ముష్రిక్ లను కాఫిర్లుగా నమ్మక పోవడం | ఇస్లాం నుంచి బహిష్కరించే విషయాలు  – షేఖ్ మాజిద్ బిన్ సులైమాన్ [ఖుత్బా టెక్స్ట్]

ఖతీబ్: మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ, జుబైల్, సౌదీ ఆరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామిఈ
ఇస్లామీయ జుమా ప్రసంగాలు’ అనే పుస్తకం నుండి – రచన: మాజిద్ బిన్ సులైమాన్ అర్రస్సీ

إنَّ الْحَمْدَ لِلَّهِ، نَحْمَدُهُ وَنَسْتَعِينُهُ وَنَسْتَغْفِرُهُ، وَنَعُوذُ بِاللَّهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وسَيِّئَاتِ أَعْمَالِنَا، مَنْ يَهْدِهِ اللَّهُ فَلَا مُضِلَّ لَهُ، وَمَنْ يُضْلِلْ فَلَا هَادِيَ لَهُ، وَأَشْهَدُ أَنْ لَا إلـٰه إِلَّا اللَّهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ.

)يَا أَيُّهَا الَّذِينَ آمَنُواْ اتَّقُواْ اللّهَ حَقَّ تُقَاتِهِ وَلاَ تَمُوتُنَّ إِلاَّ وَأَنتُم مُّسْلِمُون(.

 )يَا أَيُّهَا النَّاسُ اتَّقُواْ رَبَّكُمُ الَّذِي خَلَقَكُم مِّن نَّفْسٍ وَاحِدَةٍ وَخَلَقَ مِنْهَا زَوْجَهَا وَبَثَّ مِنْهُمَا رِجَالاً كَثِيراً وَنِسَاء وَاتَّقُواْ اللّهَ الَّذِي تَسَاءلُونَ بِهِ وَالأَرْحَامَ إِنَّ اللّهَ كَانَ عَلَيْكُمْ رَقِيبا(.

)يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ وَقُولُوا قَوْلاً سَدِيداً * يُصْلِحْ لَكُمْ أَعْمَالَكُمْ وَيَغْفِرْ لَكُمْ ذُنُوبَكُمْ وَمَن يُطِعْ اللَّهَ وَرَسُولَهُ فَقَدْ فَازَ فَوْزاً عَظِيما(.

స్తోత్రాలు మరియు దరూద్ తరువాత :

అన్నిటి కంటే ఉత్తమమైన మాట అల్లాహ్ మాట, మరియు అందరి కంటే ఉత్తమమైన పద్ధతి ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి పద్ధతి. అన్నిటి కంటే నీచమైనది ఇస్లాంలో కొత్తగా సృష్టించబడినవి, మరియు ఇస్లాంలో కొత్తగా సృష్టించబడిన ప్రతీ కార్యము బిద్అత్ క్రిందికే వస్తుంది మరియు ప్రతీ బిద్అత్ మార్గభ్రష్టత్వము మరియు ప్రతీ మార్గభ్రష్టత్వము నరకంలోకి తీసుకువెళ్ళేదే.    

ఓ అల్లాహ్ దాసులారా! అల్లాహ్ తో భయపడుతూ ఉండండి, ఆయనను గౌరవించండి, ఆయన మాటను అనుసరించండి మరియు అవిధేయతకు పాల్పడమాకండి. గుర్తుంచుకోండి ధర్మాలన్నీ ఏయే  విషయాలపై  ఏకమై ఉన్నాయో  అందులో తౌహీద్ రెండు మూల స్తంభాలపై ఆధారపడి ఉండటము కూడా ఒకటి.

మొదటిది: అల్లాహ్ యేతరుల ఆరాధన నుంచి సంబంధం లేకపోవడం.  అల్లాహ్ ను కాకుండా ఇతరులను ఆరాధించడాన్ని అల్లాహ్ వాటికి “తాగూత్ ” అని పేరు పెట్టారు.

రెండవ మూలము:  కేవలం అల్లాహ్ యే నిజ ఆరాధ్యుడు అని సాక్ష్యం పలకటం. ఇదే తౌహీద్ కనుక ఏ వ్యక్తి అయితే తౌహీద్ తో పాటు బహుదైవారాధకుల ధర్మం నుంచి సంబంధం లేదు అన్నట్టు స్పష్టంగా సాక్ష్యం ఇవ్వడో, నిరాకరించడో  అతను తాగుత్ (మిద్య దైవారాధన ) ను తిరస్కరించలేదు అన్నట్టే . అలాంటి వ్యక్తి గురించి అల్లాహ్  ఈ విధంగా సెలవిచ్చారు:

فمن يكفر بالطاغوت ويؤمن بالله فقد استمسك بالعروة الوثقى لا انفصام لها
ఎవరయితే  అల్లాహ్ ను  తప్ప  వేరేతర  ఆరాధ్యులను  (తాగూత్ లను)  తిరస్కరించి,  కేవలం అల్లాహ్ ను మాత్రమే   విశ్వసిస్తారో  వారు  దృఢమైన  కడియాన్ని  పట్టుకున్నారు.

ఈ వాక్యం యొక్క అర్థం ఏమిటంటే, ఏ వ్యక్తి అయితే అల్లాహ్ యేతర ఆరాధ్యులను (తాగూత్ లను)  తిరస్కరించడో అతను బలమైన కడియాన్ని పట్టుకోలేదు. ఆ బలమైన కడియం ఇస్లాం ధర్మం.

ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారు, తమ జాతి యొక్క  ధర్మం నుంచి నాకు ఎటువంటి సంబంధం లేదు అని స్పష్టం చేస్తూ ఈ విధంగా అన్నారు:

 إِنَّنِي بَرَاءٌ مِّمَّا تَعْبُدُونَ إِلَّا الَّذِي فَطَرَنِي فَإِنَّهُ سَيَهْدِينِ وَجَعَلَهَا كَلِمَةً بَاقِيَةً فِي عَقِبِهِ لَعَلَّهُمْ يَرْجِعُونَ

“మీరు పూజించే వాటి నుంచి నేను వేరైపోయాను. నన్ను పుట్టించిన వానిని మాత్రమే (నేను ఆరాధిస్తాను). ఆయనే నాకు సన్మార్గం చూపుతాడు”. మరి ఇబ్రాహీము ఈ మాటే – తన తదనంతరం – తన సంతానంలో మిగిలి ఉండేట్లుగా చేసి వెళ్ళాడు – ప్రజలు (షిర్క్‌ నుంచి) మరలిరావటానికి.

తారీక్ బిన్ అషీమ్ అల్ అస్జయీ ఉల్లేఖనం, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: “ఏ వ్యక్తి అయితే “లా ఇలాహ ఇల్లలాహ్” పలికి అల్లాహ్ యేతర ఆరాధ్యులను తిరస్కరించాడో అతని ప్రాణాలు మరియు ధనము క్షేమంగా ఉన్నట్టే మరియు అల్లాహ్ యే అతని లెక్క చూసుకుంటాడు”. ( సహీహ్ ముస్లిం )

ఈ హదీస్ యొక్క అర్థం ఏమిటంటే ఏ వ్యక్తి అయితే  అల్లాహ్  కాకుండా ఇతర ఆరాధ్యులను  తిరస్కరించడో, అతని ప్రాణాలు మరియు ధనము క్షేమంగా లేనట్టే. ఇది కేవలం కాఫిర్ (అవిశ్వాసి) హక్కులోనే ఇలా జరుగుతుంది.

అల్లాహ్ దాసులారా! వివరించబడిన ఖురాన్ మరియు హదీస్ వెలుగులో  అర్ధమైన విషయం ఏమిటంటే ఎవరైతే ముష్రికులను కాఫిర్ గా ప్రకటించడో లేదా అతని కుఫ్ర్ లో (అవిశ్వాసంలో) సందేహం పడినా లేదా అతని ధర్మాన్ని సరైనదిగా భావించినా అతను అవిశ్వాసానికి పాల్పడినట్టే. అతను  ఇస్లామీయ బహిష్కరణలో నుంచి ఒక బహిష్కరణకు పాల్పడినట్టే.

అల్లాహ్ దాసులారా! ఏ వ్యక్తి అయితే తప్పుడు మతాలను అవలంబిస్తున్నాడో అతనిని కాఫిర్ ప్రకటించకపోవడం కూడా కుఫ్ర్ అవుతుంది. అతను ముస్లిం కాలేడు, ఎందుకంటే ఏ వ్యక్తినైతే అల్లాహ్ మరియు ప్రవక్త కాఫిర్ అని ప్రకటిస్తున్నారో అతనికి ఈయన కాఫిర్ అని భావించడంలేదు, అతని కుఫ్ర్ లో సందేహంపడి అల్లాహ్ మరియు ప్రవక్తను  వ్యతిరేకిస్తున్నాడు . మరియు అతను ఖుర్ఆన్ యొక్క సందేశాన్ని స్వీకరించలేదు, ఖురాన్ యొక్క సత్యతను స్వీకరించలేదు, మరియు ప్రవక్త గారి ఆజ్ఞ పాలన కూడా చేయలేదు. మరి  ఎవరైతే అల్లాహ్ మరియు ప్రవక్త సందేశాన్ని  స్వీకరించలేదో అతను కాఫిరే.  అల్లాహ్ మనందరిని రక్షించుగాక.

ఇంకా ఏ వ్యక్తి అయితే ముష్రిక్కులకు కాఫిరని భావించడో, ప్రకటించడో,  అతని వద్ద విశ్వాసం మరియు అవిశ్వాసం రెండు సమానమే, వీటి మధ్య ఎటువంటి భేదం, తేడా లేనట్టే. ఇందువల్లే అతను కాఫిర్ (అవిశ్వాసి) అవుతున్నాడు. (ఇది షేఖ్ సాలెహ్ అల్ ఫౌజాన్  గారి మాట, షర్హు నవాకిజుల్ ఇస్లాం అనే పుస్తకంలో 79వ పేజీలో వివరించారు)

అల్లాహ్ దాసులారా! ఒక కాఫిర్ ని కాఫిర్ అని భావించని వ్యక్తి వాస్తవానికి అతను ఇస్లాం మరియు కుఫ్ర్ మద్య ఉన్న వ్యత్యాసాన్ని గ్రహించలేదు, అతనికి తెలియదు. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన స్పష్టమైన ఆజ్ఞ.  ఖుర్ఆన్ లో అనేక చోట్ల అవిశ్వాసాన్ని తిరస్కరించడం జరిగింది మరియు ఇహ పరలోకాలలో అవిశ్వాసులకు పడే శిక్షలు గురించి ప్రస్తావన కూడా చేయడం జరిగినది.  ఏ వ్యక్తి అయితే ఒక కాఫిర్ ని కాఫిరని నమ్మడో అతను ముస్లిం అని అనిపించుకునే అర్హత అతనికి లేదు, ఎంతవరకు అంటే అతను ఇస్లాం మరియు అవిశ్వాసం మధ్య ఉన్న  వ్యత్యాసాన్ని గ్రహించి హృదయపూర్వకంగా  నోటి ద్వారా పూర్తిగా అవిశ్వాసానికి నాకు సంబంధం లేదు అని ప్రకటించనంతవరకు .

ఇంకా ఏ వ్యక్తి అయితే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ఎవరినైతే కాఫిర్ అని స్పష్టం చేశారో అతన్ని కాఫిర్ అని భావించడో అతను అల్లాహ్ నిషేధించిన షిర్క్ ను హలాల్ గా ప్రకటించినట్టే,  ఎందుకంటే అల్లాహ్ మరియు ప్రవక్త ఒక   స్పష్టమైన ముష్రిక్ నీ అవిశ్వాసిగా ఖరారు చేస్తే ఇతను అతనిని కాఫిర్ అని నమ్మలేదు కాబట్టి. ఇలా చెయడం  అల్లాహ్ ఆజ్ఞకు వ్యతిరేకము. పైగా అల్లాహ్ తో పోరాడినట్టే. అల్లాహ్ ఆజ్ఞ ఇలా ఉన్నది:

قل تعالوا أتل ما حرم ربكم عليكم ألا تشركوا به شيئا
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : ”రండి, మీ ప్రభువు మీపై నిషేధించిన వస్తువులు ఏవో మీకు చదివి వినిపిస్తాను. అవేమంటే; అల్లాహ్‌కు సహవర్తులుగా ఎవరినీ కల్పించకండి

ఇబ్నే సాది రహిమహుల్లాహ్ వారు ఈ విధంగా రాస్తున్నారు: “ఏ వ్యక్తులను అయితే ఇస్లాం షరియత్ ధర్మం కాఫిర్ అని ప్రకటించిందో  అతనిని కాఫిర్ అనటం తప్పనిసరి. మరి ఎవరైతే స్పష్టమైన ఆధారాల ద్వారా ఒక వ్యక్తి కాఫిర్ అని రుజువైన తర్వాత కూడా అతనిని కాఫిర్ అని భావించడో  అతను అల్లాహ్ మరియు ప్రవక్తను తిరస్కరించినట్టే. (ఫతావా అల్ సాదియా 98)

షేక్  అబ్దుల్ అజీజ్ బిన్ బాజ్ రహిమహుల్లాహ్ వారు అంటున్నారు: “ఎవరైతే ఒక వ్యక్తికి సంబంధించి అతని కుఫ్ర్ విషయంలో స్పష్టమైన ఆధారాలు రుజువు అయిన తర్వాత కూడా అతను కాఫిర్  అని నమ్మడో, ప్రకటించడో అతను కూడా ఆ వ్యక్తి (కాఫిర్) మాదిరిగానే. ఉదాహరణకు:  ఒక వ్యక్తి  ఒక యూదుడ్ని  ఒక నసరాని ను ( క్రైస్తవుడ్ని) లేదా కమ్యూనిస్టుని లేదా ఇలాంటి వాళ్లను కాఫిరని భావించడం లేదు. (వీళ్ళు కాఫిర్లు అని బహుకొద్ధి ధర్మ జ్ఞానం కలిగిన వాళ్ళకు  కూడా సందేహం లేదు).”  (మజ్మూ ఫతావా వ మఖాలాత్ ముతనవ్విఅహ్ (7/418) దారుల్ ఖాసిం, రియాజ్)

షేక్ సాలెహ్ అల్ ఫాజన్ హఫిజహుల్లాహ్ వారు అంటున్నారు: “ఎవరైతే ముష్రిక్ లను కాఫిర్లు అని నమ్మడో  వాడు కూడా  కాఫిర్ మరియు ముర్తదే  (ఇస్లాం నుంచి బహిష్కరించబడినట్టే). ఎందుకంటే అతని వద్ద ఇస్లాం మరియు కుఫ్ర్ రెండు సమానమే, అతను వీటి మధ్య వ్యత్యాసం చేయట్లేదు అందువలన అతను కాఫిర్”. (షర్హు నవాకిజుల్ ఇస్లాం పేజ్ 79)

అల్లాహ్ దాసులారా! తాగుత్ ను (అల్లాహ్ ను కాకుండా ఇతరులను ఆరాధ్యుడుగా చేసుకోవటం) తిరస్కరించటం చాలా విలువైనది, ప్రయోజకరమైనది. అల్లాహ్ ను విశ్వసించడం వలన తాగూత్ నిరాకరణ సంభవిస్తుంది. దానివల్లే దాసుడు పటిష్టమైన కడియాన్ని పట్టుకోవటం అనే ఈ ప్రక్రియ సంపూర్ణమవుతుంది ఇది అల్లాహ్ ఆజ్ఞలో ఈ విధంగా ఉన్నది:

(فَمَن يَكْفُرْ بِٱلطَّٰغُوتِ وَيُؤْمِنۢ بِٱللَّهِ فَقَدِ ٱسْتَمْسَكَ بِٱلْعُرْوَةِ ٱلْوُثْقَىٰ لَا ٱنفِصَامَ لَهَا).
ఎవరయితే  అల్లాహ్  తప్ప  వేరితర  ఆరాధ్యులను (తాగూత్ను)  తిరస్కరించి  అల్లాహ్ ను  మాత్రమే   విశ్వసిస్తారో  వారు  దృఢమైన  కడియాన్ని  పట్టుకున్నారు.

ఇది తహ్లియ(అలంకరణ) కన్నా తఖ్లియ(శుద్ధి) కు ప్రాధాన్యత ఇవ్వటం అవుతుంది. అంటే చెడును శుభ్రపరచి మంచిని అలంకరించటం.

అల్లాహ్ దాసులారా!  అబద్ధపు ధర్మాలు, మతాలను నిరాకరించటం ఐదు విషయాలను అవలంబించడం వల్ల జరుగుతుంది, సాధ్యమవుతుంది. (1) ఆ ధర్మాలు అసత్యము, అబద్ధమని విశ్వసించటము. (2) వాళ్ళను ఆరాధించకుండా ఉండటం, (3) వాటి పట్ల ద్వేషం కలిగి ఉండటం, (4) వాళ్ళను నమ్మి ఆరాధించే వాళ్ళను కాఫిర్లు గా భావించడం, (5) వాటి పట్ల శత్రుత్వం కలిగి ఉండటం. ఇవన్నీ షరతులు అల్లాహ్ ఆజ్ఞ ప్రకారం రుజువు అవుతునాయి. అల్లాహ్ ఆదేశం:

(لقد كان لكم أسوة حسنة في إبراهيم والذين آمنوا معه إذ قالوا لقومهم إنا برءاء منكم ومما تعبدون من دون الله كفرنا بكم وبدا بيننا وبينكم العداوة والبغضاء أبدا حتى تؤمنوا بالله وحده)

ఓ ముస్లిములారా! మీకు   ఇబ్రాహీములోనూ, అతని వెంట  నున్న  వారిలోనూ   అత్యుత్తమమైన  ఆదర్శం  ఉంది.  వారంతా  తమ  జాతి  వారితో  స్పష్టంగా   ఇలా   చెప్పేశారు:  “మీతోనూ,  అల్లాహ్‌ను  వదలి  మీరు  పూజించే  వారందరితోనూ   మాకెలాంటి  సంబంధం  లేదు.  మేము  మిమ్మల్ని  (మీ  మిథ్యా  విశ్వాసాలను)   తిరస్కరిస్తు న్నాము.  ఒకే  ఒక్కడైన  అల్లాహ్‌ను  మీరు  విశ్వసించనంతవరకూ   మాకూ  –  మీకూ  మధ్య   శాశ్వతంగ  విరోధం,  వైషమ్యం  ఏర్పడినట్లే…

ఈ వాక్యం ద్వారా మూడు విషయాలు స్పష్టమవుతున్నాయి: అవిశ్వాసులతో  సంబంధం లేకపోవడం వ్యక్తం చేయడం, వాళ్ల ఆచరణ, షిర్క్ కి పాల్పడటం నుంచి సంబంధం లేదు అని వ్యక్తం చేయటము మరియు వాళ్ళ పట్ల కోపము ద్వేషము స్పష్టం చేయటము.

ఇక మిగిలిన మాట వాళ్ళ (అసత్య ధర్మాల దేవుళ్ళ) ఆరాధన అసత్యం అనే విషయం కలిగి ఉండటం అంటే ఇది ఈ వాక్యం ద్వారా స్పష్టం అవుతుంది. ఎందుకంటే అవి అసత్య ధర్మము అని మనం విశ్వసించనంతవరకు పైన పేర్కొనబడిన మూడు విషయాలు ఉనికిలోకి రావు.

ఇక అబద్ధపు ఆరాధ్యుల ఆరాధనను తిరస్కరించటము ఇంకా వాళ్లతో సంబంధం తెంచుకోవడానికి ఈ వాక్యం మనకు ఆధారము,  ఇందులో ప్రవక్త ఇబ్రాహీం తమ జాతి వారిని ఉద్దేశించి అంటున్నారు:

(وأعتزلكم وما تدعون من دون الله وأدعوا ربي عسى ألا أكون بدعاء ربي شقيا )     
నేను మిమ్మల్నీ, అల్లాహ్‌ను విడిచి  మీరు  మొరపెట్టుకునే  వారందరినీ  వదలి  పోతున్నాను. కేవలం  నా  ప్రభువును  మాత్రమే  వేడుకుంటాను. నా  ప్రభువుని  వేడుకుని  విఫలుణ్ణి   కానన్న  నమ్మకం  నాకుంది”  అని  (ఇబ్రాహీం)  చెప్పాడు.(5:15)

పై వాక్యంలో ఒక సూక్ష్మమైన విషయం దాగి ఉంది, అదేమిటంటే కుఫ్ర్ తో సంబంధం తెంచడం హృదయము, నాలుక, మరియు శరీర అవయవాల ద్వారా స్పష్టమవుతుంది. హృదయం నుంచి సంబంధం తెంచటం అంటే వాళ్లతో ద్వేషము మరియు వాళ్ళు అవిశ్వాసులు అన్న నమ్మకం కలిగి ఉండటంతోనే స్పష్టమవుతుంది , ఎలాగైతే ఖుర్ఆన్ వాక్యంలో  బోధించబడింది: ﴿كفرنا بكم﴾ .

నోటి నుంచి సంబంధం తెంచడం అనేది ప్రవక్త ఇబ్రాహీం వారి మాట ద్వారా స్పష్టమవుతుంది. ఆయన తమ జాతి వారు ముందు ఈ విధంగా ప్రకటించారు “ كفرنا بكم”

మరియు శరీర అవయవాల నుంచి సంబంధం తెంచటం ఈ వాక్యం ద్వారా మనకు స్పష్టమవుతుంది:

وَأَعْتَزِلُكُمْ وَمَا تَدْعُونَ مِن دُونِ اللَّهِ
నేను   మిమ్మల్నీ, అల్లాహ్‌ను విడిచి  మీరు  మొరపెట్టుకునే  వారందరినీ  వదలి  పోతున్నాను.

అల్లాహ్  దాసులారా: తాగూత్  నుంచి సంబంధం తెంచడం అనేది కేవలం ఆరాధన విషయంలో మాత్రం అంకితం కాదు, షిర్క్ మరియు కుఫ్ర్ లోని అన్ని రకాలలో ఇది వర్తిస్తుంది. ఉదాహరణకు : అల్లాహ్ కు లోపాలు ఆపాదించుటము లేదా ధర్మాన్ని ఎగతాళి  చేయటము లేదా సహబాలను తిట్టటం లేదా మాతృమూర్తులపై నింద మోపటము లేదా జిబ్రయిల్ వారు దౌత్య విషయంలో దగా, మోసం చేశాడని అనుమానించటము, లేదా యూద మతం క్రైస్తవ మతం బౌద్ధమతం ఇవన్నీ సత్యమే అని భావించడం, లేదా ఇలాంటి అవిశ్వాస చర్యలకు పాల్పడితే ఆ వ్యక్తి కాఫిర్ అవ్వటంలో ఎటువంటి సందేహం లేదు.

అల్లాహ్ దాసులారా!  ఇప్పటిదాకా వివరించిన విషయాల  ప్రకారం తౌహీద్ మరియు దాని వ్యతిరేకము అయిన షిర్క్ వివరణ స్పష్టం అయింది, తౌహీద్ విషయంలో పరస్పర ప్రేమ మరియు సంబంధాలు దాని యొక్క అర్థము స్పష్టమైనది , తౌహీద్ కి వ్యతిరేకమైన షిర్క్ నుంచి సంబంధం తెంచుకోవడం అనే విషయము అర్థం అయింది , దానిని తెలుసుకోవడం వల్ల హృదయము రుజుమార్గంపై నిలకడగా, స్థిరంగా ఉంటుంది, ఎందుకంటే ప్రతి వస్తువు యొక్క విలువ దాని  వ్యతిరేకం ద్వారానే  తెలుస్తోంది. ఒక కవి ఇలా అంటున్నాడు :

فالضِّد يظهر حسنه الضد   وبضِدها تتبين الأشياء
వ్యతిరేకం అనే పదానికి అందము దాని వ్యతిరేకంతోనే స్పష్టమవుతుంది,  మరియు వస్తువులు తమ వ్యతిరేకతతోనే అర్థమవుతాయి.

కనుక ఏ వ్యక్తికి అయితే షిర్క్ తెలియదో అతనికి తౌహీద్ కూడా తెలియదు, మరియు ఎవరైతే షిర్క్ నుంచి సంబంధం తెంచుకోడో అతను తౌహీద్ ని ఆచరణలోకి తీసుకురాలేదు.

అల్లాహ్ నాపై మరియు మీపై  ఖుర్ఆన్ యొక్క శుభాలను అనుగ్రహించు గాక! మనందరికీ వివేకంతో, హితోపదేశంతో కూడిన ఖురాన్ వాక్యాల నుంచి లాభం చేకూర్చు గాక! నేను ఇంతటితో నా మాటను ముగిస్తూ అల్లాహ్ తో మనందరి క్షమాపణ కొరకు ప్రార్థిస్తున్నాను, మరియు మీరు కూడా అల్లాహ్ తో క్షమాపణ కోరండి, నిస్సందేహంగా ఆయన క్షమించేవాడు మరియు అమిత దయామయుడు.

స్తోత్రాలు మరియు దరూద్ తరువాత :

అల్లాహ్ దాసులారా! అల్లాహ్ భీతి కలిగి ఉండండి. మరియు గుర్తుంచుకోండి! ఏ వ్యక్తి అయితే ఒక ముష్రిక్ ను కాఫిర్ గా భావించడంలో సందేహ పడతాడో అతను కూడా ఆ ముష్రిక్ మాదిరిగానే అవుతాడు. ఉదాహరణకు:  ఒక వ్యక్తి ఇలా అంటే: (నాకు తెలీదు యూదుడు కాఫీరో కాడో) లేక ఇలా అన్నా (నాకు తెలీదు క్రైస్తవులు కాపీర్లు లేక కాదో,) లేదా ఇలా అన్నా (నాకు తెలీదు అల్లాహ్ ను కాకుండా ఇతరులను మొరపెట్టుకునేవారు ముస్లిమో కాదో) లేదా ఇలా చెప్పినా  (నాకు తెలీదు ఫిరోన్ కాఫిరా కాదా అనేది) – ఇలా చెప్పిన వ్యక్తి కూడా కాఫిరే. ఇలా చెప్పటానికి కారణం ఏమిటంటే ఆ వ్యక్తి కుఫ్ర్ అనేది స్వతహాగా సత్యమా, అసత్యమా? అనే విషయంలో సందేహపడి ఉన్నాడు, కనుక అతను ఖచ్చితంగా ప్రకటించట్లేదు మరియు తాగూత్ ను  (మిద్య దైవారాధనను) కూడా తిరస్కరించట్లేదు. ఇక చూడబోతే అల్లాహ్ ఈ విషయాన్ని ఖురాన్లో స్పష్టంగా వివరించేశారు, అదేమిటంటే అవిశ్వాసం అసత్యమని, అబద్ధమని.  ఇది ఇలా స్పష్టమైనప్పటికీ కూడా దీంట్లో సందేహం కలిగి ఉంటే అతను ఖుర్ఆన్  లో వివరించబడిన ఆజ్ఞలను  విశ్వసించట్లేదు.

ఇంకో విషయం ఏమనగా ఇలా సందేహపడేవాడికి ఇస్లాంకి సంబంధించి ఏ అవగాహన లేదు. ఒకవేళ ఇస్లాం ధర్మం పట్ల అవగాహన ఉంటే అతని ముందు కుఫ్ర్ (ఇస్లాంకి వ్యతిరేకమైనది) స్పష్టమయ్యేది. మరి ఎవరికైతే ఇస్లాం పట్ల అవగాహన లేదో అతను ముస్లిం అని ఎలా అనబడతాడడు! ?.

షేక్ సులేమాన్ (*) బిన్ అబ్దుల్లా బిన్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహ్హబ్ రహిమహుల్లాహ్ తమ పుస్తకం “ఔసఖు ఉరల్ ఇమాన్” లో అంటున్నారు: ఒకవేళ అతను వాళ్ళ కుఫ్ర్ విషయంలో సందేహపడినా లేదా వాళ్ళ కుఫ్ర్ కు సంబంధించి అవగాహన లేకపోయినా అలాంటి సమయంలో ఆ వ్యక్తి ముందు ఖుర్ఆన్ మరియు హదీస్ ఆధారాలు వివరించాలి. దానివల్ల వాళ్ళ కుఫ్ర్ (అవిశ్వాసం) స్పష్టమవుతుంది. దీని తర్వాత కూడా ఒకవేళ అతను వాళ్ళ కుఫ్ర్ విషయంలో సందేహంపడినా లేదా సంకోచంలో ఉన్నా ఆ వ్యక్తి కాఫిరే, ఎందుకంటే ఏ వ్యక్తి అయితే ఒక కాఫిర్ యొక్క కుఫ్ర్ విషయంలో సందేహం పడితే అతను కూడా కాఫిరే, ఈ విషయంలో ఉలమాలందరూ  ఏకీభవించి ఉన్నారు .

అల్లాహ్ దాసులారా!  ఎవరైతే అవిశ్వాసుల మతం సరైనదిగా  ప్రకటించాడో,  అతను వాళ్ళ కన్నా ఎక్కువగా మార్గభ్రష్టత్వానికి లోనై ఉన్నాడు.  ఎందుకంటే వాళ్ళ మతం అసత్యం అన్న విషయంలో సందేహానికి లోనై ఉన్నాడు, అతని కుఫ్ర్ (అవిశ్వాసం) అవిశ్వాసికన్నా ఎక్కువే. దీని వాస్తవం ఏమిటంటే ఎవరైతే కుఫ్ర్ ని సత్యంగా ప్రకటిస్తున్నాడో, అతడు ఇస్లాం ధర్మాన్ని అసత్యమని ప్రకటించినట్టే. అతను అసత్య ధర్మం కొరకు పోరాడినట్టే, దాని ప్రచారం చేస్తూ, దానిని సహకరించినట్టే, అవిశ్వాస ధర్మాన్ని ప్రచారం చేయటానికి విశాలమైన మైదానంలో సిద్ధమైనట్టే. (అల్లాహ్ మనందర్నీ కాపాడు గాక)

ఉదాహరణకు: ఒక వ్యక్తి ఇస్లాం కి వ్యతిరేకంగా విశ్వాసాన్ని (నమ్మకాన్ని) కలిగి ఉండి, దానిని  సరైనదిగా భావిస్తున్నాడో ఎలాగైతే యూద మతం  క్రైస్తవ మతం, సోషలిజం, సెక్యులరిజం లాంటివి, వీళ్ళందర్నీ సత్యమని భావించి లేదా ఈ ధర్మాలన్నీ ఒకటే అన్న భ్రమలో దాని వైపుకు ఆహ్వానించినా, ప్రచారం చేసినా, దావత్ ఇచ్చినా.

ఉదాహరణకు: యూద మతం, క్రైస్తవ మతం మరియు ఇస్లాం ధర్మం ఇవన్నీ ఇబ్రాహీం (అలైహిస్సలాం) వారి ధర్మమే అని ప్రచారం చేయడం, మరియు అధర్మ వాక్యాల ద్వారా ప్రజలను సందేహంలో, సంకోచంలో పడి వేయటము. ఇంకా యూదులు, క్రైస్తవులు మూసా మరియు ఈసా ప్రవక్త వారి యొక్క అనుయాయులే అని ప్రచారం చేయటం, ఇవన్నీ సత్యసత్యాలను తారుమారు చేయడమే.

ఎందుకంటే అల్లాహ్  ఇస్లాం ద్వారా మిగతా ధర్మాలన్నిటిని రద్దు చేశారు. ఒకవేళ మూసా మరియు ఈసా ప్రవక్తలు బ్రతికి ఉన్నా, వాళ్లు సత్య ధర్మంపై స్థిరంగా ఉన్నప్పటికీ  వాళ్లు కూడా ఇస్లాం ధర్మాన్నే అవలంబిస్తారు. కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏమిటంటే వాళ్ళు తెచ్చిన ధర్మాన్ని తారుమారు చేశారు, మార్పిడి చేశారు. అవి తమ అసలైన రూపంలో లేవు,  కనుక   తౌరాత్ ను కోల్పోయిన తర్వాత మూసా వారి ధర్మంలో వక్రీకరణ జరిగింది. మరియు యూదులు ఉజెర్ ప్రవక్తను ఆరాధించడం మొదలుపెట్టారు, ఇంకా ఆయన అల్లాహ్ కుమారుడని చెప్పటం మొదలుపెట్టారు. ప్రవక్త ఈసా వారిని అల్లాహ్ ఆకాశం వైపుకు ఆరోహణ చేసుకున్న తర్వాత ఆయన తీసుకొచ్చిన ధర్మంలో కూడా వక్రీకరణ మొదలై ఆయన అనుయాయులు శిలువను ఆరాధించడం మొదలుపెట్టారు. ఇక ఆయన అల్లాహ్ కుమారుడని, అల్లాహ్ ముగ్గురు దేవుళ్లలో ఒక్కడు  అని చెప్పటం మొదలెట్టారు. ఇవన్నీ తెలిసినప్పటికీ కూడా యూద మతం క్రైస్తవ మతం ఇస్లాం ధర్మం మూడు ఒకటే అని చెప్పటం సమంజసమేనా? ఆ ధర్మాల ద్వారా అల్లాహ్ ను ఆరాధించడం అనేది సమంజసమేనా?  కాదు ! ఎన్నటికీ సరైనది కాదు. అల్లాహ్ ఈ విధంగా సెలవిస్తున్నారు :

يَا أَهْلَ الْكِتَابِ قَدْ جَاءَكُمْ رَسُولُنَا يُبَيِّنُ لَكُمْ كَثِيرًا مِّمَّا كُنتُمْ تُخْفُونَ مِنَ الْكِتَابِ وَيَعْفُو عَن كَثِيرٍ ۚ قَدْ جَاءَكُم مِّنَ اللَّهِ نُورٌ وَكِتَابٌ مُّبِينٌ

ఓ గ్రంథవహులారా! మీ వద్దకు మా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వచ్చేశాడు. మీరు కప్పిపుచ్చుతూ ఉండిన గ్రంథంలోని ఎన్నో విషయాలను అతను మీ ముందు విపులీకరిస్తున్నాడు. మరెన్నో విషయాలను ఉపేక్షిస్తున్నాడు. అల్లాహ్‌ తరఫు నుంచి మీ వద్దకు జ్యోతి వచ్చేసింది. అంటే, స్పష్టమైన గ్రంథం వచ్చేసింది. (అల్ మాయిదా 5: 15)

మరో చోట ఇలా సెలెవిచ్చారు :

يَا أَهْلَ الْكِتَابِ قَدْ جَاءَكُمْ رَسُولُنَا يُبَيِّنُ لَكُمْ عَلَىٰ فَتْرَةٍ مِّنَ الرُّسُلِ أَن تَقُولُوا مَا جَاءَنَا مِن بَشِيرٍ وَلَا نَذِيرٍ ۖ فَقَدْ جَاءَكُم بَشِيرٌ وَنَذِيرٌ ۗ وَاللَّهُ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ

గ్రంథవహులారా! ప్రవక్తల ఆగమన క్రమంలో విరామం తర్వాత మా ప్రవక్త మీ వద్దకు వచ్చేశాడు. అతను మీకు స్పష్టంగా విడమరచి చెబుతున్నాడు. మా వద్దకు శుభవార్త అందించేవాడు, భయపెట్టేవాడు ఎవరూ రాలేదన్న మాట మీరు అనకుండా ఉండేందుకుగాను (ఈ ఏర్పాటు జరిగింది). అందుకే ఇప్పుడు నిజంగా శుభవార్త వినిపించేవాడు, భయపెట్టేవాడు మీ వద్దకు వచ్చేశాడు. అల్లాహ్‌ అన్నింటిపై అధికారం కలవాడు. (అల్ మాయిదా 5: 19)

ఇంకో చోట ఇలా ఆజ్ఞాపించారు :

وَمَن يَبْتَغِ غَيْرَ الْإِسْلَامِ دِينًا فَلَن يُقْبَلَ مِنْهُ وَهُوَ فِي الْآخِرَةِ مِنَ الْخَاسِرِينَ

ఎవరయినా ఇస్లాంను కాకుండా మరో ధర్మాన్ని అన్వేషిస్తే అతని ధర్మం స్వీకరించబడదు. అలాంటి వ్యక్తి పరలోకంలో నష్టపోయినవారిలో చేరిపోతాడు. ( ఆలే ఇమ్రాన్ 3: 85)

చివరిగా సారాంశం ఏమిటంటే, ఏ వ్యక్తి అయితే అవిశ్వాసుల ధర్మాన్ని (యూధ మతం, క్రైస్తవ మతం) సత్యమని ప్రకటించాడో  అతను కూడా కాఫిరే.  అల్లాహ్ శరణం.

ఇదే విధంగా రవాఫిజ్ ల విశ్వాసం వైపుకు ఆహ్వానించడం కూడా వాళ్ల మాదిరిగా అయినట్టే, వాళ్లలో చేరిపోయినట్టే.

రవాఫిజ్ ల మతం: సమాధుల ఆరాధన, ఆహ్లె బైత్ (ప్రవక్త  గారి ఇంటి వాళ్ళను) ఆరాధించటం, ప్రవక్త గారి సున్నత్ ను తిరస్కరించటం, సహాబాలను కాఫిర్లు గా ప్రకటించటం, దైవదూతల నాయకుడైన జిబ్రయిల్ అమీన్ ను మరియు ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారిని అవమానించడం,  ఖుర్ఆన్ మరియు ప్రవక్త గారి దౌత్యాన్ని అవమానించడం.

ఇలాంటి విశ్వాసాలు కలిగి ఉన్న రవాఫిజ్ ల వైపుకు దావత్ ఇవ్వటము, వాళ్ళ విశ్వాసాలను అందంగా అలంకరించి ప్రకటించేవాళ్లు వీళ్ళలోనే తప్ప మరెవరో  కాదు. అందుకే అతను వాళ్ల మతం స్వీకరించ పోయినప్పటికీ కూడా వాళ్ళలాగా అవిశ్వాసియే, ఎందుకంటే అతను కుఫ్ర్ మరియు కపటాన్ని సత్యమే అని, సరైనదే అని భావించాడు కాబట్టి. అల్లాహ్ మనందరినీ దాన్నుంచి కాపాడుగాక

అల్లాహ్  దాసులారా!  తౌహీద్ మరియు దాని వ్యతిరేకాన్ని ( షిర్క్ ను) అర్థం చేసుకోవడానికి, దానికి పాల్పడకుండా  జాగ్రత్త పడడానికి ఇది చాలా ఉత్తమమైన సందర్భం. ముస్లింలు ముష్రిక్ లను అవిశ్వాసులని (కాఫిర్లు అని) భావించి, వాళ్ళ కుఫ్ర్ లో సందేహం పడకుండా, వాళ్ల  మతాన్ని సరైనదిగా భావించకుండా జాగ్రత్త పడటం తప్పనిసరి. ఈ మూడు విషయాలు ఇస్లాం నుంచి బహిష్కరించేవి. ప్రతి ముస్లిం పై తప్పనిసరి ఏమిటంటే ఎవరినైతే అయితే అల్లాహ్ మరియు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కాఫిర్లు అని నిర్ధారించారో వారి కుఫ్ర్ గురుంచి  నమ్మకం కలిగి,  హృదయంలో ఎటువంటి సంకోచము సందేహం లేకుండా నమ్మాలి. (ఇది ప్రతి ముస్లిం పై తప్పనిసరి)

అల్లాహ్ ప్రజలందరికీ తౌహీద్ పై జీవితాంతం స్థిరంగా ఉండే భాగ్యాన్ని ప్రసాదించుగాక, ఎందుకంటే ఏ వ్యక్తి అయితే షరియత్ ప్రకారం జీవితాన్ని గడుపుతాడో, స్థిరంగా  ఉంటాడో అతనికి తౌహీద్ పైనే మరణం లభిస్తుంది. అలాంటి వ్యక్తి ఎటువంటి ప్రశ్నోత్తరాలు లెక్క లేకుండా స్వర్గంలో ప్రవేశిస్తాడు .

మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే అల్లాహ్ మిమల్ని గొప్ప సత్కార్యాన్ని గురుంచి ఆదేశించాడు. అల్లాహ్ ఆదేశం:

إن اللَّهَ وَمَلَائِكَتَهُ يُصَلُّونَ عَلَى النَّبِيِّ يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا صَلُّوا عَلَيْهِ وَسَلِّمُوا تسليما

నిశ్చయంగా   అల్లాహ్‌,  ఆయన  దూతలు  కూడా  దైవప్రవక్తపై  కారుణ్యాన్ని   పంపిస్తున్నారు. ఓ విశ్వాసులారా!  మీరు  కూడా  అతనిపై  దరూద్‌   పంపండి.  అత్యధికంగా  అతనికి  ‘సలాములు’  పంపుతూ  ఉండండి (33: 56)

اللهم صل وسلم على عبدك ورسولك محمد، وارض عن أصحابه الخلفاء، الأئمة الحنفاء، وارض عن التابعين ومن تبعهم بإحسان إلى يوم الدين.

ఓ అల్లాహ్! మాకు  ప్రపంచంలో మేలును, పుణ్యాన్ని పరలోకంలో సాఫల్యాన్ని ప్రసాదించు. మరియు  నరక శిక్షల నుండి మమ్ములను కాపాడు.

للهم صل على نبينا محمد وآله وصحبه وسلِّم تسليما كثيرا

ఖతీబ్: మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ, జుబైల్, సౌదీ ఆరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామిఈ
ఇస్లామీయ జుమా ప్రసంగాలు’ అనే పుస్తకం నుండి – రచన: మాజిద్ బిన్ సులైమాన్ అర్రస్సీ