మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్) (Al-Lulu-wal-Marjaan) .
1వ అధ్యాయం – బాటసారి నమాజు, ప్రయాణావస్థలో నమాజు సంక్షిప్తీకరణ
398 – حديث عَائِشَةَ أُمِّ الْمُؤْمِنِينَ قَالَتْ: فَرَضَ اللهُ الصَّلاَةَ حِينَ فَرَضَهَا رَكْعَتَيْنِ رَكْعَتَيْنِ فِي الْحَضَرِ وَالسَّفَرِ، فَأُقِرَّتْ صَلاَةُ السَّفَرِ، وَزِيدَ فِي صَلاَةِ الْحَضَرِ
__________
أخرجه البخاري في: 8 كتاب الصلاة: 1 كيف فرضت الصلوات في الإسراء
398. విశ్వాసుల మాతృమూర్తి హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం:-
అల్లాహ్ (ప్రారంభంలో) నమాజు విధిగా చేయాలని నిర్ణయించినప్పుడు ప్రయాణావస్థలో ఉన్నా, లేకపోయినా రెండేసి రకాతులు విధిగా చేయాలని ఆదేశించాడు. అయితే ఆ తరువాత కొన్నాళ్ళకు ప్రయాణావస్థలో రకాతుల సంఖ్యను ఇదివరకటిలాగే యథాతథంగా ఉంచి, ప్రయాణావస్థలో లేనప్పుడు నిర్వర్తించవలసిన రకాతుల సంఖ్యను పెంచడం జరిగింది.
[సహీహ్ బుఖారీ : 8వ ప్రకరణం – సలాత్, 1వ అధ్యాయం – కైఫఫర్జియ తిస్సలాతు ఫిల్ ఇస్రా)
399 – حديث ابْنِ عُمَرَ عَنْ حَفْصِ بْنِ عَاصِمٍ قَالَ: حَدَّثَنَا ابْنُ عُمَرَ، فَقَالَ: صَحِبْتُ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فَلَمْ أَرَهُ يُسَبِّحُ فِي السَّفَرِ وَقَالَ اللهُ جَلَّ ذِكْرُهُ (لَقَدْ كَانَ لَكُمْ فِي رَسُولِ اللهِ أُسْوَةٌ حَسَنَةٌ)
__________
أخرجه البخاري في: 18 كتاب تقصير الصلاة: 11 باب من لم يتطوع في السفر دبر الصلاة وقبلها
399. హజ్రత్ హఫ్స్ బిన్ ఆసిమ్ (రహిమహుల్లాహ్) కథనం ప్రకారం హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ఇలా తెలియజేశారు:-
నేను (ఓసారి ప్రయాణంలో) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వెంట ఉన్నాను. ఆయన (ఈ) ప్రయాణంలో సున్నత్ నమాజులు చేస్తూ ఉండగా నేను చూడలేదు. కాగా; అల్లాహ్ ( ఖుర్ఆన్లో) “దైవప్రవక్త (జీవనసరళి)లో మీకొక చక్కని ఆదర్శం ఉంది” అని అన్నాడు. (33:21)
[సహీహ్ బుఖారీ : 18వ ప్రకరణం – తఫ్సీరుస్సలాత్, 11వ అధ్యాయం – మల్లమ్ యతతవ్వు ఫిస్సఫరి దుబుర సలవాత్)
400 – حديث أَنَسٍ رضي الله عنه، قَالَ: صَلَّيْتُ الظُّهْرَ مَعَ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ بِالْمَدِينَةِ أَرْبَعًا، وَبِذِي الْحُلَيْفَةِ رَكْعَتَيْنِ
__________
أخرجه البخاري في: 18 كتاب تقصير الصلاة: 5 باب يقصر إذا خرج من موضعه
400. హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం:-
నేను మదీనాలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వెనుక నాలుగు రకాతులు జుహర్ నమాజు చేశాను; ‘జుల్ హులైఫా’లో రెండు రకాతులు అసర్ నమాజు చేశాను.
[సహీహ్ బుఖారీ : 18వ ప్రకరణం – తఖ్సీరుస్సలాత్, 5వ అధ్యాయం – యఖ్ సురు ఇజా ఖరజ మిమ్మవుజూ…..]
401 – حديث أَنَسٍ، قَالَ خَرَجْنَا مَعَ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ مِنَ الْمَدِينَةِ إِلَى مَكَّةَ، فَكَانَ يُصَلِّي رَكْعَتَيْنِ رَكْعَتَيْنِ حَتَّى رَجَعْنَا إِلَى الْمَدِينَة
سَأَلَهُ يَحْيَى بْنُ أَبِي إِسْحقَ قَالَ: أَقَمْتُمْ بِمَكَّةَ شَيْئًا قَالَ أَقَمْنَا بِهَا عَشْرًا
__________
أخرجه البخاري في: 18 كتاب تقصير الصلاة: 1 باب ما جاء في التقصير وكم يقيم حتى يقصر
401. హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు)కథనం:-
మేమొకసారి దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) వెంట మదీనా నుండి మక్కాకు బయలుదేరాము. ఈ ప్రయాణంలో మేము (మక్కా నుండి) తిరిగి మదీనా చేరుకునే వరకు రెండేసి రకాతులు (మాత్రమే ఫర్జ్) నమాజ్ చేశాము. హజ్రత్ యహ్యా బిన్ అబూ ఇసఖ్ (రహిమహుల్లాహ్) ఈ హదీసు విని “మరి మీరు మక్కాలో ఎన్ని రోజులు విడిది చేశారు?” అని అడిగారు. దానికి హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) “మక్కాలో మేము పది రోజులు ఉన్నాము” అని సమాధానమిచ్చారు.
(సహీహ్ బుఖారీ : 18వ ప్రకరణం – తఖ్సీరుస్సలాత్, 1వ అధ్యాయం – మాజా అఫిత్తఖ్సీరి వకమ్ యుఖీము హత్తాయుఖస్సిర్)
2వ అధ్యాయం – ‘మినా’లో ఖస్ర్ నమాజు చేయడం قصر الصلاة بمنى
402 – حديث عَبْدِ اللهِ بْنِ عُمَرَ، قَالَ: صَلَّيْتُ مَعَ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ بِمِنًى رَكْعَتَيْنِ، وَأَبِي بَكْرٍ وَعُمَرَ، وَمَعَ عُثْمَانَ صَدْرًا مِنْ إِمَارَتِهِ، ثُمَّ أَتَمَّهَا
__________
أخرجه البخاري في: 18 كتاب تقصير الصلاة: 2 باب الصلاة [ص:137] بمنى
402. హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం:-
నేను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)తో కలసి, హజ్రత్ అబూబకర్ (రదియల్లాహు అన్హు), హజ్రత్ ఉమర్ ఫారూఖ్ (రదియల్లాహు అన్హు)లతో కలసి కూడా ‘మినా’ (ప్రదేశం)లో రెండు రకాతులు (ఖస్ర్ నమాజు) చేశాను. హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) గారి పరిపాలనా కాలంలో కూడా ఆయనతో కలసి నేను (మినాలో) రెండు రకాతులు మాత్రమే (ఖస్ర్ నమాజు) చేశాను. అయితే ఆ తరువాత ఆయన (ప్రయాణావస్థలో) పూర్తిగా (నాలుగు రకాతులు) నమాజు చేయడం ప్రారంభించారు.
(సహీహ్ బుఖారీ : 18వ ప్రకరణం – తఫ్సీరుస్సలాత్, 2వ అధ్యాయం – అస్సలాతి బిమినా]
403 – حديث حَارِثَةَ بْنِ وَهْبٍ الْخُزَاعِيِّ رضي الله عنه قَالَ صَلَّى بِنَا النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، وَنَحْنُ أَكْثَرُ مَا كُنَّا قَطُّ وَامَنُهُ، بِمِنًى رَكْعَتَيْنِ
__________
أخرجه البخاري في: 25 كتاب الحج: 84 باب الصلاة بمنى
403. హజ్రత్ హారిస్ బిన్ వహబ్ ఖుజాయి (రదియల్లాహు అన్హు) కథనం:-
మేమొకసారి ‘మినా’లో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)తో కలసి రెండు రకాతులు ‘ఖస్ర్ నమాజు’ చేశాము. ఆనాడు మేము గతంలో కన్నా అత్యధిక సంఖ్యలో ఉన్నాము. పూర్వం కన్నా అప్పుడు ఎక్కువ శాంతియుత వాతావరణంలో ఉన్నాము.
[సహీహ్ బుఖారీ: 25వ ప్రకరణం – హజ్, 84వ అధ్యాయం – అస్సలాతి బిమినా]
3వ అధ్యాయం – వర్షం పడుతున్నప్పుడు ఇంట్లోనే నమాజు చేయవచ్చు
الصلاة في الرحال في المطر
404 – حديث ابْنِ عُمَرَ، أَنَّهُ أَذَّنَ بِالصَّلاَةِ فِي لَيْلَةٍ ذَاتِ بَرْدٍ وَرِيحِ، ثُمَّ قَالَ: أَلاَ صَلُّوا فِي الرِّحَالِ ثُمَّ قَالَ: إِنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ كَانَ يَأْمُرُ الْمُؤَذِّنَ، إِذَا كَانَتْ لَيْلَةٌ ذاتُ بَرْدٍ وَمَطَرٍ، يَقُولُ: أَلاَ صَلُّوا فِي الرِّحَالِ
__________
أخرجه البخاري في: 10 كتاب الأذان: 40 باب الرخصة في المطر والعلة، أن يصلي في رحله
404. హజ్రత్ నాఫె (రహిమహుల్లాహ్) కథనం:- ఒక రోజు రాత్రి తీవ్రమయిన ఈదురుగాలులు వీస్తున్నప్పుడు హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) అజాన్ (నమాజ్ కొరకు పిలుపు) ఇచ్చారు. అయితే ఆ అజాన్లో (నమాజు కొరకు రండి అని చెప్పడానికి బదులు) “ప్రజలారా! మీ ఇండ్లలోనే నమాజు చేసుకోండి” అని అన్నారు. ఇలా అజాన్ ఇచ్చిన తరువాత, రాత్రివేళ బాగా చలి వున్నప్పుడు గాని, వర్షం కురుస్తున్నప్పుడు గాని, మీ మీ ఇండ్లలోనే నమాజు చేసుకోండి అంటూ అజాన్ ఇవ్వాలని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ముఅజ్జిన్ని ఆదేశించేవారు” అని తెలియజేశారు. *
(సహీహ్ బుఖారీ : 10వ ప్రకరణం – అజాన్, 40వ అధ్యాయం – అర్రుఖ్సతు ఫిల్ మతరి వల్ ఇల్లతి అయ్యు సల్లి]
* ఈ హదీసులో చలి, గాలులను గురించి ప్రస్తావన వచ్చింది. అంటే తీవ్రమైన చలి, తుఫాను గాలి అని అర్థం తీశారు ధర్మవేత్తలు. అదే విధంగా తీవ్రమైన మండుటెండల్లో కూడా నమాజు ఇంట్లోనే చేసుకునే అనుమతి ఉంది. పోతే కుండపోత వర్షం రాత్రివేళ కురుస్తున్నా, పగటివేళ కురుస్తున్నా నమాజు ఇంట్లోనే చేసుకోవచ్చు. కాని తుఫాను గాలి విషయంలో రాత్రివేళలో మాత్రమే నమాజు ఇంట్లో చేసుకునే అనుమతి ఉంది. దానిక్కారణం రాత్రివేళలోనే ఎక్కువ బాధ, శ్రమ ఉంటాయి. అయితే హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు), తుఫాను గాలిలో కూడ కుండపోత వర్షంలో లాగే బాధ ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఇంట్లో నమాజు ఒంటరిగా చేయవచ్చు, సామూహికంగా కూడా చేయవచ్చు. హదీసులో ప్రస్తావించిన తీరును గమనిస్తే, సామూహిక నమాజు అసలు స్థానం మస్జిద్ మాత్రమే గనక, (ఇంట్లో) నమాజు ఒంటరిగానే చేసుకోవాలన్న భావమే స్ఫురిస్తోంది.
405 – حديث ابْنِ عَبَّاسٍ قَالَ لِمُؤَذِّنِهِ فِي يَوْمٍ مَطِيرٍ: إِذَا قُلْتَ أَشْهَدُ أَنَّ مُحَمَّدًا رَسُولُ اللهِ فَلاَ تَقُلْ حَيَّ عَلَى الصَّلاَةِ، قُلْ صَلُّوا فِي بُيوتِكُمْ فَكَأَنَّ النَّاسَ اسْتَنْكَرُوا، قَالَ: فَعَلَهُ مَنْ هُوَ خَيْرٌ مِنِّي، إِنَّ الْجُمُعَةَ عَزْمَةٌ، وَإِنِّي كَرِهْتُ أَنْ أُحْرِجَكُمْ فَتَمْشُونَ فِي الطِّينِ وَالدَّحْضِ
__________
أخرجه البخاري في: 11 كتاب الجمعة: 14 باب الرخصة لمن لم يحضر الجمعة في المطر
405. ఒకసారి (శుక్రవారం నాడు) హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హు) అజాన్ ఇవ్వమని ముఅజ్జిన్ని ఆజ్ఞాపిస్తూ, అజాన్లో ‘అష్ హదు అన్న ముహమ్మదర్రసూలుల్లాహ్’ అని పలికిన తరువాత హయ్య అలస్సలాహ్ అని చెప్పకుండా ‘సల్లూ ఫీ బుయూతికుమ్’ (మీమీ ఇండ్లలోనే నమాజు చేయండి) అని చెప్పాలని అన్నారు. ఈ మాటలు విని జనం ఆశ్చర్యపోయారు. అప్పుడు హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హు) వారి ఆశ్చర్యాన్ని పటాపంచలు చేస్తూ “నా కంటే ఎంతో శ్రేష్ఠుడయిన మహనీయులు (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగానే ఆచరించారు. జుమా నమాజ్ విధిగా చేయవలసిన ప్రార్ధన అన్నది నిజమే. కాని మిమ్మల్ని బురదలో, జారుటలో నడిపించి ఇబ్బందులకు గురి చేయడం నాకిష్టం లేదు” అని అన్నారు.
[సహీహ్ బుఖారీ : 11వ ప్రకరణం – జుమా, 14వ అధ్యాయం – అర్రుఖ్సతు లిమన్ లమ్ యహ జురిల్ జుముఅ ఫిల్ మతర్]
4వ అధ్యాయం – ప్రయాణంలో వాహనం పై (నడుస్తూ) నమాజు చేయవచ్చు
جواز صلاة النافلة على الدابة في السفر حيث توجهت
406 – حديث ابْنِ عُمَرَ، قَالَ: كَانَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يُصَلِّي فِي السَّفَرِ عَلَى رَاحِلَتِهِ حَيْثُ تَوَجَّهَتْ بِهِ، يُومِئُ إِيمَاءَ، صَلاَةَ اللَّيْلِ إِلاَّ الْفَرَائِضَ، وَيُوتِرُ عَلَى رَاحِلَتِهِ
__________
أخرجه البخاري في: 14 كتاب الوتر: 6 باب الوتر في السفر
406. హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ఇలా అన్నారు:-
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రయాణం చేస్తూ వాహనం మీద కూర్చొని ఉండే నమాజు చేసేవారు. వాహనం ఏ దిక్కుకు తిరిగి నడుస్తున్నా సరే దాని మీదే నమాజు చేసేవారు (రుకూ, సజ్దాలు) సైగల ద్వారా నిర్వర్తించేవారు. ఇది రాత్రివేళ నమాజు. ఫర్జ్ నమాజులు తప్ప (ఫర్జ్ నమాజును వాహనం దిగి చేసేవారు) ఇతర (సున్నత్, నఫిల్) నమాజులన్నీ ఇలా (వాహనం మీద కూర్చొని) చేసేవారు. వితర్ నమాజు కూడా వాహనం మీద కుర్చొనే చేసేవారు.
[సహీహ్ బుఖారీ : 14వ ప్రకరణం – వితర్, 6వ అధ్యాయం – అల్ వితరి ఫిస్సఫర్]
407 – حديث عَامِرِ بْنِ رَبِيعَةَ، أَنَّهُ رَأَى النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ صَلَّى السُّبْحَةَ بِاللَّيْلِ فِي السَّفَرِ عَلَى ظَهْرِ رَاحِلَتِهِ حَيْتُ تَوَجَّهَتْ بِهِ
__________
أخرجه البخاري في: 18 كتاب تقصير الصلاة: 12 باب تطوع في السفر في غير دبر الصلاة وقبلها
407. హజ్రత్ ఆమిర్ బిన్ రబీయ (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వాహనం పై కూర్చొని ప్రయాణం సాగిస్తూనే రాత్రివేళ నఫిల్ నమాజు చేస్తూ ఉండటం నేను చూశాను. వాహనం ఏ దిశవైపుకు నడుస్తున్నా సరే (ఆ దిశవైపుకే ముఖం పెట్టి నమాజు చేసేవారు). [సహీహ్ బుఖారీ : 18వ ప్రకరణం – తఖ్సీరుస్సలాత్, 12వ అధ్యాయం – మన్ తతవ్వవు ఫిస్సఫరి ఫీగైరి దుబురి స్సలాత్)
408 – حديث أَنَسٍ عَنْ أَنَسِ بْنِ سِيرِينَ، قَالَ: اسْتَقْبَلْنَا أَنَسًا حِينَ قَدِمَ مِنَ الشَّأمِ فَلَقِينَاهُ بِعَيْنِ التَّمْرِ، فَرَأَيْتُهُ يُصَلِّي عَلَى حِمَارٍ، وَوَجْهُهُ مِنْ ذَا الْجَانِبِ، يَعْنِي عَنْ يَسَارِ الْقِبْلَةِ، فَقُلْتُ: رَأَيْتُكَ تُصَلِّي لِغَيْرِ الْقِبْلَةِ، فَقَالَ: لَوْلاَ أَنِّي رَأَيْتُ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فَعَلَهُ لَمْ أَفْعَلْهُ
__________
أخرجه البخاري في: 18 كتاب تقصير الصلاة: 10 باب صلاة التطوع على الحمار
408. హజ్రత్ అనస్ బిన్ సైరీన్ (రహిమహుల్లాహ్) కథనం:-
హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) ఓ రోజు సాయంత్రం వచ్చినపుడు మేము ఆయనకు స్వాగతం చెప్పడానికి వెళ్ళాము. మేము ఆయన్ని ‘ఐనిత్తమర్’ అనే ప్రదేశంలో కలుసుకున్నాము. అప్పుడు ఆయన గాడిద మీద కూర్చొని (ప్రయాణం చేస్తూనే) నమాజు చేస్తూ వుండటం నేను చూశాను. (నమాజులో) ఆయన ముఖం ఖిబ్లా నుండి కుడి వైపుకు వుంది. అందువల్ల (నమాజు ముగిసిన తరువాత) నేనీ విషయాన్ని విచారిస్తూ “మీరు నమాజు చేస్తున్నప్పుడు మీ ముఖం ఖిబ్లా వైపు కాకుండా వేరే దిశకు ఉండటం కన్పించిందే? ” అని అన్నాను. దానికి హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) సమాధానమిస్తూ “దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గనక ఇలా చేసి ఉండకపోతే నేనీ విధంగా చేసేవాణ్ణి కాను” అని అన్నారు.
(సహీహ్ బుఖారీ : 18వ ప్రకరణం – తఫ్సీరుస్సలాత్, 10వ అధ్యాయం – సలాతితవ్వవు అలల్ హిమార్)
5వ అధ్యాయం – ప్రయాణావస్థలో ఒకేసారి రెండు (వేళల) నమాజులు చేయవచ్చు
جواز الجمع بين الصلاتين في السفر
409 – حديث ابْنِ عُمَرَ، قَالَ: رَأَيْتُ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ إِذَا أَعْجلَهُ السَّيْرُ فِي السَّفَرِ يُؤَخِّرُ الْمَغْرِبَ حَتَّى يَجْمَعَ بَيْنَهَا وَبَيْنَ الْعِشَاءِ
__________
أخرجه البخاري في: 18 كتاب تقصير الصلاة: 6 يصلى المغرب ثلاثا في السفر
409. హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం:-
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రయాణావస్థలో త్వరగా వెళ్ళాలనుకున్నప్పుడు, మగ్రిబ్ నమాజ్ ని వేళకాగానే చేయకుండా (ఇషా వేళ సమీపించే వరకు) ఆలస్యం చేసేవారు. ఆ తరువాత మగ్రిబ్, ఇషా నమాజులు కలిపి ఒకేసారి చేసేవారు.
(సహీహ్ బుఖారీ : 18వ ప్రకరణం – తఖ్సీరుస్సలాత్, 6వ అధ్యాయం – యుసల్లిల్ మగ్రిబి సలాసన్ ఫిస్సఫర్)
410 – حديث أَنَسِ بْنِ مَالِكٍ قَالَ: كَانَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ إِذَا ارْتَحَلَ قَبْلَ أَنْ تَزِيغَ الشَّمْسُ أَخَّرَ الظُّهْرَ إِلَى وَقْتِ الْعَصْرِ، ثُمَّ نَزَلَ فَجَمَعَ بَيْنَهُمَا، فَإِنْ زَاغَتِ الشَّمْسُ قَبْلَ أَنْ يَرْتَحِلَ صَلَّى الظُّهْرَ ثُمَّ رَكِبَ
__________
أخرجه البخاري في: 18 كتاب تقصير الصلاة: 16 باب إذا ارتحل بعدما زاغت الشمس صلى الظهر ثم ركب
410. హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం:-
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సూర్యుడు నెత్తి మీద నుండి వాలక ముందే ప్రయాణం చేయవలసి వస్తే జుహర్ నమాజ్ ని వేళకాగానే చేయకుండా అసర్ వేళ సమీపించే వరకు ఆలస్యం చేసేవారు. తరువాత (అసర్ వేళకు) ఒక చోట ఆగి (జుహర్, అసర్) రెండు నమాజులు కలిపి ఒకేసారి చేసేవారు. ఒకవేళ ఆయన ప్రయాణమవడానికి ముందే సూర్యుడు నెత్తి మీద నుండి వాలితే జుహర్ నమాజు చేసిన తరువాత బయలుదేరేవారు.
[సహీహ్ బుఖారీ : 18వ ప్రకరణం – తఫ్సీరుస్సలాత్, 16వ అధ్యాయం – ఇజా అర్తహల్ బాద మాజాగతిషమ్సు సలాఅజుహ్ర్ సుమ్మ రకబ్]
6వ అధ్యాయం – ప్రయాణావస్థలో లేనపుడు రెండు నమాజులు కలిపి చేయడం
الجمع بين الصلاتين في الحضر
411 – حديث ابْنِ عَبَّاسٍ قَالَ: صَلَّيْتُ مَعَ رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ ثَمَانِيًا جَمِيعًا، وَسَبْعًا جَمِيعًا
__________
أخرجه البخاري في: 19 كتاب التهجد: 30 باب من لم يتطوع بعد المكتوبة
411. హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హు) కథనం:- నేనొకసారి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)తో కలసి (జుహర్, అసర్ వేళలకు చెందిన) ఎనిమిది రకాతుల నమాజు, (మగ్రిబ్, ఇషావేళలకు చెందిన) ఏడు రకాతుల నమాజు కలిపి చేశాను. (సహీహ్ బుఖారీ : 19వ ప్రకరణం – తహజ్జుద్, 30వ అధ్యాయం – మల్లమ్ యత తవ్వు బాదల్ మక్ తూబా)
7వ అధ్యాయం – నమాజు ముగిసిన తరువాత ఇమామ్ కుడివైపో, ఎడమవైపో తిరిగి కూర్చోవచ్చు جواز الانصراف من الصلاة عن اليمين والشمال
412 – حديث عَبْدِ اللهِ بْنِ مَسْعُودٍ، قَالَ لاَ يَجْعَلَنَّ أَحَدُكُمْ لِلشَيْطَانِ شَيْئًا مِنْ صَلاَتِهِ، يَرَى أَنَّ حَقًّا عَلَيْهِ أَنْ لاَ يَنْصَرِفَ إِلاَّ عَنْ يَمِينِهِ لَقَدْ رَأَيْتُ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ كَثِيرًا يَنْصَرِفُ عَنْ يَسَارِهِ
__________
أخرجه البخاري في: 10 كتاب الأذان: 195 باب الانفتال والانصراف عن اليمين والشمال
412. హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ ఊద్ (రదియల్లాహు అన్హు) కథనం:-
ఏ మనిషి కూడా తన నమాజులో షైతానుకు భాగం ఇవ్వకూడదు. (నమాజు ముగిసిన తరువాత) మనిషి కుడివైపుకే తిరిగి కూర్చోవాలని నిర్ణయించుకోవడం కూడ నమాజులో షైతానుకు భాగం కల్పించడమే అవుతుంది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఎన్నోసార్లు ఎడమవైపుకు తిరిగి కూర్చోవడాన్ని నేను చూశాను.
(సహీహ్ బుఖారీ : 10వ ప్రకరణం – అజాన్, 195వ అధ్యాయం – అల్ ఇన్ఫితాలి వల్ ఇన్సిరాఫి అనిల్ యమీని వష్ షిమాల్)
9వ అధ్యాయం – ఇఖామత్ చెప్పిన తర్వాత నఫిల్ నమాజు ప్రారంభించరాదు
كراهة الشروع في نافلة بعد شروع المؤذن
413 – حديث عَبْدِ اللهِ بْنِ مَالِكِ بْنِ بُحَيْنَةَ، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ رَأَى رَجُلاً، وَقَدْ أُقِيمَتِ الصَّلاَةُ، يُصَلِّي رَكْعَتَيْنِ، فَلَمَّا انْصَرَفَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ لاَثَ بِهِ النَّاسُ، وَقَالَ لَهُ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: الصُّبْحَ أَرْبَعًا الصُّبْحَ أَرْبَعًا
__________
أخرجه البخاري في: 10 كتاب الأذان: 38 باب إذا أقيمت الصلاة فلا صلاة إلا المكتوبة
413. హజ్రత్ అబ్దుల్లా బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) కథనం:-
ఫజ్ర్ వేళ (ముఅజ్జిన్) తక్బీరె ఇఖామ చెప్పిన తరువాత ఒక వ్యక్తి రెండు రకాతుల సున్నత్ నమాజు చేస్తూ ఉండటాన్ని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గమనించారు. (ఫర్జ్) నమాజు ముగిసిన తరువాత జనం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చుట్టూ గుమిగూడారు. అప్పుడు దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ఆ వ్యక్తిని ఉద్దేశించి “ఏమిటీ, ఫజ్ర్ వేళ నాలుగు రకాతుల నమాజు ఉన్నదా? నాలుగు రకాతుల నమాజ్ ఉన్నదా?!” అని అన్నారు.
[సహీహ్ బుఖారీ : 10వ ప్రకరణం – అజాన్, 38వ అధ్యాయం – ఇజా అఖీమతిస్సలాతు ఫలా సలాత ఇల్లల్ మక్ తూబా)
11వ అధ్యాయం – ప్రతి వేళా రెండు రకాతుల తహ్యతుల్ మస్జిద్ నమాజ్ చేయడం అభిలషణీయం استحباب تحية المسجد بركعتين وكراهة الجلوس قبل صلاتهما وأنها مشروعة في جميع الأوقات
414 – حديث أَبِي قَتَادَةَ السَّلَمِيِّ، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: إِذَا دَخَلَ أَحَدُكُمُ الْمَسْجِدَ فَلْيَرْكَعْ رَكْعَتَيْنِ قَبْلَ أَنْ يَجْلِسَ
__________
أخرجه البخاري في: 8 كتاب الصلاة: 60 باب إذا دخل المجلس فليركع ركعتين
414. హజ్రత్ అబూ ఖతాద (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:-
“మస్జిదులో ప్రవేశించిన వ్యక్తి కూర్చోవడానికి ముందు రెండు రకాతులు (తహ్యతుల్ మస్జిద్) నమాజు చేయాలి.”
సహీహ్ బుఖారీ: 8వ ప్రకరణం – సలాత్, 60వ అధ్యాయం – ఇజా దఖలుల్ మస్జిద్ ఫల్ యర్కవు రకతైన్]
12వ అధ్యాయం – ప్రయాణం నుండి తిరిగి రాగానే ముందు మస్జిద్ కెళ్ళి రెండు రకాతుల నమాజు చేయడం అభిలషణీయం استحباب الركعتين في المسجد لمن قدم من سفر أول قدومه
415 – حديث جَابِرِ بْنِ عَبْدِ اللهِ، قَالَ: كُنْتُ مَعَ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فِي غَزَاةٍ فَأَبْطَأَ بي جَمَلِي وَأَعْيَا، فَأَتَى عَلَيَّ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَقَالَ: جَابِرٌ فَقُلْتُ: نَعَمْ قَالَ: مَا شَأْنُكَ قُلْتُ: أَبْطَأَ عَلَيَّ جَمَلِي وَأَعْيَا
وَقَدِمْتُ بِالْغَدَاةِ فَجِئْنَا إِلَى الْمَسْجِدِ فَوَجَدْتُهُ عَلَى بَابِ الْمَسْجِدِ، قَالَ: الآنَ قَدِمْتَ قُلْتُ: نَعَمْ قَالَ: فَدَعْ جَمَلَكَ وَادْخُلْ فَصَلِّ رَكْعَتَيْنِ فَدَخَلْتُ فَصَلَّيْتُ
__________
أخرجه البخاري في: 34 كتاب البيوع: 34 باب شراء الدواب والحمير
415. హజ్రత్ జాబిర్ బిన్ అబ్దుల్లా (రదియల్లాహు అన్హు) కథనం:-
నేనొకసారి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)తో కలసి ఒక యుద్ధంలో పాల్గొన్నాను. అయితే తిరుగు ప్రయాణంలో నా ఒంటె అలసిపోవడం వలన నేను వెనుకపడ్డాను. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నా దగ్గరకు వచ్చి “ఎవరు జాబిరా?” అని అన్నారు. “ఔనండి, నేను జాబిర్ ” అన్నాను నేను. “ఏమిటీ, ఏమయింది (వెనకబడ్డావు)?” అని అడిగారు ఆయన. “నా ఒంటె బాగా అలసిపోయింది. అందువల్ల నేను కాస్త వెనకబడిపోయాను” అన్నాను నేను. రెండో రోజు ఉదయం చేరుకున్నాను నేను. మస్జిదు వైపుకు వస్తుంటే, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నన్ను, మస్జిదు ద్వారం దగ్గర కలసి “నీవిప్పుడు చేరుకున్నావా?” అని అడిగారు. నేను ఔనండీ! అన్నాను. “సరే నీ ఒంటెను ఇక్కడే వదిలి ముందు మస్జిద్ కెళ్ళి రెండు రకాతులు (నఫిల్) నమాజు చేసుకో” అని అన్నారు ఆయన. నేను అలాగే మస్జిదులోకి వెళ్ళి రెండు రకాతుల నమాజు చేశాను.
(సహీహ్ బుఖారీ : 34వ ప్రకరణం – అల్ బుయూ, 34వ అధ్యాయం – షరాఇద్దవాబ్ వల్ హమీర్)
13వ అధ్యాయం – దుహా నమాజ్ కనీసం రెండు రకాతులు చేయడం అభిలషణీయం
استحباب صلاة الضحى وأن أقلها ركعتان
416 – حديث عَائِشَةَ، قَالَتْ: إِنْ كَانَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ لَيَدَعُ الْعَمَلَ وَهُوَ يُحِبُّ أَنْ يَعْمَلَ بِهِ خَشْيَةَ أَنْ يَعْمَلَ بِهِ النَّاسُ فَيُفْرَضَ عَلَيْهِمْ، وَمَا سَبَّحَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ سُبْحَةَ الضُّحى قطُّ، وَإِنِّي لأُسَبِّحُهَا
__________
أخرجه البخاري في: 19 كتاب التهجد: 5 باب تحريض النبي صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ على صلاة الليل والنوافل من غير إيجاب
416. విశ్వాసుల మాతృమూర్తి హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం:-
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు కొన్ని పనులు చేయడం ఇష్టమయినప్పటికీ ఆయన వాటిని విడనాడేవారు. కారణం, ఇలా నిరంతరం చేయడం వల్ల ప్రజలు ఆ పనిని విధిగా నిర్ణయించబడినట్లు భావించవచ్చని (దాని వల్ల అనుచర సమాజంపై మరింత భారం పడుతుందని) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తలపోయడమే. అందుకే ఆయన దుహా వేళ నఫిల్ నమాజు ఎన్నడూ చేయలేదు. కాని నేను మాత్రం దుహా నమాజు చేస్తున్నాను.
(సహీహ్ బుఖారీ : 19వ ప్రకరణం – తహజ్జుద్, 5వ అధ్యాయం – తహ్రీజున్నబీ (సల్లల్లాహు అలైహి వసల్లం) అలా సలాతిల్లెలి వన్నవాఫిలి మిన్ గైరియజాబ్]
417 – حديث أُمِّ هَانِيءٍ عَنِ ابْنِ أَبِي لَيْلَى، قَالَ: مَا أَنْبَأَنَا أَحَدٌ أَنَّهُ رَأَى النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ صَلَّى الضُّحى غَيْرُ أُمِّ هَانِيءٍ ذَكَرَتْ أَنَّ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَوْمَ فَتْحِ مَكَّةَ اغْتَسَلَ فِي بَيْتِهَا، فَصَلَّى ثَمَانِ رَكَعَاتٍ، فَمَا رَأَيْتُهُ صَلَّى صلاةً أَخَفَّ مِنْهَا غَيْرَ أَنَّهُ يُتِمُّ الرُّكُوعَ وَالسُّجُودَ
__________
أخرجه البخاري في: 18 كتاب تقصير الصلاة: 12 باب من تطوع في السفر في غير دبر الصلوات وقبلها
417. హజ్రత్ ఇబ్నె అబీ లైలా (రహిమహుల్లాహ్) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దుహా వేళ నఫిల్ నమాజులు చేయడం తాను చూసినట్లు హజ్రత్ ఉమ్మె హాని (రదియల్లాహు అన్హా) తెలిపారు. ఈ సమాచారం ఆమె తప్ప మరెవరి ద్వారా మాకు చేరలేదు.
హజ్రత్ ఉమ్మె హాని (రదియల్లాహు అన్హా) ఇలా తెలియజేశారు – “దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మక్కా జయించబడిన రోజు మా ఇంట్లో స్నానం చేసి ఎనిమిది రకాతులు నమాజు సంక్షిప్తంగా చేశారు. ఆయన ఇంత సంక్షిప్తంగా నమాజు చేయడం నేను లోగడ ఎప్పుడూ చూడలేదు. అయితే ఈ నమాజులో కూడా ఆయన రుకూ, సజ్దాలు సంపూర్ణంగా (నింపాదిగా) చేశారు. వాటిలో ఎలాంటి కొరత చేయలేదు).”
[సహీహ్ బుఖారీ : 18వ ప్రకరణం – తఖ్సీరుస్సలాత్, 12వ అధ్యాయం – మన తతవ్వఅ ఫిస్సఫరి ఫీగైరి దుబురిస్సలాతి వఖబ్లహా]
418 – حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه قَالَ: أَوْصَانِي خَلِيلِي بِثَلاَثٍ، لاَ أَدَعُهُنَّ حَتَّى أَمُوتَ: صَوْمِ ثَلاَثَةِ أَيَّامِ مِنْ كُلِّ شَهْرٍ، وَصَلاَةِ الضُّحى، وَنَوْمٍ عَلَى وِتْرٍ
__________
أخرجه البخاري في: 19 كتاب التهجد: 33 باب صلاة الضحى في الحضر
418. హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం:-
నా ప్రాణ స్నేహితులు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నాకు మూడు విషయాలను గురించి హితబోధ చేశారు. నేను వాటిని నా బొందిలో ప్రాణం ఉన్నంతవరకూ వదలి పెట్టను. ఆ మూడు విషయాలు ఇవి – (1) ప్రతి నెలా మూడు రోజులు ఉపవాసాలు పాటించడం, (2) దుహా నమాజు చేయడం, (3) వితర్ నమాజు చేసి నిద్రపోవడం.
(సహీహ్ బుఖారీ : 19వ ప్రకరణం – తహజ్జుద్, 33వ అధ్యాయం – సలాతిజుహా ఫిల్ హజర్)
14వ అధ్యాయం – ఫజ్ర్ వేళ సున్నత్ నమాజు ప్రాముఖ్యం
استحباب ركعتي سنة الفجر والحث عليهما
419 – حديث حَفْصَةَ، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ كَانَ، إِذَا اعْتَكَفَ الْمُؤَذِّنُ لِلصُّبْحِ، وَبَدَا الصُّبْحُ، صَلَّى رَكْعَتَيْنِ خَفِيفَتَيْنِ قَبْلَ أَنْ تُقَامَ الصَّلاَةُ
__________
أخرجه البخاري في: 10 كتاب الأذان: 12 باب الأذان بعد الفجر
419. విశ్వాసుల మాతృమూర్తి హజ్రత్ హఫ్సా (రదియల్లాహు అన్హా) కథనం:-
ముఅజ్జిన్ అజాన్ ఇచ్చి కూర్చుంటాడు. ఫజ్ర్ (ఉదయం) ప్రారంభమవుతుంది. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సామూహిక నమాజుకు ముందు రెండు రకాతులు తేలికపాటి నమాజు చేసేవారు.
(సహీహ్ బుఖారీ : 10వ ప్రకరణం – అజాన్, 12వ అధ్యాయం – అల్ అజాన్ బాదుల్ ఫజ్ర్ ]
420 – حديث عَائِشَةَ، أَنَّهَا قَالَتْ: كَانَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يُصَلِّي رَكْعَتَيْنِ خَفِيفَتَيْنِ بَيْنَ النِّدَاءِ وَالإِقَامَةِ مِنْ صَلاَةِ الصُّبْحِ
__________
أخرجه البخاري في: 10 كتاب الأذان: 12 باب الأذان بعد الفجر
420. హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఫజ్ర్ నమాజు వేళ అజాన్, ఇఖామల మధ్య రెండు రకాతులు తేలికపాటి నమాజు చేసేవారు. (సహీహ్ బుఖారీ : 10వ ప్రకరణం – అజాన్, 12వ అధ్యాయం – అల్ అజాన్ బాదల్ ఫజ్ర్)
421 – حديث عَائِشَةَ، قَالَتْ: كَانَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يُخَفِّفُ الرَّكْعَتَيْنِ اللَّتَيْنِ قَبْلَ صَلاَةِ الصُّبْحِ، حَتَّى إِنِّي لأَقُولُ هَلْ قَرَأَ بِأُمِّ الْكِتَابِ
__________
أخرجه البخاري في: 19 كتاب التهجد: 28 باب ما يقرأ في ركعتي الفجر
421. హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం:-
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఫజ్ర్ వేళ (ఫర్జ్) నమాజుకు ముందు ఎంతో సంక్షిప్తంగా రెండు రకాతులు సున్నత్ నమాజు చేసేవారు. ఆ నమాజు చూస్తుంటే ఒక్కోసారి నాకు ఆయన అలహమ్ (సూరా) అయినా పఠించారా లేదా అనిపించేది. అంత తేలికపాటి నమాజు చేసేవారు ఆయన.
(సహీహ్ బుఖారీ : 19వ ప్రకరణం – తహజ్జుద్, 28వ అధ్యాయం – మాయఖ్రా ఫీ రకఅతియల్ ఫజ్ర్)
422 – حديث عَائِشَةَ، قَالَتْ: لَمْ يَكُنِ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ عَلَى شَيْءٍ مِنَ النَّوَافِلِ أَشَدَّ مِنْهُ تَعَاهُدًا عَلَى رَكْعَتَيِ الْفَجْرِ
__________
أخرجه البخاري في: 19 كتاب التهجد: 27 باب تعاهد ركعتي الفجر ومن سماها تطوعا
422. హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఫజ్ర్ వేళ రెండు రకాతులు సున్నత్ నమాజ్ ని ప్రతి రోజూ క్రమం తప్పకుండా చేసేవారు. ఆ విధంగా (నాగా లేకుండా) మరే నఫిల్ నమాజు కూడా ఆయన చేసేవారు కాదు. (సహీహ్ బుఖారీ : 19వ ప్రకరణం – తహజ్జుద్, 17వ అధ్యాయం)
15వ అధ్యాయం – ఫర్జ్ నమాజుకు ముందు, ఆ తరువాత చేసే సున్నత్ నమాజుల ప్రాముఖ్యం فضل السنن الراتبة قبل الفرائض وبعدهن وبيان عددهن
423 – حديث ابْنِ عُمَرَ قَالَ: صَلَّيْتُ مَعَ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ سَجْدَتَيْنِ قَبْلَ الظُّهْرِ، وَسَجْدَتَيْنِ بَعْدَ الظُّهْرِ، وَسَجْدَتَيْنِ بَعْدَ الْمَغْرِبِ، وَسَجْدَتَيْنِ بَعْدَ الْعِشَاءِ، وَسَجْدَتَيْنِ بَعْدَ الْجُمُعَةِ؛ فَأَمَّا الْمَغْرِبُ وَالْعِشَاءُ، فَفِي بَيْتِهِ
__________
أخرجه البخاري في: 19 كتاب التهجد: 29 باب التطوع بعد المكتوبة
423. హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం:-
నేను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)తో కలసి సున్నత్ నమాజులు ఈ విధంగా చేశాను. జుహర్ (ఫర్జ్ నమాజు)కు పూర్వం రెండు రకాతులు, జుహర్ (ఫర్జ్) తరువాత రెండు రకాతులు, మగ్రిబ్ (ఫర్జ్ నమాజు) తరువాత రెండు రకాతులు, ఇషా (ఫర్జ్ నమాజు) తరువాత రెండు రకాతులు, జుమా (ఫర్జ్ నమాజు) తరువాత రెండు రకాతులు సున్నత్ నమాజు చేసేవారు. మగ్రిబ్, ఇషా వేళల సున్నత్ నమాజులు ఆయన ఇంట్లోనే చేసుకునేవారు.
(సహీహ్ బుఖారీ : 19వ ప్రకరణం – తహజ్జుద్, 29వ అధ్యాయం – అత్తతవ్వల బాదల్ మక్తూబా]
16వ అధ్యాయం – నఫిల్ నమాజు కూర్చొని చేయడం కూడా ధర్మ సమ్మతమే
جواز النافلة قائما وقاعدا وفعل بعض الركعة قائما وبعضها قاعدا
424 – حديث عَائِشَةَ قَالَتْ: مَا رَأَيْتُ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَقْرَأُ فِي شَيْءٍ مِنْ صَلاَةِ اللَّيْلِ جَالِسًا، حَتَّى إِذَا كَبِرَ قَرَأَ جَالِسًا، فَإِذَا بَقِيَ عَلَيْهِ مِنَ السُّورَةِ ثَلاَثُونَ أَوْ أَرْبَعُونَ آيَةً، قَامَ فَقَرَأَهُنَّ ثُمَّ رَكَعَ
__________
أخرجه البخاري في: 19 كتاب التهجد: 16 باب قيام النبي صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ بالليل في رمضان وغيره
424. హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం:-
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) రాత్రి వేళ ఏ నమాజులో కూడా కూర్చొని ఖుర్ఆన్ పఠించడం నేను చూడలేదు. వృద్ధాప్యం సమీపించిన రోజుల్లో కూడా ఆయన కూర్చొనే (నఫిల్) నమాజు చేసేవారు. అయితే సూరా (అధ్యాయం)లో ముప్ఫై నలభై ఆయత్ లు (సూక్తులు) ఇంకా మిగిలి ఉన్నాయనగా ఆయన లేచి నిలబడతారు. అలా నిల్చొని మిగిలిన సూక్తులు పఠించేవారు. ఆ తరువాత రుకూ చేసేవారు.
[సహీహ్ బుఖారీ: 19వ ప్రకరణం – తహజ్జుద్, 16వ అధ్యాయం – ఖియామున్నబీ (సల్లల్లాహు అలైహి వసల్లం) బిల్ ల్లెలి ఫీ రమజాన్ వగైరిహీ]
425 – حديث عَائِشَةَ أُمِّ الْمُؤْمِنِينَ، أَنَّ رَسولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ كَانَ يُصَلِّي جَالِسًا، فَيَقْرأُ وَهُوَ جَالِسٌ، فَإِذَا بَقِيَ مِنْ قِرَاءَتِهِ نَحْوٌ مِنْ ثَلاَثِينَ أَوْ أَرْبَعِينَ آيَةً قَامَ فَقَرَأَهَا، وَهْوَ قَائمٌ، ثُمَّ رَكَعَ ثُمَّ سَجَدَ، يَفْعَلُ فِي الرَّكْعَةِ الثَّانِيَةِ مِثْلَ ذلِكَ، فَإِذَا قَضَى صَلاَتَهُ نَظَرَ، فَإِنْ كُنْتُ يَقْظَى تَحَدَّثَ مَعِي، وَإِنْ كُنْتُ نَائمَةً اضْطَجَعَ
__________
أخرجه البخاري في: 18 كتاب تقصير الصلاة: 20 باب: إذا صلى قاعدا ثم صح أو وجد خفة تمّم ما بَقِي
425. హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం:-
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కూర్చొని (నఫిల్) నమాజు చేయదలచుకున్నప్పుడు కూర్చొని వుండే అందులో ఖుర్ఆన్ పారాయణం చేసేవారు. ఇలా చేశాక (సూరా)లో ఇంకా దాదాపు ముప్పై, నలభై అయతులు మిగిలి ఉండిపోయేవి. అప్పుడు ఆయన లేచి నిలబడి ఆ మిగిలి ఉన్న అయతులను పఠించేవారు. ఆ తరువాత రుకూ, సజ్జలు చేస్తారు. అదే విధంగా రెండవ రకాత్ లో కూడా చేసేవారు. ఈ విధంగా (రెండు రకాతులు) నమాజు ముగించి (నేను మేల్కొని ఉన్నానా లేదా అని నా వైపు) చూసేవారు. నేనొక వేళ మేల్కొని ఉంటే నాతో మాట్లాడేవారు, నిద్రపోతూ ఉంటే ఆయన కూడా నిద్రకు ఉపక్రమించేవారు.
[సహీహ్ బుఖారీ : 18వ ప్రకరణం – తఫ్సీరుస్సలాత్, 20వ అధ్యాయం – ఇజాసల్లా ఖాయిదన్ సుమ్మ సహ అవ్ వజద్ ఖిపృతన్…..]
17వ అధ్యాయం – ఇషా నమాజులో పఠించవలసిన రకాతుల సంఖ్య
صلاة الليل وعدد ركعات النبي صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ في الليل وأن الوتر ركعة، وأن الركعة صلاة صحيحة
426 – حديث عَائِشَةَ عَنْ أَبِي سَلَمَةَ بْنِ عَبْدِ الرَّحْمنِ، أَنَّهُ سَأَلَ عَائِشَةَ، كيْفَ كَانَتْ صَلاَةُ رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فِي رَمَضَانَ فَقَالَتْ: مَا كَانَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَزِيدُ [ص:143] فِي رَمَضَانَ وَلاَ فِي غَيْرِهِ عَلَى إِحْدَى عَشْرَةَ رَكْعَةً، يُصَلِّي أَرْبَعًا فَلاَ تَسَلْ عَنْ حُسْنِهِنَّ وَطُولِهِنَّ، ثُمَّ يُصَلِّي أَرْبَعًا فَلاَ تَسَلْ عَنْ حُسْنِهِنَّ وَطُولِهِنَّ، ثُمَّ يُصَلِّي ثَلاَثًا قَالَتْ عَائِشَةُ: فَقُلْتُ يَا رَسُولَ اللهِ أَتَنَامُ قَبْلَ أَنْ تُوتِرَ فَقَالَ: يَا عَائِشَةُ إِنَّ عَيْنَيَّ تَنَامَانِ وَلاَ يَنَامُ قَلْبِي
__________
أخرجه البخاري في: 19 كتاب التهجد: 16 باب قيام النبي صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ بالليل في رمضان وغيره
426. హజ్రత్ అబూసలమా (రహిమహుల్లాహ్) బిన్ అబ్దుర్రహ్మాన్ (రదియల్లాహు అన్హు) కథనం:- “రమజాన్ నెలలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఎన్ని రకాతులు నమాజు చేసేవారు?” అని నేను విశ్వాసుల మాతృమూర్తి హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా)ని అడిగాను. దానికామె ఇలా సమాధానమిచ్చారు.
రమజాన్ మాసంలో అయినా ఇతర మాసాలలోనయినా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పదకొండు రకాతులకు మించి (నఫిల్) నమాజు చేసేవారు కాదు. మొదట నాలుగు రకాతులు పఠిస్తారు. ఈ నాలుగు రకాతుల నమాజు ఎంతో సుందరంగా సుదీర్ఘంగా వర్ణనాతీతంగా ఉంటుంది. దాని తరువాత మరో నాలుగు రకాతులు నమాజు చేస్తారు. ఇది కూడ ఎంతో సుందరంగా, సుదీర్ఘంగా, వర్ణనాతీతంగా ఉంటుంది. ఆ తరువాత మరో మూడు రకాతులు పఠిస్తారు. నేను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను ఉద్దేశించి “మీరు వితర్ నమాజు చేయడానికి ముందు పడుకుంటారా?” అని అడిగాను (ఓసారి). అందుకాయన “ఆయిషా! నా కళ్ళు తప్పకుండా నిద్రిస్తాయి. కాని నా హృదయం మాత్రం (మేల్కొనే ఉంటుంది అది) ఎన్నటికీ నిద్రించదు” అని అన్నారు.
[సహీహ్ బుఖారీ : 19వ ప్రకరణం – అత్తహ్హజుద్, 16వ అధ్యాయం – ఖియామున్నబీ (సల్లల్లాహు అలైహి వసల్లం) బిల్ ల్లెలి ఫీరమజాన వ గైరిహీ]
427 – حديث عَائِشَةَ، قَالَتْ: كَانَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يُصَلِّي مِنَ اللَّيْلِ ثَلاَثَ عَشْرَةَ رَكْعَةً؛ مِنْهَا الْوِتْرُ، وَرَكْعَتَا الْفَجْرِ
__________
أخرجه البخاري في: 19 كتاب التهجد: 10 باب كيف كان صلاة النبي صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ وكم كان النبي يصلي من الليل
427. హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) రాత్రివేళ పదమూడు రకాతులు నమాజ్ చేసేవారు. ఆ పదమూడు రకాతులలో (ఒక రకాత్) వితర్, ఫజ్ర్ వేళకు సంబంధించిన రెండు రకాతుల సున్నత్ కూడ చేరి ఉన్నాయి. (సహీహ్ బుఖారీ : 19వ ప్రకరణం – తహజ్జుద్, 10వ అధ్యాయం – కైఫకానసలాతిన్నబీ (సల్లల్లాహు అలైహి వసల్లం) వకమ్ కానన్నబీ (సల్లల్లాహు అలైహి వసల్లం) మినల్లెల్)
428 – حديث عَائِشَةَ عَنِ الأَسْوَدِ، قَالَ: سَأَلْتُ عَائِشَةَ، كَيْفَ كَانَ صَلاَةُ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ بِاللَّيْلِ قَالَتْ: كَانَ يَنَامُ أَوَّلَهُ، وَيَقُومُ آخِرَهُ، فَيُصَلِّي ثُمَّ يَرْجِعُ إِلَى فِرَاشِهِ، فَإِذَا أَذَّنَ الْمُؤَذِّنُ وَثَبَ فَإِنْ كَانَ بِهِ حَاجَةٌ اغْتَسَلَ، وَإِلاَّ تَوَضَّأَ وَخَرَجَ
__________
أخرجه البخاري في: 19 كتاب التهجد: 15 باب من نام أول الليل وأحيا آخره
428. హజ్రత్ అస్వద్ బిన్ యజీద్ (రహిమహుల్లాహ్) కథనం:- “రాత్రివేళ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నమాజు పరిస్థితి ఏమిటి?” అని నేను విశ్వాసుల మాతృమూర్తి హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా)ను అడిగాను. దానికామె ఇలా సమాధానమిచ్చారు. “దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) రాత్రి తొలి జామున పడుకుంటారు. చివరి జామున మేల్కొని నమాజు చేస్తారు. ఆ తరువాత పడక మీద కెళ్ళి పడుకుంటారు. (తెల్లవారుజామున) ముఅజ్జిన్ అజాన్ ఇవ్వగానే పడకమీద నుంచి, లేచి స్నానం చేయవలసివస్తే స్నానం చేస్తారు, లేకుంటే వుజూ మాత్రమే చేసి బయటికి (మస్జిదు వైపు) వెళ్తారు”.
[సహీహ్ బుఖారీ : 19వ ప్రకరణం – తహజ్జుద్, 15వ అధ్యాయం – మన్ నామ అవ్వలుల్ లైలి వ అహ్యా ఆఖిరా)
429 – حديث عَائِشَةَ عَنْ مَسْرُوقٍ، قَالَ: سَأَلْتُ عَائِشَةَ، أَيُّ الْعَمَلِ كَانَ أَحَبَّ إِلَى النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَتِ: الدَّائمُ، قُلْتُ: مَتَى كَانَ يَقُومُ قَالَتْ: كَانَ يَقُومُ إِذَا سَمِعَ الصَّارِخَ
__________
أخرجه البخاري في: 19 كتاب التهجد: 7 باب من نام عند السحر
429. హజ్రత్ మస్రూఖ్ (రహిమహుల్లాహ్) కథనం:-
నేను (ఓసారి) హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా)ని “దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు అన్నిటికంటే ఎక్కువగా ఏ పని అంటే ఇష్టం? ” అని అడిగాను. దానికామె “ఆయనకు నిత్యం క్రమం తప్పకుండా చేసేపని అంటే ఎంతో ఇష్టం” అని సమాధానమిచ్చారు. “మరి రాత్రివేళ ఆయన (తహజ్జుద్ నమాజు చేయడానికి) ఎప్పుడు లేస్తారు?” అని అడిగాను మళ్ళీ. అందుకామె “కోడికూత వినగానే లేస్తారు” అని అన్నారు.
[సహీహ్ బుఖారీ : 19వ ప్రకరణం – తహజ్జుద్, 7వ అధ్యాయం – మన్ నాము ఇన్దస్సహర్]
430 – حديث عَائِشَةَ قَالَتْ: مَا أَلْفَاهُ عِنْدِي إِلاَّ نَائمًا تَعْنِي النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ
__________
أخرجه البخاري في: 19 كتاب التهجد: 7 باب من نام عند السحر
430. హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నా దగ్గర ఎప్పుడు (రాత్రి) గడిపినా తెల్లవారు జామున మాత్రం తప్పకుండా పడుకునేవారు. [సహీహ్ బుఖారీ : 10వ ప్రకరణం – తహజ్జుద్, 7వ అధ్యాయం – మన్ నామ ఇన్దస్సహరి]
431 – حديث عَائِشَةَ قَالَتْ: كُلَّ اللَّيْلِ أَوْتَرَ رسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، وانْتَهى وِتْرُهُ إِلَى السَّحَرِ
__________
أخرجه البخاري في: 14 كتاب الوتر: 2 باب ساعات الوتر
431. హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) రాత్రి అన్ని వేళల్లోను విత్ర్ నమాజు చేస్తారు. చివరికి ఆయన తెల్లవారు జామున (సహర్ వేళ) కూడ వితర్ నమాజు చేసేవారు. (సహీహ్ బుఖారీ : 14వ ప్రకరణం – వితర్, 2వ అధ్యాయం – సాఅతిల్ విత్ర్)
20వ అధ్యాయం – రాత్రి (తహజ్జుద్) నమాజు రెండేసి రకాతుల చొప్పున చేయాలి, చివరి జామున ఒక రకాత్ వితర్ صلاة الليل مثنى مثنى والوتر ركعة من آخر الليل
432 – حديث ابْنِ عُمَرَ، أَنَّ رَجُلاً سَأَلَ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ عَنْ صَلاَةِ اللَّيْلِ؛ فَقَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: صَلاَةُ اللَّيْلِ مَثْنَى مثنى، فَإِذَا خَشِيَ أَحَدُكُمُ الصُّبْحَ، صَلَّى رَكْعَةً وَاحِدَةً تُوتِرُ لَهُ مَا قَدْ صَلَّى
__________
أخرجه البخاري في: 14 كتاب الوتر 1 باب ما جاء في الوتر
432. హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం:- ఒక వ్యక్తి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను రాత్రివేళ (తహజ్జుద్) నమాజు గురించి అడిగాడు. దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సమాధానమిచ్చారు: “రాత్రి వేళ నఫిల్ నమాజు రెండేసి రకాతుల చొప్పున చేయాలి. ఇక ఉషోదయం కావస్తోందని భావించినపుడు ఒక రకాతు పఠించు. దీనివల్ల మొత్తం నమాజులు వితర్ (బేసి సంఖ్య నమాజ్) అయిపోతాయి”. (సహీహ్ బుఖారీ : 14వ ప్రకరణం – వితర్, 1వ అధ్యాయం – మాజాఆ ఫిల్ విత్ర్)
433 – حديث ابْنِ عُمَرَ، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: اجْعَلُوا آخِرَ صَلاَتِكُمْ بِاللَّيْلِ وِتْرًا
__________
أخرجه البخاري في: 14 كتاب الوتر: 4 باب ليجعل آخر صلاته وترا
433. హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం:- రాత్రి వేళ నమాజు ముగింపులో వితర్ నమాజు చేయండని దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) సెలవిచ్చారు. [సహీహ్ బుఖారీ : 14వ ప్రకరణం – వితర్, 4వ అధ్యాయం – లియజ్ అల్ ఆఖిర సలాతిహి విత్రా]
24వ అధ్యాయం – రాత్రి చివరి జామున జిక్ర్, దుఆ చేయడం الترغيب في الدعاء والذكر في آخر الليل والإجابة فيه
434 – حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: يَنْزِلُ رَبُّنَا تَبَارَكَ وَتَعَالَى كلَّ لَيْلَةٍ إِلَى السَّمَاءِ الدُّنْيَا، حِينَ يَبْقَى ثُلُثُ اللَّيْلِ الآخِرِ، يَقولُ مَنْ يَدْعُونِي فَأَسْتَجِيبَ لَهُ، مَنْ يَسْأَلُنِي فَأُعْطِيَهُ، مَنْ يَسْتَغْفِرُنِي فَأَغْفِرَ لَهُ
__________
أخرجه البخاري في: 19 كتاب التهجد: 14 باب الدعاء والصلاة في آخر الليل
434. హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:
మహోన్నతుడు, శుభదాయకుడు అయిన మన ప్రభువు ప్రతి రోజు రాత్రి చివరి మూడో జామున మొదటి ఆకాశం పై అవతరించి (మానవుల్ని సంబోధిస్తూ) “నన్ను మొర పెట్టుకునే వారెవరైనా ఉన్నారా? (ఈ సమయంలో) నేను వారి మొరలను ఆలకిస్తాను. నన్ను పిలిచే వారెవరైరా ఉన్నారా? నేను వారి పిలుపుకు సమాధానమిస్తాను. నన్ను క్షమాపణ కోరే వారెవరైనా ఉన్నారా? నేను వారిని క్షమిస్తాను” అని అంటాడు.
[సహీహ్ బుఖారీ : 19వ ప్రకరణం – తహజ్జుద్, 14వ అధ్యాయం – అద్దుఆఇ వస్సలాతి మిన్ ఆఖిరిల్లైల్]
25వ అధ్యాయం – రమజాన్ నెలలో తరావీహ్ నమాజు ప్రాముఖ్యం
الترغيب في قيام رمضان وهو التراويح
435 – حديث أَبِي هُرَيْرَةَ، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: مَنْ قَامَ رَمَضَانَ إِيمَانًا واحْتِسَابًا غُفِرَ لَهُ مَا تَقَدَّمَ مِنْ ذَنْبِهِ
__________
أخرجه البخاري في: 27 كتاب الإيمان: 27 باب تطوع قيام رمضان من الإيمان
435. హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:- “రమజాన్ నెలలో ఎవరు ధృడ విశ్వాసంతో, పుణ్యఫలాపేక్షతో రాత్రిళ్ళు తరావీహ్ నమాజు చేస్తారో వారి గత పాపాలన్నీ క్షమించబడతాయి.” [సహీహ్ బుఖారీ : 2వ ప్రకరణం – ఈమాన్, 27వ అధ్యాయం – తతవ్వవు ఖియామి రమజాన్ మినల్ ఈమాన్]
436 – حديث عَائِشَةَ، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ خَرَجَ ذَاتَ لَيْلَةٍ مِنْ جَوْفِ اللَّيْلِ فَصَلَّى فِي الْمَسْجِدِ، فَصَلَّى رِجَالٌ بِصَلاَتِهِ، فَأَصْبَحَ النَّاسُ فَتَحَدَّثُوا، فَاجْتَمَعَ أَكْثَرُ مِنْهُمْ فَصَلَّوْا مَعَهُ، فَأَصْبَحَ النَّاسُ فَتَحَدَّثُوا، فَكَثُرَ أَهْلُ الْمَسْجِدِ مِنَ اللَّيْلَةِ الثَّالِثَةِ، فَخَرَجَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فَصَلَّوا بِصَلاَتِهِ، فَلَمَّا كَانَتِ اللَّيْلَةُ الرَّابِعَةُ عَجَزَ الْمَسْجِدُ عَنْ أَهْلِهِ حَتَّى خَرَجَ لِصَلاَةِ الصُّبْحِ؛ فَلَمَّا قَضَى الْفَجْرَ أَقْبَلَ عَلَى النَّاسِ فَتَشَهَّدَ ثُمَّ قَالَ: أَمَّا بَعْدُ؛ فَإِنَّهُ لَمْ يَخْفَ عَلَيَّ مَكَانُكُمْ، لكِنِّي خَشِيتُ أَنْ تُفْرَضَ عَلَيْكُمْ فَتَعْجِزُوا عَنْهَا
__________
أخرجه البخاري في: 11 كتاب الجمعة: 29 باب من قال في الخطبة بعد الثناء أما بعد
436. హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం:- ఓ రోజు నడిరేయి వేళ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మస్జిదుకెళ్ళి నమాజు చేశారు. అప్పుడు మరికొందరు వ్యక్తులు కూడ వచ్చి ఆయనతో పాటు నమాజు చేశారు. ఉదయం ఈ విషయం గురించి ప్రజలు పరస్పరం చెప్పుకున్నారు. (రెండో రోజు రాత్రి) మొదటి రాత్రి కంటే ఎక్కువమంది జనం వచ్చారు. అందరూ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నేతృత్వంలో నమాజు చేశారు. మరునాడు ఈ విషయం గురించి జనం మరింత ఎక్కువగా చెప్పుకున్నారు. మూడో రోజు రాత్రి జనం ఇంకా ఎక్కువ మంది వచ్చారు. దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) కూడా ఇంటి నుంచి బయలుదేరి ప్రజలకు నేతృత్వం వహించి నమాజు చేశారు.
నాల్గవ రోజు రాత్రి అయితే జనం మరింత అత్యధిక మంది రావడంతో మస్జిదు కిటకిటలాడిపోయింది. అయితే (ఆ రోజు రాత్రి దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ఇంటి నుంచి బయటకి రాలేదు. తెల్లవారుజామున మాత్రమే ఫజ్ర్ నమాజు కోసం బయలుదేరి మస్జిదుకు వచ్చారు. నమాజు ముగిసిన తరువాత ప్రజల వైపు దృష్టి సారించారు. దైవస్తోత్రం తర్వాత ఇలా అన్నారు: “ప్రజలారా! రాత్రి మీరు మస్జిలో ఉన్నారన్న సంగతి నాకు తెలియనిది కాదు, కానీ (నేనిలా ప్రతి రాత్రి వస్తూంటే) ఈ విధంగా ఈ (తరావీహ్) నమాజు మీకు ఫర్జ్ (విధి) చేయబడవచ్చనీ, ఆ తరువాత మీరు దాన్ని నెరవేర్చలేకపోతారేమోనని నేను భయపడ్డాను.”
(సహీహ్ బుఖారీ : 11 వ ప్రకరణం – జుమా, 29వ అధ్యాయం – మన్ ఖాల ఫిల్ ఖుత్ బతి బాదస్సనా అమ్మాబాద్)
26వ అధ్యాయం – నడి రేయి నమాజు (తహజ్జుద్), తరువాత వేడుకోలు (దుఆ)
الدعاء في صلاة الليل وقيامه
437 – حديث ابْنِ عَبَّاسٍ، قَالَ: بِتُّ عِنْدَ مَيْمُونَةَ، فَقَامَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فَأَتَى حَاجَتَهُ، غَسَلَ وَجْهَهُ وَيَدَيْهِ ثُمَّ نَامَ، ثُمَّ قَامَ فَأَتَى الْقِرْبَةَ، فَأَطْلَقَ شِنَاقَهَا، ثُمَّ تَوَضَّأَ وُضُوءًا بَيْنَ وُضُوءَيْنِ لَمْ يُكْثِرْ، وَقَدْ أَبْلَغَ، فَصَلَّى، فَقُمْتُ فَتَمَطَّيْتُ كَرَاهِيَةَ أَنْ يَرَى [ص:146] أَنِّي كُنْتُ أَرْقبُهُ، فَتَوَضَّأْتُ، فَقَامَ يُصَلِّي، فَقُمْتُ عَنْ يَسَارِهِ، فَأَخَذَ بِأُذُنِي فَأَدَارَنِي عَنْ يَمِينِهِ، فَتَتَامَّتْ صَلاَتُهُ ثَلاَثَ عَشْرَةَ رَكْعَةً، ثُمَّ اضْطَجَعَ فَنَامَ حَتَّى نَفَخَ، وَكَانَ إِذَا نَامَ نَفَخَ، فَآذَنَهُ بِلاَلٌ بِالصَّلاَةِ فَصَلَّى وَلَمْ يَتَوَضَّأ؛ وَكَانَ يَقُولُ فِي دُعَائِهِ:
اللهُمَّ اجْعَلْ فِي قَلْبِي نُورًا، وَفِي بَصَرِي نُورًا، وَفِي سَمْعِي نُورًا، وَعَنْ يَمِينِي نُورًا، وَعَنْ يَسَارِي نُورًا، وَفَوْقِي نُورًا، وَتَحْتِي نُورًا، وَأَمَامِي نُورًا، وَاجْعَلْ لِي نُورًا
قَالَ كُرَيْبٌ (الرَّاوِي عَنِ ابْنِ عَبَّاسٍ) وَسَبْعٌ فِي التَّابُوتِ، فَلَقَيْتُ رَجُلاً مِنْ وَلَدِ الْعَبَّاسِ فَحَدَّثَنِي بِهِنَّ فَذَكَرَ عَصَبِي وَلَحْمِي وَدَمِي وَشَعَرِي وَبَشَرِي، وَذَكَرَ خَصْلَتَيْنِ
__________
أخرجه البخاري في: 80 كتاب الدعوات: 10 باب الدعاء إذا انتبه من الليل
437. హజ్రత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) కథనం:- నేనొక రోజు రాత్రి విశ్వాసుల మాతృమూర్తి హజ్రత్ మైమూన (రదియల్లాహు అన్హా) గారి ఇంట్లో గడిపాను. (ఆ రోజు అర్ధరాత్రి) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మేల్కొని కాలకృత్యాలు తీర్చుకున్నారు. ముఖం, చేతులు కడుక్కొని పడుకున్నారు. ఆ తరువాత (కాస్సేపటికి) మళ్ళీ లేచి నీళ్ళ తిత్తి దగ్గరకు వెళ్ళారు. దాని మూతి విప్పదీసి మధ్యస్థాయి వుజూ చేశారు. అంటే నీళ్ళు ఎక్కువగా వాడలేదు, కాని పూర్తిగా వుజూ చేశారు. ఆ తర్వాత నమాజు చేయడానికి ఉపక్రమించారు.
నేను కూడా లేచాను. నేను నిద్రపోకుండా జాగరణ చేస్తున్నానని ఆయన భావించవచ్చేమో, అది ఆయనకు అయిష్టం కలిగించవచ్చేమో. అందువల్ల నేను కూడా లేచి ఒళ్ళు విరుచుకున్నాను. ఆయన దైనందిన కార్యకలాపాలను గమనిస్తూ నేను కూడ వుజూ చేశాను. ఆయన నిలబడి నమాజు చేస్తుంటే నేను వెళ్ళి ఆయన ఎడమవైపున నిల్చున్నాను. (వెంటనే) ఆయన నా చెవి పెట్టి మెలేస్తూ, నన్ను తన కుడివైపున నిలబెట్టుకున్నారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆ సమయంలో పదమూడు రకాతులు నమాజు చేశారు. ఆ తర్వాత పడుకొని గురకబెట్టి నిద్రపోయారు. నిద్రలో గురక పెట్టడం ఆయనకు అలవాటు. ఆ తరువాత (తెల్లవారుజామున) హజ్రత్ బిలాల్ (రదియల్లాహు అన్హు) వచ్చి ఫజ్ర్ నమాజు వేళయిందని తెలియజేశారు. దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) (మస్జిదుకెళ్ళి) నమాజు చేశారు. (దాని కోసం) వుజూ చేయలేదు. ఆయన (ఆ రాత్రి తహజ్జుద్ నమాజ్ తర్వాత) ఈ విధంగా దుఆ (వేడుకోలు) చేశారు.
“అల్లాహుమ్మజ్ అల్ ఫీ ఖల్బీ నూరన్ వఫీ బసరీ నూరన్ వఫీ సమ్యీ నూరన్ వ అన్ యమీనీ నూరన్ వ అన యసారీ నూరన్ వ పౌఖీ నూరన్ వ తహతీ నూరన్ వ అమామీ నూరన్ వ ఖల్ఫీ నూరన్ వ య జ అల్లీ నూరా.”
(అల్లాహ్! నా హృదయాన్ని జ్యోతిర్మయం చెయ్యి. నా కళ్ళు కూడా జ్యోతిర్మయం చెయ్యి. నా చెవులు కూడ జ్యోతితో నింపు. నా కుడివైపు, ఎడమవైపులను, నా పైనా, క్రిందా, నా ముందూ, వెనకాల కూడ జ్యోతిర్మయం చెయ్యి. నాకు (ఆపాదమస్తకం) జ్యోతిని ప్రసాదించు).
హజ్రత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) నుండి ఈ హదీసు గ్రహించిన హజ్రత్ కురైబ్ (రహిమహుల్లాహ్) ఈ సందర్భంగా మాట్లాడుతూ “నా దగ్గర ఇంకా ఏడు పదాలు రాసి పెట్టి ఉన్నాయి. ప్రస్తుతం అవి నాకు గుర్తుకు రావటం లేదు” అని అన్నారు.
హదీసు ఉల్లేఖకుడు విషయాన్ని వివరిస్తూ “తర్వాత నేను అబ్బాస్ కుటుంబానికి చెందిన ఒక వ్యక్తిని కలుసుకున్నాను. అతను విషయం తెలియజేస్తూ “నా నరాలు, నా రక్తమాంసాలు, నా వెంట్రుకలు, నా చర్మం” అని ప్రస్తావించారు. ఆయన మరో రెండు వస్తువులను * గురించి కూడా ప్రస్తావించారు.
(సహీహ్ బుఖారీ : 80వ ప్రకరణం – అద్దావాత్, 10వ అధ్యాయం – అద్దుఆవు ఇజా అంతబమినల్లైల్)
(*) ఈ రెండు వస్తువులు ఎముకలు, మజ్జ (సారము) కావచ్చని కొందరి అభిప్రాయం. అవి కొవ్వు, ఎముకలని మరికొందరి అభిప్రాయం. నిజం అల్లాహ్ కే తెలుసు.
438 – حديث عَبْدِ اللهِ بْنِ عَبَّاسِ، أَنَّهُ بَاتَ لَيْلَةً عِنْدَ مَيْمُونَةَ، زَوْجِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ وَهِيَ خَالَتَهُ، فَاضْطَجَعْتُ فِي عَرْضِ الْوِسَادَةِ، وَاضْطَجَعَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ وَأَهْلُهُ فِي طُولِهَا، فَنَامَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ حَتَّى إِذَا انْتَصَفَ اللَّيْلُ أَوْ قَبْلَهُ بِقَلِيلٍ أَوْ بَعْدَهُ بِقَلِيلٍ، اسْتَيْقَظَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَجَلَسَ يَمْسَحُ النَّوْمَ عَنْ وَجْهِهِ بِيَدِهِ، ثُمَّ قَرَأَ الْعَشْرَ الآيَاتِ الْخَواتِمَ مِنْ سُورَةِ آلِ عِمْرَانَ، ثُمَّ قَامَ إِلَى شَنٍّ مُعَلَّقَةٍ فَتَوَضَّأَ مِنْهَا فَأَحْسَنَ وُضُوءَهُ، ثُمَّ قَامَ يُصَلِّي [ص:147] قَالَ ابْنُ عَبَّاسٍ: فَقُمْتُ فَصَنَعْتُ مِثْلَ مَا صَنَعَ، ثُمَّ ذَهَبْتُ فَقُمْتُ إِلَى جَنْبِهِ فَوَضَعَ يَدَهُ الْيُمْنَى عَلَى رَأْسِي وَأَخَذَ بِأُذُنِي الْيُمْنَى يَفْتِلُهَا؛ فَصَلَّى رَكْعَتَيْنِ، ثُمَّ رَكْعَتَيْنِ، ثُمَّ رَكْعَتَيْنِ ثُمَّ رَكْعَتَيْنِ، ثُمَّ رَكْعَتَيْنِ، ثُمَّ رَكْعَتَيْنِ، ثُمَّ أَوْتَرَ؛ ثُمَّ اضْطَجَعَ حَتَّى أَتَاهُ الْمُؤذِّنُ فَقَامَ فَصَلَّى رَكْعَتَيْنِ خَفِيفَتَيْنِ، ثُمَّ خَرَجَ فَصَلَّى الصُّبْحَ
__________
أخرجه البخاري في: 4 كتاب الوضوء: 36 باب قراءة القرآن بعد الحدث وغيره
438. హజ్రత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) కథనం:- నేనొక రోజు రాత్రి నా పినతల్లి, విశ్వాసుల మాతృమూర్తి అయిన హజ్రత్ మైమూన (రదియల్లాహు అన్హా) గారి ఇంట్లో గడిపాను. ఆ రాత్రి నేను పడక మీద అడ్డంగా పడుకున్నాను. దైవప్రవక్త సతీమణి (రదియల్లాహు అన్హు) పడకమీద నిలువుగా పడుకున్నారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కూడ పడుకున్నారు. అలా దాదాపు అర్థరాత్రి దాకా పడుకున్నారు. అంటే అర్థరాత్రికి కొంచెం ముందు వరకు లేదా అర్థరాత్రి దాటిన కాస్సేపటికి వరకు పడుకున్నారు. ఆ తరువాత లేచి కూర్చున్నారు. చేత్తో కళ్ళు నలుపుకొని నిద్ర మత్తును దూరం చేసుకున్నారు. తర్వాత ఆలి ఇమ్రాన్ సూరా లోని చివరి పది సూక్తులు పఠించి నిలబడ్డారు. వ్రేలాడుతున్న ఒక నీటి తిత్తి దగ్గరకు వెళ్ళి, అందులోని నీటితో వుజూ చేసుకున్నారు. ఎంతో చక్కగా వుజూ చేసుకున్నారు. ఆ తరువాత నిలబడి నమాజు చేయడం ప్రారంభించారు.
నేను కూడ లేచి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చేసినట్లే చేశాను. ఆ తరువాత వచ్చి ఆయన ఎడమ ప్రక్క నిలబడ్డాను. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన కుడిచేతిని నా తల మీద పెట్టి నా కుడి చెవి మెలివేయడం ప్రారంభించారు. (అలా నన్ను తన కుడిప్రక్కకు లాగి నిల్చో బెట్టుకున్నారు). ఆ తరువాత ఆయన రెండు రకాతులు నమాజు చేశారు. తర్వాత రెండు, ఆ తరువాత రెండు, ఆ తరువాత రెండు, ఆ తరువాత రెండు, ఆ తరువాత రెండు, ఆ తరువాత (ఒక రకాతు) వితర్ నమాజు చేశారు. ఆ తర్వాత వెళ్ళి పడుకున్నారు. చివరికి ముఅజ్జిన్ వచ్చి ఆయన్ని లేపారు. ఆయన లేచి రెండు రకాతులు తేలికపాటి నమాజు చేశారు. ఆ తర్వాత బయటికి వెళ్ళి (మస్జిద్ లో) ఫజ్ర్ నమాజ్ చేయించారు.
[సహీహ్ బుఖారీ : 4వ ప్రకరణం – వుజూ, 36వ అధ్యాయం – ఖిరాతిల్ ఖుర్ఆని బాదల్ హదసి వగైరిహీ]
439 – حديث ابْنِ عَبَّاسٍ، قَالَ: كَانَتْ صَلاَةُ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ ثَلاَثَ عَشْرَةَ رَكْعَةً، يَعْنِي بِاللَّيْلِ
__________
أخرجه البخاري في: 19 كتاب التهجد: 10 باب كيف كانت صلاة النبي صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ وكم كان النبي صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يصلى من الليل
439. హజ్రత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) కథనం:- “దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) రాత్రివేళ నమాజులో పదమూడు రకాతులు పఠించేవారు“.
[సహీహ్ బుఖారీ : 19వ ప్రకరణం – తహజ్జుద్, 1వ అధ్యాయం – కైఫకానత్ సలాతున్నబీ (సల్లల్లాహు అలైహి వసల్లం) వ కమ్ కానన్నబీ యుసల్లీ మినల్లయిల్)
440 – حديث ابْنِ عَبَّاسٍ، قَالَ: كَانَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ إِذَا تَهَجَّدَ مِنَ اللَّيْلِ قَالَ: اللهُمَّ لَكَ الْحَمْدُ أَنْتَ نُورُ السَّمَواتِ وَالأَرْضِ، وَلَكَ الْحَمْدُ أَنْتَ قَيِّمُ السَّمَواتِ وَالأَرْضِ، وَلَكَ الْحَمْدُ أَنْتَ رَبُّ السَّمَواتِ وَالأَرْضِ وَمَنْ فِيهِنَّ أَنْتَ الْحَقُّ، وَوَعْدُكَ الْحَقُّ، وَقَوْلُكَ الْحَقُّ، وَلِقَاؤكَ حَقٌّ، وَالْجَنَّةُ حَقٌّ، وَالنَّارُ حَقٌّ، وَالنَّبِيُّونَ حَقٌّ وَالسَّاعَةُ حَقٌّ؛ اللهُمَّ لَكَ أَسْلَمْتُ، وَبِكَ آمَنْتُ، وَعَلَيْكَ تَوَكَّلْتُ، وَإِلَيْكَ أَنَبْتُ، وَبِكَ خَاصَمْتُ، وَإِلَيْكَ حَاكَمْتُ، فَاغْفِرْلي مَا قَدَّمْتُ وَمَا أَخَّرْتُ، وَمَا أَسْرَرْتُ وَمَا أَعْلَنْتُ أَنْتَ إِلهِي لاَ إِلهَ إِلاَّ أَنْتَ
__________
أخرجه البخاري في: 97 كتاب التوحيد: 35 باب قول الله تعالى (يريدون أن يبدلوا كلام الله)
440. హజ్రత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) రాత్రివేళ తహజ్జుద్ నమాజు చేయడానికి లేచినపుడు ఈ విధంగా దుఆ (వేడుకోలు) చేసేవారు:
అల్లాహుమ్మ లకల్ హమ్దు అంత నూరుస్సమావాతి వల్ అర్జ్. వ లకల్ హమ్దు అంత ఖుయ్యిముస్సమావాతి వల్ అర్జ్. వ లకల్ హమ్దు అంత రబ్బుస్సమావాతి వల్ అర్జ్ వ మన్ ఫీ హిన్న, అంత హఖ్కు వ వాదుకల్ హఖ్కు వ ఖౌలుకల్ హఖ్కు వ లిఖావుక హఖ్కున్ వల్ జన్నతు హఖ్కున్ వన్నారు హఖ్కున్ వన్నబియ్యూన హఖ్కున్ వస్సాఅతు హఖ్కున్, అల్లాహుమ్మ లక అస్లంతు వ బిక ఆమంతు వ అలైక తవక్కల్తు వ ఇలైక అనబ్తు వ బిక ఖాసమ్తు వ ఇలైక హాకమ్తు ఫగ్ఫిర్లీ మా ఖద్ధమ్ తు వమా అఖ్ఖర్తు వ మా అస్రర్తు వ మా ఆలన్తు అంత ఇలాహీ లా ఇలాహ ఇల్లా అంత.
“అల్లాహ్! స్తుతిస్తోత్రాలు నీకే శోభిస్తాయి. నీవు భూమ్యాకాశాల కాంతివి. స్తుతిస్తోత్రాలకు నీవే అర్హుడవు. భూమ్యాకాశాలను స్థిరంగా నిలపగలవాడివి నీవే. నీకే సకల ప్రశంసలు వర్తిస్తాయి. భూమ్యాకాశాలకు, వాటిలో ఉండే సమస్త సృష్టిరాసులకు నీవే ప్రభువువి, పోషకుడివి. నీ వాగ్దానం సత్యంతో కూడుకున్నది. నీ వాణి కూడా సత్యమైనది. (మేమంతా మరణానంతరం) నీ సన్నిధికి రావడం యదార్ధం. స్వర్గ నరకాలు రెండు యదార్థాలే. దైవప్రవక్తలంతా సత్యమంతులే. ప్రళయం కూడా సత్యబద్దమే. అల్లాహ్! నేను నీ విధేయుడ్ని, అజ్ఞాబద్దుడ్ని. నిన్ను విశ్వసించాను. నిన్నే నమ్ముకున్నాను. నీ మీదే నా మనసు లగ్నం చేశాను. నీ కోసమే పోరాడుతున్నాను. నిన్నే తీర్పుకై అర్ధిస్తున్నాను. నా గత భవిష్యత్ పాపాలు, నా గుప్త బహిర్గత పాపాలు సమస్తం క్షమించు. నీవే నా ప్రభువు,’ ఆరాధ్యదైవానివి నీవు తప్ప మరెవరూ ఆరాధ్యుడు లేడు.”
[సహీహ్ బుఖారీ : 97వ ప్రకరణం – తౌహీద్, 35వ అధ్యాయం – ఖౌలిల్లాహు తాలా యురీదూన అఁయ్యు బద్దిలూ కలామల్లాహ్)
27వ అధ్యాయం – నడిరేయి నమాజులో సుదీర్ఘ పారాయణం అభిలషణీయం
استحباب تطويل القراءة في صلاة الليل
441 – حديث عَبْدِ اللهِ بْنِ مَسْعُودٍ رضي الله عنه، قَالَ: صَلَّيْتُ مَعَ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ لَيْلَةً فَلَمْ يَزَلْ قَائمًا حَتَّى هَمَمْتُ بِأَمْرِ سَوْءٍ؛ قِيلَ لَهُ: وَمَا هَمَمْتَ قَالَ: هَمَمْت أَنْ أَقْعُدَ وَأَذَرَ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ
__________
أخرجه البخاري في: 19 كتاب التهجد: 9 باب طول القيام في صلاة الليل
441. హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ వూద్ (రదియల్లాహు అన్హు) కథనం:- ఓ రోజు రాత్రి నేను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)తో కలసి (తహజ్జుద్) నమాజు చేశాను. అప్పుడు ఆయన (నమాజులో) చాలా సేపు నిలబడ్డారు. దాంతో నా మనసులో ఒక దురాలోచన పుట్టింది. (ఈ సందర్భంలో ఒక వ్యక్తి) “మీ మనసులో పుట్టిన ఆ దురాలోచన ఏమిటని” అడిగాడు. దానికి హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ వూద్ (రదియల్లాహు అన్హు) “దైవప్రవక్తను వదిలి పెట్టి నేను కూర్చుందామన్న ఆలోచన కలిగింది” అని అన్నారు.
(సహీహ్ బుఖారీ : 19వ ప్రకరణం – తహజ్జుద్, 9వ అధ్యాయం – తవీలుల్ ఖియామి ఫీసలాతిల్లైల్ ]
28వ అధ్యాయం – నమాజు చేయకుండా తెల్లవారేదాకా పడుకునే వ్యక్తి
ما روي فيمن نام الليل أجمع حتى أصبح
442 – حديث عَبْدِ اللهِ بْنِ مَسْعُودٍ رضي الله عنه، قَالَ: ذُكِرَ عِنْدَ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ رَجُلٌ نَامَ لَيْلَهُ حَتَّى أَصْبَحَ، قَالَ: ذَاكَ رَجُلٌ بَالَ الشَّيْطَانُ فِي أُذُنَيْهِ أَوْ قَالَ: فِي أُذُنِهِ
__________
أخرجه البخاري في: 59 كتاب بدء الخلق: 11 باب صفة إبليس وجنوده
442. హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ వూద్ (రదియల్లాహు అన్హు) కథనం:-
(నమాజు చేయకుండా) తెల్లవారేదాకా పడుకునే వ్యక్తిని గురించి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ముందు ప్రస్తావించగా “అలాంటి వ్యక్తి చెవిలో లేదా చెవుల్లో షైతాన్ మూత్రం పోస్తాడు” అని అన్నారు ఆయన.
[సహీహ్ బుఖారీ: 59వ ప్రకరణం – బద్ అల్ ఖల్క్, 11వ అధ్యాయం – సిఫతి ఇబ్లీస్ వజునూదహు]
443 – حديث عَلِيِّ بْنِ أَبِي طَالِبٍ، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ طَرَقَهُ وَفَاطِمَةَ بِنْتَ النَّبِيِّ عَلَيْهِ السَّلاَمُ لَيْلَةً، فَقَالَ: أَلاَ تُصَلِّيَانِ فَقُلْتُ: يَا رَسُولَ اللهِ أَنْفُسُنَا بِيَدِ اللهِ، فَإِذَا شَاءَ أَنْ يَبْعَثَنَا بَعَثَنَا فَانْصَرَفَ حِينَ قُلْنَا ذلِكَ، وَلَمْ يَرْجِعْ إِلَيَّ شَيْئًا ثُمَّ سَمِعْتُهُ وَهُوَ مُوَلٍّ يَضْرِبُ فَخِذَهُ وَهُوَ يَقُولُ: (وَكَانَ الإِنْسَانُ أَكْثَرَ شَيْءٍ جَدَلاً)
__________
أخرجه البخاري في: 19 كتاب التهجد: 5 باب تحريض النبي صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ على صلاة الليل والنوافل
443. హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) బిన్ అబీ తాలిబ్ కథనం:- ఓ రోజు రాత్రి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మా ఇంటికి వచ్చి “మీరు (తహజ్జుద్) నమాజు చేయరా?” అని అడిగారు. దానికి నేను “దైవప్రవక్తా! మా ప్రాణాలు దేవుని అధీనంలో ఉన్నాయి. ఆయన మమ్మల్ని తాను తలచుకున్నప్పుడు మేల్కొలుపుతాడు” అని అన్నాము. ఈ మాటలు వినగానే ఆయన మాకు ఎలాంటి సమాధానం ఇవ్వకుండానే వెనుదిరిగి వెళ్ళిపోతూ, “నిజంగా మానవుడు పెద్ద జగడాల మారిగా తయారయ్యాడు” అని అన్నారు. (కహఫ్ సూరాలోని 54వ సూక్తిని ఉచ్ఛరిస్తూ)
(సహీహ్ బుఖారీ : 19వ ప్రకరణం – తహహుద్, 5వ అధ్యాయం – 1 తహ్రీజున్నబీ (సల్లల్లాహు అలైహి వసల్లం) అలా సలాతిల్లైలి వన్నవాఫిల్)
444 – حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: يَعْقِدُ الشَّيْطَانُ عَلَى قَافِيَةِ رَأْسِ أَحَدِكُمْ إِذَا هُوَ نَامَ ثَلاَثَ عُقَدٍ؛ يَضْرِبُ عَلَى كُلِّ عُقْدَةٍ، عَلَيْكَ لَيْلٌ طَوِيلٌ فَارْقُدْ، فَإِن اسْتَيْقَظَ فَذَكَرَ الله انْحَلَّتْ عُقْدَةٌ، فَإِنْ تَوَضَّأَ انْحَلَّتْ عُقْدَةٌ، فَإِنْ صَلَّى انْحَلَّتْ عُقْدَةٌ، فَأَصْبَحَ نَشِيطًا طَيِّبَ النَّفْسِ، وَإِلاَّ أَصْبَحَ خَبِيثَ النَّفْسِ كَسْلاَنَ
__________
أخرجه البخاري في: 19 كتاب التهجد: 12 باب عقد الشيطان على قافية الرأس إذا لم يصل بالليل
444. హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:-
“మనిషి రాత్రివేళ పడుకున్న తరువాత షైతాన్ అతని ముచ్చిలి గుంట పై మూడు ముళ్ళు వేస్తాడు. ప్రతి ముడి మీద ‘రాత్రి ఇంకా చాలా వుంది, హాయిగా పడుకో’ అంటూ మంత్రించి ఊదుతాడు. అప్పుడు మనిషి మేల్కొని అల్లాహ్ ను స్మరించగానే ఒక ముడి ఊడిపోతుంది. తరువాత వుజూ చేస్తే రెండవ ముడి ఊడిపోతుంది. ఆ తరువాత నమాజు చేస్తే మూడవ ముడి కూడా ఊడిపోతుంది. దాంతో ఆ వ్యక్తి తెల్లవారు జామున ఎంతో ఉత్సాహంతో, సంతోషంతో లేస్తాడు. అలా చేయకపోతే వళ్ళు బరువయి బద్ధకంగా లేస్తాడు”.
(సహీహ్ బుఖారీ : 19వ ప్రకరణం – తహజ్జుద్, 12వ అధ్యాయం – అఖ్ద షైతాని అలా ఖాఫియాతిర్రాస్]
29వ అధ్యాయం – నఫిల్ నమాజు ఇంట్లో చేయడం అభిలషణీయం
استحباب صلاة النافلة في بيته وجوازها في المسجد
445 – حديث ابْنِ عُمَرَ، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: اجْعَلُوا فِي بُيُوتِكُمْ مِنْ صَلاَتِكُمْ وَلاَ تَتَّخِذُوهَا قُبُورًا
__________
أخرجه البخاري في: 8 كتاب الصلاة: 52 باب كراهية الصلاة في المقابر
445. హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: “మీరు కొన్ని నమాజులు మీ ఇండ్లలో చేసుకోండి. మీ ఇండ్లను సమాధులుగా మార్చుకోకండి.” [సహీహ్ బుఖారీ : 8వ ప్రకరణం – సలాత్, 52వ అధ్యాయం – కరాహియతుస్సలాతి ఫిల్ మఖాబిర్)
446 – حديث أَبِي مُوسى رضي الله عنه، قَالَ: قَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: مَثَلُ الَّذِي يَذْكُرُ رَبَّهُ وَالَّذِي لاَ يَذْكُرُ مَثَلُ الْحَيِّ وَالْمَيِّتِ
__________
أخرجه البخاري في: 80 كتاب الدعوات: 66 باب فضل ذكر الله عز وجل
446. హజ్రత్ అబూ మూసా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు:- “ఎవరైతే తన ప్రభువుని స్మరిస్తూ ఉంటాడో అతనే సజీవ మానవుడు. మరెవరు తన ప్రభువును స్మరించడో అతను శవం లాంటివాడు.” * [సహీహ్ బుఖారీ : 80వ ప్రకరణం – అద్దావాత్, 66వ అధ్యాయం – ఫణి జిక్రిల్లాహి అజ్జ వ జల్ల)
* సహీహ్ ముస్లిం గ్రంధంలో హజ్రత్ అబూమూసా (రదియల్లాహు అన్హు) కథనం ఇలా వుంది. “అల్లాహ్ నామస్మరణ జరిగే ఇల్లు సజీవ మానవుడు లాంటిది. అల్లాహ్ నామస్మరణ జరగని ఇల్లు మృత మానవుని లాంటిది”.
447 – حديث زَيْدِ بْنِ ثَابِتٍ، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ اتَّخَذَ حُجْزَةً، مِنْ حَصِيرٍ، في رَمَضَانَ، فَصَلَّى فِيهَا لَيَالِيَ، فَصَلَّى بِصَلاَتِهِ نَاسٌ مِنْ أَصْحَابِهِ، فَلَمَّا عَلِمَ بِهِمْ جَعَلَ يَقْعُدُ، فَخَرَجَ إِلَيْهِمْ، فَقَالَ: قَدْ عَرَفْتُ الَّذِي رَأَيْتُ مِنْ صَنِيعِكُمْ، فَصَلُّوا أَيُّهَا النَّاسُ فِي بُيُوتِكُمْ فَإِنَّ أَفْضَلَ الصَّلاَةِ صَلاَةُ الْمَرْءِ فِي بَيْتِهِ إِلاَّ الْمَكْتُوبَة
__________
أخرجه البخاري في: 10 كتاب الأذان: 81 باب صلاة الليل
447. హజ్రత్ జైద్ బిన్ సాబిత్ (రదియల్లాహు అన్హు) కథనం:-
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) రమజాన్ మాసంలో చాపలతో ఒక కుటీరాన్ని నిర్మించుకుని, అందులో కొన్ని రాత్రులు నమాజు చేశారు. (ఆయన్ని చూసి) ఆయన అనుచరుల్లో కూడా కొందరు ఆయన వెనుక నమాజు చేయడం ప్రారంభించారు. కొందరు తనతో కలసి నమాజు చేస్తున్నారని తెలిసి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కుటీరం నుండి బయటికి రావడం మానేశారు. ఆ తరువాత (మరునాడు ఉదయం) వారి దగ్గరకు వచ్చి “మీరు చేస్తున్నదాన్ని నేను చూశాను. దాని వెనుక మీ ఉద్దేశం ఏమిటో కూడా నాకు తెలుసు (అంటే పుణ్యార్జన ఉద్దేశంతో మీరు నా వెనుక నమాజు చేయడం ప్రారంభించారు.) కనుక ప్రజలారా! మీరు మీ ఇండ్లలో (నఫిల్) నమాజు చేస్తూ ఉండండి. ఫర్జ్ నమాజ్ తప్ప మనిషికి అన్నిటికంటే తన ఇంట్లో చేసే నమాజే శ్రేష్ఠమయినది” అని బోధించారు.
(సహీహ్ బుఖారీ : 10వ ప్రకరణం – అజాన్, 81వ అధ్యాయం – సలాతి ల్లైల్)
31వ అధ్యాయం – నమాజు చేస్తున్నప్పుడు కునుకు వస్తే కునికిపాటు పోయేదాకా పడుకోవాలి أمر من نعس في صلاته أو استعجم عليه القرآن أو الذكر بأن يرقد أو يقعد حتى يذهب عنه ذلك
448 – حديث أَنَسِ بْنِ مَالِكٍ رضي الله عنه، قَالَ: دَخَلَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فَإِذَا حَبْلٌ مَمْدُودٌ بَيْنَ السَّارِيَتَيْنِ؛ فَقَالَ: مَا هذَا الْحَبْلُ قَالُوا: هذَا حَبْلٌ لِزَيْنَبَ، فَإِذَا فَتَرَتْ تَعَلَّقَت فَقَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: لاَحُلُّوهُ، لِيُصَلِّ أَحَدُكُمْ نَشَاطَهُ، فَإِذَا فَتَرَ فَلْيَقْعُدْ
__________
أخرجه البخاري في: 19 كتاب التهجد: 18 باب ما يكره من التشديد في العبادة
448. హజ్రత్ అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) కథనం:-
ఒకసారి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) (మస్జిదుకు) వచ్చి చూస్తే రెండు నిట్టాడుల మధ్య ఒక తాడు కట్టి ఉండటం కన్పించింది. అప్పుడు ఆయన “ఈ తాడు ఎందుకు కట్టారు?” అని అడిగారు. “దీన్ని జైనబ్ (రదియల్లాహు అన్హా) కట్టారు. నిలబడి నమాజు చేస్తు చేస్తూ అలసిపోతే ఆమె ఈ తాడు ఆధారంతో వ్రేలాడుతారు” అని చెప్పారు సహచరులు. అది విని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “అలా చేయకూడదు. ఈ తాడు విప్పదీయండి. మనస్సు లగ్నమయి వున్నంత సేపు నమాజు చేయాలి. అలుపు వస్తే కూర్చొని (కాస్సేపు) విశ్రాంతి తీసుకోవాలి. ఇదే మంచి పద్ధతి” అని అన్నారు.
(సహీహ్ బుఖారీ : 19వ ప్రకరణం – తహజ్జుద్, 18వ అధ్యాయం – మాయుక్రహు మినత్తష్దీది ఫిల్ ఇబాద్)
449 – حديث عَائِشَةَ، أَنَّ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ دَخَلَ عَلَيْهَا وَعِنْدَهَا امْرَأَةٌ، قَالَ: مَنْ هذِهِ قَالَتْ: فُلاَنَةُ، تَذْكُرُ مِنْ صَلاَتِهَا، قَالَ: مَهْ عَلَيْكُمْ بِمَا تُطِيقُونَ، فَوَاللهِ لاَ يَمَلُّ اللهُ حَتَّى تَمَلُّوا وَكَانَ أَحَبَّ الدِّينِ إِلَيْهِ مَا دَاوَمَ عَلَيْهِ صَاحِبُهُ
__________
أخرجه البخاري في: 2 كتاب الإيمان: 32 باب أحب الدين إلى الله أدومه
449. హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం:-
ఒకసారి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నా దగ్గరికి వచ్చినప్పుడు నా ముందు ఒక స్త్రీ కూర్చొని వుంది. (ఆమెను చూసి), “ఈ స్త్రీ ఎవర”ని అడిగారు ఆయన. హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) ఆమె ఫలానా స్త్రీ అని చెప్పి (రాత్రంతా మేల్కొని నమాజు చేస్తుంటుంది అంటూ) ఆమెను పొగడనారంభించారు. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు. “ఇక ఆపెయ్యి (ఈ పొగడ్తలు). (ఈవిడ) ఇలా చేయడం మంచి పద్ధతి కాదు. నెరవేర్చే శక్తి గల బాధ్యతలనే మనిషి తనమీద మోపుకోవాలి. అల్లాహ్ సాక్షి! (అల్లాహ్ ని) ఆరాధించడంలో మీరు అలసిపోనంత వరకు అల్లాహ్ కూడా (మీకు పుణ్యం ప్రసాదించడంలో) అలసిపోడు.” మనిషి చేసే ధర్మ కార్యాలన్నిటిలో అతను క్రమం తప్పకుండా ఎల్లప్పుడు చేసే పని మాత్రమే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు ఎక్కువ ప్రీతికరమైనది.
(సహీహ్ బుఖారీ : 2వ ప్రకరణం – ఈమాన్, 32వ అధ్యాయం – అహిబ్బుద్దీని ఇన్దల్లాహి అద్వముహూ)
450 – حديث عَائِشَةَ، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: إِذَا نَعَسَ أَحَدُكُمْ وَهُوَ يُصَلِّي فَلْيَرْقُدْ حَتَّى يَذْهَبَ عَنْهُ النَّوْمُ، فَإِنَّ أَحَدَكُمْ إِذَا صَلَّى وَهُوَ نَاعِسٌ لاَ يَدْرِي لَعَلَّهُ يَسْتَغْفِرُ فَيَسُب نَفْسَهُ
__________
أخرجه البخاري في: 4 كتاب الوضوء: 53 باب الوضوء من النوم
450. హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:- “నమాజు చేస్తున్నప్పుడు ఎవరికైనా కునుకు వస్తే ఆ కునికిపాటు దూరమయ్యే వరకు అతను పడుకోవాలి. నమాజు చేస్తూ కునుకుతుంటే అతను పాప క్షమాపణ కోరుతూ (అకస్మాత్తుగా) తనను తానే నిందించుకోవడం ప్రారంభించవచ్చు. ఆ సంగతి అతనికెలా తెలుస్తుంది?” (సహీహ్ బుఖారీ : 4వ ప్రకరణం – వుజూ, 53వ అధ్యాయం – అల్ వుజూ మినన్నౌమ్)
33వ అధ్యాయం – ఖుర్ఆన్ పారాయణంలో ఫలానా సూక్తి మరచిపోయానని చెప్పరాదు الأمر بتعهد القرآن وكراهة قول نسيت آية كذا وجواز قول أنسيتها
451 – حديث عَائِشَةَ، قَالَتْ: سَمِعَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَارِئًا يَقْرَأُ مِنَ اللَّيْلِ فِي الْمَسْجِدِ، فَقَالَ: يَرْحَمُهُ اللهُ لَقَدْ أَذْكَرَنِي كَذَا وَكَذَا، آيَةً أَسْقَطْتُهَا مِنْ سُورَةِ كَذَا وَكَذَا
__________
أخرجه البخاري في: 66 كتاب فضائل القرآن: 27 باب من لم ير بأسا أن يقول سورة البقرة وسورة كذا وكذا
451. హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఓసారి రాత్రివేళ మస్జిదులో ఒకతను ఖుర్ఆన్ పఠిస్తుంటే విని “ఆ వ్యక్తిపై అల్లాహ్ తన కారుణ్యాన్ని అవతరింపజేయుగాక. నేను ఫలానా సూరా (అధ్యాయం) పఠిస్తున్నప్పుడు వదిలి పెట్టిన ఫలానా ఆయత్ ని అతను నాకు గుర్తు చేశాడు” అని అన్నారు. (సహీహ్ బుఖారీ : 66వ ప్రకరణం – ఫజాయలె ఖుర్ఆన్, 27వ అధ్యాయం – మన్ ల్లమ్ యరబాస అఁయ్యఖూల సూరతుల్ బఖర వ సూరతు కిజా వకిజా)
452 – حديث ابْنِ عُمَرَ، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: إِنَّمَا مَثَلُ صَاحِبِ الْقُرْآنِ كَمَثَلِ صَاحِبِ الإِبِلِ الْمُعَقَّلَةِ، إِنْ عَاهَدَ عَلَيْهَا أَمْسَكَهَا، وَإِنْ أَطْلَقَهَا ذَهَبَتْ
__________
أخرجه البخاري في: 66 كتاب فضائل القرآن: 23 باب استذكار القرآن وتعاهده
452. హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: “ఖుర్ఆన్ కంఠస్తం చేసిన మనిషి పోలిక తన ఒంటెను త్రాడుతో కట్టి ఉంచిన వ్యక్తిలా ఉంది. అతనా ఒంటెను అలా కాపలా కాస్తూ ఉంటే అది ఎక్కడికీ పోకుండా ఆగి వుంటుంది. ఒకవేళ (తాడు విప్పి) స్వేచ్ఛగా వదిలివేస్తే అది ఎక్కడికైనా వెళ్తుంది.” [సహీహ్ బుఖారీ : 66వ ప్రకరణం – ఫజాయలె ఖుర్ఆన్, 23వ అధ్యాయం – ఇస్తిజ్ కారిల్ ఖుర్ఆని వత ఆహుదిహీ]
453 – حديث عَبْدِ اللهِ بْنِ مَسْعُودٍ قَالَ: قَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: بِئْسَ مَا لأَحَدِهِمْ أَنْ يَقُولَ نَسِيتُ آيَةَ كَيْتَ وَكَيْتَ، بَلْ نُسِّيَ؛ وَاسْتَذْكِرُوا الْقُرْآنَ، فَإِنَّهُ أَشَدُّ تَفَصِّيًا مِنْ صُدُورِ الرِّجَالِ مِنَ النَّعَمِ
__________
أخرجه البخاري في: 66 كتاب فضائل القرآن: 23 باب استذكار القرآن وتعاهده
453. హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ వూద్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: “ఎవరైనా దివ్యఖుర్ఆన్లోని ఫలానా సూక్తి (ఆయత్) మరచిపోయానని అనకూడదు. దానికి బదులు నన్ను మరపింపజేయడం జరిగిందని చెప్పాలి. ఖుర్ఆన్ (ఏమరుపాటు వహించే) ప్రజల హృదయాల నుండి పొగరుబోతు ఒంటెల కంటే కూడా వేగంగా బయటికెళ్ళిపోతుంది. అందువల్ల ఖుర్ఆన్ ని నిరంతరం పఠిస్తూ జ్ఞాపకం ఉంచుకోండి”. (సహీహ్ బుఖారీ : 66వ ప్రకరణం – ఫజాయలె ఖుర్ఆన్, 23వ అధ్యాయం – ఇస్తిజ్కారిల్ ఖుర్ఆని వతాహదిహీ]
454 – حديث أَبِي مُوسى، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: تَعَاهَدُوا الْقُرْآنَ، فَوَالَّذِي نَفْسِي بِيَدِهِ لَهُوَ أَشَدُّ تَفَصِّيًا مِنَ الإِبِلِ فِي عُقُلِهَا
__________
أخرجه البخاري في: 66 كتاب فضائل القرآن: 23 باب استذكار القرآن وتعاهده
454. హజ్రత్ అబూమూసా (రదియల్లాహు అన్హు) కథనం:- ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు:- “ఎవరి అధీనంలో నా ప్రాణం ఉందో ఆ శక్తి స్వరూపుని సాక్షి! ఖుర్ఆన్ కాళ్ళు కట్టివేసిన ఒంటెల కంటే కూడ వేగంగా విడిపించుకొని పారిపోతుంది. అందువల్ల మీరు ఖుర్ఆన్ ని పరిరక్షిస్తూ ఉండండి. (అంటే దాన్ని నిరంతరం పఠిస్తూ జ్ఞాపకం ఉంచుకోండి)”. [సహీహ్ బుఖారీ : 66వ ప్రకరణం – ఫజాయలె ఖుర్ఆన్, 23వ అధ్యాయం – ఇస్తిజ్కారిల్ ఖుర్ఆని వతఆహదిహీ]
34వ అధ్యాయం – ఖుర్ఆన్ ని ఉచ్చారణ నిబద్ధతతో చక్కగా పఠించడం అభిలషణీయం استحباب تحسين الصوت بالقرآن
455 – حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، أَنَّهُ كَانَ يَقُولُ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: لَمْ يَأْذَنِ اللهُ لِشَيْءٍ مَا أَذِنَ لِلنَّبِيِّ أَنْ يَتَغَنَّى بِالْقُرَآنِ يُرِيدُ يَجْهَرُ بِهِ
__________
أخرجه البخاري في: 66 كتاب فضائل القرآن: 19 باب من لم يتغن بالقرآن
455. హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు : “సుమధుర స్వరంతో ఖుర్ఆన్ పారాయణం చేసే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కంఠస్వరాన్ని అల్లాహ్ ఎంతో శ్రద్ధగా ఆలకిస్తాడు. ఆయన అంత శ్రద్ధగా మరే స్వరాన్ని వినడు”. అంటే (చక్కని ఉచ్ఛారణతో) బిగ్గరగా పారాయణం చేయడమని అర్థం. (సహీహ్ బుఖారీ : 66వ ప్రకరణం – ఫజాయలె ఖుర్ఆన్, 19వ అధ్యాయం – మల్లమ్ యతగన్ని బిల్ ఖుర్ఆన్]
456 – حديث أبِي مُوسى رضي الله عنه عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ لَهُ: يَا أَبَا مُوسى لَقَدْ أُوتِيتَ مِزْمَارًا مِنْ مَزَامِيرِ آلِ دَاوُدَ
__________
أخرجه البخاري في: 66 كتاب فضائل القرآن: 31 باب حسن الصوت بالقراءة
456. హజ్రత్ అబూ మూసా (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నన్ను సంబోధిస్తూ “అబూమూసా! హజ్రత్ దావూద్ (అలైహిస్సలాం) గారి స్వరమాధుర్యంలో ఒక భాగం నీకు ప్రసాదించబడింది.” (సహీహ్ బుఖారీ : 66వ ప్రకరణం – ఫజాయలె ఖుర్ఆన్, 31వ అధ్యాయం – హుస్ని స్సౌతి బిల్ ఖిరాఅత్)
35వ అధ్యాయం – మక్కా విజయం నాడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఫతహ్ సూరా పఠించడం ذكر قراءة النبي صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ سورة الفتح يوم فتح مكة
457 – حديث عَبْدِ اللهِ بْنِ مُغَفَّلٍ، قَالَ: رَأَيْتُ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَوْمَ فَتْحِ مَكَّةَ عَلَى نَافَتِهِ وَهُوَ يَقْرَأُ سُورَةَ الْفَتْح، يُرَجِّعُ، قَالَ: لَوْلاَ أَنْ يَجْتَمِعَ النَّاسُ حَوْلِي لَرَجَّعْتُ كَمَا رَجَّعَ
__________
أخرجه البخاري في: 64 كتاب المغازي: 48 باب أين ركز النبي صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ الراية يوم الفتح
457. హజ్రత్ అబ్దుల్లా బిన్ ముగఫ్ఫిల్ (రదియల్లాహు అన్హు) కథనం:- మక్కా జయించబడిన రోజు దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) తన ఒంటి మీద ఎక్కి (నడుస్తూ) ‘ఫతహ్’ సూరాను లయబద్ధంగా పఠించడం నేను విన్నాను. హజ్రత్ అబ్దుల్లాబిన్ ముగఫ్ఫిల్ (రదియల్లాహు అన్హు) ఈ విషయం తెలియజేస్తూ ఇలా అన్నారు; “ప్రజలు నా చుట్టూ గుమికూడతారన్న భయం గనక లేకపోతే, నేను ఆ రోజు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పఠించిన విధంగా లయబద్ధంగా పఠించి విన్పించేవాడ్ని”. *
[సహీహ్ బుఖారీ : 64వ ప్రకరణం – అల్ మగాజి, 48వ అధ్యాయం – ఐనరకజన్నబీ (సల్లల్లాహు అలైహి వసల్లం) అర్రాయత యౌమల్ ఫతహ్]
* ఇక్కడ మూలభాషలో ‘తర్జీ’ అనే పదం ప్రయోగించబడింది. తర్జీ అంటే స్వరాన్ని కంఠంలోనే తిప్పుతూ పఠించడం. హజ్రత్ అబ్దుల్లా బిన్ ముగఫ్ఫిల్ (రదియల్లాహు అన్హు) అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పఠించిన తీరుని ఆచరణాత్మకంగా విన్పించారు. దాన్ని బట్టి ఒంటె నడుస్తూ ఉండటం వల్ల దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కూడా కదులుతూ పఠనంలో దీర్ఘాలు తీసి ఉంటారని తెలుస్తోంది.
36వ అధ్యాయం – ఖుర్ఆన్ పారాయణ శుభంతో సకీనత్ (స్థిమితం) అవతరిస్తుంది
نزول السكينة لقراءة القرآن
458 – حديث الْبَرَاءِ بْنِ عَازِبٍ قَرَأَ رَجُلٌ الْكَهْفَ، وَفِي الدَّارِ الدَّابَّةُ، فَجَعَلَتْ تَنْفِرُ، فَسَلَّمَ، فَإِذَا ضَبَابَةٌ أَوْ سَحَابَةٌ غَشِيَتْهُ؛ فَذَكَرَهُ لِلنَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَقَالَ اقْرَأْ فُلاَن فَإِنَّهَا السَّكِينَةُ نَزَلَتْ لِلْقُرْآنِ أَوْ تَنَزَّلَتْ لِلْقُرْآنِ
__________
أخرجه البخاري في: 61 كتاب المناقب: 25 باب علامات النبوة في الإسلام
458. హజ్రత్ బరాబిన్ ఆజిబ్ (రదియల్లాహు అన్హు) కథనం:- ఒక వ్యక్తి (నమాజులో) ఖుర్ఆన్ పఠిస్తుంటే అతని ఇంట్లో కట్టివేయబడిన పశువు బెదరసాగింది. దాంతో అతను నమాజు ముగించి చూస్తే ఒక మేఘం లేక పొగమంచు తన చుట్టూ ఆవరించి ఉండటం కన్పించింది. (ఆ తరువాత) ఈ సంఘటన గురించి అతను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ముందు ప్రస్తావించాడు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అది విని “నీవు (ఎల్లప్పుడూ ఇలాగే) ఖుర్ఆన్ పారాయణం చేస్తూ ఉండు. ఖుర్ఆన్ పారాయణ మహత్తులో అవతరించిన లేక అవతరిస్తూ ఉండిన ‘ స్థిమితం’ ఇది” * అని అన్నారు.
[సహీహ్ బుఖారీ : 61వ ప్రకరణం – మనాఖిబ్, 25వ అధ్యాయం – అలా మాతిన్న బువ్వత్ ఫిల్ ఇస్లాం]
* ఇక్కడ మూలభాషలో ‘సకీనత్‘ అనే పదం వచ్చింది. దీనికి విస్తృతభావం ఉంది. ఇది అల్లాహ్ సృష్టిలో ఒక విశిష్టవస్తువు. ఇందులో మనో స్థిమితం, అల్లాహ్ యొక్క కారుణ్యం ఉన్నాయి. వాటితో పాటు దైవదూతలు కూడా దిగివస్తారు.
459 – حديث أُسَيْدِ بْنِ حُضَيْرٍ، قَالَ: بَيْنَمَا هُوَ يَقْرَأُ مِنَ اللَّيْلِ سُورَةَ الْبَقَرَةِ، وَفَرَسُهُ مَرْبُوطَةٌ عِنْدَهُ، إِذْ جَالَتِ الْفَرَسُ، فَسَكَتَ فَسَكَتَتْ، فَقَرَأَ فَجَالَتِ الْفَرَسُ، فَسَكَتَ وَسَكَتَتِ الْفَرسُ، ثُمَّ قَرَأَ فَجَالَتِ الْفَرَسُ، فَانْصَرَفَ وَكَانَ ابْنُهُ يَحْيَى قَرِيبًا مِنْهَا، فَأَشْفَقَ أَنْ تُصِيبَهُ، فَلَمَّا اجْتَرَّهُ، رَفَعَ رَأْسَهُ إِلَى السَّمَاءِ حتَّى مَا يَرَاهَا، فَلَمَّا أَصْبَحَ حَدَّثَ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَقَالَ: اقْرَأْ يَا ابْنَ حُضَيْرٍ اقْرَأْ يَا ابْنَ حُضَيْرٍ قَالَ فَأَشْفَقْتُ يَا رَسُولَ اللهِ أَنْ تَطَأَ يَحْيَى، وَكَانَ مِنْهَا قَرِيبًا، فَرَفَعْتُ رَأْسِي فَانْصَرَفْتُ إِلَيْهِ، فَرَفَعْتُ رَأْسِي إِلَى السَّمَاءِ فَإِذا مِثْلُ الظُّلَّةِ فِيهَا أَمْثَالُ الْمَصَابِيحِ، فَخَرَجَتْ حَتَّى لاَ أَرَاهَا قَالَ: [ص:154] وَتَدْرِي مَا ذَاكَ قَالَ: لاَ؛ قَالَ: تِلْكَ الْمَلاَئِكَةُ دَنَتْ لِصَوْتِكَ، وَلَوْ قَرَأْتَ لأَصْبَحَتْ يَنْظُرُ النَّاسُ إِلَيْهَا، لاَ تَتَوَارَى مِنْهُمْ
__________
أخرجه البخاري في: 66 كتاب فضائل القرآن: 15 باب نزول السكينة والملائكة عند قراءة القرآن
459. హజ్రత్ ఉసైద్ బిన్ హుజైర్ (రదియల్లాహు అన్హు) కథనం:- ఓ రోజు రాత్రివేళ నేను బఖరా సూరా పఠిస్తూ ఉంటే సమీపంలోనే కట్టివేయబడిన నా గుర్రం బెదరసాగింది. నేను ఖుర్ఆన్ పఠించడం ఆ పేయగానే గుర్రం కూడ బెదరిపోవడం ఆగింది. నేను మళ్ళీ ఖుర్ఆన్ పఠనం మొదలెట్టగా అది తిరిగి బెదరిపోసాగింది. నేను పఠనం ఆపేయగానే అది కూడ ఆగిపోయింది. నేను తిరిగి పఠించగానే అది మళ్ళీ బెదరిపోసాగింది.
ఆ తర్వాత హజ్రత్ ఉసైద్ బిన్ హుజైర్ (రదియల్లాహు అన్హు) ఖుర్ఆన్ పారాయణం ఆపేశారు. ఆయన కొడుకు యహ్యా గుర్రానికి సమీపంలోనే ఉన్నాడు. గుర్రం ఇలా బెదిరిపోతూ కొడుక్కు నష్టం కలిగిస్తుందేమోనని ఆయన భయపడ్డారు. అందువల్ల అతడ్ని అక్కడ్నుంచి తప్పించి తన వైపుకు పిలిపించుకున్నారు. అయితే ఆయన అటువైపు తల పైకెత్తి చూస్తే అక్కడ ఆకాశం కన్పించలేదు. (దానికి బదులు గొడుగు ఆకారంలో వెలుగుతున్న దీపిక లేవో కన్పించాయి.)
మరునాడు ఉదయం హజ్రత్ ఉసైద్ (రదియల్లాహు అన్హు) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి వెళ్ళి జరిగిన వృత్తాంతం పూర్తిగా తెలియజేశారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆ సంఘటన విని “ఇబ్నె హుజైర్! నీవు ఖుర్ఆన్ పారాయణం అలాగే కొనసాగిస్తే ఎంత బాగుండేది!! ఇబ్నెహుజైర్! నువ్వు అలాగే పఠిస్తూ ఉంటే ఎంత బాగుండేది!!” అని అన్నారు.
“దైవప్రవక్తా! నా కొడుకు గుర్రానికి అతి చేరువలో ఉన్నాడు. అది (బెదరిపోతూ) అతడ్ని ఎక్కడ తొక్కివేస్తుందోనని భయపడ్డాను. అందువల్ల నా దృష్టి అతని పైకి వెళ్ళింది. ఆ తరువాత నేను తల పైకెత్తి ఆకాశం వైపు చూశాను. అక్కడ నాకు గొడుగు ఆకారంలో ఒక వింత వస్తువు కన్పించింది. అందులో (అనేక) దీపాలు వెలిగిపోతూ కన్పించాయి. ఆ తరువాత నేను ఆ దృశ్యాన్ని చూడలేక అక్కడ్నుంచి బయటికి వెళ్ళాను” అన్నారు హజ్రత్ ఉసైద్ (రదియల్లాహు అన్హు).
“ఇంతకూ అదేమిటో నీకు తెలుసా?” అడిగారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం). “తెలియదు” అన్నారు హజ్రత్ ఉసైద్ (రదియల్లాహు అన్హు). ” ఆ దృశ్యం దైవదూతలు. నీ కంఠస్వరం వినడానికి వచ్చారు. నీవు అలాగే తెల్లారే దాకా ఖుర్ఆన్ పఠనం కొనసాగించి వుంటే ఉదయం ప్రజలు వారిని చూసేవారు. వారు ప్రజలకు కనుమరుగయ్యేవారు కాదు” అన్నారు దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం).
(సహీహ్ బుఖారీ: 66వ ప్రకరణం – ఫజాయలె ఖుర్ఆన్, 15వ అధ్యాయం-నుజూలిస్సకీనతి వల్ మలాయికతి ఇన్ద ఖిర్ అతిల్ ఖుర్ఆన్]
37వ అధ్యాయం – ఖుర్ఆన్ క్రమం తప్పకుండా పఠించే వ్యక్తి ఘనత فضيلة حافظ القرآن
460 – حديث أَبِي مُوسى الأَشْعَرِيِّ، قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: مَثَلُ الْمُؤمِنِ الَّذِي يَقْرَأُ الْقُرْآنَ كَمَثَلِ الأُتْرُجَّةِ، رِيحُهَا طَيِّبٌ وَطَعْمُهَا طَيِّبٌ؛ وَمَثَلُ الْمُؤْمِنِ الَّذِي لاَ يَقْرَأُ الْقُرْآنَ كَمَثَلِ التَّمْرَةِ، لاَ رِيحَ لَهَا وَطَعْمُهَا حُلْوٌ؛ وَمَثَلُ الْمُنَافِقِ الَّذِي يَقْرَأُ الْقُرْآنَ، مَثَلُ الرَّيْحَانَةِ، رِيحُهَا طَيِّبٌ وَطعْمُهَا مُرٌّ؛ وَمَثَلُ الْمُنَافِقِ الَّذِي لاَ يَقْرَأُ الْقُرْآنَ كَمَثَلِ الْحَنْظَلَةِ، لَيْسَ لَهَا رِيحٌ وَطَعْمُهَا مُرٌّ
__________
أخرجه البخاري في: 70 كتاب الأطعمة: 30 باب ذكر الطعام
460. హజ్రత్ అబూమూసా అష్ అరీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలిపారు:
“ఖుర్ఆన్ పఠించే వ్యక్తి (విశ్వాసి) రుచిలోనూ, సువాసనలోనూ మేలు జాతికి చెందిన నారింజపండు లాంటివాడు. ఖుర్ఆన్ పఠించని విశ్వాసి (మోమిన్) రుచి ఉన్నా సువాసన లేని ఖర్జూర పండు లాంటివాడు. ఖుర్ఆన్ పఠించే కపట విశ్వాసి పరిమళం ఉన్న చేదుఫలం లాంటివాడు. ఖుర్ఆన్ పఠించని కపట విశ్వాసి సువాసనలేని చేదుగా వుండే అడవి దోసకాయలాంటివాడు.”
(సహీహ్ బుఖారీ : 70వ ప్రకరణం – అల్ అత్ అము – 30వ అధ్యాయం – జిక్రిత్తామ్)
38వ అధ్యాయం – శ్రమకోర్చి ఖుర్ఆన్ పఠించే వ్యక్తి ఘనత
فضل الماهر بالقرآن والذي يتتعتع فيه
461 – حديث عَائِشَةَ، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: مَثَلُ الَّذِي يَقْرَأُ الْقُرْآنَ وَهُو حَافِظٌ لَهُ مَعَ السَّفَرَةِ الْكِرَامِ، وَمَثَلُ الَّذِي يَقْرَأُ وَهُوَ يَتَعَاهَدُهُ، وَهُوَ عَلَيْهِ شَدِيدٌ، فَلَهُ أَجْرَانِ
__________
أخرجه البخاري في: 65 كتاب التفسير: 80 سورة عبس
461. హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలిపారు:- “ఖుర్ఆన్ కంఠపాఠి గౌరవనీయులైన దైవదూత లాంటివాడు. అతను (ప్రళయదినాన) వారితోనే ఉంటాడు. ఖురాన్ పఠించడం తనకు ఎంతో ప్రయాసతో కూడిన పని అయినప్పటికీ, దాన్ని పఠించి కంఠస్తం చేసే వ్యక్తి రెట్టింపు పుణ్యఫలానికి అర్హుడవుతాడు.” [సహీహ్ బుఖారీ : 65వ ప్రకరణం – అత్తఫ్సీర్ ఖుర్ఆన్, 80వ అధ్యాయం – ‘అబస’ సూరా)
39వ అధ్యాయం – ఉన్నత స్థానం పొందిన పండితులకు ఖుర్ఆన్ విన్పించడం పుణ్యప్రదం استحباب قراءة القرآن على أهل الفضل والحذاق فيه وإن كان القارئ أفضل من المقروء عليه
462 – حديث أَنَسِ بْنِ مَالِكٍ رضي الله عنه قَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ لأُبَيٍّ: إِنَّ الله أَمَرَنِي أَنْ أَقْرَأَ عَلَيْكَ (لَمْ يَكُنِ الَّذِينَ كَفَرُوا) قَالَ: وَسَمَّانِي قَالَ: نَعمْ فَبَكَى
__________
أخرجه البخاري في: 63 كتاب مناقب الأنصار: 16 باب مناقب أبي بن كعب رضى الله عنه
462. హజ్రత్ అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఓసారి హజ్రత్ అబీ బిన్ కాబ్ (రదియల్లాహు అన్హు)తో “నేను నీ ముందు ‘లమ్ యకు నిల్లజీన కఫరూ’ సూరా పఠించి విన్పించాలని అల్లాహ్ నన్ను ఆదేశించాడు”, అని అన్నారు. హజ్రత్ అబీ (రదియల్లాహు అన్హు) అది విని (ఆశ్చర్యంతో) “ఏమిటి? అల్లాహ్ నా పేరు ప్రస్తావించి అలా ఆదేశించాడా?” అని అడిగారు. దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “ఔను. అల్లాహ్ నీ పేరు ప్రస్తావించి ఇలా అన్నాడు” అని తెలియజేశారు. ఈ మాట విని హజ్రత్ అబీ (రదియల్లాహు అన్హు) ఒక్కసారిగా రోదించారు.
(సహీహ్ బుఖారీ : 63వ ప్రకరణం – మనాఖిబిల్ అన్సార్, 16వ అధ్యాయం – మనాఖిబ్ అబీ బిన్ కాబ్)
40వ అధ్యాయం – ఖుర్ఆన్ వినడం, శ్రద్ధగా ఆలకించడం, దాని పట్ల దుఃఖించడం
فضل استماع القرآن وطلب القراءة من حافظه للاستماع والبكاء عند القراءة والتدبر
463 – حديث عَبْدِ اللهِ بْنِ مَسْعُودٍ، قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: اقْرَأْ عَلَيَّ قَالَ: قُلْتُ أَقْرَأُ عَلَيْكَ، وَعَلَيْكَ أُنْزِلَ قَالَ: إِنِّي أَشْتَهِي أَنْ أَسْمَعَهُ مِنْ غَيْرِي قَالَ: فَقَرَأْتُ النِّسَاءَ، حَتَّى إِذَا بَلَغَتُ (فَكَيْفَ إِذَا جِئْنَا مِنْ كُلِّ أُمَّةٍ بشَهِيدٍ وَجِئْنَا بِكَ عَلَى هؤلاَءِ شَهِيدًا) قَالَ لِي: كُفَّ أَوْ أَمْسِكْ فَرَأَيْتُ عَيْنَيْهِ تَذْرِفَانِ
__________
أخرجه البخاري في: 66 كتاب فضائل القرآن: 35 باب البكاء عند قراءة القرآن
463. హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ వూద్ (రదియల్లాహు అన్హు) కథనం:-
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఓసారి తనముందు ఖుర్ ఆన్ పఠించి విన్పించవలసిందిగా నన్ను ఆదేశించారు. నేను (ఆశ్చర్యంతో) “ఏమిటీ? నేను మీకు ఖుర్ఆన్ విన్పించాలా. దైవప్రవక్తా!? నిజానికి ఖుర్ఆన్ స్వయంగా మీపైనే అవతరించింది కదా!” అని అన్నాను. దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “(ఔను) నేను మరెవరి ద్వారానైనా ఖుర్ఆన్ వినాలని నాకు అన్పిస్తోంది” అని అన్నారు. అప్పుడు నేను ‘నిసా’ సూరా పఠించడం ప్రారంభించాను. అలా నేను ప్రతి అనుచర సమాజం నుండి మేము ఒక సాక్షిని తెచ్చి, ఈ ప్రజల మీద నిన్ను (అంటే ముహమ్మద్ ప్రవక్తను) సాక్షిగా నిలబెట్టే రోజు వీరి పరిస్థితి ఏమవుతుంది? అనే సూక్తి దగ్గరికి చేరుకోగానే ‘ఆగు’ లేక ఇక ‘ఆపెయ్యి’ అన్నారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం). నేను తల పైకెత్తి చూస్తే ఆయన కళ్ళు ధారాపాతంగా వర్షించసాగాయి.
(సహీహ్ బుఖారీ : 66వ ప్రకరణం – ఫజాయలె ఖుర్ఆన్, 35వ అధ్యాయం – అల్ బుకాయి ఇన్ద ఖిరా అతిల్ ఖుర్ఆన్]
464 – حديث ابْنِ مَسْعُودٍ عَنْ عَلْقَمَةَ قَالَ: كُنَّا بِحِمْصَ، فَقَرَأَ ابْنُ مَسْعُودٍ سُورَةَ يُوسُفَ، فَقَالَ رَجُلٌ: مَا هكَذَا أُنْزِلَتْ، قَالَ: قَرَأْتُ عَلَى رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فَقَالَ: أَحْسَنْتَ وَوَجَدَ مِنْهُ رِيحَ الْخَمْرِ، فَقَالَ: أَتَجْمَعُ أَنْ تُكَذِّبَ بِكِتَابِ اللهِ وَتَشْرَبَ الْخَمْرَ فَضَرَبَهُ الْحَدَّ
__________
أخرجه البخاري في: 66 كتاب فضائل القرآن: 8 باب القرّاء من أصحاب النبي صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ
464. హజ్రత్ అల్ఖమా (రహిమహుల్లాహ్) కథనం:- మేము హమస్ (సిరియా దేశంలోని ఒక పట్టణం పేరు)లో ఉన్నప్పుడు ఓసారి హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ ఊద్ (రదియల్లాహు అన్హు) యూసుఫ్ సూరా పఠించారు. అప్పుడు ఒక వ్యక్తి “ఈ సూరా ఈ విధంగా అవతరించలేదు” అని అన్నాడు. హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ ఊద్ అది విని “నేను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ముందు ఈ విధంగానే పఠించాను. ఆయన విని నీవు చక్కగా పఠించావని అన్నారు” అని అన్నారు. అదే సమయంలో ఆ వ్యక్తి మద్యం సేవించినట్లు అతని నోటి దుర్వాసన ద్వారా పసిగట్టారు. దాంతో ఆయన “నీవు రెండు నేరాలు చేశావు. ఒకటి, దైవవాణిని తిరస్కరించావు. రెండు, మద్యం సేవించావు” అని అన్నారు. అందువల్ల ఆయన ఆ వ్యక్తిని మద్యం సేవించినందుకు శిక్ష విధించి దాన్ని అమలు పరిచారు.
[సహీహ్ బుఖారీ: 66వ ప్రకరణం – ఫజాయలె ఖుర్ఆన్, 8వ అధ్యాయం – అల్ ఖురాయి మిన్ అసహాబి నబీ (సల్లల్లాహు అలైహి వసల్లం)]
43వ అధ్యాయం – ఫాతిహా సూరా మొత్తం, బఖరా సూరాలోని చివరి రెండు సూక్తుల ఔన్నత్యం فضل الفاتحة وخواتيم سورة البقرة والحث على قراءة الآيتين من آخر البقرة
465 – حديث أَبِي مَسْعُودٍ الْبَدْرِيِّ رضي الله عنه، قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: الآيَتَانِ مِنْ آخِرِ سُورَةِ الْبَقَرَةِ، مَنْ قَرَأَهُمَا فِي لَيْلَةٍ كَفَتَاهُ
__________
أخرجه البخاري في: 64 كتاب المغازى 12 باب حدثنى خليفة
465. హజ్రత్ అబూ మన వూద్ బద్రి (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: “బఖరా సూరాలోని చివరి రెండు సూక్తుల్ని రాత్రివేళ పఠించే వ్యక్తికి ఆ రాత్రంతా ఆ రెండు సూక్తులే చాలు” (అంటే ఆ రాత్రంతా ఖుర్ఆన్ పఠించినంత పుణ్యం లభిస్తుందన్నమాట).
[సహీహ్ బుఖారీ : 63వ ప్రకరణం – అల్ మగాజి, 12వ అధ్యాయం – హద్దసనీ ఖలీఫా]
47వ అధ్యాయం – ఖుర్ఆన్ విద్య నేర్చుకొని ఇతరులకు నేర్పే వ్యక్తి ఔన్నత్యం
فضل من يقوم بالقرآن ويعلمه، وفضل من تعلم حكمة من فقه أو غيره فعمل بها وعلمها
466 – حديث ابْنِ عُمَرَ، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: لاَ حَسَدَ إِلاَّ فِي اثْنَتَيْنِ: رَجُلٌ آتَاهُ اللهُ الْقُرْانَ فَهُوَ يَتْلوهُ آنَاءَ اللَّيْلِ وَآنَاءَ النَّهَارِ، وَرَجُلٌ آتَاهُ اللهُ مَالاً فَهُوَ يُنْفِقُهُ آنَاءَ اللَّيْلِ وَآنَاءَ النَّهَارِ
__________
أخرجه البخاري في: 97 كتاب التوحيد: 45 باب قول النبي صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ رجل آتاه الله القرآن فهو يقوم به
466. హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:-
ఇద్దరు తప్ప ఇతర వ్యక్తుల పట్ల అసూయ చెందడం ధర్మసమ్మతం కాదు. ఒకరు, అల్లాహ్ ఖుర్ఆన్ విద్య ప్రసాదించగా దాన్ని రేయింబవళ్ళు చదవడంలో, చదివించడంలో నిమగ్నుడయి ఉండే వ్యక్తి. రెండోవాడు, అల్లాహ్ సిరిసంపదలు అనుగ్రహించగా వాటిని రేయింబవళ్ళు (సత్కార్యాలలో) వినియోగించే వ్యక్తి.” (ఇలాంటి వారి పట్ల అసూయ చెందడంలో తప్పులేదు).
[సహీహ్ బుఖారీ : 97వ ప్రకరణం – తౌహీద్, 45వ అధ్యాయం – ఖౌలిన్నబియ్యి(సల్లల్లాహు అలైహి వసల్లం) రజులున్ అతాహుల్లాహుల్ ఖుర్ఆని ఫహువ యఖూము బిహీ]
467 – حديث عَبْدِ اللهِ بْنِ مَسْعُودٍ، قَالَ: قَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: لاَ حَسَدَ إِلاَّ فِي اثْنَتَيْنِ: رَجُلٌ آتَاهُ اللهُ مَالاً فَسُلِّطَ عَلَى هَلَكَتِهِ فِي الْحَقِّ، وَرَجُلٌ آتَاهُ اللهُ الْحِكْمَةَ فَهُوَ يَقْضِي بِهَا وَيُعَلِّمُهَا
__________
أخرجه البخاري في: 3 كتاب العلم: 15 باب الاغتباط في العلم والحكمة
467. హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ ఊద్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేశారు:
“ఇద్దరు తప్ప మరెవరి పట్లా అసూయ చెందడం ధర్మసమ్మతం కాదు. ఒకరు, అల్లాహ్ సిరిసంపదలు అనుగ్రహించడంతో పాటు, వాటిని దైవమార్గంలో వినియోగించే సద్బుద్ధి కూడా ప్రసాదించబడిన వ్యక్తి. రెండోవాడు, అల్లాహ్ విజ్ఞతా వివేకాలు ప్రసాదించగా, వాటి ప్రకారం నిర్ణయాలు తీసుకుంటూ, ఆ విజ్ఞతావివేకాలను ఇతరులక్కూడా బోధిస్తూ ఉండే వ్యక్తి.”
(సహీహ్ బుఖారీ : 3వ ప్రకరణం – ఇల్మ్, 15వ అధ్యాయం – అల్ ఇగ్తి బాతి ఫిల్ ఇల్మివల్ హిక్మత్]
48వ అధ్యాయం – దివ్యఖుర్ఆన్ ఏడు రకాల ఉచ్చారణ శైలిలో అవతరించింది
بيان أن القرآن على سبعة أحرف وبيان معناه
468 – حديث عُمَرَ بْنِ الْخَطَّابِ رضي الله عنه، قَالَ: سَمِعْتُ هِشَامَ بْنَ حَكِيمِ بْنِ حِزَامٍ يَقْرَأُ سُورَة الْفُرْقَانِ عَلَى غَيْرِ مَا أَقْرَؤهَا، وَكَانَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ أَقْرَأَنِيهَا، وَكِدْتُ أَنْ أَعْجَلَ عَلَيْهِ، ثُمَّ أَمْهَلْتُهُ حَتَّى انْصَرَفَ، ثُمَّ لَبَّبْتُهُ بِرِدَائِهِ فَجِئْتُ بِهِ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَقُلْتُ إِنِّي سَمِعْتُ هذَا يَقْرَأُ عَلَى غَيْرِ مَا أَقْرَأْتَنِيهَا؛ فَقَالَ لِي: أَرْسِلْهُ ثُمَّ قَالَ لَهُ: اقْرَأْ فَقَرَأَ، قَالَ: هكَذَا أُنْزِلَتْ ثُمَّ قَالَ لِي: اقْرَأْ فَقَرَأْتُ، فَقَالَ: هكَذَا أُنْزِلَتْ، إِنَّ الْقُرْآنَ أُنْزِلَ عَلَى سَبْعَةِ أَحْرُفِ فَاقْرَءُوا مَا تَيَسَّرَ مِنْهُ
__________
أخرجه البخاري في: 44 كتاب الخصومات: 4 باب الخصوم بعضهم في بعض
468. హజ్రత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు) కథనం:- ఒకసారి హిషామ్ బిన్ హకీమ్ బిన్ హిజామ్ ‘ఫుర్ఖాన్’ సూరా పఠించసాగారు. కాని ఆయన పఠనాశైలి నా పఠనాశైలికి భిన్నంగా ఉంది. మాకు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నేర్పిన శైలికి కూడ భిన్నంగా ఉంది. నేను ఆగ్రహంతో ఊగిపోతూ ఆయన మీద విరుచుకుపడేవాడ్ని. కాని ఆయన పఠించడం ముగిసేవరకు ఎలాగో తమాయించుకున్నాను. పఠనం పూర్తి కాగానే నేనాయన మెడకు చుట్టుకున్న దుప్పటి పట్టుకొని ఆయన్ని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి లాక్కెళ్ళాను. అక్కడ “దైవ ప్రవక్తా! మీరు నాకు నేర్పిన ఉచ్చారణ శైలికి భిన్నంగా ఈయన (ఫుర్ఖాన్) సూరా పరిస్తుంటే నేను విన్నాను” అని విన్నవించుకున్నాను.
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అది విని మొదట “ఇతడ్ని వదిలి పెట్టు” అని చెప్పారు. తర్వాత ఆయన వైపు తిరిగి “ఏది నువ్వు పఠించి విన్పించు, విందాం” అన్నారు. వెంటనే ఆయన (ఇంతకు ముందు మాదిరిగానే) (ఫుర్ఖాన్ సూరా) పఠించారు. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “ఇది ఈ విధంగానే అవతరించింది”. అని అన్నారు. ఆ తరువాత నన్ను పఠించమని ఆదేశించారు. నేను కూడా (నాకు నేర్పిన ఉచ్చారణాశైలిలో) పఠించాను. (నా పఠనాశైలి విని) “ఇది (కూడా) ఆ విధంగానే అవతరించింది” అన్నారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం). తరువాత ( ఆ విషయాన్ని వివరిస్తూ) “దివ్యఖుర్ఆన్ ఏడురకాల ఉచ్ఛారణ శైలిలో అవతరించింది. మీకు ఏది సౌలభ్యంగా ఉంటే ఆ శైలిలో పఠించండి” అని చెప్పారు.
[సహీహ్ బుఖారీ : 44వ ప్రకరణం – ఖుసూమాత్, 4వ అధ్యాయం – కలామిల్ ఖుసూమి బాజుహుమ్ ఫీబాజ్)
469 – حديث ابْنِ عَبَّاسٍ، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: أَقْرَأَنِي جِبْرِيلُ عَلَى حَرْفٍ فَلَمْ أَزَلْ أَسْتَزِيدُهُ حَتَّى انْتَهَى إِلَى سَبْعَةِ أَحْرُفٍ
__________
أخرجه البخاري في: 59 كتاب بدء الخلق: 6 باب ذكر الملائكة
469. హజ్రత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలిపారు : “నాకు జిబ్రయీల్ (అలైహిస్సలాం) ఒక్క ఉచ్చరణాశైలిలో (మాత్రమే) ఖుర్ఆన్ పఠించడం నేర్పారు. అయితే నేను మరికొన్ని ఉచ్ఛారణ శైలుల్లో పఠించడం నేర్పమని మాటిమాటికీ అడుగుతూ పోయాను. చివరికి ఈ ఉచ్ఛారణ శైలుల సంఖ్య ఏడుకు చేరింది.” *
(సహీహ్ బుఖారీ : 59వ ప్రకరణం – బద్ ఇల్ ఖల్ఖ్ , 6వ అధ్యాయం – జిక్రిల్ మలాయిక)
(*) ఏడు సంఖ్య ఇక్కడ సూచనప్రాయంగా తెలియజేయబడిందనీ, అందువల్ల ఏడంటే కచ్చితంగా ఏడేకానవసరం లేదని కొందరు ధర్మవేత్తలు అభిప్రాయపడ్డారు. కానీ మరికొందరు ఏడంటే ఏడు సంఖ్యను మాత్రమే తీసుకోవాలి గాని దానిని ఎక్కువ తక్కువ చేయడానికి వీల్లేదని అభిప్రాయపడ్డారు. దీనిపై ఇంకా అనేక భిన్నాభిప్రాయాలున్నాయి. వీటన్నిటినీ పరిశీలిస్తే అరేబియాలోని వివిధ తెగల్లో ఉన్న విభిన్న ఉచ్ఛారణలు, మాండలికాల మూలంగా విభిన్న శైలుల్లో పఠించే అనుమతి ఇవ్వబడినట్లు అనిపిస్తోంది.
49వ అధ్యాయం – ఖుర్ఆన్ ఆగి ఆగి నిదానంగా పఠించాలి, వేగంగా పఠించకూడదు
ترتيل القراءة واجتناب الهذّ وهو الإفراط في السرعة وإباحة سورتين فأكثر في ركعة
470 – حديث ابْنِ مَسْعُودٍ عَنْ أَبِي وَائِلٍ قَالَ: جَاءَ رَجُلٌ إِلَى ابْنِ مَسْعُودٍ، فَقَالَ [ص:158] قَرَأْتُ الْمُفَصَّلَ اللَّيْلَةَ في رَكْعَةٍ، فَقَالَ: هَذًّا كَهَذِّ الشِّعْرِ لَقَدْ عَرَفْتُ النَّظَائرَ الَّتِي كَانَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَقْرُنُ بَيْنَهُنَّ فَذَكَرَ عِشْرِينَ سُورَةً مِنَ الْمُفَصَّلِ، سُورَتَيْنِ فِي كُلِّ رَكْعَةٍ
__________
أخرجه البخاري في: 10 كتاب الأذان: 106 باب الجمع بين السورتين في الركعة
470. హజ్రత్ అబూ వాయిల్ (రహిమహుల్లాహ్) కథనం:- ఒక వ్యక్తి హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ వూద్ (రదియల్లాహు అన్హు) దగ్గరికి వచ్చి “నేను గతరాత్రి ఒక్క రకాత్ లో ముఫస్సిల్ (*) సూరాలన్నీ పఠించాను” అని అన్నారు.హజ్రత్ అబ్దుల్లా (రదియల్లాహు అన్హు) ఆ మాట విని “ఏమిటీ, నువ్వు కవుల మాదిరిగా వడివడిగా పఠిస్తున్నావా?” అని అడిగారు. ఆ తరువాత “నజాయిర్ సూరాలను గురించి నాకు బాగా తెలుసు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వాటిని కలిపేసి (ఒక్కొక్క రకాతులో) పఠించేవారు” అని అన్నారు. ఆ సందర్భంలో ఆయన ముఫస్సిల్ సూరాలలో ఇరవై సూరాలను ప్రస్తావించి, వీటిలో నుంచి దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రతి రకాత్ లో రెండేసి సూరాలు పఠించేవారు” అని తెలియజేశారు.
[సహీహ్ బుఖారీ : 10వ ప్రకరణం – అజాన్, 106వ అధ్యాయం – అల్ జమ్ బైన స్సూరతైని ఫిర్రకాత్]
(*) (1) ఖుర్ఆన్లోని ఫతహ్ సూరా నుండి చివరి సూరా వరకున్న సూరాలను ‘ముఫస్సిల్’ సూరాలు అంటారు. (2) సూక్తుల సంఖ్యారీత్యా పరస్పరం పోలిక ఉన్న పది జంట సూరాలను ‘నజాయిర్’ సూరాలు అంటారు. ఇవి ఈ విధంగా ఉన్నాయి. (1) రహ్మాన్-నజ్మ్ , (2) ఇఖ్ తర్బత్ – అల్ హాఖ్ఖ, (3) జారియా-తూర్ (4) వాఖియా – నూన్ (5) సాలసాయిల్-నాజియాత్ (6) వైలుల్లిల్ ముతప్ఫిఫీన్ – అబస్ (7) ముద్దస్సిర్ – ముజ్జమ్మిల్ (8) హల్ అతా – లావుఖ్సిమ్ (9) అమ్మ యత్ సాలూన్ – ముర్సలాత్ (10) ఇజషమ్సు కువ్విరత్ – దుఖ్కాన్.
50వ అధ్యాయం – ఖుర్ఆన్ కు సంబంధించిన కొన్ని విషయాలు
ما يتعلق بالقراءات
471 – حديث عَبْدِ اللهِ بْنِ مَسْعُودٍ رضي الله عنه، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ أَنَّهُ كَانَ يَقْرَأُ فَهَلْ مِنْ مُدَّكِرٍ
__________
أخرجه البخاري في: 65 كتاب التفسير: 54 سورة اقتربت الساعة: 2 باب تجرى بأعيننا
471. హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ వూద్ (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) “ఫహల్ మిమ్ మ్ముద్దకిర్” (ఖమర్ సూరా 17వ సూక్తిలోని పదం) అని ఉచ్చరించేవారు (ముజ్జకిర్ అని కాదు). (సహీహ్ బుఖారీ : 65వ ప్రకరణం – అత్తఫ్సీర్ – 54వ సూరా – ఇఖ్తర బతిస్సా అత్)
472 – حديث أَبِي الدَّرْدَاءِ عَنْ إِبْرَاهيمَ، قَالَ: قَدِمَ أَصْحَابُ عَبْدِ اللهِ عَلَى أَبِي الدَّرْدَاءِ فَطَلَبَهُمْ فَوَجَدَهُمْ، فَقَالَ: أَيُّكُمْ يَقْرَأُ قِرَاءَةَ عَبْدِ اللهِ قَالَ: كُلُّنَا؛ قَالَ: فَأَيُّكُمْ أَحْفَظُ فَأَشَارُوا إِلَى عَلْقَمَةَ؛ قَالَ: كَيْفَ سَمِعْتَهُ يَقْرَأُ وَاللَّيْلِ إِذَا يَغْشَى قَالَ عَلْقَمَةُ: وَالذَّكَرِ وَالأُنْثَى؛ قَالَ: أَشْهَدُ أَنِّي سَمِعْتُ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَقْرَأُ هكَذَا، وَهؤلاَءِ يُرِيدُونِي عَلَى أَنْ أَقْرَأَ (وَمَا خَلَقَ الذَّكَرَ وَالأُنْثَى) ، وَاللهِ لاَ أُتَابِعُهُمْ
__________
أخرجه البخاري في: 65 كتاب التفسير: 92 سورة والليل: 7 باب وما خلق الذكر والأنثى
472. హజ్రత్ ఇబ్రాహీం (రహిమహుల్లాహ్) కథనం:- హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ వూద్ (రదియల్లాహు అన్హు) సహచరులు కొందరు హజ్రత్ అబూదర్దా (రదియల్లాహు అన్హు) ప్రాంతానికి (సిరియా) వచ్చినపుడు హజ్రత్ అబూదర్దా (రదియల్లాహు అన్హు) వారిని వెతుక్కుంటూ వచ్చారు. (చివరికి) వారిని కలుసుకొని “మీలో హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ వూద్ (రదియల్లాహు అన్హు) గారి ఉచ్చారణా శైలి ప్రకారం ఖుర్ఆన్ పఠించగలిగే వారు ఎవరైనా ఉన్నారా?” అని అడిగారు. దానికి వారు తామంతా వారి ఉచ్చారణా శైలి ప్రకారమే పఠిస్తామని అన్నారు. “అయితే మీలో ఆయన ఉచ్చారణాశైలి గురించి ఎక్కువగా ఎవరికి తెలుసు?” అని హజ్రత్ అబూదర్దా (రదియల్లాహు అన్హు) మళ్ళీ అడిగారు. వారు హజ్రత్ అల్ఖమా (రహిమహుల్లాహ్) వైపు సూచించారు. హజ్రత్ అబూదర్దా (రదియల్లాహు అన్హు) అల్ఖమా (రహిమహుల్లాహ్)ని ఉద్దేశించి “మీరు (వల్ లైలి ఇజా యగ్ షా సూరాను) హజ్రత్ ఇబ్నె మస్ వూద్ (రదియల్లాహు అన్హు) ఎలా పఠిస్తూ ఉండగా విన్నారు?” అని ప్రశ్నించారు. దానికి అల్ఖమా (రహిమహుల్లాహ్) సమాధానమిచ్చారు. (వజ్జకరి వల్ ఉన్సా-అని). అప్పుడు హజ్రత్ అబూదర్దా (రదియల్లాహు అన్హు) నేను కూడా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగానే పఠిస్తుంటే విన్నానని సాక్ష్యమిస్తున్నాను. కాని ఇక్కడి (సిరియా) జనం నేను ‘వమా ఖలఖజ్జకర వల్ ఉన్సా’ అని చదవాలని కోరుతున్నారు. అల్లాహ్ సాక్షి! నేను ఎన్నటికీ వీరిని అనుసరించను” అని అన్నారు.
[సహీహ్ బుఖారీ : 65వ ప్రకరణం – అత్తఫ్సీర్, 92వ సూరా, వల్లెల్ – 7వ అధ్యాయం – వమా ఖలఖజ్జకర వల్ ఉన్సా’]
51వ అధ్యాయం – నమాజు చేయకూడని (నిషిద్ధ) వేళలు
الأوقات التي نهى عن الصلاة فيها
473 – حديث عُمَرَ بْنِ الْخَطَّابِ عَنِ ابْنِ عَبَّاسٍ، قَالَ: شَهِدَ عِنْدِي رِجَالٌ مَرْضِيُّونَ [ص:159] وَأَرْضَاهُمْ عِنْدِي عُمَرُ، أَنَّ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ نَهى عَنِ الصَّلاَةِ بَعْدَ الصُّبْحِ حَتَّى تَشْرُقَ الشَّمْسُ، وَبَعْدَ الْعَصْرِ حَتَّى تَغْرُبَ
__________
أخرجه البخاري في: 9 كتاب مواقيت الصلاة: 30 باب الصلاة بعد الفجر حتى ترتفع الشمس
473. హజ్రత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) కథనం:-
నా ముందు కొందరు పుణ్యాత్ములు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) రెండు వేళలల్లో నమాజు చేయడాన్ని నిషేధించారని సాక్ష్యమిచ్చారు. అందులో ఒకటి: ఫజ్ర్ నమాజు తరువాత సూర్యోదయం అయ్యే వరకుండే సమయం, రెండు: అస్ర్ నమాజ్ తర్వాత సూర్యాస్తమమయ్యే వరకుండే సమయం. ఆ పుణ్యాత్ములలో అందరికంటే నా దృష్టిలో హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ఎక్కువ ఉత్తములు, పుణ్యాత్ములు.
(సహీహ్ బుఖారీ : 9వ ప్రకరణం – మవాఖియతుస్సలాత్, 30వ అధ్యాయం – అస్సలాతు బాదల్ ఫజ్ర్రి హత్తా తరఫ అష్షమ్స్)
474 – حديث أَبِي سَعِيدٍ الْخُدْرِيِّ، قَالَ سَمِعْتُ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ: لاَ صَلاَةَ بَعْدَ الصُّبْحِ حَتَّى تَرْتَفِعَ الشَّمْسُ، وَلاَ صَلاَةَ بَعْدَ الْعَصْرِ حَتَّى تَغِيبَ الشَّمْسُ
__________
أخرجه البخاري في: 9 كتاب مواقيت الصلاة: 31 باب لا يتحرى الصلاة قبل غروب الشمس
474. హజ్రత్ అబూసయీద్ ఖుదరీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:
“ఫజ్ర్ నమాజు తరువాత మొదలుకొని సూర్యుడు ఉదయించి పూర్తిగా పైకి వచ్చేవరకుండే సమయంలో ఎలాంటి నమాజు కూడా చేయకూడదు. అలాగే అస్ర్ నమాజు తరువాత మొదలుకొని పూర్తిగా సూర్యాస్తమయం అయ్యే వరకుండే సమయంలో కూడా ఎలాంటి నమాజు చేయకూడదు”.
[సహీహ్ బుఖారీ : 9వ ప్రకరణం – మవాఖియతుస్సలాత్, 31వ అధ్యాయం – లాయత్ హిర్రిస్సలాతు ఖబ్లి గురూబిషమ్స్]
475 – حديث ابْنِ عُمَرَ، قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: لاَ تَحَرَّوْا بِصَلاَتِكُمْ طُلُوعَ الشَّمْسِ وَلاَ غُرُوبَهَا
__________
أخرجه البخاري في: 9 كتاب مواقيت الصلاة: 30 باب الصلاة بعد الفجر حتى ترتفع الشمس
475. హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా బోధించారు: “సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు గానీ, అస్తమిస్తున్నప్పుడు గానీ నమాజు చేయకండి”. (సహీహ్ బుఖారీ : 9వ ప్రకరణం – మవాఖియతుస్సలాత్, 30వ అధ్యాయం – అస్సలాతు బాదల్ ఫజ్ర్రి హత్తా తరఫ అష్షమ్స్]
476 – حديث ابْنِ عُمَرَ، قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: إِذَا طَلَعَ حَاجِبُ الشَّمْسِ فَدَعُوا الصَّلاَةَ حَتَّى تَبْرُزَ، وَإِذَا غَابَ حَاجِبُ الشَّمْسِ فَدَعُوا الصَّلاَةَ حَتَّى تَغِيبَ
__________
أخرجه البخاري في: 59 كتاب بدء الخلق: 11 باب صفة إبليس وجنوده
476. హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు: “సూర్యుడు ఉదయించి పూర్తిగా పైకి రానంతవరకు నమాజు చేయకండి. అలాగే సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు అతడు పూర్తిగా అస్తమించనంత వరకు కూడా నమాజు చేయకండి.” [సహీహ్ బుఖారీ : 59వ ప్రకరణం – బదఇల్ ఖల్ఖ్ , 11వ అధ్యాయం – సిఫతి ఇబ్లీసి వ జనూదిహీ]
54వ అధ్యాయం – అస్ర్ నమాజు తర్వాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చేసిన రెండు రకాతుల నమాజు గురించిన వాస్తవ పరిస్థితి معرفة الركعتين اللتين كان يصليهما النبي صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ بعد العصر
477 – حديث أُمِّ سَلَمَةَ عَنْ كُرَيْبٍ، أَنَّ ابْنَ عَبَّاسٍ، وَالْمِسْوَرَ بْنَ مَخْرَمَةَ، وَعَبْدَ الرَّحْمنِ بْنَ أَزْهَرَ أَرْسَلُوهُ إِلَى عَائِشَةَ، فَقَالُوا: اقْرأْ عَلَيْهَا السَّلاَمَ مِنَّا جَمِيعًا، وَسَلْهَا عَنِ الرَّكْعَتَيْنِ بَعْدَ صَلاَةِ الْعَصْرِ، وَقُلْ لَهَا: إِنَّا أُخْبِرْنَا أَنَّكِ تُصَلِّينَهُمَا، وَقَدْ بَلَغَنَا أَنَّ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ نَهَى عَنْهُمَا وَقَالَ ابْنُ عَبَّاسٍ: وَكُنْتُ أَضْرِبُ النَّاسَ مَعَ عُمَرَ بْنِ الْخَطَّابِ عَنْهُمَا
[ص:160] قَالَ كُرَيْبٌ: فَدَخَلْتُ عَلَى عَائِشَةَ، فَبَلَّغْتُهَا مَا أَرْسَلُونِي؛ فَقَالَتْ: سَلْ أُمَّ سَلَمَةَ فَخَرَجْتُ إِلَيْهِمْ فَأَخْبَرْتُهُمْ بِقَوْلِهَا، فَرَدُّونِي إِلَى أُمِّ سَلَمَةَ بِمِثْلِ مَا أَرْسَلُونِي بِهِ إِلَى عَائِشَةَ، فَقَالَتْ أُمُّ سَلَمَةَ: سَمِعْتُ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَنْهَى عَنْهَا ثُمَّ رَأَيْتُهُ يُصَلِّيهِمَا حِينَ صَلَّى الْعَصْرَ، ثُمَّ دَخَلَ وَعِنْدِي نِسْوَةٌ مِنْ بَنِي حَرَامٍ مِنَ الأَنْصَارِ، فَأَرْسَلْتُ إِلَيْهِ الْجَارِيَةَ، فَقُلْتُ قُومِي بِجَنْبِهِ، قُولِي لَهُ: تَقُولُ لَكَ أُمُّ سَلَمَةَ يَا رَسُولَ اللهِ سَمِعْتُكَ تَنْهَى عَنْ هَاتَيْنِ وَأَرَاكَ تُصَلِّيهِمَا فَإِنْ أَشَارَ بِيَدِهِ فَاسْتأْخِرِي عَنْهُ فَفَعَلَتِ الْجَارِيَةُ، فَأَشَارَ بِيَدِهِ فَاسْتَأْخَرَتْ عَنْهُ فَلَمَّا انْصَرَفَ، قَالَ: يَا بِنْتَ أَبِي أُمَيَّةَ سَأَلْتِ عَنِ الرَّكْعَتَيْنِ بَعْدَ الْعَصْرِ، وَإِنَّهُ أَتَانِي نَاسٌ مِنْ عَبْدِ الْقَيْسِ فَشَغَلُونِي عَنِ الرَّكْعَتَيْنِ اللَّتَيْنِ بَعْدَ الظُّهْرِ، فَهُمَا هَاتَانِ
__________
أخرجه البخاري في: 22 كتاب السهو: 8 باب إذا كُلِّم وهو يصلي فأشار بيده واستمع
477. హజ్రత్ కురేబ్ (రహిమహుల్లాహ్) కథనం:- హజ్రత్ ఇబ్నె అబ్బాస్, ముసవ్విర్ బిన్ మఖ్రమ, అబ్దుర్రహ్మాన్ బిన్ అజహర్ (రదియల్లాహు అన్హుమ్)లు నన్ను విశ్వాసుల మాతృమూరి ఆయిషా సిద్దిఖా (రదియల్లాహు అన్హు) సన్నిధికి పంపించారు. మనందరి తరఫున ఆమెకు సలాం చేసిన తరువాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అస్ర్ తరువాత చేసిన రెండు రకాల (సున్నత్) నమాజు గురించి అడగవలసినదిగా వారు నాకు చెప్పారు. అదీగాక దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) అస్ర్ తరువాత (మరే) నమాజు చేయకూడదని వారించిన హదీసు మాదాకా చేరిందని, అయినప్పటికీ మీరు కూడా ఈ రెండు రకాతులు పఠిస్తున్నారని మాకు తెలిసిందని కూడ ఆమె దృష్టికి తీసుకు రావాలని వారు చెప్పారు. హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హు) మరొక విషయం తెలియజేస్తూ, “హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు)తో కలసి ఈ రెండు రకాతులు పఠిస్తుంటే నేను (జనాన్ని) కొడ్తుండేవాడ్ని కూడా” అని అన్నారు.
నేను హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా)గారి సన్నిధికి వెళ్ళి నన్ను అడిగి రమ్మని చెప్పిన విషయాల్ని ఆమె ముందుంచాను. హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) ఈ మాటలు విని “ఈ విషయం హజ్రత్ ఉమ్మె సల్మా (రదియల్లాహు అన్హా)ని అడగండని” అన్నారు. నేను హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హు) దగ్గరకు తిరిగి వచ్చి, హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) ఇచ్చిన సమాధానం విన్పించాను. అప్పుడు వారు ముగ్గురూ నన్ను హజ్రత్ ఉమ్మె సల్మా (రదియల్లాహు అన్హా) సన్నిధికి పంపుతూ హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా)ని అడిగిన విషయాలే ఆమెను కూడా అడగమని చెప్పారు.
హజ్రత్ ఉమ్మె సల్మా (రదియల్లాహు అన్హా) (నా మాటలు విని) ఇలా అన్నారు: “దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ రెండు రకాతుల నమాజు చేయకూడదని వారించిన సంగతి స్వయంగా నేను కూడ విన్నాను. అయితే ఆ తరువాత (ఓరోజు) ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) అస్ర్ తర్వాత రెండు రకాతుల నమాజు చేయడం నేను చూశాను. (ఆ రోజు) అస్ర్ నమాజు చేసిన తరువాత ఆయన నా ఇంటికి వచ్చి రెండు రకాతులు పఠించసాగారు. ఆ సమయంలో అన్సారీ తెగ-బనీహరాంకు చెందిన కొందరు స్త్రీలు నా దగ్గర కూర్చొని ఉన్నారు. (అందువల్ల నేను ఈ విషయం అడగడానికి ఆయన దగ్గరికి వెళ్ళలేకపోయాను). నేను ఆయన దగ్గరికి ఒక అమ్మాయిని పంపాను. “ఆయన సమీపానికి వెళ్ళి ఒకవైపు జరిగి నిల్చుని దైవప్రవక్తా! ఈ రెండు రకాతులు పఠించకూడదని మీరు వారించడం స్వయంగా నేను విన్నాను. ఇప్పుడేమో మీరే ఈ రెండు రకాతులు పఠిస్తూ ఉండటం నేను చూస్తున్నాను; కారణం ఏమిటి అని నా మాటలుగా ఆయన్ని అడుగు. ఆయన గనుక చేత్తో ఏదైనా సైగ చేస్తే నువ్వు కాస్త వెనక్కి జరిగి నిలబడు” అని చెప్పాను.
ఆ అమ్మాయి వెళ్ళి నేను చెప్పమన్న మాటలు ఆయనకు చెప్పింది. అప్పుడు ఆయన ఆ అమ్మాయిని ఆగమని చేత్తో సైగ చేశారు. ఆమె కాస్త వెనక్కి జరిగి నిల్చుంది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నమాజు ముగించిన తరువాత ఆ అమ్మాయి ద్వారా నన్ను ఉద్దేశించి ఇలా అన్నారు:- “అబూఉమయ్యా కూతురా (ఉమ్మెసల్మా)! అస్ర్ తరువాత నేను చేస్తున్న రెండు రకాతుల నమాజు గురించి నన్ను అడుగుతున్నావు, విను, (ఇది అస్ర్ తరువాత చేసే రెండు రకాతుల నమాజు కాదు). నా దగ్గరికి (జుహర్ సమయంలో) బనీ అబ్దే ఖెస్ తెగకు చెందిన కొందరు రావడం వల్ల నేను జుహర్ (ఫర్జ్ నమాజు) తర్వాత చేయవలసిన రెండు రకాతుల (సున్నత్) నమాజు చేయలేకపోయాను. అందుచేత ఆ రెండు రకాతుల (సున్నత్) నమాజును ఇప్పుడు (అస్ర్ తరువాత) నెరవేర్చాను. ఇదసలు జుహర్ తరువాత చేయవలసిన రెండు రకాతుల నమాజు”.
[సహీహ్ బుఖారీ : 22వ ప్రకరణం – అస్సహూ, 8వ అధ్యాయం – ఇజాకుల్లిమ వహువ యుసల్లీ ఫాషారా బియదిహి వస్తమ]
478 – حديث عَائِشَةَ، قَالَتْ: رَكْعَتَانِ لَمْ يَكُنْ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَدَعُهُمَا سِرًّا وَلاَ عَلاَنِيَةً؛ رَكْعَتَانِ قَبْلَ صَلاَةِ الصُّبْحِ، وَرَكْعَتَانِ بَعْدَ الْعَصْرِ
__________
أخرجه البخاري في: 9 كتاب مواقيت الصلاة: 33 باب ما يصلي بعد العصر من الفوائت ونحوها
478. హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం:- రహస్యంగానైనా, బహిరంగంగానైనా రెండు నమాజులను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఎన్నడూ విడనాడలేదు. ఒకటి: ఫజ్ర్ నమాజుకు ముందు చేసే రెండు రకాతులు (సున్నత్ నమాజు). రెండు: అస్ర్ నమాజు తరువాత చేసే రెండు రకాతులు (సున్నత్ నమాజు). [సహీహ్ బుఖారీ : 9వ ప్రకరణం – మవాఖియతుస్సలాత్, 33వ అధ్యాయం – మాయు సల్లా బాదల్ అస్రి ……]
55వ అధ్యాయం – మగ్రిబ్ నమాజుకు ముందు రెండు రకాతులు పఠించడం అభిలషణీయం استحباب ركعتين قبل صلاة المغرب
479 – حديث أَنَسِ بْنِ مَالِكٍ قَالَ: كَانَ الْمُؤذِّنُ إِذَا أَذَّنَ، قَامَ نَاسٌ مِنْ أَصْحَابِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَبْتَدِرُونَ السَّوَارِيَ حَتَّى يَخْرُجَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ وَهُمْ كَذلِكَ يُصَلُّونَ الرَّكْعَتَيْنِ قَبْلَ الْمَغْرِبِ، وَلَمْ يَكُنْ بَيْنَ الأَذَانِ وَالإِقَامَةِ شَيْءٌ
__________
أخرجه البخاري في: 10 كتاب الأذان: 14 باب كم بين الأذان والإقامة
479. హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం:-
ముఅజ్జిన్ (మగ్రిబ్ నమాజు కోసం) అజాన్ ఇవ్వగానే ప్రవక్త అనుచరులు (మస్జిదు) స్తంభాల వైపు పరుగెత్తేవారు. చివరికి దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) వచ్చేస్తారు. అయితే వారు మగ్రిబ్ (ఫర్జ్ నమాజు)కు ముందు రెండు రకాతులు (సున్నత్) నమాజు చేసేవారు. అజాన్, ఇఖామత్ ల మధ్య అంతగా విరామం ఉండదు.
(సహీహ్ బుఖారీ : 10వ ప్రకరణం – అజాన్, 14వ అధ్యాయం – కమ్ బైనల్ అజాని వల్ ఇఖామత్)
56వ అధ్యాయం – ప్రతి రెండు అజాన్ (అంటే అజాన్, ఇఖామత్ ల) మధ్య ఒక నమాజు వుంది بين كل أذانين صلاة
480 – حديث عَبْدِ اللهِ بْنِ مُغَفَّلٍ، قَالَ: قَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: بَيْنَ كلِّ أَذَانَيْنِ صَلاَةٌ، بَيْنَ كُلِّ أَذَانَيْنِ صَلاَةٌ ثُمَّ قَالَ فِي الثَّالِثَةِ: لِمَنْ شَاءَ
__________
أخرجه البخاري في: 10 كتاب الأذان: 16 باب بين كل أذانين صلاة لمن شاء
480. హజ్రత్ అబ్దుల్లా బిన్ ముగఫ్ఫిల్ (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “ప్రతి రెండు అజాన్ల మధ్య, అంటే అజాన్, ఇఖామత్ ల మధ్య ఒక నమాజు ఉంద’ని తెలిపారు. ఆయన ఈ విషయాన్ని మూడుసార్లు చెప్పారు. అయితే మూడవసారి “చేయదలచినవారికి (ఈ నమాజు ఉంది)” అని కూడా ఆయన చెప్పారు. (సహీహ్ బుఖారీ : 10వ ప్రకరణం – అజాన్, 16వ అధ్యాయం – బైనకుల్లి అజానైని సలాతుల్లి మన్ షా]
57వ అధ్యాయం – నమాజ్ ఖౌఫ్ (భయానక స్థితిలో చేసే నమాజు) صلاة الخوف
481 – حديث ابْنِ عُمَرَ، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ صَلَّى بِإِحْدَى الطَّائِفَتَيْنِ، وَالطَّائِفَةُ الأُخْرَى مُوَاجِهَةَ الْعَدُوِّ، ثُمَّ انْصَرَفُوا، فَقَامُوا فِي مَقَامِ أَصْحَابِهِمْ، فَجَاءَ أُولئِكَ فَصَلَّى بِهِمْ رَكْعَةً، ثُمَّ سَلَّمَ عَلَيْهِمْ، ثُمَّ قَامَ هؤلاَءِ فَقَضَوْا رَكْعَتَهُمْ، وَقَامَ هؤلاَءِ فَقَضَوْا رَكْعَتَهُمْ
__________
أخرجه البخاري في: 64 كتاب المغازي: 31 باب غزوة ذات الرقاع
481. హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం:-
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఓసారి (భయానక స్థితిలో) సైన్యాన్ని రెండు భాగాలుగా విభజించి, ఒక భాగం సైన్యంతో కలసి (ఒక రకాతు) నమాజు చేశారు. ఆ సమయంలో రెండో భాగం సైన్యం శత్రు సైన్యం ముందు నిలబడి ఉంది. తరువాత వీరు (అంటే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)తో కలసి ఒక రకాతు నమాజు చేసిన యోధులు) వెనక్కి వెళ్ళి తమ సహయోధుల స్థానాల్లో నిలబడ్డారు. అప్పుడు వారొచ్చి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)తో కలసి ఒక రకాతు నమాజు చేశారు. (రెండు రకాతులు పఠించిన తరువాత) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కుడి ఎడమలవైపు తిరిగి సలాం చేశారు. వారు (వెంటనే) లేచి నిలబడి (తప్పిపోయిన) ఒక రకాతు పఠించి నమాజు పూర్తి చేసుకున్నారు. తరువాత (వీరు వెళ్ళిపోయాక దైవప్రవక్తతో కలసి ఒక రకాతు పఠించి వెళ్ళిపోయిన వారు తిరిగొచ్చి) నిలబడి మరొక రకాతు పఠించారు. ఇలా వారు తమ నమాజును పూర్తి చేసుకున్నారు.
(సహీహ్ బుఖారీ : 64వ ప్రకరణం – మగాజి, 31వ అధ్యాయం – గజూవతి జాతిర్రిఖా)
482 – حديث سَهْلِ بْنِ أَبِي حَثْمَةَ، قَالَ: يَقُومُ الإِمَامُ مُسْتَقْبِلَ الْقِبْلَةِ، وَطَائِفَةٌ مِنْهُمْ مَعَهُ، وَطَائِفَةٌ مِنْ قِبَلِ الْعَدُوِّ، وُجُوهُهُمْ إِلَى الْعَدُوِّ، فَيُصَلِّي بِالَّذِينَ مَعَهُ رَكْعَةً، ثُمَّ يَقُومُونَ فَيَرْكَعُونَ لأَنْفُسِهِمْ رَكْعَةً، وَيَسْجُدُونَ سَجْدَتَيْنِ فِي مَكَانِهِمْ، ثُمَّ يَذْهَبُ هؤلاَءِ إِلَى مَقَامِ أُولئِكَ فَيَرْكَعُ بِهِمْ رَكْعَةً، فَلَهُ ثِنْتَانِ، ثُمَّ يَرْكَعُونَ وَيَسْجُدُونَ سَجْدَتَيْنِ
__________
أخرجه البخاري في: 64 كتاب المغازى: 31 باب غزوة ذات الرقاع
482. హజ్రత్ సహల్ బిన్ అబీజస్మ (రదియల్లాహు అన్హు) కథనం:-
(భయానక స్థితిలో నమాజు చేయవలసినపుడు) ఇమాం ఖిబ్లాదిశకు అభిముఖంగా నిలబడతాడు. సైన్యంలోని ఒక భాగం అతని వెనుక నిలబడుతుంది. రెండో భాగం సైన్యం శత్రువుల ముందు ఉంటుంది. వారి ముఖాలు కూడా శత్రువుల వైపు తిరిగి ఉంటాయి. ఇమాం తన వెనుక నిల్చున్న వారికి ఒక రకాతు నమాజు చేయిస్తాడు. ఆ తరువాత వీరు ఇమాం నుండి వేరయిపోయి విడిగా మరొక రకాతు నమాజు చేస్తారు. అంటే ఒక రుకూ, రెండు సజ్దాలు చేస్తారు. ఆ తరువాత వీరు వెనక్కి వెళ్ళి శత్రువు ముందు నిల్చున్న వారి స్థానాల్లో నిలబడతారు. అప్పుడు వారొచ్చి ఇమాం వెనుక నిల్చుంటారు. ఇమామ్ వారితో కలసి మరొక రకాతు పఠించి నమాజ్ పూర్తి చేస్తాడు. ఇలా ఇమాంకు రెండు రకాతుల నమాజ్ అవుతుంది. అప్పుడు అతని వెనుక నిల్చున్నవారు లేచి నిలబడి అక్కడే ఒక రుకూ, రెండు సజ్దాలతో మరొక రకాతు నమాజ్ చేస్తారు.
(సహీహ్ బుఖారీ : 64వ ప్రకరణం – మగాజి, 31వ అధ్యాయం – గుజ్వతి జాతిర్రిఖా]
483 – حديث خَوَّاتِ بْنِ جُبَيْرٍ عَنْ صَالِحِ بْنِ خَوَّاتٍ عَمَّنْ شَهِدَ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَوْمَ ذَاتِ الرِّقَاعِ صَلَّى صَلاَةَ الْخَوْفِ؛ أَنَّ طَائِفَةً صَفَّتْ مَعَهُ، وَطَائِفَةٌ وُجَاهَ الْعَدُوِّ، فَصَلَّى [ص:162] بِالَّتِي مَعَهُ رَكْعَةً، ثُمَّ ثَبَتَ قَائمًا، وَأَتَمُّوا لأَنْفُسِهِمْ، ثُمَّ انْصَرَفُوا فَصَفُّوا وُجَاهَ الْعَدُوِّ، وَجَاءَتِ الطَّائِفَةُ الأُخْرَى فَصَلَّى بِهِمِ الرَّكْعَةَ الَّتِي بَقِيَتْ مِنْ صَلاَتِهِ، ثُمَّ ثَبَتَ جَالِسًا وَأَتَمُّوا لأَنْفُسِهِمْ، ثُمَّ سَلَّمَ بِهِمْ
__________
أخرجه البخاري في: 64 كتاب المغازى: 31 باب غزوة ذات الرقاع
483. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)తో కలసి జాతిర్రిఖా యుద్ధంలో పాల్గొని ఆయన వెనుక ‘నమాజే ఖౌఫ్’ చేసిన హజ్రత్ ఖవాత్ బిన్ జుబైర్ (రదియల్లాహు అన్హు) గారి కథనం:-
సైన్యంలోని ఒక భాగం యోధులు దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) వెనుకబారులు తీరి నిలబడ్డారు. మిగిలిన భాగం సైనికులు శత్రువుల ముందు నిల్చొన్నారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన వెనుక నిల్చున్నవారికి ఒక రకాతు నమాజు చేయించారు. ఆ తర్వాత వీరు విడిగా మరొక రకాతు పఠించి నమాజు ముగించి, శత్రు సైన్యం ముందుకెళ్ళి నిలబడ్డారు. శత్రు సైన్యం ముందు నిల్చున్న మొదటి దళం యోధులు వచ్చి దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) వెనుక నిలబడ్డారు. అప్పటిదాకా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మౌనంగా అలాగే నిలబడ్డారు. వారు రాగానే ఆయన వారికి కూడా ఒక రకాతు నమాజు చేయించారు. అలా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) రెండు రకాతులు పఠించి, వారు మిగిలిపోయిన మరొక రకాతు పఠించి నమాజు పూర్తి చేసుకునేదాకా మౌనంగా కూర్చున్నారు. తర్వాత వారితో కలసి కుడి ఎడమల వైపు తిరిగి సలాం చేశారు. (అంటే నమాజు ముగించారు)
(సహీహ్ బుఖారీ : 64వ ప్రకరణం – మగాజి, 31వ అధ్యాయం – గుజ్వతి జాతిర్రిఖా)
484 – حديث جَابِرٍ، قَالَ: كُنَّا مَعَ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ بِذَاتِ الرِّقَاعِ، فَإِذَا أَتَيْنَا عَلَى شَجَرَةٍ ظَلِيلَةٍ تَرَكْنَاهَا لِلنَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَجَاءَ رَجُلٌ مِنَ الْمُشْرِكِينَ وَسَيْفُ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ مُعَلَّقٌ بِالشَّجَرَةِ، فَاخْتَرَطَهُ، فَقَالَ: تَخَافُنِي قَالَ: لاَ قَالَ: فَمَنْ يَمْنَعُكَ مِنِّي قَالَ: اللهُ فَتَهَدَّدَهُ أَصْحَابُ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، وَأُقِيمَتِ الصَّلاَةُ، فَصَلَّى بِطَائِفَةٍ رَكْعَتَيْنِ ثُمَّ تَأَخَّرُوا، وَصَلَّى بِالطَّائِفَةِ الأُخْرَى رَكْعَتَيْنِ؛ وَكَانَ لِلنَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ أَرْبَعٌ، وَلِلْقَوْمِ رَكْعَتَانِ
__________
أخرجه البخاري في: 64 كتاب المغازى: 31 باب غزوة ذات الرقاع
484. హజ్రత్ జాబిర్ బిన్ అబ్దుల్లా (రదియల్లాహు అన్హు) కథనం:-
జాతిర్రిఖా యుద్ధంలో మేము దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) వెంట ఉన్నాము. మేము ఒక ఛాయావృక్షం దగ్గరికి చేరుకున్నాక దాన్ని దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) కోసం (విశ్రాంతి తీసుకోవడానికి). ప్రత్యేకించాము. అప్పుడు ఒక బహు దైవారాధకుడు వచ్చి వృక్షానికి వ్రేలాడదీసిన ప్రవక్త ఖడ్గాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఆ వెనువెంటనే ఒరలో నుండి ఆ ఖడ్గాన్ని బయటికి తీసి “మీరు నాకు భయపడుతున్నారా?” అని అడిగాడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ని. దైవప్రవక్త లేదన్నారు. అతను (ఖడ్గం చూపిస్తూ) “ఇప్పుడు నా బారి నుండి మిమ్మల్ని ఎవరు కాపాడగలరు?” అని అడిగాడు. దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “అల్లాహ్ యే కాపాడగలడు” అని అన్నారు. (అంతలో) ప్రవక్త అనుచరులు కొందరు (అక్కడికి చేరుకొని) అతడ్ని గదమాయించారు.
ఆ తరువాత నమాజు కోసం అజాన్ చెప్పారు. అప్పుడు దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) సైన్యంలోని ఒక భాగంతో కలసి రెండు రకాతులు నమాజు చేశారు. తర్వాత వీరు వెనక్కి వెళ్ళిపోయారు. ఆ తరువాత సైన్యంలోని మిగిలిన భాగం వస్తే దాంతో కలసి కూడ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) రెండు రకాతులు నమాజు చేశారు. ఈ విధంగా ఆయన నాలుగు రకాతులు నమాజు చేశారు. సైనికులు మాత్రం రెండేసి రకాతుల నమాజు చేశారు.*
[సహీహ్ బుఖారీ : 64వ ప్రకరణం – మగాజి, 31వ అధ్యాయం – గజ్వతి జాతిర్రఖా]
* భయాందోళనల సందర్భంలో చేసే నమాజు గురించి ఇదే కాకుండా ఇంకా అనేక పద్ధతులున్నాయి. ధర్మవేత్తలు వాటి ఘనత, ప్రాముఖ్యతలను బట్టి విభిన్న పద్ధతులు అవలంబించారు. సందర్భానుసారం ఏ పద్ధతి అవలంబించినా నమాజు నెరవేరుతుంది.
మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్) (Al-Lulu-wal-Marjaan) .