ఉపవాసం పాటించే వారు ఎందరో? కానీ పుణ్యాలు పొందే వారు కొందరే! ఎందుకో తెలుసుకోండి [వీడియో క్లిప్ & టెక్స్ట్]

ఉపవాసం పాటించే వారు ఎందరో? కానీ పుణ్యాలు పొందే వారు కొందరే! ఎందుకో తెలుసుకోండి
https://youtu.be/JC8rwimqiyw [1 నిముషం]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిమ్ రహిమహుల్లా చెప్పారు, ప్రతి ఆరాధనలో ఎందులోనైతే ఎక్కువగా అల్లాహ్ యొక్క జిక్ర్ (స్మరణ) ఉంటుందో దాని యొక్క ఘనత పుణ్య పరంగా ఎక్కువగా ఉంటుంది. ఎలా అంటే, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం తో ప్రశ్నించడం జరిగింది, జీహాద్ లో ఎక్కువ పుణ్యం ఎవరికి లభిస్తుంది అంటే అల్లాహ్ యొక్క జిక్ర్ ఎక్కువ చేసిన వారికి. అలాగే నమాజ్, జకాత్, హజ్ విషయాల్లో కూడా ప్రశ్నించడం జరిగింది. అలాగే “అయ్యుస్-సాయిమీన ఆజము అజ్రా”, ఉపవాసంలో ఎవరికి ఎక్కువగా పుణ్య ఫలితం లభిస్తుంది అన్నటువంటి ప్రశ్నకు కూడా “అక్సరుహుమ్ లిల్లాహి జిక్రా”, ఎవరైతే ఎక్కువగా అల్లాహ్ ను స్మరిస్తారో.