1.15 జకాత్ ప్రకరణం | మహా ప్రవక్త మహితోక్తులు 

మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్) (Al-Lulu-wal-Marjaan) .  

567 – حديث أَبِي سَعِيدٍ رضي الله عنه، قَالَ: قَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: لَيْسَ فِيمَا دُونَ خَمْسِ أَوَاقٍ صَدَقَةٌ، وَلَيْسَ فِيمَا دُونَ خَمْسِ ذَوْدٍ صَدَقَةٌ، وَلَيْسَ فِيمَا دُونَ خَمْسِ أَوْسُقٍ صَدَقَةٌ
__________
أخرجه البخاري في: 24 كتاب الزكاة: 4 باب ما أدى زكاته فليس بكنز

567. హజ్రత్ అబూసయీద్ ఖుదరీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలిపారు:- “ఐదు ఊఖియాల (52 1/2 తులాల) కన్నా తక్కువ వెండి పై జకాత్ లేదు. ఐదుకంటే తక్కువ ఒంటెల పై కూడా జకాత్ లేదు. అలాగే ఐదు వసఖ్ ల * కన్నా తక్కువ (ఖర్జూరం లేక ధాన్యం) పై కూడా జకాత్ లేదు.”

[సహీహ్ బుఖారీ : 24వ ప్రకరణం – జకాత్, 4వ అధ్యాయం – మాఅదీ జకాతుహూ ఫలైస బి కన్జ్ ]

* వసఖ్ అంటే శాబ్దిక భావం ‘బుట్ట లేక తట్ట’. బరువు రీత్యా ఒక వసఖ్ 60 ‘సా’లకు సమానం. ఒక ‘సా’ నాలుగు ‘ముద్’లు అవుతుంది. ఒక ‘ముద్’ రెండు ‘రతిల్ ల కు సమానం. ఒక ‘రతిల్ అర్ధ ‘సేరు’, పావు ‘సేరు’లకు సమానం. ఒక సేరు’ ఎనభై ‘తులాల’కు సమానం. ఒక ‘ముద్’ ఒకటింబావు సేరు అవుతుంది. ఒక ‘సా’ అయిదు ‘సేర్ల’కు సమానం. ఒక వసఖ్ (60 ‘సా’ లు) ఏడున్నర ‘మణుగు’లకు సమానం. ఇలా అయిదు ‘వసఖ్ లు 37 మణుగుల 20 సేర్లు అవుతాయి. (గమనిక : ఒక ‘తులం’ దాదాపు 11.5 గ్రాములు అవుతుంది – అనువాదకుడు)

568 – حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، قَالَ: قَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: لَيْسَ عَلَى الْمُسْلِمِ فِي فَرَسِهِ وَغُلامِهِ صَدَقَةٌ
__________
أخرجه البخاري في: 24 كتاب الزكاة: 45 باب ليس على المسلم في فرسه صدقة

568. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు:- “ముస్లిం యాజమాన్యంలో ఉన్న గుర్రాలపై, బానిసలపై జకాత్ విధిగా లేదు”.*

[సహీహ్ బుఖారీ: 24వ ప్రకరణం – జకాత్, 45వ అధ్యాయం – లైస అలల్ ముస్లిమి ఫీ ఫరసిహీ సదఖా]

* గుర్రాల పై, బానిసల పై జకాత్ లేదన్న విషయంలో ఎలాంటి అభిప్రాయభేదం లేదు. కాకపోతే అత్యధిక సంఖ్యలో వ్యాపార నిమిత్తం ఉన్నప్పుడు జకాత్ విధిగా చెల్లించాలి. ఇందులో కూడా విభిన్న అభిప్రాయాలు లేవు. అయితే గుర్రాలు వ్యాపార నిమిత్తం కాకపోయినా ఒకటి కంటే ఎక్కువ ఉంటే వాటి జకాత్ విషయంలోనే అభిప్రాయభేదాలున్నాయి.

569 – حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، قَالَ: أَمَرَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ بِالصَّدَقَةِ، فَقِيلَ: مَنَعَ ابْنُ جَمِيلٍ، وَخَالِدُ بْنُ الْوَلِيدِ، وَعَبَّاسُ بْن عَبْدِ الْمُطَّلِبِ؛ فَقَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: [ص:198] مَا يَنْقِمُ ابْنُ جَمِيلٍ إِلاَّ أَنَّهُ كَانَ فَقِيرًا فَأَغْنَاهُ اللهُ وَرَسُولُهُ وَأَمَّا خَالِدٌ، فَإِنَّكُمْ تَظْلمُونَ خَالِدًا، قَدِ احْتَبَسَ أَدْرَاعَهُ وَأَعْتُدَهُ فِي سَبِيلِ اللهِ؛ وَأَمَّا الْعَبَّاسُ بْنُ عَبْدِ الْمُطَّلِبِ، فَعَمُّ رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَهِيَ عَلَيْهِ صَدَقَةٌ وَمِثْلَهَا مَعَهَا
__________
أخرجه البخاري في: 24 كتاب الزكاة: 49 باب قول الله تعالى وفي الرقاب

569. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జకాత్ వసూలు చేయమని ఆదేశించిన తరువాత (ఒకసారి) హజ్రత్ ఇబ్బె జమీల్ * (రదియల్లాహు అన్హు), ఖాలిద్ బిన్ వలీద్ (రదియల్లాహు అన్హు), అబ్బాస్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్ లు జకాత్ చెల్లించడానికి నిరాకరించినట్లు ఆయనకు సమాచారం అందింది. అప్పుడు ఆయన ఇలా అన్నారు: “ఇబ్నె జమీల్ (రదియల్లాహు అన్హు) గతంలో పేదవానిగా ఉండేవారు. ఇప్పుడు అల్లాహ్, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అతడ్ని ధనికునిగా చేశారు. (అందుకు అతను వారి పట్ల కృతజ్ఞత చూపడా?) ఖాలిద్ (రదియల్లాహు అన్హు)ని జకాత్ అడిగి మీరతని పై అన్యాయానికి పాల్పడుతున్నారు. అతను తన యుద్ధ కవచాన్ని, ఆయుధాల్ని సైతం దైవమార్గంలో అంకితం చేశాడు. పోతే అబ్బాస్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పినతండ్రి అయినందున ఆయన జకాత్ ఆయనకే సదఖా (దానం) అవుతుంది. కాకపోతే అంతే జకాత్ మొత్తం (ఆయన తరఫున నేను చెల్లిస్తాను)”.*

[సహీహ్ బుఖారీ : 24వ ప్రకరణం – జకాత్, 49వ అధ్యాయం – ఖౌలిల్లాహితఆలా (వఫిర్రిఖాబ్)]

* ఇబ్నె జమీల్ జకాత్ ని నిరాకరించడానికి అతని దగ్గర ఎలాంటి కారణం లేదు. ఆయన తప్పనిసరిగా జకాత్ చెల్లించాలి. అల్లాహ్ పట్ల ఆయన ప్రవక్త పట్ల కృతఘ్నుడయి పోకూడదు.

* సహీహ్ ముస్లింలో వచ్చిన ఉల్లేఖనం ఇలా ఉంది. “ఇక అబ్బాస్ (రదియల్లాహు అన్హు) గారి విషయానికొస్తే ఆయన జకాత్ బాధ్యత నా పై ఉంది. పైగా నేను ఆయన తరఫున అంతకు మరింత చెల్లిస్తాను” అన్నారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం). ఆ తరువాత “ఉమర్! మీకు తెలుసా! చిన్నాయన (లేదా పెదనాన్న) కన్నతండ్రితో సమానం” అన్నారు ఆయన.

570 – حديث ابْنِ عُمَرَ، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فَرَضَ زَكَاةَ الْفِطْرِ صَاعًا مِنْ تَمْرٍ، أَوْ صَاعًا مِنْ شَعِيرٍ، عَلَى كُلِّ حُرٍّ أَوْ عَبْدٍ، ذَكَرٍ أَوْ أُنْثى، مِنَ الْمُسْلِمِينَ
__________
أخرجه البخاري في: 24 كتاب الزكاة: 71 باب صدقة الفطر على العبد وغيره من المسلمين

570. హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం:-

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒక ‘సా’ ఖర్జూర పండ్లుగాని, ఎర్ర గోధుమలు గాని (పేదలకు) ఫిత్రా దానంగా ఇవ్వడం ప్రతి ముస్లిం పురుషునికి, స్త్రీకి విధిగా చేశారు. వారు స్వేచ్ఛాపరులైనా, బానిసలైనా సరే విధిగా చెల్లించాలి.

[సహీహ్ బుఖారీ : 24వ ప్రకరణం – జకాత్, 71వ అధ్యాయం – సదఖతుల్ ఫిత్రి అలల్ అబ్ది వగైరిహీ మినల్ ముస్లిమీన్]

571 – حديث عَبْدِ اللهِ بْنِ عُمَرَ؛ قَالَ: أَمَرَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ بِزَكَاةِ الْفِطْرِ صَاعًا مِنْ تَمْرٍ أَوْ صَاعًا مِنْ شَعِيرٍ قَالَ عَبْدُ اللهِ رضي الله عنه: فَجَعَلَ النَّاسُ عِدْلَهُ مُدَيْنِ مِنْ حِنْطَةٍ
[ص:199] أخرجه البخاري في: 24 كتاب الزكاة: 74 باب صدقة الفطر صاعًا من تمر

571. హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం:-

ఫిత్రా దానంగా ఒక ‘సా’ ఖర్జూర పండ్లుగాని, ఎర్ర గోధుమలు గాని చెల్లించాలని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆదేశించారు. (అయితే ఆ తరువాత) ప్రజలు రెండు ముద్ ల (అర్ధ ‘సా’) తెల్ల గోధుమలను ఒక ‘సా’ ఎర్ర గోధుమలతో లేదా ఒక ‘సా’ ఖర్జూర పండ్లతో సమానంగా పరిగణించారు.

[సహీహ్ బుఖారీ : 24వ ప్రకరణం – జకాత్, 74వ అధ్యాయం – సదఖతుల్ ఫిత్రి సాఅమ్మిన్ తమ్ర్)

572 – حديث أَبِي سَعِيدٍ الْخُدْرِيِّ رضي الله عنه، قَالَ: كُنَّا نُخْرِجُ زَكَاةَ الْفِطْرِ صَاعًا مِنْ طَعَامٍ، أَوْ صَاعًا مِنْ شَعِيرٍ، أَوْ صَاعًا مِنْ تَمْرٍ، أَوْ صَاعًا مِنْ أَقِطٍ، أَوْ صَاعًا مِنْ زَبِيبٍ
__________
أخرجه البخاري في: 24 كتاب الزكاة: 73 باب صدقة الفطر صاعًا من طعام

572. హజ్రత్ అబూ సయీద్ ఖుదరీ (రదియల్లాహు అన్హు) కథనం:- మేము ఫిత్రా దానంగా ఒక ‘సా’ భోజనంగాని, ఒక ‘సా’ ఖర్జూర పండ్లుగాని, ఒక ‘సా’ ఎర్ర గోధుమలు గాని, ఒక ‘సా’ జున్నుగాని, ఒక ‘సా’ ద్రాక్ష పండ్లుగాని ఇచ్చేవాళ్ళము. (సహీహ్ బుఖారీ 24వ ప్రకరణం – జకాత్, 73వ అధ్యాయం – సదఖతుల్ ఫిత్రి సాఅమ్మిన్ తఆమ్ర్]

573 – حديث أَبِي سَعِيدٍ الْخُدْرِيِّ رضي الله عنه، قَالَ: كُنَّا نُعْطِيَهَا، فِي زَمَانِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، صَاعًا مِنْ طَعَامٍ، أَوْ صَاعًا مِنْ تَمْرٍ، أَوْ صَاعًا مِنْ شَعِيرٍ، أَوْ صَاعًا مِنْ زَبِيبٍ فَلَمَّا جَاءَ مُعَاوِيَةُ وَجَاءَتِ السَّمْرَاءُ، قَالَ: أَرَى مُدًّا مِنْ هذَا يَعْدِلُ مُدَّيْنِ
__________
أخرجه البخاري في: 24 كتاب الزكاة: 75 باب صاع من زبيب

573. హజ్రత్ అబూ సయీద్ ఖుదరీ (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కాలంలో మేము ఫిత్రా దానంగా ఒక ‘సా’ ఎర్ర గోధుమలు గాని, తెల్ల గోధుమలు గాని, ఖర్జూరపండ్లుగాని, ద్రాక్ష పండ్లుగాని ఇచ్చేవాళ్ళము. అయితే హజ్రత్ ముఆవియా (రదియల్లాహు అన్హు) పాలనా కాలంలో సిరియా దేశపు ఎర్ర గోధుమలు వచ్చేశాయి. అప్పుడు హజ్రత్ ముఆవియా (రదియల్లాహు అన్హు) తన అభిప్రాయం వ్యక్తపరుస్తూ “ఈ ఎర్ర గోధుమలు ఒక ‘ముద్’ ఇతర వస్తువులు రెండు ముద్ లతో సమానమవుతాయనుకుంటున్నాను” అని అన్నారు. [సహీహ్ బుఖారీ: 24వ ప్రకరణం – జకాత్, 75వ అధ్యాయం- సాఅమ్మిన్ జబీబ్]

574 – حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: الْخَيْلُ لِثَلاَثَةٍ: لِرَجُلٍ أَجْرٌ، وَلِرَجُلٍ سِتْرٌ، وَعَلَى رَجُلٍ وِزْرٌ فَأَمَّا الَّذِي لَهُ أَجْرٌ فَرَجُلٌ رَبَطَهَا فِي سَبِيلِ اللهِ فَأَطَالَ فِي مَرْجٍ أَوْ رَوْضَةٍ، فَمَا أَصَابَتْ فِي طِيَلِهَا ذَلِكَ مِنَ الْمَرْجِ أَوِ الرَّوْضَةِ كَانَتْ لَهُ حَسَنَاتٍ، وَلَوْ أَنَّهَا قَطَعَتْ طِيَلَهَا فَاسْتَنَّتْ شَرَفًا أَوْ شَرَفَيْنِ كَانَتْ أَرْوَاثُهَا وَآثَارُهَا حَسَنَاتٍ لَهُ، وَلَوْ أَنَّهَا مَرَّتْ بِنَهَرٍ فَشَرِبَتْ مِنْهُ وَلَمْ يُرِدْ أَنْ يَسْقِيَهَا كَانَ ذَلِكَ حَسَنَاتٍ لَهُ؛ [ص:200] وَرَجُلٌ رَبَطَهَا فَخْرًا وَرِئَاءً وَنِوَاءً لأَهْلِ الإِسْلاَمِ فَهِيَ وِزْرٌ عَلَى ذلِكَ
وَسُئِلَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ عَنِ الْحُمُرِ، فَقَالَ: مَا أُنْزِلَ عَلَيَّ فِيهَا إِلاَّ هذِهِ الآيَةُ الْجَامِعَةُ الْفاذَّةُ (مَنْ يَعْمَلْ مِثْقَالَ ذَرَّةٍ خَيْرًا يَرَهُ وَمَنْ يَعْمَلْ مِثْقَالَ ذَرَّةٍ شَرًّا يَرَهُ)
__________
أخرجه البخاري في: 56 كتاب الجهاد والسير: 48 باب الخيل لثلاثة

574. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:-

“గుర్రాలు మూడు విధాలుగా ఉంటాయి. కొందరికవి పుణ్యఫలానికి ఉద్దేశించినవి. మరికొందరికి అవి లోపాలను కప్పి పుచ్చేవిగా ఉంటాయి. ఇంకా కొందరికి (నరక) యాతనకు కారణభూతమవుతాయి. దైవమార్గంలో పోరాడేందుకు గుర్రాన్ని పెంచే వ్యక్తికి అది పుణ్యఫలాన్ని ఆర్జించి పెడుతుంది. అతనా గుర్రాన్ని పొడుగాటి త్రాటితో కట్టివేసి ఏదైనా పచ్చిక బైలులోగాని లేదా తోటలోగాని వదలి పెడితే, ఆత్రాటి పొడవు ఆ పచ్చిక బైలులో లేక తోటలో ఎంత మేరకు విస్తరిస్తుందో అన్ని పుణ్యాలు అతని కర్మల చిట్టాలో వ్రాయబడతాయి. ఒక వేళ ఆ గుర్రం త్రాడు తెంచుకొని ఒకటి రెండు గుట్టలు దూకి వస్తే,దాని లద్ది, దాని గిట్టల గుర్తులు సయితం అతని కోసం పుణ్యాలుగా పరిగణించబడతాయి. అంతేకాదు, ఆ గుర్రానికి దాని యజమాని నీళ్ళు త్రాగించే ఉద్దేశం లేకపోయినా సరే అది తనంతట తాను ఏదైనా నది దగ్గరికెళ్ళి నీళ్ళు త్రాగితే అప్పుడు కూడా అతని ఖాతాలో పుణ్యాలు వ్రాయబడతాయి దీనికి భిన్నంగా ఎవరైనా ప్రదర్శనా బుద్దితో, గర్వకారణం కోసం గుర్రాన్ని పెంచుతూ, ఇస్లాం శక్తులకు వ్యతిరేకంగా పోరాడే ఉద్దేశ్యంతో కట్టి ఉంచితే అతని కోసం ఆ గుర్రం పాపఫలానికి కారణభూతమవుతుంది”.

ఈ సందర్భంలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను మరి గాడిదను గురించి ఏమిటి అని అడిగితే ఆయన ఇలా సమాధానమిచ్చారు: “ఆ విషయంలో నా పై ఎలాంటి దైవాజ్ఞ అవతరించలేదు. కాకపోతే పాప మన్నింపు రీత్యా ఎంతో సమగ్రమైన అసాధారణ సూక్తి ఒకటి అవతరించింది. అదేమిటంటే “ఎవరు అణుమాత్రం సత్కార్యం చేసినా సరే అతను దాన్ని (పరలోకంలో) కళ్ళారా చూసుకుంటాడు. అలాగే మరెవరు అణుమాత్రం పాపకార్యం చేసినా సరే అతను దాన్ని ప్రత్యక్షంగా చూసుకుంటాడు.” (దివ్యఖుర్ఆన్ – జిల్ జాల్ : 7,8)

[సహీహ్ బుఖారీ : 56వ ప్రకరణం – జిహాద్ వ స్సైర్ 48వ అధ్యాయం – అల్ ఖైలుల్ సలాసతి]

575 – حديث أَبِي ذَرٍّ، قَالَ: انْتَهَيْتُ إِلَيْهِ وَهُوَ يَقُولُ، فِي ظِلِّ الْكَعْبَةِ: هُمُ الأَخْسَرُونَ وَرَبِّ الْكَعْبَةِ، هُمُ الأَخْسَرُونَ وَرَبِّ الْكَعْبَةِ قُلْتُ: مَا شَأْنِي أَيُرَى فِيَّ شَيْءٌ مَا شَأْنِي فَجَلَسْتُ إِلَيْهِ وَهُوَ يَقُولُ، فَمَا اسْتَطَعْتُ أَنْ أَسْكُتَ، وَتَغَشَّانِي مَا شَاءَ اللهُ، فَقُلْتُ: مَنْ هُمْ بِأَبِي أَنْتَ وَأُمِّي يَا رَسُولَ اللهِ قَالَ: الأَكْثَرُونَ أَمْوَالاً إِلاَّ مَنْ قَالَ هكَذَا وَهكَذَا وَهكَذَا
__________
أخرجه البخاري في: 83 كتاب الأيمان والنذور: 8 باب كيف كانت يمين النبي صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ

575. హజ్రత్ అబూజర్ గిఫ్ఫారి (రదియల్లాహు అన్హు) కథనం:- నేనొకసారి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి వెళ్ళాను. అప్పుడాయన కాబా (గోడ) నీడలో కూర్చొని “కాబా ప్రభువు సాక్షి! అందరికంటే ఎక్కువగా వాళ్ళే నష్టపోయే వాళ్ళు. కాబా ప్రభువు సాక్షి!! అందరికంటే ఎక్కువగా వాళ్ళే నష్టపోయే వాళ్ళు” అని అన్నారు. నేను (ఆశ్చర్యపోతూ) “ఏమిటీ, నా పరిస్థితి ఏమిటీ? నాలో అలాంటి దేదయినా కన్పిస్తోందా? (దైవప్రవక్తా!)” అని అడిగాను. ఆ తరువాత నేను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెంత వెళ్ళి కూర్చున్నాను. ఆయన తిరిగి అవే మాటలను ఉద్ఘాటించసాగారు. నేను తీవ్రంగా చింతిస్తూ ఉండబట్టలేక “దైవప్రవక్తా నా తల్లిదండ్రులు మీ కోసం అర్పితమవుగాక, ఎవరు వాళ్ళు?” అని అడిగాను మళ్ళీ. అప్పుడాయన సమాధానమిస్తూ, “అత్యధిక సిరిసంపదలు కలవాళ్ళు. అయితే ఈ విధంగా, ఆ విధంగా (అంటే ముందూ, వెనుకా, కుడి, ఎడమల వైపు) దైవమార్గంలో ఖర్చు పెట్టే వాళ్ళు మాత్రం కాదు” అని అన్నారు.

[సహీహ్ బుఖారీ : 83వ ప్రకరణం – ఈమాన్ వనుజూర్, 4వ అధ్యాయం – కైఫ కానత్ యమీనున్నబీ (సల్లల్లాహు అలైహి వసల్లం)]

576 – حديث أَبِي ذَرٍّ رضي الله عنه، قَالَ: انْتَهَيْتُ إِلَى النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: وَالَّذِي نَفْسِي بِيَدِهِ أَوْ وَالَّذِي لاَ إِلهَ غَيْرُهُ أَوْ كَمَا حَلَفَ مَا مِنْ رَجُلٍ تَكُونُ لَهُ إِبِلٌ أَوْ بَقَرٌ أَوْ غَنَمٌ لاَ يُؤَدِّي حَقَّهَا إِلاَّ أُتِيَ بِهَا يَوْمَ الْقِيَامَةِ أَعْظَمَ مَا تَكُونُ وَأَسْمَنهُ، تَطَؤُهُ بِأَخْفَافِهَا، وَتَنْطَحُهُ بِقُرُونِهَا، كُلَّمَا جَازَتْ أُخْرَاهَا رُدَّتْ عَلَيْهِ أُولاَهَا، حَتَّى يُقْضَى بَيْنَ النَّاسِ
__________
أخرجه البخاري في: 24 كتاب الزكاة: 43 باب زكاة البقر

576. హజ్రత్ అబూజర్ గిఫ్ఫారి (రదియల్లాహు అన్హు) కథనం:- నేను (ఓసారి) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి వెళ్తే సరిగ్గా అదే సమయంలో ఆయన “నా ప్రాణం ఎవరి అధీనంలో ఉందో ఆ శక్తి స్వరూపుని సాక్షి!” అంటూ లేక “తాను తప్ప వేరే ఆరాధ్యుడు లేనటువంటి శక్తి స్వరూపుని సాక్షి” అంటూ లేక మొత్తం మీద ఆయన ఏదో ఓ రకంగా ప్రమాణం చేస్తూ ఇలా అన్నారు. “ఒంటెలు, ఆవులు లేదా మేకలు కలిగి ఉన్న వ్యక్తి వాటి హక్కు (అంటే జకాత్) గనక నెరవేర్చకపోతే ప్రళయదినాన ఆ పశువులు బాగా పెరిగి బలసిపోయేలా చేసి తీసుకు రాబడతాయి. తర్వాత అవి ఒకదాని తరువాత మరొకటి వరుసగా ఆ వ్యక్తిని కొమ్ములతో పొడిచి కాళ్ళతో తొక్కివేస్తాయి. చివరి పశువు కూడ పొడిచి, తొక్కి వేసిన తరువాత తిరిగి మొదటి పశువు వచ్చేస్తుంది. ఈ విధంగా ఈ యాతన యావత్తు మానవులను గురించి (పరలోక) తీర్పు ముగిసే దాకా కొనసాగుతుంది”.

[సహీహ్ బుఖారీ : 24వ ప్రకరణం – జకాత్, 43వ అధ్యాయం – జకాతిల్ బఖర]

577 – حديث أَبِي ذَرٍّ، قَالَ: كُنْتُ أَمْشِي مَعَ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فِي حَرَّةِ الْمَدِينَةِ عِشَاءً، اسْتَقْبَلَنَا أُحُدٌ؛ فَقَالَ: يَا أَبَا ذَرٍّ مَا أُحِبُّ أَنَّ أُحُدًا لِي ذَهَبًا، يَأْتِي عَلَيَّ لَيْلَةٌ أَوْ ثَلاَثٌ عِنْدِي مِنْهُ دِينَارٌ إِلاَّ أَرْصُدُهُ لِدَيْنٍ، إِلاَّ أَنْ أَقُولَ بِهِ فِي عِبَادِ اللهِ هكَذَا وَهكَذَا وَهكَذَا وَأَرَانَا بِيَدِهِ ثُمَّ قَالَ: يَا أَبَا ذَرٍّ قُلْتُ: لَبَّيْكَ وَسَعْدَيْكَ يَا رَسُولَ اللهِ قَالَ: الأَكْثَرُونَ هُمُ الأَقَلُّونَ إِلاَّ مَنْ قَالَ هكَذَا وَهكَذَا، ثُمَّ قَالَ لِي: مَكَانَكَ، لاَ تَبْرَحْ يَا أَبَا ذَرٍّ حَتَّى أَرْجِعَ فَانْطَلَقَ حَتَّى غَابَ عَنِّي، فَسَمِعْتُ صَوْتًا، فَخَشِيتُ أَنْ يَكُونَ عُرِضَ لِرَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَأَرَدْتُ أَنْ أَذْهَبَ، ثُمَّ ذَكَرْتُ قَوْلَ رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ لاَ تَبْرَحْ، فَمَكُثْتُ قُلْتُ يَا رَسُولَ اللهِ سَمِعْتُ صَوْتًا خَشِيتُ أَنْ يَكُونَ عُرِضَ لَكَ، ثُمَّ ذَكَرْتُ قَوْلَكَ، فَقُمْتُ؛ فَقَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: ذَاكَ جِبْرِيلُ، أَتَانِي فَأَخْبَرَنِي أَنَّهُ مَنْ مَاتَ مِنْ أُمَّتِي لاَ يُشْرِكُ بِاللهِ شَيْئًا دَخَلَ الْجَنَّةَ قُلْتُ: يَا رَسُولَ اللهِ وَإِنْ زَنَى وَإِنْ سَرَقَ قَالَ: وَإِنْ زَنَى وَإِنْ سَرَقَ
__________
أخرجه البخاري في: 79 كتاب الاستئذان: 3 باب من أجاب بلبيك وسعديك

577. హజ్రత్ అబూజర్ గిప్పారి (రదియల్లాహు అన్హు) కథనం:- నేనొక రోజు సాయంత్రం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వెంట మదీనా వెలుపల కంకర నేలపై నడచిపోతుంటే మా ఎదురుగా ఉహద్ పర్వతం వచ్చింది. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: “అబూజర్! నా దగ్గర ఉహద్ పర్వతమంత బంగారం ఉండి, ఒక రాత్రి లేక మూడు రాత్రులు గడిచినంత కాలంలో అప్పు తీర్చడానికి ఉంచుకునే దీనార్ తప్ప ఆ బంగారంలో ఒక్క దీనార్ కూడ నా దగ్గర ఉండిపోవడం నాకిష్టం లేదు. నేనా సంపదను దైవదాసుల కోసం ఇలా అలా ఖర్చు పెడతాను.” దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ మాట అంటూ తన చేతిని అటూ ఇటూతిప్పి చూపారు.

ఆ తరువాత “అబూజర్ !” అని నన్ను సంబోధించారు. “చెప్పండి దైవప్రవక్తా! నేను మాట వినడానికి సిద్ధంగా ఉన్నాను” అన్నాను నేను. “అలా, ఇలా (దైవమార్గంలో) ధనాన్ని ఖర్చు చేసేవారు తప్ప ఎక్కువ సిరిసంపదలు కలవారే తక్కువ పుణ్యం పొందేవారు”అన్నారు ఆయన. ఆ తరువాత “అబూజర్! ఇక్కడ ఉండు. నేను తిరిగొచ్చేదాకా ఎక్కడికీ వెళ్ళకు” అని చెప్పి ఎక్కడికో వెళ్ళిపోయారు. నాకు కనపడనంత దూరంగా వెళ్ళిపోయారు.

ఆ తర్వాత కాస్సేపటికి ఏదో శబ్దం విన్పించింది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఏదైనా ప్రమాదానికి గురయ్యారేమోనని నేను భయపడ్డాను. అందువల్ల నేను ముందుకు సాగుదామనుకున్నాను. ఇక్కడ్నుంచి ఎక్కడికీ వెళ్ళకు అన్న దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆజ్ఞ గుర్తొచ్చి ఆగిపోయాను. (అంతలో దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) వచ్చేశారు, రాగానే) “దైవప్రవక్తా! నేనొక విధమైన శబ్దం విని (దురదృష్టవశాత్తు) మీకేమయినా ప్రమాదం సంభవించిందేమోనని భయపడ్డాను. కాని మీ ఆదేశం గుర్తొచ్చి నేను ఇక్కడ్నుంచి కదలలేకపోయాను” అన్నాను నేను.

అప్పుడు ఆయన ఇలా అన్నారు : “ఈ శబ్దం హజ్రత్ జిబ్రీల్ (అలైహిస్సలాం) గారిది. ఆయన నా దగ్గరకు వచ్చి ‘మీ అనుచర సమాజంలో అల్లాహ్ కి ఆయన దైవత్వంలో ఏ మాత్రం ఇతరులను సాటి కల్పించని వ్యక్తి స్వర్గానికి వెళ్తాడు’ అని తెలియజేశారు”. నేనా మాటలు విని “మరి దైవప్రవక్తా! అతను వ్యభిచారం చేసినా, దొంగతనాలకు పాల్పడినా (స్వర్గానికి వెళ్తాడా)”? అని అడిగాను. దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “ఔను, వ్యభిచారం చేసినా, దొంగతనాలకు పాల్పడినా సరే” అని అన్నారు.

[సహీహ్ బుఖారీ : 79వ ప్రకరణం – ఇస్తీజాన్, 3వ అధ్యాయం – మన్ అజాబ బిలబ్బైక వసాదైక్ ]

578 – حديث أَبِي ذَرٍّ رضي الله عنه، قَالَ: خَرَجْتُ لَيْلَةً مِنَ اللَّيَالِي، فَإِذَا رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَمْشِي وَحْدَهُ، وَلَيْسَ مَعَهُ إِنْسَانٌ؛ قَالَ فَظَنَنْتُ أَنَّهُ يَكْرَهُ أَنْ يَمْشِيَ مَعَهُ أَحَدٌ، قَالَ: فَجَعَلْتُ أَمْشِي فِي ظِلِّ الْقَمَرِ، فَالْتَفَتَ فَرَآنِي، فَقَالَ: مَنْ هذَا قُلْتُ: أَبُو ذَرٍّ، [ص:202] جَعَلَنِي اللهُ فِدَاءَكَ، قَالَ: يَا أَبَا ذَرٍّ تَعَالَه قَالَ: فَمَشَيْتُ مَعَهُ سَاعَةً، فَقَالَ: إِنَّ الْمُكْثِرِينَ هُمُ الْمُقِلُّونَ يَوْمَ الْقِيَامَةِ، إِلاَّ مَنْ أَعْطَاهُ اللهُ خَيْرًا فَنَفَحَ فِيهِ يَمِينهُ وَشِمَالَهُ وَبَيْنَ يَدَيْهِ وَوَرَاءَهُ وَعَمِلَ فِيهِ خَيْرًا قَالَ: فَمَشَيْتُ مَعَهُ سَاعَةً؛ فَقَالَ لِي: اجْلِسْ ههُنَا قَالَ: فَأَجْلَسَنِي فِي قَاعٍ حَوْلَهُ حِجَارَةٌ، فَقَالَ لِي: اجْلِسْ ههُنَا حَتَّى أَرْجِعَ إِلَيْكَ قَالَ: فَانْطَلَقَ فِي الْحَرَّةِ حَتَّى لاَ أَرَاهُ، فَلَبِثَ عَنِّي فَأَطَالَ اللُّبْثَ، ثُمَّ إِنِّي سَمِعْتُهُ وَهُوَ مُقْبِلٌ، وَهُوَ يَقُولُ: وَإِنْ سَرَقَ وَإِنْ زَنَى قَالَ: فَلَمَّا جَاءَ لَمْ أَصْبِرْ حَتَّى قُلْتُ يَا نَبِيَّ اللهِ جَعَلَنِي اللهُ فِدَاءَكَ، مَنْ تُكَلِّمُ فِي جَانِبِ الْحَرَّةِ، مَا سَمِعْتُ أَحَدًا يَرْجِعُ إِلَيْكَ شَيْئًا قَالَ: ذَاكَ جِبْرِيلُ عَلَيْهِ السَّلاَمُ، عَرَضَ لِي فِي جَانِبِ الْحَرَّةِ، قَالَ: بَشِّرْ أُمَّتَكَ أَنَّهُ مَنْ مَاتَ لاَ يُشْرِكُ بِاللهِ شَيْئًا دَخَلَ الْجَنَّةَ، قُلْتُ: يَا جِبْرِيلُ وَإِنْ سَرَقَ وَإِنْ زَنَى قَالَ: نَعَمْ قَالَ، قُلْتُ: وَإِنْ سَرَقَ وَإِنْ زَنَى قَالَ: نَعَمْ وَإِنْ شَرِبَ الْخَمْرَ
__________
أخرجه البخاري في: 81 كتاب الرقاق: 13 باب المكثرون هم المقلون

578. హజ్రత్ అబూజర్ గిప్పారి (రదియల్లాహు అన్హు) కథనం:- నేనొక రోజు రాత్రి (ఇంటి నుంచి) బయలుదేరి చూస్తే, దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ఒంటరిగా ఎక్కడికో వెళ్తున్నారు. ఆయన వెంట ఎవరూ లేరు. బహుశా ఆయన (ఈ సమయంలో) తన వెంట ఎవరినీ తీసుకు వెళ్ళదలచుకోలేదేమో అనుకున్నాను నేను మనసులో. ఈ ఆలోచనతో నేను (ఆయనకు కనపడకుండా ఉండేందుకు, వెన్నెలను తప్పించి (నీడచాటున) నడవసాగాను. కాని ఆయన వెనుదిరిగి నన్ను చూసి “ఎవరూ?’ అన్నారు. “నేను అబూజర్ ని. అల్లాహ్ నన్ను మీ కోసం సమర్పించుగాక” అని అన్నాను. ఆయన (వెంటనే) “అబూజర్! వచ్చెయ్యి” అన్నారు. నేను వెళ్ళి ఆయన వెంట (మౌనంగా) నడవసాగాను.

కాస్సేపటికి ఆయన (నిశ్శబ్దాన్ని చీల్చివేస్తూ) ఇలా అన్నారు; “నిజానికి అత్యధిక సిరిసంపదలు కలవారే ప్రళయ దినాన అధములుగా, దరిద్రులుగా ఉండేవారు. అయితే అల్లాహ్ ప్రసాదించిన సిరిసంపదల్ని ఎడమవైపు, కుడివైపు, ముందు వెనకా, సర్వత్రా వెదజల్లుతూ వాటిని సత్కార్యాల కోసం వినియోగించే వాళ్ళు మాత్రం కాదు.”

ఆ తరువాత మరి కాస్సేపు ఆయన వెంట నడుస్తూ పోయాను. కాస్సేపటికి ఆయన “ఇక్కడ కూర్చో” అన్నారు. చుట్టు ప్రక్కల రాళ్ళు, రప్పలు పడి ఉండి, మధ్యలో శుభ్రంగా ఉన్న ఒక చదునైన ప్రదేశంలో కూర్చోవలసినదిగా ఆయన నన్ను ఆదేశిస్తూ “నేను తిరిగి వచ్చే వరకూ (ఎక్కడికీ వెళ్ళకుండా) ఇక్కడే కూర్చొని ఉండు” అని అన్నారు.

ఆ తరువాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆ రాతి నేల మీద నడుస్తూ నాకు కనుమరుగయిపోయి ఎక్కడికో వెళ్ళారు. అక్కడ చాలా సేపు గడిపారు. తర్వాత ఎంతో ఆలస్యంగా వచ్చారు. అలా వస్తూ ఆయన “దొంగతనం చేసినా, వ్యభిచారానికి పాల్పడినా సరే” అన్నారు. ఆయన నాకు దగ్గరగా వచ్చారు. నేనిక ఉండబట్టలేక “దైవప్రవక్తా! అల్లాహ్ నన్ను మీకోసం అంకితమయ్యే భాగ్యం ప్రసాదించుగాక. ఈ రాతి నేల ఆవల మీరు ఎవరితో మాట్లాడుతున్నారు” అని అడిగాను.

అప్పుడు దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా వివరించారు; హజ్రత్ జిబ్రయీల్ (అలైహిస్సలాం)తో. ఆయన ఈ రాతి నేల ఆవల వచ్చి నన్ను కలుసుకొని “మీ అనుచర సమాజానికి శుభవార్త అందజేయండని చెబుతూ ఒక్క అల్లాహ్ ను తప్ప మరెవరినీ ఆరాధించకుండా, ఆయనకు (ఆయన శక్తి సామర్ధ్యాలలో) మరెవరినీ సాటి కల్పించకుండా జీవితం గడుపుతూ చివరికి అదే స్థితిలో ఎవరైనా చనిపోతే అతను స్వర్గానికి వెళ్తాడు”అని అన్నారు. అప్పుడు నేను “అయితే జిబ్రీల్! అతను దొంగతనం చేసి ఉన్నా, వ్యభిచరించి ఉన్నా (సరే స్వర్గానికి వెళ్తాడా)?” అని అడిగాను. దానికి ఆయన ‘ఔన’ని సమాధానమిచ్చారు. నేను మళ్ళీ “ఏమిటి, అతను దొంగతనం, వ్యభిచారం చేసి ఉన్నప్పటికీ (స్వర్గానికి వెళ్తాడా)?” అని అడిగాను. “ఔను (అంతేకాదు) అతను మద్యం సేవించి ఉన్నా సరే” అని అన్నారు.

[సహీహ్ బుఖారీ : 81వ ప్రకరణం – అర్రిఖాఖ్, 13వ అధ్యాయం – అల్ ముక్సరూన హుముల్ మఖ్లూన్]

579 – حديث أَبِي ذَرٍّ عَنِ الأَحْنَفِ بْنِ قَيْسٍ، قَالَ: جَلَسْتُ إِلَى مَلإٍ مِنْ قُرَيْشٍ، فَجَاءَ رَجُلٌ خَشِنُ الشَّعَرِ وَالثِّيَابِ وَالْهَيْئَةِ، حَتَّى قَامَ عَلَيْهِمْ فَسَلَّمَ، ثُمَّ قَالَ: بَشِّرِ الْكَانِزِينَ بِرَضْفٍ يُحْمَى عَلَيْهِ فِي نَارِ جَهَنَّمَ، ثُمَّ يُوضَعُ عَلَى حَلَمَةِ ثَدْيِ أَحَدِهِمْ حَتَّى يَخْرُجَ مِنْ [ص:203] نُغْضِ كَتِفِهِ، وَيُوضَعُ عَلَى نُغْضِ كَتِفِهِ حَتَّى يَخْرُجَ مِنْ حَلَمَةِ ثَدْيِهِ يَتَزَلْزَلُ ثُمَّ وَلَّى فَجَلَسَ إِلَى سَارِيَةٍ وَتَبِعْتُهُ وَجَلَسْتُ إِلَيْهِ، وَأَنَا لاَ أَدْرِي مَنْ هُوَ؛ فَقُلْتُ لَهُ: لاَ أُرَى الْقَوْمَ إِلاَّ قَدْ كَرِهُوا الَّذِي قُلْتَ، قَالَ: إِنَّهُمْ لاَ يَعْقِلُونَ شَيْئًا، قَالَ لِي خَلِيلِي قَالَ: قُلْتُ مَنْ خَلِيلُكَ قَالَ: النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَا أَبَا ذَرٍّ أَتُبْصِرُ أُحُدًا قَالَ: فَنَظَرْتُ إِلَى الشَّمْسِ مَا بَقِيَ مِنَ النَّهَارِ، وَأَنَا أُرَى أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يرْسِلُنِي فِي حَاجَةٍ لَهُ قُلْتُ: نَعَمْ قَالَ: مَا أُحِبُّ أَنَّ لِي مِثْلَ أُحُدٍ ذَهَبًا أُنْفِقُهُ كُلَّهُ إِلاَّ ثَلاَثَةَ دَنَانِيرَ وَإِنَّ هؤُلاَءِ لاَ يَعْقِلُونَ، إِنَّمَا يَجْمَعُونَ الدُّنْيَا، لاَ وَاللهِ لاَ أَسْأَلُهُمْ دُنْيَا، وَلاَ أَسْتَفْتِيهِمْ عَنْ دِينٍ حَتَّى أَلْقَى اللهَ
__________
أخرجه البخاري في: 24 كتاب الزكاة: 4 باب ما أدى زكاته فليس بكنز

579. హజ్రత్ అహ్నఫ్ బిన్ ఖైస్ (రదియల్లాహు అన్హు) కథనం:- నేనొకసారి ఖురైష్ నాయకుల దగ్గర కూర్చొని ఉన్నప్పుడు ఒక వ్యక్తి వచ్చాడు. అతను ముతక బట్టలు ధరించి ఉన్నాడు. తల వెంట్రుకలు చాలా బిరుసుగా ఉన్నాయి. అతని రూపురేఖలు చూస్తే చాలా మొరటుగా ఉన్నాడు. అతను వారి దగ్గర నిలబడి సలాం చేసి ఇలా అన్నాడు.

“డబ్బు కూడబెట్టే వారికి శుభవార్త చెప్పండి. (దైవదూతలు) నరకాగ్నిలో ఒక రాయిని కాల్చి దాన్ని వారి గుండెల మీద ఉంచుతారు. అది వారి భుజపు టెముకల దగ్గర్నుంచి (దేహాన్ని మాడ్చుతూ) రెండో వైపుకు వచ్చేస్తుంది. ఆ తరువాత దాన్ని వారి భుజపు టెముకల మీద ఉంచుతారు. అది వారి గుండెల నుండి రెండో వైపుకు వచ్చేస్తుంది. ఈ విధంగా ఆ రాయి నిరంతరాయంగా అటూ, ఇటూ తిరుగుతుంటుంది.”

ఈ మాటలు చెప్పి ఆ వ్యక్తి (కొంచెం దూరంలో ఉన్న) ఒక స్తంభం దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. ఆ వ్యక్తి ఎవరో నాకు తెలియదు. నేనతనితో “మీ మాటలు వారికి కోపాన్ని కలిగించాయనుకుంటున్నాను నేను” అని అన్నాను. దానికా వ్యక్తి “వారు బుద్ధిహీనులు. నాకీ విషయం నా ప్రాణ స్నేహితుడు తెలియజేశారు” అని అన్నాడు. “మీ. ప్రాణ స్నేహితుడెవరు?” అని అడిగాను నేను.

అప్పుడా వ్యక్తి ఇలా తెలియజేశాడు: “నా ప్రాణ స్నేహితుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం). ఆయన నాతో “అబూజర్! నీకా ఉహద్ పర్వతం కన్పిస్తోంది కదూ?” అని అన్నారు. ఈ మాట విని ఇంకా ఎంత పొద్దుందోనని నేను సూర్యుని వైపు చూశాను. ఆయన నన్ను ఏదైనా పని మీద ఎక్కడికైనా పంపదలచుకున్నారేమోనని భావించాను. నేను (వెంటనే ఆలోచన నుంచి తేరుకొని) “కనిపిస్తోంది దైవప్రవక్తా!” అని అన్నాను. “నా దగ్గర ఉహద్ పర్వతమంత బంగారం ఉండి, మూడు వరహాలు తప్ప ఆ బంగారం అంతా ఖర్చు చేయకుండా అట్టి పెట్టుకోవడం నాకు (ఎంతమాత్రం) ఇష్టం లేదు” అని అన్నారు ఆయన.

(దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి ఈ ఉపదేశాన్ని వినిపించిన తరువాత హజ్రత్ అబూజర్ (రదియల్లాహు అన్హు) ఇలా చెప్పారు): “వీరసలు బుద్దిహీనులు. ప్రాపంచిక సంపదను కూడబెట్టుకుంటున్నారు. అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను; నేను అల్లాహ్ ను కలుసుకునే వరకు (అంటే చనిపోయే వరకు) వారిని వారి ప్రాపంచిక సంపద నుండి చిల్లిగవ్వ కూడా అడగను. అలాగే ధర్మం విషయంలో కూడా వారిని నేను ఏ మాటా అడిగి తెలుసుకోను.”

[సహీహ్ బుఖారీ : 24వ ప్రకరణం – జకాత్, 4వ అధ్యాయం – మా అదా జకాతుహూ ఫలైస బికన్జ్]

580 – حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: قَالَ اللهُ عَزَّ وَجَلَّ: أَنْفِقْ أُنْفِقْ عَلَيْكَ وَقَالَ: يَدُ اللهِ مَلأَى، لاَ تَغِيضُهَا نَفَقَةٌ، سَحَّاءُ اللَّيْلَ وَالنَّهَارَ وَقَالَ: أَرَأَيْتُمْ مَا أَنْفَقَ مُنْذُ خَلَقَ السَّموَاتِ وَالأَرْضَ، فَإِنَّهُ لَمْ يَغِضْ مَا فِي يَدِهِ، [ص:204] وَكَانَ عَرْشُهُ عَلَى الْمَاءِ، وَبِيَدِهِ الْمِيزَان يَخْفِضُ وَيَرْفَعُ
__________
أخرجه البخاري في: 65 كتاب التفسير: 11 سورة هود: 2 باب قوله وكان عرشه على الماء

580. హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:- అల్లాహ్ “(నా కోసం) డబ్బు ఖర్చు చేయండి, నేను కూడా మీకోసం ఖర్చు చేస్తాను” అని అన్నాడు.

“అల్లాహ్ చేయి (సకల విధాల సిరిసంపదలతో) నిండుగా ఉంది. దాన్ని రేయింబవళ్ళు నిగ్విరామంగా ఖర్చు చేసినా తరగదు.అల్లాహ్ భూమ్యాకాశాలను సృష్టించిన దగ్గర్నుంచి ఎంత ఖర్చు చేశాడో మీరెప్పుడైనా ఆలోచించారా? ఇంత ఖర్చు చేసినా ఆయన చేతిలో ఉన్న నిధి నిక్షేపాలలో రవ్వంత కూడా తగ్గలేదు. ఆయన సింహాసనం నీళ్ళ మీద ఉంది. ఆయన చేతిలో త్రాసు (న్యాయం) ఉంది. ఆయన తలచుకుంటే ఎవరినైనా అధోగతి పాలు చేయగలడు. అలాగే ఆయన తలచుకుంటే ఎవరినైనా ఉచ్చస్థాయికి తీసుకు రాగలడు”

[సహీహ్ బుఖారీ : 65వ ప్రకరణం – అత్తఫ్సీర్, 2వ అధ్యాయం – ఖౌలిహీ వకాన అర్షిహీ అలల్ మాయి]

581 – حديث جَابِرٍ، قَالَ: بَلَغَ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ أَنَّ رَجُلاً مِنْ أَصْحَابِهِ أَعْتَقَ غُلاَمًا عنْ دُبُرٍ، لَمْ يَكُنْ لَهُ مَالٌ غَيْرَهُ، فَبَاعَهُ بِثَمَانِمِائَةِ دِرْهَمٍ، ثُمَّ أَرْسَلَ بِثَمَنِهِ إِلَيْهِ
__________
أخرجه البخاري في: 93 كتاب الأحكام: 32 باب بيع الإمام على الناس أموالهم وضياعهم

581. హజ్రత్ జాబిర్ బిన్ అబ్దుల్లా (రదియల్లాహు అన్హు) కథనం:- ఒక సహాబీ (ప్రవక్త అనుచరుడు) దగ్గర ఒక బానిస తప్ప మరే సంపదా లేదు. అయినా ఆ స్థితిలో ఆయన ఆ బానిసకు తన తదనంతరం స్వాతంత్ర్యం ప్రసాదించారని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు తెలిసింది. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆ బానిసను ఎనిమిదొందల దిర్హమ్ లకు అమ్మించి ఆ పైకాన్ని ఆ సహాబి వద్దకు పంపించారు.

[సహీహ్ బుఖారీ : 93వ ప్రకరణం – అహ్కామ్, 32వ అధ్యాయం – బైయిల్ ఇమామి అలన్నాసి అమ్వాలహుమ్ వ
జియా అహుమ్]

582 – حديث أَنَسٍ رضي الله عنه، قَالَ: كَانَ أَبُو طَلْحَةَ أَكْثَرَ الأَنْصَارِ بِالْمَدِينَةِ مَالاً مِنْ نَخْلٍ، وَكَانَ أَحَبَّ أَمْوَالِهِ إِلَيْهِ بَيْرُحَاءَ، وَكَانَتْ مُسْتَقْبِلَةَ الْمَسْجِدِ، وَكَانَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَدْخُلُهَا وَيَشْرَبُ مِنْ مَاءٍ فِيهَا طَيِّبٍ؛ قَالَ أَنَسٌ: فَلَمَّا أُنْزِلَتْ هذِهِ الآيَة (لَنْ تَنَالُوا الْبِرَّ حَتَّى تُنْفِقُوا مِمَّا تُحِبُّونَ) قَامَ أَبُو طَلْحَةَ إِلَى رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَقَالَ: يَا رَسُولَ اللهِ إِنَّ اللهَ تَبَارَكَ وَتَعَالَى يَقُولُ (لَنْ تَنَالُوا الْبِرَّ حَتَّى تُنْفِقُوا مِمَّا تُحِبُّونَ) وَإِنَّ أَحَبَّ أَمْوَالِي إِلَيَّ بَيْرُحَاءُ، وَإِنَّهَا صَدَقَةٌ للهِ؛ أَرْجُو بِرَّهَا وَذُخْرَهَا عِنْدَ اللهِ؛ فَضَعْهَا [ص:205] يَا رَسُولَ اللهِ حَيْثُ أَرَاكَ اللهُ قَالَ: فَقَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: بَخْ ذلِكَ مَالٌ رَابِحٌ، ذلِكَ مَالٌ رَابِحٌ، وَقَدْ سَمِعْتُ مَا قُلْتَ، وَإِنِّي أَرَى أَنْ تَجْعَلَهَا فِي الأَقْرَبِينَ فَقَالَ أَبُو طَلْحَةَ: أَفْعَلُ يَا رَسُولَ اللهِ فَقَسَمَهَا أَبُو طَلْحَةَ فِي أَقَارِبِهِ وَبَنِي عَمِّهِ
__________
أخرجه البخاري في: 24 كتاب الزكاة على الأقارب

582. హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం:- హజ్రత్ అబూ తల్హా (రదియల్లాహు అన్హు) మదీనాలోని అన్సార్ ముస్లింలలో కెల్లా గొప్ప ధనికులు. ఆయనకు (అనేక) ఖర్జూర తోటలు ఉండేవి. వాటిలో ‘బైర్హా’ అనే తోటంటే ఆయనకు ఎంతో ఇష్టం. ఈ తోట మస్జిదెనబవీ ముందు భాగాన ఉండేది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆ తోటలోకి (తరచుగా) వెళ్తుండేవారు. అక్కడ లభించే మంచినీళ్ళు త్రాగేవారు. “మీకు అత్యంత ప్రీతికరమైన వస్తువుని దైవమార్గంలో ఖర్చు చేయనంత వరకు మీరు పుణ్యస్థాయికి చేరుకోలేరు” అనే ఖుర్ఆన్ సూక్తి (ఆలి ఇమ్రాన్:92) అవతరించినపుడు హజ్రత్ అబూ తల్హా లేచి ఇలా అన్నారు.

“దైవప్రవక్తా! మీకు అత్యంత ప్రీతికరమైన వస్తువుని దైవమార్గంలో ఖర్చు చేయనంతవరకు మీరు పుణ్యస్థాయికి చేరుకోలేరని అల్లాహ్ సెలవిస్తున్నాడు. ‘బైర్హా’ తోట నాకత్యంత ప్రీతికరమైనది. అంచేత నేనాతోటను దైవమార్గంలో దానం చేస్తున్నాను. అల్లాహ్ నుండి దాని పుణ్య ఫలాన్ని ఆశిస్తున్నాను. పరలోకంలో అది నా కోసం గొప్ప నిక్షేపంగా తయారవుతుందని నమ్ముతున్నాను. దైవ ప్రవక్తా! మీరు దైవాజ్ఞ ప్రకారం దాన్ని వినియోగించండి.”

హదీసు ఉల్లేఖకుని కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అప్పుడిలా అన్నారు: “చాలా మంచిది. ఇదెంతో లాభదాయకమైన సంపద. ఇది నిజంగా ఎంతో లాభదాయకమైన సంపద. నీవన్న మాటలన్నీ నేను విన్నాను. అయితే నాదొక సలహా. ఆ తోటను నీ బంధువులకు పంచి పెట్టు”. హజ్రత్ అబూ తలా (రదియల్లాహు అన్హు) ఇది విని “దైవప్రవక్తా! నేను మీ ఆజ్ఞను శిరసావహిస్తున్నాను” అని అన్నారు. దాని ప్రకారం ఆయన ఆ తోటను తన పెదనాన్న, చిన్నాన్న కొడుకులకు, ఇతర బంధువులకు పంచి వేశారు.

[సహీహ్ బుఖారీ : 24వ ప్రకరణం – జకాత్, 44వ అధ్యాయం – అజ్జకాతి అలల్ అఖారిబ్]

583 – حديث مَيْمُونَةَ زَوْجِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، أَنَّهَا أَعْتَقَتْ وَلِيدَةً لَهَا فَقَالَ لَهَا: وَلَوْ وَصَلْتِ بَعْضَ أَخْوالِكِ كَانَ أَعْظَمَ لأَجْرِكِ
__________
أخرجه البخاري في: 51 كتاب الهبة: 16 باب بمن يُبدأ بالهدية

583. విశ్వాసుల మాతృమూర్తి హజ్రత్ మైమూన (రదియల్లాహు అన్హా) కథనం:- నేనొకసారి ఒక దాసిని బానిసత్వం నుంచి విముక్తి కలిగించాను. అప్పుడు దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు. “నీవా దాసిని నీ మేనమామలలో ఎవరికైనా ఇచ్చి (నీ బంధుప్రేమను వెల్లడించుకొని) ఉంటే నీకెక్కువ పుణ్యఫలం లభించి ఉండేది.”

[సహీహ్ బుఖారీ : 51వ ప్రకరణం – హిబా, 16వ అధ్యాయం – బిమఁయ్యుబ్ దవు బిల్ హదియ్యా]

584 – حديث زَيْنَبَ امْرَأَةِ عَبْدِ اللهِ قَالَتْ: كُنْتُ فِي الْمَسْجِدِ، فَرَأَيْتُ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَقَالَ: تَصَدَّقْنَ وَلَوْ مِنْ حُلِيِّكُنَّ وَكَانَتْ زَيْنَبُ تُنْفِقُ عَلَى عَبْدِ اللهِ، وَأَيْتَامٍ فِي حَجْرِهَا، فَقَالَتْ لِعَبْدِ اللهِ، سَلْ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، أَيَجْزِي عَنِّي أَنْ أُنْفِقَ عَلَيْكَ وَعَلَى أَيْتَامِي فِي حَجْرِي مِنَ الصَّدَقَةِ فَقَالَ: سَلِي أَنْتِ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ؛ فَانْطَلَقْتُ إِلَى النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فَوَجَدْتُ امْرَأَةً مِنَ الأَنْصَارِ عَلَى الْبَابِ، حَاجَتُهَا مِثْلُ حَاجَتِي؛ فَمَرَّ عَلَيْنَا بِلاَلٌ، فَقُلْنَا: سَلِ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، أَيَجْزِي عَنِّي أَنْ أُنْفِقَ عَلَى زَوْجِي وَأَيْتَامٍ لِي فِي حَجْرِي وَقُلْنَا: لاَ تُخْبِرْ بِنَا فَدَخَلَ فَسَأَلَهُ، فَقَالَ: مَنْ هُمَا قَالَ: زَيْنَبُ قَالَ: أَيُّ الزَّيَانِبِ قَالَ: امْرَأَة عَبْدِ اللهِ، قَالَ: نَعَمْ لَهَا أَجْرَانِ، أَجْرُ الْقَرَابَةِ وأَجْرُ الصَّدَقَةِ
__________
أخرجه البخاري في: 24 كتاب الزكاة: 48 باب الزكاة على الزوج والأيتام في الحجر

584. హజ్రత్ అబ్దుల్లా భార్య అయిన హజ్రత్ జైనబ్ (రదియల్లాహు అన్హా) కథనం:- నేనొకసారి మస్జిదులో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) స్త్రీలకు హితోపదేశం చేస్తుంటే చూశాను. ఆయన వారికి హితోపదేశం చేస్తూ “దానం చేయండి. మీ నగల్లో నుంచయినా సరే (ఏదో ఒకటి) దానం చేయండి” అని అన్నారు.

హదీసు ఉల్లేఖకుని కథనం ప్రకారం హజ్రత్ జైనబ్ (రదియల్లాహు అన్హా) తన భర్త కోసం, తన పోషణలో ఉన్న కొందరు అనాధ పిల్లల కోసం సంపద ఖర్చు చేస్తుండేవారు. అందువల్ల ఆమె హజ్రత్ అబ్దుల్లా (రదియల్లాహు అన్హు) ముందు ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ “నేను మీ కోసం, నా పోషణలో ఉన్న అనాధ పిల్లల కోసం ఖర్చు చేస్తున్న ధనం దానంగా పరిగణించడుతుందో లేదో కాస్త దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ని అడిగి తెలుసుకోండి” అని అన్నారు. దానికి హజ్రత్ అబ్దుల్లా (రదియల్లాహు అన్హు) “నువ్వేపోయి అడిగి తెలుసుకో ” అన్నారు. .

అప్పుడు నేను దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) దగ్గరికి వెళ్ళడానికి బయలుదేరాను. గుమ్మం దగ్గర ఒక అన్సారీ మహిళ కలిసింది. ఆమెకు కూడ ఇదే సమస్య ఎదురయి, ఈ విషయం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను అడిగి తెలుసుకోదలచింది. అదే సమయంలో హజ్రత్ బిలాల్ (రదియల్లాహు అన్హు) మా సమీపం నుండి ఎక్కడికో వెళ్తుంటే మేము ఆయన్ని ఆపి, “నేను నా భర్త కోసం నా పోషణలో ఉన్న అనాధ పిల్లల కోసం వినియోగిస్తున్న ధనం దానం క్రిందికి వస్తుందో లేదో కాస్త మీరు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను అడిగి మాకు తెలియజేయండి” అని అన్నాము. అయితే దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) దగ్గర మా ప్రస్తావన తేరాదు అని కూడా విన్నవించుకున్నాము.

హజ్రత్ బిలాల్ (రదియల్లాహు అన్హు) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి వెళ్ళి ఈ విషయం గురించి విచారించారు. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “ఇలా అడుగుతున్న ఆ స్త్రీలు ఎవరు?” అని అడిగారు, “జైనబ్” అన్నారు హజ్రత్ బిలాల్ (రదియల్లాహు అన్హు). “ఏ జైనబ్?” అడిగారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మళ్ళీ. “అబ్దుల్లా భార్య” అని చెప్పారు హజ్రత్ బిలాల్ (రదియల్లాహు అన్హు).

“అలాగా! ఆమెకు రెండు విధాల పుణ్యఫలం లభిస్తుంది (అని తెలియజెయ్యి). ఒకటి: బంధుప్రేమకు సంబంధించిన పుణ్యఫలం, రెండు: దానం చేసినందుకు లభించే పుణ్యఫలం” అన్నారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం).

(సహీహ్ బుఖారీ : 24వ ప్రకరణం – జకాత్, 48వ అధ్యాయం – అజ్జకాతి అలజ్జౌజి వల్ యతామ ఫిల్ హుజ్ర్)

585 – حديث أُمِّ سَلَمَةَ، قَالَتْ: قُلْتُ يَا رَسُولَ اللهِ هَلْ لِي مِنْ أَجْرٍ فِي بَنِي أَبِي سَلَمَةَ أَنْ أُنْفِقَ عَلَيْهِمْ، وَلَسْتُ بِتَارِكَتِهِمْ هكَذَا وَهكَذَا، إِنَّمَا هُمْ بَنِيَّ قَالَ: نَعَمْ لَكِ أَجْرُ مَا أَنْفَقْتِ عَلَيْهِمْ
__________
أخرجه البخاري في: 69 كتاب النفقات: 14 باب وعلى الوارث مثل ذلك:

585. విశ్వాసుల మాతృమూర్తి హజ్రత్ ఉమ్మె సల్మా (రదియల్లాహు అన్హా) కథనం:-

నేనొకసారి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)తో మాట్లాడుతూ “దైవప్రవక్తా! నేను అబూ సల్మా పిల్లల కోసం ఖర్చు పెడుతున్న సంపదకు నాకేమయినా పుణ్యఫలం లభిస్తుందా? అదీగాక (వారు నా పిల్లలే కదా!) నేను వారిని అటూ ఇటూ తిరిగి అడుక్కోవడానికి వదిలి పెట్టలేను కూడా” అని అన్నాను. దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సమాధానమిస్తూ “నీవు వారి కోసం చేస్తున్న ఖర్చుకు నీకు (తప్పకుండా) పుణ్యఫలం లభిస్తుంది” అని అన్నారు.

[సహీహ్ బుఖారీ : 69వ ప్రకరణం – అన్న ఫఖాత్, 14వ అధ్యాయం – వఅలల్ వారిసి మిస్లు జాలిక్)

586 – حديث أَبِي مِسْعُودٍ الأَنْصَارِيِّ، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: إِذَا أَنْفَقَ الْمُسْلِمُ نَفَقَةً عَلَى أَهْلِهِ، وَهُوَ يَحْتَسِبُهَا، كَانَتْ لَهُ صَدَقَةً
__________
أخرجه البخاري في: 69 كتاب النفقات: 1 باب في فضل النفقة على الأهل

586. హజ్రత్ అబూ మస్ వూద్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:- “ఒక ముస్లిం పుణ్యఫలాపేక్షతో తన కుటుంబ సభ్యుల (శ్రేయస్సు) కోసం ధన వినియోగం చేస్తే, ఆ ధనం అతను చేసే దానమవుతుంది.”

[సహీహ్ బుఖారీ : 69వ ప్రకరణం – అన్నఫఖాత్, 15వ అధ్యాయం – ఫజ్లిస్నదఖతి అలల్ అహ్లి]

587 – حديث أَسْمَاءَ بِنْتِ أَبِي بَكْرٍ، قَالَتْ: قَدِمَتْ عَلَيَّ أُمِّي وَهِيَ مُشْرِكَةٌ فِي عَهْدِ رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَاسْتَفْتَيْتُ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قُلْتُ، وَهِيَ رَاغِبَةٌ: أَفَأَصِلُ أُمِّي قَالَ: نَعَمْ صِلِي أُمَّكِ
__________
أخرجه البخاري في: 51 كتاب الأذان: 29 باب الهدية للمشركين

587. హజ్రత్ అస్మా బిన్త్ అబూబకర్ (రదియల్లాహు అన్హా) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హయాంలో ఓ సారి బహుదైవారాధకురాలిగా ఉండిన నా తల్లి నా దగ్గరకు వచ్చింది. నేనప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ముందు ఆమె సంగతి ప్రస్తావిస్తూ “దైవప్రవక్తా! నా తల్లి (నా దగ్గరకు వచ్చింది). ఆమె ఇంకా ఇస్లాం స్వీకరించలేదు. మరి నేను ఆమెకు ఆర్థిక సహాయం అందజేయడం గాని, ఆమెపట్ల మంచిగా మసలుకోవడం గాని చేయవచ్చా?” అని అడిగాను. దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “తప్పకుండా చేయవచ్చు. ఆమె నీ తల్లి కదా, ఆమె పట్ల సత్ప్రవర్తన కలిగి ఉండు” అని అన్నారు.

[సహీహ్ బుఖారీ : 51వ ప్రకరణం – హిబా – 29వ అధ్యాయం – అల్ హదియతుల్ ముష్రికీన్]

588 – حديث عَائِشَةَ، أَنَّ رَجُلاً قَالَ لِلنَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: إِنَّ أُمِّي افْتُلِتَتْ نَفْسَهَا، وَأَظُنُّهَا لَوْ تَكَلَّمَتْ تَصَدَقَتْ، فَهَلْ لَهَا أَجْرٌ إِنْ تَصَدَّقْتُ عَنْهَا قَالَ: نَعَمْ
__________
أخرجه البخاري في: 23 كتاب الجنائز: 95 باب موت الفجأة البغتة

588. విశ్వాసుల మాతృమూర్తి హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం:- ఒక వ్యక్తి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి వచ్చి “నా తల్లి అకస్మాత్తుగా చనిపోయింది. మాట్లాడే అవకాశం గనక లభించి ఉంటే ఆమె (తన తరఫున) దానం చేయమని చెప్పి ఉండేది. మరి ఇప్పుడు నేను ఆమె తరఫున ఏదైనా దానం చేస్తే దాని పుణ్యం ఆమెకు చేరుతుందంటారా?” అని అడిగాడు. దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చేరుతుందని సమాధానమిచ్చారు.

[సహీహ్ బుఖారీ : 23వ ప్రకరణం – జనాయెజ్, 95వ అధ్యాయం – మౌతిల్ ఫుజా అల్ బగ్ తత్)

589 – حديث أَبِي مُوسَى، قَالَ: قَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: عَلَى كُلِّ مُسْلِمٍ صَدَقَةٌ قَالُوا: فَإِنْ لَمْ يَجِدْ قَال: فَيَعْمَلُ بِيَدَيْهِ فَيَنْفَعُ نَفْسَهُ وَيَتَصَدَّقُ قَالُوا: فَإِنْ لَمْ يَسْتَطِعْ أَوْ لَمْ يَفْعَلْ قَالَ: فَيُعِينُ ذَا الْحَاجَةِ الْمَلْهُوفَ قَالُوا: فَإِنْ لَمْ يَفْعَلْ قَالَ: فَيَأْمُرُ بِالْخَيْرِ أَوْ قَالَ: بِالْمَعْرُوفِ قَالَ: فَإِنْ لَمْ يَفْعَلْ قَالَ: فَيُمْسِكُ عَنِ الشَّرِّ فَإِنَّهُ لَهُ صَدَقَةٌ
__________
أخرجه البخاري في: 78 كتاب الأدب: 33 باب كل معروف صدقة

589. హజ్రత్ అబూ మూసా అష్ అరీ (రదియల్లాహు అన్హు) కథనం:-

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన అనుచరులతో మాట్లాడుతూ “ప్రతి ముస్లిం విధిగా దానం చేయాలి” అన్నారు. అనుచరులు అది విని “మరి ఎవరి దగ్గరైనా దానం చేయడానికి ఏమీ లేకపోతే ఎలా?” అని అడిగారు. “అప్పుడు ఆ వ్యక్తి కష్టపడి సంపాదించి తానూ అనుభవించాలి, దాన్ని (పేదలకు) దానం కూడా చేయాలి” అన్నారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం). “ఒకవేళ అలా చేసే శక్తి కూడ లేకపోతే? లేదా అలా కూడ చేయకపోతే?” అని మళ్ళీ అడిగారు అనుయాయులు. “అప్పుడు ఎవరైనా అగత్యపరుడు ఏదైనా ఆపదలో చిక్కుకుంటే అతడ్ని ఆదుకోవాలి” అన్నారు దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం). “అది కూడా చేయలేకపోతేనో?” అడిగారు అనుయాయులు తిరిగి, “(అదీ చేయలేకపోతే) మేలు చేయాలని లేక సత్కార్యాలు చేయాలని ఇతరులకు సలహాలివ్వాలి” అన్నారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం). “మరి అదీ చేయలేకపోతే” అడిగారు అనుయాయులు మళ్ళీ. “(అలాంటి పరిస్థితిలో కనీసం) తాను స్వయంగా చెడు పనులు చేయకుండా, ఇతరులకు చెడు తల పెట్టకుండా ఉండాలి. ఇది కూడా దానం క్రిందకే వస్తుంది” అన్నారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం).

[సహీహ్ బుఖారీ : 78వ ప్రకరణం – అదబ్, 33వ అధ్యాయం – కుల్లు మారూఫిన్ సదఖాతున్]

590 – حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: كُلُّ سُلاَمَى مِنَ النَّاسِ عَلَيْهِ صَدَقَةٌ، كُلَّ يَوْمٍ تَطْلُعُ فِيهِ الشَّمْسُ؛ يَعْدِلُ بَيْنَ اثْنَيْنِ صَدَقَةٌ، وَيُعِينُ الرَّجُلَ عَلَى دَابَّتِهِ فَيَحْمِلُ عَلَيْهَا أَو يَرْفَعُ عَلَيْهَا مَتَاعَهُ صَدَقَةٌ، وَالْكَلِمَةُ الطَّيِّبَةُ صَدَقَةٌ وَكُلُّ خَطْوَةٍ يَخْطُوهَا إِلَى الصَّلاَةِ صَدَقَةٌ، وَيُمِيطُ الأَذَى عَنِ الطَّرِيقِ صَدَقَةٌ
__________
أخرجه البخاري في: 56 كتاب الجهاد: 128 باب من أخذ بالركاب ونحوه

590. హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:

“మానవుని శరీరంలో ఎన్ని కీళ్ళు ఉన్నాయో వాటిలో ప్రతి దానికీ ఒక దానం (సదఖా) విధి అయి ఉంది. ప్రతి రోజు సూర్యోదయమవుతున్నప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్య న్యాయంగా తీర్పు చెప్పడం కూడా దానం క్రిందకే వస్తుంది. ఎవరినైనా తన వాహనం మీద కూర్చోబెట్టుకోవడం లేదా వస్తు సామగ్రి ఏదైనా ఉంటే వాటిని తన వాహనం. మీద గమ్యానికి చేర్చడం వంటి సత్కార్యాల ద్వారా ఇతరులకు సహాయ పడటం కూడా దానంగానే పరిగణించబడుతుంది. మంచి మాట పలకడం కూడా దానమే. నమాజు కోసం మస్జిదుకు వెళ్తున్నప్పుడు వేసే ప్రతి అడుగు దానమే. దారిలో జనానికి బాధ కలిగించే వస్తువుని తొలగించడం కూడా దానం క్రిందకే వస్తుంది”.

[సహీహ్ బుఖారీ: 56వ ప్రకరణం – జిహాద్, 128వ అధ్యాయం – మన్ అఖజ బిర్రికాబి వనహూహీ]

591 – حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، أَنَّ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: مَا مِنْ يَوْمٍ يُصْبِحُ الْعِبَاد فِيهِ إِلاَّ مَلَكَانَ يَنْزِلاَنِ، فَيَقُولُ أَحَدُهُمَا: اللهُمَّ أَعْطِ مُنْفِقًا خَلَفًا؛ وَيَقُولُ الآخَرُ: اللهُمَّ أعْطِ مُمْسِكًا تَلَفًا
__________
أخرجه البخاري في: 24 كتاب الزكاة: 27 باب قول الله تعالى (فأما من أعطى واتقى وصدق بالحسنى)

591. హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేశారు: “ప్రతి రోజు ఉదయం ప్రజలు నిద్ర నుండి మేల్కొనగానే ఇద్దరు దైవదూతలు అవతరిస్తారు. వారిలో ఒకడు అల్లాహ్ ను ప్రార్థిస్తూ ‘అల్లాహ్! (దానం) ఇచ్చే వాడికి మరింత (పుణ్యఫలం) ఇవ్వు’ అని అంటాడు. రెండో దూత ‘అల్లాహ్! పిసినారి సంపదను నాశనం చెయ్యి’ అని ప్రార్థిస్తాడు.”

[సహీహ్ బుఖారీ : 24వ ప్రకరణం – జకాత్, 27వ అధ్యాయం – ఖౌలిల్లాహీ తాలా ఫ అమ్మామన్ ఆతా వత్తఖా వసద్దఖ బిల్ హుస్నా]

592 – حديث حَارِثَةَ بْنِ وَهْبٍ، قَالَ: سَمِعْتُ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ: تَصَدَّقُوا فَإِنَّهُ يَأتِي عَلَيْكُمْ زَمَانٌ يَمْشِي الرَّجُلُ بِصَدَقَتِهِ فَلاَ يَجِدُ مَنْ يَقْبَلُهَا، يَقُولُ الرَّجُلُ لَوْ جِئْتَ بِهَا بِالأَمْسِ لَقَبِلْتُهَا، فَأَمَّا الْيَوْمَ فَلاَ حَاجَةَ لِي بِهَا
__________
أخرجه البخاري في: 24 كتاب الزكاة: 9 باب الصدقة قبل الرد

592. హజ్రత్ హారిసా బిన్ వహబ్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:

“(సిరిసంపదలు పొంగి పొరలే) ఒక కాలం రానున్నది. అప్పుడు దానధర్మాలు చేయడానికి ఒక వ్యక్తి బయలుదేరితే అతనికి దానాన్ని స్వీకరించే వారే లభించరు. అతను ఎవరికి దానం చేయాలన్నా నాకిప్పుడు అవసరమే లేదు. నీవు నిన్న తీసుకొని వచ్చి ఉంటే నేనీ దానాన్ని స్వీకరించేవాడ్ని అని అంటాడు.”

[సహీహ్ బుఖారీ : 24వ ప్రకరణం – జకాత్, 9వ అధ్యాయం – అస్సదఖతి ఖబ్లర్రద్]

593 – حديث أَبِي مُوسَى رضي الله عنه عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: لَيَأْتِيَنَّ عَلَى النَّاسِ زَمَانٌ يَطُوفُ الرَّجُلُ فِيهِ بِالصَّدَقَةِ مِنَ الذَّهَبِ ثُمَّ لاَ يَجِدُ أَحَدًا يَأْخُذُهَا مِنْهُ، وَيُرَى الرَّجُلُ الْوَاحِدُ يَتْبَعُهُ أَرْبَعُونَ امْرَأَةً يَلُذْنَ بِهِ، مِنْ قِلَّةِ الرِّجَالِ وَكَثْرَةِ النِّسَاءِ
__________
أخرجه البخاري في: 24 كتاب الزكاة: 9 باب الصدقة قبل الرد

593. హజ్రత్ అబూమూసా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేశారు:-

ప్రజలకు సిరిసంపదలు పొంగిపొరలే ఒక కాలం ఎదురుకానున్నది. అప్పుడు ఒక వ్యక్తి బంగారం తీసుకొని దాన్ని దానం చేసే ఉద్దేశ్యంతో (వీధుల వెంబడి) తిరుగుతుంటాడు, కాని బంగారం సయితం దానంగా స్వీకరించే వారెవరూ అతనికి దొరకరు. ఆ కాలంలో పురుష జనాభా అత్యల్పంగా స్త్రీ జనాభా అత్యధికంగా ఉంటుంది. అందువల్ల ఒక్కొక్క పురుషుడి వెంట అతని ఆశ్రయం కోరుతూ నలభయ్యేసి మంది స్త్రీలు తిరుగుతుంటారు.

(సహీహ్ బుఖారీ : 24వ ప్రకరణం – జకాత్, 9వ అధ్యాయం – అస్సదఖతి ఖబ్లర్రద్)

594 – حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، قَالَ: قَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: لاَ تَقُومُ السَّاعَةُ [ص:209] حَتَّى يَكْثُرَ فِيكُم الْمَالُ، فَيَفِيضَ حَتَّى يُهِمَّ رَبَّ الْمَالِ مَنْ يَقْبَلُ صَدَقَتَهُ، وَحَتَّى يَعْرِضَهُ فَيَقُولَ الَّذِي يَعْرِضُهُ عَلَيْهِ: لاَ أَرَبَ لِي
__________
أخرجه البخاري في: 24 كتاب الزكاة: 9 باب الصدقة قبل الرد

594. హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు :- “మీ దగ్గర సిరిసంపదలు పొంగిపొరిలేటంత అత్యధికంగా వచ్చి పడనంతవరకు ప్రళయం రాదు. అప్పుడు ప్రజలు ఈ అసాధారణ ధనరాసులతో చికాకు పడుతూ వీటిని ఎవరైనా దానంగా స్వీకరిస్తే బాగుండునని భావిస్తారు (కాని దానం తీసుకునే వాళ్ళే లభించరు). ఒకడు మరొకనికి దానం చేయజూస్తే, అతను తనకు డబ్బవసరమే లేదంటాడు.”

(సహీహ్ బుఖారీ : 24వ ప్రకరణం – జకాత్, 9వ అధ్యాయం – అస్సదఖతి ఖబ్లర్రద్)

595 – حديث أَبِي هُرَيْرَةَ، قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: مَنْ تَصَدَّقَ بِعَدْلِ تَمْرَةٍ مِنْ كَسْبٍ طَيِّبٍ، وَلاَ يَصْعَدُ إِلَى اللهِ إِلاَّ الطَّيِّبُ، فَإِنَّ اللهَ يَتَقَبَّلُهَا بِيَمِينِهِ، ثُمَّ يُرَبِّيهَا لِصَاحِبِهَا كمَا يُرَبِّي أَحَدُكُمْ فَلُوَّهُ، حَتَّى تَكُونَ مِثْلَ الْجَبَلِ
__________
أخرجه البخاري في: 97 كتاب التوحيد: 23 باب قول الله تعالى (تعرج الملائكة والروح إليه)

595. హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: “అల్లాహ్ దగ్గరకు పవిత్ర వస్తువు మాత్రమే చేరుతుంది. అందువల్ల ఎవరైనా తన పవిత్ర సంపాదన నుండి ఒక ఖర్జూరపుటంత దానం చేసినాసరే అల్లాహ్ దాన్ని కుడిచేత్తో స్వీకరిస్తాడు. ఆ తర్వాత మీరు గుర్రపు పిల్లను పెంచి పెద్ద చేసినట్లు ఆయన ఆ దానాన్ని వృద్ధి పరుస్తాడు. అలా వృద్ధి చెందుతూ చివరికది పర్వతం మాదిరిగా పెరిగిపోతుంది.”

(సహీహ్ బుఖారీ : 97వ ప్రకరణం – తౌహీద్, 23వ అధ్యాయం – ఖౌలిల్లాహి తాలా – తారుజుల్ మలాయికతు వర్రూహు ఇలై)

596 – حديث عَدِيِّ بْنِ حَاتِمِ رضي الله عنه، قَالَ: سَمِعْتُ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ: اتَّقُوا النَّارَ وَلَوْ بَشِقِّ تَمْرَةٍ
__________
أخرجه البخاري في: 24 كتاب الزكاة: 10 اتقوا النار ولو بشق تمرة

596. హజ్రత్ అదీ బిన్ హాతిం (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ఉపదేశించారు:- “ఒక ఖర్జూరపు ముక్కయినా సరే దానం చేసి నరకాగ్ని నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి.”

[సహీహ్ బుఖారీ : 24వ ప్రకరణం – జకాత్, 10వ అధ్యాయం – ఇత్త ఖున్నార వలె బిషిఖ్కి తమ్రతి]

597 – حديث عَدِيِّ بْنِ حَاتِمٍ، قَالَ: قَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: مَا مِنْكُمْ مِنْ أَحَدٍ إِلاَّ وَسَيُكَلِّمُهُ اللهُ يَوْمَ الْقِيَامَةِ، لَيْسَ بَيْنَ اللهِ وَبَيْنَهُ تَرْجُمَانٌ، ثُمَّ يَنْظُرُ فَلاَ يَرَى شَيْئًا قدَّامَهُ، ثُمَّ يَنْظُرُ بَيْنَ يَدَيْهِ فَتَسْتَقْبِلُهُ النَّارُ، فَمَنِ اسْتَطَاعَ مِنْكُمْ أَنْ يَتَّقِيَ النَّارَ وَلَوْ بِشِقِّ تَمْرَةٍ
وَعَنْهُ أَيْضًا، قَالَ: قَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: اتَّقُوا النَّارَ، ثُمَّ أَعْرَضَ وَأَشَاحَ؛ ثُمَّ قَالَ: اتَّقُوا النَّارَ، ثُمَّ أَعْرَضَ وَأَشَاحَ، ثَلاَثًا حَتَّى ظَنَنَّا أَنَّهُ يَنْظُرُ إِلَيْهَا ثُمَّ قَالَ: اتَّقُوا النَّارَ وَلَوْ بِشِقِّ تَمْرَةٍ، فَمَنْ لَمْ يَجِدْ فَبِكَلِمَةٍ طَيِّبَةٍ
__________
أخرجه البخاري في: 81 كتاب الرقاق: 49 باب من نوقش الحساب عذِّب

597. హజ్రత్ అదీ బిన్ హాతిం (రదియల్లాహు అన్హు) ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:- “అతి త్వరలోనే అల్లాహ్ ప్రళయదినాన మీలోని ప్రతి వ్యక్తితో ప్రత్యక్షంగా మాట్లాడుతాడు. ఆ రోజు అల్లాహ్ కి, దాసునికి మధ్య ఎలాంటి అనువాదకుడు ఉండడు. దాసుడు తలపైకెత్తి చూస్తాడు. మొదట తన ముందు ఏదీ కన్పించదు. రెండవసారి మళ్ళీ తల పైకెత్తి చూస్తాడు. అప్పుడతని ముందు ఎటు చూసినా అతనికి స్వాగతం చెబుతూ అగ్నే (భగభగమండుతూ) కన్పిస్తుంది. అందువల్ల మీలో ఎవరైనా ఖర్జూరపు ముక్కయినా సరే దానం చేసి నరకం నుండి కాపాడుకో గలిగితే కాపాడుకోవాలి”.

హజ్రత్ అదీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారమే మరో సందర్భంలో దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) నరకాన్ని ప్రస్తావిస్తూ “నరకాగ్ని నుండి కాపాడుకోండి” అన్నారు. ఈ మాట చెప్పి ఆయన ముఖం ఓ ప్రక్కకు తిప్పుకున్నారు. (తాను నరకాగ్నిని ప్రత్యక్షంగా చూస్తున్నట్లు) నరకాగ్ని పట్ల భీతి, అసహ్యతలు వెలిబుచ్చారు. ఆ తరువాత తిరిగి ఆయన “నరకాగ్ని నుండి రక్షించుకోండి” అన్నారు. మళ్ళీ నరకాగ్ని పట్ల భీతి, అసహ్యతలు వెలిబుచ్చుతూ ముఖాన్ని ఓ పక్కకు తిప్పుకున్నారు. ఈ విధంగా ఆయన మూడుసార్లు చేశారు. చివరికి ఆయన నిజంగానే నరకాగ్ని చూస్తున్నారేమోనని మాకు అనుమానం వచ్చింది. ఆ తరువాత ఆయన ఇలా అన్నారు: “ఓ ఖర్జూరపు ముక్కనయినా సరే దానం చేసి నరకాగ్ని నుండి రక్షించుకోండి. అదీ దొరక్కపోతే ఓ మంచి మాటయినా పలకండి. నోట ఓ మంచి మాట వెలువడటం కూడా దానం (సదఖా)గానే పరిగణించబడుతుంది”.

(సహీహ్ బుఖారీ : 81వ ప్రకరణం – రిఖాఖ్, 49 వ అధ్యాయం – మన్నూ ఖిషల్ హిసాబి అజాబ్)

598 – حديث أَبِي مَسْعُودٍ قَالَ: لَمَّا أُمِرْنَا بِالصَّدَقَةِ كُنَّا نَتَحَامَلُ؛ فَجَاءَ أَبُو عَقِيلٍ بِنِصْفِ صَاعٍ، وَجَاءَ إِنْسَانٌ بِأَكْثَرَ مِنْهُ؛ فَقَالَ الْمُنَافِقُونَ: إِنَّ اللهَ لَغَنِيٌّ عَنْ صَدَقَةِ هذَا، [ص:211] وَمَا فَعَلَ هذَا الآخَرُ إِلاَّ رِئَاءً فَنَزَلَتْ (الَّذِينَ يَلْمِزُونَ الْمُطَّوِّعِينَ مِنَ الْمُؤْمِنِينَ فِي الصَّدَقَاتِ وَالَّذِينَ لاَ يَجِدُونَ إِلاَّ جُهْدَهُمْ) الآيَةَ
__________
أخرجه البخاري في: 65 كتاب التفسير: 9 سورة التوبة: 11 باب قوله (الذين يلمزون المطوعين)

598. హజ్రత్ అబూ మస్ వూద్ (రదియల్లాహు అన్హు) కథనం:- మమ్మల్ని దానం చేయాలని ఆదేశించినపుడు మేము బరువులు మోసి సంపాదన చేసే వాళ్ళము (అందులో నుంచే కొంతదానం చేసే వాళ్ళము). ఒక రోజు హజ్రత్ అబూ అఖీల్ (రదియల్లాహు అన్హు) తనకు కూలి క్రింద లభించిన అర్ధ ‘సా’ (తూకం) ఖర్జూర పండ్లను (దానంగా ఇవ్వడానికి) తీసుకు వచ్చారు. మరొక వ్యక్తి అంతకంటే ఎక్కువ తీసుకు వచ్చాడు. అప్పుడు కొందరు కపట విశ్వాసులు (కారుకూతలు కూస్తూ) “అల్లాహ్ కి అతని (అంటే అబూ అఖిల్ తెచ్చిన) దానం అవసరం లేదు (ఆయన ఇలాంటి అల్పదానాన్ని ఖాతరు చేయడు), రెండవ వ్యక్తి పేరు ప్రతిష్ఠల కోసం (దానం) చేశాడు” అని అన్నారు. ఆ సందర్భంలో ఈ దైవవచనం అవతరించింది:

“మనస్పూర్తిగా విశ్వాసులు చేస్తున్న ధన త్యాగాలను గురించి వారు ఎత్తిపొడుస్తూ మాట్లాడుతున్నారు. కష్టపడి చెమటోడ్చి ఎంతో కొంత దైవమార్గంలో దానమిస్తున్న (నిరు పేద) విశ్వాసుల్ని ఎగతాళి చేస్తున్నారు. (అలా ఎకసక్కెం, ఎగతాళి చేస్తున్న ఈ పిసినారుల సంగతి అల్లాహ్ కి బాగా తెలుసు.) అల్లాహ్ యే వారిని ఎగతాళి చేస్తున్నాడు. వారి కోసం దుర్భరమైన (నరక) శిక్ష కాచుకొని ఉంది.” (ఖుర్ఆన్ – తౌబా:79)

(సహీహ్ బుఖారీ : 65వ ప్రకరణం – అత్తఫ్సీర్, సూరె తౌబా, 11వ అధ్యాయం – ఖౌలిహీ అల్లజీన యల్మిజూనల్ ముత్తవ్వియీన్]

599 – حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: نِعْمَ الْمَنِيحَةُ اللِّقْحَةُ الصَّفِيُّ مِنْحَةً، وَالشَّاةُ الصَّفِيُّ، تَغْدُو بِإِنَاءٍ وَتَرُوحُ بِإِنَاءٍ
__________
أخرجه البخاري في: 51 كتاب الهبة: 35 باب فضل المنيحة

599. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:- “బాగా పాలిచ్చే ఆరోగ్యవంతమైన ఒంటె ఎంత మంచి కానుక! అలాగే ఉదయం ఒక పాత్ర, సాయంత్రం ఒక పాత్ర పాలిచ్చే ఆరోగ్యవంతమైన మేక కూడా ఎంతో మంచి కానుక!!”

(సహీహ్ బుఖారీ : 51వ ప్రకరణం – హిబా, 35వ అధ్యాయం – ఫజ్లిల్ మనీహ)

600 – حديث أَبِي هُرَيْرَةَ، قَالَ: ضَرَبَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ مَثَلَ الْبَخِيلِ وَالْمُتَصَدِّقِ كَمَثَلِ رَجُلَيْنِ عَلَيْهِمَا جُبَّتَانِ مِنْ حَدِيدٍ، قَدِ اضْطُرَّتْ أَيْدِيهِمَا إلى ثُديِّهِمَا وَتَرَاقِيهِمَا؛ [ص:212] فَجَعَلَ الْمُتَصَدِّقُ كَلَّمَا تَصَدَّقَ بِصَدَقَةٍ انْبَسَطَتْ عَنْهُ حَتَّى تَغْشَى أَنَامِلَهُ، وَتَعْفُوَ أَثَرَهُ؛ وَجَعَلَ الْبَخِيلُ كُلَّمَا هَمَّ بِصَدَقَةٍ قَلَصَتْ، وَأَخَذَتْ كُلُّ حَلْقَةٍ بِمَكَانِهَا
قَالَ أَبُو هُرَيْرَةَ: فَأَنَا رَأَيْتُ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، يَقُولُ بِإِصْبَعِهِ هكَذَا فِي جَيْبِهِ، فَلَوْ رَأَيْتَهُ يُوَسِّعُهَا وَلاَ تَتَوَسَّعُ
__________
أخرجه البخاري في: 77 كتاب اللباس: 9 باب جيب القميص من عند الصدر وغيره

600. హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పిసినారిని, దానశీలుడ్ని ఉక్కు కవచాలు ధరించిన ఇద్దరు వ్యక్తులతో పోల్చారు. ఆ కవచాలలో వారిద్దరి చేతులు, వక్షస్థలాలు వారి కంఠాలతో కలిపివేయబడి ఉన్నాయి. వారిలో దానశీలుడు దానం చేయడానికి ప్రయత్నించినపుడు, అతని కవచం బాగా వదులయిపోయి అతని చేతివ్రేళ్ళ కొనలు సయితం కప్పబడే అంతగా క్రిందికి జారిపోతుంది. మరోవైపు కవచం క్రిందికి జారిపోయి అతని కాలి ముద్రలను కూడా చెరిపి వేస్తోంది. దీనికి భిన్నంగా పిసినారి దానం చేయడానికి ప్రయత్నించినపుడు, అతని కవచం బిగుసుకుపోతుంది. దాని కొండీలు ఎక్కడికక్కడ ఇరుక్కుపోతాయి. (దాంతో అతను తన చేతిని బయటికి తీయలేడు).

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ ఉపమానాన్ని పేర్కొంటూ తన చేతి వ్రేళ్ళను తన చొక్కాలోకి దూర్చి దాన్ని వదులు చేయడానికి ప్రయత్నించారు. మీరు గనక చూసి ఉంటే దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తమ చొక్కాను వదులు చేయడానికి ప్రయత్నిస్తున్నారనీ, అయితే అది ఏ మాత్రం వదలుకావటం లేదనీ మీకు స్పష్టంగా తెలిసిపోయేది.

[సహీహ్ బుఖారీ : 77వ ప్రకరణం – లిబాస్, 9వ అధ్యాయం – జేబుల్ ఖమీసి మిన్ ఇన్ది సద్రి వగైరిహీ]

601 – حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: قَالَ رَجُلٌ لأَتَصَدَّقَنَّ بِصَدَقَةٍ، فَخَرَجَ بِصَدَقَتِهِ فَوَضَعَهَا فِي يَدِ سَارِقٍ؛ فَأَصْبَحُوا يَتَحَدَّثُونَ، تُصُدِّقَ عَلَى سَارِقٍ؛ فَقَالَ: اللهُمَّ لَكَ الْحَمْدُ، لأَتَصَدَّقَنَّ بِصَدَقَةٍ، فَخَرَجَ بِصَدَقَتِهِ، فَوَضَعَهَا فِي يَدَيْ زَانِيَةٍ؛ فَأَصْبَحُوا يَتَحَدَّثُونَ، تُصُدِّقَ اللَّيْلَةَ عَلَى زَانِيَةٍ؛ فَقَالَ: اللهُمَّ لَكَ الْحَمْدُ عَلَى زَانِيَةٍ؛ لأَتَصَدَّقَنَّ بِصَدَقَةٍ؛ فَخَرَجَ بِصَدَقَتِهِ، فَوَضَعَهَا فِي يَدَيْ غَنِيٍّ؛ فَأَصْبَحُوا يَتَحَدَّثُونَ، تُصُدِّقَ عَلَى غَنِيٍّ فَقَالَ: اللهُمَّ لَكَ الْحَمْدُ عَلَى سَارِقٍ، وَعَلَى زَانِيَةٍ، وَعَلَى غَنِيٍّ فَأُتِيَ، فَقِيلَ لَهُ: أَمَّا صَدَقَتُكَ عَلَى سَارِقٍ فَلَعَلَّهُ أَنْ يَسْتَعِفَّ عَنْ سَرِقَتِهِ، وَأَمَّا الزَّانِيَةُ فَلَعَلَّهَا أَنْ تَسْتَعِفَّ عَنْ زِنَاهَا، وَأَمَّا الْغَنِيُّ فَلَعَلَّهُ يَعْتَبِرُ فَيُنْفِقُ مِمَّا أَعْطَاهُ اللهُ
__________
أخرجه البخاري في: 24 كتاب الزكاة: 14 باب إذا تصدق على غني وهو لا يعلم

[ص:213] أجر الخازن الأمين والمرأة إِذا تصدقت من بيت زوجها غير مفسدة بإذنه الصريح أو العرفي

601. హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలిపారు:-

ఒక వ్యక్తి తానీ రోజు (రాత్రి) దానం చేస్తానని నిశ్చయించుకొని ఇంటి నుండి బయలుదేరాడు. అయితే అతను (తెలియక) ఒక దొంగకు దానం చేశాడు; మరునాడు ఉదయం జనం ఒక వ్యక్తి రాత్రి ఒక దొంగకు దానం చేశాడని చెప్పుకోసాగారు. ఈ మాట ఆ వ్యక్తి విని “అల్లాహ్! సకల స్తోత్రాలకు నీవే అర్హుడివి” అని అన్నాడు. తరువాత అతను తానీ రోజు (రాత్రి) మళ్ళీ దానం చేస్తానని సంకల్పించుకొని ఇంటి నుంచి బయలుదేరాడు. (కాని ఆ రోజు రాత్రి కూడా తెలియక ఒక వ్యభిచారిణి చేతికి ఆ దానం అందించాడు). మరునాడు ఉదయం జనం మళ్ళీ, ఒక మనిషి రాత్రి ఒక వ్యభిచారిణికి దానం చేశాడని గుసగుసలాడుకున్నారు. అది విని ఆ వ్యక్తి “అల్లాహ్! సకల స్తోత్రాలకు నీవే అర్హుడివి. నా దానం వ్యభిచారిణి చేతికి చిక్కింది” అని అన్నాడు. ఆ తరువాత తానీ రోజు (రాత్రి) మళ్ళీ దానం చేస్తానని నిర్ణయించుకొని బయలుదేరాడు. అయితే (ఆ రోజు కూడా) అతను దానం ఒక ధనికుడి చేతిలో పెట్టాడు .మరునాడు ఉదయం ప్రజల్లో, ఒకతను రాత్రి ఒక ధనికుడికి దానం చేశాడని గుసగుసలు బయలుదేరాయి. ఆ సంగతి తెలిసి “అల్లాహ్! సకల స్తోత్రాలకు నీవే అర్హుడివి. నా దానం ఒక సారి ఒక దొంగకు, మరొకసారి ఒక వ్యభిచారిణికి దొరికిపోయింది. ఇప్పుడేమో ధనికునికి చిక్కింది. అల్లాహ్! ఏమిటీ వైపరీత్యం !!” అని అన్నాడు. ఆ తరువాత (రాత్రి) ఒక వ్యక్తి కలలో కన్పించి ఇలా అన్నాడు:

“(నీ దానం స్వీకరించబడింది) దొంగ చేతికి లభించిన దానం వల్ల ఆ దొంగ (త్వరలోనే) దొంగతనాలు మానేయవచ్చు. వ్యభిచారిణికి దొరికిన దానం వల్ల ఆ వ్యభిచారిణి తన వ్యభిచార వృత్తిని వదలి పెట్టవచ్చు. అలాగే ధనికుడికి లభించిన దానం వల్ల ఆ ధనికుడు సిగ్గుపడి తనకు అల్లాహ్ ప్రసాదించిన సంపదలో కొంత భాగం దైవమార్గంలో వినియోగించవచ్చు.”

[సహీహ్ బుఖారీ : 24వ ప్రకరణం – జకాత్, 14వ అధ్యాయం – ఇజా తసద్దఖ అలాగనీ వపు లాయాలం]

602 – حديث أَبِي مُوسَى، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: الْخَازِنُ الْمُسْلِمُ الأَمِينُ الَّذِي يُنْفِذُ، وَرُبَّمَا قَالَ: يُعْطِي مَا أُمِرَ بِهِ كَامِلاً مُوَفَّرًا، طَيِّبًا بِهِ نَفْسُهُ، فَيَدْفَعُهُ إِلَى الَّذِي أُمِرَ لَهُ بِهِ أَحَدُ الْمُتَصَدِّقَيْنِ
__________
أخرجه البخاري في: 24 كتاب الزكاة: 25 باب أجر الخادم إذا تصدق بأمر صاحبه غير مفسد

602. హజ్రత్ అబూ మూసా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:- “తన యజమాని ఆజ్ఞలను అమలు పరిచే నిజాయితీ పరుడైన ముస్లిం కోశాధికారి కూడా దానం (సదఖా) చేసేవాడిగా పరిగణించబడతాడు. (అంటే అతనిక్కూడ దానం చేసినంత పుణ్యం లభిస్తుందన్న మాట)”

లేదా మరికొన్ని సందర్భాలలో దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: “ఆజ్ఞాపించినంత మేరకు, ఆజ్ఞాపించబడిన వ్యక్తికి మాత్రమే (ఏ మాత్రం కొరత చేయకుండా) పూర్తిగా, సంతోషంగా ఇచ్చివేసే నిజాయితీ పరుడైన ముస్లిం కోశాధికారి కూడా దానం చేసేవాడిగా పరిగణించబడతాడు.”

(సహీహ్ బుఖారీ : 24వ ప్రకరణం – జకాత్, 25వ అధ్యాయం – అజ్రిల్ ఖాదిమి ఇజా తసద్దఖ బిఅమ్రి సాహిబిహీ గైరి ముఫ్సిద్)

603 – حديث عَائِشَةَ، قَالَتْ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: إِذَا أَنْفَقَتِ الْمَرْأَةُ مِنْ طَعَامِ بَيْتِهَا غَيْرَ مُفْسِدَةٍ، كَانَ لَهَا أَجْرُهَا بِمَا أَنْفَقَتْ، وَلِزَوْجِهَا أَجْرُهُ بِمَا كَسَبَ، وَلِلْخَازِنِ مِثْلُ ذلِكَ، لاَ يَنْقُصُ بَعْضُهُمْ أَجْرَ بَعْضٍ شَيْئًا
__________
أخرجه البخاري في: 24 كتاب الزكاة: 17 باب من أمر خادمه بالصدقة ولم يناول بنفسه

603. విశ్వాసుల మాతృమూర్తి హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం ప్రకారం దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు:

“గృహిణి తన ఇంట్లో ఉండే ఆహార సామగ్రిలో నుంచి ఏదైనా కొంత దానం చేస్తే ఆమెకు దాని పుణ్యఫలం లభిస్తుంది. కారణం, ఆమె స్వయంగా ఆ ధర్మ కార్యం చేయడమే. కాకపోతే ఆమె సంకల్పం మంచిదయి ఉండాలి. (భర్త ఆస్తికి) నష్టం కలిగించేదిగా ఉండకూడదు. పోతే సంపాదన ఆమె భర్తదయినందున (ఆమె చేసే దానం వల్ల) అతనిక్కూడా పుణ్యఫలం ప్రాప్తమవుతుంది. అలాగే కోశాధికారి తన యజమాని ఆస్తి నుండి (అతని అనుమతితో, నిజాయితీగా) ఏదైనా ఖర్చు చేస్తే అతనిక్కూడా దాని పుణ్యఫలం లభిస్తుంది. వీరంతా ఒకరి పుణ్యఫలాన్ని మరొకరు ఏ మాత్రం తగ్గించరు.”

[సహీహ్ బుఖారీ : 24వ ప్రకరణం – జకాత్, 17వ అధ్యాయం – మన్ అమర ఖాదిమహూ బిస్సదఖతి వలం యునావలు బినఫ్సిహీ]

604 – حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: لاَ تَصُومُ الْمَرْأَةُ، وَبَعْلُهَا شَاهِدٌ، إِلاَّ بإِذْنِهِ
__________
أخرجه البخاري في: 67 كتاب النكاح: 84 باب صوم المرأة بإذن زوجها تطوعًا

604. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:- “భర్త ఇంటి దగ్గర ఉండే రోజుల్లో భార్య అతని అనుమతి లేకుండా (నఫిల్) ఉపవాసం పాటించకూడదు.” * [సహీహ్ బుఖారీ : 67వ ప్రకరణం – నికాహ్, 83వ అధ్యాయం – సౌముల్ మర్అతి బిఇజ్ని జౌజహా తతూఆ]

* ఈ సంకలనంలో హదీసు మూలం బుఖారీ గ్రంథం నుండి విషయసూచిక ముస్లిం గ్రంథం నుండి తీసుకోవడం వల్ల ఇక్కడ పేర్కొన్న ఈ హదీసు దీని ప్రకరణంతో సంబంధం లేని హదీసుగా కన్పిస్తోంది. మూలగ్రంథాలు రెండూ పరిశీలించిన తరువాతనే కారణం అర్థమవుతుంది.- అనువాదకుడు

605 – حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: إِذَا أَنْفَقَتِ الْمَرْأَةُ مِنْ كَسْبِ زَوْجِهَا عَنْ غَيْرِ أَمْرِهِ فَلَهُ نِصْف أَجْرِهِ
__________
أخرجه البخاري في: 69 كتاب النفقات: 5 باب نفقة المرأة إذا غاب عنها زوجها نفقة الولد

605. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు:- “భార్య తన భర్త అనుమతి లేకుండా అతని సంపాదన నుండి (కొంత) అతని పిల్లల కోసం, అతని బంధుమిత్రుల కోసం ఖర్చు చేస్తే ఆమె భర్తకు అర్థపుణ్యం లభిస్తుంది.”

[సహీహ్ బుఖారీ : 69వ ప్రకరణం – అన్నఫఖాత్, 5వ అధ్యాయం – నుఫఖతిల్ మర్ అతి ఇజాగాబు అన్హా జాజహా]

606 – حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: مَنْ أَنْفَقَ زَوْجَيْنِ فِي سَبِيلِ اللهِ نُودِيَ مِنْ أَبْوَابِ الْجَنَّةِ يَا عَبْدَ اللهِ هذَا خَيْرٌ؛ فَمَنْ كَانَ مِنْ أَهْلِ الصَّلاةِ دُعِيَ مِنْ بَابِ الصَّلاَةِ، وَمَنْ كَانَ مِنْ أَهْلِ الْجِهَادِ دُعِيَ مِنْ بَابِ الْجِهَادِ، وَمَنْ كَانَ مِنْ أَهْلِ الصِّيَامِ دُعِيَ مِنْ بَابِ الرَّيَّانِ، وَمَنْ كَانَ مِنْ أَهْلِ الصَّدَقَةِ دُعِيَ مِنْ بَابِ الصَّدَقَةِ
فَقَالَ أَبُو بَكْرٍ رضي الله عنه: بِأَبِي أَنْتَ وَأُمِّي، يَا رَسُولَ اللهِ مَا عَلَي مَنْ دُعِيَ مِنْ تِلْكَ الأَبْوَابِ مِنْ ضَرُورَةٍ، فَهَلْ يُدْعَى أَحَدٌ مِنْ تلْكَ الأَبْوَابِ كُلِّهَا قَالَ: نَعَمْ وَأَرْجُو أَنْ تَكُونَ مِنْهُمْ
__________
أخرجه البخاري في: 30 كتاب الصوم: 4 باب الريان للصائمين

606. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలిపారు:- “ఎవరైనా దైవమార్గంలో (ఒకటికి బదులు) రెండు వస్తువులు ఇస్తే (మరణానంతరం) అలాంటి వ్యక్తిని (దైవదూతలు) స్వర్గ ద్వారం నుండి పిలుస్తూ “దైవదాసుడా! ఇక్కడికి వచ్చెయ్యి. ఈ ద్వారం బాగుంది” అని అంటారు. నమాజు చేసే వ్యక్తి అయితే అతడ్ని ప్రార్థనా ద్వారం నుండి పిలుస్తారు. ధర్మపోరాటం (జిహాద్) చేసే వ్యక్తి అయితే అతడ్ని ధర్మపోరాటపు ద్వారం నుండి పిలుస్తారు. ఉపవాసాలు పాటించే వాడయితే అతడ్ని ఉపవాస ద్వారం నుండి పిలుస్తారు. దానధర్మాలు చేసేవాడయితే అతడ్ని దాన ద్వారం నుండి పిలుస్తారు.”

హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) ఈ మాటలు విని “దైవప్రవక్తా! నా తల్లిదండ్రులు మీ కోసం సమర్పితం! అన్ని ద్వారాల నుండి పిలువబడే వ్యక్తి కూడా ఉంటాడా? ఇలా అన్ని ద్వారాల నుండి పిలువబడే వ్యక్తి ఎలాంటి కర్మలు చేయవలసి ఉంటుంది?” అని అడిగారు. దీనికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సమాధానమిస్తూ “మీరు అలాంటి వారిలోని వారే అవుతారని నాకు నమ్మకం ఉంది” అని అన్నారు.

[సహీహ్ బుఖారీ : 30వ ప్రకరణం – సౌమ్, 4వ అధ్యాయం – అర్రయ్యాను లిస్సాయిమీన్]

607 – حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: مَنْ أَنْفَقَ زَوْجَيْنِ فِي سَبِيلِ الله دَعَاهُ خَزَنَةُ الْجَنَّةِ، كُلُّ خَزَنَةِ بابٍ، أَيْ فُلُ هَلُمَّ قَالَ أَبُو بَكْرٍ: [ص:215] يَا رَسُولَ اللهِ ذَاكَ الَّذِي لاَ تَوَى عَلَيْهِ فَقَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: إِنِّي لأَرْجُو أَنْ تَكُونَ مِنْهُمْ
__________
أخرجه البخاري في: 56 كتاب الجهاد والسير: 37 باب فضل النفقة في سبيل الله

607. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రబోధించారు:- “ఎవరైనా దైవమార్గంలో (ఒకటికి బదులు) రెండు వస్తువులు ఇస్తే, (మరణానంతరం) అలాంటి వ్యక్తిని స్వర్గంలోని ప్రతి ద్వారపాలకుడు ఆహ్వానిస్తూ ‘ఓ మానవా! ఇటు వైపు వచ్చెయ్యి’ అని అంటాడు.”

హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) ఈ మాటలు విని “దైవప్రవక్తా! అలాంటి వ్యక్తికయితే ఇక భయమే లేదు. (కోరిన ద్వారం గుండా నిరభ్యంతరంగా స్వర్గంలో ప్రవేశించవచ్చు)” అని అన్నారు. (ఆ తరువాత) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మాట్లాడుతూ “మీరు కూడా అలాంటి వ్యక్తులలో ఉంటారని నేను నమ్ముతున్నాను” అని అన్నారు.

[సహీహ్ బుఖారీ : 56వ ప్రకరణం – జిహాద్ వ స్పైర్, 37వ అధ్యాయం – ఫజ్ఞున్ను ఫఖా ఫీ సబీలిల్లాహ్ ]

608 – حديث أَسْمَاءَ، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: أَنْفِقِي وَلاَ تُحْصِي فَيُحْصِيَ اللهُ عَلَيْكِ، وَلاَ تُوعِي فَيُوعِيَ اللهُ عَلَيْكِ
__________
أخرجه البخاري في: 51 كتاب الهبة: 15 باب هبة المرأة لغير زوجها

608. హజ్రత్ అస్మా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా బోధించారు:-

“(దైవమార్గంలో ఉదారంగా) ఖర్చు పెట్టు. లెక్క పెట్టకు. లెక్క పెట్టి ఇస్తే అల్లాహ్ కూడా నీకు లెక్క పెట్టి మరీ ఇస్తాడు. (అంటే నీ పట్ల ఉదారంగా వ్యవహరించడు). అలాగే కూడ బెట్టి ఉంచకు. అలా చేస్తే అల్లాహ్ కూడా (పుణ్యఫలాన్ని నీకు ప్రసాదించకుండా) ఆపి ఉంచుతాడు.”

(సహీహ్ బుఖారీ : 51వ ప్రకరణం – హిబా, 15వ అధ్యాయం – హిబతిల్ మర్ అతి బిగైరి జౌజిహా)

609 – حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: يَا نِسَاءُ الْمُسْلِمَاتِ لاَ تَحْقِرَنَّ جَارَةٌ لِجَارَتِهَا وَلَوْ فِرْسِنَ شَاةٍ
__________
أخرجه البخاري في: 51 كتاب الهبة: 1 باب الهبة وفضلها والتحريض عليها

609. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా హితోపదేశం చేశారు: “ముస్లిం మహిళల్లారా! మీలో ఏ ఒక్కరూ తమ పొరుగింటి స్త్రీలను కించపరచకూడదు. వారొకవేళ (పారితోషికంగా) మీకు ఒక మేక గిట్ట పంపినా సరే (దాన్ని) గౌరవించి స్వీకరించండి. నిరాకరించి వారిని కించపరచకండి.” *

[సహీహ్ బుఖారీ : 51వ ప్రకరణం – హిబా; 1వ అధ్యాయం – అల్ హిబా వ ఫజ్లిహా…]

* ఇక్కడ మేక గిట్ట అంటే అత్యల్ప వస్తువని అర్థం. కనుక పారితోషికం ఇచ్చేవారు ఇంతటి అల్ప వస్తువు ఎలా ఇవ్వాలని అనుకోకూడదని, స్వీకరించేవారు దాన్ని విలువలేని అల్పవస్తువని భావించకుండా సంతోషంగా స్వీకరించి కృతజ్ఞత చెప్పాలని ఈ హదీసు బోధిస్తోంది.

610 – حديث أَبِي هُرَيْرَةَ، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: سَبْعَةٌ يُظِلُّهُمُ اللهُ فِي ظِلِّهِ يَوْمَ لاَ ظِلَّ إِلاَّ ظِلُّهُ: الإِمَامُ الْعَادِلُ، وَشَابٌّ نَشَأَ فِي عِبَادَةِ رَبِّهِ، وَرَجُلٌ قَلْبُهُ مُعَلَّقٌ فِي الْمَسَاجِدِ، وَرَجُلاَنِ تَحَابَّا فِي اللهِ، اجْتَمَعَا عَلَيْهِ وَتَفَرَّقَا عَلَيْهِ، وَرَجُلٌ طَلَبَتْهُ امْرَأَةٌ ذَاتُ مَنْصِبٍ وَجَمَالٍ، فَقَالَ إِنِّي أَخَافُ اللهَ، وَرَجُلٌ تَصَدَّقَ أَخْفَى حَتَّى لاَ تَعْلَمَ شِمَالُهُ مَا تُنْفِقُ يَمِينُهُ، وَرَجُلٌ ذَكَرَ اللهَ خَالِيًا فَفَاضَتْ عَيْنَاهُ
__________
أخرجه البخاري في: 10 كتاب الزكاة: 36 باب من جلس في المسجد ينتظر الصلاة وفضل المساجد

610. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలిపారు:-

“అల్లాహ్ (కారుణ్య) ఛాయ తప్ప మరెలాంటి ఛాయ లభించని (ప్రళయ) దినాన అల్లాహ్ ఏడుగురు వ్యక్తులను తన నీడ పట్టున ఆశ్రయమిస్తాడు. వారిలో (1) న్యాయంగా పాలన చేసే పరిపాలకుడు; (2) తన యౌవన జీవితం (వ్యర్థ కార్యకలాపాల్లో గడపకుండా అంతిమ శ్వాస వరకూ) దైవారాధనలో గడిపిన యువకుడు; (3) మనసంతా మస్జిదులోనే ఉండేటటువంటి వ్యక్తి (అంటే ఉద్యోగం, వ్యాపారం తదితర ప్రపంచ వ్యవహారాల్లో నిమగ్నుడయిపోయినా ధ్యాసంతా మస్జిదు వైపు ఉండేటటువంటి మనిషన్న మాట), (4) కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసం – పరస్పరం అభిమానించుకునే, అల్లాహ్ ప్రసన్నత కోసమే పరస్పరం కలుసుకొని విడిపోయే ఇద్దరు వ్యక్తులు; (5) అంతస్తు, అందచందాలు గల స్త్రీ అసభ్యకార్యానికి పిలిచినప్పుడు, తాను అల్లాహ్ కు భయపడుతున్నానంటూ ఆమె కోరికను తిరస్కరించిన వ్యక్తి; (6) కుడి చేత్తో ఇచ్చింది ఎడమచేతికి సయితం తెలియనంత గోప్యంగా దానధర్మాలు చేసిన వ్యక్తి; (7) ఏకాంతంలో అల్లాహ్ ను తలచుకొని కంట తడి పెట్టే వ్యక్తి.”

[సహీహ్ బుఖారీ : 10వ ప్రకరణం – అజాన్, 36వ అధ్యాయం – మన్ జలస ఫిల్ మస్జిది యన్తజిరుస్సలాతి వ ఫజ్లిల్ మసాజిద్]

611 – حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، قَالَ: جَاءَ رَجُلٌ إِلَى النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَقَالَ: يَا رَسُولَ اللهِ أَيُّ الصَّدَقَةِ أَعْظَمُ أَجْرًا قَالَ: أَنْ تَصَدَّقَ وَأَنْتَ صَحِيحٌ شَحِيحٌ تَخْشَى الْفَقْرَ وَتَأْمُلُ الْغِنَى، وَلاَ تُمْهِلُ حَتَّى إِذَا بَلَغْتِ الحُلْقُومَ، قُلْتَ لِفُلاَنٍ كَذَا، وَلِفُلاَنٍ كَذَا، وَقَد كَانَ لِفُلاَنٍ
__________
أخرجه البخاري في: 24 كتاب الزكاة: 11 باب أي الصدقة أفضل

611. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం:- ఒకతను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి వచ్చి “దైవప్రవక్తా! ఎవరి దానధర్మాల పుణ్యఫలం అందరికంటే అధికంగా ఉంటుంది?” అని అడిగాడు. దానికి దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సమాధానమిచ్చారు:

“నీవు ఆరోగ్యంగా ఉండి, అత్యధిక ధనాశ కలిగి ఉన్న రోజుల్లో (ఖర్చు చేస్తే) పేదవాణ్ణయి పోతానన్న భయంతో పాటు ధనికుడయి పోవాలన్న కోరిక కలిగి ఉన్నప్పటికీ చేసే దానం అత్యంత శ్రేష్ఠమైనది. కనుక దానం చేయడంలో నీవు అంత్యకాలం దాపురించే దాకా వేచి ఉండకు. ప్రాణం కంఠంలోకి వచ్చి కొన ఊపిరితో కొట్టుకునే స్థితి వచ్చినప్పుడు నేను ఫలానా వ్యక్తికి అంతిస్తాను, ఫలానా మనిషికి ఇంతిస్తాను అని చెబితే ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇప్పుడది ఫలానా, ఫలానా వారిది అయిపోయినట్లే (నీవిచ్చేదేమీ లేదు).”

(సహీహ్ బుఖారీ : 24వ ప్రకరణం – జకాత్, 11వ అధ్యాయం – అయ్ అస్సదఖ అఫ్జల్)

612 – حديث ابْنِ عُمَرَ، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ، وَهُوَ عَلَى الْمِنْبَرِ، وَذَكَرَ الصَّدَقَةَ وَالتَّعَفُّفَ وَالْمَسْئَلَةَ: الْيَدُ الْعُلْيَا خَيْرٌ مِنْ الْيَدِ السُّفْلَى، فَالْيَدُ الْعُلْيَا هِيَ الْمُنْفِقَةُ، وَالسُّفْلَى هِيَ السَّائِلَةُ
__________
أخرجه البخاري في: 24 كتاب الزكاة: 18 لا صدقة إلا عن ظهر غني

612. హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వేదిక మీద ప్రసంగిస్తూ “దానం చేయడం, (భిక్షం) అడగటం, అడగకపోవడం గురించి ప్రస్తావించారు. ఆ సందర్భంలో ఆయన “క్రింది చేయికంటే పైచేయి ఎంతో శ్రేష్ఠమైనది. పై చేయి అంటే ఇచ్చే, ఖర్చు పెట్టే చేయి. క్రింది చేయి అంటే అడిగి తీసుకునే చేయి” అని అన్నారు.

[సహీహ్ బుఖారీ : 24వ ప్రకరణం – జకాత్, 18వ అధ్యాయం – లా సదఖత ఇల్లా అన్ జహ్ రిగ్నీ]

613 – حديث حَكِيمِ بْنِ حِزَامٍ رضي الله عنه، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: الْيَدُ الْعُلْيَا خَيْرٌ مِنَ الْيَدِ السُّفْلَى، وَابْدَأْ بِمَنْ تَعُولُ، وَخَيْرُ الصَّدَقَةِ عَنْ ظَهْرِ غِنًى، وَمَنْ يَسْتَعْفِفْ يُعِفَّهُ اللهُ، وَمَنْ يَسْتَغْنِ يُغْنِهِ اللهُ
__________
أخرجه البخاري في: 24 كتاب الزكاة: 18 باب لا صدقة إلا عن ظهر غنى

613. హజ్రత్ హకీం బిన్ హిజామ్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:- “క్రింది చేయి కంటే పై చేయి శ్రేష్ఠమైనది. మొదట మీ పోషణలో ఉన్న వారికి దానం చేయండి. దానమిచ్చిన తరువాత కూడా మనిషి ధనవంతుడిగా ఉండిపోతే అలాంటి వ్యక్తి చేసే దానమే ఎంతో శ్రేష్ఠమైనది. (దానం) అర్ధించడం మానుకున్న వ్యక్తికి అల్లాహ్ దేవురించే అవమానం నుండి కాపాడుతాడు. దాన స్వీకారాన్ని లక్ష్య పెట్టకుండా మసలుకునే వాడికి అల్లాహ్ కలిమిని ప్రసాదిస్తాడు.”

[సహీహ్ బుఖారీ : 24వ ప్రకరణం – జకాత్, 18వ అధ్యాయం – లా సదఖత ఇల్లా అన్ జహ్ రిగ్నీ]

614 – حديث حَكِيمِ بْنِ حِزَامٍ رضي الله عنه، قَالَ: سَأَلْتُ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فَأَعْطَانِي، ثُمَّ سَأَلْتُهُ فَأَعْطَانِي، ثُمَّ سَأَلْتُهُ فَأَعْطَانِي؛ ثُمَّ قَالَ: يَاحَكِيمُ إِنَّ هذَا الْمَالَ خَضِرَةٌ حُلْوَةٌ، [ص:218] فَمَنْ أَخَذَهُ بِسَخَاوَةِ نَفْسٍ بُورِكَ لَهُ فِيهِ، وَمَنْ أَخَذَهُ بِإِشْرَافِ نَفْسٍ لَمْ يُبَارَكْ لَهُ فِيهِ، كَالَّذِي يَأْكُلُ وَلاَ يَشْبَعُ، الْيَدُ الْعُلْيَا خَيْرٌ مِنَ الْيَدِ السُّفْلَى
قَالَ حَكِيمٌ: فَقُلْتُ يَا رَسُولَ اللهِ وَالَّذِي بَعَثَكَ بِالْحَقِّ لاَ أَرْزأْ أَحَدًا بَعْدكَ شَيْئًا حَتَّى أُفَارِقَ الدُّنْيَا فَكَانَ أَبُو بَكْرٍ رضي الله عنه، يَدْعُو حَكِيمًا إِلَى الْعَطَاءِ، فَيَأْبَى أَنْ يَقْبَلَهُ مِنْهُ ثُمَّ إِنَّ عُمَرَ رضي الله عنه دَعَاهُ لِيُعْطِيَهُ، فَأَبَى أَنْ يَقْبَلَ مِنْهُ شَيْئًا فَقَالَ عُمَرُ: إِنِّي أُشْهِدُكُمْ يَا مَعْشَرَ الْمُسْلِمِينَ عَلَى حَكِيمٍ، أَنِّي أَعْرِضُ عَلَيْهِ حَقَّهُ مِنْ هذَا الْفَيْءِ فَيَأْبَى أَنْ يَأْخُذَهُ
فَلَمْ يَرْزَأْ حَكِيمٌ أَحَدًا مِنَ النَّاسِ بَعْدَ رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، حَتَّى تُوُفِّيَ
__________
أخرجه البخاري في: 24 كتاب الزكاة: 50 باب الاستعفاف عن المسئلة

614. హజ్రత్ హకీమ్ బిన్ హిజామ్ (రదియల్లాహు అన్హు) కథనం:- నేనొకసారి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను (కొంతధనం) అడిగితే ఆయన ఇచ్చివేశారు. నేను (అది చాలక) మళ్ళీ అడిగాను. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నాకు మరికొంత ప్రసాదించారు. నేను (తృప్తి చెందక) మళ్ళీ అడిగాను. ఆయన నాకు మరికాస్త ప్రసాదించి ఇలా అన్నారు:

“హకీమ్! ఈ ప్రాపంచిక సంపద (పైకి) ఎంతో పచ్చపచ్చగా మధురంగా ఉండవచ్చు. కాని దాన్ని ఆత్మ సంతృప్తితో తీసుకునే వ్యక్తికి అందులో శుభం కలుగుతుంది. అత్యాశతో అడిగే వాడికి అందులో ఎలాంటి శుభం ఉండదు. అతను ఎంత తిన్నా కడుపునిండని వ్యక్తిలాంటివాడు. (గుర్తుంచుకో) ఇచ్చే చేయి పుచ్చుకునే చేయి కంటే ఎంతో శ్రేష్ఠమైనది.”

అప్పుడు హజ్రత్ హకీం (రదియల్లాహు అన్హు) ఇలా అన్నారు: “దైవప్రవక్తా! మిమ్మల్ని సత్యాన్నిచ్చి పంపిన ఆ ప్రభువు సాక్షిగా చెబుతున్నాను. నేనీ క్షణం నుంచి ఇహలోకం వీడిపోయే వరకు ఏ వస్తువు కోసం ఎవరి ముందూ చేయిజాపను.”

అందువల్ల హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) తన పాలనాకాలంలో (ధనధాన్యాలు) ఇవ్వడానికి హజ్రత్ హకీం (రదియల్లాహు అన్హు)ని ఎన్నిసార్లు పిలిపించినా ఆయన వెళ్ళి (వాటిని) స్వీకరించడానికి నిరాకరించేవారు. ఆ తరువాత హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కూడా (తన పాలనా కాలంలో ధనధాన్యాలు) ఇవ్వడానికి హజ్రత్ హకీం (రదియల్లాహు అన్హు)ని అనేకసార్లు పిలిపించారు. కాని హజ్రత్ హకీం (రదియల్లాహు అన్హు) ఆయన దగ్గర్నుంచి కూడా స్వీకరించడానికి నిరాకరించేవారు. దాంతో హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ఓ రోజు ప్రజలను సంబోధిస్తూ “ముస్లింలారా! నేను యుద్ధప్రాప్తి నుండి హజ్రత్ హకీం (రదియల్లాహు అన్హు)కు రావలసిన భాగాన్ని తీసి ఆయనకు ఇవ్వబోతున్నప్పుడల్లా ఆయన దాన్ని స్వీకరించడానికి నిరాకరిస్తున్నారు. దీనికి సాక్షులుగా నేను మిమ్మల్ని నిలబెడుతున్నాను” అని అన్నారు.

ఈ విధంగా హజ్రత్ హకీం (రదియల్లాహు అన్హు) దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) నుండి దానం స్వీకరించిన నాటి నుండి చనిపోయే రోజు వరకూ ఎన్నడూ ఎవరి నుండీ, ఎలాంటి వస్తువూ తీసుకోలేదు.

[సహీహ్ బుఖారీ : 24వ ప్రకరణం – జకాత్, 50వ అధ్యాయం – అల్ ఇస్తి అఫాఫి అనిల్ మస్ అల]

615 – حديث مُعَاوِيَةَ، قَالَ: سَمِعْتُ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، يَقُولُ مَنْ يُرِدِ اللهُ بِهِ خَيْرًا يُفَقِّهْهُ فِي الدِّينِ، وَإِنَّمَا أَنَا قَاسِمٌ وَاللهُ يُعْطِي، وَلَنْ تَزَالَ هذِهِ الأُمَّةُ قَائِمَةً عَلَى أَمْرِ اللهِ، [ص:219] لا يَضُرُّهُمْ مَن خَالَفَهُمْ حَتَّى يَأْتِيَ أَمْرُ اللهِ
__________
أخرجه البخاري في: 3 كتاب العلم: 13 باب من يرد الله به خيرًا يفقهه في الدين

615. హజ్రత్ ముఆవియా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ఉపదేశించారు:-

“అల్లాహ్ ఎవరి శ్రేయస్సు కోరుకుంటాడో అతనికి ధర్మావగాహనా శక్తిని ప్రసాదిస్తాడు. నేను (సంపద) పంపిణీ చేసేవాడ్ని మాత్రమే. ప్రసాదించేవాడు అల్లాహ్. (గుర్తుంచుకోండి) ఈ (ముస్లిం) సమాజం సత్య ధర్మం పై స్థిరంగా ఉంటుంది. (ఇలా సత్యధర్మం పై స్థిరంగా ఉన్నంత కాలం) వారికి వారి విరోధులు ప్రళయం వచ్చే దాకా ఎలాంటి నష్టం కలిగించలేరు.” *

(సహీహ్ బుఖారీ: 3వ ప్రకరణం – ఆల్ ఇల్మ్, 13వ అధ్యాయం – మన యురిదిల్లాహు బిహీ ఖైరన్ యుఫఖ్ఖిహు ఫిద్దీన్]

* ఈ సంకలనంలో హదీసు మూలం బుఖారీ గ్రంథం నుండి, విషయ సూచిక ముస్లిం గ్రంథం నుండి తీసుకోవడం వల్ల ఇక్కడ పేర్కొన్న హదీసు ఈ ప్రకరణంతో సంబంధం లేని హదీసుగా కనిపిస్తోంది. ఈ హదీసు గురించి సహీహ్ ముస్లింలో అదనంగా ఇలా ఉంది: “నేను కోశాధికారిని మాత్రమే. నా అంతట నేను ఎవరికైనా సంతోషంగా ఏదైనా ఇస్తే అందులో శుభం ఉంటుంది. అడిగి వేధించే వాడికి ఇస్తే, అతను ఎంత తిన్నా కడుపు నిండని వాడులాంటి వాడవుతాడు.”

616 – حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: لَيْسَ الْمِسْكِينُ الَّذِي يَطُوفُ عَلَى النَّاسِ، تَرُدُّهُ اللقْمَةُ وَاللُّقْمَتَانِ، وَالتَّمْرَةُ وَالتَّمْرَتَانِ، وَلكِنِ الْمِسْكِينُ لاَ يَجِدُ غِنًى يُغْنِيهِ، وَلاَ يُفْطَنُ بِهِ فَيُتَصَدَّقُ عَلَيْهِ، وَلاَ يَقُومُ فَيَسْأَلُ النَّاسَ
__________
أخرجه البخاري في: 24 كتاب الزكاة: 35 باب قول الله تعالى (لا يسألون الناس إلحافَا)

616. హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు :

“నిరుపేద అంటే వీధుల వెంబడి తిరుగుతూ ఒకటి రెండు ముద్దలు లేక ఒకటి రెండు ఖర్జూరపు పండ్లు అడుక్కునేవాడు కాదు. సిసలైన నిరుపేద అంటే ఇతరుల్ని అర్థించనవసరం లేనంత ఆర్థిక స్తోమత లేనివాడు. అటు దానం చేయడానికి ప్రజల దృష్టిలో అతనంత పేదవాడిగా కూడా కన్పించడు. పైగా అతను ప్రజల ముందు దేబిరిస్తూ తిరగడు.” *

[సహీహ్ బుఖారీ : 24వ ప్రకరణం – జకాత్, 53వ అధ్యాయం – ఖౌలిల్లాహి తాలా లా యస్అలూనన్నాస ఇల్ హీఫా]

* దివ్యఖుర్ఆన్లోని “ఈ జకాత్ నిధులు నిరుపేదలకు, కనీస అవసరాలు సయితం తీరని వారికి…… ” (9:60) అనే సూక్తిలో ‘మిస్కీన్’ అనే పదం వచ్చింది. దీన్నే ఇక్కడ ఈ హదీసు విశదీకరిస్తోంది.

617 – حديث عَبْدِ اللهِ بْنِ عُمَرَ، قَالَ: قَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: مَا يَزَالُ الرَّجُلُ يَسْأَلُ النَّاسَ حَتَّى يَأْتِيَ يَوْمَ الْقِيَامَةِ لَيْسَ فِي وَجْهِهِ مُزْعَةُ لَحْمٍ
__________
أخرجه البخاري في: 34 كتاب الزكاة: 52 باب من سأل الناس تكثرًا

617. హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా హితోపదేశం చేశారు: “ఎల్లప్పుడూ ప్రజల దగ్గర అడుక్కుంటూ ఉండేవాడు ప్రళయదినాన ముఖాన ఒక్క మాంసపు తునకైనా లేనివాడై (వికృత ముఖాకృతితో) వస్తాడు.”

(సహీహ్ బుఖారీ : 24వ ప్రకరణం – జకాత్, 52వ అధ్యాయం – మన్ సఅలన్నాస తకస్సురా)

618 – حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: لأَنْ يَحْتَطِبَ أَحَدُكُمْ حُزْمَةً عَلَى ظَهْرِهِ خَيْرٌ مِنْ أَنْ يَسْأَلَ أَحَدًا فَيُعْطِيَهُ أَوْ يَمْنَعَهُ
[ص:220] أخرجه البخاري في: 34 كتاب البيوع: 15 باب كسب الرجل وعمله بيده

618. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:-

“లోకుల దగ్గర ముప్టెత్తడం కన్నా (అడవి నుండి) కట్టెల మోపు మోసుకొచ్చి అమ్ముకుని తినడం మనిషికి ఎంతో మేలు. వారు (దానం చేసేవారు) అతనికి ఏదైనా (దానం) ఇవ్వవచ్చు లేదా ఇవ్వడానికి నిరాకరించనూ వచ్చు.”

[సహీహ్ బుఖారీ : 34వ ప్రకరణం – బుయూ, 15వ అధ్యాయం – కస్బుర్రజులి వ వఅమలిహీ బియదిహీ]

619 – حديث عُمَرَ، قَالَ: كَانَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يُعْطِينِي الْعَطَاءَ فَأَقُولُ: أَعْطِهِ مَنْ هُوَ أَفْقَرُ إِلَيْهِ مِنِّي، فَقَالَ: خُذْهُ، إِذَا جَاءَكَ مِنْ هذَا الْمَالِ شَيْءٌ وَأَنْتَ غَيْرُ مُشْرِفٍ وَلاَ سَائِلٍ فَخُذْهُ، وَمَا لاَ، فَلاَ تُتْبِعْهُ نَفْسَكَ
__________
أخرجه البخاري في: 24 كتاب الزكاة: 51 باب من أعطاه الله شيئًا من غير مسألة ولا إشراف نفس

619. హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నాకేదయినా ప్రసాదిస్తున్నప్పుడు “దీన్ని అతని కివ్వండి. నా కంటే అతనికి దీని అవసరం ఎక్కువగా ఉంది” అని అనేవాడ్ని నేను. ఈ విషయం గురించి (ఓ రోజు) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రస్తావిస్తూ “అత్యాశకు పోకుండా ఉండి, అర్థించకుండానే మీకేదయినా సంపద లభిస్తే నిరభ్యంతరంగా తీసుకోండి. అలా లభించకపోతే దాన్ని గురించి పట్టించుకోకండి” అని అన్నారు.

[సహీహ్ బుఖారీ : 24వ ప్రకరణం – జకాత్, 51వ అధ్యాయం – మన్ అతాహుల్లాహు పై అమ్మిన్ గైరి మస్ అలతి వల అష్రాఫి నఫ్సిన్]

620 – حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، قَالَ: سَمِعْتُ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، يَقُولُ: لاَ يَزَالُ قَلْبُ الْكَبِيرِ شَابًّا فِي اثْنَتَيْنِ: فِي حُبِّ الدُّنْيَا وَطُولِ الأَمَلِ
__________
أخرجه البخاري في: 81 كتاب الرقاق: 5 باب من بلغ ستين سنة فقد أعذر الله إليه في العمر

620. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:- “రెండు విషయాల్లో వృద్ధుని మనస్సు కూడా యువ మనస్సయిపోతుంది. ఒకటి, ప్రాపంచిక వ్యామోహం. రెండు, చాలా కాలం బ్రతకాలన్న కోరిక”.

[సహీహ్ బుఖారీ : 81వ ప్రకరణం – రిఖాఖ్, 5వ అధ్యాయం – మన్ బలగ సిత్తీన సనతా…..]

621 – حديث أَنَسٍ رضي الله عنه، قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: يَكْبَرُ ابْنُ آدَمَ وَيَكْبَرُ مَعَهُ اثْنَانِ: حُبُّ الْمَالِ وَطُولُ الْعُمُرِ
__________
أخرجه البخاري في: 81 كتاب الرقاق: 5 باب من بلغ ستين سنة فقد أعذر الله إليه في العمر

621. హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రబోధించారు:- “మానవుడు ఒకవైపు వృద్దుడై పోతూ ఉంటే, మరో వైపు అతనిలో రెండు విషయాలు అధికమవుతూ ఉంటాయి. ఒకటి: ధనవ్యామోహం. రెండు: దీర్ఘాయుష్సు పట్ల కోరిక.”

[సహీహ్ బుఖారీ : 81వ ప్రకరణం – రిఖాఖ్, 5వ అధ్యాయం – మన్ బలగ సిత్తీన సనతా……]

622 – حديث أَنَسِ بْنِ مَالِكٍ، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: لَوْ أَنَّ لاِبْنِ آدَمَ وَادِيًا مِنْ ذَهَبٍ أَحَبَّ أَنْ يَكُونَ لَهُ وَادِيَانِ، وَلَنْ يَمْلأَ فَاهُ إِلاَّ التُّرَابُ، وَيَتُوبُ اللهُ عَلَى مَنْ تَابَ
__________
أخرجه البخاري في: 81 كتاب الرقاق: 10 باب ما يتقي من فتنة المال

622. హజ్రత్ అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలిపారు:- “ఈ మానవుడికి బంగారంతో నిండిన ఒక అరణ్యం లభించినా సరే, అలాంటి మరో అరణ్యం దొరికితే బాగుండునని భావిస్తాడు. అతని కడుపు (సమాధి) మట్టితో మాత్రమే నిండుతుంది. అయితే ప్రాపంచిక వ్యామోహం విడనాడి అల్లాహ్ వైపుకు మరలితే అలాంటి వ్యక్తిని అల్లాహ్ మన్నిస్తాడు. అతని ప్రాయశ్చిత్తాన్ని స్వీకరిస్తాడు. (అతనికి ఆత్మ సంతృప్తి భాగ్యం ప్రసాదిస్తాడు.)

(సహీహ్ బుఖారీ : 81వ ప్రకరణం – రిఖాఖ్; 10వ అధ్యాయం – మా యత్తఖా మిన్ ఫిత్నతిల్ మాల్)

623 – حديث ابْنِ عَبَّاسٍ، قَالَ: سَمِعْتُ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، يَقُولُ: لَوْ أَنَّ لاِبْنِ آدَمَ مِلْءَ وَادٍ مَالاً لأَحَبَّ أَنَّ لَهُ إِلَيْهِ مِثْلَهُ، وَلاَ يَمْلأُ عَيْنَ ابْنِ آدَمَ إِلاَّ التُّرَابُ، وَيَتُوبُ اللهُ عَلَى مَنْ تَابَ
__________
أخرجه البخاري في: 81 كتاب الرقاق: 10 باب ما يتقي من فتنة المال

623. హజ్రత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: “మానవునికి సిరిసంపదలతో నిండిన ఓ పెద్ద అరణ్యం లభించినప్పటికీ, అలాంటి మరో అరణ్యం దొరికితే బాగుండునని భావిస్తాడు. అతని పేరాశ కడుపు (సమాధి) మట్టితో మాత్రమే నిండుతుంది. అయితే ప్రాపంచిక వ్యామోహం వదలి పశ్చాత్తాప హృదయంతో అల్లాహ్ వైపుకు మరలితే అలాంటి వ్యక్తిని అల్లాహ్ మన్నిస్తాడు. అతని పశ్చాత్తాపాన్ని స్వీకరిస్తాడు (అతనికి ఆత్మ సంతృప్తి భాగ్యం ప్రసాదిస్తాడు.)”

[సహీహ్ బుఖారీ : 81వ ప్రకరణం – రిఖాఖ్, 10వ అధ్యాయం – మాయత్తఖా మిన్ ఫిత్నతిల్ మాల్]

624 – حديث أَبِي هُرَيْرَةَ، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: لَيْسَ الْغِنَى عَنْ كَثْرَةِ الْعَرَضِ وَلكِنَّ الْغِنَى غِنَى النَّفْسِ
__________
أخرجه البخاري في: 81 كتاب الرقاق: 15 باب الغنى غنى النفس

624. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు:- “అత్యధిక సిరిసంపదలతో కలిమి రాదు. నిజమైన కలిమి ఆత్మ సంతృప్తి వల్లనే ఒనగూడుతుంది.”

(సహీహ్ బుఖారీ : 81వ ప్రకరణం – రిఖాఖ్, 15వ అధ్యాయం – అల్ గినా గినన్నఫ్స్)

625 – حديث أَبِي سَعِيدٍ، قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: إِنَّ أَكْثَرَ مَا أَخَافُ عَلَيْكُمْ مَا يُخْرِجُ اللهُ لَكُمْ مِنْ بَرَكَاتِ الأَرْضِ قِيلَ: وَمَا بَرَكَات الأَرْضِ قَالَ: زَهْرَة الدُّنْيَا فَقَالَ لَهُ رَجُلٌ: هَلْ يَأْتِي الْخَيْرُ بِالشَّرِّ فَصَمَتَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، حَتَّى ظَنَنَّا أَنَّهُ يُنْزَلُ علَيْهِ، ثُمَّ جَعَلَ يَمْسَحُ عَنْ جَبِينِهِ، فَقَالَ: أَيْنَ السَّائِلُ قَالَ: أَنَا قَالَ أَبُو سَعِيدٍ: لَقَدْ حَمِدْنَاهُ حِينَ طَلَعَ ذلِكَ، قَال: لاَ يَأْتِي الْخَيْرُ إِلاَّ بِالْخَيْرِ، إِنَّ هذَا الْمَالَ خَضِرَةٌ حُلْوَةٌ، وَإِنَّ كُلَّ مَا أَنْبَتَ الرَّبِيعُ يَقْتُلُ حَبَطًا أَوْ يُلِمُّ، إِلاَّ آكِلَةَ الْخَضِرَةِ، أَكَلَتْ، حَتَّى إِذَا امْتَدَّتْ خَاصِرَتَاهَا اسْتَقْبَلَتِ الشَمْسَ فَاجْتَرَّتْ وَثَلَطَتْ وَبَالَتْ، [ص:223] ثُمَّ عَادَتْ فَأَكَلَتْ؛ وَإِنَّ هذَا الْمَالَ حُلْوَةٌ، مَنْ أَخَذَهُ بِحَقِّهِ، وَوَضَعَهُ فِي حَقِّهِ فَنِعْمَ الْمَعُونَةُ هُوَ؛ وَمَنْ أَخَذَهُ بِغَيْرِ حَقِّهِ كَانَ كَالَّذِي يَأْكُلُ وَلاَ يَشْبَعُ
__________
أخرجه البخاري في: 81 كتاب الرقاق: 7 باب ما يحذر من زهرة الدنيا والتنافس فيها

625. హజ్రత్ అబూ సయీద్ ఖుదరీ (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఓసారి మాతో మాట్లాడుతూ, “మీ విషయంలో నాకు భూశుభాలను గురించి ఎక్కువ భయంగా ఉంది” అని అన్నారు. అప్పుడు ఒకతను “భూశుభాలు అంటే ఏమిటీ” అని అడిగాడు. దానికి దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) “భూశుభాలు అంటే ప్రాపంచిక సిరిసంపదలు” అని సమాధానమిచ్చారు. అప్పుడు మరొకతను “మంచి నుండి చెడు జనిస్తుందా?” అని అడిగాడు.

ఈ మాట విని దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) మౌనంగా ఉండిపోయారు. అలా చాలా సేపు ఉన్నారు. దాంతో మాకు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పై వహీ అవతరిస్తుందేమోనని అనుమానం వచ్చింది. ఆ తరువాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నుదుటికి పట్టిన చెమట తుడుచుకుంటూ “ప్రశ్న అడిగిన ఆ వ్యక్తి ఎక్కడున్నాడు?” అని అడిగారు. అప్పుడావ్యక్తి “నేను ఇక్కడే ఉన్నానండీ” అన్నాడు.

హజ్రత్ అబూ సయీద్ (రదియల్లాహు అన్హు) ఇంకా ఇలా తెలుపుతున్నారు. అప్పుడు మేము పరిస్థితి గ్రహించి ఆ వ్యక్తిని ప్రశంసించసాగాము. సరే, ఆ తరువాత దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా అన్నారు:

“మంచి విషయం వల్ల ఎప్పుడూ మంచే జరుగుతుంది. అయితే ఈ ప్రాపంచిక సంపద (పైకి) తళుకు బెళుకులతో కళకళలాడుతూ, రుచిలో ఎంతో మధురంగా ఉంటుంది. వర్షాకాలంలో ఏపుగా పెరిగి నయనానందకరంగా ఉండే పచ్చికను గనక పశువు మితిమీరి మేస్తే (అజీర్తితో) దాని పొట్ట ఉబ్బిపోతుంది. దాంతో అది చావనయినా చస్తుంది లేదా చావు దరిదాపులకైనా చేరుతుంది. దీనికి భిన్నంగా ఆ పశువు కాస్త మితంగా పచ్చికమేసి, కడుపు నిండగానే ఎండలో కెళ్ళి నిలబడి నెమరు వేసి, మలమూత్ర విసర్జన తరువాత తిరిగొచ్చి మేస్తుంటే (నష్టమేమీ ఉండదు.) ఈ ప్రాపంచిక ఐశ్వర్యం కూడా అలాంటిదే. ఇది పైకి ఎంతో ఆకర్షవంతంగా, రుచిలో మధురంగా ఉంటుంది. అందువల్ల దీన్ని (అవసరమైనంత మేరకు) ధర్మయుక్తంగా సంపాదించి ధర్మయుక్తంగా వినియోగించాలి. అప్పుడే అది మనిషికి సత్ఫలాన్నిస్తుంది. దానికి బదులు అధర్మంగా, అక్రమంగా తనకు లభించవలసిన దానికంటే ఎక్కువ సంపాదించి తినేవాడు, ఎంత తిన్నా కడుపునిండని వాడితో సమానుడవుతాడు.”

[సహీహ్ బుఖారీ : 81వ ప్రకరణం – రిఖాఖ్, 7వ అధ్యాయం – మా యుహ్ జరు మిన్ జహ్రతిద్దున్యా వత్తనాఫుసి ఫీహా]

626 – حديث أَبِي سَعِيدٍ الْخدْرِيِّ رضي الله عنه، أَنَّ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ جَلَسَ ذَاتَ يَوْمٍ عَلَى الْمِنْبَرِ وَجَلَسْنَا حَوْلَهُ، فَقَالَ: إِنِّي مِمَّا أَخَافُ عَلَيْكُمْ مِنْ بَعْدِي مَا يُفْتَحُ عَلَيْكُمْ مِنْ زَهْرَةِ الدُّنْيَا وَزِينَتِهَا فَقَالَ رَجُلٌ: يَا رَسُولَ اللهِ أَوَ يَأْتِي الْخَيْرُ بِالشَّرِّ فَسَكَتَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فَقِيلَ لَهُ: مَا شَأْنُكَ تُكَلِّمُ النَبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ وَلاَ يُكَلِّمُكَ فَرَأَيْنَا أَنَّهُ يُنْزَلُ عَلَيْهِ قَالَ فَمَسَحَ عَنْهُ الرُّحَضَاءَ، فَقَالَ: أَيْنَ السَّائِلُ وَكَأَنَّهُ حَمِدَهُ؛ فَقَالَ: إِنَّهُ لاَ يَأْتِي [ص:224] الْخَيْرُ بِالشَّرِّ، وَإِنَّ مِمَّا يُنْبِتُ الرَّبِيعُ يَقْتُلُ أَو يُلِمُّ، إِلاَّ آكِلَةَ الْخَضْرَاءِ، أَكَلَتْ حَتَّى إِذَا اْمتَدَّتْ خَاصِرَتَاهَا اسْتَقْبَلَتْ عَيْنَ الشَّمْسِ، فَثَلَطَت وَبَالَتْ وَرَتَعَتْ، وَإِنَّ هذَا الْمَالَ خَضِرَةٌ حُلْوَةٌ، فَنِعْمَ صَاحِبُ الْمُسْلِمِ مَا أَعْطَى مِنْهُ الْمِسْكِينَ وَالْيَتِيمَ وَابْنَ السَّبِيلِ أَوْ كَمَا قَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: وَإِنَّهُ مَنْ يَأْخُذُهُ بِغَيْرِ حَقِّهِ كَالَّذِي يَأْكُلُ وَلاَ يَشْبَعُ، وَيَكُونُ شَهِيدًا عَلَيْهِ يَوْمَ الْقِيَامَةِ
__________
أخرجه البخاري في: 24 كتاب الزكاة: 47 باب الصدقة على اليتامى

626. హజ్రత్ అబూ సయీద్ ఖుదరీ (రదియల్లాహు అన్హు) కథనం:- ఒకరోజు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వేదిక పై కూర్చొని ఉన్నారు. మేమంతా ఆయన చుట్టూ చేరి కూర్చున్నాము. అప్పుడు ఆయన మాట్లాడుతూ “నేను ఇహలోకం వీడిపోయిన తరువాత మీరు ప్రాపంచిక వ్యా మోహంలో పడిపోతారేమోనని మీ గురించి నాకు భయంగా ఉంది. ప్రాపంచిక సిరిసంపదలు (వెల్లువలా) మీ ముందుకు వచ్చి పడతాయి” అని అన్నారు.

ఆ సందర్భంలో ఒక వ్యక్తి లేచి “అయితే దైవప్రవక్తా! మంచి వల్ల చెడు కూడా జనిస్తుందా?” అని అడిగాడు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ మాట విని మౌనంగా ఉండిపోయారు. అప్పుడు కొందరు ఆ వ్యక్తిని నిందిస్తూ “నువ్వెందుకు అలాంటి ప్రశ్న అడిగావు. దాని వల్ల దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉండిపోయారు చూడు” అని అన్నారు.

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మౌనంగా ఉండిపోవడం చూసి ఆయనపై ‘వహీ’ అవతరిస్తుందేమోనని అనుకున్నాము మేము మనసులో. కాస్సేపటికి ఆయన ముఖమ్మీది చెమట తుడుచుకుంటూ “ప్రశ్న అడిగినవాడు ఎక్కడున్నాడు?” అని అడిగారు అతని ప్రశ్న తనకు నచ్చినట్లుగా. తరువాత ఆయన ఇలా అన్నారు:

“నిజమే. మంచి నుండి చెడు పుట్టదనడంలో ఎలాంటి సందేహం లేదు. కాని వసంత రుతువులో మొలిచే వృక్ష సంపద సాధారణంగా పశువుల్ని హతమార్చుతుంది. లేదా చావుకు దగ్గరగా చేర్చుతుంది. అయితే కడుపు నిండా తిన్న తరువాత ఎండలో వెళ్ళి (నిలబడి) నెమరువేసి, మలమూత్ర విసర్జన తరువాత తిరిగొచ్చి మళ్ళీ బాగా మేసే పశువులకు అలాంటి ప్రమాదం ఉండదు. ఈ ప్రాపంచిక సిరిసంపదలు కూడా ఎంతో ఆకర్షవంతంగా, పచ్చపచ్చగా రుచిలో ఎంతో మధురంగా ఉంటాయి.* నిరుపేదలకు, అనాధలకు, బాటసారులకు దానం చేసే ముస్లింలకు మాత్రమే ఈ సిరిసంపదలు మేలు చేర్చుతాయి.”

లేదా చివర్లో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు (హదీసు ఉల్లేఖకునికి ఇక్కడ సరిగా గుర్తులేదు). “ప్రాపంచిక సిరిసంపదల్ని అధర్మంగా, అక్రమంగా ఆర్జించేవాడు ఎంత తిన్నా కడుపు నిండని వ్యక్తిలాంటివాడు. ప్రళయదినాన అలాంటి వ్యక్తికి వ్యతిరేకంగా (అతను సంపాదించిన) ఈ ధనమే సాక్ష్యమిస్తుంది.”

[సహీహ్ బుఖారీ: 24వ ప్రకరణం – జకాత్, 47వ అధ్యాయం – అస్పదఖతి అలల్ యతామా]

* ఇమాం నవవీ (రహిమహుల్లాహ్) తన ‘ముస్లిం వ్యాఖ్యాన గ్రంథం’లో ఈ హదీసు భావాన్ని ఇలా వివరించారు:-

“మీకు లభించే ప్రాపంచిక పటాటోపం, తళుకు బెళుకుల్లో ఎలాంటి శ్రేయస్సు లేదు. పైగా అందులో పరీక్ష ప్రమాదం ఉంది. అంటే దీని పర్యవసానం పేరాశ, ప్రగల్భాలు, అలజడి, అరాచకాల రూపంలో బహిర్గతమవుతుంది. మనిషి ప్రాపంచిక భోగ భాగ్యాల్లో మునిగిపోతే పరలోకాన్ని మరిచిపోతాడు. వర్షాకాలంలో మితిమీరిన పచ్చిక తిన్నపశువు పొట్ట ఉబ్బి చచ్చిపోతుంది. ఈ ప్రాపంచిక సిరిసంపదలు కూడా వర్షాకాలంలో పెరిగిన పచ్చికలా నయనానందకరంగా ఉండి మానవుల్ని ఆకర్షించుకుంటాయి. వారిని మాటి మాటికి ఊరిస్తూ చపలచిత్తుల్ని చేస్తాయి. చివరికి అవి వారి పరలోక జీవితాన్ని సర్వనాశనం చేస్తాయి. అయితే ఆత్మసంతృప్తితో వాటిని అవసరమైన మేరకు మాత్రమే వాడుకునే వారికి ఎలాంటి హాని జరగదు.”

627 – حديث أَبِي سَعِيدٍ الْخدْرِيِّ رضي الله عنه، أَنَّ نَاسًا مِنَ الأَنْصَارِ، سَأَلُوا رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَأَعْطَاهُمْ، ثُمَّ سَأَلُوهُ فَأَعْطَاهُمْ، حَتَّى نَفِدَ مَا عِنْدَهُ، فَقَالَ: مَا يَكُونُ عِنْدِي مِنْ خَيْرٍ فَلَنْ أَدَّخِرَهُ عَنْكُم، وَمَنْ يَسْتَعْفِفْ يُعِفَّهُ اللهُ، وَمَنْ يَسْتَغْنِ يُغْنِهِ اللهُ، وَمَنْ يَتَصَبَّرْ يُصَبِّرْهُ اللهُ، وَمَا أُعْطِيَ أَحَدٌ عَطَاءً خَيْرًا وَأَوْسَعَ مِنَ الصَّبْرِ
__________
أخرجه البخاري في: 24 كتاب الزكاة: 50 باب الاستعفاف عن المسئلة

627. హజ్రత్ అబూ సయీద్ ఖుదరీ (రదియల్లాహు అన్హు) కథనం:- కొందరు అన్సార్ ముస్లింలు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి వచ్చి కొంత ధనం అర్థించారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారికి ఇచ్చారు. కాని వారు మళ్ళీ అడిగారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) రెండోసారి కూడా ఇచ్చారు. ఇలా ఇస్తూపోయారు, చివరికి ఆయన దగ్గర ఉన్నదంతా హరించుకుపోయింది. అప్పుడు ఆయన ఇలా అన్నారు:

“నా దగ్గరున్న ధన సంపద (ఎంతైనా) మీ కివ్వడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు. మీకు ఇవ్వకుండా నేను ఏదీ దాచుకోను. కాని (ఒక విషయం గుర్తుంచుకోండి) దానం అడగకుండా ఉండే వాడికి అల్లాహ్ అలాంటి పరిస్థితి రాకుండా కాపాడుతాడు. నిరపేక్షా వైఖరిని అవలంబించేవాడికి అల్లాహ్ అక్కరలేనంతగా ప్రసాదిస్తాడు. సహనం వహించే వాడికి సహనశక్తి ప్రసాదిస్తాడు. (దైవానుగ్రహాలలో) సహనానికి మించిన మహాభాగ్యం లేదు.”

[సహీహ్ బుఖారీ: 24వ ప్రకరణం – జకాత్, 50వ అధ్యాయం – అల్ ఇస్తిఫాఫీ అనిల్ మఅల]

628 – حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: اللهُمَّ ارْزُقْ آلَ مُحَمَّدٍ قُوتًا
__________
أخرجه البخاري في: 81 كتاب الرقاق: 17 باب كيف كان عيش النبي صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ وأصحابه وتخليهم من الدنيا

628. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రార్థించారు: “అల్లాహ్! ముహమ్మద్ సంతతికి అవసరమయిన మేరకు (మాత్రమే) ఆహారం తదితర సామగ్రిని అనుగ్రహించు.”

[సహీహ్ బుఖారీ : 81వ ప్రకరణం – రిఖాఖ్, 17వ అధ్యాయం – కైఫకాన ఐషున్నబీ (సల్లల్లాహు అలైహి వసల్లం) వ అహోబిహీ వతఖిల్లీహిమ్ మినద్దున్యా]

629 – حديث أَنَسِ بْنِ مَالِكٍ رضي الله عنه، قَالَ: كُنْتُ أَمْشِي مَعَ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، وَعَلَيْهِ بُرْدٌ نَجْرَانِيٌّ غَلِيظُ الْحَاشِيَةِ، فَأَدْرَكَهُ أَعْرَابِيٌّ، فَجَذَبَهُ جَذْبَةً شَدِيدَةً، حَتَّى نَظَرْتُ إِلَى صَفْحَةِ عَاتِقِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَدْ أَثَّرَتْ بهِ حَاشِيَةُ الرِّدَاءِ مِنْ شِدَّةِ جَذْبَتِهِ، ثُمَّ قَالَ: مُرْ لِي مِنْ مَالِ اللهِ الَّذِي عِنْدَكَ؛ فَالْتَفَتَ إِلَيْهِ، فَضَحِكَ، ثُمَّ أَمَرَ لَهُ بِعَطَاءٍ
__________
أخرجه البخاري في: 57 كتاب فرض الخمس: 19 باب ما كان النبي صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يعطي المؤلفة قلوبهم وغيرهم من الخمس ونحوه

629. హజ్రత్ అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) కథనం:- నేనొక రోజు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)తో కలసి నడుస్తున్నాను. ఆ సమయంలో ఆయన నజ్రాన్ కండువా కప్పుకొని ఉన్నారు. దాని అంచులు లావుగా ఉండేవి. దారిలో ఓ పల్లెవాసి కలసి దైవప్రవక్త (కండువా)ను పట్టి గట్టిగా లాగాడు. అలా గట్టిగా లాగడం వల్ల ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) భుజం మీద కండువా అంచులు గీరుకుపోయి ఆ ప్రదేశం కందిపోయింది. పల్లెవాసి అంతటితో ఊరుకోక (కటువుగా) మాట్లాడుతూ “మీకు అల్లాహ్ ఇచ్చిన సొమ్ములో నుంచి నాక్కొంచెం ఇప్పించలేరా!” అని అన్నాడు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అతని వైపు తిరిగి చూసి చిరునవ్వు నవ్వుతూ అతనికి కొంత ధనం ఇవ్వమని (అనుచరుల్ని) ఆజ్ఞాపించారు.

[సహీహ్ బుఖారీ : 57వ ప్రకరణం – ఫర్జుల్ ఖమ్స్, 19వ అధ్యాయం – మాకానన్నబియ్యి …..]

630 – حديث الْمِسْوَرِ بْنِ مَخْرَمَةَ رضي الله عنه، قَالَ: قَسَمَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ أَقْبِيَةً، وَلَمْ يُعْطِ مَخْرَمَةَ مِنْهَا شَيْئًا، فَقَالَ مَخْرَمَةُ: يَا بُنَيِّ انْطَلِقْ بِنَا إِلَى رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فَانْطَلَقْتُ مَعَهُ، فَقَالَ: ادْخُلْ فَادْعُهُ لِي، قَالَ فَدَعَوْتُهُ لَهُ فَخَرَجَ إِلَيْهِ وَعَلَيْهِ قَبَاءٌ مِنْهَا، فَقَالَ: خَبَأْنَا هذَا لَكَ قَالَ: فَنَظَرَ إِلَيْهِ، فَقَالَ: رَضِيَ مَخْرَمَةُ
__________
أخرجه البخاري في: 51 كتاب الهبة: 19 باب كيف يقبض العبد والمتاع

630. హజ్రత్ మిస్వర్ బిన్ మఖ్రమా (రదియల్లాహు అన్హు) కథనం:- ఓసారి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చొక్కాలు పంచారు. (మా నాన్న) మఖ్రమా (రదియల్లాహు అన్హు)కు ఒక్క చొక్కా కూడా దొరకలేదు. అప్పుడాయన నాతో “బాబూ! నువ్వు నాతో పాటు రా. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దగ్గరికి వెళ్తాం” అని అన్నారు. నేను ఆయన వెంట వెళ్ళాను. అక్కడకు చేరుకున్న తరువాత “నువ్వు లోపలికి వెళ్ళి ఆయన్ని పిలుచుకురా” అన్నారు ఆయన. నేను వెళ్ళి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు విషయం తెలియజేశాను. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) బయటికి వచ్చారు. ఆ సమయంలో ఆయన పంచిన చొక్కాలలో ఒక చొక్కా ధరించి ఉన్నారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మా నాన్నతో “ఇదిగో నేనీ చొక్కా నీ కోసం దాచి ఉంచాను” అని అన్నారు. ( ఆ చొక్కా ఇచ్చిన తరువాత) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మఖ్రమా (రదియల్లాహు అన్హు) వైపు చూసి, “మఖ్రమా ఇప్పుడు సంతోషంగా ఉన్నాడు” అని అన్నారు.

[సహీహ్ బుఖారీ : 51వ ప్రకరణం – హిబా, 19వ అధ్యాయం – కైఫ యుఖ్బజుల్ అబ్దు వల్ మతావు]

631 – حديث سَعْدِ بْنِ أَبِي وَقَّاصٍ، قَالَ: أَعْطَى رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ رَهْطًا وَأَنَا جَالِسٌ فِيهِمْ، قَالَ: فَتَرَكَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ مِنْهُمْ رَجُلاً لَمْ يُعْطِهِ، وَهُوَ أَعْجَبُهُمْ إِلَيَّ، فَقُمْتُ إِلَى رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَسَارَرْتُهُ، فَقُلْتُ: مَا لَكَ عَنْ فُلاَنٍ وَاللهِ إِنِّي لأُرَاهُ مُؤْمِنًا قَالَ: أَوْ مُسْلِمًا قَالَ: فَسَكَتُّ قَلِيلاً؛ ثُمَّ غَلَبَنِي مَا أَعْلَمُ فِيهِ فَقُلْتُ: يَا رَسُولَ اللهِ مَا لَكَ عَنْ فُلاَنٍ وَاللهِ إِنِّي لأُرَاهُ مُؤْمِنًا قَالَ: أَوْ مُسْلِمًا قَالَ: فَسَكَتُّ قَلِيلاً، ثُمَّ غَلَبَنِي مَا أَعْلَمُ فِيهِ، فَقُلْتُ: يَا رَسُولَ اللهِ مَا لَكَ عَنْ فُلاَنٍ وَاللهِ إِنِّي لأُرَاهُ مُؤْمِنًا قَالَ: أَوْ مُسْلِمًا فَقَالَ: إِنِّي لأُعْطِي الرَّجُلَ، وَغَيْرُهُ أَحَبُّ إِلَيَّ مِنْهُ، خَشْيَةَ أَنْ يُكَبَّ فِي النَّارِ عَلَى وَجْهِهِ
__________
أخرجه البخاري في: 24 كتاب الزكاة: 53 باب قول الله تعالى (لا يسألون الناس إلحافًا)
إِعطاء المؤلفة قلوبهم على الإسلام وتصبر من قوى إِيمانه

631. హజ్రత్ సాద్ బిన్ అబీ వఖ్కాస్ (రదియల్లాహు అన్హు) కథనం:- నేను ఓ రోజు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధిలో కూర్చొని ఉండగా ఆయన కొందరికి (పైకం) పంచి బెట్టారు. అయితే నా దృష్టిలో అందరికంటే మంచివాడైన ఒక వ్యక్తికి మాత్రం ఏమీ ఇవ్వలేదు. అప్పుడు నేను లేచి దైవప్రవక్త( సల్లల్లాహు అలైహి వసల్లం) సమీపానికెళ్ళి “ఫలానా వ్యక్తి విషయంలో మీరిలా ఎందుకు ప్రవర్తించారు? అల్లాహ్ సాక్షి! నా దృష్టిలో మాత్రం అతను మోమిన్ (విశ్వాసి)” అని అన్నాను మామూలు ధోరణిలో. దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “ఏమిటి మోమినా? ముస్లిమా?” అని అడిగారు.

దాంతో నేను కాస్సేపు మౌనంగా ఉండిపోయాను. కాని అతడ్ని గురించి నేనెరిగిన (మంచి) విషయాలు నన్ను మరోసారి నోరు విప్పడానికి ప్రేరేపించాయి. “దైవప్రవక్తా! ఫలానా వ్యక్తికి మీరు ఎందుకు ఇవ్వలేదో నాకర్థం కావడం లేదు. అల్లాహ్ సాక్షి! నా దృష్టిలో అతను (మంచి) విశ్వాసి” అని అన్నాను నేను మళ్ళీ. దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “మోమినా, ముస్లిమా?” అని అడిగారు తిరిగి. ఈ మాట విని నేను కాస్సేపు మిన్నకుండిపోయాను. కాని అతడ్ని గురించి నేనెరిగిన విషయాలు నన్ను మరోసారి అడిగేందుకు పురిగొల్పాయి. “దైవప్రవక్తా! మీరు ఫలానా వ్యక్తికి ఎందుకివ్వలేదు. అల్లాహ్ సాక్షి! నా దృష్టిలో అతను (మంచి) విశ్వాసి” అని అన్నాను నేను మళ్ళీ. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తిరిగి “అతను మోమినా లేక ముస్లిమా?” అని అడిగారు. ఆ తరువాత ఆయన ఇలా ప్రవచించారు.

“నేను కొన్ని సందర్భాలలో ఒక వ్యక్తికి ఇస్తాను. అయితే (నా నుండి ఏదీ అందుకోని) మరో వ్యక్తి నా కెంతో ప్రియమైన వాడయి ఉంటాడు. నేనిలా (ఒకనికిచ్చి మరొకనికి ఇవ్వకపోతే) అతను ఇస్లాం ధర్మాన్నే వదలి పెట్టవచ్చు. లేదా అతని నోట వెలువడరాని మాట వెలువడి (తత్పర్యవసానంగా) అతడ్ని బొక్క బోర్లా నరకంలో పడవేయవచ్చు. ఈ భయం వల్లనే నేనిలాంటి వైఖరి అవలంబించవలసి వచ్చింది.”

[సహీహ్ బుఖారీ : 24వ ప్రకరణం – జకాత్, 53వ అధ్యాయం – ఖౌలిల్లాహి తాలా (లాయస్ అలూనన్నాసిల్ హాఫా)]

632 – حديث أَنَسِ بْنِ مَالِكٍ، أَنَّ نَاسًا مِنَ الأَنْصَارِ قَالُوا لِرَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، حِينَ أَفَاءَ اللهُ عَلَى رَسُولِهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ مِنْ أَمْوَالِ هَوَازِنَ مَا أَفَاءَ فَطَفِقَ يُعْطِي رِجَالاً مِنْ قُرَيْشٍ الْمَائَةَ مِنَ الإبِلِ؛ فَقَالوا: يَغْفِرُ اللهُ لِرَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يُعْطِي قُرَيْشًا وَيَدَعُنَا، وَسُيُوفُنَا تَقْطُرُ مِنْ دِمَائِهِمْ قَالَ أَنَسٌ: فَحُدِّثَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ بِمَقَالتِهِمْ، فَأَرْسَلَ إِلَى الأَنْصَارِ [ص:227] فَجَمَعَهُمْ فِي قُبَّةٍ مِنْ أَدَمٍ، وَلَمْ يَدْعُ مَعَهُمْ أَحَدًا غَيْرَهُمْ، فَلَمَّا اجْتَمَعُوا جَاءَهُمْ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَقَالَ: مَا كَانَ حَدِيثٌ بَلَغَنِي عَنْكُمْ قَالَ لَهُ فُقَهَاؤُهُمْ: أَمَّا ذَوو آرَائِنَا يَا رَسُولَ اللهِ فَلَمْ يَقُولوا شَيْئًا، وَأَمَّا أُنَاسٌ مِنَّا حَدِيثَةٌ أَسْنَانُهُمْ، فَقَالُوا: يَغْفِرُ اللهُ لِرَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يُعْطِي قرَيْشًا وَيَتْرُكُ الأَنْصَارَ، وَسُيُوفُنا تَقْطُرُ مِنْ دِمَائِهِمْ فَقَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: إِنِّي لأُعْطِي رِجَالاً حَدِيثٌ عَهْدُهُمْ بِكُفْرٍ، أَمَا تَرْضَوْنَ أَنْ يَذْهَبَ النَّاسُ بِالأَمْوَالِ، وَتَرْجِعُونَ إِلَى رِحالِكُمْ بِرَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فَوَاللهِ مَا تَنْقَلِبُونَ بِهِ، خَيْرٌ مِمَّا يَنْقَلِبُونَ بِهِ قَالُوا: بَلَى يَا رَسُولَ اللهِ قَدْ رَضِينَا فَقَالَ لَهُمْ: إِنَّكُمْ سَتَرَوْنَ بَعْدِي أَثَرَةً شَدِيدَةً، فَاصْبرُوا حَتَّى تَلْقَوُا اللهَ وَرَسُولَهُ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ عَلَى الْحَوْضِ قَالَ أَنَسٌ: فَلَمْ نَصْبِرْ
__________
أخرجه البخاري في: 57 كتاب فرض الخمس: 19 باب ما كان النبي صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يعطي المؤلفة قلوبهم وغيرهم من الخمس ونحوه

632. హజ్రత్ అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) కథనం:- యుద్ధం చేయకుండానే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు అల్లాహ్ హవాజన్ తెగవారి సిరిసంపదల నుండి పెద్ద ఎత్తున యుద్ధ ప్రాప్తిని ఇప్పించాడు. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఖురైష్ తెగకు చెందిన కొందరు ముస్లింలకు వందేసి ఒంటెలు ఇవ్వసాగారు. అది చూసి కొందరు అన్సార్ ముస్లింలు (అసూయపడుతూ) “అల్లాహ్ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను క్షమించుగాక! ఈయనగారు ఖురైషీయులకు మాత్రం (విశాల హృదయంతో యుద్ధప్రాప్తిని పుష్కలంగా) ఇచ్చి వేస్తున్నారు. కాని మా ఖడ్గాల నుండి ఖురైషీయుల రక్తం ఇంకా కారుతున్నప్పటికీ మమ్మల్ని విస్మరించారు” అని అన్నారు.

కొందరు వీరి మాటల్ని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెవిలో వేశారు. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అన్సార్ ముస్లింలను పిలిపించి ఒక తోలు గుడారంలో వారిని సమావేశపరిచారు. ఆ సమావేశానికి అన్సార్ ముస్లింలను తప్ప మరెవరినీ పిలువలేదు.

అందరూ సమావేశమయిన తరువాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి దగ్గరకు వచ్చి “మీరేదో అన్నారని విన్నాను. ఏమిటి సంగతి?” అని అడిగారు. వారిలో కొందరు విజ్ఞులు ముందుకు వచ్చి ఇలా అన్నారు: “దైవప్రవక్తా! మాలో బుద్ధిజ్ఞానం కలవాళ్ళెవరూ ఎలాంటి మాట అనలేదు. కొందరు కుర్రవాళ్ళు (ముందూ వెనుకా ఆలోచించకుండా వాగుతూ) “అల్లాహ్ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను క్షమించుగాక, ఈయనగారు ఖురైషీయులకు మాత్రం (విశాల మనస్సుతో యుద్ధ సొత్తు పుష్కలంగా) ఇచ్చ చేస్తున్నారు. కాని మా ఖడ్గాల నుండి ఖురైషీయుల రక్తం ఇంకా కారుతున్నప్పటికీ మమ్మల్ని విస్మరించారు’ అని అన్నారు”.

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ మాటలు విని ఇలా అన్నారు: “నిజమే. మొన్నటి దాకా అవిశ్వాసులుగా ఉండి ఈ మధ్యనే కొత్తగా ఇస్లాం స్వీకరించిన వారికి నేను (యుద్ధప్రాప్తి) ఇస్తున్నమాట నిజమే. కాని ఇతరులు ధనధాన్యాలు (నా నుండి) తీసికెళ్ళితే, మీరు ఏకంగా నన్నే మీ ఇండ్లకు తీసికెళ్ళడం మీకు సంతోషంగా లేదా? (వినండి) దైవసాక్షిగా చెబుతున్నాను. ఇతరులు (నా నుండి) తమ ఇండ్లకు తీసికెళ్ళే డబ్బూ దస్కం కంటే మీరు తీసికెళ్ళే ఐశ్వర్యం ఎంతో విలువైనది.” అన్సార్ ముస్లింలు ఈ మాటలు విని “ఎందుకు లేదు? ఇది మాకందరికీ తప్పకుండా సంతోషకరమైన విషయమే” అన్నారు (ముక్తకంఠంతో).

ఆ తరువాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా చెప్పారు: “(అన్సార్ ముస్లింలారా!) నా (ఇహలోక నిష్క్రమణ) తరువాత సమీప భవిష్యత్తులో మీరు ఇంతకంటే కఠినమైన సంఘటనల్ని ఎదుర్కోవలసి వస్తుంది. అప్పుడు మీకంటే ఇతరులకు అత్యధిక ప్రాధాన్యత నివ్వడం జరుగుతుంది. అలాంటి సందర్భాలలో మీరు అల్లాహ్ దగ్గరకు చేరుకొని, కౌసర్ సరస్సు దగ్గర దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను కలుసుకునే వరకూ సహనంతో వ్యవహరించండి.”

అయితే మేము ఆ మేరకు సహనం పాటించలేకపోయాము’ అని హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) అభిప్రాయపడ్డారు.

[సహీహ్ బుఖారీ : 57వ ప్రకరణం – ఫర్జుల్ ఖమ్స్, 19వ అధ్యాయం-మాకాన నబీ (సల్లల్లాహు అలైహి వసల్లం) యాతియల్ ముఅల్లఫతిల్ ఖులూబుహుమ్ వ గైరుహుమ్ మినల్ ఖమ్సి నహ్ విహీ]

633 – حديث أَنَسٍ رضي الله عنه، قَالَ: دَعَا النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ الأَنْصَارَ، فَقَالَ: هَلْ فِيكُمْ أَحَدٌ مِنْ غَيْرِكُمْ قَالوا: لاَ، إِلاَّ ابْنُ أُخْتٍ لَنَا؛ فَقَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: ابْنُ أُخْتِ الْقَوْمِ مِنْهُمْ
__________
أخرجه البخاري في: 61 كتاب المناقب: 14 باب ابن أخت القوم ومولى القوم منهم

633. హజ్రత్ అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అన్సార్ ముస్లింలను పిలిపించారు. (అందరూ వచ్చిన తరువాత) “మీలో అన్సారేతర ముస్లింలెవరైనా ఉన్నారా?” అని అడిగారు. దానికి వారు “మా మేనల్లుడు ఒకరు తప్ప మరెవరూ లేరు” అని తెలిపారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ మాట విని “ఒక కుటుంబానికి చెందిన మేనల్లుడు కూడా వారికి చెందిన వ్యక్తిగానే పరిగణించబడతాడు” అని అన్నారు.

[సహీహ్ బుఖారీ : 61వ ప్రకరణం – మనాఖిబ్; 14వ అధ్యాయం – ఇబ్ను ఉఖిల్ భౌమి ప మౌలిల్ భౌమి మినుమ్ ]

634 – حديث أَنَسٍ رضي الله عنه، قَالَ: قَالَتِ الأَنْصَارُ يَوْمَ فَتْحِ مَكَّةَ، وأَعْطَى قُرَيْشًا: [ص:228] وَاللهِ إِنَّ هذَا لَهُوَ الْعَجَبُ، إِنَّ سُيُوفَنَا تَقْطُرُ مِنْ دِمَاءِ قُرَيْشٍ، وَغَنَائِمُنَا تَرَدُّ عَلَيْهِمْ فَبَلَغَ ذلِكَ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَدَعَا الأَنْصَارَ قَالَ، فَقَالَ: مَا الَّذِي بَلَغَنِي عَنْكُمْ وَكَانُوا لاَ يَكْذِبُونَ فَقَالُوا: هُوَ الَّذِي بَلَغَكَ قَالَ: أَوَ لاَ تَرْضَوْنَ أَنْ يَرْجِعَ النَّاسُ بِالْغَنَائِمِ إِلَى بيُوتِهِمْ، وَتَرْجِعُونَ بِرَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ إِلَى بُيُوتِكُمْ لَوْ سَلَكَتِ الأَنْصَارُ وَادِيًا أَوْ شِعْبًا لَسَلَكْتُ وَادِيَ الأَنْصَارِ أَوْ شِعْبَهمْ
__________
أخرجه البخاري في: 63 كتاب مناقب الأنصار: 1 باب مناقب الأنصار

634. హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం:- మక్కా జయించబడిన కాలంలో (యుద్ధప్రాప్తిలో నుంచి) ఖురైషీయులకు ఇవ్వబడగా అప్పుడు అన్సారులలో కొందరు (కుర్రవాళ్ళు అసూయతో ఉడికిపోతూ) “దైవసాక్షి! మా ఖడ్గాల నుండి ఖురైషీయుల రక్తం ఇంకా కారుతూనే ఉంది. అయినా మేము సాధించిన యుద్ధప్రాప్తి ఖురైషీయులకు పంచబడుతోంది. ఎంత విచిత్రకరమైన విషయమిది!!” అని అన్నారు.ఈ సంగతి తెలిసి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వెంటనే అన్సార్ ముస్లింలను పిలిపించారు. అప్పుడు ఆయన “మీ గురించి నేనొక మాట విన్నాను. అది నిజమేనా?” అని అడిగారు. వారు అబద్దం చెప్పే మనుషులు కారు. అందువల్ల వారు (నిజాన్ని ఒప్పుకుంటూ) “మీరు విన్న సంగతి నిజమే” అన్నారు. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు:

“ఇతరులు తమ ఇండ్లకు యుద్ధసొత్తు తీసికెళ్తే మీరు ఏకంగా నన్నే మీ ఇండ్లకు తీసికెళ్ళడం మీకు సంతోషకరమైన విషయం కాదా? వినండి, అన్సార్ ముస్లింలు ఏఏ లోయల్లో, కనుమల్లో నడిస్తే నేను కూడా ఆయా లోయల్లో, కనుమల్లో నడుస్తాను.”

[సహీహ్ బుఖారీ : 63వ ప్రకరణం – మనాఖిబుల్ అన్సార్, 1వ అధ్యాయం – మనాఖిబుల్ అన్సార్]

635 – حديث أَنَسٍ رضي الله عنه، قَالَ: لَمَّا كَانَ يَوْمُ حُنَيْنٍ الْتَقَى هَوَازِنُ، وَمَعَ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ عَشَرَةُ آلاَفٍ وَالطُّلَقَاءُ فَأَدْبَرُوا قَالَ: يَا مَعْشَرَ الأَنْصَارِ قَالُوا: لَبَّيْكَ يَا رَسُولَ اللهِ وَسَعْدَيْكَ لَبَّيْكَ، نَحْنُ بَيْنَ يَدَيْكَ فَنَزَلَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَقَالَ: أَنَا عَبْدُ اللهِ وَرَسُولُهُ فَانْهَزَمَ الْمُشْرِكُونَ، فَأَعْطَى الطُّلَقَاءَ وَالْمُهَاجِرِينَ وَلَمْ يُعْطِ الأَنْصَارَ شَيْئًا فَقَالُوا؛ فَدَعَاهُمْ فَأَدْخَلَهُمْ فِي قُبَّةٍ، فَقَالَ: أَمَا تَرْضَوْنَ أَنْ يَذْهَبَ النَّاسُ بِالشَّاةِ وَالْبَعِيرِ وَتَذْهَبُونَ بِرَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فَقَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: لَوْ سَلَكَ النَّاسُ وَادِيًا وَسَلَكَتِ الأَنْصَارُ شِعْبًا لاَخْتَرْتُ شِعْبَ الأَنْصَارِ
__________
أخرجه البخاري في: 64 كتاب المغازي: 56 باب غزوة الطائف

635. హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం:- హునైన్ యుద్ధంలో హవాజిన్ తెగవాళ్ళు పోటీకి దిగినప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వెంట పదివేల మంది యోధులు ఉన్నారు. వారితో పాటు మక్కా పట్టణానికి చెందిన నవ ముస్లింలు కూడా ఉన్నారు. అయితే ఆ తరువాత వారు వెనక్కి పారిపోయారు. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అన్సార్ ముస్లింలను పిలుస్తూ “అన్సార్ ముస్లింలారా!” అని అన్నారు. దానికి వారు “మేం ఇక్కడ ఉన్నాం దైవప్రవక్తా! మీకు సహాయపడేందుకు మీ దగ్గరే సర్వసన్నద్ధంగా ఉన్నాం” అని అన్నారు. ఆ తరువాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన వాహనం మీద నుంచి క్రింద దిగి “నేను అల్లాహ్ దాసుడ్ని, ఆయన సందేశహరుడ్ని” అని అన్నారు. చివరికి (ఆ యుద్ధంలో) బహుదైవారాధకులు ఓడిపోయారు.

ఆ తరువాత దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) మక్కా నవ ముస్లింలకు, ముహాజిర్ ముస్లింలకు ( పెద్ద ఎత్తున) యుద్ధప్రాప్తిని పంచి పెట్టారు. అయితే అన్సార్ ముస్లింలకు ఏమీ ఇవ్వలేదు. అప్పుడు అన్సార్ ముస్లింలు (కొందరు అసంతృప్తిని వెలిబుచ్చే) మాటలు పలికారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారిని పిలిపించి ఒక గుడారంలో సమావేశపరిచారు. ఆ తరువాత వారిని సంబోధిస్తూ ఇలా అన్నారు: “ఇతరులు ఒంటెలు, మేకలు తీసికెళ్తే, మీరు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను తీసికెళ్ళతారు. ఇది మీకు సంతోషకరం కాదా! ఇతరులు ఒక లోయలో నడుస్తూ, అన్సార్ ముస్లింలు (కఠినమైన) కొండ కనుమల్లో నడుస్తూ ఉంటే, నేను అన్సారులు నడిచే కనుమ దారినే ఎంచుకుంటాను.”

[సహీహ్ బుఖారీ : 64వ ప్రకరణం – మగాజి, 56వ అధ్యాయం – గజ్వతుత్తాయెఫ్]

636 – حديث عَبْدِ اللهِ بْنِ زَيْدِ بْنِ عَاصِمٍ، قَالَ: لَمَّا أَفَاءَ اللهُ عَلَى رَسُولِهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَوْمَ حُنَيْنٍ قَسَمَ فِي النَّاسِ فِي الْمُؤَلَّفَةِ قَلُوبُهُمْ وَلَمْ يُعْطِ الأَنْصَارَ شَيْئًا؛ فَكَأَنَّهُمْ وَجَدُوا، إِذْ لَمْ يُصِبْهُمْ مَا أَصَابَ النَّاسَ، فَخَطَبَهُمْ فَقَالَ: يَا مَعْشَرَ الأَنْصَارِ أَلَمْ أَجِدْكُمْ ضُلاَّلاً فَهَدَاكُمُ اللهُ بِي، وَكُنْتُمْ مُتَفَرِّقِينَ فَأَلَّفَكُمُ اللهُ بِي، وَعَالَةً فَأَغْنَاكُمُ الله بِي كلَّمَا قَالَ شَيْئًا، قَالُوا: اللهُ وَرَسُولُهُ أَمَنُّ؛ قَالَ: مَا يَمْنَعُكُمْ أَنْ تُجِيبُوا رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ، كُلَّمَا قَالَ شَيْئًا، قَالُوا: اللهُ وَرَسُولُهُ أَمَنُّ قَالَ: لَوْ شِئتُمْ قُلْتُمْ: جِئْتَنَا كَذَا وَكَذَا، أَتَرْضَوْنَ أَنْ يَذْهَبَ النَّاسُ بِالشَّاةِ وَالْبَعِيرِ وَتَذْهَبُونَ بِالنَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ إِلَى رِحَالِكُمْ لَوْلاَ الْهِجْرَةُ لَكُنْتُ امْرءًا مِنَ الأَنْصَارِ، وَلَوْ سَلَكَ النَّاسُ وَادِيًا وَشِعْبًا لَسَلَكْتُ وَادِيَ الأَنْصَارِ وَشِعْبَهَا، الأَنْصَارُ شِعَارٌ وَالنَّاسُ دِثَارٌ، إِنَّكُمْ سَتَلْقَوْنَ بَعْدِي أَثَرَةً فَاصْبِرُوا حَتَّى تَلْقَوْنِي عَلَى الْحَوْضِ
__________
أخرجه البخاري في: 64 كتاب المغازي: 56 باب غزوة الطائف

636. హజ్రత్ అబ్దుల్లా బిన్ జైద్ బిన్ ఆసిమ్ (రదియల్లాహు అన్హు) కథనం:- హునైన్ యుద్ధంలో అల్లాహ్ తన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు (పెద్ద ఎత్తున) యుద్ధప్రాప్తిని ప్రసాదించాడు. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నవ ముస్లింల (మక్కా ఖురైషీయుల) హృదయాలను ఆకట్టుకోవడానికి వారికి యుద్ధప్రాప్తిని పంచి పెట్టారు. కాని అన్సార్ ముస్లింలకు ఏమీ ఇవ్వలేదు. ఇతరులకు లభించినది తమకు లభించకపోవడంతో అన్సార్ ముస్లింలు ఎంతో బాధపడ్డారు. అప్పుడు దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) వారిని సంబోధిస్తూ ఇలా అన్నారు:

“అన్సార్ ముస్లింలారా! మీరు ఒకప్పుడు మార్గభ్రష్టులయి ఉన్నారు; అల్లాహ్ మీకు నా ద్వారా సన్మార్గం చూపలేదా? మీరు విభిన్న వర్గాలుగా చీలి ఉన్నారు; అల్లాహ్ నా ద్వారా మీలో పరస్పరం ఐకమత్యం, ప్రేమాభిమానాలు కలిగించలేదా? మీరు పేదవాళ్ళుగా ఉండేవాళ్ళు; అల్లాహ్ నా మూలంగా మిమ్మల్ని ఐశ్వర్యవంతుల్ని చేశాడు. ఇది యదార్థం కాదా?”

దైవప్రవక (సల్లల్లాహు అలైహి వసల్లం) అడిగిన ప్రతి మాటకు అన్సార్ ముస్లింలు సమాధానమిస్తూ, “ఆ అల్లాహ్, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మా కెంతో మేలు చేశారు” అని అన్నారు.

ఆ తరువాత దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: “మీరు కావాలనుకుంటే – మీరు మా దగ్గరికి ఇలాంటి (గత్యంతరం లేని) పరిస్థితుల్లో వచ్చి మా పంచన చేరారు – అని కూడా అనవచ్చు. ఇతరులు (తమ ఇండ్లకు) ఒంటెలు, మేకలు తీసికెళ్తుంనే మీరు ఏకంగా దైవప్రవక్తనే మీ ఇండ్లకు తీసికెళ్ళడం మీకు సంతోషకరమైన విషయం కాదా? హిజ్రత్ (వలస) గనక లేకుండా ఉండినట్లయితే నేను అన్సార్ వర్గంలోనే ఒక సభ్యుడినై ఉండేవాడ్ని. ఇతరులు ఒక లోయలో (లేదా) ఒక కనుమ గుండా నడుస్తూ, అన్సార్ ముస్లింలు మరో లోయలో (లేక) మరో కనుమ గుండా నడుస్తుంటే, నేను అన్నారులు నడిచే లోయలో (లేక) కనుమ గుండానే నడుస్తాను. అన్సార్ ముస్లిం దేహానికి అంటి ఉండే వస్త్రం లాంటివాడు. ఇతరులు పైన ధరించే వస్త్రం (ఉత్తరీయం) లాంటి వాళ్ళు. గుర్తుంచుకోండి. నేను ఇహలోకం వీడిపోయిన తరువాత మీరు అనేక ఆటుపోటులకు గురికావలసి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో మీరు చనిపోయి ‘కౌసర్’ కోనేటి దగ్గర నన్ను కలుసుకునే వరకు సహనం వహించాలి.”

[సహీహ్ బుఖారీ : 64వ ప్రకరణం – మగాజి, 56వ అధ్యాయం – గజ్వతిత్తాయెఫ్ ]

637 – حديث عَبْدِ اللهِ بْنِ مَسْعُودٍ رضي الله عنه، قَالَ: لَمَّا كَانَ يَوْمُ حُنَيْنٍ آثَرَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ أُنَاسًا فِي الْقِسْمَةِ فَأَعْطَى الأَقْرَعَ بْنَ حَابِسٍ مِائَةً مِنَ الإِبِلِ، وَأَعْطَى عُيَيْنَةَ مِثْلَ ذلِكَ، وَأَعْطَى أُنَاسًا مِنْ أَشْرَافِ الْعَرَبِ، فَآثَرَهُمْ يَوْمَئِذٍ فِي الْقِسْمَةِ؛ قَالَ رَجُلٌ: وَاللهِ إِنَّ هذِهِ الْقِسْمَةَ مَا عُدِلَ فِيهَا، وَمَا أُرِيدَ بِهَا وَجْهُ اللهِ فَقُلْتُ: وَاللهِ لأُخْبِرَنَّ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، [ص:230] فَأَتَيْتهُ فَأَخْبَرْتُهُ، فَقَالَ: فَمَنْ يَعْدِلُ إِذَا لَمْ يَعْدِلِ اللهُ وَرَسُولُهُ رَحِمَ اللهُ مُوسَى، قَدْ أُوذِيَ بِأَكْثَرَ مِنْ هذَا فَصَبَرَ
__________
أخرجه البخاري في: 57 كتاب فرض الخمس: 19 باب ما كان النبي صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يعطي المؤلفة قلوبهم وغيرهم من الخمس ونحوه

637. హజ్రత్ అబ్దుల్లా బిన్ మసూద్ (రదియల్లాహు అన్హు) కథనం:- హునైన్ యుద్ధం ముగిసిన తరువాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) యుద్ధప్రాప్తి పంచుతూ కొందరికి ఇతరుల కంటే ఎక్కువ ప్రాధాన్యత నిచ్చారు. అఖ్రా బిన్ హాబిస్ (రదియల్లాహు అన్హు)కు వంద ఒంటెలు ఇచ్చారు. ఉయీనా (రదియల్లాహు అన్హు)కు కూడా వంద ఒంటెలు ఇచ్చారు. ఇతర అరబ్ నాయకులకు కూడా భారీ ఎత్తున సంపద ప్రసాదించారు. ఈ విధంగా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) యుద్ధప్రాప్తి పంపిణీ విషయంలో వారికి అత్యధిక ప్రాధాన్యత నిచ్చినట్లు అన్నించింది. దాంతో ఒకతను తీవ్రంగా స్పందిస్తూ “అల్లాహ్ సాక్షి! ఈ పంపిణీలో న్యాయాన్ని పాటించలేదు. అల్లాహ్ ప్రసన్నతను కూడా దృష్టిలో పెట్టు కోలేదు” అని అన్నాడు.

నేనప్పుడు “ఈ మాటను నేను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు తప్పకుండా చేరవేస్తాను” అని అన్నాను. అన్నట్లుగానే నేను (వెంటనే) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి వెళ్ళి ఆయనకీ విషయం తెలియజేశాను. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ మాట విని “అల్లాహ్, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)లే న్యాయం పాటించకపోతే ఇంకెవరు పాటిస్తారు? అల్లాహ్ హజ్రత్ మూసా (అలైహిస్సలాం)ను కరుణించుగాక. ఆయనకు ఇంతకంటే కూడా ఎక్కువ బాధలు కలిగించారు. అయినప్పటికీ ఆయన సహనం వహించారు” అని అన్నారు.

[సహీహ్ బుఖారీ : 57వ ప్రకరణం – ఫర్జుల్ ఖమ్స్, 19వ అధ్యాయం – మాకానన్నబీ (సల్లల్లాహు అలైహి వసల్లం) యూతిల్ ముఅల్లఫతిల్ ఖులూబుహుమ్…]

638 – حديث جَابِرِ بْنِ عَبْدِ اللهِ، قَالَ: بَيْنَمَا رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَقْسِمُ غَنيمَةً بِالْجِعْرَانَةِ، إِذْ قَال لَهُ رَجُلٌ: اعْدِلْ فَقَالَ لَهُ: شَقِيتُ إِنْ لَمْ أَعْدِلْ
__________
أخرجه البخاري في: 57 كتاب فرض الخمس: 15 باب ومن الدليل على أن الخمس لنوائب المسلمين

638. హజ్రత్ జాబిర్ బిన్ అబ్దుల్లా (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఓసారి ‘జారానా’ అనే చోట యుద్ధప్రాప్తిని (యోధులకు) పంచుతుంటే ఒక వ్యక్తి ముందుకు వచ్చి “న్యాయం పాటించండి” అని అన్నాడు. దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నొచ్చుకుంటూ “నువ్వొట్టి దౌర్భాగ్యుడిలా ఉన్నావు. నేను న్యాయం పాటించకపోతే ఇంకెవరు పాటిస్తారు?” * అని అన్నారు.

[సహీహ్ బుఖారీ : 57వ ప్రకరణం – ఫర్జుల్ ఖమ్స్, 15వ అధ్యాయం – వమినద్దలీలి అలా అనిల్ ఖమ్స్ అన్నవాయి బిల్ ముస్లిమీన్]

* దీనికి మరో అర్ధం కూడా ఇలా ఉండవచ్చు. నీవు నన్ను దైవప్రవక్తగా విశ్వసించి ఉండికూడా నేను అన్యాయానికి పాల్పడతానని ఎలా అనుకున్నావు? ఒకవేళ నిజంగా నేను అన్యాయపరుణ్ణి అయి ఉంటే నీకు నా దగ్గర ఎలాంటి స్థానమే ఉండదు. అప్పుడు నీ అంతటి దౌర్భాగ్యుడు మరొకడు ఉండడు.

639 – حديث أَبِي سَعِيدٍ الْخُدْرِيِّ رضي الله عنه، قَالَ: بَعَثَ عَلِيٌّ رضي الله عنه إِلَى النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ بِذُهَيْبَةٍ فَقَسَمَهَا بَيْنَ الأَرْبَعَةِ، الأَقْرَعِ بْنِ حَابِسٍ الْحَنْظَلِيِّ ثُمَّ الْمُجَاشِعِيِّ، وَعُيَيْنَةَ بْنِ بَدْرٍ الْفَزَارِيِّ، وَزَيْدٍ الطَّائِيِّ، ثُمَّ أَحَدِ بَنِي نَبْهَانَ، وَعَلْقَمَةَ بْنِ عُلاَثَةَ الْعَامِرِيِّ، ثُمَّ أَحَدِ بَنِي كِلاَبٍ؛ فَغَضِبَتْ قُرَيْشٌ وَالأَنْصَارُ قَالُوا: يُعْطِي صَنَادِيد أَهْل نَجْدٍ وَيَدَعُنَا قَالَ: إِنَّمَا أَتأَلَّفُهُمْ فَأَقْبَلَ رَجُلٌ غَائِرُ الْعَيْنَيْنِ، مُشْرِفُ الْوَجْنَتَيْنِ، نَاتِىءُ الْجَبِينِ، كَثُّ اللِّحْيَةِ، مَحْلُوقٌ، فَقَالَ: اتَّقِ اللهَ يَا مُحَمَّدُ فَقَالَ: مَنْ يُطِعِ اللهَ إِذَا عَصَيْتُ أَيَأْمنُنِي اللهُ عَلَى أَهْلِ الأَرْضِ وَلاَ تَأْمَنُونَنِي فَسأَلَهُ رَجُلٌ قَتْلَهُ، أَحْسِبُهُ خَالِدَ بْنَ الْوَلِيدِ، فَمَنَعَهُ فَلَمَّا وَلَّى، قَالَ: إَنَّ مِنْ ضِئْضِئِي هذَا أَوْ فِي عَقِبَ هذَا قَوْمٌ يَقْرَءُونَ الْقُرْآنَ [ص:231] لاَ يُجَاوِزُ حَنَاجِرَهُمْ، يَمْرُقُونَ مِنَ الدِّينِ مُرُوقَ السَّهْمِ مِنَ الرَّمِيَّةِ، يَقْتُلُونَ أَهْلَ الإِسْلاَمِ، وَيَدعُونَ أَهْلَ الأَوْثَانِ، لَئِنْ أَنَا أَدْرَكْتُهُمْ لأَقْتُلَنَّهُمْ قَتْلَ عَادٍ
__________
أخرجه البخاري في: 6 كتاب الأنبياء: 6 باب قول الله تعالى (وإلى عاد أخاهم هودا)

639. హజ్రత్ అబూసయీద్ ఖుదరీ (రదియల్లాహు అన్హు) కథనం:- హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి కొంత బంగారం పంపారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దాన్ని నలుగురు వ్యక్తులకు పంచి పెట్టారు. ఆ నలుగురు : (1) అఖ్రా బిన్ హాబిస్ అల్ హన్జలి (రదియల్లాహు అన్హు). ఈయన ఆ తర్వాత మజాషియి అనే పేరుతో పిలువబడ్డారు; (2) ఉయీనా బిన్ బదర్ ఫజారీ (రదియల్లాహు అన్హు), (3) జైద్ తాయి (రదియల్లాహు అన్హు), ఈయన ఆ తరువాత బనీ నబ్ హాన్ (తెగ)లో కలసిపోయారు, (4) అల్ఖమ బిన్ అలాసా ఆమిరీ (రదియల్లాహు అన్హు), ఈయన ఆ తరువాత బనీ కిలాబ్ (తెగ)లో కలసిపోయారు. అప్పుడు ఖురైషీయులు, అన్సారీలు ముఖం చిట్టించుకొని “మీరు నజద్ వారికి ఇచ్చి మమ్మల్ని విస్మరించారు” అని అన్నారు.

దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సమాధానమిస్తూ “వారి హృదయాల్లో ఇస్లాం పట్ల (మరింత) ప్రేమాభిమానాలు జనిస్తాయన్న ఆశతోనే నేను వారికి ఇచ్చాను” అని అన్నారు. అయితే మరొక వ్యక్తి ముందుకు వచ్చాడు, అతని కళ్ళు లోపలికి పీక్కుపోయి ఉన్నాయి, చెంపలు ఉబ్బెత్తుగా ఉన్నాయి, ఎత్తైన నుదురు, గుబురు గడ్డం, తల పూర్తిగా గొరిగి ఉంది. అతను ముందుకు వచ్చి “ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)! కాస్త అల్లాహ్ కి భయపడండి” అని అన్నాడు. దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ఆ మాటకు స్పందిస్తూ ఇలా అన్నారు:

“ఏమిటీ, నేనే అల్లాహ్ కి విధేయత చూపకపోతే మరెవరు చూపుతారు? అల్లాహ్ నన్ను భూవాసుల కోసం అమీన్ (నిజాయితీపరుని)గా చేసి పంపాడు. నువ్వు నన్ను అమీన్ (నిజాయితిపరుని)గా విశ్వసించడం లేదా?”

ఆ తరువాత ఒక వ్యక్తి, నా దృష్టిలో ఖాలిద్ బిన్ వలీద్ (రదియల్లాహు అన్హు) లేచి అతడ్ని హతమార్చడానికి తనను అనుమతించవలసిందిగా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను అడిగారు. అయితే దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ఆయన్ని ఆ పని నుండి వారించారు.

చివరికి ఆ వ్యక్తి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోగానే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: “ఇతని సంతతి నుండి కొందరు పుడతారు” లేక దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు. “ఇతని (మరణం) తరువాత కొందరు పుడ్తారు. వారు ఖుర్ఆన్ పఠిస్తారు గాని, అది వారి కంఠం నుంచి క్రిందికి (హృదయంలోకి) దిగదు. వేట జంతువు (శరీరం) నుండి బాణం బయటకి దూసుకుపోయినట్లు వీరు (సత్య) ధర్మం నుండి బయటికి వెళ్ళిపోతారు. (అంటే ధర్మభ్రష్టులయి పోతారన్నమాట). అంతేకాదు, ఇస్లాంను ప్రేమించే ముస్లింలను సంహరిస్తారు. విగ్రహారాధకుల జోలికి మాత్రం పోరు. వీరు గనక నా చేతికి చిక్కితే ఆద్ జాతి హతమార్చబడినట్లు నేను వారిని (నామరూపాల్లేకుండా) సంహరిస్తాను.”

[సహీహ్ బుఖారీ : 60వ ప్రకరణం – అంబియా, 6వ అధ్యాయం – ఖౌలిల్లాహితాలా వ ఇలా ఆదిన్ ఇఖాహుమ్ హూద్]

640 – حديث أَبِي سَعِيدٍ الْخُدْرِيِّ، قَالَ: بَعَثَ عَلِيُّ بْنُ أَبِي طَالِبٍ رضي الله عنه، إِلَى رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، مِنَ الْيَمَنِ بِذُهَيْبَةٍ فِي أَدِيمٍ مَقْرُوظٍ؛ لَمْ تُحَصَّلْ مِنْ تُرَابِهَا، قَالَ: فَقَسَمَهَا بَيْنَ أَرْبَعَةِ نَفَرٍ: بَيْنَ عُيَيْنَةَ بْنِ بَدْرٍ، وَأَقْرعَ بْنِ حَابِسٍ، وَزَيْدِ الْخَيْلِ، وَالرَّابِعُ إِمَّا عَلْقَمَةُ وَإِمَّا عَامِرُ بْنُ الطُّفَيْلِ فَقَالَ رَجُلٌ مِنْ أَصْحَابِهِ: كُنَّا نَحْنُ أَحَقَّ بِهذَا مِنْ هؤُلاَءِ قَالَ: فَبَلَغَ ذلِكَ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَقَالَ: أَلاَ تَأْمَنُونِي وَأَنَا أَمِينُ مَنْ فِي السَّمَاءِ، يَأْتِينِي خَبَرُ السَّمَاءِ صَبَاحًا وَمَسَاءً قَالَ: فَقَامَ رَجُلٌ غَائِرُ الْعَيْنَيْنِ، مُشْرِفُ الْوَجْنَتَيْنِ، نَاشِزُ الْجَبْهَةِ، كَثُّ اللِّحْيَةِ، مَحْلُوقُ الرَّأْسِ، مُشَمَّرُ الإِزَارِ؛ فَقَالَ: يَا رَسُولَ اللهِ اتَّقِ اللهَ قَالَ: وَيْلَكَ أَوَلَسْتُ أَحَقُّ أَهْلِ الأَرْضِ أَنْ يَتَّقِيَ اللهَ قَالَ: ثُمَّ وَلَّى الرَجُلُ
قَالَ خَالِدُ بْنُ الْوَلِيدِ: يَا رَسُولَ اللهِ أَلاَ أَضْرِبُ عُنُقَهُ قَالَ: لا، لَعَلَّهُ أَنْ يَكُونَ يُصَلِّي فَقَالَ خَالِدٌ: وَكَمْ مِنْ مُصَلٍّ يَقُولُ بِلِسَانِهِ مَا لَيْسَ فِي قَلْبِهِ قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: [ص:232] إِنِّي لَمْ أُومَرْ أَنْ أَنْقُبَ قُلُوبَ النَّاسِ، وَلاَ أَشُقَّ بُطُونَهُمْ قَالَ: ثُمَّ نَظَرَ إِلَيْهِ، وَهُوَ مُقَفٍّ، فَقَالَ: إِنَّهُ يَخْرُجُ مِنْ ضِئْضِئِي هذَا قَوْمٌ يَتْلُونَ كِتَابَ اللهِ رَطْبًا، لاَ يُجَاوِزُ حَنَاجِرَهُمْ، يَمْرُقُونَ مِنَ الدِّينِ كَمَا يَمْرُقُ السَّهْمُ مِنَ الرَّمِيَّةِ وَأَظُنُّهُ قَالَ: لَئِنْ أَدْرَكْتُهُمْ لأَقْتُلَنَّهُمْ قَتْلَ ثَمُودَ
__________
أخرجه البخاري في: 64 كتاب المغازي: 61 باب بعث علي ابن أبي طالب عليه السلام وخالد بن الوليد رضي الله عنه إلى اليمن قبل حجة الوداع

640. హజ్రత్ అబూ సయీద్ ఖుదరీ కథనం:- హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) యమన్ ప్రాంతం నుండి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి తుమ్మ బెరడుతో రంగరించబడిన తోలు సంచిలో కొంత బంగారం పంపించారు. అదింకా మట్టి నుండి వేరు చేయబడని (ముడి) ఖనిజం. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దాన్ని నలుగురు వ్యక్తులకు పంచారు. వారు (1) ఉయీనా బిన్ బదర్ (రదియల్లాహు అన్హు), (2) అఖ్రా బిన్ హాబిస్ (రదియల్లాహు అన్హు), (3) జైద్ అల్ ఖీల్ (రదియల్లాహు అన్హు) (4) నాల్గవ వ్యక్తి అల్ ఖమా (రదియల్లాహు అన్హు) లేదా ఆమిర్ బిన్ తుఫైల్. అప్పుడు ప్రవక్త అనుయాయుల్లో ఒకతను (ఈ పంపిణీ వ్యవహారాన్ని విమర్శిస్తూ) “ఈ బంగారం స్వీకరించడానికి వారి కంటే మేమే ఎక్కువ హక్కుదారులం” అని అన్నాడు.

నేనీ మాటను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు చేరవేశాను. . దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అది విని (ఆ వ్యక్తిని ఉద్దేశించి) “నీవు నన్ను అమీన్ (నిజాయితీపరుని)గా భావించడం లేదా? ఆకాశాలలో ఉన్న దాని విషయంలో నేను అమీన్ (నిజాయితీపరుడ్ని)ని. నా దగ్గరకు ఉదయం, సాయంత్రం ఆకాశం నుండి ‘వహీ’ వస్తుంది ” అని అన్నారు.

ఆ తర్వాత మరొక వ్యక్తి లేచాడు. అతని కళ్ళు రెండూ లోపలికి పీక్కుపోయి ఉన్నాయి. చెంపలు వాచి ఉన్నాయి. నుదురు ఎత్తుగా ఉంది. గడ్డం గుబురుగా ఉంది. తల నున్నగా గొరిగి ఉంది. లుంగీ ఎత్తి కట్టుకుని ఉన్నాడు. అతను లేచి “దైవప్రవక్తా! కాస్త అల్లాహ్ కి భయపడండి” అన్నాడు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ మాటలకు (తీవ్రంగా స్పందిస్తూ) “నీ పాడుగాను! భూవాసులందరికెల్లా అల్లాహ్ కు భయపడే అర్హత నాకే ఎక్కువవుందన్న సంగతి నీకు తెలియదా?” అని అన్నారు. ఈ మాటలు విన్న తర్వాత ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు.

ఆ సందర్భంలో హజ్రత్ ఖాలిద్ బిన్ వలీద్ (రదియల్లాహు అన్హు) కల్పించుకుంటూ “దైవప్రవక్తా! నేనితడ్ని చంపేయనా?” అని అన్నారు. “వద్దు. అతను ఎప్పుడయినా నమాజు చేస్తూ ఉండవచ్చు” అన్నారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం). “నమాజు చేసే వారిలో చాలా మంది తమ అంతరంగాల్లో లేని విషయాలను తమ నోట వెలిబుచ్చుతుంటారు” అని అన్నారు హజ్రత్ ఖాలిద్ (రదియల్లాహు అన్హు). “(నిజమే కావచ్చు). కాని ప్రజల హృదయాల్లోని మాటల్ని త్రవ్వి తీయమని లేక వారి పొట్టలు చీల్చి చూడమని నాకు ఆజ్ఞ ఇవ్వబడలేదు” అన్నారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం).

తరువాత ఆయన ఆ వ్యక్తి వైపు చూస్తే అతను వెనుతిరిగి వెళ్తూ ఉండటం కన్పించింది. అప్పుడాయన ఇలా అన్నారు. “ఆ వ్యక్తి సంతతి నుండి (ధర్మం పట్ల ఏ మాత్రం ఆసక్తి లేనివారు) జన్మిస్తారు. వారు దివ్య ఖుర్ఆన్ని బాగానే పఠిస్తారు. కాని అది వారి కంఠం నుంచి క్రిందికి దిగదు. వేట జంతువు (దేహం) నుండి బాణం దూసుకుపోయినట్లు వారు ధర్మం నుండి బయటకి వెళ్ళిపోతారు.”

హజ్రత్ అబూసయీద్ (రదియల్లాహు అన్హు) ఇలా అంటున్నారు:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విషయం కూడా చెప్పి ఉన్నారని నేను భావిస్తున్నాను. “వీరు గనక నా చేతికి చిక్కితే సమూద్ జాతి హతమార్చబడినట్లు వీరిని నేను (నామరూపాల్లేకుండా) సంహరిస్తాను.”

(సహీహ్ బుఖారీ : 64వ ప్రకరణం – మగాజి, 61వ అధ్యాయం – బాసి అలీబిన్ అబీతాలిబ్ అలైహిస్సలాము వ ఖాలిదిబ్నిల్ వలీద్ (రదియల్లాహు అన్హు) ఇలల్ యమని ఖబల్ హజ్జతుల్ విదా]

641 – حديث أَبِي سَعِيدٍ الْخُدْرِيِّ رضي الله عنه، قَالَ: سَمِعْتُ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، يَقُولُ: يَخْرُجُ فِيكُمْ قَوْمٌ تَحْقِرُونَ صَلاَتَكُمْ مَعَ صَلاَتِهِمْ، وَصِيَامَكُمْ مَعَ صِيَامِهِمْ، وَعَمَلَكُمْ مَعَ عَمَلِهِمْ، وَيَقْرَءُونَ الْقُرْآنَ، لاَ يُجَاوِزُ حَنَاجِرَهُمْ، يَمْرُقُونَ مِنَ الدِّينِ كَمَا يَمْرُقُ السَّهْمُ مِنَ الرَّمِيَّةِ، يَنْظُرُ فِي النَّصْلِ فَلاَ يَرَى شَيْئًا، وَيَنْظُرُ فِي الْقِدْحِ فَلاَ يَرَى شَيئًا، وَيَيْظُرُ فِي الرِّيشِ فَلاَ يَرَى شَيْئًا، وَيَتَمَارَى فِي الْفُوقِ
__________
أخرجه البخاري في: 66 كتاب فضائِل القرآن: 36 باب من رايا بقراءة أو تأكل به أو فخر به

641. హజ్రత్ అబూసయీద్ ఖుదరీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: “మీలో నుంచి ఒక వర్గం (ఇస్లాం నుండి) బయటికి వెళ్తుంది. మీ నమాజులను వారి నమాజుల కంటే, మీ ఉపవాసాలను వారి ఉపవాసాల కంటే, మీ సత్కార్యాలను వారి సత్కార్యాల కంటే మీరు అల్పంగా భావిస్తారు. వారు ఖుర్ఆన్ పఠిస్తారు గాని, అది వారి కంఠం నుండి క్రిందకు దిగదు (అంటే వారు దాన్ని అర్థం చేసుకుంటూ చదవరు). వేట జంతువు (శరీరం) నుండి బాణం బయటికి పోయినట్లు వారు ధర్మం నుండి బయటికి వెళ్తారు (మార్గభ్రష్టులవుతారు). వేటగాడు ఓసారి బాణం మొన పైకి దృష్టి సారిస్తాడు. అక్కడ అతనికేమీ కన్పించదు, తర్వాత బాణం కర్రను చూస్తాడు. అక్కడ కూడా ఏమీ కన్పించదు. తిరిగి అతడు బాణం ఈకల్ని చూస్తాడు. అక్కడా ఏమీ కన్పించదు. అయితే బాణం చివరి భాగాన ఏదో (రక్తపు మరక) ఉన్నట్లు అనుమానం కలుగుతుంది.”

(సహీహ్ బుఖారీ : 66వ ప్రకరణం – ఫజాయెలె ఖుర్ఆన్, 36వ అధ్యాయం – మర్రాయా బిఖిర్ అతిల్ ఖుర్ఆని ఔతాకుల్ బిహీ అవ్ ఫేఖ్రబ]

642 – حديث أَبِي سَعِيدٍ الْخُدْرِيِّ رضي الله عنه، قَالَ: بَيْنَمَا نَحْنُ عِنْدَ رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، [ص:233] وَهُوَ يَقْسِمُ قَسْمًا، أَتَاهُ ذُو الْخُوَيْصِرَةِ، وَهُوَ رَجُلٌ مِنْ بَنِي تَمِيمٍ فَقَالَ: يَا رَسُولَ اللهِ اعْدِلْ فَقَالَ: وَيْلَكَ وَمَنْ يَعْدِلُ إِذَا لَم أَعْدِلْ قَدْ خِبْتَ وَخَسِرْتَ إِنْ لَمْ أَكُنْ أَعْدِلُ فَقَالَ عُمَرُ: يَا رَسُولَ اللهِ ائْذَنْ لِي فِيهِ، فَأَضْرِبَ عُنَقَهُ فَقَالَ: دَعْهُ، فَإِنَّ لَهُ أَصْحَابًا يَحْقِرُ أَحَدُكُمْ صَلاَتَهُ مَعَ صَلاَتِهِمْ، وَصِيَامهُ مَعَ صِيَامِهِمْ، يَقْرَءُونَ الْقُرْآنَ، لاَ يُجَاوِزُ تَرَاقِيَهُمْ، يَمْرُقُونَ مِنَ الدِّينِ كَمَا يَمْرُقُ السَّهْمُ مِنَ الرَّمِيَّة، يُنْظَرُ إِلَى نَصْلِهِ، فَلاَ يُوجَدُ فِيهِ شَيْءٌ؛ ثُمَّ يُنْظَرُ إِلَى رِصافِهِ، فَلاَ يُوجَدُ فِيهِ شَيْءٌ؛ ثُمَّ يُنْظَرُ إِلَى نَضِيِّهِ، وَهُوَ قِدْحُهُ، فَلاَ يُوجَدُ فِيه شَيْءٌ، ثُمَّ يُنْظَرُ إِلَى قُذَذِهِ، فَلاَ يُوجَدُ فِيهِ شَيْءٌ؛ قَدْ سَبَقَ الفَرْثَ وَالدَّمَ؛ آيَتُهُمْ رَجُلٌ أَسْوَدُ، إِحْدَى عَضُدَيْهِ مِثْلُ ثَدْيِ الْمَرْأَةِ، أَو مِثْلُ الْبَضْعَةِ تَدَرْدَرُ وَيَخْرُجُونَ عَلَى حِينِ فُرْقَةٍ مِنَ النَّاسِ
قَالَ أَبُو سَعِيدٍ: فَأَشْهَدُ أَنِّي سَمِعْتُ هذَا الْحَدِيثَ مِنْ رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، وَأَشْهَدُ أَنَّ [ص:234] عَلِيَّ بْنَ أَبِي طَالِبٍ قَاتَلَهُمْ، وَأَنَا مَعَهُ، فَأَمَرَ بِذلِكَ الرَّجُلِ، فَالْتُمِسَ فَأُتِيَ بِهِ، حَتَّى نَظَرْتُ إِلَيْهِ عَلَى نَعْتِ النَبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ الَّذِي نَعَتَهُ
__________
أخرجه البخاري في: 61 كتاب المناقب: 25 باب علامات النبوة في الإسلام

642. హజ్రత్ అబూసయీద్ ఖుదరీ (రదియల్లాహు అన్హు) కథనం:- మేమొకసారి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధిలో ఉండగా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కొంత ధనం పంచిపెట్టసాగారు. అంతలో బనీతమీమ్ తెగకు చెందిన జుల్ ఖువైసర్ అనే వ్యక్తి దగ్గరికి వచ్చి “దైవప్రవక్తా! న్యాయంగా వ్యవహరించండి” అని అన్నాడు. దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) (తీవ్రంగా స్పందిస్తూ) “నీ పాడుగాను! నేనే న్యాయంగా వ్యవహరించకపోతే ఇంకెవరు న్యాయంగా వ్యవహరిస్తారు? నేను గనక న్యాయంగా వ్యవహరించక అన్యాయానికి పాల్పడితే నువ్వు కూడా పరాభవానికి లోనయ్యేవాడివే”.

ఆ సందర్భంలో హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) లేచి “దైవప్రవక్తా! నాకు అనుమతి నివ్వండి, ఇతని తల ఖండించి వేస్తాను” అని అన్నారు. దానికి దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా అన్నారు: “పోనివ్వండి. అతని లాంటి వాళ్ళు కొందరు (రాబోయే కాలంలో) ఉండవచ్చు. మీ నమాజులు, ఉపవాసాలు వారి నమాజులు, ఉపవాసాల కంటే అల్పమైనవిగా భావిస్తారు. వారు ఖుర్ఆన్ పఠిస్తారు గాని, అది వారి కంఠం నుండి క్రిందికి దిగదు. (అంటే దాని ప్రభావం వారి జీవితంపై ఏ మాత్రం పడదు). వేటగాడి నుండి బాణం వెడలినట్లే వారు ధర్మం నుండి బయటికి వెళ్తారు. (అంటే మార్గభ్రష్టులవుతారు).

వేటగాడు ఓసారి బాణం ములికి వైపు దృష్టి సారిస్తాడు. అక్కడ అతనికేమీ కన్పించదు. తర్వాత అతడు బాణం కర్రను చూస్తాడు. అక్కడ కూడ ఏమి కన్పించదు. తర్వాత అతడు బాణం ఈకల్ని చూస్తాడు. అక్కడా ఏమీ కన్పించదు. నిజానికి ఆ బాణం వేట జంతువు రక్తమాంసాల గుండా బయటికి వస్తుంది (అందువల్ల ఆ బాణానికి రక్తపు మరకలు అంటి ఉండాలి). వారిని కనుక్కోవడానికి కొన్ని గుర్తులున్నాయి. వారిలో ఒక నల్లవాడు ఉంటాడు. అతని భుజమొకటి స్త్రీ వక్షోజంలా లేక మాంసపు ముద్దలా కదులుతూ ఉంటుంది. (ముస్లిం) ప్రజానీకంలో విభేదాలు పొడసూపి చీలిపోయినపుడు వారు బయల్పడతారు.”

హజ్రత్ అబూసయీద్ (రదియల్లాహు అన్హు) ఇలా అంటున్నారు:- అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను, నేనీ హదీసును స్వయంగా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నోట విన్నాను. హజ్రత్ అలీ(రదియల్లాహు అన్హు) ఆ మనుషులతో యుద్ధం చేశారని కూడా నేను సాక్ష్యమిస్తున్నాను. అప్పుడు నేను ఆయనతో పాటే ఉన్నాను. (యుద్ధం ముగిసిన తరువాత) అతడ్ని వెతకమని ఆయన ఆజ్ఞాపించారు. అతడ్ని వెతికి పట్టుకొచ్చిన తరువాత నేనతడ్ని (ఆపాదమస్తకం) చూశాను. అచ్చం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పినట్లే అతని రూపు ఆకారాలు ఉన్నాయి.

[సహీహ్ బుఖారీ : 61వ ప్రకరణం – మనాఖిబ్, 25వ అధ్యాయం – అలామాతున్నబువ్వతి ఫిల్ ఇస్లాం)

643 – حديث عَلِيٍّ رضي الله عنه، قَالَ: إِذَا حَدَّثْتُكُمْ عَنْ رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَلأَنْ أَخِرَّ مِنَ السَّمَاءِ أَحَبُّ إِلَيَّ مِنْ أَنْ أَكْذِبَ عَلَيْهِ، وَإِذَا حدَّثْتُكُمْ فِيمَا بَيْنِي وَبَيْنَكُمْ، فَإِنَّ الْحَرْبَ خَدْعَةٌ سَمِعْتُ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، يَقُولُ: يَأْتِي فِي آخِرِ الزَّمَانِ قَوْمٌ، حُدَثَاءُ الأَسْنَانِ، سُفَهَاءُ الأَحْلاَمِ، يَقُولُونَ مِنْ خَيْرِ قَوْلِ الْبَرِيَّةِ، يَمْرُقُونَ مِنَ الإِسْلاَمِ كَمَا يَمْرُقُ السَّهْمُ مِنَ الرَّمِيَّةِ، لاَ يُجَاوِزُ إِيمَانُهُمْ حَنَاجِرَهُمْ، فَأَيْنَمَا لَقِيتُمُوهُمْ فَاقْتُلُوهُمْ، فَإِنَّ قَتْلَهُمْ أَجْرٌ لِمَنْ قَتَلَهُمْ يَوْمَ الْقِيَامَةِ
__________
أخرجه البخاري في: 61 كتاب المناقب: 25 باب علامات النبوة في الإسلام

643. హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) కథనం:- నేను మీకు ఎప్పుడైనా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచనం విన్పించాలంటే ఎంతో భయమేస్తుంది. ప్రవక్త ప్రవచనం పేరుతో ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం)కు అసత్య ప్రవచనం ఆపాదించడం కంటే నేను ఆకాశం నుండి అమాంతం నేలమీద పడిపోవడమే నాకెంతో ఇష్టం. అయితే మన పరస్పర సంబంధాలను గురించి మాత్రం ఒక విషయం గుర్తుంచుకోవాలి. యుద్ధంలో వ్యూహ రచన చేయబడుతుంది. ‘ఉద్దేశ్యపూర్వకంగా కొన్ని విషయాలు బహిర్గతం చేయబడవు. అంతగా అవసరమనుకుంటే వాటిని మరో విధంగా – పరోక్షంగా – ప్రస్తావించవలసి వస్తుంది.

నేను దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) నోట ఈ ప్రవచనం విన్నాను – “అంత్యకాలంలో కొందరు పుట్టుకొస్తారు; వారు నవయువకులు, అల్పబుద్ధి గలవారై ఉంటారు. వారు పైకి ఎంతో తియ్యటి మాటలు చెబుతారు. కాని (వారు ధర్మవ్యతిరేకులు) వేట జంతువు (శరీరం) నుండి బాణం బయటికి పోయినట్లుగానే వారు దైవధర్మం వదలి బయటికి వెళ్ళిపోతారు. వారి విశ్వాసం వారి కంఠాల నుండి క్రిందికి దిగదు. అందువల్ల అలాంటివారు ఎక్కడ కన్పిస్తే అక్కడ మీరు వాళ్ళని హతమార్చండి. వారిని హతమార్చడం ప్రళయదినాన పుణ్యఫలానికి కారణభూతమవుతుంది.”

[సహీహ్ బుఖారీ : 61వ ప్రకరణం – మనాఖిబ్, 25వ అధ్యాయం – అలామాతున్నబువ్వత్ ఫిల్ ఇస్లాం]

644 – حديث سَهْلِ بْنِ حُنَيْفٍ عَنْ يُسَيْرِ بْنِ عَمْرِو، قَالَ: قُلْتُ لِسَهْلِ بْنِ حُنَيْفٍ: هَلْ سَمِعْتَ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ فِي الْخَوارِجِ شَيْئًا قَالَ: سَمِعْتُهُ يَقُولُ، وَأَهْوَى بِيَدِهِ [ص:235] قِبَلَ الْعِرَاقِ: يَخْرُجُ مِنْهُ قَوْمٌ يَقْرَءُونَ الْقُرْآنَ، لاَ يُجَاوِزُ تَرَاقِيَهُمْ، يَمْرُقُونَ مِنَ الإِسْلاَمِ مُرُوقَ السَّهْمِ مِنَ الرَّمِيَّةِ
__________
أخرجه البخاري في: 88 كتاب استتابة المرتدين: 7 باب من ترك قتال الخوارج للتألف، وأن لا ينفر الناس عنه

644. హజ్రత్ యుసీర్ బిన్ ఉమర్ (రహిమహుల్లాహ్) కథనం:- నేను హజ్రత్ సహెల్ బిన్ హునైఫ్ (రదియల్లాహు అన్హు)ని ఖార్జీలను గురించి అడుగుతూ, ‘మీరు ఖార్జీల విషయంలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నోట ఏదైనా ప్రవచనం విన్నారా?’ అన్నాను. దానికి హజ్రత్ సహెల్ (రదియల్లాహు అన్హు) సమాధానమిస్తూ, విన్నాను. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తమ చేతిని ఇరాఖ్ వైపు సూచిస్తూ ఇలా అన్నారు: “అటు నుండి ఒక వర్గం బయలుదేరుతుంది. వారు ఖుర్ఆన్ పఠిస్తారు గాని, అది వారి కంఠం నుండి క్రిందికి దిగదు. వేట జంతువు (శరీరం) నుండి బాణం బయటికి పోయినట్లే వారు దైవధర్మం వదలి బయటికి వెళ్ళిపోతారు.”

[సహీహ్ బుఖారీ : 88వ ప్రకరణం – ఇస్తితా బతిల్ ముర్తి దీన్, 7వ అధ్యాయం – మన్తరక ఖితాలల్ ఖవారిజ్]

645 – حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، قَالَ: كَانَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يُؤْتَى بِالتَّمْرِ عِنْدَ صِرَامِ النَّخْلِ؛ فَيَجِيءُ هذَا بِتَمْرِهِ، وَهذَا مِنْ تَمْرِهِ، حَتَّى يَصِيرَ عِنْدَهُ كَوْمًا مِنْ تَمْرٍ فَجَعَلَ الْحَسَنُ وَالْحُسَيْنُ يَلْعَبَانِ بِذلِكَ التَّمْرِ؛ فَأَخَذَ أَحَدُهُمَا تَمْرَةً فَجَعَلَهَا فِي فِيهِ، فَنَظَرَ إِلَيْهِ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فَأَخْرَجَهَا مِنْ فِيهِ، فَقَالَ: أَمَا عَلِمْتَ أَنَّ آلَ مُحَمَّدٍ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ لاَ يَأْكُلُونَ الصَّدَقَةَ
__________
أخرجه البخاري في: 24 كتاب الزكاة: 57 باب أخذ صدقة التمر عند صرام النخل

645. హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం:- ఖర్జూరాలు కోసే కాలంలో ప్రజలు (జకాత్ క్రింద) ఖర్జూర పండ్లు తీసుకొని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి వచ్చేవారు. ఒకరు ఒకటి, మరొకరు మరొకటి తీసుకొస్తారు. ఈ విధంగా పెద్ద ఎత్తున ఖర్జూర పండ్ల రాసి అవుతుంది. ఒకసారి హజ్రత్ హసన్ (రదియల్లాహు అన్హు) హజ్రత్ హుసైన్ (రదియల్లాహు అన్హు) అలాంటి ఖర్జూర పండ్లతో ఆడుకోసాగారు. అలా ఆడుకుంటూ వారిద్దరిలో ఒక బాలుడు ఓ ఖర్జూర పండు తీసుకొని నోట్లో వేసుకున్నాడు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అది చూసి వెంటనే ఆ పిల్లవాడి నోటి నుంచి దాన్ని బయటికి తీయించారు. ఆ తరువాత ఆయన ఆ బాలుడ్ని ఉద్దేశించి “ముహమ్మద్ కుటుంబీకులు సదఖా (దానం) వస్తువుల్ని తినరని నీకు తెలియదా?” అని అన్నారు.

[సహీహ్ బుఖారీ : 24వ ప్రకరణం – జకాత్, 57వ అధ్యాయం – అఖ్జి, సదఖతిత్తమర్ ఇన్దసిరామిన్నఖ్ల్]

646 – حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، عَنِ النَبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: إِنِّي لأَنْقَلِبُ إِلَى أَهْلِي فَأَجِدُ التَّمْرَةَ سَاقِطَةَ عَلَى فِرَاشِي فَأَرْفَعُهَا لآكُلَهَا، ثُمَّ أَخْشَى أَنْ تَكُونَ صَدَقَةً فَأُلْقِيَهَا
__________
أخرجه البخاري في: 45 كتاب اللقطة: 45 باب إذا وجد تمرة في الطريق

646. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:- “నేను ఇంటికెళ్ళి చూస్తే ఒక్కోసారి నా పడకమీద కొన్ని ఖర్జూరపండ్లు పడి ఉండటం కన్పిస్తుంది. నేను వాటిని తిందామని చేతిలోకి తీసుకుంటాను. కాని అవి సదఖాకు (దానానికి) సంబంధించిన వేమోనన్న భయంతో వాటిని తిరిగి అక్కడే పడవేస్తాను.”

[సహీహ్ బుఖారీ : 45వ ప్రకరణం – లుఖ్ తతా, 6వ అధ్యాయం – ఇజా వజద తమ్రతన్ ఫిత్తరీఖ్ ]

647 – حديث أَنَسٍ رضي الله عنه، قَالَ: مَرَّ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ بِتَمْرَةٍ مَسْقُوطَةٍ، فَقَالَ: لَوْلاَ أَنْ تَكُونَ صَدَقَةً لأَكلْتُها
__________
أخرجه البخاري في: 34 كتاب البيوع: 4 باب ما يتنزه من الشبهات

647. హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం:- ఒకసారి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు దారిలో ఓ ఖర్జూర పండు పడి ఉండటం కన్పించింది. ఆయన దాన్ని చూసి “ఇది దానానికి సంబంధించిన పండు కాదని తెలిస్తే నేను దీన్ని నిరభ్యంతరంగా తింటాను” అని అన్నారు.

[సహీహ్ బుఖారీ : 34వ ప్రకరణం – అల్ బుయూ, 4వ అధ్యాయం – మాయత నజ్జహూ మినష్షుబహాత్)

648 – حديث أَنَسٍ رضي الله عنه، أَنَّ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ أُتِيَ بِلَحْمٍ تُصُدِّقَ بِهِ عَلَى بَرِيرَةَ، فَقَالَ: هُوَ عَلَيْهَا صَدَقَةٌ، وَهُوَ لَنَا هَدِيَّةٌ
__________
أخرجه البخاري في: 24 كتاب الزكاة: 62 باب إذا تحولت الصدقة

648. హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం:- హజ్రత్ బరీరా (రదియల్లాహు అన్హు)కు దానంగా లభించిన మాంసం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు ఇవ్వబడింది. ఆ సందర్భంలో దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) మాట్లాడుతూ “ఈ మాంసం బరీరా (రదియల్లాహు అన్హు) కయితే దానమవుతుంది. కాని ఈ మాంసం (బరీరా రదియల్లాహు అన్హు మాకు సమర్పించినందున ఇది) మా కొరకు కానుకవుతుంది” అని అన్నారు.

[సహీహ్ బుఖారీ : 24వ ప్రకరణం – జకాత్, 62వ అధ్యాయం – ఇజా తహ్వలతిస్పదఖా]

649 – حديث أُمِّ عَطِيَّةَ الأَنْصَارِيَّةِ، قَالَتْ: دَخَلَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ عَلَى عَائِشَة، فَقَالَ: هَلْ عِنْدَكُمْ شَيْءٌ فَقَالَتْ: لاَ إِلاَّ شَيْءٌ بَعَثَتْ بِهِ إِلَيْنَا نُسَيْبَةُ مِنَ الشَّاةِ الَّتِي بَعَثْتَ بِهَا مِنَ الصَّدَقَةِ فَقَالَ: إِنَّهَا قَدْ بَلَغَتْ مَحِلَّهَا
__________
أخرجه البخاري في: 24 كتاب الزكاة: 62 باب إذا تحولت الصدقة

649. హజ్రత్ ఉమ్మె అతియా అన్సారియా (రదియల్లాహు అన్హా) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఓసారి విశ్వాసుల మాతృమూర్తి హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) ఇంటికి వచ్చి “నీ దగ్గర ఏదైనా తినటానికి ఉందా” అని అడిగారు. దానికామె “లేదండీ! అయితే కాస్తంత మేక మాంసం మటుకు ఉంది. ఇది మీరు నసీబా (ఉమ్మె అతియా)కు దానంగా పంపిన మాంసమే. దాన్ని ఆమె తిరిగి మనకే పంపింది” అని అన్నారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ మాట విని “దానం మటుకు తన స్థానానికి చేరుకున్నది” అన్నారు.

[సహీహ్ బుఖారీ : 24వ ప్రకరణం – జకాత్, 62వ అధ్యాయం – ఇజా తహ్వలతిస్సదఖా]

650 – حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، قَالَ: كَانَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، إِذَا أُتِيَ بِطَعَامٍ سَأَلَ عَنْهُ: أَهَدِيَّةٌ أَمْ صَدَقَةٌ فَإِنْ قِيلَ صَدَقَةٌ، قَالَ لأَصْحَابِهِ: كُلُوا، وَلَمْ يَأْكُلْ وَإِنْ قِيلَ هَدِيَّةٌ، ضَرَبَ بِيَدِهِ/ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَأَكَلَ مَعَهُمْ
__________
أخرجه البخاري في: 51 كتاب الهبة: 7 باب قبول الهدية

650. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు ఎవరైనా ఆహార పదార్థాలు సమర్పిస్తున్నప్పుడు “ఇది దానంగా ఇస్తున్నావా లేక కానుకగా ఇస్తున్నావా?” అని అడుగుతారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆ వ్యక్తిని. అతను గనక ఆ వస్తువుని దానంగా ఇస్తున్నానని చెబితే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన అనుచరుల్ని ఉద్దేశించి “దీన్ని మీరు తినండి” అనంటారు, ఆయన మాత్రం దాన్ని ముట్టరు. ఒకవేళ అతను ఆ వస్తువుని కానుకగా ఇస్తున్నానని అంటే మాత్రం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దాన్ని స్వీకరించి, ఇతరుల్ని కూడా కలుపుకొని తింటారు.

[సహీహ్ బుఖారీ :51వ ప్రకరణం – హిబా, 7వ అధ్యాయం -ఖుబూలిల్ హద్యా]

651 – حديث عَبْدِ اللهِ بْنِ أَبِي أَوْفَى، قَالَ: كَانَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، إِذَا أَتَاهُ قَوْمٌ بِصَدَقَتِهِمْ قَالَ: اللهُمَّ صَلِّ عَلَى آلِ فُلاَنٍ، فَأَتَاهُ أَبِي بِصَدَقَتِهِ، فَقَالَ: اللهُمَّ صَلِّ عَلَى آلِ أَبِي أَوْفَى
__________
أخرجه البخاري في: 24 كتاب الزكاة: 64 باب صلاة الإمام ودعائه لصاحب الصدقة

651. హజ్రత్ అబ్దుల్లా బిన్ అబూ ఔఫా (రదియల్లాహు అన్హు) కథనం:- ప్రజలు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధిలో ఏదైనా దానం సమర్పిస్తున్నప్పుడు, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారిని ఆశీర్వదిస్తూ “అల్లాహ్! ఫలానా కుటుంబంపై కారుణ్యం కురిపించు” అని ప్రార్థించేవారు. ఒకసారి మానాన్న అబూ ఔఫా (రదియల్లాహు అన్హు) దానం తెచ్చిస్తే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆయన్ని దీవిస్తూ “అల్లాహ్! అబూ ఔఫా (రదియల్లాహు అన్హు) సంతతి పై కారుణ్యం కురిపించు” అని ప్రార్థించారు.

(సహీహ్ బుఖారీ :24వ ప్రకరణం – జకాత్, 64వ అధ్యాయం – సలాతుల్ ఇమామి వ దుఆయిహీ లిసాహిబిస్సదఖా]

మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్) (Al-Lulu-wal-Marjaan) .