మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్) (Al-Lulu-wal-Marjaan) .
1వ అధ్యాయం – అజాన్ ప్రారంభ దశ بدء الأذان
213 – حديث ابْنِ عُمَرَ كَانَ يَقُولُ: كَانَ الْمُسْلِمُونَ حِينَ قَدِمُوا الْمَدِينَةَ يَجْتَمِعُونَ فَيَتَحيَّنُونَ الصَّلاَةَ، لَيْسَ يُنَادَى لَهَا؛ فَتَكَلَّمُوا يَوْمًا فِي ذَلِكَ، فَقَالَ بَعْضُهُمْ اتَّخِذُوا نَاقُوسًا مِثْلَ نَاقُوسِ النَّصَارَى، وَقَالَ بَعْضُهُمْ: بَلْ بُوقًا مِثْلَ بُوقِ الْيَهُودِ؛ فَقَالَ عُمَرُ رضي الله عنه: أَوَلاً تَبْعَثُونَ رَجُلاً يُنَادِي بِالصَّلاَةِ فَقَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: يَا بِلاَلُ قُمْ فَنَادِ بِالصَّلاَةِ
__________
أخرجه البخاري في: 10 كتاب الأذان: 1 باب بدء الأذان
213. హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం:- ముస్లింలు మదీనా వచ్చిన తరువాత ప్రారంభంలో నమాజు కోసం అజాన్ చెప్పే సంప్రదాయం ఉండేది కాదు, నిర్ణీత వేళకు ప్రజలు తమంతట తామే (మస్జిద్ లో) గుమిగూడి నమాజు చేసుకునేవారు. కొన్నాళ్ళ తరువాత ఓ రోజు ముస్లింలు దీన్ని గురించి పరస్పరం సంప్రదించుకోవడానికి సమావేశమయ్యారు. అప్పుడు కొందరు తమ అభిప్రాయం వెలిబుచ్చుతూ “క్రైస్తవుల మాదిరిగా ఒక గంట ఏర్పాటు చేసుకొని మోగించాల’ని అన్నారు. మరి కొందరు యూదుల మాదిరిగా శంఖం ఊదాలని అన్నారు. అప్పుడు హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) మాట్లాడుతూ, “మనం నమాజు ప్రకటన కోసం ప్రత్యేకంగా ఒక వ్యక్తిని ఎందుకు నియమించుకోకూడదు?” అని అన్నారు. దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ సలహా విని హజ్రత్ బిలాల్ (రదియల్లాహు అన్హు)తో “లే, లేచి నమాజు కోసం ప్రకటన చెయ్యి” అని అన్నారు.
[సహీహ్ బుఖారీ : 10వ ప్రకరణం – అజాన్, 1వ అధ్యాయం – బయీల్ అజాన్]
2వ అధ్యాయం – అజాన్ వాక్యాలు రెండేసి సార్లు పలకాలి الأمر بشفع الأذان وإِيتار الإقامة
214 – حديث أَنَسٍ، قَالَ: ذَكَرُوا النَّارَ وَالنَّاقُوسَ، فَذَكَرُوا الْيَهُودَ وَالنَّصَارَى، فَأُمِرَ بِلاَلٌ أَنْ يَشْفَعَ الأَذَانَ وَأَنْ يُوتِرَ الإِقَامَةَ
__________
أخرجه البخاري في: 10 كتاب الأذان: 1 باب بدء الأذان
214. హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం:- ప్రజలు (నమాజు ప్రకటన విషయంలో) అగ్ని గురించి, శంఖం గురించి మాట్లాడారు. యూదులు, క్రైస్తవులు ఇలా చేస్తారని వారి పద్దతుల్ని గురించి కూడా ప్రస్తావించారు. ఆ తరువాత దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) అజాన్ చెప్పమని హజ్రత్ బిలాల్ (రదియల్లాహు అన్హు)ని ఆదేశిస్తూ అజాన్లో (అజాన్ పదాలు) రెండేసి సార్లు పలకాలని, ఇఖామత్ లో అయితే (ఈ పదాలనే) ఒక్కొక్కసారి పలకాలని అన్నారు. *
[సహీహ్ బుఖారీ : 10వ ప్రకరణం – అజాన్, 1వ అధ్యాయం – బద్ ఇల్ అజాన్]
* అజాన్ పదాలు రెండేసి సార్లు పలకాలి అంటే అర్థం ప్రారంభంలో అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్ అని ఒకే గుక్కలో రెండుసార్లు పలకడం వల్ల అది ఒకసారిగానే పరిగణించబడేది. ఈ విధంగా రెండు సార్లు పలకాలి అంటే ‘అల్లాహు అక్బర్’ అని నాలుగు సార్లు ఉచ్చరించాలన్న మాట. ‘ఇఖామత్’లో ‘ఖద్ ఖామతిస్సలాత్’ అనే పదం రెండు సార్లు, మిగతా పదాలు ఒక్కొక్కసారి ఉచ్చరించాలి. ఇది ఇమామ్ మాలిక్, ఇమామ్ షాఫయి (రహిమహుల్లాహ్), సలఫీ ధర్మవేత్తల అభిప్రాయం. దీనికి భిన్నంగా హనఫీ ధర్మవేత్తలు అజాన్లో అయినా, ఇఖామత్ లో అయిన ప్రతిపదం రెండేసి సార్లు ఉచ్చరించాలని నిర్ణయించారు. (అనువాదకుడు)
7వ అధ్యాయం – అజాన్ వినేవారు కూడా అజాన్ పదాలే ఉచ్చరించి చివర్లో దరూద్ పఠించాలి
القول مثل قول المؤذن لمن سمعه ثم يصلي على النبي صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ ثم يسأل له الوسيلة
215 – حديث أَبِي سَعِيدٍ الْخدْرِيِّ، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: إِذَا سَمِعْتُمُ النِّدَاءَ فَقُولُوا مِثْلَ مَا يَقُولُ الْمُؤَذِّنُ
__________
أخرجه البخاري في: 10 كتاب الأذان: 7 باب ما يقول إذا سمع المنادي
215. హజ్రత్ అబూ సయీద్ ఖుదరీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు: “మీరు అజాన్ వింటున్నప్పుడు ముఅజ్జిన్ (అజాన్ చెప్పేవాడు) పలికే పదాలే పలకండి. “ (*)
(సహీహ్ బుఖారీ : 10 వ ప్రకరణం – అజాన్, 7వ అధ్యాయం – మాయభూలు ఇజా సమిఅల్ మునాదీ]
(*) అజాన్ సందర్భంలో ‘ముఅజ్జిన్’ “హయ్యఅలస్సలాహ్, హయ్య అలల్ ఫలహ్” అని పలికినప్పుడు హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) గారి హదీసు ప్రకారం అజాన్ వినేవాడు “లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్” అని పలకాలి.
8వ అధ్యాయం – అజాన్ ఔన్నత్యం – షైతాన్ పై దాని ప్రభావం
فضل الأذان وهرب الشيطان عند سماعه
216 – حديث أَبِي هُرَيْرَةَ، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: إِذَا نُودِيَ لِلصَّلاَةِ أَدْبَرَ الشَّيْطَان وَلَهُ ضُرَاطٌ حَتَّى لاَ يَسْمَعَ التَّأْذِينَ، فَإِذَا قُضِيَ النِّدَاءُ أَقْبَلَ، حَتَّى إِذَا ثُوِّبَ بِالصَّلاَةِ أَدْبَرَ، حَتَّى إِذَا قُضِيَ التَّثْوِيبُ أَقْبَلَ، حَتَّى يَخْطُرَ بَيْنَ الْمَرْءِ وَنَفْسِهِ، يَقُولُ اذْكُرْ كَذَا، اذْكُرْ كَذَا، لِمَا لَمْ يَكُنْ يَذْكُرُ؛ حَتَّى يَظَلَّ الرَّجُلُ لاَ يَدْرِي كَمْ صَلَّى
__________
أخرجه البخاري في: 10 كتاب الأذان: 4 باب فضل التأذين
216. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు :-
అజాన్ చెప్పడం ప్రారంభించగానే షైతాన్ వెనక్కి తిరిగి పలాయనం చిత్తగిస్తాడు. (తీవ్రమైన భయాందోళనతో) వాడికి అపానవాయువు వెడలుతుంది. దాంతో వాడు అజాన్ వినరానంత దూరం పారిపోతాడు. అయితే అజాన్ చెప్పడం అయిపోగానే వాడు మళ్ళీ (ప్రార్ధనా స్థలానికి) చేరుకుంటాడు. ఇఖామత్ చెప్పగానే తిరిగి తోకముడిచి పారిపోతాడు. ఇఖామత్ చెప్పడం అయిపోగానే మళ్ళీ వచ్చి మానవుని హృదయంలో దుష్టాలోచనలు రేకెత్తిస్తాడు. మనిషికి అంతకు ముందు గుర్తుకురాని విషయాలన్నిటినీ (నమాజు కోసం నిలబడగానే) గుర్తు చేస్తూ ‘ఇది జ్ఞాపకం తెచ్చుకో’, ‘అది జ్ఞాపకం తెచ్చుకో’ అని పురిగొల్పుతాడు. దాంతో మనిషికి (వాడి మాయజాలంలో పడిపోయి), తాను ఎన్ని రకాతులు పఠించానన్న సంగతి కూడా జ్ఞాపకం ఉండదు.
[సహీహ్ బుఖారీ : 10వ ప్రకరణం – అజాన్, 4వ అధ్యాయం – ఫజ్లిత్తాజీన్)
9వ అధ్యాయం – రుకూ నుండి లేచేటప్పుడు రఫఅదైన్ చేయడం అభిలషణీయం
استحباب رفع اليدين حذو المنكبين مع تكبيرة الإحرام والركوع وفي الرفع من الركوع وأنه لا يفعله إِذا رفع من السجود
217 – حديث عَبْدِ اللهِ بْنِ عُمَرَ، قَالَ: رَأَيْتُ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ إِذَا قَامَ فِي الصَّلاَةِ رَفَعَ يدَيْهِ حَتَّى تَكُونَا حَذْوَ مَنْكِبَيْهِ، وَكَانَ يَفْعَلُ ذَلِكَ حِينَ يُكبِّرُ لِلرُّكُوعِ، وَيَفْعَلُ ذَلِكَ إِذَا رَفَعَ رَأْسَهُ مِنَ الرُّكُوعِ، وَيَقُولُ: سَمِعَ اللهُ لِمَنْ حَمِدَهُ، وَلاَ يَفْعَلُ ذَلِكَ فِي السُّجُودِ
__________
أخرجه البخاري في: 10 كتاب الأذان: 84 باب رفع اليد إذا كبر وإذا ركع وإذا رفع
217. హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) నమాజు కోసం నిలబడినప్పుడు ముందుగా (అల్లాహు అక్బర్ అంటూ) రెండు చేతులను భుజాల వరకు ఎత్తడం నేను చూశాను. (*) (దీన్ని రఫయెదైన్ అంటారు) అలాగే రుకూ కోసం తక్బీర్ పలికేటప్పుడు కూడా (రఫయెదైన్) చేసేవారు. తిరిగి రుకూ నుండి తల పైకెత్తేటప్పుడు కూడా అలాగే చేసేవారు. (రుకూ నుండి లేచేటప్పుడు) ఆయన “సమిఅల్లాహు లిమన్ హమిదహ్” అని అంటారు. అయితే సజ్దా స్థితిలోకి పోయేటప్పుడు గాని సజ్దా నుండి లేచేటప్పుడు గాని ఆయన రఫయెదైన్ చేసేవారు కాదు.
[సహీహ్ బుఖారీ : 10వ ప్రకరణం – అజాన్, 84వ అధ్యాయ- రఫ్ ఇల్ యదైని ఇజా కబ్బర వ ఇజారఫా)
(*) ఇమామ్ నవవీ (రహిమహుల్లాహ్) కథనం ప్రకారం తక్బీరె తహ్రీమా (అంటే నమాజ్ ప్రారంభంలో అల్లాహు అక్బర్ అని) చెప్పేటప్పుడు మాత్రం రఫయెదైన్ (అంటే చేతులు చెవుల దాకా పైకెత్తే) విషయంలో యావత్తు ముస్లిం సమాజంలో ఏకాభిప్రాయం ఉంది. కాని ఇతర సందర్భాలలో రఫయెదైన్ చేసే విషయం గురించి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇమామ్ షాఫయి (రహిమహుల్లాహ్), ఇమామ్ అహ్మద్ బిన్ హంబల్ (రహిమహుల్లాహ్), ఇమామ్ మాలిక్ (రహిమహుల్లాహ్), ఇంకా అనేకమంది ధర్మవేత్తల అభిప్రాయం ప్రకారం రుకూ స్థితిలోకి పోయేటప్పుడు, రుకూ నుండి పైకి లేచినప్పుడు రఫయెదైన్ చేయడం అభిలషణీయం (ముస్తహబ్).
ఇమామ్ షాఫయి (రహిమహుల్లాహ్) దృష్టిలో రెండు రకాతుల తరువాత ‘అత్తహియ్యత్’ చదివి పైకి లేచేటప్పుడు కూడా రఫయేదైన్ చేయవలసి ఉంటుంది. దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా చేసేవారని హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) తెలిపినట్లు ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్) పేర్కొన్నారు. అబూ బకర్ బిన్ మన్ జిర్ (రహిమహుల్లాహ్), అబూఅలి తబ్రీ (రహిమహుల్లాహ్), ఇంకా అహఁలే హదీస్ వర్గంలోని కొందరి అభిప్రాయం ప్రకారం రెండు సజ్దాల మధ్య కూడా రఫయెదైన్ ముస్తహబ్.
అయితే ఇమామ్ అబూ హనీఫా (రహిమహుల్లాహ్), ఇమామ్ మాలిక్ (రహిమహుల్లాహ్), అహఁలే కూఫాల అభిప్రాయంలో తక్బీరె తహ్రీమా సమయంలో తప్ప మరే సందర్భంలోనూ రఫయెదైన్ చేయకూడదు. ఏమయినప్పటికీ రఫయదైన్ చేయడం (ఏ సందర్భంలోనూ) వాజిబ్ (తప్పనిసరి) మటుకు కాదని అయితే అది ‘సున్నత్’ అన్నది నిర్వివాదాంశమని మొత్తం ముస్లిం సమాజం అంగీకరించింది. పోతే చేతులు ఏ మేరకు పైకెత్తాలి అనే విషయంలో అత్యధిక మంది ధర్మవేత్తల అభిప్రాయం ప్రకారం బొటన వ్రేళ్ళు చెవుల క్రింది భాగం వరకు, ఇతర వ్రేళ్ళు చెవుల పై భాగం వరకు చేరేలా చేతులు పైకెత్తాలి. చేతులు పైకెత్తే సమయం గురించి మూడు రకాల ఉల్లేఖనాలున్నాయి. (1) తక్బీర్ (అంటే అల్లాహు అక్బర్ అని) చెప్పే ముందు, (2) తక్బీర్ చెప్పిన తరువాత, (3) కచ్చితంగా తక్బీర్ చెప్పే క్షణానే చేతులు పైకెత్తాలి.
218 – حديث مَالِكِ بْنِ الْحُوَيْرِثِ عَنْ أَبِي قِلاَبَةَ، أَنَّهُ رَأَىَ مَالِكَ بْنَ الْحُوَيْرِثِ إِذَا صَلَّى كَبَّرَ وَرَفَعَ يَدَيْهِ، وَإِذَا أَرَادَ أَنْ يَرْكَعَ رَفَعَ يَدَيْهِ، وَإِذَا رَفَعَ رَأْسَهُ مِنَ الرُّكُوعِ رَفَعَ يَدَيْهِ، وَحَدَّثَ أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ صَنَعَ هكَذَا
__________
أخرجه البخاري في: 10 كتاب الأذان: 84 باب رفع اليدين إذا كبّر وإذا ركع وإذا رفع
218. హజ్రత్ అబూ ఖిలాబ (రహిమహుల్లాహ్) కథనం:- మాలిక్ బిన్ హువైరిస్ (రదియల్లాహు అన్హు) నమాజులో (మొదటి) తక్బీర్ పలికేటప్పుడు, రుకూ స్థితిలోకి పోయేటప్పుడు, రుకూ నుండి లేచేటప్పుడు కూడా రఫయెదైన్ చేస్తూ ఉండటం నేను చూశాను. దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా చేస్తుండేవారని ఆయన అన్నారు.
[సహీహ్ బుఖారీ : 10వ ప్రకరణం – అజాన్, 84వ అధ్యాయం – రఫ్ యదైని ఇజా కబ్బర వ ఇజా రకా వ ఇజా రఫఅ]
10వ అధ్యాయం – నమాజులో వంగేటప్పుడు, లేచేటప్పుడు ప్రతి సారీ ‘అల్లాహు అక్బర్’ అని పలకాలి
إِثبات التكبير في كل خفض ورفع في الصلاة إِلا رفعه من الركوع فيقول فيه: سمع الله لمن حمده
219 – حديث أَبِي هُرَيْرَةَ، أَنَّهُ كَانَ يُصَلِّي بِهِمْ فَيُكَبِّرُ كلَّمَا خَفَضَ وَرَفَعَ، فَإِذَا انْصَرَفَ قَالَ: إِنِّي لأَشْبَهُكُمْ صَلاَةً بِرَسُولِ الله صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ
__________
أخرجه البخاري في: 10 كتاب الأذان: 115 باب إتمام التكبير في الركوع
219. అబూ సల్మా బిన్ అబ్దుర్రహ్మాన్ (రహిమహుల్లాహ్) కథనం:- హజ్రత్ అబూ హురైరా(రదియల్లాహు అన్హు) నమాజు చేస్తున్న సందర్భంలో వంగేటప్పుడు, పైకి లేచేటప్పుడు అల్లాహు అక్బర్ అని పలికేవారు. సలాముతో నమాజు ముగించిన తరువాత ఆయన మాట్లాడుతూ “మీ అందరి నమాజు కన్నా నా నమాజు ఎక్కువగా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నమాజును పోలి ఉంటుంది” అని అన్నారు.
(సహీహ్ బుఖారీ : 10వ ప్రకరణం – అజాన్, 115వ అధ్యాయం – ఇత్మామిత్తక్బీరి ఫిర్రుకూ)
220 – حديث أَبي هُرَيْرَةَ، قَالَ: كَانَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ إِذَا قَامَ إِلَى الصَّلاَةِ يُكَبِّرُ حِينَ يَقُومُ، ثُمَّ يُكَبِّرُ حِينَ يَرْكَعُ، ثُمَّ يَقُولُ: سَمِعَ الله لِمَنْ حَمِدَهُ حِينَ يَرْفَعُ صُلْبَهُ مِنَ الرُّكُوعِ، ثُمَّ يَقُولُ وَهُوَ قَائِمٌ: رَبَّنَا وَلَكَ الْحَمْدُ، ثُمَّ يُكَبِّرُ حِينَ يَهْوِي، ثُمَّ يُكَبِّرُ حِينَ يَرْفَعُ رَأْسَهُ، ثُمَّ يُكَبِّرُ حِينَ يَسْجُدُ، ثُمَّ يُكَبِّرُ حِينَ يَرْفَعُ رَأْسَهُ؛ ثُمَّ يَفْعَلُ ذَلِكَ فِي الصَّلاَةِ كُلِّهَا حَتَّى يَقْضِيَهَا؛ وَيُكَبِّرُ حِينَ يَقُومُ مِنَ الثِّنْتَيْنِ بَعْدَ الْجُلُوسِ
__________
أخرجه البخاري في: 10 كتاب الأذان: 117 باب التكبير إذا قام من السجود
220. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం :-
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నమాజు కోసం నిలబడినప్పుడు ‘అల్లాహు అక్బర్’ అంటారు. రుకూ స్థితిలోకి పోయేటప్పుడు కూడా మళ్ళీ ‘అల్లాహు అక్బర్’ అంటారు. అయితే రుకూ నుండి లేచేటప్పుడు మాత్రం ‘సమిఅల్లాహులిమన్ హమిదా’ అంటారు. ఆ తర్వాత నిల్చొని ‘రబ్బనా లకల్ హమ్ద్ ‘ అంటారు. తిరిగి ‘అల్లాహు అక్బర్’ అంటూ సజ్దా స్థితిలోకి వెళ్తారు. సజ్దా నుండి లేచి కూర్చునేటప్పుడు కూడా ‘అల్లాహు అక్బర్’ అంటారు. అలాగే రెండవ సజ్దా లోకి పోయేటప్పుడు తిరిగి లేచి కూర్చునేటప్పుడు కూడా ‘అల్లాహు అక్బర్ అంటారు. ఈ విధంగా ఆయన పూర్తి నమాజు చేసి ముగిస్తారు. రెండు రకాతుల తరువాత మొదటి ఖాయిదా (కూర్చునే స్థితి) నుండి పైకి లేచేటప్పుడు కూడా ‘అల్లాహు అక్బర్’ అంటారు.
[సహీహ్ బుఖారీ : 10వ ప్రకరణం – అజాన్, 117వ అధ్యాయం – అత్తక్బీరి ఇజాఖామ మినస్సుజూద్)
221 – حديث عِمْرَانَ بْنِ حُصَيْنِ عَنْ مُطَرِّفِ بْنِ عَبْدِ اللهِ، قَالَ: صَلَّيْتُ خَلْفَ عَلِيِّ بْنِ أَبِي طَالِبٍ، أَنَا وَعِمْرَانُ بْنُ حُصَيْنٍ، فَكَانَ إِذَا سَجَدَ كَبَّرَ، وَإِذَا رَفَعَ رَأْسَهُ كَبَّرَ، وَإِذَا نَهَضَ مِنَ الرَكْعَتَيْنِ كَبَّرَ؛ فَلَمَّا قَضَى الصَّلاَةَ أَخَذَ بِيَدِي عِمْرَانُ بْنُ حُصَيْنٍ فَقَالَ: لَقَدْ ذَكَّرَنِي هذَا صَلاَةَ مُحَمَّدٍ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، أَوْ قَالَ: لَقَدْ صَلَّى بِنَا صَلاَةَ مُحَمَّدٍ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ
__________
أخرجه البخاري في: 10 كتاب الأذان: 116 باب إتمام التكبير في السجود
221. హజ్రత్ ముతర్రిఫ్ బిన్ అబ్దుల్లా (రహిమహుల్లాహ్) కథనం:- ఓ రోజు నేను, ఇమ్రాన్ బిన్ హుసేన్ కలసి హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) వెనుక నమాజు చేశాము. హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) సజ్దా స్థితిలోకి పోయేటప్పుడు సజ్దా నుండి లేచేటప్పుడు ‘అల్లాహు అక్బర్’ అని పలికేవారు. రెండు రకాతులు పూర్తి అయిన తరువాత లేచి నిలబడేటప్పుడు కూడా ‘అల్లాహు అక్బర్’ అని పలికేవారు. ఇలా నమాజు ముగిసిన తరువాత ఇమ్రాన్ బిన్ హుసేన్ నా చేయి పట్టుకొని “ఈ రోజు చేసిన నమాజు నాకు దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) చేసే నమాజును స్ఫరణకు తెచ్చింది” అని అన్నారు. లేక “హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) మనకు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నమాజు చేయించారు” అని అన్నారు.
[సహీహ్ బుఖారీ : 10వ ప్రకరణం – అజాన్, 116వ అధ్యాయం – ఇత్మామిత్తక్బీరి ఫిస్సుజూద్)
11వ అధ్యాయం – ప్రతి రకాతులో ఫాతిహా సూరా విధిగా పఠించాలి
وجوب قراءة الفاتحة في كل ركعة وأنه إِذا لم يحسن الفاتحة ولا أمكنه تعلمها، قرأ ما تيسر له من غيرها
222 – حديث عُبَادَةَ بْنِ الصَّامِتِ، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: لاَ صَلاَة لِمَنْ لَمْ يَقْرَأْ بِفَاتِحَةِ الْكِتَابِ
[ص:81] أخرجه البخاري في: كتاب الأذان: 95 باب وجوب القراءة للإمام والمأموم في الصلوات كلها
222. హజ్రత్ ఉబాదా బిన్ సామిత్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు:- “ఫాతిహా సూరా పఠించని వారి నమాజు నెరవేరనే నెరవేరదు.” *
(సహీహ్ బుఖారీ : 10వ ప్రకరణం – అజాన్, 95వ అధ్యాయం – వుజూబుల్ ఖిరాతిలిల్ ఇమామి వల్ మామూమి ఫిస్సలాతి కుల్లిహా]
(*) ఈ ఉల్లేఖనాన్ని బట్టి ఇమామ్, ముఖ్తదీలు ఉభయులూ ప్రతి నమాజులో ఫాతిహా సూరా పఠించవలసిన అవసరముందని హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) భావించినట్లు తెలుస్తోంది. ఈ విషయమై సహాబీల (ప్రవక్త ప్రత్యక్ష అనుచరుల)లో కూడా భిన్నాభిప్రాయాలున్నాయి. ముఖ్తదీలు ఫాతిహా సూరా పఠించడం మక్రూహ్ (అవాంఛనీయం) అని కొందరు భావించారు. ముఖ్తదీలు కూడా ఫాతిహా సూరా పఠించాలని మరి కొందరు అభిప్రాయపడ్డారు. ఇంకా కొందరు సహాబీలు ఇలా పఠించడం అవసరమని గాని, మక్రూహ్ అని గాని భావించలేదు. అందువల్లనే హజ్రత్ అబూబకర్ (రదియల్లాహు అన్హు) మనవడు హజ్రత్ ఖాసిం (రహిమహుల్లాహ్) దృష్టికి ఈ సమస్య వచ్చినప్పుడు చాలామంది ఇమాములు ఫాతిహా సూరా పఠించకూడదని, చాలా మంది ఇమాములు ఫాతిహా సూరా పఠించాలని అన్నారని ఆయన తెలియజేశారు. అంతేగాని ఆయన తన సొంత అభిప్రాయాన్ని వెలిబుచ్చలేదు. అలాగే వివిధ ధర్మవేత్తలు, సంస్కరణ వాదులలో కూడా ఈ సమస్య గురించి భిన్నాభిప్రాయాలున్నాయి. ఇమామ్ షాఫయి, ఇమామ్ అహ్మద్ బిన్ హంబల్, ఇమామ్ మాలిక్ (రహిమహుల్లాహ్)ల అభిప్రాయం నమాజు ఒంటరిగా చేసినా, ఇమామ్ వెనుక నిల్చొని సామూహికంగా చేసినాసరే ఫాతిహా సూరా పఠించడం వాజిబ్ (తప్పనిసరి). హనఫీ దర్మవేత్తల అభిప్రాయం ప్రకారం ఇమామ్ వెనుక నిలబడి నమాజు చేసే వాళ్ళు ఫాతిహా సూరా పఠించడం మక్రూహ్ (అవాంఛనీయం).
223 – حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، قَالَ: فِي كُلِّ صَلاَةٍ يُقْرَأُ، فَمَا أَسْمَعَنَا رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ أَسْمَعْنَاكُمْ، وَمَا أَخْفَى عَنَّا أَخْفَيْنَا عَنْكُمْ، وَإِنْ لَمْ تَزدْ عَلى أُمِّ الْقُرْآن أَجْزَأَتْ، وَإِنْ زِدْتَ فَهُوَ خَيْرٌ
__________
أخرجه البخاري في: 10 كتاب الأذان: 104 باب القراءة في الفجر
223. హజ్రత్ అబూ హూరైరా (రదియల్లాహు అన్హు) కథనం:-
ప్రతి నమాజులో ఖిరాత్ (పారాయణం) చేయాలి. ఏ నమాజులలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) (బిగ్గరగా) పారాయణం చేసి మాకు విన్పించారో ఆ నమాజులలో మేము కూడా మీకు (బిగ్గరగా) పారాయణం చేసి విన్పించాము. మరే నమాజులలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) (మెల్లిగా పఠించి) మా ముందు దాచారో ఆ నమాజులలో మేము కూడా (మెల్లిగా పఠించి) మీ ముందు దాచాము. (నమాజులో) ఫాతిహా సూరా మాత్రమే పఠించి ఖుర్ఆన్లోని మరే ఆయతులు పఠించకపోయినా సరిపోతుంది (నమాజు నెరవేరుతుంది). ఒకవేళ ఫాతిహా సూరాతో పాటు అదనంగా ఖుర్ఆన్లోని మరికొన్ని సూక్తులు కూడా పఠిస్తే మరీ మంచిది.
[సహీహ్ బుఖారీ : 10వ ప్రకరణం – అజాన్, 104వ అధ్యాయం – అల్ ఖిరాతి ఫిల్ ఫజ్ర్)
224 – حديث أَبِي هُرَيْرَةَ، أَنَّ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ دَخَلَ الْمَسْجِدَ؛ فَدَخَلَ رَجُلٌ فَصَلَّى، ثُمَّ جَاءَ فَسَلَّمَ عَلَى النَبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَرَدَّ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ عَلَيْهِ السَّلاَمَ؛ فَقَالَ: ارْجِعْ فَصَلِّ فَإِنَّكَ لَمْ تُصَلِّ فَصَلَّى، ثُمَّ جَاءَ فَسَلَّمَ عَلَى النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ؛ فَقَالَ: ارْجِعْ فَصَلِّ فَإِنَّكَ لَمْ تُصَلِّ ثَلاَثًا فَقَالَ: وَالَّذِي بَعَثَكَ بِالْحَقِّ مَا أُحْسِنُ غَيْرَهُ، فَعَلِّمْنِي قَالَ: إِذَا قُمْتَ إِلَى الصَّلاَةِ فكَبِّرْ ثُمَّ اقْرَأْ مَا تَيَسَّرَ مَعَكَ مِنَ الْقُرْآنِ، ثُمَّ ارْكَعْ حَتَّى تَطْمَئِنَّ رَاكِعًا، ثُمَّ ارْفَعْ حَتَّى تَعْتَدِلَ قَائِمًا، ثُمَّ اسْجُدْ حَتَّى تَطْمَئِنَّ سَاجِدًا، ثُمَّ ارْفَعْ حَتَّى تَطْمَئِنَّ جَالِسًا، ثُمَّ اسْجُدْ حَتَّى تَطْمَئنَّ سَاجِدًا، ثُمَّ افْعَلْ ذَلِكَ فِي صَلاَتِكَ كُلِّهَا
__________
أخرجه البخاري في: 10 كتاب الأذان: 122 باب أمر النبي صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ الذي لا يتم ركوعه بالإعادة
224. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం:-
ఓ రోజు దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మస్జిద్ కు వెళ్ళారు. అదే సమయంలో ఒక వ్యక్తి వచ్చి నమాజు చేశాడు. అతను నమాజు ముగించుకొని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు సలాం చేశాడు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అతనికి ప్రతి సలాం చేసి “వెళ్ళి నమాజు చెయ్యి. నువ్వసలు నమాజు చెయ్యలేదు” అన్నారు. ఆ వ్యక్తి వెళ్ళి (తిరిగి) నమాజు చేశాడు. నమాజు చేసి వచ్చి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు సలాం చేశాడు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తిరిగి అదే మాట చెబుతూ “వెళ్ళు, వెళ్ళి నమాజు చెయ్యి. నువ్వసలు (సరిగా) నమాజు చేయలేదు” అని అన్నారు. ఈ విధంగా ఆ వ్యక్తి మూడుసార్లు నమాజు చేసి వచ్చాడు. ప్రతీసారి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “నువ్వసలు నమాజు చేయలేదు. వెళ్ళి నమాజు చెయ్యి” అనే అన్నారు.
చివరికి ఆ వ్యక్తి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దగ్గరకొచ్చి “మిమ్మల్ని దైవప్రవక్తగా నియమించి పంపిన ఆ దేవుని సాక్ష్యం! నాకు ఇంత కంటే మెరుగైన నమాజు చేయడం రాదు. కాస్త మీరే నేర్పండి ఎలా చేయాలో” అని అన్నాడు. అప్పుడు దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా చెప్పారు:
“నువ్వు నమాజు కోసం నిలబడినప్పుడు మొట్టమొదట ‘అల్లాహు అక్బర్’ అని పలకాలి. తరువాత నీవు ఖుర్ఆన్ సులభంగా ఎంత భాగం పఠించగలవో అంత పఠించు. ఆ తరువాత రుకూ చెయ్యి. రుకూ నింపాదిగా చేశాక తల పైకెత్తి నిటారుగా నిలబడు. ఆ తరువాత సజ్దా చెయ్యి. సజ్దా నింపాదిగా చేసిన తరువాత, తల పైకెత్తి ప్రశాంతంగా కూర్చో. ఆ తరువాత మళ్ళీ సజ్దా చెయ్యి. సజ్దా నింపాదిగా చేసిన తరువాత తల పైకెత్తి ప్రశాంతంగా కూర్చో. ఈ విధంగా పూర్తి నమాజు చేసి ముగించాలి”.
(సహీహ్ బుఖారీ : 10వ ప్రకరణం – అజాన్, 122వ అధ్యాయం – అమ్రిన్నబియ్యి (సల్లల్లాహు అలైహి వసల్లం) అల్లజీ లా యుతిమ్ము రుకూ అహూ బిల్ ఇఆదా)
13వ అధ్యాయం- నమాజులో ‘బిస్మిల్లాహ్’ పదం బిగ్గరగా పఠించకూడదు
حجة من قال لا يجهر بالبسملة
225 – حديث أَنَسٍ، أَنَّ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، وَأَبَا بَكْرٍ وَعُمَرَ، كَانُوا يَفْتَتِحُونَ الصَّلاَةَ ب الْحَمْدُ للهِ رَبِّ الْعَالَمِينَ
__________
أخرجه البخاري في: 10 كتاب الأذان: 89 باب ما يقول بعد التكبير
225. హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం :- దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం), హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు), హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు)లు “అలహములిల్లాహి రబ్బిల్ ఆలమీన్” అనే వాక్యంతో నమాజు ప్రారంభించేవారు. (దానికి ముందు బిస్మిల్లాహ్ అనే పదం మెల్లిగా పఠించడం వల్ల పైకి విన్పించేది కాదు).
[సహీహ్ బుఖారీ : 10వ ప్రకరణం – అజాన్, 89 వ అధ్యాయం – మాయఖూలు బాదత్తక్బీర్]
16వ అధ్యాయం – నమాజులో ‘తషహ్హుద్’ పఠనం التشهد في الصلاة
226 – حديث عَبْدِ اللهِ بْنِ مَسْعُودٍ، قَالَ: كُنَّا إِذَا صَلَّيْنَا مَعَ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قُلْنَا السَّلاَمُ عَلَى اللهِ قَبْلَ عِبَادِهِ، السَّلاَمُ عَلَى جِبْرِيلَ، السَّلاَمُ عَلَى مِيكَائِيلَ، السَّلاَمُ عَلَى فُلاَنٍ؛ فَلَمَّا انْصَرَفَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ أَقْبَلَ عَلَيْنَا بِوَجْهِهِ، فَقَالَ: إِنَّ اللهَ هَوَ السَّلاَمُ، فَإِذَا جَلَسَ أَحَدُكُمْ فِي الصَّلاَةِ فَلْيَقُلِ التَّحِيَّاتُ للهِ وَالصَّلَوَاتُ وَالطَّيِّبَاتُ، السَّلاَمُ عَلَيْكَ أَيُّهَا النَّبِيُّ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ، السَّلاَمُ عَلَيْنَا وَعَلَى عِبَادِ اللهِ الصَّالِحِينَ؛ فَإِنَّهُ إِذَا قَالَ ذَلِكَ أَصَابَ كُلَّ عَبْدٍ صَالِحٍ في السَّمَاءِ والأَرْضِ؛ أَشْهَدُ أَنْ لاَ إِلهَ إِلاَّ اللهُ وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ، ثُمَّ يَتَخَيَّرُ بَعْدُ مِنَ الْكَلاَم مَا شَاءَ
__________
أخرجه البخاري في: 79 كتاب الاستئذان: 3 باب السلام اسم من أسماء الله تعالى
226. హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ వూద్ (రదియల్లాహు అన్హు) కథనం:-
ప్రారంభంలో మేము దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)తో కలసి నమాజు చేస్తుంటే “దాసులకు పూర్వం అల్లాహ్ పై శాంతి కలుగుగాక! తరువాత జిబ్రయీల్ కు, మీకాయీలకు, ఫలానా వ్యక్తికి (ఇలా) మొదలగు వారికి శాంతి కలుగుగాక!” అని పఠించేవాళ్ళము. ఆ తరువాత ఓ రోజు నమాజు ముగిసిన తరువాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మా వైపుకు తిరిగి ఇలా అన్నారు:
“అల్లాహ్ స్వయంగా శాంతిమయుడు. (ఆయనకు మీరు శాంతి కలుగుగాక అని చెప్పనవసరం లేదు) అందువల్ల మీరు నమాజులో (తషహ్హుద్ పఠనం కోసం) కూర్చున్నప్పుడు ‘అత్తహియ్యాతులిల్లాహి వస్సలవాతు వత్తయ్యిబాతు అస్సలాము అలైక అయ్యుహన్నబియ్యు వరహ్మతుల్లాహి వబరకాతుహూ అస్సలాము అలైనా వఅలా ఇబాదిల్లాహిస్సాలిహీన్’ అని పఠించండి. ఈ విధంగా మీరు శాంతి ప్రార్థన చేస్తే భూమ్యాకాశాలలో ఉన్న ఉత్తమ దైవదాసులందరికీ శాంతి చేకూరుతుంది. (ఆ తరువాత) ‘అష్ హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వ అష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహ్’ (అని పఠించండి). ఇలా పఠించిన తరువాత మీరు చేయదలచుకున్న దుఆ (వేడుకోలు) చేసుకోవచ్చు.”
(సహీహ్ బుఖారీ : 79వ ప్రకరణం – ఇస్తీజాన్, 3వ అధ్యాయం – అస్సలాము ఇస్మున్ మిన్ అస్మాయిల్లాహ్)
17వ అధ్యాయం – తషహ్హుద్ తరువాత దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) కోసం దరూద్ పఠనం الصلاة على النبي صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ بعد التشهد
227 – حديث كَعْبِ بْنِ عُجْرَةَ عَنْ عَبْدِ الرَّحْمنِ ابْنِ أَبِي لَيْلَى، قَالَ: لَقِيَنِي كَعْبُ بْن عُجْرَةَ؛ فَقَالَ: أَلاَ أُهْدِي لَكَ هَدِيَّةً سَمِعْتُهَا مِنَ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فَقُلْتُ: بَلَى فَأَهْدِهَا لِي فَقَالَ: سَأَلْنَا رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فَقُلْنَا: يَا رَسُولَ اللهِ كَيْفَ الصَّلاَةُ عَلَيْكُمْ أَهْلَ الْبَيْتِ فَإِنَّ اللهَ قَدْ عَلَّمَنَا كَيْفَ نُسَلِّمُ عَلَيْكُمْ، قَالَ: قُولُوا اللهُمَّ صَلِّ عَلَى مُحَمَّدٍ وَعَلَى آلِ مُحَمَّدٍ كَمَا صَلَّيْتَ عَلَى إِبْرَاهِيمَ وَعَلَى آلِ إِبْرَاهِيمَ إِنَّكَ حَمِيدٌ مَجِيدٌ، اللهُمَّ بَارِكْ عَلى مُحَمَّدٍ وَعَلَى آلِ مُحَمَّدٍ كَمَا بَارَكْتَ عَلَى إِبْرَاهِيمَ وَعَلَى آلِ إِبْرَاهِيمَ إِنَّكَ حَمِيدٌ مَجِيدٌ
__________
أخرجه البخاري في: 60 كتاب الأنبياء: 10 باب حدثنا موسى بن إسماعيل
227. హజ్రత్ అబ్దుర్రహ్మాన్ బిన్ అబూ లైలా (రహిమహుల్లాహ్) కథనం:- ఓ రోజు నన్ను కాబ్ బిన్ ఉజరా (రదియల్లాహు అన్హు) కలిసి, “నేను దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) నోట విన్న ఒక హదీసును విన్పించనా?” అని అన్నారు. నేను “తప్పకుండా విన్పించండి” అన్నాను. అప్పుడాయన ఇలా అన్నారు – నేను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)తో మాట్లాడుతూ “దైవప్రవక్తా! మీ కోసం, మీ కుటుంబం కోసం శాంతి వేడుకోలు ఎలా చెయ్యాలో మాత్రం అల్లాహ్ మాకు తెలియజేశాడు. కాని మీ కోసం, మీ కుటుంబం కోసం, దరూద్ వేడుకోలు ఎలా చేయాలి మరి?” అని అడిగాను.
అప్పుడు దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా చెప్పారు: “అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదివ్ వ అలా ఆలి ముహమ్మదిన్ కమా సల్లెత అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్మజీద్. అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మదివ్ వ అలా ఆలి ముహమ్మదిన్ కమా బారక్ త అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదు మ్మజీద్.”
[సహీహ్ బుఖారీ : 60వ ప్రకరణం – అంబియా, 10వ అధ్యాయం – హద్దసనా మూసా బిన్ ఇస్మాయిల్)
228 – حديث أَبِي حُمَيْدٍ السَّاعِدِيِّ رضي الله عنه، أَنَّهُمْ قَالُوا: يَا رَسُولَ اللهِ كَيْفَ نُصَلِّي عَلَيْكَ فَقَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: قُولُوا: اللهُمَّ صَلِّ عَلَى مُحَمَّدٍ وَأَزْوَاجِهِ وَذُرِّيَّتِهِ كَمَا صَلَّيْتَ [ص:83] عَلَى آلِ إِبْرَاهِيمَ، وَبَارِكْ عَلَى مُحَمَّدٍ وَأَزْوَاجِهِ وَذُرِّيَّتِهِ كَمَا بَارَكْتَ عَلَى آلِ إِبْرَاهِيمَ إِنَّكَ حَمِيدٌ مَجِيدٌ
__________
أخرجه البخاري في: 60 كتاب الأنبياء: 10 باب حدثنا موسى بن إسماعيل
228. హజ్రత్ అబూ హమీద్ సాఅది (రదియల్లాహు అన్హు) కథనం:- ఓ సారి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)తో ఆయన అనుచరులు మాట్లాడుతూ “దైవప్రవక్తా! మేము మీ కోసం దరూద్ వేడుకోలు ఎలా చేయాలి?” అని అడిగారు. దానికాయన ఇలా సమాధానమిచ్చారు:
“ఇలా అనండి – అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిఁవ్వఅజ్ వాజిహీ వ జుర్రియ్యతిహీ కమాసల్లెత అలా ఇబ్రాహీమ వ బారిక్ అలా ముహమ్మదిఁవ్వ అజ్వాజిహీ వ జుర్రియ్యతిహిహీ కమాబారక్త అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్మజీద్.”
[సహీహ్ బుఖారీ : 60వ ప్రకరణం – అంబియా, 10వ అధ్యాయం – హద్దసనా మూసా బిన్ ఇస్మాయీల్)
18వ అధ్యాయం – సమి అల్లాహులిమన్ హమిదా, రబ్బనా లకల్ హమ్ద్, ఆమీన్ التسميع والتحميد والتأمين
229 – حديث أَبِي هُرَيْرَةَ، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: إِذَا قَالَ الإِمَامُ سَمِعَ اللهُ لِمَنْ حَمِدَهُ، فَقُولُوا: اللهُمَّ رَبَّنَا وَلَكَ الْحَمْدُ؛ فَإِنَّهُ مَنْ وَافَقَ قَوْلُهُ قَوْلَ الْمَلاَئِكَةِ غُفِرَ لَهُ مَا تَقَدَّمَ مِنْ ذَنْبِهِ
__________
أخرجه البخاري في: 10 كتاب الأذان: 125 باب فضل اللهم ربنا ولك الحمد
229. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:- ఇమామ్ (నమాజులో) ‘సమిఅల్లాహులిమన్ హమిదా’ అని అన్నప్పుడు మీరు ‘రబ్బనా! వ లకల్ హమ్ద్’ అని చెప్పండి. ఇలా దైవదూతల మాటకు అనుగుణంగా పలికే వారి గత పాపాలన్నీ క్షమించబడతాయి.
[సహీహ్ బుఖారీ : 10వ ప్రకరణం – అజాన్, 125 వ అధ్యాయం – ఫజ్లిల్లాహుమ్మ రబ్బనా వ లకల్ హమ్ద్)
230 – حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: إِذَا قَالَ أَحَدُكُمْ آمِينَ، وَقَالَتِ الْمَلاَئِكَةُ فِي السَّمَاءِ آمِينَ، فَوَافَقَتْ إِحْداهُمَا الأُخْرَى؛ غُفِرَ لَهُ مَا تَقَدَّمَ مِنْ ذَنْبِهِ
__________
أخرجه البخاري في: 10 كتاب الأذان: 112 باب فضل التأمين
230. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:- మీలో ఎవరైనా ‘ఆమీన్’ అని పలకగానే ఆకాశంలో దైవదూతలు కూడా ‘ఆమీన్’ అంటారు. ఇలా మీరు పలికే ఆమీన్, వారు పలికే ఆమీన్ పరస్పరం కలసిపోతుంది. ఆపై ‘ఆమీన్’ పలికే వ్యక్తి గత పాపాలన్నీ క్షమించబడతాయి.
(సహీహ్ బుఖారీ : 10వ ప్రకరణం – అజాన్, 112వ అధ్యాయం – ఫజ్లిత్తామీన్]
231 – حديث أَبِي هُرَيْرَةَ، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: إِذَا قَالَ الإِمَامُ غَيْرِ الْمَغْضُوبِ عَلَيْهِمْ وَلاَ الضَّالِّينَ فَقُولُوا: آمِينَ؛ فَإِنَّهُ مَنْ وَافَقَ قَوْلُهُ قَوْلَ الْمَلاَئِكَةِ؛ غُفِرَ لَهُ مَا تَقَدَّمَ مِنْ ذَنْبِهِ
__________
أخرجه البخاري في: 10 كتاب الأذان: 113 باب جهر المأموم بالتأمين
231. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:- “ఇమామ్ (నమాజులో) గైరిల్ మగ్ జూబి అలైహిమ్ వలజ్జాలీన్ అని అన్నప్పుడు మీరంతా ‘ఆమీన్’ * అని చెప్పండి మీరు చెప్పే ఆమీన్ దైవదూతలు చెప్పే ఆమీను అనుగుణంగా చేయబడుతుంది. అదీగాక ఇలా ఆమీన్ అని చెప్పే వ్యక్తి గత పాపాలు క్షమించబడతాయి.”
[సహీహ్ బుఖారీ : 10వ ప్రకరణం – అజాన్, 113 వ అధ్యాయం – జహ్రిల్ మామూమి బిత్తామీన్]
(*) ఇమామ్, ముఖ్తదీలు ఉభయులూ ఆమీన్ పలకడం ముస్తహబ్ (అభిలషణీయం). అయితే ఉభయులూ ఒకేసారి పలకాలి. ఇమామ్ మాలిక్ (రహిమహుల్లాహ్), ఇమామ్ అబుహనీఫా (రహిమహుల్లాహ్)ల అభిప్రాయం ప్రకారం ఆమీన్ మెల్లగా పలకాలి. ఇతర ధర్మవేత్తలు, సంస్కరణ వాదుల అభిప్రాయం ప్రకారం ‘ఆమీన్’ బిగ్గరగా పలకాలి.
19వ అధ్యాయం – ముఖ్తదీలు (నమాజులో) ఇమామ్ ని విధిగా అనుకరించాలి
ائتمام المأموم بالإمام
232 – حديث أَنَسِ بْنِ مَالِكٍ، قَالَ: سَقَطَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ عَنْ فَرَسٍ فَجُحِشَ شِقُّهُ الأَيْمَنُ، فَدَخَلْنَا عَلَيْهِ نَعُودُهُ، فَحَضَرَتِ الصَّلاَةُ، فَصَلَّى بِنا قَاعِدًا، فَقَعَدْنَا؛ [ص:84] فَلَمَّا قَضَى الصَّلاَةَ، قَالَ: إِنَّمَا جُعِلَ الإِمَامُ لِيُؤْتَمَّ بِهِ؛ فَإِذَا كَبَّرَ فَكَبِّرُوا، وَإِذَا رَكَعَ فَارْكَعُوا، وَإِذَا رَفَع فارْفَعُوا، وَإِذَا قَالَ سَمِعَ اللهُ لِمَنْ حَمِدَهُ، فَقُولُوا رَبَّنَا وَلَكَ الْحَمْدُ، وَإِذَا سَجَدَ فَاسْجُدُوا
__________
أخرجه البخاري في: 10 كتاب الأذان: 128 باب يهوى بالتكبير حين يسجد
232. హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఓ సారి గుర్రం మీద నుంచి పడిపోయారు. దాని వల్ల ఆయన శరీరం కుడి భాగం దోక్కుని పోయింది. మేము ఆయన్ని పరామర్శించడానికి వెళ్ళాం. మేము ఆయన సన్నిధికి వెళ్ళేటప్పటికి నమాజు వేళ అయింది. ఆయన మాకు కూర్చునే నమాజు చేయించారు. మేము కూడా ఆయన వెనుక కూర్చునే నమాజు చేశాము. ఆయన నమాజు ముగించిన తరువాత “ఇమామ్ నియామకం ఆయన్ని (ముఖ్తదీలు) అనుకరించడానికే జరుగుతుంది. అందువల్ల అతను (అల్లాహు అక్బర్ అని) తక్బీర్ పలికితే మీరు తక్బీర్ పలకండి. ఆయన రుకూ చేస్తే మీరూ రుకూ చేయండి. ఆయన రుకూ నుండి పైకి లేస్తే మీరూ లేవండి. అప్పుడు ఇమామ్ ‘సమిఅల్లాహులిమన్ హమిదా’ అంటే మీరు ‘రబ్బనా! వలకల్ హమ్ద్’ అనండి. (ఆ తరువాత) అతను సజ్దా చేస్తే మీరూ సజ్దా చేయండి” అని ప్రబోధించారు.
(సహీహ్ బుఖారీ : 10వ ప్రకరణం – అజాన్, 128వ అధ్యాయం – యహ్ వీ బిత్తక్బీరి హీన యస్జుద్)
233 – حديث عَائِشَةَ أُمِّ الْمُؤْمِنِينَ، أَنَّهَا قَالَتْ: صَلَّى رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فِي بَيْتِهِ وَهُوَ شَاكٍ، فَصَلَّى جَالِسًا وَصَلَّى وَرَاءَهُ قَوْمٌ قِيَامًا، فَأَشَارَ إِلَيْهِمْ أَنِ اجْلِسُوا؛ فَلَمَّا انْصَرَفَ قَالَ: إِنَّمَا جُعِلَ الإِمَامُ لِيُؤْتَمَّ بِهِ، فَإِذَا رَكَعَ فَارْكَعُوا، وَإِذَا رَفَعَ فَارْفَعُوا، وَإِذَا صَلَّى جَالِسًا فَصَلُّوا جُلُوسًا
__________
أخرجه البخاري في: 10 كتاب الأذان: 51 باب إنما جعل الإمام ليؤتم به
233. విశ్వాసుల మాతృమూర్తి హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఓ సారి వ్యాధిగ్రస్తులయితే ఇంట్లోనే నమాజు చేశారు. ఇంట్లో ఆయన కూర్చొని నమాజు చేస్తుంటే కొందరు ఆయన వెనుక నిల్చొని నమాజు చేశారు. దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) అది గమనించి వాళ్ళను కూర్చోమని ఆదేశించారు. నమాజు ముగిసిన తరువాత “ఇమామ్ నియమించబడింది ఆయన్ని అనుసరించడానికే. అందువల్ల అతను రుకూ చేస్తే మీరూ రుకూ చేయండి. రుకూ నుండి పైకి లేస్తే మీరూ లేవండి. అతను కూర్చొని నమాజు చేస్తే మీరూ కూర్చొనే నమాజు చేయండి” అని అన్నారు.
(సహీహ్ బుఖారీ : 10వ ప్రకరణం – అజాన్, 51వ అధ్యాయం – ఇన్నమాజుయిలల్ ఇమాము లియూతమ్మబిహీ]
234 – حديث أَبِي هُرَيْرَةَ، قَالَ: قَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ إِنَّمَا جُعِلَ الإِمَامُ لِيُؤْتَمَّ بِهِ، فَإِذَا كَبَّرَ فَكَبِّرُوا، وَإِذَا رَكَعَ فَارْكَعُوا، وَإِذَا قَالَ سَمِعَ اللهُ لِمَنْ حَمِدَهُ، فَقُولوا: رَبَّنَا وَلَكَ الْحَمْدُ، وَإِذَا سَجَدَ فَاسْجُدُوا، وَإِذَا صَلَّى جَالِسًا فَصَلُّوا جُلُوسًا أَجْمَعُونَ
__________
أخرجه البخاري في: 10 كتاب الأذان: 82 باب إيجاب التكبير وافتتاح الصلاة
234. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:- ఇమామ్ ని నియమించేది అతడ్ని అనుసరించడానికే. అందువల్ల అతను ‘అల్లాహు అక్బర్’ అంటే మీరూ అల్లాహు అక్బర్ అనండి. అతను రుకూ చేస్తే మీరూ రుకూ చేయండి. అతను ‘సమి అల్లాహు లిమన్ హమిదా’ అంటే మీరు ‘రబ్బనా వలకల్ హమ్ద్’ అనండి. అతను సజ్దా చేస్తే మీరూ సజ్దా చేయండి. అతను కూర్చొని నమాజు చేస్తే మీరూ కూర్చొని నమాజు చేయండి. *
[సహీహ్ బుఖారీ : 10వ ప్రకరణం – అజాన్, 82 వ అధ్యాయం – ఈ జాబిత్తక్బీరి వఫ్తితా హిస్సలాహ్ ]
* ఇమామ్ కూర్చొని నమాజ్ చేస్తే ముఖ్తదీలు కూడా కూర్చొనే నమాజు చేయాలి’ అనే విషయంలో ధర్మవేత్తల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. ఇమామ్ ఔజాయి (రహిమహుల్లాహ్), ఇమామ్ అహ్మద్ (రహిమహుల్లాహ్) ల ప్రకారం ఈ హదీసుని తప్పకుండా ఆచరించాలి. ఇమామ్ మాలిక్ (రహిమహుల్లాహ్) అభిప్రాయం ప్రకారం నిలబడే శక్తి ఉన్నవాడు, కూర్చొని నమాజు చేయించే ఇమామ్ వెనుక నమాజు చేయడం సరికాదు. అయితే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తమ జీవిత అంత్య దినాలలో జబ్బు పడినప్పుడు కూర్చోని నమాజు చేయించారు. ఆయన వెనుక ఆయన అనుచరులు నిలబడి నమాజు చేశారు. తత్కారణంగానే ఇమామ్ అబూ హనీఫా (రహిమహుల్లాహ్), ఇమామ్ షాఫయి (రహిమహుల్లాహ్), ఇంకా ఇతర ధర్మవేత్తలు అనేకమంది కూర్చొని నమాజు చేయించే ఇమామ్ వెనుక ముఖ్తదీలు నిలబడే నమాజు చేయాలని అన్నారు.
21వ అధ్యాయం – అనివార్య పరిస్థితుల్లో ఇమామ్ నమాజు కోసం తన ప్రతినిధిని నియమించుకోవచ్చు استخلاف الإمام إِذا عرض له عذر من مرض وسفر وغيرهما من يصلي بالناس
235 – حديث عَائِشَةَ عَنْ عُبَيْدِ اللهِ بْنِ عَبْدِ اللهِ بْنِ عُتْبَةَ، قَالَ: دَخَلْتُ عَلَى عَائِشَةَ فَقُلْتُ: أَلاَ تُحَدِّثِينِي عَنْ مَرَضِ رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَتْ: بَلَى ثَقُلَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَقَالَ: أَصَلَّى النَّاسُ قُلْنَا: لاَ، هُمْ يَنْتَظِرُونَكَ؛ قَالَ: ضُعُوا لِي مَاءً فِي الْمِخْضَبِ قَالَتْ: [ص:85] فَفَعَلْنَا، فَقَعَدَ فَاغْتَسَلَ، ثُمَّ ذَهَبَ لِيَنُوءَ فَأُغْمِيَ عَلَيْهِ، ثُمَّ أَفَاقَ؛ فَقَالَ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: أَصَلَّى النَّاسُ قُلْنَا: لاَ، هُمْ يَنْتَظِرُونَكَ يَا رَسُولَ اللهِ قَالَ: ضَعُوا لِي مَاءً فِي الْمِخْضَبِ قَالَتْ: فَقَعَدَ فَاغْتَسَلَ، ثُمَّ ذَهَبَ لِيَنُوءَ، فَأُغْمِيَ عَلَيْهِ، ثُمَّ أَفَاقَ فَقَالَ: أَصَلَّى النَّاسُ قُلْنَا: لاَ، هُمْ يَنْتَظِرُونَكَ يَا رَسُولَ اللهِ فَقَالَ ضَعُوا لِي مَاءً فِي الْمِخْضَبِ فَقَعَدَ فَاغْتَسَلَ، ثُمَّ ذَهَبَ لِيَنُوءَ، فَأُغْمِيَ عَلَيْهِ، ثُمَّ أَفَاقَ فَقَالَ أَصَلَّى النَّاسُ فَقُلْنَا لاَ، هُمْ يَنْتَظِرونَكَ يَا رَسُولَ اللهِ وَالنَّاسُ عُكُوفٌ فِي الْمَسْجِدِ يَنْتَظِرُونَ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ لِصَلاَةِ الْعِشَاءِ الآخِرَةِ؛ فَأَرْسَلَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ إِلَى أَبِي بَكْرٍ بِأَنْ يُصَلِّيَ بِالنَّاسِ، فَأَتَاهُ الرَّسُولُ فَقَالَ: إِنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَأْمُرُكَ أَنْ تُصَلِّيَ بِالنَّاسِ، فَقَالَ أَبُو بَكْرٍ، وَكَانَ رَجُلاً رَقِيقًا: يَا عُمَر صَلِّ بِالنَّاسِ، فَقَالَ لَهُ عُمرُ: أَنْتَ أَحَقُّ بِذَلِكَ، فَصَلَّى أَبُو بَكْرٍ تِلْكَ الأَيَّام
ثُمَّ إِنَّ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ وَجَدَ مِنْ نَفْسِهِ خِفَّةً فَخَرَجَ بَيْنَ رَجُلَيْنِ، أَحَدُهُمَا الْعَبَّاسُ، لِصَلاَةِ الظُّهْرِ، وَأَبُو بَكْرٍ يُصَلِّي بِالنَّاسِ؛ فَلَمَّا رَآهُ أَبُو بَكْر ذَهَبَ لِيَتأَخَّرَ، فَأَوْمَأَ إِلَيْهِ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ بِأَنْ لاَ يَتَأَخَّرَ؛ قَالَ: أَجْلِسَانِي إِلَى جَنْبِهِ، فَأَجْلَسَاهُ إِلَى جَنْبِ أَبِي بَكْرٍ، قَالَ: فَجَعَلَ أَبُو بَكْرٍ يُصَلِّي وَهُوَ يَأْتَمُّ بِصَلاَةِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، وَالنَّاسُ بِصَلاَةِ أَبِي بَكْرٍ وَالنَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَاعِدٌ
قَالَ عُبَيْدُ اللهِ: فَدَخَلْتُ عَلَى عَبْدِ اللهِ بْنِ عَبَّاسٍ، فَقُلْتُ لَهُ: أَلاَ أَعْرِضُ عَلَيْكَ مَا حدَّثَتْنِي عَائِشَةُ عَنْ مَرَضِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: هَاتِ؛ فَعَرَضْتُ عَلَيْهِ حَدِيثَهَا فَمَا أَنْكَرَ مِنْهُ شَيئًا، غَيْرَ أَنَّهُ قَالَ أَسَمَّتْ لَكَ الرَّجُلَ الَّذِي كَانَ مَعَ الْعَبَّاسِ قُلْتُ: لاَ؛ قَالَ: [ص:86] هُوَ عَلِيٌّ
__________
أخرجه البخاري في: 10 كتاب الأذان: 51 باب إنما جعل الإمام ليؤتم به
235. హజ్రత్ ఉబైదుల్లా బిన్ అబ్దుల్లా బిన్ ఉత్బా (రహిమహుల్లాహ్) కథనం:- నేనొక రోజు విశ్వాసుల మాతృమూర్తి హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) సన్నిధికెళ్ళి “అమ్మా! మీరు దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) వ్యాధి గురించి మాకేమీ చెప్పరా?” అని అడిగాను. అప్పుడామె ఇలా అన్నారు:
ఎందుకు చెప్పను? దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) వ్యాధిగ్రస్తులయి బలహీనులయిపోయినప్పుడు (ఓ రోజు) “ప్రజలు నమాజు చేసుకున్నారా?” అని అడిగారు. ‘లేదు, అందరూ మీ కోసం ఎదురు చూస్తున్నారు’ అని మేము అన్నాము. “అయితే నా కోసం నీళ్ళు పెట్టండి” అని అన్నారు ఆయన. మేము ఆయన ఆదేశాన్ని పాటించాము. ఆయన కూర్చొని స్నానం చేశారు. స్నానం చేశాక నడవడానికి ప్రయత్నిస్తే కళ్ళు తిరిగి స్పృహ కోల్పోయారు. కాస్త స్పృహ వచ్చిన తరువాత “ప్రజలు నమాజు చేసుకున్నారా?” అని అడిగారు మళ్ళీ. మేము “లేదు, దైవప్రవక్తా! వాళ్ళంతా మీ కోసం ఎదురు చూస్తున్నారు” అని అన్నాము. “అయితే ఓ పాత్రలో నా కోసం నీళ్ళు తీసుకురండి” అని అన్నారు ఆయన. మేము తిరిగి నీళ్ళు తీసి పెట్టాము. ఆయన కూర్చొని స్నానం చేశారు. కాని లేచి నడవడానికి ప్రయత్నిస్తే మళ్ళీ స్పృహ తప్పిపోయారు. కాస్సేపటికి స్పృహ వచ్చిన తరువాత “ప్రజలు నమాజు చేసుకున్నారా?” అని అడిగారు మళ్ళీ. మేము “లేదు దైవప్రవక్తా! వారంతా మీ కోసం ఎదురు చూస్తున్నారు” అని అన్నాము.
అటు ప్రజల పరిస్థితి చూస్తే వారు ఇషా నమాజు చేయడానికి మస్జిద్ లో కూర్చొని దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) రాక కోసం ఎదురు చూస్తున్నారు. చివరికి దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) (మస్జిద్ కు రాలేక) హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు)ను నమాజు చేయించమని ఆదేశించారు. ఈ ఆదేశం తీసుకొని ఒక వ్యక్తి హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) దగ్గరకు వచ్చి “దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మిమ్మల్ని ప్రజలకు నాయకత్వం వహించి నమాజు చేయించమని ఆజ్ఞాపించారు” అని తెలియజేశాడు. కాని హజ్రత్ అబూబకర్ (రదియల్లాహు అన్హు) (సున్నిత హృదయుడయినందున తానీ పని చేయడానికి సాహసించలేక) హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు)తో “మీరు నమాజు చేయించండి” అని అన్నారు. దానికి హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) “నమాజు విషయంలో మీరే జనానికి నాయకత్వం వహించగల యోగ్యులు” అని అన్నారు. దాంతో ఆ రోజుల్లో హజ్రత్ అబూబకరే (రదియల్లాహు అన్హు) నమాజు చేయించారు.
ఒకరోజు దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ఆరోగ్యం కొంత కుదుటపడగానే ఇద్దరు వ్యక్తుల సహాయంతో జుహర్ నమాజు కోసం (మస్జిదు ) వచ్చారు. ఆ ఇద్దరిలో ఒక వ్యక్తి హజ్రత్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు). దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మస్జిద్ లో అడుగుపెట్టే సమయానికి హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) జనానికి నాయకత్వం వహించి నమాజు చేయించసాగారు. ఆయన దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) రాకను గమనించి ఇమామత్ స్థానం నుండి వెనక్కి జరగడానికి ప్రయత్నించారు. అయితే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆయన్ని వెనక్కి జరగవద్దని సైగతో వారించారు. ఆ తరువాత ఆయన “నన్ను (అబూబకర్) సిద్దీఖ్ పక్కన కూర్చోబెట్టండి” అని అన్నారు. అప్పుడు ఆ ఇద్దరు వ్యక్తులు ఆయన్ని హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) పక్కన తీసికెళ్ళి కూర్చోబెట్టారు.
ఉల్లేఖకుని కథనం ప్రకారం, ఆ తరువాత హజ్రత్ అబూ బకరే (రదియల్లాహు అన్హు) తాను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నాయకత్వంలో ఆయన వెనుక నమాజు చేస్తున్నట్లు నమాజు చేయించారు. (నిజానికి) ప్రజలు హజ్రత్ అబూబకర్ (రదియల్లాహు అన్హు) నాయకత్వాన నమాజు చేశారు. ఆ తరువాత నేను (ఉల్లేఖకుడ్ని) హజ్రత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) దగ్గరకు వెళ్ళి “దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) వ్యాధి గురించి హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) చెప్పిన విషయాలు నేను మీకు తెలియజేయనా?” అని అన్నాను. ఆయన తెలియజేయమన్నారు. నేను హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) చెప్పిన (పై) ఉదంతం అంతా ఆయన ముందు ప్రస్తావించాను. అందులో ఆయన ఏ విషయంలోనూ నాతో విభేదించలేదు. ఆయన అంతా విని “హజ్రత్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు)తో పాటు ఉన్న రెండవ వ్యక్తి ఎవరో హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) మీకు తెలియజేశారా?” అని అడిగారు. నేను లేదన్నాను. అప్పుడాయన “ఆ రెండవ వ్యక్తి హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు)” అని అన్నారు.
(సహీహ్ బుఖారీ : 10వ ప్రకరణం – అజాన్, 51వ అధ్యాయం – ఇన్నమాజ అలల్ ఇమాము లియూతమ్మబిహీ)
236 – حديث عَائِشَةَ، قَالَتْ: لَمَّا ثَقُلَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَاشْتَدَّ وَجَعُهُ، اسْتَأْذَنَ أَزْوَاجَهُ أَنْ يُمَرَّضَ فِي بَيْتِي، فَأَذِنَّ لَهُ، فَخَرَجَ بَيْنَ رَجُلَيْنِ تَخُطُّ رِجْلاَهُ الأَرْضَ، وَكَانَ بَيْنَ الْعَبَّاسِ وَبَيْنَ رَجُلٍ آخَرَ؛ فَقَالَ عُبَيْدُ اللهِ (راوي الحديث) فَذَكَرْتُ لاِبْنِ عَبَّاسٍ مَا قَالَتْ عَائِشَةُ؛ فَقَالَ: وَهَلْ تَدْرِي مَنِ الرَّجُلُ الَّذِي لَمْ تُسَمِّ عَائِشَةُ قُلْتُ: لاَ، قَالَ: هُوَ عَلِيُّ بْنُ أَبِي طَالِبٍ
__________
أخرجه البخاري في: 51 كتاب الهبة: 14 باب هبة الرجل لامرأته والمرأة لزوجها
236. హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అస్వస్థులయ్యారు. బాధ క్రమంగా అధికమవుతూ పోయింది. అప్పుడాయన వ్యాధి ఉన్నంత కాలం నా ఇంట ఉండటానికి అనుమతి నివ్వమని తన భార్యలందరినీ పిలిచి అడిగారు. వారందుకు సంతోషంగా అనుమతినిచ్చారు. ఆ రోజుల్లో (ఓ రోజు) దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ఇద్దరు మనుషుల భుజాల మీద చేతులు వేసి వారి తోడ్పాటుతో బయటికి వెళ్ళారు. అప్పుడు ఆయన (నడవలేక) రెండు కాళ్ళను నేలమీద ఈడుస్తూ వెళ్ళారు. ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు హజ్రత్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు). రెండో అతను మరొక వ్యక్తి.
ఉల్లేఖకుడు ఉబైదుల్లా (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు:- నేను హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) తెలియజేసిన (ఈ) విషయాలను హజ్రత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) దగ్గర ప్రస్తావించాను. ఆయన విని “హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) తెలపని ఆ రెండవ వ్యక్తి పేరేమిటో మీకు తెలుసా?” అని అన్నారు. తెలియదన్నాను నేను. “ఆ వ్యక్తి హజ్రత్ అలీ బిన్ అబితాలిబ్ (రదియల్లాహు అన్హు)” అని అన్నారు ఆయన.
(సహీహ్ బుఖారీ : 51వ ప్రకరణం – అల్ హిబా, 14వ అధ్యాయం – హిబతిర్రజులిల్ ఇమ్రాతిహీ వల్ మరాతి బిజౌజిహా)
237 – حديث عَائِشَةَ، قَالَتْ: لَقَدْ رَاجَعْتُ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فِي ذَلِكَ وَمَا حَمَلَنِي عَلَى كَثْرَةِ مُرَاجَعَتِهِ إِلاَّ أَنَّهُ لَمْ يَقَعْ فِي قَلْبِي أَنْ يُحِبَّ النَّاسُ بَعْدَهُ رَجُلاً قَامَ مَقَامَهُ أَبَدًا وَلاَ كُنْتُ أُرَى أَنَّهُ لَنْ يَقُومَ أَحَدٌ مَقَامَهُ إِلاَّ تَشَاءَمَ النَّاسُ بِهِ، فَأَرَدْتُ أَنْ يَعْدِلَ ذَلِكَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ عَنْ أَبِي بَكْرٍ
__________
أخرجه البخاري في: 64 كتاب المغازي: 83 باب مرض النبي صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ ووفاته
237. హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం:- హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు)ని నమాజు చేయించమని దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ఆదేశించినప్పుడు) నేను ఆలోచనలో పడ్డాను. దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) స్థానంలో మరే వ్యక్తి నియమించబడినా ప్రజలు అతడ్ని ఎన్నటికీ ఇష్టపడరు. పైగా అతడ్ని తమ పాలిట దుఃశకునంగా భావిస్తారు. అందువల్ల దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విషయంలో హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు)ని క్షమించాలని నేను కోరుకున్నాను. నేనీ విషయాన్నే దృష్టిలో పెట్టుకొని (ఈ ఆజ్ఞను గురించి) పునరాలోచించవలసిందిగా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ముందు అనేకసార్లు విన్నవించుకున్నాను.
[సహీహ్ బుఖారీ : 64వ ప్రకరణం – అల్ మగాజి, 83వ అధ్యాయం – మర్జున్నబియ్యి (సల్లల్లాహు అలైహి వసల్లం) వ వఫాతహు]
238 – حديث عَائِشَةَ، قَالَتْ: لَمَّا مَرِضَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ مَرَضَهُ الَّذِي مَاتَ فِيهِ، فَحَضَرَتِ الصَّلاَةُ فَأُذِّنَ، فَقَالَ: مُرُوا أَبَا بَكْرٍ فَلْيُصَلِّ بِالنَّاسِ فَقِيلَ لَهُ: إِنَّ أَبَا بَكْرٍ رجلٌ أَسِيفٌ إِذَا قَامَ فِي مَقَامِكَ لَمْ يَسْتَطِعْ أَنْ يُصَلِّي بِالنَّاسِ وَأَعَادَ فَأَعَادُوا لَهُ، فَأَعَادَ الثَّالِثَةَ، فَقَالَ: إِنَّكُنَّ صَوَاحِبُ يُوسُفَ، مُرُوا أَبَا بَكْرٍ فَلْيُصَلِّ بِالنَّاسِ؛ فَخَرَجَ أَبُو بَكْرٍ فَصَلَّى، فَوَجَدَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ مِنْ نَفْسِهِ خِفَّةً، فَخَرَجَ يُهَادَى بَيْنَ رَجُلَيْنِ، كَأَنِّي أَنْظُرُ رِجْلَيْهِ تَخُطَّانِ الأَرْضَ مِنَ الْوَجَعِ، فَأَرَادَ أَبُو بَكْرٍ أَنْ يَتَأَخَّرَ فَأَوْمَأَ إِلَيْهِ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ أَنْ مَكَانَكَ، ثُمَّ أُتِيَ بِهِ حَتَّى جَلَسَ إِلَى جَنْبِهِ فَكَانَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يُصَلِّي، [ص:87] وأَبُو بَكْرٍ يُصَلِّي بِصَلاَتِهِ، وَالنَّاسُ يُصَلُّونَ بِصَلاَةِ أَبِي بَكْرٍ
__________
أخرجه البخاري في: 10 كتاب الأذان: 39 باب حدّ المريض أن يشهد الجماعة
238. హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం:-
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇహలోకం వీడిపోవడానికి దారి తీసిన వ్యాధికి గురయి ఉన్న రోజుల్లో ఒకసారి నమాజు వేళ అయింది. అజాన్ పిలుపు కూడా ఇవ్వబడింది. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మాట్లాడుతూ “ప్రజలకు నాయకత్వం వహించి నమాజు చేయించమని అబూబకర్ (రదియల్లాహు అన్హు)కు చెప్పండి” అని అన్నారు. “అబూ బకర్ (రదియల్లాహు అన్హు) సున్నిత మనస్కులు. ఆయన మీ స్థానంలో నిలబడితే (తీవ్రదుఃఖంతో) నమాజు చేయించలేరు” అని అన్నారు ప్రజలు. కాని దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ఆ మాటలనే తిరిగి ఉద్ఘాటించారు. ప్రజలు మళ్ళీ ఆ విషయాన్నే విన్నవించుకున్నారు. మూడవసారి కూడా దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) అలాగే ఆదేశించడం, ప్రజలు ఆ విషయాన్నే విన్నవించుకోవడం జరిగింది.
అప్పుడు దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) (చిరుకోపంతో) “మీరు హజ్రత్ యూసుఫ్ (ప్రవక్త)ను కవ్వించబూనిన స్త్రీల వంటివారు. వెళ్ళండి, వెళ్ళి) అబూబకర్ (రదియల్లాహు అన్హు)తో నమాజు చేయించమని చెప్పండి” అని అన్నారు. ఈ సంగతి అబూబకర్ (రదియల్లాహు అన్హు)కు తెలియజేస్తే, ఆయన జనానికి నాయకత్వం వహించి నమాజు చేయించారు. (అదే సమయంలో) దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ఆరోగ్యం కాస్త కుదుటపడినట్లు అన్పించగానే ఇద్దరు వ్యక్తుల సహాయంతో బయటికి వెళ్ళారు. ఆయన బయటికి వెళ్ళిన ఆ సన్నివేశం ఇప్పటికీ నా కళ్ళ ముందు మెదలుతోంది.
తీవ్రమైన వ్యాధి, బలహీనతల వల్ల (నడవలేక) నేలమీద కాళ్ళు ఈడుస్తూ వెళ్ళారు. ఆయన రావడం గమనించి హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) వెనక్కి జరగడానికి ప్రయత్నించారు. అయితే దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ఆయన్ని అక్కడే ఉండమని సైగ చేశారు. తరువాత దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం)ను హజ్రత్ అబూబకర్ (రదియల్లాహు అన్హు) పక్కన కూర్చోబెట్టారు. దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) నమాజు చేయిస్తూ ఉంటే, హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) ఆయన్ని అనుసరిస్తూ పోయారు. మరి ప్రజలు మాత్రం అబూబకర్ (రదియల్లాహు అన్హు)ని అనుసరిస్తూ నమాజు చేయసాగారు.
(సహీహ్ బుఖారీ : 10వ ప్రకరణం – అజాన్, 39వ అధ్యాయం – హద్దల్ మరీజి అఁయ్యష్ హదల్ జమాఅత్]
239 – حديث عَائِشَةَ، قَالَتْ: لَمَّا ثَقُلَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ جَاءَ بِلاَلٌ يُؤْذِنُهُ بِالصَّلاَةِ فَقَالَ: مُرُوا أَبَا بَكْرٍ أَنْ يُصَلِّيَ بِالنَّاسِ، فَقُلْتُ: يَا رَسُولَ اللهِ إِنَّ أَبَا بَكْرٍ رَجُلٌ أَسِيفٌ وَإِنَّهُ مَتَى مَا يَقُمْ مَقَامَكَ لاَ يُسْمِعُ النَّاسَ فَلَوْ أَمَرْتَ عُمَرَ فَقَالَ: مُرُوا أَبَا بَكْرٍ يُصَلِّي بِالنَّاسِ؛ فَقُلْتُ لِحَفْصَةَ: قُولِي لَهُ إِنَّ أَبَا بَكْرٍ رَجُلٌ أَسِيفٌ، وَإِنَّهُ مَتَى يَقُمْ مَقَامَكَ لاَ يُسْمِعُ النَّاسَ فَلَوْ أَمَرْتَ عُمَرَ قَالَ: إِنَّكُنَّ لأَنْتُنَّ صَوَاحِبُ يُوسُفَ، مُرُوا أَبَا بَكْرٍ أَنْ يُصَلِّيَ بِالنَّاس؛ فَلَمَّا دَخَلَ فِي الصَّلاَةِ وَجَدَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فِي نَفْسِهِ خِفَّةً، فَقَامَ يُهَادَى بَيْنَ رَجُلَيْنِ، وَرِجْلاَهُ تَخُطَّانِ فِي الأَرْضِ حَتَّى دَخَلَ الْمَسْجِدَ؛ فَلَمَّا سَمِعَ أَبُو بَكْرٍ حِسَّهُ، ذَهَبَ أَبُو بَكْرٍ يَتَأَخَّرُ؛ فَأَوْمَأَ إِلَيْهِ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَجَاءَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ حَتَّى جَلَسَ عَنْ يَسَارٍ أَبِي بَكْرٍ، فَكَانَ أَبُو بَكْرٍ يُصَلِّي قَائِمًا، وَكَانَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يُصَلِّي قَاعِدًا، يَقْتَدِي أَبُو بَكْرٍ بِصَلاَةِ رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، وَالنَّاسُ مُقْتَدُونَ بِصَلاَةِ أَبِي بَكْرٍ رضي الله عنه
__________
أخرجه البخاري في: 10 كتاب الأذان: 68 باب الرجل يأتم بالإمام ويأتم الناس بالمأموم
239. ఉమ్ముల్ మోమినీన్ హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం:-
దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) వ్యాధిగ్రస్తులయినప్పుడు (ఓ రోజు) ఆయన్ని హజ్రత్ బిలాల్ (రదియల్లాహు అన్హు) నమాజు కోసం పిలవడానికి వచ్చారు. అప్పుడు ఆయన మాట్లాడుతూ “ప్రజలకు నాయకత్వం వహించి నమాజు చేయించమని అబూబకర్ (రదియల్లాహు అన్హు)కు చెప్పండి” అని అన్నారు. అది విని నేను “దైవప్రవక్తా! అబూబకర్ (రదియల్లాహు అన్హు) సున్నిత మనస్కులు. మీ స్థానంలో ఆయన నిల్చుంటే ఆయన నోట మాట వెలువడదు. ఖుర్ఆన్ పఠించలేరు. మీరు ఉమర్ (రదియల్లాహు అన్హు)ని ఆజ్ఞాపిస్తే బాగుంటుంది” అని అన్నాను. కాని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం), “అబూబకర్ (రదియల్లాహు అన్హు)కు నమాజు చేయించమని చెప్పండి” అని అన్నారు మళ్ళీ. నేనప్పుడు హజ్రత్ హఫ్సా (రదియల్లాహు అన్హా)తో “నువ్వు కాస్త దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు నచ్చజెప్పు. అబూబకర్ (రదియల్లాహు అన్హు) సున్నిత హృదయులు. ఆయన దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) స్థానంలో నిల్చుంటే నోట మాటే పెగలదు. ఖుర్ఆన్ పఠించి ప్రజలకు విన్పించలేరు. అందువల్ల హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) నమాజు చేయిస్తే బాగుంటుందని చెప్పి ఆయన్ని ఈ పని కోసం ఆదేశించమని విజ్ఞప్తి చెయి” అని అన్నాను. అదే విషయం హజ్రత్ హఫ్సా (రదియల్లాహు అన్హా) విన్నవించారు. అప్పుడు దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) (చిరుకోపంతో) “మీరు హజ్రత్ యూసుఫ్ (ప్రవక్త)కు తారసపడ్డ స్త్రీల లాంటి స్త్రీలులా ఉన్నారు. వెళ్ళండి, అబూబకర్ (రదియల్లాహు అన్హు)కు నమాజు చేయించమని చెప్పండి” అని అన్నారు.
చివరికి హజ్రత్ అబూబకర్ (రదియల్లాహు అన్హు) నమాజు చేయించడానికి నిలబడ్డారు. కాస్సేపటికి దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ఆరోగ్యం కాస్త కుదుటపడినట్లు అన్పిస్తే లేచి ఇద్దరు వ్యక్తుల సహాయంతో మస్జిద్ కు వెళ్ళారు. అప్పుడు ఆయన కాళ్ళు నేలమీద ఈడుస్తూ వెళ్ళారు. హజ్రత్ అబూబకర్ (రదియల్లాహు అన్హు) ఆయన రాకను గమనించి వెనక్కి జరగడానికి ప్రయత్నించారు. కాని దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ఆయన్ని అక్కడే ఉండమని ఆదేశించి, ఆయన ఎడమ పక్కన వెళ్ళి కూర్చున్నారు. ఇలా హజ్రత్ అబూబకర్ (రదియల్లాహు అన్హు) నిలబడి నమాజు చేయిస్తుంటే, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కూర్చుని నమాజు చేయించసాగారు. హజ్రత్ అబూబకర్ (రదియల్లాహు అన్హు) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను అనుసరించసాగారు. మిగతా జనం అబూబకర్ (రదియల్లాహు అన్హు)ని అనుసరిస్తూ నమాజు చేయసాగారు.
(సహీహ్ బుఖారీ : 10వ ప్రకరణం – అజాన్, 68వ అధ్యాయం – అర్రజులి యాతమ్ము బిల్ ఇమామి వయాతమ్మున్నాసుబిల్ మామూమ్]
240 – حديث أَنَسِ بْنِ مَالِكٍ الأَنْصَارِيِّ، وَكَانَ تَبِعَ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ وَخَدَمَهُ، وَصَحْبَهُ، أَنَّ أَبَا بَكْرٍ كَانَ يُصَلِّي لَهُمْ فِي وَجَعِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ الَّذِي تُوُفِّيَ فِيهِ، حَتَّى إِذَا كَانَ يَوْمُ الاثْنَيْنِ وَهُمْ صُفُوفٌ فِي الصَّلاَةِ، فَكَشَفَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ سِتْرَ الْحُجْرَةِ، يَنْظُرُ إِلَيْنَا وَهُوَ قَائِمٌ كَأَنَّ وَجْهَهُ وَرَقَةُ مُصْحَفٍ، ثُمَّ تَبَسَّمَ يَضْحَكُ، فَهَمَمْنَا أَنْ نَفْتَتِنَ مِنَ الْفَرَحِ بِرُؤْيَةِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَنَكَصَ أَبُو بَكْرٍ عَلَى عَقِبَيْهِ لِيَصِلَ الصَّفَّ، وَظَنَّ أَنَّ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ [ص:88] خَارِجٌ إِلَى الصَّلاَةِ، فَأَشَارَ إِلَيْنَا النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ أَنْ أَتِمُّوا صَلاَتَكمْ، وَأَرْخَى السِّتْرَ، فَتُوُفِّيَ مِنْ يَوْمِهِ
__________
أخرجه البخاري في: 10 كتاب الأذان: 46 باب أهل العلم والفضل أحق بالإمامة
240. దైవప్రవక్త సహచర్య భాగ్యం లభించడంతో పాటు, రేయింబవళ్ళు ఆ మహనీయునికి సేవ చేసే అదృష్టానికి కూడా నోచుకున్న ప్రముఖ సహాబీ (శిష్యుడు) హజ్రత్ అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) కథనం:
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జీవితపు చివరి రోజుల్లో హజ్రత్ అబూబకర్ (రదియల్లాహు అన్హు) నమాజులో ప్రజలకు నాయకత్వం వహించి నమాజు చేయిస్తూ ఉండేవారు. ఓసారి సోమవారం జనం బారులు తీరి నమాజు చేయడంలో నిమగ్నులయిపోయారు. దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) తమ ఇంటి (ద్వారపు) తెర పైకెత్తి మావైపు చూశారు. అప్పుడు ఆయన నిలబడి ఉన్నారు. ఆయన ముఖారవిందం ఖుర్ఆన్ పుటలా దేదీప్యమానంగా వెలిగిపోసాగింది. అదీగాక ఆయన పెదవులపై చిరునగవు తొణకిసలాడింది. ఇటు మేమంతా దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం)ను చూసి, సంతోషాతిశయంతో తన్మయత్వం చెందసాగాము. హజ్రత్ అబూబకర్ (రదియల్లాహు అన్హు) పరిస్థితి గమనించి దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) నమాజు చేయించడానికి వస్తున్నారేమోనని భావించారు. అందుచేత ఆయన ఇమామత్ చోటు నుంచి మెల్లిగా వెనక్కి జరుగుతూ ముఖ్తదీల పంక్తిలో నిల బడటానికి ప్రయత్నించారు. అయితే దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) చేత్తో సైగ చేస్తూ, అందరూ తమ తమ స్థానాల్లోనే ఉండి నమాజు పూర్తి చేయవలసిందిగా ఆదేశించారు. ఆ తరువాత ఆయన తెర దించి వేశారు. అదే రోజు ఆయన ఇహలోకం వీడిపోయారు.
(సహీహ్ బుఖారీ : 10వ ప్రకరణం – అజాన్, 46వ అధ్యాయం – అహ్లుల్ ఇల్మి వల్ ఫజ్లి అహఖ్ఖుబిల్ ఇమామ]
241 – حديث أَنَسٍ، قَالَ: لَمْ يَخْرُجِ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ ثَلاَثًا، فَأُقِيمَتِ الصَّلاَةُ، فَذَهَبَ أَبُو بَكْرٍ يَتَقَدَّمُ؛ فَقَالَ نَبِيُّ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ بِالْحِجَابِ فَرَفَعَهُ، فَلَمَّا وَضَحَ وَجْهُ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، مَا نَظَرْنَا مَنْظَرًا كَانَ أَعْجَبَ إِلَيْنَا مِنْ وَجْهِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ حِينَ وَضَحَ لَنَا، فَأَوْمَأَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ بِيَدِهِ إِلَى أَبِي بَكْرٍ أَنْ يَتَقَدَّمَ، وَأَرْخَى النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ الْحِجَابَ، فَلَمْ يُقْدَرْ عَلَيْهِ حَتَّى مَاتَ
__________
أخرجه البخاري في: 10 كتاب الأذان: 46 باب أهل العلم والفضل أحق بالإمامة
241. హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం:-
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) (తమ జీవిత అంత్య దశలో) మూడు రోజుల పాటు నమాజు చేయించడానికి బయటికి రాలేకపోయారు. ఆ మూడు రోజులు హజ్రత్ అబూబకర్ (రదియల్లాహు అన్హు) నమాజు చేయించారు. తరువాత ఒక రోజు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తమ ఇంటి పరదా పైకెత్తారు. అప్పుడు మాకు ఆయన ముఖారవిందాన్ని దర్శించుకునే భాగ్యం లభించింది. ఆయన ముఖారవిందాన్ని మించిన సుందర దృశ్యం మేము మా జీవితంలో మరెన్నడూ చూడలేదు. తరువాత ఆయన చేత్తో సైగచేస్తూ, హజ్రత్ అబూబకర్ (రదియల్లాహు అన్హు)ని నమాజు చేయించమని ఆదేశించి తెర దించివేశారు. ఆ తరువాత ఆయన చనిపోయేవరకు తెర పైకెత్తి మాకు తమ దర్శన భాగ్యం కలిగించలేకపోయారు.
[సహీహ్ బుఖారీ : 10వ ప్రకరణం – అజాన్, 46వ అధ్యాయం – అహ్లుల్ ఇల్మి వల్ ఫజ్లి అహఖ్ఖు బిల్ ఇమామ)
242 – حديث أَبِي مُوسى، قَالَ: مَرِضَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فَاشْتَدَّ مَرَضُهُ، فَقَالَ: مُرُوا أَبَا بَكْرٍ فَلْيُصَلِّ بِالنَّاسِ قَالَتْ عَائِشَةُ: إِنَّهُ رَجُلٌ رَقِيقٌ إِذَا قَامَ مَقَامَكَ لَمْ يَسْتَطِعْ أَنْ يُصَلِّيَ بِالنَّاس، قَالَ: مُرُوا أَبَا بَكْرٍ فَلْيُصَلِّ بِالنَّاسِ، فَعَادَتْ، فَقَالَ: مُرِي أَبَا بَكْرٍ فَلْيُصَلِّ بِالنَّاسِ فَإِنَّكُنَّ صَوَاحِبُ يُوسُفَ فَأَتَاهُ الرَّسُولُ فَصَلَّى بِالنَّاسِ فِي حَيَاةِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ
__________
أخرجه البخاري في: 10 كتاب الأذان: 46 باب أهل العلم والفضل أحق بالإمامة
242. హజ్రత్ అబూ మూసా (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వ్యాధిగ్రస్తులయి వ్యాధి తీవ్ర రూపం దాల్చినప్పుడు హజ్రత్ అబూబకర్ (రదియల్లాహు అన్హు)ని నమాజు చేయించమని ఆదేశించారు. హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) ఈ మాట విని “అబూబకర్ (రదియల్లాహు అన్హు) సున్నితమనస్కులు. మీ స్థానంలో ఆయన నిలబడితే (తీవ్రమైన భావోద్రేకాలకు లోనయి) నమాజు చేయించలేరు” అని అన్నారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తిరిగి అదే విషయాన్ని ప్రస్తావిస్తూ “అబూబకర్ (రదియల్లాహు అన్హు)కు నమాజు చేయించమని చెప్పండి” అని అన్నారు. హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) తమ విజ్ఞప్తిని మళ్ళీ ప్రస్తావించారు. దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) మళ్ళీ అదే ఆజ్ఞ జారీ చేస్తూ “అబూబకర్ (రదియల్లాహు అన్హు)కు నమాజు చేయించమని చెప్పండి. మీరు యూసుఫ్ (ప్రవక్త)ను పురిగొల్పడానికి ప్రయత్నించిన స్త్రీల మాదిరిగా ఉన్నారు” అని అన్నారు. దాంతో ఒక వ్యక్తి హజ్రత్ అబూబకర్ (రదియల్లాహు అన్హు) దగ్గరికి వెళ్ళి ఈ ఆజ్ఞ విన్పించారు. హజ్రత్ అబూబకర్ (రదియల్లాహు అన్హు) దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) జీవించి ఉండగా ప్రజలకు నాయకత్వం వహించి నమాజు చేయించారు.
(సహీహ్ బుఖారీ : 10వ ప్రకరణం – అజాన్, 46వ అధ్యాయం – అహ్లుల్ ఇల్మి వల్ ఫజ్లి అహఖ్ఖ్ బిల్ ఇమామ]
22వ అధ్యాయం – నియమిత ఇమామ్ రావడంలో ఆలస్యమైతే మరొకర్ని ఇమామ్ గా నియమించుకోవడం تقديم الجماعة من يصلي بهم إِذا تأخر الإمام ولم يخافوا مفسدة بالتقديم
243 – حديث سَهْلِ بْنِ سَعْدٍ السَّاعِدِيِّ أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ ذَهَبَ إِلَى بَنِي عَمْرِو بْنِ عَوْفٍ لِيُصْلِحَ بَيْنَهُمْ، فَحَانَتِ الصَّلاَةُ، فَجَاءَ الْمُؤَذِّنُ إِلَى أَبِي بَكْرٍ، فَقَالَ: أَتُصَلِّي بِالنَّاسِ فَأُقِيم قَالَ: نَعَمْ فَصَلَّى أَبُو بَكْرٍ؛ فَجَاءَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ وَالنَّاسُ فِي الصَّلاَةِ، فَتَخَلَّصَ حَتَّى وَقَفَ فِي الصَّفِّ، فَصَفَّقَ النَّاسُ، وَكَانَ أَبُو بَكْرٍ لاَ يَلْتَفِتُ فِي صَلاَتِهِ، [ص:89] فَلَمَّا أَكْثَرَ النَّاسُ التَّصْفِيقَ الْتَفَتَ فَرَأَى رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَأَشَارَ إِلَيْهِ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ أَنِ امْكُثْ مَكَانَكَ، فَرَفَعَ أَبُو بَكْرٍ رضي الله عنه يَدَيْهِ فَحَمِدَ اللهَ عَلَى مَا أَمَرَهُ بِهِ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ مِنْ ذلِكَ، ثُمَّ اسْتَأْخَرَ أَبُو بَكْرٍ حَتَّى اسْتَوَى فِي الصَّفِّ، وَتَقَدَّمَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فَصَلَّى؛ فَلَمَّا انْصَرَفَ، قَالَ: يَا أَبَا بَكْرٍ مَا مَنَعَكَ أَنْ تَثْبُتَ إِذْ أَمَرْتُكَ فَقَالَ أَبُو بَكْرٍ: مَا كَانَ لاِبْنِ أَبِي قُحَافَةَ أَنْ يُصَلِّي بَيْنَ يَدَيْ رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ؛ فَقَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: مَا لِي رَأَيْتُكُمْ أَكْثَرْتُمُ التَّصْفِيقَ مَنْ رَابَهُ شَيْءٌ فِي صَلاَتِهَ فَلْيُسَبِّحْ فَإِنَّهُ إِذَا سَبَّحَ الْتُفِتَ إِلَيْهِ، وَإِنَّمَا التَّصْفِيقُ لِلنِّسَاءِ
__________
أخرجه البخاري في: 10 كتاب الأذان: 48 باب من دخل ليؤم الناس فجاء الإمام الأول فتأخر الآخر
243. హజ్రత్ సహల్ బిన్ సాద్ (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ఓసారి బనీ ఉమర్ బిన్ ఔఫ్ తెగ ప్రజల మధ్య రాజీ కుదర్చడానికి వారి దగ్గరకు వెళ్ళారు. ఆ సందర్భంలో నమాజు వేళ అయింది. అప్పుడు ముఅజ్జిన్, హజ్రత్ అబూబకర్ (రదియల్లాహు అన్హు)తో “మీరు నమాజు చేయిస్తారా? నేను తక్బీర్ (ఇఖామత్) చెబుతాను” అని అన్నాడు. దానికి హజ్రత్ అబూబకర్ (రదియల్లాహు అన్హు) “సరే, చేయిస్తాను’ అని అన్నారు. ఆ తరువాత ఆయన నమాజు చేయించడం ప్రారంభించారు. ప్రజలు ఇంకా నమాజు ముగించలేదు, అంతలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వచ్చారు. ఆయన జనాన్ని దాటుకుంటూ మొదటి పంక్తిలోకి వెళ్ళి నిల్చున్నారు.
ఆయన్ని చూసి ప్రజలు చప్పట్లు చరచి (హజ్రత్ అబూబకర్(రదియల్లాహు అన్హు)ని) సైగ చేయడానికి ప్రయత్నించారు. కాని హజ్రత్ అబూబకర్ (రదియల్లాహు అన్హు) [ఆ విషయాన్ని పట్టించుకోలేదు. ఆయన నమాజు చేస్తున్నప్పుడు మరే విషయంపై దృష్టి సారించరు. చివరికి ప్రజలు చప్పట్లు చరచడం అధికం చేయడంతో ఆయన విషయం గమనించారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను చూడగానే ఆయన (ఇమామత్ చోటు నుంచి) వెనక్కి జరగడానికి ప్రయత్నించారు. అయితే దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ఆయన్ని (కదలకుండా) తన స్థానంలోనే నిలబడమని ఆదేశించారు. కాని హజ్రత్ అబూబకర్ (రదియల్లాహు అన్హు) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆదేశం విని (ఆయన తనను అంతటి యోగ్యుడిగా గుర్తించినందుకు) రెండు చేతులెత్తి కృతజ్ఞతగా దైవాన్ని స్తుతించారు. తరువాత వెనక్కి జరిగి అందరితో పాటు సమానంగా పంక్తిలో నిల్చున్నారు.
అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ముందుకు వెళ్ళి నమాజు చేయించారు. నమాజు ముగిసిన తరువాత “అబూబకర్! నీ స్థానంలోనే నిలబడమని నేను ఆజ్ఞాపించినప్పటికీ నీవు అలా ఎందుకు చేయలేదు?” అని అడిగారు ఆయన. దానికి హజ్రత్ అబూబకర్ (రదియల్లాహు అన్హు) “అబూ హాఫా కొడుక్కి దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ముందు నిలబడేటంత శక్తి, సాహసం ఎక్కడున్నాయి” అని అన్నారు. అప్పుడు దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రజల వైపుకు తిరిగి ” మీరు (అనవసరంగా) చాలా సార్లు చప్పట్లు చరిచారు. అసలీ చేత్తో శబ్దం చేయడం అనేది స్త్రీల పని. నమాజులో ఏదైనా ఊహించని విషయం జరిగితే, మీరు “సుబహానల్లాహ్” అనండి చాలు. సుబహానల్లాహ్ అనగానే ఇమామ్ మీ ఉద్దేశ్యాన్ని పసిగడతారు” అని అన్నారు.
[సహీహ్ బుఖారీ : 10వ ప్రకరణం – అజాన్, 48వ అధ్యాయం – మన్ దఖల లియౌమ్మున్నాస ఫజా అల్ఇమాముల్ అవ్వలు ఫత అఖ్కరల్ ఆఖిర్)
23వ అధ్యాయం – నమాజులో ఊహించని సంగతేదైనా జరిగితే ఇమామ్ కు సూచించే పద్ధతి
تسبيح الرجل وَتصفيق المرأة إِذا نابهما شيء في الصلاة
244 – حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: التَّسْبِيحُ لِلرِّجَالِ وَالتَّصْفِيقُ لِلنِّسَاءِ
__________
أخرجه البخاري في: كتاب العمل في الصلاة: 5 باب التصفيق للنساء
244. హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:- (నమాజులో ఊహించని పరిణామం ఏదైనా జరిగిపోతే) పురుషులు ‘సుబ్ హానల్లాహ్’ అనాలి. స్త్రీలయితే చేత్తో శబ్దం చేయాలి.
[సహీహ్ బుఖారీ : 21వ ప్రకరణం – అల్ అమల్ ఫిస్సలాత్, 5వ అధ్యాయం – తస్ఫీఖున్నిసా]
24వ అధ్యాయం – నమాజులో ఏకాగ్రత, సముచిత రీతులు
الأمر بتحسين الصلاة وإِتمامها والخشوع فيها
245 – حديث أَبِي هُرَيْرَةَ، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: هَلْ تَرَوْنَ قِبْلَتِي ههُنَا فَوَاللهِ مَا يَخْفَى عَلَيَّ خُشُوعُكُمْ وَلاَ رُكُوعُكْم، إِنِّي لأَرَاكُمْ مِنْ وَرَاءِ ظَهْرِي
__________
أخرجه البخاري في: كتاب الصلاة: 40 باب عظة الإمام بالناس في إتمام الصلاة وذكر القبلة
245. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా అన్నారు:- నేను (నమాజు చేస్తున్నప్పుడు) ఖిబ్లా వైపు మాత్రమే చూస్తానని మీరు భావిస్తున్నారా? దైవసాక్షి! మీ ఏకాగ్రత, రుకూ, సజ్దా లను గురించి కూడా నాకు తెలుసు. నేను నా వెనుకవైపు నుండి కూడా మీ చర్యలను ఓ కంట గమనిస్తుంటాను.
[సహీహ్ బుఖారీ: 8వ ప్రకరణం – సలాత్, 40వ అధ్యాయం – ఇజతిల్ ఇమామిన్నాస ఫీఇత్మామిస్సలాతి వజికిల్ ఖిబ్ల)
246 – حديث أَنَسِ بْنِ مَالِكٍ، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: أَقِيمُوا الرُّكُوعَ وَالسُّجُودَ فَوَاللهِ إِنِّي لأَرَاكُمْ مِنْ بَعْدِي، وَرُبَّمَا قَالَ: مِنْ بَعْدِ ظَهْرِي إِذَا رَكَعْتُمْ وَسَجَدْتُمْ
__________
أخرجه البخاري في: 10 كتاب الأذان: 88 باب الخشوع في الصلاة
246. హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు:- “రుకూ, సజ్దా లు, సరిగ్గా చేయండి. అల్లాహ్ సాక్షి! మీరు రుకూ, సజ్దాలు ఎలా చేస్తున్నారో నేను నా వెనుకవైపు నుండి అంతా గమనిస్తూ ఉంటాను.”
[సహీహ్ బుఖారీ : 10వ ప్రకరణం – అజాన్, 88వ అధ్యాయం – అల్ ఖుషూ ఫిస్సలాత్)
25వ అధ్యాయం – ఇమామ్ కు ముందే రుకూ, సజ్జలు చేయకూడదు
النهي عن سبق الإمام بركوع أو سجود ونحوهما
247 – حديث أَبِي هُرَيْرَةَ، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: أَمَا يَخْشَى أَحَدُكُمْ، أَوْ لاَ يَخْشَى أَحَدُكُمْ إِذَا رَفَعَ رَأْسَهُ قَبْلَ الإِمَامِ أَنْ يَجْعَلَ اللهُ رَأْسَهُ رَأْسَ حِمَارٍ، أَوْ يَجْعَلَ اللهُ صُورَتَهُ صُورَةَ حِمَارٍ
__________
أخرجه البخاري في: 10 كتاب الأذان: 53 باب إثم من رفع رأسه قبل الإمام
247. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు:- “(నమాజులో రుకూ, సజ్దాల సందర్భంగా) ఇమామ్ కు ముందు తల పైకెత్తేవాడు తన తలను అల్లాహ్, గాడిద తలగా మార్చుతాడేమోనని భయపడడా?” లేక దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు. “ అతను తన రూపాన్ని అల్లాహ్, గాడిద రూపంగా మార్చుతాడేమోనని భయపడడా?”
(సహీహ్ బుఖారీ : 10వ ప్రకరణం – అజాన్, 53వ అధ్యాయం – ఇస్మిమర్రఫ అరాసహూ ఖబ్లల్ ఇమామ్]
28వ అధ్యాయం – పంక్తులను వంకరటింకరగా లేకుండా తిన్నగా ఉంచాలి
تسوية الصفوف وإقامتها
248 – حديث أَنَسٍ، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: سَوُّوا صَفُوفَكمْ فَإِنَّ تَسْوِيَةَ الصُّفوفِ مِنْ إِقَامَةِ الصَّلاَةِ
__________
أخرجه البخاري في: 10 كتاب الأذان: 74 باب إقامة الصف من تمام الصلاة
248. హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు:- “మీ పంక్తులను (వంకరటింకరగా లేకుండా) తిన్నగా ఉంచండి. పంక్తులను తీర్చిదిద్దడం నమాజు (వ్యవస్థ)కు పరిపూర్ణతనివ్వడంలో ఒక భాగమయి ఉంది” (సహీహ్ బుఖారీ : 10వ ప్రకరణం – అజాన్, 74వ అధ్యాయం – ఇఖామతుస్సఫ్ఫి మిన్ తమామిస్సలాతి]
249 – حديث أَنَسٍ، أَنَّ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: أَقِيمُو الصُّفُوفَ فَإِنِّي أَرَاكُمْ خَلْفَ ظَهْرِي
__________
أخرجه البخاري في: 10 كتاب الأذان: 71 باب تسوية الصفوف عند الإقامة وبعدها
249. హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు:- మీ పంక్తులను తిన్నగా, సక్రమంగా ఉంచుకోండి. వినండి! మీరు నా వెనుక నిల్చున్నప్పుడు కూడా నేను మిమ్మల్ని చూడగలుగుతాను.
[సహీహ్ బుఖారీ : 10వ ప్రకరణం – అజాన్, 71వ అధ్యాయం – తిస్వయతిస్సుపూ ఫి ఇన్దల్ ఇఖామతి వ బాదహా]
250 – حديث النُّعْمَانِ بْنِ بَشِيرٍ، قَالَ: قَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: لَتُسَوُّنَّ صُفُوفَكُمْ، أَوْ لَيُخَالِفَنَّ اللهُ بَيْنَ وُجُوهِكُمْ
__________
أخرجه البخاري في: 10 كتاب الأذان: 71 باب تسوية الصفوف عند الإقامة وبعدها
250. హజ్రత్ నూమాన్ బిన్ బషీర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు:- “మీరు సర్వావస్థల్లో మీ పంక్తులను తిన్నగా, సక్రమంగా ఉంచుకోవాలి. అలా చేయకపోతే అల్లాహ్ మీ ముఖాలను పరస్పరం వ్యతిరేకంగా మార్చివేస్తాడు (అంటే మీరు పరస్పరం విభేదించుకొని అనైక్యతకు గురవుతారు)“
(సహీహ్ బుఖారీ : 10వ ప్రకరణం – అజాన్, 71వ అధ్యాయం – తిస్వయతిస్సుపూఫి ఇన్దల్ ఇఖామతి వ బాదహా]
251 – حديث أَبِي هُرَيْرَةَ، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: لَوْ يَعْلَمُ النَّاسُ مَا فِي النِّدَاءِ وَالصَفِّ الأَوَّلِ، ثُمَّ لَمْ يَجِدُوا إِلاَّ أَنْ يَسْتَهِمُوا عَلَيْهِ لاَسْتَهَمُوا، وَلَوْ يَعْلَمُونَ [ص:91] مَا فِي التَّهْجِيرِ لاَسْتَبَقُوا إِلَيْهِ، وَلَوْ يَعْلَمُونَ مَا فِي الْعَتَمَةِ وَالصُّبْحِ لأَتَوْهُمَا وَلَوْ حَبْوًا
__________
أخرجه البخاري في: 10 كتاب الأذان: 9 باب الاستهام في الأذان
251. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు :
అజాన్ చెప్పడంలో, మొదటి పంక్తిలో చేరడంలో ఎంత పుణ్యం ఉందో ప్రజలకు గనక తెలిస్తే, ఆ అవకాశాలు లాటరీ పద్ధతి ద్వారా మాత్రమే లభిస్తాయని తెలిస్తే, మీరు తప్పకుండా పరస్పరం లాటరీ వేసుకుంటారు. అలాగే వేళ కాగానే తొలి సమయంలో నమాజు చేయడంలో ఎంత పుణ్యం ఉందో తెలిస్తే, అందులో కూడా ప్రజలు ఒకర్నొకరు మించిపోవడానికి పోటీపడతారు. అదే విధంగా ఇషా, ఫజ్ర్ (సామూహిక) నమాజులు చేయడంలో ఎంత పుణ్యం ఉందో తెలిస్తే, వాటి కోసం కాళ్ళీడ్చుకుంటూ నడవవలసి వచ్చినా సరే వారు పరస్పరం పోటీపడి వస్తారు.
[సహీహ్ బుఖారీ : 10వ ప్రకరణం – అజాన్, 9వ అధ్యాయం – అల్ ఇస్తిహామి ఫిల్ అజాన్]
29వ అధ్యాయం – నమాజులో పురుషులు తల పైకెత్తే వరకు స్త్రీలు తల పైకెత్తరాదు
أمر النساء المصليات وراء الرجال أن لا يرفعن رؤوسهن من السجود حتى يرفع الرجال
252 – حديث سَهْلِ بْنِ سَعْدٍ، قَالَ: كَانَ رِجَالٌ يُصلُّونَ مَعَ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ عَاقِدِي أُزْرِهِمْ عَلَى أَعْنَاقِهِمْ كَهَيْئَةِ الصِّبْيَانِ، وَيُقَالُ لِلنِّسَاءِ: لاَ تَرْفَعْنَ رُؤُوسَكُنَّ حَتَّى يَسْتَوِيَ الرِّجَالُ جُلُوسًا
__________
أخرجه البخاري في: 8 كتاب الصلاة: 6 باب إذا كان الثوب ضيقًا
252. హజ్రత్ సహల్ బిన్ సాద్ (రదియల్లాహు అన్హు) కథనం:- కొందరు (అనుచరులు చాలీ చాలని బట్టల వల్ల) అంగవస్త్రాన్ని పిల్లల సూదిరిగా మెడలో కట్టుకొని దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) వెనుక నమాజు చేసేవారు. అందువల్ల పురుషులు సజ్దా నుండి తలపూర్తిగా పైకెత్తనంతవరకు స్త్రీలు కూడా సజ్దా నుండి తల పైకెత్తకూడదని దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ఆజ్ఞాపించేవారు.
(సహీహ్ బుఖారీ : 8వ ప్రకరణం – అస్సలాత్, 6వ అధ్యాయం – ఇజా కాన స్సౌబుజయ్యిఖా)
30వ అధ్యాయం – ఎలాంటి ఉపద్రవం లేదనుకుంటే స్త్రీలు సువాసన పూసుకోకుండా’ మస్జిద్కు వెళ్ళవచ్చు خروج النساء إِلى المساجد إِذا لم يترتب عليه فتنة وأنها لا تخرج مطيبة
253 – حديث ابْنِ عُمَرَ، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: إِذَا اسْتَأْذَنَتِ امْرَأَةُ أَحَدِكُمْ إِلَى الْمَسْجِدِ فَلاَ يَمْنَعْهَا
__________
أخرجه البخاري في: 67 كتاب النكاح: 116 باب استئذان المرأة زوجها في الخروج إلى المسجد وغيره
253. హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు:- మీ భార్యలు మస్జిదుకు వెళ్ళడానికి అనుమతి అడిగితే, వారిని నిరోధించకండి. (సహీహ్ బుఖారీ : 67వ ప్రకరణం – నికాహ్, 116వ అధ్యాయం – ఇస్తీ జానిల్ మర్ అతి జౌజహా ఫిల్ ఖురూజి ఇలల్ మస్జిద్]
254 – حديث ابْنِ عُمَرَ، قَالَ: كَانَتِ امْرأَةٌ لِعُمَرَ تَشْهَدُ صَلاَةَ الصُّبْحِ وَالْعِشَاءِ فِي الْجَمَاعَةِ فِي الْمَسْجِدِ، فَقِيلَ لَهَا: لِم تَخْرُجِينَ وَقَدْ تَعْلَمِينَ أَنَّ عُمَرَ يَكْرَهُ ذَلِكَ وَيَغَارُ قَالَتْ: وَمَا يَمْنَعَهُ أَنْ يَنْهَانِي قَالَ: يَمْنَعُهُ قَوْلُ رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: لاَ تَمْنَعُوا إِمَاءَ اللهِ مَسَاجِدَ اللهِ
__________
أخرجه البخاري في: 11 كتاب الجمعة: 13 باب حدثنا عبد الله بن محمد
254. హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం:- హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) భార్యలలో ఒకరు ఫజ్ర్ , ఇషా ల సామూహిక నమాజులు చేయడానికి మస్జిద్ కు వెళ్ళేవారు. “స్త్రీలు మస్జిద్ కు వెళ్ళడాన్ని హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ఇష్టపడరని, ఈ విషయంలో ఆయన ఎంతో అభిమానం గల వ్యక్తి అని తెలిసి కూడా మీరు ఇంటి నుండి బయటికి ఎందుకు వెళ్తున్నారు?” అని ఆమెను ఒకరు అడిగారు. దానికామె “అయితే ఉమర్ (రదియల్లాహు అన్హు) నన్నెందుకు నిరోధించడం లేదు?” అని ఎదురు ప్రశ్నవేశారు. “ఎందుకంటే అల్లాహ్ దాసీలను అల్లాహ్ ఆలయానికి వెళ్ళడాన్ని నిరోధించకండని దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) అన్నారు. ఈ ప్రవచనమే మిమ్మల్ని నిరోధించకుండా ఆయనకు అడ్డుతగిలింది” అని అన్నాడు ఆ వ్యక్తి.
[సహీహ్ బుఖారీ : 11వ ప్రకరణం – జుమా, 13వ అధ్యాయం – హద్దసనా యూసుఫు బిన్ మూసా]
255 – حديث عَائِشَةَ، قَالَتْ: لَوْ أَدْرَكَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ مَا أَحْدَثَ النِّسَاءُ لَمَنَعَهُنَّ الْمَسَاجِدَ كَمَا مُنِعَتْ نِسَاءُ بَنِي إِسْرَائِيلَ
__________
أخرجه البخاري في: 10 كتاب الأذان: 163 باب انتظار الناس قيام الإمام العالم
255. హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం:- (ఈనాడు) స్త్రీలు (రకరకాల ఫ్యాషన్లతో) తమల్ని తాము (సింగారించుకొని) ఎలా రూపొందించుకున్నారో దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) గనక చూస్తే, బనీ ఇస్రాయీల్ మహిళలు ఎలా నిరోధించబడ్డారో అలా స్త్రీలను ఆయన మస్జిదు వెళ్ళకుండా నిరోధించేవారు.
[సహీహ్ బుఖారీ: 10వ ప్రకరణం – అజాన్, 163వ అధ్యాయం – ఖురూజిన్నిసాయి ఇలల్ మసాజిద్]
31వ అధ్యాయం – అలజడి రేగే ప్రమాదం ఉంటే నమాజులో ఖుర్ఆన్ బిగ్గరగా పఠించకూడదు
التوسط في القراءة في الصلاة الجهرية بين الجهر والإسرار إذا خاف من الجهر مفسدة
256 – حديث ابْنِ عَبَّاسِ (وَلاَ تَجْهَرْ بِصَلاتِكَ وَلاَ تُخَافِتْ بِهَا) قَالَ: أُنْزِلَتْ وَرَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ مُتَوَارٍ بِمَكَّةَ، فَكَانَ إِذَا رَفَعَ صَوْتَهُ سَمِعَ الْمُشْرِكُونَ، فَسبُّوا الْقُرْآنَ وَمَنْ أَنْزَلَهُ وَمَنْ جَاءَ بِهِ؛ فَقَالَ اللهُ تَعَالَى (وَلا تَجْهَرْ بِصَلاَتِكَ وَلاَ تُخَافِتْ بِهَا) لاَ تَجْهَرْ بِصَلاَتِكَ حَتَّى يَسْمعَ الْمُشْرِكُونَ، وَلاَ تُخَافِتْ بِهَا عَنْ أَصْحَابِكَ فَلاَ تُسْمِعُهُمْ (وَابْتَغِ بَيْنَ ذَلِكَ سَبِيلاً) أَسْمِعْهُمْ وَلاَ تَجْهَرْ حَتَّى يَأْخُذُوا عَنْكَ الْقُرْآنَ
__________
أخرجه البخاري في: 97 كتاب التوحيد: 34 باب قوله تعالى (أنزله بعلمه والملائكة يشهدون)
256. హజ్రత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) కథనం:- “మీ నమాజు (లో ఖుర్ఆన్ సూక్తులు) మరీ బిగ్గరగా గాని, మరీ మెల్లగా గాని పఠించకండి” అనే ఖుర్ఆన్ సూక్తి (17:110) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మక్కాలో (తమ ఇంట్లో) రహస్యంగా నమాజు చేస్తుండిన రోజుల్లో అవతరించింది. ఆ కాలంలో ఖుర్ఆన్ బిగ్గరగా పఠిస్తే బహుదైవారాధకులు విని ఖుర్ఆన్ని, ఖుర్ఆన్ని అవతరింపజేసేవాడిని, ఖుర్ఆన్ తెచ్చేవాడ్ని నానా మాటలతో దూషించేవారు. ఈ కారణంగా “నమాజులో ఖుర్ఆన్ సూక్తుల్ని బహుదైవారాధకులు వినగలిగే అంత బిగ్గరగా గాని, (ఇమామ్ వెనుక నిల్చునే) అనుచరులకు సయితం వినపడనంత మెల్లిగాగాని పఠించకుండా మధ్యేమార్గాన్ని అవలంబించండి” అని అల్లాహ్ ఆజ్ఞాపించాడు. [సహీహ్ బుఖారీ : 97వ ప్రకరణం – తౌహీద్, 34వ అధ్యాయం]
32వ అధ్యాయం – దివ్యఖుర్ఆన్ ని శ్రద్ధగా ఆలకించి الاستماع للقراءة
257 – حديث ابْنِ عَبَّاسٍ، فِي قَوْلِهِ (لاَ تُحَرِّكْ بِهِ لِسَانَكَ لِتَعْجَلَ بِهِ) قَالَ: كَانَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ إِذَا نَزَلَ جِبْرِيلُ بِالْوَحْيِ وَكَانَ مِمَّا يُحَرِّكُ بِهِ لِسَانَهُ وَشَفَتَيْهِ فَيَشْتَدُّ عَلَيْهِ، وَكَانَ يُعْرَفُ مِنْهُ، فَأَنْزَلَ اللهُ الآيَةَ الَّتِي فِي (لاَ أُقْسِمُ بِيَوْمِ الْقِيَامَةِ) (لاَ تُحَرِّكْ بِهِ لِسَانَكَ لِتَعْجَلَ بِهِ إِنَّ عَلَيْنَا جَمْعَه وَقُرْآنَهُ) قَالَ: عَلَيْنَا أَنْ نَجْمَعَهُ فِي صَدْرِكَ، وَقُرْآنَهُ (فَإِذَا قَرَأْنَاهُ فَاتَّبِعْ قُرْآنَهُ) فَإِذَا أَنْزَلْنَاهُ فَاسْتَمِعْ (ثُمَّ إِنَّ عَلَيْنَا بَيَانَه) عَلَيْنَا أَنْ نُبَيِّنَهُ [ص:93] بِلِسَانِكَ قَالَ: فَكَانَ إِذَا أَتَاهُ جِبْرِيلُ أَطْرَقَ، فَإِذَا ذَهَبَ قَرَأَهُ كَمَا وَعَدَهُ اللهُ
__________
أخرجه البخاري في: 65 كتاب التفسير: 75 سورة القيامة: 2 باب قوله (فإِذا قرأناه)
257. హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హు) కథనం:- హజ్రత్ జిబ్రయీల్ (అలైహిస్సలాం) వహీ తెచ్చి విన్పిస్తున్నప్పుడు దైవప్రవక (సల్లల్లాహు అలైహి వసల్లం) తమ నాలుక, పెదాలను కదిలించేవారు. దాని వల్ల ఆయనకు బాధ కలిగేది. ఈ సంగతి ఆయన ముఖకవళికలను బట్టి తెలిసేది. అందువల్ల అల్లాహ్ ఖియామా సూరాలో “ప్రవక్తా! ఈ వహీని జ్ఞాపకముంచుకోవడానికి వడివడిగా నాలుక తిప్పకు. దాన్ని నీకు గుర్తు చేయించడం, నీ చేత చదివించడం మా పని. అంచేత మేము పఠిస్తున్నప్పుడు నీవు దాన్ని శ్రద్ధగా ఆలకిస్తూ ఉండు చాలు. ఆ తరువాత దాని భావం తెలియజేయడం కూడా మా భాద్యతే” (75:16-19) అనే సూక్తుల్ని అవతరింపజేశాడు. అప్పటి నుంచి హజ్రత్ జిబ్రయీల్ (అలైహిస్సలాం) (వహీ తీసుకొని) వచ్చినప్పుడల్లా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తలవంచి శ్రద్ధగా ఆలకించేవారు. జిబ్రయీల్ (అలైహిస్సలాం) వెళ్ళిపోయిన తరువాత ఆయన దాన్ని అల్లాహ్ వాగ్దానం ప్రకారం పఠించేవారు (అంటే హజ్రత్ జిబ్రయీల్ (అలైహిస్సలాం) నోట ఒక్కసారి వినగానే ఆయనకు ఇక ఎల్లప్పుడూ గుర్తుండిపోతుందన్నమాట)
[సహీహ్ బుఖారీ : 25వ ప్రకరణం – అత్తఫ్సీర్, 75వ సూరా – అల్ ఖియామ: 2వ అధ్యాయం]
258 – حديث ابْنِ عَبَّاسٍ، فِي قَوْلِهِ تَعَالَى (لاَ تُحَرِّكْ بِهِ لِسَانَكَ لِتَعْجَلَ بِهِ) قَالَ: كَانَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يُعَالِجُ مِنَ التَّنْزِيلِ شِدَّةً، وَكَانَ مِمَّا يُحَرِّكُ شَفَتَيْهِ، فَقَالَ ابْنُ عَبَّاسٍ فَأَنَا أُحَرِّكُهُمَا لَكُمْ كَمَا كَانَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يُحَرِّكُهُمَا وَقَالَ سَعِيدٌ (هُوَ سَعِيدُ بْنُ جُبَيْرٍ رَاوِي الْحَدِيثِ عَنِ ابْنِ عَبَّاسٍ) : أَنَا أُحَرِّكُهُمَا كَمَا رَأَيْتُ ابْنَ عَبَّاسٍ يُحَرِّكُهُمَا، فَحَرَّكَ شَفَتَيْهِ فَأَنْزَلَ اللهُ تَعَالَى (لاَ تُحَرِّكْ بِهِ لِسَانَكَ لِتَعْجَلَ بِهِ إِنَّ عَلَيْنَا جَمْعَهُ وَقُرْآنَهُ) قَالَ جَمْعُهُ لَهُ فِي صَدْرِكَ وَتَقْرَأَهُ، (فَإِذَا قَرَأْنَاهُ فَاتَّبِعْ قُرْآنَهُ) قَالَ: فَاسْتَمِعْ لَهُ وَأَنْصِتْ (ثُمَّ إِنَّ عَلَيْنَا بَيَانَهُ) ثُمَّ إِنَّ عَلَيْنَا أَنْ تَقْرَأَهُ فَكَانَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، بَعْدَ ذَلِكَ، إِذَا أَتَاهُ جِبْرِيلُ اسْتَمَعَ، فَإِذَا انْطَلَقَ جِبْرِيلُ قَرَأَهُ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ كَمَا قَرَأَهُ
__________
أخرجه البخاري في: 1 كتاب بدء الوحي: 4 باب حدثنا موسى بن إسماعيل
258. “ఈ వహీని గుర్తుంచుకోవడానికి వడివడిగా నాలుక తిప్పకు” అనే దైవాజ్ఞ అవతరణ గురించి హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హు) తెలియజేస్తూ “దైవసందేశం అవతరిస్తున్నప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దాన్ని గుర్తుంచుకోవడానికి నాలుకను వడివడిగా తిప్పుతూ చాలా ఇబ్బంది పడేవారు” అని అన్నారు. ఆ తరువాత ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హు) “దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) తమ నాలుకను ఎలా తిప్పారో అలా నా నాలుకను, పెదవుల్ని తిప్పి చూపుతాను” అని అన్నారు.
హజ్రత్ ఇబ్నె అబ్బాస్ ద్వారా ఈ హదీసును ఉటంకించిన హజ్రత్ సయీద్ బిన్ జుబైర్ ఇలా అన్నారు: హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ఎలా తన పెదవుల్ని కదిపారో నేను మీకు కదిపి చూపుతాను. తరువాత ఆయన (రహిమహుల్లాహ్) తన పెదవులను తిప్పి చూపారు.
అందువల్ల అల్లాహ్ “ప్రవక్తా! ఈ వహీని గుర్తుంచుకోవడానికి వడివడిగా నాలుక తిప్పకు. దాన్ని గుర్తు చేయించడం, నీ చేత చదివించడం మా పని. అంచేత మేము పఠిస్తున్నప్పుడు నీవు దాన్ని చెవి యొగ్గి విను చాలు. ఆ తరువాత దాని భావం తెలియజేయడం కూడా మా బాధ్యతే” అనే సూక్తుల్ని అవతరింపజేశాడు. ఈ ఆజ్ఞ వచ్చిన తరువాత దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) పరిస్థితి మారిపోయింది. హజ్రత్ జిబ్రయీల్ (అలైహిస్సలాం) దైవసందేశం తెచ్చినప్పుడల్లా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దాన్ని చెవి యొగ్గి వినేవారు. జిబ్రయీల్ (అలైహిస్సలాం) వెళ్ళిపోయిన తరువాత ఆయన ఆ సూక్తుల్ని జిబ్రయీల్ దూత (అలైహిస్సలాం) పఠించినట్లు పఠించేవారు.
(సహీహ్ బుఖారీ : 1వ ప్రకరణం – వహీ, 4వ అధ్యాయం – హద్దసనా మూసా బిన్ ఇస్మాయిల్)
33వ అధ్యాయం – ఫజ్ర్ నమాజ్ లో బిగ్గరగా ఖుర్ఆన్ పారాయణం – జిన్నులకు ఖుర్ఆన్ బోధ
الجهر بالقراءة في الصبح والقراءَة على الجن
259 – حديث ابْنِ عَبَّاسٍ، قَالَ: انْطَلَقَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فِي طَائِفَةٍ مِنْ أَصْحَابِهِ عَامِدِينَ إِلَى سُوقِ عُكَاظٍ، وَقَدْ حِيلَ بَيْنَ الشَّيَاطِينِ وَبَيْنَ خَبَرِ السَّمَاءِ، وَأُرْسِلَتْ عَلَيْهِمُ الشُّهُبُ فَرَجَعَتِ الشَّيَاطِينُ إِلَى قَوْمِهِمْ، فَقَالُوا مَا لَكُمْ قَالُوا: حِيلَ بَيْنَنَا وَبَيْنَ خَبَرِ السَّمَاءِ، وَأُرْسِلَتْ عَلَيْنَا الشُّهُبُ قَالُوا: مَا حَالَ بَيْنَكُمْ وَبَيْنَ خَبَرِ السَّمَاءِ إِلاَّ شَيْءٌ [ص:94] حَدَثَ، فَاضْرِبُوا مَشَارِقَ الأَرْضِ وَمَغَارِبَهَا فَانْظُرُوا مَا هذَا الَّذِي حَالَ بَيْنَكُمْ وَبَيْنَ خَبَرِ السَّمَاءِ فَانْصَرَفَ أُولئِكَ الَّذِينَ تَوَجَّهُوا نَحْوَ تِهَامَةَ إِلَى النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، وَهُوَ بِنَخْلَةَ عَامِدِينَ إِلَى سُوقِ عُكَاظٍ، وَهُوَ يُصَلِّي بِأَصْحَابِهِ صَلاَةَ الْفَجْرِ، فَلَمَّا سَمِعُوا الْقُرْآنَ اسْتَمَعُوا لَهُ؛ فَقَالُوا: هذَا وَاللهِ الَّذِي حَالَ بَيْنَكُمْ وَبَيْنَ خَبَرِ السَّمَاءِ، فَهُنَالِكَ حِينَ رَجَعُوا إِلَى قَوْمِهِمْ؛ فَقَالُوا: (يَا قوْمَنَا إِنَّا سَمِعْنَا قُرْآنًا عَجَبًا يَهْدِي إلى الرُّشْدِ فَآمَنَّا بِهِ وَلَنْ نُشْرِكَ بِرَبِّنَا أَحَدًا) فَأَنْزَلَ اللهُ عَلَى نَبِيِّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ (قُلْ أُوحِيَ إِلَيَّ أَنَّهُ اسْتَمَعَ نَفَرٌ مِنَ الْجِنِّ) وَإِنِّمَا أُوحِيَ إِلَيْهِ قَوْلُ الْجِنِّ
__________
أخرجه البخاري في: 10 كتاب الأذان: 105 باب الجهر بقراءة صلاة الفجر
259. హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఓ సారి కొందరు అనుచరుల్ని వెంట బెట్టుకొని అకాజ్ (ప్రాంతానికి) బయలుదేరారు. ఇది ఆకాశంలో అగ్నిజ్వాలలు షైతానుల్ని (దుష్టశక్తుల్ని) తరిమివేస్తూ వారికి దివ్యలోకాల సమాచారం అందకుండా ద్వారాలు మూసివేయబడిన నాటి సంగతి. షైతానులు (దివ్యలోకాల సమాచారం సేకరించలేక నిరాశతో) వెనుదిరిగి తమ మిత్రమూక దగ్గరికి వచ్చినప్పుడు “ఏమయింది మీకు (ఉత్త చేతులతో వచ్చారు)?” అని అడిగింది ఆ మిత్రమూక. దానికి వారు “మా మీద అగ్నిజ్వాలలు కురిపించబడ్డాయి, దివ్యలోకాల మాటలు విననీయకుండా మనల్ని నిరోధించడం జరిగింది” అని సమాధానమిచ్చారు. “మనం వార్తలు సయితం వినకుండా నిరోధించబడ్డాం అంటే, దానికి కారణం ఏదో కొత్త సంఘటనే జరిగిందన్నమాట. అందువల్ల మనం నేల నాలుగు చెరగులా తిరిగి, దివ్యలోకాల వార్తలు విననీయకుండా మనకు అడ్డుపడిన విషయం ఏమిటో అన్వేషించాలి” అన్నారు వారి మిత్రులు.
(దాని ప్రకారం జిన్నులు ప్రపంచం నలుమూలలా వ్యాపించారు.) ఒక బృందం తహామా {ప్రాంతం)లో పర్యటిస్తూ, అకాజ్ బజారుకు బయలుదేరి దారిలో నఖ్లా (ప్రదేశం)లో ఆగిన దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) దగ్గరికి చేరుకున్నది. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఫజ్ర్ నమాజ్ చేయసాగారు. జిన్నులు ఆయన నోట దివ్యఖుర్ ఆన్ విని “దైవసాక్షి! దివ్యలోకాల మాటలు విననీయకుండా మనకు అడ్డుగా నిలిచిన విషయం ఇదే” అని అన్నారు. ఆ తరువాత వారు అక్కడ్నుంచి తమ జాతి దగ్గరకు చేరుకొని “(సోదరులారా!) ఈ రోజు మేము అద్భుతమైన ఖుర్ఆన్ వాణి విన్నాము. అది (మనల్ని) రుజుమార్గం వైపుకు ఆహ్వానిస్తోంది. అందువల్ల మేము దాన్ని విశ్వసించాము. ఇక నుండి మేము మా(నిజ) ప్రభువుకు ఎవరినీ సాటి కల్పించము” అని అన్నారు.
ఈ సందర్భంలోనే అల్లాహ్ మహాప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) పై “జిన్ సూరా (అధ్యాయం)” అవతరింపజేశాడు. ఇది జిన్ సూరాలో “ఖుల్ ఊహియ ఇలయ్య అన్న హుస్తమఅ నఫర్రుఁమినల్ జిన్ని” నుండి మొదలవుతుంది. ఇందులో జిన్నులకు సంబంధించిన విషయాలు అవతరించాయి.
[సహీహ్ బుఖారీ : 10వ ప్రకరణం – అజాన్, 105 వ అధ్యాయం – అల్ జహ్రి బిఖిరా అతి సలాతిల్ ఫజ్ర్)
34వ అధ్యాయం – జుహ్ర్ , అస్ర్ నమాజుల్లో ఖుర్ఆన్ పఠనం గురించి القراءة في الظهر والعصر
260 – حديث أَبِي قَتَادَةَ، قَالَ: كَانَ النَبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَقْرَأُ فِي الرَّكْعَتَيْنِ الأُولَيَيْنِ مِنْ صَلاَةِ الظُّهْرِ بِفَاتِحَةِ الْكِتَابِ وَسُورَتَيْنِ، يُطَوِّلُ فِي الأُولَى وَيُقَصِّرُ فِي الثَّانيَةِ، وَيُسْمِعُ الآيَة أَحْيانًا، وَكَانَ يَقْرَأُ فِي الْعصْرِ بِفَاتِحَةِ الْكِتَابِ وَسُورَتَيْنِ، وَكَانَ يُطَوِّلُ فِي الأُولَى، وَكَانَ يُطَوِّلُ فِي الرَكْعَةِ الأُولَى مِنْ صَلاَةِ الصُّبْحِ وَيُقَصِّرُ فِي الثَّانِيَةِ
__________
أخرجه البخاري في: 19 كتاب الأذان: 96 باب القراءة في الظهر
260. హజ్రత్ అబూ ఖతాదా (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జుహ్ర్ నమాజ్ మొదటి రెండు రకాతులలో ఫాతిహ సూరా, ఆ తరువాత (ఒక్కొక్క రకాతులో ఒక సూరా చొప్పున) రెండు సూరాలు పఠించేవారు. మొదటి రకాతులో సుదీర్ఘ పారాయణం, రెండవ రకాతులో సంక్షిప్త పారాయణం చేసేవారు. ఒక్కోసారి ఒకటీ అరా సూక్తి (ఆయత్) మాకూ వినిపిస్తుండేది. అస్ర్ నమాజ్ లో మొదటి రెండు రకాతులలో (ప్రతి రకాతులో) ఫాతిహా సూరా, ఆ తరువాత మరేదైనా ఒక సూరా పఠించేవారు. మొదటి రకాతులో మటుకు సుదీర్ఘ పారాయణం చేసేవారు. అలాగే ఫజ్ర్ నమాజులో కూడా మొదటి రకాతులో సుదీర్ఘ పారాయణం, రెండవ రకాతులో సంక్షిప్త పారాయణం చేసేవారు.
[సహీహ్ బుఖారీ: 10వ ప్రకరణం – అజాన్, 96వ అధ్యాయం – అల్ ఖిరా అతి ఫిజ్జుహ్ర్]
261 – حديث سَعْدِ بْنِ أَبِي وَقَّاصٍ، عَنْ جَابِرِ بْنِ سَمُرَةَ قَالَ: شَكَا أَهْلُ الْكُوفَةِ سَعْدًا إِلَى عُمَرَ رضي الله عنه، فَعَزَلَهُ، وَاسْتَعْمَلَ عَلَيْهِمْ عَمَّارًا فَشَكَوْا حَتَّى ذَكَرُوا أَنَّهُ لاَ يُحْسِنُ يُصَلِّي، فَأَرْسَلَ إِلَيْه، فَقَالَ: يَا أَبَا إِسْحقَ إِنَّ هؤُلاَءِ يَزْعُمُونَ أَنَّكَ لاَ تُحْسِن [ص:95] تُصَلِّي قَالَ أَبُو إِسْحقَ: أَمَّا أَنَا وَاللهِ فَإِنِّي كُنْتُ أُصَلِّي بِهِمْ صَلاَةَ رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، مَا أَخْرِمُ عَنْهَا، أُصَلِّي صَلاَةَ الْعِشَاءِ فَأَرْكُدُ فِي الأُولَيَيْنِ، وَأُخِفُّ فِي الأُخْرَيينِ قَالَ: ذَاكَ الظَّنُّ بِكَ يَا أَبَا إِسْحقَ فَأَرْسَلَ مَعَهُ رَجُلاً، أَوْ رِجَالاً، إِلَى الْكُوفَةِ فَسَأَلَ عَنْهُ أَهْلَ الْكُوفَةِ، وَلَمْ يَدَعْ مَسْجِدًا إِلاَّ سَأَلَ عَنْهُ، وَيُثْنُونَ مَعْرُوفًا، حَتَّى دَخَلَ مَسْجِدًا لِبَنِي عَبْسٍ؛ فَقَامَ رَجُلٌ مِنْهُمْ يُقَالُ لَهُ أُسَامَةُ بْنُ قَتَادَةَ، يُكْنَى أَبَا سَعْدَةَ؛ فَقَالَ: أَمَّا إِذْ نَشَدْتَنَا فَإِنَّ سَعْدًا كَانَ لاَ يَسِيرُ بِالسَّرِيَّةِ، وَلاَ يَقْسِمُ بِالسَّوِيَّةِ، وَلاَ يَعْدِلُ فِي الْقَضِيَّة قَالَ سَعْدٌ: أَمَا وَاللهِ لأَدْعُوَنَّ بِثَلاَثٍ: اللهُمَّ إِنْ كَانَ عَبْدُكَ هذَا كَاذِبًا قَامَ رِيَاءً وَسُمْعَةً فَأَطِلْ عُمْرَهُ، وَأَطِلْ فَقْرَهُ، وَعَرِّضْهُ بِالْفِتَنِ فَكَانَ بَعْدُ، إِذَا سُئِلَ يَقُولُ: شَيْخٌ كَبيرٌ مَفْتُونٌ أَصَابَتْنِي دَعْوَةُ سَعْد
قَالَ عَبْدُ الْمَلِكِ (أَحَدُ رُوَاةِ هذَا الْحَدِيثَ) فَأَنَا رَأَيْتُهُ بَعْدُ، قَدْ سَقَطَ حَاجِبَاهُ عَلَى عَيْنَيْهِ مِنَ الْكِبَرِ، وَإِنَّهُ لَيَتَعَرَّضُ لِلْجَوَارِي فِي الطُّرُقِ يَغْمِزُهُنَّ
__________
أخرجه البخاري في: 10 كتاب الأذان: 95 باب وجوب القراءة للإمام والمأموم في الصلوات كلها
261. హజ్రత్ జాబిర్ బిన్ సమురా (రదియల్లాహు అన్హు) కథనం:- కూఫా ప్రజలు ( ఖలీఫా) హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) దగ్గర హజ్రత్ సాద్ (రదియల్లాహు అన్హు)ని గురించి ఫిర్యాదు చేశారు. అప్పుడు హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) హజ్రత్ సాద్ (రదియల్లాహు అన్హు)ని (గవర్నర్ పదవి నుంచి) తొలగించి, హజ్రత్ అమ్మార్ (రదియల్లాహు అన్హు)ను కూఫా పాలకునిగా నియమించారు. కూఫా ప్రజలు చేసిన ఫిర్యాదులో హజ్రత్ సాద్ (రదియల్లాహు అన్హు) నమాజ్ సరిగ్గా చేయించరనే విషయం కూడా ఉంది.
అందువల్ల హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) హజ్రత్ సాద్ (రదియల్లాహు అన్హు)ని పిలిపించి “అబూ ఇస్ హాఖ్! మీరు సరిగ్గా నమాజు చేయించడం లేదని వీరు ఆరోపిస్తున్నారు. (దీనికి మీ సమాధానం ఏమిటి?)” అని అడిగారు. హజ్రత్ సాద్ (రదియల్లాహు అన్హు) సమాధానమిస్తూ “అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఏ విధంగా నమాజు చేయించేవారో నేను అదే విధంగా నమాజు చేయిస్తున్నాను. అందులో నేను ఎలాంటి లోటు రానివ్వడం లేదు. ఇషా నమాజు చేయిస్తున్నప్పుడు నేను మొదటి రెండు రకాతులలో సుదీర్ఘ పారాయణం, ఆ తరువాతి రెండు రకాతులలో సంక్షిప్త పారాయణం చేస్తున్నాను” అని అన్నారు. హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ఈ మాట విని “అబూ ఇస్ హాఖ్! నేను మీ నుండి ఇలాంటి సమాధానమే ఆశించాను” అని అన్నారు.
ఆ తరువాత హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) హజ్రత్ సాద్ (రదియల్లాహు అన్హు) పై వచ్చిన ఆరోపణలను గురించి విచారించడానికి ఆయన వెంట ఒక వ్యక్తిని లేదా కొందరు వ్యక్తులను కూఫా పంపించారు. ఆ వ్యక్తులు కూఫాలోని ప్రతి మస్జిదకు వెళ్ళి ప్రజలను విచారించారు. ప్రజలంతా హజ్రత్ సాద్ (రదియల్లాహు అన్హు) గుణగణాలను ప్రశంసించారు. అయితే బనీ అబస్ పేట మస్జిద్లో (అబూ సాదా) ఉసామా బిన్ ఖతాదా అనే ఒక వ్యక్తి లేచి “మీరు మమ్మల్ని ప్రమాణం చేసి చెప్పమంటున్నారు గనక అసలు విషయం చెబుతున్నాను. హజ్రత్ సాద్ (రదియల్లాహు అన్హు) సైనిక దళాలతో కలసి అసలు యుద్ధానికే పోరు. యుద్ధసొత్తు (మాలెగనీమత్)ను సమానంగా పంచరు. అలాగే వ్యవహార విచారణ చేస్తున్నప్పుడు న్యాయంగా తీర్పివ్వరు (పక్షపాతం వహిస్తారు)” అని అన్నారు.
ఈ మాటలకు హజ్రత్ సాద్ (రదియల్లాహు అన్హు) (నిర్ఘాంతపోయి), “దేవదేవ! ఎంత దారుణం! ఈ ఆరోపణలను గురించి నిజానిజాలు తెలుసుకోవాలంటే నా దగ్గర ఒకే ఒక మార్గం ఉంది. నేను అల్లాహ్ ను ప్రార్థించి ఇతనికి మూడు శాపాలు పెడ్తాను. (ఇతను సత్యవంతుడయితే ఈ శాపాలకు గురికాకుండా ఉంటాడు)” అని అన్నారు. ఆ తరువాత “అల్లాహ్! నీ ఈ దాసుడు గనక అబద్ధాలకోరు అయి, పేరు ప్రతిష్ఠల కోసం ప్రాకులాడుతూ ప్రదర్శనా బుద్ధితో నా మీద ఇలాంటి అభాండాలు వేస్తుంటే ఇతనికి (1) సుదీర్ఘ వయస్సు ప్రసాదించు (2) దీర్ఘకాలంగా దారిద్ర్యంలో మగ్గి ఉండేలా చెయ్యి (3) ఇంకా ఇతన్ని పరీక్షలకు గురి చెయ్యి” అని ప్రార్థించారు ఆయన.
ఉల్లేఖకుని కథనం ప్రకారం ఆ తరువాత ఆ వ్యక్తిని అతని పరిస్థితి ఏమిటని అడిగినప్పుడు “ఏమని చెప్పను! నేను పరమ దౌర్భాగ్యుడ్ని, కష్టాలలో చిక్కుకున్న ముసలివాడ్ని. నాకు సాద్ (రదియల్లాహు అన్హు) గారి శాపం తగిలింది” అని సమాధానమిచ్చేవాడు.
హదీసు ఉల్లేఖకులలో అబ్దుల్ మాలిక్ (రహిమహుల్లాహ్) అనే ఒక ఉల్లేఖకుడు ఇలా తెలియజేస్తున్నారు – “ఈ సంఘటన జరిగిన కొన్నేళ్లకు నేనా వ్యక్తిని చూశాను. అప్పుడతను బాగా ముసలివాడయిపోయాడు. కనుబొమలు వ్రేలాడిపోయి అతని కళ్ళ మీద పడ్డాయి. దారిలో నిల్చొని వచ్చేపోయే అమ్మాయిలను అల్లరి పెడ్తూ, వారి చేత శాపనార్ధాలు పెట్టించుకునేవాడు”.
(సహీహ్ బుఖారీ : 10వ ప్రకరణం – అజాన్, 95వ అధ్యాయం – వుజూ బిల్ ఖిరాతి లిల్ ఇమామి వల్ మామూమి ఫిస్సలాతి కుల్లిహా]
35వ అధ్యాయం – ఫజ్ర్, మగ్రిబ్ నమాజుల్లో ఖుర్ఆన్ పఠనం గురించి القراءة في الصبح والمغرب
262 – حديث أَبِي بَرْزَةَ، قَالَ: كَانَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يُصَلِّي الصُّبْحَ وَأَحَدُنَا يَعْرِفُ جَلِيسَهُ [ص:96] وَيَقْرأُ فِيهَا مَا بَيْنَ السِّتِّينَ إِلَى الْمِائَةِ، وَيُصَلِّي الظُّهْرَ إِذَا زَالَتِ الشَّمْسُ، وَالْعَصْرَ وَأَحَدُنَا يَذْهَبُ إِلَى أَقْصَى الْمَدِينَةِ ثُمَّ يَرْجِعُ وَالشَّمْسُ حَيَّةٌ وَلاَ يُبَالِي بِتَأْخِيرِ الْعِشَاءِ إِلَى ثُلُثِ اللَّيْلِ
__________
أخرجه البخاري في: 9 كتاب مواقيت الصلاة: 11 باب وقت الظهر عند الزوال
262. హజ్రత్ అబూ బర్జా (రదియల్లాహు అన్హు) కథనం:- మాలో ప్రతి వ్యక్తి తన సహచరుడ్ని గుర్తు పట్టగలిగే అంత వెలుతురు వచ్చిన సమయంలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఫజ్ర్ నమాజు చేసేవారు. (ఈ నమాజులో) ఆయన అరవై నుండి వంద సూక్తుల దాకా ఖుర్ఆన్ పఠించేవారు. జుహర్ నమాజు సూర్యుడు నడి నెత్తిమీది నుండి కొంచెం వాలిన తరువాత, అస్ర్ నమాజు (నమాజు ముగించి) ఒక వ్యక్తి మదీనా పట్టణంలో ఈ చివరి నుండి ఆ చివరి వరకు నడచి వెళ్ళినా సూర్యుడు ఇంకా ప్రకాశిస్తూనే ఉండే వేళలో చేసేవారు. పోతే ఇషా నమాజు కోసం రాత్రి మూడింట ఒక వంతు గడచిపోయినా తప్పు లేదని భావించేవారు.
[సహీహ్ బుఖారీ : 9వ ప్రకరణం – మవాఖియతుస్సలా – 11వ అధ్యాయం – వఖ్తి జుహ్రి ఇన్దజ్జవాల్)
263 – حديث أُمِّ الْفَضْلِ عَنِ ابْنِ عَبَّاسٍ، أَنَّهُ قَالَ: إِنَّ أُمَّ الْفَضْلِ سَمِعَتْهُ وَهُوَ يَقْرَأُ (وَالْمُرْسَلاَتِ عُرْفًا) فَقَالَتْ: يَا بُنَيَّ وَاللهِ لَقَدْ ذَكَّرْتَنِي بِقِرَاءَتِكَ هذِهِ السُّورَةَ، إِنَّهَا لآخِرُ مَا سَمِعْتُ مِنْ رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَقْرَأُ بِهَا فِي الْمَغْرِبِ
__________
أخرجه البخاري في: 10 كتاب الأذان: 98 باب القراءة في المغرب
263. హజ్రత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) కథనం:- నేను “వల్ ముర్సలాతి ఉర్ఫా” అనే సూరా పఠిస్తుంటే హజ్రత్ ఉమ్ముల్ ఫజల్ (రదియల్లాహు అన్హా) విని ఇలా అన్నారు: “బాబూ! నువ్వీ సూరా పఠిస్తుంటే నాకో విషయం గుర్తొస్తోంది. దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) నోట నేను చివరిసారిగా విన్న సూరా ఇదే. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దీన్ని మగ్రిబ్ నమాజులో పఠించారు.”
(సహీహ్ బుఖారీ : 10వ ప్రకరణం – అజాన్, 98వ అధ్యాయం – అల్ ఖిరాతి ఫిల్ మగ్రిబ్ ]
264 – حديث جُبَيْرِ بْنِ مُطْعِمٍ قَالَ: سَمِعْتُ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَقْرَأُ فِي الْمَغْرِبِ بِالطورِ
__________
أخرجه البخاري في: 10 كتاب الأذان: 99 باب الجهر في المغرب
264. హజ్రత్ జుబైర్ బిన్ ముత్ ఇమ్ (రదియల్లాహు అన్హు) కథనం:- నేను మగ్రిబ్ నమాజులో దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) అత్తూర్ సూరా పఠిస్తుండగా విన్నాను. (సహీహ్ బుఖారీ : 10వ ప్రకరణం – అజాన్, 99వ అధ్యాయం – అల్ జుహ్రి ఫీల్ మగ్రిబ్)
36వ అధ్యాయం – ఇషా నమాజులో ఖుర్ఆన్ పఠనం గురించి القراءة في العشاء
265 – حديث الْبَرَاءِ، أَنَّ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ كَانَ في سَفَرٍ فَقَرَأَ فِي الْعِشَاءِ فِي إِحْدَى الرَّكْعَتَيْنِ بِالتِّينِ وَالزَّيْتُون
__________
أخرجه البخاري في: 10 كتاب الأذان: 100 باب الجهر في العشاء
265. హజ్రత్ బరా (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒకసారి ప్రయాణావస్థలో ఉన్నప్పుడు ఇషా నమాజుకు చెందిన మొదటి రెండు రకాతులలో ఒక రకాతులో “వత్తీని వజ్ జైతూన్” అనే సూరా పఠించారు.
[సహీహ్ బుఖారీ : 10వ ప్రకరణం – అజాన్, 100వ అధ్యాయం – అల్ జుహ్రి ఫిల్ ఇషా]
266 – حديث جَابِرِ بْنِ عَبْدِ اللهِ، أَنَّ مُعَاذَ بْنَ جَبَلٍ رضي الله عنه كَانَ يُصَلِّي مَعَ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ ثُمَّ يَأْتِي قَوْمَهُ فَيُصَلِّي بِهِمْ الصَّلاَةَ، فَقَرَأَ بِهِمُ الْبَقَرَةَ قَالَ: فَتَجَوَّزَ رَجُلٌ فَصَلَّى صَلاَةً خَفِيفَةً، فَبَلَغَ ذَلِكَ مُعَاذًا، فَقَالَ: إِنَّهُ مُنَافِقٌ فَبَلَغَ ذلِكَ الرَّجُلَ، فَأَتَى النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَقَالَ يَا رَسُولَ اللهِ إِنَّا قَوْمٌ نَعْمَلُ بِأَيْدِينَا، وَنَسْقِي بِنَوَاضِحِنَا وَإِنَّ مُعَاذًا صَلَّى بِنَا الْبَارِحَةَ، [ص:97] فَقَرَأَ الْبَقَرَةَ، فَتَجَوَّزْتُ، فَزَعَمْ أَنِّي مُنَافِقٌ فَقَالَ النَبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: يَا مُعَاذُ أَفَتَّانٌ أَنْتَ ثلاثًا اقْرَأْ (وَالشَّمْسِ وَضُحَاهَا) وَ (سَبِّحِ اسْمَ رَبِّكَ الأَعْلَى) وَنَحْوَهَا
__________
أخرجه البخاري في: 78 كتاب الأدب: 74 باب من لم ير إكفار من قال ذلك متأولاً أو جاهلا
266. హజ్రత్ జాబిర్ బిన్ అబ్దుల్లా (రదియల్లాహు అన్హు) కథనం:- హజ్రత్ ముఆజ్ బిన్ జబల్ (రదియల్లాహు అన్హు) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వెనుక (ఇషా) నమాజు చేసి (ఇంటికి) వెళ్ళిపోయేవారు. వెళ్ళి తన తెగవారికి (ఇషా) నమాజు చేయించేవారు. ఒకసారి ఆయన (ఇషా) నమాజులో ‘బఖరా’ సూరా పఠించారు. అప్పుడు ఒక వ్యక్తి పంక్తి నుండి వేరయిపోయి విడిగా సంక్షిప్త నమాజు చేసి వెళ్ళిపోయాడు. హజ్రత్ ముఆజ్ (రదియల్లాహు అన్హు)కు అతను చేసిన పని తెలిసి “నిస్సందేహంగా అతను కపట విశ్వాసి” అని అన్నారు.
హజ్రత్ ముఆజ్ (రదియల్లాహు అన్హు) తనను కపట విశ్వాసి అన్నారని తెలుసుకున్న ఆ వ్యక్తి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి వెళ్ళి “దైవప్రవక్తా! మేము కూలినాలి చేసి బ్రతికే శ్రమ జీవులం. (పగలల్లా) ఒంటెల సహాయంతో నీళ్ళు తోడి మోసుకెళ్ళి పోస్తుంటాము. కాని హజ్రత్ ముఆజ్ (రదియల్లాహు అన్హు) గత రాత్రి (ఇషా) నమాజులో బఖరా సూరా (పూర్తిగా) పఠించారు. దాంతో నేను పంక్తి నుండి వేరయి ఒంటరిగా సంక్షిప్త నమాజు చేసుకొని వెళ్ళిపోయాను. దానిపై హజ్రత్ ముఆజ్ (రదియల్లాహు అన్హు) నన్ను కపట విశ్వాసి అంటున్నారు” అని ఫిర్యాదు చేశాడు. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హజ్రత్ ముఆజ్ (రదియల్లాహు అన్హు)ని పిలిచి “ఏమిటీ నీ సంగతి? జనాన్ని చిక్కుల్లో పడవేసి ధర్మం పట్ల వారికి వెగటు కలిగించదలిచావా?” అని అన్నారు. ఈ మాట ఆయన మూడుసార్లు అన్నారు. ఆ తరువాత “వషమ్సి వజుహాహా, సబ్బిహిస్మ రబ్బికల్ ఆలా” లాంటి (చిన్న) సూరాలు (సామూహిక నమాజులో) పఠిస్తూ ఉండు” అని అన్నారు.
(సహీహ్ బుఖారీ : 78వ ప్రకరణం – అల్ ఆదాబ్, 73వ అధ్యాయం – మల్లమ్ యర్ కఫార మన్సాల జాలిక ముతావలన్ అల్ జాహిలన్]
37వ అధ్యాయం – ఇమామ్ ప్రజలకు భారం అన్పించని నమాజు చేయించాలి
أمر الأئمة بتخفيف الصلاة في تمام
267 – حديث أَبِي مَسْعُودٍ الأَنْصَارِيِّ، قَالَ: جَاءَ رَجُلٌ إِلَى رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَقَالَ: يَا رَسُولَ اللهِ إِنِّي وَاللهِ لأَتأَخَّرُ عَنْ صَلاَةِ الْغَدَاةِ مِنْ أَجْلِ فُلاَنٍ مِمَّا يُطِيلُ بِنَا فِيهَا قَالَ: فَمَا رَأَيْتُ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَطُّ أَشَدَّ غَضَبًا فِي مَوْعِظَةٍ مِنْهُ يَوْمَئِذٍ، ثُمَّ قَالَ: يأَيُّهَا النَّاسُ إِنَّ مِنْكُمْ مُنَفِّرِينَ؛ فَأَيُّكُمْ مَا صَلَّى بِالنَّاسِ فَلْيُوجِزْ، فَإِنَّ فِيهِمُ الْكَبِيرَ وَالضَّعِيفَ وَذَا الْحَاجَةِ
__________
أخرجه البخاري في: 93 كتاب الأحكام: 13 باب هل يقضي الحاكم أو يفتي وهو غضبان
267. హజ్రత్ అబూ మస్ వూద్ అన్సారీ (రదియల్లాహు అన్హు) కథనం:-
ఒక వ్యక్తి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి వచ్చి “దైవప్రవక్తా! ఒక వ్యక్తి (సామూహిక నమాజులో) సుదీర్ఘ పారాయణం చేస్తుంటాడు. దాని వల్ల నేను ఫజ్ర్ వేళ సామూహిక నమాజులో పాల్గొనలేకపోతున్నాను” అని ఫిర్యాదు చేశాడు. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రజలను సంబోధిస్తూ “జనులారా! మీలో కొందరు ఇతరుల్ని ధర్మం పట్ల వెగటు కలిగించేవారు కూడా ఉన్నారు. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి. మీలో ఇమామత్ (నమాజులో నాయకత్వం) బాధ్యతలు నిర్వహించేవారు నమాజ్ ని క్లుప్తంగా చేయించాలి. ఎందుకంటే ఇమామ్ వెనుక నమాజు చేసేవారిలో వృద్ధులు, బలహీనులు, శ్రమజీవులు కూడా ఉంటారు” అని హితబోధ చేశారు. అప్పుడాయన ఇదివరకెన్నడూ లేనంత ఆగ్రహోదగ్రులయి పోవడం నేను చూశాను.
[సహీహ్ బుఖారీ : 93వ ప్రకరణం – అహ్ కామ్, 13వ అధ్యాయం – హల్ యఖ్ జిల్ హాకమ్ అవ్ యఫ్తీ వహువ గజబాన్)
268 – حديث أَبِي هُرَيْرَةَ، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: إِذَا صَلَّى أَحَدُكُمْ لِلنَّاسِ فَلْيُخَفِّفْ، فَإِنَّ مِنْهُمُ الضَّعِيفَ وَالسَّقِيمَ وَالْكَبِيرَ؛ وَإِذَا صَلَّى أَحَدُكُمْ لِنَفْسِهِ فَلْيُطَوِّلْ مَا شَاءَ
__________
أخرجه البخاري في: 10 كتاب الأذان: 62 باب إذا صلى لنفسه فليطول ما شاء
268. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు :-
“నమాజుకు వచ్చే వారిలో బలహీనులు, వ్యాధిగ్రస్తులు, వృద్ధులు కూడా ఉంటారు. అందువల్ల ఇతరులకు నాయకత్వం వహించి నమాజు చేయించే వ్యక్తి (ఎవరికీ భారం అన్పించకుండా) సంక్షిప్తంగా నమాజు చేయించాలి. అతను ఒంటరిగా నమాజు చేసుకుంటున్నప్పుడు కావాలనుకుంటే ఎంత సుదీర్ఘంగానైనా నమాజు చేసుకోవచ్చు”.
[సహీహ్ బుఖారీ : 10వ ప్రకరణం – అజాన్, 62వ అధ్యాయం – ఇజాసల్లాలినఫ్సిహీ ఫల్ యుతవ్విల్ మాషా]
269 – حديث أَنَسٍ، قَالَ: كَانَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يُوجِزُ الصَّلاَةَ وَيُكْمِلُهَا
__________
أخرجه البخاري في: 10 كتاب الأذان: 64 باب الإيجاز في الصلاة وإكمالها
269. హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సంక్షిప్తంగా నమాజు చేయించేవారు. కాని అన్ని విధాలా ఆ నమాజు సంపూర్ణంగా ఉండేది. [సహీహ్ బుఖారీ : 10వ ప్రకరణం – అజాన్, 64వ అధ్యాయం – అల్ ఏజాజి ఫిస్సలాతి వ ఇక్మాలిహా]
270 – حديث أَنَسِ بْنِ مَالِكٍ، قَالَ: مَا صَلَّيْتُ وَرَاءَ إِمَامٍ قَطُّ أَخَفَّ صَلاَةً وَلاَ أَتَمَّ مِنَ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ؛ وَإِنْ كَانَ لَيَسْمَعُ بُكَاءَ الصَّبِيِّ فيُخَفِّفُ مَخَافَةَ أَنْ تُفْتَنَ أُمُّهُ
__________
أخرجه البخاري في: 10 كتاب الأذان: 65 باب من أخف الصلاة عند بكاء الصبي
270. హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం:-
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఎంతో సంక్షిప్తంగా సంపూర్ణంగా నమాజు చేయించేవారు. ఆ విధంగా మరెవరూ నమాజు చేయించడాన్ని నేను చూడలేదు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఎవరి బిడ్డయినా ఏడుస్తూ ఉండటం వింటే చాలు, ఆ బిడ్డ తల్లి ఎక్కడ కంగారుపడుతుందోనన్న భయంతో వెంటనే నమాజును మరింత సంక్షిప్తం చేసేవారు.
[సహీహ్ బుఖారీ : 10వ ప్రకరణం – అజాన్, 65వ అధ్యాయం – మన అఖఫ్ఫ స్సలాత ఇన్ద బుకాయిస్సబియ్యి ]
271 – حديث أَنَسِ بْنِ مَالِكٍ، أَنَّ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: إِنِّي لأَدْخُلُ فِي الصَّلاةِ وَأَنَا أُرِيدُ إِطَالَتَهَا فَأَسْمَعُ بُكَاءَ الصَّبِيِّ فَأَتَجَوَّزُ فِي صَلاَتِي مِمَّا أَعْلَمُ مِنْ شِدَّةِ وَجْدِ أُمِّهِ مِنْ بُكَائِهِ
__________
أخرجه البخاري في: 10 كتاب الأذان: 65 باب من أخف الصلاة عند بكاء الصبي
271. హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:- “నేను సుదీర్ఘ నమాజు చేయించాలని మొదట అనుకునేవాడ్ని. కాని ఆ తరువాత ఏదయినా బిడ్డ ఏడ్పు వినపడగానే దాన్ని సంక్షిప్తం చేస్తాను. బిడ్డ ఏడ్పు వల్ల ఆ బిడ్డ తల్లి కంగారుపడుతుందని నాకు తెలుసు.” (సహీహ్ బుఖారీ : 10వ ప్రకరణం – అజాన్, 65వ అధ్యాయం – మన అఖఫ్ఫ స్సలాత ఇన్ద బుకాయిస్సబియ్యి]
38వ అధ్యాయం – నమాజులో సంతులనం, సంక్షిప్తం పాటించాలి
اعتدال أركان الصلاة وتخفيفها في تمام
272 – حديث الْبَرَاءِ، قَالَ: كَانَ رُكُوعُ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ وَسُجُودُهُ، وَبَيْنَ السَّجْدَتَيْنِ، وَإِذَا رَفَعَ رَأْسَهُ مِنَ الرُّكُوعِ، مَا خَلاَ الْقِيَامَ وَالقُعُودَ، قَرِيبًا مِنَ السَّوَاءِ
__________
أخرجه البخاري في: 10 كتاب الأذان: 121 باب حدّ إتمام الركوع والاعتدال فيه والطمأنينة
272. హజ్రత్ బరా (రదియల్లాహు అన్హు) కథనం:-
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నమాజులో ఖియాం (నిలబడే పద్ధతి), ఖాయిదా (కూర్చునే పద్ధతి) తప్ప రుకూ (వంగటం), సజ్దా (సాష్టాంగపడటం), రెండు సజ్దాల మధ్య జల్సా (విరామ) స్థితి, రుకూ నుండి లేచి నిలబడే విరామం (ఖౌమా) వంటి అంశాలన్నిటి విషయంలో పాటించే సమయం సమానంగా ఉంటుంది.
[సహీహ్ బుఖారీ : 10వ ప్రకరణం – అజాన్, 121వ అధ్యాయం – హద్ది ఇత్మామి ర్రుకూయి వల్ ఏతెదాల్….]
273 – حديث أَنَسٍ رضي الله عنه قَالَ: إِنِّي لاَ آلُو أَنْ أُصَلِّي بِكُمْ كَمَا رَأَيْتُ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يُصَلِّي بِنَا
قَالَ ثَابِتٌ (راوي هذَا الْحَدِيثِ) كَانَ أَنَسٌ يَصْنَعُ شَيْئًا لَمْ أَرَكُمْ تَصْنَعُونَهُ، كَانَ إِذَا رَفَعَ رَأْسَهُ مِنَ الرُّكُوعِ قَامَ حَتَّى يَقُولَ الْقَائِلُ قَدْ نَسِيَ؛ وَبَيْنَ السَّجْدَتَيْنِ، حَتَّى يَقولَ الْقَائِلُ قَدْ نَسِيَ
__________
أخرجه البخاري في: 10 كتاب الأذان: 140 باب المكث بين السجدتين
273. హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం:-
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మాకు నాయకత్వం వహించి నమాజు చేయించడం నేను చూశాను. అందువల్ల నేను మీకు నాయకత్వం వహించి అలాంటి నమాజునే చేయిస్తాను. అందులో ఎలాంటి కొరతా చేయను.
హదీసు ఉల్లేఖకుడు హజ్రత్ సాబిత్ (రహిమహుల్లాహ్) ఇలా తెలియజేస్తున్నారు:- నమాజులో మీరు చేయనటువంటి ఒక పని హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) చేయడం నేను చూశాను. ఆయన రుకూ నుండి లేచి చాలా సేపు నిల్చుంటారు. చూసేవారికి ఆయన సజ్దా చేయడం మరచిపోయారా అన్పిస్తుంది. అలాగే రెండు సజ్దాల మధ్య విరామ విషయంలో కూడా చూసేవారికి ఆయన రెండవ సజ్దా చేయడం మరచిపోయారా అన్పించేలా సుదీర్ఘ విరామం పాటిస్తారు. .
[సహీహ్ బుఖారీ : 10వ ప్రకరణం – అజాన్, 140 వ అధ్యాయం – అల్ మక్సిబైనస్సజ్దతైన్]
39వ అధ్యాయం – ఇమామ్ కు ముందు ఏ పనీ చేయకూడదు
متابعة الإمام والعمل بعده
274 – حديث الْبَرَاءِ بْنِ عَازِبٍ، قَالَ: كُنَّا نُصَلِّي خَلْفَ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَإِذَا قَالَ: سَمِعَ اللهُ لِمَنْ حَمِدَهُ لَمْ يَحْنِ أَحَدٌ مِنَّا ظَهْرَهُ حَتَّى يَضَعَ النَبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ جَبْهَتَهُ عَلَى الأَرْضِ
__________
أخرجه البخاري في: 10 كتاب الأذان: 133 باب السجود على سبعة أعظم
274. హజ్రత్ బరాబిన్ ఆజిబ్ (రదియల్లాహు అన్హు) కథనం:- మేము దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వెనుక నమాజు చేస్తున్న సమయంలో ఆయన ‘సమిఅల్లాహులిమన్ హమిదః’ అని అన్నప్పుడు, ఆ తరువాత ఆయన తన నుదుటిని నేల మీద ఆనించనంతవరకు మాలో ఏ ఒక్కడూ నడుము వంచే వాడు కాదు (అంటే సజ్దా స్థితిలోకి పోవడానికి ప్రయత్నించేవాడు కాదన్న మాట). [సహీహ్ బుఖారీ : 10వ ప్రకరణం – అజాన్, 133వ అధ్యాయం – అస్సుజూది అలా సబ్ అతి ఆజుం]
42వ అధ్యాయం – రుకూ, సజ్జలలో పఠించవలసిన విషయాలు
ما يقال في الركوع والسجود
275 – حديث عَائِشَةَ، قَالَتْ: كَانَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يُكْثِرُ أَنْ يَقُولَ فِي رُكُوعِهِ وَسُجُودِهِ: سُبْحَانَكَ اللهُمَّ رَبَّنَا وَبِحَمْدِكَ، اللهُمَّ اغْفِرْ لِي يَتَأَوَلُ الْقُرْآنَ
__________
أخرجه البخاري في: 10 كتاب الأذان: 139 باب التسبيح والدعاء في السجود
275. హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం:- దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం)’ రుకూ, సజ్దాలలో సాధారణంగా “సుబ్హానకల్లాహుమ్మ రబ్బనా వబిహమ్ దిక అల్లాహుమ్మగ్ ఫిర్లీ’ అనే మాటలు ఉచ్చరిస్తారు. ఈ విధంగా ఆయన ఖుర్ఆన్ ఆ ప్రకారం ఆచరించేవారు.* (సహీహ్ బుఖారీ : 10వ ప్రకరణం – అజాన్, 139వ అధ్యాయం – అత్తస్బీహి వద్దు ఆఫిస్సుజూద్]
* దివ్యఖుర్ఆన్లో “ఫసబ్బిహ్ బిహమ్ ది రబ్బిక వస్తగ్ ఫిర్హు” (నీ ప్రభువు స్తోత్రంతో పాటు ఆయన పేరును స్మరించు, ఆయన సన్నిధిలో పాప మన్నింపు వేడుకో’) అని ఉంది. (110:3)
44వ అధ్యాయం – సజ్దాలో పాటించవలసిన, పాటించకూడని విషయాలు.
أعضاء السجود والنهي عن كف الشعر والثوب وعقص الرأس في الصلاة
276 – حديث ابْنِ عَبَّاسٍ، قَالَ: أُمِرَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ أَنْ يَسْجُدَ عَلَى سَبْعَةِ أَعْضَاءٍ، وَلاَ يَكُفَّ شَعَرًا وَلاَ ثَوْبًا: الْجَبْهَةِ، وَالْيَدَيْنِ وَالرُّكْبَتَيْنِ وَالرِّجْلَيْنِ
__________
أخرجه البخاري في: 10 كتاب الأذان: 133 باب السجود على سبعة أعظم
276. హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హు) కథనం:- సజ్దా చేస్తున్నప్పుడు ఏడు అవయవాలు నేలమీద ఆనించాలని, శిరోజాలు, వస్త్రాలు దగ్గరికి లాక్కోరాదని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు ఆజ్ఞ అయింది. ఆ ఏడు అవయవాలు ఇవి – (1) నుదురు, (2) రెండు (అర) చేతులు, (3) రెండు మోకాళ్ళు, (4) రెండు కాళ్ళు. [సహీహ్ బుఖారీ : 10వ ప్రకరణం – అజాన్, 133వ అధ్యాయం – అస్సుజాది అలా సబ్ అతి ఆజుం]
46వ అధ్యాయం – సజ్దాలో మధ్యే మార్గం సరైన పద్ధతి
ما يجمع صفة الصلاة وما يفتتح به ويختم به
277 – حديث عَبْدِ اللهِ بْنِ مَالِكِ بْنِ بحَيْنَةَ، أَنَّ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ كَانَ إِذَا صَلَّى فَرَّجَ بَيْنَ يَدَيْهِ حَتَّى يَبْدُوَ بَيَاضُ إِبْطَيْهِ
__________
أخرجه البخاري في: 8 كتاب الصلاة: 27 باب يبدي ضَبْعيه ويجافي في السجود
277. హజ్రత్ అబ్దుల్లా బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సజ్దా స్థితిలో తమ రెండు చేతులు, రెండు ప్రక్కటెముకల మధ్య ఎంత ఎడం ఉంచే వారంటే, ఆ స్థితిలో ఆయన చంకల తెల్లదనం కన్పించేది. (సహీహ్ బుఖారీ : 8వ ప్రకరణం – అస్సలాత్, 27వ అధ్యాయం – యబ్దీ జబ్ ఐహి వయుజాఫీ ఫిస్సు జూద్)
47వ అధ్యాయం – ‘సుత్రా’ ఆవశ్యకత سترة المصلي
278 – حديث ابْنِ عُمَرَ، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ كَانَ إِذَا خَرَجَ يَوْمَ الْعِيدِ أَمَر بِالْحَرْبَةِ فَتُوضَعُ بَيْنَ يَدَيْهِ فَيُصَلي إِلَيْهَا، وَالنَّاسُ وَرَاءَهُ، وَكَانَ يَفْعَلُ ذلِكَ فِي السَّفَرِ، فَمِنْ ثَمَّ اتَّخَذَهَا الأُمَرَاءُ
__________
أخرجه البخاري في: 8 كتاب الصلاة: 90 باب سترة الإمام سترة من خلفه
278. హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం:- పండుగరోజు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నమాజు కోసం (ఊరు) వెలుపలికి వెళ్ళినప్పుడు ఆయన ఆజ్ఞతో ఆయన ముందు ఒక బల్లెం పాతడం జరిగేది. దాని ఆసరాతో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం), నమాజు చేసేవారు. మిగిలిన వారంతా ఆయన వెనుక ఉండేవారు. ప్రయాణావస్థలో కూడా దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలాగే (బల్లెం పాతి దాని ముందు నమాజు) చేసేవారు. ఈ కారణంగానే (ఇతర) నాయకులు (కూడా) .ఇదే పద్ధతి అవలంబించారు.
(సహీహ్ బుఖారీ : 8వ ప్రకరణం – సలాత్, 90వ అధ్యాయం – సుత్రతుల్ ఇమామి సుత్రతు మన్ ఖల్ఫా]
279 – حديث ابْنِ عُمَرَ، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ أَنَّهُ كَانَ يُعَرِّضُ رَاحِلَتَهُ فَيُصَلِّي إِلَيْهَا
__________
أخرجه البخاري في: 8 كتاب الصلاة: 98 باب الصلاة إلى الراحلة والبعير والشجر والرحل
279. హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన ఒంటెను ఎదురుగా కూర్చోబెట్టి దాని ఆసరాతో నమాజు చేసేవారు. (సహీహ్ బుఖారీ : 8వ ప్రకరణం – సలాత్, 98వ అధ్యాయం – అస్సలాతు ఇలర్రాహిలతి వల్ బయీరి వ ష్షజర్ వ ర్రజుల్]
280 – حديث أَبِي جُحَيْفَةَ، أَنَّهُ رَأَى بِلاَلاً يُؤَذِّنُ، فَجَعَلْتُ أَتَتَبَّعُ فَاهُ ههُنَا وَههُنَا بِالأَذانِ
__________
أخرجه البخاري في: 10 كتاب الأذان: 19 باب هل يتتبع المؤذن فاه ههنا وههنا
280. హజ్రత్ అబూ హుజైఫా (రదియల్లాహు అన్హు) కథనం:- నేనొకసారి హజ్రత్ బిలాల్ (రదియల్లాహు అన్హు) అజాన్ చెబుతుంటే విన్నాను. ఆయన అజాన్ చెబుతున్నప్పుడు ముఖాన్ని అటూ ఇటూ తిప్పేవారు. ఆయనతో పాటు నేను కూడా ఆయన ముఖం ఎటు తిప్పితే అటు చూసేవాడ్ని. [సహీహ్ బుఖారీ : 10వ ప్రకరణం – అజాన్, 19వ అధ్యాయం – హల్ యతతబ్బవుల్ ముఅజ్జిను ఫాహుహా హునా వహాహునా]
281 – حديث أَبِي جُحَيْفَةَ، قَالَ: رَأَيْتُ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فِي قُبَّةٍ حَمْرَاءَ مِنْ أَدَمٍ، وَرَأَيْتُ بِلاَلاً أَخَذَ وَضُوءَ رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، وَرَأَيْتُ النَّاسَ يَبْتَدِرُونَ ذَاكَ الْوَضوءَ، فَمَنْ أَصَابَ مِنْهُ شَيْئًا تَمَسَّحَ بِهِ، وَمَنْ لَمْ يُصِبْ مِنْهُ شَيْئًا أَخَذَ مِنْ بَلَلِ يَدِ صَاحِبِه، ثُمَّ رَأَيْتُ بِلاَلاً أَخَذَ عَنَزَةً فَرَكَزَهَا، وَخَرَجَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فِي حُلَّةٍ حَمْرَاءَ مُشَمِّرًا، صَلَّى إِلَى الْعَنَزَةِ بِالنَّاسِ رَكْعَتَيْنِ، وَرَأَيْتُ النَّاسَ وَالدَّوَابَّ يَمُرُّونَ مِنْ بَيْنَ يَدَيِ الْعَنَزَةِ
__________
أخرجه البخاري في: 8 كتاب الصلاة: 17 باب الصلاة في الثوب الأحمر
281. హజ్రత్ అబూ హుజైఫా (రదియల్లాహు అన్హు) కథనం:-
నేనొకసారి (మక్కాలో) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఎర్ర చర్మపు గుడారంలో కూర్చొని ఉండటం చూశాను. అప్పుడు హజ్రత్ బిలాల్ (రదియల్లాహు అన్హు) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వుజూ చేయగా మిగిలిపోయిన నీటిని తీసుకు వచ్చారు. ఆ నీటి కోసం జనం ఎగబడ్డారు. ఎవరికి ఏ కొద్దిపాటి నీరు దొరికినా ఆ నీటిని ముఖం మీద పులుముకునేవారు. ఏ మాత్రం నీళ్ళు దొరకని వాళ్ళు తమ స్నేహితుల తడి చేతుల్ని తీసుకొని ముఖానికి రాసుకునేవారు.
ఆ తరువాత చూస్తే హజ్రత్ బిలాల్ (రదియల్లాహు అన్హు) ఒక ఈటెను నేలమీద పాతారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అరుణ వస్త్రాలు ధరించి, క్రిందికి వ్రేలాడుతున్న అంగవస్త్రాన్ని మడిమల పైకెత్తి పట్టుకొని బయటికి వచ్చారు. అలా వచ్చి ఈటె ముందు నిల్చొని రెండు రకాతులు నమాజు చేయించారు. ఆ తరువాత చూస్తే ఈటె అవతలి వైపు నుండి ప్రజలు, పశువులు నడచిపోవడం కన్పించింది.
(సహీహ్ బుఖారీ : 8వ ప్రకరణం – సలాత్, 17వ అధ్యాయం – అస్సలాతి ఫిస్సౌబిల్ అహ్మర్)
282 – حديث عَبْدِ اللهِ بْنِ عَبَّاسٍ، قَالَ: أَقْبَلْتُ رَاكِبًا عَلَى حِمَارٍ أَتَانٍ، وَأَنَا يَوْمَئِذٍ قَدْ نَاهَزْتُ الاحْتِلاَمَ، وَرَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يُصَلِّي بِمِنَى إِلَى غَيْرِ جِدَارٍ، فَمَرَرْتُ بَيْنَ يَدَيْ بَعْضِ الصَّفِّ، وَأَرْسَلْتُ الأَتَانَ تَرْتَعُ، فَدَخَلْتُ فِي الصَّفِّ، فَلَمْ يُنْكَرْ ذلِكَ عَلَيَ
__________
أخرجه البخاري في: 3 كتاب العلم: 18 باب متى يصح سماع الصغير
282. హజ్రత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఓసారి ‘మినా’ ప్రాంతంలో ఎలాంటి ఆసరా లేకుండానే (ఆరు బయట మైదానంలో) నమాజు చేయసాగారు. నేను గాడిద మీద ముందువైపు నుంచి వచ్చి దిగాను. గాడిదను మేయడానికి వదిలేసి నేను పంక్తి ముందు నుంచి నడచి వెళ్ళి నమాజీల సమూహంలో చేరిపోయాను. అది నేను నవయౌవనంలో అడుగు పెడుతుండిన కాలం. (అయినప్పటికీ) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నేను చేసిన ఈ పనిని విమర్శించలేదు. (సహీహ్ బుఖారీ : 3వ ప్రకరణం – అల్ ఇల్మ్, 18వ అధ్యాయం – మతాయసిహ్హు సిమావుస్సగీర్)
48వ అధ్యాయం – నమాజు చేస్తున్న వారి ముందు నుండి వెళ్ళకూడదు
منع المار بين يدي المصلي
283 – حديث أَبِي سَعِيدٍ الْخُدْرِيِّ قَالَ أَبُو صَالِحِ السَّمَّانُ: رَأَيْتُ أَبَا سَعِيدٍ الخُدْرِيَّ فِي يَوْمِ جُمُعَةٍ يُصَلِّي إِلَى شَيْءٍ يَسْتُرُهُ مِنَ النَّاسِ، فَأَرَادَ شَابٌّ مِنْ بَنِي أَبِي مُعَيْطٍ [ص:101] أَنْ يَجْتَازَ بَيْنَ يَدَيْهِ، فَدَفَعَ أَبُو سَعِيدٍ فِي صَدْرِهِ، فَنَظَرَ الشَّابُ فَلَمْ يَجِدْ مَسَاغًا إِلاَّ بَيْنَ يَدَيْهِ؛ فَعَادَ لِيَجْتَازَ فَدَفَعَهُ أَبُو سَعِيدٍ أَشَدَّ مِنَ الأُولَى فَنَالَ مِنْ أَبِي سَعِيدٍ، ثُمَّ دَخَلَ عَلَى مَرْوَانَ، فَشَكَا إِلَيْهِ مَا لَقِيَ مِنْ أَبِي سَعِيدٍ، وَدَخَلَ أَبُو سَعِيدٍ خَلْفَهُ عَلَى مَرْوَانَ، فَقَالَ: مَا لَكَ وَلاِبْنِ أَخِيكَ يَا أَبَا سَعِيدٍ قَالَ: سَمِعْتُ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ: إِذَا صَلَّى أَحَدُكُمْ إِلَى شَيْءٍ يَسْتُرُهُ مِنَ النَّاسِ فَأَرَادَ أَحَدٌ أَنْ يَجْتَازَ بَيْنَ يَدَيْهِ فَلْيَدْفَعُهُ، فَإِنْ أَبى فَلْيُقَاتِلْهُ فَإِنَّمَا هُوَ شَيْطَانٌ
__________
أخرجه البخاري في: 8 كتاب الصلاة: 100 باب يرد المصلِّي مَن مرَّ بين يديه
283. హజ్రత్ అబూ సాలిహ్ సమ్మాన్ (రహిమహుల్లాహ్) కథనం:- హజ్రత్ అబూ సయీద్ ఖుదరీ (రదియల్లాహు అన్హు) ఓసారి శుక్రవారం నాడు జనావాసానికి దూరంగా వెళ్ళి ఒక వస్తువుని సుత్రాగా చేసుకొని ఒంటరిగా నమాజు చేస్తుంటే నేను చూశాను. అంతలో అబూ ముయీత్ సంతానంలో ఒక యువకుడు ఆయన ముందు నుంచి వెళ్ళడానికి ప్రయత్నించాడు. అయితే హజ్రత్ అబూ సయీద్ (రదియల్లాహు అన్హు) అతని ఛాతీ మీద చేత్తో ఓ దెబ్బ చరిచారు. ఆ యువకుడు (అటూ ఇటూ చూశాడు. కాని హజ్రత్ అబూసయీద్ (రదియల్లాహు అన్హు) ముందు నుంచి వెళ్ళడం తప్ప మరో మార్గం కన్పించకపోవడంతో అతను మరోసారి ఆయన ముందు నుండి వెళ్ళడానికి ప్రయత్నించాడు. అప్పుడు హజ్రత్ అబూ సయీద్ (రదియల్లాహు అన్హు) అతని ఛాతీ మీద అంతకు ముందుకంటే గట్టిగా చరిచి వెనక్కి నెట్టారు. దాంతో ఆ యువకుడు హజ్రత్ అబూ సయీద్ (రదియల్లాహు అన్హు) మీద మండి పడి ఏవేవో కూశాడు.
ఆ తరువాత అతను (మదీనా గవర్నర్) మర్వాన్ దగ్గరికెళ్ళి దీన్ని గురించి ఫిర్యాదు చేశాడు. హజ్రత్ అబూ సయీద్ (రదియల్లాహు అన్హు) కూడా అతని వెనకాలే బయలుదేరి మర్వాన్ దగ్గరకు చేరుకున్నారు. మర్వాన్ ఆయన్ని చూడగానే “మీకూ, మీ సోదరుని కొడుకు మధ్య ఈ గొడవేమిటి?” అని అడిగారు. దానికి హజ్రత్ అబూ సయీద్ (రదియల్లాహు అన్హు) ఇలా సమాధానమిచ్చారు:
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: “ఒక వ్యక్తి ఏదైనా వస్తువుని ఆసరాగా చేసుకొని నమాజు చేస్తున్నప్పుడు ఇతరులెవరైనా అతని ముందు నుంచి వెళ్ళడానికి ప్రయత్నిస్తే అతడ్ని నమాజు చేసే వ్యక్తి (చేత్తో) కొట్టి నెట్టివేయాలి. అయినా అతను తన వైఖరి మార్చుకోకపోతే అతను షైతాన్ అని గ్రహించి అతనితో పోరాడాలి.”
[సహీహ్ బుఖారీ : 8వ ప్రకరణం – సలాత్, 100వ అధ్యాయం – యరద్దుల్ ముసల్లీ మఁ మ్మర్ర బైనయదైహి]
284 – حديث أَبِي جُهَيْمٍ عَنْ بُسْرِ بْنِ سَعِيدٍ، أَنَّ زَيْدَ بْنَ خَالِدٍ أَرْسَلَهُ إِلَى أَبِي جُهَيْمٍ يَسْأَلُهُ مَاذَا سَمِعَ مِنْ رَسُولِ الله صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فِي الْمَارِّ بَيْنَ يَدَيِ الْمُصَلِّي، فَقَالَ أَبُو جُهَيْمٍ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: لَوْ يَعْلَمُ الْمَارُّ بَيْنَ يَدَيِ الْمُصَلِّي مَاذَا عَلَيْهِ مِنَ الإِثْمِ لَكَانَ أَنْ يَقِفَ أَرْبَعِينَ خَيْرًا لَهُ مِنْ أَنْ يَمُرَّ بَيْنَ يَدَيْهِ
__________
أخرجه البخاري في: 8 كتاب الصلاة: 101 باب إثم المارّ بين يدي المصلي
284. హజ్రత్ బసర్ బిన్ సయీద్ (రహిమహుల్లాహ్) కథనం:- జైద్ బిన్ ఖాలిద్ నన్ను హజ్రత్ అబూ జుహైమ్ (రదియల్లాహు అన్హు) దగ్గరకు పంపించి, నమాజీ ముందు నుంచి వెళ్ళే వ్యక్తి గురించి ఆయన దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నోట ఏం విన్నారో తెలుసుకొని రమ్మన్నారు. హజ్రత్ అబూ జుహైమ్ (రదియల్లాహు అన్హు) దగ్గరికి వెళ్తే ఆయన ప్రవక్త ప్రవచనాన్ని ఈ విధంగా తెలిపారు:
“నమాజు చేస్తున్న వ్యక్తి ముందు నుంచి వెళ్తే ఎంత పాపమో తెలిసి ఉంటే, మనిషి అలాంటి చర్యకు పాల్పడడానికి బదులు నలభై (సంవత్సరాలు, నెలలు, రోజుల పాటు – ఉల్లేఖకునికి ఎంత కాలమో సరిగా గుర్తులేదు) వరకు నిలబడి ఉండటం ఎంతో మేలని భావిస్తాడు.”
(సహీహ్ బుఖారీ : 8వ ప్రకరణం – సలాత్, 101 వ అధ్యాయం – ఇస్ముల్ మర్రిబైన యదయిల్ ముసల్లీ)
49వ అధ్యాయం – నమాజీకి, సూత్రా వస్తువుకు మధ్య ఎంత ఎడం ఉండాలి?
دنو المصلي من السترة
285 – حديث سَهْلِ بْنِ سَعْدٍ قَالَ: كَانَ بَيْنَ مُصَلَّي رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ وَبَيْنَ الْجِدَارِ مَمَرُّ الشَّاةِ
__________
أخرجه البخاري في: 8 كتاب الصلاة: 91 باب قدركم ينبغي أن يكون بين المصلِّي والسترة
285. హజ్రత్ సహల్ బిన్ సాద్ (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నమాజు కోసం ఎక్కడ నిల్చుంటారో అక్కడ్నుంచి ఆయన ఎదురుగా ఉండే గోడ (లేక మరేదైనా అడ్డు వస్తువు) వరకు.ఒక మేక దూరగలిగే అంత సందు మాత్రమే ఉంటుంది.
(సహీహ్ బుఖారీ : 8వ ప్రకరణం – సలాత్, 91వ అధ్యాయం – ఖద్రికుమ్ యంబగి అఁయ్యకూన బైనల్ ముసల్లీ : వస్సుత్ర]
286 – حديث سَلَمَةَ، قَالَ: كَانَ جِدَارُ الْمَسْجِدِ عِنْدَ الْمِنْبَرِ مَا كَادَتِ الشَّاةُ تَجُوزُهَا
__________
أخرجه البخاري في: 8 كتاب الصلاة: 91 باب قدركم ينبغي أن يكون بين المصلِّي والسترة
286. హజ్రత్ సల్మా (రదియల్లాహు అన్హు) కథనం:- ప్రవక్త మస్జిదు (ఖిబ్లా వైపున్న) గోడకు వేదిక (మెంబర్) దగ్గరగా ఉంది. (ఆ గోడకు వేదికకు మధ్య) ఒక మేక దూరిపోగల ఖాళీ మాత్రమే ఉంది. (సహీహ్ బుఖారీ : 8వ ప్రకరణం – 91వ అధ్యాయం – ఖద్రికుమ్ యంబగి అఁయ్యకూన బైనల్ ముసల్లీ వస్సుత్రా]
287 – حديث سَلَمَةَ بْنِ الأَكْوَعِ قَالَ يَزِيدُ بْنُ أَبِي عُبَيْدٍ: كُنْتُ آتِي مَعَ سَلَمَةَ بْنِ الأَكْوَعِ فَيُصَلِّي عِنْدَ الأُسْطُوَانَةِ الَّتِي عِنْدَ الْمُصْحَفِ، فَقُلْتُ يَا أَبَا مُسْلِمٍ أَرَاكَ تَتَحَرَّى الصَّلاَةَ عِنْدَ هذِهِ الأُسْطُوَانَةِ قَالَ: فَإِنِّي رَأَيْتُ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَتَحَرَّى الصَّلاَةَ عِنْدهَا
__________
أخرجه البخاري في: 8 كتاب الصلاة: 95 باب الصلاة إلى الأسطوانة
287. హజ్రత్ యజీద్ బిన్ అబూ ఉబైద్ (రహిమహుల్లాహ్ ) కథనం:- నేను (తరచుగా) హజ్రత్ సలమా బిన్ అకూ (రదియల్లాహు అన్హు) వెంట ప్రవక్త మస్జిదుకు వెళ్తుండేవాడ్ని. ఆయన దివ్యఖుర్ఆన్ ఉంచబడిన స్తంభం దగ్గర నమాజు చేసేవారు. నేనొకసారి (అందులో ఉన్న ఆంతర్యం ఏమిటో తెలుసుకోవాలన్న కుతూహలంతో) “అబూ సలీం (రదియల్లాహు అన్హు)! మీరీ స్తంభం దగ్గరే నమాజు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. (కారణం ఏమిటి)?” అని అడిగాను. దానికాయన సమాధానమిస్తూ “దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కూడా ఈ స్తంభం దగ్గరే నమాజు చేయడానికి ప్రయత్నించేవారు” అని అన్నారు.
(సహీహ్ బుఖారీ : 8వ ప్రకరణం – సలాత్, 95వ అధ్యాయం – అస్సలాతు ఇలల్ ఉస్తువానత్]
51వ అధ్యాయం – నమాజు చేసే వ్యక్తి ముందు పడుకోవచ్చు
الاعتراض بين يدي المصلي
288 – حديث عَائِشَةَ، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ كَانَ يُصَلِّي وَهِيَ بَيْنَهُ وَبَيْنَ الْقِبْلَةِ عَلَى فِرَاشِ أَهْلِهِ اعْتِرَاضَ الْجَنَازَةِ
__________
أخرجه البخاري في: 8 كتاب الصلاة: 22 باب الصلاة على الفراش
288. విశ్వాసుల మాతృమూర్తి హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇంట్లో నమాజు చేస్తున్నప్పుడు నేను ఆయన ముందు ఖిబ్లా వైపు శవపేటిక ఉంచబడే తీరులో నేలమీద పడుకుని ఉండేదానిని. (సహీహ్ బుఖారీ : 8వ ప్రకరణం – సలాత్, 22వ అధ్యాయం – అస్సలాతు అలల్ ఫర్ష్)
289 – حديث عَائِشَةَ، قَالَتْ: كَانَ النَبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يُصَلِّي وَأَنَا رَاقِدَةٌ مُعْتَرِضَةٌ عَلَى فِرَاشِهِ، فَإِذَا أَرَادَ أَنْ يُوتِرَ أَيْقَظَنِي فَأَوْتَرْتُ
__________
أخرجه البخاري في: 8 كتاب الصلاة: 103 باب الصلاة خلف النائم
289. హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నమాజు చేస్తున్నప్పుడు నేను ఆయన పడక మీద అడ్డంగా పడి నిద్రపోయేదాన్ని. (కాస్సేపటికి) ఆయన వితర్ నమాజు చేయదలచుకున్నప్పుడు నన్ను నిద్రలేపేవారు. లేచి నేను కూడా వితర్ నమాజు చేసేదాన్ని. (సహీహ్ బుఖారీ : 8వ ప్రకరణం – సలాత్, 103వ అధ్యాయం – అస్సలాతి ఖల్ఫన్నాయిమ్)
290 – حديث عَائِشَةَ عَنْ مَسْرُوقٍ، قَالَ: ذُكِرَ عِنْدَهَا (عَائِشَةَ) مَا يَقْطَعُ الصَّلاَةَ، الْكَلْبُ وَالْحِمَارُ وَالْمَرْأَةُ فَقَالَتْ: شَبَّهْتُمُونَا بالْحُمُر وَالْكِلاَب وَاللهِ لَقَدْ رَأَيْتُ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يُصَلِّي وَإِنِّي عَلَى السَرِيرِ بَيْنَهُ وَبَيْنَ الْقبْلَةِ، مُضْطَجِعَةً، فَتَبْدو لِي الْحَاجَةُ فَأَكْرَهُ أَنْ أَجْلِسَ فأُوذِيَ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَأَنْسَلُّ مِنْ عِنْد رِجْلَيْهِ
__________
أخرجه البخاري في: 8 كتاب الصلاة: 105 باب من قال لا يقطع الصلاة شيء
290. హజ్రత్ మస్రూఖ్ (రహిమహుల్లాహ్) కథనం:- నమాజు చేసే వ్యక్తి ముందు నుంచి కుక్కగాని, గాడిదగాని, స్త్రీగాని వెళ్ళడం జరిగితే అతని నమాజు భంగమయిపోతుంది అనే విషయం హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) ముందు ప్రస్తావించబడింది. హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) ఆ మాట విని “ఏమిటీ, మీరు మమ్మల్ని (స్త్రీలను) కుక్కలు, గాడిదలతో పోల్చుతున్నారా!? వినండి, అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నమాజు చేస్తున్నప్పుడు, నేను ఆయన ముందు ఖిబ్లా వైపు బల్ల మీద పడుకొని ఉండేదాన్ని. తరువాత నాకేదయినా పనిబడితే, నేను లేచి కూర్చొని ఆయనకు బాధ కలిగించడం భావ్యం కాదని తలచి, పడుకున్న స్థితిలోనే మెల్లిగా కాళ్ళవైపు నుంచి జారుకునేదాన్ని.” [సహీహ్ బుఖారీ : 8వ ప్రకరణం – సలాత్, 105వ అధ్యాయం – మనఖాల లా యాఖ్తవు వుస్సలాత షైవున్]
291 – حديث عَائِشَةَ قَالَتْ: أَعَدَلْتُمُونَا بِالْكَلْبِ وَالْحِمَارِ لَقَدْ رَأَيْتُنِي مُضْطَجِعَةً عَلَى السَّرِيرِ فَيَجِيءُ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فَيتَوَسَّطُ السَّرِيرَ، فَيُصَلِّي، فَأَكْرَهُ أَنْ أُسَنِّحَهُ [ص:103] فَأَنْسَلُّ مِنْ قِبَلِ رِجْلِي السَّرِيرِ حَتَّى أنْسَلَّ مِنْ لِحَافِي
__________
أخرجه البخاري في: 8 كتاب الصلاة: 99 باب الصلاة إلى السرير
291. హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం:- మీరు మమ్మల్ని (స్త్రీలను) కుక్కలు, గాడిదలతో కలిపేశారా! కాని (అసలు విషయం వినండి) నేను బల్లమీద పడుకొని ఉన్నప్పుడు, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వచ్చి ఆ బల్ల ముందు నిలబడి నమాజు చేసేవారు. నేనిలా ఆయన కెదురుగా పడుకొని ఉండటం (ఆయన పట్ల) అపచారమని భావించేదాన్ని. అందువల్ల నేను పడుకున్న స్థితిలోనే కాళ్ళ వైపున జరుగుతూ, దుప్పటి నుంచి బయటపడేదాన్ని. (సహీహ్ బుఖారీ : 8వ ప్రకరణం – సలాత్, 99వ అధ్యాయం – అస్సలాతి ఇలస్సరీర్)
292 – حديث عَائِشَةَ زَوْجِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، أَنَّهَا قَالَتْ: كُنْتُ أَنَامُ بَيْنَ يَدَيْ رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ وَرِجْلاَيَ فِي قِبْلَتِهِ، فَإِذَا سَجَدَ غَمَزَنِي فَقَبَضْتُ رِجْلَيَّ، فَإِذَا قَامَ بَسَطْتُهُمَا قَالَتْ: والْبُيُوتُ يَوْمَئِذٍ لَيْسَ فِيهَا مَصَابِيحُ
__________
أخرجه البخاري في: 8 كتاب الصلاة: 104 باب التطوع خلف المرأة
292. హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) (నమాజు చేస్తూ ఉన్నప్పుడు ఆయన) ఎదురుగా నేను పడుకొని ఉండేదాన్ని. అప్పుడు నా కాళ్ళు ఆయన ముందు ఖిబ్లావైపు, ఆయన సజ్దా చేసే చోట ఉండేవి. ఆయన సజ్దా చేయడానికి ఉపక్రమిస్తూ నా కాళ్ళను తాకేవారు. నేనప్పుడు నా కాళ్ళను ముడుచుకునేదాన్ని. ఆయన సజ్జ నుండి లేచి నిలబడగానే నేను యధాప్రకారం కాళ్ళు చాపుకునేదాన్ని. ఆ రోజుల్లో మేము ఇండ్లలో దీపాలు వెలిగించే వాళ్ళము కాము. [సహీహ్ బుఖారీ : 8వ ప్రకరణం – సలాత్, 104 వ అధ్యాయం – అత్తతవ్వూ ఖల్ఫల్ మర్ అతి]
293 – حديث مَيْمُونَةَ قَالَتْ: كَانَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يُصَلِّي وَأَنَا حِذَاءَهُ، وَأَنَا حَائِضٌ، وَرُبَّمَا أَصَابَنِي ثَوْبُهُ إِذَا سَجَدَ
__________
أخرجه البخاري في: 8 كتاب الصلاة: 19 باب إذا أصاب المصلي امرأته إذا سجد
293. విశ్వాసుల మాతృమూర్తి హజ్రత్ మైమూన (రదియల్లాహు అన్హా) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నమాజు చేస్తూ ఉన్నప్పుడు నేను ఆయన ముందు (పడుకొని లేదా కూర్చొని) ఉండేదాన్ని. అప్పుడు నేను ఒక్కోసారి బహిష్టు అయి కూడా ఉండేదాన్ని. అదీగాక దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సజ్దా చేస్తున్నప్పుడు (ఒక్కోసారి) ఆయన దుస్తులు నాకు తగులుతుండేవి కూడా. [సహీహ్ బుఖారీ : 8వ ప్రకరణం – సలాత్, 19వ అధ్యాయం – ఇజా అసాబ సౌబుల్ ముసల్లి అమ్రాతహు)
52వ అధ్యాయం – ఒకే అంగవస్త్రంతో నమాజు చేయడం గురించి
الصلاة في ثوب واحد وصفة لبسه
294 – حديث أَبِي هُرَيْرَةَ، أَنَّ سَائِلاً سَأَلَ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ عَنِ الصَّلاَةِ فِي ثَوبٍ وَاحِدٍ، فَقَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: أَوَلِكُلِّكُمْ ثَوْبَانِ
__________
أخرجه البخاري في: 8 كتاب الصلاة: 4 باب الصلاة في الثوب الواحد ملتحفًا به
294. హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం:- ఒక వ్యక్తి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)తో మాట్లాడుతూ “ఒక బట్ట మాత్రమే కట్టుకొని నమాజు చేయవచ్చా?” అని అడిగాడు. దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “మరి మీలో ప్రతి ఒక్కరి దగ్గర రెండేసి బట్టలు ఉన్నాయా?” అని అన్నారు.*
[సహీహ్ బుఖారీ : 8వ ప్రకరణం – సలాత్, 4వ అధ్యాయం – అస్సలాతి ఫిస్సౌబిల్ వాహిది ముల్త హిఫా]
* ఆనాడు అనేక మంది సహాబీల దగ్గర ఒక కట్టు వస్త్రం మాత్రమే ఉండేది. అందువల్ల ఒక వస్త్రం కట్టుకున్నా నమాజు నెరవేరుతుందని అనుమతి లభించింది. కనుక ఈ సమస్య పై ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవు. దీంతో విభేదిస్తూ హజ్రత్ అబ్దుల్లా బిన్ మసూద్ (రదియల్లాహు అన్హు) నుండి ఉల్లేఖించబడినట్లు ఉన్న హదీసుకు సరైన ఆధారం లేదు. అయితే రెండు వస్త్రాలు కట్టుకొని నమాజు చేయడం చాలా మంచిది అనే విషయంలో ఏకాభిప్రాయం ఉంది.
295 – حديث أَبِي هُرَيْرَةَ، قَالَ: قَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: لاَ يُصَلِّي أَحَدُكُمْ فِي الثَّوْبِ الْوَاحِدِ لَيْسَ عَلَى عَاتِقَيْهِ شَيْءٌ
__________
أخرجه البخاري في: 8 كتاب الصلاة: 5 باب إذا صلى في الثوب الواحد فليجعل على عاتقيه
295. హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:- “ఒక్క బట్ట మాత్రమే ఉండి దాంతో నమాజు చేయదలచిన వ్యక్తి భుజమ్మీద (కాస్తయినా) ఆచ్ఛాదన లేకుండా నమాజు చేయకూడదు.” * (సహీహ్ బుఖారీ : 8వ ప్రకరణం – సలాత్, 5వ అధ్యాయం – ఇజాసల్లా ఫిస్సౌబిల్ వాహిది ఫల్ యజ్ అల్ అలా ఆతి ఖైహి)
* భుజం మీద బట్టలేకపోతే ‘సతర్’ భాగం బయటపడే ప్రమాదం ఉంది. ఇమామ్ అబూ హనీఫా, ఇమామ్ షాఫయి, ఇమామ్ మాలిక్ (రహిమహుముల్లాహ్)ల ప్రకారం భుజం మీద వస్త్రం లేకుండా నమాజు చేస్తే ఆ నమాజ్ మక్రూహ్ (అవాంఛనీయం) అవుతుంది. బాతిల్ కాదు (అంటే చెడిపోదు). ఇమామ్ అహ్మద్ (రహిమహుల్లాహ్) ప్రకారం అవకాశం ఉన్నప్పటికీ భుజం మీద వస్త్రం లేకుండా నమాజు చేస్తే అది సరికాదు. నమాజు విధి నెరవేరుతుంది గాని, అలా చేయడం పాపమవుతుందని ఆయన ఒక సందర్భంలో అన్నారు.
296 – حديث عُمَرَ بْنِ أَبِي سَلَمَةَ، قَالَ: رَأَيْتُ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يُصَلِّي فِي ثَوْبٍ وَاحِدٍ مُشْتَمِلاً بِهِ، فِي بَيْتِ أُمِّ سَلَمَةَ، وَاضِعًا طَرَفَيْهِ عَلَى عَاتِقَيْهِ
__________
أخرجه البخاري في: 8 كتاب الصلاة: 4 باب الصلاة في الثوب الواحد ملتحفًا به
296. హజ్రత్ ఉమర్ బిన్ అబూసల్మా (రదియల్లాహు అన్హు) కథనం:- నేనొక సారి విశ్వాసుల మాతృమూర్తి హజ్రత్ ఉమ్మె సల్మా (రదియల్లాహు అన్హా) గారి ఇంట్లో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒక వస్త్రం మాత్రమే కట్టుకొని నమాజు చేస్తూ ఉంటే చూశాను. అప్పుడు ఆ వస్త్రం చెరుగులు రెండూ ఆయన భుజమ్మీద (కట్టబడి) ఉన్నాయి. [సహీహ్ బుఖారీ : 8వ ప్రకరణం – సలాత్, 4వ అధ్యాయం – అస్సలాతి ఫిస్సౌబిల్ వాహిది ముల్త హిఫా]
297 – حديث جَابِرِ بْنِ عَبْدِ اللهِ قَالَ مُحَمَّدُ بْنُ الْمُنْكَدِرِ: رَأَيْتُ جَابِرَ بْنَ عَبْدِ اللهِ يُصَلِّي فِي ثَوْبٍ وَاحِدٍ، وَقَالَ رَأَيْتُ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يُصَلِّي فِي ثَوْبٍ
__________
أخرجه البخاري في: 8 كتاب الصلاة: 3 باب عقد الإزار على القفا في الصلاة
297. హజ్రత్ ముహమ్మద్ బిన్ మున్కదిర్ (రహిమహుల్లాహ్) కథనం:- నేనొకసారి హజ్రత్ జాబిర్ బిన్ అబ్దుల్లా (రదియల్లాహు అన్హు) ఒక్క బట్ట మాత్రమే ధరించి నమాజు చేస్తూ వుంటే చూశాను. ఆ తరువాత ఆయన మాట్లాడుతూ “దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కూడ (ఇలా) ఒక్క అంగవస్త్రంతో నమాజు చేస్తుండగా నేను చూశాను” అని అన్నారు. [సహీహ్ బుఖారీ : 8వ ప్రకరణం • సలాత్, 3వ అధ్యాయం – అఖిల్ ఇజారి అలల్ ఖఫాఫిస్సలాత్)
మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్) (Al-Lulu-wal-Marjaan) .