వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్) ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
1- అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్యుడు మరొకడు లేడు, ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అల్లాహ్ యొక్క ప్రవక్త అని సాక్ష్యమిచ్చుట.
2- నమాజు స్థాపించుట.
3- జకాత్ (విధిదానం) చెల్లించుట.
4- హజ్ చేయుట.
5- రమజాను ఉపవాసాలు పాటించుట”.
(బుఖారి 8, ముస్లిం 16).
ప్రాజ్ఞ వయస్సుకు చేరడం అంటే పదిహేను సంవత్సరాలు నిండడం, లేదా మర్మాంగం చుట్టున వెంట్రుకలు మొలవడం, లేదా స్వప్నస్ఖలనం ద్వారా ఇంకే విధంగానైనా ఇంద్రియం వెలువడడం.
బాలికలకు నెలవారి రక్తస్రావం అంటే బహిష్టు రావడం. మనిషికి వీటిలో ఏ ఒక్కటి జరిగినా అతను ప్రాజ్ఞవయస్సుకు చేరినట్లు.
నమాజు విధిని తిరస్కరించే వాడు కాఫిర్ (సత్య తిరస్కారి) అవుతాడని ఏకాభిప్రాయం (ఇజ్మాఅ) ఉంది. ఇక బద్ధకం, నిర్లక్ష్యంతో మొత్తానికే నమాజు చేయనివాడు కూడా కాఫిర్ అవుతాడని సహాబాలు ఏకీభవించారు (ప్రవక్త సహచరుల ఇజ్మాఅ ఉంది).
జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖనం ప్రకారం, నేను ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పగా విన్నాను:
“ఎవరైనా తన ఇంట్లో వుజూ చేసుకొని, అల్లాహ్ యొక్క విధుల్లో ఒక విధి నిర్వహించుటకు అల్లాహ్ గృహాల్లోని ఒక గృహం (మస్జిద్)లో ప్రవేశిస్తే, అతను వేసే అడుగుల్లో ఒక దానికి బదులుగా ఒక పుణ్యం లభిస్తే, మరో దానికి బదులుగా ఒక స్థానం పెరుగుతుంది”.(ముస్లిం 666).
అబూహురైర (రది అల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం: మహానీయ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అడిగారు:
“పరమ ప్రభువైన అల్లాహ్ ఏ విషయాల ఆధారంగా అపరాధాలను మన్నిస్తాడో, స్థాయిని ఉన్నతం చేస్తాడో అలాంటి విషయాలు మీకు తెలుపనా?” దానికి సహచరులు ‘దైవప్రవక్తా తప్పక సెలవీయండి’ అని బదులిచ్చారు. అప్పుడాయన ఇలా బోధించారు:
“(1) వాతవరణం, పరిస్థితులూ అనుకూలంగా లేనప్పటికీ వుజూ పూర్తిగా చెయ్యటం.
(2) మస్జిద్ వైపునకు అధికంగా అడుగులు వెయ్యడం.
(3) ఒక నమాజ్ తరువాత మరో నమాజ్ కొరకు నిరీక్షించడం, ఇది రిబాత్ తో సమానం(1)“.
(ముస్లిం 251).
(1) రిబాత్ అంటే సత్యాసత్యాల మధ్య పోరాటం సాగే రోజుల్లో రాత్రిళ్ళు పహరా కాయడం. శాంతి కాలంలో నమాజ్ పట్ల మక్కువ, పోరాటపు రోజుల్లో ప్రాణాలొడ్డి పహరాకాయడంతో సమానమని అర్థం.
“మస్జిద్ కు వస్తూ పోతూ ఉండేవారు (ఎంత అదృష్టవంతులంటే), వారు వస్తూ పోతూ ఉన్న ప్రతీసారి అల్లాహ్ వారి కొరకు స్వర్గంలో విందు ఏర్పాటు చేస్తాడు”. (బుఖారి 662. ముస్లిం 669).
నమాజుకు సంబంధించిన ముఖ్య విషయాలు:
1- సామూహికంగా నమాజు చేయడం పురుషులపై విధిగా ఉంది, ఈ హదీసు ఆధారంగా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వస్లలం తెలిపారు:
“నమాజు చేయించడానికి ఒకరిని ఆదేశించి, సామూహిక నమాజులో పాల్గొనని వారి వైపుకు తిరిగి వారు ఇండ్లల్లో ఉండగా వారి గృహాలను తగలబెడదామని ఎన్నో సార్లు అనుకున్నాను”. (బుఖారి 2420, ముస్లిం 651).
2- ముస్లిం వ్యక్తి శాంతి, నిదానంగా త్వరగా మస్జిదుకు రావాలి.
3- మస్జిదులో ప్రవేశిస్తూ కుడి కాలు ముందు వేసి చదవండి:
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) బోధించారని, అబూ హురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః
“అజాన్ పలకడం మరియు మొదటి పంక్తిలో చేరడం ఎంత పుణ్యకార్యమో ప్రజలకు గనక తెలిస్తే, ఆ అవకాశాలు చీటి (ఖుర్అ) పద్దతి ద్వారా మాత్రమే లభిస్తాయని తెలిస్తే, వారు తప్పకుండా పరస్పరం చీటి వేసుకొందురు. అలాగే వేళ కాగానే తొలి సమయంలో నమాజుకు రావడంలో ఎంత పుణ్యముందో తెలిస్తే, అందులో కూడా ప్రజలు ఒకర్నొకరు మించిపోవడానికి పోటిపడుదురు. …..”. (బుఖారి 615, ముస్లిం 437).
عَنْ أَبِي هُرَيْرَةَ t أَنَّ رَسُولَ الله ﷺ قَالَ: (لَا يَزَالُ أَحَدُكُمْ فِي صَلَاةٍ مَا دَامَتْ الصَّلَاةُ تَحْبِسُهُ).
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రబోధించారని, అబూ హురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు:
“నమాజు కొరకు వేచిస్తూ ఉన్న వ్యక్తికి నమాజు చేస్తున్నంత పుణ్యం లభిస్తుంది“. (బుఖారి 659, ముస్లిం 649).
నమాజు సమయాలు:
జొహ్ర్ నమాజు నమయం: తల నుండి పొద్దు వాలినప్పటి నుండి ప్రతీ వస్తువు నీడ దానంత అయ్యే వరకు.
అస్ర్ నమాజు సమయం: ప్రతీ వస్తువు నీడ దానంత అయినప్పటి నుండి సూర్యాస్తమయం వరకు.
మగ్రిబ్ నమాజు సమయం: సూర్యాస్తమయమైనప్పటి నుండి ఎర్రని కాంతులు కనుమరుగయ్యే వరకు.
ఇషా నమాజు సమయం: ఎర్రని కాంతులు మరుగైన మరుక్షణం నుండీ అర్థ రాత్రి వరకు.
ఫజ్ర్ నమాజు సమయం: ఉషోదయము నుండి సూర్యోదయము వరకు.
నమాజు చేయరాని స్థలాలు:
1- ఖననవాటిక: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు:
“గొరీలు ఎదురుగా ఉండగా నమాజ్ చేయడం గానీ, వాటిపై కూర్చోవటం గానీ చేయకండి”. (ముస్లిం 972).
3- ఒంటెశాల అంటే ఒంటెలు కట్టే చోటు. అలాగే అశుద్ధ స్థలాల్లో నమాజు చేయరాదు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
అల్లాహుమ్మ ఇన్నీ అస్ అలుక ఫి’అలల్ ఖైరాతి , వ తర్కల్ మున్కరాతి , వ హుబ్బల్ మసాకీని, వ అన్ తగ్ ఫిరలీ, వ తర్ హమనీ, వ ఇజా అరత్త ఫిత్నత ఖౌమిన్ ఫతవఫ్ఫనీ గైర మఫ్ తూన్, వ అస్అలుక హుబ్బక, వ హుబ్బ మన్ యుహిబ్బుక, వ హుబ్బ అమలిన్ యుకర్రిబునీ ఇలా హుబ్బిక్
ఓ అల్లాహ్ నిశ్చయంగా నేను నీతో అర్థిస్తున్నాను – అన్ని రకాల మంచి పనులు చెయ్యాలని, అన్ని రకాల చెడులను వదులుకోవాలని, నిరుపేదల పట్ల ప్రేమగా మసులుకోవాలని. మరియు నా పాపాలను మన్నించు మరియు నన్ను కరుణించు. ఏ సమాజంలో నైనా ఏదైనా ప్రజలకు నీవు వారిని ఫిత్నా (ఉపద్రవంలో సంక్షోభంలో) పడవేయాలని కోరినపుడు, నేను సంక్షోభం లో పడకముందే నాకు చావు ప్రసాదించు. నీతోనే అర్థిస్తున్నాను – నీ ప్రేమ నాకు లభించాలని, నిన్ను ప్రేమించేవారి ప్రేమకూడా నాకు ప్రాప్తించాలని, మరియు ఏ కార్యాలు ఏ మాటలైతే నీ ప్రేమకు మరింత దగ్గరగా,చేరువగా చేస్తాయో, అలాంటి సత్కార్యాల, మంచి మాటల ప్రేమ కూడా నాకు కలుగజేయుము.
Ahmad 5/243, Al-Haakim 1/521 and At-Tirmidhi 5/369 (with similar wording); declared hasan by At-Tirmidhi who said, “I asked Muhammad bin Isma’il (Al-Bukhari) and he said, “This hadith is hasan sahih.” Additionally, at the end of the hadith, the Prophet صَلَّى اللّٰهُ عَلَيْهِ وَسَلَّم said, “Verily it is true so learn it and teach it.”“
Source: From the Book “Supplications & Treatment with Ruqyah” ,
Dr. Sa’eed bin Ali Al-Qahtani, Dar-us-Salam Publication
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్) ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
స్వలింగ సంపర్కము అనగా ఇద్దరు పురుషుల మధ్య లేదా ఇద్దరు స్త్రీల మధ్య ఉండే లైంగిక సంబంధము. ఒకే లింగ జాతికి చెందిన వ్యక్తుల మధ్య రతి సంబంధాన్ని స్వలింగ సంపర్కం (హోమో సెక్సువల్స్) అంటారు. అనగాఒక స్త్రీ మరొక స్త్రీతో అలాగే ఒక పురుషుడు మరొక పురుషునితో సంభోగించటం.
దైవ ప్రవక్త లూత్ అలైహిస్సలాం జాతివారు ప్రపంచంలోనే అందరికన్న ముందుగా స్వలింగ సంపర్కమనే అత్యంత నీచమైన చేష్టకు పాల్పడ్డారు. ఆ ముదనపు జాతి పేరు మీదగానే స్వలింగ సంపర్కాన్ని ‘లవాతత్‘ అని పేర్కొనటం జరుగుతుంది.
మేము లూతు (అలైహిస్సలామ్)ను పంపాము. అతను తన జాతివారిని ఉద్దేశించి, ”మీరు ఇంత సిగ్గుమాలిన చేష్టకు పాల్పడుతున్నారేమిటి? మీకు పూర్వం లోకంలో ఎవరూ ఇలాంటి పాడు పని చెయ్యలేదే!”అయ్యో! మీరు స్త్రీలను వదలి [96], పురుషులతో కామవాంఛ తీర్చుకుంటున్నారా?! [97] అసలు మీరు మరీ బరితెగించి వ్యవహరిస్తున్నారు” [98] అని అన్నారు. దానికి అతని జాతి వారు ఇచ్చిన జవాబు ఇదే: ”వీళ్లను మీ బస్తీ నుంచి వెళ్లగొట్టండి. మహా పవిత్రులట వీళ్ళు. [99]” (Quran – 7 : 80-82)
[96] అంటే మీరు స్త్రీలను వదిలి లైంగిక కోర్కేల్ని తీర్చుకోవటానికి ప్రకృతి ధర్మానికి విరుద్దంగా సిగ్గులేకుండా మగవాళ్ళు దగ్గరికి పోతారా?! మీరు ఒడిగడుతున్న ఈ చేష్ట అత్యంత హేయమైనది, విరుద్దమైనది. జంతువుల్లో సయితం లేని ఈ పాడు బుద్ది మీకెలా పుట్టిందీ?
[97] మగవారి లైంగిక వాంఛల పరిపూర్తికై, వారి తృప్తికై, సౌఖ్యానికై దేవుడు ఆడవారిని పట్టించాడు. కాని ఈ దుర్మార్గుల స్వభావమే చెడిపోయింది. మీరు స్త్రీలను వదిలి పురుషుల మల విసర్జనా మార్గాన్ని వాడుకోసాగారు.
[98] ప్రకృతి విరుద్ధమైన ఈ పని బరితెగించిన చేష్టగా, దైవాదేశాల అతిక్రమణగా పేర్కొనబడింది. అయితే నాగరికతా ధ్వజవాహకులమని చెప్పుకునే పాశ్చత్య దేశాల వారు నేడు ఈ సిగ్గుమాలిన పనిని చట్టబద్దంగా చేసుకుంటున్నారు. పైగా ఈ లతుకోరు పనిని ‘ప్రాధమిక హక్కు’ (fundamental right) గా ఖరారు చేసుకుంటున్నారు. అంటే పాశ్చాత్య దేశాల వారి దృష్టిలో ఇప్పుడది నేరమూ కాదు. చెడు పని కూడా కాదు. ఎందుకంటే వారి నాగరికత బాగా ‘ముదిరి’పోయింది.
[99] నీతిబాహ్యత, దుర్మార్గం, సామాజిక రుగ్మతలు వ్రేళ్లూనుకుపోయిన సమాజంలో సజ్జనుల హితబోధలు ఒక్కోసారి వింతగా తోస్తాయి. దైవప్రవక్త హజ్రత్ లూత్ అలైహిస్సలాం మరియు ఆయన వెంటనున్న కొద్దిమంది సౌశీల్యవంతులు ఆ దుర్మార్గుల కంటికి వింత మనుషుల్లా కనిపించారు. తమ సొసైటిలో ఈ పవిత్రులకు చోటు లేదు అని తెగేసి చెప్పే దుస్సాహసానికి పాల్పడ్డారు. కామంతో కళ్ళు మూసుకుపోయిన వానికి సిగ్గూ ఉండదు, భయమూ ఉండదు అన్న దానికి ఇదొక నిదర్శనం.మంచి వైపుకు, సౌశీల్యం పారిశుద్ద్యాల వైపుకు ఆహ్వానించే వారు వారి దృష్టికి అధములుగా కనిపిస్తారు. మంచివారినే వారు చులకన చేస్తారు.
మేము పంపిన దూతలు లూత్ వద్దకు చేరుకున్నప్పుడు వారి రాకపై అతను దుఃఖవదనుడయ్యాడు. లోలోపలే కుంచించుకు పోతూ, ”ఇది చాలా గడ్డురోజు” [125] అని అన్నాడు. (మరో వైపునుంచి) అతని జాతి వారు పరుగులు తీస్తూ అతని వద్దకు వచ్చారు. వారు మొదటినుంచే ఇటువంటి నీచపు పనులు చేస్తుండేవారు.[126] ”నా జాతి ప్రజలారా! ఇదిగో, నా కూతుళ్ళు [127] ఉన్నారు. మీ కొరకు వీరు పరిశుద్ధులు. మీరు అల్లాహ్‌కు భయపడండి. నా అతిథుల విషయంలో నన్ను నవ్వులపాలు చెయ్యకండి. ఏమిటీ, మీలో ఒక్కడైనా మంచివాడు లేడా?’‘ [128] అని లూతు నచ్చజెప్పాడు. ”నీ కూతుళ్ళపై మాకెలాంటి హక్కు లేదన్న సంగతి నీకు బాగా తెలుసు. మాకిష్టమైనది ఏదో కూడా నీకు తెలుసు కదా!” [129] అని వారు సమాధానమిచ్చారు.”(అయ్యో!)మిమ్మల్ని ప్రతిఘటించే బలం నాకుంటే ఎంత బావుండేది! లేదా నేను ఆశ్రయం పొందటానికి ఏదైనా దృఢమైన ఆధారం ఉంటే ఎంత బావుండేది!” [130] అని లూత్ అన్నాడు. అప్పుడు దైవదూతలు “ఓ లూత్! మేము నీ ప్రభువు తరఫున పంపబడిన వారము. వారు నీ దాకా రాలేరు. కాబట్టి నువ్వు నీ ఇంటివారిని తీసుకుని కొంత రాత్రి ఉండగానే బయలుదేరు. మీలో ఎవరూ వెనుతిరిగి చూడకూడదు. అయితే నీ భార్య; వారందరికీ పట్టే గతే ఆవిడకూ పట్టనున్నది. వారికోసం ఉదయ సమయం నిశ్చయించబడింది. ఏమిటీ, ఉదయ సమయం దగ్గరలో లేదా?” [131] అని పలికారు. మరి మా ఉత్తర్వు(ను అమలుపరచే సమయం) రాగానే ఆ బస్తీని తల క్రిందు లుగా చేసేసి, వారిపై నిరాఘాటంగా గులకరాళ్ళను కురిపించాము. అవి నీ ప్రభువు తరపున గుర్తు వేయ బడినవి. అవి ఈ దుర్మార్గులకు ఎంతో దూరాన లేవు.[132](సూరా హూద్ 11 :77 – 83)
[125] హజ్రత్ లూత్ (అలైహిస్సలాం) అంతగా మనస్తాపం చెందడానికి కారణం ఏమిటంటే దైవదూతలు మీసాలు కూడా మొలవని నవయువకుల రూపంలో వచ్చారు. తన జాతి పురుషుల సిగ్గుమాలిన చేష్టల గురించి ఆయనకు తెలుసు కాబట్టి పొంచివున్న ప్రమాదాన్ని పసిగట్టి ఆయన వ్యాకులతకు లోనయ్యారు. వచ్చిన ఆ అందమైన నవయువకులు అతిథులు కానేకారనీ, వారు దైవశాసనాన్ని అమలు పరచడానికి వచ్చిన దైవదూతలని ఆయనకు తెలీదు.
[126] లూత్ ఇంటికి అందమైన కొందరు యువకులు వచ్చి ఉన్నారని తెలియగానే ఆ స్వలింగ సంపర్క రోగగ్రస్తులు ఉండబట్టలేక పరుగెత్తుకుని వచ్చారు. ఆ యువకులను తమ తమ ఇళ్లకు తీసుకుపోయి వాళ్ళను ఆ పాడుపని కోసం ఉపయోగించు కోవాలనుకున్నారు.
[127] అంటే – లైంగిక కోర్కెల్ని తీర్చుకోవాలన్నదే మీ ఉద్దేశ్యమైతే అందుకోసం ‘నా కూతుళ్లు ఉన్నారు. వారిని వివాహమాడండి. మీ కోర్కెల్ని ధర్మబద్ధంగానూ, సహజపద్ధతిలోనూ తీర్చుకోండి. ఇదే మీ కొరకు అన్ని విధాలా శ్రేయస్కరం అని లూత్ చెప్పదలిచారు. ఇక్కడ ‘కూతుళ్లు’ అంటే ఎవరు? తన జాతికి చెందిన మహిళలను ఆయన కూతుళ్లుగా చెప్పుకున్నారని చాలామంది వ్యాఖ్యాతలు అభిప్రాయపడ్డారు. ఎందుకంటే దైవప్రవక్త తన జాతివారి కొరకు పితామహుడు వంటివాడు. అలా చెప్పటంలోని ఆయన ఆంతర్యం ఏమిటంటే సమాజంలో ఇంతమంది ఆడపిల్లలు ఉండగా మీకేం పోయే రోగం వచ్చింది? మీరు ఆ అమ్మాయిలను పెళ్లి చేసుకుని మీ సహజ కోరికల్ని తీర్చుకోవచ్చుకదా! (ఇబ్నె కసీర్).
[128] ఏమిటీ? నా ఇంటికి వచ్చిన అతిథులతో దుర్వవహారం చేసి నన్ను అవమానాలపాలు చేస్తారా? మీలో ఆ మాత్రం అర్ధం చేసుకునే వారు లేరా? అతిథి మర్యాదకు కళంకం తెస్తారా? మీ దుష్ట బుద్ధిని అడ్డుకునే సజ్జనుడు మీలో ఒక్కడూ లేడా? దైవప్రవక్త లూత్ ఇంతగా కలత చెందడానికి కారణం అప్పటివరకూ ఆయన ఆ అతిథులను మానవ మాత్రులుగా తలపోయటమే. ఆ వచ్చిన వారు మనుషులు కారనీ, దుర్మార్గుల భరతం పట్టడానికి దివి నుంచి భువికి దిగివచ్చిన దైవదూతలని ఆయనకు తెలీదు. వారు దైవదూతలన్న సంగతి ఆయనకు ముందు నుంచే తెలిసి ఉంటే కలవరం చెందేవారు కారు. దైవప్రవక్తలకు రహస్య విషయాల జ్ఞానం ఉండదని చెప్పడానికి ఇది కూడా ఒక ప్రబల తార్మాణమే.
[129] అంటే ఆ దుర్మార్గులు సహజమైన, ధర్మసమ్మతమైన ఒక వద్ధతిని ్రోసివుచ్చి అసహజమైన, అహేతుకమైన, అధర్మమైన చేష్టను అవలంబించారు. పరమ జుగుప్సాకరమైన ఈ పనిలో లూత్ జాతివారు ఎంత ముందుకు వెళ్ళిపోయారో, వారి కళ్లు ఎలా మూసుకుపోయాయో దీన్నిబట్టి బోధపడుతోంది.
[130] “బలం” అంటే బాహుబలం, ఒనరులు, సంతానబలం అని భావం. “దృథఢమైన ఆధారం” అంటే తనను సమర్థించే తెగగానీ, వంశంగానీ ఉంటే వారిని ఆశ్రయించే వాడినే! అన్నది ఆయన ఆవేదన. ఎంతటి నిస్సహాయస్థితిలో ఆయన ఈ మాటలన్నారో అర్థమవుతోంది. నన్ను ఆదుకునేవారు, నా తరఫున మాట్లాడేవారు ఈ రోజు ఉండి ఉంటే అతిథుల విషయంలో నేను అవమానం పాలు కాకుండా ఉండేవాడినే! అని ఆందోళన చెందారు. దైవప్రవక్త హజత్ లూత్ (అలైహిస్సలాం) గారి ఈ ఆకాంక్ష దైవంపై భారం మోపే విషయానికి విరుద్ధం కాజాలదు. ప్రాపంచికంగా మనిషి తన రక్షణ కోసం తీసుకోవలసిన జాగ్రత్తలన్నీ తీసుకుని ఆ పైన దైవంపై భారం వేయాలి. ఇదే సరైనది. అంతేగాని చేతులు ముడుచుకు కూర్చుని, అన్నింటికీ దేవుడే ఉన్నాడు అంటే అసలుకే నష్టం వాటిల్లుతుంది. కాబట్టి హజ్రత్ లూత్ (అలైహిస్సలాం) పలుకుల్లో విపరీతమైన అంశం ఏమీ లేదు. ఈ సంఘటన ద్వారా విదితమయ్యే మరో ముఖ్య విషయం ఏమిటంటే దైవప్రవక్తలకు అగోచర జ్ఞానం ఉండదు. అలాగే వారు సర్వాధికారాలు కలిగి ఉండరు. దైవప్రవక్తలకు సర్వాధికారాలు ఉండి ఉంటే ఈ సందర్భంగా హజ్రత్ లూత్ అత్యంత దీనంగా ఇలా చెప్పుకుని ఉండేవారు కారు. ఈ రోజుల్లో కొందరు దైవప్రవక్త (స)కు సర్వాధికారాలుండేవని నమ్ముతున్నారు. ఈ నమ్మకం సరైనది కాదు. పై ఆయతు వారి ఈ నమ్మకాన్ని ఖండిస్తున్నది.
[131] ఒకవైపు లూత్ గారి దీనావస్థను, మరోవైపు ఆ జాతిజనుల విశ్చంఖలత్వాన్ని గమ నించిన దైవదూతలు జోక్యం చేసుకోవలసిన తరుణం వచ్చేసింది. “ఓ లూత్! మీరు ఆందోళన చెందనవసరం లేదు. వాళ్లు మా దాకా కాదుకదా, కనీసం మీ దాకా కూడా రాలేరు. రాత్రి పొద్దుపోయాక మీ మనుషులను వెంటబెట్టుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. తెల్లవారగానే ఈ పట్టణవాసులు నాశనం చేయబడతారు” అని వారు ధైర్యం చెప్పారు.
[132]“అవి” అంటే ఏవి? ఆయా ఊళ్లను ధ్వంసం చేయటానికి వాటిపై విసరబడిన “రాళ్ళు’ అని కొంతమంది వ్యాఖ్యాతలు అభిప్రాయపడగా, ఈ ఆయతులో “అవి” అనే సర్వనామం నాశనమైన ఆ ‘ఊళ్ళ’నే సూచిస్తున్నదని మరికొంతమంది అభిప్రాయ పడ్డారు. ఆ ఊళ్లు సిరియా-మదీనాల మధ్య ఉండేవి. “దుర్మార్గులు” అంటే మక్కాకు చెందిన సత్యతిరస్కారులు. వెనుకటి జాతులకు పట్టిన దుర్గతే మీకూ పడుతుంది జాగ్రత్త! అని హెచ్చరించటం ఈ వాక్యాల ప్రధాన ఉద్దేశం.
ప్రవక్త లూత్ అలైహిస్సలాం జాతివారు స్వలింగ సంపర్కంమనే అత్యంత నీచమైన చేష్టకు పాల్పడటంతో వారిపై దేవుడి శిక్షలు దాపురించాయి!.
మరి మా దూతలు లూత్ (అలైహిస్సలాం) వద్దకు చేరుకున్నప్పుడు, అతను వారిని చూసి ఆందోళన చెందాడు. లోలోపలే కుమిలిపోయాడు [49]. అప్పుడు వారిలా అన్నారు: “నువ్వు భయపడకు. కలత చెందకు. మేము నీ భార్యను తప్ప [50] – నిన్నూ, నీ పరివారాన్నీ కాపాడుతాము. ఎందుకంటే ఆమె (శిక్షను అనుభవించటానికి) వెనుక ఉండిపోయే వారితో చేరుతుంది.” “మేము ఈ పట్టణవాసులపై, వారి తిరుగుబాటు ధోరణి కారణంగా ఆకాశం నుంచి శిక్షను అవతరింపజేయనున్నాము.[51] (ఆ విధంగా) మేము ఆ పట్టణాన్ని బుద్ధి జీవుల కోసం స్పష్టమైన గుణపాఠ సూచనగా [53] చేసాము” (సూరా అంకబూత్ 29 : 33 – 35)
[50] హజ్రత్ లూత్ అలైహిస్సలాం పరిస్దితిని అర్ధం చేసుకున్న దైవదూతలు భీతి చెందరాదని, దుఃఖించరాదని ఆయన్ని ఓదార్చారు. తాము దుష్టులను శిక్షించటానికి పంపబడిన దైవదూతలం అని తెలిపారు. అయితే దగాకోరుగా వ్యవహరించిన ఆయన భార్యకు సయితం శిక్షపడటం ఖాయమని ఆ సందర్భంగా దైవదూతలు స్పష్టం చేశారు.
[51] ఆకాశం నుంచి అవతరించిన ఆ శిక్ష ఎటువంటిదంటే దైవదూత జిబ్రయీల్ అలైహిస్సలాం వారి నివాస స్ధలాలను భూమినుంచి పెళ్ళగించి, ఆకాశం దాకా ఎత్తుకెళ్ళి అమాంతం క్రింద పడేశారు. ఆ తరువాత వారిపై కంకర రాళ్ళ వర్షం కురిపించబడింది. ఆ స్ధలాన్ని దుర్వాసన వచ్చే జలసంధి (మృత సముద్రం)గా మార్చివేయటం జరిగింది. (ఇబ్నె కసీర్)
[53] ఒకవైపు నుంచి రాళ్ళ వర్షం, మరో వైపు నుంచి ఇళ్ళు తలక్రిందులవటం, ఆ తరువాత ఆ ప్రదేశం అంతా దుర్వాసనతో కంపుకొట్టడం ఇదంతా ఒక గుణపాఠ సూచనే. ఆ ప్రదేశం మృత సముద్రంగా వ్యవహరించబడుతోంది. కాని విజ్ఞులు మాత్రమే ఇలాంటి ఘటనల నుండి గుణపాఠం గ్రహిస్తారు.
సూర్యోదయం అవుతున్న సమయంలో ఒక భయంకరమైన ప్రేలుడు వారిని ముట్టడించింది [46].చివరికి మేము ఆ నగరాన్ని తలక్రిందులుగా చేసివేశాము [47]. వారిపై కంకర రాళ్ల వర్షం కురిపించాము [48]. నిస్సందేహంగా యోచన చేసేవారి కొరకు [49] ఇందులో ఎన్నో సూచనలున్నాయి. ఈ పట్టణం (జనులు) వచ్చిపోయే రహదారిపైనే ఉంది [50](సూరా అల్ హిజ్ర్ – 15 :73 – 75)
[46] సూర్యుని లేలేత కిరణాలు పడుతున్న సమయంలో ఒకే ఒక్క శబ్దం వచ్చింది. అత్యంత భయంకరమైన ఈ కేక హజ్రత్ జిబ్రీల్ (అలైహిస్సలాం)దని కొంతమంది అభిప్రాయపడ్డారు.
[47] వారి నివాస స్థలాలు భూమి నుంచి ఆకాశానికి ఎత్తి, వాటిని తలక్రిందులుగా చేసి విసిరివేయటం జరిగిందని అనబడుతోంది. ఆ విధంగా వారు తమ ఇల్లూ వాకిలి సమేతంగా తలక్రిందులుగా చేసివేయబడ్డారు. అయితే కేవలం పై కప్పులతో సహా ఇళ్లు కూలిపోవటం మాత్రమే దీని భావమని మరికొందరంటారు.
[48] ఆ తర్వాత వారిపై ఒక ప్రత్యేక రకమైన కంకర రాళ్లు కూడా కురిపించబడ్డాయి. ఈ విధంగా వారు మూడు రకాల శిక్షలకు గురిచేయబడ్డారు. భావితరాల కొరకు ఇదొక గుణపాఠం అయ్యేలా చేయబడింది.
[49] ఆయతులో ‘ముతవస్సిమీన్” అని వుంది. నిశిత దృష్టితో విషయాన్ని పరికించే వారిని, యోచన చేసేవారిని ‘ముతవస్సిమీన్’ అంటారు. అలాంటి వారి కోసం ఇందులో గుణపాఠం ఉంది.
[50] అంటే ప్రధాన రహదారి అని భావం. మదీనా నుంచి సిరియాకు వెళ్ళే మార్గంలో శిథిలావస్థలో ఉన్న లూత్ (అలైహిస్సలాం) జాతి ప్రజల పట్టణాలు కానవస్తాయి. అటువైపు వచ్చేపోయే వారంతా ఆ దారి గుండా సాగవలసిందే. అవి మొత్తం అయిదు పేటలు. 1. సద్దూమ్ (ముఖ్యపట్టణం) 2. సాబ 3. సావహ్ 4. అస్‌ర 5. దూమా. వీటిని నాశనం చేసిన తీరు గురించి ఒక కథనం ఈ విధంగా ఉంది : హజత్ జిబ్రీల్ (అలైహిస్సలాం) తన రెక్కలపై ఈ పేటలను ఎత్తుకుని నింగికేసి సాగిపోయారు. ఆకాశాన ఉన్నవారు కూడా వారి కుక్కలు మొరగటాన్ని, కోళ్లు కూతవేయటాన్ని విన్నారు. ఆ తరువాత వారిని నేలకేసి గిరాటు కొట్టారని అనబడుతోంది (ఇబ్నె కసీర్). అయితే ఈ కథనానికి ప్రామాణికమైన అధారాలు లేవు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్) ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
వుజూ
వుజూ లేని నమాజు స్వీకరించబడదు. అబూ హురైరా (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు:
“మీలో ఎవనికైనా అపానవాయువు జరిగితే, వుజూ భంగమయితే అతను వుజూ చేసుకోనంత వరకు అల్లాహ్ అతని నమాజును స్వీకరించడు”. (బుఖారి 6954, ముస్లిం 225).
అందుకే ముస్లిం వ్యక్తి నమాజుకు ముందు వుజూ చేయడం తప్పనిసరి. వుజూ ఘనతలు చాలా ఉన్నాయి, మనిషి వాటిని తెలుసుకోవడం చాలా అవసరం. ఈ రెండుహదీసులు శ్రద్ధగా వినండి:
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా శుభవార్త ఇచ్చారని, ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు:
“ఎవరు వుజూ చేసినప్పుడు పూర్తి శ్రద్ధతో మంచి విధంగా చేస్తారో అతని శరీరం నుండి అతని పాపాలన్నీ రాలిపోతాయి. చివరికి గోళ్ళ నుండి కూడా రాలిపోతాయి”. (ముస్లిం 245).
“అల్లాహ్ ఆదేశించిన విధంగా సంపూర్ణంగా వుజూ చేసేవారు, వారి ఫర్డ్ నమాజులు వాటి మధ్య జరిగే పాపాల ప్రక్షాళనకు కారణభూతమవుతాయి”.(ముస్లిం 231).
వుజూ విధానం:
1- వుజూ నియ్యత్ (సంకల్పం) నోటితో పలుకకుండా మనుసులోనే చేయాలి. ఒక పని చేయుటకు మనుసులో నిర్ణయించుకోవడమే ‘నియ్యత్’. మళ్ళీ బిస్మిల్లాహ్ అనాలి.
2- రెండు అరచేతులను మణికట్ల వరకు మూడు సార్లు కడగాలి.
3- మూడు సార్లు నోట్లో నీళ్ళు తీసుకొని పుక్కిలించి, ముక్కులో నీళ్ళు ఎక్కించి శుభ్రం చేయాలి.
4- మూడు సార్లు ముఖము కడగాలి. అడ్డంలో కుడి చెవి నుండి ఎడమ చెవి వరకు, నిలువులో నొసటి పై భాగం నుండి గదువ క్రింది వరకు.
5- రెండు చేతులు మూడేసి సార్లు కడగాలి. వ్రేలు మొదటి భాగము నుండి మోచేతుల వరకు. ముందు కుడి చెయ్యి, తరువాత ఎడమ చెయ్యి.
6- ఒక సారి తల ‘మసహ్’ చేయాలి. అంటే రెండు చేతులను తడి చేసి తల మొదటి (నుదుటి) భాగము నుండి వెనక మెడ వరకు తీసుకెళ్ళి మళ్ళీ వెనక నుండి మొదటి (నుదుటి) వరకు తలను స్పర్శిస్తూ తీసుకురావాలి.
7- ఒక సారి రెండు చెవుల ‘మసహ్’ చేయాలి. అంటే రెండు చూపుడు వ్రేళ్ళతో చెవి లోపలి భాగాన్ని, బొటన వ్రేళ్ళతో పై భాగాన్ని స్పర్శించాలి.
8- రెండు కాళ్ళను వ్రేళ్ళ నుండి చీలమండల వరకు మూడేసి సార్లు కడగాలి. ముందు కుడి కాలు తరువాత ఎడమ కాలు. అవయవాలు ఒకసారి లేదా రెండు సార్లు కడిగినా పరవాలేదు, కాని ఆ అవయవం సంపూర్ణంగా కడగబడడం తప్పనిసరి.
9- తర్వాత ఈ మస్నూన్ దుఆ చదవాలి: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని, ఉమర్ బిన్ ఖత్తాబ్ (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు:
“మీలో ఎవరైనా సంపూర్ణంగా వుజూ చేసుకొని
‘అష్ హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వ అన్న ముహమ్మదన్ అబ్దుహూ వరసూలుహ్’
(నేను సాక్ష్యమిస్తున్నాను; అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్యుడెవ్వడూ లేడని, మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క దాసుడు మరియు ప్రవక్త).
చదువుతారో అతని కొరకు స్వర్గపు ఎనిమిది ద్వారాలు తెరువబడతాయి, ఎందులో నుండి ప్రవేశించగోరినా అతని ఇష్టం’. (ముస్లిం 234).
వుజూలో ఒక అవయవం తరాఇత మరో అవయవం క్రమ ప్రకారంగా మరియు వెంటవెంటనే కడుగుట తప్పనిసరి(*)
(*) క్రమ ప్రకారంగా అంటే: 1 నుండి 8 వరకు ఉన్న క్రమం ప్రకారం వీటిలో వెనకా ముందు చేయకూడదు. వెంటవెంటనే అంటే: పై క్రమం ప్రకారం, ఒక అవయవం కడిగాక, దాని తడి ఆరక ముందే వెంటనే దాని వెనక అవయవం కడగాలి. మరీ ఆలస్యం చేయవద్దు.
వుజూను భంగపరిచే విషయాలు:
1- మలమూత్రపు మార్గాల నుండి ఏదీ వెలువడినా సరే అందు వలన వుజూ భంగమవుతుంది: మలము, మూత్రము, అపానవాయువు (పిత్తు), ‘మజీ’, ‘వదీ’ రక్తము మరియు ‘మనీ’. ‘మనీ’ వలన స్నానం చేయడం కూడా విధి అవుతుంది.
2- నిద్ర.
౩- ఒంటె మాంసం తినడం.
4- స్పృహ తప్పటం మరియు బుద్ధి క్షీణించడం.
మేజోళ్ళ పై ‘మసహ్’
ఇస్లాం ధర్మం యొక్క సులువైన ఉత్తమ విషయం ఒకటి: మేజోళ్ళపై ‘మసహ్’ చేసే అనుమతివ్వడం. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కూడా ‘మసహ్’ చేసేవారని రుజువైనది. అమ్ర్ బిన్ ఉమయ్య (రజియల్లాహు అన్హు) చెప్పారు:
“ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తమ తలపాగ మరియు మేజోళ్ళపైన ‘మసహ్’ చేస్తున్నది నేను చూశాను.” (బుఖారి 205).
వాటి పై ‘మసహ్’ చేయుటకు ఒక నిబంధన ఏమిటంటే అవి వుజూ చేసిన తర్వాత తొడిగి యుండాలి.
తడి చేసిన చెయ్యితో పాదాల పై భాగాన ‘మసహ్’ చేయాలి, క్రింది భాగాన కాదు.
ఇక ‘మసహ్’ గడువు విషయానికి వస్తే; స్థానికులు ఒక పగలు ఒక రాత్రి. ఏ ప్రయాణంలో నమాజ్ ఖస్ర్ చేయవచ్చునో ఆ ప్రయాణంలో ఉన్నవారు మూడు రేయింబవళ్ళు మేజోళ్ళపై ‘మసహ్’ చేయవచ్చును. (వుజూ చేసి తొడిగన తరువాత మొదట సారి మసహ్ చేసిన క్షణం నుంచీ గడువు మొదలవుతుంది).
‘మసహ్’ భంగమయే కారణాలు:
గడువు ముగిసిన మరుక్షణం నుంచే ‘మసహ్’ భంగమైపోతుంది.
‘మసహ్’ చేసిన తరువాత కనీసం ఒకసారైనా తీసినట్లయితే ‘మసహ్’ భంగమవుతుంది.
లేదా మనిషి (స్వప్నస్థలనం లేదా భార్యభర్తల సంభోగం కారణంగా) అశుద్ధతకు లోనైతే ‘మసహ్’ భంగమవుతుంది.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్) Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.
షిర్క్ (బహుదైవారాధన), దాని రకాలు:
షిర్క్ అంటే: ఆరాధనలో అల్లాహ్ తో పాటు ఇతరులను సాటి కల్పుట. ఉదాహరణకు విగ్రహాన్ని, మృతులను, సూర్యచంద్రులను, ప్రవక్తలను, వలీలను, సమాధి తదితరాలను పూజించుట. లేదా అల్లాహ్ యేతరులతో మొరపెట్టుకొనుట, వారికి మ్రొక్కుబడులు చెల్లించుట లేదా వారి కొరకు నమాజు, ఉపవాసాలు పాటించుట, వారి కొరకు బలిదానమిచ్చుట. ఇవన్నీ అల్లాహ్ తో పాటు షిర్క్ లో వస్తాయి.
అలాగే విగ్రహానికి, సూర్యచంద్రులకు, సమాధివారికి ఇంకా ఇలాంటి వాటికి సజ్దా చేయుట (సాష్టాంగపడుట). ఇది కూడా షిర్క్, ఇది ఇస్లాం నుండి బహిష్కరిస్తుంది. అల్లాహ్ కాపాడుగాక!
అలాగే సృష్టించటంలో అల్లాహ్ తో పాటు ఎవరైనా భాగస్వామి గలడని, లేదా అల్లాహ్ మాత్రమే శక్తిగలవాటి శక్తి అతనిలో ఉందని నమ్మడం కూడా షిర్క్ అవుతుంది.
షిర్క్ రెండు రకాలు: చిన్న షిర్క్, పెద్ద షిర్క్.
మొదటిది: పెద్ద షిర్క్: ఆరాధన యొక్క ఏ ఒక్క రకమైనా అల్లాహ్ యేతరుల కొరకు చేయుట. ఇలాంటి షిర్క్ చేసిన వ్యక్తి తౌబా చేయకుండా (పశ్చత్తాప పడి, క్షమాభిక్ష కోరకుండా) చనిపోతే శాశ్వతంగా నరకంలో ఉంటాడు. ఇంకా ఇది సర్వ సత్కార్యాలను భస్మం చేసేస్తుంది.
పద్దెనిమిది ప్రవక్తల ప్రస్తావన తర్వాత సూర అన్ఆమ్ ఆయతు 88లో అల్లాహ్ ఇలా హెచ్చరించాడు:
{అల్లాహ్ క్షమించనిది కేవలం షిర్క్ మాత్రమే. అది తప్ప ఏ పాపాన్ని అయినా ఆయన తాను ఇష్టపడిన వారి కొరకు క్షమిస్తాడు. ఇతరులను అల్లాహ్ కు భాగస్వాములుగా చేసేవాడు, ఎంతో తీవ్రమైన పాపపు మాట అన్నాడన్నమాట}. (సూరె నిసా 4: 48).
పెద్ద షిర్క్ లోని కొన్ని రకాలు: అల్లాహ్ యేతరులతో దుఆ, అల్లాహ్ యేతరుల కొరకు మొక్కుబడి, జిబహ్ వగైరాలు చేయుట. అల్లాహ్ తో ఇతరుల్ని సాటి కలిపి అల్లాహ్ పట్ల ఉండవలసిన ప్రేమ వారి పట్ల ఉంచుట.
{కొందరు అల్లాహ్ ను కాదని ఇతరులను ఆయనకు సమానులుగా, ప్రత్యర్థులుగా భావిస్తారు. వారు అల్లాహ్ పట్ల కలిగి ఉండవలసిన ప్రేమతో వారిని ప్రేమిస్తారు}. (సూరె బఖర 2: 165).
రెండవది: చిన్న షిర్క్:ఖుర్ఆను, హదీసుల్లో ఏ పనుల కొరకు షిర్క్ అనే పదం వచ్చిందో కాని అవి పెద్ద షిర్క్ వరకు చేరవో వాటిని చిన్న షిర్క్ అంటారు. ఈ రకం ధర్మభ్రష్టతకు కారణం కాదు. కాని దీని వల్ల తౌహీదు లో మాత్రం కళంకం, కొరత ఏర్పడుతుంది. ఉదా: ప్రదర్శనాబుద్ధితో ఏదైనా సత్కార్యం చేయుట. లేదా షిర్క్ అక్బర్ కు చేర్పించే ఏదైనా కార్యం. ఉదా: ఏదైనా సమాధి వద్ద అల్లాహ్ కొరకు నమాజు చేయుట. అల్లాహ్ యేతరులు లాభనష్టానికి అధికారులు కారు అన్న విశ్వాసంతో వారి మీద ప్రమాణం చేయుట. ఇంకా అల్లాహ్ మరియు ఫలాన వ్యక్తి తలచినట్లు అని అనడం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారుః
“మీ పట్ల నాకు అధికంగా భయం కలిగించేదేమిటంటే మీరు చిన్న షిర్క్ కు పాల్పడతారని”. చిన్న షిర్క్ అంటేమిటి? ప్రవక్తా అని అడిగారు అక్కడున్నవారు. అప్పుడు ప్రవక్త చెప్పారు: “ప్రదర్శనాబుధ్ధి” అని.(ముస్నద్ అహ్మ్దద్ 23630. దీని సనద్ జయ్యిద్).
«مَنْ حَلَفَ بِغَيْرِ اللَّهِ فَقَدْ أَشْرَكَ»
“ఎవరు అల్లాహ్ తప్ప ఇతరుల ప్రమాణం చేశాడో అతడు షిర్క్ చేసినట్లే“. (అబూ దావూద్ 3251. సహీ హదీస్).
తాయత్తులు వేసుకొనుట: రోగాలు, ఆపదలు రాకుండా లేదా వచ్చినా తొలిగిపోవుటకు కడాలు, రింగులు సాధనం అని వేసుకొనుట లాంటి పనులు చిన్న షిర్క్ కు సంబంధించినవే. ఇక అవి సాధనమే కాదు, లాభనష్టాలు వాటిలో ఉన్నాయి, అంటే: అవి వేసుకున్నప్పుడు లాభం ఉంటుంది వేసుకోకుంటే నష్టం ఉంటుంది అని విశ్వసిస్తే అది పెద్ద షిర్కులో వస్తుంది. (అందుకు చాలా జాగ్రత్తగా ఉండాలి).
అలాగే జ్యోతిషుల వద్దకు వచ్చి ఏమైనా అడగడం కూడా షిర్క్ లో వస్తుంది, ఎలా అనగా అతడు మానవుల్లో కొందరు అగోచర జ్ఞానం గలవారని నమ్మినందుకు. ఇది అబద్ధం, భూటకం. అల్లాహ్ ఈ ఆదేశానుసారం:
“అల్లాహ్‌కు తప్ప ఆకాశాలలోనూ, భూమిలోనూ ఉన్న వారెవరికీ అగోచర జ్ఞానం లేదు. తాము ఎప్పుడు తిరిగి లేపబడతారో కూడా వారికి తెలియదు” అని ఓ ప్రవక్తా వారికి చెప్పు. (నమ్ల్ 27:65).
అందుకే ప్రతి ముస్లం తప్పనిసరిగా తెలుసకోవాల్సిన విషయం ఏమిటంటే: స్వచ్ఛమైన తౌహీద్ (ఏకేశ్వరోపాసన) కొరకే అల్లాహ్ మనల్ని పుట్టించాడు, స్వర్గనరకాలను సృష్టించాడు, ప్రవక్తల్ని పంపాడు, గ్రంథాలను అవతరింపజేశాడు. కర్మలన్నీ అల్లాహ్ కొరకే ప్రత్యేకించి చిత్తశుద్ధితో చేసినప్పుడే స్వీకరించబడతాయి, లేదా అంటే అవి రద్దు చేయబడతాయి.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్) Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.
విశ్వాసం, దాని మూల స్తంభాలు :
వాచాకర్మను విశ్వాసం అంటారు. అది సత్కార్యాలతో పెరుగుతుంది, పాపాలతో తరుగుతుంది. హృదయం మరియు నాలుక మాటను ఇంకా హృదయం, నాలుక మరియు అవయవాల పనిని విశ్వాసం అంటారు. హృదయ మాట అంటే: హృదయపూర్వకంగా విశ్వసించుట, సత్యపరచుట. నాలుక మాట అంటే: అంగీకరించుట. హృదయ పని అంటే: సమ్మతించుట, ఇఖ్లాస్, లొంగిపోవుట, ప్రేమ, సత్కార్యాల సంకల్పం. అవయవాల పని అంటే: ఇస్తాం ఇచ్చిన ఆదేశాలను నెరవేర్చుట మరియు నిశిద్ధతలను విడనాడుట.
విశ్వాసానికి కొన్ని మూలసూత్రాలున్నాయని ఖుర్‌ఆన్ మరియు సున్నతుల ద్వారా రుజువైనది. అవి: (1) అల్లాహ్‌ను, (2) ఆయన దూతలను, (3) ఆయన పంపిన గ్రంథాలను, (4) ఆయన ప్రవక్తలను, (5) ప్రళయదినాన్ని, (6) మంచి, చెడు తఖ్దీర్ (అదృష్టాాల)ను విశ్వసించడం. అందులో కొన్ని ఈ ఆయతులో ప్రస్తావించబడినవి:
(ప్రవక్తతన ప్రభువు నుండి తనపై అవతరించి ప్రబోధాన్ని విశ్వసించాడు. ప్రవక్తను విశ్వసించినవారు కూడా దాన్ని మనసారా స్వీకరించారు. వీరంతా అల్లాహ్ ను, ఆయన దూతల్ని ఆయన గ్రంథాలను, ఆయన ప్రవక్తల్ని నమ్ముతారు; వారిలా పలుకుతారుః ‘మేము అల్లాహ్ ప్రవక్తల్లో ఏ ఒక్కరి పట్లనూ తారతమ్యాన్ని పాటించము, మేము ఆజ్ఞ విన్నాము, దానికి విధేయులమయ్యాము, స్వామీ మేము క్షమాభిక్షను అర్ధిస్తున్నాము, మరి మేము నీ వైపునకే మరలవలసినవారము). (సూ. బఖర 2: 285).
సహీ ముస్లింలో ఉంది: అమీరుల్ మోమినీన్ హజ్రత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: జిబ్రీల్ అలైహిస్సలాం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో విశ్వాసం (ఈమాన్) అంటేమిటి అని అడిగాడు. దానికి ప్రవక్త ఇలా జవాబిచ్చారు: “విశ్వాసం అంటే నీవు (1) అల్లాహ్‌ను, ఆయన (2) దూతలను, ఆయన (3) గ్రంథాలను, ఆయన (4) ప్రవక్తలను, (5) పరలోకదినాన్ని మరియు (6) మంచి చెడు అదృష్టాన్ని విశ్వసించుట”. (ముస్లిం 8).
ఈ ఆరు విషయాలే సత్యవిశ్వాసం యొక్క మూలసూత్రాలు. వీటిని తీసుకొని ఖుర్‌ఆను అవతరించింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చారు. వీటినే విశ్వాస మూల సూత్రాలు (అర్కానె ఈమాన్) అంటారు. వీటి వివరణ క్రింద చదవండి:
1- అల్లాహ్ పై విశ్వాసం:
అంటే: ఉలూహియత్, రుబూబియత్ మరియు అస్మా వ సిఫాత్ లో అల్లాహ్ అద్వితీయుడని విశ్వసించాలి. అల్లాహ్ పై విశ్వాసంలో ఈ క్రింది విషయాలు కూడా వచ్చును.
అల్లాహ్ యే వాస్తవ ఆరాధ్యుడు, సర్వ ఆరాధనలకు అర్హుడు. ఆయన గాక వేరే లేదా ఆయనతో పాటు మరొకడు ఏ మాత్రం అర్హుడు కాడు. ఎందుకనగా మానవుల సృష్టికర్త, వారికి మేలు చేయువాడు, వారికి ఆహారం నొసంగువాడు, వారి రహస్య బహిరంగ విషయాలన్నీ తెలిసినవాడు, పుణ్యాత్ములకు సత్ఫలితం మరియు పాపాత్ములను శిక్షించు శక్తిగలవాడు ఆయన మాత్రమే.
ఈ ఆరాధన యొక్క వాస్తవికత ఏమిటంటేః సర్వ ఆరాధనలు వినయ నమ్రతలతో, ఆయన ఔన్నత్యాల ముందు హీనభావంతో, పూర్తి ప్రేమతో, కంపిస్తూ, కారుణ్యాశలతో అద్వితీయుడైన అల్హాహ్‌కే ప్రత్యేకించి చేయాలి. ఈ గొప్ప మౌలిక విషయంతోనే ఖుర్‌ఆన్ అవతరించింది. అల్లాహ్ ఆదేశం సూర జుమర్ 39: 2,3లో చదవండి:
(అల్లాహ్ ను మాత్రమే వేడుకోండి. మీ ధర్మాన్ని ఆయనకై ప్రత్యేకించుకొని. మీరు చేసే ఈ పని అవిశ్వానులకు ఎంత అయిష్టంగా ఉన్నాసరే).
అరాధన యొక్క రకాలు అనేకమున్నాయి, అందులో కొన్ని ఇవి: దుఆ (ప్రార్ధన, వేడుకోలు), ఖౌఫ్ (భయం), రజా (ఆశ), తవక్కుల్ (నమ్మకం), రగ్బత్ (ఆసక్తి), రహబ్ (మహాభీతి), ఖుషూ (నమ్రత), ఖషియత్ (గౌరవభావంతో భీతి), ఇనాబత్ (మరలుట), ఇస్తిఆనత్ (సహాయం అర్థించుట), ఇస్తిఆజ (శరణు కోరుట), ఇస్తిఘాస (మొరపెట్టు కొనుట), జిబహ్ (బలిదానం), నజ్‌ర్ (మొక్కుబడి) తదితర ఆరాధన రకాలు. ఇవన్నియూ అల్లాహ్ తప్ప ఇతరుల కొరకు చేయుట యోగ్యం లేదు. అలా చేయుట షిర్క్ (బహుదైవారాధన) మరియు కుఫ్ర్ (సత్యతిరస్కారం)లో పరిగణించబడుతుంది.
2- అల్లాహ్ దూతలపై విశ్వాసం:
ఒక ముస్లిం సంక్షిప్త రూపంలో అల్లాహ్ దూతలను గురించి ఇలా విశ్వసించాలి: వారిని అల్లాహ్ పుట్టించాడు. వారి స్వభావం లోనే విధేయత వ్రాసాడు. వారిలో అనేకానేక రకాలు గలవు. ‘అర్ష్ (అల్లాహ్ సింహాసనము)ను మోసేవారు, స్వర్గనరక భటులు, మానవుల కర్మములను భద్రపరుచువారు. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరి పేర్లతో సహా ఏ వివరం తెలిపారో అలాగే వారిని విశ్వసించాలి. ఉదా: జిబ్రీల్, మీకాఈల్, నరక పాలకుడు మాలిక్, శంకు ఊదే బాధ్యత కలిగి ఉన్న ఇస్రాఫీల్. అల్లాహ్ వారిని కాంతితో పుట్టించాడు. ప్రవక్త సల్లల్హాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారని, ఆయిషా (రది అల్లాహు అన్హా) ఉల్లేఖించారు:
“అల్లాహ్ దూతలు నూర్ (కాంతి)తో వుట్టించబడ్డారు. జిన్నాతులు అగ్నిజ్వాలలతో మరియు ఆదము ముందే మీకు ప్రస్తావించ బడిన దానితో (మట్టితో) వుట్టించబడ్డారు”. (ముస్లిం 2996).
3- గ్రంథములపై విశ్వాసం:
గ్రంథములపై సంక్షిప్తంగా ఇలా విశ్వసించుట విధిగా ఉంది: ప్రవక్తలు తమ తమ జాతులకు ధర్మం బోధించుటకు, వారిని దాని వైపునకు పిలుచుటకు అల్లాహ్ వారిపై (ప్రవక్తలపై) గ్రంథాల్ని అవతరింపజేశాడు. అల్లాహ్ ఏ గ్రంథముల పేరుతో సహా తెలిపాడో వాటిని వివరంగా విశ్వసించాలి. ఉదా: ప్రవక్త మూసా అలైహిస్సలాంపై ‘తౌరాత్‘, ప్రవక్త దావూద్ అలైహిస్సలాంపై ‘జబూర్‘, ప్రవక్త యేసు మసీహ్ అలైహిస్సలాంపై ‘ఇంజీల్‘ మరియు అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్హాహు అలైహి వసల్లంపై ‘దివ్య ఖుర్‌ఆన్‘లు అవతరించాయి. అన్నిట్లో ఖుర్‌ఆన్ అతిగొప్పది మరియు చిట్టచివరిది. అది పూర్వ గ్రంథాలను రుజువు పరుచునది మరియు పరిరక్షించునది. దానిని అనుసరించుట, దాని ద్వారా మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహీ హదీసుల ద్వారా తీర్పులు చేయుట తప్పనిసరి. ఎందుకనగా అల్లాహ్, ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)ను ఇరుజాతుల వైపునకు ప్రవక్తగా పంపాడు. ఆయనపై ఈ దివ్య ఖుర్‌ఆనును అవతరింపజేశాడు, ఆయన (ప్రవక్త) దాని ద్వారా వారి మధ్య తీర్పు చేయుటకు. ఇంక దానిని హృదయ వ్యాధులకు స్వస్థతగా చేశాడు. అది ప్రతి విషయాన్ని స్పష్టంగా వివరిస్తుంది. ఇంకా అది సర్వ లోకాల కొరకు సన్మార్గం, కారుణ్యం. అల్లాహ్ ఆదేశాలు చదవండి:
(మేము ఈ గ్రంథాన్ని అవతరింపజేశాము. ఇది శుభాలుకల గ్రంథం. కావున మీరు దీనిని అనుసరించండి. భయభక్తుల వైఖరిని అవలంబించండి. మీరు కరుణింపబడటం సాధ్యం కావచ్చు). (సూరె అన్‌ఆమ్ 6: 155).
(మేము ఈ గ్రంథాన్ని నీపై అవతరింవజేశాము. అది ప్రతి విషయాన్ని స్పష్టంగా వివరిస్తుంది. విధేయులైన వారికి అది ఉపదేశం, కారుణ్యం, శుభవార్త).(సూరె నహ్ల్ 16: 89).
4- ప్రవక్తలపై విశ్వాసం:
ప్రవక్తలపై సంక్షిప్తంగా ఇలా విశ్వసించాలి: అల్లాహ్ తన దాసుల వైపునకు ప్రవక్తల్ని శుభవార్తనిచ్చువారిగా, హెచ్చరించువారిగా, ధర్మం వైపునకు పిలుచువారిగా జేసి పంపాడు.
(మేము ప్రతి జాతిలోనూ ఒక ప్రవక్తను ప్రభవింపజేశాము. అతని ద్వారా అందరికీ ఇలా హెచ్చరిక చేశాము: ‘అల్లాహ్ ను ఆరాధించండి. మిథ్యా దైవాల ఆరాధనకు దూరంగా ఉండండి’). (సూరె నహ్ల్ 16: 36).
ప్రవక్తల్ని విశ్వసించినవారే సాఫల్యం పొందువారు. వారిని తిరస్కరించినవారే నష్టం, అవమానం పాలయ్యేవారు.
ప్రవక్తలందరి పిలుపు ఒక్కటేనని మనం విశ్నసించాలి. అది అల్లాహ్ ఏకత్వం మరియు సర్వ ఆరాధనల్లో ఆయన్ని అద్వితీయునిగా నమ్మటం. అయితే వారికి నొసంగబడిన ధర్మశాస్త్రాలు, ఆదేశాలు, శాసనాలు వేరు వేరు. అల్లాహ్ కొందరికి మరి కొందరిపై ఘనత ప్రసాదించాడు. అందరిలోకెల్లా గొప్ప ఘనతగల మరియు చిట్టచివరి, అంతిమ ప్రవక్త ముహమ్మద్ స సల్లల్లాహు అలైహి వసల్లం. చదవండి అల్లాహ్ ఆదేశాలు:
((మానవులారా) ముహమ్మద్ మీలోని ఏ వురుషునికీ తండ్రి కారు. కాని ఆయన అల్లాహ్ యొక్క ప్రవక్త, దైవప్రవక్తల పరంపరను సమాప్తం చేసే చివరివారు). (అహ్ జాబ్ 33: 40).
ఇక ఏ ప్రవక్తల పేర్తతో సహా అల్లాహ్ లేక ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారో వారిని అదే వివరంగా విశ్వసించాలి. ఉదా: నూహ్, హూద్, సాలిహ్, ఇబ్రాహీం, వగైరా ప్రవక్తలు. అల్లాహ్ వారందరిపై అనేకానేక దయాకరుణా మేఘాలు కురిపించుగాకా! ఆమీన్.
5- పరలోక విశ్వాసం:
అల్లాహ్, ఆయన ప్రవక్త సల్లల్హ్లాహు అలైహి వసల్లం మరణానంతరం సంభవించే ఏ ఏ విషయాల గురించి తెలిపారో అవన్నీ ఇందులోనే వస్తాయి. ఉదా: సమాధి యాతన, పరీక్షలు, శుభాలు, ప్రళయ దినం నాటి ఘోర సంఘటనలు, వంతెన, త్రాసు, లెక్క, ప్రతి కర్మ యొక్క ఫలితం, కర్మ పత్రాలు ప్రజల ముందు తెరువబడుట, వారు దాన్ని కుడి లేక ఎడమ చేతితో లేక వీపు వెనక నుంచి తీసుకొనుట, ఇంకా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు లభించే హౌజె కౌసర్, స్వర్గం, నరకం, విశ్వాసులకు అల్లాహ్ దర్శనం, సంభాషణ. ఇంకా ఖుర్‌ఆను మరియు సహీ హదీసుల్లో వచ్చిన విషయాలన్నిటినీ విశ్వసించాలి. అవి అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త తెలిపిన ప్రకారమే సంభవించునని నమ్మాలి.
6- మంచి, చెడు ‘ తఖ్దీర్’ (అదృష్టం)పై విశ్వాసం:
‘తఖ్దీర్’ పై విశ్వాసంలో నాలుగు విషయాలు వస్తాయి:
మొదటిది: భూతకాలములో జరిగినది, భవిష్యత్తులో జరగబోయేది సర్వమూ తెలిసినవాడు అల్లాహ్. తన దాసుల పరిస్థితులు సయితం ఆయనకు తెలుసు. ఇంకా వారి జీవనోపాయం, వారి చావు, వారు చేసే కర్మలన్నియూ ఎరిగినవాడు ఆయనే. ఆ పరమ పవిత్రునికి వారి ఏ విషయమూ మరుగుగా లేదు.
إِنَّ اللَّهَ بِكُلِّ شَيْءٍ عَلِيمٌ
(నిశ్చయముగా అల్లాహ్ కు సర్వమూ తెలియును). (సూరె తౌబా 9: 115).
రెండవది: ఆయన సృష్టిలో ఉన్న ప్రతీ దాని అదృష్టాన్ని వ్రాసి పెట్టాడు.
وَكُلَّ شَيْءٍ أَحْصَيْنَاهُ فِي إِمَامٍ مُّبِينٍ
(ప్రతి విషయాన్నీ మేము ఒక స్పష్టమైన గ్రంథంలో వ్రాసి పెట్టాము). (సూరె యాసీన్ 36: 12).
మూడవది: ప్రతి విషయం అల్లాహ్ ఇష్టముపై ఆధారపడి యుంది. ఆయన తలచినది తక్షణమే అవుతుంది. తలచనిది కానే కాదు అని విశ్వసించాలి. సూర ఆలి ఇమ్రాన్ (3:40)లో ఉంది:
كَذَٰلِكَ اللَّهُ يَفْعَلُ مَا يَشَاءُ
(అలానే అవుతుంది. అల్లాహ్ తాను కోరినదానిని చేస్తాడు).
నాల్గవది: అల్లాహ్ దేని తఖ్దీర్ నిర్ణయించాడో అది సంభవించక ముందే దానిని పుట్టించి ఉన్నాడు.
وَاللَّهُ خَلَقَكُمْ وَمَا تَعْمَلُونَ
(వాస్తవానికి అల్లాహ్ యే మిమ్మల్నీ మీరు చేసిన వాటినీ సృష్టించాడు).(సూరె సాఫ్ఫాత్ 37: 96).
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.