1.8 ప్రార్ధనా స్థలాల ప్రకరణం | మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్)

మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్) (Al-Lulu-wal-Marjaan) .  

298 – حديث أَبِي ذَرٍّ رضي الله عنه، قَالَ: قُلْتُ يَا رَسُولَ اللهِ أيُّ مَسْجِدٍ وُضِعَ فِي الأَرْضِ أَوَّلُ قَالَ: الْمَسْجِدُ الْحَرَامُ قَالَ: قُلْتُ ثُمَّ أيُّ قَالَ: الْمَسْجِدُ الأَقْصى قُلْتُ: كَمْ كَانَ بَيْنَهُمًا قَالَ: أَرْبَعُونَ سَنَةً، ثُمَّ أَيْنَمَا أَدْرَكَتْكَ الصَّلاَةُ بَعْدُ، فَصَلِّ، فَإِنَّ الْفَضْلَ فِيهِ
__________
أخرجه البخاري في: 60 كتاب الأنبياء: 10 باب حدثنا موسى بن إسماعيل

298. హజ్రత్ అబూజర్ (రదియల్లాహు అన్హు) కథనం:- నేనొకసారి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)తో మాట్లాడుతూ “దైవప్రవక్తా! ప్రపంచంలో అన్నిటి కంటే ముందు నిర్మించబడిన మస్జిద్ ఏది?” అని అడిగాను. దానికాయన “మస్జిదుల్ హరాం (కాబా గృహం)” అని సమాధానమిచ్చారు. “ఆ తరువాత ఏదీ?” అని నేను మళ్ళీ అడిగాను. “బైతుల్ మఖ్ దిస్” అన్నారు ఆయన. “అయితే ఈ రెండిటి నిర్మాణాల మధ్య ఎంత వ్యవధి ఉంది?” అని తిరిగి ప్రశ్నించాను. “నలభై ఏళ్ళ”ని ఆయన సమాధానమిచ్చారు. ఆ తరువాత “కాల చక్రం నిన్ను ఏ చోటుకు తెస్తే ఆ చోటనే (వేళకు) నమాజు చెయ్యి. అదే శ్రేష్ఠమైన పని” అని హితవు చేశారు ఆయన.” [సహీహ్ బుఖారీ : 60వ ప్రకరణం – అంబియా….. అధ్యాయం ]

299 – حديث جَابِرِ بْنِ عَبْدِ اللهِ قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: أُعْطِيتُ خَمْسًا لَمْ يُعْطَهُنَّ أَحَدٌ مِنَ الأَنْبِيَاءِ قَبْلِي: نُصِرْتُ بِالرُّعْبِ مَسِيرَةَ شَهْرٍ، وَجُعِلَتْ لِيَ الأَرْضُ مَسْجِدًا وَطَهُورًا، فَأَيُّمَا رَجُلٍ مِنْ أُمَّتِي أَدْرَكَتْهُ الصَّلاَةُ فَلْيُصَلِّ، وَأُحِلَّتْ لِيَ الْغَنَائِمُ، وَكَانَ النَبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يُبْعَثُ إِلَى قَوْمِهِ خَاصَّةً وَبُعِثْتُ إِلَى النَّاس كَافَّةً، وَأُعْطِيتُ الشَّفَاعَةَ
__________
أخرجه البخاري في: 8 كتاب الصلاة: 56 باب قول النبي صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ جعلت لي الأرض مسجدًا وطهورًا

299. హజ్రత్ జాబిర్ బిన్ అబ్దుల్లా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేశారు:- నాకు పూర్వం ఏ దైవప్రవక్తకూ ప్రసాదించబడని ఐదు ప్రత్యేకతలు ప్రసాదించబడ్డాయి. (1) నా గాంభీర్యానికి శత్రువులు ఒక నెల ప్రయాణపు దూరం నుండే భయపడిపోయేలా అల్లాహ్ నాకు సహాయం చేస్తున్నాడు. (2) నా కోసం యావత్తు భూమండలం * ప్రార్థనా స్థలంగా, పరిశుద్ధ పరిచే వస్తువుగా చేయబడింది. అందువల్ల నా అనుచర సమాజంలోని ప్రతి వ్యక్తి ఏ చోటున ఉంటే ఆ చోటునే వేళయినప్పుడు నమాజు చేసుకోవచ్చు. (3) నా కోసం యుద్ధప్రాప్తి (మాలె గనీమత్)ను వాడుకోవడం ధర్మసమ్మతం చేయబడింది. (4) ఇతర దైవప్రవక్తలందరూ తమ తమ జాతుల కోసం మాత్రమే ప్రత్యేకించబడగా, నేను యావత్తు మానవాళి కోసం దైవప్రవక్తగా పంపబడ్డాను. (5) నాకు (పరలోక తీర్పుదినాన సాధారణ) సిఫారసు ** చేసే అధికారం ఇవ్వబడింది.

[సహీహ్ బుఖారీ : 8వ ప్రకరణం – సలాత్, 56వ అధ్యాయం – ఖౌలిన్నబియ్యి…. జుఇలత్ లియల్ అర్జుకుల్లహ మస్జిదన్ వ తహూర]

* అంటే, నిషిద్ధ ప్రదేశాల్లో తప్ప మరెక్కడయినా వేళకాగానే అలస్యం చేయకుండా నమాజు చేయడం ఉత్తమం అని అర్థం. నిషిద్ధ ప్రదేశాలు అంటే శ్మశానం, భవన నిర్మాణ సామగ్రి ఉండే ప్రదేశాలు, పేడ కసువు ఉండే పశువుల కొట్టాలు, మార్గాలు, మలిన ప్రదేశాలు, స్నానాల దొడ్లు మొదలగునవి.

** ఇక్కడ సిఫారసు అంటే, హషర్ మైదానంలో మానవులంతా తీవ్ర ఆందోళనకు గురి అయినపుడు చేసే సాధారణ సిఫారసు అని అర్థం. అప్పుడు ఇతర ప్రవక్తలందరూ ప్రజలను నిరాశపరుస్తారు. అయితే ఇతర సందర్భాలలో ప్రత్యేక సిఫార్సు ప్రవక్తలు, సజ్జనులు కూడా చేస్తారు. లేదా ఇక్కడ సిఫార్సు అంటే రద్దు కానటువంటి సిఫార్సు గాని, అణుమాత్రం విశ్వాసమున్న వారికి సయితం ప్రయోజనం చేకూర్చే సిఫార్సు గానీ అయి ఉంటుంది.

300 – حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: بُعِثْتُ بِجَوَامِعِ الْكَلِمِ، وَنُصِرْتُ بِالرُّعْبِ، فَبَيْنَا أَنَا نَائِمٌ أُتِيتُ بِمَفَاتِيحِ خَزَائِنِ الأَرْضِ فَوُضِعَتْ فِي يَدِي
قَالَ أَبُو هُرَيْرَةَ: وَقَدْ ذَهَبَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ وَأَنْتُمْ تَنْتَثِلُونَهَا
__________
أخرجه البخاري في: 56 كتاب الجهاد: 122 باب قول النبي صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ نصرت بالرعب مسيرة شهر

300. హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: “నాకు సంక్షిప్త పదాలతో విస్తృత భావం కలిగి వున్న ( ఖుర్ఆన్) వాణి ప్రసాదించబడింది. (నా గురించి విని శత్రువుల గుండెల్లో గుబులు పుట్టేలా) నాకు గాంభీర్యత నిచ్చి సహాయం చేయబడింది. ఓ రోజు నేను నిద్రపోతూంటే (కలలో) నా చేతికి ప్రపంచంలోని సిరిసంపదలు, నిక్షేపాలకు సంబంధించిన తాళపు చెవులు అందించబడ్డాయి”.

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) ఈ హదీసు ఉల్లేఖించిన తర్వాత “దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇహలోకం వీడిపోయిన తరువాత ఇప్పుడు మీరా సిరిసంపదలు, నిక్షేపాలు హస్తగతం చేసుకుంటున్నారు” అని అన్నారు.

[సహీహ్ బుఖారీ : 56వ ప్రకరణం – జిహాద్, 122వ అధ్యాయం – ఖౌలిన్నబియ్యి…. నుసిర్తు బిర్రూబి….]

301 – حديث أَنَسٍ قَالَ: قَدِمَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ الْمَدِينَةَ، فَنَزَلَ أَعْلَى الْمَدِينَةِ فِي حَيٍّ يُقَالُ لَهُمْ بَنُو عَمْرِو بْنِ عَوْفٍ، فَأَقَامَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فِيهِمْ أَرْبَعَ عَشْرَةَ لَيْلَةَ، ثُمَّ أَرْسَلَ [ص:105] إِلِى بَني النَّجَّارِ فَجَاءُوا مُتَقَلِّدِي السُّيُوفِ، فَكَأَنِّي أَنْظُرُ إِلَى النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ عَلَى رَاحِلَته، وَأَبُو بَكْرٍ رِدْفُهُ، وَمَلأُ بَنِي النَّجَّارِ حَوْلَهُ، حَتَّى أَلْقَى بِفِنَاءِ أَبِي أَيُّوبَ، وَكَانَ يُحِبُّ أَنْ يُصَلِّي حَيْثُ أَدْرَكَتْهُ الصَّلاَةُ، وَيُصَلِّي فِي مَرَابِضِ الْغَنَمِ، وَأَنَّهُ أَمَرَ بِبِنَاءِ الْمَسْجِدِ، فَأَرْسَلَ إِلَى مَلإٍ مِنْ بَنِي النَّجَّارِ، فَقَالَ: يَا بَنِي النَّجَّارِ ثَامِنُونِي بِحَائِطِكُمْ هذَا قَالُوا: لاَ وَاللهِ لاَ نَطْلُبُ ثَمَنَهُ إِلاَّ إِلَى الله
قَالَ أَنَسٌ: فَكَانَ فِيهِ مَا أَقُولُ لَكُمْ، قُبُورُ الْمُشْرِكِينَ، وَفِيهِ خَرِبٌ، وَفِيهِ نَخْلٌ؛ فَأَمَرَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ بِقُبُورِ الْمُشْرِكِينَ فَنُبِشَتْ، ثمَّ بِالْخَرِبِ فَسُوِّيَتْ، وَبِالنَّخْلِ فَقُطِعَ فَصَفُّوا النَّخْلَ قِبْلَةَ الْمَسْجِدِ، وَجَعَلوا عِضَادَتَيْهِ الْحِجَارَةَ، وَجَعَلُوا يَنْقُلُونَ الصَّخْرَ وَهُمْ يَرْتَجِزُونَ، وَالنَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ مَعَهُمْ وَهُوَ يَقُولُ:
اللهُمَّ لاَ خَيْرَ إِلاَّ خَيْرُ الآخِرَهْفَاغْفِرْ لِلأَنْصَارِ وَالْمُهَاجِرَهْ
__________
أخرجه البخاري في: 8 كتاب الصلاة: 48 باب هل تنبش قبور مشركي الجاهلية ويتخذ مكانها مساجد

301. హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మదీనా వచ్చిన తరువాత బనీ ఉమర్ బిన్ ఔఫ్ వాడలో విడిది చేశారు. అక్కడ పధ్నాలుగు రోజులు ఉన్నారు. తర్వాత ఆయన బనీనజ్జార్ తెగవాళ్ళను పిలిపించారు. వారు తమ ఖడ్గాలు ధరించి వచ్చారు.

ఆ దృశ్యం ఇప్పటికీ నా దృష్టి పథంలో మెదలుతోంది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒంటె ఎక్కి కూర్చున్నారు. హజ్రత్ అబూబకర్ (రదియల్లాహు అన్హు) ఆయన వెనుక కూర్చున్నారు. బనూ నజ్జార్ తెగనాయకులు ఆయన చుట్టూ నిలబడి ఉన్నారు. (ఈ విధంగా బయలుదేరి) చివరికి అబూ అయ్యూబ్ (రదియల్లాహు అన్హు) గారి ఇంటి ముందు దిగారు. ఎక్కడ నమాజు వేళయితే అక్కడే నమాజు చేయడమంటే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు ఎంతో ఇష్టం. ఆ రోజులలో ఆయన మేకల కొట్టంలో కూడా నమాజు చేసేవారు. ఆ తరువాత మస్జిదు నిర్మించడానికి పూనుకున్నారు. దీని కోసం ఆయన బనీనజ్జార్ తెగ మనుషులను పిలిపించి “బనీనజ్జార్ (సోదరులారా!) మీరీ తోటను నాకు అమ్మివేయండి” అని అన్నారు. దానికి వారు “అల్లాహ్ సాక్షి! మేమీ తోట ధరను మీ నుండి వసూలు చేయము. దీని ప్రతిఫలాన్ని మేము అల్లాహ్ నుండి తీసుకోదలిచాము” అని అన్నారు.

హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) ఇలా వివరిస్తున్నారు: ఆ తోటలో ఏమేమి ఉన్నాయో చెబుతాను వినండి. అక్కడ బహు దైవారాధకుల సమాధులు, కొన్ని శిథిలమయిపోయిన ఇండ్లు, కొన్ని ఖర్జూర చెట్లు ఉన్నాయి. అందువల్ల దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆదేశంతో ఆయన అనుచరులు ఆ సమాధుల్ని తొలగించి, శిథిల గృహాలను నేలమట్టం చేశారు. ఖర్జూర చెట్లను నరికి, వాటి మొదళ్ళను కాబా దిక్కున పేర్చి పెట్టారు. వాటి రెండు వైపులా రాళ్ళు నిలబెట్టి తలుపు మాదిరిగా చేశారు. అనుచరులు (రదియల్లాహు అన్హుమ్) రాళ్ళు మోస్తూ వుంటే, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కూడా వారితో పాటు ఆ పని చేస్తూ “అల్లాహ్! పరలోక శ్రేయస్సే నిజమైన శ్రేయస్సు. అందువల్ల (వలస వచ్చిన) ముహాజిర్లను, (వారిని ఆదుకున్న) అన్సారులను ఉభయుల్ని మన్నించు” అని కవితా రూపంలో ప్రార్థన చేసేవారు.

[సహీహ్ బుఖారీ : 8వ ప్రకరణం – సలాత్, 48వ అధ్యాయం – హల్ తంభిషు ఖుబూరు ముష్రికిల్ జాహిలియ్యతి వయత్తఖిజు మకానుహా మసాజిద్]

302 – حديث الْبَرَاءِ بْنِ عَازِبٍ رضي الله عنه، قَالَ: كَانَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ صَلَّى نَحْوَ بَيْتِ الْمَقْدِسِ سِتَّةَ عَشَرَ أَوْ سَبْعَةَ عَشَرَ شَهْرًا، وَكَانَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يُحِبُّ أَنَّ يُوَجَّهَ إِلَى الْكَعْبَةِ، فَأنْزَلَ اللهُ (قَدْ نَرَى تَقَلُّبَ وَجْهِكَ فِي السَّمَاءِ) فتَوَجَّهَ نَحْوَ الْكَعْبَةِ وَقَالَ السُّفَهَاءُ مِنَ النَّاسِ، وَهُمُ الْيَهُودُ مَا وَلاَّهُمْ عَنْ قِبْلَتِهِمُ الَّتِي كَانُوا عَلَيْهَا قُلْ للهِ الْمَشْرِقُ وَالْمَغْرِبُ يَهْدِي مَنْ يَشَاءُ إِلَى صِرَاطٍ مُسْتَقِيمٍ فَصَلَّى مَعَ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ رَجُلٌ ثُمَّ خَرَجَ بَعْدَ مَا صَلَّى، فَمَرَّ عَلَى قَوْمٍ منَ الأَنْصَارِ فِي صَلاَةِ الْعَصْرِ يُصَلُّونَ نَحْوَ بَيْتِ الْمَقْدِسِ، فَقَالَ هُوَ يَشْهَدُ أَنَّهُ صَلَّى مَعَ رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ وَأَنَّهُ تَوَجَّهَ نَحْوَ الْكَعْبَةِ؛ فَتَحَرَّفَ الْقَوْمُ حَتَّى تَوجَّهُوا نَحْوَ الْكَعْبَةِ
[ص:106] أخرجه البخاري في: 8 كتاب الصلاة: 31 باب التوجه نحو القبلة حيث كان

302. హజ్రత్ బరాబిన్ ఆజిబ్ (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) (మదీనా వచ్చిన తరువాత) పదహారు, పది హేడు మాసాల వరకు బైతుల్ మఖ్ దిస్ వైపు తిరిగి నమాజు చేశారు. అయితే కాబా గృహం వైపు తిరిగి నమాజు చేయాలని ఆయన మనసు ఆరాటపడసాగింది. దాంతో అల్లాహ్ “నీ ముఖాన్ని మాటి మాటికీ ఆకాశం వైపు ఎత్తడాన్ని మేము చూస్తున్నాము……” అనే సూక్తిని అవతరింపజేశాడు. ఈ సూక్తి అవతరించిన తరువాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కాబా వైపు తిరిగి నమాజు చేయడం ప్రారంభించారు. బుద్దిహీనులు, అంటే యూదులు (ఈ మార్పు పట్ల విస్తుబోయి) “ఏమయింది వీరికి, నిన్నటిదాకా ఒక దిక్కుకు తిరిగి ప్రార్థన చేస్తూ ఉండిన వీరు ఈ రోజు హఠాత్తుగా మరో దిక్కుకు మరలారు?” అని అన్నారు. ప్రవక్తా! వారికిలా చెప్పు – “తూర్పు పడమరలు అన్నీ అల్లాహ్ దిక్కులే. ఆయన తాను తలచిన వారికి సన్మార్గం చూపుతాడు.” (దివ్యఖుర్ఆన్ – 2:142) ఈ ఆజ్ఞ వచ్చిన తరువాత ఒక వ్యక్తి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)తో పాటు (జుహర్) నమాజు చేసిన తరువాత ఎక్కడికో బయలుదేరాడు. అస్ర్ నమాజ్ వేళకు అతను అన్సార్ తెగ వాడ మీదుగా ముందుకు సాగాడు. అయితే అక్కడ (అన్సార్) ప్రజలు బైతుల్ మఖ్ దిస్ వైపు తిరిగి నమాజు చేస్తూ ఉండటం చూసి “నేను (ఇంతకు క్రితమే) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)తో కలసి నమాజు చేశానని సాక్ష్యమిస్తున్నాను. అప్పుడాయన తన దిశను కాబా వైపుకు మరల్చుకున్నారు” అని బిగ్గరగా చెప్పాడు. ఈ మాట వినగానే అందరూ తమ దిశను కాబా వైపుకు మరల్చుకున్నారు.

[సహీహ్ బుఖారీ : 8వ ప్రకరణం – సలాత్, 31వ అధ్యాయం – అత్తవజ్జుహి నహ్ వల్ ఖిబ్లతి హైసుకాన]

303 – حديث الْبَرَاءِ رضي الله عنه، قَالَ: صَلَّيْنَا مَعَ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ نَحْوَ بَيْتِ الْمَقْدِسِ سِتَّةَ عَشَرَ أَوْ سَبْعَةَ عَشَرَ شَهْرًا، ثُمَّ صُرِفُوا نَحْوَ الْقِبْلَةِ
__________
أخرجه البخاري في: 65 كتاب التفسير: 2 سورة البقرة: 18 باب ولكل وجهة هو موليها

303. హజ్రత్ బరా (రదియల్లాహు అన్హు) కథనం:- మేము దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వెనుక పదహారు, పదిహేడు మాసాల వరకు బైతుల్ మఖ్ దిస్ వైపు తిరిగి నమాజు చేశాము. ఆ తరువాత ప్రస్తుత ఖిబ్లా (కాబా) వైపుకు తిరిగి నమాజు చేయాలని ఆజ్ఞ అయింది.

[సహీహ్ బుఖారీ : 65వ ప్రకరణం – అత్తఫ్సీర్, బఖరా సూరా, 18వ అధ్యాయం – వలికుల్లి వ్విజ్ హతున్ హువ మువల్లీహా)

304 – حديث عَبْدِ اللهِ بْنِ عُمَرَ، قَالَ: بَيْنَا النَّاسُ بِقبَاءٍ فِي صَلاَةِ الصُّبْحِ إِذْ جَاءَهُمْ آتٍ؛ فَقَالَ: إِنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَد أُنْزِلَ عَلَيْهِ اللَّيْلَةَ قُرْآنٌ، وَقَدْ أُمِرَ أَنْ يَسْتَقْبِلَ الْكَعْبَةَ، فَاسْتَقْبِلُوهَا وَكَانَتْ وُجُوهُهُمْ إِلَى الشَّامِ، فَاسْتَدَارُوا إِلَى الْكَعْبَةِ
__________
أخرجه البخاري في: 8 كتاب الصلاة: 32 باب ما جاء في القبلة

304. హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం :- ప్రజలు ఓ రోజు ఖుబా మస్జిదులో ప్రాతఃకాల ప్రార్థన చేస్తూ ఉంటే ఒక వ్యక్తి వచ్చి “రాత్రి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పై ఓ ఖుర్ఆన్ సూక్తి అవతరించింది. అందులో మన ప్రార్థన దిశను కాబా వైపుకు మార్చుకోవాలని ఆజ్ఞ జారీ అయ్యింది” అని తెలియజేశాడు. ఈ మాట వినగానే వారంతా తమ ప్రార్ధనా దిశను ‘కాబా’ వైపుకు మార్చుకున్నారు. అంతకు ముందు వారు సిరియా (బైతుల్ మఖ్ దిస్) వైపు తిరిగి నమాజు చేస్తూ ఉన్నారు. ఈ ఆజ్ఞ వినగానే అందరూ (నమాజు స్థితిలోనే) తమ దిశను కాబా వైపుకు మరల్చుకున్నారు.

[సహీహ్ బుఖారీ : 8వ ప్రకరణం – సలాత్, 32వ అధ్యాయం – మాజా ఫిల్ ఖిబ్లా ]

305 – حديث عَائِشَةَ، أَنَّ أُمَّ حَبِيبَة وَأُمَّ سَلَمَةَ ذكَرَتَا كَنِيسَةً رَأَتَاهَا بِالْحَبَشَةِ، فِيهَا تَصَاوِيرُ، فَذَكَرَتَا ذلِكَ لِلنَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَقَالَ: إِنَّ أُولئِكَ إِذَا كَانَ فِيهِمُ الرَّجُلُ الصَّالِحُ فَمَاتَ، بَنَوْا عَلَى قَبْرِهِ مَسْجِدًا، وَصَوَّرُوا فِيهِ تِلْكَ الصُّوَرَ، فَأُولئِكَ شِرَارُ الْخَلْقِ عِنْدَ اللهِ يَوْمَ الْقِيَامَةِ
[ص:107] أخرجه البخاري في: 8 كتاب الصلاة: 48 باب هل تنبش قبور مشركي الجاهلية ويتخذ مكانها مساجد

305. విశ్వాసుల మాతృమూర్తి హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం:- విశ్వాసుల మాతృమూర్తులు హజ్రత్ ఉమ్మె హబీబా (రదియల్లాహు అన్హా), హజ్రత్ ఉమ్మె సల్మా (రదియల్లాహు అన్హా)లు అబిసీనియాలోని ఒక చర్చీలో కొన్ని విగ్రహాలు ఉండటం చూసి వాటిని గురించి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ముందు ప్రస్తావించారు. దాని పై దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా వ్యాఖ్యానించారు: “వారిలో (అంటే యూదులు, క్రైస్తవులలో) ఎవరైనా సత్పురుషుడు చనిపోతే అతని సమాధిపై వారు ప్రార్థనా మందిరాన్ని నిర్మిస్తారు. ఆ ప్రార్థనా మందిరంలో ఇలాంటి విగ్రహాలు తయారు చేసి ప్రతిష్ఠిస్తారు. వారిలో ఇదొక సంప్రదాయ మయిపోయింది. అయితే వారు ప్రళయ దినాన అల్లాహ్ దగ్గర యావత్తు సృష్టిలో అత్యంత నీచమైన వాళ్ళుగా పరిగణించబడతారు.”

[సహీహ్ బుఖారీ: 8వ ప్రకరణం – సలాత్, 48వ అధ్యాయం – హల్ తుం బషు ఖుబూరు ముష్రికిల్ జాహిలియ్య]

306 – حديث عَائِشَةَ، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ فِي مَرضِهِ الَّذِي مَاتَ فِيهِ: لَعَنَ اللهُ الْيَهُودَ وَالنَّصَارَى، اتَّخَذوا قُبُورَ أَنْبِيَائِهِمْ مَسَاجِدَ
قَالَتْ: وَلَوْلاَ ذلِكَ لأبْرَزُوا قَبْرَهُ، غَيْرَ أَنِّي أَخْشى أَنْ يُتَّخَذَ مِسْجِدًا
__________
أخرجه البخاري في: 23 كتاب الجنائز: 62 باب ما يكره من اتخاذ المساجد على القبور

306. హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తమ మరణానికి కారణమయిన వ్యాధికి గురయిన రోజుల్లో “యూదులు క్రైస్తవులు తమ ప్రవక్తల సమాధుల్ని ప్రార్థనా స్థలాలుగా చేసుకున్నారు. అల్లాహ్ వారిని శపించుగాక” అని అన్నారు.

ఈ హదీసు తెల్సిన తరువాత హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) దానిపై ఇలా వ్యాఖ్యానించారు: “దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించి ఉండకపోతే ఆయన సమాధి (ప్రజల దర్శనార్థం ఎలాంటి కట్టడి లేకుండా) తెరిచి ఉంచబడేది. అంతేకాదు అది (కొంతకాలానికి) ప్రార్థనాస్థలంగా కూడ మారిపోవచ్చని నా భయం “.

[సహీహ్ బుఖారీ : 23వ ప్రకరణం – జనాయెజ్, 62వ అధ్యాయం – మా యుక్రహు మిన్ ఇత్తి ఖాజి మసాజిద్ అలల్ ఖుబూర్)

307 – حديث أَبِي هُرَيْرَةَ، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: قَاتَلَ اللهُ الْيَهُودَ، اتَّخَذُوا قُبُورَ أَنْبِيَائِهِمْ مَسَاجِدَ
__________
أخرجه البخاري في: 8 كتاب الصلاة: 55 باب حدثنا أبو اليمان

307. హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: “యూదులు, క్రైస్తవులు తమ ప్రవక్తల సమాధుల్ని ప్రార్థనా స్థలాలుగా చేసుకున్నారు. అల్లాహ్ వారిని నాశనం చేయుగాక!”

[సహీహ్ బుఖారీ : 8వ ప్రకరణం – సలాత్, 55వ అధ్యాయం – హద్ధసనా అబూ యమాన్]

308 – حديث عَائِشَةَ وَعَبْدِ اللهِ بْنِ عَبَّاسٍ، قَالاَ: لَمَّا نَزَلَ برَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، طَفِقَ يَطْرَحُ خَمِيصَةَ لَهُ عَلَى وَجْهِهِ، فَإِذَا اغْتَمَّ بهَا كَشَفَهَا عَنْ وَجْهِهِ، فَقَالَ، وَهُوَ كَذلِكَ: لَعْنَةُ اللهِ عَلَى الْيَهُودِ وَالنَّصَارَى، اتَّخَذُوا قُبُورَ أَنْبِيائِهِمْ مَسَاجِدَ يُحَذِّرُ مَا صَنَعُوا
__________
أخرجه البخاري في: 8 كتاب الصلاة: 55 باب حدثنا أبُو اليمان

308. హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా), హజ్రత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు)ల కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు మరణ సమయం ఆసన్నమయినపుడు ఆయన పరిస్థితి చాలా దుర్భరంగా మారిపోయింది. ఒక్కోసారి ఆయన తన దుప్పటిని ముఖం మీదికి లాగుకునేవారు. కాస్సేపటికి ఊపిరి ఆడకపోవడంతో ముఖం మీది దుప్పటిని తొలగించి వేసేవారు. అలాంటి స్థితిలో సయితం ఆయన (సమాధి పూజలను శపిస్తూ) “యూదులు, క్రైస్తవులు తమ ప్రవక్తల సమాధుల్ని ప్రార్థనా స్థలాలుగా చేసుకున్నారు. అల్లాహ్ వారిని శపించుగాక!” అని అన్నారు. ఈ విధంగా ప్రవచించి ఆయన ముస్లింలను ఇలాంటి చర్యలకు పాల్పడకూడదని పరోక్షంగా హెచ్చరించారు.

[సహీహ్ బుఖారీ : 8వ ప్రకరణం -సలాత్, 55వ అధ్యాయం – హద్దసనా అబూయమాన్]

309 – حديث عُثْمَانَ بْنِ عَفَّان عَنْ عُبَيْدِ اللهِ الْخَوْلاَنِيِّ، أَنَّهُ سَمِعَ عُثْمَانَ بْنَ عَفَّانَ يَقُولُ، عِنْدَ قَوْلِ النَّاسِ فِيهِ، حِينَ بَنَى مَسْجِدَ الرَّسُولِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: إِنَّكُمْ أَكْثَرْتُمْ، وَإِنِّي سَمِعْتُ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ: مَنْ بَنَى مَسْجدًا يَبْتَغِي بِهِ وَجْهَ اللهِ بَنَى اللهُ لَهُ مِثْلَهُ فِي الْجَنَّةِ
__________
أخرجه البخاري في: 8 كتاب الصلاة: 65 باب من بنى مسجدًا

309. హజ్రత్ ఉబైదుల్లా ఖూలానీ (రహిమహుల్లాహ్) కథనం:- హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) మస్జిదె నబవి (ప్రవక్త మస్జిదు)ని పునర్నిర్మించినపుడు ప్రజలు ఆయన్ని ఏవేవో మాటలు అన్నారు. హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) ఆ మాటలు విని ఇలా అన్నారు. “మీరు లేనిపోని మాటలు అంటున్నారు గాని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఏమన్నారో తెలుసా? ‘ కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసం ఎవరైనా మస్జిదు నిర్మిస్తే అతని కోసం అల్లాహ్ అలాంటిదే ఒక ఇల్లు స్వర్గంలో నిర్మిస్తాడు’ అని అన్నారాయన.”

[సహీహ్ బుఖారీ : 8వ ప్రకరణం – సలాత్, 65వ అధ్యాయం – మన్ బనా మస్జిద్]

310 – حديث سَعْدِ بْنِ أَبِي وَقَّاصٍ قَالَ مُصْعَبُ ابْنُ سَعْدٍ: صَلَيْتُ إِلَى جَنْبِ أَبِي فَطَبَّقْتُ بَيْنَ كَفَّيَّ، ثُمَّ وَضَعْتُهُمَا بَيْنَ فَخِذَيَّ، فَنَهَانِي أَبِي، وَقَالَ: كُنَّا نَفْعَلُهُ؛ فَنُهِينَا عَنْهُ، وَأُمِرْنَا أَنْ نَضَعَ أَيْدِينَا عَلَى الرُّكَبِ
__________
أخرجه البخاري في: 10 كتاب الأذان: 118 باب وضع الأكف على الركب في الركوع

310. హజ్రత్ సాద్ బిన్ అబీవఖ్కాస్ (రదియల్లాహు అన్హు) కుమారుడు హజ్రత్ ముసైబ్ (రహిమహుల్లాహ్) కథనం:- నేను మా తండ్రిగారి ప్రక్కన నిల్చుని నమాజు చేశాను. అప్పుడు నేను రుకూ స్థితిలో నా రెండు చేతుల్ని కలిపి తొడల మధ్య పెట్టుకున్నాను. మా నాన్నగారు అది చూసి నన్ను వారిస్తూ “ప్రారంభంలో మేము ఇలాగే చేస్తుండేవాళ్ళము. అయితే ఆ తరువాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మమ్మల్ని అలా చేయకూడదని వారించి రెండు చేతుల్ని (విడిగా) మోకాలి చిప్పలపై పెట్టుకోవాలని ఆదేశించారు” అని అన్నారు.*

[సహీహ్ బుఖారీ : 10వ ప్రకరణం – అజాన్, 118వ అధ్యాయం – వజ్ అల్ అకిఫ్ఫి అలర్రుకబ ఫిర్రుకూ)

* రెండు చేతుల్ని కలిపి తొడల మధ్య పెట్టుకునే ఈ ఆదేశం ఆ తర్వాత రద్దయిపోయి, చేతుల్ని మోకాలి చిప్పలపై పెట్టుకోవాలన్న ఆజ్ఞ వచ్చింది.

311 – حديث عَبْدِ اللهِ بْنِ مَسْعُودٍ رضي الله عنه، قَالَ: كُنَّا نُسَلِّمُ عَلَى النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ وَهُوَ فِي الصَّلاَةِ فَيَرُدُّ عَلَيْنَا، فَلَمَّا رَجَعْنَا مِنْ عِنْدِ النَّجَاشِيِّ سَلَّمْنَا عَلَيْهِ فَلَمْ يَرُدَّ عَلَيْنَا، وَقَالَ: إِنَّ فِي الصَّلاَةِ شُغْلاً
__________
أخرجه البخاري في: 21 كتاب العمل في الصلاة: 2 باب ما ينهى من الكلام في الصلاة

311. హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ వూద్ (రదియల్లాహు అన్హు) కథనం:- మొదట్లో మేము దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నమాజు చేస్తుంటే ఆయనకు సలాం చేసే వాళ్ళము. నమాజు స్థితిలోనే ఆయన మాకు ప్రతి సలామ్ పలికేవారు. అయితే మేము (అబిసీనియా రాజు) నజాషీ దగ్గర నుండి (వలసవెళ్ళి) తిరిగి వచ్చిన తరువాత మేము దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు (నమాజు స్థితిలో) సలాం చేస్తే, ఆయన మాకు సమాధానమివ్వలేదు. (నమాజు ముగిసిన తరువాత) “నమాజు చేస్తున్నప్పుడు మనిషికి ఏకాగ్రత చాలా అవసరం” అని అన్నారు.

(సహీహ్ బుఖారీ – 21వ ప్రకరణం, అల్ అమలు ఫిస్సలాత్, 2వ అధ్యాయం – మాయున్హా మినల్ కలామి ఫిస్సలాత్)

312 – حديث زَيْدِ بْنِ أَرْقَمَ، قَالَ: كُنَّا نَتَكَلَّمُ فِي الصَّلاَةِ، يُكَلِّمُ أَحَدُنَا أَخَاهُ فِي حَاجَتِهِ، حَتَّى نَزَلَتْ هذِهِ الآيَةُ (حَافِظُوا عَلَى الصَّلَوَاتِ وَالصَّلاَةِ الْوُسْطَى وَقُومُوا للهِ قَانِتِينَ) فَأُمِرْنَا بِالسُّكُوتِ
__________
أخرجه البخاري في: 65 كتاب التفسير: 2 سورة البقرة: 43 باب وقوموا لله قانتين أي مطيعين

312. హజ్రత్ జైద్ బిన్ అర్ఖమ్ (రదియల్లాహు అన్హు) కథనం:- ప్రారంభంలో మేము నమాజు స్థితిలో మాట్లాడే వాళ్ళము. మాలో ఎవరైనా తన ప్రక్క వాడితో పని బడితే అతను తన ప్రక్క నుండే మిత్రునితో మాట్లాడేవాడు. కొంత కాలానికి “మీరు ప్రార్థన (నమాజు) లన్నిటినీ, ముఖ్యంగా ‘మధ్యస్థ’ ప్రార్ధనను క్రమం తప్పకుండా నిర్వహిస్తూ జాగ్రత్తగా కాపాడుకోండి. అల్లాహ్ సన్నిధిలో వినయ విధేయతలతో నిలబడండి” అన్న ఖుర్ఆన్ సూక్తి అవతరించింది. దాంతో మేము (నమాజు స్థితిలో) ఇతరులతో మాట్లాడకుండా మౌనంగా ఉండాలని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆజ్ఞాపించారు.

[సహీహ్ బుఖారీ : 65వ ప్రకరణం – అత్తఫ్సీర్, బఖరా సూరా 43వ అధ్యాయం – వఖూ మ వల్లాహి ఖానితీన్]

313 – حديث جَابِرِ بْنِ عَبْدِ اللهِ، قَالَ: بَعَثَنِي رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فِي حَاجَةٍ لَهُ، فَانْطَلَقْتُ، ثُمَّ رَجَعْتُ وَقَدْ قَضَيْتُهَا، فَأَتَيْتُ النَّبيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فَسَلَّمْتُ عَلَيْهِ، فَلَمْ يَرُدَّ عَلَيَّ، فَوَقَعَ فِي قَلْبِي مَا اللهُ أَعْلَمُ بِهِ، فَقُلْتُ فِي نَفْسِي لَعَلَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ وَجَدَ عَلَيَّ أَنِّي أَبْطَأْتُ عَلَيْهِ، ثُمَّ سَلَّمْتُ عَلَيْهِ فَلَمْ يَرُدَّ عَلَيَّ فَوَقَعَ فِي قَلْبِي أَشَدُّ مِنَ الْمَرَّةِ الأُولَى؛ ثُمَّ سَلَّمْتُ عَلَيْهِ [ص:109] فَرَدَّ عَلَيَّ، وَقَالَ: إِنَّمَا مَنَعَنِي أَنْ أَرُدَّ عَلَيْكَ أَنِّي كُنْتُ أُصَلِّي وَكَانَ عَلَى رَاحِلَتِهِ مُتَوَجِّهًا إِلَى غَيْرِ الْقِبْلَةِ
__________
أخرجه البخاري في: 21 كتاب العمل في الصلاة: 15 باب لا يردّ السلام في الصلاة

313. హజ్రత్ జాబిర్ బిన్ అబ్దుల్లా (రదియల్లాహు అన్హు) కథనం:- ఓ సారి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నన్ను ఒక పని మీద (ఒక చోటికి ) పంపించారు. నేనా పని ముగించి ఆయన సన్నిధికి తిరిగొచ్చి సలాం చేసాను. కాని ఆయన నా సలాంకు సమాధానమివ్వలేదు. దాంతో నేను ఎంతో బాధపడ్డాను. నా బాధ అల్లాహ్ తప్ప మరెవరూ గ్రహించలేరు. నేను తిరిగి రావడం ఆలస్యమయిందని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు నా మీద కోపం వచ్చి ఉంటుందని నేను మనసులో అనుకున్నాను. నేను మరోసారి సలాం చేశాను. దానికి ఆయన సమాధానమివ్వలేదు. అప్పుడు నేను మరింత బాధపడ్డాను. నేను తిరిగి మూడోసారి సలాం చేశాను. అప్పుడు ఆయన నా సలాంకు సమాధానమిస్తూ “నేను నమాజు చేస్తూ ఉండటం వల్ల నీ సలాంకు సమాధానం ఇవ్వలేకపోయాను. అంతేగాని మరేం లేదు” అని అన్నారు. ఆ సమయంలో ఆయన ఒంటె ఎక్కి ఉన్నారు. అయితే ఆయన ఖిబ్లా వైపు తిరిగి వుండలేదు.

[సహీహ్ బుఖారీ : 21వ ప్రకరణం -అల్ అమలు ఫిస్సలాత్, 15వ అధ్యాయం – లాయరుద్దు స్సలాము ఫిస్సలాత్)

314 – حديث أَبِي هُرَيْرَةَ، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: إِنَّ عِفْرِيتًا مِنَ الْجِنِّ تَفَلَّتَ عَلَيَّ الْبَارِحَةَ لِيَقْطَعَ عَلَيَّ الصَّلاَةَ، فَأَمْكَنَنِي اللهُ مِنْهُ، فَأَرَدْتُ أَنْ أَرْبِطَهُ إِلَى سَارِيَةٍ مِنْ سَوَارِي الْمَسْجِدِ حَتَّى تُصْبِحُوا وَتَنْظُرُوا إِلَيْهِ كُلُّكُمْ، فَذَكَرْتُ قَوْلَ أَخِي سُلَيْمَانَ (رَبِّ هَبْ لِي مُلْكًا لاَ يَنْبَغِي لأَحدٍ مِنْ بَعْدِي) فَرَدَّهُ خَاسِئًا
__________
أخرجه البخاري في: 8 كتاب الصلاة: 75 باب الأسير أو الغريم يربط في المسجد

314. హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలిపారు:- “గత రాత్రి ఒక దుష్ట పొగరుబోతు జిన్ (భూతం) నమాజు నుండి నా దృష్టి మరల్చడానికి హఠాత్తుగా నా మీదికి దాడికొచ్చాడు. దాంతో నేను మధ్యలోనే నమాజు విరమించవలసి వచ్చింది. అయితే అల్లాహ్ నాకు వాడ్ని ఎదుర్కునే శక్తి ప్రసాదించాడు. మొదట్లో నేను వాడ్ని మస్జిద్ లో ఒక స్తంభానికి కట్టివేసి ఉదయం మీకందరికీ చూపిద్దామని అనుకున్నాను. కానీ అంతలో నా సోదరుడు సులైమాన్ (అలైహిస్సలాం) చేసిన ప్రార్థన గుర్తుకొచ్చింది. “ప్రభూ! నన్ను క్షమించు, నా తరువాత మరెవరికీ శోభించనటువంటి అద్భుత సామ్రాజ్యాన్ని నాకు ప్రసాదించు” అని ఆయన అల్లాహ్ ను వేడుకున్నారు. అందువల్ల నేను పరాభవం పాలైన అతన్ని తిరిగి వెళ్ళేందుకు అనుమతించాను.”

[సహీహ్ బుఖారీ: 8వ ప్రకరణం – సలాత్, 75వ అధ్యాయం – అల్ అసీరి వల్ గరీమి యుర్బితు ఫిల్ మస్జిద్)

315 – حديث أَبِي قَتَادَةَ الأَنْصَارِيِّ، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ كَانَ يُصَلِّي وَهُوَ حَامِلٌ أُمَامَةَ بِنْتَ زَيْنَبَ بِنْتِ رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، وَلأَبِي الْعَاصِ بْنِ رَبِيعَةَ بْنِ عَبْدِ شَمْسٍ، فَإِذَا سَجَدَ وَضَعَهَا، وَإِذَا قَامَ حَمَلَهَا
__________
أخرجه البخاري في: 8 كتاب الصلاة: 106 باب إذا حمل جارية صغيرة على عنقه في الصلاة

315. హజ్రత్ అబూ ఖతాదా అన్సారీ (రదియల్లాహు అన్హు) కథనం:- ఓసారి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తమ మనుమరాలు ఉమామాని ఒళ్ళో తీసుకుని నమాజు చేయసాగారు. ఆ పాప దైవప్రవక్త కుమార్తె హజ్రత్ జైనబ్, అబుల్ ఆస్ ల కూతురు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సజ్దా స్థితిలోనికి పోయేటపుడు ఆ పాపను ఒళ్ళో నుండి తీసి ప్రక్కన వదలి పెట్టేవారు. సజ్దా నుంచి లేచి నిలబడేటప్పుడు మరల ఆమెను ఎత్తుకునేవారు.

[సహీహ్ బుఖారీ : 8వ ప్రకరణం – సలాత్, 106వ అధ్యాయం – ఇజా హమల జారియతన్ సగీరతన్ అలా అన్ ఖహూ ఫిస్సలాత్)

316 – حديث سَهْلِ بْنِ سَعْدٍ السَّاعِدِيِّ، قَالَ أَبُو حَازِمِ بْنِ دِينَارٍ: إِنَّ رِجَالاً أَتَوْا سَهْلَ بْنَ سَعْدٍ السَّاعِدِيَّ، وَقَدِ امْتَرَوْا فِي الْمِنْبَرِ، مِمَّ عُودُهُ، فَسَأَلُوهُ عَنْ ذلِكَ، فَقَالَ: [ص:110] وَاللهِ إِنِّي لأَعْرِفُ مِمَّا هُوَ، وَلَقَدْ رَأَيْتُهُ أَوَّلَ يَوْمٍ وُضِعَ، وأَوَّلَ يَوْمٍ جَلَسَ عَلَيْهِ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ أَرْسَلَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ إِلَى فُلاَنَةَ (امْرأَةٍ قَدْ سَمَّاهَا سَهْلٌ) : مُرِي غُلاَمَكِ النَّجَّارَ أَنْ يَعْمَلَ لِي أَعْوَادًا أَجْلِسُ عَلَيْهِنَّ إِذَا كَلَّمْتُ النَّاسَ فَأَمَرَتْهُ فَعَمِلَهَا مِنْ طَرْفَاء الْغَابَةِ، ثُمَّ جَاءَ بِهَا، فَأَرْسَلَتْ إِلَى رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فَأَمَرَ بِهَا فَوُضِعَتْ ههُنَا ثُمَّ رَأَيْتُ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ صَلَّى عَلَيْهَا، وَكَبَّرَ وَهُوَ عَلَيْهَا، ثُمَّ رَكَع وَهُوَ عَلَيْهَا، ثُمَّ نَزَلَ الْقَهْقَرَى، فَسَجَدَ فِي أَصْلِ الْمِنْبَرِ، ثُمَّ عَادَ، فَلَمَّا فَرَغَ أَقْبَلَ عَلَى النَّاسِ، فَقَالَ: أَيُّهَا النَّاسُ إِنَّمَا صَنَعْتُ هذَا لِتَأْتَمُّوا وَلِتُعلَّمُوا صَلاَتِي
__________
أخرجه البخاري في: 11 كتاب الجمعة: 26 باب الخطبة على المنبر

316. హజ్రత్ అబూహాజిమ్ బిన్ దీనార్ (రహిమహుల్లాహ్) కథనం:- కొందరు వ్యక్తులు (ప్రవక్త మస్జిదులోని) ప్రసంగ వేదిక ఏ కలపతో తయారు చేయబడిందన్న విషయం గురించి పరస్పరం వాదించుకొని పరిష్కారం కోసం హజ్రత్ సహెల్ బిన్ సాద్ సాది (రదియల్లాహు అన్హు) దగ్గరకు వచ్చారు. హజ్రత్ సాద్ (రదియల్లాహు అన్హు) విషయం విన్న తరువాత ఇలా అన్నారు :

“అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను. అది ఏ కలపతో నిర్మించబడిందో, దాన్ని ఎవరు నిర్మించారో నాకు బాగా తెలుసు. నేను దాన్ని (మస్జిదులో) మొదటిసారి ప్రతిష్ఠించిన దగ్గర్నుంచి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తొలిసారిగా దాని మీద ఎక్కిన దగ్గర్నుంచి ఎరుగుదును. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఫలానా స్త్రీకి (ఆ స్త్రీ పేరేమిటో హదీసు ఉల్లేఖించిన వారు మరిచిపోయారు) కబురు చేసి ‘ప్రజలకు బోధ చేసేటపుడు నేను కూర్చోవడానికి వీలుగా చెక్కలతో ఏదైనా వేదిక తయారు చేయమని నీ వడ్రంగి బానిసకు చెప్పు’ అని అన్నారు. ఆ స్త్రీ అలాగే తన బానిసను ఆదేశించింది. ఆ బానిస ‘గాబా’ ప్రాంతంలో ఉండే ఒక విధమైన వెదురు కర్రలతో వేదిక తయారు చేసి తెచ్చాడు. దాన్ని ఆ స్త్రీ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు పంపింది. ఆయన ఆజ్ఞతో ఆ వేదిక అక్కడ ఉంచారు.

ఆ తరువాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దానిపై నిలబడి నమాజు చేయించడం నేను చూశాను. ఆయన దాని మీద నిలబడి అల్లాహు అక్బర్ అని తక్బీరు పలికారు. దాని మీద నిలబడే రుకూ కూడ చేశారు. అయితే ఆ తరువాత వెనక్కి దిగి వచ్చి (వేదిక ప్రక్కన) నేలమీద సజ్దా చేశారు. ఆ తరువాత మళ్ళీ వేదిక మీదికి వెళ్ళి నిల్చున్నారు. ఈ విధంగా నమాజు చేసిన తరువాత ప్రజల వైపు తిరిగి “ప్రజలారా! మీరు నన్ను అనుసరించడానికి, నేను చేసినట్లు నమాజు చేయడానికే నేనిలా చేశాను” అని అన్నారు.

[సహీహ్ బుఖారీ : 11వ ప్రకరణం – అల్ జుమా, 26వ అధ్యాయం – అల్ ఖుత్బతి అలల్ మింబర్)

317 – حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، قَالَ: نُهِيَ أَنْ يُصَلِّيَ الرَّجُلُ مُخْتَصِرًا
__________
أخرجه البخاري في: 21 كتاب العمل في الصلاة: 17 باب الخصر في الصلاة

317. హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం:- నడుం మీద చేతులు పెట్టుకొని నమాజు చేయకూడదని వారించడం జరిగింది.

[సహీహ్ బుఖారీ : 21వ ప్రకరణం – అమలు ఫిస్సలాత్, 17వ అధ్యాయం – అల్ ఖుస్రి ఫిస్సలాత్)

318 – حديث مُعَيْقيبٍ، أَنَّ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: فِي الرَّجُلِ يُسَوِّي التُّرَابَ حَيْثُ يَسْجُدُ، قَالَ: إِنْ كُنْتَ فَاعِلاً فَوَاحِدَةً
__________
أخرجه البخاري في: 21 كتاب العمل في الصلاة: 8 باب مسح الحصا في الصلاة

318. హజ్రత్ ముఅయ్ ఖీబ్ (రదియల్లాహు అన్హు) కథనం:- సజ్దా స్థలం నుంచి మన్ను (దుమ్ము) తొలగించి శుభ్రపరుచుకునే విషయం గురించి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రస్తావిస్తూ “ఎవరైనా తప్పకుండా ఇలా చేయదలచుకుంటే ఒకసారి మాత్రమే చేయవచ్చు” అని అన్నారు.

[సహీహ్ బుఖారీ : 21వ ప్రకరణం – అమలు ఫిస్సలాత్, 8వ అధ్యాయం – మస్ హిల్ హిసా ఫిస్సలాత్)

319 – حديث عَبْدِ اللهِ بْنِ عُمَرَ، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ رَأَى بُصَاقًا فِي جِدَارَ الْقِبْلَةِ فَحَكَّهُ، ثُمَّ أَقْبَلَ عَلَى النَّاسِ، فَقَالَ: إِذَا كَانَ أَحَدُكُمْ يُصَلِّي فَلاَ يَبْصُقْ قِبَلَ وَجْههِ، فَإِنَّ اللهَ قِبَلَ وَجْهِهِ إِذَا صَلَّى
__________
أخرجه البخاري في: 8 كتاب الصلاة: 33 باب حكّ البزاق باليد من المسجد

319. హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఓ రోజు మస్జిదులోని ఖిబ్లా వైపు గోడపై ఎవరో ఉమ్మి వేయడం చూసి దాన్ని తొలగించారు. ఆ తరువాత మనిషి నమాజు చేస్తున్నప్పుడు అల్లాహ్ అతనికి అభిముఖంగా ముందు వైపు ఉంటాడు. అందువల్ల నమాజు చేస్తున్నప్పుడు ఎవరూ ముందు వైపు ఉమ్మి వేయకూడదు అని అన్నారు.

(సహీహ్ బుఖారీ : 8వ ప్రకరణం – సలాత్, 33వ అధ్యాయం – హక్కిల్ బుజాఖి బిల్ యది మినల్ మస్జిద్)

320 – حديث أَبِي سَعِيدٍ، أَنَّ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ أَبْصَرَ نُخَامَةً فِي قِبْلَةِ الْمَسْجِدِ فَحَكَّهَا بِحَصَاةٍ، ثُمَّ نَهى أَنْ يَبْزُقَ الرَّجُلُ بَيْنَ يَدَيْهِ، أَوْ عَنْ يَمِينِهِ، وَلكِنْ عَنْ يَسَارِهِ، أَوْ تَحْتَ قَدَمِهِ الْيُسْرَى
__________
أخرجه البخاري في: 8 كتاب الصلاة: 36 باب ليبزق عن يساره أو تحت قدمه اليسرى

320. హజ్రత్ అబూ సయీద్ ఖుదరీ (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఓ రోజు మస్జిదులోని ఖిబ్లా వైపు గోడమీద (ఎవరో ఉమ్మి లేక చీదివేసిన) కఫం పడి వుండటం చూసి ఒక రాయితో గీకి శుభ్రపరిచారు. ఆ తర్వాత ఆయన ముందు వైపు గాని, కుడివైపు గాని ఉమ్మకూడదని అన్నారు. అయితే ఎడమవైపు గాని, లేదా ఎడమకాలి క్రింద గాని ఉమ్మివేయవచ్చని చెప్పారు.

[సహీహ్ బుఖారీ : 8వ ప్రకరణం – సలాత్, 36వ అధ్యాయం – లియబ్ జక అయ్యసారిహీ అవ్ తహ్ త కిద్మతుల్ యస్రా]

321 – حديث أَبِي هُرَيْرَةَ وَأَبِي سَعِيدٍ، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ رَأَى نُخَامَةً فِي جِدَارِ الْمَسْجِدِ فَتَنَاوَلَ حَصَاةً فَحَكَّهَا، فَقَالَ: إِذَا تَنَخَّمَ أَحَدُكُمْ فَلاَ يَتَنَخَّمَنَّ قِبَلَ وَجْهِهِ، وَلاَ عَنْ يَمِينِهِ، وَلْيَبْصُقْ عَنْ يَسَارِهِ أَوْ تَحْتَ قَدَمِهِ الْيُسْرَى
__________
أخرجه البخاري في: 8 كتاب الصلاة: 34 باب حكّ المخاط بالحصى من المسجد

321. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) హజ్రత్ అబూ సయీద్ (రదియల్లాహు అన్హు)ల కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఓ రోజు మస్జిదులో గోడ మీద కఫం పడి వుండటం చూసి ఒక రాయి తీసుకొని దాన్ని గీకి శుభ్రపరిచారు. ఆ తరువాత “ఎవరైనా ఉమ్మి వేయదలచుకుంటే తన ముందు వైపుగాని, కుడి వైపుగాని ఉమ్మకూడదు. ఎడమ వైపుగాని లేదా ఎడమకాలి క్రింద గాని ఉమ్మాలి” అని చెప్పారు.

[సహీహ్ బుఖారీ: 8వ ప్రకరణం – సలాత్, 34వ అధ్యాయం – హక్కుల్ ముఖాతి బిల్ హిసా మినల్ మస్జిద్)

322 – حديث عَائِشَةَ أُمِّ الْمُؤْمِنِينَ، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ رَأَى فِي جِدار الْقِبْلَةِ مُخاطًا، أَوْ بُصَاقًا، أَوْ نُخَامةً فَحَكَّهُ
__________
أخرجه البخاري في: 8 كتاب الصلاة: 23 باب حك البزاق باليد من المسجد

322. హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం:- దైవ వక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఓ రోజు మస్జిదులో గోడమీద ఉమ్మివేసిన లేక చీది వేసిన శ్లేష్మాన్ని చూసి దాన్ని గీకి తొలగించారు.

[సహీహ్ బుఖారీ : 8వ ప్రకరణం – సలాత్, 23వ అధ్యాయం- హక్కిల్ బుజాఖి బిల్ యది మినల్ మస్జిద్)

323 – حديث أَنَسِ بْنِ مَالِكٍ، قَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: إِنَّ الْمُؤْمِنَ إِذَا كَانَ فِي الصَّلاَةِ فَإِنَّمَا يُنَاجِي رَبَّهُ، فَلاَ يَبْزُقَنَّ بَيْنَ يَدَيْهِ وَلاَ عَنْ يَمِينِهِ، وَلكِنْ عَنْ يَسَارِهِ أَو تَحْتَ قَدَمِهِ
__________
أخرجه البخاري في: 8 كتاب الصلاة: 36 باب ليبزق عن يساره أو تحت قدمه

323. హజ్రత్ అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: “విశ్వాసి నమాజు చేస్తున్నప్పుడు అతను తన ప్రభువుతో గుసగుసలాడుతున్నాడన్నమాట. అందువల్ల అతను తన ముందువైపు గాని, కుడివైపు గాని ఉమ్మి వేయకూడదు. ఎడమవైపు లేదా ఎడమకాలి క్రింద మాత్రమే ఉమ్మివేయాలి.”

[సహీహ్ బుఖారీ : 8వ ప్రకరణం – సలాత్, 36వ అధ్యాయం – లియబ్ జిఖ్ అఁయ్యసారిహీ ఔ తహ్ త ఖిద్మ]

324 – حديث أَنَسِ بْنِ مَالِكٍ، قَالَ: قَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: الْبُزَاق فِي الْمَسْجِدِ خَطِيئَةٌ وَكَفَّارَتُهَا دَفْنُهَا
__________
أخرجه البخاري في: 8 كتاب الصلاة: 37 باب كفارة البزاق في المسجد

324. హజ్రత్ అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: “మస్జిదులో ఉమ్మి వేయడం పాపం. (అలా జరిగితే) దానికి పాప పరిహారంగా ఆ ఉమ్మిని తీసి (నేలలో) మట్టి క్రింద కప్పివేయాలి.”

(సహీహ్ బుఖారీ : 8వ ప్రకరణం – సలాత్, 37వ అధ్యాయం – కఫారతిల్ బుజాఖి ఫిల్ మస్జిద్)

325 – حديث أَنَسِ بْنِ مَالِكٍ عَنْ سَعِيدِ بْنِ يَزِيدَ الأَزْدِيِّ، قَالَ: سَأَلْتُ أَنَسَ بْنَ مَالِكٍ: أَكَانَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يُصَلِّي فِي نَعْلَيْهِ قَالَ: نَعَمْ
__________
أخرجه البخاري في: 8 كتاب الصلاة: 24 باب الصلاة في النعال

325. హజ్రత్ సయీద్ బిన్ యజీద్ అజ్ది (రహిమహుల్లాహ్) కథనం:- హజ్రత్ అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) ని “దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పాదరక్షలు ధరించి నమాజు చేసేవారా?” అని నేను అడిగాను. దానికి హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) ఔనని సమాధానమిచ్చారు.

[సహీహ్ బుఖారీ : 8వ ప్రకరణం – సలాత్, 24వ అధ్యాయం – అస్సలాతి ఫిన్నిఆల్]

326 – حديث عَائِشَةَ، أَنَّ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ صَلَّى فِي خَمِيصَةٍ لَهَا أَعْلاَمٌ، فَقَالَ: شَغَلَتْنِي أَعْلاَمُ هذِهِ اذهبوا بِهَا إِلَى أَبِي جَهْمٍ وَأْتُونِي بِأَنْبِجَانِيَّةٍ
__________
أخرجه البخاري في: 10 كتاب الأذان: 93 باب الالتفات في الصلاة

326. హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఓసారి పూల దుప్పటి కప్పుకొని నమాజు చేశారు. ఆ తరువాత (అనుచరులతో మాట్లాడుతూ)” ఈ పూల డిజైన్ వల్ల నమాజులో నాకు అంతరాయం ఏర్పడి నా ఏకాగ్రతకు భంగం కలిగింది. దీన్ని తీసికెళ్ళి అబూ జహం (రదియల్లాహు అన్హు)కి ఇచ్చేసి,* అతని దగ్గర్నుంచి ఒక ముతక దుప్పటి తీసుకురండి” అని అన్నారు.

[సహీహ్ బుఖారీ : 10వ ప్రకరణం – అజాన్, 93 వ అధ్యాయం – ఆల్ ఇల్తి ఫాతి ఫిస్సలాత్]

* ఈ పూల డిజైన్ దుప్పటిని అబూ జహం (రదియల్లాహు అన్హు) గారే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు కానుకగా ఇచ్చారు.

327 – حديث أَنَسِ بْنِ مَالِكٍ رضي الله عنه، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: إِذَا وُضِعَ الْعَشَاءُ وَأُقِيمَتِ الصَّلاَةُ فَابْدَءُوا بِالْعَشَاءِ
__________
أخرجه البخاري في: 70 كتاب الأطعمة: 58 باب إِذا حضر العشاء فلا يعجل عن عشائه

327. హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:- “రాత్రి భోజనం తెచ్చి పెట్టిన తరువాత సామూహిక నమాజు కోసం అఖామత్ చెబుతుంటే ముందు భోజనం చేయాలి.”

[సహీహ్ బుఖారీ : 70వ ప్రకరణం – అత్ అమా, 58వ అధ్యాయం – ఇజాహజ రుల్ ఇషా……..]

328 – حديث أَنَسِ بْنِ مَالِكٍ، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: إِذَا قُدِّمَ الْعَشَاءُ فَابْدَءُوا بِهِ قَبْلَ أَنْ تُصَلُّوا صَلاَةَ الْمَغْرِبِ، وَلاَ تَعْجَلُوا عَنْ عَشَائِكمْ
__________
أخرجه البخاري في: 10 كتاب الأذان: 42 باب إذا حضر الطعام وأقيمت الصلاة

328. హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు:- “భోజనం తెచ్చి పెట్టడం జరిగితే మగ్రిబ్ నమాజు చేయడానికి ముందే భోజనం చేయండి. అంతేగాని భోజనం వదిలేసి నమాజు కోసం తొందరపడకండి.”

[సహీహ్ బుఖారీ : 10వ ప్రకరణం – అజాన్, 42వ అధ్యాయం – ఇజాహజరి త్తామ్మి వ అఖీమతిస్సలాత్]

329 – حديث عَائِشَةَ، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ أَنَّهُ قَالَ: إِذَا وُضِعَ الْعَشَاءُ وَأُقِيمَتِ الصَّلاَةُ فَابْدَءُوا بِالْعَشَاءِ
__________
أخرجه البخاري في: 10 كتاب الأذان: 42 باب إذا حضر الطعام وأقيمت الصلاة

329. హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా బోధించారు: “రాత్రి భోజనం తెచ్చి పెట్టిన తరువాత అటు నమాజు కోసం అఖామత్ చెప్పడం జరుగుతుంటే, ముందు భోజనం చేయండి.”

[సహీహ్ బుఖారీ : 10వ ప్రకరణం – అజాన్, 42వ అధ్యాయం – ఇజా హజరత్తఆము వ అఖీమతుస్సలాత్)

330 – حديث ابْنِ عُمَرَ، قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: إِذَا وُضِعَ عَشَاءُ أَحَدِكُمْ وَأُقِيمَت الصَّلاَةُ فَابْدَءُوا بِالْعَشَاءِ، وَلاَ يَعْجَلْ حَتَّى يَفْرُغَ مِنْهُ
__________
أخرجه البخاري في: 10 كتاب الأذان: 42 باب إذا حضر الطعام وأقيمت الصلاة

330. హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు :- “రాత్రి భోజనం తెచ్చి ముందు పెట్టడం జరిగినప్పుడు సామూహిక నమాజు ప్రారంభమయితే మొదట భోజనం చేయాలి. భోజనం చేయకుండా నమాజు కోసం తొందర పడకూడదు.” *

(సహీహ్ బుఖారీ : 10వ ప్రకరణం – అజాన్, 42వ అధ్యాయం – ఇజా హజరత్తాము వఅఖీమతిస్సలాత్)

* భోజనం ముందుకు వచ్చినపుడు దాన్ని తినకుండా ఆకలి కడుపుతో నమాజు చేయడం ‘మక్రూహ్’ (అవాంఛనీయం) అవుతుంది. ఆ స్థితిలో నమాజు చేస్తే మనిషి ధ్యాస అంతా భోజనం మీదే ఉంటుంది. నమాజులో ఏకాగ్రత ఉండదు. అలాగే మలమూత్రాల విసర్జన అవసరం వస్తే ముందు ఆ పని ముగించుకోవాలి. అయితే నమాజు వేళ మించిపోయి ఖజా అయ్యే ప్రమాదం ఉన్నప్పుడు భోజనానికి, మలమూత్ర విసర్జనకు అంతగా తొందర లేకపోతే మొదట నమాజే చేయాలి. అందులో ఎలాంటి తప్పు (మక్రూహ్) లేదు.

331 – حديث ابْنِ عُمَرَ، أَنَّ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ فِي غَزْوَةِ خَيْبَرَ: مَنْ أَكَلَ مِنْ هذِهِ الشَّجَرَةِ يَعْنِي الثُّومَ فَلاَ يَقْرَبَنَّ مَسْجِدَنَا
__________
أخرجه البخاري في: 10 كتاب الأذان: 160 باب ما جاء في الثوم النِّيِّ والبصل والكراث

331. హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఖైబర్ దండయాత్ర సందర్భంలో ఇలా అన్నారు. “వెల్లుల్లి తిన్న వ్యక్తి మన మస్జిదు దరిదాపులకు సయితం రాకూడదు.”

[సహీహ్ బుఖారీ : 10వ ప్రకరణం – అజాన్, 160వ అధ్యాయం – మాజాఆ ఫిస్సూమి వల్ కరాసి వల్ బసలిన్నబీ]

332 – حديث أَنَسٍ عَنْ عَبْدِ الْعَزِيزِ، قَالَ: سَأَلَ رَجُلٌ أَنَسًا، مَا سَمِعْتَ نَبِيَّ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فِي الثُّومِ فَقَالَ: قَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: مَنْ أَكَلَ مِنْ هذِهِ الشَّجَرَةِ فَلاَ يَقْرَبْنَا أَوْ لاَ يُصَلِّيَنَّ مَعَنَا
__________
أخرجه البخاري في: 10 كتاب الأذان: 160 باب ما جاء في الثوم النِّيِّ والبصل والكراث

332. హజ్రత్ అబ్దుల్ అజీజ్ (రహిమహుల్లాహ్) కథనం:- ఒక వ్యక్తి హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు)తో మాట్లాడుతూ “వెల్లుల్లి విషయంలో మీరు దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) నోట ఏం విన్నారు?” అని అడిగారు. “ఈ మొక్క (అంటే వెల్లుల్లి) తిన్నవారు మన మస్జిదు దరిదాపులకు కూడా రాకూడదని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అన్నారు. లేక మాతో కలసి నమాజు చేయకూడదని ఆయన అన్నారు” అని హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) సమాధానమిచ్చారు.

[సహీహ్ బుఖారీ : 10వ ప్రకరణం – అజాన్, 160వ అధ్యాయం – మాజా అఫి స్సూమి…..]

333 – حديث جَابِرِ بْنِ عَبْدِ اللهِ، زَعَمَ أَنَّ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: مَنْ أَكَلَ ثُومًا أَوْ بَصَلاً فَلْيَعْتَزِلْنَا أَوْ قَالَ فَلْيَعْتَزِلْ مَسْجِدَنَا وَلْيَقْعُدْ فِي بَيْتِهِ

وَأَنَّ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ أُتِيَ بِقِدْرٍ فِيهِ خَضِرَاتٌ مِنْ بُقُولٍ فَوَجَدَ لَهَا رِيحًا، فَسَأَلَ فَأُخْبِرَ بِمَا فِيهَا مِنَ الْبُقُولِ، فَقَالَ: قَرِّبُوهَا إِلَى بَعْضِ أَصْحَابِهِ كَانَ مَعَهُ فَلَمَّا رَآهُ كَرِهَ أَكْلَهَا، قَالَ: كُلْ فَإِنِّي أُنَاجِي مَنْ لاَ تُنَاجِي
__________
أخرجه البخاري في: 10 كتاب الأذان: 160 باب ما جاء في الثوم النِّيِّ والبصل والكراث

333. హజ్రత్ జాబిర్ బిన్ అబ్దుల్లా (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వెల్లుల్లి (గురించి ప్రస్తావిస్తూ) “ఉల్లిగాని, వెల్లుల్లిగాని తిన్న వ్యక్తి మనకు దూరంగా ఉండాలి”అని అన్నారు. లేక “మన మస్జిదుకు దూరంగా తన ఇంట్లోనే నమాజు చేస్తూ ఉండిపోవాలి” అని అన్నారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దగ్గరికి (ఒకరు) కూరగాయలున్న ఒక కుండ తీసుకువచ్చాడు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అందులో వాసన చూసి “ఏమిటిది?’ అన్నారు. అప్పుడు అందులో ఏఏ కూరగాయలున్నాయో ఆయనకు వివరించడం జరిగింది. “అయితే దీన్ని (దగ్గరే కూర్చున్న ఒక సహాబీకి) ఇచ్చి వేయండి” అని అన్నారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం). అతను కూడ దాన్ని తినడానికి ఇష్టపడకపోవడంతో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) (కూరగాయలు తెచ్చిన వ్యక్తితో) “ఎవరితో మీరు మాట్లాడలేరో వారితో (అంటే దైవదూతలతో) నేను మాట్లాడవలసి ఉంటుంది. (గనక నేను దీన్ని తినలేను) నువ్వే తిను” అని అన్నారు.

[సహీహ్ బుఖారీ : 10వ ప్రకరణం – అజాన్, 160వ అధ్యాయం – మాజా ఆ ఫిస్సూమి]

334 – حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: إِذَا نُودِيَ بِالصَّلاَةِ أَدْبَرَ الشَّيْطَانُ وَلَهُ ضُرَاطٌ حَتَّى لاَ يَسْمَعَ الأَذَانَ، فَإِذَا قُضِيَ ْالأَذَانُ أَقْبَلَ، فَإِذَا ثُوِّبَ بِهَا أَدْبَرَ، فَإِذَا قُضِيَ التَّثْوِيبُ أَقْبَلَ، حَتَّى يَخْطِرَ بَيْنَ الْمَرْءِ وَنَفْسِهِ، يَقُولُ اذْكُرْ كَذَا وَكَذَا، مَا لَمْ يَكُنْ يَذْكُرُ، حَتَّى يَظَلَّ الرَّجُلُ إِنْ يَدْرِي كَمْ صَلَّى فَإِذَا لَمْ يَدْرِ أَحَدُكُمْ كَمْ صَلَّى، ثَلاَثًا أَوْ أَرْبَعًا، فَلْيَسْجُدْ سَجْدَتَيْنِ وَهُوَ جَالِسٌ
__________
أخرجه البخاري في: 22 كتاب السهو: 6 باب إذا لم يدرِكم صلى ثلاثًا أو أربعًا سجد سجدتين وهو جالس

334. హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:- “అజాన్ చెప్పడం ప్రారంభించగానే షైతాన్ వెనక్కి తిరిగి పలాయనం చిత్తగిస్తాడు. అప్పుడు (తీవ్రమైన భయాందోళనతో) వాడికీ అపానవాయువు వెడలుతుంది. దాంతో వాడు అజాన్ వినరానంత దూరం పారిపోతాడు. అయితే అజాన్ చెప్పడం అయిపోగానే వాడు మళ్ళీ (ప్రార్థనా స్థలానికి) చేరుకుంటాడు. ఇఖామత్ చెప్పగానే తిరిగి తోక ముడిచి పారిపోతాడు. ఇఖామత్ చెప్పడం అయిపోగానే మళ్ళీ వచ్చి మానవుని హృదయంలో దుష్టాలోచనలు రేకెత్తిస్తాడు. (మనిషికి) అంతకుముందు గుర్తుకురాని విషయాలన్నిటినీ (నమాజు చేయడానికి నిలబడగానే) గుర్తు చేస్తూ ‘ఇది జ్ఞాపకం తెచ్చుకో, అది జ్ఞాపకం తెచ్చుకో’ అని పురిగొల్పుతాడు. దాంతో మనిషికి (వాడి మాయాజాలంలో పడిపోయి) తాను ఎన్ని రకాతులు పఠించానన్న సంగతి కూడ జ్ఞాపకం వుండదు. ఎవరికైనా (ఇలాంటి పరిస్థితి ఎదురయి) తాను ఎన్ని రకాతులు పఠించాను, మూడా నాలుగా అన్న విషయం గుర్తుకు రాకపోతే అతను కూర్చొనే రెండుసార్లు సజ్దా (సాష్టాంగ ప్రణామం) చేయాలి.”

[సహీహ్ బుఖారీ :22వ ప్రకరణం – సహూ, 6వ అధ్యాయం – ఇజాలమ్ యద్రికుమ్…]

335 – حديث عَبْدِ اللهِ بْنِ بُحَيْنَةَ رضي الله عنه، قَالَ: صَلَّى لَنَا رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ رَكْعَتَيْنِ مِنْ بَعْضِ الصَّلَوَاتِ، ثُمَّ قَامَ فَلَمْ يَجْلِسْ، فَقَامَ النَّاسُ مَعَهُ، فَلَمَّا قَضَى صَلاَتَهُ وَنَظَرْنَا تَسْلِيمَهُ كَبَّرَ قَبْلَ التَّسْلِيمِ، فَسَجَدَ سَجْدَتَيْنِ وَهُوَ جَالِسٌ، ثُمَّ سَلَّمَ
__________
أخرجه البخاري في: 22 كتاب السهو: 1 باب ما جاء في السهو إذا قام من ركعتي الفريضة

335. హజ్రత్ అబ్దుల్లా బిన్ బహీనా (రదియల్లాహు అన్హు) కథనం:- (ఓ రోజు) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒక నమాజులో రెండు రకాతులు పఠించిన తర్వాత లేచి నిల్చున్నారు. ‘ఖాయిదాయె ఊలా’ ప్రకారం కూర్చోవడం మరచిపోయారు. అనుచరులు కూడా ఆయనతో పాటు పైకి లేచారు. నమాజు పూర్తయి ‘సలాం’ చేయడానికి మేము ఎదురుచూస్తున్న తరుణంలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ‘అల్లాహు అక్బర్’ అంటూ కూర్చునే రెండు సార్లు సజ్దా చేశారు. ఆ తర్వాత కుడి ఎడమల వైపు సలాం చేశారు.

[సహీహ్ బుఖారీ : 22వ ప్రకరణం – సహూ, 15వ అధ్యాయం – మాజాఆ ఫిస్సహూ…….]

336 – حديث عَبْدِ اللهِ بْنِ مَسْعُودٍ، قَالَ: صَلَّى النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، (قَالَ إِبْرَاهِيمُ، أَحَدُ الرُّوَاةِ، لاَ أَدْرِي زَادَ أَوْ نَقَصَ) ؛ فَلَمَّا سَلَّمَ قِيلَ لَهُ يَا رَسُولَ اللهِ أَحَدَثَ فِي الصَّلاَةِ شَيْءٌ قَالَ: وَمَا ذَاكَ قَالُوا: صَلَّيْتَ كَذَا وَكَذَا فَثَنَى رِجْلَيْهِ وَاسْتَقْبَلَ الْقِبْلَةَ وَسَجَدَ سَجْدَتَيْنِ، ثُمَّ سَلَّمَ فَلَمَّا أَقْبَلَ عَلَيْنَا بِوَجْهِهِ، قَالَ: إِنَّهُ لَوْ حَدَثَ فِي الصَّلاَةِ شَيْءٌ لَنَبَّأْتُكُمْ بِهِ، وَلكِنْ إِنَّمَا أَنَا بَشَرٌ مِثْلُكُمْ أَنْسى كَمَا تَنْسَوْنَ، فَإِذَا نَسِيتُ فَذَكِّرُونِي، وَإِذَا شَكَّ أَحَدُكُمْ فِي صَلاَتِهِ فَلْيَتَحَرَّ الصَّوَابَ فَلْيُتِمَّ عَلَيْهِ، ثُمَّ لِيسَلِّمْ ثُمَّ يَسْجُدْ سَجْدَتَيْنِ
__________
أخرجه البخاري في: 8 كتاب الصلاة: 31 باب التوجه نحو القبلة حيث كان

336. హజ్రత్ అబ్దుల్లా బిన్ మసూద్ (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నమాజు చేయించారు. హదీసు ఉల్లేఖకుడు ఇబ్రాహీం (రహిమహుల్లాహ్) ఈ విషయం ప్రస్తావిస్తూ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) (నమాజులో) ఏదైనా అధికం చేశారో తగ్గించారో నాకు జ్ఞాపకం లేదు అని అన్నారు. మొత్తానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నమాజు పూర్తి చేసి కుడి ఎడమల వైపు సలాం చేసిన తరువాత “దైవప్రవక్తా! నమాజు గురించి ఏదైనా కొత్త ఆదేశం జారీ అయిందా?” అని అడిగారు అనుచరులు. దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “ఎందుకు ఏమయిందీ?” అని ప్రశ్నించారు. “మీరు (రోజు చేస్తున్న పద్ధతికి భిన్నంగా) ఇలా నమాజు చేశారే?” అన్నారు అనుచరులు. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కాళ్ళు ముడుచుకుని ఖిబ్లా వైపు తిరిగి రెండుసార్లు సజ్దా చేశారు. ఆ తర్వాత కుడి ఎడమల వైపు సలాం చేసి మా వైపు తిరిగి ఇలా అన్నారు: “నమాజు గురించి ఏదైనా కొత్త ఆదేశం వస్తే నేను మీకు ముందే తెలియజేసి ఉండేవాడ్ని. అలాంటిదేమీ లేదు. అసలు విషయం ఏమిటంటే నేను కూడ మీలాంటి మానవ మాత్రుడ్ని. మీకు మల్లే నాకూ మరుపు వస్తుంది. అందుచేత ఎప్పుడైనా నేనేదయినా మరచిపోతే నాకు గుర్తు చేయండి. నమాజు చేస్తున్నప్పుడు ఎవరికైనా ఏదైనా అనుమానం వస్తే సరైన నిర్ణయం తీసుకోవడానికి కృషి చేసి దాని ప్రకారం నమాజు పూర్తి చేయండి, కుడి ఎడమల వైపు ‘ సలాం చేయండి. ఆ తరువాత రెండు సార్లు సజ్దా చేయండి.”

[సహీహ్ బుఖారీ : 8వ ప్రకరణం – సలాత్, 31వ అధ్యాయం – అత్తవజ్జు ….]

337 – حديث أَبِي هُرَيْرَةَ، قَالَ: صَلَّى بِنَا النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ الظُّهْرَ رَكْعَتَيْنِ، ثُمَّ سَلَّمَ، ثُمَّ قَامَ إِلَى خَشَبَةٍ فِي مُقَدِّمِ الْمَسْجِدِ وَوَضَعَ يَدَهُ عَلَيْهَا؛ وَفِي الْقَوْمِ يَوْمَئِذٍ أَبُو بَكْرٍ وَعُمَرُ فهَابَا أَنْ يُكَلِّمَاهُ، وَخَرَجَ سَرَعَانُ النَّاسِ، فَقَالُوا: قَصُرَتِ الصَّلاَةُ، وَفِي الْقَوْمِ رَجُلٌ كَان النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَدْعُوهُ ذَا الْيَدَيْنِ، فَقَالَ: يَا نَبِيَّ اللهِ أَنَسِيت أَمْ قَصُرَتْ، فَقَالَ: لَمْ أَنْسَ وَلَمْ تَقْصُرْ، قَالُوا: بَلْ نَسِيتَ يَا رَسُولَ اللهِ قَالَ: صَدَقَ ذُو الْيَدَيْنِ، فَقَامَ فَصَلَّى رَكْعَتَيْنِ ثُمَّ سَلَّمَ، ثُمَّ كَبَّرَ فَسَجَدَ مِثْلَ سُجُودِهِ أَوْ أَطْوَلَ، ثُمَّ رَفَعَ رَأْسَهُ وَكَبَّرَ، ثُمَّ وَضَعَ مِثْلَ سُجُودِهِ أَوْ أَطْوَلَ، ثُمَّ رَفَعَ رَأْسَهُ وَكَبَّرَ
__________
أخرجه البخاري في: 78 كتاب الأدب: 45 باب ما يجوز من ذكر الناس

337. హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఓ సారి జుహర్ నమాజులో రెండు రకాతులు పఠించి కుడిఎడమల వైపు సలాం చేశారు. ఆ తరువాత మస్జిదులో ఖిబ్లా వైపు ఉంచిన ఓ కర్ర దగ్గరకు వెళ్ళి దాని మీద చేయి ఆనిచ్చి నిల్చున్నారు. ఆ సమయంలో హజ్రత్ అబూబక్ర్ (రదియల్లాహు అన్హు) హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కూడ వున్నారు, కాని వారిద్దరు నోరు విప్పడానికి భయపడ్డారు. తొందరపాటు తత్వం గలవారు “నమాజు తగ్గించబడిందంటూ” లేచి నిలబడ్డారు.

అంతలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చేత ‘జువాలీదైన్’ (ద్విహస్తుడు)’ * అని పిలువబడే ఒక వ్యక్తి ముందుకు వచ్చి “దైవప్రవక్తా! మీరు నమాజు తగ్గించారు, లేదా మరచిపోయి ఉంటారు” అని అన్నాడు. దానికి దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) “నేను నమాజు తగ్గించలేదు, మరచిపోవడం కూడ జరగలేదు” అని అన్నారు. వెంటనే ఇతర అనుచరులు కొందరు జోక్యం చేసుకుంటూ “లేదు దైవప్రవక్తా! మీరు మరచిపోయారు” అని అన్నారు. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “అంటే ‘జువాలీదైన్’ చెప్పింది నిజమేనన్నమాట” అని అన్నారు. ఆ తరువాత నిలబడి మరో రెండు రకాతులు నమాజు చేసి, కుడి ఎడమలవైపు సలాం చేశారు. ఆ వెనువెంటనే ‘అల్లాహు అక్బర్’ అంటూ సజ్దా చేశారు. ఇది ఆయన లోగడ చేస్తూ వస్తున్న సజ్దా వంటిదే. కాకపోతే కాస్త సుదీర్ఘంగా చేసి ఉండవచ్చు. ఆ తరువాత సజ్దా నుండి లేచి ‘అల్లాహు అక్బర్’ అంటూ తిరిగి అదే విధంగా సజ్దా చేశారు. లేదా అంతకంటే కొంచెం దీర్ఘంగా చేసి ఉంటారు. ఆ తరువాత సజ్దా నుండి తల పైకెత్తుతూ ‘అల్లాహు అక్బర్’ ** అన్నారు.

[సహీహ్ బుఖారీ, 78వ ప్రకరణం – అదబ్, 45వ అధ్యాయం – మాయజూజు మిన్ జిక్రిన్నాస్]

(*) ఈ వ్యక్తి ఆజానుబాహుడయినందున ఇతనికి ద్విహస్తుడన్న పేరు వచ్చింది.
(**) ‘సహూఁ’ విషయంలో ధర్మవేత్తల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ‘సహూసజ్దా’ సలాంకు ముందు చేయాలా లేక సలాం తర్వాత చేయాలా అనే విషయం నమాజు చేసే వ్యక్తి ఇష్టాయిష్టాల పై ఉందని కొందరు అభిప్రాయపడ్డారు. ఇమామ్ అబూహనీఫా (రహిమహుల్లాహ్) అభిప్రాయం ప్రకారం సహూ సజ్దా సలామ్ తర్వాతే చేయాలి. ఇమామ్ షాఫయి (రహిమహుల్లాహ్) ప్రకారం సలామ్ కు ముందే చేయాలి. – అనువాదకుడు

338 – حديث ابْنِ عُمَرَ، قَالَ: كَانَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَقْرَأُ عَلَيْنَا السُّورَةَ، فِيهَا السَّجْدَةُ، فَيَسْجُدُ وَنَسْجُدُ حَتَّى مَا يَجِدُ أَحَدُنَا مَوْضِعَ جَبْهَتِهِ
__________
أخرجه البخاري في: 17 كتاب سجود القرآن: 8 باب من سجد لسجود القارىء

338. హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మా ముందు ‘సజ్దా’ ఉండే ఏదైనా సూరా పఠిస్తున్నప్పుడు (సజ్దా వాక్యం రాగానే) ఆయనతో పాటు మేము కూడా సజ్దా చేసేవాళ్ళము. ఆ సమయంలో జనానికి సజ్దా చేసేందుకు నుదురు ఆనించడానికి సయితం సరిపడ చోటు లేనంతగా జన సమూహం ఉండేది.

[సహీహ్ బుఖారీ : 17వ ప్రకరణం – సుజూదుల్ ఖుర్ఆన్, 8వ అధ్యాయం – మన్ సజద, లిసుజూదిల్ భారి]

339 – حديث عَبْدِ اللهِ بْنِ مَسْعُودٍ رضي الله عنه، قَالَ: قَرَأَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ النَّجْمَ بِمَكَّةَ فَسَجَدَ فِيهَا وَسَجَدَ مَنْ مَعَهُ غَيْرَ شَيْخٍ أَخَذَ كفًّا مِنْ حَصًى أَوْ تُرَابٍ فَرَفَعَهُ إِلَى جَبْهَتِهِ، وَقَال: يَكْفِينِي هذَا؛ فَرَأَيْتُهُ بَعْدَ ذلِكَ قُتِلَ كَافِرًا
__________
أخرجه البخاري في: 17 كتاب سجود القرآن: 1 باب ما جاء في سجود القرآن وسنتها

339. హజ్రత్ అబ్దుల్లా బిన్ మస ఊద్ (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఓ సారి మక్కాలో ‘అన్ నజ్మ్’ సూరా పఠించారు. అందులో సజ్దా వాక్యం వచ్చినప్పుడు ఆయనతో పాటు ఆయన సమీపంలో ఉన్నవారంతా (బహుదైవారాధకులు సయితం) సజ్దా చేశారు. ఒక వృద్ధుడు మాత్రం (సజ్దా చేయకుండా) చేతిలో కొన్ని కంకర్రాళ్ళు తీసుకొని, నుదుటి దగ్గరికి ఎత్తి “నాకిది చాలు” అన్నాడు. ఆ తరువాత కొంత కాలానికి నేనతని పరిస్థితి గమనించాను. అతను (ఉమయ్య బిన్ ఖల్ఫ్) అవిశ్వాస స్థితిలోనే వధించబడ్డాడు. (ఇస్లాం స్వీకారభాగ్యానికి నోచుకోలేకపోయాడు).

[సహీహ్ బుఖారీ : 17వ ప్రకరణం – సుజూదుల్ ఖుర్ఆన్, 1వ అధ్యాయం – మాజాఫీ సుజూ దిల్ ఖుర్ఆని వ సున్నతిహా]

340 – حديث زَيْدِ بْنِ ثَابِتٍ عَنْ عَطَاءِ بْنِ يَسَارٍ، أَنَّهُ سَأَلَ زَيْدَ بْنَ ثَابِتٍ رضي الله عنه، فَزَعَمَ أَنَّهُ قَرأَ عَلَى النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ وَالنَّجْمِ فَلَمْ يَسْجُدْ فِيهَا
__________
أخرجه البخاري في: 17 كتاب سجود القرآن: 6 باب من قرأ السجدة ولم يسجد

340. హజ్రత్ అతాబిన్ యసార్ (రహిమహుల్లాహ్) కథనం:- నేను హజ్రత్ జైద్ బిన్ సాబిత్ (రదియల్లాహు అన్హు)ని ఖుర్ఆన్ పఠనం గురించి విచారిస్తే దానికి ఆయన సమాధానమిస్తూ “నేను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ముందు ‘నజ్మ్’ సూరా పఠించినపుడు ఆయన సజ్దా చేయలేదు” అని అన్నారు.

[సహీహ్ బుఖారీ : 17వ ప్రకరణం – సుజూదుల్ ఖుర్ఆన్, 6వ అధ్యాయం – మన్ ఖరా అస్సజ్జద్ త వలమ్ యస్ జుద్ ]

341 – حديث أَبِي هُرَيْرَةَ عَنْ أَبِي رَافِعٍ، قَالَ: صَلَّيْتُ مَعَ أَبِي هُرَيْرَةَ الْعَتَمةَ فَقَرَأَ (إِذَا السَّمَاءُ انْشَقَّتْ) فَسَجَدَ، فَقُلْتُ: مَا هذِهِ قَالَ: سَجَدْتُ بِهَا خَلْفَ أَبِي الْقَاسِمِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَلاَ أَزَالُ أَسْجُدُ بِهَا حَتَّى أَلْقَاهُ
__________
أخرجه البخاري في: 10 كتاب الأذان: 101 باب القراءة في العشاء بالسجدة

341. హజ్రత్ అబూరాఫె (రహిమహుల్లాహ్) కథనం:- నేనొకసారి హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) వెనుక ఇషా నమాజు చేశాను. ఆ నమాజులో ఆయన ‘ఇజస్సమా ఉన్ షఖ్ఖత్ ‘ అనే సూరా పఠించారు. అప్పుడు ‘తిలావత్ సజ్దా’ చేశారు. ఆ తరువాత నేను “ఏమిటీ సజ్దా?” అని అడిగాను. దానికి ఆయన “నేను సూరా పారాయణం సమయంలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వెనక సజ్దా చేశాను. ఇప్పుడిక నేను ఆయన దగ్గరకు వెళ్ళే దాకా ‘సజ్దా’ చేస్తూ ఉంటాను” అని అన్నారు.

[సహీహ్ బుఖారీ : 10వ ప్రకరణం – అజాన్, 101 వ అధ్యాయం – అల్ ఖరాఅతి ఫిల్ ఇషా ఇ బిస్ సజ్దా]

342 – حديث ابْنِ عَبَّاسٍ، قَالَ: كُنْتُ أَعْرِفُ انْقِضَاءَ صَلاَةِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ بَالتَّكْبِيرِ
__________
أخرجه البخاري في: 10 كتاب الأذان: 155 باب الذكر بعد الصلاة

342. హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హు) కథనం:- తక్బీర్ (అల్లాహు అక్బర్) ధ్వని వినగానే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నమాజు ముగించారని నాకు తెలిసిపోయేది.

[సహీహ్ బుఖారీ : 10వ ప్రకరణం – అజాన్, 155వ అధ్యాయం – అజ్జిక్రి బాదస్సలాత్)

343 – حديث عَائِشَةَ، قَالَتْ: دَخَلَتْ عَلَيَّ عَجُوزَانِ مِنْ عُجُزِ يَهُودِ الْمَدِينَةِ، فَقَالَتَا لِي، إِنَّ أَهْلَ الْقُبُورِ يُعَذَّبُونَ فِي قُبُورِهِمْ، فَكَذَّبْتُهُمَا وَلَمْ أُنْعِمْ أَنْ أُصَدِّقَهُمَا؛ فَخَرَجَتَا وَدَخَلَ عَلَيَّ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فَقُلْت لَهُ: يَا رَسُولَ اللهِ إِنَّ عَجُوزَيْنِ، وَذَكَرْتُ لَهُ؛ فَقَال: صَدَقَتَا، إِنَّهُمْ يُعَذَّبُونَ عَذَابًا تَسْمَعُهُ الْبَهَائِمُ كُلُّهَا فَمَا رَأَيْتُهُ بَعْدُ فِي صَلاَةٍ إِلاَّ تَعَوَّذَ مِنْ عَذَابِ الْقَبْرِ
__________
أخرجه البخاري في: 80 كتاب الدعوات: 37 باب التعوذ من عذاب القبر

343. విశ్వాసుల మాతృమూర్తి హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం:- ఓ రోజు మదీనా యూదులకు చెందిన ఇద్దరు వృద్ధ మహిళలు నా దగ్గరకు వచ్చి “సమాధుల్లో మృతులు శిక్షించబడతారు” అని అన్నారు. నేనీ మాట విని ఖండించాను. వాళ్ళ మాటలు నిజమని ఒప్పుకోవడానికి నాకు మనసొప్పలేదు. వాళ్ళు వెళ్ళిపోయారు. కాస్సేపటికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇంటికి తిరిగి వచ్చారు. నేను ఇద్దరు యూద వృద్ధ స్త్రీలు వచ్చిపోయిన సంగతి ప్రస్తావించి, దైవప్రవక్తా! వారిలా అన్నారు అని అన్నాను. దానికి ఆయన “వాళ్ళు చెప్పింది’ నిజమే. సమాధిలోని మృతులను తీవ్రంగా శిక్షించడం జరుగుతుంది. దాన్ని జంతువులు సయితం వింటారు” అని అన్నారు. ఆ తరువాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రతి నమాజులోను సమాధి శిక్ష నుండి అల్లాహ్ ను శరణు కోరుతూ ఉండటం నేను చూశాను.

[సహీహ్ బుఖారీ : 80వ ప్రకరణం – అద్దావాత్, 37వ అధ్యాయం – అత్తవూజు మిన్ అజాబిల్ ఖబ్ర్ ]

344 – حديث عَائِشَةَ، قَالَتْ: سَمِعْتُ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَسْتَعِيذ فِي صَلاَتِهِ مِنْ فِتْنَةِ الدَّجَّالِ
__________
أخرجه البخاري في: 10 كتاب الأذان: 149 باب الدعاء قبل السلام

344. హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దజ్జాల్ ఉపద్రవం నుండి అల్లాహ్ ని శరణు కోరుతుంటే నేను విన్నాను.

[సహీహ్ బుఖారీ : 10వ ప్రకరణం – అజాన్, 149వ అధ్యాయం – అద్దుఆవు ఖబ్లస్సలాం]

345 – حديث عَائِشَةَ زَوْجِ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ كَانَ يَدْعُو فِي الصَّلاَةِ اللهُمَّ إِنِّي أَعُوذَ بِكَ مِنْ عَذَابِ الْقَبْرِ، وَأَعُوذ بِكَ مِنْ فِتْنَةِ الْمَسِيحِ الدَّجَالِ، وَأَعُوذ بِكَ مِنْ فِتْنَةِ الْمَحْيَا وَفِتْنَةِ الْمَمَاتِ، اللهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنَ الْمأْثَمِ وَالْمَغْرَمِ، فقَالَ لَهُ قَائِلٌ: مَا أَكْثَرَ مَا تَسْتَعِيذُ مِنَ الْمَغْرَمِ فَقَالَ: إِنَّ الرَّجُلَ إِذَا غَرِمَ حَدَّثَ فَكَذِبَ وَوَعَدَ فَأَخْلَفَ
__________
أخرجه البخاري في: 10 كتاب الأذان: 149 باب الدعاء قبل السلام

345. హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నమాజులో తషహుద్ తరువాత ఇలా దుఆ (ప్రార్థన) చేస్తూ ఉంటే నేను విన్నాను.

అల్లాహుమ్మ ఇన్నీ అవూజుబిక మిన్ అజాబిల్ ఖబ్రి వ అవూజుబిక మిన్ ఫిత్నతిల్ మసీహిద్దజాలి వ అవూజుబిక మిన్ ఫిత్నతిల్ మహ్యాయి వ ఫిత్నతిల్ మమాతి. అల్లాహుమ్మ ఇన్నీ అవూజుబిక మినల్ మాసమి వల్ మగ్రమ్.

(“అల్లాహ్! నేను సమాధి యాతన నుండి నీ శరణు కోరుతున్నాను. మసీహిద్దజాల్ ఉపద్రవం నుండి నీ శరణు కోరుతున్నాను. జీవన్మరణాల పరీక్ష నుండి నీ శరణు కోరుతున్నాను. అల్లాహ్! పాపాల్లో పడివేసే పనుల నుండి నీ శరణు కోరుతున్నాను. రుణగ్రస్తుణ్ణయ్యే దుస్థితి నుండి నీ శరణు కోరుతున్నాను.”)

ఒక వ్యక్తి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)తో మాట్లాడుతూ “దైవప్రవక్తా! మీరు రుణగ్రస్త స్థితి నుండి కూడా అంత ఎక్కువగా శరణు కోరుతున్నారెందుకు?” అని అడిగాడు. దానికి ఆయన సమాధానమిస్తూ “ఎందుకంటే మనిషి అప్పుల పాలయితే అసత్యమాడతాడు. వాగ్దాన భంగానికి పాల్పడతాడు” అని అన్నారు.

[సహీహ్ బుఖారీ : 10వ ప్రకరణం – అజాన్, 149వ అధ్యాయం – అద్దుఆవు ఖబ్లస్సలాం)

* ‘జీవిత’ పరీక్ష అంటే, మానవ జీవితంలో ఎదురయ్యే పరీక్షలన్నీ అని అర్థం. ఉదాహరణకు – పనికిమాలిన విషయాల్లో చిక్కుకుపోవడం, మనోవాంఛలకు బలయిపోవడం మొదలైనవి. మరణపరీక్ష అంటే, మనిషి మరణ ఘడియల్లో దైవానుగ్రహం పట్ల నిరాశ చెందడం, సద్వచనం.(కలిమా) పలకలేకపోవడం, ఇస్లాం వ్యతిరేక విషయాలు మాట్లాడడం ఇత్యాదివి. రుణగ్రస్తుడవడం అంటే, అధర్మకార్యాలు లేక అనవసరమైన పనుల కోసం చేసే అప్పు అన్నమాట. లేదా అప్పు తీర్చే సద్బుద్ధి లేకపోవడం. నిజమైన అవసరాల నిమిత్తం అప్పు తీసుకోవడంలో తప్పులేదు. అయితే దాంతో పాటు అప్పు తీర్చే స్తోమత కూడా ఉండాలి. ఈ దుఆ (వేడుకోలు) మొదటి భాగం అల్లాహ్ హక్కులకు, రెండవ భాగం దాసులహక్కులకు సంబంధించినది.

346 – حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، قَالَ: كَانَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَدْعُو: اللهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنْ عَذَابِ الْقَبْرِ وَمِنْ عَذَابِ النَّارِ، وَمِنْ فِتْنَةِ الْمَحْيَا وَالْمَمَاتِ، وَمِنْ فِتْنَةِ الْمَسِيحِ الدَّجَّالِ
__________
أخرجه البخاري في: 23 كتاب الجنائز: 88 باب التعوذ من عذاب القبر

346. హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా అల్లాహ్ ను వేడుకునేవారు “అల్లాహ్! నేను సమాధి శిక్ష నుండి, అగ్ని శిక్ష నుండి, జీవన్మరణాల పరీక్ష నుండి మసీహ్ దజ్జాల్ ఉపద్రవం నుండి నీ శరణు కోరుతున్నాను.”

[సహీహ్ బుఖారీ : 23వ ప్రకరణం – జనాయెజ్, 88వ అధ్యాయం – అత్త అవ్వుజు మిన్ అజాబిల్ ఖబ్ర్]

347 – حديث الْمُغِيرَةِ بْنِ شُعْبَةَ عَنْ وَرَّادٍ، كَاتِبِ الْمُغِيرَةِ بْنِ شُعْبَةَ، قَالَ: أَمْلَى عَلَيَّ الْمُغِيرَةُ بْنُ شُعْبَةَ فِي كِتَابٍ إِلَى مُعَاوِيَةَ، أَنَّ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ كَانَ يَقُولُ فِي دُبُرِ كلِّ صَلاَةٍ مَكْتُوبَةٍ: لاَ إِلهَ إِلاَّ اللهُ وَحْدَهُ لاَ شَرِيكَ لَهُ، لَهُ الْمُلْكُ وَلَهُ الْحَمْدُ وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ، اللهُمَّ لاَ مَانِعَ لِمَا أَعْطَيْتَ وَلاَ مُعْطِيَ لِمَا مَنَعْتَ، وَلاَ يَنْفَعُ ذَا الْجَدِّ مِنْكَ الْجَدُّ
__________
أخرجه البخاري في: 10 كتاب الأذان: 155 باب الذكر بعد الصلاة

347. హజ్రత్ ముగైరా బిన్ షాబ (రదియల్లాహు అన్హు) గారి కార్యదర్శి హజ్రత్ వర్రాద్ (రహిమహుల్లాహ్) కథనం:- హజ్రత్ ముగైరా (రదియల్లాహు అన్హు) నా చేత అమీర్ ముఆవియా (రదియల్లాహు అన్హు) పేర ఒక ఉత్తరం వ్రాయించారు. అందులో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రార్థించేవారని ఉంది.

“లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహు లా షరీకలహు లహుల్ ముల్కు వ లహుల్ హమ్దు వ హువ అలాకుల్లి షయ్యిన్ ఖదీర్. అల్లాహుమ్మ లా మానిఅ లిమా ఆతైత వలా మూతియ లిమా మనాత వలా యన్ఫహు జల్ జద్ధి మిన్కల్ జద్దు .”

“అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడు. ఆయన ఒక్కడే. ఆయనకు మరెవరూ సహవర్తులు లేరు. యావత్తు విశ్వ సామ్రాజ్యం ఆయనదే. అన్ని విధాల స్తోత్రాలకు, ప్రశంసలకు ఆయనే యోగ్యుడు. ఆయన సర్వ సమర్థుడు. ప్రతిదానిపై అధికారం కలవాడు. అల్లాహ్! నీవు ప్రసాదించే దాన్ని అడ్డుకునే వారు లేరు. నీవు అడ్డుకునే దాన్ని ఇప్పించేవారు కూడా ఎవరూ లేరు. నీకు వ్యతిరేకంగా ఎవరి ప్రయత్నం కూడా సఫలం కాజాలదు”.

[సహీహ్ బుఖారీ : 10వ ప్రకరణం – అజాన్, 155వ అధ్యాయం – అజ్జిక్రి బాదస్సలాత్]

348 – حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، قَالَ: جَاءَ الْفُقَرَاءِ إِلَى النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَقَالُوا: ذَهَبَ أَهْلُ الدُّثُورِ مِنَ الأَمْوالِ بِالدَّرَجَاتِ الْعُلاَ وَالنَّعِيمِ الْمُقِيمِ، يُصَلُّونَ كمَا نُصَلِّي وَيَصُومُونَ كَمَا نَصُومُ، وَلَهُم فَضْلٌ مِنْ أَمْوَالٍ يَحُجُّونَ بِهَا وَيَعْتَمِرُونَ، وَيُجَاهِدُونَ وَيَتَصَدَّقُونَ قَالَ: أَلاَ أُحَدِّثكُمْ بِمَا إِنْ أَخَذْتُمْ بِهِ أَدْرَكْتُمْ مَنْ سَبَقَكُمْ وَلَمْ يُدْرِكْكُمْ أَحَدٌ بَعْدَكُمْ، وَكُنْتُمْ خَيْرَ مَنْ أَنْتُمْ بَيْنَ ظَهْرَانَيْهِمْ، إِلاَّ مَنْ عَمِلَ مِثْلَهُ تُسبِّحُونَ وَتَحْمَدُونَ وَتكبِّرُونَ خَلْفَ كُلِّ صَلاَةٍ ثَلاَثًا وَثَلاَثِينَ، فَاخْتَلَفْنَا بَيْنَنَا، فَقَالَ بَعْضُنَا نُسَبِّحُ ثَلاَثًا وَثَلاَثِينَ وَنَحْمَدُ ثَلاَثًا وَثَلاَثِينَ وَنكَبِّرُ أَرْبَعًا وَثَلاَثِينَ فَرَجَعْتُ إِلَيْهِ فَقَالَ: تَقُولُ: سُبْحَانَ اللهِ وَالْحَمْدُ للهِ وَاللهُ أَكْبَرُ، حَتَّى يَكُونَ مِنْهُنَّ كُلِّهِنَّ ثَلاَثًا وَثَلاَثِينَ
__________
أخرجه البخاري في: 10 كتاب الأذان: 155 باب الذكر بعد الصلاة

348. హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం:- ఓ రోజు కొందరు పేద ప్రజలు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి వచ్చి “దైవప్రవక్తా! ధనికులు తమ సిరిసంపదల మూలంగా గొప్పగొప్ప హోదా, అంతస్తులు, శాశ్వత సౌఖ్యాలు పొందగలుగుతున్నారు. వారు మాలాగా నమాజులు కూడ చేస్తున్నారు, ఉపవాసాలు కూడా పాటిస్తున్నారు, పైగా డబ్బున్నందున హజ్, ఉమ్రా ఆచారాలు కూడ పాటిస్తున్నారు. జిహాద్ (ధర్మపోరాటం) కూడా చేస్తున్నారు. దానధర్మాలు కూడ చేస్తున్నారు” అని అన్నారు.

అది విని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు : “సరే, నేను మీకో విషయం తెలియజేయనా? దాన్ని గనక మీరు మీ దినచర్యగా చేసుకుంటే, మిమ్మల్ని మించిపోయిన వాళ్ళతో మీరూ సమానులయిపోతారు. ఆ తరువాత మీతో మరెవరూ పోటీ ఉండరు. ఈ పద్ధతి అనుసరించే వాడుతప్ప మీరే అందరికంటే శ్రేష్ఠులయిపోతారు. ఆ విషయం ఏమిటంటే, ప్రతి నమాజు తరువాత, ‘సుబ్ హానల్లాహ్’ అని, ‘అల్ హమ్దు లిల్లాహ్’ అని, ‘అల్లాహు అక్బర్’ అని ముఫ్ఫై మూడుసార్లు చొప్పున స్మరించండి”.

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం:- ఆ తరువాత (వీటి సంఖ్య విషయమయి) మాలో విభేదాలు వచ్చాయి. కొందరు సుబ్ హానల్లాహ్, అల్ హమ్దు లిల్లాహ్ అనే మాటలు ముఫ్ఫైమూడుసార్లు చొప్పున స్మరించాలని, అల్లాహు అక్బర్ అనే మాటను ముఫ్పై నాలుగుసార్లు స్మరించాలని అన్నారు. అందువల్ల నేను ఈ విషయం గురించి మరోసారి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను అడిగాను. అప్పుడాయన “సుబ్ హానల్లాహ్, అల్ హమ్దు లిల్లాహ్, అల్లాహు అక్బర్ అనే మాటలలో ప్రతిదాన్ని ముఫ్పై మూడు సార్లు పఠించండి” అని అన్నారు.

[సహీహ్ బుఖారీ : 10వ ప్రకరణం – అజాన్, 115 వ అధ్యాయం – అజ్జిక్రి బాదస్సలాత్]

349 – حديث أَبِي هُرَيْرَةَ، قَالَ: كَانَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَسْكُتُ بَيْنَ التَّكْبِيرِ وَبَيْنَ الْقِرَاءَةِ إِسْكَاتَةَ هُنَيَّةً، فَقُلْتُ: بِأَبِي وَأُمِّي يَا رَسُولَ اللهِ إِسْكَاتُكَ بَيْنَ التَّكْبِيرِ وَالْقِرَاءَةِ مَا تَقُولُ قَالَ: أَقُولُ: اللهُمَّ بَاعِدْ بَيْنِي وَبَيْنَ خَطَايَايَ كَمَا بَاعَدْتَ بَيْنَ الْمَشْرِقِ وَالْمَغْرِبِ؛ اللهُمَّ نقِّنِي مِنَ الْخَطَايَا كَمَا يُنَقَّى الثَوْبُ الأَبْيَضُ مِنَ الدَّنَسِ، اللهُمَّ اغْسِلْ خَطَايَايَ بِالْمَاءِ وَالثَلْجِ وَالْبَرَدِ
__________
أخرجه البخاري في: 10 كتاب الأذان: 89 باب ما يقول بعد التكبير

349. హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తక్బీరె తహ్రీమాకు (అంటే నమాజు ప్రారంభించే ముందు ‘అలాహు అక్బర్’ అని పలకడానికి), ఖిరాత్ కు (అంటే నమాజులో ఖుర్ఆన్ పఠనానికి) మధ్య కాసేపు మౌనంగా ఉండిపోతారు. అందువల్ల నేనొక రోజు “దైవప్రవక్తా! నా తల్లిదండ్రులు మీకై సమర్పితులు గాక! మీరు తక్బీరె తహ్రీమాకు, ఖిరాత్ కు మధ్య కాస్సేపు నిశ్శబ్దంగా ఉంటారు. అప్పుడు మీరేం పఠిస్తారు” అని అడిగాను. దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సమాధానమిచ్చారు. నేనప్పుడు అల్లాహ్ ను వేడుకుంటాను

“అల్లాహుమ్మ బాయిద్ బైనీ వ బైన ఖతాయాయ కమా బఅత్త బైనల్ మష్రిఖి వల్ మగ్రిబి అల్లాహుమ్మ నఖ్కినీ మినల్ ఖతాయా కమా యునఖ్క సౌబుల్ అబ్ యజు మినద్దనసి అల్లాహుమ్మగ్ సిల్ ఖతాయాయ బిల్ మాయి వస్సల్జి వల్ బరద్”.

(అల్లాహ్! నీవు తూర్పు పడమరల మధ్య ఎంత దూరం వుంచావో నన్ను పాపాలకు అంతే దూరంగా ఉంచు. ఓ నా అల్లాహ్! మాసిన బట్ట తెల్లబట్టలా ఎలా శుభ్రమవుతుందో నా పాపాలను అలా పూర్తిగా శుద్ది చెయ్యి. అల్లాహ్! నా పాపాలను నీరు, మంచు, వడగండ్లతో కడిగివెయ్యి)

[సహీహ్ బుఖారీ : 10వ ప్రకరణం – అజాన్, 89వ అధ్యాయం – మాయఖూలు బాదత్తక్బీర్]

350 – حديث أَبِي هُرَيْرَةَ، قَالَ: سَمِعْتُ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ: إِذَا أُقِيمَتِ الصَّلاَةُ فَلاَ تَأْتُوهَا تَسْعَوْنَ وَأْتُوهَا تَمْشُونَ، عَلَيْكمُ السَّكِينَةُ، فَمَا أَدْرَكْتُمْ فَصلُّوا وَمَا فَاتَكُمْ فَأَتِمُّوا
__________
أخرجه البخاري في: 11 كتاب الجمعة: 18 باب المشي إلى الجمعة وقول الله جل ذكره (فاسعوا إلى ذكر الله)

350. హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:- “నమాజు చేయడానికి జన సమూహం నిలబడినపుడు అందులో చేరడానికి పరుగెత్తిపోకూడదు. నింపాదిగా నడచి వెళ్ళాలి. సామూహిక నమాజులో మీకు ఏ మేరకు లభిస్తే ఆ మేరకు చేయండి. మిగిలిన భాగాన్ని వ్యక్తిగతంగా చేసి నమాజు పూర్తి చేసుకోండి”.

[సహీహ్ బుఖారీ : 11వ ప్రకరణం – జుమా, 18వ అధ్యాయం – అల్ మష్ యి ఇలల్ జుముఆ…..]

351 – حديث أَبِي قَتَادَةَ، قَالَ: بَيْنَمَا نَحْنُ نُصَلِّي مَعَ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، إِذْ سَمِعَ جَلَبَةَ رِجَالٍ، فَلَمَّا صَلَّى قَالَ: مَا شَأْنُكُمْ قَالُوا: اسْتَعْجَلْنَا إِلَى الصَّلاَةِ، قَالَ: فَلاَ تَفْعَلُوا، إِذَا أَتَيْتُمُ الصَّلاَةَ فَعَلَيْكُمْ بِالسَّكِينَةِ، فَمَا أَدْرَكْتُمْ فَصَلُّوا، وَمَا فَاتَكُمْ فَأَتِمُّوا
__________
أخرجه البخاري في: 10 كتاب الأذان: 20 باب قول الرجل فاتتنا الصلاة

351. హజ్రత్ అబూ ఖతాదా (రదియల్లాహు అన్హు) కథనం:- మేమంతా ఓ రోజు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)తో కలసి నమాజు చేస్తుంటే, కొందరు పరుగెత్తుకొస్తున్న అడుగుల చప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు విన్పించింది. నమాజు ముగిసిన తరువాత ఆయన వారిని ఉద్దేశించి “ఏమిటీ, ఏమయింది మీకు అలా పరుగెత్తుకొచ్చారు?” అని అడిగారు. దానికి వారు “మేము త్వరగా జమాఅత్ (సామూహిక నమాజు)లో కలవడానికి పరుగెత్తాము” అని విన్నవించుకున్నారు. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హితవు చేస్తూ “ఇక నుండి అలా చేయకండి. నమాజు చేయడానికి వచ్చినప్పుడల్లా హుందాగా, నింపాదిగా నడచిరండి. సామూహిక నమాజులో ఎంత భాగం లభిస్తే అంతే చేయండి. మిగిలిన భాగాన్ని మీరంతగా మీరు (వ్యక్తిగతంగా) చేసి నమాజును పూర్తి చేసుకోండి” అని అన్నారు.

[సహీహ్ బుఖారీ : 10వ ప్రకరణం – అజాన్, 20వ అధ్యాయం – ఖౌలిర్రజులి ఫఅతతునస్సలాత్]

352 – حديث أَبِي هُرَيْرَةَ، قَالَ: أُقِيمَتِ الصَّلاَةُ وَعُدِّلَتِ الصُّفُوفُ قِيَامًا، فَخَرَجَ إِلَيْنَا رَسُول اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَلَمَّا قَامَ فِي مُصَلاَّهُ ذَكَرَ أَنَّهُ جُنُبٌ؛ فَقَالَ لَنَا: مَكَانَكُمْ ثُمَّ رَجَعَ فاغْتَسَلَ، ثُمَّ خَرَجَ إِلَيْنَا وَرأْسُهُ يَقْطُرُ، فَكَبَّرَ، فَصَلَّيْنَا مَعَهُ
__________
أخرجه البخاري في: 5 كتاب الغسل: 17 باب إذا ذكر في المسجد أنه جنب يخرج كما هو ولا يتيمم

من أدرك ركعة من الصلاة فقد أدرك تلك الصلاة

352. హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం:- ఒకసారి సామూహిక నమాజు కోసం ఇఖామత్ తక్బీర్ చెప్పబడింది. అది విని ప్రజలు బారులు తీరి నిలబడ్డారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నమాజు చేయించడానికి ‘ముసల్లా’ మీద కెళ్ళి నిల్చున్నారు. అంతలో తాను లైంగిక అశుద్ధావస్థలో ఉన్న సంగతి గుర్తుకు రావడంతో ఆయన “అందరూ మీ మీ స్థానాల్లో నిలబడండ”ని చెప్పి ఇంటికి వెళ్ళిపోయారు. స్నానం చేసి మళ్ళీ వచ్చారు. అప్పుడు ఆయన శిరస్సు నుండి నీటి బిందువులు రాలిపడుతుండేవి. ఆయన రాగానే అల్లాహు అక్బర్ అంటూ నమాజు చేయించడానికి ఉపక్రమించారు. మేమంతా ఆయన వెనుక నిలబడి నమాజు చేశాము.

[సహీహ్ బుఖారీ : 5వ ప్రకరణం – గుసుల్, 17వ అధ్యాయం – ఇజాజకర్ ఫిల్ మస్జిది…]

353 – حديث أَبِي هُرَيْرَة، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: مَنْ أَدرَكَ رَكْعَةً مِنَ الصَّلاَةِ فَقَدْ أَدْرَكَ الصَّلاَةَ
__________
أخرجه البخاري في: 9 كتاب مواقيت الصلاة: 29 باب من أدرك من الصلاة ركعة

353. హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: “ఎవరికైనా (సామూహిక) నమాజులో ఒక్క రకాతు లభించినా సరే అతని నమాజు మొత్తం సామూహిక నమాజుగా పరిగణించబడుతుంది.”

[సహీహ్ బుఖారీ : 9వ ప్రకరణం – అల్ మవాకియతుస్సలాత్, 29వ అధ్యాయం – మన్ అద్రక మినస్సలాతి రక అతన్]

354 – حديث أَبِي مَسْعُودٍ، قَالَ: سَمِعْتُ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ: نَزَلَ جِبْرِيلُ فَأَمَّنِي فَصَلَّيْتُ مَعَهُ، ثُمَّ صَلَّيْتُ مَعَهُ، ثُمَّ صَلَّيْتُ مَعَهُ، ثُمَّ صَلَّيْتُ مَعَهُ، ثُمَّ صَلَّيْتُ مَعَهُ يَحْسُبُ بِأَصَابِعِهِ خَمْسَ صَلَوَاتٍ
__________
أخرجه البخاري في: 59 كتاب بدء الخلق: 6 باب ذكر الملائكة

354. హజ్రత్ అబూమస వూద్ అన్సారీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలిపారు: “హజ్రత్ జిబ్రయీల్ (అలైహిస్సలాం) ఓ సారి వచ్చి సామూహిక నమాజుకు నాయకత్వం వహిస్తే, నేను ఆయనతో కలిసి నమాజు చేశాను. మళ్ళీ (రెండోసారి) నమాజు చేశాను, తిరిగి (మూడవసారి) నమాజు చేశాను. ఆ తరువాత (నాల్గవసారి) నమాజు చేశాను, ఆపై (అయిదవసారి) నమాజు చేశాను”.

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విషయం చెబుతూ అయిదు (వేళల) నమాజులను వ్రేళ్ళమీద లెక్క పెట్టారు.

[సహీహ్ బుఖారీ : 59వ ప్రకరణం – బద్ యిల్ ఖల్ఖ్, 6వ అధ్యాయం – జిక్రిల్ మలాయిక్ ]

355 – حديث أَبِي مَسْعُودٍ الأَنْصَارِيِّ عَنِ ابْنِ شِهَابٍ، أَنَّ عُمَرَ بْنَ عَبْدِ الْعَزِيزِ أَخَّرَ الصَّلاَةَ يَوْمًا، فَدَخَلَ عَلَيْهِ عُرْوَةُ بْنُ الزُّبَيْرِ، فَأَخْبَرَهُ أَنَّ الْمُغِيرَةَ بْنَ شُعْبَةَ أَخَّرَ الصَّلاَةَ يَوْمًا وَهُوَ بِالْعِرَاقِ، فَدَخَلَ عَلَيْهِ أَبُو مَسْعُودٍ الأَنْصَارِيُّ؛ فَقَالَ: مَا هذَا يَا مُغِيرَةُ؛ أَلَيْسَ قَدْ عَلِمْتَ أَنَّ جِبْرِيلَ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ نَزَلَ فَصَلَّى فَصَلَّى رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، ثُمَّ صَلَّى فَصَلَّى رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، ثُمَّ صَلَّى فَصَلَّى رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، ثُمَّ صَلَّى فَصَلَّى رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، ثُمَّ صَلَّى فَصَلَّى رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، ثُمَّ قَالَ: بِهذَا أُمِرْتُ
فَقَالَ عُمَرُ لِعُرْوَةَ: اعْلَمْ مَا تحَدِّثُ بِهِ، أَوَ إِنَّ جِبْرِيلَ هُو أَقَامَ لِرَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ وَقْتَ الصَّلاَةِ
قَالَ عُرْوَةُ: كَذلِكَ كَانَ بَشِيرُ بْنُ أَبِي مَسْعُودٍ يُحَدِّثُ عَنْ أَبِيهِ
__________
أخرجه البخاري في: 9 كتاب مواقيت الصلاة: 1 باب مواقيت الصلاة وفضلها

355. హజ్రత్ ఇబ్నెషిహాబ్ (రహిమహుల్లాహ్) కథనం:- హజ్రత్ ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ (రహిమహుల్లాహ్) ఓ రోజు ఆలస్యంగా నమాజు చేశారు. అప్పుడు హజ్రత్ ఉర్వాబిన్ జుబైర్ (రదియల్లాహు అన్హు) వచ్చి హజ్రత్ ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ (రహిమహుల్లాహ్)తో ఇలా అన్నారు:- హజ్రత్ ముగైరా బిన్‌షాబ (రదియల్లాహు అన్హు) ఇరాక్ లో ఉన్న రోజుల్లో ఓసారి (ఇలాగే) ఆలస్యంగా నమాజు చేశారు. అప్పుడు ఆయన దగ్గరకు హజ్రత్ అబూ మస్ వూద్ అన్సారీ (రదియల్లాహు అన్హు) వచ్చి ఇలా అన్నారు:

“ముగైరా! ఏమిటి మీరిలా చేశారు! మీకు తెలియదా!? హజ్రత్ జిబ్రయీల్ (అలైహిస్సలాం) వచ్చి నమాజు చేయించారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆయనతో కలసి నమాజు చేశారు. హజ్రత్ జిబ్రయీల్ (అలైహిస్సలాం) మళ్ళీ నమాజు చేయించారు; దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కోరి ఆయనతో కలసి మళ్ళీ నమాజు చేశారు. ఈ విధంగా ఆయన హజ్రత్ జిబ్రయీల్ (అలైహిస్సలాం)తో కలసి అయిదు(వేళల) నమాజులు చేశారు. తరువాత హజ్రత్ జిబ్రయీల్ (అలైహిస్సలాం) ఆయనతో ‘ఇలా నమాజు చేయాలని మీకు ఆజ్ఞ ఇవ్వబడింది’ అని తెలియజేశారు”.

హజ్రత్ ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ (రహిమహుల్లాహ్) ఈ మాటలు విని “ఉర్వా! ఆలోచించి మాట్లాడండి, మీరు చెబుతున్న దాన్ని బట్టి హజ్రత్ జిబ్రయీల్ (అలైహిస్సలాం) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు నమాజు వేళలు నిర్ణయించి తెలిపారని అర్థమవుతోంది” అని అన్నారు. దానికి హజ్రత్ ఉర్వా సమాధానమిస్తూ, “బషీర్ బిన్ అబూ మస్ వూద్ అన్సారీ కూడ తమ తండ్రి (అబూమస్ వూద్ అన్సారీ (రదియల్లాహు అన్హు)) నోట ఇలాగే విని చెప్పారు” అని అన్నారు.

[సహీహ్ బుఖారీ : 9వ ప్రకరణం – మవాఖియతుస్సలాత్, 1వ అధ్యాయం – మవాఖియతుస్సలాతి వ ఫజ్లిహా]

356 – حديث عَائِشَةَ، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ كَانَ يُصَلِّي الْعَصْرَ وَالشَّمْسُ فِي حُجْرَتِهَا قَبْلَ أَنْ تَظْهَرَ
__________
أخرجه البخاري في: 9 كتاب مواقيت الصلاة: 1 باب مواقيت الصلاة وفضلها

356. హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం:- సూర్యరశ్మి (ఎండ) పై కెక్కకుండా ఇంకా నా ఇంటి ముంగిట ఉంటుంది; ఆ సమయంలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అస్ర్ నమాజు చేసేవారు.

[సహీహ్ బుఖారీ : 9వ ప్రకరణం – మవాఖియతుస్సలాత్, 1వ అధ్యాయం – మవాఖియతుస్సలాతి వ ఫజ్లిహా)

357 – حديثُ أَبِي هُرَيْرَةَ، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: إِذَا اشْتَدَّ الْحَرُّ فَأَبْرِدُوا بِالصَّلاَةِ فَإِنَّ شِدَّةَ الْحَرِّ مِنْ فَيْحِ جَهَنَّمَ
__________
أخرجه البخاري في: 9 كتاب مواقيت الصلاة: 9 باب الإبراد بالظهر في شدة الحر

357. హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: “నరక జ్వలనం అధికమయినపుడు (ఇహలోకంలో) ఎండ తీవ్రమవుతుంది. అందువల్ల మీరు ఎండ తీవ్రమయినపుడు (కాస్త ఆలస్యం చేసి, వాతావరణం చల్లబడిన తరువాత (జుహర్) నమాజు చేయండి”.

[సహీహ్ బుఖారీ : 9వ ప్రకరణం – మవాఖియతుస్సలాత్, 9వ అధ్యాయం – అల్ ఇబ్రాది బిజ్జుహ్రి ఫీషిద్ధతిల్ హర్రి]

358 – حديث أَبِي ذَرٍّ، قَالَ: أَذَّنَ مُؤَذِّنُ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ الظُّهْرَ، فَقَالَ: أَبْرِدْ أَبْرِدْ أَوْ قَالَ: انْتَظِرْ انْتَظِرْ، وَقَالَ: شِدَّةُ الْحَرِّ مِنْ فَيْحِ جَهَنَّمَ، فَإِذَا اشْتَدَّ الْحَرُّ فَأَبْرِدُوا عَنِ الصَّلاَةِ حَتَّى رَأَيْنَا فَيْءَ التُّلُولِ
__________
أخرجه البخاري في: 9 كتاب مواقيت الصلاة: 9 باب الإبراد بالظهر في شدة الحر

358. హజ్రత్ అబూజర్ గిఫ్ఫారి (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త గారి ముఅజ్జిన్ (హజ్రత్ బిలాల్ రదియల్లాహు అన్హు) అజాన్ చెప్పడం మొదలెట్టారు. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) (ఆయన్ని వారిస్తూ) “చల్లబడని, కాస్త చల్లబడని” అన్నారు. లేక “కాస్త ఆగు, కాస్త ఆగు” అన్నారు. ఆ తరువాత “నరక తాపం తీక్షణమయినపుడు (ఇహలోకంలో) ఎండ తీవ్రమవుతుంది. అందుచేత ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు వాతావరణం కాస్త చల్లబడిన తరువాత (జుహర్) నమాజు చేయండి” అని బోధించారు ఆయన(సల్లల్లాహు అలైహి వసల్లం). వేసవి కాలంలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గుట్టల నీడ కన్పించేటంత ఆలస్యంగా జుహర్ నమాజు చేశారు.

[సహీహ్ బుఖారీ : 9వ ప్రకరణం – మవాఖియతుస్సలాత్, 9వ అధ్యాయం – అల్ ఇబ్రాది బిజ్జుహ్రి ఫీషిద్ధతిల్ హర్రి]

359 – حديث أَبِي هُرَيْرَةَ، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: اشْتَكَتِ النَّارُ إِلَى رَبِّهَا، فَقَالَتْ: يَا رَبِّ أَكَلَ بَعْضِي بَعْضًا؛ فَأَذِنَ لَهَا بِنَفَسَيْنِ، نَفَسٍ فِي الشِّتَاءِ وَنَفَسٍ فِي الصَّيْفِ، فَهُوَ أَشَدُّ مَا تَجِدُونَ مِنَ الْحَرِّ، وَأَشَدُّ مَا تَجِدُونَ مِنَ الزَّمْهَرِيرِ
__________
أخرجه البخاري في: 9 كتاب مواقيت الصلاة: 9 باب الإبراد بالظهر في شدة الحر

359. హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:- నరకాగ్ని అల్లాహ్ ను వేడుకుంటూ “ప్రభూ! నాలోని ఒక భాగాన్ని మరొక భాగం తినేసింది. (ఈ అత్యుష్ణాన్ని భరించలేకపోతున్నా, నన్ను కాపాడు)” అన్నది. అప్పుడు అల్లాహ్ దానికి (ఏటా) రెండు సార్లు ఊపిరిపీల్చుకోవడానికి అనుమతినిచ్చాడు. ఈ ఊపిరి పీల్చుకునే వేళలే మీరు (ప్రతి సంవత్సరం) చూస్తున్న ఎండా(కాలం), చలి(కాలం) తీవ్రతలు.

[సహీహ్ బుఖారీ: 9వ ప్రకరణం – మవాఖియతుస్సలాత్, 9వ అధ్యాయం – అల్ ఇబ్రాది బిజ్జుహ్రి ఫీషిద్ధతిల్ హర్రి]

360 – حديث أَنَسِ بْنِ مَالِكٍ رضي الله عنه، قَالَ: كُنَّا نُصَلِّي مَعَ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فِي شِدَّةِ الْحَرِّ، فَإِذَا لَمْ يَسْتَطِعْ أَحَدُنَا أَنْ يُمَكِّنَ وَجْهَهُ مِنَ الأَرْضِ بَسَطَ ثَوْبَهُ فَسَجَدَ عَلَيْهِ
__________
أخرجه البخاري في: 21 كتاب العمل في الصلاة: 9 باب بسط الثوب في الصلاة للسجود

360. హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం:- మేము ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వెనుక జుహ్ర్ నమాజు చేసే వాళ్ళము. అప్పుడు (ఎండ తీవ్రత వల్ల) కొందరు తమ నుదుటిని నేలమీద ఆనించలేక ఒక గుడ్డ పరచుకొని దాని మీద ‘సజ్దా’ చేసేవారు.

[సహీహ్ బుఖారీ : 21వ ప్రకరణం – అల్ అమలు ఫిస్సలాత్, 9వ అధ్యాయం – బస్తిస్సౌబి ఫిస్సలాతి లిస్సుజూద్)

361 – حديث أَنَسِ بْنِ مَالِكٍ، قَالَ: كَانَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يُصَلِّي الْعَصْرَ وَالشَّمْسُ مُرْتَفِعَةٌ حَيَّةٌ، فَيَذْهَبُ الذَّاهِبُ إِلَى الْعَوَالِي فَيَأْتِيهِمْ وَالشَّمْسُ مُرْتَفِعَةٌ؛ وَبَعْضُ الْعَوَالِي مِنَ الْمَدِينَةِ عَلَى أَرْبَعَةِ أَمْيَالٍ، أَوْ نَحْوِهِ
__________
أخرجه البخاري في: 9 كتاب مواقيت الصلاة: 13 باب وقت العصر

361. హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం:- పొద్దువాలిన తరువాత సూర్యకిరణాలు బాగా వాడిగా ఉన్నప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అస్ర్ నమాజు చేసేవారు. నమాజు ముగించిన తరువాత ఎవరైనా మదీనా (పట్టణం వెలుపల) కొండ గుట్టల వైపు పోదలచుకుంటే, అతను అక్కడికి పొద్దువాలిపోయి సూర్యకిరణాలు వాడిగా ఉండగానే చేరుకుంటాడు. మదీనా కొండ గుట్టలలో కొన్ని నాలుగు మైళ్ళ దూరాన ఉన్నాయి. లేక సుమారు నాలుగుమైళ్ళ దూరాన ఉన్నాయి.

[సహీహ్ బుఖారీ : 9వ ప్రకరణం – మవాఖియతుస్సలాత్, 13వ అధ్యాయం – వఖ్తిల్ అస్ర్]

362 – حديث أَنَسِ بْنِ مَالِكٍ عَنْ أَبِي أُمَامَةَ، قَالَ: صَلَّيْنَا مَعَ عُمَرَ بْنِ عَبْدِ الْعَزِيزِ الظُّهْرَ، ثُمَّ خَرَجْنَا حَتَّى دَخَلْنَا عَلَى أَنَسِ بْنِ مَالِكٍ، فَوَجَدْنَاهُ يُصَلِّي الْعَصْرَ، فَقُلْتُ: يَا عَمِّ مَا هذِهِ الصَّلاَةُ الَّتِي صَلَّيْتَ قَالَ: الْعَصْرُ، وَهذِهِ صَلاَةُ رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ الَّتِي كُنَّا نُصَلِّي مَعَهُ
__________
أخرجه البخاري في: 9 كتاب مواقيت الصلاة: 13 باب وقت العصر

362. హజ్రత్ అబూ అమామా (రహిమహుల్లాహ్) కథనం:- ఒకసారి మేము హజ్రత్ ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ (రహిమహుల్లాహ్)తో కలసి జుహర్ నమాజు చేశాము. నమాజు ముగిసిన తరువాత మేము హజ్రత్ అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) దగ్గరకు వెళ్ళి చూస్తే ఆయన. అస్ర్ నమాజ్ చేస్తూ ఉండటం కన్పించింది. (నమాజు అయిన తరువాత) “బాబాయి! మీరిప్పుడు చేసిన నమాజు ఏ వేళ నమాజు?” అని అడిగాను నేను. దానికాయన సమాధానమిస్తూ “ అస్ర్ నమాజ్. మేము దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)తో కలసి ఇలాంటి (వేళే) అస్ర్ నమాజు చేస్తూ ఉండే వాళ్ళము” అని అన్నారు.

[సహీహ్ బుఖారీ : 9వ ప్రకరణం – మవాఖియతుస్సలాత్, 13వ అధ్యాయం – వఖ్తిల్ అస్ర్]

363 – حديث رَافِعِ بْنِ خَدِيجٍ رضي الله عنه، قَالَ: كُنَّا نُصَلِّى مَعَ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ الْعَصْرَ، فَنَنْحَرُ جَزُورًا فَتُقْسَمُ عَشْرَ قِسْمٍ، فَنأْكُلُ لَحْمًا نَضِيجًا قَبْلَ أَنْ تَغْرُبَ الشَّمْسُ
__________
أخرجه البخاري في: 47 كتاب الشركة: 1 باب الشركة في الطعام

363. హజ్రత్ రాఫె బిన్ ఖదీజ్ (రదియల్లాహు అన్హు) కథనం:- మేము దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)తో కలసి పొద్దు చాలా ఉండగానే) అస్ర్ నమాజు చేసే వాళ్ళము. నమాజు ముగిసిన తరువాత మేము ఒంటెను కోసి దాని మాంసాన్ని పది భాగాలుగా విభజిస్తాము. ఆ మాంసాన్ని వండి, సూర్యాస్తమయం కాక మునుపే తినేసే వాళ్ళము.

[సహీహ్ బుఖారీ : 47వ ప్రకరణం – అష్షిరిక – 1వ అధ్యాయం – అష్షిర్కతి ఫిత్త ఆమ్)

364 – حديث ابْنِ عُمَرَ، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: الَّذِي تَفُوتُهُ صَلاَةُ الْعَصْرِ كَأَنَّمَا وُتِرَ أَهْلَهُ وَمَالَهُ
__________
أخرجه البخاري في: 9 كتاب مواقيت الصلاة: 14 باب إثم من فاتته العصر

364. హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: “ఎవరైతే అస్ర్ నమాజు పోగొట్టుకుంటాడో (అంటే ఖజా చేస్తాడో) అతని ఇల్లు, సంపద, సామగ్రి సర్వం నాశనమయిపోయినట్లే”

[సహీహ్ బుఖారీ : 9వ ప్రకరణం – మవాఖియతుస్సలాత్, 14వ అధ్యాయం – ఇస్మిమన్ ఫాతతహు సలాతిల్ అస్ర్]

365 – حديث عَلِيٍّ رضي الله عنه، قَالَ: لَمَّا كَانَ يَوْمُ الأَحْزَابِ، قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: مَلأَ اللهُ بُيُوتَهُمْ وَقُبورَهُمْ نَارًا، شَغَلُونَا عَنِ الصَّلاَةِ الْوُسْطَى حَتَّى غَابَتِ الشَّمْسُ
__________
أخرجه البخاري في: 56 كتاب الجهاد: 98 باب الدعاء على المشركين بالهزيمة والزلزلة

365. హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అహ్ ఖాబ్ యుద్ధం రోజుల్లో (బహుదైవారాధకుల్ని శపిస్తూ) “అల్లాహ్ వారి ఇళ్ళను, సమాధుల్ని అగ్నితో నింపుగాక! సూర్యుడు అస్తమించినా వారు మనల్ని ‘సలాతుల్ వుస్తా’ చేయనివ్వలేదు” అని అన్నారు.

[సహీహ్ బుఖారీ: 56వ ప్రకరణం – జిహాద్, 98వ అధ్యాయం – అద్దుఆ అలల్ ముష్రికీన …..]

366 – حديث جَابرِ بْنِ عَبْدِ اللهِ، أَنَّ عُمَرَ بْنَ الخَطَّابِ جَاءَ يَوْمَ الْخَنْدَقِ بَعْدَمَا غَرَبَتِ الشَّمْسُ فَجَعَلَ يَسُبُّ كُفَّارَ قُرَيْشٍ، قَالَ: يَا رَسولَ اللهِ مَا كِدْتُ أُصَلِّي الْعَصْرَ حَتَّى كَادَتِ الشَّمْسُ تَغْرُبُ، قَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: واللهِ مَا صَلَّيْتُهَا فَقُمْنَا إِلَى بُطْحَانَ، فَتوَضَّأَ للِصَّلاَةِ، وَتَوَضَّأْنَا لَهَا، فَصَلَّى الْعَصْرَ بَعْدَ مَا غَرَبَتِ الشَّمْسُ، ثُمَّ صَلَّى بَعْدَهَا الْمَغْرِبَ
__________
أخرجه البخاري في: 9 كتاب مواقيت الصلاة: 36 باب من صلى بالناس جماعة بعد ذهاب الوقت

366. హజ్రత్ జాబిర్ బిన్ అబ్దుల్లా (రదియల్లాహు అన్హు) కథనం:- హజ్రత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు) కందకం యుద్ధకాలంలో (అంటే అహ్ ఖాబ్ యుద్ధకాలంలో) ఓ రోజు సూర్యాస్తమయమయిన తరువాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి వచ్చారు. ఆయన వచ్చీ రాగానే ఖురైష్ బహుదైవారాధకులకు శాపనార్థాలు పెడుతూ “దైవప్రవక్తా! (వీరి మూలంగా) నేను సూర్యాస్తమయమవుతున్నా అస్ర్ నమాజు ఇంతవరకు చేయలేకపోయాను” అని అన్నారు. దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “అల్లాహ్ సాక్షి! నేను కూడా చేయలేక పోయాను” అని అన్నారు. ఆ తరువాత మేమంతా బుత్హాన్ అనే ప్రదేశానికి చేరుకొని వుజూ చేశాము. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సూర్యాస్తమయం అయిన తరువాత అస్ర్ నమాజ్ (సామూహికంగా) చేశారు. ఆ తరువాత (వెంటనే) మగ్రిబ్ నమాజు చేశారు.

[సహీహ్ బుఖారీ : 9వ ప్రకరణం – మవాఖియతుస్సలాత్, 36వ అధ్యాయం – మన్సల్లా బిన్నాసి జమాఅతు బాద జహా బిల్ వఖ్త్]

367 – حديث أَبِي هُرَيْرَةَ، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: يَتَعَاقَبُونَ فِيكُمْ، مَلاَئِكَةٌ بِاللَّيْلِ وَمَلاَئِكَةٌ بِالنَّهَارِ، وَيَجْتَمِعُونَ فِي صَلاَةِ الْفَجْرِ وَصَلاَةِ الْعَصْرِ، ثُمَّ يَعْرُجُ الَّذِينَ بَاتُوا فِيكُمْ فَيَسْأَلُهُمْ رَبُّهُمْ، وَهُوَ أَعْلَمُ بِهِمْ، كَيْفَ تَرَكْتُمْ عِبَادِي فَيَقُولُونَ تَرَكْنَاهُمْ وَهُمْ يُصَلُّونَ، وَأَتَيْناهُمْ وَهُمْ يُصَلُّونَ
__________
أخرجه البخاري في: 9 كتاب مواقيت الصلاة: 16 باب فضل صلاة العصر

367. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేశారు: “మీ దగ్గరకు రాత్రి దైవదూతలు, పగటి దైవదూతలు ఒకరి వెనుక మరొకరు వస్తారు. ఈ రెండు బృందాలు ఫజ్ర్, అస్ర్ నమాజులలో మాత్రం కలుస్తారు. రాత్రంతా మీతో పాటు గడిపిన దైవదూతలు తిరిగి ఆకాశం పైకి వెళ్ళినప్పుడు మీ ప్రభువు వారిని ఉద్దేశించి “మీరు నా దాసులను ఏ స్థితిలో వదలి పెట్టి వచ్చారు?’ అని అడుగుతాడు. దానికి దైవదూతలు “మేము వారి దగ్గర్నుంచి బయలు దేరేటప్పుడు వారు నమాజు చేస్తూ ఉండటం కన్పించింది. అంతకు ముందు మేము వారి దగ్గరకు చేరుకున్నప్పుడు కూడా వారిని నమాజ్ స్థితిలోనే చూశాము” అని సమాధానమిస్తారు.

[సహీహ్ బుఖారీ : 9వ ప్రకరణం – మవాఖియతుస్సలాత్, 16వ అధ్యాయం – ఫజ్లి స్సలాతిల్ అస్ర్ ]

368 – حديث جَرِيرٍ، قَالَ: كُنَّا عِنْدَ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فَنَظَرَ إِلَى الْقَمَر لَيْلَةً، يَعْنِي الْبَدْرَ، فَقَالَ: إِنَّكُمْ سَتَرَوْنَ رَبَّكُمْ كَمَا تَرَوْنَ هذَا الْقَمَرَ، لاَ تُضَامُّونَ فِي رُؤْيَتِهِ، فَإِنِ اسْتَطَعْتُمْ أَنْ لاَ تُغْلَبُوا عَلَى صَلاَةٍ قَبْلَ طُلُوعِ الشَّمْسِ وَقَبْلَ غُرُوبِهَا فَافْعَلُوا ثُمَّ قَرَأَ: (وَسَبِّحْ بِحَمْدِ رَبِّكَ قَبْلَ طُلُوعِ الشَّمْسِ وَقَبْلَ الْغُرُوبِ)
__________
أخرجه البخاري في: 9 كتاب مواقيت الصلاة: 16 باب فضل صلاة العصر

368. హజ్రత్ జరీర్ బిన్ అబ్దుల్లా (రదియల్లాహు అన్హు) కథనం:- మేమొకసారి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెంత (కూర్చొని) ఉండగా రాత్రి వేళ అయింది. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆకాశంలో (పున్నమి) చంద్రుడ్ని చూసి మాతో ఇలా అన్నారు : “ఇప్పుడు మీరు చంద్రుడ్ని ఎలా స్పష్టంగా చూస్తున్నారో అదే విధంగా త్వరలోనే మీరు (ప్రళయదినాన) మీ ప్రభువుని స్పష్టంగా చూస్తారు. ఆయన్ని దర్శించడంలో మీ ముందు ఎలాంటి ఆటంకం ఉండదు. అందువల్ల మీరు సూర్యోదయానికి పూర్వం చేయవలసిన (ఫజ్ర్) నమాజును, సూర్యాస్తమయానికి పూర్వం చేయవలసిన (అస్ర్) నమాజును చేయడంలో వీలైనంతవరకు మీ ముందు ఎలాంటి ఆటంకం ఏర్పడకుండా ఉండేలా కృషి చేయండి (అశ్రద్ధ, అలసత్వాలకు ఏ మాత్రం తావీయకండి.)”

ఇలా అన్న తరువాత ” వ సబ్బిహ్ బిహమ్ది రబ్బిక ఖబ్ల తులూయి షమ్సి వ ఖబ్లల్ గురూబ్’ (మీరు సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయానికి పూర్వం మీ ప్రభువు ఔన్నత్యాన్ని స్తుతిస్తూ, ఆయన్ని స్మరించండి) అనే ఖుర్ఆన్ – (ఖాఫ్-39) సూక్తి పఠించారు ఆయన.

[సహీహ్ బుఖారీ : 9వ ప్రకరణం – మవాఖియతుస్సలాత్, 16వ అధ్యాయం – ఫజ్లి స్సలాతిల్ అస్ర్ ]

369 – حديث أبِي مُوسى، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: مَنْ صَلَّى الْبَرْدَيْنِ دَخَلَ الْجَنَّةَ
__________
أخرجه البخاري في: 9 كتاب مواقيت الصلاة: 26 باب فضل صلاة الفجر

369. హజ్రత్ అబూమూసా అష్ అరి (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు : “రెండు చల్లని వేళల్లో చేయవలసిన (ఫజ్ర్, అస్ర్) నమాజులు (ప్రతి రోజు క్రమం తప్పకుండా) చేసే వ్యక్తి స్వర్గంలో ప్రవేశిస్తాడు.”

[సహీహ్ బుఖారీ : 9వ ప్రకరణం – మవాఖియతుస్సలాత్, 26వ అధ్యాయం – ఫజ్లిస్సలాతిల్ ఫజ్ర్]

370 – حديث سَلَمَةَ، قَالَ: كُنَّا نُصَلِّي مَعَ النَّبيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ الْمَغْرِبَ إِذَا تَوَارَتْ بِالْحِجَابِ
__________
أخرجه البخاري في: 9 كتاب مواقيت الصلاة: 18 باب وقت المغرب

370. హజ్రత్ సల్మా బిన్ అకూ (రదియల్లాహు అన్హు) కథనం:- మేము దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)తో కలసి, సూర్యుడు పూర్తిగా తెరమరుగయిన తరువాత మగ్రిబ్ నమాజు చేసేవాళ్ళము.

[సహీహ్ బుఖారీ : 9వ ప్రకరణం – మవాఖియతుస్సలాత్, 18వ అధ్యాయం – వఖ్తుల్ మగ్రిబ్)

371 – حديث رَافِعِ بْنِ خَدِيجٍ، قَالَ: كُنَّا نُصَلِّي الْمَغْرِبَ مَعَ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فَيَنْصَرِفُ أَحَدُنَا وَإِنَّهُ لَيُبْصِرُ مَوَاقِعَ نَبْلِهِ
__________
أخرجه البخاري في: 9 كتاب مواقيت الصلاة: 18 باب وقت المغرب

371. హజ్రత్ రాఫె బిన్ ఖదీజ్ (రదియల్లాహు అన్హు) కథనం:- మేము దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)తో కలసి మగ్రిబ్ నమాజు చేసి (ఇండ్లకు) తిరిగి వెళ్తుంటే (పూర్తిగా చీకటి పడేది కాదు) మనిషి తన బాణం పడిన చోటును స్పష్టంగా చూడగలిగినంత వెలుగు వుండేది.*

[సహీహ్ బుఖారీ : 9వ ప్రకరణం – మవాఖియతుస్సలాత్, 18వ అధ్యాయం – వఖ్తిల్ మగ్రిబ్]

* ఈ హదీసును ‘ముస్నద్ అహ్మద్’ గ్రంథంలోని ఒక ప్రామాణిక ఉల్లేఖనం వివరిస్తోంది. దీన్ని అలీ బిన్ బిలాల్ (రహిమహుల్లాహ్) కొందరు అన్సారీ సహాబీల నుండి గ్రహించారు. వారిలా తెలియజేశారు:- “దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కాలంలో మేము మగ్రిబ్ నమాజ్ చేసి వచ్చిన తర్వాత ధనుర్బాణ పోటీల్లో పాల్గొనేవాళ్ళము. ఆ తర్వాత మేము ఇండ్లకు తిరిగివస్తాము. ఆ సమయంలో మేము బాణం వేసిన చోటును సయితం చూడగలిగేటంత వెలుగు ఉండేది. దీన్ని బట్టి మగ్రిబ్ నమాజ్ వేళ కాగానే వెంటనే చేయాలనీ, నమాజు దీర్ఘంగా కాకుండా సంక్షిప్తంగా చేయాలని తెలుస్తోంది. – సంకలనకర్త

372 – حديث عَائِشَةَ قَالَتْ: أَعْتَمَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ لَيْلَةً بِالْعِشَاءِ، وَذلِكَ قَبْلَ أَنْ يَفْشُوَ الإِسْلاَمُ، فَلَمْ يَخْرُجْ حَتَّى قَالَ عُمَرُ: نَامَ النِّسَاءُ وَالصِّبْيَانُ؛ فَخَرَجَ، فَقَالَ لأَهْلِ الْمَسْجِدِ: مَا يَنْتَظِرُهَا أَحَدٌ مِنْ أَهْلِ الأَرْضِ غَيْرَكُمْ
__________
أخرجه البخاري في: 9 كتاب المواقيت 22 فضل العشاء

372. విశ్వాసుల మాతృమూర్తి హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒక రోజు రాత్రి ఇషా నమాజు చాలా ఆలస్యంగా చేశారు (ఇది ఇస్లాం ఇంకా వ్యాపించని నాటి సంఘటన). హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) వచ్చి “దైవప్రవక్తా! పిల్లలు, స్త్రీలు నిద్ర కూడా పోయారు” అని చెప్పేదాకా ఆయన ఇంటి నుంచి బయలుదేరలేదు. హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) మాట విని ఆయన బయటికి వచ్చారు. మస్జిదులో సమావేశమయిన వారిని ఉద్దేశించి “ఈ సమయంలో మొత్తం భూలోక వాసుల్లో మీరు తప్ప మరెవ్వరూ ఈ నమాజు కోసం ఇంతగా నిరీక్షించడం లేదు” అని అన్నారు ఆయన.

[సహీహ్ బుఖారీ : 9వ ప్రకరణం – మవాఖియతుస్సలాత్, 22వ అధ్యాయం – ఫజ్లుల్ ఇషా)

373 – حديث عَبْدِ اللهِ بن عُمَرَ، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ شُغِلَ عَنْهَا لَيْلَةً، فَأَخَّرَهَا حَتَّى رَقَدْنَا فِي الْمَسْجِدِ، ثُمَّ اسْتَيْقَظْنَا، ثُمَّ رَقَدْنَا ثُمَّ اسْتَيْقَظْنَا، ثُمَّ خَرَجَ عَلَيْنَا النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، ثُمَّ قَالَ: لَيْسَ أَحَدٌ مِنْ أَهْلِ الأَرْضِ يَنْتَظِرُ الصَّلاَةَ غَيْرُكُمْ
__________
أخرجه البخاري في: 9 كتاب مواقيت الصلاة: 24 باب النوم قبل العِشاء لمن غُلِب

373. హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం:- ఒక రోజు రాత్రి ఇషా నమాజు వేళ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఏదో పనిలో నిమగ్నులయిపోవడం వల్ల మస్జిదుకు రావడం చాలా ఆలస్యమయిపోయింది. మేము మస్జిదులో ఆయన కోసం ఎదురు చూసి చూసి చివరకు నిద్రపోయాము. కాస్సేపటికి లేచి మళ్ళీ నిద్రపోయాము. ఆ తరువాత లేచి చూస్తే ఆయన వచ్చేశారు. (నమాజు చేయించిన) తరువాత ఆయన మమ్మల్ని ఉద్దేశించి “ఈ సమయంలో యావత్తు భూలోక వాసుల్లో మీరు తప్ప మరెవ్వరూ నమాజు కోసం (ఇంత తీవ్రంగా) ఎదురు చూడటం లేదు” అని అన్నారు.

[సహీహ్ బుఖారీ : 9వ ప్రకరణం – మవాఖియతుస్సలాత్, 24వ అధ్యాయం – అన్నౌమి ఖబ్లల్ ఇషాయి లిమన్ గులిబ్ ……]

374 – حديث أَنَسٍ قَالَ حُمَيْدٌ: سُئِلَ أَنَسٌ، هَلِ اتَّخَذَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ خَاتَمًا قَالَ: أَخَّرَ لَيْلَةً صَلاَةَ الْعِشَاءِ إِلَى شَطْرِ اللَّيْلِ، ثُمَّ أَقْبَلَ عَلَيْنَا بِوَجْههِ فَكَأَنِّي أَنْظُرُ إِلَى وَبِيصِ خَاتَمِهِ قَالَ: إِنَّ النَّاسَ قَدْ صَلَّوْا وَنَامُوا وَإِنَّكُمْ لَمْ تَزَالُوا فِي صَلاَةٍ مَا انْتَظَرْتُمُوهَا
__________
أخرجه البخاري في: 77 كتاب اللباس: 48 باب فص الخاتم

374. హజ్రత్ హుమైద్ (రహిమహుల్లాహ్) కథనం:- “దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉంగరం వాడారా?” అని ఒక వ్యక్తి హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు)ని అడిగాడు. దానికాయన సమాధానమిస్తూ ఇలా అన్నారు. “ఓ రోజు రాత్రి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇషా నమాజుకు చాలా ఆలస్యంగా అర్థరాత్రి గడచిన తరువాత వచ్చారు. ఆ తరువాత ఆయన మమ్మల్ని ఉద్దేశించి “జనమంతా నమాజు చేసి పడుకున్నారు. మీరు నమాజు కోసం ఎంత సేపు నిరీక్షించారో అదంతా మీరు నమాజులో గడిపినట్లే లెక్క” అని అన్నారు. ఆయన ధరించిన ఉంగరం ఇప్పటికీ నా కళ్ళ ముందు వెలిగిపోతూ కన్పిస్తోంది.”

[సహీహ్ బుఖారీ: 77వ ప్రకరణం – అల్లిబాస్, 48వ అధ్యాయం – ఫస్సిల్ ఖాతమ్)

375 – حديث أَبِي مَوسى قَالَ: كُنْتُ أَنَا وَأَصْحَابِي الَّذِينَ قَدِمُوا مَعِي فيِ السَّفِينَةِ نُزُولاً فِي بَقِيعِ بُطْحَانَ، وَالنَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ بِالْمَدِينَةِ، فَكَانَ يَتَنَاوَبُ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ عِنْدَ صَلاَةِ الْعِشَاءِ كُلَّ لَيْلَةٍ نَفَرٌ مِنْهُمْ، فَوَافَقْنَا النَّبِيَّ عَلَيْهِ السَّلاَمُ أَنَا وَأَصْحَابِي، وَلَهُ بَعْضُ الشُّغْلِ فيِ بَعْضِ أَمْرِهِ فَأَعْتَمَ بِالصَّلاَةِ حَتَّى ابْهَارَّ اللَّيْلُ، ثُمَّ خَرَجَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فَصَلَّى بِهِمْ، فَلَمَّا قَضَى صَلاَتَهُ، قَالَ لِمَنْ حَضَرهُ: عَلَى رِسْلِكُمْ، أَبْشِرُوا، إِنَّ مِنْ نِعْمَةِ اللهِ عَلَيْكُمْ أَنَّهُ لَيْسَ أَحَدٌ مِنَ النَّاسِ يُصَلِّي هذِهِ السَّاعَةَ غَيْرُكُمْ، أَوْ قَالَ: مَا صَلَّى هذِهِ السَّاعَةَ أَحَدٌ غَيْرُكُمْ قَالَ أَبُو مُوسى، فَفَرِحْنَا بِمَا سَمِعْنَا مِنْ رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ
__________
أخرجه البخاري في: 9 كتاب مواقيت الصلاة: 22 باب فضل العِشاء

375. హజ్రత్ అబూ మూసా అష్ అరీ (రదియల్లాహు అన్హు) కథనం:- నేను, ఓడలో నాతో పాటు వచ్చిన నా సహచరులు అందరం మదీనా వెలుపల ‘బఖీ’ అనే చోట కంకర్రాళ్ళ ప్రదేశంలో బస చేశాము. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మదీనాలో ఉన్నారు. అందువల్ల మాలో ఒక్కొక్క బృందం వంతుల వారీగా ప్రతి రోజూ ఇషా వేళకు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి వెళ్ళేది. ఒక రోజు నా వంతు వచ్చింది. నేను కొందరు సహచరులతో కలసి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి వెళ్ళాను. అయితే ఆ రోజు యాదృచ్చికంగా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు ఏదో పని తగలడం వల్ల ఆయన ఇషా నమాజుకు రావడం చాలా ఆలస్యమయిపోయింది. అర్థరాత్రి గడచిపోయింది. అప్పుడు ఆయన వచ్చి నమాజు చేయించారు. నమాజు ముగిసిన తరువాత సభికుల్ని ఉద్దేశించి “ఆగండి. మీకో శుభవార్త! అల్లాహ్ మీకెంతో మేలు చేశాడు. ఈ సమయంలో మీరు తప్ప మరెవరూ నమాజు చేయడం లేదు” అని అన్నారు. లేక “ఈ సమయంలో మీరు తప్ప మరెవరూ నమాజు చేయలేదు” అని అన్నారు. ఆ తరువాత మేము (మా విడిదికి) వెళ్ళిపోయాము. ఆ రోజు ఆయన నోట ఆ శుభవార్త విని మేమెంతో ఆనందించాము.

[సహీహ్ బుఖారీ : 9వ ప్రకరణం – మవాఖియతుస్సలాత్, 22వ అధ్యాయం – ఫజ్లిల్ ఇషా]

376 – حديث ابْنِ عَبَّاسٍ قَالَ: أَعْتَمَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ لَيْلَةً بِالْعِشَاءِ حَتَّى رَقَدَ النَّاسُ وَاسْتَيْقَظُوا، وَرَقَدُوا وَاسْتَيْقَظُوا؛ فَقَامَ عُمَرُ بْنُ الْخَطَّابِ، فَقَالَ: الصَّلاَةَ فَخَرَجَ نَبِيُّ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، كَأَنِّي أَنْظُرُ إِلَيْهِ الآنَ، يَقْطُرُ رَأْسُهُ مَاءً، وَاضِعًا يَدَهُ عَلَى رَأْسِهِ فَقَالَ: لَوْلاَ أَنْ أَشُقَّ عَلَى أُمَّتِي لأَمَرْتُهُمْ أَنْ يُصَلُّوهَا هكَذَا (قَالَ ابْنُ جُرَيْجٍ الرَّاوِي عَنْ عَطَاءٍ، الرَّاوِي عَنِ ابْنِ عَبَّاسٍ) فَاسْتَثْبَتُّ عَطَاءً كَيْفَ وَضَعَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ عَلَى رَأْسِهِ يَدَهُ [ص:127] كَمَا أَنْبَأَهُ ابْنُ عبَّاسٍ، فَبَدَّدَ لِي عَطَاءٌ بَيْنَ أَصَابِعِهِ شَيْئًا مِنْ تَبْدِيدٍ، ثُمَّ وَضَعَ أَطْرَافَ أَصَابِعِهِ عَلَى قَرْنِ الرَّأْسِ ثُمَّ ضَمَّهَا، يُمِرُّهَا كَذلِكَ عَلَى الرَّأْسِ حَتَّى مَسَّتْ إِبْهَامُهُ طَرَفَ الأُذُنِ مِمَّا يَلِي الْوَجْهَ عَلَى الصُّدْغِ وَنَاحِيَةِ اللِّحْيَةِ، لاَ يُقَصِّرُ وَلاَ يَبْطشُ إِلاَّ كَذلِكَ، وَقَالَ: لَوْلاَ أَنْ أَشُقَّ عَلَى أُمَّتِي لأَمَرْتُهُمْ أَنْ يُصَلُّوهَا هكَذَا
__________
أخرجه البخاري في: 9 كتاب مواقيت الصلاة 24 باب النوم قبل العِشاء لمن غُلِب

376. హజ్రత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) కథనం:- ఓ రోజు రాత్రి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇషా నమాజుకు చాలా ఆలస్యంగా వచ్చారు. జనం (ఆయన కోసం ఎదురు చూసి చూసి చివరకు) నిద్రపోయారు. ఆ తరువాత మరో కునుకు తీశారు. ఈ పరిస్థితి చూసి హజ్రత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు) లేచి “నమాజు (కోసం జన సమూహం) సిద్ధంగా ఉంద”ని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు తెలియజేశారు. అది విని దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) బయటకు వచ్చారు. ఆయన తలమీద చేయి పెట్టుకొని రాసాగారు. తలపై నుండి నీటి బిందువులు రాలుతున్నాయి. ఆ దృశ్యం ఇప్పటికీ నా కళ్ళ ముందు మెదలుతోంది. ఆ తరువాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అనుచరుల్ని ఉద్దేశించి “నా అనుచర సమాజం ఇబ్బందులకు గురవుతుందన్న ఆలోచన నాకు కలగకపోయి ఉంటే, ఇలాగే (ప్రతి రోజూ ఆలస్యంగా) ఇషా నమాజు చేయాలని నేను ఆదేశించే వాడ్ని” అని అన్నారు.

హజ్రత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) నోట హజ్రత్ అతా (రహిమహుల్లాహ్) వినగా, ఆయన ద్వారా ఈ హదీసు ఉల్లేఖించిన హజ్రత్ ఇబ్బె జరీజ్ (రహిమహుల్లాహ్) ఇలా తెలియజేశారు – “నేను అతా (రహిమహుల్లాహ్)ను (ఈ హదీసు గురించి వివరాలు అడుగుతూ) “దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) తమ శిరస్సు మీద ఎలా చేయి పెట్టుకున్నారో హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హు) మీకు చేసి చూపించినట్లు నాక్కూడా మీరు కాస్త చేసి చూపండి” అని విన్నవించుకున్నాను. అప్పుడు హజ్రత్ అతా (రహిమహుల్లాహ్) నాకు చూపించడానికి, తన చేతి వ్రేళ్ళను కాస్త ఎడం చేసి వాటి చివర్లను తల వైపుకు చుట్టూపోనిచ్చారు. తరువాత కణత, గడ్డం అంచు కలసి ఉన్న చెవి భాగాన్ని బొటనవేలు స్పర్శించేలా చేతి వేళ్ళను తలమీద త్రిప్పారు. ఆయన ఇలా చేస్తున్నప్పుడు తొందరగా గాని, ఆలస్యంగా గాని చేయకుండా నింపాదిగా చేశారు. ఆ తరువాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించినట్లు తెలిపారు . “నా అనుచర సమాజం ఇబ్బందులకు గురవుతుందన్న ఆలోచన నాకు కలగకపోతే ఇలాగే (ప్రతి రోజూ ఆలస్యంగా) ఇషా నమాజు చేయాలని నేను ఆజ్ఞాపించేవాడ్ని.”

[సహీహ్ బుఖారీ : 9వ ప్రకరణం – మవాఖియతుస్సలాత్, 24వ అధ్యాయం – అన్నౌమి ఖబ్లల్ ఇషాయి లిమన్ గులిబ్ ]

377 – حديث عَائِشَةَ، قَالَتْ: كُنَّ نِسَاءُ الْمُوْمنَاتِ يَشْهَدْنَ مَعَ رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ صَلاَةَ الْفَجْرِ مُتَلَفِّعَاتٍ بِمُرُوطِهِنَّ، ثُمَّ يَنْقَلِبْنَ إِلَى بُيُوتِهِنَّ حِينَ يَقْضِينَ الصَّلاَةَ لاَ يَعْرِفُهُنَّ أَحَدٌ مِنَ الْغَلَسِ
__________
أخرجه البخاري في: 9 كتاب مواقيت الصلاة: 27 باب وقت الفجر

377. హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నేతృత్వంలో ఫజ్ర్ నమాజు చేయడానికి ముస్లిం మహిళలు దుప్పట్లు కప్పుకొని మస్జిదుకు వెళ్ళేవారు. నమాజు ముగిసిన తరువాత వారు తమ తమ ఇండ్లకు మరలేటప్పుడు బయట తమను ఎవరూ గుర్తించలేనంత చీకటిగా ఉండేది.

[సహీహ్ బుఖారీ : 9వ ప్రకరణం – మవాఖియతుస్సలాత్, 27వ అధ్యాయం – వఖ్తిల్ ఫజ్ర్)

378 – حديث جَابِرِ بْنِ عَبْدِ اللهِ، قَالَ: كَانَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يُصَلِّي الظُّهْرَ بِالْهَاجِرَةِ، وَالْعَصْرَ وَالشَّمْسُ نَقِيَّةٌ، وَالْمَغْرِبَ إِذَا وَجَبَتْ، وَالْعِشَاءَ أَحْيَانًا وَأَحْيَانًا: إِذَا رَآهُمُ اجْتَمَعُوا عَجَّلَ، وَإِذَا رَآهُمْ أَبْطَوْا أَخَّرَ؛ وَالصُّبْحَ كَانُوا، أَوْ، كَانَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يُصَلِّيها بِغَلَسٍ
__________
أخرجه البخاري في: 9 كتاب مواقيت الصلاة: 27 باب وقت الفجر

378. హజ్రత్ జాబిర్ బిన్ అబ్దుల్లా (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జుహర్ నమాజ్ మధ్యాహ్నం (సూర్యుడు వాలిన వెంటనే) చేసేవారు. అస్ర్ నమాజు సూర్యుడు (పశ్చిమదిశకు వాలిపోయి ఇంకా) స్పష్టంగా ప్రకాశిస్తున్న వేళ చేసేవారు. మగ్రిబ్ నమాజు సూర్యుడు అస్తమించగానే చేసేవారు. ఇషా నమాజు రాత్రివేళ ఒక్కొక్కసారి పొద్దుపోయి (ఆలస్యంగా) చేసేవారు, ఒక్కొక్కసారి కాస్త పెందలాడే చేసేవారు. అంటే జనం తొందరగా గుమికూడితే కాస్త త్వరగా, ఆలస్యంగా గుమికూడితే కాస్త ఆలస్యంగా చేసేవారు. పోతే ఫజ్ర్ నమాజ్ – (ఇక్కడ ఈ హదీసు ఉల్లేఖించిన వ్యక్తికి కర్త ఎవరో సరిగా జ్ఞాపకం లేక) హజ్రత్ జాబిర్ (రదియల్లాహు అన్హు) ముస్లిములో లేక దైవప్రవక్తో (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారని అంటూ ఇలా తెలియజేశాడు – చివరి జాము చీకటి ఇంకా మిగిలి ఉండగానే చేసేవారు.

[సహీహ్ బుఖారీ : 9వ ప్రకరణం – మవాఖియతుస్సలాత్, 18వ అధ్యాయం – వఖ్తిల్ మగ్రిబ్ ]

379 – حديث أَبِي بَرْزَةَ الأَسْلَمِيِّ، وَقَدْ سُئِلَ عَنْ وَقْتِ الصَّلَوَاتِ، قَالَ: كَانَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يُصَلِّي الظُّهْرَ حِينَ تَزُولُ الشَّمْسُ، وَالْعَصْرَ، وَيَرْجِعُ الرَّجُلُ إِلَى أَقْصى الْمَدِينَةِ وَالشَّمْسُ حَيَّةٌ (قَالَ الرَّاوِي عَنْ أَبِي برْزَةَ: وَنَسِيتُ مَا قَالَ فِي الْمَغْرِبِ) وَلاَ يُبَالِي بِتَأخِيرِ الْعِشَاءِ إِلَى ثُلُثِ اللَّيْلِ، وَلاَ يُحِبُّ النَّوْمَ قَبْلَهَا وَلاَ الْحَدِيثَ بَعْدَهَا، وَيُصَلِّي الصُّبْحَ، فَيَنْصَرِفُ الرَّجُلُ فَيَعْرِفُ جَلِيسَهُ؛ وَكَانَ يَقْرَأُ فِي الرَّكْعَتَيْنِ أَوْ إِحْدَاهُمَا مَا بَيْنَ السِّتِّينَ إِلَى الْمِائَةِ
__________
أخرجه البخاري في: 10 كتاب الأذان: 104 باب القراءة في الفجر

379. హజ్రత్ అబూ బర్జా అస్లమి (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జుహర్ నమాజు (మధ్యాహ్నం వేళ) సూర్యుడు నెత్తిమీది నుండి వాలగానే చేసేవారు. అస్ర్ నమాజు ఎలాంటి వేళలో చేసేవారంటే (నమాజు ముగిసిన తరువాత) ఎవరైనా మదీనా నగరం ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళి తిరిగొచ్చినా సూర్యుడు ఇంకా వాడిగా ప్రకాశిస్తూనే ఉంటాడు – మగ్రిబ్ నమాజు విషయంలో హజ్రత్ అబూ బరా (రదియల్లాహు అన్హు) ఏం చెప్పారో ఇక్కడ ఈ హదీసు ఉల్లేఖించిన వ్యక్తికి గుర్తులేదు – దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇషా నమాజు మూడింట ఒక రాత్రి గడిచేవరకూ చేయడంలో ఎలాంటి తప్పులేదని భావించేవారు. అయితే ఇషా నమాజుకు ముందు భోజనం చేయడం, ఇషా నమాజు తరువాత కబుర్లు చెప్పుకోవటం అంటే ఆయనకు నచ్చేది కాదు. (తెల్లవారుజామున) ఫజ్ర్ నమాజు ఎప్పుడు చేసేవారంటే నమాజు ముగిసిన తరువాత మనిషి తన స్నేహితుడ్ని చూస్తే సులభంగా గుర్తుపట్టగలడు. (ఈ నమాజుకు సంబంధించిన) రెండు (ఫర్జ్) రకాతుల్లో లేక ప్రతి రకాతులో అరవై మొదలు వంద ఆయత్ ల (సూక్తుల) వరకు ఖుర్ఆన్ పఠనం చేసేవారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం).

[సహీహ్ బుఖారీ : 10వ ప్రకరణం – అజాన్, 104వ అధ్యాయం – అల్ ఖిరాఅతి ఫిల్ ఫజ్ర్)

380 – حديث أَبِي هُرَيْرَةَ، قَالَ: سَمِعْتُ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ: تَفْضُلُ صَلاَةُ الْجَمِيعِ صَلاَةَ أَحَدِكُمْ وَحْدَهُ بِخَمْسٍ وَعِشْرِينَ جُزْءًا، وتَجْتَمِعُ مَلاَئِكَةُ اللَّيْلِ وَمَلاَئِكَةُ النَّهَارِ فِي صَلاَةِ الْفَجْرِ
ثُمَّ يَقُولُ أَبُو هُرَيْرَةَ: فَاقْرَءُوا إِنْ شِئْتُمْ (إِنَّ قُرْآنَ الْفَجْرِ كَانَ مَشْهُودًا)
__________
أخرجه البخاري في: 10 كتاب الأذان: 31 باب فضل صلاة الفجر في جماعة

380. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: “వ్యక్తిగత నమాజు కంటే జమాఅత్ (సంఘం)తో కలసి చేసే సామూహిక నమాజు ఇరవై ఐదు రెట్లు శ్రేష్ఠమైనది. ఫజ్ర్ నమాజు (సమయం)లో రాత్రి దైవదూతలు, పగటి దైవదూతలు పరస్పరం సమావేశమవుతారు”.

హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఈ హదీసు తెలిపిన తరువాత “(మీకు అంతగా నమ్మకం లేకపోతే) ‘ఇన్న ఖుర్ఆనల్ ఫజ్రి కాన మష్ హూదా’ (నిస్సందేహంగా ఫజ్ర్ నమాజు (దైవదూతలు) సమావేశమయ్యే సమయం) అనే ( ఖుర్ఆన్ 17:78) సూక్తి చదివి చూసుకోండి” అని అన్నారు.

[సహీహ్ బుఖారీ : 10వ ప్రకరణం – అజాన్, 31వ అధ్యాయం – ఫజ్లిస్సలాతిల్ ఫజ్రి ఫీజమాఅత్]

381 – حديث عَبْدِ اللهِ بْنِ عُمَرَ، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: صَلاَةُ الْجَمَاعَةِ تَفْضُلُ صَلاَةَ الْفَذِّ بِسَبْعٍ وَعِشْرِينَ دَرَجَةً
__________
أخرجه البخاري في: 10 كتاب الأذان: 30 باب فضل صلاة الجماعة

381. హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: “వ్యక్తిగతంగా (ఒంటరిగా) చేసే నమాజు కన్నా సామూహికంగా (సంఘంతో కలసి) చేసే నమాజు ఇరవై ఏడు రెట్లు శ్రేష్ఠమైనది.”

[సహీహ్ బుఖారీ : 10వ ప్రకరణం – అజాన్, 30వ అధ్యాయం – ఫజ్లి సలాతిల్ జమాఅత్)

382 – حديث أَبِي هُرَيْرَةَ، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: وَالَّذِي نَفْسِي بِيَدِهِ لَقَدْ هَمَمْتُ أَنْ آمُرَ بِحَطَبٍ فَيُحْطَبَ، ثُمَّ آمُرَ بِالصَّلاَةِ فَيُؤَذَّنَ لَهَا، ثُمَّ آمُرَ ُرَجُلاً فَيَؤُم النَّاسَ، ثُمَّ أُخَالِفَ إِلَى رِجَالٍ فَأُحَرِّقَ عَلَيْهِمْ بُيُوتَهُمْ، وَالَّذِي نَفْسِي بِيَدِهِ لَوْ يَعْلَمُ أَحَدُهُمْ أَنَّهُ يَجِدُ عَرْقًا سَمِينًا، أَوْ مِرْمَاتَيْنِ حَسَنَتَيْنِ لَشَهِدَ الْعِشَاءَ
__________
أخرجه البخاري في: 10 كتاب الأذان: 29 باب وجوب صلاة الجماعة

382. హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా అన్నారు:- “నా ప్రాణంఎవరి అధీనంలో ఉందో ఆ శక్తి స్వరూపుని సాక్ష్యం! కట్టెలు సమీకరించమని, అజాన్ ఇవ్వమని ఆజ్ఞాపించి, నమాజు చేయించడానికి నా స్థానంలో మరొకరిని నిలబెట్టి (సామూహిక నమాజులో పాల్గొనని) వారి దగ్గరకు వెళ్ళి వారి ఇండ్లను తగలబెడదామని నేను (ఎన్నో సార్లు) అనుకున్నాను. నా ప్రాణం ఎవరి అధీనంలో ఉందో ఆ శక్తి స్వరూపుని సాక్ష్యం! ఇషా నమాజు చేస్తే ఓ పెద్ద మాంసపు ముక్కగాని లేదా శ్రేష్ఠమైన రెండు మేక కాళ్ళు గాని లభిస్తాయని తెలిస్తే వారు తప్పకుండా ఇషా నమాజు చేయడానికి (మస్జిదుకు) వచ్చే వారు”.

[సహీహ్ బుఖారీ : 10వ ప్రకరణం – అజాన్, 29వ అధ్యాయం – వజూబి సలాతిల్ జమాఅత్)

383 – حديث أَبِي هُرَيْرَةَ، قَالَ: قَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: لَيْسَ صَلاَةٌ أَثْقَلَ عَلَى الْمُنَافِقِينَ مِنَ الْفَجْرِ وَالْعِشَاءِ، وَلَوْ يَعْلَمُونَ مَا فِيهِمَا لأَتَوْهُمَا وَلَوْ حَبْوًا، لَقَدْ هَمَمْتُ أَنْ آمُرَ الْمُؤَذِّنَ فَيُقِيمَ ثُمَّ آمُرَ رَجُلاً يَؤُمُّ النَّاسَ، ثُمَّ آخُذُ شُعَلاً مِنْ نَارٍ فَأُحَرِّقَ عَلَى مَنْ لاَ يَخْرُجُ إِلَى الصَّلاَةِ بَعْدُ
__________
أخرجه البخاري في: 10 كتاب الأذان: 34 باب فضل العِشاء في الجماعة

383. హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు:- “కపట విశ్వాసులకు ఫజ్ర్, ఇషా నమాజుల కంటే మరే నమాజూ భారంగా వుండదు. అయ్యో! ఈ రెండు నమాజులకు ఎంత పుణ్యం లభిస్తుందో తెలిస్తే వారీ నమాజుల్లో పాల్గొనడానికి మోకాళ్ళ మీద కుంటుకుంటూ రావలసి వచ్చినాసరే తప్పకుండా వస్తారు (కాని ఈ కపటులకసలు నా మాటల మీద నమ్మకమే లేదాయె). ముఅజ్జిన్ కు ఇఖామత్ (పిలుపు) ఇవ్వమని చెప్పి, నమాజు చేయించడానికి (నా స్థానంలో) మరొకరిని నిలబడమని ఆజ్ఞాపించి నేను స్వయంగా అగ్నిజ్వాల తీసుకొని నమాజుకు ఇంకా రాని వారి ఇండ్లను తగలబెడదామని (ఎన్నోసార్లు) అనుకున్నాను.”

[సహీహ్ బుఖారీ: 10వ ప్రకరణం – అజాన్, 34వ అధ్యాయం – ఫజ్లిల్ ఇషాయి ఫిల్ జమాఅత్)

384 – حديث عِتْبَانَ بْنِ مَالِكٍ، وَهُوَ مِنْ أَصْحَابِ رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، مِمَّنْ شَهِدَ بَدْرًا مِنَ الأَنْصَارِ، أَنَّهُ أَتَى رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَقَالَ يَا رَسُولَ اللهِ قَدْ أَنْكَرْتُ بَصَرِي، وَأَنَا أُصَلِّي لِقَوْمِي، فَإِذَا كَانَتِ الأَمْطَارُ سَالَ الْوَادِي الَّذِي بَيْنِي وَبَيْنَهُمْ، لَمْ أَسْتَطِعْ أَنْ آتِيَ مَسْجِدَهُمْ، فَأُصَلِّيَ بِهِمْ، وَوَدِدْتُ يَا رَسُولَ اللهِ أَنَّكَ تَأْتِينِي فَتُصَلِّيَ فِي بَيْتِي [ص:130] فَأَتَّخِذَهُ مُصَلًّى قَالَ، فَقَالَ لَهُ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: سَأَفْعَلُ إِنْ شَاءَ اللهُ قَالَ عِتْبَانُ: فَغَدَا رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ وَأَبُو بَكْرٍ حِينَ ارْتَفَعَ النَّهَارُ، فَاسْتَأْذَنَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَأَذِنْتُ لهُ، فَلَمْ يَجْلِسْ حَتَّى دَخَلَ الْبَيْتَ، ثُمَّ قَالَ: أَيْنَ تُحِبُّ أَنْ أُصلِّيَ مِنْ بَيْتِكَ قَالَ، فَأَشَرْتُ لَه إِلَى نَاحِيَةٍ مِنَ الْبَيْتِ فَقَامَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فَكَبَّرَ، فَقُمْنَا فَصَفَّنَا فَصَلَّى رَكْعَتَيْنِ ثُمَّ سَلَّمَ؛ قَالَ وَحَبَسْنَاهُ عَلَى خَزِيرَةٍ صَنَعْنَاهَا لَهُ، قَالَ، فَثَابَ فِي الْبَيْتِ رِجَالٌ مِنْ أَهْلِ الدَّارِ ذَوُو عَدَدٍ، فَاجْتَمَعُوا؛ فَقَالَ قَائِلٌ مِنْهُمْ: أَيْنَ مَالِكُ بْنُ الدُّخَيْشِنِ أَوِ ابْنُ الدُّخْشُنِ فَقَالَ بَعْضُهُمْ: ذلِكَ مُنَافِقٌ لاَ يُحِبُّ اللهَ وَرَسُولَهُ فَقَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: لاَ تَقُلْ ذلِكَ، أَلاَ تَرَاهُ قَدْ قَالَ لاَ إِلهَ إِلاَّ اللهُ، يُرِيدُ بِذلِكَ وَجْهَ اللهِ قَالَ: اللهُ وَرَسُولُهُ أَعْلَمُ، قَالَ: فَإِنَّا نَرَى وَجْهَهُ وَنَصِيحَتَهُ إِلَى الْمُنَافِقِينَ؛ فَقَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: فَإِنَّ اللهَ قَدْ حَرَّمَ عَلَى النَّارِ مَنْ قَالَ لاَ إِلهَ إِلاَّ اللهُ، يَبْتَغِي بِذَلِكَ وَجْهَ اللهِ
__________
أخرجه البخاري في: 8 كتاب الصلاة: 46 باب المساجد في البيوت

384. మహమూద్ బిన్ రబీ అన్సారీ కథనం:- బద్ర్ యుద్ధంలో పాల్గొన్న ఒక అన్సారీ ముస్లిం హజ్రత్ ఇత్బాన్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) ఒక రోజు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి వచ్చి “దైవప్రవక్తా! నాక్కాస్త దృష్టిలోపం ఉంది. నేను నా తెగవాళ్ళకు నాయకత్వం వహిస్తున్నాను. అయితే వర్షం కురిసినప్పుడల్లా నాకు, నా తెగవాళ్ళకు మధ్య వరద వస్తుంది. అప్పుడు నేను వారికి నాయకత్వం వహించి నమాజు చేయించడానికి వారి మస్జిద్ కు వెళ్ళలేకపోతున్నాను. అందుచేత దైవప్రవక్తా! నాదొక విన్నపం. మీరొకసారి మా ఇంటికి వచ్చి నమాజు చేయిస్తే, ఆ పవిత్ర స్థలాన్ని నేను నమాజు కోసం ప్రత్యేకించుకుంటాను” అని అన్నారు. దానికి దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) “సరే దైవచిత్తమయితే నేను అలాగే చేస్తాను” అని అన్నారు. హజ్రత్ ఇత్బాన్ (రదియల్లాహు అన్హు) ఇలా అన్నారు: మరునాడు ఉదయం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హజ్రత్ అబూబకర్ (రదియల్లాహు అన్హు)ని వెంటబెట్టుకొని వచ్చి ఇంట్లో ప్రవేశించడానికి అనుమతి కోరారు. నేను అనుమతి ఇచ్చాను. ఆయన లోపలికి వచ్చి కూర్చోకముందే “నేను మీ ఇంట్లో ఎక్కడ నమాజు చేయించాలని నీవు కోరుకుంటున్నావు?” అని అడిగారు. అప్పుడు నేను ఇంట్లో ఒక మూల చూపించాను. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వెంటనే ఆ చోట నిలబడి ‘అల్లాహు అక్బర్’ అంటూ నమాజు చేయించడానికి ఉపక్రమించారు. మేము కూడ ఆయన వెనుక వరుస తీరి నిల్చున్నాము. దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) రెండు రకాతులు నమాజు చేయించారు. ఆ తరువాత మేము తయారు చేయించిన ‘హలీం’ *(ఓ ప్రత్యేకమైన వంటకం) పెడదామని ఆయన్ని ఆపాము”.

హజ్రత్ ఇత్బాన్ (రదియల్లాహు అన్హు) ఇంకా ఇలా తెలియజేస్తున్నారు. ఈ విందుకు వాడలోని మరికొందరు కూడా వచ్చారు. ఇలా చాలా మంది మా ఇంటికి వచ్చారు. అప్పుడొక వ్యక్తి ‘మాలిక్ బిన్ దుఖైషెన్ ఏడి (రాలేదేమిటి)?’ అని అడిగారు. అప్పుడు విందుకు వచ్చిన వారిలో మరొక వ్యక్తి సమాధానమిస్తూ “అతను కపట విశ్వాసి. అల్లాహ్ మీద, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మీద అతనికి అసలు అభిమానం ఉంటే కదా రావటానికి”! అని అన్నారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ మాట విని అలా అనకు. అతను కేవలం దైవప్రసన్నత కోసం ‘అల్లాహ్ తప్ప మరే ఆరాధ్యుడు లేడని పలికిన సంగతి నీకు తెలియదా?’ అని అన్నారు. దానికి ఆ వ్యక్తి, ఆ విషయం అల్లాహ్ కు, ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు మాత్రమే బాగా తెలుసు. కాని మాకు మాత్రం అతని ధోరణి చూస్తుంటే అతను కపట విశ్వాసుల పైన్నే ఆసక్తి చూపుతూ వారి శ్రేయస్సునే కోరుతున్నట్లు అనిపిస్తోంది? అని అన్నారు. [అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కేవలం దైవప్రసన్నత కోసం అల్లాహ్ తప్ప మరే ఆరాధ్యుడూ లేడని పలికే వ్యక్తికి అల్లాహ్ నరకాగ్నిని నిషేధించాడు’ అని అన్నారు.”]

[సహీహ్ బుఖారీ : 8వ ప్రకరణం – సలాత్, 46వ అధ్యాయం – అల్ మసాజిద్ ఫిల్ బుయూత్]

* ఇక్కడ మూలభాషలో ‘ఖజీరా’ అనే పదం వాడబడింది (హలీం కాదు). మాంసాన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసి నీటిలో పోసి ఉడక బెడతారు. బాగా ఉడికిన తర్వాత అందులో పిండి కలిపి మరికాస్సేపు ఉడకబెడ్తారు. ఆ తర్వాత దాన్ని మెత్తగా రుబ్బుతారు. ఇలా తయారయిన వంటకాన్నే ఖజీరా అంటారు. (సంకలనకర్త)

385 – حديث مَحْمُودِ بْنِ الرَّبِيعِ زَعَمَ أَنَّهُ عَقَلَ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، وَعَقَلَ مَجَّةً مَجَّهَا مِنْ دَلْوٍ كَانَ فِي دَارِهِمْ، ثُمَّ حَدَّثَ عَنْ عِتْبَانَ حَدِيثَهُ السَّابِقَ
__________
أخرجه البخاري في: 10 كتاب الأذان: 154 باب من لم ير ردّ السلام على الإمام واكتفى بتسليم الصلاة

385. హజ్రత్ మహమూద్ బిన్ రబీ (రదియల్లాహు అన్హు) కథనం:- నాకు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) బాగా గుర్తున్నారు. ఆయన మా వాడలో చేదతో నీళ్ళు తీసుకొని నోరు పుక్కిలించిన సంగతి కూడా నాకు జ్ఞాపకం వుంది. హజ్రత్ మహమూద్ (రదియల్లాహు అన్హు) ఈ మాట చెప్పిన తరువాత, హజ్రత్ ఇత్బాన్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) ద్వారా గ్రహించిన పై హదీసును వివరించారు.

[సహీహ్ బుఖారీ : 10వ ప్రకరణం – అజాన్, 154వ అధ్యాయం]

386 – حديث مَيْمُونَةَ، قَالَتْ: كَانَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يُصَلِّي وَأَنَا حِذَاءَهُ، وَأَنَا حَائِضٌ، وَرُبَّمَا أَصَابَنِي ثَوْبُهُ إِذَا سَجَد
قَالَتْ: وَكَانَ يُصَلِّي عَلَى الْخَمْرَةِ
__________
أخرجه البخاري في: 8 كتاب الصلاة: 19 باب إذا أصاب ثوب المصلّى امرأته إذا سجد

386. విశ్వాసుల మాతృమూర్తి హజ్రత్ మైమూన (రదియల్లాహు అన్హా) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నమాజు చేస్తుంటే నేను ఆయన ప్రక్కనే కూర్చొని ఉండేదానిని. (కొన్నిసార్లు) నేను బహిష్టు అయి ఉండేదానిని. ‘సజ్దా’ చేసేటప్పుడు అనేకసార్లు ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి అంగవస్త్రం నాకు తగిలేది. హజ్రత్ మైమూన (రదియల్లాహు అన్హు) ఇంకా ఇలా అంటున్నారు. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఖర్జూరపు చాప పై నమాజు చేసేవారు. [సహీహ్ బుఖారీ : 8వ ప్రకరణం – అస్సలాత్ : 19వ అధ్యాయం]

387 – حديث أَبِي هُرَيْرَةَ، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: صَلاَةُ الْجَمِيعِ تَزِيدُ عَلَى صَلاَتِهِ فِي بَيْتِهِ وَصَلاَتِهِ فِي سُوقِهِ خَمْسًا وَعِشْرِينَ دَرَجَةً، فَإِنَّ أَحَدَكُمْ إِذَا تَوَضَّأَ فَأَحْسَنَ، وَأَتَى الْمَسْجِدَ لاَ يُرِيدُ إِلاَّ الصَّلاَةَ، لَمْ يَخْطُ خَطْوَةً إِلاَّ رَفَعَهُ اللهُ بِهَا دَرَجَةً، وَحَطَّ عَنْهُ خَطِيئَةً حَتَّى يَدْخُلَ الْمَسْجِدَ، وَإِذَا دَخَلَ الْمَسْجِدَ كَانَ فِي صَلاَةٍ مَا كَانَتْ تَحْبِسُهُ، وَتُصَلِّي عَلَيْهِ الْمَلاَئِكَةُ مَا دَامَ فِي مَجْلِسِهِ الَّذِي يُصَلِّي فيهِ: اللهُمَّ اغْفِرْ لَهُ، اللهُمَّ ارْحَمْهُ، مَا لَمْ يُحْدِثْ فِيهِ
__________
أخرجه البخاري في: 8 كتاب الصلاة: 87 باب الصلاة في مسجد السوق

387. హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:- “మనిషి తన ఇంట్లోనైనా వీధిలోనైనా ఒంటరిగా చేసే నమాజు కన్నా సామూహికంగా చేసే నమాజు పుణ్యం రీత్యా పాతికరెట్లు శ్రేష్ఠమయినది. మనిషి శుభ్రంగా సముచిత రీతిలో వుజూ చేసి కేవలం నమాజు చేసే ఉద్దేశంతో మస్జిదుకు వెళ్తుంటే, మస్జిదులో ప్రవేశించే వరకు అతను వేసే ప్రతి అడుగుకు అల్లాహ్ ఒక్కొక్కటి చొప్పున అతనికి (పరలోకపు) అంతస్తులను పెంచుతాడు. అదీగాక అతని వల్ల జరిగిన ఒక్కొక్క పాపాన్ని తుడిచివేస్తాడు. ఇక మస్జిదులో ప్రవేశించిన తరువాత సామూహిక నమాజు కోసం అతను ఎంత సేపు నిరీక్షిస్తాడో అంత సేపు అతనికి నమాజు చేసినంత పుణ్యం ప్రాప్తమవుతుంది. అతను తన నమాజు స్థానంలో కూర్చుని ఉన్నంతవరకు దైవదూతలు అతని శ్రేయస్సు కోసం ప్రార్థిస్తూ “అల్లాహ్! ఇతని వుజూ భంగం కానంతవరకు ఇతడ్ని క్షమించు, ఇతడ్ని కనికరించు” అని అంటారు.

[సహీహ్ బుఖారీ : 8వ ప్రకరణం – సలాత్, 87వ అధ్యాయం – అస్సలాతి ఫీమస్జిదిస్సూఖ్ )

388 – حديث أَبِي مُوسى، قَالَ: قَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: أَعْظَمُ النَّاسِ أَجْرًا فِي الصَّلاَةِ [ص:132] أَبْعَدُهُمْ فَأَبْعَدُهُمْ مَمْشًى، وَالَّذِي يَنْتَظِرُ الصَّلاَةَ حَتَّى يُصَلِّيَهَا مَعَ الإِمَامِ أَعْظَمُ أَجْرًا مِنَ الَّذِي يُصَلِّي ثُمَّ يَنَامُ
__________
أخرجه البخاري في: 10 كتاب الأذان: 31 باب صلاة الفجر في جماعة

388. హజ్రత్ అబూ మూసా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు:- “మస్జిదుకు అందరికంటే ఎక్కువ దూరముండే వ్యక్తి నమాజు కోసం అందరికంటే ఎక్కువ దూరం నడవవలసి వస్తుంది. అందువల్ల అతనికే అందరికన్నా ఎక్కువ నమాజు పుణ్యం లభిస్తుంది. అలాగే (ఇషా) నమాజు తొందరగా చేసి పడుకునే వ్యక్తి కంటే ఇమామ్ వెనుక సామూహిక నమాజు కోసం ఎదురు చూసే వ్యక్తికి ఎక్కువ పుణ్యం లభిస్తుంది.”

[సహీహ్ బుఖారీ : 10వ ప్రకరణం – అజాన్, 31వ అధ్యాయం – సలాతిల్ ఫజి ఫీజమాఅత్)

389 – حديث أَبِي هُرَيْرَةَ، أَنَّهُ سَمِعَ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ: أَرَأَيْتُمْ لَوْ أَنَّ نَهَرًا بِبَابِ أَحَدِكُمْ يَغْتَسِلُ فِيهِ كُلَّ يَوْمٍ خَمْسًا، مَا تَقُولُ ذلِكَ يُبْقِي مِنْ دَرَنِهِ قالُوا: لاَ يُبْقِي مِنْ دَرَنِهِ شَيْئًا قَالَ: فَذلِكَ مِثْلُ الصَّلَواتِ الْخَمْسِ يَمْحُو اللهُ بِهِ الْخَطَايَا
__________
أخرجه البخاري في: 9 كتاب مواقيت الصلاة: 6 باب الصلوات الخمس كفارة

389. హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా అన్నారు:- “ఒక వ్యక్తి ఇంటి ముందు ఒక నది ప్రవహిస్తూ ఉండి, అతనా నదిలో ప్రతి రోజు అయిదుసార్లు స్నానం చేస్తూ ఉంటే, ఇక అతని శరీరం మీద మలినం ఉంటుందా? దీనిపై మీ అభిప్రాయం ఏమిటి?” దానికి ప్రవక్త అనుచరులు “అతని శరీరం మీద ఎలాంటి మలినం మిగిలి ఉండదు” అని అన్నారు ముక్తకంఠంతో. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం), “రోజుకు అయిదుసార్లు నమాజు చేసే మనిషి పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. అయిదు వేళలా నమాజు చేయడం వల్ల దాసుని పాపాలను అల్లాహ్ క్షమిస్తాడు” అని బోధించారు.

[సహీహ్ బుఖారీ : 9వ ప్రకరణం – మవాఖియతుస్సలాత్, 6వ అధ్యాయం – అస్సలవాతుల్ ఖమ్సి కఫ్ఫారా]

390 – حديث أَبِي هُرَيْرَةَ، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: مَنْ غَدَا إِلَى الْمَسْجِدِ وَرَاحَ أَعَدَّ اللهُ لَهُ نُزُلَهُ مِنَ الْجَنَّةِ كُلَّمَا غَدَا أَوْ رَاحَ
__________
أخرجه البخاري في: 10 كتاب الأذان: 37 باب فضل من غدا إلى المسجد ومن راح

390. హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:- “ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం నమాజు చేయడానికి మస్జిదుకు వెళ్ళే వ్యక్తి కోసం అల్లాహ్ స్వర్గంలో విందు ఏర్పాటు చేస్తాడు”.

[సహీహ్ బుఖారీ : 10వ ప్రకరణం – అజాన్, 37వ అధ్యాయం – ఫజ్లిమన్ ఘదా ఇలల్ మస్జిది వరాహ ]

391 – حديث مَالِكِ بْنِ الْحُوَيْرِثِ، قَالَ: أَتَيْتُ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فِي نَفَرٍ مِنْ قَوْمِي فَأَقَمْنَا عِنْدَهُ عِشْرِينَ لَيْلَةً، وَكَانَ رَحِيمًا رَفِيقًا، فَلَمَّا رَأَى شَوْقَنَا إِلَى أَهَالِينَا، قَالَ: [ص:133] ارْجِعُوا فَكُونُوا فِيهِمْ، وَعَلِّمُوهُمْ، وَصَلُّوا؛ فَإِذَا حَضَرَتِ الصَّلاَةُ فَلْيُؤَذِّنْ لكُمْ أَحَدُكُمْ، وَلْيَؤُمَّكُمْ أَكْبَرُكُمْ
__________
أخرجه البخاري في: 10 كتاب الأذان: 17 باب من قال ليؤذن في السفر مؤذن واحد

391. హజ్రత్ మాలిక్ బిన్ హువైరిస్ (రదియల్లాహు అన్హు) కథనం:- నేనొక రోజు నా తెగ వాళ్ళు కొందరిని వెంట బెట్టుకొని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి వెళ్ళాను. మేమంతా ఆయన దగ్గర ఇరవై రాత్రులు గడిపాము. ఆయన ఎంతో దయామయులు, మృదు హృదయులు. మేము మా భార్యాబిడ్డల దగ్గరికి తిరిగి వెళ్ళదలచుకున్నప్పుడు ఆయన మమ్మల్ని సంబోధిస్తూ “మీరు (మీ స్వస్థలానికి) వెళ్ళిపోండి. మీ తెగ వాళ్ళలోనే ఉండి వారికి ధర్మశిక్షణ ఇవ్వండి, నమాజు చేయించండి. నమాజు వేళ అయినపుడు మీలో ఒకరు అజాన్ ఇవ్వాలి. అందరిలో కెల్లా ఎక్కువ వయస్సున్న వ్యక్తి నమాజులో నేతృత్వం వహించాలి” అని హితోపదేశం చేశారు. `

[సహీహ్ బుఖారీ : 10వ ప్రకరణం – అజూన్, 17వ అధ్యాయం – మనఖాల లియుజన్ ఫిల్ సఫరి ముఅజిన్ వాహిద్]

392 – حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، قَالَ: وَكَانَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ حِينَ يَرْفَعُ رَأْسَهُ يَقُولُ: سَمِعَ اللهُ لِمَنْ حَمِدَهُ، رَبَّنَا وَلَكَ الْحَمْدُ يَدْعُو لِرِجَالٍ فَيُسَمِّيهِمْ بِأَسْمَائهِمْ؛ فَيَقُولُ: اللهُمَّ أَنْجِ الْوَلِيد بْنَ الْوَلِيدِ وَسَلَمَةَ بْنَ هِشَامٍ وَعَيَّاشَ بْنَ أَبِي رَبِيعَةَ وَالْمُسْتَضْعَفِينَ مِنَ الْمُؤْمِنِينَ؛ اللهُمَّ اشْدُدْ وَطْأَتَكَ عَلَى مُضَرَ، وَاجْعَلْهَا عَلَيْهِمْ سِنِينَ كَسِنِى يُوسُفَ وَأَهْلُ الْمَشْرِقِ يَوْمَئِذٍ مِنْ مُضَرَ مُخَالِفُونَ لَهُ
__________
أخرجه البخاري في: 10 كتاب الأذان: 128 باب يهوى بالتكبير حين يسجد

392. హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) రుకూ స్థితి నుండి తల పైకెత్తేటప్పుడు “సమి అల్లాహు లిమన్ హమిదహ్, రబ్బనా వలకల్ హమ్ద్’ (అల్లాహ్ స్తుతించేవారి స్తుతి పలుకుల్ని విన్నాడు; ప్రభూ! స్తుతిస్తోత్రాలు నీకే శోభిస్తాయి)” అని అనేవారు. ఆ తరువాత కొందరి పేర్లను ప్రస్తావించి “అల్లాహ్! వలీద్ బిన్ వలీద్ ని, సల్మా బిన్ హెషామ్ ని, అయ్యుష్ బిన్ అబీరబియ్యని, (అవిశ్వాసుల దౌర్జన్యకాండకు గురి అయిన) నిరుపేద ముస్లింలందరినీ కాపాడు. అల్లాహ్! ముజీర్ తెగను అణచివెయ్యి. హజ్రత్ యూసుఫ్ (అలైహిస్సలాం) కాలంలో సంవత్సరాల తరబడి వచ్చిన కరువులాంటి కరువు విపత్తును ముజీర్ తెగమీద తెచ్చి పడవెయ్యి” అని ప్రార్థించారు. ఆ కాలంలో ముజీర్ తెగకు చెందిన తూర్పు వాసులు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు విరోధులయి ఉన్నారు.

[సహీహ్ బుఖారీ : 10వ ప్రకరణం – అజాన్, 128వ అధ్యాయం – యహ్విబిత్తక్బీరి హీన యస్ జుద్)

393 – حديث أَنَسٍ، قَالَ: قَنَتَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ شَهْرًا يَدْعُو عَلَى رِعْلٍ وَذَكْوَانَ
__________
أخرجه البخاري في: 14 كتاب الوتر: 7 باب القنوت قبل الركوع وبعده

393. హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) రీల్, జిక్వాన్, తెగలను శపిస్తూ వరుసగా ఒక నెల రోజుల పాటు ‘ఖునూతె నాజిలా’ పఠించారు. *

[సహీహ్ బుఖారీ : 14వ ప్రకరణం – వితర్, 7వ అధ్యాయం – అల్ ఖునూతు ఖబ్లర్రుకూవబాద్)

* రీల్, జిక్వాన్ అనేవి బనీసలీమ్ కు చెందిన రెండు ఉపతెగలు. ఈ తెగలవాళ్ళు ‘బైర్ మవూన’ అనే ప్రాంతంలో 70 మంది సహాబీలను మోసగించి హతమార్చారు.

394 – حديث أَنَسٍ عَنْ عَاصِمٍ، قَالَ: سَأَلْتُ أَنَسًا رضي الله عنه، عَنِ الْقُنُوتِ، قَالَ: قَبْلَ الرُّكُوعِ فَقُلْتُ: إِنَّ فُلاَنًا يَزْعُمُ أَنَّكَ قُلْتَ بَعْدَ الرُّكُوعِ فقال: كَذَبَ؛ ثُمَّ حَدَّثَنَا عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، أَنَّهُ قَنَتَ شَهْرًا بَعْدَ الرُّكُوعِ يَدْعُو عَلَى أَحْيَاءٍ مِنْ بَنِي سُلَيْمٍ [ص:134] قَالَ: بَعَثَ أَرْبَعِينَ أَوْ سَبْعِينَ (يَشُكُّ فِيهِ) مِنَ الْقُرَّاءِ إِلى أَنَاسٍ مِنَ الْمُشْرِكِينَ، فَعَرَضَ لَهُمْ هؤُلاَءِ، فَقَتَلُوهُمْ؛ وَكَانَ بَيْنَهُمْ وَبَيْنَ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ عَهْدٌ، فَمَا رَأَيْتُهُ وَجَدَ عَلَى أَحَدٍ مَا وَجَدَ عَلَيْهِمْ
__________
أخرجه البخاري في: 58 كتاب الجزية: 8 باب دعاء الإمام على من نكث عهدا

394. హజ్రత్ ఆసిమ్ (రహిమహుల్లాహ్) కథనం:- నేను హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు)ని ‘దుఆయె ఖునూత్ ని గురించి అడిగితే “దుఆయెఖునూత్”ని రుకూ స్థితిలో పోవడానికి ముందు పఠిస్తారని” ఆయన సమాధానమిచ్చారు. “కాని రుకూ స్థితి నుండి పైకి లేచిన తరువాత ‘దుఆయె ఖునూత్’ పఠిస్తారని మీరు చెప్పినట్లుగా ఫలానా వ్యక్తి వాదిస్తున్నాడే?” అన్నాను నేను. హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) ఆ విషయాన్ని ఖండిస్తూ “ఆ వ్యక్తి అబద్ధం చెప్పాడు” అని అన్నారు. ఆ తరువాత ఆయన అసలు విషయాన్ని తెలియజేస్తూ ఇలా అన్నారు: “దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒక నెల రోజుల పాటు రుకూ స్థితి నుండి తల పైకెత్తిన తరువాత ‘ఖునూతె నాజిలా’ పఠించారు. అందులో ఆయన బనీసలీంకు చెందిన కొన్ని ఉప తెగలను శపించారు” అని అన్నారు. హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) (ఆ తెగల నిర్వాకం గురించి తెలుపుతూ) “ఆ’ బహుదైవారాధకుల వైపుకు నలభై లేక డెబ్భై మంది ఖారీ (నిబద్ధపాఠకు)లను (ఖారీల సంఖ్య కచ్చితంగా ఎంతో హదీసు ఉల్లేఖకునికి గుర్తులేదు) పంపితే వారి పై ఆ దుర్మార్గులు దాడి చేసి హతమార్చారు. దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం)కు, ఆ తెగలకు మధ్య శాంతి ఒప్పందం జరిగినప్పటికీ వారు దాన్ని ఖాతరు చేయలేదు. ఈ సంఘటనతో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆ తెగలపై ఆగ్రహోదగ్రులయిపోయారు. ఆయనలో అంతటి ఆగ్రహాన్ని నేనిది వరకెప్పుడూ చూడలేదు.”

[సహీహ్ బుఖారీ : 58వ ప్రకరణం – అల్ జజ్ యా – 8వ అధ్యాయం – దుఆ ఇల్ ఇమామి అలా మన్నక్సి అహదా)

395 – حديث أَنَسٍ رضي الله عنه، قَالَ: بَعَثَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ سَرِيَّةً يُقَالُ لَهُمُ الْقُرَّاءُ، فَأُصِيبُوا، فَمَا رَأَيْتُ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ وَجَدَ عَلَى شَيْءٍ مَا وَجَدَ عَلَيْهِمْ، فَقَنَتَ شَهْرًا فِي صَلاَةِ الْفَجْرِ، وَيَقُولُ: إِنَّ عُصَيَّةَ عَصَوُا اللهَ وَرَسُولَهُ
__________
أخرجه البخاري في: 8 كتاب الدعوات: 58 باب الدعاء على المشركين

395. హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కొందరు ఖారీలను పంపితే (దారిలో) వారు హతమార్చబడ్డారు. ఈ సంగతి విని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఎంతో బాధపడ్డారు. ఆయన గతంలో ఇంత బాధపడినట్లు నేనెన్నడూ చూడలేదు. ఈ సంఘటన తరువాత ఆయన ఒక నెల దాకా ఫజ్ర్ నమాజులో “ఖునూతె నాజిలా” పఠించారు. అందులో ఆయన “అల్లాహ్ కు దైవప్రవక్తకు ఉసయ్య ద్రోహం చేశాడు” అని అంటుండేవారు.

[సహీహ్ బుఖారీ : 80వ ప్రకరణం – అద్దావాత, 58వ అధ్యాయం – అద్దు ఆవు అలల్ ముఫ్రికీన్]

396 – حديث عِمْرَانَ بْنِ حُصَيْنٍ، أَنَّهُمْ كَانُوا مَعَ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فِي مَسِيرٍ، فَأَدْلَجُوا لَيْلَتَهُمْ، حَتَّى إِذَا كَانَ وَجْهُ الصُّبْحِ عَرَّسُوا فَغَلَبَتْهُمْ أَعْيُنُهُمْ حَتَّى ارْتَفَعَتِ الشَّمْسُ، فَكَانَ أَوَّلَ مَنِ اسْتَيْقَظَ مِنْ مَنَامِهِ أَبُو بَكْرٍ، وَكَانَ لاَ يُوقَظُ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ مِنْ مَنَامِهِ حَتَّى يَسْتَيْقِظَ، فَاسْتَيْقَظَ عُمَرُ فَقَعَدَ أَبُو بَكْرٍ عِنْدَ رَأْسِهِ، فَجَعَلَ يُكَبِّرُ وَيَرْفَعُ صَوْتَهُ حَتَّى اسْتَيْقَظَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَنَزَلَ وَصَلَّى بِنَا الْغَدَاةَ؛ فَاعْتَزَلَ رَجٌلٌ مِنَ الْقَوْمِ لَمْ يُصَلِّ مَعَنَا فَلَمَّا انْصَرَفَ قَالَ: يَا فُلاَنُ مَا يَمْنَعُكَ أَنْ تُصَلِّيَ مَعَنَا قَالَ: أَصَابَتْنِي جَنَابَةٌ [ص:135] فَأَمَرَهُ أَنْ يَتَيَمَّمَ بِالصَّعِيدِ، ثُمَّ صَلَّى وَجَعَلَنِي رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فِي رَكُوبٍ بَيْنَ يَدَيْهِ، وَقَدْ عَطِشْنَا عَطَشًا شَدِيدًا فَبَيْنَمَا نَحْنُ نَسِيرُ إذا بِامْرَأَةٍ سَادِلَةٍ رِجْلَيْهَا بَيْنَ مَزَادَتَيْنِ؛ فَقُلْنَا لَهَا: أَيْنَ الْمَاءُ فَقَالَتْ: إِنَّهُ لاَ مَاءَ فَقُلْنَا: كَمْ بَيْنَ أَهْلِكِ وَبَيْنَ الْمَاءِ قَالَتْ: يَوْمٌ وَلَيْلَةٌ فَقُلْنَا: انْطَلِقِي إِلَى رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَتْ: وَمَا رَسُولُ اللهِ فَلَمْ نُمَلِّكْهَا مِن أَمْرِهَا حَتَّى اسْتَقْبَلْنَا بِهَا النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فَحَدَّثَتْهُ بِمِثْلِ الَّذِي حَدَّثَتْنَا، غَيْرَ أَنَّهَا حَدَّثَتْهُ أَنَّهَا مُؤْتِمَةٌ فَأَمَرَ بِمَزَادَتَيْهَا، فَمَسَحَ فِي الْعَزْلاَوَيْنِ، فَشَرِبْنَا عِطَاشًا، أَرْبَعِينَ رَجُلاً، حَتَّى رَوِينَا فَمَلأْنا كُلَّ قِرْبَةٍ مَعَنَا وَإِدَاوَةٍ، غَيْرَ أَنَّهُ لَمْ نَسْقِ بَعِيرًا، وَهِيَ تَكَادُ تَنِضُّ مِنَ الْمِلْءِ ثُمَّ قَالَ: هَاتُوا مَا عِنْدَكُمْ فَجُمِعَ لَهَا مِنَ الْكِسَرِ وَالتَّمْر حَتَّى أَتَتْ أَهْلَهَا فَقَالَتْ: لَقِيتُ أَسْحَرَ النَّاسِ أَوْ هُوَ نَبِيٌّ كَمَا زَعَمُوا فَهَدَى اللهُ ذَاكَ الصِّرْمَ بِتِلْكَ الْمَرْأَةِ، فَأَسْلَمَتْ وَأَسْلَمُوا
__________
أخرجه البخاري في: 61 كتاب المناقب: 25 باب علامات النبوة في الإسلام

396. హజ్రత్ ఇమ్రాన్ బిన్ హుసైన్ (రదియల్లాహు అన్హు) కథనం:- ఓసారి మేము దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)తో కలసి ప్రయాణం చేస్తూ (ఒక రోజు) రాత్రంతా నడిచాము. తెల్లవారుతూ ఉండగా ఓ చోట విడిది చేసి పడుకున్నాం. రాత్రంతా మేల్కొనడం వలన పడుకోగానే గాఢనిద్ర పట్టింది. చివరికి లేచి చూస్తే సూర్యుడు దేదీప్యమానంగా ప్రకాశించసాగాడు. అందరి కంటే ముందు హజ్రత్ అబూబకర్ (రదియల్లాహు అన్హు) మేల్కొన్నారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) స్వయంగా మేల్కోనంతవరకు ఆయన్ని ఎవరూ లేపకూడదని ముందు నుంచే ఒక రివాజు వుంది (అందుచేత ఆయన్ని ఎవరూ లేపలేదు). ఆ తరువాత హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) మేల్కొన్నారు. హజ్రత్ అబూబకర్ (రదియల్లాహు అన్హు) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తలవైపు కూర్చొని “అల్లాహు అక్బర్! అల్లాహు అక్బర్”!! అంటూ బిగ్గరగా చెప్పసాగారు. దాంతో చివరికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కూడా మేల్కొన్నారు. (వెంటనే) ఆయన మాకు (నాయకత్వం వహించి) నమాజు చేయించారు.

అప్పుడు ఒకతను మాతో పాటు కలసి నమాజు చేయలేదు. నమాజు ముగిసిన తరువాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అతడ్ని పిలిపించి “నీవు మాతో పాటు నమాజు ఎందుకు చేయలేదు?” అని అడిగారు. దానికావ్యక్తి “నేను (లైంగిక) స్నానం చేయవలసిన పరిస్థితి వచ్చింది” అని అన్నాడు. “అయితే (నీళ్ళు లభించని పక్షంలో) మన్నుతో తయమ్ముమ్ చేసుకో” అని ఆదేశించారు దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం). అప్పుడా వ్యక్తి తయమ్ముమ్ చేసి నమాజు చేశాడు.

మేమంతా తీవ్రమైన దప్పికతో ఉన్నాము. అందువల్ల దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నన్ను కొందరు వాహనరోహకులతో కలసి ముందుకు సాగమని పురమాయించారు. మేము ముందు ముందు నడవసాగాము. కొంత దూరం ప్రయాణించాక ఒక చోట హఠాత్తుగా ఒక స్త్రీ కన్పించింది. ఆమె తన రెండు కాళ్ళను రెండు పెద్ద నీటి తిత్తుల మధ్య (ఒంటె పై) వ్రేలాడదీసి వెల్తోంది. మేమామెను “(ఇక్కడెక్కడైనా) నీళ్ళున్నాయా?” అని అడిగాము. ఆమె లేవన్నది. “సరే నీ ఇంటికి, నీటికి మధ్య ఎంత దూరం ఉంది?” అని మళ్ళీ అడిగాము. దానికామె “ఒక పగలు, ఒక రాత్రి” అని సమాధానమిచ్చింది. “సరే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దగ్గరికి వెళ్లాం పద” అన్నాము మేము. అందుకామె “దైవప్రవక్త ఎవరో నేనెరగను” అన్నది. చివరికి మేము ఒత్తిడి తెచ్చి ఆమెను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి తీసికెళ్ళాము.

ఆ స్త్రీ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)తో కూడా మాతో అన్న మాటలే అన్నది. దాంతో పాటు తాను అనాధ పిల్లలను పోషిస్తున్నానని చెప్పింది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆమెను నీటి తిత్తులు తెరవమని ఆదేశించారు. ఆ తరువాత ఆయన నీటి తిత్తుల మూతులపై చేయి తిప్పారు. అప్పుడు మేము నలభై మంది దాహార్తులు ఆ నీటి తిత్తులలో నుంచి తనవి తీరా నీళ్ళు త్రాగాము. అంతేకాదు, మా దగ్గరున్న మొత్తం పాత్రలు తోలుతిత్తుల్ని కూడా నీటితో నింపుకున్నాము. ఒంటెలకు మాత్రం నీళ్ళు తాపలేదు. అటు ఆ స్త్రీ నీటి తిత్తుల్ని చూస్తే, ఒక్క చుక్క కూడా తగ్గకుండా యథాతధంగా నీళ్ళు నిండి ఉన్నాయి.

ఆ తరువాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ” మీ దగ్గర ఉన్న ఆహార పదార్థాలు తీసుకురండి” అని (అనుచరుల్ని) ఆదేశించారు. దాంతో మేము మా దగ్గరున్న రొట్టెలు, ఖర్జూర పండ్లు అన్నీ ప్రోగుచేసి ఆ స్త్రీకి ఇచ్చి వేశాము. ఆమె వాటిని తీసుకొని ఇంటికి వెళ్ళిపోయింది. వెళ్ళి తన కుటుంబ సభ్యులకు (ఈ విచిత్ర సంఘటనను తెలియజేస్తూ) “ఈ రోజు నేను ఓ గొప్ప మాంత్రికుడ్ని కలుసుకున్నాను. లేదా అందరూ అనుకున్నట్లు ఆయన నిజంగా దైవప్రవక్త అయి ఉండవచ్చు” అని చెప్పింది. ఆ స్త్రీ మూలంగా అల్లాహ్ ఆ ఊరి ప్రజలందరికీ సన్మార్గం చూపించాడు. ఈ విధంగా ఆ స్త్రీ కూడా ముస్లిం అయిపోయింది; ఆ ఊరి ప్రజలు కూడా ముస్లింలయిపోయారు.

[సహీహ్ బుఖారీ : 61వ ప్రకరణం – మనాఖిబ్, 25వ అధ్యాయం – అలామాతున్న బువ్వతి ఫిల్ ఇస్లాం]

397 – حديث أَنَسٍ، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: مَنْ نَسِيَ صَلاَةً فَلْيُصَلِّ إِذَا ذَكَرَهَا، لاَ كَفَّارَةَ لَهَا إِلاَّ ذلِكَ، (وَأَقِمِ الصَّلاَةَ لِذِكْرِي)
__________
أخرجه البخاري في: 9 كتاب مواقيت الصلاة: 37 باب من نسى صلاة فليصل إذا ذكرها ولا يعيد إلا تلك الصلاة

397. హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:- “ఎవరయినా ఏదయినా నమాజు వేళకు చేయడం మరచిపోతే జ్ఞాపకం వచ్చిన వెంటనే అతనా నమాజు చేయాలి. మరచిపోయిన నమాజుకు అదే నిష్కృతి. ‘వ అఖిమిస్సలాత లిజిక్రీ’ (నా జ్ఞాపకార్థం నమాజు వ్యవస్థను నెలకొల్పండి)”. ( ఖుర్ఆన్ – 20:14)

[సహీహ్ బుఖారీ : 9వ ప్రకరణం – మవాఖియతుస్సలాత్, 37వ అధ్యాయం – మన్ న్నసియ సలాతన్ ఫల్ యుసల్లిహా ఇజా జకరహా]

మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్) (Al-Lulu-wal-Marjaan) .