2.22 – పశ్చాత్తాప ప్రకరణం | మహా ప్రవక్త మహితోక్తులు

మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్) (Al-Lulu-wal-Marjaan) .  

1746 – حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، قَالَ: قَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: يَقُولُ اللهُ تَعَالَى: أَنَا عِنْدَ ظَنِّ عَبْدِي بِي وَأَنَا مَعَهُ إِذَا ذَكَرَنِي فَإِنْ ذَكَرَنِي فِي نَفْسِهِ، ذَكَرْتُهُ فِي نَفْسِي وَإِنْ ذَكَرَنِي فِي ملإٍ، ذَكَرْتُهُ فِي مَلإٍ خَيْرٍ مِنْهُمْ وَإِنْ تَقَرَّبَ إِلَيَّ بِشِبْرٍ، تَقَرَّبْتُ إِلَيْهِ ذِرَاعًا وَإِنْ تَقَرَّبَ إِلَيَّ ذِرَاعًا، تَقَرَّبْتُ إِلَيْهِ بَاعًا وَإِنْ أَتَانِي يَمْشِي، أَتَيْتُهُ هَرْوَلَةً
__________
أخرجه البخاري في: 97 كتاب التوحيد: 15 باب قول الله تعالى (ويحذركم الله نفسه)

1746. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ఉపదేశించారు :-

అల్లాహ్ ఈ విధంగా తెలియజేస్తున్నాడు – “నా దాసుడు నా గురించి ఎలా ఊహించుకుంటాడో నేనతని కోసం అలాగే ఉంటాను. నా దాసుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటూ నా పేరు స్మరిస్తున్నప్పుడు నేనతని వెన్నంటి ఉంటాను. అతను నన్ను మనసులో జ్ఞాపకం చేస్తే నేను కూడా మనసులో జ్ఞాపకం చేస్తాను. అతను గనక ఏదైనా సమావేశంలో నా గురించి ప్రస్తావిస్తే నేను అంతకంటే శ్రేష్ఠమైన (దైవదూతల) సమావేశంలో అతడ్ని గురించి ప్రస్తావిస్తాను. నా దాసుడు నా వైపు ఒక జానెడు జరిగి వస్తే నేనతని వైపుకు ఒక బారెడు జరిగి వస్తాను. అతను నా వైపుకు ఒక బారెడు పురోగమిస్తే నేనతని వైపుకు రెండు బారలు పురోగమిస్తాను. అతను నా వైపుకు నడచి వస్తే నేనతని వైపుకు పరుగెత్తుకొస్తాను.”

(సహీహ్ బుఖారీ:- 97వ ప్రకరణం – అత్ తౌహీద్, 15వ అధ్యాయం – ఖౌలిల్లాహి తఆలా (వయుహజ్జిరుకు ముల్లాహ నఫ్సహు)

1747 – حديث عَبْدِ اللهِ بْنِ مَسْعُودٍ، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: للهُ أَفْرَحُ بِتَوْبَةِ عَبْدِهِ، مِنْ رَجُلٍ نَزَلَ مَنْزِلاً، وَبِهِ مَهْلَكَةٌ، وَمَعَهُ رَاحِلَتُهُ، عَلَيْهَا طَعَامُهُ وَشَرَابُهُ فَوَضَعَ رَأْسَهُ، فَنَامَ نَوْمَةً، فَاسْتَيْقَظَ، وَقَدْ ذَهَبَتْ رَاحِلَتُهُ حَتَّى اشْتَدَّ عَلَيْهِ الْحَرُّ [ص:239] وَالْعَطَشُ، أَوْ مَا شَاءَ اللهُ، قَالَ: أَرْجِعُ إِلَى مَكَانِي فَرَجَعَ، فَنَامَ نَوْمَةً، ثُمَّ رَفَعَ رَأْسَهُ، فَإِذَا رَاحِلَتُهُ عِنْدَهُ
__________
أخرجه البخاري في: 80 كتاب الدعوات: 4 باب التوبة

1747. హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ వూద్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ఉద్బోధించారు :

“ఒక వ్యక్తి ప్రాణాపాయముండే ప్రదేశంలో దిగుతాడు. అతని ఒంటె మీద అన్న పానీయాల సామగ్రి ఉంటుంది. అతనా ప్రదేశంలో దిగి (ప్రయాణ బడలిక వల్ల) కాస్సేపు పడుకుంటాడు. కాని మేల్కొన్న తరువాత చూస్తే ఆ ఒంటె కన్పించక ఎక్కడికోపోతుంది. (అతను ఎంత వెతికినా అది కన్పించదు) చివరికి ఎండ తీవ్రమయిపోయి దప్పికతో అతను తల్లడిల్లిపోతాడు. ఇలాంటి పరిస్థితిలో ఎదురయ్యే బాధలన్నీ అతనికి ఎదురయ్యాయి. అతను (తిరిగి తిరిగి విసిగి వేసారిపోయి) ఇక లాభం లేదు, తాను తన విడిదికి చేరుకోవాలి అని భావించి ఆ ప్రదేశానికి తిరిగొస్తాడు. అలసిపోయి కాస్సేపు పడుకుంటాడు. మేల్కొన్న తరువాత తల పైకెత్తి చూస్తే అతని ఒంటె అతని ఎదురుగా నిలబడి ఉండటం కన్పిస్తుంది. దాన్ని చూసి అతను పరమానంద భరితుడవుతాడు. అయితే అల్లాహ్ తన దాసుని పశ్చాత్తాపం (తౌబా)పట్ల చెందే ఆనందం ఈ బాటసారి చెందిన ఆనందానికి మించి ఉంటుంది.”

(సహీహ్ బుఖారీ:- 80వ ప్రకరణం – అద్దావాత్, 4వ అధ్యాయం – అత్ తౌబా)

1748 – حديث أَنَسٍ رضي الله عنه، قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: اللهُ أَفْرَحُ بِتَوْبَةِ عَبْدِهِ مِنْ أَحَدِكُمْ، سَقَطَ عَلَى بَعِيرِهِ، وَقَدْ أَضَلَّهُ فِي أَرْضٍ فَلاَةٍ
__________
أخرجه البخاري في: 80 كتاب الدعوات: 4 باب التوبة

1748. హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు :-

ఎలాంటి అన్న పానీయాలు లభించని భయంకర ఎడారి ప్రాంతంలో తప్పిపోయిన తన ఒంటె తిరిగి లభించినపుడు ఒక బాటసారి ఎంత సంతోషిస్తాడో అల్లాహ్ తన దాసుని పశ్చాత్తాపం పట్ల అంతకంటే ఎక్కువ సంతోషిస్తాడు.”

(సహీహ్ బుఖారీ:- 80వ ప్రకరణం – అద్దావాత్, 4వ అధ్యాయం – అత్ తౌబా)

1749 – حديث أَبِي هُرَيْرَةَ، قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: لَمَّا قَضَى اللهُ الْخَلْقَ، كَتَبَ فِي كَتَابِهِ، فهُوَ عِنْدَهُ، فَوْقَ الْعَرْشِ، إِنَّ رَحْمَتِي غَلَبَتْ غَضَبِي
__________
أخرجه البخاري في: 59 كتاب بدء الخلق: 1 باب ما جاء في قول الله تعالى (وهو الذي يبدأ الخلق ثم يعيده)

1749. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు :-

అల్లాహ్ యావత్తు సృష్టిని సృష్టించిన తరువాత తన దగ్గర సింహాసనంపై ఉన్న తన గ్రంథంలో “నా ఆగ్రహం కన్నా నా అనుగ్రహానిదే పై చేయి” అని రాశాడు.

(సహీహ్ బుఖారీ:- 59వ ప్రకరణం – బద్ యిల్ ఖల్ఖ్ , 1వ అధ్యాయం – మాజాఅ ఫీ ఖౌలిల్లాహి తఆలా వహువల్లజీ యబ్ దవుల్ ఖల్ఖ సుమ్మ యుయీదుహు)

1750 – حديث أَبِي هُرَيْرَةَ، قَالَ: سَمِعْتُ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، يَقُولُ: جَعَلَ اللهُ الرَّحْمَةَ مَائَةَ جُزْءٍ فَأَمْسَكَ عِنْدَهُ تِسْعَةً وَتِسْعِينَ جُزْءًا وَأَنْزَلَ فِي الأَرْضِ جُزْءًا وَاحِدًا فَمِنْ ذلِكَ الْجُزْءِ يَتَرَاحَمُ الْخَلْقُ، حَتَّى تَرْفَعَ الْفَرَسُ حَافِرَهَا عَنْ وَلَدِهَا، خَشْيَةَ أَنْ تُصِيبَهُ
__________
أخرجه البخاري في: 78 كتاب الأدب: 19 باب جعل الله الرحمة مائة جزء

1750. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ఉద్బోధించారు :-

అల్లాహ్ (తన) కారుణ్యాన్ని వంద భాగాలు చేసి, అందులో తొంభై తొమ్మిది భాగాలు తన దగ్గర పెట్టుకొని ఒక్క భాగం మాత్రమే భూమిపై అవతరింపజేశాడు. ఆ ఒక్క భాగం కారుణ్యం కారణంగానే మానవులు, ఇతర జీవరాసులు ఒకరి పట్ల మరొకరు కారుణ్యం, కనికరాలతో మసలుకుంటున్నారు. చివరికి (ఈ కారుణ్యం మూలంగానే) గుర్రం తన పిల్ల(కు కాస్త కూడా నష్టం వాటిల్లకూడదని, దాని) పై నుండి తన కాలిగిట్టను ఎత్తుకుంటుంది.

(సహీహ్ బుఖారీ:- 78వ ప్రకరణం – అదబ్, 19వ అధ్యాయం – జఅలల్లాహుర్రహ్మత మిఅత జుజ్యిన్)

1751 – حديث عُمَرَ بْنِ الْخَطَّابِ رضي الله عنه، قَالَ: قَدِمَ عَلَى النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ سَبْيٌ، فَإِذَا امْرَأَةٌ مِن السَّبْيِ قَدْ تَحْلُبُ ثَدْيَهَا، تَسْقِي إِذَا وَجَدَتْ صَبِيًّا فِي السَّبْيِ، أَخَذَتْهُ، فَأَلْصَقَتْهُ بِبَطْنِهَا وَأَرْضَعَتْهُ فَقَالَ لَنَا النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: أَتَرَوْنَ هذِهِ طَارِحَةً وَلَدَهَا فِي النَّارِ قلْنَا: لاَ وَهِيَ تَقْدِرُ عَلَى أَنْ لاَ تَطْرَحَهُ فَقَالَ: للهُ أَرْحَمُ بِعِبَادِهِ، مِنْ هذِهِ بِوَلَدِهَا
__________
أخرجه البخاري في: 78 كتاب الأدب: 18 باب رحمة الولد وتقبيله ومعانقته

1751. హజ్రత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు) కథనం :-

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దగ్గరికి కొందరు ఖైదీలు వచ్చారు. వారిలో ఒక మహిళా ఖైదీ పాలిండ్లలో పాలు పొంగుతున్నాయి. ఆమె ఏ చంటి పిల్లవాడ్ని చూసినా గుండెలకు హత్తుకొని అతనికి పాలు పట్టేది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆ స్త్రీని చూసి మాతో “ఈ స్త్రీ తన పిల్లవాడ్ని అగ్నిలో విసరి వేస్తుందంటారా?” అని అడిగారు. దానికి మేము “విసరివేయదు. తనకు నిరోధక శక్తి ఉన్నంత వరకు ఆమె తన పిల్లవాడ్ని అగ్నిలో ఎంతమాత్రం విసరి వేయదు” అని అన్నాము. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “ఈ స్త్రీ తన పిల్లవాడి పట్ల ఎంత దయామయురాలో, అల్లాహ్ తన దాసుల పాలిట అంతకంటే ఎంతో ఎక్కువ దయామయుడు” అని అన్నారు.

(సహీహ్ బుఖారీ:- 78వ ప్రకరణం – అదబ్, 18వ అధ్యాయం – రహ్మతిల్ వలది వ తఖ్బీ లిహీ వ ముఆనఖతిహీ)

1752 – حديث أَبِي هُرَيْرَةَ، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: قَالَ رَجُلٌ لَمْ يَعْمَلْ خَيْرًا قَطُّ: فَإِذَا مَاتَ، فَحَرِّقُوهُ، وَاذْرُوا نِصْفَهُ فِي الْبَرِّ، وِنِصْفَهُ فِي الْبَحْرِ فَوَاللهِ لَئِنْ قَدَرَ اللهُ عَلَيْهِ، لَيُعَذِّبَنَّهُ عَذَابًا، لاَ يُعَذِّبُهُ أَحَدًا مِنَ الْعَالَمِينَ فَأَمَرَ اللهُ الْبَحْرَ، فَجَمَعَ مَا فِيهِ وَأَمَرَ الْبَرَّ فَجَمَعَ مَا فِيهِ ثُمَّ قَالَ: لِمَ فَعَلْتَ قَالَ: مِنْ خَشْيَتِكَ، وَأَنْتَ أَعْلَمُ فَغَفَرَ لَهُ
__________
أخرجه البخاري في: 97 كتاب التوحيد: 34 باب قول الله تعالى (يريدون أن يبدلوا كلام الله)

1752. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలిపారు :-

ఒకతను ఏనాడూ ఒక్క సత్కార్యం కూడా చేయలేదు. అతను చావు దగ్గరికొచ్చినపుడు (తన కొడుకుల్ని పిలిచి) “నేను చనిపోతే నా భౌతిక కాయాన్ని దహనం చేసి ఆ చితాభస్మాన్ని సగం నేల మీద, సగం సముద్రంలో విసరి పారెయ్యాలి. ఎందుకంటే నేను గనక అల్లాహ్ చేతికి చిక్కితే ఆయన నాకు లోకంలో ఎవరికీ విధించనంతటి కఠిన శిక్ష విధిస్తాడు” అని ఉపదేశించాడు. (అతని వారసులు అతను చెప్పినట్లే చేశారు). అయితే అల్లాహ్ సముద్రాన్ని ఆజ్ఞాపించగానే సముద్రం అతని బూడిదను ఒక చోట సమీకరించింది. అలాగే నేలను ఆజ్ఞాపించగానే నేల కూడా తన పై వెదజల్లబడిన అతని బూడిదనంతటినీ సమీకరించింది. (ఈ విధంగా) అల్లాహ్ (ఆ బూడిద నుండి అతడ్ని తిరిగి బ్రతికించి) నీవిలా ఎందుకు చేశావు?” అని ప్రశ్నించాడు. దానికా వ్యక్తి “నీకు భయపడి చేశాను. నీకీ సంగతి బాగా తెలుసు” అని అన్నాడు. ఈ సమాధానం విని అల్లాహ్ అతడ్ని క్షమించాడు.

(సహీహ్ బుఖారీ:- 35వ ప్రకరణం – అత్ తౌహీద్, 35వ అధ్యాయం – ఖౌలిల్లాహి తఆలా (యురీదూన అయ్యుబద్ధిలూ కలామల్లాహి)

1753 – حديث أَبِي سَعِيدٍ الْخُدْرِيِّ رضي الله عنه عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: أَنَّ رَجُلاً كَانَ قبْلَكُمْ رَغسَهُ اللهُ مَالاً فَقَالَ لِبَنِيهِ لَمَّا حُضِرَ: أَيَّ أَبٍ كُنْتُ لَكُمْ قَالُوا: خَيْرَ أَبٍ قَالَ: فَإِنِّي لَمْ أَعْمَلْ خَيْرًا قَطُّ فَإِذَا مُتُّ فَأَحْرِقُونِي، ثُمَّ اسْحَقُونِي، ثُمَّ ذَرُّونِي فِي يَوْمٍ عَاصِفٍ فَفَعَلُوا فَجَمَعَهُ اللهُ عَزَّ وَجَلَّ، فَقَالَ: مَا حَمَلَكَ قَالَ: مَخَافَتُكَ فَتَلَقَّاهُ بِرَحْمَتِه
__________
أخرجه البخاري في: 60 كتاب الأنبياء: 54 باب حدثنا أبو اليمان

1753. హజ్రత్ అబూ సయీద్ ఖుదరీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలిపారు :

మీకు పూర్వం (గత జాతులలో) ఒక వ్యక్తికి అల్లాహ్ అత్యధిక సిరిసంపదలు ప్రసాదించాడు. అతను మరణ సమయం సమీపించినప్పుడు తన కొడుకుల్ని పిలిచి “నేను మీకు ఎలాంటి తండ్రిని?” అని అడిగాడు. దానికి వారు “ఎంతో మంచి తండ్రి” అని అన్నారు. “అయితే (వినండి) నేను జీవితంలో ఎన్నడూ ఎలాంటి సత్కార్యం చేయలేదు. అందువల్ల నేను చనిపోతే నా భౌతిక కాయాన్ని దహనం చేయాలి. ఆ తరువాత ఎముకల్ని బాగా నూరి పొడి చేసి, దాన్ని తీవ్రంగా గాలి వీస్తున్నప్పుడు ఆ గాలిలోకి విసరి పారెయ్యాలి” అని అన్నాడు. వారతను చెప్పినట్లే చేశారు. అయితే అల్లాహ్ అతని శరీర భాగాలను (అంటే బూడిదను) సమీకరించి అతడ్ని తిరిగి (బ్రతికించి) “నువ్విలా చేయడానికి కారణం ఏమిటీ?” అని అడిగాడు. దానికా వ్యక్తి “నేను నీకు భయపడి అలా చేశాను” అని అన్నాడు. ఈ సమాధానం విని అల్లాహ్ అతడ్ని కనికరించాడు.

(సహీహ్ బుఖారీ:- 60వ ప్రకరణం – అంబియా, 54వ అధ్యాయం – హద్దసనా అబుల్ యమాన్)

1754 – حديث أَبِي هرَيْرَةَ قَالَ: سَمِعْت النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: إِنَّ عَبْدًا أَصَاب ذَنْبًا، وَرُبَّمَا قَالَ، أَذْنَبَ ذَنْبًا فَقَالَ: رَبِّ أَذْنَبْتُ وَرُبَّمَا قَالَ: أَصَبْتُ فَاغْفِرْ لِي فَقَالَ رَبُّهُ: أَعَلِمَ عَبْدِي أَنَّ لَهُ رَبا يَغْفِرُ الذَّنْبَ وَيَأْخُذ بِهِ غَفَرْتُ لِعَبْدِي ثُمَّ مَكَثَ مَا شَاءَ اللهُ ثُمَّ أَصَابَ ذَنْبًا، أَوْ أَذْنَبَ ذَنْبًا فَقَالَ: رَبِّ أَذْنَبْتُ، أَوْ أَصَبْتُ آَخَرَ فَاغْفِرْهُ فَقَالَ: أَعَلِمَ عَبْدِي أَنَّ لَهُ رَبًّا يَغْفِرُ الذَّنْبَ، وَيَأْخُذُ بِهِ غَفَرْتُ لِعَبْدِي ثُمَّ مَكَثَ مَا شَاءَ اللهُ ثُمَّ أَذْنَبَ ذَنْبًا وَرُبَّمَا قَالَ: أَصَابَ ذَنْبًا قَالَ: قَالَ رَبِّ أَصَبْتُ أَوْ أَذْنَبْتُ آخَرَ فَاغْفِرْهُ لِي فَقَالَ: أَعَلِمَ عَبْدِي أَنَّ لَهُ رَبًّا يَغْفِرُ الذَّنْبَ وَيَأْخُذُ بِهِ غَفَرْتُ لِعَبْدِي ثَلاَثًا فَلْيَعْمَلْ مَا شَاءَ
__________
أخرجه البخاري في: 97 كتاب التوحيد: 35 باب قول الله تعالى (يريدون أن يبدلوا كلام الله)

1754. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు :-

దాసుని వల్ల ఏదైనా పాపం జరిగి లేక దాసుడు ఏదైనా పాపానికి పాల్పడి, “ప్రభూ! నేను పాపానికి పాల్పడ్డాను. లేక, ప్రభూ! నా వల్ల పాపం జరిగిపోయింది. నన్ను క్షమించు” అని వేడుకుంటే, అల్లాహ్ (దైవ దూతలతో) “నా దాసునికి తన పాపాలను క్షమించే ఒక ప్రభువున్నాడని కూడా తెలుసా? ఆ పాపాలకు ఆయన తనను పట్టుకుంటాడని కూడా తెలుసా? సరే, నేనితడ్ని క్షమిస్తున్నాను” అని అంటాడు. ఆ తరువాత అల్లాహ్ తలచినంత కాలం అతను పాపాలకు దూరంగా ఉంటాడు. తరువాత అతని వల్ల మళ్ళీ పాపం జరిగిపోతుంది. లేక అతను మళ్ళీ పాపానికి పాల్పడతాడు. అప్పుడతను “ప్రభూ! నేను మళ్ళీ పాపం చేశాను. లేక నా వల్ల మళ్ళీ పాపం జరిగిపోయింది. నన్ను క్షమించు” అని వేడుకుంటాడు. అది విని అల్లాహ్ (తన దూతలతో) “నా దాసునికి తన పాపాలను క్షమించే ప్రభువు ఒకడు ఉన్నాడని కూడా తెలుసా? ఆ పాపాలకు గాను ఆయన తనను పట్టుకుంటాడని కూడా తెలుసా? సరే, నేనతడ్ని క్షమిస్తున్నాను” అని అంటాడు. ఆ తరువాత అల్లాహ్ తలచినంత కాలం అతను పాపాలకు దూరంగా ఉంటాడు. తరువాత అతను మళ్ళీ పాపానికి పాల్పడతాడు లేక అతని వల్ల పాపం జరుగుతుంది. అందువల్ల అతను “ప్రభూ! నా వల్ల పాపం జరిగిపోయింది. లేక నేనొక పాపానికి పాల్పడ్డాను. నన్ను క్షమించు” అని వేడుకుంటాడు మళ్ళీ. అల్లాహ్ అది విని “పాపాలను క్షమించే తన ప్రభువు కూడా ఒకడున్నాడని నా దాసునికి తెలుసా? సరే, నేను నా దాసుడ్ని క్షమిస్తున్నాను. (అల్లాహ్ ఈ మాటను మూడు సార్లు అంటాడు) ఇప్పుడతను ఏదైనా చేసుకోవచ్చు” అని అంటాడు.

(సహీహ్ బుఖారీ:- 97వ ప్రకరణం – అత్తౌహీద్, 35వ అధ్యాయం – ఖౌలిల్లాహి తఆలా (యురీదూన అయ్యుబద్ధిలూ కలామల్లాహి)

1755 – حديث عَبْدِ اللهِ بْنِ مَسْعُودٍ رضي الله عنه، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: لاَ أَحَدَ أَغْيَرُ مِنَ اللهِ وَلِذلِكَ حَرَّمَ الْفَوَاحِشَ، مَا ظَهَرَ مِنْهَا، وَمَا بَطَنَ وَلاَ شَيْءَ أحَبُّ إِلَيْهِ الْمَدْحُ مِنَ اللهِ [ص:243] وَلِذلِكَ مَدَحَ نَفْسَهُ
__________
أخرجه البخاري في: 65 كتاب التفسير: 6 سورة الأنعام: 7 باب ولا تقربوا الفواحش ما ظهر منها وما بطن

1755. హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ వూద్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు :-

అల్లాహ్ ను మించిన ఆత్మాభిమానం కలవారు మరెవరూ లేరు. అందువల్లనే ఆయన రహస్య, బహిరంగ, అశ్లీల విషయాలన్నిటినీ నిషేధించాడు. అల్లాహ్ కు స్తుతిస్తోత్రాలకంటే ప్రియమైన విషయం మరేదీ లేదు. ఈ కారణంగానే ఆయన స్వయంగా తనను స్తుతించుకున్నాడు (ఎవరూ ప్రశంసించకపోయినా ఆయన స్వతహాగానే ప్రశంసనీయుడు).

(సహీహ్ బుఖారీ:- 65వ ప్రకరణం – తఫ్సీర్, 6వ సూరా – అన్ ఆమ్. 7వ అధ్యాయం – వలా తఖ్రబుల్ ఫవాహిష్ మా జహ్ర మినహా వమా బతన)

1756 – حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، أَنَّهُ قَالَ: إِنَّ اللهَ يَغَارُ، وَغَيْرَةُ اللهِ أَنْ يَأْتِيَ الْمُؤْمِنُ مَا حَرَّمَ اللهُ
__________
أخرجه البخاري في: 67 كتاب النكاح: 107 باب الغيرة

1756. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు :

“అల్లాహ్ ఎంతో అభిమానధనుడు. అందువల్లనే ఆయన తాను నిషేధించిన అధర్మ కార్యాలకు ఒక ముస్లిం పాల్పడటాన్ని సహించలేడు.”

(సహీహ్ బుఖారీ:- 67వ ప్రకరణం – నికాహ్, 107వ అధ్యాయం – అల్ గైరా)

1757 – حديث أَسْمَاءَ، أَنَّهَا سَمِعَتْ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، يَقُولُ: لاَ شَيْءَ أَغْيَرُ مِنَ اللهِ
__________
أخرجه البخاري في: 67 كتاب النكاح: 107 باب الغيرة

1757. హజ్రత్ అస్మా బిన్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలిపారు : “అల్లాహ్ ని మించిన అభిమానధనులు మరెవరూ లేరు”.

(సహీహ్ బుఖారీ :- 67వ ప్రకరణం – నికాహ్, 107వ అధ్యాయం – అల్ గైరా)

1758 – حديث ابْنِ مَسْعُودٍ، أَنَّ رَجُلاً أَصَابَ مِنَ امْرَأَةٍ قُبْلَةً فَأَتَى النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَأَخْبَرَهُ فَأَنْزَلَ اللهُ (أَقِمِ الصَّلاَةَ طَرَفَي النَّهَارِ وَزُلَفًا مِنَ اللَّيْلِ إِنَّ الْحِسَنَاتِ يُذْهِبْنَ السَّيِّئَاتِ) فَقَالَ الرَّجُلُ: يَا رَسُولَ اللهِ أَلِي هذَا قَالَ: لِجَمِيعِ أُمَّتِي كُلِّهِمْ اخرجه البخاري في: 9 كتاب مواقيت الصلاة: 4 باب الصلاة كفارة

1758. హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ వూద్ (రదియల్లాహు అన్హు) కథనం :-

ఒకతను ఒక స్త్రీని ముద్దాడాడు. ఆ తరువాత అతను (పశ్చాత్తాపం చెందుతూ) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి వచ్చి తన పొరపాటును గురించి చెప్పుకున్నాడు. అప్పుడు ఈ సూక్తి అవతరించింది. “నమాజును నెలకొల్పండి – ఉదయం, సాయంత్రం, రాత్రి కొంత గడచిన తరువాత కూడా. నిస్సందేహంగా పుణ్యకార్యాలు పాపకార్యాలను హరించివేస్తాయి” (దివ్యఖుర్ఆన్ – 11:114). ఈ సూక్తి అవతరించిన తరువాత ఆ వ్యక్తి “దైవప్రవక్తా! ఈ ఆదేశం నాకొక్కడి కోసమేనా?” అని అడిగాడు. దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “నా అనుచర సమాజంలోని వారందరికీ” అని చెప్పారు.

(సహీహ్ బుఖారీ:- 9వ ప్రకరణం – మవాఖీతిస్సలాహ్, 4వ అధ్యాయం – సలాతు కఫ్ఫారాహ్)

1759 – حديث أَنَسِ بْنِ مَالِكٍ رضي الله عنه قَالَ: كُنْتُ عِنْدَ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَجَاءَهُ رَجُلٌ، فَقَالَ: يَا رَسُولَ اللهِ إِنِّي أَصَبْتُ حَدًّا، فَأَقِمْهُ عَلَيَّ قَالَ: وَلَمْ يَسْأَلْهُ عَنْهُ قَالَ: وَحَضَرَتِ الصَّلاَةُ، فَصَلَّى مَعَ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فَلَمَّا قَضى النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ الصَّلاَةَ، قَامَ إِلَيْهِ الرَّجُلُ فَقَالَ: يَا رَسُولَ اللهِ إِنِّي أَصَبْتُ حَدًّا، فَأَقِمْ فِيَّ كِتَابَ اللهِ قَالَ: أَلَيْسَ قَدْ صَلَّيْتَ مَعَنَا قَالَ: نعمْ قَالَ: فَإِنَّ اللهَ قَدْ غَفَرَ لَكَ ذَنْبَكَ (أَوْ قَالَ) حَدَّكَ
__________
أخرجه البخاري في: 86 كتاب الحدود: 27 باب إذا أقر بالحد ولم يبين هل للإمام أن يستر عليه

1759. హజ్రత్ అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) కథనం :-

నేను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధిలో ఉన్నాను. అంతలో ఒక వ్యక్తి వచ్చి “దైవప్రవక్తా! నేను శిక్షార్హమైన ఒక నేరం చేశాను. నాకు శిక్ష విధించండి” అని అన్నాడు. దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అతడ్ని ఎలాంటి వివరాలు అడగలేదు. కాస్సేపటికి నమాజు వేళ అయింది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)తో పాటు అతను కూడా నమాజు చేశాడు. నమాజు చేశాక ఆ వ్యక్తి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దగ్గరకు వచ్చి “దైవప్రవక్తా! నేను శిక్షార్హమైన ఒక నేరం చేశాను. దైవాజ్ఞ ప్రకారం నాకు శిక్ష విధించండి” అని మళ్ళీ విన్నవించుకున్నాడు. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “నీవు మాతోపాటు నమాజు చేయలేదా?” అని అడిగారు. దానికా వ్యక్తి చేశానన్నాడు. “అయితే అల్లాహ్ నీ పాపాన్ని క్షమించాడు” అని అన్నారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)

(సహీహ్ బుఖారీ:- 86వ ప్రకరణం – హుదూద్, 27వ అధ్యాయం – ఇజా అఖర్రబిల్ హద్ది వలమ్ యుబయ్యిన్ హల్ లిల్ఇమామి అయ్యస్తుర అలైహి)

1760 – حديث أَبِي سَعِيدٍ رضي الله عنه عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: كَانَ فِي بَنِي إِسْرَائِيلَ رَجُلٌ قَتَلَ تِسْعَةً وَتِسْعِينَ إِنْسانًا ثُمَّ خَرَجَ يَسْأَلُ فَأَتَى رَاهِبًا، فَسَأَلَهُ فَقَالَ لَهُ: هَلْ مِنْ تَوْبَةٍ قَالَ: لاَ فَقَتَلَهُ فَجَعَلَ يَسْأَلُ فَقَالَ لَهُ رَجُلٌ: ائْتِ قَرْيَةَ كَذَا وَكَذَا [ص:245] فَأَدْرَكَهُ الْمَوْتُ فَنَاءَ بِصَدْرِهِ نَحْوَهَا فَاخْتَصَمَتْ فِيهِ مَلاَئِكَةُ الرَّحْمَةِ وَمَلاَئِكَةُ الْعَذَابِ فَأَوْحى اللهُ إِلَى هذِهِ: أَنْ تَقَرَّبِي وَأَوْحى اللهُ إِلَى هذِهِ: أَنْ تَبَاعَدِي وَقَالَ: قِيسُوا مَا بَيْنَهُمَا فَوُجِدَ إِلَى هذِهِ أَقْرَبَ بِشِبْرٍ، فَغُفِرَ لَهُ
__________
أخرجه البخاري في: 60 كتاب الأنبياء: 54 باب حدثنا أبو اليمان

1760. హజ్రత్ అబూసయీద్ ఖుదరీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేశారు:

ఇస్రాయీల్ సంతతికి చెందిన ఒక వ్యక్తి తొంభై తొమ్మిది హత్యలు చేశాడు. ఆ తరువాత దాని నిష్కృతి కోసం జనాన్ని అడుగుతూ ఒక సాధువు దగ్గరికెళ్ళి “నా పాపానికి నిష్కృతి ఉందా?” అని అడిగాడు. దానికా సాధువు లేదన్నాడు. దాంతో ఆ వ్యక్తి (వళ్ళు మండిపోయి) ఆ సాధువుని కూడా హతమార్చాడు. ఆ తరువాత అతను మళ్ళీ జనాన్ని అడుగుతూ తిరగసాగాడు. ఒకతను కలసి “నీవు ఫలానా ఊరికి వెళ్ళు. అక్కడ కొందరు దైవారాధనలో నిమగ్నులయి ఉన్నారు. వారితో కలసి నీవు కూడా దైవాన్ని ఆరాధించు. అల్లాహ్ నీ పశ్చాత్తాపాన్ని స్వీకరిస్తాడు” అని చెప్పారు. (ఈ మాట విని ఆ వ్యక్తి బయలుదేరాడు) అయితే దారిలోనే అతను మృత్యువాతన పడ్డాడు. అతను చనిపోతూ తన రొమ్మును ఆ ఊరి దిశకు మరల్చాడు. అతని (ఆత్మను తీసికెళ్ళే) విషయంలో కారుణ్య దైవదూతలకు, యాతన దైవదూతలకు మధ్య వివాదం చెలరేగింది. అప్పుడు అల్లాహ్ (ఆ వ్యక్తి పాప నిష్కృతి కోసం పోదలచుకున్న) ఊరిని అతనికి దగ్గరగా జరగమని ఆదేశించాడు. అలాగే (అతను బయలుదేరిన) ఊరిని అతనికి దూరంగా జరగమని ఆదేశించాడు. ఆ తరువాత అతని (భౌతిక కాయం) నుండి ఆ రెండు ఊళ్ళు ఎంతెంత దూరం ఉన్నాయో కొలచి చూడమని దైవదూతలను ఆజ్ఞాపించాడు. కొలవడం పూర్తయ్యాక చూస్తే, ఆ వ్యక్తి (మృతదేహం) నిష్కృతికై పోయే ఊరికి ఒక జానెడు దూరం దగ్గరగా ఉన్నట్లు తేలింది. అందువల్ల అల్లాహ్ అతని పాపాలను క్షమించాడు.

(సహీహ్ బుఖారీ:- 60వ ప్రకరణం – అంబియా, 54వ అధ్యాయం – హద్దసనా అబుల్ యమాన్)

1761 – حديث ابْنِ عُمَرَ عَنْ صَفْوَانَ بْنِ مُحْرِزٍ الْمَازِنِيِّ، قَالَ: بَيْنَمَا أَنَا أَمْشِي مَعَ ابْنِ عُمَرَ، آخِذٌ بِيَدِهِ، إِذْ عَرَضَ رَجُلٌ فَقَالَ: كَيْفَ سَمِعْتَ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فِي النَّجْوَى فَقَالَ: سَمِعْتُ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، يَقُولُ: إِنَّ اللهَ يُدْنِي الْمُؤْمِنَ، فَيَضَعُ عَلَيْهِ كَنَفَهُ وَيَسْترُهُ: فَيَقُولُ: أَتَعْرِفُ ذَنْبَ كَذَا أَتَعْرِفُ ذَنْبَ كَذَا فَيَقُولُ: نَعَمْ أَيْ رَبِّ حَتَّى إِذَا قَرَّرَهُ بِذُنوبِهِ، وَرَأَى فِي نَفْسِهِ أَنَّهُ هَلَكَ قَالَ: سَتَرْتُهَا عَليْكَ فِي الدُّنْيَا وَأَنَا أَغْفِرُهَا لَكَ الْيَوْمَ فَيُعْطَى كِتَابَ حَسَنَاتِهِ وَأَمَّا الْكَافِرُ وَالْمُنَافِقُونَ فَيَقُولُ الأَشْهَادُ: هؤُلاَءِ الَّذِينَ كَذَبُوا عَلَى رَبِّهِمْ أَلاَ لَعْنَةُ اللهِ عَلَى الظَّالِمِينَ
__________
أخرجه البخاري في: 46 كتاب المظالم: 2 باب قول الله تعالى (ألا لعنة الله على الظالمين)

1761. హజ్రత్ సఫ్వాన్ బిన్ ముహ్రిజ్ మాజిని (రహిమహుల్లాహ్) కథనం :- నేను హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) గారి చేయి పట్టుకొని ఆయన వెంట నడచి వెళ్తున్నాను. దారిలో ఒక వ్యక్తి తారసపడి “మీరు గుసగుసలాడటం * గురించి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నోట ఏం విన్నారు?” అని అడిగాడు హజ్రత్ అబ్దుల్లా (రదియల్లాహు అన్హు)ని. దానికి ఆయన “నేను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా చెబుతుంటే విన్నానని ఇలా తెలిపారు:

అల్లాహ్ (ప్రళయ దినాన) విశ్వాసికి దగ్గరగా వచ్చి అతడ్ని తన కారుణ్య పరదాతో కప్పివేసి “నీవు ఫలానా పాపం చేశావు కదూ?” అని అడుగుతాడు. దానికా దాసుడు “చేశాను ప్రభూ!” అని అంటాడు. ఆ తరువాత అల్లాహ్ మరొక పాపాన్ని గురించి అదే విధంగా అడుగుతాడు) ఇలా అల్లాహ్ అతని పాపాలన్నిటి గురించి అడిగి, అతని చేత అంగీకరింపజేస్తాడు. దాంతో దాసుడు ఇక తనకు సర్వనాశనం తప్పదని భావించి మనస్సులో భయపడతాడు. అప్పుడు అల్లాహ్ అతనితో “నేను ప్రపంచంలో నీ పాపాలను బయటపడకుండా దాచి ఉంచాను. అలాగే ఈ రోజు ఇక్కడ కూడా నీ పాపాలను (జనం ముందు బహిర్గతం చేయకుండా) నేను క్షమిస్తున్నాను” అని అంటాడు. అందువల్ల అతని (దుష్కర్మలను తీసివేయగా మిగిలిన) సత్కర్మల పత్రాన్ని అతని చేతికి ఇవ్వడం జరుగుతుంది. అయితే అవిశ్వాసులు, కపటుల సంగతి వేరు (వారి విషయంలో సాక్షులు రప్పించబడతారు). ఆ సాక్షులు (వచ్చి) “వీరు తమ ప్రభువును గురించి అబద్దమాడారు’ (దైవప్రవక్తలను నిరాకరించి తమ పైనే దౌర్జన్యం చేసుకున్నారు). కనుక దౌర్జన్యపరుల పై దైవశాపం విరుచుకుపడుగాక!” అని అంటారు.

(సహీహ్ బుఖారీ:- 46వ ప్రకరణం – మజాలిమ్, 2వ అధ్యాయం – ఖౌలిల్లాహి తఆలా (అలా లానతుల్లాహి అలజ్జాలిమీన్)

* అంటే, ప్రళయదినాన అల్లాహ్ తన దాసునితో చేసే గుసగుసలు అన్నమాట, అల్లాహ్ పాపాలు చేసిన తన దాసుడ్ని తోటి మానవుల ముందు అవమానం పాలు కాకుండా కాపాడేందుకు అతనితో ఏకాంతంలో గుసగుసలాడుతాడు. దానివల్ల అతని పాపాలు ఇతరుల ముందు బహిర్గతం కాకుండా ఉంటాయి. (సంకలనకర్త)

1762 – حديث كَعْبِ بْنِ مَالِكٍ قَالَ: لَمْ أَتَخَلَّفْ عَنْ رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فِي غَزْوَةٍ غَزَاهَا، إِلاَّ فِي غَزْوَةِ تَبُوكَ غَيْرَ أَنِّي كُنْتُ تَخَلَّفْتُ فِي غَزْوَةِ بَدْرٍ، وَلَمْ يُعَاتِبْ أَحَدًا تَخَلَّفَ عَنْهَا إِنَّمَا خَرَجَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يُرِيدُ عِيرَ قُرَيْشٍ حَتَّى جَمَعَ اللهُ بَيْنَهُمْ وَبَيْنَ عَدُوِّهِمْ عَلَى غَيْرِ مِيعَادٍ وَلَقَدْ شَهِدْتُ مَعَ رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، لَيْلَةَ الْعَقبَةِ حِينَ تَوَاثَقْنَا عَلَى الإِسْلاَمِ وَمَا أُحِبُّ أَنَّ لِي بِهَا مَشْهَدَ بَدْرٍ، وَإِنْ كَانَتْ بَدْرٌ أَذْكَرَ فِي النَّاسِ مِنْهَا
كَانَ مِنْ خَبَرِي أَنِّي لَمْ أَكُنْ قَطُّ أَقْوَى وَلاَ أَيْسَرَ حِينَ تَخَلَّفْتُ عَنْهُ فِي تِلْكَ الْغَزَاةِ وَاللهِ مَا اجْتَمَعَتْ عِنْدِي قَبْلَهُ رَاحِلَتَانِ قَطُّ، حَتَّى جَمَعْتُهُمَا فِي تِلْكَ الْغَزْوَةِ وَلَمْ يَكُنْ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، يُرِيدُ غَزْوَةً إِلاَّ وَرَّى بِغَيْرِهَا حَتَّى كَانَتْ تِلْكَ الْغَزْوَةُ غَزَاهَا رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فِي حَرٍّ شَدِيدٍ، وَاسْتَقْبَلَ سَفَرًا بَعِيدًا، وَمَفَازًا، وَعَدُوًّا كَثِيرًا فَجَلَّى لِلْمُسْلِمِينَ أَمْرَهُمْ لِيَتَأَهَّبُوا أُهْبَةَ غَزْوِهِمْ فَأَخَبْرَهُمْ بِوَجْهِهِ الَّذِي يُرِيدُ وَالْمُسْلِمُونَ مَعَ رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ كَثِيرٌ وَلاَ يَجْمَعُهُمْ كِتَابٌ حَافِظٌ (يُرِيدُ الدِّيوَانَ)
[ص:247] قَالَ كَعْبٌ: فَمَا رَجُلٌ يُرِيدُ أَنْ يَتَغَيَّبَ إِلاَّ ظَنَّ أَن سَيَخْفَى لَهُ، مَا لَمْ يَنْزِلْ فِيهِ وَحْيُ اللهِ وَغَزَا رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، تِلْكَ الْغَزْوَةَ، حِينَ طَابَتِ الثِّمَارُ وَالظِّلاَلُ وَتَجَهَّزَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ وَالْمُسْلِمُونَ مَعَهُ فَطَفِقْتُ أَغْدُو لِكَيْ أَتَجَهَّزَ مَعَهُمْ فَأَرْجِعُ وَلَمْ أَقْضِ شَيْئًا فَأَقُولُ فِي نَفْسِي: أَنَا قَادِرٌ عَلَيْهِ فَلَمْ يَزَلْ يَتَمَادَى بِي، حَتَّى اشْتَدَّ بِالنَّاسِ الْجِدُّ فَأَصْبَحَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، وَالْمُسْلِمُونَ مَعَهُ وَلَمْ أَقْضِ مِنْ جَهَازِي شَيْئًا فَقُلْتُ: أَتَجَهَّزُ بَعْدَهُ بِيَوْمٍ أَوْ يَوْمِيْنِ، ثُمَّ أَلْحَقهُمْ فَغَدَوْتُ بَعْدَ أَنْ فَصَلوا، لأَتَجَهَّزَ، فَرَجَعْتُ وَلَمْ أَقْضِ شَيْئًا ثُمَّ غَدَوْتُ ثُمَّ رَجَعْتُ وَلَمْ أَقْضِ شَيْئًا فَلَمْ يَزَلْ بِي حَتَّى أَسْرَعوا، وَتَفَارَطَ الْغَزْوُ وَهَمَمْتُ أَنْ أَرْتَحِلَ فَأدْرِكَهُمْ وَلَيْتَنِي فَعَلْتُ فَلَمْ يُقَدَّرْ لِي ذَلِكَ فَكنْتُ، إِذَا خَرَجْتُ فِي النَّاسِ، بَعْدَ خرُوجِ رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَطفْتُ فِيهِمْ، أَحْزَنَنِي أَنِّي لاَ أَرَى إِلاَّ رَجُلاً مَغْمُوصًا عَلَيْهِ النِّفَاقُ، أَوْ رَجلاً مِمَّنْ عَذَرَ اللهُ مِنَ الضُّعَفَاءِ وَلَمْ يَذْكُرْنِي رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ حَتَّى بَلَغَ تَبُوكَ فَقَالَ، وَهُوَ جَالِسٌ فِي الْقَوْمِ بِتَبُوكَ: مَا فَعَل كَعْبٌ فَقَالَ رَجُلٌ مِنْ بَنِي سَلِمَةَ: يَا رَسُولَ اللهِ حَبَسَهُ بُرْدَاهُ وَنَظَرُه فِي عِطْفِهِ فَقَالَ مُعَاذُ بْنُ جَبَلٍ: بِئْسَ مَا قُلْتَ وَاللهِ يَا رَسُولَ اللهِ مَا عَلِمْنَا عَلَيْهِ إِلاَّ خَيْرًا فَسَكَتَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ

قَالَ كَعْبُ بْنُ مَالِكٍ: فَلَمَّا بَلَغَنِي أَنَّهُ تَوَجَّهَ قَافِلاً، حَضَرَنِي هَمِّي وَطَفِقْتُ أَتَذَكَّرُ الْكَذِبَ، وَأَقُولُ: بِمَاذَا أَخْرُجُ مِنْ سَخَطِهِ غَدًا وَاسْتَعَنْتُ عَلَى ذَلِكَ بِكُلِّ ذِي رَأْيِ [ص:248] مِنْ أَهْلِي فَلَمَّا قِيلَ إِنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَدْ أَظَلَّ قَادِمًا، زَاحَ عَنِّي الْبَاطِلُ، وَعَرَفْتُ أَنِّي لَنْ أَخْرُجَ مِنْهُ أَبَدًا بِشَيْءٍ فِيهِ كَذِبٌ، فَأَجْمَعْتُ صِدقَهُ وَأَصْبَحَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَادِمًا وَكَانَ، إِذَا قَدِمَ مِنْ سَفَرٍ، بَدَأَ بِالْمَسْجِدِ، فَيَرْكَعُ فِيهِ رَكْعَتَيْنِ، ثُمَّ جَلَسَ لِلنَّاسِ فَلَمَّا فَعَلَ ذَلِكَ، جَاءَهُ الْمُخَلَّفُونَ، فَطَفِقُوا يَعْتَذِرُونَ إِلَيْهِ، وَيَحْلِفُونَ لَهُ وَكَانوا بِضْعَةً وَثَمَانِينَ رَجُلاً فَقَبِلَ مِنْهُمْ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ عَلاَنِيَتَهُمْ، وَبَايَعَهُمْ، وَاسْتَغْفَرَ لَهُمْ، وَوَكَلَ سَرَائِرَهُمْ إِلَى اللهِ فَجِئْتُهُ فَلَمَّا سَلَّمْتُ عَلَيْهِ، تَبَسَّمَ تَبَسُّمَ الْمُغْضَبِ ثُمَّ قَالَ تَعَالَ فَجِئْتُ أَمْشِي، حَتَّى جَلَسْتُ بَيْنَ يَدَيْهِ فَقَالَ لِي مَا خَلَّفَكَ أَلَمْ تَكُنْ قَدِ ابْتَعْتَ ظهْرَكَ فَقُلْتُ: بَلَى إِنِّي، وَاللهِ لَوْ جَلَسْتُ عِنْدَ غَيْرِكَ مِنْ أَهْلِ الدُّنْيَا، لَرَأَيْتُ أَنْ سَأخْرُجُ مِنْ سَخَطِهِ بِعُذْرٍ وَلَقَدْ أُعْطِيتُ جَدَلاً وَلكِنِّي، وَاللهِ لَقَدْ عَلِمْتُ لَئِنْ حَدَّثْتُكَ الْيَوْمَ حَدِيثَ كَذِبٍ، تَرْضى بِهِ عَنِّي، لَيُوشِكَنَّ اللهُ أَنْ يُسْخِطَكَ عَلَيَّ وَلَئِنْ حَدَّثْتُكَ حَدِيثَ صِدْقٍ تَجِدُ عَلَيَّ فِيهِ، إِنِّي لأَرْجُو فِيهِ عَفْوَ اللهِ لاَ وَاللهِ مَا كَانَ لِي مِنْ عُذْرٍ وَاللهِ مَا كُنْتُ قَطُّ
أَقْوَى، وَلاَ أَيْسَرَ مِنِّي، حِينَ تَخَلَّفْتُ عَنْكَ فَقَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: أَمَّا هذَا، فَقَدْ صَدَقَ فَقُمْ حَتَّى يَقْضِيَ اللهُ فِيكَ فَقُمْتُ وَثَارَ رِجَالٌ مِنْ بَنِي سَلِمَةَ، فَاتَّبَعُونِي فَقَالُوا لِي: وَاللهِ مَا عَلِمْنَاكَ كُنْتَ أَذْنَبْتَ ذَنْبًا [ص:249] قَبْلَ هذَا وَلَقَدْ عَجَزْتَ أَنْ لاَ تَكُونَ اعْتَذَرْتَ إِلَى رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ بِمَا اعْتَذَرَ إِلَيْهِ الْمُتَخَلِّفُونَ قَدْ كَانَ كَافِيَكَ ذَنْبَكَ اسْتِغْفَارُ رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ لَكَ فَوَاللهِ مَا زَالُوا يُؤَنِّبُونِي، حَتَّى أَرَدْتُ أَنْ أَرْجِعَ فَأُكَذِّبَ نَفْسِي ثُمَّ قلْتُ لَهُمْ: هَلْ لَقِيَ هذَا مَعِي أَحَدٌ قَالُوا: نَعَمْ رَجُلاَنِ قَالاَ مِثْلَ مَا قُلْتَ، فَقِيلَ لَهُمَا مِثْلُ مَا قِيلَ لَكَ فَقُلْتُ: مَنْ هُمَا قَالُوا: مُرَارَةُ بْنُ الرَّبِيعِ الْعَمْرِيُّ، وَهِلاَلُ بْنُ أُمَيَّةَ الْوَاقِفِيُّ فَذَكَرَوا لِي رَجُلَيْنِ صَالِحَيْنِ، قَدْ شَهِدَا بَدْرًا، فِيهِمَا أُسْوَةٌ فَمَضَيْتُ حِينَ ذَكَرُوهُمَا لِي

وَنَهى رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ الْمُسْلِمِينَ عَنْ كَلاَمِنَا، أَيُّهَا الثَّلاَثَةُ، مِنْ بَيْنِ مَنْ تَخَلَّفَ عَنْهُ فَاجْتَنَبنَا النَّاسُ، وَتَغَيَّرُوا لَنَا، حَتَّى تَنَكَّرَتْ فِي نَفْسِي الأَرْضُ، فَمَا هِيَ الَّتِي أَعْرِفُ فَلَبِثْنَا عَلَى ذَلِكَ خَمْسِينَ لَيْلَةً
فَأَمَّا صَحِبَاي، فَاسْتَكَانَا، وَقَعَدَا فِي بُيُوتِهِمَا، يَبْكِيَانِ وَأَمَّا أَنا فَكنْتُ أَشَبَّ الْقَوْمِ، وَأَجْلَدَهُمْ فَكُنْتُ أَخْرُجُ فَأَشْهَدُ الصَّلاَةَ مَعَ الْمُسْلِمِينَ، وَأَطُوفُ فِي الأَسْوَاقِ وَلاَ يُكلِّمُنِي أَحَدٌ وَآتِي رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فَأُسَلِّمُ عَلَيْهِ، وَهُوَ فِي مَجْلِسِهِ بَعْدَ الصَّلاَةِ [ص:250] فَأَقُولُ فِي نَفْسِى: هَلْ حَرَّكَ شَفَتَيْهُ بِرَدِّ السَّلاَمِ عَلَيَّ، أَمْ لاَ ثُمَ أُصَلِي قَرِيبًا مِنْهُ، فَأُسَارِقُهُ النَّظَرَ فَإِذَا أَقْبَلْتُ عَلَى صَلاَتِي، أَقْبَلَ إِلَيَّ وَإِذَا الْتَفَتُّ نَحْوَهُ، أَعْرَضَ عَنِّي حَتَّى إِذَا طَالَ عَلَيَّ ذَلِكَ مِنْ جَفْوَةِ النَّاسِ، مَشَيْتُ حَتَّى تَسَوَّرْتُ جِدَارَ حَائِطِ أَبِي قَتَادَةَ، وَهُوَ ابْنُ عَمِّي، وَأَحَبُّ النَّاسِ إِلَيَّ، فَسَلَّمْتُ عَلَيْهِ فَوَاللهِ مَا رَدَّ عَلَيَّ السَّلاَمَ فَقُلْتُ: يَا أَبَا قَتَادَةَ أَنْشُدُكَ بِاللهِ هَلْ تَعْلَمُنِي أُحِبُّ اللهَ وَرَسُولَهُ فَسَكَتَ فَعُدْتُ لَهُ، فَنَشَدْتُهُ فَسَكَتَ فَعُدْتُ لَهُ فَنَشَدْتُهُ، فَقَالَ: اللهُ وَرَسُولُهُ أَعْلَمُ فَفَاضَتْ عَيْنَايَ، وَتَوَلَّيْتُ حَتَّى تَسَوَّرْتُ الْجِدَارَ

قَالَ: فَبَيْنَا أَنَا أَمْشِي بِسُوقِ الْمَدِينَةِ، إِذَا نَبَطِيٌّ مِنْ أَنْبَاطِ أَهْلِ الشَّامِ، مِمَّنْ قَدِمَ بِالطَّعَامِ يَبِيعُهُ بِالْمَدِينَةِ، يَقُولُ: مَنْ يَدُلُّ عَلَى كَعْبِ بْنِ مَالِكٍ فَطَفِقَ النَّاسُ يُشِيرُونَ لَهُ حَتَّى إِذَا جَاءَنِي، دَفَعَ إِلَيَّ كِتَابًا مِنْ مَلِكِ غَسَّانَ فَإِذَا فِيهِ: أَمَّا بَعْدُ فَإِنَّهُ قَدْ بَلَغَنِي أَنَّ صَاحِبَكَ قَدْ جَفَاكَ وَلَمْ يَجْعَلْكَ اللهُ بِدَارِ هَوَانٍ، وَلاَ مَضْيَعَةٍ فَالْحَقْ بِنَا نُوَاسِكَ فَقلْتُ لَمَّا قَرَأْتُهَا: وَهذَا أَيْضًا مِنَ الْبَلاَءِ فَتَيَمَّمْتُ بِهَا التَّنُّورَ فَسَجَرْتُهُ بِهَا حَتَّى إِذَا [ص:251] مَضَتْ أَرْبَعُونَ لَيْلَةً مِنَ الْخَمْسِينَ، إِذَا رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَأْتِينِي فَقَالَ: إِنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَأْمُرُكَ أَنْ تَعْتَزِلَ امْرَأَتَكَ فَقُلْتُ: أُطَلِّقُهَا أَمْ مَاذَا أَفْعَلُ قَالَ: لاَ بَلِ اعْتَزِلْهَا، وَلاَ تَقْرَبْهَا وَأَرْسَلَ إِلَى صَاحِبَيَّ مِثْلَ ذَلِكَ فَقُلْتُ لامْرَأَتِي: الْحَقِي بِأَهْلِكِ، فَكُونِي عِنْدَهُمْ حَتَّى يَقْضِيَ اللهُ فِي هذَا الامْرِ

قَالَ كَعْبٌ: فَجَاءَتِ امْرَأَةُ هِلاَلِ بْنِ أُمَيَّةَ، رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَقَالَتْ: يَا رَسُولَ اللهِ إِنَّ هِلاَلَ بْنَ أُمَيَّةَ شَيْخٌ ضَائِعٌ، لَيْسَ لَهُ خَادِمٌ فَهَلْ تَكْرَهُ أَنْ أَخْدُمَهُ قَالَ: لاَ وَلكِنْ لاَ يَقْرَبْكِ قَالَتْ: إِنَّهُ، وَاللهِ مَا بِهِ حَرَكَةٌ إِلَى شَيْءٍ وَاللهِ مَا زَالَ يَبْكِي مُنْذُ كَانَ مِنْ أَمْرِهِ مَا كَانَ، إِلَى يَوْمِهِ هذَا فَقَالَ لِي بَعْضُ أَهْلِي: لَوِ اسْتَأْذَنْتَ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فِي امْرَأَتِكَ، كَمَا أَذِنَ لاِمْرَأَةِ هِلاَلِ بْنِ أُمَيَّةَ أَنْ تَخْدُمَهُ فَقُلْتُ: وَاللهِ لاَ أسْتأْذِنُ فِيهَا رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ وَمَا يُدْرِينِي مَا يَقُولُ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، إِذَا اسْتَأْذَنْتهُ فِيهَا، وَأَنَا رَجُلٌ شَابٌّ فَلَبِثْت بَعْدَ ذَلِكَ عَشْرَ لَيَالٍ، حَتَّى كَمَلَتْ لَنَا خَمْسُونَ لَيْلَةً، مِنْ حِينَ نَهى رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ عَنْ كَلاَمِنَا فَلَمَّا صَلَّيْتُ صَلاَةَ الْفَجْرِ، صُبْحَ خَمْسِينَ لَيْلَةً، وَأَنَا عَلَى ظَهْرِ بَيْتٍ مِنْ بُيُوتِنَا فَبَيْنَا أَنَا جِالِسٌ عَلَى الْحَالِ الَّتِي ذَكَرَ اللهُ، قَدْ ضَاقَتْ عَلَيَّ نَفْسِي، وَضَاقَتْ عَلَيَّ الأَرْضُ بِمَا رَحُبَتْ سَمِعْتُ صَوْتَ صَارِخٍ، أَوْفَى عَلَى جَبَلِ سَلْعٍ، بِأَعْلَى صَوْتِهِ: يَا كَعْبُ بْنَ مَالِكٍ أَبْشِرْ قَالَ: فَخَرَرْتُ سَاجِدًا، وَعَرَفْتُ أَنْ قَدْ جَاءَ فَرَجٌ وَآذَنَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ بِتَوْبَةِ اللهِ عَلَيْنَا، حِينَ صَلّى صَلاَةَ الْفَجْرِ [ص:252] فَذَهَبَ النَّاسُ يُبَشِّرُونَنَا، وَذَهَبَ قِبَلَ صَاحِبَيَّ مبَشِّرُونَ، وَرَكَضَ إِلَيَّ رَجُلٌ فَرَسًا، وَسَعَى سَاعٍ مِنْ أَسْلَمَ، فَأَوْفَى عَلَى الْجَبَلِ وَكَانَ الصَّوْتُ أَسْرَعَ مِنَ

الفَرَسِ فَلَمَّا جَاءَنِي الَّذِي سَمِعْتُ صَوْتَهُ يُبَشِّرُنِي نَزَعْتُ لَهُ ثَوْبَيَّ، فَكَسَوْتُهُ إِيَّاهُمَا بِبُشْرَاهُ وَاللهِ مَا أَمْلِكُ غَيْرَهُمَا يَوْمَئِذٍ وَاسْتَعَرْتُ ثَوْبَيْنِ، فَلَبِسْتُهُمَا وَانْطَلَقْتُ إِلَى رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فَيَتَلَقَّانِي النَّاسُ فَوْجًا فَوْجًا، يُهَنُّونِي بِالتَّوْبَةِ يَقُولُونَ: لِتَهْنِكَ تَوْبَةُ اللهِ عَلَيْكَ
قَالَ كَعْبٌ: حَتَّى دَخَلْتُ الْمَسْجِدَ فَإِذَا رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ جَالِسٌ حَوْلَهُ النَّاسُ فَقَامَ إِلَيَّ طَلْحَةُ بْنُ عُبَيْدِ اللهِ يُهَرْوِلُ، وَهَنَّانِي وَاللهِ مَا قَامَ إِلَيَّ رَجُلٌ مِنَ الْمُهَاجِرِينَ غَيْرَهُ وَلاَ أَنْسَاهَا لِطَلْحَةَ

قَالَ كَعْبٌ: فَلَمَّا سَلَّمْتُ عَلَى رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، وَهُوَ يَبْرُقُ وَجْهُهُ مِنَ السُّرُورِ: أَبْشِرْ بَخَيْرِ يَوْمٍ مَرَّ عَلَيْكَ مُنْذُ وَلَدَتْكَ أُمُّكَ قَالَ: قُلْت أَمِنْ عِنْدِكَ يَا رَسُولَ اللهِ أَمْ مِنْ عِنْدِ اللهِ قَالَ: لاَ بَلْ مِنْ عِنْدِ اللهِ وَكَانَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، إِذَا سُرَّ اسْتَنَارَ وَجْهُهُ، حَتَّى كَأَنَّهُ قِطْعَةُ قَمَرٍ وَكُنَّا نَعْرِفُ ذلِكَ مِنْهُ [ص:253] فَلَمَّا جَلَسْتُ بَيْنَ يَدَيْهِ، قُلْتُ: يَا رَسُولَ اللهِ إِنَّ مِنْ تَوْبَتِي أَنْ أَنْخَلِعَ مِنْ مَالِي صَدَقَةً إِلَى اللهِ وَإِلَى رَسُولِ اللهِ قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: أَمْسِكَ عَلَيْكَ بَعْضَ مَالِكَ، فَهُوَ خَيْرٌ لَكَ قُلْتُ: فَإِنِّي أُمْسِكُ سَهْمِي الَّذِي بِخَيْبَرَ

فَقُلْتُ: يَا رَسُولَ اللهِ إِنَّ اللهَ إِنَّمَا نَجَّانِي بِالصِّدْقِ، وَإِنَّ مِنْ تَوْبَتِي أَنْ لاَ أُحَدِّثَ إِلاَّ صِدْقًا مَا بَقِيتُ فَوَاللهِ مَا أَعْلَمُ أَحَدًا مِنَ الْمُسْلِمِينَ أَبْلاَهُ اللهُ فِي صِدْقِ الْحَدِيثِ، مُنْذُ ذَكَرْتُ ذَلِكَ لِرَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، أَحْسَنَ مِمَّا أَبْلاَنِي مَا تَعَمَّدْتُ، مُنْذُ ذَكَرْتُ ذَلِكَ لِرَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ إِلَى يَوْمِي هذَا، كَذِبًا وَإِنِّي لأَرْجُو أَنْ يَحْفَظَنِي اللهُ فِيمَا بَقِيتُ

وأَنْزَلَ اللهُ عَلَى رَسُولِهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ (لَقَدْ تَابَ اللهُ عَلَى النَّبِيِّ وَالْمُهَاجِرِينَ) إِلَى قَوْلَهِ (وَكُونوا مَعَ الصَّادِقِينَ)
فَوَاللهِ مَا أَنْعَمَ اللهُ عَلَيَّ مِنْ نِعْمَةٍ قَطُّ، بَعْدَ أَنْ هَدَانِي لِلإِسْلاَمٍ، أَعْظَمَ فِي نَفْسِي مِنْ صِدْقِي لِرَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ أَنْ لاَ أَكُونَ كَذَبْتُهُ، فَأَهْلِكَ كَمَا هَلَكَ الَّذِينَ [ص:254] كَذَبُوا فَإِنَّ اللهَ قَالَ لِلَّذِينَ كَذَبُوا، حِينَ أَنْزَلَ الْوَحْيَ، شَرَّ مَا قَالَ لأَحَدٍ فَقَالَ، تَبَارَكَ وَتَعَالَى (سَيَحْلِفُونَ بِاللهِ لَكُمْ إِذَا انْقَلَبْتمْ) إِلَى قَوْلِهِ (فَإِنَّ اللهَ لاَ يَرْضى عَنِ الْقَوْمِ الْفَاسِقِينَ) قَالَ كَعْبٌ: وَكُنَّا تَخَلَّفْنَا، أَيُّهَا الثَّلاَثَةُ، عَنْ أَمْرِ أُولئِكَ الَّذِينَ قَبِلَ مِنْهُمْ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، حِينَ حَلَفُوا لَهُ، فَبَايَعَهُم وَاسْتَغْفَرَ لَهُمْ وَأَرْجَأَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ أَمْرَنَا، حَتَّى قَضَى اللهُ فِيهِ
فَبِذلِكَ قَالَ اللهُ (وَعَلَى الثَّلاَثَةِ الَّذِينَ خُلِّفُوا) وَلَيْسَ الَّذِي ذَكَرَ اللهُ مِمَّا خُلِّفْنَا عَنِ الْغَزْو، إِنَّمَا هُوَ تَخْلِيفُهُ إِيَّانَا، وَإِرْجَاؤُهُ أَمْرَنَا، عَمَّنْ حَلَفَ لَهُ، وَاعْتَذَرَ إِلَيْهِ، فَقَبِلَ مِنْهُ
__________
أخرجه البخاري في: 64 كتاب المغازي: 79 باب حديث كعب بن مالك وقول الله عز وجل (وعلى الثلاثة الذين خلفوا)

1762. హజ్రత్ కాబ్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) కథనం :- నేను ఒక్క తబూక్ యుద్ధంలో తప్ప మరే యుద్ధంలోనూ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను వదలి వెనకుండిపోలేదు. అయితే బద్ర్ యుద్దంలో కూడా నేను పాల్గొనలేదు. బద్ర్ యుద్ధంలో పాల్గొనని కారణంగా అల్లాహ్ ఏ వ్యక్తినీ ఆగ్రహించలేదు. బద్ర్ యుద్ధ సమయంలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఖురైషీయుల వర్తక బిడారాల పై దాడి చేయడానికి బయలుదేరారు. (అప్పుడు ఆయనకు యుద్ధం చేసే ఉద్దేశ్యం లేదు) కాని అల్లాహ్ సమయం నిర్ణయించకుండా శత్రువుల్ని హఠాత్తుగా ముస్లింల ముందుకు తెచ్చి నిలబెట్టాడు. నేను ఉఖ్బా ప్రమాణం సందర్భంలో కూడా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి వచ్చాను. అప్పుడు మేము ఇస్లాం స్వీకరిస్తామని ప్రమాణం చేశాము. ప్రజల దృష్టిలో బద్ర్ యుద్ధం ఉఖ్బా ప్రమాణం కన్నా విలువయినదైనప్పటికీ నాకు బద్ర్ యుద్ధం కంటే ఉఖ్బా ప్రమాణమే ఎంతో ప్రియమైనది.

(తబూక్ దండయాత్రలో పాల్గొనకపోవడానికి కారణమయిన) నా గాధ ఇలా ఉంది : తబూక్ దండయాత్రలో పాల్గొనకుండా వెనకుండిపోయిన రోజుల్లో నేను ఎంతో ఆరోగ్యంగా, సిరి సంపదలతో తులతూగుతూ ఉన్నాను. అంతకు ముందెన్నడూ నా దగ్గర రెండు ఒంటెలు కూడా ఉండేవి కావు. తబూక్ రోజుల్లో నా దగ్గర అనేక సంపదలతో పాటు రెండు ఒంటెలు కూడా ఉన్నాయి. సాధారణంగా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) యుద్ధం చేయడానికి ఎక్కడికయినా వెళ్ళదలచుకుంటే ఆ ప్రాంతాన్ని గురించి ఫలానా ప్రాంతమని ఖచ్చితంగా చెప్పకుండా అస్పష్టమైన మాటల్లో [*] చెప్పేవారు. దాని వల్ల ప్రజలు ఆయన నిర్ణయించుకున్న ప్రాంతం కాకుండా మరో ప్రాంతమని భావించేవారు. అయితే తబూక్ దండయాత్ర కోసం ఆయన ప్రాంతం స్పష్టంగా నిర్ణయించారు. దాని సన్నాహాలు నడి ఎండాకాలంలో (తీవ్రమైన వేసవిలో) ప్రారంభించారు. సుదూర ప్రయాణం, జన సంచారం లేని, నీటి బొట్టు సయితం లభించని భయంకర మార్గం. శత్రు సంఖ్య కూడా అపారంగా ఉంది. అందువల్ల దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ముస్లింలకు దండయాత్రను గురించి పూర్తి వివరాలు స్పష్టంగా చెప్పేశారు. యుద్ధ సన్నాహాలు పూర్తి చేసుకోవడానికి వీలుగా ప్రయాణ దిశ కూడా తెలియజేశారు.

నేను వెళ్ళగానే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు సలాం చేశాను. ఆయన వికసించిన ముఖారవిందంతో “ఈ రోజు నీకు శుభం కలుగు గాక! నీవు పుట్టిన రోజు నుంచి నేటి వరకు జరిగిపోయిన రోజుల్లో ఈ రోజు నీ కోసం ఎంతో శ్రేష్ఠమైన రోజు” అని అన్నారు సంతోషం వెలిబుచ్చుతూ. అప్పుడు నేను “దైవప్రవక్తా! ఈ క్షమాభిక్ష నాకు మీ తరఫున లభించిందా లేక అల్లాహ్ తరఫున లభించిందా?” అని అడిగాను. దానికి ఆయన “నా తరఫున కాదు, అల్లాహ్ తరఫు నుండే వచ్చింది” అని అన్నారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సంతోషంగా ఉన్నప్పుడు ఆయన ముఖ వర్ఛస్సు పున్నమి. చంద్రునిలా మెరసిపోతూ ఉంటుంది. దాన్ని బట్టి మేము ఆయన చాలా సంతోషంగా ఉన్నారని భావించేవాళ్ళము.

నేను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ముందు కూర్చొని “దైవప్రవక్తా! నాకీ క్షమాభిక్ష లభించినందుకు కృతజ్ఞతగా నేను నా ఆస్తి నంతటినీ అల్లాహ్ కోసం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కోసం దానం చేయాలను కుంటున్నాను” అని అన్నాను. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ మాట విని “అంతా వద్దు. కొంత ధనం నీ దగ్గర పెట్టుకుంటే మంచిది” అని అన్నారు. “సరే, ఖైబర్ లో నాకు లభించిన వాటాను నేను అట్టి పెట్టుకుంటాను” అన్నాను నేను. ఆ తరువాత నేను “దైవప్రవక్తా! నేను నిజం చెప్పినందుకు అల్లాహ్ నాకు విముక్తి కలిగించాడు. అందుచేత నేనిక జీవించి ఉన్నంత కాలం ఎల్లప్పుడు నిజమే చెబుతుంటానని ఈ శుభ తరుణంలో వాగ్దానం చేస్తున్నాను. దైవసాక్షి! కేవలం నిజం చెప్పిన కారణంగా అల్లాహ్ నన్ను కటాక్షించినంతగా మరే ముస్లింని కటాక్షించి ఉండడని నేను భావిస్తున్నాను. ఈ వ్యవహారంలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ముందు ఉన్నది ఉన్నట్లు నిజం చెప్పిన రోజు నుంచి ఈనాటి వరకు నేను ఎప్పుడూ కావాలని అబద్ధమాడలేదు. ఇక ముందు కూడా బ్రతికి ఉన్నంత కాలం నేను అబద్ధమాడకుండా అల్లాహ్ నన్ను రక్షిస్తూ ఉంటాడని ఆశిస్తున్నాను.

అల్లాహ్ (ఈ సంఘటన గురించి) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పై ఈ క్రింది సూక్తుల్ని అవతరింపజేశాడు: “అల్లాహ్ తన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను, కష్టకాలంలో ఆదుకొని అతనికి తోడుగా నిలిచిన ముహాజిర్లను, అన్సారులను మన్నించాడు. వారిలో కొందరి హృదయాలు అపమార్గం వైపుకు మొగ్గినప్పటికీ (అటువైపు. పోకుండా ప్రవక్తకు మాత్రమే తోడుగా నిల్చున్నందున) వారిని అల్లాహ్ క్షమించాడు. నిస్సందేహంగా అల్లాహ్ వారి విషయంలో అపార వాత్సల్యంతో, అమితమైన దయతో వ్యవహరించాడు. ఇక వ్యవహారం వాయిదా వేయబడిన ఆ ముగ్గురిని కూడా అల్లాహ్ క్షమించాడు. భూమి ఎంతో విశాలంగా ఉన్నప్పటికీ అది వారికి చాలా ఇరుకయిపోయింది. చివరికి వారి ప్రాణాలే వారికి భారమయిపోయాయి. అల్లాహ్ పట్టు నుండి తప్పించుకోవడానికి స్వయంగా ఆయన కారుణ్య ఒడి తప్ప ఎలాంటి ఆశ్రయం లేదని వారు తెలుసుకున్నారు. అప్పుడు అల్లాహ్ వారు తన వైపుకు మరలి వచ్చేందుకుగాను దయతో వారివైపుకు మరలాడు. నిస్సందేహంగా అల్లాహ్ గొప్ప క్షమాశీలి, అమిత దయామయుడు. (కనుక) విశ్వాసులారా! అల్లాహ్ కు భయపడండి. సత్యవంతులకు తోడ్పడండి.” (దివ్య ఖుర్ఆన్ : 9:117-119)

దైవసాక్షిగా చెబుతున్నాను. ఇస్లాం స్వీకరణ భాగ్యం ప్రసాదించిన తరువాత అల్లాహ్ నాకు చేసిన ఉపకారాలలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ముందు ఆయన నాకు ప్రసాదించిన ‘నిజం చెప్పే సద్బుద్ధి’ ఎంతో గొప్ప ఉపకారం. నా దృష్టిలో దీనికి మించిన మహోపకారం లేదు. ఆయన నాకు అబద్దం నుండి రక్షించాడు. నేనొక వేళ అబద్దమాడితే ఇతరుల (కపట విశ్వాసుల) మాదిరిగా నేను సర్వనాశనమయ్యేవాడ్ని. వారు అబద్ధమాడి (పరలోకం దృష్ట్యా) సర్వనాశనమయ్యారు. అల్లాహ్ తన గ్రంథంలో వారిని గురించి తీవ్రమైన పదాలను అవతరింపజేశాడు. అంతటి తీవ్రమైన పదాలను మరెవరి గురించీ అవతరింపజేయలేదు. ఆ దైవ సూక్తులు ఇలా ఉన్నాయి :

“నీవు (యుద్ధం నుండి) తిరిగొచ్చిన తరువాత వారు నీ దగ్గరకు వచ్చి, అల్లాహ్ మిద ప్రమాణం చేసి మరీ రకరకాల సాకులు చెబుతారు. నీవు వారిపట్ల చూచీ చూడనట్లుగా (స్థూల దృష్టితో) వ్యవహరిస్తావని. కనుక నీవు వారిని అసలు పట్టించుకోకు. ఎందుకంటే వారొక మాలిన్యం వంటి వారు. వారి అసలు స్థానం నరకం. వారి దుష్ట సంపాదనకు ప్రతిఫలంగా అదే వారికి లభించే మహాభాగ్యం! నీవు వారి పట్ల సంతృప్తి పడతావని వారు నీ దగ్గరకు వచ్చి (ఇలా) ప్రమాణాలు చేస్తారు. కాని నీవు వారి పట్ల సంతృప్తి చెందినా అల్లాహ్ మాత్రం అలాంటి దుర్మార్గుల పట్ల ఎన్నటికీ సంతృప్తి చెందడు” (9: 95, 96).

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మా ముగ్గురి వ్యవహారాన్ని వాయిదా వేసి, అసత్య ప్రమాణాలతో సాకులు చెప్పిన వారి వ్యవహారాన్ని పరిష్కరించారు. వారి చేత ప్రమాణం చేయించి, వారి పాప మన్నింపు కోసం అల్లాహ్ ని ప్రార్థించారు. మా వ్యవహారాన్ని మాత్రం తాత్కాలికంగా నిలిపివేశారు. చివరికి మా వ్యవహారాన్ని అల్లాహ్ (స్వయంగా) పరిష్కరించాడు. ఆయన (తన గ్రంథంలో) ఇలా పేర్కొన్నాడు :
“వ్యవహారం వాయిదా వేయబడిన ఆ ముగ్గురిని కూడా అల్లాహ్ క్షమించాడు”. ఈ సూక్తిలో “ఖుల్లిఫూ” అనే పదానికి అర్థం, వారు యుద్ధానికి బయలుదేరకుండా వెనకుండి పోయేలా చేయబడ్డారు అని కాదు. వారిని (తాత్కాలికంగా) వదలెయ్యడం జరిగిందని, వారి వ్యవహారం వాయిదా వేయబడిందని, ప్రమాణం చేసి సాకులు చెప్పిన వారి కారణాలను అంగీకరించడం జరిగిందని దీని అర్థం.

(సహీహ్ బుఖారీ:- 64వ ప్రకరణం – మగాజి, 79వ అధ్యాయం – హదీసి కాబ్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) వ ఖౌలిల్లాహి అజ్జ వ జల్ల్ వ అలస్సలాసతిల్లజీన ఖుల్లిపూ)

1763 – حديث عَائِشَةَ، زَوْجِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، حِينَ قَالَ لَهَا أَهْلُ الإِفْكِ مَا قَالُوا
قَالَتْ عَائِشَةُ: كَانَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ إِذَا أَرَادَ سَفَرًا، أَقْرَعَ بَيْنَ أَزْوَاجِهِ فَأَيُّهُنَّ خَرَجَ سَهْمُهَا، خَرَجَ بِهَا رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ مَعَهُ قَالَتْ عَائِشَةُ: فَأَقْرَعَ بَيْنَنَا فِي غَزْوَةٍ غَزَاهَا فَخَرَجَ فِيهَا سَهْمِي فَخَرَجْتُ مَعَ رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ بَعْدَ مَا أُنْزِلَ الْحِجَابُ فَكُنْتُ أُحْمَلُ [ص:255] في هَوْدَجِي، وَأُنْزَلُ فِيهِ فَسِرْنَا، حَتَّى إِذَا فَرَغَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ مِنْ غَزْوَتِهِ تِلْكَ، وَقَفَلَ دَنَوْنَا مِنَ الْمَدِينَةِ قَافِلِينَ، آذَنَ لَيْلَةً بِالرَّحِيلِ فَقُمْتُ، حِينَ آذَنُوا بِالرَّحِيلِ، فَمَشَيْتُ حَتَّى جَاوَزْتُ الْجَيْشَ فَلَمَّا قَضَيْتُ شَأْنِي، أَقْبَلْتُ إِلَى رَحْلِي، فَلَمَسْتُ صَدْرِي، فَإِذَا عِقْدٌ لِي، مِنْ جَزْعِ ظَفَارِ، قَدِ انْقَطَعَ فَرَجَعْتُ، فَالْتَمَسْتُ عِقْدِي، فَحَبَسَنِي ابْتِغَاؤُهُ قَالَتْ: وَأَقْبَلَ الرَّهْطُ الَّذِينَ كَانُوا يُرَحِّلُونِي، فَاحْتَمَلُوا هَوْدَجِي، فَرَحَلُوهُ عَلَى بَعِيرِي الَّذِي كُنْتُ أَرْكَبُ عَلَيْهِ، وَهُمْ يَحْسِبُونَ أَنِّي فِيهِ وَكَانَ النِّسَاءُ، إِذْ ذَاكَ، خِفَافًا لَمْ يَهْبُلْنَ وَلَمْ يَغْشَهُنَّ اللَّحْمُ إِنَّمَا يَأْكُلْنَ الْعُلْقَةَ مِنَ الطَّعَامِ فَلَمْ يَسْتَنْكِرِ الْقَوْمُ خِفَّةَ الْهَوْدَجِ حِينَ رَفَعُوه وَحَمَلُوهُ وَكُنْتُ جَارِيَةً حَدِيثَةَ السِّنِّ فَبَعَثُوا الْجَمَلَ فَسَارُوا وَوَجَدْتُ عِقْدِي، بَعْدَ مَا اسْتَمَرَّ الْجَيْشُ فَجِئْتُ مَنَازِلَهُمْ وَلَيْسَ بِهَا مِنْهُمْ دَاعٍ وَلاَ مُجِيبٌ فَتَيَمَّمْتُ مَنْزِلِي الَّذِي كُنْتُ بِهِ، وَظَنَنْتُ أَنَّهُمْ سَيَفْقِدُونِي، فَيَرْجِعُونَ إِلَيَّ فَبَيْنَا أَنَا جَالِسَةٌ فِي مَنْزِلِي، غَلَبَتْنِي عَيْنِي، فَنِمْتُ
وَكَانَ صَفْوَان بْنُ الْمُعَطَّلِ السُّلَمِيُّ، ثُمَّ الذَّكْوَانِيُّ [ص:256] مِنْ وَرَاءِ الْجَيْشِ فَأَصْبَحَ عِنْدَ مَنْزِلِي فَرَأَى سَوَادَ إِنْسَانٍ نَائِمٍ، فَعرَفَنِي حِينَ رَآنِي، وَكَانَ رَآنِي قَبْلَ الْحِجَابِ فَاسْتَيْقَظْتُ بِاسْتِرْجَاعِهِ، حِينَ عَرَفَنِي فَخمَّرْتُ وَجْهِي بِجِلْبَابِي وَوَاللهِ مَا تَكَلَّمْنَا بِكَلِمَةٍ، وَلاَ سَمِعْتُ مِنْهُ كَلِمَةً غَيْرَ اسْتِرْجَاعِهِ وَهَوَى حَتَّى أَنَاخَ رَاحِلَتَهُ، فَوَطِىءَ عَلَى يَدِهَا، فَقُمْتُ إِلَيْهَا، فَرَكِبْتَهَا فَانْطَلَقَ يَقُودُ بِي الرَّاحِلَةَ، حَتَّى أَتَيْنَا الْجَيْشَ، مُوغِرِينَ فِي نَحْرِ الظَّهِيرَةِ، وَهُمْ نُزُولٌ

قَالَتْ: فَهَلَكَ مَنْ هَلَكَ وَكَانَ الَّذِي تَوَلّى كِبْرَ الإِفْكِ عَبْدَ اللهِ بْنَ أُبَيِّ بْنَ سَلُولَ
قَالَ عُرْوَةُ (أَحَدُ رُوَاةِ الْحَدِيثِ) : أُخْبِرْتُ أَنَّهُ كَانَ يُشَاعُ وَيُتَحَدَّثُ بِهِ عِنْدَهُ، فَيُقِرُّهُ وَيَسْتَمِعُهُ وَيَسْتَوْشِيهِ
وَقَالَ عُرْوَة أَيْضًا: لَمْ يُسَمَّ مِنْ أَهْلِ الإِفْكِ أَيْضًا إِلاَّ حَسَّانُ بْنُ ثَابِتٍ، وَمِسْطَحُ بْنُ أُثَاثَةَ، وَحَمْنَةُ بِنْتُ جَحْشٍ، فِي نَاسٍ آخَرِينَ، لاَ عِلْمَ لِي بِهِمْ غَيْرَ أَنَّهمْ عُصْبَةٌ [ص:257] كَمَا قَالَ اللهُ تَعَالَى وَإِنَّ كُبْرَ ذلِكَ يُقَالُ عَبْدُ اللهِ بْنُ أُبَيٍّ بْنُ سَلُولَ
قَالَ عُرْوَةُ: كَانَتْ عَائِشَةُ تَكْرَهُ أَنْ يُسَبَّ عِنْدَهَا حَسَّانُ وَتَقُولُ: إِنَّه الَّذِي قَالَ:
فَإِنَّ أَبِي وَوَالِدَهُ وَعِرْضِيلِعِرْضِ مُحَمَّدٍ مِنْكُمْ وِقَاءُقَالَتْ عَائِشَةُ: فَقَدِمْنَا الْمَدِينَةَ فَاشْتَكَيْتُ حِينَ قَدِمْتُ شَهْرًا، وَالنَّاسُ يُفِيضُونَ فِي قَوْلِ أَصْحَابِ الإِفْكِ لاَ أَشْعُرُ بِشَيْءٍ مِنْ ذَلِكَ وَهُوَ يَرِيبُنِي فِي وَجَعِي أَنِّي لاَ أَعْرِفُ مِنْ رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ اللُّطْفَ الَّذِي كُنْتُ أَرَى مِنْهُ حِينَ أَشْتَكِي إِنَّمَا يَدْخُلُ عَلَيَّ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فَيُسَلِّمُ ثُمَّ يَقُولُ: كَيْفَ تِيكُمْ ثُمَّ يَنْصَرِفُ فَذلِكَ يَرِيبُنِي وَلاَ أَشْعُرُ بِالشَّرِّ حَتَّى خَرَجْتُ حِينَ نَقَهْتُ فَخَرَجْتُ مَعَ أُمِّ مِسْطِحٍ قِبَلَ الْمَنَاصِعِ وَكَانَ مُتَبَرَّزَنَا وَكُنَّا لاَ نَخْرُجُ إِلاَّ لَيْلاً إِلَى لَيْلٍ وَذَلِكَ قَبْلَ أَنْ نَتخِذَ الْكُنُفَ قَرِيبًا مِنْ بُيُوتِنَا قَالَتْ: وَأَمْرُنَا أَمْرُ الْعَرَبِ الأُوَلِ فِي الْبَرِّيَةِ قِبَلَ الْغَائِطِ وَكُنَّا نَتَأَذَّى بِالْكُنُفِ أَنْ نَتَّخِذَهَا عِنْدَ بُيُوتِنَا قَالَتْ: فَانْطَلَقْتُ أَنَا وَأُمُّ مِسْطَحٍ، وَهِيَ ابْنَةُ أَبِي رُهْمِ بْنِ الْمُطَّلِبِ بْنِ عَبْدِ مَنَافٍ، وَأُمُّهَا بِنْتُ صَخْرِ بْنِ عَامِرٍ، خَالَةُ أَبِي بَكْرٍ الصِّدِّيقِ وَابْنُهَا مِسْطَحُ بْنُ أُثَاثَةَ بْنِ عَبَّادِ بْنِ الْمُطَّلِبِ فَأَقْبَلْتُ أَنَا وَأُمُّ مِسْطَحٍ قِبَلَ بَيْتِي، [ص:258] حِينَ فَرَغْنَا مِنْ شَأنِنَا فَعَثَرَتْ أُمُّ مِسْطَحٍ فِي مِرْطِهَا فَقَالَتْ: تَعِسَ مِسْطَحٌ فَقُلْتُ لَهَا: بِئْسَ مَا قُلْتِ أَتَسُبِّينَ رَجُلاً شَهِدَ بَدْرًا فَقَالَتْ: أَيْ هَنْتَاهْ وَلَمْ تَسْمَعِي مَا قَالَ قَالَتْ: وَقُلْتُ: مَا قَالَ فَأَخْبَرَتْنِي بِقَوْلِ أَهْلِ الإِفْكِ قَالَتْ: فَازْدَدْتُ مَرَضًا عَلَى مَرَضِي فَلَمَّا رَجَعْتُ إِلَى بَيْتِي، دَخَلَ عَلَيَّ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فَسَلَّمَ ثُمَّ قَالَ: كَيْفَ تِيكُمْ فَقُلْتُ لَهُ: أَتَأْذَنُ لِي أَنْ آتِيَ أَبَوَيَّ قَالَتْ: وَأُرِيدُ أَنْ أَسْتَيْقِنَ الْخَبَرَ مِنْ قِبَلِهِمَا قَالَتْ: فَأَذِنَ لِي رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فَقُلْتُ لاِمِّي: يَا أُمَّتَاهُ مَاذَا يَتَحَدَّثُ النَّاسُ قَالَتْ: يَا بُنَيَّةُ هَوِّنِي عَلَيْكِ فَوَاللهِ لَقَلَّمَا كَانَتِ امْرَأَةٌ قَطُّ وَضِيئَةً عِنْدَ رَجُلٍ يُحِبُّهَا، لَهَا ضَرَائِرُ، إِلاَّ كَثَّرْنَ عَلَيْهَا قَالَتْ: فَقُلْتُ سُبْحَانَ اللهِ أَوَ لَقَدْ تَحَدَّثَ النَّاسُ بِهذَا قَالَتْ: فَبَكَيْتُ تِلْكَ اللَّيْلَةَ حَتَّى أَصْبَحْتُ، لاَ يَرْقَأُ لِي دَمْعٌ، وَلاَ أَكْتَحِلُ بِنَوْمٍ ثُمَّ أَصْبَحْتُ أَبْكِي

قَالَتْ: وَدَعَا رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ عَلِيَّ بْنَ أَبِي طَالِبٍ، وَأُسَامَةَ بْنَ زَيْدٍ، حِينَ اسْتَلْبَثَ الْوَحْيُ، يَسْأَلُهُمَا، وَيَسْتَشِيرُهُمَا فِي فِرَاقِ أَهْلِهِ قَالَتْ: فَأَمَّا أُسَامَةُ فَأَشَارَ عَلَى رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ بِالَّذِي يَعْلَمُ مِنْ بَرَاءَةِ أَهْلِهِ، وَبِالَّذِي يَعْلَمُ لَهُمْ فِي نَفْسِهِ فَقَالَ أُسَامَةُ: أَهْلَكَ [ص:259] وَلاَ نَعْلَمُ إِلاَّ خَيْرًا وَأَمَّا عَلِيٌّ، فَقَالَ: يَا رَسُولَ اللهِ لَمْ يُضَيِّقِ اللهُ عَلَيْكَ وَالنِّسَاءُ سِوَاهَا كَثِيرٌ وَسَلِ الْجَارِيَةَ تَصْدُقْكَ قَالَتْ: فَدَعَا رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ بَرِيرَةَ فَقَالَ: أَيْ بَرِيرَةُ هَلْ رَأَيْتِ مِنْ شَيْءٍ يَرِيبُكِ قَالَتْ لَهُ بَرِيرَةُ: وَالَّذِي بَعَثَكَ بِالْحَقِّ مَا رَأَيْتُ عَلَيْهَا أَمْرًا قَطُّ أَغْمِصهُ، غَيْرَ أَنَّهَا جَارِيَةٌ حَدِيثَةُ السِّنِّ، تَنَامُ عَنْ عَجِينِ أَهْلِهَا، فَتأتِي الدَّاجِنُ فَتَأْكُلُهُ
قَالَتْ: فَقَامَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ مِنْ يَوْمِهِ، فَاسْتَعْذَرَ مِنْ عَبْدِ اللهِ بْنِ أُبَيٍّ، وَهُوَ عَلَى الْمِنْبَرِ، فَقَالَ: يَا مَعْشَرَ الْمُسْلِمِينَ مَنْ يَعْذِرُنِي مِنْ رَجُلٍ قَدْ بَلَغَنِي عَنْهُ أَذَاهُ فِي أَهْلِي وَاللهِ مَا عَلِمْتُ عَلَى أَهْلِي إِلاَّ خَيْرًا وَلَقَدْ ذَكَرُوا رَجُلاً مَا عَلِمْتُ عَلَيْهِ إِلاَّ خَيْرًا [ص:260] وَمَا يَدْخُلُ عَلَى أَهْلِي إِلاَّ مَعِي قَالَتْ: فَقَامَ سَعْدُ بْنُ مُعَاذٍ، أَخُو بَنِي عَبْدِ الأَشْهَلِ فَقَالَ: أَنَا، يَا رَسُولَ اللهِ أَعْذِرُكَ فَإِنْ كَانَ مِنَ الأَوْسِ ضَرَبْتُ عُنُقَهُ وَإِنْ كَانَ مِنْ إِخْوَانِنَا مِنَ الْخَزْرَجِ أَمَرْتَنَا فَفَعَلْنَا أَمْرَكَ قَالَتْ: فَقَامَ رَجُلٌ مِنَ الْخَزْرَجِ، وَكَانَتْ أُمُّ حَسَّانَ بِنْتَ عَمِّهِ، مِنْ فَخِذِهِ وَهُوَ سَعْدُ بْنُ عُبَادَةَ وَهُوَ سَيِّدُ الْخَزْرَجِ قَالَتْ: وَكَانَ قَبْلَ ذَلِكَ رَجُلاً صَالِحًا وَلكِنِ احْتَمَلَتْهُ الْحَمِيَّةُ، فَقَالَ لِسَعْدٍ: كَذَبْتَ لَعَمْرُ اللهِ لاَ تَقْتلُهُ، وَلاَ تَقْدِرُ عَلَى قَتْلِهِ وَلَوْ كَانَ مِنْ رَهْطِكَ مَا أَحْببْتَ أَنْ يُقْتَلَ فَقَامَ أُسَيْدُ بْنُ حُضَيْرٍ، وَهُوَ ابْنُ عَمِّ سَعْدٍ، فَقَالَ لِسَعْدِ بْنِ عُبَادَةَ: كَذَبْتَ لَعَمْرُ اللهِ لَنَقْتُلَنَّهُ فَإِنَّكَ مُنَافِقٌ تُجَادِلُ عَنِ الْمُنَافِقِينَ قَالَتْ: فَثَارَ الْحَيَّانِ، الأَوْسُ وَالْخَزْرَجُ، حَتَّى هَمُّوا أَنْ يَقْتَتِلُوا وَرَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَائِمٌ عَلَى الْمِنْبَرِ قَالَتْ: فَلَمْ يَزَلْ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يُخَفِّضُهُمْ حَتَّى سَكَتُوا وَسَكَتَ قَالَتْ: فَبَكَيْتُ يَوْمِي ذَلِكَ كُلَّهُ لاَ يَرْقَأُ لِي دَمْعٌ، وَلاَ أَكْتَحِلُ بِنَوْمٍ

قَالَتْ: وَأَصْبَحَ أَبَوَايَ عِنْدِي، وَقَدْ بَكَيْتُ لَيْلَتَيْنِ وَيَوْمًا لاَ يَرْقَا لِي دَمْعٌ، وَلاَ أَكْتَحِلُ بِنَوْمٍ حَتَّى إِنِّي لأَظُنُّ أَنْ الْبُكَاءَ فَالِقٌ كَبِدِي فَبَيْنَا أَبَوَايَ جَالِسَانِ عِنْدِي، [ص:261] وَأَنَا أَبْكِي، فَاسْتَاذَنَتْ عَلَيَّ امْرَأَةٌ مِن الأَنْصَارِ، فَأَذِنْتُ لَهَا فَجَلَسَتْ تَبْكِي مَعِي قَالَتْ: فَبَيْنَا نَحْنُ عَلَى ذَلِكَ، دَخَلَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ عَلَيْنَا فَسَلَّمَ، ثُمَّ جَلَسَ قَالَتْ: وَلَمْ يَجْلِسْ عِنْدِي، مُنْذُ قِيلَ مَا قِيلَ، قَبْلَهَا وَقَدْ لَبِثَ شَهْرًا لاَ يُوحى إِلَيْهِ فِي شَأْنِي بِشَيْءٍ قَالَتْ: فَتَشَهَّدَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ حِينَ جَلَسَ، ثُمَّ قَالَ: أَمَّا بَعْدُ يَا عَائِشَةُ إِنَّهُ بَلَغَنِي عِنْكِ كَذَا وَكَذَا فَإِنْ كُنْتِ بَرِيئَةً، فَسَيُبَرِّئُكِ اللهُ وَإِنْ كُنْتِ أَلْمَمْتِ بِذَنْبٍ فَاسْتَغْفِرِي اللهَ، وَتُوبِي إِلَيْهِ فَإِنَّ الْعَبْدَ، إِذَا اعْتَرَفَ، ثُمَّ تَابَ، تَابَ اللهُ عَلَيْهِ
قَالَتْ: فَلَمَّا قَضى رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ مَقَالَتَهُ، قَلَصَ دَمْعِي، حَتَّى مَا أُحِسُّ مِنْهُ قَطْرَةً فَقُلْتُ لأَبِي: أَجِبْ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ عَنِّي فِيمَا قَالَ فَقَالَ أَبِي: وَاللهِ مَا أَدْرِي مَا أَقُولُ لِرَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فَقُلْتُ لأُمِّي: أَجِيبِي رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فِيمَا قَالَ قَالَتْ أُمِّي: وَاللهِ مَا أَدْرِي مَا أَقُولُ لِرَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فَقُلْتُ: وَأَنَا جَارِيَةٌ حَدِيثَةُ السِّنِّ، لاَ أَقْرَأُ الْقُرْآنَ كَثِيرًا: إِنِّي، وَاللهِ لَقَدْ عَلِمْتُ لَقَدْ سَمِعْتُمْ هذَا الْحَدِيثَ حَتَّى اسْتَقَرَّ فِي أَنْفُسِكُمْ وَصَدَّقْتُمْ بِهِ فَلَئِنْ قُلْتُ لَكُمْ إِنِّي بَرِيئَةٌ لاَ تُصَدِّقُونِي وَلَئِنِ اعْتَرَفْتُ لَكُمْ بِأَمْرٍ، وَاللهُ يَعْلَمُ أَنِّي مِنْهُ بَرِيئَةٌ، لَتُصَدِّقُنِّي فَوَاللهِ لاَ أَجِدُ لِي وَلَكُمْ مَثَلاً إِلاَّ أَبا يُوسُفَ [ص:262] حِينَ قَالَ (فَصَبْرٌ جَمِيلٌ وَاللهُ الْمُسْتَعَانُ عَلَى مَا تَصِفُونَ) ثُمَّ تَحَوَّلْتُ وَاضْطَجَعْتُ عَلَى فِرَاشِي وَاللهُ يَعْلَمُ أَنِّي حِينَئِذٍ بَرِيئَةٌ وَأَنَّ اللهَ مُبَرِّئِي بِبَرَاءَتِي وَلكِنْ وَاللهِ مَا كُنْتُ أَظُنُّ أَنَّ اللهَ مُنْزِلٌ فِي شَأنِي وَحْيًا يُتْلَى لَشَأنِي فِي نَفْسِي كَانَ أَحْقَرَ مِنْ أَنْ يَتَكَلَّم اللهُ فِيَّ بِأَمْرٍ وَلكِنْ كُنْتُ أَرْجُو أَنْ يَرَى رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فِي النَّوْمِ رُؤْيَا يُبَرِّئُنِي اللهُ بِهَا فَوَاللهِ مَا رَامَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ مَجْلِسَهُ، وَلاَ خَرَجَ أَحَدٌ مِنْ أَهْلِ الْبَيْتِ، حَتَّى أُنْزِلَ عَلَيْهِ فَأَخَذَهُ مَا كَانَ يَأْخُذُهُ مِنَ الْبُرَحَاءِ حَتَّى إِنَّهُ لَيَتَحَدَّرُ مِنْهُ مِنَ الْعَرَقِ مِثْلُ الْجُمَانِ وَهُوَ فِي يَوْمٍ شَاتٍ، مِنْ ثِقَلِ الْقَوْلِ الَّذِي أُنْزِلَ عَلَيْهِ

قَالَتْ: فسُرِّيَ عَنْ رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ وَهُوَ يَضْحَكُ فَكَانَتْ أَوَّلَ كَلِمَةٍ تَكَلَّمَ بِهَا أَنْ قَالَ: يَا عَائِشَةُ أَمَّا اللهُ فَقَدْ بَرَّأَكِ
قَالَتْ: فَقَالَتْ لِي أُمِّي: قُومِي إِلَيْهِ فَقُلْتُ: وَاللهِ لاَ أَقُومُ إِلَيْهِ، فَإِنِّي لاَ أَحْمَدُ إِلاَّ اللهَ عَزَّ وَجَلَّ قَالَتْ: وَأَنْزَلَ اللهُ تَعَالَى:
(إِنَّ الَّذِين جَاءُوا بِالإِفْكِ عُصْبَةٌ مِنْكُمْ لاَ تَحْسبُوهُ شَرًّا لَكُمْ، بَلْ هُوَ خَيْرٌ لَكُمْ [ص:263] لِكُلِّ امْرِىءٍ مِنْهُمْ مَا اكْتَسَبَ مِنَ الإِثْمِ، وَالَّذِي تَوَلَّى كِبْرَهُ مِنْهُمْ لَهُ عَذَابٌ عَظِيمٌ لَوْلاَ إِذْ سَمِعْتُمُوهُ ظَنَّ الْمُؤْمِنُونَ وَالْمُؤْمِنَاتُ بِأَنْفُسِهِمْ خَيْرًا وَقَالُوا هذَا إِفْكٌ مُبِيِنٌ لَوْلاَ جَاءُوا عَلَيْهِ بِأَرْبَعَةِ شُهَدَاءِ، فَإِذْ لَمْ يَأْتُوا بِالشُّهَدَاءِ فَأُولئِكَ عِنْدَ اللهِ هُمُ الْكَاذِبُونَ وَلَوْلاَ فَضْلُ اللهِ عَلَيْكُمْ وَرَحْمَتُهُ فِي الدُّنيَا وَالآخِرَةِ لَمَسَّكُمْ فِي مَا أَفَضْتُمْ فِيهِ عَذَابٌ عَظِيمٌ إِذْ تَلَقَّوْنَهُ بِأَلْسِنَتِكُمْ وَتَقُولُونَ بِأَفْوَاهِكُمْ مَا لَيْسَ لَكُمْ بِهِ عِلْمٌ وَتَحْسَبُونَه هَيِّنًا وَهُوَ عِنْدَ اللهِ عَظِيمٌ [ص:264] وَلَوْلاَ إِذْ سَمِعْتُمُوهُ قُلْتُمْ مَا يَكُونُ لَنَا أَنْ نَتَكَلَّمَ بِهذَا سُبْحنَكَ هذَا بُهْتنٌ عَظِيمٌ يَعِظُكُمُ اللهُ أَنْ تَعُودُوا لِمِثْلِهِ أَبَدًا إِنْ كُنْتُم مؤْمِنِينَ وَيُبَيِّنُ اللهُ لَكُمُ الآيتِ، وَاللهُ عَلِيمٌ حَكِيمٌ إِنَّ الَّذِينَ يُحِبُّونَ أَنْ تَشِيعَ الْفَاحِشَةُ فِي الَّذِينَءَامَنُوا لَهُمْ عَذَابٌ أَلِيمٌ فِي الدُّنْيَا وَالآخِرَةِ، وَاللهُ يَعْلَمُ وَأَنْتُمْ لاَ تَعْلَمُونَ وَلَوْلاَ فَضْلُ اللهِ عَلَيْكُمْ وَرحْمَتُهُ وَأَنَّ اللهَ رَءُوفٌ رَحِيمٌ يأيُّهَا الَّذِينَءَامَنُوا لاَ تَتَّبِعُوا خُطُوتِ الشَّيْطنِ وَمَنْ يَتَّبِعْ خُطُوتِ الشَّيْطنِ [ص:265] فَإِنَّهُ يَأْمُرُ بِالْفَحْشَاءِ وَالْمُنْكَرِ وَلَوْلاَ فَضْلُ اللهِ عَلَيْكُمْ وَرَحْمَتُهُ مَا زَكَى مِنْكُمْ مِنْ أَحَدٍ أَبَدًا وَلكِنَّ اللهَ يُزَكِّي مَنْ يَشاءُ وَاللهُ سَمِيعٌ عَلِيمٌ وَلاَ يَأْتَلِ أْولُوا الْفَضْلِ مِنْكُمْ وَالسَّعَةِ أَنْ يُؤْتُوا أُولِي الْقُرْبى وَالْمَسكِينَ وَالْمُهجِرِينَ فِي سَبِيلِ اللهِ وَلْيَعْفُوا وَلْيَصْفَحُوا أَلاَ تُحِبُّونَ أَنْ يَغْفِرَ اللهُ لَكُمْ وَاللهُ غَفُورٌ رَحِيمٌ إِنَّ الَّذِينَ يَرْمُونَ الْمُحْصَنتِ الْغفِلتِ الْمُؤْمِنتِ لُعِنُوا فِي الدُّنْيَا وَالآخِرَةِ وَلَهُمْ عَذَابٌ عَظِيمٌ يَوْمَ تَشْهَدُ عَلَيْهِمْ أَلْسِنَتُهُمْ وَأَيْدِيهِمْ وَأَرْجُلُهُمْ بِمَا كَانُوا يَعْمَلونَ [ص:266] يَوْمَئِذٍ يُوَفِّيهِمُ اللهُ دِينَهُمُ الْحَقَّ وَيَعْلَمُونَ أَنَّ اللهَ هُوَ الْحَقُّ الْمُبِينُ الْخَبِيثتُ لِلْخَبِيثِينَ وَالْخَبِيثُونَ لِلْخَبِيثتِ، وَالطَّيِّبتُ لِلطَّيِّبِينَ وَالطَّيِّبُونَ لِلطَّيِّبتِ، [ص:267] أُولئِكَ مَبَرَّءُونَ مِمَّا يَقُولونَ، لَهُمْ مَغْفِرَةٌ وَرِزْقٌ كَرِيمٌ)
ثُمَّ أَنْزَلَ اللهُ هذَا فِي بَرَاءَتِي
قَالَ أَبُو بَكْرٍ الصِّدِّيقُ، وَكَانَ يُنْفِقُ عَلَى مِسْطَحِ بْنِ أُثَاثَةَ، لِقَرَابَتِهِ مِنْهُ وَفَقْرِهِ: وَاللهِ لاَ أُنْفِقُ عَلَى مِسْطَحٍ شَيْئًا أَبَدًا، بَعْدَ الَّذِي قَالَ لِعَائِشَةَ مَا قَالَ فَأَنْزَلَ اللهُ (وَلاَ يَأْتَلِ أُولُوا الْفَضْلِ مِنْكُمْ) إِلَى قَوْلِهِ (غَفُورٌ رَحِيمٌ)
قَالَ أَبُو بَكْرٍ الصِّدِّيقُ: بَلَى وَاللهِ إِنِّي لأُحِبُّ أَنْ يَغْفِرَ اللهُ لِي فَرَجَعَ إِلَى مِسْطَحِ النَّفَقَةَ الَّتِي كَانَ يُنْفِقُ عَلَيْهِ وَقَالَ: وَاللهِ لاَ أَنْزِعُهَا مِنْهُ أَبَدًا
قَالَتْ عَائِشَةُ: وَكَانَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ سَأَلَ زَيْنَبَ بِنْتَ جَحْشٍ عَنْ أَمْرِي فَقَالَ لِزَيْنَبَ: مَاذَا عَلِمْتِ أَوْ رَأَيْتِ قَالَتْ: يَا رَسُولَ اللهِ أَحْمِي سَمْعِي وَبَصَرِي وَاللهِ مَا عَلِمْتُ إِلاَّ خَيْرًا
قَالَتْ عَائِشَةُ: وَهِيَ الَّتِي كَانَتْ تُسَامِينِي، مِنْ أَزْوَاجِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فَعَصَمَهَا اللهُ بِالْوَرَعِ قَالَتْ: وَطَفِقَتْ أُخْتُهَا حَمْنَةُ تُحَارِبُ لَهَا فَهَلَكَتْ فِيمَنْ هَلَكَ
[ص:268] قَالَتْ عَائِشَةُ: وَاللهِ إِنَّ الرَّجُلَ الَّذِي قِيلَ لَهُ مَا قِيلَ، لَيَقُولُ: سُبْحَانَ اللهِ فَوَالَّذِي نَفْسِي بَيَدِهِ مَا كَشَفْتُ مِنْ كَنَفِ أُنْثى قَطُّ قَالَتْ: ثُمَّ قُتِلَ، بَعْدَ ذَلِكَ، فِي سَبِيلِ اللهِ
__________
أخرجه البخاري في: 64 كتاب المغازي: 34 باب حديث الإفك

1763. విశ్వాసుల మాతృమూర్తి హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) తనపై అపవాదు వేసిన వారి మాటలను గురించి ఇలా తెలియజేశారు:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఎక్కడికైనా ప్రయాణం చేయడానికి నిర్ణయించుకుంటే, తమ భార్యలను గురించి చీటీ వేసి, అందులో ఎవరి పేరు వస్తే ఆమెను తమ వెంట తీసికెళ్ళేవారు.

ఒక యుద్ద* సందర్భంగా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మాలో ఎవరిని తమ వెంట తీసికెళ్ళాలనే విషయమయి చీటీ వేశారు. ఆ చీటీలో నా పేరు వచ్చింది. అప్పుడు నేను ఆయన వెంట బయలుదేరాను. ఈ సంఘటన పరదా ఆదేశం అవతరించిన తరువాత జరిగింది. అందువల్ల నన్ను ఒంటె మిద అంబారీలో కూర్చోబెట్టారు. ఒంటె మీది నుంచి దిగవలసి వచ్చినప్పుడు నన్ను అంబారీలో ఉంచే క్రిందికి దించేవారు. సరే మేము బయలుదేరాము. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆ యుద్ధం ముగిసిన తరువాత తిరుగు ప్రయాణమయ్యారు. తిరుగు ప్రయాణంలో మేము మదీనా పట్నానికి కొన్ని మైళ్ళ దూరంలో ఒక ప్రదేశానికి చేరుకునేటప్పటికి చీకటి పడింది. ఆ రాత్రికి అక్కడ విడిది చేయాలని ప్రకటించబడింది

* ఒక యుద్ధం అంటే ఇక్కడ ‘బనీ ముస్తలిఖ్ యుద్ధం’ అని అర్థం. దీన్నే ‘మురసీ యుద్ధం’ అని కూడా అంటారు. (సంకలనకర్త)

నేనీ ప్రకటన విని (ఒంటె మీది నుంచి నా అంబారీని దించిన తరువాత) సహజ అవసరార్ధం సైన్యాలకు కాస్త దూరంగా బహిర్భూమికి వెళ్ళిపోయాను. మళ్ళీ నేను నా అంబారీ దగ్గరకు తిరిగొచ్చి కంఠం దగ్గర చేయి పెట్టి చూసుకుంటే నా ముత్యాల హారం కన్పించలేదు. అది తెగిపోయి ఎక్కడో పడిపోయి ఉంటుందని భావించి వెనక్కి వెళ్ళి వెతకడం ప్రారంభించాను. ఇలా వెతుక్కోవడంలో ఆలస్యమయిపోయింది. ఈలోగా నా అంబారీ ఎత్తే వాళ్ళు నేను అంబారీలో కూర్చొని ఉన్నాననుకొని దాన్ని ఎత్తి నా ఒంటి మీద పెట్టారు. ఆ రోజుల్లో మేము స్త్రీలము అన్నం తక్కువగా తినడం వల్ల బక్కగా ఉండేవాళ్ళము. ఎముకల మీద మాంసమే ఉండేది కాదు. అందువల్ల వారు నా అంబారీ ఎత్తి పెట్టేటప్పుడు బరువును అంచనా వేయలేకపోయారు. అదీగాక నేను నవ యౌవనంలో ఉండిన బాలికను. ఆ తరువాత వారు ఒంటెను లేపి వెళ్ళిపోయారు. నేను నా కంఠహారం వెతుక్కొని తిరిగి వచ్చేటప్పటికి సైన్యం అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. అక్కడ పిలిచేవారు గాని, కేక వేస్తే జవాబిచ్చేవారు గాని ఎవరూ లేరు. నేను అంబారీలో కన్పించకపోతే వాళ్ళే నా దగ్గరకు తిరిగొస్తారని తలచి నేను సైన్యం విడిది చేసిన ప్రదేశంలోనే కూర్చున్నాను.

కాస్సేపటికి నాకు నిద్ర వచ్చి పడుకున్నాను. హజ్రత్ సఫ్వాన్ బిన్ ముఅత్తల్ సలమీ జక్వానీ (రదియల్లాహు అన్హు) సైన్యాలకు వెనకాలగా నడచి వస్తున్నారు. ఆయన మరునాడు ఉదయం నేను నిద్రిస్తున్న ప్రదేశానికి చేరుకున్నారు. ఎవరో పడుకున్నారని తలచి ఆయన సమీపానికి వచ్చి చూశారు. ఆయన లోగడ పరదా ఆదేశం రాక పూర్వం నన్ను చూసి ఉండటం వల్ల, దగ్గరికొచ్చి చూడగానే నన్ను గుర్తుపట్టి “ఇన్నాలిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజివూన్” అన్నారు. ఈ అలికిడికి నేను కళ్ళు తెరిచాను. ఆయన్ని చూసి వెంటనే ఓణీతో నా ముఖాన్ని కప్పుకున్నాను. దైవసాక్షిగా చెబుతున్నాను. మేము ఒకరితోనొకరు ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు. నేనాయన నోట ‘ఇన్నాలిల్లాహి’ అనే మాట తప్ప మరేదీ వినలేదు. ఆ తరువాత ఆయన ఒంటె (దిగి దాని)ని నేల మీద కూర్చోబెట్టారు. నేను లేచి దాని మీద ఎక్కి కూర్చున్నాను. ఆయన ఒంటె ముకుతాడు పట్టుకొని ముందుకు నడిచారు. ఈ విధంగా మేము ఎండ పెట పెటలాడే (మిట్ట మధ్యాహ్నం) వేళకు సైన్యాలు విడిది చేసిన చోటుకు చేరుకున్నాము. (ఈ మాత్రం సంఘటనకే) వారు (నా మిద అపవాదు వేసి) నాశనమయ్యారు. ఈ అపవాదును లేపడంలో అబ్దుల్లా బిన్ ఉబై ప్రధాన పాత్ర వహించాడు.

ఈ హదీసును ఉల్లేఖించిన వారిలో ఒకరైన హజ్రత్ ఉర్వా (రహిమహుల్లాహ్) ఇలా తెలియజేస్తున్నారు: అతని (అంటే అబ్దుల్లా బిన్ ఉబై) సమావేశంలో ఈ అపవాదును గురించి బాహాటంగా చర్చ జరిగింది. రకరకాల మాటలు కల్పించబడ్డాయి. అతను వారిని సమర్ధిస్తూ వారు చెప్పే ప్రతి మాటనూ శ్రద్ధగా వింటూ విషయం మరింత తీవ్రరూపం దాల్చేలా (దానికి మిర్చీ మసాలా రాసి) మాట్లాడేవాడు. అపవాదు లేపిన వారిలో హస్సాన్ బిన్ సాబిత్ (రదియల్లాహు అన్హు), మిస్తహ్ బిన్ ఉసాసా (రదియల్లాహు అన్హు), హుమ్నా బినై జహష్ (రదియల్లాహు అన్హు)ల పేర్లు మాత్రమే నాకు తెలుసు. వీరే కాకుండా మరికొందరు కూడా ఉన్నారు. వారి* పేర్లు నాకు తెలియదు. కాకపోతే దివ్య ఖుర్ఆన్లో “ఈ అపవాదును మీలోనే ఒక ముఠా లేపింది” (24:11) అనే సూక్తిని బట్టి వారొక ముఠాకు చెందిన వారని మాత్రం నాకు తెలుసు. ఆ ముఠాలో ప్రధాన సూత్రధారి అబ్దుల్లా బిన్ ఉబయ్యే. హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) తన ముందు ఎవరైనా హజ్రత్ హస్సాన్ బిన్ సాబితా (రదియల్లాహు అన్హు)ని మాత్రం నిందిస్తే సహించేవారు కాదు. “నా తల్లిదండ్రులు, నా గౌరవ ప్రతిష్ఠలు ముహమ్మద్ మహనీయు (సల్లల్లాహు అలైహి వసల్లం)ని గౌరవ ప్రతిష్ఠల పరిరక్షణకై సమర్పితం. అందులోనే నా గౌరవం ఇమిడి ఉంది – అనే కవిత హస్సానే కదా చెప్పింది” అని అంటారు ఆమె.

* ఇక్కడ మూలభాషలో ప్రయోగించిన ‘ఉస్బా’ అనే పదానికి పది నుండి నలభై మంది వ్యక్తుల ముఠా అని అర్థం వస్తుంది (సంకలనకర్త)

హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) (తమ కథనాన్ని) కొనసాగిస్తూ ఇలా తెలియజేస్తున్నారు: ఆ తరువాత మేము మదీనాలో ప్రవేశించాము. మదీనా తిరిగొచ్చిన తరువాత నేను ఓ నెల రోజుల దాకా జబ్బుపడ్డాను. అపవాదు లేపిన వారి మాటలు విని ప్రజలు పరి పరి విధాలా చెప్పుకునేవారు. కాని నాకా సంగతే తెలియదు. అయితే నేను ఇది వరకు జబ్బు పడినప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నా పట్ల కనబరిచే ప్రేమ, సానుభూతుల్ని ఇప్పుడు జబ్బు పడి ఉన్నప్పుడు కనబరచకపోవడం గమనించి నాక్కొంచెం అనుమానం వచ్చేది. నేనీ జబ్బుపడి ఉన్న రోజుల్లో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నా దగ్గరికి వచ్చి సలాం మాత్రం చేసేవారు. (నా ఆరోగ్యం గురించి నన్నడగకుండా) “ఈవిడకు ఎలా ఉంది?” అని (ఇంట్లో ఉండే ఇతర సభ్యుల్ని) అడిగేవారు. ఈ ధోరణి మాత్రమే నాక్కాస్త అనుమానం కలిగించేది (ఆయన నా మిద అలిగారేమోనని). అంతకు మించి నాకు అపవాదు గురించి బొత్తిగా తెలియదు.

నేను జబ్బు నుండి కొంచెం కోలుకున్న తరువాత ఓ రోజు ఉమ్మె మిస్తహ్ (రదియల్లాహు అన్హు)తో కలసి ‘మనాసా’ ప్రదేశానికి బయలుదేరాను. ఇది మా స్త్రీల బహిర్బూమి. మేమక్కడికి రాత్రి వేళల్లో మాత్రమే వెళ్ళోస్తుంటాము. ఇది మా ఇండ్ల దగ్గర మరుగుదొడ్లు నిర్మించబడని నాటి సంగతి. ప్రాచీన అరబ్బుల అలవాటు ప్రకారం మేము బహిర్భూమి కోసం (ఊరి బయట చెట్లు చేమలుండే) అడవి ప్రదేశానికి వెళ్ళేవారము. ఆనాడు ఇండ్ల సమీపంలో మరుగుదొడ్లు నిర్మించడాన్ని జనం అసహ్యించుకునేవారు. ఉమ్మె మిస్తహ్ (అంటే మిస్తహ్ తల్లి) అబూరహమ్ బిన్ ముత్తలిబ్ బిన్ అబ్దుమునాఫ్ గారి కుమార్తె. ఆమె తల్లి బినై సఖర్ బినై ఆమిర్ (మా నాన్న) హజ్రత్ అబూబకర్ (రదియల్లాహు అన్హు)కు పినతల్లి అవుతుంది. నేను ఉమ్మె మిస్తహ్ (రదియల్లాహు అన్హు) ఆ తరువాత బహిర్భూమి నుండి ఇంటికి తిరుగు ముఖం పట్టాము. దారిలో ఉమ్మె మిస్తహ్ (రదియల్లాహు అన్హు) కాలు దుప్పటిలో ఇరుక్కుపోయి ఆమె తూలి పడిపోయింది. అప్పుడామె (అప్రయత్నంగా) “మిస్తహ పాడుగాను!” అని అన్నది. నేను (విషయం అర్థం గాక) “నువ్వు చాలా దారుణమైన మాటన్నావు. బద్ర్ యుద్ధంలో పాల్గొన్నటువంటి వ్యక్తిని నిందిస్తున్నావా నువ్వు?” అని అడిగాను. దానికామె “పిచ్చి పిల్లా! అతనేమన్నాడో నీకేమైనా తెలుసా? ” అని అన్నది. నేను

“ఏమన్నాడేమిటి?” అని అడిగాను. అప్పుడామె నా పై అపనింద వేసిన వారు ఎలాంటి మాటలు కల్పించి ప్రచారం చేస్తున్నారో తెలియజేసింది. ముందే జబ్బు పడి ఉన్న నేను ఈ మాటలు వినడంతో నా జబ్బు మరింత ఎక్కువైపోయింది. నేను ఇంటికి చేరుకునేటప్పటికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వచ్చి ఉన్నారు. నన్ను చూసి ఆయన సలాం చేశారు. ఆ తరువాత “ఈవిడ పరిస్థితి ఎలా ఉంది?” అని అడిగారు (ఇంట్లోని ఇతర సభ్యులతో). నేనాయనతో “నేను నా తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళడానికి అనుమతిస్తారా?” అని అన్నాను. ఈ అనుమతి అడగడంలో నా ఉద్దేశ్యం, నా తల్లిదండ్రుల ఇంటికెళ్ళి ఈ వదంతి గురించి నిజానిజాలు తెలుసుకోవాలన్నదే. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నాకు పుట్టింటికెళ్ళేందుకు అనుమతిచ్చారు. నేను (వెళ్ళి) మా అమ్మతో “అమ్మా! జనం ఏమిటీ ఇలా చెప్పుకుంటున్నారు?” అని అడిగాను. దానికామె సమాధానమిస్తూ “అమ్మా! బాధపడకు. దైవసాక్షిగా చెబుతున్నాను. సాధారణంగా ఎవరికైనా అందమైన భార్య ఉండి అతనామెను బాగా ప్రేమిస్తూ ఉన్నప్పుడు ఆమె సవతులు ఆమెలో ఏదో ఒక లోపాన్ని ఎత్తి చూపుతూనే ఉంటారు. ఇది సహజం” అని అన్నది. నేనీ మాట విని “సుబహానల్లాహ్! (ఆశ్చర్యార్థక పదం) ఇప్పుడు మరికొందరు కూడా ఇలాంటి అభూత కల్పనలకు పాల్పడుతున్నారా?” అని అన్నాను. ఆ రాత్రంతా నా కంటి మీద కునుకే లేదు. తెల్లారే దాకా ఏడుస్తూనే ఉండిపోయాను. తెల్లవారిన తరువాత కూడా నా కన్నీరు ఆగలేదు.

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దివ్యావిష్కృతి (వహీ) అవతరణలో ఆలస్యమయినందున హజ్రత్ అలీ బిన్ అబూ తాలిబ్ (రదియల్లాహు అన్హు), హజ్రత్ ఉసామా బిన్ జైద్ (రదియల్లాహు అన్హు)లను పిలిపించి, ఆయన తమ భార్య నుండి (అంటే నా నుండి) విడిపోయే విషయమయి వారిద్దర్నీ సంప్రదించారు. అప్పుడు హజ్రత్ ఉసామా (రదియల్లాహు అన్హు) మాట్లాడుతూ “దైవప్రవక్తా! మీ భార్యామణిని మీ నుండి వేరు చేయకండి. ఆమెలో మేముమంచితనం తప్ప మరేదీ చూడలేదు” అని అన్నారు. అయితే హజ్రత్ అలీ మాట్లాడుతూ “దైవప్రవక్తా! అల్లాహ్ మీకు ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు. ఆయిషా (రదియల్లాహు అన్హా)యే గాకుండా (లోకంలో) చాలా మంది స్త్రీలున్నారు. మీరు ఆమె సేవకురాలిని అడిగి చూడండి, ఆమె వాస్తవమేమిటో చెబుతుంది” అని అన్నారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) (నా సేవకురాలు) హజ్రత్ బరీరా (రదియల్లాహు అన్హు)ను పిలిపించి “బరీరా! నీకు ఆయిషా (రదియల్లాహు అన్హా) పట్ల అనుమానం కలిగించే సంఘటన ఏదైనా జరిగినట్లు నువ్వు చూశావా?” అని అడిగారు. హజ్రత్ బరీరా (రదియల్లాహు అన్హు) సమాధానమిస్తూ “మీకు సత్యధర్మమిచ్చి పంపిన శక్తి స్వరూపుని సాక్షి! హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా)లో నాకు అనుమానం కలిగించే ఎలాంటి చెడు విషయం నేనింతవరకు చూడలేదు. కాకపోతే ఆమె ఇంకా చిన్నపిల్లే అయినందున, ఇంట్లో పిండి కొట్టి ఉంచితే దాన్ని (నిర్లక్ష్యంగా) వదిలేసి నిద్రపోతుంది. ఈలోగా మేక వచ్చి దాన్ని కాస్తా తినిపోతుంది” అని అన్నది.

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ మాటలు విన్న తరువాత ఆ రోజే (మస్జిద్ లో) వేదిక ఎక్కి (కపట విశ్వాసి) అబ్దుల్లా బిన్ ఉబైని శిక్షించే విషయం గురించి ప్రజలను అడిగారు. ఆయన ప్రజలను సంబోధిస్తూ ఇలా అన్నారు : “(సోదర) ముస్లింలారా! నా భార్యపై అపనింద మోపి నన్ను , నా కుటుంబాన్ని బాధించిన వ్యక్తిపై నా తరఫున ప్రతీకారం తీర్చుకునేవారు ఎవరైనా ఉన్నారా? అల్లాహ్ మీద ప్రమాణం చేసి చెబుతున్నాను, నేను నా భార్యలలో మంచితనం తప్ప మరేదీ చూడలేదు. అపవాదు మోపబడిన ఆ వ్యక్తిలో కూడా నేనింతవరకు ఎలాంటి చెడు చూడలేదు. అతను నా ఇంటికి ఎప్పుడొచ్చినా నేనింట ఉన్నప్పుడే వచ్చేవాడు. నేను లేనప్పుడు ఎన్నడూ రాలేదు.”

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పలికిన ఈ మాటలు విని బనీ అబ్దుల్ అష్ హల్ ఉప తెగకు చెందిన హజ్రత్ సాద్ బిన్ ముఆజ్ (రదియల్లాహు అన్హు) లేచి “దైవప్రవక్తా! నేను మీ తరఫున ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ వ్యక్తి ఔస్ తెగవాడై ఉంటే నేను స్వయంగా అతడ్ని హతమారుస్తాను. ఒకవేళ అతను మా సోదర తెగ ఖజ్ రజ్ కు చెందిన వాడయితే అతడ్ని గురించి మిరాజ్ఞాపించండి, మేము మీ ఆజ్ఞను పాటిస్తాము” అని అన్నారు. ఈ మాట విని ఖజ్ రజ్ తెగ నాయకుడు హజ్రత్ సాద్ బిన్ ఉబాదా (రదియల్లాహు అన్హు) లేచి నిలబడ్డారు. ఆయన హజ్రత్ హస్సాన్ బిన్ సాబితా (రదియల్లాహు అన్హు) తల్లికి వరుసకు సోదరుడవుతారు. (అంటే ఆమె పిన తండ్రి కొడుకు). ఆయన సాధారణంగా మంచి మనిషే. కాని సాద్ బిన్ ముఆజ్ (రదియల్లాహు అన్హు) మాటలు విన్న తరువాత ఆయనలో అజ్ఞాన కాలంనాటి జాతీయ దురభిమానం పెల్లుబికింది. దాంతో ఆయన (ఉద్రేక పూరితుడయి) “నిత్య జీవుడయిన ప్రభువు సాక్షి! నీవు అబద్దమాడుతున్నావు. నీవతడ్ని హతమార్చవు, హతమార్చలేవు కూడా. అతను గనక నీ తెగవాడయి ఉంటే, అతను చంపబడటానికి నీవు ఎన్నటికీ కోరవు” అని అన్నారు హజ్రత్ సాద్ బిన్ ముఆజ్ (రదియల్లాహు అన్హు)తో.

హజ్రత్ సాద్ బిన్ ముఆజ్ (రదియల్లాహు అన్హు) పిన తండ్రి కొడుకు హజ్రత్ ఉసైద్ బిన్ హజీర్ (రదియల్లాహు అన్హు) ఈ మాట విని (దిగున) లేచి నిలబడ్డారు. ఆయన సాద్ బిన్ ఉబాదా (రదియల్లాహు అన్హు)ని సంబోధిస్తూ “నిత్య జీవుడయిన ప్రభువు సాక్షి! నువ్వొట్టి అబద్దాల రాయుడివి. మేమతడ్ని తప్పకుండా సంహరిస్తాం. నువ్వు కపట విశ్వాసిలా ఉన్నావు. అందుకే నువ్వు కపట విశ్వాసుల కొమ్ముకాస్తున్నావు” అని అన్నారు. ఈ సంభాషణ పెద్ద వివాదానికి దారి తీసింది. ఔస్, ఖజ్ రజ్ రెండు తెగలు పరస్పరం భగ్గుమన్నాయి. కొట్లాటకు సిద్ధమయ్యా యి. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వేదికపై నిలబడి ఉభయ తెగల వారికీ మాటి మాటికి సర్ది చెబుతూ వారిని శాంతపరచడానికి ప్రయత్నించారు. చివరికి ఎలాగో అందరూ శాంతించారు. గొడవ సద్దుమణిగింది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కూడా మౌనంగా ఉండిపోయారు. నేనా రోజంతాఏడుస్తూనే ఉండిపోయాను. కంటి మీద కునుకు కూడా రాలేదు.

నా తల్లిదండ్రులు నా దగ్గరే ఉన్నారు. నేనిలా ఒక పగలు, రెండు రాత్రులు నిరంతరాయంగా దుఃఖిస్తూ ఉన్నాను. కన్నీరు ఆగలేదు. నిద్ర కూడా పట్టలేదు. ఏడ్చి ఏడ్చి నా గుండె పగిలి పోతుందా అన్పించింది. కాస్సేపటికి ఒక స్త్రీ వచ్చి లోపల ప్రవేశించడానికి అనుమతి అడిగింది. నేనామెకు అనుమతిచ్చాను. ఆమె కూడా నాతోపాటు కూర్చొని ఏడ్వసాగింది. మేమి స్థితిలో ఉన్నప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) (మా ఇంటికి) వచ్చారు. ఆయన సలాం చేసి కూర్చున్నారు. నా మీద అపనింద మోపబడిన నాటి నుంచి ఈ రోజు వరకు ఆయన నా దగ్గర కూర్చోలేదు. ఒక నెల గడచిపోయినా అపనింద విషయంలో ఆయన పై ఎలాంటి దివ్యావిష్కృతి (వహీ) అవతరించలేదు.

ఆయన కూర్చొని ముందుగా షహాదత్ కలిమా (సాక్ష్య వచనం) పఠించారు. ఆ తరువాత ఇలా అన్నారు : “ఆయిషా! నీ గురించి నేనీ మాట విన్నాను. నీవు ఏ పాపమెరగని దానివయితే త్వరలోనే అల్లాహ్ నీ పాతివ్రత్యాన్ని బహిర్గతం చేస్తాడు. ఒకవేళ నీ వల్ల ఏదైనా తప్పు జరిగి ఉంటే, పశ్చాత్తాప హృదయంతో అల్లాహ్ ముందు క్షమాపణ వేడుకో. దాసుడు తన పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాప హృదయంతో క్షమాపణ వేడుకుంటే, అల్లాహ్ అతని పాపాన్ని (తప్పకుండా) క్షమిస్తాడు.”

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తమ సంభాషణ ముగించగానే నా కన్నీటి ప్రవాహం ఒక్కసారిగా ఆగిపోయింది. ఆ తరువాత నా కళ్ళ నుంచి ఒక్క కన్నీటి బిందువు కూడా రాలలేదు. నేను మా నాన్నగారి వైపుకు తిరిగి “దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పిన దానికి నా తరఫున మీరు సమాధానం ఇవ్వండి” అని అన్నాను. (మా నాన్న) హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) మాట్లాడుతూ “(అమ్మాయ్!) దైవ సాక్షిగా చెబుతున్నాను. ఈ విషయంలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు ఏమని సమాధానమివ్వాలో నాకేమీ అర్థం కావడం లేదు” అని అన్నారు. ఆ తరువాత నేను మా అమ్మతో “(అమ్మా!) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు నువ్వయినా సమాధానమివ్వు” అని అన్నాను. కాని మా అమ్మ కూడా “దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు ఏం సమాధానమివ్వాలో నాకేమి తోచడంలేదు” అని అన్నది.

ఆ తరువాత నేను మాట్లాడటం మొదలెట్టాను. అప్పటికి నేను పెద్దగా వయసు లేని బాలికను. ఖుర్ఆన్ కూడా నేనెక్కువగా పఠించలేదు. అయినా నేను మాట్లాడటానికి ఉపక్రమించాను. “మీరీ (అపనింద) మాటను బాగా విని ఉండటం వల్ల అది మీ అందరి హృదయాల్లో తిష్ఠవేసింది. అందరూ దీన్ని నిజమని భావిస్తున్నారు. అలాంటప్పుడు నేను ఏ పాపమెరుగని దాననంటే మీకు నమ్మకం కలగదు. ఒకవేళ నేను తప్పు చేయకపోయినా చేశానని ఒప్పుకుంటే మీరు వెంటనే నమ్ముతారు. కాని నేను ఎలాంటి పాపానికీ ఎంత మాత్రం పాల్పడలేదు. ఆ సంగతి అల్లాహ్ కు తెలుసు. అందువల్ల దైవసాక్షిగా చెబుతున్నాను. ఇప్పుడు నా పరిస్థితి, ఈ పరిస్థితి హజ్రత్ యాఖూబ్ (అలైహి) పరిస్థితిలో ఉంది. ఈ స్థితిలో నేను హజ్రత్ యాఖూబ్ (అలైహి) అన్న మాటనే అంటాను. ‘ఇప్పుడు నేను ఉత్తమ రీతిలో సహనం వహిస్తాను. మీరు కల్పించి చెబుతున్న దాని గురించి నేనిక అల్లాహ్ ని మాత్రమే సహాయం అర్ధించాలి’ (యూసుఫ్-18) అని అన్నారు ఆమె.”

ఇలా మాట్లాడిన తరువాత నేను పడక మీదికెళ్ళి పక్కకు తిరిగి పడుకున్నాను. నేను ఏ పాపమెరగని అమాయకురాలినని అల్లాహ్ కు బాగా తెలుసు. అందువల్ల ఆయన నా పాతివ్రత్యాన్ని తప్పకుండా బహిర్గతం చేస్తాడని నాకు గట్టి నమ్మకం ఉండింది. అయితే అల్లాహ్ నా ఈ వ్యవహారంలో (ప్రళయం దాకా) నిత్యం పఠించబడేలా దివ్య వచనాలను అవతరింపజేస్తాడని నేను కలలో కూడా ఊహించలేదు. నా వ్యవహారంలో అల్లాహ్ ప్రత్యేకంగా (దివ్య)వాణిని అవతరింపజేయడానికి నేనంతటి గొప్పదానను కూడా కాను. కాని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కలలో అలాంటిదేదైనా కన్పిస్తుందని మాత్రం నాకు నమ్మకముండింది.

అయితే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తమ స్థానం నుండి లేవకుండా అలాగే కూర్చున్నారు. అటు మా ఇంట్లో వాళ్ళు కూడా ఎవరూ లేచి బయటకు వెళ్ళలేదు. ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడే మట్టి బొమ్మల్లా కూర్చుండిపోయారు). అంతలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పై ‘దివ్యావిష్కృతి’ (వహీ) అవతరించింది. దివ్యావిష్కృతి సమయంలో ఏర్పడే అనిర్వచనీయమైన బాధ ఆయన్ని క్రమ్ముకుంది. దైవవాణి మోపిన భారం వల్ల తీవ్రమైన చలిలో సయితం ఆయన శరీరం నుండి చెమట బిందువులు రాలసాగాయి. కాస్సేపటికి ఈ పరిస్థితి దూరమయింది. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పెదవుల పై దరహాసం తొణికిసలాడింది. ఆయన నోట వెలువడిన మొట్టమొదటి వాక్యం (చూడండి). “ఆయిషా! అల్లాహ్ నీ పాతివ్రత్యాన్ని ధృవపరిచాడు” అని అన్నారు ఆయన.

మా అమ్మ ఈ మాట వినగానే “ఇక లే. లేచి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కు కృతజ్ఞతలు చెప్పుకో” అని అన్నది. నేను (తల అడ్డంగా తిప్పుతూ) “నేను లేవను. దైవసాక్షి! పరమోన్నతుడయిన నా ప్రభువుకు తప్ప మరెవరికీ నేను కృతజ్ఞతలు చెప్పుకోను” అని అన్నాను – దివ్యావిష్కృతి ద్వారా నూర్ సూరాలోని ఈ సూక్తులు వెలువడ్డాయి :

“ఈ అపవాదును మీలోనే ఒక వర్గం లేవదీసింది. (జరిగిందేదో జరిగింది, కాని) దీన్ని మీరు (ఈ విషయంలో) చెడుగా భావించకండి. ఇది మీకు (ఒకందుకు) మంచిదే. ఇందులో ఎవరు ఎంత పాత్ర వహించారో ఆ మేరకు వారు పాపాన్ని మూటగట్టుకున్నట్లే. ఈ వ్యవహారం గురించి అత్యధిక బాధ్యతను నెత్తిమీద వేసుకున్న ప్రధాన పాత్రధారికి మాత్రం కఠినాతి కఠినమైన శిక్ష కాచుకొని ఉంది.” (24:11)

“ఈ నిందారోపణను వినగానే విశ్వాసులైన స్త్రీ పురుషులు అనుమానానికి లోను కాకుండా సహృదయంతో ఎందుకు ఉండలేదు? మీరు అప్పటికప్పుడు ఇది పూర్తిగా నిరాధారమైన అపనింద అని ఎందుకు ఖండించలేదు? వారు (తమ నిందారోపణను నిరూపించుకోవడానికి) నలుగురు సాక్షులను ఎందుకు తీసుకురాలేదు? వారు సాక్ష్యం తీసుకురాలేదు. (తీసుకు రాలేరు కూడా, కనుక) అల్లాహ్ దృష్టిలో వారే పచ్చి అబద్ధాలరాయుళ్ళు”. (24:12, 13).

“మి మిద ఇహపరలోకాల్లో అల్లాహ్ అనుగ్రహం, ఆయన కరుణాకటాక్షాలే గనక లేకపోయి ఉంటే, మీరు ఏ (నిరాధారమైన) మాటల్లో పడిపోయారో వాటి పర్యవసానంగా మీ పై ఓ ఘోరమైన విపత్తు వచ్చిపడేదే. ఈ అసత్యారోపణ (ఎంత చెడ్డ విషయమో కాస్త మిరే ఆలోచించండి అది) మీ మధ్య ఒకరి నుంచి మరొకరికి (కార్చిచ్చులా) వ్యాపిస్తూ పోయింది. మీకు వాస్తవం ఏమిటో తెలియని విషయం మీనోట వెలువడసాగింది. మీరు దాన్ని సాధారణ విషయమని భావిస్తూ ఉండేవారు. కాని అల్లాహ్ దృష్టిలో ఇది చాలా తీవ్రమైన విషయం” . (24:14-15)

“ఈ విషయం వినగానే ‘ఇలాంటి మాటలు పలకడం మనకు తగదు, అల్లాహ్ పరిశుద్దుడు. ఇది పూర్తిగా నీలాపనింద’ అని మీరు ఎందుకు అనలేదు? మీరు విశ్వాసులే అయితే ఇక ముందు ఎన్నటికీ ఇలాంటి పనులకు పాల్పడకూడదని అల్లాహ్ మీకు ఉపదేశిస్తున్నాడు. మీరు విషయాన్ని అర్థం చేసుకోవడానికి) అల్లాహ్ మీకు తన బోధనలను విడమరచి తెలియజేస్తున్నాడు. ఆయన సర్వం తెలిసిన వాడు, ఎంతో వివేకవంతుడు”. (24:16-18)

“విశ్వసించినవారి మధ్య అశ్లీల విషయాలు వ్యాపించాలని కోరుకునేవారు ఇటు ప్రపంచంలోనూ, అటు పరలోకంలోనూ వ్యధాభరితమైన శిక్షకు అర్హులవుతారు. (అశ్లీలం సమాజం మీద ఎంత దుష్ప్రభావం వేస్తుందో) అల్లాహ్ కు తెలుసు; మీకు తెలియదు. మీ మీద అల్లాహ్ అనుగ్రహం, ఆయన కారుణ్య కటాక్షాలు గనక లేకపోయి ఉంటే, అల్లాహ్ వాత్సల్య మూర్తి, దయామయుడు అయి ఉండకపోతే (మీ మధ్య వ్యాపింపజేయబడిన ఈ విషయం దారుణమైన పరిణామాలకు దారి తీసి ఉండేది)”. (24:19, 20)

“కనుక విశ్వాసులారా! షైతాన్ అడుగుజాడల్లో నడవకండి. వాడు తనను అనుసరించే వారికి చెడు, అశ్లీలతలను గురించే ఆదేశిస్తాడు. ఈ మీద అల్లాహ్ అనుగ్రహం, ఆయన కారుణ్య కటాక్షాలే గనక లేకపోతే మీలో ఏఒక్కడూ పరిశుద్దుడు కాలేడు. అయితే అల్లాహ్ తాను కోరిన వ్యక్తిని పరిశుద్ధం చేస్తాడు. ఆయన సర్వం వినేవాడు. సమస్తం ఎరిగిన వాడు”. (24:21)

“మీలోని ఉదార స్వభావులు, (ఆర్థిక) స్తోమత కలిగినవారు. (ఈ అపనిందలో పాలు పంచుకున్న) తమ బంధువులకు, నిరు పేదలకు, దైవమార్గంలో ఇల్లు వాకిలి వదలి వలస వచ్చిన వారికి సహాయం చేయము అని ప్రతిన బూనకూడదు. వారిని క్షమించాలి, ఉదారంగా వ్యవహరించాలి. అల్లాహ్ మిమ్మల్ని క్షమించాలని వారు కోరుకోరా? అల్లాహ్ ఎంతో క్షమాశీలి, దయామయుడు”. (24:22)

“శీలవంతులయిన అమాయక ముస్లిం మహిళలపై లేనిపోని అపనిందలు మోపేవారు ఇటు ప్రపంచంలోనూ, అటు పరలోకంలోనూ శాపగ్రస్తులవుతారు. వారి కోసం కఠినాతి కఠిన శిక్ష ఉంది”. (24:23)

“ఇలా అపనిందలు మోపేవారు, స్వయంగా తమ నోళ్ళు, తమ కాళ్ళు చేతులే తమ అకృత్యాలను గురించి (తమకు వ్యతిరేకంగా) సాక్ష్యమిచ్చే రోజు ఒకటి వస్తుందన్న సంగతి మరచిపోకూడదు. ఆ రోజు అల్లాహ్ వారి కర్మలను బట్టి వారికి పూర్తి ప్రతిఫలాన్నిస్తాడు. అప్పుడు తెలుస్తుంది వారికి అల్లాహ్ యే సత్యమని, అల్లాహ్ యే నిజాన్ని నిజం చేసి చూపేవాడని”. (24:24, 25)

“అపవిత్ర స్త్రీలు అపవిత్ర పురుషులకొరకు, అపవిత్ర పురుషులు అపవిత్ర స్త్రీల కొరకు తగినవారు. అలాగే పవిత్ర స్త్రీలు పవిత్ర పురుషుల కొరకు, పవిత్ర పురుషులు పవిత్ర స్త్రీల కొరకు యోగ్యులు. జనం చెప్పుకునే (తప్పుడు) మాటల నుండి వారు పరిశుద్ధులు, పవిత్రులు. వారి కోసం మన్నింపు), ఉదారమైన ఉపాధి ఉన్నాయి.” (24:26) – (దివ్య ఖుర్ఆన్ – 24:11-26)

ఈ సూక్తుల్ని అల్లాహ్ నా పవిత్రత, పాతివ్రత్యాలను గురించి అవతరింపజేశాడు. (మా నాన్న) హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) (తమ నిరుపేద బంధువయిన) మిస్తహ్ బిన్ అసాసా (రదియల్లాహు అన్హు)కు ధన సహాయం చేస్తుండేవారు. అయితే (నా మీద వచ్చిపడిన అపనిందలో ఆయన కూడా భాగం పంచుకోవడం వల్ల) ఆయన (ఆగ్రహం వెలిబుచ్చుతూ) “దైవసాక్షి! (నా కుమార్తె) ఆయిషా (రదియల్లాహు అన్హా)ను గురించి మిస్తహ్ (రదియల్లాహు అన్హు) అన్న మాటలకు (నా హృదయం తూట్లు పడింది) నేనిక నుండి అతని కోసం ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టను” అని అన్నారు. ఆయనలా అన్నందుకు అల్లాహ్ సూక్తిని అవతరింపజేశాడు : “మీలో దయానుగ్రహం పొందినవారు, (ఆర్థిక) స్తోమత కలిగిన వారు (ఈ అపనిందలో పాలు పంచుకున్న) తమ బంధువులకు, నిరు పేదలకు, ఇల్లు వాకిలి వదలి దైవమార్గంలో వలస వచ్చిన వారికి సహాయం చేయబోమని ప్రతిన బూనకూడదు. వారిని క్షమించాలి, వారి పట్ల ఉదారంగా మసలుకోవాలి. అల్లాహ్ మిమ్మల్ని క్షమించాలని మీరు కోరుకోరా? అల్లాహ్ ఎంతో క్షమాశీలి. దయామయుడు.” (24:22) ఈ సూక్తి అవతరించిన తరువాత హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) (మనసు మార్చుకొని) “దైవసాక్షి! అల్లాహ్ నన్ను క్షమించాలనే నేను కోరుకుంటున్నాను. ఇక నుంచి నేనీ సహాయాన్ని ఎన్నటికీ నిలిపి వేయను” అని అన్నారు. ఆయన మిస్తహ్ (రదియల్లాహు అన్హు)కు ఇది వరకు ఎంత ధన సహాయం అంద చేస్తుండేవారో ఆ సహాయాన్ని తిరిగి అందజేయడం ప్రారంభించారు.

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నా వ్యవహారం గురించి (విశ్వాసుల మాతృమూర్తి) హజ్రత్ జైనబ్ బిన్‌ జహష్ (రదియల్లాహు అన్హు)ని కూడా విచారించారు. “ఈ విషయంలో నీకేమయినా తెలుసా?” అన్నారు ఆయన. దానికామె “దైవప్రవక్తా! నేను నా కళ్ళు చెవుల విషయంలో చాలా జాగ్రత్తగా మసలుకుంటాను. (చూడకుండా, వినకుండా, నోటికొచ్చినట్లు మాట్లాడను). దైవసాక్షి! నేనామెలో మంచితనం తప్ప మరేదీ చూడలేదు” అని అన్నారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) భార్యలలో ఒక్క జైనబ్ (రదియల్లాహు అన్హు) మాత్రమే నాకు పోటీగా నిలిచే స్త్రీ. (అయినప్పటికీ ఆమె ఈ వ్యవహారంలో సవతి అసూయ ప్రదర్శించకుండా న్యాయంగా మాట్లాడారు) ఆమెలోని భక్తి పరాయణత వల్ల అల్లాహ్ ఆమెను (ఈ రొంపి నుండి) కాపాడాడు. అయితే హజ్రత్ జైనబ్ (రదియల్లాహు అన్హు)ను ఎల్లప్పుడూ సమర్ధిస్తూ మాట్లాడే ఆమె సోదరి మత్రం అపవాదు లేపిన వారితో చేరి నాశనమయిపోయింది.

అపవాదు వ్యవహారంలోకి, నాతో పాటు ఈడ్చబడిన ఆ వ్యక్తి * అన్న పలుకులు కూడా ఎంతో గమనార్హమైనవి. ఆయన “అల్లాహ్ మాత్రమే పరిశుద్దుడు, పవిత్రుడు. కాని నా ప్రాణం ఎవరి అధీనంలో ఉందో ఆ అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను. ఈ రోజు వరకు నేను ఏనాడూ ఏ (పర) స్త్రీ వలువ విప్పలేదు” అని అన్నారు. ఈయన ఆ తరువాత కొన్నాళ్ళకు దైవమార్గంలో పోరాడుతూ అమరగతులయ్యారని హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) తెలిపారు.

(సహీహ్ బుఖారీ:- 64వ ప్రకరణం – మగాజీ, 34వ అధ్యాయం – హదీసిల్ ఇఫ్క్)

* ఈ వ్యక్తి పేరు హజ్రత్ సఫ్వాన్ బిన్ ముఅత్తల్ (రదియల్లాహు అన్హు) – (సంకలనకర్త)

1764 – حديث عَائِشَةَ، قَالَتْ: لَمَّا ذُكِرَ مِنْ شَأْنِي الَّذِي ذُكِرَ، وَمَا عَلِمْتُ بِهِ، قَامَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فِيَّ خَطِيبًا فَتَشَهَّدَ، فَحَمِدَ اللهَ وَأَثْنَى عَلَيْهِ بِمَا هُوَ أَهْلُهُ ثُمَّ قَالَ: أَمَّا بَعْدُ أَشِيرُوا عَلَيَّ فِي أُنَاسٍ أَبْنُوا أَهْلِي، وَايْمُ اللهِ مَا عَلِمْتُ عَلَى أَهْلِي مِنْ سُوءٍ وَأَبَنُوهُمْ بِمَنْ، وَاللهِ مَا عَلِمْتُ عَلَيْهِ مِنْ سُوءٍ قَطُّ وَلاَ يَدْخُلُ بَيْتِي قَطُّ إِلاَّ وَأَنَا حَاضِرٌ وَلاَ غِبْتُ فِي سَفَرٍ إِلاَّ غَابَ مَعِي
قَالَتْ: وَلَقَدْ جَاءَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ بَيْتِي فَسَأَلَ عَنِّي خَادِمَتِي فَقَالَتْ: لاَ وَاللهِ مَا عَلِمْتُ عَلَيْهَا عَيْبًا إِلاَّ أَنَّهَا كَانَتْ تَرْقُدُ حَتَّى تَدْخُلَ الشَّاةُ فَتَأْكُلَ خَمِيرَهَا أَوْ عَجِينَهَا وَانْتَهَرَهَا بَعْضُ أَصْحَابِهِ، فَقَالَ: اصْدُقِي رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، حَتَّى أَسْقَطُوا لَهَا بِهِ فَقَالَتْ سُبْحَانَ اللهِ وَاللهِ مَا عَلِمْتُ عَلَيْهَا إِلاَّ مَا يَعْلَمُ الصَّائِغُ عَلَى تِبْرِ الذَّهَبِ الأحْمَرِ وَبَلَغَ الأَمْرُ إِلَى ذَلِكَ الرَّجُلِ الَّذِي قِيلَ لَهُ فَقَالَ: سُبْحَانَ اللهِ وَاللهِ مَا كَشَفْتُ كَنَفَ أُنْثى قَطُّ قَالَتْ عَائِشَةُ: فَقُتِلَ شَهِيدًا فِي سَبِيلِ اللهِ
__________
أخرجه البخاري في: 65 كتاب التفسير: 24 سورة النور: 11 باب إن الذين يحبون أن تشيع الفاحشة في الذين آمنوا

1764. హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం :- నా మిద లేనిపోని అపనింద మోపబడినప్పుడు నాకా సంగతే తెలియదు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రసంగించడానికి (వేదికపై) నిలబడ్డారు. మొదట ఆయన షహాదత్ కలిమా (సాక్ష్య వచనం) పఠించారు. తరువాత అల్లాహ్ ను ఆయన ఔన్నత్యానికి తగిన విధంగా స్తుతించారు. ఆ తరువాత ఇలా అన్నారు. “నా భార్య మీద అపనింద మోపిన వ్యక్తిని గురించి మీరు నాకేదయినా సలహా ఇవ్వండి. దైవసాక్షిగా చెబుతున్నాను. నా కుటుంబ సభ్యులను గురించి ఎలాంటి చెడు విషయం కూడా ఎన్నడూ నా దృష్టికి రాలేదు. నా భార్యతో పాటు ఈ అపనిందలో ఇరికించబడిన వ్యక్తి గురించి కూడా నేనెప్పుడూ చెడు విషయం వినలేదు. అతను నా ఇంటికి నేను లేనప్పుడు ఎన్నడూ రాలేదు. నేనెప్పుడైనా ప్రయాణమయి ఎక్కడికైనా వెళ్తే అతను కూడా నాతో పాటే ఉండేవాడు.”

హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం :- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నా యింటికి వచ్చి నా గురించి నా సేవకురాలిని విచారించారు. దానికి ఆమె సమాధానమిస్తూ “ఎంత మాత్రం లేదు. నేను ఆయిషా (రదియల్లాహు అన్హా)లో ఏనాడూ ఎలాంటి చెడునూ చూడలేదు. కాకపోతే ఆమె (అప్పుడప్పుడు) ఆదమరచి నిద్ర పోతుంది, అప్పుడు మేక వచ్చి పిండి తినిపోతుంది” అని అన్నది. నా యీ సేవకురాలిని ప్రవక్త అనుచరులలో కొందరు గదమాయించారు, కోపగించుకున్నారు. అయినప్పటికీ ఆమె “అల్లాహ్ పరిశుద్దుడు. దైవసాక్షిగా చెబుతున్నాను. స్వర్ణకారుణికి మేలిమి బంగారం గురించి ఏం తెలుసో ఆయిషా (రదియల్లాహు అన్హా)ను గురించి కూడా నాకు అదే తెలుసు. (అంతకు మించి మరేమీ తెలియదు)” అని అన్నది. ఈ అపవాదులో నాతోపాటు ఇరికించబడిన వ్యక్తికి * అపవాదు సంగతి తెలిసినపుడు “అల్లాహ్ పరిశుద్ధుడు. దైవసాక్షిగా చెబుతున్నాను. నేనీ రోజు వరకు ఏ (పర) స్త్రీ వలువ విప్పలేదు” అని అన్నాడు. ఈయన ఆ తరువాత కొన్నాళ్ళకు దైవమార్గంలో పోరాడుతూ అమరగతులయ్యారు.

(సహీహ్ బుఖారీ:- 65వ ప్రకరణం – తఫ్సీర్, 24వ సూరా – నూర్, 11వ అధ్యాయం – ఇన్నల్లజీన యుహిబ్బూన అన్ తషీఐ అల్ ఫాహిషతు ఫిల్లజీన ఆమనూ)

* ఈ వ్యక్తి పేరు హజ్రత్ సఫ్వాన్ బిన్ ముఅత్తల్ (రదియల్లాహు అన్హు) – (సంకలనకర్త)

మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్) (Al-Lulu-wal-Marjaan) .