1.11 ఈద్ (పండుగ) నమాజ్ ప్రకరణం | మహా ప్రవక్త మహితోక్తులు

మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్) (Al-Lulu-wal-Marjaan) .  

505 – حديث ابْنِ عَبَّاسٍ قَالَ: شَهِدْتُ الْفِطْرَ مَعَ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ وَأَبِي بَكْرٍ وَعُمَرَ وَعُثْمَانَ يُصَلُّونَهَا قَبْلَ الْخُطْبَةِ، ثَمَّ يُخْطَبُ بَعْد

خَرَجَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ كَأَنِّي أَنْظُرُ إِلَيْهِ حينَ يُجْلِسُ بِيَدِهِ، ثُمَّ أَقْبَلَ يَشُقُّهُمْ، حَتَّى جَاءَ النِّسَاءَ، مَعَهُ بِلاَلٌ فَقَالَ: (يَأَيُّهَا النَّبيُّ إِذَا جَاءَكَ الْمُؤمِنَاتُ يُبَايِعْنَكَ) الآيَةَ ثُمَّ قَالَ حينَ فَرَغَ مِنْهَا: آنْتُنَّ عَلَى ذلِكِ فَقَالَتِ امْرَأَةٌ وَاحِدَةٌ مِنْهُنَّ، لَمْ يُجِبْهُ غَيْرُهَا: نَعَمْ قَالَ: فَتَصَدَّقْنَ فَبَسَطَ بِلاَلٌ ثَوْبَهُ، ثُمَّ قَالَ: هَلُمَّ لَكُنَّ فِدَاءً أَبِي وَأُمِّي فَيُلْقِينَ الْفَتَخَ وَالْخَوَاتِيمَ فِي ثَوْبِ بِلاَلٍ
__________
أخرجه البخاري في: 13 كتاب العيدين: 19 باب موعظة الإمام النساء يوم العيد

505. హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హు) కథనం:-

నేను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)తో కలసి ఈదుల్ ఫిత్ర్ నమాజు చేశాను. అలాగే శ్రేష్ఠ ఖలీఫాలయిన అబూబక్ర్ (రదియల్లాహు అన్హు), ఉమర్ (రదియల్లాహు అన్హు), ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) గార్లతో కలసి కూడా ఈదుల్ ఫిత్ర్ నమాజు చేశాను. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం), శ్రేష్ఠ ఖలీఫాలు కూడా మొదట నమాజు చేసి ఆ తరువాత ఖుత్బా (ఉపన్యాసం) ఇచ్చేవారు. ఆనాడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) (ఉపన్యాస వేదిక నుంచి) క్రిందికి దిగి, ప్రజలను కూర్చోమని చేత్తో సైగ చేస్తూ (పురుషుల) పంక్తులను చీల్చుకుంటూ స్త్రీల పంక్తుల సమీపానికి చేరుకున్న దృశ్యం ఇప్పటికీ నా కళ్ళ ముందు మెదలుతోంది. ఆ సమయంలో హజ్రత్ బిలాల్ (రదియల్లాహు అన్హు) కూడా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వెంట ఉన్నారు.

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “యా హయ్యుహన్నబియ్యు ఇజా జా అకల్ మూమినాతు యుబాయీనక అలా అల్లా యుష్రిక్ న” (ప్రవక్తా! విశ్వసించిన స్త్రీలు నీ దగ్గరికి వచ్చి తాము అల్లాహ్ కు (ఆయన దైవత్వంలో) మరెవరినీ సాటి కల్పించబోమని, దొంగతనం చేయబోమని, వ్యభిచారానికి పాల్పడబోమని, తమ సంతనాన్ని హతమార్చము అనీ, అక్రమ సంబంధాలను గురించిన అపనిందలు సృష్టించమని, మంచి విషయాల్లో నీకు అవిధేయత చూపమని ప్రమాణం చేస్తే, వారి చేత ప్రమాణం చేయించు. వారి పాప మన్నింపు కోసం అల్లాహ్ ను ప్రార్థించు. అల్లాహ్ తప్పకుండా క్షమించేవాడు, కరుణించేవాడు.) ( ఖుర్ఆన్ : 60-12) అనే సూక్తి పఠించారు.

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ సూక్తి పఠించిన తరువాత “మీరీ విషయాలను గురించి నా ముందు ప్రమాణం చేస్తారా?” అని మహిళల్ని ప్రశ్నించారు. అప్పుడు వారిలో ఒక స్త్రీ మాత్రమే చేస్తానని సమాధానమిచ్చింది. మిగిలిన వారంతా ఎలాంటి సమాధానం ఇవ్వకుండా ఉండిపోయారు. “సరే మీరు సదఖా (విరాళాలు) ఇవ్వండి” అన్నారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం). హజ్రత్ బిలాల్ (రదియల్లాహు అన్హు) తన కండువా తీసి క్రింద పరుస్తూ “నా తల్లిదండ్రుల్ని మీ కోసం సమర్పింతు” అని అన్నారు. అప్పుడు స్త్రీలు తమ ఉంగరాలు, మెట్టెలు తీసి ఆ వస్త్రంలో వేయనారంభించారు.

సహీహ్ బుఖారీ: 13వ ప్రకరణం – ఈదైన్, 19వ అధ్యాయం – మౌయిజతిల్ ఇమామిన్నిసా (యౌముల్ ఈద్)

506 – حديث جَابِرِ بْنِ عَبْدِ اللهِ، قَالَ: قَامَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَوْمَ الْفِطْرِ فَصَلَّى، فَبَدَأَ بِالصَّلاَةِ، ثُمَّ خَطَبَ، فَلَمَّا فَرَغَ نَزَلَ فَأَتَى النِّسَاءَ فَذَكَّرَهُنَّ، وَهُوَ يَتَوَكَّأُ عَلَى يَدِ بِلاَلٍ، وَبِلاَلٌ بَاسِطٌ ثَوْبَهُ، يُلْقِي فِيهِ النِّسَاءُ الصَّدَقَةَ
__________
أخرجه البخاري في: 13 كتاب العيدين: 19 موعظة الإمام النساء يوم العيد

506. హజ్రత్ జాబిర్ బిన్ అబ్దుల్లా (రదియల్లాహు అన్హు) కథనం:-

ఈదుల్ ఫిత్ర్ రోజు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నిలబడి మొదట నమాజు చేయించారు. ఆ తరువాత ఖుత్బా (ఉపన్యాసం) ఇచ్చారు. ఉపన్యాసం ముగిసిన తరువాత వేదిక దిగి స్త్రీల దగ్గరికి వెళ్ళి వారికి ధర్మబోధన చేశారు. అప్పుడు ఆయన హజ్రత్ బిలాల్ (రదియల్లాహు అన్హు) చేతిని ఊతగా చేసుకుని నిల్చున్నారు. తరువాత హజ్రత్ బిలాల్ (రదియల్లాహు అన్హు) వస్త్రం తీసి క్రింద పరిచారు. అందులో స్త్రీలు తమ తమ విరాళాలు (సదఖాలు) వేస్తూపోయారు.

(సహీహ్ బుఖారీ : 13వ ప్రకరణం – ఈదైన్, 19వ అధ్యాయం – మౌయిజతిల్ ఇమామిన్నిసా యౌముల్ ఈద్)

507 – حديث ابْنِ عَبَّاسٍ وَجَابِرِ بْنِ عَبْدِ اللهِ قَالاَ: لَمْ يَكُنْ يُؤَذَّنُ يَوْمَ الْفِطْرِ وَلاَ يَوْمَ الأَضْحَى
__________
أخرجه البخاري في: 13 كتاب العيدين: 7 باب المشي والركوب إلى العيد، والصلاة قبل الخطبة بغير أذان ولا إقامة

507. హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హు), హజ్రత్ జాబిర్ బిన్ అబ్దుల్లా (రదియల్లాహు అన్హు)ల కథనం:- ఈదుల్ ఫిత్ర్, ఈదుల్ అజ్హా రెండు పండుగల నమాజు కోసం (ప్రవక్త కాలంలో) అజాన్ ఇవ్వడం జరిగేది కాదు. [సహీహ్ బుఖారీ : 13వ ప్రకరణం – ఈదైన్, 7వ అధ్యాయం – అల్ మషి వర్రుకూ బి ఇలల్ ఈద్ …….. బిగైరి అజాన్]

508 – حديث ابْنِ عَبَّاسٍ، أَنَّهُ أَرْسَلَ إِلَى ابْنِ الزُّبَيْرِ فِي أَوَّلِ مَا بُويِعَ لَهُ، إِنَّهُ لَمْ يَكُنْ يُؤَذَّنُ بِالصَّلاَةِ يَوْمَ الْفِطْرِ، وَإِنَّمَا الْخُطْبَةُ بَعْدَ الصَّلاَةِ
__________
أخرجه البخاري في: 13 كتاب العيدين: 7 باب المشي والركوب إلى العيد، والصلاة قبل الخطبة بغير أذان ولا إقامة

508. హజ్రత్ అబ్దుల్లా బిన్ జుబైర్ (రదియల్లాహు అన్హు) గారి ఖిలాఫత్ (పాలనా) ప్రారంభ రోజుల్లో హజ్రత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ఆయనకు ఒక సమాచారం పంపుతూ “(దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కాలంలో) ఈదుల్ ఫిత్ర్ నమాజు కోసం అజాన్ ఇచ్చేవారు కాదు. అదీగాక ఈద్ ఖుత్బా (ఉపన్యాసం) నమాజు తరువాత ఇచ్చేవారు” అని తెలియచేశారు.” (సహీహ్ బుఖారీ : 13వ ప్రకరణం – ఈదైన్, 7వ అధ్యాయం – అల్ మషి వర్రుకూబి ఇలల్ ఈద్….]

509 – حديث ابْنِ عُمَرَ: قَالَ: كَانَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، وَأَبُو بَكْرٍ وَعُمَرَ، يُصَلُّونَ الْعِيدَيْنِ قَبْلَ الْخُطْبَةِ
__________
أخرجه البخاري في: 13 كتاب العيدين: 8 باب الخطبة بعد العيد

509. హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం :- దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం), హజ్రత్ అబూబకర్ (రదియల్లాహు అన్హు), హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు)లు ఇద్దరూ, పండుగల నమాజును ఖుత్బా (ఉపన్యాసం)కు ముందే చేసేవారు. [సహీహ్ బుఖారీ : 13వ ప్రకరణం – ఈదైన్, 8వ అధ్యాయం – అల్ ఖుత్బ బాదల్ ఈద్]

510 – حديث أَبِي سَعِيدٍ الْخُدْرِيِّ، قَالَ: كَانَ رَسُول اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَخْرُجُ يَوْمَ الْفِطْرِ وَالأَضْحَى إِلَى الْمُصَلَّى، فَأَوَّلُ شَيْءٍ يَبْدأُ بِهِ الصَّلاَةُ، ثُمَّ يَنْصَرِفُ فَيَقُومُ مُقَابِلَ النَّاسِ، وَالنَّاسُ جُلُوسٌ عَلَى صُفُوفِهِمْ، فَيَعِظُهُمْ وَيُوصِيهِمْ وَيَأْمُرُهُمْ، فَإِنْ كَانَ يُريدُ أَنْ يَقْطَعَ بَعْثًا، قَطَعَهُ؛ أَوْ يَأْمُرَ بِشَيْءٍ، أَمَرَ بِهِ؛ ثُمَّ يَنْصَرِف
قَالَ أَبُو سَعِيدٍ: فَلَمْ يَزَلِ النَّاسُ عَلَى ذلِكَ حَتَّى خَرَجْتُ مَعَ مَرْوَانَ، وَهُوَ أَميرُ الْمَديِنةِ، فِي أَضْحًى أَوْ فِطْرٍ، فَلَمَّا أَتَيْنَا الْمُصَلَّى إِذَا مِنْبَرٌ بَنَاهُ كَثيرُ بْنُ الصَّلْتِ، فَإِذَا مَرْوَانُ يُريدُ أَنْ يَرْتَقِيَهُ قَبْلَ أَنْ يُصَلِّيَ، فَجَبَذْتُ بِثَوْبِهِ، فَجَبَذَنِي، فَارْتَفَعَ فَخَطَبَ قَبْلَ الصَّلاَةِ؛ فَقُلْتُ لَهُ: غَيَّرْتُمْ وَاللهِ فَقَالَ: أَبَا سَعِيدٍ قَدْ ذَهَبَ مَا تَعْلَمُ؛ فَقُلْتُ: مَا أَعْلَمُ، وَاللهِ خَيْرٌ مِمَّا لاَ أَعْلَمُ، فَقَالَ: إِنَّ النَّاسَ لَمْ يَكُونُوا يَجْلِسُونَ لَنَا بَعْدَ الصَّلاَةِ فَجَعَلْتُهَا قَبْلَ الصَّلاَةِ
__________
أخرجه البخاري في: 13 كتاب العيدين: 6 باب الخروج إلى المصلى بغير منبر

510. హజ్రత్ అబూ సయీద్ ఖుదరీ (రదియల్లాహు అన్హు) కథనం:-

ఈదుల్ ఫిత్ర్, ఈదుల్ అజ్హా దినాల్లో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈద్గాకు వెళ్ళి ముందుగా నమాజు చేయించేవారు. ఆ తరువాత నమాజు ముగించగానే బారులు తీరి తమ తమ స్థానాల్లో కూర్చొని ఉన్న ప్రజల ముందు నిలబడి వారికి ధర్మబోధ చేస్తూ మంచి విషయాలను గురించి ఆజ్ఞాపించేవారు. (ఆ సమయంలో) సైన్యాన్ని ఎక్కడికైనా పంపవలసి ఉంటే ఆ ఏర్పాటు చేసేవారు లేదా ఏదైనా ఆజ్ఞ జారీ చేయవలసి ఉంటే ఆ ఆజ్ఞ జారీ చేసేవారు. ఆ తర్వాత తిరిగి (తమ స్థానానికి) వచ్చేవారు.

చాలా కాలం వరకు ప్రజలు ఈ పద్ధతినే అనుసరిస్తూ ఉండేవారు. అయితే మర్వాన్ మదీనా పాలకుడిగా నియమించబడిన తరువాత ఈదుల్ ఫిత్ర్ లేక ఈదుల్ అజ్హా వస్తే నేను మర్వాన్ తో కలసి నమాజు కోసం ఈద్గాహ్ వెళ్ళాను. అక్కడ చూస్తే కసీర్ బిన్ సల్త్ ఒక వేదిక ఏర్పాటు చేసి ఉంచాడు. మర్వాన్ నమాజుకు ముందుగానే (ఉపన్యాసం ఇవ్వడానికి) ఆ వేదిక ఎక్కడానికి ఉపక్రమించారు. నేను (వెంటనే) అతని అంగవస్త్రం పట్టుకొని లాగాను. కాని అతను తన వస్త్రం నా నుండి విడిపించుకొని వేదిక ఎక్కి నమాజుకు పూర్వమే ఉపన్యాసం ఇచ్చాడు. నేను అతడ్ని విమర్శిస్తూ “మీరు ప్రవక్త సంప్రదాయాన్ని మార్చి వేశారు” అని అన్నాను. దానికతను “అబూ సయీద్! నీవు ఎరిగిన కాలం ఇప్పుడు మారిపోయింది” అన్నారు. “అయ్యో దైవమా! నేను ఎరగని దానికంటే ఎరిగిన విషయం ఎంతో శ్రేష్ఠమైనది” అన్నా నేను. అప్పుడు మర్వాన్ అసలు విషయం చెబుతూ “నమాజు అయిన తరువాత జనం మా మాటలు వినడానికి అట్టే ఇక్కడ కూర్చోరు. అందుచేత మేము నమాజుకు ముందే ఉపన్యాసం మొదలెట్టాము” అని అన్నారు.

(సహీహ్ బుఖారీ : 13వ ప్రకరణం – ఈదైన్, 6వ అధ్యాయం – అల్ ఖురూజ్ ఇలల్ ముసల్లా బిగైరి మింబర్)

511 – حديث أُمِّ عَطِيَّةَ قَالَتْ: أُمِرْنَا أَنْ نُخْرِجَ الْحُيَّضَ، يَوْمَ الْعِيدَيْنِ، وَذَوَاتِ الْخُدُورِ، فَيَشْهَدْنَ جَمَاعَةَ الْمُسْلِمِينَ وَدَعْوَتَهُمْ، وَيَعْتَزِلُ الحُيَّضُ عَنْ مُصَلاَّهُن
قَالَتِ امْرَأَةٌ: يَا رَسُولَ اللهِ إِحْدَانَا لَيْسَ لَهَا جِلْبَابٌ، قَالَ: لِتُلْبِسْهَا صَاحِبَتُهَا مِنْ جِلْبَابِهَا
__________
أخرجه البخاري في: 8 كتاب الصلاة: 2 باب وجوب الصلاة في الثياب

511. హజ్రత్ ఉమ్మె అతియా (రదియల్లాహు అన్హా) కథనం:-

రెండు పండుగల సందర్భాల్లోనూ బహిష్టు స్త్రీలు, పరదా మహిళలు ఈద్గాహ్ కు వెళ్ళి ముస్లిం పురుషులతో పాటు దుఆ (వేడుకోలు)లో పాల్గొనాలని మాకు ఆజ్ఞ ఇవ్వబడింది. అయితే బహిష్టు స్త్రీలు మాత్రం నమాజు చేసే చోటు నుంచి కొంచెం దూరంగా జరిగి కూర్చోవాలని ఆదేశించారు. (ఒకసారి) ఓ స్త్రీ “దైవప్రవక్తా! ఎవరి దగ్గరైనా దుప్పటి (బురఖా) లేకపోతే ఆమె ఈద్గాహ్ కు ఎలా వెళ్తుంది?” అని అడిగింది. దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “ఆమె స్నేహితురాలు తన దగ్గరున్న దుప్పట్లలో ఒకటి ఆమెకు ఇవ్వాలి” అని అన్నారు.

[సహీహ్ బుఖారీ : 8వ ప్రకరణం – సలాత్, 2వ అధ్యాయం – వజూబిస్సలాతి ఫిస్సియాబ్)

512 – حديث عَائِشَةَ قَالَتْ: دَخَلَ أَبُو بَكْرٍ، وَعِنْدَي جَارِيَتَانِ مِنْ جَوَارِي الأَنْصَارِ، تُغَنِّيَانِ بِمَا تَقَاوَلَتِ الأَنْصَارُ يَوْمَ بُعَاثَ قَالَتْ: وَلَيْسَتَا بِمُغَنِّيَتَيْن
فَقَالَ أَبُو بَكْرٍ: أَمَزَاميرُ الشَّيْطَانِ فِي بَيْتِ رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ وَذلِكَ فِي يَوْمِ عيدٍ، فَقَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: يَا أَبَا بَكْرٍ إِنَّ لِكُلِّ قَوْمٍ عيدًا وَهذَا عيدُنَا
__________
أخرجه البخاري في: 13 كتاب العيدين: 3 باب سنة العيدين لأهل الإسلام

512. హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం:-

ఓ సారి పండుగ రోజు మా ఇంట్లో ఇద్దరు అన్సార్ బాలికలు బాస్ యుద్ధం గురించి అన్సార్లు రచించిన ఒక గేయాన్ని పాడసాగారు. (అంతలో మా నాన్నగారు) హజ్రత్ అబూబకర్ (రదియల్లాహు అన్హు) వచ్చి “ఏమిటిది, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇంట్లో ఈ పైశాచికపు పాటలు?” అని అరిచారు. దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ మాటలు విని “అబూబకర్! ప్రతిజాతీ పండుగ జరుపుకుంటుంది. ఈ రోజు మన పండుగ (ఇలా సంతోషంగా పాడుకోవడంలో తప్పులేదు)” అని అన్నారు. *

[సహీహ్ బుఖారీ : 13వ ప్రకరణం – ఈదైన్, 3వ అధ్యాయం – సున్నతిల్ ఈధైని లి అహ్ లిల్ ఇస్లాం]

* పండుగరోజు ఆనందోత్సవాలు జరుపుకోవడం మంచి విషయమేనని ఈ హదీసు భావం. బాలికలు సంతోషంతో పాటలు పాడటాన్ని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వ్యతిరేకించలేదు; పైగా సమర్థించారు. అందువల్ల కొందరు ధర్మవేత్తలు ఈ హదీసుని ఆధారంగా చేసుకొని పండుగ రోజు యువతులు పాటలు పాడటం, వాటిని ఇతరులు వినడం దర్మసమ్మతమేనని, అయితే ఆ పాటలు చెడుకు దారి తీసేవిగా ఉండరాదని అన్నారు.

513 – حديث عَائِشَةَ قَالَتْ: دَخَلَ عَلَيَّ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، وَعِنْدِي جَارِيَتَانِ تُغَنِّيَانِ بِغِنَاءِ بُعَاثَ، فَاضْطَجَعَ عَلَى الْفِرَاشِ وَحَوَّلَ وَجْهَهُ، وَدَخَلَ أَبُو بَكْرٍ، فَانْتَهَرَني، وَقَالَ: مِزْمَارَةُ الشَّيْطَانِ عِنْدَ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَأَقْبَلَ عَلَيْهِ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَقَالَ: دَعْهُمَا فَلَمَّا غَفَلَ غَمَزْتُهُمَا فَخَرَجَتَاوَكَانَ يَوْمَ عيدٍ يَلْعَبُ فِيهِ السُّودَانُ بِالدَّرَقِ وَالْحِرَابِ، فَإِمَّا سَأَلْتُ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، وَإِمَّا قَالَ: تَشْتَهِينَ تَنْظُرِينَ فَقُلْتُ: نَعَمْ فَأَقَامَنِي وَرَاءَهُ، خَدِّي عَلَى خَدِّهِ، وَهُوَ يَقُولُ: دُونَكُمْ يَا بَنِي أَرْفِدَةَ حَتَّى إِذَا مَلِلْتُ قَالَ: حَسْبُكِ قُلْتُ: نَعَمْ قَالَ: فَاذْهَبِي
__________
أخرجه البخاري في: 13 كتاب العيدين: 2 باب الحراب والدرق يوم العيد

513. హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం:-

మా ఇంట్లో ఇద్దరు బాలికలు బాస్ యుద్ద గాధ గురించిన ఒక పాట పాడుతుంటే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇంటికి తిరిగొచ్చారు. ఆయన వచ్చి పడక మీద మేను వాల్చి ముఖం అటువైపుకు తిప్పుకుని పడుకున్నారు. కాస్సేపటికి మా నాన్న హజ్రత్ అబూబకర్ (రదియల్లాహు అన్హు) కూడా వచ్చారు. ఆయన వచ్చీరాగానే నా మీద మండిపడుతూ “ఏమిటీ ఈ పైశాచికపు పాటలు?” అందులోనూ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ముందా?” అని అరిచారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ మాటలు విని హజ్రత్ అబూబకర్ (రదియల్లాహు అన్హు) వైపు తిరిగి “అబూబకర్! వాళ్ళను ఏమీ అనకండి” అన్నారు. తరువాత ఆయనపై (వహీ) సూచనగా మైకం కమ్ముకున్నది. నేను వెంటనే ఆ బాలికలను బయటికి వెళ్ళిపొమ్మని సైగ చేశాను. వారు వెళ్ళిపోయారు.

అది పండుగ రోజు, ఆ సందర్భంలోనే కొందరు నీగ్రోలు డాలు, ఈటెలతో తమ ప్రతిభా విశేషాలను ప్రదర్శించసాగారు. నేను కోరానో లేక స్వయంగా దైవప్రవక్త అడిగారో గుర్తు లేదుగాని, “నువ్వు చూడాలనుకుంటున్నావా (ఆ విన్యాసం)” అని అంటే నేను ‘ఔను’ అన్నాను. అప్పుడు ఆయన నన్ను తన వెనుక నిలబెట్టుకున్నారు! నా చెంప ఆయన చెంపకు ఆని ఉండేలా. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆ నీగ్రోలను ఉత్సాహపరుస్తూ “అర్ ఫిదా ముద్దు బిడ్డలారా! ఆడండి, ఇంకా ఆడండి” అని చెబుతుండేవారు. చివరికి నేను అలసిపోయాను. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నా పరిస్థితి గమనించి “ఏమిటీ ఇక చాలా?” అని అడిగారు. నేను ‘ఊఁ’ అన్నాను. “అయితే ఇక (లోపలికి) వెళ్ళిపో” అన్నారు ఆయన.

(సహీహ్ బుఖారీ : 13వ ప్రకరణం – ఈదైన్, 2వ అధ్యాయం – అల్ హిరాబి వద్దర్ఖి యౌముల్ ఈద్)

514 – حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه قَالَ: بَيْنَا الْحَبَشَةُ يَلْعَبُونَ عِنْدَ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ بِحِرَابِهِمْ، دَخَلَ عُمَرُ فَأَهْوَى إِلَى الْحَصَى فَحَصَبَهُمْ بِهَا، فَقَالَ: دَعْهُمْ يَا عُمَرُ
__________
أخرجه البخاري في: 56 كتاب الجهاد والسير: 79 باب اللهو بالحراب ونحوها

514. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం:-

కొందరు నీగ్రోలు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) (ఇంటి) సమీపంలో బరిసెలతో తమ ప్రతిభా విశేషాలను ప్రదర్శించసాగారు. అదే సమయంలో హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) అటు వైపు వచ్చారు. ఆయన వచ్చీరాగానే (మండిపడుతూ) ఆ నీగ్రోలను కొట్టేందుకు కంకర్రాళ్ళ కోసం క్రిందకి వంగారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆయన వాలకం చూసి “ఉమర్! వాళ్ళను ఏమీ అనకు, వాళ్ళు చేస్తున్న దాన్ని చేయని” అని అన్నారు.

[సహీహ్ బుఖారీ : 56వ ప్రకరణం – అల్ జిహాద్ వస్సైర్, 79వ అధ్యాయం – అల్లహూ బిల్ హరాబి వ నహూహ)