినీ మన్నించాడు. అసలు ఆయన చేత దొర్లిన పొరపాట్లను పాపాలు అనడం కూడా సబబు కాదు. అయితే సాధారణ వ్యక్తులకు సమ్మతమైనవిగా భావించబడే కొన్ని పనులు మహనీయులకు శోభాయమానం కావు. ఆయన గారు తీసుకున్న కొన్ని నిర్ణయాలలో మానవ సహజమైన దౌర్బల్యం వల్ల ఏదో ఒక దశలో స్వల్పమయిన పొరపాట్లు జరగవచ్చు. అలాంటి దైవప్రవక్తే రోజుకు డెబ్బైకన్నా ఎక్కువసార్లు పాపాల మన్నింపు కోసం వేడుకుంటుండగా పీకలదాకా పాపాల్లో మునిగివున్న మనం ఎలా ఉపేక్షించబడతాం!
2. నిరంతరం వీలైనంత ఎక్కువగా పాపాలపై పశ్చాత్తాపపడుతూ ఉండాలి. దీనివల్ల మనకు తెలియకుండానే మనవల్ల దొర్లిపోయే తప్పిదాలు మన్నించబడతాయి. రాబోయే హదీసులో కూడా పశ్చాత్తాప భావన గురించే నొక్కి వక్కాణించబడింది.
14. హజ్రత్ అగర్ర్ బిన్ యసార్ ముజనీ (రది అల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రబోధించారు :
“ప్రజలారా! పాపాలపై పశ్చాత్తాపభావంతో అల్లాహ్ వైపుకు మరలండి. మన్నింపు కోసం ఆయన్ను వేడుకోండి. నేను అల్లాహ్ సన్నిధిలో రోజుకు వందసార్లు పశ్చాత్తాప భావంతో కుంగి పోతూ ఉంటాను.”
(సహీహ్ ముస్లింలోని ధ్యాన ప్రకరణం)
15. దైవప్రవక్త సేవకులు, హజ్రత్ అబూ హంజా అనస్ బిన్ మాలిక్ అన్సారీ (రది అల్లాహు అన్హు) కథనం ప్రకారం ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రబోధించారు :
“తన దాసుడు పాపాలపై పశ్చాత్తాప పడినందుకు అల్లాహ్, ఎడారి ప్రదేశంలో ఒంటెను పోగొట్టుకొని తిరిగి పొందిన వ్యక్తి కన్నా ఎక్కువగా సంతోషిస్తాడు.” (బుఖారీ – ముస్లిం)
ముస్లింలోని వేరొక ఉల్లేఖనంలో ఇలా ఉంది : ఒక వ్యక్తి ఎడారి ప్రాంతంలో తన ఒంటెపై ప్రయాణిన్తున్నాడు. దానిపైనే అతని ఆహారసామగ్రి, నీరు ఉన్నాయి. (మార్గమధ్యంలో) ఆ ఒంటె తప్పిపోయింది. అతను ఇక ఆ ఒంటె దొరకదని భావించాడు. (వెతికి వేసారి) నిరాశతో తిరిగి వచ్చి ఓ చెట్టు నీడలో మేనువాల్చాడు. ఇంతలో ఆ ఒంటె వచ్చి అతని ముందు నిలబడింది. వెంటనే అతను దాని ముక్కుతాడు పట్టుకొని ఆనందంతో ఉబ్బి తబ్బిబ్పైపోయి “ఓ అల్లాహ్! నీవే నా దాసుడివి, నేనునీ ప్రభువును” అన్నాడు. సంతోషం పట్టలేక ఆ వ్యక్తి మాటలు అలా తడబడ్డాయనుకుంటే నిశ్చయంగా అల్లాహ్ తన దాసుని పశ్చాత్తాపంపై అంతకన్నా ఎక్కువగానే సంతోషిస్తాడు.
1.పై హదీసులో కూడా పశ్చాత్తాపం ప్రోత్సహించబడింది, దాని ప్రాముఖ్యత గురించి నొక్కి వక్కాణించటం జరిగింది.
2. దాసుల పశ్చాత్తాప భావం చూసి అల్లాహ్ అమితంగా సంతోషిస్తాడు.
3. అసంకల్పితంగా దొర్లిపోయే పారబాట్లను తప్పుపట్టడం జరగదు. మాటల్లో చేవ తీసుకురావటం కోసం విషయాన్ని ప్రమాణం చేసి మరీ చెప్పటం ధర్మసమ్మళమే.
5. విషయాన్ని బోధపరిచేందుకు ఉదాహరణలు కూడా ఇవ్వవచ్చు.
16. హజ్రత్ అబూ మూసా అబ్దుల్లాహ్ బిన్ ఖైస్ అష్‌అరీ (రది అల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ఉద్పోధించారు:
“పగటిపూట పాపం చేసినవాడు రాత్రికి పశ్చాత్తాపం చెందాలని అల్లాహ్ రాత్రివేళ తన చేయిని చాపుతాడు. అలాగే రాత్రి వేళ పాపం చేసినవాడు పగలు పశ్చాత్తాపం చెందుతాడని అల్లాహ్ పగటిపూట తన చేయిని చాచి ఉంచుతాడు. (ఈ పరంపర) సూర్యుడు పడమటి దిక్కు నుండి ఉదయించేంతవరకూ (అంటే ప్రళయం వచ్చేంత వరకు) కొనసాగు తూనే ఉంటుంది.” (ముస్లిం)
ముఖ్యాంశాలు:
‘పై హదీసులో అల్లాహ్‌కు చేయి కూడా ఉంటుందనే గుణం గురించి వివరించడమైనది. అయితే ఆ చెయ్యి ఎలా ఉంటుంది? దాన్ని ఆయన ఎలా చాపుతాడు? అనే విషయం వాస్తవిక స్వరూప స్వభావాల గురించి మనకు తెలియదు. దాన్ని మనం వివరించనూలేము. అయితే దాని వాస్తవిక స్వరూప స్వభావాలు తెలియకపోయినప్పటికీ ఊహాగానాలు, ఉపమానాలు ఇవ్వకుండా దానిపై విశ్వాసముంచటం అవసరం. ఈ హదీసు ద్వారా బోధపడే మరొక విషయం ఏమిటంటే, రేయింబవళ్ళలో ఎప్పుడైనా ఏదైనా తప్పిదం జరిగిపోతే ఏమాత్రం జాప్యం చేయకుండా మనిషి వెంటనే పశ్చాత్తాప భావంతో కుమిలిపోతూ దైవసన్నిధిలో మోకరిల్లాలి.
17. హజ్రత్ అబూ హురైరా (రది అల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రబోధించారు :
“సూర్యుడు పడమటి దిక్కు నుంచి ఉదయించక మునుపే తన పాపాలపై పశ్చాత్తాపం చెందే వాని పశ్చాత్తాపాన్ని అల్లాహ్ సమ్మతించి ఆమోదిస్తాడు.” (ముస్లిం)
(సహీహ్ ముస్లింలోని ధ్యానం, ప్రార్ధనల ప్రకరణం)
ముఖ్యాంశాలు:
నిఘంటువు ప్రకారం “తౌబా” అంటే మరలటం అని అర్థం. మనిషి పాపం చేసినప్పుడు అల్లాహ్‌కు దూరమవుతాడు. తిరిగి “తౌబా” చేసుకున్నప్పుడు (పశ్చాత్తాప పడినప్పుడు), ఆయన వైపుకి మరలి ఆయన సాన్నిహిత్యం, ఆయన క్షమాభిక్ష కోసం పరితపిస్తాడు. ఈ మార్పును, ఈ మరలింపునే ‘తౌబా‘ (పశ్చాత్తాపం) అంటారు. అల్లాహ్ అతని వైపు దృష్టి సారిస్తాడంటే అతని పశ్చాత్తాపాన్ని ఆమోదిస్తాడని భావం.
“జీవితంలోని అంతిమ ఘడియలు దాపురించక ముందువరకూ అల్లాహ్ తన దాసుని పశ్చాత్తాపాన్ని అంగీకరిస్తూనే ఉంటాడు.”
ఈ హదీసును తిర్మిజీ ఉల్లేఖించి హసన్‌గా ఖరారు చేశారు. (సుననె తిర్మిజీలోని ప్రార్ధనల ప్రకరణంలో చరమ ఘడియలకంటే ముందు పశ్చాత్తాపం ఆమోదించబడుతుందన్న అధ్యాయంలో ఈ హదీసు ప్రస్తావించ బడింది)
ముఖ్యాంశాలు:
‘పై హదీసులో “గర్‌గరా” అనే పదం వాడబడింది. ఇది ఆత్మ శరీరాన్ని వదలి కంఠానికి చేరుకునేదానికి ధ్వన్యానుకరణం. అంటే జీవితపు చివరి శ్వాసలన్నమాట. ఈ హదీసును ‘హసన్’గా ఖరారు చేయడం జరిగిందంటే ఈ హదీసు పరంపరలో వైవిధ్యాలకు, లొసుగులకు తావులేదు గాని దీని ఉల్లేఖకులు సహీహ్ హదీసుల ఉల్లేఖకుల కంటే తక్కువ స్థాయికి చెందినవారని అర్ధం. హదీసువేత్తల దృష్టిలో సహీహ్ హదీసుల మాదిరిగా “హసన్” కోవకు చెందిన హదీసులు కూడా ఆచరించదగినవే.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.