ప్రశ్న:
సందేశహరుడు (రసూల్) మరియు ప్రవక్త (నబీ) మధ్య ఏమైనా తేడా ఉందా?
జవాబు:
అవును, పండితులు (ఉలమాలు) దీని గురించి ఇలా చెబుతున్నారు:
“ప్రవక్త (నబీ) అంటే అల్లాహ్ నుండి ఒక ధర్మానికి (చట్టానికి) సంబంధించిన వహీ (దైవవాణి) పొందినవారు, కానీ దానిని ప్రజలకు ప్రచారం చేయమని ఆదేశించబడనివారు. వారు దానిని స్వయంగా ఆచరించాలి, కానీ ఇతరులకు అందించమని కోరబడరు”
సందేశహరుడు (రసూల్) అంటే అల్లాహ్ నుండి ధర్మానికి సంబంధించిన వహీ పొందినవారు మరియు దానిని ఆచరిస్తూ, ప్రజలకు ప్రచారం చేయమని (అందించమని) ఆదేశించబడినవారు.
ప్రతి సందేశహరుడు (రసూల్) ఒక ప్రవక్త (నబీ) అయి ఉంటారు, కానీ ప్రతి ప్రవక్త సందేశహరుడు కారు.
సందేశహరుల కంటే ప్రవక్తల సంఖ్య చాలా ఎక్కువ. అల్లాహ్ ఖురాన్ లో కొందరు సందేశహరుల గాథలను మనకు తెలియజేశాడు, మరికొందరి గురించి తెలియజేయలేదు. అల్లాహ్ (మహోన్నతుడు) ఇలా సెలవిస్తున్నాడు:
وَلَقَدْ أَرْسَلْنَا رُسُلًا مِّن قَبْلِكَ مِنْهُم مَّن قَصَصْنَا عَلَيْكَ وَمِنْهُم مَّن لَّمْ نَقْصُصْ عَلَيْكَ ۗ وَمَا كَانَ لِرَسُولٍ أَن يَأْتِيَ بِآيَةٍ إِلَّا بِإِذْنِ اللَّهِ
“నిశ్చయంగా నీకు పూర్వం కూడా మేము ఎంతోమంది ప్రవక్తల్ని పంపి ఉన్నాము. వారిలో కొందరి సంగతులు మేము నీకు తెలియపర్చాము. మరికొందరి వృత్తాంతాలను అసలు నీకు తెలుపనే లేదు. ఏ ప్రవక్త కూడా అల్లాహ్ అనుజ్ఞ లేకుండా ఏ మహిమనూ తీసుకురాలేకపోయేవాడు.” [గాఫిర్ 40:78]
ఈ వచనం ఆధారంగా, ఖురాన్ లో ప్రస్తావించబడిన ప్రతి ప్రవక్త ఒక సందేశహరుడు (రసూల్) అని స్పష్టమవుతోంది.
షేక్ ముహమ్మద్ బిన్ సాలిహ్ అల్-ఉతైమీన్
ఫతావా ఇస్లామియా, సంపుటి 1, పేజీ 226
Translated from:
https://abdurrahman.org/2014/09/20/the-difference-between-a-messenger-rasul-and-a-prophet-nabiyy/