2.16 – ఘనతా విశిష్టతల ప్రకరణం – మహా ప్రవక్త మహితోక్తులు

మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్) (Al-Lulu-wal-Marjaan) .  

1468 – حديث أَنسِ بْنِ مَالِكٍ، قَالَ: رَأَيْتُ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، وَحَانَتْ صَلاَة الْعَصْرِ، فَالْتَمَسَ النَّاسُ الْوَضُوءَ، فَلَمْ يَجِدُوهُ، فَأُتِيَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ بِوَضُوءٍ، فَوَضَعَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فِي ذلِكَ الإِنَاءِ يَدَهُ، وَأَمَرَ النَّاسَ أَنْ يَتَوَضَّؤُوا مِنْهُ قَالَ: فَرَأَيْتُ الْمَاءَ يَنْبَعُ مِنْ تَحْتِ أَصَابِعِهِ، حَتَّى تَوَضَّؤُوا مِنْ عِنْدَ آخِرِهِمْ
__________
أخرجه البخاري في: 4 كتاب الوضوء: 32 باب التماس الوضوء إذا حانت الصلاة

1468. హజ్రత్ అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) కథనం :-

నేను ఒకసారి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను అసర్ నమాజ్ వేళ చూశాను. ప్రజలు వుజూ చేయడానికి నీళ్ళ కోసం అన్వేషిస్తున్నారు. కాని వారికి ఎక్కడా నీళ్ళు లభించడం లేదు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కోసం మటుకు (కొంచెం) నీళ్ళు తీసుకురావడం జరిగింది. ఆయన ఆ నీళ్ళ పాత్రలో తమ చేతిని ముంచి, ఇక వుజూ చేయండని అన్నారు అనుచరులతో. అప్పుడు ఆయన చేతి వ్రేళ్ళ నుండి ధారాపాతంగా నీళ్ళు వెలువడసాగాయి. మొదటి వ్యక్తి నుంచి చివరి వ్యక్తి దాకా అందరూ వుజూ చేసుకునే వరకు ఆ నీటి ధారలు వెలువడుతూనే ఉండటం నేను కళ్ళారా చూశాను.

(సహీహ్ బుఖారీ:- 4వ ప్రకరణం – వుజూ, 32వ అధ్యాయం – ఇల్తి మాసిన్నాసి అల్ వజూఅ ఇజా హానతిస్సలాహ్)

1469 – حديث أَبِي حُمَيْدٍ السَّاعِدِيِّ قَالَ: غَزَوْنَا مَعَ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ غَزْوَةَ تَبُوكَ فَلَمَّا جَاءَ وَادِيَ الْقُرَى، إِذَا امْرَأَةٌ فِي حَدِيقَةٍ لَهَا فَقَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، لأَصْحَابِهِ اخْرُصُوا وَخَرَصَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ عَشَرَةَ أَوْسُقٍ فَقَالَ لَهَا: أَحْصِي مَا يَخْرُجُ مِنْهَا فَلَمَّا أَتَيْنَا تَبُوكَ، قَالَ: أَمَا إِنَّهَا سَتَهُبُّ اللَّيْلَةَ رِيحٌ شَدِيدَةٌ، فَلاَ يَقُومَنَّ أَحَدٌ، وَمَنْ كَانَ مَعَهُ [ص:91] بَعِيرٌ فَلْيَعْقِلْهُ فَعَقَلْنَاهَا وَهَبَّتْ رِيحٌ شَدِيدَةٌ؛ فَقَامَ رَجُلٌ فَأَلْقَتْهُ بِجَبَلِ طَيِّء
وَأَهْدَى مَلِكُ أَيْلَةَ لِلنَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ بَغْلَةً بَيْضَاءَ، وَكَسَاهُ بُرْدًا وَكَتَبَ لَهُ بِبَحْرِهِمْ
فَلَمَّا أَتى وَادِيَ الْقُرَى، قَالَ لِلْمَرْأَةِ: كَمْ جَاءَ حِدِيقَتُكِ قَالَتْ: عَشَرَةَ أَوْسُقٍ، خَرْصَ رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فَقَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: إِنِّي مُتَعَجِّلٌ إِلَى الْمَدِينَةِ، فَمَنْ أَرَادَ مِنْكُمْ أَنْ يَتَعَجَّلَ مَعِي فَلْيَتَعَجَّلْ
فَلَمَّا أَشْرَفَ عَلَى الْمَدِينَةِ، قَالَ: هذِهِ طَابَةُ فَلَمَّا رَأَى أُحُدًا، قَالَ: هذَا جُبَيْلٌ يُحِبُّنَا وَنُحِبُّهُ، أَلاَ أُخْبِرُكُمْ بِخَيْرِ دُورِ الأَنْصَارِ قَالُوا: بَلَى قَالَ: دُورُ بَنِي النَّجَّارِ، ثُمَّ دُورُ بَنِي عَبْدِ الأَشْهَلِ، ثُمَّ دُورُ بَنِي سَاعِدَةَ، أَوْ دُورُ بَنِي الْحارثِ بْنِ الْخَزْرَجِ، وَفِي كُلِّ دُورِ الأَنْصَارِ يَعْنِي خَيْرًا
__________
أخرجه البخاري في: 24 كتاب الزكاة: 54 باب خرص التمر

1469 – فَلَحِقْنَا سَعْدَ بْنَ عُبَادَةَ فَقَالَ أَبُو أُسَيْدٍ: أَلَمْ تَرَ أَنَّ نَبِيَّ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، خَيَّرَ الأَنْصَارَ فَجَعَلَنَا أَخِيرًا فَأَدْرَكَ سَعْدٌ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَقَالَ: يَا رَسُولَ اللهِ خُيِّرَ دُورُ الأَنْصَارِ فَجُعِلْنَا آخِرًا فَقَالَ: أَوَلَيْسَ بِحَسْبكُمْ أَنْ تَكُونُوا مِنَ الْخِيَارِ
__________
أخرجه البخاري في: 63 كتاب مناقب الأنصار: 7 باب فضل دور الأنصار

1469. హజ్రత్ అబూ హమీద్ సాది (రదియల్లాహు అన్హు) కథనం:- మేము తబూక్ పోరాటంలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వెంట ఉన్నాము. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఖురా లోయలోకి చేరుకున్నారు. అక్కడ తోటలో ఒక స్త్రీ కన్పించింది. “ఆమె తోటలో ఎన్ని పండ్లు అవుతాయో అంచనా వేయండి” అన్నారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తమ అనుచరులతో. ఆయన స్వయంగా పది ‘వసఖ్’ల పండ్లు ఉండవచ్చని అంచనా వేసుకున్నారు.

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆ స్త్రీతో “ఈ తోటలో (ఈ యేడు) ఎన్ని పండ్లు కాస్తాయో లెక్క గట్టి ఉంచు” అని అన్నారు. ఆ తరువాత మేము తబూక్ చేరుకున్నాం. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మాతో మాట్లాడుతూ “ఈ రోజు రాత్రి తీవ్రమైన తుఫాను గాలి వీస్తుంది. కనుక మీలో ఎవరూ ఆ సమయంలో లేచి నిలబడకూడదు. ఒంటెలు ఉన్నవారు తమ ఒంటెలను కట్టివేయాలి” అని అన్నారు. మేము మా ఒంటెలను కట్టివేశాము. ఆ రాత్రి భయంకరమైన తుఫాను గాలి వీచింది. ఒక వ్యక్తి (ఎందుకో) లేచి నిలబడ్డాడు. మరుక్షణమే అతడ్ని తుఫాను గాలి అమాంతం పైకెత్తి ‘తై’ కొండ మీద విసరివేసింది. ఆ సమయంలోనే ఐలా ప్రాంతపు రాజు, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు ఒక తెల్ల కంచర గాడిదను, ఒక దుప్పటిని కానుకగా పంపాడు. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అతనికి అతని రాజ్యాధికారం అతని క్రిందే ఉన్నట్లు ఒక ఫర్మానా వ్రాసిచ్చారు.

ఆ తరువాత మేము ఖురా లోయకు తిరిగొచ్చాము. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆ స్త్రీని “నీ తోటలో ఎన్ని పండ్లు కాశాయి?” అని అడిగారు. దానికామె పది వసఖ్’లు కాశాయి అన్నది. అంటే దైవప్రవక్త అంచనా ప్రకారమే ఉత్పత్తి జరిగింది. తరువాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మాతో “నేను తొందరగా మదీనా వెళ్ళిపోదామనుకుంటున్నాను. నాతో పాటు వచ్చే వాళ్ళెవరైనా ఉంటే వెంటనే బయలుదేరండి” అని అన్నారు.

ఆ తరువాత మాకు మదీనా పట్టణం కన్పించసాగింది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) దాన్ని చూసి “ఇది తైబా” అన్నారు. తరువాత ఆయన ఉహుద్ పర్వతాన్ని చూసి “ఈ పర్వతం మనల్ని అభిమానిస్తోంది. మనం దీన్ని అభిమానిస్తున్నాం” అని అన్నారు. ఆ తరువాత “నేను మీకు అన్సార్ ఇండ్లలో శ్రేష్ఠమైన ఇండ్లను గురించి చెప్పనా?” అని అన్నారు. దానికి అనుచరులు “తప్పకుండా చెప్పండి దైవప్రవక్తా!” అన్నారు. “అన్నిటికంటే బనీ నజ్జార్ తెగవారి ఇండ్లు శ్రేష్ఠమైనవి. తరువాత బనీ అబ్దుల్ అష్ హల్ తెగవారి ఇండ్లు, ఆ తరువాత బనీ సాదా తెగవారి ఇండ్లు వస్తాయి” అన్నారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం). తిరిగి ఆయన “బనీ హారిస్ బిన్ ఖజ్రజ్ తెగవారి ఇండ్లతో బాటు అన్సార్ ముస్లింల ఇండ్లన్నిటిలోనూ శ్రేయోశుభాలు ఉన్నాయి” అని అన్నారు.
(సహీహ్ బుఖారీ:- 24వ ప్రకరణం – జకాత్, 54వ అధ్యాయం – ఖర్సిత్తమ్ర్)

(హదీసు ఉల్లేఖకుని కథనం) – ఆ తరువాత హజ్రత్ సాద్ బిన్ ఉబాదా(రదియల్లాహు అన్హు) మమ్మల్ని కలుసుకోవడానికి వచ్చారు. అప్పుడు హజ్రత్ అబూ ఉసైద్ (రదియల్లాహు అన్హు) ఆయనతో “మీరు విన్నారా? దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అన్సారుల ఇండ్ల శ్రేష్ఠతను గురించి మాట్లాడుతూ మనల్ని అందరికంటే చివర్లో ఉంచారు” అని అన్నారు. హజ్రత్ సాద్ (రదియల్లాహు అన్హు) ఈ మాటలు విని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సన్నిధికి వెళ్ళి “దైవప్రవక్తా! మీరు అన్సారుల ఇండ్ల ఘనతను గురించి చెబుతూ మమ్మల్ని చివర్లో ఉంచారు” అని అన్నారు.దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సమాధానమిస్తూ “మీరు కూడా శ్రేష్ఠమైన వారిలో ఉన్నారన్న మాట మీకు చాలదా?” అని అన్నారు.

(సహీహ్ బుఖారీ:- 63వ ప్రకరణం – మనాఖిబుల్ అన్సార్, 7వ అధ్యాయం – ఫజ్లి దూరిల్ అన్సార్)

1470 – حديث جَابِرِ بْنِ عَبْدِ اللهِ، قَالَ: غَزَوْنَا مَعَ رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ غَزْوَةَ نَجْدٍ فَلَمَّا أَدْرَكَتْهُ الْقَائِلَةُ، وَهُوَ فِي وَادٍ كَثِيرِ الْعِضَاهِ، فَنَزَلَ تَحْتَ شَجَرَةٍ، وَاسْتَظَلَّ بِهَا، وَعَلَّقَ سَيْفَهُ فَتَفَرَّقَ النَّاسُ فِي الشَّجَرِ يَسْتَظِلُّونَ وَبَيْنَا نَحْنُ كَذَلِكَ إِذْ دَعَانَا رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَجِئْنَا، فَإِذَا أَعْرَابِيٌّ قَاعِدٌ بَيْنَ يَدَيْهِ فَقَالَ: إِنَّ هذَا أَتَانِي وَأَنَا نَائِمٌ فَاخْتَرَطَ سَيْفِي فَاسْتَيْقَظْتُ وَهُوَ قَائِمٌ عَلَى رَأْسِي، مُخْتَرِطٌ صَلْتًا قَالَ: مَنْ يَمْنَعكَ مِنِّي قُلْتُ: اللهُ فَشَامَهُ، ثُمَّ قَعَدَ فَهُوَ هذَا قَالَ: وَلَمْ يُعَاقِبْهُ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ
__________
أخرجه البخاري في: 64 كتاب المغازي: 32 باب غزوة المصطلق من خزاعة

1470. హజ్రత్ జాబిర్ బిన్ అబ్దుల్లా (రదియల్లాహు అన్హు) కథనం :-

మేము దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)తో కలసి నజద్ యుద్ధంలో పాల్గొన్నాం. ఎండ తీవ్రమయిపోయినప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఒక లోయలోకి చేరుకున్నారు. ఆ లోయలో ఒక విధమైన ముండ్ల చెట్లు అనేకం ఉన్నాయి. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఒక చెట్టు క్రిందికి చేరి, ఖడ్గాన్ని చెట్టుకు వ్రేలాడదీసి చెట్టు నీడలో విశ్రాంతి కోసం పడుకున్నారు. మిగిలిన వాళ్ళు కూడా నలువైపులా వ్యాపించి ఉన్న చెట్ల నీడన విశ్రాంతి తీసుకోసాగారు. కాస్సేపటికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మమ్మల్ని కేకవేసి పిలిచారు. మేము వెంటనే లేచి ఆయన దగ్గరకు వెళ్ళాము. చూస్తే, అక్కడ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఎదురుగా ఒక పల్లెవాసి కూర్చొని ఉన్నాడు.

అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మాకిలా తెలియజేశారు :- “నేను పడుకొని ఉంటే ఒక వ్యక్తి వచ్చి నా ఖడ్గం చేతిలోకి తీసుకున్నాడు. నేను మేల్కొని చూస్తే అతను వరలేని ఆ కత్తి పట్టుకొని నా తలవైపు నిల్చున్నాడు. అతనలా కత్తి పట్టుకొని ‘నా బారి నుండి నిన్నెవరు కాపాడుతారు?’ అని అన్నాడు. నేను ‘అల్లాహ్ కాపాడుతాడ’న్నాను. ఈ మాట విని అతను ఖడ్గాన్ని వరలోకి నెట్టి కూర్చున్నాడు. ఆ వ్యక్తి ఇతనే.” దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆ వ్యక్తికి ఎలాంటి శిక్ష విధించలేదు.

(సహీహ్ బుఖారీ:- 64వ ప్రకరణం – మగాజి, 32వ అధ్యాయం – గజ్వతి బనీ ముస్తలిఖ్ మన్ ఖుజఅ)

1471 – حديث أَبِي مُوسى، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: مَثَلُ مَا بَعَثَنِي اللهُ بِهِ مِنَ الْهُدَى وَالْعِلْمِ، كَمَثَلِ الْغَيْثِ الْكَثِيرِ، أَصَابَ أَرْضًا، فَكَانَ مِنْهَا نَقِيَّةٌ قَبِلَتِ الْمَاءَ فَأَنْبَتَتِ الْكَلأَ وَالْعُشْبَ الْكَثِيرَ وَكَانَ مِنْهَا أَجَادِبُ أَمْسَكَتِ الْمَاءَ فَنَفَعَ اللهُ بِهَا النَّاسَ فَشَرِبُوا وَسَقَوْا وَزَرَعُوا وَأَصَابَتْ مِنْهَا طَائِفَةً أُخْرَى، إِنَّمَا هِيَ قِيعَانٌ لاَ تُمْسِكُ مَاءً، وَلاَ تَنْبتُ كَلأَ، فَذَلِكَ مَثَلُ مَنْ فَقِهَ فِي دِينِ اللهِ وَنَفَعَهُ مَا بَعَثَنِي اللهُ بِهِ، فَعَلِمَ وَعَلَّمَ وَمَثَلُ مَنْ لَمْ يَرْفَعْ بِذَلِكَ رَأْسًا وَلَمْ يَقْبَلْ هُدَى اللهِ الَّذِي أُرْسِلْتُ بِهِ
[ص:93] وَفِي رِوَايَةٍ: وَكَانَ مِنْهَا طَائِفَةٌ قَيَّلَتِ الْمَاءَ
__________
أخرجه البخاري في: 3 كتاب العلم: 20 باب فضل من علم وعلّم

1471. హజ్రత్ అబూ మూసా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు :-

అల్లాహ్ నాకిచ్చి పంపిన జ్ఞానోపదేశాలు నేల పై కురిసే కుండపోత వర్షం లాంటివి. ఆ వర్షం ద్వారా నీటిని బాగా పీల్చుకునే సారవంతమైన నేలలో పచ్చిక, చెట్లు చేమలు మొలుస్తాయి. గట్టి నేల ఆ వర్షపు నీటిని నిరోధించి నిల్వ చేస్తుంది. అల్లాహ్ ఆ నీటితో మానవులకు ప్రయోజనం చేకూర్చుతాడు. వారు దాన్ని త్రాగుతారు, పంట భూముల కోసం వినియోగించుకుంటారు. ఈ వర్షమే మెట్టపల్లాలు లేని చదునైన నేలపై కూడా కురుస్తుంది. కాని ఆ నేల నీటిని (పీల్చుకోవడం గాని) నిరోధించడం గాని, పచ్చికను, చెట్లను మొలకెత్తించడం గాని చేయజాలదు. ఈ (పై రెండు) ఉదాహరణలు దైవధర్మాన్ని అర్థం చేసుకున్న వ్యక్తికి వర్తిస్తాయి. అల్లాహ్ నాకిచ్చి పంపిన జ్ఞానం ఆ వ్యక్తికి ప్రయోజనం చేకూర్చుతుంది. అతనా జ్ఞానాన్ని ఆర్జించి ఇతరులక్కూడా నేర్పుతాడు. ఈ (మూడవ) ఉదాహరణ అహంకారం, దురభిమానం గల వ్యక్తికి వర్తిస్తుంది. అతను తన అహంకారం కారణంగా ధర్మం వైపు దృష్టి సారించడు, అల్లాహ్ నాకిచ్చి పంపిన హితోపదేశాలను స్వీకరించడు.*

(సహీహ్ బుఖారీ:- 3వ ప్రకరణం – ఇల్మ్, 20వ అధ్యాయం – ఫజ్లిమన్ అలిమ వ అల్లమ్)

* ఇమామ్ నవవీ (రహిమహుల్లాహ్) ఇలా రాస్తున్నారు: నేల మూడు రకాలుగా ఉంది. అలాగే మానవుల్లో కూడా మూడు రకాల వారున్నారు. మొదటి రకం సారవంతమైన నేల వర్షం పడగానే పచ్చిక, పండ్లు ఉత్పత్తి చేసి సస్యశ్యామలమవుతుంది. ప్రజలు దాని వల్ల ప్రయోజనం పొందుతారు. ధర్మవిద్య నేర్చుకొని, దాన్ని స్వయంగా ఆచరించడమే గాక, ఇతరులక్కూడా నేర్పుతూ వారికి ప్రయోజనం చేకూర్చే వ్యక్తి ఈ సారవంతమైన నేల వంటివాడు. రెండవ రకం నేల పచ్చిక, పండ్లు వగైరా ఉత్పత్తి చేయకపోయినా వర్షపు నీటిని ఆపుకొని నిలువ చేస్తుంది. దానివల్ల మానవులు, జంతువులు ప్రయోజనం పొందుతారు. ధర్మవిద్య నేర్చుకున్నప్పటికీ దాని ద్వారా సమకాలీన సమస్యలకు పరిష్కారం చూపగలిగే అంత దక్షత లేని వ్యక్తి ఈ నేల వంటివాడు. అయినప్పటికిన్నీ ప్రజలు అతను చెప్పే ధార్మిక విషయాలు విని ప్రయోజనం పొందుతారు. మూడవ రకం నేల చదునైన మెరక నేల. ఇది పచ్చిక, పండ్లు వగైరా ఏదీ ఉత్పత్తి చేయజాలదు. వర్షపు నీటిని కూడా నిల్వచేయజాలదు. ధర్మం పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంబించిన వాడ్ని ఇలాంటి నేలతో పోల్చవచ్చు. ఇతను ధర్మజ్ఞానాన్ని జ్ఞాపకం పెట్టుకోడు. అతని దగ్గర ఎవరూ ఎలాంటి ధార్మిక విషయమూ నేర్చుకోలేరు. (సంకలనకర్త).

1472 – حديث أَبِي هُرَيْرَةَ، أَنَّهُ سَمِعَ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، يَقُولُ: إِنَّمَا مَثَلِي وَمَثَلُ النَّاسِ كَمَثَلِ رَجُلٍ اسْتَوْقَدَ نَارًا، فَلَمَّا أَضَاءَتْ مَا حَوْلَهُ، جَعَلَ الْفَرَاشُ [ص:94] وَهذِهِ الدَّوَابُّ الَّتِي تَقَعُ فِي النَّارِ يَقَعْنَ فِيهَا، فَجَعَلَ يَنْزِعُهُنَّ وَيَغْلِبُنَهُ، فَيَقْتَحِمنَ فِيهَا فَأَنَا آخُذُ بِحُجَزِكُمْ عَنِ النَّارِ وَهُمْ يَقْتَحِمُونَ فِيهَا
__________
أخرجه البخاري في: 81 كتاب الرقاق: 26 باب الانتهاء عن المعاصي

1472. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు :-

నన్ను, (నా అనుచర సమాజం) ప్రజలను ఈ విధంగా పోల్చవచ్చు. ఒక వ్యక్తి అగ్నిని రాజేయగా దాని వెలుగు నలువైపులా వ్యాపిస్తుంది. అప్పుడు ఉసుళ్ళు, కీటకాలు వచ్చి అందులో పడుతుంటాయి. ఆ వ్యక్తి వాటిని నిరోధిస్తాడు, (అగ్నిలో పడకుండా) ఆపడానికి ప్రయత్నిస్తాడు. కాని అవి ఆగవు, అగ్నిలోకి పోయి పడుతూనే ఉంటాయి. అదే విధంగా నేను కూడా మిమ్మల్ని మీ నడుము పట్టి నరకాగ్నిలో పడిపోకుండా నిరోధిస్తున్నాను. కాని ఈ జనం నరకంలోకి పోయి పడుతున్నారు.

(సహీహ్ బుఖారీ:- 81వ ప్రకరణం – రిఖాఖ్, 26వ అధ్యాయం – అల్ ఇంతిహా అనిల్ మఆసి)

1473 – حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: إِنَّ مَثَلِي وَمَثَلُ الأَنْبِيَاءِ مِنْ قَبْلِي كَمَثَلِ رَجُلٍ بَنى بَيْتًا فَأَحْسَنَهُ وَأَجْمَلَهُ إِلاَّ مَوْضِعَ لَبِنَةٍ مِنْ زَاوِيَةٍ، فَجَعَلَ النَّاسُ يَطُوفُونَ بِهِ، وَيَعْجَبُونَ لَهُ، وَيَقُولُونَ: هَلاَّ وُضِعَتْ هذِهِ اللَّبِنَةُ فَأَنَا اللَّبِنَةُ، وَأَنَا خَاتَمُ النَّبِيِّينَ
__________
أخرجه البخاري في: 61 كتاب المناقب: 18 باب خاتم النبيين صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ

1473. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధంగా తెలియ జేశారు :-

నన్ను, నాకు పూర్వం వచ్చిపోయిన ప్రవక్తలను ఈ విధంగా పోల్చవచ్చు – ఒక వ్యక్తి ఒక ఇల్లు కట్టించాడు. దాన్ని అన్ని విధాలా తీర్చిదిద్దాడు. కాని ఓ మూలలో ఒక ఇటుక పెట్టేంత ఖాళీ వదలి పెట్టాడు. ప్రజలు ఆ ఇంటిని నలువైపులా తిరిగి చూసి “(ఇంత అందమైన ఈ ఇంటికి) ఇక్కడ ఇటుక ఎందుకు పెట్టలేదు!” అని ఆశ్చర్యపోయారు – కనుక ఆ ఇటుకను నేనే. ఆ విధంగా నేను (అందరి కన్నా చివర్లో వచ్చిన) అంతిమ దైవప్రవక్తను *.

(సహీహ్ బుఖారీ:- 61వ ప్రకరణం – మనాఖిబ్, 18వ అధ్యాయం – ఖాతిమున్నబియ్యీన్)

* ఈ హదీసులో దైవప్రవక్తలను, వారు తెచ్చిన బోధనలు, హితోపదేశాలను ఒక భవనంతో పోల్చడం జరిగింది. దీనికి పటిష్టమైన పునాదులు వేయబడ్డాయి. దాని కట్టడం ఎంతో అందంగా, అద్భుతంగా నిర్మించబడింది. కాని అందులో ఒక చోట ఒక ఇటుక పట్టేంత ఖాళీ వదిలి వేయబడింది. అత్యున్నత నైతిక విలువల సంస్థాపనకై పంపబడిన అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ని ఇక్కడ ఈ ఖాళీ స్థలాన్ని పూరించే ఇటుకతో పోల్చడం జరిగింది. ఆయన ప్రభవించి అద్భుతమైన ఈ దైవ దౌత్యసౌధానికి చివరి ఇటుకను అమర్చి దానికి పరిపూర్ణత్వాన్ని చేకూర్చారు. ఆ తరువాత ఈ సౌధానికి మరే ఇటుకా అవసరం లేదు. అదే విధంగా మహాప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) తరువాత మానవాళి మార్గదర్శనానికి మరే దైవప్రవక్తా ప్రభవించడు. (సంకలనకర్త)

1474 – حديث جَابِرِ بْنِ عَبْدِ اللهِ قَالَ: قَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: مَثَلِي وَمَثَلُ الأَنْبِيَاءِ كَرَجُلٍ بَنى دَارًا فَأَكْمَلَهَا وَأَحْسَنَهَا إِلاَّ مَوْضِعَ لَبِنَةٍ فَجَعَلَ النَّاسُ يَدْخُلُونَهَا وَيَتَعَجَّبُونَ وَيَقُولُونَ: لَوْلاَ مَوُضِعُ اللَّبِنَةِ
__________
أخرجه البخاري في: 61 كتاب المناقب: 18 باب خاتم النبيين صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ

1474. హజ్రత్ జాబిర్ బిన్ అబ్దుల్లా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు:

నన్ను, నాకు పూర్వం వచ్చిపోయిన దైవప్రవక్తలను ఈ విధంగా పోల్చవచ్చు – ఒక వ్యక్తి ఒక ఇల్లు నిర్మించాడు. నిర్మాణం పూర్తయింది. దాన్ని అన్ని విధాలా తీర్చిదిద్దాడు. కాని (ఓ మూలన) ఒక ఇటుక పట్టేంత ఖాళీ వదలి పెట్టాడు. ప్రజలు ఆ ఇంట్లో ప్రవేశించి (తిరిగి చూసి, “ఇక్కడ ఒక ఇటుక ఉండవలసిన ఖాళీ చోటును గనక వదలి పెట్టకుండా ఉంటే ఈ ఇల్లు పరిపూర్ణతను సంతరించుకునేది” అని అన్నారు.

(సహీహ్ బుఖారీ:- 61వ ప్రకరణం – మనాఖిబ్, 18వ అధ్యాయం • ఖాతిమున్నబియ్యీన్)

1475 – حديث جُنْدَبٍ، قَالَ: سَمِعْتُ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، يَقُولُ: أَنَا فَرَطكُمْ عَلَى الْحَوْضِ
__________
أخرجه البخاري في: 81 كتاب الرقاق: 53 باب في الحوض وقول الله تعالى (إنا أعطيناك الكوثر)

1475. హజ్రత్ జుందుబ్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ఉద్బోధించారు:- (కౌసర్) కోనేటి దగ్గరకు నేను మీ అందరికంటే ముందు చేరుకుంటాను (అక్కడ నేను మీ కోసం నిరీక్షిస్తూ ఉంటాను).

(సహీహ్ బుఖారీ:- 81వ ప్రకరణం – రిఖాఖ్, 53వ అధ్యాయం – ఫిల్ హౌజి వ ఖౌలిల్లాహి తాలా ఇన్నా ఆతయ్ నా కల్ కౌసర్)

1476 – حديث سَهْلِ بْنِ سَعْدٍ، قَالَ: قَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: إِنِّي فَرَطُكُمْ عَلَى الْحَوْضِ، مَنْ مَرَّ عَلَيَّ شَرِبَ، وَمَنْ شَرِبَ لَمْ يَظْمَأْ أَبَدًا لَيَرِدَنَّ عَلَيَّ أَقْوَامٌ أَعْرِفُهُمْ وَيَعْرِفُونِي، ثُمَّ يُحَالُ بَيْنِي وَبَيْنَهُمْ
__________
أخرجه البخاري في: 81 كتاب الرقاق: 53 باب في الحوض وقول الله تعالى (إنا أعطيناك الكوثر)

1476. హజ్రత్ సహెల్ బిన్ సాద్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా తెలిపారు:-

(కౌసర్) సరస్సు దగ్గరకు నేను మీ అందరికంటే ముందుగా చేరుకొని మిమ్మల్ని స్వాగతించడానికి నిరీక్షిస్తూ ఉంటాను. నా దగ్గరకు వచ్చిన ప్రతి వ్యక్తి ఈ సరస్సు నీరు త్రాగుతాడు. ఈ నీరు (ఓసారి) త్రాగిన వాడికి ఇక ఎన్నటికీ దాహమవదు. మరికొందరు నా దగ్గరికి రావడానికి ప్రయత్నిస్తారు. నేను వారిని గుర్తుపడ్డాను. వారు కూడా నన్ను గుర్తు పట్టవచ్చు. అయినప్పటికీ వారిని నా దగ్గరకు రాకుండా నిరోధించడం జరుగుతుంది.

(సహీహ్ బుఖారీ:- 81వ ప్రకరణం – రిఖాఖ్, 53వ అధ్యాయం – ఫిల్ హౌజి వ ఖౌలిల్లాహి తాలా ఇన్నా ఆతయ్ నా కల్ కౌసర్)

1477 – حديث أَبِي سَعِيدٍ الْخُدْرِيِّ، يَزِيدُ فِيهِ فَأَقُولُ: إِنَّهُمْ مِنِّي، فَيُقَالُ إِنَّكَ لاَ تَدْرِي مَا أَحْدَثُوا بَعْدَكَ، فَأَقُولُ: سُحْقًا سُحْقًا لِمَنْ غَيَّرَ بَعْدِي
__________
أخرجه البخاري في: 81 كتاب الرقاق: 53 باب في الحوض وقول الله تعالى (إنا أعطيناك الكوثر)

1477. హజ్రత్ అబూ సయీద్ ఖుదరీ (రదియల్లాహు అన్హు) కథనం:- పై హదీసును హజ్రత్ అబూ సయీద్ (రదియల్లాహు అన్హు) కూడా ఉల్లేఖించారు. అయితే ఆ హదీసులో ఈ విషయం అదనంగా ఉంది –

నేను (అంటే దైవప్రవక్త) వారిని చూసి “వీరు నా వారు (నా అనుచర సమాజం ప్రజలు)” అని అంటాను. కాని “మీరు (ఇహలోకం వీడి) పోయిన తరువాత వీరు ఏమేమి చేశారో (ధర్మంలో ఎలాంటి కొత్త పోకడలు సృష్టించారో, ధర్మ వ్యతిరేక వైఖరి అవలంబించారో) మీకు తెలియదు” అని నాకు సమాధానం ఇవ్వబడుతుంది. అప్పుడు నేను వారితో “దూరంగా ఉండండి, నా తరువాత దైవధర్మాన్ని మార్చేసిన వారు దూరంగా ఉండాలి” అని అంటాను.

(సహీహ్ బుఖారీ:- 81వ ప్రకరణం – రిఖాఖ్, 53వ అధ్యాయం – ఫిల్ హౌజివ ఖౌలిల్లాహి తాలా ఇన్నా ఆతయ్ నా కల్ కౌసర్)

1478 – حديث عَبْدِ اللهِ بْنِ عَمْرٍو، قَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: حَوْضِي مَسِيرَةُ شَهْرٍ، مَاؤُهُ أَبْيَضُ مِنَ اللَّبَنِ، وَرِيحُهُ أَطْيَبُ مِنَ الْمِسْكِ، وَكِيزَانُهُ كَنُجُومِ السَّمَاءِ، مَنْ شَرِبَ مِنْهَا فَلاَ يَظْمَأُ أَبَدًا
__________
أخرجه البخاري في: 81 كتاب الرقاق: 53 باب في الحوض وقول الله تعالى (إنا أعطيناك الكوثر)

1478. హజ్రత్ అబ్దుల్లా బిన్ అమ్ర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధంగా ఉద్బోధించారు:-

నా సరస్సు ఒక నెల ప్రయాణం చేసిన దూరమంత పొడవుగా ఉంటుంది. అందులోని నీళ్ళు పాలకంటే తెల్లగా, దాని పరిమళం కస్తూరి కంటే ఎక్కువ సువాసనగా ఉంటాయి. అక్కడ ఉండే అసంఖ్యాకమైన చెంబులు ఆకాశంలోని నక్షత్రాల దృశ్యాన్ని తలపింపజేస్తాయి. అందులో ఎవరైనా ఒక్కసారి నీరు త్రాగితే ఇక ఎన్నటికీ అతనికి దాహం వేయదు.

(సహీహ్ బుఖారీ:- 81వ ప్రకరణం – రిఖాఖ్, 53వ అధ్యాయం – ఫిల్ హౌజి వ ఖౌలిల్లాహి తాలా ఇన్నా ఆతయ్ నా కల్ కౌసర్)

1479 – حديث أَسْمَاءَ بِنْتِ أَبِي بَكْرٍ رضي الله عنهما قَالَتْ: قَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: إِنِّي عَلَى الْحَوْضِ حَتَّى أَنْظُرَ مَنْ يَرِدُ عَلَيَّ مِنْكُمْ، وَسَيُؤْخَذُ نَاسٌ دُونِي، فَأَقُولُ: يَا رَبِّ مِنِّي ومِنْ أُمَّتِي فَيُقَالُ: هَلْ شَعَرْتَ مَا عَمِلُوا بَعْدَكَ، وَاللهِ مَا بَرِحُوا يَرْجِعُونَ عَلَى أَعْقَابِهِمْ
فَكَانَ ابْنُ أَبِي مُلَيْكَةَ (رَاوِي هذَا الْحَدِيثِ عَنْ أَسْمَاءَ) يَقُولُ: اللهُمَّ إِنَّا نعُوذُ بِكَ أَنْ نَرْجِعَ عَلَى أَعْقَابِنَا، أَوْ نُفْتَنَ عَنْ دِينِنَا
__________
أخرجه البخاري في: 81 كتاب الرقاق: 53 باب في الحوض وقول الله تعالى (إنا أعطيناك الكوثر)

1479. హజ్రత్ అస్మా బిన్త్ అబూబకర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధంగా తెలిపారు:-

నేను (కౌసర్) సరస్సు దగ్గర ఉండి మీలో నుండి వచ్చే ప్రతి వ్యక్తిని చూస్తుంటాను. కొంత మందిని నా దగ్గరకు రాకుండా నిరోధించడం జరుగుతుంది. నేనప్పుడు “అల్లాహ్! వీరు నా వారు. నా అనుచర సమాజం సభ్యులు కదా!” అని అంటాను. కాని “మీ తరువాత వీరు ఏమేమి చేశారో మీకేమయినా తెలుసా? దైవసాక్షి! మీరు (ఇహలోకం వీడి) పోయిన తరువాత వీరు ఎప్పుడూ అజ్ఞానం, అనాగరిక చేష్టల వైపుకే మరలిపోవడానికి ప్రయత్నిస్తూ ఉండేవారు” అని నాకు సమాధానం ఇవ్వబడుతుంది (అంటే వీరు అజ్ఞాన కాలంలో ఉండిన మూఢ సంప్రదాయాలను, దైవ ధర్మంలో లేని కొత్త పోకడలను ఇస్లాంలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తూ ఉండేవారని అర్థం).

హజ్రత్ అస్మా (రదియల్లాహు అన్హా) నుండి హదీసు గ్రహించిన హజ్రత్ అబూ ములైక (రహిమహుల్లాహ్) ఈ హదీసు విన్పించిన తరువాత “అల్లాహ్! మేము మళ్ళీ అజ్ఞానం, మూఢత్వాల వైపుకు మరలిపోకుండా, నీ ధర్మం విషయంలో మేము పరీక్షకు గురి కాకుండా మమ్మల్ని కాపాడు అని ప్రార్థించారు.” (اللهُمَّ إِنَّا نعُوذُ بِكَ أَنْ نَرْجِعَ عَلَى أَعْقَابِنَا، أَوْ نُفْتَنَ عَنْ دِينِنَا)

(సహీహ్ బుఖారీ:- 81వ ప్రకరణం – రిఖాఖ్, 53వ అధ్యాయం – ఫిల్ హౌజి వ ఖౌలిల్లాహి తాలా ఇన్నా ఆతయ్ నా కల్ కౌసర్)

1480 – حديث عُقْبَةَ بْنِ عَامِرٍ قَالَ: صَلَّى رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ عَلَى قَتْلَى أُحُدٍ، بَعْدَ ثَمَانِي سِنِينَ، كَالْمُوَدِّعِ لِلأَحْيَاءِ وَالأَمْوَاتِ، ثُمَّ طَلَعَ الْمِنْبَرَ، فَقَالَ: إِنِّي بَيْنَ أَيْدِيكُمْ فَرَطٌ، وَأَنَا عَلَيْكُمْ شَهِيدٌ، وَإِنَّ مَوْعِدَكُمُ الْحَوْضُ، وَإِنِّي لأَنْظُرُ إِلَيْهِ مِنْ مَقَامِي هذَا، وَإِنِّي لَسْتُ أَخْشى عَلَيْكُمْ أَنْ تُشْرِكُوا، وَلكِنِّي أَخْشى عَلَيْكُمُ الدُّنْيَا، أَنْ تَنَافَسُوهَا
__________
أخرجه البخاري في: 64 كتاب المغازي: 7 باب غزوة أحد

1480. హజ్రత్ ఉఖ్బా బిన్ ఆమిర్ (రదియల్లాహు అన్హు) కథనం :- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఉహుద్ అమరగతుల కోసం ఎనిమిది సంవత్సరాల తరువాత (జనాజా) నమాజ్ చేశారు. చనిపోయిన వారికి, బ్రతికున్న వారికి అందరికీ వీడ్కోలు చెబుతున్న విధంగా ఈ నమాజు చేశారు. ఆ తరువాత మస్జిద్ లో వేదిక ఎక్కి ఇలా ఉద్బోధించారు –

“నేను సారథిగా, జట్టు నాయకుడిగా మీకు ముందుగా వెళ్తున్నాను. నేను మీకు సాక్షిని, పర్యవేక్షకుడిని. ఇక మీరు నన్ను కౌసర్ సరస్సు దగ్గర కలుసుకుంటారు. నేనిక్కడ నిలబడి కూడా దాన్ని (కౌసర్ సరస్సుని) చూడగలుగుతున్నాను. నేను వెళ్ళిన తరువాత మీరు మళ్ళీ బహుదైవారాధకులయి పోతారేమోనన్న భయమిప్పుడు నాకు ఏమాత్రం లేదు. కాని నా భయమల్లా మీరు ప్రాపంచిక వ్యా మోహంలో చిక్కుకుపోతారేమోనన్నదే.”

(సహీహ్ బుఖారీ:- 64వ ప్రకరణం – మగాజి, 17వ అధ్యాయం – గజ్వతి ఉహుద్)

1481 – حديث عَبْدِ اللهِ بْنِ مَسْعُودٍ رضي الله عنه، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: أَنَا فَرَطُكُمْ عَلَى الْحَوْضِ، وَلَيُرْفَعَنَّ رِجَالٌ مِنْكُمْ، ثُمَّ لَيُخْتَلَجُنَّ دُونِي، فَأَقُولُ: يَا رَبِّ أَصْحَابى فَيُقَالُ: إِنَّكَ لاَ تَدْرِي مَا أَحْدَثُوا بَعْدَكَ
__________
أخرجه البخاري في: 81 كتاب الرقاق: 53 باب في الحوض وقول الله تعالى (إنا أعطيناك الكوثر)

1481. హజ్రత్ అబ్దుల్లా బిన్ మసూద్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ఉద్బోధించారు:

నేను మీకు ముందుగా కౌసర్ సరస్సు దగ్గరికెళ్ళి మీ కోసం నిరీక్షిస్తుంటాను – మిమ్మల్ని స్వాగతించడానికి, మీలో కొందరు నా దగ్గరకు వస్తారు. అయితే వారిని నా దగ్గరకు రాకుండా ఆపడం జరుగుతుంది. నేనప్పుడు “అల్లాహ్! వీరు నా సహచరులు” అని అంటాను. “మీరు చనిపోయిన తరువాత వీరు దైవ ధర్మంలో ఏఏ కొత్త విషయాలు, వినూత్న పోకడలు సృష్టించారో మీకు తెలియదు” అని నాకు సమాధానం ఇవ్వబడుతుంది.

(సహీహ్ బుఖారీ:- 81వ ప్రకరణం – రిఖాఖ్, 53వ అధ్యాయం – ఫిల్ హౌజి వ ఖౌలిల్లాహి తాలా ఇన్నా ఆతయ్ నా కల్ కౌసర్)

1482 – حديث حارِثَةَ بْنِ وَهْبٍ، قَالَ: سَمِعْتُ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، وَذَكَرَ الْحَوْضَ فَقَالَ كَمَا بَيْنَ الْمَدِينَةِ وَصَنْعَاءَ

1482. హజ్రత్ హారిసా బిన్ వహబ్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా తెలిపారు :- కౌసర్ సరస్సు మదీనా నుండి (యమన్ లోని) సనా వరకు ఎంత దూరం ఉంటుందో అంత పొడవుగా ఉంటుంది.

(సహీహ్ బుఖారీ:- 81వ ప్రకరణం – రిఖాఖ్, 53వ అధ్యాయం – ఫిల్ హౌజి వ ఖౌలిల్లాహి తాలా ఇన్నా ఆతయ్ నా కల్ కౌసర్)

1483 – حديث فَقَالَ لَهُ الْمُسْتَوْرِدُ، أَلَمْ تَسْمَعْهُ قَالَ الأَوَانِي قَالَ: لاَ قَالَ الْمُسْتَوْرِدُ: [ص:98] تُرَى فِيهِ الآنِيَةُ مِثْلَ الْكَوَاكِبِ أخرجهما البخاري في: 81 كتاب الرقاق: 53 باب في الحوض وقول الله تعالى (إنا أعطيناك الكوثر)

1483. హజ్రత్ హారిసా (రదియల్లాహు అన్హు)తో హజ్రత్ ముస్తూరిద్ (రదియల్లాహు అన్హు) మాట్లాడుతూ “మీరు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) నోట (కౌసర్ సరస్సు దగ్గరుండే) చెంబులను గురించి వినలేదా?” అని అడిగారు. హజ్రత్ హారిసా (రదియల్లాహు అన్హు) వినలేదన్నారు. అప్పుడు హజ్రత్ ముస్తూరిద్ (రదియల్లాహు అన్హు) “మీకు ఆ సరస్సు దగ్గర చెంబులు నక్షత్రాల్లా (మెరసిపోతూ, అసంఖ్యాకంగా) కన్పిస్తాయి – (అని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తెలియజేశారు)” అని అన్నారు.

(సహీహ్ బుఖారీ:- 81వ ప్రకరణం – రిఖాఖ్, 53వ అధ్యాయం – ఫిల్ హౌజి వ ఖౌలిల్లాహి తాలా ఇన్నా ఆతయ్ నా కల్ కౌసర్)

1484 – حديث ابْنِ عُمَرَ، عَنِ النَّبِيِّ قَالَ: أَمَامَكُمْ حَوْضٌ كَمَا بَيْنَ جَرْبَاءَ وَأَذْرَحَ
__________
أخرجه البخاري في: 81 كتاب الرقاق: 53 باب في الحوض وقول الله تعالى (إنا أعطيناك الكوثر)

1484. హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు: “మీ ముందు ఒక సరస్సు ఉంటుంది. అది ‘జర్బా’ నుండి ‘అజ రుహ్’ వరకు ఎంత దూరం ఉంటుందో అంత పొడవుగా ఉంటుంది.” (*)

(సహీహ్ బుఖారీ:- 81వ ప్రకరణం – రిఖాఖ్, 53వ అధ్యాయం – ఫిల్ హౌజి వ ఖౌలిల్లాహి తాలా ఇన్నా ఆతయ్ నా కల్ కౌసర్)

(*) హజ్రత్ ఖస్తలాని (రహిమహుల్లాహ్) ప్రకారం ‘జర్బా’ , ‘అజ్ రుహ్’ అనేవి సిరియా దేశంలోని రెండు పట్టణాల పేర్లు. ఈ రెండు పట్టణాలమధ్య మూడు రాత్రుల ప్రయాణమంత దూరం ఉంటుంది. (సంకలనకర్త)

1485 – حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنهما، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: وَالَّذِي نَفْسِي بِيَدِهِ لأَذُودَنَّ رِجَالاً عَنْ حَوْضِي، كَمَا تُذَادُ الْغَرِيبَةُ مِنَ الإِبِلِ عَنِ الْحَوْضِ
__________
أخرجه البخاري في: 42 كتاب المساقاة: 10 باب من رأى أن صاحب الحوض والقربة أحق بمائه

1485. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా అన్నారు:- ఎవరి అధీనంలో నా ప్రాణం ఉందో ఆ శక్తిమంతుని సాక్షి! మన సరస్సు దగ్గర్నుండి ఇతరుల ఒంటెలను దూరంగా ఎలా తోలేస్తామో, అలాగే నేను నా (కౌసర్) సరస్సు దగ్గర్నుండి కొందరు మనుషుల్ని దూరంగా తొలగిస్తాను.

(సహీహ్ బుఖారీ:- 42వ ప్రకరణం – ముసాఖాత్, 10వ అధ్యాయం – మర్రఆ అన్న సాహిబల్ హౌజ్ వల్ ఖుర్భతి అహఖ్ఖు బిమాయిహీ)

1486 – حديث أَنَسِ بْنِ مَالِكٍ رضي الله عنه، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: إِنَّ قَدْرَ حَوْضِي كَمَا بَيْنَ أَيْلَةَ وَصَنْعَاءَ مِنَ الْيَمَنِ، وَإِنَّ فِيهِ مِنَ الأَبَارِيقِ، كَعَدَدِ نُجُومِ السَّمَاءِ
__________
أخرجه البخاري في: 81 كتاب الرقاق: 53 باب في الحوض وقول الله تعالى (إنا أعطيناك الكوثر)

1486. హజ్రత్ అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు : నా సరస్సు ‘ఐలా’ నుండి ‘సనా’ * వరకు ఎంత దూరం ఉంటుందో అంత పొడవుగా ఉంటుంది. అక్కడ, ఆకాశంలో ఎన్ని నక్షత్రాలుంటాయో అన్ని చెంబులుంటాయి.

(సహీహ్ బుఖారీ:- 81వ ప్రకరణం – రిఖాఖ్, 53వ అధ్యాయం – ఫిల్ హౌజి వ ఖౌలిల్లాహి తాలా ఇన్నా ఆతయ్ నా కల్ కౌసర్)

(*) ‘ఐలా’ అనేది సిరియా దేశంలోని ఒక ప్రముఖ పట్టణం పేరు. కాని ఈ నాడది నిర్జన ప్రదేశంగా మారిపోయింది. ‘సనా’ అనేది యమన్ దేశంలోని ముఖ్య పట్టణం పేరు. (సంకలనకర్త)

1487 – حديث أَنَسِ بْنِ مَالِكٍ، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: لَيَرِدَنَّ عَلَيَّ نَاسٌ مِنْ أَصْحَابِي الْحَوْضَ حَتَّى عَرَفْتُهُمُ اخْتُلِجُوا دُونِي، فَأَقُولُ: أَصْحَابِي فَيَقُولُ: لاَ تَدْرِي مَا أَحْدَثُوا بَعْدَكَ
__________
أخرجه البخاري في: 81 كتاب الرقاق 53 باب في الحوض وقول الله تعالى (إنا أعطيناك الكوثر)

1487. హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా తెలిపారు :-

“నా అనుచరుల్లో కొందరు నా సరస్సు దగ్గరకి వస్తారు. నేను వారిని గుర్తుపడ్డాను కూడా. కాని వారిని నా దగ్గర్నుండి లాగి దూరంగా నెట్టివేయడం జరుగుతుంది. అప్పుడు నేను “వీరు నా అనుచరులు” అంటాను. కాని “మీరు (ఇహలోకం వీడి) పోయిన తరువాత వీరు ఎలాంటి కొత్త పోకడలు సృష్టించారో మీకు తెలియదు” అని నాకు సమాధానం ఇవ్వబడుతుంది”.

(సహీహ్ బుఖారీ:- 81వ ప్రకరణం – రిఖాఖ్, 53వ అధ్యాయం – ఫిల్ హౌజి వ ఖౌలిల్లాహి తాలా ఇన్నా ఆతయ్ నా కల్ కౌసర్)

1488 – حديث سَعْدِ بْنِ أَبِي وَقَّاصٍ رضي الله عنه، قَالَ: رَأَيْتُ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَوْمَ أُحُدٍ، وَمَعَهُ رَجُلاَنِ يُقَاتِلاَنِ عَنْهُ، عَلَيْهِمَا ثِيَابٌ بِيضٌ، كَأَشَدِّ الْقِتَالِ، مَا رَأَيْتهُمَا قَبْلُ وَلاَ بَعْدُ
__________
أخرجه البخاري في: 64 كتاب المغازي: 18 باب إذ همت طائفتان منكم أن تفشلا

1488. హజ్రత్ సాద్ బిన్ అబీ వఖ్ఖాస్ (రదియల్లాహు అన్హు) కథనం:-

ఉహుద్ యుద్ధంలో నేను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ముందు ఇద్దరు వ్యక్తులు ఆయనకు రక్షణగా అవిశ్వాసులతో పోరాడుతుంటే చూశాను. వారిద్దరు తెల్లబట్టలు ధరించి ఉన్నారు. యుద్ధం చేయడంలో పూర్తిగా లీనమైపోయారు. వారిద్దర్ని నేను ఇది వరకు గాని ఆ తరువాత గాని చూడలేదు.

(సహీహ్ బుఖారీ:- 6 వ ప్రకరణం – మగాజి, 18వ అధ్యాయం – ఇజ్ హమ్మత్తాయిఫతాన్ మిన్కుమ్ అస్తఫ్ షలా)

1489 – حديث أَنَسٍ رضي الله عنه، قَالَ: كَانَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ أَحْسَنَ النَّاسِ وَأَشْجَعَ النَّاسِ، وَلَقَدْ فَزِعَ أَهْلُ الْمَدِينَةِ لَيْلَةً، فَخَرَجُوا نَحْوَ الصَّوْتِ، فَاسْتَقْبَلَهُمُ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، وَقَدِ اسْتَبْرَأَ الْخَبَرَ وَهُوَ عَلَى فَرَسٍ، لأَبِى طَلْحَةَ، عُرْيٍ، وَفِي عُنُقِهِ السَّيْفُ، وَهُوَ يَقُولُ: [ص:100] لَمْ تُرَاعُوا، لَمْ تُرَاعُوا ثُمَّ قَالَ: وَجَدْنَاهُ بَحْرًا أَوْ قَالَ: إِنَّهُ لَبَحْرٌ
__________
أخرجه البخاري في: 56 كتاب الجهاد: 82 باب الحمائل وتعليق السيف بالعنق

1489. హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం :-

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అందరికన్నా ఎంతో అందమైనవారు. అందరికన్నా ఎక్కువ పరాక్రమశాలి. ఓ రోజు రాత్రి మదీనా ప్రజలు శత్రు భయంతో బిక్కుబిక్కు మంటున్నారు. ఏవో ధ్వనులు వినబడుతుంటే ఏమిటో చూద్దామని భయపడుతూనే బయలుదేరారు. చూస్తే వారికి ఎదురుగా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తిరిగొస్తున్నారు. అప్పటికే ఆయన (ఆ ధ్వనుల గురించిన) వివరాలన్నీ తెలుసుకున్నారు. ఆయన అబూ తల్హా (రదియల్లాహు అన్హు) గారి గుర్రం ఎక్కారు. దాని మీద ఎలాంటి జీను కూడా లేదు. ఆయన భుజానికి ఖడ్గం వ్రేలాడదీయబడి ఉంది. ఆయన వారిని చూసి “భయపడకండి, భయపడాల్సిన పనిలేదు” అని అన్నారు. ఆ తరువాత “ఈ గుర్రం సముద్రంలా ఎంతో వేగంతో పరుగెత్తడం గమనించాను” అని అన్నారు ఆయన.

(సహీహ్ బుఖారీ:- 56వ ప్రకరణం – జిహాద్, 82వ అధ్యాయం – అల్ హమాయిల్ వతాలీఖి సైఫ్ బిల్ ఉనుఖ్ )

1490 – حديث ابْنِ عَبَّاسٍ، قَالَ: كَانَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، أَجْوَدَ النَّاسِ، وَكَانَ أَجْوَدُ مَا يَكونُ فِي رَمَضَانَ، حِينَ يَلْقَاهُ جِبْرِيلُ وَكَانَ يَلْقَاهُ فِي كُلِّ لَيْلَةٍ مِنْ رَمَضَانَ، فَيُدَارِسُهُ القُرْآنَ فَلَرَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ أَجْوَدُ بِالْخَيْرِ مِنَ الرِّيحِ الْمُرْسَلَةِ
__________
أخرجه البخاري في: 1 كتاب بدء الوحي: 5 باب حدثنا عبدان

1490. హజ్రత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) కథనం :-

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అందరికన్నా ఎక్కువ దానశీలురు. ఆయన దానధర్మాలు రమజాన్ నెలలో అత్యధికంగా కన్పిస్తాయి. రమజాన్ నెలలో హజ్రత్ జిబ్రయీల్ (అలైహిస్సలాం) ఆయన దగ్గరకు ప్రతి రాత్రీ వస్తుండేవారు. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆయనతో కలసి ఖుర్ఆన్ పారాయణం చేసేవారు. వాస్తవానికి దానధర్మాలు చేయడంలో ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రభంజనం కన్నా చురుకుగా ఉండేవారు.

(సహీహ్ బుఖారీ:- 1వ ప్రకరణం – వహీ , 5వ అధ్యాయం – హద్దసనా అబ్బాన్)

1491 – حديث أَنَسٍ رضي الله عنه، قَالَ: خَدَمْتُ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، عَشْرَ سِنِينَ، فَمَا قَالَ لِي: أُفٍّ وَلاَ: لِمَ صَنَعْتَ وَلاَ: أَلاّ صَنَعْتَ
__________
أخرجه البخاري في: 78 كتاب الأدب: 39 باب حسن الخلق والسخاء وما يكره من البخل

1491. హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం:-

నేను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) దగ్గర పదేండ్లు సేవ చేశాను. కాని ఆయన నన్ను ఏనాడూ కోపగించుకోలేదు; పరుషంగా మాట్లాడలేదు. కనీసం “నువ్విలా ఎందుకు చేశావ”ని కూడా ఆయన నన్నడగలేదు.

(సహీహ్ బుఖారీ:- 78వ ప్రకరణం – అదబ్, 39వ అధ్యాయం – హుస్నుల్ ఖులుఖి వస్సఖా వమా యుక్రహు మినల్ బుఖ్లి)

1492 – حديث أَنَسٍ، قَالَ: لَمَّا قَدِمَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ الْمَدِينَةَ، أَخَذَ أَبُو طَلْحَةَ بِيَدِي، فَانْطَلَقَ بِي إِلَى رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فَقَالَ: يَا رَسُولَ اللهِ إِنَّ أَنَسًا غُلاَمٌ كَيِّسٌ، فَلْيَخْدُمْكَ قَالَ: فَخَدَمْتُهُ فِي الْحَضَرِ وَالسّفَرِ فَوَاللهِ مَا قَالَ لِي، لِشَيْءٍ صَنَعْتُهُ: لِمَ صَنَعْتَ هذَا هكَذَا وَلاَ لِشَيْءٍ لَمْ أَصْنَعْهُ: لِمَ لَمْ تَصْنَعْ هذَا هكَذَا
__________
أخرجه البخاري في: 87 كتاب الديات: 27 باب من استعان عبدًا أو صبيًا

1492. హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం :-

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మదీనాకు (వలస) వచ్చిన తరువాత హజ్రత్ అబూ తల్హా (రదియల్లాహు అన్హు) (హజ్రత్ ఉమ్మె సులైమ్ రదియల్లాహు అన్హా భర్త, హజ్రత్ అనస్ రదియల్లాహు అన్హు గారి సవతి తండ్రి) నా చేయి పట్టుకొని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సన్నిధికి తీసికెళ్ళారు. ఆయనతో “దైవప్రవక్తా! అనస్ (రదియల్లాహు అన్హు) చాలా బుద్ధిమంతుడు. ఇతడ్ని మీ సేవకోసం పెట్టుకోండి” అని అన్నారు. నేను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇంటా బయటా సేవ చేశాను. కాని దైవసాక్షి! నేను చేసిన ఏ పని విషయంలో కూడా నువ్వెందుకు ఇలా చేశావు అని ఆయన నన్నెప్పుడూ అనలేదు. అలాగే నేను చేయని పని విషయంలో నువ్వెందుకు ఇలా చేయలేదు అని కూడా ఆయన నన్నెప్పుడూ మందలించలేదు.

(సహీహ్ బుఖారీ:- 87వ ప్రకరణం – దియాత్, 27వ అధ్యాయం – మనిస్త ఆన అబ్దన్ ఔ సబియ్యా)

1493 – حديث جَابِرٍ رضي الله عنه، قَالَ: مَا سُئِل النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ عَنْ شَيْءٍ قَطُّ، فَقَالَ: لاَ
__________
أخرجه البخاري في: 78 كتاب الأدب: 39 باب حسن الخلق والسخاء وما يكره من البخل

1493. హజ్రత్ జాబిర్ బిన్ అబ్దుల్లా (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను ఏదైనా వస్తువు అడిగినప్పుడు ఆయన ఏనాడు లేదని అనలేదు. (సహీహ్ బుఖారీ:- 78వ ప్రకరణం – అదబ్, 39వ అధ్యాయం – హస్నుల్ ఖులుఖి వస్సఖా వమా యుక్రహు మినల్ బుఖ్లి)

1494 – حديث جَابِرِ بْنِ عَبْدِ اللهِ، قَالَ: قَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: لَوْ قَدْ جَاءَ مَال الْبَحْرَيْنِ قَد أَعْطَيْتُكَ هكَذَا وَهكَذَا وَهكَذَا فَلَمْ يَجِى مَالُ الْبَحْرَيْنِ حَتَّى قبِضَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فَلَمَّا جَاءَ مَالُ الْبَحْرَيْنِ أَمَرَ أَبُو بَكْرٍ، فَنَادَى: مَنْ كَانَ لَهُ عِنْدَ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ عِدَةٌ أَوْ دَيْنٌ فَلْيَأْتِنَا فَأَتَيْتُهُ، فَقُلْتُ: إِنَّ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ لِي: كَذَا وَكَذَا فَحَثَى لِي حَثْيَةً، فَعَدَدْتُهَا فَإِذَا هِيَ خَمْسُمِائَةٍ وَقَالَ: خُذْ مِثْلَيْهَا
__________
أخرجه البخاري في: 39 كتاب الكفالة: 3 باب من تكفل عن ميت دينًا

1494. హజ్రత్ జాబిర్ బిన్ అబ్దుల్లా (రదియల్లాహు అన్హు) కథనం :-

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చేత్తో చూపిస్తూ “బహెరైన్ నుండి (రెవెన్యూ) రాబడి గనక వస్తే నేను మీకు ఇంతింత ఇస్తాను” అని అన్నారు. కాని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇహలోకం వీడిపోయే వరకూ బహెరైన్ నుండి రాబడి రాలేదు. ఆ తరువాత బహెరైన్ నుండి రాబడి వచ్చింది. అప్పుడు (ఖలీఫా) హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) ఒక ప్రకటన గావిస్తూ “దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఎవరికైనా ఏదైనా ఇస్తానని వాగ్దానం చేసి ఉంటే, లేదా ఆయన ఎవరికైనా అప్పుపడి ఉంటే వారంతా నా దగ్గరకు వచ్చి అడగవచ్చు, నేను వారికి (ఆ డబ్బు లేక వస్తు సంపద ఏదైనా సరే) చెల్లిస్తాను” అని అన్నారు. నేనప్పుడు హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) దగ్గరకెళ్ళి “దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) నాతో ఈ ఈ మాటలు చెప్పారు” అని అన్నాను. అప్పుడు ఆయన నాకు రెండు చేతుల నిండా నాణాలు తీసి ఇచ్చారు. నేను వాటిని లెక్కిస్తే అవి అయిదొందలు తేలాయి. హజ్రత్ అబూబకర్ (రదియల్లాహు అన్హు) నాతో “ఇంకా కావాలంటే వాటికి రెట్టింపు తీసుకో” అని అన్నారు.

(సహీహ్ బుఖారీ:- 39వ ప్రకరణం – కిఫాలత్, 3వ అధ్యాయం – మంత కఫ్ఫల అమ్మయ్యితిన్ దైనా)

1495 – حديث أَنَسِ بْنِ مَالِكٍ رضي الله عنه قَالَ: دَخَلْنَا مَعَ رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، عَلَى أَبِي سَيْفٍ الْقَيْنِ وَكَانَ ظِئْرًا لإِبْرَاهِيمَ عَلَيْهِ السَّلاَمُ فَأَخَذَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ إِبْرَاهِيمَ فَقَبَّلَهُ وَشَمَّهُ ثُمَّ دَخَلْنَا عَلَيْهِ، بَعْدَ ذلِكَ، وَإِبْرَاهِيمُ يَجُودُ بِنَفْسِهِ فَجَعَلَتْ عَيْنَا رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ تَذْرِفَانِ فَقَالَ لَهُ عَبْدُ الرَّحْمنِ بْنُ عَوْفٍ رضي الله عنه: وَأَنْتَ يَا رَسُولَ اللهِ فَقَالَ: يَا ابْنَ عَوْفٍ إِنَّهَا رَحْمَةٌ ثُمَّ أَتْبَعَهَا بِأُخْرَى فَقَالَ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: إِنَّ الْعَيْنَ تَدْمَعُ، وَالْقَلْبَ يَحْزَنُ، وَلاَ نَقُولُ إِلاَّ مَا يَرضى رَبُّنَا وَإِنَّا بِفِرَاقِكَ، يَا إِبْرَاهِيمُ لَمَحْزُونُونَ
__________
أخرجه البخاري في: 23 كتاب الجنائز: 44 باب قول النبي صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: (إنا بك لمحزونون)

1495. హజ్రత్ అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) కథనం :-

ఓసారి మేము దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)తో కలసి అబూ యూసుఫ్ అనే ఒక కమ్మరి ఇంటికి వెళ్ళాము. ఆ వ్యక్తి (దైవప్రవక్త కుమారుడు) హజ్రత్ ఇబ్రాహీం (రదియల్లాహు అన్హు)కు పాలుపట్టిన దాయీ భర్త. (అక్కడకు వెళ్ళిన తరువాత) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) (కొడుకు) ఇబ్రాహీం (రదియల్లాహు అన్హు)ని వడిలోకి తీసుకొని ఆయన్ని ముద్దాడారు, చుంబించారు.

ఆ తరువాత మేము మరొకసారి అబూ యూసుఫ్ ఇంటికి వెళ్ళాము. ఆ సమయంలో హజ్రత్ ఇబ్రాహీం (రదియల్లాహు అన్హు) కొన ఊపిరితో సతమతమవుతున్నారు. పిల్లవాడి పరిస్థితి చూసి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కళ్ళు అప్రయత్నంగా చెమ్మగిల్లాయి. హజ్రత్ అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ (రదియల్లాహు అన్హు) ఆయన్ని చూసి (ఆశ్చర్యపోతూ) “దైవ ప్రవక్తా! మీరు కూడా దుఃఖిస్తున్నారా?” అని అడిగారు. దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) “ఇబ్నె ఔఫ్! ఇవి కారుణ్యం, వాత్సల్యాల కన్నీళ్ళు” అని అన్నారు. ఆ తరువాత ఆయన ఆ విషయాన్ని మరింత వివరిస్తూ “కళ్ళు తప్పకుండా అశ్రుపూరితాలవుతాయి, మనస్సు కూడా బాధపడుతోంది. అయితే మా ప్రభువుకు ప్రీతికరమైన మాటలే నా నోట వెలువడుతాయి – ఇబ్రాహీమా! నీ ఎడబాటు మమ్మల్ని శోకసముద్రంలో ముంచివేసింది” అని అన్నారు.


(సహీహ్ బుఖారీ:- 23వ ప్రకరణం – జనాయిజ్, 44వ అధ్యాయం – ఖౌలిన్నబియ్యి (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇన్నాబిక లమహ్ జూనూన్)

1496 – حديث عَائِشَةَ، قَالَتْ: جَاءَ أَعْرَابِيٌّ إِلَى النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَقَالَ: تقَبِّلُونَ الصِّبْيَانَ فَمَا نُقَبِّلُهُمْ فَقَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: أَوَ أَمْلِكُ لَكَ أَنْ نَزَعَ اللهُ مِنْ قَلْبِكَ الرَّحْمَةَ
__________
أخرجه البخاري في: 78 كتاب الأدب: 18 باب رحمة الولد وتقبيله ومعانقته

1496. హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం :-

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సన్నిధికి ఒక పల్లెవాసి వచ్చి “తమరు కూడా పిల్లలను ముద్దాడుతున్నారా! మేము మాత్రం ముద్దు పెట్టుకోము” అని అన్నాడు. దైవప్రవక్త ఈ మాట విని “అల్లాహ్ మీ హృదయాల నుండి మమతానురాగాలను తీసివేస్తే (నేనేమి చేయగలను?) నేను వాటిని పుట్టించలేను కదా?” అని అన్నారు.

(సహీహ్ బుఖారీ:- 78వ ప్రకరణం – అదబ్, 18వ అధ్యాయం – రహ్మతిల్ వలది వ తఖ్బీలిహీ వ ముఆనఖతిహీ)

1497 – حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه قَالَ: قَبَّلَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، الْحَسَنَ بْنَ عَلِيٍّ، وَعِنْدَهُ الأَقْرَعُ بْنُ حَابِسٍ التَّمِيميُّ، جَالِسًا فَقَالَ الأَقْرَعُ: إِنَّ لِي عَشَرَةً مِنَ الْولَدِ مَا قَبَّلْتُ مِنْهُمْ أَحَدًا فَنَظَرَ إِلَيْهِ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، ثُمَّ قَالَ: مَنْ لاَ يَرْحَمُ لاَ يُرْحَمُ
__________
أخرجه البخاري في: 78 كتاب الأدب: 18 باب رحمة الولد وتقبيله ومعانقته

1497. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం :-

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఓ సారి హజ్రత్ హసన్ బిన్ అలీ (రదియల్లాహు అన్హు)ని ముద్దాడారు. ఆ సమయంలో అక్కడే కూర్చున్న అఖ్రా బిన్ హాబిస్ తమీమి (రదియల్లాహు అన్హు) అది చూసి “నాకు పది మంది పిల్లలున్నారు. కాని వారిలో ఏ పిల్లవాడ్నీ ఎన్నడూ నేను ముద్దాడలేదు” అని అన్నారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ మాటలు విని (ఆశ్చర్యంతో) ఆయన వైపు చూస్తూ “కనికరించని వాడు కనికరించబడడు” అని అన్నారు.

(సహీహ్ బుఖారీ:- 78వ ప్రకరణం – అదబ్, 18వ అధ్యాయం – రహ్మతిల్ వలది వ తఖ్బీలిహీ వ ముఆనఖతిహీ)

1498 – حديث جَرِيرِ بْنِ عَبْدِ اللهِ، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: مَنْ لاَ يَرْحَمُ لاَ يُرْحَمُ
__________
أخرجه البخاري في: 78 كتاب الأدب: 27 باب رحمة الناس والبهائم

1498. హజ్రత్ జరీర్ బిన్ అబ్దుల్లా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు : “కనికరించని వాడు కనికారానికి నోచుకోడు.” (సహీహ్ బుఖారీ:- 78వ ప్రకరణం – అదబ్, 27వ అధ్యాయం – రహ్మతిన్నాసి వల్ బహాయిమ్)

1499 – حديث أَبِي سَعِيدٍ الْخدْرِيِّ رضي الله عنه، قَالَ: كَانَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ أَشَدَّ حَيَاءً مِنْ الْعَذْرَاءِ فِي خِدْرِهَا
__________
أخرجه البخاري في: 61 كتاب المناقب: 23 باب صفة النبي صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ

1499. హజ్రత్ అబూ సయీద్ ఖుదరీ (రదియల్లాహు అన్హు) కథనం :- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) పరదాలో ఉండే కన్నెపిల్ల కంటే కూడా ఎక్కువ బిడియపడేవారు. (సహీహ్ బుఖారీ:- 61వ ప్రకరణం – మనాఖిబ్, 23వ అధ్యాయం – సిఫతిన్నబియ్యి (సల్లల్లాహు అలైహి వ సల్లం))

1500 – حديث عَبْدِ اللهِ بْنٍ عَمْرِو، قَالَ: لَمْ يَكُنِ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فَاحِشًا [ص:104] وَلاَ مُتَفَحِّشًا وَكَانَ يَقُولُ: إِنَّ مِنْ خِيَارِكُمْ أَحْسَنَكُمْ أَخْلاَقًا
__________
أخرجه البخاري في: 61 كتاب المناقب: 23 باب صفة النبي صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ

1500. హజ్రత్ అబ్దుల్లా బిన్ అమ్ర్ (రదియల్లాహు అన్హు) కథనం :-

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) స్వభావంలో అశ్లీల ఛాయలు కూడా లేవు. ఆయన అశ్లీల మాటల జోలికే పోయేవారు కాదు. ఆయన (మమ్మల్ని ఉపదేశిస్తూ) “గుణగణాల రీత్యా మీలో ఉత్తముడైన వాడే అందరికంటే శ్రేష్ఠుడు” అని అన్నారు.

(సహీహ్ బుఖారీ:- 81వ ప్రకరణం – మనాఖిబ్, 23వ అధ్యాయం – సిఫతిన్నబియ్యి (సల్లల్లాహు అలైహి వ సల్లం))

1501 – حديث أَنَسِ بْنِ مَالِكٍ، قَالَ: كَانَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فِي سَفَرٍ، وَكَانَ مَعَهُ غُلاَمٌ لَهُ أَسْوَدُ، يُقَالُ لَهُ أَنْجَشَةُ، يَحْدُو فَقَالَ لَهُ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: وَيْحَكَ يَا أَنْجَشَةُ رُوَيْدَكَ بِالْقَوَارِيرِ
__________
أخرجه البخاري في: 78 كتاب الأدب: 95 باب ما جاء في قول الرجل ويلك

1501. హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం :-

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఓసారి ప్రయాణంలో ఉన్నప్పుడు ఆయన వెంట అన్జషా అనే ఓ నీగ్రో బానిస ఉన్నాడు. అతను కవితా గానం చేస్తూ ఒంటెను వేగంగా తోలుతుంటే “నీ పాడు గాను అన్జషా! కాస్త నిదానంగా తోలు. కోమలాంగులను దృష్టిలో పెట్టుకో” అని అన్నారు. *

(సహీహ్ బుఖారీ:- 78వ ప్రకరణం – అదబ్, 95వ అధ్యాయం – మాజాఆ ఫీ ఖౌలిర్రజుల్ వైలక)

* ఈ బానిస మధుర కంఠ స్వరం గలవాడు. అతని కవితాగానం విని ఒంటె హుషారుగా, వేగంగా నడిచేది. అందువల్ల దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) “కోమలాంగుల్ని దృష్టిలో పెట్టుకొని ఒంటెను నిదానంగా తోలు” అని అన్నారు. అయితే కొందరు హదీసు వేత్తలు ఈ హదీసుకు వేరే అర్థాన్ని తీసుకున్నారు. దాని ప్రకారం మధుర కంఠ స్వరంగల ఈ బానిస ప్రేమ కవితలు పఠిస్తుంటే, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆకవితల ప్రభావం స్త్రీల హృదయాల పై పడి గాజులాంటి వారి సున్నిత హృదయాలు పగిలి పోవచ్చని, లేదా అనుచిత ప్రభావం పడవచ్చని భావించి అలా చేయవద్దని అతడ్ని వారించారు. ఇమామ్ నవవీ (రహిమహుల్లాహ్) దీని పై వ్యాఖ్యానిస్తూ “పాట వ్యభిచారానికి మంత్రం వంటిద”ని అన్నారు. (అనువాదకుడు)

1502 – حديث عَائِشَة، أَنَّهَا قَالَتْ: مَا خُيِّرَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، بَيْنَ أَمْرَيْنِ إِلاَّ أَخَذَ أَيْسَرَهُمَا، مَا لَمْ يَكُنْ إِثْمًا فَإِنْ كَانَ إِثْمًا كَانَ أَبْعَدَ النَّاسِ مِنْهُ وَمَا انْتَقَمَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، لِنَفْسِهِ، إِلاَّ أَنْ تُنْتَهَكَ حُرْمَةُ اللهِ فَيَنْتَقِمَ للهِ بِهَا
__________
أخرجه البخاري في: 61 كتاب المناقب: 23 باب صفة النبي صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ

1502. హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం :- రెండు విషయాల్లో ఒక దాన్ని అవలంబించే స్వేచ్ఛ ఇవ్వబడినప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆ రెండింటిలో సులభమైన విషయాన్నే ఎంచుకునేవారు. అయితే ఆ విషయం పాపకార్యమయి ఉండరాదు. ఒకవేళ ఆ సులభమైన విషయం పాపకార్యమయితే అందరికంటే ఆయనే దానికి దూరంగా ఉంటారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఏనాడూ తన స్వవిషయంలో ఎవరి పైనా ప్రతీకారం తీర్చుకోలేదు. కాని దైవాజ్ఞల పట్ల అపచారం జరిగితే మాత్రం ఆయన తప్పకుండా ప్రతీకారం తీర్చుకునేవారు. (సహీహ్ బుఖారీ:- 61వ ప్రకరణం – మనాఖిబ్, 23వ అధ్యాయం – సిఫతిన్నబియ్యి (సల్లల్లాహు అలైహి వ సల్లం))

1503 – حديث أَنَس رضي الله عنه، قَالَ: مَا مَسِسْتُ حَرِيرًا وَلاَ دِيبَاجًا أَلْيَنَ مِنْ كَفِّ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، وَلاَ شَمِمْتُ رِيحًا قَطُّ أَوْ عَرْفًا قَطُّ أَطْيَبَ مِنَ رِيحِ أَوْ عَرْفِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ
__________
أخرجه البخاري في: 61 كتاب المناقب: 23 باب صفة النبي صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ

1503. హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం :- నేనెన్నడూ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హస్తం కంటే మృదువైన పట్టు వస్త్రం కూడా చూడలేదు. అలాగే ఆయన దేహం నుండి వెలువడే సుగంధ పరిమళాన్ని మించిన సువాసనను కూడా నేను ఎప్పుడూ ఆస్వాదించలేదు. (సహీహ్ బుఖారీ:- 61వ ప్రకరణం – మనాఖిబ్, 23వ అధ్యాయం – సిఫతిన్నబియ్యి (సల్లల్లాహు అలైహి వ సల్లం))

1504 – حديث أَنَسٍ، أَنَّ أُمَّ سُلَيْمٍ كَانَتْ تَبْسُطُ لِلنَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ نِطَعًا فَيَقِيلُ عِنْدَهَا عَلَى ذلِكَ النِّطَعِ قَالَ: فَإِذَا نَامَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ أَخَذَتْ مِنْ عَرَقِهِ وَشَعَرِهِ فَجَمَعَتْهُ فِي قَارُورَةٍ، ثُمَّ جَمَعَتْهُ فِي سُكٍّ
__________
أخرجه البخاري في: 79 كتاب الاستئذان: 41 باب من زار قومًا فقال عندهم

1504. హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం :- హజ్రత్ ఉమ్మె సులైమ్ (రదియల్లాహు అన్హా) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కోసం చర్మాన్ని పడకగా పరచేవారు. దాని మీదే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మధ్యాహ్నం వేళ విశ్రాంతి తీసుకునేవారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆ విధంగా పడుకున్న తరువాత హజ్రత్ ఉమ్మె సులైమ్ (రదియల్లాహు అన్హా) ఆయన శరీరం నుండి వెలువడే చెమటను, వెండ్రుకల్ని ఒక సీసాలో పట్టుకునేవారు. ఆ తరువాత వాటిలో ఓ ప్రత్యేక సువాసన “సుక్”ని కలిపి దాచుకునేవారు. (సహీహ్ బుఖారీ:- 79వ ప్రకరణం – ఇస్తియిజాన్, 41వ అధ్యాయం – మన్ జార ఖౌమన్ ఫఖాలి ఇందహుమ్)

1505 – حديث عَائِشَةَ، أُمِّ الْمُؤْمِنِينَ، أَنَّ الْحارثَ بْنَ هِشَامٍ رضي الله عنه، سَأَلَ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَقَالَ: يَا رَسُولَ اللهِ كَيْفَ يَأْتِيكَ الْوَحْيُ فَقَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: أَحْيَانًا يَأْتِينِي مِثْلَ صَلْصَلَةِ الْجَرَسِ، وَهُوَ أَشَدُّهُ عَلَيَّ، فَيُفْصَمُ عَنِّي وَقَدْ وَعَيْتُ عَنْهُ مَا قَالَ وَأَحْيَانًا يَتَمَثَّلُ لِي الْمَلَكُ رَجُلاً فَيُكَلِّمُنِي فَأَعِي مَا يَقُولُ قَالَتْ عَائِشَةَ: وَلَقَدْ رَأَيْتُهُ يَنْزِلُ عَلَيْهِ الْوَحْيُ فِي الْيَوْمِ الشَّدِيدِ الْبَرْدِ فَيَفْصِمُ عَنْهُ، وَإِنَّ جَبِينَهُ لَيَتَفَصَّدُ عَرَقًا
__________
أخرجه البخاري في: 1 كتاب بدء الوحي: 2 باب حدثنا عبد الله بن يوسف

1505. హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం :- హజ్రత్ హారిస్ బిన్ హెషామ్ (రదియల్లాహు అన్హు) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను “దైవప్రవక్తా! మీపై దివ్యావిష్కృతి (వహీ) ఎలా అవతరిస్తుంది?” అని అడిగారు. దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సమాధానమిచ్చారు :

“దివ్యావిష్కృతి (వహీ) అవతరించినప్పుడు ఒక్కోసారి అది నాకు గంటమోతలా విన్పిస్తుంది. ఈ పరిస్థితి నాకు చాలా బాధాకరంగా ఉంటుంది. ఆ పరిస్థితి తొలగిపోగానే నాకు చెప్పబడిన విషయాలు నా మేధలో నిక్షిప్తమయిపోతాయి. ఒక్కొక్కసారి (దివ్యావిష్కృతి (వహీ) తెచ్చే) దైవదూత నా దగ్గరికి మానవాకారంలో వచ్చి నాతో సంభాషిస్తారు.ఆయన చెప్పినది నేను గుర్తుంచుకుంటాను.” నేనొకసారి తీవ్రమైన చలి ఉన్న రోజు ఆయన పై దివ్యావిష్కృతి (వహీ) అవతరిస్తుండగా చూశాను. దివ్యావిష్కృతి (వహీ) స్థితి అంతమైపోగానే ఆయన నుదుటి నుండి స్వేద బిందువులు రాలసాగాయి.

(సహీహ్ బుఖారీ:- 1వ ప్రకరణం – వహీ, 2వ అధ్యాయం – హద్దసనా అబ్దుల్లా బిన్ యూసుఫ్)

1506 – حديث الْبَرَاءِ بْنِ عَازِبٍ، قَالَ: كَانَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، مَرْبُوعًا، بَعِيدَ مَا بَيْنَ الْمَنْكِبَيْنِ، لَهُ شَعَرٌ يَبْلُغُ شَحْمَةَ أُذنَيْهِ، رَأَيْتُهُ فِي حُلَّةٍ حَمْرَاءَ، لَمْ أَرَ شَيْئًا قَطُّ أَحْسَنَ مِنْهُ
__________
أخرجه البخاري في: 61 كتاب المناقب: 23 باب صفة النبي صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ

1506. హజ్రత్ బరా బిన్ ఆజిబ్ (రదియల్లాహు అన్హు) కథనం :-

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మరీ అంత పొడవరి కాదు, మరీ అంత పొట్టివారూ కాదు, మధ్యస్థంగా ఉంటారు. విశాలమైన వక్షస్థలం (తో నిండుగా ఉంటారు). శిరోజాలు చెవి తమ్మె దాకా వ్రేలాడుతూ ఉంటాయి. నేనొకసారి ఆయన్ని అరుణ వస్త్రాలు ధరించి ఉండగా చూస్తే ఆయన ఎంతో అందంగా కన్పించారు. అంతటి సౌందర్యాన్ని నేను మరే వస్తువులోనూ చూడలేదు.

(సహీహ్ బుఖారీ:- 61వ ప్రకరణం – మనాఖిబ్, 23వ అధ్యాయం – సిఫతిన్నబియ్యి (సల్లల్లాహు అలైహి వ సల్లం))

1507 – حديث الْبَرَاءِ، قَالَ: كَانَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، أَحْسَنَ النَّاسِ وَجْهًا، وَأَحْسَنَهُ خَلُقًا، لَيْسَ بِالطَّوِيلِ الْبَائِنِ وَلاَ بِالْقَصِيرِ
__________
أخرجه البخاري في: 61 كتاب المناقب: 23 باب صفة النبي صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ

1507. హజ్రత్ బరాబిన్ ఆజిబ్ (రదియల్లాహు అన్హు) కథనం:-

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ముఖారవిందం అందరి కంటే ఎంతో అందమైనది, సద్గుణ సంపత్తిలోనూ ఆయన యావత్తు మానవుల కంటే గొప్ప సద్గుణశాలి. ఆయన మరీ అంత పొడవరీ కాదు, మరీ అంత పొట్టీ కాదు.

(సహీహ్ బుఖారీ:- 61వ ప్రకరణం – మనాఖిబ్, 23వ అధ్యాయం – సిఫతిన్నబియ్యి (సల్లల్లాహు అలైహి వ సల్లం))

1508 – حديث أَنَسٍ، قَالَ: كَانَ شَعَرُ رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ رَجِلاً لَيْسَ بِالسَّبِطِ وَلاَ الْجَعْدِ، بَيْنَ أُذُنَيْهِ وَعَاتِقِهِ
__________
أخرجه البخاري في: 77 كتاب اللباس: 68 باب الجعد

1508. హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం :- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) శిరోజాలు వంకీలు తిరిగిన జుత్తులా ఉండవు. పూర్తి సరిగా కూడా ఉండవు. మధ్యస్థంగా ఉంటాయి. అవి ఆయన రెండు చెవుల మధ్య భుజాలపై వ్రేలాడుతుంటాయి. (సహీహ్ బుఖారీ:- 77వ ప్రకరణం – లిబాస్, 68వ అధ్యాయం – అల్ జాద్)

1509 – حديث أَنَسٍ، أَنَّ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ كَانَ يَضْرِبُ شَعَرُهُ مَنْكِبَيْهِ
__________
أخرجه البخاري في: 77 كتاب اللباس: 68 باب الجعد

1509. హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం :- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తల వెండ్రుకలు ఆయన భుజాలను తాకుతుంటాయి.(సహీహ్ బుఖారీ:- 77వ ప్రకరణం – లిబాస్, 68వ అధ్యాయం – అల్ జాద్)

1510 – حديث أَنَسٍ عَنْ مُحَمَّدِ بْنِ سِيرِينَ، قَالَ: سَأَلْتُ أَنَسًا أَخَضَبَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: لَمْ يَبْلُغِ الشّيْبَ إِلاَّ قَلِيلاً
__________
أخرجه البخاري في: 77 كتاب اللباس: 66 باب ما يذكر في الشيب

1510. హజ్రత్ ముహమ్మద్ బిన్ సీరీన్ (రహిమహుల్లాహ్) కథనం :- నేనొకసారి హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు)ను “దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తమ తల వెండ్రుకలకు రంగు పూసుకునేవారా?” అని అడిగాను. దానికి హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) సమాధానమిస్తూ “ఆయనలో వృద్ధాప్య సూచనలు బహు తక్కువగా ద్యోతక మయ్యాయి” అని అన్నారు.

(సహీహ్ బుఖారీ:- 77వ ప్రకరణం – లిబాస్, 66వ అధ్యాయం – మాయుజ్కురు ఫిష్ షైబ్ )

1511 – حديث أَبِي جُحَيْفَةَ السُّوَائِيِّ، قَالَ: رَأَيْتُ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، وَرَأَيْتُ بَيَاضًا مِنْ تَحْتِ شَفَتِهِ السُّفْلَى، الْعَنْفَقَةَ
__________
أخرجه البخاري في: 61 كتاب المناقب: 23 باب صفة النبي صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ

1511. హజ్రత్ అబూ హుజైఫా సవాయి (రదియల్లాహు అన్హు) కథనం :- నేను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను చూశాను. ఆయన గడ్డం వెండ్రుకల్లో క్రింది పెదవి క్రింది భాగంలో కాస్తంత తెలుపుదనం చూశాను. (సహీహ్ బుఖారీ:- 81వ ప్రకరణం – మనాఖిబ్, 23వ అధ్యాయం – సిఫతిన్నబియ్యి (సల్లల్లాహు అలైహి వ సల్లం))

1512 – حديث أَبِي جُحَيْفَةَ رضي الله عنه، قَالَ: رَأَيْتُ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، وَكَانَ الْحَسَنُ بْنُ عَلِيٍّ، عَلَيْهِمَا السَّلاَمُ، يُشْبِهُهُ
__________
أخرجه البخاري في: 61 كتاب المناقب: 23 باب صفة النبي صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ


1512. హజ్రత్ అబూ హుజైఫా (రదియల్లాహు అన్హు) కథనం :- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) రూపురేఖల్లో హజ్రత్ హసన్ (రదియల్లాహు అన్హు)ని పోలి ఉండేవారు. (సహీహ్ బుఖారీ:- 61వ ప్రకరణం – మనాఖిబ్, 23వ అధ్యాయం – సిఫతిన్నబియ్యి (సల్లల్లాహు అలైహి వ సల్లం))

1513 – حديث السَّائِبِ بْنِ يَزِيدَ، قَالَ: ذَهَبَتْ بِي خَالَتِي إِلَى النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَقَالَتْ: يَا رَسُولَ اللهِ إِنَّ ابْنَ أَخْتِي وَجِعٌ فَمَسَحَ رَأْسِي، وَدَعَا لِي بِالْبَرَكَةِ، [ص:109] ثُمَّ تَوَضَّأَ، فَشَرِبْتُ مِنْ وَضُوئِهِ، ثُمَّ قُمْتُ خَلْفَ ظَهْرِهِ، فَنَظَرْتُ إِلَى خَاتَمِ النُّبُوَّةِ بَيْنَ كَتِفَيْهِ، مِثْلَ زِرِّ الْحَجَلَةِ
__________
أخرجه البخاري في: 4 كتاب الوضوء: 40 باب استعمال فضل وضوء الناس

1513. హజ్రత్ సాయిబ్ బిన్ యజీద్ (రదియల్లాహు అన్హు) కథనం :- మా పిన్నమ్మ నన్ను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సన్నిధికి తీసికెళ్ళి “దైవప్రవక్తా! నా ఈ సోదరి కుమారుడు జబ్బుపడ్డాడు” అని అన్నది. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) నా తలను నిమురుతూ నా శ్రేయోశుభాల కోసం అల్లాహ్ ని ప్రార్థించారు. ఆ తరువాత ఆయన వుజూ చేశారు. ఆయన వుజూ చేయగా మిగిలిపోయిన నీళ్ళను నేను త్రాగాను. తరువాత ఆయన వెనుక నిలబడ్డాను. ఆయన భుజాల మధ్య నేను దైవ దౌత్య ముద్రను చూశాను. అది పందిరి మంచానికుండే దారపు కుచ్చులా ఉంది.

(సహీహ్ బుఖారీ :- 4వ ప్రకరణం – వుజూ, 40వ అధ్యాయం – ఇస్తిమాలి ఫజ్లి వుజూయిన్నాస్)

1514 – حديث أَنَسِ بْنِ مَالِكٍ يَصِفُ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: كَانَ رَبْعَةً مِنَ الْقَوْمِ، لَيْسَ بِالطَّوِيلِ وَلاَ بِالْقَصِيرِ، أَزْهَرَ اللَّوْنِ، لَيْسَ بِأَبْيَضَ أَمْهَقَ، وَلاَ آدَمَ، لَيْسَ بِجَعْدٍ قَطَطٍ، وَلاَ سَبْطٍ رَجِلٍ؛ أُنْزِلَ عَلَيْهِ وَهُوَ ابْنُ أَرْبَعِينَ، فَلَبِثَ بِمَكَّةَ عَشْرَ سِنِينَ يُنْزَلُ عَلَيْهِ، وَبِالْمَدِينَةِ عَشْرَ سِنِينَ، وَلَيْسَ فِي رَأْسِهِ وَلِحْيَتِهِ عِشْرُونَ شَعَرَةً بَيْضَاءَ
__________
أخرجه البخاري في: 61 كتاب المناقب: 23 باب صفة النبي صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ

1514. హజ్రత్ అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) రూపురేఖలు (వగైరా) వర్ణిస్తూ ఇలా తెలియజేశారు :-

ఆయన మరీ అంత పొడగరీ కాదు, మరీ అంత పొట్టీ కాదు. మధ్యస్థంగా ఉంటారు. దేహచ్చాయ ఎరుపు కలసిన తెలుపు రంగులో ఉంటుంది. మరీ అంత తెలుపూ కాదు, మరీ అంత ఎరుపూ కాదు. తల వెంట్రుకలు మరీ అంత వంకీలు తిరిగి ఉండవు. పూర్తి సరిగా కూడా ఉండవు. నలభై ఏళ్ళ వయస్సులో ఆయన పై దివ్యావిష్కృతి (వహీ) ప్రారంభమైంది. మక్కాలో పది సంవత్సరాల దాకా ఆయనపై దివ్య ఖుర్ఆన్ అవతరిస్తూ ఉండింది. * మదీనాలో కూడా పదేండ్లపాటు ఖుర్ఆన్ అవతరించింది. ఆయన తలలో, గడ్డంలో ఇరవై కూడా నెరసిన వెండ్రుకలు లేవు. (సహీహ్ బుఖారీ:- 81వ ప్రకరణం – మనాఖిబ్, 23వ అధ్యాయం – సిఫతిన్నబియ్యి (సల్లల్లాహు అలైహి వ సల్లం))

*దివ్యావిష్కృతివహీ ప్రారంభమయిన తరువాత దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మక్కాలో పదమూడు సంవత్సరాలు ఉన్నారు. అయితే మూడేండ్లు దివ్యావిష్కృతి (వహీ) అవతరించనందున, దివ్యావిష్కృతి అవతరణ కాలం పదేండ్లు మాత్రమేనన్న విషయం గమనార్హం.

1515 – حديث عَائِشَةَ، أَنَّ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ تُوُفِّيَ وَهُوَ ابْنُ ثَلاَثٍ وَسِتِّينَ
__________
أخرجه البخاري في: 61 كتاب المناقب: 19 باب وفاة النبي صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ

1515. హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం :- “దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇహలోకం వీడిపోయే నాటికి ఆయన వయస్సు అరవై మూడు సంవత్సరాలు.” (సహీహ్ బుఖారీ:- 61వ ప్రకరణం ” మనాఖిబ్, 19వ అధ్యాయం – సిఫతిన్నబియ్యి (సల్లల్లాహు అలైహి వ సల్లం))

1516 – حديث ابْنِ عَبَّاسٍ، قَالَ: مَكَثَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، بِمَكَّةَ ثَلاَثَ عَشْرَةَ، وَتُوُفِّيَ وَهُوَ ابْنُ ثَلاَثٍ وَسِتِّينَ
__________
أخرجه البخاري في: 63 كتاب مناقب الأنصار: 14 باب هجرة النبي صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ وأصحابه إلى المدينة

1516. హజ్రత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) కథనం :- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మక్కాలో పదమూడేండ్లు ఉన్నారు. ఇహలోకం వీడిపోయే నాటికి ఆయన వయస్సు అరవై మూడు సంవత్సరాలు. (సహీహ్ బుఖారీ:- 63వ ప్రకరణం – మనాఖిబిల్ అన్సార్, 14వ అధ్యాయం – హిజ్రతిన్నబియ్యి (సల్లల్లాహు అలైహి వ సల్లం) వ అస్ హాబిహీ ఇలల్ మదీనా)

1517 – حديث جُبَيْرِ بْنِ مُطْعِمٍ رضي الله عنه، قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: لِي خَمْسَةُ أَسْمَاءٍ؛ أَنَا مُحَمَّدٌ وَأَحْمَدُ، وَأَنَا الْمَاحِي الَّذِي يَمْحُو اللهُ بِي الْكُفْرَ، وَأَنَا الْحَاشِرُ الَّذِي يَحْشَرُ النَّاسُ عَلَى قَدَمِي، وَأَنَا الْعَاقِبُ
__________
أخرجه البخاري في: 61 كتاب المناقب: 17 باب ما جاء في أسماء رسول الله صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ

1517. హజ్రత్ జుబైర్ బిన్ ముత్ అమ్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా తెలిపారు :

నాకు ఐదు పేర్లున్నాయి. నా పేరు ముహమ్మద్ కూడా, అహ్మద్ కూడా, మాహీ కూడా. (మాహీ) అంటే అల్లాహ్ నా ద్వారా అవిశ్వాసా (అధర్మా)న్ని అంతమొందించాడు. నాకు హాషిర్ అనే పేరు కూడా ఉంది. హాషిర్ అంటే హష్ర్ (పునరుత్థాన) దినాన ప్రజలు నా అడుగుజాడల (ఇస్లాం ధర్మం) పై లేపబడతారు. నాకు ఆఖిబ్ అనే పేరు కూడా ఉంది (అంటే అందరికంటే చివర్లో వచ్చేవాడని అర్థం).

(సహీహ్ బుఖారీ:- 61వ ప్రకరణం – మనాఖిబ్, 17వ అధ్యాయం – మాజాఆ ఫీ అస్మాయి రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వ సల్లం))

1518 – حديث عَائِشَةَ، قَالَتْ: صَنَعَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ شَيْئًا، فَرَخَّصَ فِيهِ فَتَنَزَّهَ عَنْهُ قَوْمٌ، فَبَلَغَ ذلِكَ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَخَطَبَ، فَحَمِدَ اللهَ، ثُمَّ قَالَ: مَا بَالُ أَقْوَامٍ يَتَنَزَّهُونَ [ص:111] عَنِ الشَّيْءِ أَصْنَعُهُ فَوَاللهِ إِنِّي لأَعْلَمُهُمْ بِاللهِ، وَأَشَدُّهُمْ لَهُ خَشْيَةً
__________
أخرجه البخاري في: 78 كتاب الأدب: 72 باب من لم يواجه الناس بالعتاب

1518. హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం :- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఒక పని చేసి (తమ అనుచరులకు) ఆ పని చేయమనో లేక చేయరాదనో సెలవిచ్చారు. అప్పుడు కొందరు ఆ విషయానికి సంబంధించి ఇవ్వబడిన సౌకర్యాన్ని ఉపయోగించుకోలేదు. ఈ సంగతి తెలిసి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఒక ఉపన్యాసం ఇచ్చారు. అందులో మొదట అల్లాహ్ యొక్క ఔన్నత్యాన్ని స్థుతించి, తరువాత ఇలా అన్నారు – “జనానికి ఏమయింది, నేను స్వయంగా చేస్తున్న పనులను మానేస్తున్నారే? అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను. అల్లాహ్ గురించి నాకు మీ అందరికంటే బాగా తెలుసు. మీ అందరిలోకీ అల్లాహ్ కి ఎక్కువగా భయపడేది కూడా నేనే.” (సహీహ్ బుఖారీ:- 78వ ప్రకరణం – అదబ్, 72వ అధ్యాయం – మల్లమ్ యువాణిహిన్నాస బిల్ యితాబ్)

1519 – حديث عَبْدِ اللهِ بْنِ الزُّبَيْرِ، أَنَّ رَجُلاً مِنَ الأنْصَارِ خَاصَمَ الزُّبَيْرَ عِنْدَ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فِي شِرَاجِ الْحَرَّةِ الَّتِي يَسْقُونَ بهَا النَّخْلَ فَقَالَ الأَنْصَارِيُّ: سَرِّحِ الْمَاءَ يَمُرُّ فَأَبى عَلَيْهِ فَاخْتَصَمَا عِنْدَ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فَقَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، لِلزُّبَيْرِ: اسْقِ يَا زُبَيْرُ ثُمَّ أَرْسِلِ الْمَاءَ إِلَى جَارِكَ فَغَضِبَ الأَنْصَارِيُّ، فَقَالَ: أَنْ كَانَ ابْنَ عَمَّتِكَ فَتَلَوَّنَ وَجْهُ رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، ثُمَّ قَالَ: اسْقِ يَا زُبَيْرُ ثُمَّ احْبِسِ الْمَاءَ حَتَّى يَرْجِعَ إِلَى الْجَدْرِ

[ص:112] فَقَالَ الزُّبَيْرُ: وَاللهِ إِنِّي لأَحْسِبُ هذِهِ الآيَةَ نَزَلَتْ فِي ذلِكَ (فَلاَ وَرَبِّكَ لاَ يُؤْمِنُونَ حَتَّى يُحَكِّمُوكَ فِيمَا شَجَرَ بَيْنَهُمْ) أخرجهما البخاري في: 42 كتاب المساقاة: 6 باب سَكْر الأنهار

1519. హజ్రత్ అబ్దుల్లా బిన్ జుబైర్ (రదియల్లాహు అన్హు) కథనం :- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కాలంలో ఖర్జూర చెట్లకు నీరు సరఫరా అయ్యే ‘హర్రా’ కాలువ విషయమయి హజ్రత్ జుబైర్ (రదియల్లాహు అన్హు)కు, ఒక అన్సారీకి మధ్య తగాదా వచ్చింది. నీటిని (అడ్డుకోకుండా) ప్రవహించనీయమని అన్సారీ వ్యక్తి అంటే, అందుకు హజ్రత్ జుబైర్ (రదియల్లాహు అన్హు) అంగీకరించలేదు. అప్పుడు వారిద్దరు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సన్నిధికి వెళ్ళి ఫిర్యాదు చేశారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ ఫిర్యాదు విని “జుబైర్! మొదట నీవు నీ చెట్లకు నీరు పెట్టుకో, తరువాత నీ పొరుగువాని కోసం వదలెయ్యి” అని అన్నారు. అన్సారీ ఈ తీర్పు విని ముఖం చిట్లించుకుంటూ “జుబైర్ (రదియల్లాహు అన్హు) మీ మేనత్త కొడుకు గనక మీరిలా తీర్పిచ్చారు” అని అన్నాడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)తో. ఈ మాటలు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు కోపాన్ని తెప్పించాయి. ఆయన జుబైర్ (రదియల్లాహు అన్హు)తో “జుబైర్! నీవు నీ చెట్లకు నీరు పెట్టుకో. ఆ తరువాత తోట (మడి) గట్ల దాకా చేరుకోనంతవరకు నీటిని వదలకు” అని అన్నారు.

1520. హజ్రత్ జుబైర్ (రదియల్లాహు అన్హు) పై సంఘటనను గురించి ఇలా అన్నారు :- అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను! ఈ సూక్తి ఆ సంఘటన పైనే అవతరించిందని నేను భావిస్తున్నాను – “కాదు. వీరు తమ పరస్పర విభేదాల విషయంలో (ఓ ముహమ్మద్!) నిన్ను మధ్యవర్తిగా ఒప్పుకొని, దాని పై నీవిచ్చే తీర్పును ఏ మాత్రం సంకోచించకుండా నిండు హృదయంతో శిరసావహించనంతవరకూ వీరు నిజమైన విశ్వాసులు కాలేరు.” (దివ్య ఖుర్ఆన్ – 4:65) (సహీహ్ బుఖారీ :- 42వ ప్రకరణం – ముసాఖాత్, 6వ అధ్యాయం – సక్రిల్ అన్సార్)

1520 – حديث سَعْدِ بْنِ أَبِي وَقَّاصٍ، أَنَّ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: إِنَّ أَعْظَمَ الْمُسْلِمِينَ جُرْمًا مَنْ سَأَلَ عَنْ شَيْءٍ لَمْ يُحَرَّمْ فَحُرِّمَ مِنْ أَجْلِ مَسْئَلَتِهِ
__________
أخرجه البخاري في: 96 كتاب الاعتصام: 3 باب ما يكره من كثرة السؤال وتكلف ما لا يعنيه

1521. హజ్రత్ సాద్ బిన్ అబీ వఖ్కాస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు: నిషిద్ధం (హరాం) కాని విషయం గురించి (అనవసరంగా) ప్రశ్నించి, ఆ ప్రశ్న మూలంగా అది నిషిద్ధం అయ్యేలా దోహదపడే వ్యక్తే ముస్లిములందరిలోకెల్లా పెద్ద నేరస్థుడు. (సహీహ్ బుఖారీ:- 96వ ప్రకరణం – ఏతిసామ్, 3వ అధ్యాయం – మా యుక్రహుమిన్ కస్రతిస్సువాల్ వ తకల్లుఫి మాలాయానీహ్)

1521 – حديث أَنَسٍ رضي الله عنه، قَالَ: خَطَبَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، خُطْبَةً، مَا سَمِعْت مِثْلَهَا قَطُّ قَالَ: لَوْ تَعْلَمُونَ مَا أَعْلَمُ لَضَحِكْتُمْ قَلِيلاً وَلَبَكَيْتُمْ كَثِيرًا قَالَ: فَغَطَّى أَصْحَابُ رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، وُجُوهَهُمْ، لَهُمْ خَنِينٌ فَقَالَ رَجُلٌ: مَنْ أَبِي قَالَ: فُلاَنٌ فَنَزَلَتْ هذِهِ الآيَةُ (لاَ تَسْأَلُوا عَنْ أَشْيَاءَ إِنْ تُبْدَلَكُمْ تَسُؤْكُمْ)
__________
أخرجه البخاري في: 65 كتاب التفسير: 5 سورة المائدة: 12 باب لا تسألوا عن أشياء إن تبدلكم تسؤكم

1522. హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం :- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఓసారి ఒక ఉపన్యాసం ఇచ్చారు. అలాంటి ఉపన్యాస తీరును నేనిదివరకెన్నడూ వినలేదు. ఆయన ప్రసంగిస్తూ ఇలా అన్నారు : “నాకు తెలిసిన విషయాలు మీకు గనక తెలిస్తే మీరు చాలా తక్కువగా నవ్వుతారు, చాలా ఎక్కువగా ఏడుస్తారు” అని అన్నారు. అనుచరులు ఈ మాట వినగానే ముఖాలు దాచుకొని ఎక్కి ఎక్కి ఏడ్వనారంభించారు.

ఆ తరువాత ఒక వ్యక్తి “నా తండ్రి ఎవరు?” అని అడిగాడు. ‘ఫలానా వ్యక్తి నీ తండ్రి’ అన్నారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం). అప్పుడు ఈ సూక్తి అవతరించింది – “విశ్వాసులారా! కొన్ని ప్రశ్నలకు వచ్చే సమాధానాలు మీకు వెగటు కలిగించవచ్చు. అలాంటి (పనికి మాలిన) ప్రశ్నలు అడగకండి.” (ఖుర్ఆన్ – 5:101)

(సహీహ్ బుఖారీ:- 65వ ప్రకరణం – తఫ్సీర్, ఐదో సూరా – అల్ మాయిదా, 12వ అధ్యాయం – లాతస్ అలూ అన్ అష్యా అఇన్ తుబద్దలకుమ్ తసూకుమ్)

1522 – حديث أَنَسٍ رضي الله عنه، قَالَ: سَأَلُوا رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، حَتَّى أَحْفَوْهُ الْمَسْئَلَةَ، فَغَضِبَ، فَصَعِدَ الْمِنْبَرَ، فَقَالَ: لاَ تَسْأَلُونِي الْيَوْمَ عَنْ شَيْءٍ إِلاَّ بَيَّنْتُهُ لَكُمْ فَجَعَلتُ أَنْظُرُ يَمِينًا وَشِمَالاً فَإِذَا كُلُّ رَجُلٍ لاَفٌّ رَأْسَهُ فِي ثَوْبِهِ يَبْكِي فَإِذَا رَجُلٌ كَانَ إِذَا لاَحَى الرِّجَالَ يُدْعَى لِغَيْرِ أَبِيهِ فَقَالَ: يَا رَسُولَ اللهِ مَنْ أَبِي قَالَ: حُذَافَةُ ثُمَّ أَنْشَأَ عُمَرُ، فَقَالَ: رَضِينَا بِاللهِ رَبًّا، وَبِالإِسْلاَمِ دِينًا، وَبِمُحَمَّدٍ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ رَسُولاً، نَعُوذُ بِاللهِ مِنَ الْفِتَنِ فَقَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: مَا رَأَيْتُ فِي الْخَيْرِ وَالشَّرِّ كَالْيَوْمِ قَطُّ، إِنَّهُ صُوِّرَتْ لِي الْجَنَّةُ وَالنَّارُ حَتَّى رَأَيْتُهُمَا وَرَاءَ الْحَائِطِ
__________
أخرجه البخاري في: 80 كتاب الدعوات: 35 باب التعوذ من الفتن

1523. హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం :- ఒకసారి ప్రజలు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను పదే పదే ప్రశ్నలు అడిగి ఆయన్ని విసిగెత్తించారు. దాంతో ఆయన ఆగ్రహోదగ్రులయ్యారు. (మస్జిద్) వేదిక ఎక్కి “(అడగండి) ఈ రోజు మీరు ఏ ప్రశ్న అడిగినా సమాధానమిస్తాను అడగండి” అని అన్నారు ఆయన.

నేను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) నోట ఈ మాటలు విన్న తరువాత అటూ ఇటూ చూశాను. చూస్తే జనం నోట్లో గుడ్డ కుక్కుకొని ఏడ్వనారంభించారు. అప్పుడు ఒక వ్యక్తి లేచి నిలబడ్డాడు – ఇతను జనంతో ఏదైనా జగడానికి దిగితే “నువ్వు ఎవరి కొడుకువు? (అక్రమ సంతానమా?)” అని వారతడ్ని ఎత్తి పొడిచేవారు – అతను లేచి “దైవప్రవక్తా! నా తండ్రి ఎవరూ?”అని అడిగాడు. దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) “హుజాఫా” అని చెప్పారు. ఆ తరువాత హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) లేచి “దైవప్రవక్తా! అల్లాహ్ (మా) ప్రభువు, యజమాని అని, ఇస్లాం (నిజమైన) ధర్మం అని, ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) అల్లాహ్ ప్రవక్త అని మేము విశ్వసిస్తున్నాము, దానికి పూర్తిగా కట్టుబడి ఉన్నాం” అని అన్నారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ మాటలు విని “నేను మంచి చెడులను ఈ రోజు చూసిన విధంగా మరెన్నడూ చూడలేదు. నా ముందు స్వర్గ నరకాలు ప్రవేశ పెట్టబడ్డాయి. నేను వాటిని ఈ గోడ ఆవల వైపున చూశాను” అని అన్నారు.

(సహీహ్ బుఖారీ :- 80వ ప్రకరణం – దావాత్, 35వ అధ్యాయం – అత్త అవ్వుజి మినల్ ఫితన్)

1523 – حديث أَبِي مُوسى، قَالَ: سُئِلَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، عَنْ أَشْيَاءَ كَرِهَهَا، فَلَمَّا أُكْثِرَ عَلَيْهِ غَضِبَ ثُمَّ قَالَ لِلنَّاسِ: سَلُونِي عَمَّا شِئْتُمْ قَالَ رَجُلٌ: مَنْ أَبِي قَالَ: أَبُوكَ حُذَافَةُ فَقَامَ آخَرُ فَقَالَ: مَنْ أَبِي يَا رَسُولَ اللهِ فَقَالَ: أَبُوكَ سَالِمٌ مَوْلَى شَيْبَةَ فَلَمَّا رَأَى عُمَرُ مَا فِي وَجْهِهِ، قَالَ: يَا رَسُول اللهِ إِنَّا نَتُوبُ إِلَى اللهِ عَزَّ وَجَلَّ
__________
أخرجه البخاري في: 3 كتاب العلم: 28 باب الغضب في الموعظة والتعليم إذا رأى ما يكره

1524. హజ్రత్ అబూ మూసా అష్ అరీ (రదియల్లాహు అన్హు) కథనం :- ప్రజలు కొన్ని విషయాలను గురించి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను ప్రశ్నించారు. అవి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు నచ్చలేదు. ప్రశ్నలు మితిమీరిపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తపరుస్తూ “అడగండి, ఏమడగదలచుకున్నారో” అని అన్నారు. అప్పుడు ఒక వ్యక్తి “నా తండ్రి ఎవరూ” అని అడిగాడు. దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) “నీ తండ్రి హుజాఫా” అని అన్నారు. తరువాత మరొక వ్యక్తి లేచి అతను కూడా “నా తండ్రి ఎవరు?” అని అడిగాడు. దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) “నీ తండ్రి షీబా బానిసయిన సాలమ్” అని అన్నారు. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ముఖారవిందంపై ఆగ్రహ సూచనలు ఉండటం గమనించిన హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) లేచి “దైవప్రవక్తా! మేము అల్లాహ్ క్షమాపణ వేడుకుంటున్నాం” అని అన్నారు.

(సహీహ్ బుఖారీ:- 3వ ప్రకరణం – ఇల్మ్, 28వ అధ్యాయం – అల్ గజబి ఫిల్ మౌఇజతి వత్తాలీమి ఇజా రఆ మా యక్రహు)

1524 – حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: وَلَيَأْتِيَنَّ عَلَى أَحَدِكُمْ زَمَانٌ لأَنْ يَرَانِي أَحَبُّ إِلَيْهِ مِنْ أَنْ يَكُونَ لَهُ مِثْلُ أَهْلِهِ وَمَالِهِ
__________
أخرجه البخاري في: 61 كتاب المناقب: 25 باب علامات النبوة في الإسلام

1525. హజ్రత్ అబూ హురెరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధంగా అన్నారు :- మీ పై ఒక కాలం తప్పకుండా వస్తుంది. అప్పుడు మీరు, మీ భార్యా పిల్లలు, సిరి సంపదలకన్నా నన్నే ఎక్కువగా అభిమానిస్తారు (నా దర్శనం కోసమే తహతహలాడుతారు).(సహీహ్ బుఖారీ:- 61వ ప్రకరణం – మనాఖిబ్, 25వ అధ్యాయం – అలామాతిన్నుబువ్వతి ఫిల్ ఇస్లామ్)

1525 – حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، قَالَ: سَمِعْتُ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، يَقُولُ: أَنَا أَوْلَى النَّاسِ بِابْنِ مَرْيَمَ، وَالأَنْبِيَاءُ أَوْلاَدُ عَلاَّتٍ، لَيْسَ بَيْنِي وَبَيْنَهُ نَبِيٌّ
__________
أخرجه البخاري في: 60 كتاب الأنبياء: 48 باب واذكر في الكتاب مريم

1526. హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా తెలియజేశారు:- నేను హజ్రత్ మసీహ్ బిన్ మర్యం (అలైహిస్సలాం)కు అందరికంటే అతి సమీపంగా ఉన్నాను. దైవప్రవక్తలంతా ఒకే తండ్రి సంతానం లాంటి వాళ్ళు. నాకు, హజ్రత్ ఈసా (అలైహిస్సలాం)కు మధ్య మరే ప్రవక్తా లేడు.

(సహీహ్ బుఖారీ:- 60వ ప్రకరణం – అంబియా, 48వ అధ్యాయం – వజ్కుర్ ఫిల్ కితాబి మర్యం)

1526 – حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، قَالَ: سَمِعْتُ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ: مَا مِنْ بَنِي آدَمَ مَوْلُودٌ إِلاَّ يَمَسُّهُ الشَّيْطَانُ، حِينَ يُولَدُ، فَيَسْتَهِلُّ صَارِخًا مِنْ مَسِّ الشَّيْطَانِ، غَيْرَ مَرْيَمَ، وَابْنِهَا
ثُمَّ يَقُولُ أَبُو هُرَيْرَةَ (وَإِنِّي أُعِيذُهَا بِكَ وَذُرِّيَّتَها مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ)
__________
أخرجه البخاري في: 60 كتاب الأنبياء: 44 باب قول الله تعالى واذكر في الكتاب مريم

1527. హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ఉద్బోధించారు:- “ప్రతి పిల్లవాడ్నీ పుట్టుక సమయంలో షైతాన్ తాకుతాడు. షైతాన్ తాకని పిల్లలెవరూ ఆదం సంతానంలో లేరు. షైతాన్ తాకడం వల్లనే పిల్లవాడు పుట్టగానే ఏడుస్తాడు. అయితే హజ్రత్ మర్యమ్ మరియు ఆమె కుమారుడగు హజ్రత్ మసీహ్ (ఏసుక్రీస్తు – అలైహిస్సలాం)ల విషయంలో మాత్రం అలా జరగలేదు”.

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) పై హదీసు ఉల్లేఖించిన తరువాత ఈ క్రింది దైవసూక్తిని పఠించారు – “నేనీమెను, ఈమె భావి సంతతిని శాపగ్రస్తుడైన షైతాన్ బారి నుండి, వాడి ఆగడాల నుండి నీ రక్షణలోకి ఇస్తున్నాను.” (ఖుర్ఆన్-3:36) (సహీహ్ బుఖారీ:- 60వ ప్రకరణం – అంబియా, 44వ అధ్యాయం – ఖౌలిల్లాహితఆలా (వజ్కుర్ ఫిల్ కితాబి మర్యం)

1527 – حديث أَبِي هُرَيْرَةَ، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: رَأَى عِيسى ابْنُ مَرْيَمَ رَجُلاً يسْرِقُ فَقَالَ لَهُ: أَسَرَقْتَ قَالَ: كَلاَّ، وَاللهِ الَّذِي لاَ إِلهَ إِلاَّ هُوَ فَقَالَ عِيسى: آمَنْتُ بِاللهِ وَكَذَّبْتُ عَيْنِي
__________
أخرجه البخاري في: 60 كتاب الأنبياء: 48 باب واذكر في الكتاب مريم

1528. హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా అన్నారు:-

హజ్రత్ ఈసా ప్రవక్త (అలైహిస్సలాం) ఒక వ్యక్తిని దొంగతనం చేస్తుండగా చూసి “నీవు దొంగతనం చేశావా?” అని అడిగారు. దానికా వ్యక్తి “లేదండీ! అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేని అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను. నేను దొంగతనం చేయనే లేదు” అని అన్నాడు. హజ్రత్ ఈసా (అలైహిస్సలాం) ఈ మాటలు విని “నేను అల్లాహ్ ను విశ్వసిస్తున్నాను (నీవు అల్లాహ్ ను సాక్షిగా పెట్టి చెబుతున్నందువల్ల నేను నీ మాటలను నమ్ముతున్నాను) నా కళ్ళే అబద్ధమాడాయి” అని అన్నారు.

(సహీహ్ బుఖారీ:- 60వ ప్రకరణం – అంబియా, 48వ అధ్యాయం – వజ్కుర్ ఫిల్ కితాబి మర్యం)

1528 – حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، قَالَ: قَالَ: رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: اخْتَتَنَ إِبْرَاهِيمُ عَلَيْهِ السَّلاَمُ، وَهُوَ ابْنُ ثَمَانِينَ سَنَةً، بِالْقَدُّومِ
__________
أخرجه البخاري في: 60 كتاب الأنبياء: 8 باب قول الله تعالى (واتخذ الله إبراهيم خليلاً)

1529. హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా అన్నారు:- హజ్రత్ ఇబ్రాహీం (అలైహిస్సలాం) ఎనభై ఏండ్ల వయస్సులో ఖత్నా (వడుగులు) చేసుకున్నారు. ఆయన బాడిసతో ఖత్నా చేసుకున్నారు.* (సహీహ్ బుఖారీ:- 60వ ప్రకరణం – అంబియా, 8వ అధ్యాయం – ఖౌలిల్లాహి తఆలా (వత్త ఖజల్లాహు ఇబ్రాహీమ ఖలీలా)

* ఇక్కడ మూల భాషలో ఖద్దూమ్ అనే పదానికి బాడిస అని శాబ్దిక అర్థం వస్తుంది. ఖద్దూమ్ అనేది సిరియా దేశంలోని ఒక గ్రామం పేరు కూడా. అంచేత హదీసు వేత్తలలో కొందరు మొదటి అర్ధాన్ని, మరికొందరు రెండవ అర్థాన్ని తీసుకున్నారు. (ఇమామ్ నవవీ-రహిమహుల్లాహ్)

1529 – حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: نَحْنُ أَحَقُّ بِالشَكِّ مِنْ إِبْرَاهِيمَ، إِذْ قَالَ رَبِّ أَرِنِي كَيْفَ تُحْيِي الْمَوْتَى قَالَ أَوَ لَمْ تُؤْمِنْ قَالَ بَلَى وَلكِنْ لِيَطْمَئِنَّ قَلْبِي وَيَرْحَمُ اللهُ لُوطًا، لَقَدْ كَانَ يَأْوِي إِلَى رُكْنٍ شَدِيدٍ وَلَوْ لَبِثْتُ فِي السِّجْنِ طُولَ مَا لَبِثَ يُوسُفُ لأَجَبْتُ الدَّاعِيَ
__________
أخرجه البخاري في: 60 كتاب الأنبياء: 11 باب قوله عز وجل (ونبئهم عن ضيف إبراهيم)

1530. హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధంగా తెలియజేశారు: హజ్రత్ ఇబ్రాహీం (అలైహిస్సలాం) “ప్రభూ! నీవు మృతులను ఎలా బ్రతికిస్తావో కాస్త నాకు చూపించు” అని వేడుకున్నప్పుడు “నీకు (మా మీద) నమ్మకం లేదా?” అని అంటాడు అల్లాహ్. “ఎందుకు నమ్మకం లేదు? నమ్మకం ఉంది. కాకపోతే నా మనోతృప్తి కోసం అడుగుతున్నా” అని చెబుతారు హజ్రత్ ఇబ్రాహీం (అలైహిస్సలాం) – (ఖుర్ఆన్-2:260)

ఇది ‘అనుమానించడమైతే’ దానికి హజ్రత్ ఇబ్రాహీం (అలైహిస్సలాం) కన్నా మేము ఎక్కువ హక్కుదారులం (అంటే ఇబ్రాహీం అలైహిస్సలాం అనుమానం వల్ల అలా అడగలేదు). అల్లాహ్ హజ్రత్ లూత్ (అలైహిస్సలాం) పై కారుణ్య వర్షం కురిపించుగాక! ఆయన గట్టి ఆధారాన్ని (అంటే అల్లాహ్ ను) రక్షణగా పొందదలిచారు. హజ్రత్ యూసుఫ్ (అలైహిస్సలాం) ఉన్నంత కాలం నేను కారాగారంలో ఉండవలసిన పరిస్థితి వస్తే, అందులో నుంచి విడుదల కావడానికి వచ్చే పిలుపును నేను వెంటనే స్వీకరిస్తాను.

(సహీహ్ బుఖారీ:- 60వ ప్రకరణం – అంబియా, 11వ అధ్యాయం – ఖౌలుహు అజ్జవజల్ల (వనబ్బిహుమ్ అని జైఫి ఇబ్రాహీం))

1530 – حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، قَالَ: لَمْ يَكْذِبْ إِبْرَاهِيمُ عَلَيْهِ السَّلاَمُ، إِلاَّ ثَلاَثَ كَذَبَاتٍ: ثِنْتَيْنِ مِنْهُنَّ فِي ذَاتِ اللهِ عَزَّ وَجَلَّ قَوْلُهُ (إِنِّي سَقِيمٌ) [ص:116] وَقَوْلُهُ (بَلْ فَعَلَهُ كَبِيرُهُمْ هذَا) وَقَالَ: بَيْنَا هُوَ ذَاتَ يَوْمٍ وَسَارَةُ، إِذْ أَتَى عَلَى جَبَّار مِنَ الْجَبَابِرَةِ فَقِيلَ لَهُ: إِنَّ ههُنَا رَجُلاً مَعَهُ امْرَأَةٌ مِنْ أَحْسَنِ النَّاسِ، فَأَرْسَلَ إِلَيْهِ، فَسَأَلَهُ عَنْهَا، فَقَالَ: مَنْ هذِهِ قَالَ: أُخْتِي فَأَتَى سَارَةَ، قَالَ: يَا سَارَةُ لَيْسَ عَلَى وَجْهِ الأَرْضِ مُؤْمِنٌ غَيْرِي وَغَيْرُكِ، وَإِنَّ هذَا سَأَلَنِي فَأَخْبَرْتُهُ أَنَّكِ أُخْتِي، فَلاَ تُكَذِّبِينِي فَأَرْسَلَ إِلَيْهَا فَلَمَّا دَخَلَتْ عَلَيْهِ ذَهَبَ يَتَنَاوَلُهَا بِيَدِهِ، فَأُخِذَ فَقَالَ: ادْعِى اللهَ لِي، وَلاَ أَضُرُّكِ فَدَعَتِ اللهَ، فَأُطْلِقَ ثُمَّ تَنَاوَلَها الثَّانِيَةَ، فَأُخِذَ مِثْلَهَا أَوْ أَشَدَّ فَقَالَ: ادْعِي اللهَ لِي وَلاَ أَضُرُّكِ فَدَعَتْ، فَأُطْلِقَ فَدَعَا بَعْضَ حَجَبَتِهِ، فَقَالَ: إِنَّكُمْ لَمْ تَأْتُونِي بِإِنْسَانٍ، إِنَّمَا أَتَيْتُمُونِي بِشِيْطَانٍ فَأَخْدَمَهَا هَاجَرَ فَأَتَتْهُ، وَهُوَ قَائِمٌ يُصَلِّي فَأَوْمَأَ بِيَدِهِ، مَهْيَا قَالَتْ رَدَّ اللهُ كَيْدَ الْكَافِرِ (أَوِ الْفَاجِرِ) فِي نَحْرِهِ، وَأَخْدَمَ هَاجَرَ
قَالَ أَبُو هُرَيْرَةَ: تِلْكَ أُمُّكُمْ يَا بَنِي مَاءِ السَّمَاءِ
__________
أخرجه البخاري في: 60 كتاب الأنبياء: 8 باب قول الله تعالى (واتخذ الله إبراهيم خليلاً)

1531. హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం:-

హజ్రత్ ఇబ్రాహీం (అలైహిస్సలాం) మూడుసార్లు తప్ప ఎన్నడూ అబద్ధమాడలేదు. రెండుసార్లు అల్లాహ్ కోసం, ఉదాహరణకు – “ఒకసారి నా ఆరోగ్యం సరిగా లేదన్నా”రు ఆయన (సాప్ఫాత్:89), మరొకసారి “కాదు, ఈ పని వారి పెద్దాయన చేశాడు” అని అన్నారు (అంబియా:63).

(మూడో సంఘటన) హజ్రత్ ఇబ్రాహీం (అలైహిస్సలాం), (ఆయన భార్య) హజ్రత్ సారాలు కలిసి (ప్రయాణం చేస్తూ) ఓ రోజు ఒక రాజు దేశంలో ప్రవేశించారు. ఆ రాజుకు “ఇక్కడ (మన దేశాని)కి ఒక (కొత్త) వ్యక్తి వచ్చాడు. అతని వెంట అందరికంటే అతి అందమైన ఒక స్త్రీ ఉంది” అని సమాచారం అందజేయబడింది. అప్పుడు ఆ దుర్మార్గుడు ఒక మనిషిని పంపి ‘ఈ స్త్రీ ఎవర’ని అడిగించాడు. హజ్రత్ ఇబ్రాహీం (అలైహిస్సలాం) “ఈమె నా చెల్లెలు” అని సమాధానం ఇచ్చారు. తరువాత ఆయన హజ్రత్ సారా దగ్గరికి వచ్చి “సారా! ప్రస్తుతం యావత్తు భూమండలంలో నేను, నువ్వు తప్ప మరొక విశ్వాసి లేడు. అతను (నీ గురించి) నన్ను అడిగితే నేను ‘నువ్వు నా చెల్లెల’ని చెప్పాను. కనుక నువ్వు నా మాటను ఖండించకు” అని అన్నారు.

ఆ తరువాత హజ్రత్ ఇబ్రాహీం (అలైహిస్సలాం) హజ్రత్ సారాను ఆ రాజు దగ్గరకు పంపారు. హజ్రత్ సారా అక్కడికి చేరుకున్న తరువాత ఆ రాజు ఆమె చేతిని పట్టుకోబోయాడు. కాని వెంటనే అతని చేయి కట్టుబడిపోయింది. దాంతో ఆ రాజు హజ్రత్ సారాతో “నేను నీకు ఏ హానీ తల పెట్టను. నా కోసం దైవాన్ని ప్రార్థించు” అని అన్నాడు. హజ్రత్ సారా అల్లాహ్ ను ప్రార్థించారు. వెంటనే అతని చేయి విడిపోయింది. అయితే ఆ దుర్మార్గుడు మళ్ళీ హజ్రత్ సారాని పట్టుకోబోయాడు. వెంటనే అతని చేయి ఈసారి ఇంతకు ముందు కంటే కూడా గట్టిగా కట్టుబడిపోయింది. దాంతో అతను (గత్యంతరం లేక) సారాతో “నేను మీకిక ఎలాంటి కీడు తలపెట్టను, నా కోసం దైవాన్ని ప్రార్థించండి” అని వేడుకున్నాడు. హజ్రత్ సారా మళ్ళీ అల్లాహ్ ను ప్రార్థించారు. అతనికి ఆ ఆపద తొలగిపోయింది. ఆ తరువాత అతడు రాజ భటుడ్ని పిలిచి “నీవు నా దగ్గరికి మనిషిని కాదు, దయ్యాన్ని తెచ్చావు” అని మండిపడ్డాడు. ఆ తరువాత ఆ రాజు హజ్రత్ సారా సేవ కోసం హాజిరాను పంపాడు. హజ్రత్ సారా హజ్రత్ ఇబ్రాహీం (అలైహిస్సలాం) దగ్గరకు తిరిగొచ్చారు. అప్పుడు హజ్రత్ ఇబ్రాహీం (అలైహిస్సలాం) ప్రార్థన చేస్తూ “ఏమయింది?” అని అడిగారు చేత్తో సైగ చేస్తూ, దానికి ఆమె సమాధానమిస్తూ “అల్లాహ్ ఆ అవిశ్వాసి లేక ఆ దుర్మార్గుడి దుష్ట పన్నాగాలను అతని మీదికే తిప్పికొట్టాడు, మనకు సేవ చేయడానికి హాజిరాను ఇప్పించాడు” అని అన్నారు.

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) పై హదీసును ఉల్లేఖించిన తరువాత “ఓ గగన జలపుత్రులారా! ఈమే మీ మాతృమూర్తి (హజ్రత్ హాజిరా)” అని అన్నారు (ప్రజలతో).

(సహీహ్ బుఖారీ:- 60వ ప్రకరణం – అంబియా, 8వ అధ్యాయం – ఖౌలిల్లాహి తఆలా (వత్త ఖజల్లాహ ఇబ్రాహీమ ఖలీలా)

1531 – حديث أَبِي هُرَيْرَةَ، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: كَانَتْ بَنُو إِسْرَائِيلَ يَغْتَسِلُونَ عُرَاةً، يَنْظُرُ بَعْضُهُمْ إِلَى بَعْضٍ وَكَانَ مُوسى يَغْتَسِلُ وَحْدَه فَقَالُوا: وَاللهِ مَا يَمْنَعُ مُوسى أَنْ يَغْتَسِلَ مَعَنَا إِلاَّ أَنَّهُ آدَرُ فَذَهَبَ مَرَّةً يَغْتَسِلُ، فَوَضَعَ ثَوْبَهُ عَلَى حَجَرٍ، فَفَرَّ الْحَجَرُ بِثَوْبِهِ، فَخَرَجَ مُوسى فِي إِثْرِهِ يَقُولُ: ثَوْبِي يَا حَجَرُ حَتَّى نَظَرَتْ بَنُو إِسْرَائِيلَ إِلَى مُوسى، فَقَالُوا: وَاللهِ مَا بِمُوسى مِنْ بأسٍ وَأَخَذَ ثَوْبَهُ، فَطَفِقَ بِالْحَجَرِ ضَرْبًا
فَقَالَ أَبُو هُرَيْرَةَ: وَاللهِ إِنَّهُ لَنَدَبٌ بِالْحَجَرِ، سِتَّةٌ أَوْ سَبْعَةٌ، ضَرْبًا بِالحَجَرِ
__________
أخرجه البخاري في: 5 كتاب الغسل: 20 باب من اغتسل عريانًا وحده في الخلوة

1532. హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా తెలియజేశారు:

ఇస్రాయీల్ సంతతి ప్రజలు నగ్నంగా (సామూహిక) స్నానం చేసేవారు. ఆ స్థితిలో పరస్పరం చూసుకునేవారు. అయితే హజ్రత్ మూసా (అలైహిస్సలాం) ఒంటరిగా (వేరేచోట) స్నానం చేస్తుంటే ఇస్రాయీల్ సంతతి ప్రజలు (ఆయన్ని అనుమానిస్తూ) “మూసా (అలైహిస్సలాం) మాతో కలసి (సామూహికంగా) స్నానం చేయకపోవడానికి కారణం ఆయనకు వరిబీజం ఉండటమే” అని చెప్పుకునేవారు. ఒక రోజు హజ్రత్ మూసా (అలైహిస్సలాం) బట్టలు ఊడదీసి ఒకరాయి మీద పెట్టి స్నానం చేయసాగారు. అంతలో ఆ రాయి ఆయన బట్టల్ని తీసుకొని ఎగిరిపోయింది. వెంటనే హజ్రత్ మూసా (అలైహిస్సలాం) నీళ్ళ నుండి బయటికి వచ్చి “ఓ రాయీ! నా బట్టలు నాకిచ్చెయ్యి” అని అంటూ దాని వెంటపడ్డారు. ఆ స్థితిలో ఇస్రాయీల్ సంతతి ప్రజలు ఆయన్ని చూసి “అల్లాహ్ సాక్షి! మూసా (అలైహిస్సలాం)కు ఎలాంటి వ్యాధి లేదే!” అని చెప్పుకున్నారు. ఆ తరువాత మూసా (అలైహిస్సలాం) ఆ రాయి దగ్గర్నుండి తన బట్టలను తీసుకొని దాన్ని కొట్టడం మొదలెట్టారు.

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) ఈ హదీసు ఉల్లేఖించిన తరువాత “దైవసాక్షిగా చెబుతున్నాను. ఆ రాతి మీద మూసా (అలైహిస్సలాం) దెబ్బలకు సంబంధించిన ఆరేడు గుర్తులు పడ్డాయి” అని అన్నారు.

(సహీహ్ బుఖారీ:- 5వ ప్రకరణం – గుసుల్, 20వ అధ్యాయం – మనిగ్ తసల ఉర్వానన్ వహ్ దహూ ఫిల్ ఖల్బతి)

1532 – حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، قَالَ: أُرْسِلَ مَلَكُ الْمَوْتِ إِلَى مُوسى عَلَيهِ السَّلاَمُ فَلَمَّا جَاءَهُ صَكَّهُ فَرَجَعَ إِلَى رَبِّهِ، فَقَالَ: أَرْسَلْتَنِي إِلَى عَبْدٍ لا يُرِيدُ الْمَوْتَ فَرَدَّ اللهُ عَلَيْهِ عَيْنَهُ وَقَالَ: ارْجِعْ فَقُلْ لَهُ يَضَعُ يَدَهُ عَلَى مَتْنِ ثَوْرٍ فَلَهُ بِكُلِّ مَا غَطَّتْ بِهِ يَدُهُ، بِكُلِّ شَعْرَةٍ سَنَةٌ قَالَ: أَيْ رَبِّ ثُمَّ مَاذَا قَالَ: ثُمَّ الْمَوْتُ قَالَ: فَالآنَ فَسَأَلَ اللهَ أَنْ يُدْنِيَهُ مِنَ الأَرْضِ الْمُقَدَّسَةِ رَمْيَةً بِحَجَرٍ
[ص:118] قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: فَلَوْ كُنْتُ ثَمَّ لأَرَيْتُكُمْ قَبْرَهُ إِلَى جَانِبِ الطَّرِيقِ، عِنْدَ الْكَثِيبِ الأَحْمَرِ
__________
أخرجه البخاري في: 23 كتاب الجنائز: 69 باب من أحب الدفن في الأرض المقدسة

1533:- హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం:-

హజ్రత్ మూసా (అలైహిస్సలాం) దగ్గరకు (అల్లాహ్) మృత్యుదూతను పంపాడు (ఆయన ప్రాణం తీసుకురావడానికి). అయితే హజ్రత్ మూసా (అలైహిస్సలాం) మృత్యుదూత కంటి పై లాగి కొట్టారు (ఆ దెబ్బతో దైవదూత కనుగ్రుడ్డు బయటికి వచ్చింది). ఆయన అల్లాహ్ దగ్గరకు తిరిగెళ్ళి “అల్లాహ్! నీవు నన్ను చావడానికి ఇష్టపడని దాసుని దగ్గరకు పంపించావు ప్రాణం తీసుకు రావడానికి” అని అన్నాడు. అల్లాహ్ ఆ మృత్యుదూతకు తిరిగి దృష్టి ప్రసాదించి “సరే, ఈసారి అతని దగ్గరకు వెళ్ళి ఎద్దు వీపు మీద చేయి పెట్టమని చెప్పు. అలా అతని చేతి క్రిందికి ఎన్ని వెండ్రుకలు వస్తే అన్ని సంవత్సరాలు ఆయువు లభిస్తుందని తెలియజెయ్యి” అని అన్నాడు. (మృత్యుదూత దైవాజ్ఞను శిరసావహించాడు) అప్పుడు హజ్రత్ మూసా (అలైహిస్సలాం) “ప్రభూ! ఆ తరువాత తిరిగి ఏమవుతుంది?” అని అడిగారు. “ఆ తరువాత మృత్యువు వస్తుంది” అన్నాడు అల్లాహ్. “అలాగయితే ఆ మృత్యువు ఏదో ఇప్పుడే రప్పించు” అన్నారు హజ్రత్ మూసా (అలైహిస్సలాం). ఆ సందర్భంలోనే ఆయన ఇలా వేడుకున్నారు, “అల్లాహ్! బైతుల్ మఖ్దిస్ నుండి ఒక రాయి విసరినంత దూరంలో నాకు మరణం కలిగించు”.

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు: “నేనక్కడ ఉండి ఉంటే మీకు మూసా (అలైహిస్సలాం) సమాధిని చూపించేవాడ్ని. అది దారి ప్రక్కన ఒక ఎరుపు ఇసుక గుట్ట దగ్గర ఉంది”.

(సహీహ్ బుఖారీ:- 23వ ప్రకరణం – జనాయిజ్, 69వ అధ్యాయం – మన్ అహబ్బద్ధఫ్న ఫిల్ ఆర్జిల్ ముఖద్దసా)

1533 – حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، قَالَ: اسْتَبَّ رَجُلاَنِ، رَجُلٌ مِنَ الْمُسْلِمِينَ، وَرَجُلٌ مِنَ الْيَهُودِ قَالَ الْمُسْلِمُ: وَالَّذِي اصْطَفَى مُحَمَّدًا عَلَى الْعَالَمِينَ فَقَالَ الْيَهُودِيُّ: وَالَّذِي اصْطفَى مُوسى عَلَى الْعَالَمِينَ فَرَفَعَ الْمُسْلِمُ يَدَهُ، عِنْدَ ذلِكَ، فَلَطَمَ وَجْهَ الْيَهُودِيّ فَذَهَبَ الْيَهُودِيُّ إِلَى النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَأَخْبَرَه بِمَا كَانَ مِنْ أَمْرِهِ وَأَمْرِ الْمُسْلِمِ فَدَعَا النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ الْمُسْلِمَ، فَسَأَلَهُ عَنْ ذلِكَ، فَأَخْبَرَهُ فَقَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: لاَ تُخَيِّرُونِي عَلَى مُوسى، فَإِنَّ النَّاسَ يَصْعَقُونَ يَوْمَ الْقِيَامَةِ، فَأَصْعَقُ مَعَهُمْ، فَأَكُونُ أَوَّلَ مَنْ يُفِيقُ، فَإِذَا مُوسى بَاطِشٌ جَانِبَ الْعَرْشِ، فَلاَ أَدْرِي أَكَانَ فِيمَنْ صَعِقَ فَأَفَاقَ قَبْلِي، أَوْ كَانَ مِمَّنِ اسْتَثْنَى اللهُ
__________
أخرجه البخاري في: 44 كتاب الخصومات: 1 باب ما يذكر في الإشخاص والخصومة بين المسلم واليهود

1534:- హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం:-

ఇద్దరు వ్యక్తులు – ఒక ముస్లిం, ఒక యూదుడు – తగాదా పడ్డారు. ముస్లిం (ప్రమాణం చేయడానికి) “యావత్తు ప్రపంచంలో (ప్రవక్త పదవి కోసం) ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను ఎంచుకున్న శక్తి స్వరూపుని సాక్షి!” అని అన్నాడు. దానికి సమాధానంగా
యూదుడు “యావత్తు ప్రపంచంలో (ప్రవక్త పదవి కోసం) మూసా (అలైహిస్సలాం)ను ఎంచుకున్న శక్తి స్వరూపుని సాక్షి!” అని అన్నాడు. ముస్లిం ఈ మాట వినగానే చెయ్యెత్తి యూదుడికి ఓ చెంప దెబ్బకొట్టాడు. యూదుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సన్నిధికి వెళ్ళి జరిగిన వృత్తాంతం అంతా ఆయనకు వివరించాడు. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా అన్నారు:

“(ముస్లింలారా!) మీరు మూసా (అలైహిస్సలాం) పై నాకు ప్రాముఖ్యం ఇవ్వకండి. ప్రళయ దినాన మానవులంతా స్పృహ తప్పుతారు. నేను కూడా స్పృహ తప్పుతాను. ఆ తరువాత అందరికన్నా ముందుగా నేను స్పృహలోకి వస్తాను. అప్పుడు చూస్తే మూసా (అలైహిస్సలాం) అల్లాహ్ సింహాసనం ఒక మూలను పట్టుకొని నిలబడి ఉంటారు. ఆయనసలు స్పృహ తప్పిన వారిలో ఉన్నారా లేక స్పృహ తప్పి ఉంటే నా కంటే ముందే స్పృహలోకి వచ్చారా లేక అల్లాహ్ ఆయన్ని స్పృహ తప్పడం నుండి మినహాయించాడా అనే సంగతి మటుకు నాకు తెలియదు” *.

(సహీహ్ బుఖారీ:- 44వ ప్రకరణం – ఖుసూమాత్, 1వ అధ్యాయం – మాయుజ్కరు ఫిల్ అష్ ఖాసి వల్ ఖుసూమాబైనల్ ముస్లిం వల్ యహూద్)

* దివ్య ఖుర్ఆన్లో “అల్లాహ్ సురక్షితంగా ఉంచేవారు తప్ప భూమ్యాకాశాల్లో నివసించే వారంతా స్పృహ తప్పి పడిపోతారు” అని ఉంది. ఇది ప్రళయ దినాన మొదటి శంఖారావం విన్పించినప్పుడు సంభవిస్తుంది. అందువల్ల ఈ హదీసులోని మూసా ప్రవక్త (అలైహిస్సలాం) స్పృహ తప్పే ప్రస్తావన కూడా మొదటి శంఖారావం సందర్భానికి సంబంధించిన విషయమేనని గ్రహించాలి. (సంకలనకర్త)

1534 – حديث أَبِي سَعِيدٍ الْخُدْرِيِّ رضي الله عنه، قَالَ: بَيْنَمَا رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ جَالِسٌ، جَاءَ يَهُودِيٌّ فَقَالَ: يَا أَبَا الْقَاسِمِ ضَرَبَ وَجْهِي رَجُلٌ مِنْ أَصْحَابِكَ فَقَالَ: مَنْ قَالَ: رَجُلٌ مِنَ الأَنْصَارِ قَالَ: ادْعُوهُ فَقَالَ: أَضَرَبْتَهُ قَالَ: سَمِعْتُهُ بِالسُّوقِ يَحْلِفُ، وَالَّذِي اصْطَفَى مُوسى عَلَى الْبَشَرِ قلْتُ: أَيْ خَبِيثُ عَلَى مُحَمَّدٍ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فَأَخَذَتْنِي غَضْبَةٌ ضَرَبْتُ وَجْهَهُ فَقَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: لاَ تُخَيِّرُوا بَيْنَ الأَنْبِيَاءِ، فَإِنَّ النَّاسَ يَصْعَقُونَ [ص:119] يَوْمَ الْقِيَامَةِ، فَأَكُون أَوَّلَ مَنْ تَنْشَقُّ عَنْهُ الأَرْضُ فَإِذَا أَنَا بِمُوسى آخِذٌ بِقَائِمَةٍ مِنْ قَوَائِمِ الْعَرْشِ، فَلاَ أَدْرِي أَكَانَ فِيمَنْ صَعِقَ أَمْ حُوسِبَ بِصَعْقَةِ الاولَى
__________
أخرجه البخاري في: 44 كتاب الخصومات: 1 باب في الإشخاص والخصومة بين المسلم واليهود

1535. హజ్రత్ అబూసయీద్ ఖుదరీ (రదియల్లాహు అన్హు) కథనం:-

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) (మస్జిద్ లో) కూర్చొని ఉన్నారు. హఠాత్తుగా ఒక యూదుడు వచ్చి “అబుల్ ఖాసిం (సల్లల్లాహు అలైహి వ సల్లం)! మీ అనుచరుల్లో ఒకతను నా ముఖం మీద చెంప దెబ్బ కొట్టాడు” అని అన్నాడు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ మాట విని “ఎవరతను?” అని అడిగారు. “అతనొక అన్సారీ” చెప్పాడు యూదుడు. “అయితే అతడ్ని పిలువు” అన్నారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం). (ఆ అన్సారీ వచ్చాడు) “నువ్వితడ్ని చెంప దెబ్బ కొట్టావా?” అడిగారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం). “ఇతను ప్రమాణం చేస్తూ యావత్తు మానవుల పై మూసా (అలైహిస్సలాం)కు ప్రాధాన్యతనిచ్చి ఆయన్ని ఎన్నుకున్న శక్తి స్వరూపుని సాక్షి అన్నాడు. నేనామాటలు విని, ‘హజ్రత్ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) పై కూడానా? అని చెప్పి కోపం పట్టలేక అతనికి చెంప దెబ్బ కొట్టాను” అని అన్నాడు ఆ అన్సారీ. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా అన్నారు:-

“మీరు దైవప్రవక్తలలో ఒకరి పైనొకరికి ప్రాధాన్యత నివ్వకండి. ప్రళయదినాన (మొదటిసారి శంఖం పూరించబడినప్పుడు) అందరూ స్పృహ తప్పి పడిపోతారు. ఆ తరువాత అందరి కంటే ముందుగా నేను నేల పగిలి బయటికి వస్తాను. అప్పుడు చూస్తే నా ఎదురుగా హజ్రత్ మూసా (అలైహిస్సలాం) అల్లాహ్ సింహాసనం కాలు పట్టుకొని నిలబడి ఉంటారు. ఆయనసలు స్పృహ తప్పి పడిపోయినారా? (తరువాత నా కంటే ముందే స్పృహలోకి వచ్చారా?) లేక (గతంలో) తూర్ పర్వతంపై స్పృహతప్పి పడిపోయిన దానికి బదులు ఇప్పుడు ఆయనకు ఆ స్థితికి గురికాకుండా చేయడం జరిగిందా అనే విషయం నాకు తెలియదు”.

(సహీహ్ బుఖారీ:- 44వ ప్రకరణం – ఖుసూమాత్, 1వ అధ్యాయం – మాయుజ్కరు ఫిల్ అష్ ఖాసి వల్ ఖుసూమాబైనల్ ముస్లిం వల్ యహూద్)

1535 – حديث أَبِي هُرَيْرَةَ، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: لاَ يَنْبَغِي لِعَبْدٍ أَنْ يَقُولَ أَنَا خَيْرٌ مِنْ يُونُسَ بْنِ مَتَّى
__________
أخرجه البخاري في: 60 كتاب الأنبياء: 35 باب قول الله تعالى (وإن يونس لمن المرسلين)

1536. హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ఉపదేశించారు:- ” “ఏ దైవ దాసుడూ తాను హజ్రత్ యూనుస్ బిన్ మత్తై (అలైహిస్సలాం) కంటే శ్రేష్ఠుడ్ని అని చెప్పకూడదు”.

(సహీహ్ బుఖారీ:- 60వ ప్రకరణం – అంబియా, 35వ అధ్యాయం – ఖౌలిల్లాహి త ఆలా (వ ఇన్న యూనుసల మినల్ ముర్సలీన్))

1536 – حديث ابْنِ عَبَّاسٍ، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: لاَ يَنْبَغِي لِعَبْدٍ أَنْ يَقُولَ أَنَا خَيْرٌ مِنْ يُونُسَ بْنِ مَتَّى وَنَسَبَهُ إِلَى أَبيهِ
__________
أخرجه البخاري في: 60 كتاب الأنبياء: 24 باب قول الله تعالى (وهل أتاك حديث موسى)

1537. హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు:-

“ఏ దైవ దాసుడూ తాను హజ్రత్ యూనుస్ బిన్ మత్తె (అలైహిస్సలాం) కంటే శ్రేష్ఠుడ్ని అని చెప్పకూడదు”. మత్తె హజ్రత్ యూనుస్ (అలైహిస్సలాం) తండ్రి పేరు.

(సహీహ్ బుఖారీ:- 60వ అధ్యాయం – అంబియా, 24వ అధ్యాయం – ఫౌలిల్లాహి త ఆలా (హల్ అతాక హదీసు మూసా))

1537 – حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، قِيلَ يَا رَسُولَ اللهِ مَنْ أَكْرَمُ النَّاسِ قَالَ: أَتْقَاهُمْ فَقَالُوا: لَيْسَ عَنْ هذَا نَسْأَلُكَ قَالَ: فَيُوسُفُ نَبِيُّ اللهِ ابْنُ نَبِيِّ اللهِ ابْنِ نَبِيِّ اللهِ [ص:120] ابْنِ خَلِيلِ اللهِ قَالُوا: لَيْسَ عَنْ هذَا نَسْأَلُكَ قَالَ: فَعَنْ مَعَادِنِ الْعَرَبِ تَسْأَلُونَ خِيَارُهُمْ فِي الْجَاهِلِيَّةِ خِيَارُهُمْ فِي الإِسْلاَمِ إِذَا فَقُهُوا
__________
أخرجه البخاري في: 60 كتاب الأنبياء: 8 باب قول الله تعالى (واتخذ الله إبراهيم خليلاً)

1538. హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం:-

ఒక వ్యక్తి మాట్లాడుతూ “దైవప్రవక్తా! మానవులందరిలో కెల్లా ఎక్కువ గౌరవనీయుడు ఎవరు?” అని ప్రశ్నించాడు. “అందరి కంటే ఎక్కువగా అల్లాహ్ కు భయపడుతూ ఆయన ఆజ్ఞలను పాటించేవాడు” అన్నారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం). ప్రశ్నించే వ్యక్తి “మేమీ దృష్టితో అడగలేదు” అని అన్నాడు ” అయితే యూసుఫ్ (అలైహిస్సలాం) ఆయన స్వయంగా దైవప్రవక్తే గాక, ఆయన తండ్రి (హజ్రత్ యాఖూబ్) తాత (హజ్రత్ ఇబ్రాహీం) ఖలీలుల్లాహు కూడా దైవప్రవక్తలే” అన్నారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం). ప్రశ్నించే వ్యక్తి “మేమా దృష్టితో కూడా అడగలేద”ని అన్నాడు. “మరేమిటి? అరబ్బు తెగలు, వాటి ఉప తెగలను గురించి అడుగుతున్నావా? వారిలో అజ్ఞాన కాలంలో సజ్జనులు, సద్వర్తనులుగా ఉండినవారే ముస్లింలైన తరువాత కూడా సజ్జనులు, సద్వర్తనులుగా ఉన్నవారు ఎంతో శ్రేష్ఠులు. కాకపోతే వారు ధర్మంలో మంచి అవగాహన కలిగిన వారయి ఉండాలి” అన్నారు దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం).

(సహీహ్ బుఖారీ:- 60వ ప్రకరణం – అంబియా, 8వ అధ్యాయం – ఖౌలిల్లాహి త ఆలా (వత్త ఖజల్లాహు ఇబ్రాహీమ ఖలీలా)

1538 – حديث أُبَيِّ بْنِ كَعْبٍ، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: قَامَ مُوسى النَّبِيُّ خَطِيبًا فِي بَنِي إِسْرَائِيلَ، فَسُئِلَ: أَيُّ النَّاسِ أَعْلَمُ فَقَالَ: أَنَا أَعْلَمُ فَعَتَبَ اللهُ عَلَيْهِ إِذْ لَمْ يَرُدَّ الْعِلْمَ إِلَيْهِ فَأَوْحى اللهُ إِلَيْهِ أَنَّ عَبْدًا مِنْ عِبَادِي بِمَجْمَعِ الْبَحْرَيْنِ هُوَ أَعْلَمُ مِنْكَ قَالَ: يَا رَبِّ وَكَيْفَ بِهِ فَقِيلَ لَهُ: احْمِلْ حُوتًا فِي مِكْتَلٍ، فَإِذَا فَقَدْتَهُ فَهُوَ ثَمَّ فَانْطَلَقَ، وَانْطَلَقَ بِفَتَاهُ يُوشَعُ بْنِ نُونٍ، وَحَمَلاَ حُوتًا فِي مِكْتَلٍ، حَتَّى كَانَا عِنْدَ الصَّخْرَةِ، وَضَعَا رُؤُوسَهُمَا وَنَامَا فَانْسَلَّ الْحُوتُ مِنَ الْمِكْتَلِ فَاتَّخَذَ سَبِيلَهُ فِي الْبَحْرِ سَرَبًا وَكَانَ لِمُوسى وَفَتَاهُ عَجَبًا فَانْطَلَقَا بَقِيَّةَ لَيْلَتِهِمَا وَيَوْمَهُمَا فَلَمَّا أَصْبَحَ، قَالَ مُوسى لِفَتَاهُ: آتِنَا غَدَاءَنَا، لَقَدْ لَقِينَا مِنْ سَفَرِنَا هذَا نَصَبًا وَلَمْ يَجِدْ مُوسى مَسًّا مِنَ النَّصَبِ حَتَّى جَاوَزَ الْمَكَانَ [ص:121] الَّذِي أُمِرَ بِهِ فَقَالَ لَهُ فَتَاهُ: أَرَأيْتَ إِذْ أَوَيْنَا إِلَى الصَّخْرَةِ فَإِنِّي نَسِيتُ الْحُوتَ قَالَ مُوسى: ذلِكَ مَا كُنَّا نَبْغِي فَارْتَدَّا عَلَى آثَارِهِمَا قَصَصًا فَلَمَّا انْتَهَيَا إِلَى الصَّخْرَةِ، إِذَا رَجُلٌ مُسَجًى بِثَوْبٍ (أوْ قَالَ تَسَجَّى بِثَوْبِهِ) فَسَلَّمَ مُوسى فَقَالَ الْخَضِرُ: وَأَنَّى بِأَرْضِكَ السَّلاَمُ فَقَالَ: أَنَا مُوسى فَقَالَ: مُوسى بَنِي إِسْرَائِيلَ قَالَ: نَعَمْ قَالَ: هَلْ أَتَّبِعُكَ عَلَى أَنْ تُعَلِّمَنِي مِمَّا عُلِّمْتَ رُشْدًا قَالَ إِنَّكَ لَنْ تَسْتَطِيعَ مَعِي صَبْرًا يَا مُوسى إِنِّي عَلَى عِلْمٍ مِنْ عِلْمِ اللهِ عَلَّمَنِيهِ لاَ تَعْلَمُهُ أَنْتَ، وَأَنْتَ عَلَى عِلْمٍ عَلَّمَكَهُ لاَ أَعْلَمُهُ قَالَ: سَتَجِدُنِي إِنْ شَاءَ اللهُ صَابِرًا وَلاَ أَعْصِي لَكَ أمْرًا فَانْطَلَقَا يَمْشِيَانِ عَلَى سَاحِلِ الْبَحْرِ، لَيْسَ لَهُمَا سَفِينَةٌ فَمَرَّتْ بِهِمَا سَفِينَةٌ، فَكَلَّمُوهُمْ أَنْ يَحْمِلُوهُمَا، فَعُرِفَ الْخَضِرُ، فَحَمَلُوهُمَا بِغَيْرِ نَوْلٍ فَجَاءَ عُصْفُورٌ فَوَقَعَ عَلَى حَرْفِ السَفِينَةِ، فَنَقَرَ نَقْرَةً أَوْ نَقْرَتَيْنِ فِي الْبَحْرِ فَقَالَ الْخَضِرُ: يَا مُوسى مَا نَقَصَ عِلْمِي وَعِلْمُكَ مِنْ عِلْمِ اللهِ إِلاَّ

كَنَقْرَةِ هذَا الْعُصْفُورِ فِي الْبَحْرِ فَعَمَدَ الْخَضِرُ إِلَى لَوْحٍ مِنْ أَلْوَاحِ السَّفِينَةِ فَنَزَعَهُ فَقَالَ مُوسى: قَوْمٌ حَمَلُونَا بِغَيْرِ نَوْلٍ، عَمَدْتَ إِلَى سَفِينَتِهِمْ فَخَرَقْتَهَا لِتُغْرِقَ أَهْلَهَا قَالَ: أَلَمْ أَقُلْ إِنَّكَ لَنْ تَسْتَطِيعَ مَعِي صَبْرًا قَالَ: لاَ تُؤَاخِذْنِي بِمَا نَسِيتُ فَكَانَتِ الأُولَى مِنْ مُوسى نِسْيَانًا فَانْطَلَقَا، فَإِذَا غُلاَمٌ يَلْعَبُ مَعَ الغِلْمَانِ، فَأَخَذَ الْخَضِرُ بِرَأْسِهِ مِنْ أَعْلاَهُ فَاقْتَلَعَ رَأْسَهُ بِيَدِهِ فَقَالَ مُوسى: أَقَتَلْتَ نَفْسًا زَكِيَّةً بَغَيْرِ نَفْسٍ قَالَ: أَلَمْ أَقُلْ لَكَ إِنَّكَ لَنْ تَسْتَطِيعَ مَعِي صَبْرًا فَانطَلَقَا حَتَّى إِذَا أَتَيَا أَهْلَ قَرْيَةٍ اسْتَطْعَمَا أَهْلَهَا، فَأَبَوْا أَنْ يُضَيِّفُوهُمَا، فَوَجَدَا [ص:122] فِيهَا جِدَارًا يُرِيدُ أَنْ يَنْقَضَّ، فَأَقَامَهُ قَالَ الْخَضِرُ بِيَدِهِ فَأَقَامَهُ فَقَالَ لَهُ مُوسى: لَوْ شِئْتَ لاَتَّخَذْتَ عَلَيْهِ أَجْرًا قَالَ: هذَا فِرَاقُ بَيْنِي وَبَيْنِكَ قَالَ النَبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: يَرْحَمُ اللهُ مُوسى لَوَدِدْنَا لَو صَبَرَ حَتَّى يُقَصَّ عَلَيْنَا مِنْ أَمْرِهِمَا
__________
أخرجه البخاري في: 3 كتاب العلم: 44 باب ما يستحب للعالم إذا سئل أي الناس أعلم فيكل العلم إلى الله

1539. హజ్రత్ అలీ బిన్ కాబ్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధంగా ఉద్బోధించారు:

హజ్రత్ మూసా (అలైహిస్సలాం) ఇస్రాయీల్ సంతతి వారి ముందు ఉపన్యాసమిస్తున్నారు. అప్పుడు ఒక వ్యక్తి లేచి “అందరి కంటే గొప్ప పండితుడు ఎవరు?” అని ప్రశ్నించాడు. “నేనే” అన్నారు హజ్రత్ మూసా (అలైహిస్సలాం). ఈ మాటలు అల్లాహ్ ఆగ్రహానికి కారణమయ్యాయి. “అల్లాహ్ అందరికంటే గొప్ప జ్ఞాని అని అతను ఎందుకు అనలేదు?” అంటూ ఆగ్రహం వెలిబుచ్చాడు. తరువాత దివ్యావిష్కృతి (వహీ) ద్వారా “మజ్మయిల్ – బహ్రైన్ (రెండు నదుల సంగమం) వద్ద నా దాసుడొకడున్నాడు. అతను నీ కంటే గొప్ప జ్ఞానసంపన్నుడు” అని తెలియజేశాడు. “అయితే ప్రభూ! నేనాయన దగ్గరికి ఎలా చేరుకోవాలి?” అని అడిగారు హజ్రత్ మూసా (అలైహిస్సలాం). “నీ వెంట ఒక చేపను తోలుతిత్తిలో పెట్టుకొని తీసికెళ్ళు. . ఎక్కడయితే నీకా చేప కన్పించదో ఆ ప్రదేశంలోనే నీవా మనిషిని కలుసుకోగలవు” అని తెలియజేశాడు అల్లాహ్.

హజ్రత్ మూసా (అలైహిస్సలాం) యూషె బిన్ నూన్ అనే సేవకుడ్ని వెంటబెట్టుకొని బయలుదేరారు. ఆ సేవకుని దగ్గర తోలు తిత్తిలో చేప ఉంది. ఈ విధంగా వీరిద్దరు చివరికి ఒక చట్టు బండ దగ్గరకు చేరుకున్నారు. దాని మీద మేను వాల్చి కాస్సేపు పడుకున్నారు (ప్రయాణ బడలికతో). అంతలో తోలు తిత్తిలో ఉన్న చేప కాస్తా ఎగిరి బయటికి వెళ్ళిపోయింది. ఆ చేప సముద్రంలోకి సొరంగం లాంటి దారి చేసుకొని చక్కా వెళ్ళిపోయింది. హజ్రత్ మూసా (అలైహిస్సలాం)కు ఆయన సేవకునికి ఇది ఆశ్చర్యం కలిగించింది. (సరే, వారా సంగతి గమనించకుండా అక్కడ్నుంచి బయలుదేరారు. ఆ రాత్రి మిగిలిన భాగం, మరునాడు పగలంతా వారలా నడుస్తూనే పోయారు. తెల్లవారిన తరువాత మూసా (అలైహిస్సలాం) తన సేవకునితో “ఇక తీసుకురా మా పలహారం. మేమీ ప్రయాణంలో చాలా అలసిపోయాము” అని
అన్నారు.

కాని మూసా (అలైహిస్సలాం) తనకు అల్లాహ్ సూచించిన ప్రదేశం దాటి చాలా దూరం ముందుకు పోయేసరికి బాగా అలసిపోయారు – అప్పుడు సేవకుడు (చేప సంగతి గుర్తొచ్చి, “చూశారా! మనం చట్టుబండ మీద విశ్రాంతి తీసుకున్నప్పుడు చేప భలే విచిత్రంగా ఎగిరి సముద్రంలోకి పారిపోయింది. తరువాత మీకు చెబుదామంటే ఆ సంగతి నాకు ఏమాత్రం గుర్తుకు రాలేదు” అని అన్నాడు. హజ్రత్ మూసా (అలైహిస్సలాం) అప్పుడు “మనం దాని కోసమే గదా వెతుకుతున్నాం” అని అన్నారు. కనుక వారిద్దరు వెనక్కి మరలి తమ అడుగు జాడల్లో నడుచుకుంటూ తిరిగి ఆ చట్టుబండ దగ్గరకు చేరుకున్నారు. వారికక్కడ వస్త్రంలో పూర్తిగా చుట్టబడి ఉన్న ఒక వ్యక్తి కన్పించాడు. హజ్రత్ మూసా (అలైహిస్సలాం) ఆ వ్యక్తికి సలాం చేశారు. దానికి ఆ వ్యక్తి (హజ్రత్ ఖిజర్) “మీ దేశంలో సలాం ఎక్కడుంది?” అని అడిగాడు. హజ్రత్ మూసా (అలైహిస్సలాం) ఈ మాట విని “నేను మూసాను” అని అన్నారు. “ఏ మూసా? ఇస్రాయీలీయుల మూసావా?” అడిగాడతను. “ఔనండీ! మీరు పొందిన జ్ఞానం నేను కూడా నేర్చుకోవడానికి నన్ను మీ వెంట ఉండనిస్తారా?” అడిగారు హజ్రత్ మూసా (అలైహిస్సలాం). “నీవు నా వెంట ఉండి (నా వ్యవహారాలు చూస్తూ) సహనం వహించలేవు. నీ దగ్గర లేనటువంటి ప్రత్యేక దైవిక జ్ఞానం నా దగ్గర ఉంది. దాన్ని అల్లాహ్ స్వయంగా నాకు ప్రసాదించాడు. అలాగే నా దగ్గర లేనటువంటి ప్రత్యేక దివ్య జ్ఞానం నీ దగ్గర ఉంది. దాన్ని నీకు అల్లాహ్ ప్రసాదించాడు” అన్నారు హజ్రత్ ఖిజర్ (అలైహిస్సలాం). “అల్లాహ్ తలిస్తే మీరు నన్ను సహనశీలిగా చూడగలరు. నేను మీరిచ్చే ఏ ఆజ్ఞనూ జవదాటను” అన్నారు హజ్రత్ మూసా (అలైహిస్సలాం).

ఈ సంభాషణ తరువాత వారిద్దరూ తమ దగ్గర పడవ లేనందున నది ఒడ్డున నడవసాగారు. కాస్సేపటికి వారికొక పడవ కన్పించింది. వారు పడవ నడిపే వారితో “మమ్మల్ని కూడా పడవలో ఎక్కించుకోండి” అని అన్నారు. వారు హజ్రత్ ఖిజర్ (అలైహిస్సలాం)ను గుర్తుపట్టి ఎలాంటి అద్దె తీసుకోకుండానే వారిద్దర్నీ పడవలోకి ఎక్కించుకున్నారు. కాస్సేపటికి ఒక పిట్ట వచ్చి పడవ అంచు మీద కూర్చున్నది. అది నదిలోని నీటిని ఒకటి లేక రెండు బొట్లు ముక్కుతో పీల్చుకున్నది. హజ్రత్ ఖిజర్ (అలైహిస్సలాం) (ఆ పిట్టవైపు చూపిస్తూ) “నీకు, నాకు లభించిన జ్ఞానాన్ని అల్లాహ్ జ్ఞానంతో పోల్చితే అది ఈ పిట్ట నదిలో నుంచి నీటిని తన ముక్కుతో పీల్చుకున్నంత కూడా లేదు” అని అన్నారు.

ఆ తరువాత కాస్సేపటికి హజ్రత్ ఖిజర్ (అలైహిస్సలాం) పడవకు సంబంధించిన ఒక చెక్కను పీకి వేశారు. హజ్రత్ మూసా (అలైహిస్సలాం) అది చూసి “ఇదేమిటి? వీరు మనను అద్దె తీసుకోకుండా పడవలోకి ఎక్కించుకుంటే మీరు వీరి పడవనే విరగొడ్తారా! పడవ, పడవలోని ప్రయాణీకులు అంతా నదిలో మునిగిపోవాలనా మీ ఉద్దేశం?” అని అన్నారు. దానికి హజ్రత్ ఖిజర్ (అలైహిస్సలాం) “నేను ముందే చెప్పలేదా నీవు నా వెంట ఉండి సహనం వహించలేవని?” అని అన్నారు. హజ్రత్ మూసా (అలైహిస్సలాం) “తప్పయిపోయింది. క్షమించండి (నన్ను ఇబ్బందిలో పడవేయకండి)” అని అన్నారు. ఇది మూసా (అలైహిస్సలాం) గారి మొదటి మరుపు.

ఆ తరువాత వారు ముందుకు సాగారు. వారొక చోట తోటి పిల్లలతో ఆడుకుంటున్న ఒక పిల్లవాడ్ని చూశారు. హజ్రత్ ఖిజర్ (అలైహిస్సలాం) ఆ పిల్లవాడి మెడ పట్టుకొని అతని తలను త్రుంచి మెడ నుండి వేరు చేశారు. మూసా (అలైహిస్సలాం) అది చూసి “మీరు ఏ పాపమెరుగని ఓ పసి బాలుడ్ని అన్యాయంగా చంపేశారే! అని అన్నారు. దానికి హజ్రత్ ఖజర్ (అలైహిస్సలాం) ప్రతిస్పందిస్తూ “నేను ముందే చెప్పానుగా నీవు నా వెంట ఉండి సహనం వహించలేవని?” అని అన్నారు (హజ్రత్ మూసా (అలైహిస్సలాం) మళ్ళీ తప్పయిపోయింది, క్షమించండి అంటారు).

అక్కడ్నుంచి వారిద్దరూ ముందుకు సాగారు. చివరికి వారొక పట్నానికి చేరుకొని పట్నవాసులతో తమకు అన్నం పెట్టండని కోరారు. కాని పట్నవాసులు వారికి ఆతిథ్యమివ్వడానికి నిరాకరించారు. తరువాత (ఆ పట్నంలోనే) వారికొక ఓ ప్రక్కకు వొరిగిపోయిన ఒక గోడ కన్పిస్తుంది. అది పడిపోయే స్థితిలో ఉంది. హజ్రత్ ఖిజర్ (అలైహిస్సలాం) దాన్ని చేత్తో సైగ చేసి నిటారుగా నిలబెట్టారు. మూసా (అలైహిస్సలాం) అది చూసి “మీరు కోరుకుంటే ఈ గోడ మరమ్మత్తుకు ప్రతిఫలం తీసుకోగలరు కదా!” అని అన్నారు. అప్పుడు హజ్రత్ ఖిజర్ (అలైహిస్సలాం) మాట్లాడుతూ “ఇది చివరి అవకాశం. ఇక నీవు నా నుండి విడిపోక తప్పదు” అని అన్నారు.

అల్లాహ్ మూసా (అలైహిస్సలాం)ను కరుణించుగాక! ఆయన గనక సహనం వహించి ఉంటే ఎంత బాగుండేది. మనకా సంఘటనలను గురించిన పూర్తి వివరాలు తెలిసి ఉండేవి.

(సహీహ్ బుఖారీ:- 3వ ప్రకరణం – ఇల్మ్, 44వ అధ్యాయం – మాయుస్తహబ్బులిల్ ఆలిమి ఇజాసుయిల అయ్యున్నాసి ఆలమ్ ఫయకిలుల్ ఇల్మ ఇలల్లాహ్)

మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్) (Al-Lulu-wal-Marjaan) .