స్వర్గానికి చేర్పించే ఒక మంచి హృదయ ఆచరణ

అనస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం మేము దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో (మస్జిద్ లో) కూర్చుని ఉన్నాము. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం: ఇప్పుడు మీ ముందురా రాబోయే వ్యక్తి ఒక స్వర్గవాసి అని అన్నారు. అప్పుడు ఒక అన్సారి (సహాబి) అక్కడికి వచ్చారు. వుజూ చేసిన కారణంగా నీరు ఆయన గడ్డం నుండి కారుతుంది, ఎడుమ చేతిలో చెప్పులు పట్టుకుని ఉన్నారు. మళ్ళీ రెండోరోజు దైవ ప్రవక్త సల్లల్లాహు సల్లల్లాహు అలైహి వసల్లం అదే మాట అన్నారు, అప్పుడు మళ్ళీ ఆ అన్సారి సహాబి మునుపటి లాగే వచ్చారు, మూడోరోజు కూడా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అదే మాటే అన్నారు, అప్పుడు కూడా అదే సహాబి అలానే వచ్చారు, దైవ ప్రవక్త అక్కడ నుంచి (పోవడానికి) లేచి నిలబడ్డారు. (అక్కడ కూర్చుని ఉన్నవారిలో నుంచి) అబ్దుల్లాహ్ బిన్ అమర్ బిన్ ఆస్ రజియల్లాహు అన్హుమా ఆ అన్సారి సహాబి వెనుక వెళ్ళి ఆయనతో అన్నారు, నా తండ్రితో నాకు గొడవ జరిగిపోయింది. మూడు రోజులు ఇంటికి రాను అని ఒట్టు పెట్టుకున్నాను, ఈ రోజులు గడిచే వరకు నేను మీతో ఉండడానికి సహాయపడతారని చూస్తునాను? దానికి ఆ అన్సారి సహాబి ఆయనతో ఉండడానికి ఒప్పుకున్నారు.

అనస్ రజియల్లాహు అన్హు అంటున్నారు: అబ్దుల్లాహ్ రజియల్లాహు అన్హు మూడు రాత్రులు ఆయనతో గడిపిన సంఘటన ఇలా తెలిపారు:

నేను ఆయన్ని రాత్రుల్లో (తహజ్జుద్ కొరకు) లేవడం చూడలేదు, కాకపోతే నిద్రలో మెలుకువ వచ్చిన లేదా పడకపై అటు ఇటు మరలిన అల్లాహ్ తఆలా స్మరణ చేసేవారు మరియు తక్బీర్ (అల్లాహు అక్బర్) పలికే వారు, తర్వాత ఆయన ఫజర్ నమాజు సమయానికే లేచే వారు. అబ్దుల్లాహ్ రజియల్లాహు అన్హు అంటున్నారు, కాకపోతే ఆ అన్సారి సహాబి గుణం మంచి ఉత్తమ మాటే పలికే వారు, మూడు రాత్రులు పూర్తిగా ఆయనతో గడిపిన తర్వాత ఆయన ఆచరణలు తేలికగా భావించక ముందే, ఆ అన్సారీ సహాబితో అన్నాను ఓ అల్లాహ్ దాసుడా నా మధ్యా నా తండ్రి మధ్య ఎలాంటి కోపతాపాలు, తెగతెంపులు లేవు, కాకపోతే నేను, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అంటుండగా విన్నాను: ఇప్పుడు మీ ముందుకు రాబోయే వ్యక్తి స్వర్గవాసి అని, అప్పుడు చూస్తే మీరు వచ్చారు, ఇలా మూడు సార్లు (మూడు రోజులు) జరిగింది, నేను అప్పుడే అనుకున్నాను మీతో ఉండి ఏ ఆచరణలు చేస్తారో చూసి, వాటిని పాటించాలి అని. అందుకే నేను మీతో ఉండి గమనించాను, మరి మీరు ఏమి ఎక్కువ ఆచరణలు చేయడం నేను చూడలేదు, ఏ విషయం మీద రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం మీరు స్వర్గవాసి అని అన్నారో అని అడిగాను. అన్సారి సహాబి అన్నారు: మీరు చూసిన ఆచరణలు తప్ప నాలో ఏ ప్రత్యేక ఆచరణ లేదు, అబ్దుల్లాహ్ బిన్ అమర్ బిన్ ఆస్ రజియల్లాహు అన్హుమా అంటున్నారు, నేను అక్కడ నుంచి వెనుతిరిగి పోతుంటే ఆ అన్సారి సహాబి పిలిచి ఇలా తెలిపారు, మీరు చూసింది తప్ప నాలో ఏ ప్రత్యేక ఆచరణ లేదు, కాకపోతే నేను ముస్లింలలో ఏ ఒక్కరి కోసమైన దుర్భావన, మోసపూరిత భావన మరియు అల్లాహ్ వారికి ఇచ్చిన మేలు గురించి నా మనస్సులో ఎలాంటి అసూయ, ద్వేషం ఉంచుకోను. దానికి అబ్దుల్లాహ్ రజియల్లాహు అన్హు చెప్పారు: ఈ విషయమే మిమ్మల్ని స్వర్గవాసి అనే ప్రత్యేక స్థానానికి చేర్పించింది, ఈ ప్రత్యేక ఆచరణకు చేరుకునే శక్తి మాలో లేక పోయింది.

(హదీసు మస్నదే అహ్మద్, నసాయీ సునన్ అల్ కుబ్రా)

[ఈ హదీస్ ప్రామాణికత విషయంలో ముహద్దిసీన్ పండితుల మధ్య బేధాభిప్రాయం ఉంది కొందరు దీని ప్రామాణికతను ధృవీకరించారు కొందరు ధృవీకరించ లేదు]

హదీసు అనువాదం: సోదరుడు అబ్దుల్ ఖాదిర్ (హఫిజహుల్లాహ్)
రివ్యూ : నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

كنَّا جُلوسًا مع رسولِ اللهِ صلَّى اللهُ عليه وسلَّمَ فقال: يَطلُعُ عليكم الآنَ رَجُلٌ من أهلِ الجَنَّةِ، فطَلَعَ رَجُلٌ من الأنصارِ، تَنطِفُ لحيَتُهُ من وَضوئِهِ، قد تَعَلَّقَ نَعْلَيهِ في يَدِه الشِّمالِ، فلمَّا كان الغدُ، قال النَّبيُّ صلَّى اللهُ عليه وسلَّمَ، مِثْلَ ذلك، فطَلَعَ ذلك الرَّجُلُ مثلَ المرةِ الأولَى. فلمَّا كان اليومُ الثالثُ، قال النَّبيُّ صلَّى اللهُ عليه وسلَّمَ، مِثْلَ مَقالَتِهِ أيضًا، فطَلَعَ ذلك الرَّجُلُ على مِثْلِ حالِه الأولَى، فلمَّا قام النَّبيُّ صلَّى اللهُ عليه وسلَّمَ تَبِعَهُ عبدُ اللهِ بنُ عَمْرِو بنِ العاصِ فقال: إنِّي لاحَيتُ أبي فأقسَمْتُ ألَّا أدخُلَ عليه ثلاثًا، فإنْ رَأيْتَ أنْ تُؤويَني إليكَ حتى تَمضيَ فَعَلتَ؟ قال: نَعَمْ. قال أنَسٌ: وكان عبدُ اللهِ يُحَدِّثُ أنَّه باتَ معه تلك اللَّياليَ الثَّلاثَ، فلم يَرَهُ يقومُ من الليلِ شيئًا، غيرَ أنَّه إذا تَعارَّ وتَقَلَّبَ على فِراشِهِ ذَكَرَ اللهَ عزَّ وجَلَّ وكبَّرَ، حتى يقومَ لصلاةِ الفجرِ. قال عبدُ اللهِ: غيرَ أني لم أَسمَعْهُ يقولُ إلَّا خَيْرًا، فلمَّا مَضَتِ الثلاثُ ليالٍ وكِدْتُ أنْ أحقِرَ عمَلَهُ، قلتُ: يا عبدَ اللهِ، إنِّي لم يكن بَيْني وبينَ أبي غَضَبٌ ولا هَجْرٌ ثَمَّ، ولكِنْ سَمِعتُ رسولَ اللهِ صلَّى اللهُ عليه وسلَّمَ يقولُ لكَ ثلاثَ مِرارٍ: يَطلُعُ عليكم الآنَ رَجُلٌ من أهْلِ الجَنَّةِ فطَلَعتَ أنتَ الثلاثَ مِرارٍ، فأرَدْتُ أنْ آويَ إليكَ لِأنظُرَ ما عَمَلُكَ، فأقتَديَ به، فلم أرَكَ تَعمَلُ كثيرَ عَمَلٍ، فما الذي بَلَغَ بكَ ما قال رسولُ اللهِ صلَّى اللهُ عليه وسلَّمَ، فقال: ما هو إلَّا ما رَأيتَ. قال: فلمَّا وَلَّيتُ دَعاني، فقال: ما هو إلَّا ما رَأيتَ، غيرَ أنِّي لا أجِدُ في نَفْسي لِأحَدٍ من المسلمينَ غِشًّا، ولا أحسُدُ أحَدًا على خَيْرٍ أعطاهُ اللهُ إيَّاهُ. فقال عبدُ اللهِ: هذه التي بَلَغَتْ بكَ، وهي التي لا نُطيقُ.
الراوي : أنس بن مالك.
المحدث : شعيب الأرناؤوط.
المصدر : تخريج المسند.
الصفحة أو الرقم: 12697.
خلاصة حكم المحدث : إسناده صحيح على شرط الشيخين.
التخريج: أخرجه النسائي في ((السنن الكبرى)) (10699)، وأحمد (12697) واللفظ له.

%d bloggers like this: