తెలుగు ఇస్లామిక్ క్విజ్: పార్ట్ 44 [ఆడియో]

బిస్మిల్లాహ్

Telugu Islamic Quiz (తెలుగు ఇస్లామిక్ క్విజ్) – పార్ట్ 44
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

దైవప్రవక్త (ﷺ) వారిపై జరిగిన హింసా దౌర్జ్యన్య ఘటనలు గూర్చిన ప్రశ్నలు .ఈ ప్రశ్నలు వీటి సమాచారంను ఇన్షా అల్లాహ్ హృదయం తో చదివితే కళ్ళు తడి అవ్వడం ఖాయం

1) మన ప్రియ ప్రవక్త (ﷺ) వారు నడిచే దారిలో మరియు గుమ్మం ముందు కూడా ముళ్లను పరచిన ఆ దుష్ట స్త్రీ ఎవరు?

A) హింద
B) అబు జహల్ భార్య
C) ఉమ్మె జమీల్

2) కాబా గృహం వద్ద సజ్దా లో ఉండగా ఒంటె ప్రేవులను మన ప్రియ ప్రవక్త (ﷺ) వారి వీపుపై వేసిన దుష్టుడు ఎవరు?

A) అబూజహల్
B) ఉఖ్బా బిన్ అబీ మూఅయిత్
C) షైబా బిన్ రబియా

3) ఇస్లాం స్వీకరించిన కారణంగా ఇంటి నుండి గెంటి వేయబడిన ధనిక యువకుడు ఎవరు?

A) ముస్అబ్ బిన్ ఉమైర్ (రజియల్లాహు అన్హు)
B) ముఅజ్ బిన్ జబల్ (రజియల్లాహు అన్హు)
C) అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్(రజియల్లాహు అన్హు)

క్విజ్ 44: సమాధానాలు & వివరణ ఇక్కడ వినండి /డౌన్లోడ్ చేసుకోండి [10:40 నిమిషాలు]


1) మన ప్రియ ప్రవక్త (ﷺ) వారు నడిచే దారిలో మరియు గుమ్మం ముందు కూడా ముళ్లను పరచిన ఆ దుష్ట స్త్రీ ఎవరు?

C) ఉమ్మె జమీల్

ఉమ్మె జమీల్. అబూ సుఫ్యాన్ సోదరి మరియు అబూ లహబ్ యొక్క భార్య. ఈ విషయం తఫ్సీర్ ఇబ్ను కసీర్ లో సూర మసద్ (111:4) వ్యాఖ్యానంలో ఉంది. అలాగే సహీ బుఖారీ యొక్క ప్రఖ్యాతిగాంచిన వ్యాఖ్యానం ఫత్ హుల్ బారీలో కూడా ఉంది.

2) కాబా గృహం వద్ద సజ్దా లో ఉండగా ఒంటె ప్రేవులను మన ప్రియ ప్రవక్త (ﷺ) వారి వీపుపై వేసిన దుష్టుడు ఎవరు?

B) ఉఖ్బా బిన్ అబీ ముఈత్

ఉఖ్బా బిన్ అబీ ముఈత్. సహీ బుఖారీ 240లో, సహీ ముస్లిం 1794లో ఉంది.

అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు:

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కాబా గృహానికి దగ్గరలో నమాజు చేస్తున్నారు. అంతలో అక్కడ కూర్చున్న అబూ జహల్, అతని మిత్రమూక పరస్పరం మాట్లాడుకుంటూ వారిలో ఒకడు ఇలా అన్నాడు: ఫలానా తెగ వాడలో ఒంటె ప్రేగులు పడి ఉన్నాయి. వాటిని తెచ్చి ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) సజ్దా చేస్తున్నప్పుడు ఆయన వీపు మీద పెట్టాలి. ఈ పని చేసేవారు మీలో ఎవరైనా ఉన్నారా? అప్పుడు వారందరిలో ఉఖ్బా బిన్ అబీ ముఈత్ అనే అనే పరమ దౌర్భాగ్యుడు లేచాడు. అతను వెళ్ళి ఆ ప్రేగుల్ని తెచ్చి సమయం కోసం ఎదురు చూడసాగాడు. చివరికి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సజ్దా స్థితిలోకి పోగానే ఆ దుర్మార్గుడు ఆ ప్రేగుల్ని ఆయన భుజాల మధ్య వీపు మీద పెట్టాడు.

నేనప్పుడు ఇదంతా కళ్ళప్పగించి చూస్తూ ఉండటం తప్ప ఏమీ చేయలేకపోయాను. నాకే గనక శక్తి ఉంటే నేనా దుర్మార్గుడ్ని అడ్డుకునేవాడ్ని. వారీ పైశాచిక చర్యకు పాల్పడటమే గాకుండా వెకిలి నవ్వులు కూడా నవ్వడం మొదలెట్టారు. సంతోషం పట్టలేక ఒకరి మీద ఒకరు పడుతూ నవ్వుకోసాగారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) (వీపు మీదున్న ఒంటె ప్రేగుల బరువు వల్ల) సజ్దా స్థితిలోనే పడి ఉన్నారు. తల పైకెత్తలేక పోయారు. చివరికి హజ్రత్ ఫాతిమా (రజియల్లాహు అన్హా) వచ్చి చూసి, ఈ భారాన్ని ఆయన వీపుపై నుంచి తొలగించి వేశారు. అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సజ్దా నుండి తల పైకెత్తి “అల్లాహ్! ఖురైషీయులకు తగిన శిక్ష విధించు” అని శపించారు.

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పెట్టిన శాపం విని వారు బెంబేలిత్తిపోయారు. ఈ మక్కా నగరంలో ఏ ప్రార్థన చేసినా అది తప్పక అంగీకరించబడుతుంది అని వాళ్ళు నమ్మేవారు. ఆ తర్వాత ఆయన (సల్లల్లాహు అలైహి) వసల్లం వారిలో ఒక్కొక్కరి పేరు ప్రస్తావిస్తూ “అల్లాహ్! అబూ జహల్ ని శిక్షించు, ఉత్బా బిన్ రబీఆ, షైబా బిన్ రబీఆ, వలీద్ బిన్ ఉత్బా, ఉమయ్యా బిన్ ఖలఫ్, ఉఖ్బా బిన్ అబీ ముఈత్ లను కూడా శిక్షించు” అని ప్రార్థించారు.

అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ ఇంకా చెప్పారు: “నా ప్రాణం ఎవరి చేతిలో ఉందో అతని సాక్షి! ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పేర్లెత్తి శపించిన వీరంతా బద్ర్ (యుద్ధంలో వధించబడి) గుంటలో బొక్క బోర్లా పడి ఉండటాన్ని నేను స్వయంగా చూశాను. (మహా ప్రవక్త మహితోక్తులు 1172).

3) ఇస్లాం స్వీకరించిన కారణంగా ఇంటి నుండి గెంటి వేయబడిన ధనిక యువకుడు ఎవరు?

A) ముస్అబ్ బిన్ ఉమైర్ (రజియల్లాహు అన్హు)

ముస్అబ్ బిన్ ఉమైర్ (రజియల్లాహు అన్హు) మక్కాలో అత్యంత అందమైన యువకుడు, వారి తల్లి గొప్ప ధనవంతురాలు, తనయుడికి చాలా ధర గల దుస్తులు ధరింపచేసేది, అలాగే అత్యంత సువాసనగల అత్తర్లు పూసేది అని చరిత్ర గ్రంథాల్లో ఉంది. కాని ఇస్లాం స్వీకరించిన తర్వాత చాలా శిక్షించబడ్డారు, వేరే ఎవరితోనో కాదు. స్వయంగా ఎంతో ప్రేమ, వాత్సల్యాలతో పెంచిన కన్న తల్లి ద్వారానే. తల్లితో పాటు మరి కొందరు కలసి బందీఖానాలో వేశారు. ఏలాగో హబషా వలస వెళ్ళారు. అస్సాబిఖూనల్ అవ్వలూన్ లో ఒకరు ముస్అబ్ కూడాను. ప్రవక్త కంటే ముందు మదీనాకు ఎందుకవచ్చారో మరో క్విజ్ లో తెలుసుకుంటారు ఇన్ షా అల్లాహ్. చివరకు ఆయన షహీద్ అయిన రోజు కఫన్ కొరకు సరిపడ బట్ట దొరకలేదు. (బుఖారీ 1274, 1275).  ఇంకా చాలా ఘనతలున్నాయి.


ఇతరములు :

తెలుగు ఇస్లామిక్ క్విజ్ (ఆడియో సిరీస్) మెయిన్ పేజీ :
https://teluguislam.net/others/telugu-islamic-quiz

ఉపవాసం ఉండరాని రోజులు [వీడియో క్లిప్]

బిస్మిల్లాహ్

[2:18 నిముషాలు]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ఇక్కడ వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి (2:18 నిముషాలు)

ఈ వీడియో క్లిప్ క్రింద ఇవ్వబడిన వీడియో నుండి సేకరించబడింది :
ఉపవాస పాఠాలు -2: ఉపవాస ఆదేశాలు [వీడియో] [21:33 నిముషాలు]

క్రింది విషయాలు ఉపవాస (రోజా) ఆదేశాలు – జుల్ఫీ కేంద్రం నుండి [28 పేజీలు] అనే పుస్తకం నుండి తీసుకోబడింది.

రోజా ఉండరాని రోజులు:

1- పండుగ రోజుల్లో. ఈదుల్ ఫిత్ర్, ఈదుల్ అజ్ హా

2- ఈదుల్ అజ్ హా తరువాత మూడు రోజులు. కాని హజ్జె ఖిరాన్, హజ్జె తమత్తు చేయువారు ఖుర్బానీ చేయకుంటే, వారు ఈ రోజుల్లో ఉపవాసముండ వచ్చును.

3- బహిష్టురాలు మరియు బాలింతలు తమ గడువులో ఉండరాదు.

4- భర్త ఇంటి వద్ద ఉన్నప్పుడు భార్య తన భర్త అనుమతి లేనిది నఫిల్ ఉపవాసాలుండరాదు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సెలవిచ్చారు:

ఒక స్త్రీ తన భర్త ఇంటిలో ఉన్నప్పుడు అతని అనుమతి లేనిదే రోజా ఉండకూడదు. రమజాను మాసము తప్ప. (అబూ దావూద్ 2458, బుఖారి 5192, ముస్లిం 1026).

ఇతరములు:

నఫిల్ ఉపవాసాలు మరియు వాటి ఘనతలు [వీడియో క్లిప్]

బిస్మిల్లాహ్

[3:05 నిముషాలు]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ఇక్కడ వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి (3:05 నిముషాలు)

ఈ వీడియో క్లిప్ క్రింద ఇవ్వబడిన వీడియో నుండి సేకరించబడింది :
ఉపవాస పాఠాలు -2: ఉపవాస ఆదేశాలు [వీడియో] [21:33 నిముషాలు]

క్రింది విషయాలు ఉపవాస (రోజా) ఆదేశాలు – జుల్ఫీ కేంద్రం నుండి [28 పేజీలు] అనే పుస్తకం నుండి తీసుకోబడింది.

నఫిల్ ఉపవాసాలు:

ప్రవక్త (సల్లల్లహు అలైహి వసల్లం) ఈ రోజుల్లో ఉపవాసాలుండాలని ప్రోత్సహించారు.

1- షవ్వాల్ మాసములో ఆరు రోజాలు. ఆయన ఆదేశం ఇది:

“ఎవరు రమజాను మాసమెల్లా ఉపవాసాలుండి, షవ్వాల్ మాసములో ఆరు ఉపవాసాలుంటాడో అతనికి సంవత్సరమెల్లా ఉపవాసాలున్నంత పుణ్యం లభిస్తుంది.” (ముస్లిం 1164).

2- ప్రతి సోమవారం, గురువారం.

3- ప్రతి నెల మూడు రోజులు. అవి చంద్రమాస ప్రకారం 13,14,15 తారీకుల్లో ఉంటే మంచిది.

4- ఆషూరా రోజు. అంటే ముహర్రం పదవ తారీకు. అయితే ఒక రోజు ముందు 9,10 లేదా ఒక రోజు తర్వాత 10,11 కలిపి రోజా ఉండడం. మంచిది. ఇందులో యూదుల ఆచారానికి భిన్నత్వం కూడా ఉంది. దీని ఘనతలో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రభోదించారని, అబూ ఖతాద (రజియల్లాహు అన్హు)  ఉల్లేఖించారు:

“ఆషూరా రోజాకు బదులుగా అల్లాహ్ గత ఒక సంవత్సరపు అపరాధాలు మన్నిస్తాడని నా నమ్మకం.”(ముస్లిం 1162).

5- అరఫా రోజు ఉపవాసం. అది జిల్ హిజ్జ మాసంలో 9వ తారీకు. దీని గురించి ప్రవక్త (సల్లల్లహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు.

“అరఫా రోజాకు బదులుగా అల్లాహ్ గత ఒక సంవత్సరం మరియు వచ్చే ఒక సంవత్సరం రెండు సంవత్సరాల పాపాల్ని మన్నిస్తాడని నా నమ్మకం.” (ముస్లిం 1162).

ఇతరములు:

తరావీ నమాజు ఘనత మరియు శుభాలు [వీడియో క్లిప్]

బిస్మిల్లాహ్

[2:23 నిముషాలు]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ఇక్కడ వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి (2:23 నిముషాలు)

ఈ వీడియో క్లిప్ క్రింద ఇవ్వబడిన వీడియో నుండి సేకరించబడింది :
ఉపవాస పాఠాలు -2: ఉపవాస ఆదేశాలు [వీడియో] [21:33 నిముషాలు]

ఇతరములు:

సహ్రీ భుజించండి. సహ్రీ లో చాలా శుభాలు ఉన్నాయి [వీడియో క్లిప్]

బిస్మిల్లాహ్

[1:18 నిముషాలు]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ఇక్కడ వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి (1:18 నిముషాలు)

ఈ వీడియో క్లిప్ క్రింద ఇవ్వబడిన వీడియో నుండి సేకరించబడింది :
ఉపవాస పాఠాలు -2: ఉపవాస ఆదేశాలు [వీడియో] [21:33 నిముషాలు]

ఇతరములు:

ఉపవాస సమయంలో దుఆ అంగీకరించ బడుతుంది [వీడియో క్లిప్]

బిస్మిల్లాహ్

[1:24 నిముషాలు]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ఇక్కడ వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి (1:24 నిముషాలు)

ఈ వీడియో క్లిప్ క్రింద ఇవ్వబడిన వీడియో నుండి సేకరించబడింది :
ఉపవాస పాఠాలు -2: ఉపవాస ఆదేశాలు [వీడియో] [21:33 నిముషాలు]

ఇతరములు:

ఉపవాసపు నియ్యత్ (సంకల్పం) ఎప్పుడు చేసుకోవాలి? [వీడియో క్లిప్]

బిస్మిల్లాహ్

[1:43 నిముషాలు]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ఇక్కడ వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి (1:43 నిముషాలు)

ఈ వీడియో క్లిప్ క్రింద ఇవ్వబడిన వీడియో నుండి సేకరించబడింది :
ఉపవాస పాఠాలు -2: ఉపవాస ఆదేశాలు [వీడియో] [21:33 నిముషాలు]

ఇతరములు:

ఉపవాసం ఏ విషయాల వల్ల భంగం కాదు [వీడియో క్లిప్]

బిస్మిల్లాహ్

[3:43 నిముషాలు]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ఇక్కడ వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి (3:43 నిముషాలు)

ఈ వీడియో క్లిప్ క్రింద ఇవ్వబడిన వీడియో నుండి సేకరించబడింది :
ఉపవాస పాఠాలు -2: ఉపవాస ఆదేశాలు [వీడియో] [21:33 నిముషాలు]

ఇతరములు:

“అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్యుడు మరెవ్వడూ లేడు” అనే ప్రమాణానికి (తౌహీద్) ఆహ్వానం – కితాబ్ అత్ తౌహీద్ | ఇమామ్ అస్-సాదీ

5 వ అధ్యాయం
“అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్యుడు లేడు” అనే ప్రమాణానికి ఆహ్వానించుట
అల్ ఖవ్లుల్ సదీద్ షర్హ్ కితాబ్ అత్ తౌహీద్ – ఇమామ్ అస్-సాదీ
The famous commentary of Shaykh as-Sa’di of the book Kitab at-Tawhid of Muhammad ibn Abdul Wahhab.


باب الدعوة إلى شهادة أن لا إله إلا الله

5వ అధ్యాయం: “అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్యుడు మరెవ్వడూ లేడు” అనే ప్రమాణానికి (తౌహీద్) ఆహ్వానం

[قُلْ هَذِهِ سَبِيلِي أَدْعُو إِلَى اللَّهِ عَلَى بَصِيرَةٍ أَنَا وَمَنِ اتَّبَعَنِي وَسُبْحَانَ اللَّهِ وَمَا أَنَا مِنَ الْمُشْرِكِينَ]

(ఓ ప్రవక్తా!) నువ్వు వాళ్ళకు చెప్పేయి : “నా మార్గమైతే ఇదే. నేనూ, నా అనుయాయులూ పూర్తి అవగాహనతో, దృఢనమ్మకంతో అల్లాహ్‌ వైపుకు పిలుస్తున్నాము. అల్లాహ్‌ పరమపవిత్రుడు. నేను, అల్లాహ్‌కు భాగస్వాముల్ని కల్పించే (షిర్క్‌ చేసే) వారిలోనివాణ్ణికాను. (యూసుఫ్ 12:108).

ఇబ్నె అబ్బాస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముఆజ్ రజియల్లాహు అన్హు వారిని యమన్ దేశానికి పంపుతూ ఇలా ఉపదేశించారు:

إِنَّكَ تَأْتِي قَوْمًا مِنْ أَهْلِ الكِتَابِ، فَلْيَكُنْ أَوَّلَ مَا تَدْعُوهُمْ إِلَيْهِ شَهَادَةُ أَنَّ لَا إِلَهَ إِلَّا اللهُ

“నీవు గ్రంథమివ్వబడిన (యూద, క్రైస్తవుల) వైపునకు వెళ్తున్నావు. మొట్టమొదట నీవు వారిని “లాఇలాహ ఇల్లల్లాహ్” సాక్ష్యం ఇవ్వాలని పిలుపునివ్వు”.

 మరో ఉల్లేఖనంలో ఉంది:

إِلَى أَنْ يُوَحِّدُوا اللهَ فَإِنْ هُمْ أَطَاعُوكَ لِذَلِكَ فَأَعْلِمْهُمْ أَنَّ اللهَ افْتَرَضَ عَلَيْهِمْ خَمْسَ صَلَوَاتٍ فِي كُلِّ يَوْمٍ وَلَيْلَةٍ، فَإِنْ هُمْ أَطَاعُوكَ لِذَلِكَ فَأَعْلِمْهُمْ أَنَّ اللهَ افْتَرَضَ عَلَيْهِمْ صَدَقَةً تُؤْخَذُ مِنْ أَغْنِيَائِهِمْ فَتُرَدُّ عَلَى فُقَرَائِهِمْ، فَإِنْ هُمْ أَطَاعُوكَ لِذَلِكَ فَإِيَّاكَ وَكَرَائِمَ أَمْوَالِهِمْ، وَاتِّقِ دَعْوَةَ المَظْلُومِ فَإِنَّهُ لَيْسَ بَيْنَهَا وَبَيْنَ الله حِجَابٌ

“ఆరాధనలో అల్లాహ్ ఏకత్వాన్ని పాటించాలని” పిలుపునివ్వు. వారు నీ ఈ మాటకు విధేయులయితే, అల్లాహ్ వారిపై రేయింబవళ్ళలో ఐదు పూటల నమాజు చేయడం విధించాడని తెలుపు. నీ ఈ మాటకు కూడా విధేయత చూపితే, అల్లాహ్ వారిపై జకాత్ విధించాడని తెలియజేయి. అది వారి ధనికుల నుండి వసూలు చేసి, వారి పేదలలో పంచబడుతుంది అని తెలుపు. నీ ఈ మాటను వారు అమలు పరుస్తే, (వారి నుండి జకాత్ వసూలు చేసేటప్పుడు) వారి శ్రేష్ఠమైన వస్తువుల జోలికి పోకు. పీడితుని ఆర్తనాదాలకు భయపడు. పీడితుని ఆర్తనాదానికి, అల్లాహ్ కు మధ్య ఏలాంటి అడ్డుతెర ఉండదు”.

సహల్ బిన్ సఅద్ ఉల్లేఖించారు:

وَلَهُمَا عَنْ سَهْلِ بْنِ سَعْدٍ ﷜ أَنَّ رَسُولَ الله – صلى الله عليه وسلم – قَالَ يَوْمَ خَيْبَرَ: «لأُعْطِيَنَّ الرَّايَةَ غَدًا رَجَلًا يُحِبُّ اللهَ وَرَسُولَهُ وَيُحِبُّهُ اللهُ وَرَسُولُهُ، يَفتحُ اللهُ عَلَى يَدَيْهِ»، فَبَاتَ النَّاسُ يَدُوكُونَ لَيْلَتَهُمْ أَيُّهُمْ يُعْطَاهَا، فَلَمَّا أَصْبَحُوا غَدَوْا عَلَى رَسُولِ الله – صلى الله عليه وسلم – كُلُّهُمْ يَرْجُو أَنْ يُعْطَاهَا، فَقَالَ: «أَيْنَ عَلِيُّ بْنُ أَبِي طَالِبٍ؟ »، فَقِيلَ: هُوَ يَشْتَكِي عَيْنَيْهِ، فَأَرْسَلُوا إِلَيْهِ فَأُتِي بِهِ، فَبَصَقَ فِي عَيْنَيْهِ وَدَعَا لَهُ، فَبَرَأَ كَأَنْ لَمْ يَكُنْ بِهِ وَجَعٌ، فَأَعْطَاهُ الرَّايَةَ، فَقَالَ: «انْفُذْ عَلَى رِسْلِكَ حَتَّى تَنْزِلَ بِسَاحَتِهِمْ، ثُمَّ ادْعُهُمْ إِلَى الإِسْلامِ وَأَخْبِرْهُمْ بِمَا يَجِبُ عَلَيْهِمْ مِنْ حَقِّ الله تَعَالَى فِيهِ، فَوالله لأَنْ يَهْدِيَ اللهُ بِكَ رَجُلًا وَاحِدًا خَيْرٌ لَكَ مِنْ حُمْرِ النَّعَمِ».

ఖైబర్ యుద్ధం నాడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “నేను రేపు యుద్ధపతాకం ఎలాంటి వ్యక్తికి ఇస్తానంటే, అతను అల్లాహ్, ఆయన ప్రవక్తని ప్రేమిస్తాడు. అతన్ని అల్లాహ్, ఆయన ప్రవక్త ప్రేమిస్తారు. అల్లాహ్ అతని ద్వారా (ఖైబర్) విజయం చేకూరుస్తాడు”. ఆ పతాకం ఎవరికి దొరుకుతుందో అన్న ఆలోచనలోనే వారు రాత్రి గడిపి, తెల్లవారగానే ప్రవక్త సమక్షంలో హాజరయి,  ప్రతి ఒక్కరూ తనకే ఆ పతాకం లభిస్తుందని ఆశించారు. అప్పుడు “అలీ బిన్ అబీ తాలిబ్ ఎక్కడున్నాడ“ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అడిగారు. ఆయన కళ్ళలో ఏదో బాధగా ఉంది అని సమాధానమిచ్చారు ప్రజలు. ఎవరినో పంపి అతన్ని పిలిపించడం జరిగింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతని కళ్ళల్లో తమ లాలాజలాన్ని ఉమ్మినారు. తక్షణమే అలీ రదియల్లాహు అన్హు తనకసలు ఎలాంటి బాధే లేనట్లు పూర్తిగా ఆరోగ్యవంతులైపోయారు. యుద్ధ పతాకం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అలీ రజియల్లాహు అన్హు చేతికి ఇచ్చి, ఇలా బోధించారు: “నీవు నెమ్మదిగా, హుందాగా వెళ్ళి వారి మైదానంలో దిగు. ఆ తరువాత వారికి ముందుగా ఇస్లాం సందేశాన్ని అందజెయ్యి. వారు నిర్వహించవలసిన అల్లాహ్ హక్కులు వారిపై ఏమున్నాయో వారికి బోధించు. అల్లాహ్ సాక్షిగా! నీ ద్వారా ఏ ఒక్కనికి అల్లాహ్ రుజు మార్గం (ఇస్లాం) ప్రసాదించినా అది నీకోసం ఎరుపు రంగు ఒంటెల కంటే ఎంతో విలువైనది, శ్రేష్ఠమైనది“. (బుఖారి 2942, ముస్లిం 2406).

1. అల్లాహ్ వైపునకు ఆహ్వానించుట (ప్రవక్త మరియు) ఆయన్ని అనుసరించిన వారి జీవితాశయం.

2. ‘ఇఖ్లాస్’ గురించి తాకీదు ఉంది. ఎందుకనగా ధర్మం వైపు ఆహ్వానిస్తున్నామంటున్న అనేక మంది స్వయంగా తమ వైపునకు ప్రజల్ని ఆహ్వానిస్తారు.

3. విద్య ఆధారంగా (ధర్మప్రచారం చేయుట) కూడా ఒక విధి.

4. అల్లాహ్ ను లోపాలు లేని పవిత్రుడని నమ్ముటయే ఉత్తమమైన తౌహీద్.

5. అల్లాహ్ లోపాలు గలవాడని భావించుట చాలా చెడ్డ షిర్క్.

6. ముస్లిం, ముష్రికులకు అతి దూరంగా ఉండాలి. ఎందుకనగా అతను షిర్క్ చేయనప్పటికి వారిలో కలసిపోయే ప్రమాదముంటుంది.

7. విధుల్లో మొట్టమొదటిది తౌహీద్.

8. అన్నిటికి ముందు, చివరికి నమాజుకన్నా ముందు తౌహీద్ ప్రచారం.

9. హదీసులో “అన్ యువహ్హిదుల్లాహ్” (అల్లాహ్ ఏకత్వాన్ని పాటించుట) మరియు “లాఇలాహ ఇల్లల్లాహ్” రెండింటి భావం ఒక్కటే.

10. మనిషి దైవ గ్రంథం పొందిన (యూదుడు, క్రైస్తవుడు లాంటి) వాడు అయి కూడా “లాఇలాహ ఇల్లల్లాహ్” అర్థం తెలియకపోవచ్చు, లేక తెలిసి కూడా దాని ప్రకారం ఆచరించకపోవచ్చు.

11. క్రమ క్రమంగా విద్య నేర్పాలని బోధపడింది.

12. అతి ముఖ్యమైన విషయంతో ఆరంభించాలని తెలిసింది.

13. జకాత్ సొమ్మును ఎందులో ఖర్చు పెట్టాలో తెలిసింది.

14. (జకాత్ సొమ్ము ఎందులో ఖర్చు చెయ్యాలి తెలియక, ముఆజ్ రజియల్లాహు అన్హు సందేహ పడకుండా ప్రవక్తవారు ముందే వివరించినట్లు) శిష్యులను సందిగ్ధంలో పడవేసే విషయాలను పండితుడు ముందే విశదీకరించాలి.

15. (జకాత్ వసూలు చేసే అతను) కేవలం మంచి సొమ్ము మాత్రమే తీసుకొనుట నివారించబడింది.

16. పీడుతుని ఆర్తనాదానికి భయపడాలని ఉంది.

17. అతని ఆర్తనాదం స్వీకరించబడటానికి ఏదీ అడ్డు పడదు అని తెలిసింది.

18. ప్రవక్త, సహాబాలు, ఇతర మహాభక్తులు (తౌహీద్ ప్రచారంలో) భరించిన కష్టాలు, ఆకలి, అంటు వ్యాధి బాధలు, తౌహీద్ యొక్క నిదర్శనాలు. (ఖైబర్ యుద్ధ సందర్భంలో ఇవి ఎదురయ్యాయి).

19. “నేను యుద్ధపతాకం ఇస్తాను” అన్న ప్రవక్త మాట, ఆయన సత్య ప్రవక్త అనడానికి గొప్ప సూచన.

20. అలీ రజియల్లాహు అన్హు కళ్ళల్లో ఆయన లాలాజలం పెట్టడం కూడా ఒక అద్భుత సంకేతం మరియు సత్య ప్రవక్త అనడానికి గొప్ప సూచన.

21. అలీ రజియల్లాహు అన్హు యొక్క ఘనత తెలిసింది.

22. ఇందులో సహాబాల ఘనత కూడా తెలుస్తుంది. ఎలా అనగా? యుద్ధ పతాకం ఏ అదృష్టవంతునికి లభిస్తుందో (అతడు నిజ ప్రేమికుడు, ప్రియుడు) అని ఆలోచించడంలోనే నిమగ్నులయ్యారు, అతని ద్వారానే అల్లాహ్ విజయం ప్రసాదిస్తాడన్న విషయం వారు మరచిపోయారు.

23. ఇందులో విధివ్రాతపై విశ్వాసం రుజువవుతుంది. అది ఎలా? యుద్ధ పతాకం కోరినవారికి లభించలేదు. కోరని, ఏ మాత్రం ప్రయత్నం చేయని వారికి లభించింది.

24. “నిదానంగా బయలుదేరు” అన్న ప్రవక్త మాటలో (యుద్ధ) శిక్షణ, పద్దతి బోధపడుతుంది.

25. ఎవరితో యుద్ధం చేయబోతున్నారో ముందు వారికి ఇస్లాం పిలుపు నివ్వాలి.

26. ఇంతకు ముందే పిలుపు ఇవ్వడం, లేక యుద్ధం జరిగియుంటే పరవా లేదు.

27. “వారిపై విధియున్న వాటిని వారికి తెలుపు” అనడంలో ధర్మ ప్రచార రంగంలో అవసరమైన వివేకం కానవస్తుంది.

28. ఇస్లాంలో అల్లాహ్ హక్కు ఏమిటో తెలుసుకొనుట చాలా అవసరం.

29. ఒక్క వ్యక్తి అయినా తమ ద్వారా రుజుమార్గం పొందితే ఇది ఎంత పుణ్యకార్యమో తెలుస్తుంది. .

30. ఫత్వా ఇస్తున్నప్పుడు అవసర సందర్భంగా అల్లాహ్ నామముతో ప్రమాణం చేయవచ్చును.

ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహ్హాబ్ రహిమహుల్లాహ్: ఈ గ్రంధంలోని అధ్యాయాల్లో ఏ క్రమాన్ని పాటించారో అది చాలా ఉత్తమమైనది. మొదట తౌహీద్ “విధి” అని తెలిపారు, తరువాత దాని ఘనత, సంపూర్ణత ప్రస్తావన తెచ్చి, పిదప బాహ్యంతర్యాల్లో దాని “నిర్ధారణ”, ఆ తరువాత దానికి విరుద్ధమైన షిర్క్ తో భయంను ప్రస్తావించారు. ఇలా మనిషి ఒక విధంగా తనకు తాను పరిపూర్ణుడవుతాడు. ఆ తర్వాత “లా ఇలాహ ఇల్లల్లాహ్” యొక్క పిలుపునివ్వాలన్న అధ్యాయాన్ని చేర్చారు.

ఇది ప్రవక్తల విధానం. ఒకే అల్లాహ్ ఆరాధన చేయాలని వారు తమ జాతి వారికి పిలుపు ఇచ్చారు. ఇదే విధానం ప్రవక్తల నాయకులైన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిది. ఆయన వివేకంతో, చక్కని హితబోధతో, ఉత్తమ రీతి వాదనతో ఈ బాధ్యతను సంపూర్ణంగా నెరవేర్చారు. అందులో అలసిపోలేదు. బలహీనత చూపలేదు. అల్లాహ్ ఆయన ద్వారా ఇస్లాం ధర్మాన్ని స్థాపించాడు. అది తూర్పు, పశ్చిమాల్లో వ్యాపించింది. అనేక మంది ఋజుమార్గం పొందారు. ఆయన స్వయంగా ఈ బాధ్యతను నెరవేర్చుతూ, తమ అనుచరులను ప్రచారకులుగా తీర్చిదిద్ది ఇతర ప్రాంతాలకు పంపేవారు. మొట్ట మొదట తౌహీద్ గురించే బోధించాలని చెప్పేవారు. ఎందుకనగా సర్వ కర్మల అంగీకారం దానిపైనే ఆధారపడియుంది. ఇలాంటి బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. అందుకే మొదట తౌహీద్ గురించి తెలుసుకోవాలి. పిదప దాని ప్రచారం చేయాలి. ప్రతి ఒక్కరిపై తన శక్తి మేరకు ఈ బాధ్యత ఉంటుంది. పండితుడు తన విద్య తో ఈ బాధ్యతను నెరవేర్చాలి. ధన, ప్రాణ శక్తి గలవాడు, హోదా అంతస్తు గలవాడు వాటిని ఉపయోగించి ఈ బాధ్యతను నెరవేర్చాలి. కనీసం ఒక మాటతోనైనా ఈ బాధ్యతను నెరవేర్చినవానిని అల్లాహ్ కరుణించుగాక! శక్తి, సామర్థ్యాలు కలిగియుండి కూడా ఈ బాధ్యతను నెరవేర్చని వానికి వినాశము ఉంటుంది.

నుండిఏకత్వపు బాటకు సత్యమైన మాట (అల్ ఖవ్లుల్ సదీద్ షర్హ్ కితాబ్ అత్ తౌహీద్)  – ఇమామ్ అస్-సాదీ [పుస్తకం]. తెలుగు అనువాదం: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

తెలుగు ఇస్లామిక్ క్విజ్: పార్ట్ 43 [ఆడియో]

బిస్మిల్లాహ్

Telugu Islamic Quiz (తెలుగు ఇస్లామిక్ క్విజ్) – పార్ట్ 43
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

బంధుమిత్రులతో విని ప్రవక్త జీవిత ఘట్టాలు, క్విజ్ రూపంలో సహీ ఆధారాలతో తెలుసుకుంటున్నందుకు అల్లాహ్ కృతజ్ఞత చెల్లిస్తూ ఆనందించండి అల్ హందులిల్లాహ్, సుమ్మ అల్ హందులిల్లాహ్

ప్రశ్నల పత్రం – 43

దైవప్రవక్త (ﷺ) వారి బహిరంగ సందేశ ప్రచారం గూర్చిన ప్రశ్నలు

1) దైవప్రవక్త (ﷺ) తన దగ్గరి బంధువులకు సందేశం ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన సమావేశంలో వ్యతిరేకత చూపిన బంధువు ఎవరు?

A) అబూతాలిబ్
B) అబూలహబ్
C) అబ్దు మునాఫ్

2) బాహాటంగా సందేశం ఇచ్చేందుకు దైవప్రవక్త (ﷺ) ఏ కొండపై నుండి పిలుపునిచ్చారు?

A) సఫా కొండ
B) మర్వా కొండ
C) తూర్ కొండ

3) ఇస్లాం స్వీకరించిన తొలి పూర్తి కుటుంబం ఎవరిది?

A) ఉమర్ (రజి యల్లాహు అన్హు)
B) యాసిర్ (రజి యల్లాహు అన్హు)
C) అలీ (రజి యల్లాహు అన్హు)

క్విజ్ 43: సమాధానాలు & వివరణ ఇక్కడ వినండి /డౌన్లోడ్ చేసుకోండి [9:28 నిమిషాలు]


1) దైవప్రవక్త (ﷺ) తన దగ్గరి బంధువులకు సందేశం ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన సమావేశంలో వ్యతిరేకత చూపిన బంధువు ఎవరు?

B) అబూలహబ్

111:1 تَبَّتْ يَدَا أَبِي لَهَبٍ وَتَبَّ
అబూ లహబ్ చేతులు రెండూ విరిగి పోయాయి. వాడు సయితం నాశనం అయిపోయాడు.

111:2 مَا أَغْنَىٰ عَنْهُ مَالُهُ وَمَا كَسَبَ
వాడి ధనంగానీ, వాడి సంపాదన గాని వాడికే మాత్రం పనికి రాలేదు.

111:3 سَيَصْلَىٰ نَارًا ذَاتَ لَهَبٍ
త్వరలోనే వాడు భగ భగ మండే అగ్నికి ఆహుతి అవుతాడు.

111:4 وَامْرَأَتُهُ حَمَّالَةَ الْحَطَبِ
ఇంకా అతని భార్య; పుల్లలు మోసుకుంటూ ఆమె కూడా (నరకానికి పోతుంది).

111:5 فِي جِيدِهَا حَبْلٌ مِّن مَّسَدٍ
ఆమె మెడలో (ఖర్జూర ఆకుతో) గట్టిగా పేనిన ఒక త్రాడు ఉంటుంది.

2) బాహాటంగా సందేశం ఇచ్చేందుకు దైవప్రవక్త (ﷺ) ఏ కొండపై నుండి పిలుపునిచ్చారు?

A) సఫా కొండ

وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: لَمَّا نَزَلَتْ [وَأَنْذِرْ عَشِيْرَتَكَ الْأَقْرَبِيْنَ؛ 26: 214] خَرَجَ النَّبِيُّ صلى الله عليه وسلم حَتّى صَعِدَ الصَّفَا فَجَعلَ يُنَادِيْ: “يَا بَنِيْ فَهْرٍ يَا بَنِيْ عَدِيٍّ “لِبُطُوْنِ قُرَيْشٍ حَتّى اِجْتَمَعُوْا. فَجَعَلَ الرَّجُلُ إِذَا لَمْ يَسْتَطِعْ أَنْ يَخْرُجَ أَرْسَلَ رَسُوْلًا لِيَنْظُرَ مَا هُوَ فَجَاءَ أَبُوْ لَهْبٍ وَقُرَيْشٌ فَقَالَ: “أَرَأَيْتُمْ إِنْ أَخْبَرْتُكُمْ أَنَّ خَيْلًا تَخْرُجُ مِنْ سَفْحٍ هَذَا الْجَبَلِ –
وَفِيْ رِوَايَةٍ: أَنَّ خَيْلًا تَخْرُجُ بِالْوَادِيْ تُرِيْدُ أَنْ تُغِيْرَ عَلَيْكُمْ – أَكُنْتُمْ مُصدَّقِيَّ؟” قَالُوْا: نَعَمْ مَا جَرَّبْنَا عَلَيْكَ إِلَّا صِدْقًا.قَالَ:”فَإِنِّيْ نَذِيْرٌ لَكُمْ بَيْنَ يَدَيْ عَذَابٍ شَدِيْدٍ”. قَالَ أَبُوْ لَهْبٍ: تَبًّا لَكَ أَلِهَذَا جَمَعْتَنَا؟ فَنَزَلَتْ: [تَبَّتْ يَدَا أَبِيْ لَهَبٍ وَتَبّ؛111] مُتَّفَقٌ عَلَيْهِ.

5846. (10) [3/1625-ఏకీభవితం]

ఇబ్నె ‘అబ్బాస్ (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: ”మీరు మీ దగ్గరి బంధువులను హెచ్చరించండి” (అష్ షు’అరా’, 26:214) అనే ఆయతు అవతరించినపుడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దాన్ని నిర్వర్తించడానికి బయలుదేరారు. సఫా కొండపై ఎక్కి ఇలా పిలవటం ప్రారంభించారు. ”ఓ ఫిహ్ర్ సంతా నమా! ఓ అదీ సంతానమా! ఇదే విధంగా ఖురైషు తెగలన్నిటినీ ఉద్దేశించి పిలవ సాగారు. చివరికి అన్ని తెగల వారూ వచ్చారు. రాలేనివారు తన తరఫున ఒక వ్యక్తిని పంపారు. అనంతరం అబూ లహబ్, ఇంకా ఖురైష్కు చెందిన వారందరూ వచ్చారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి నుద్దేశించి, ” ‘ఒకవేళ నేను సైన్యం వస్తుంది, అది మీపై దాడి చేస్తుంది, హత్యలు, దోపిడీలకు పాల్పడుతుంది,’ అని అంటే, మీరు నా మాట నమ్ముతారా?” అని అడిగారు. అందరూ ముక్త కంఠంతో, ‘నమ్ముతాము, ఎందుకంటే నువ్వు ఎప్పుడూ సత్యమే పలికావు,’ అని అన్నారు. అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం), ‘నేను మీకు మీముందు ఉన్న కఠిన శిక్ష గురించి భయపెడుతున్నాను,’ అని అన్నారు. అది విన్న అబూ లహబ్, ‘నీ పాడుగాను, దీనికోసమేనా మమ్మల్ని అందరినీ ఇక్కడ ప్రోగు చేసావు,’ అని అన్నాడు.” అప్పుడు సూరహ్ లహబ్ / మసద్ (111) అవతరింపజేయ బడింది. (బు’ఖారీ 4770, ముస్లిమ్ 208)

3) ఇస్లాం స్వీకరించిన తొలి పూర్తి కుటుంబం ఎవరిది?

B) యాసిర్ (రజియల్లాహు అన్హు)

యాసిర్ (రజియల్లాహు అన్హు), అతని భార్య సుమయ్య (రజియల్లాహు అన్హా) మరియు వారిద్దరి కొడుకు అమ్మార్ (రజియల్లాహు అన్హు).


ఇతరములు :

తెలుగు ఇస్లామిక్ క్విజ్ (ఆడియో సిరీస్) మెయిన్ పేజీ :
https://teluguislam.net/others/telugu-islamic-quiz