సంతాన శిక్షణ – పార్ట్ 05 [వీడియో]

బిస్మిల్లాహ్

[36:52 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

సంతాన శిక్షణలో జరిగే పొరపాట్లు

అల్ హందు లిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలర్ రహ్మతిల్ ముహ్ దాతి వన్నిఅమతిల్ ముస్ దాతి నబియ్యినా ముహమ్మదివ్ వ అలా ఆలిహీ వసహబిహీ అజ్మఈన్. అమ్మా బఅద్:

సంతాన శిక్షణ సులభతరమైన, లక్ష్యరహితమైన పని కాదు, ప్రతి ఒక్కరు ఏ విద్యాజ్ఞానం లేకుండా దానిని పాటించటానికి. అది నిర్దిష్ట ప్రమాణాలతో, ధార్మిక నియమాలతో కూడిన క్లిష్టమైన పని. అంతే కాదు సంతానం మేళ్ళను సాధించుటకు, వారి జ్ఞానేంద్రియాల పెరుగుదల, దినదినానికి వారి మనోస్థితిని పెంచుటకు మరియు వారి నుండి చెడు అనే అపాయాన్ని దూరం చేయుటకు వ్యక్తిగత ప్రయత్నాలు, భావనాపూర్ణమైన అంతర్దృష్టి చాలా అవసరం.

కొందరు శిక్షణ విషయంలో తాతముత్తాతల గుడ్డి మార్గాన్ని అనుసరిస్తూ వంశపరమైన వారసత్వంలో పొందిన ఒకే ఒక సాలిడ్ (నిశ్చలమైన) పద్దతిని అవలంబిస్తున్నది చూస్తున్నాము. అందువల్ల శిక్షణ విషయంలో చాలా పొరపాట్లు జరుగుతున్నాయి. దీనికి ప్రభావితులవుతున్నది మన సంతానం. అందుకే వారిలో ఎన్నో దుష్ప్రవర్తనలు, చెడు అలవాట్లు జనిస్తున్నాయి. వాటిని కుటుంబాలు మరియు సమాజాలు భరించలేక పోతున్నాయి.

ఈ చిరుపుస్తకంలో కొన్ని ముఖ్యమైన పొరపాట్లను ప్రస్తావిస్తూ వాటి సరియైన నివారణపద్ధతి కూడా చూపే ప్రయత్నం చేస్తాను. అల్లాహ్ అందరికి సద్భాగ్యం ప్రసాదించుగాక.

1- శిక్షణ పట్ల నిర్బాధ్యత

కొందరు తల్లిదండ్రులు సంతానం శిక్షణలో ఏ మాత్రం శ్రద్ధ వహించరు. తమ సంతానం పట్ల ఏ చిన్న బాధ్యత వహించకుండా వదిలేస్తారు. వారు అట్లే పెరుగుతూ పోతారు. సంతానం పట్ల ఉన్న వారి బాధ్యత కూడు, గూడు, బట్ట కంటే మించినది లేదని భావిస్తారు. మరి అల్లాహ్ ఈ ఆదేశాన్ని మరచిపోతారు.

[يَا أَيُّهَا الَّذِينَ آَمَنُوا قُوا أَنْفُسَكُمْ وَأَهْلِيكُمْ نَارًا]

విశ్వాసులారా! మీరు మిమ్మల్ని మీ భార్యపిల్లల్ని నరకాగ్ని నుండి రక్షించుకోండి. (తహ్రీమ్ 66: 6).

అలీ బిన్ తాలిబ్ రజియల్లాహు అన్హు చెప్పారు: వారికి విద్య నేర్పండి మంచి శిక్షణ ఇవ్వండి.

అలాగే వారు (తండ్రులు) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ఆదేశాన్ని మరచిపోతారుః

(كُلُّكُمْ رَاعٍ وَمَسْئُولٌ عَنْ رَعِيَّتِهِ فَالْإِمَامُ رَاعٍ وَهُوَ مَسْئُولٌ عَنْ رَعِيَّتِهِ وَالرَّجُلُ فِي أَهْلِهِ رَاعٍ وَهُوَ مَسْئُولٌ عَنْ رَعِيَّتِهِ وَالْمَرْأَةُ فِي بَيْتِ زَوْجِهَا رَاعِيَةٌ وَهِيَ مَسْئُولَةٌ عَنْ رَعِيَّتِهَا)

“మీలో ప్రతి ఒక్కడు బాధ్యుడు, అతని బాధ్యతలో ఉన్నదాని గురించి అతడు ప్రశ్నించబడుతాడు. నాయకుడు (తన ప్రజలకు) బాధ్యుడు, అతని బాధ్యత గురించి అతడ్ని ప్రశ్నించబడుతుంది. భర్త తనింట్లో బాధ్యుడు అతని బాధ్యతలో ఉన్నదాని గురించి అతడ్ని ప్రశ్నించడం జరుగుతుంది. భార్య తన భర్త ఇంట్లో భాధ్యురాలు. ఆమె బాధ్యతలో ఉన్నదాని గురించి ఆమెను ప్రశ్నించడం జరుగుతుంది. (బుఖారి 2409, ముస్లిం 1829).

ఇమాం ఇబ్నుల్ ఖయ్యిమ్ ఇలా అన్నారుః

ఎవరు తన సంతానానికి లాభదయకమైన విద్య నేర్పకుండా వదిలేశాడో అతడు వారి పట్ల మహా చెడు, కీడు చేసినవాడవుతాడు. సంతానంలో అలవడే చెడు అలవాట్లు ఎక్కువశాతం తండ్రుల వల్లనే అలవడతాయి. అది వారు, వారి పట్ల అవలంబించే అశ్రద్ధ మరియు ధార్మిక విధులను, సున్నతులను వారికి నేర్పకపోవడం వల్లనే. వారి చిన్నతనంలో వారిని వృధాగా వదిలేశారు. అందుకు వారు పెరిగి పెద్దగయిన తర్వాత స్వయానికే గాని లేదా తమ తండ్రులకేగాని ఏ లాభం చేకూర్చలేకపోయారు. వీరి సంగతి ఎలా ఉంటుందంటేః తనయుని అవిధేయత భరించలేక ఒక తండ్రి అతడ్ని గట్టిగా మందలించాడు. అప్పుడు అతడన్నాడుః నాన్నా! మీరు నా చిన్నతనంలో చేసిన దాని ఫలితమే ఇప్పుడు మీరు పొందుతున్నారు. నా చిన్నతనంలో మీరు నన్ను వృధా చేశారు. ఇప్పుడు మీరు ముసలివారయ్యాక నేను మిమ్మల్ని వదిలేశాను.

(తొహ్ ఫతుల్ మౌదూద్ 229).

2 – తండ్రుల ఆధిపత్యం

ఈ తప్పు మొదటి తప్పుకు వ్యతిరేకమైనది. కొందరు తండ్రులు తమ సంతానం యొక్క సర్వ చేష్టలపై తమదే ఆధికారం నడవాలని ప్రయత్నిస్తారు. ఇలా వారు (తండ్రులు) వారి (సంతానం) వ్యక్తిత్వాన్ని మట్టిలో కల్పుతారు. తమ ఆలోచనలో వచ్చిన ఆదేశాలిస్తారు. దానికి వారు (సంతానం) గుడ్డిగా వాటిని పాటించుట తప్ప మరొక ప్రసక్తే ఉండకూడదని భావిస్తారు. నిశ్చయంగా దీని వల్ల ఎన్నో అవాంఛనీయ చేష్టలు ఉద్భవిస్తాయిః

  • 1. బలహీన వ్యక్తిత్వానికి గురి అవడం. ఆత్మవిశ్వాసం లోపించడం.
  • 2. విముఖత భావం, పిరికితనం మరియు అనవసరపు లజ్జా గుణం చోటు చేసుకొనుట.
  • 3. వింతైన, కొత్త విషయాలు కనుక్కునే యోగ్యత నశించిపోవుట.
  • 4. యుక్తవయస్సుకు చేరిన తర్వాత చెడిపోయే అవకాశం, అప్పుడు అతడు బేడిలలో బందీగా ఉండి విడుదలైనట్లు ఫీల్ అవుతాడు. అందుకు అన్ని రకాల హద్దులను అతిక్రమించే ప్రయత్నం చేస్తాడు. అవి ధర్మపరమైనవి అయినా సరే.
  • 5- మానసిక మరియు శారీరక రోగాలకు గురిఅవుతాడు.

పిల్లలకు వారి స్వంత విషయాల్లో కొంత పాటి స్వతంత్రం ఇవ్వాలని నిశ్చయంగా ఉత్తమ శిక్షణ హామీ ఇస్తుంది. అది ఏవైనా నిర్ణయాలు తీసుకొనుటకైనా, తమ కోరికను వెలిబుచ్చుటకైనా, బాధ్యత వహించుటకైనా. ఇవన్నియూ సవ్యమైన పద్ధతితో, ఉత్తమ సభ్యత తో ఉండేటట్లు తండ్రులు తమ సంతాన మదిలో నాటాలి.

3 – వైరుద్ధ్య ఆదర్శం

మొదటిసారిగా పిల్లలపై తల్లిదండ్రుల ప్రభావమే పడుతుంది. అతని గుణాలు, అలవాట్లలో వీరి ఛాయనే పడుతుంది. తల్లిదండ్రులు సద్వర్తన, ఉత్తమ నడవడిక కలవారైతే పిల్లలు కూడా సద్గుణాలు నేర్చుకుంటారు. వారు చెప్పేదొకటి చేసేది మరొకటైతే పిల్లలపై దాని చెడు ప్రభావం పడుతుంది.

వైరుద్ధ్యంలో మరొకటిః తండ్రి సత్యత గురించి తన సంతానానికి చెప్పి స్వయంగా అబద్ధం పలుకుతే లేదా అతను అమానతు గురించి ఆదేశించి స్వయంగా దొంగతనం చేస్తే, లేదా వాగ్దానానికి కట్టుబడి ఉండాలని బోధించి, తానే వాగ్దాన భంగం చేస్తే, లేదా మంచితనం మరియు సంబంధాల్ని పెంచుకోవాలని బోధించి అతడే తన తల్లిదండ్రుల పట్ల అవిధేయుడైతే, లేదా నమాజు గురించి ఆదేశించి స్వయంగా నమాజు వదులుతూ ఉంటే, లేదా పోగత్రాగరాదని హితువు చెప్పి స్వయంగా ధూమపానం చేస్తే, ఇలాంటి వైరుద్ధ్యం వలన శిక్షకుడు తన పిల్లల దృష్టిలో చులకన అయిపోతాడు. అతని మాటకు వారు ఏ మాత్రం విలువనివ్వరు. అల్లాహ్ అదేశం ఇలా ఉందిః

[أَتَأْمُرُونَ النَّاسَ بِالبِرِّ وَتَنْسَوْنَ أَنْفُسَكُمْ وَأَنْتُمْ تَتْلُونَ الكِتَابَ أَفَلَا تَعْقِلُونَ] {البقرة:44}

ఏమిటి, మీరు మంచిపనులు చేయమని ఇతరులకైతే హితబోధ చేస్తారు. కాని మిమ్మల్ని మీరు మరచి పోతారు. మీరు గ్రంథపారాయణం కూడా చేస్తున్నారు. అయినా మీరు బుద్ధిని బొత్తిగా ప్రయోగించరేమిటి.” (బఖర 2: 44).

4- కఠినత్వం

తండ్రులు తమ సంతానం పట్ల కరుణ, ప్రేమ మరియు మెతక వైఖరి అవలంభించాలి. చిన్నారుల పట్ల ప్రవక్త పద్ధతి ఇదే. అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హసన్ బిన్ అలీని ముద్దాడారు. అప్పుడు అక్కడ అఖ్ రఅ బిన్ హారిస్ ఉన్నారు. ఈ విషయం చూసి అతడన్నాడుః నాకు పది మంది సంతానం, కాని నేను ఇంతవరకు ఏ ఒక్కరినీ ముద్ధాడలేదు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతని వైపు చూస్తూ ఇలా అన్నారుః

(مَنْ لَا يَرْحَمْ لَا يُرْحَمْ).

“కరుణించనివారు కరుణింపబడరు“. (బుఖారి 5997).

 ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖించారుః పల్లెటూరి అరబ్బులు కొందరు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చారు. “మీరు మీ పిల్లల ను ముద్దాడుతారా?” అని అడిగారు. “అవును” అని ప్రవక్త సమాధానమిచ్చారు. వారన్నారుః “కాని మేము అల్లాహ్ సాక్షిగా! ముద్దాడము”. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారుః

(أَوَ أَمْلِكُ إِنْ كَانَ اللهُ نَزَعَ الرَّحْمَةَ مِنْ قُلُوبِكُمْ).

 “అల్లాహ్ మీ హృదయాల్లో నుండి కరుణ తీసేస్తే నేనేమి చేయ గలుగుతాను”. (బుఖారి 5998, ముస్లిం 2317).

శిక్షించేటప్పుడు కఠినత్వం మరియు కర్కశత్వం పాటించటం అనేది తికమక వేసే ఆలోచనలు పుట్టిస్తాయి. అందువల్ల వారు తమనుతామే అదుపులో పెట్టుకోలేరు. ఇక ఇతరులను అదుపులో పెట్టే ప్రసక్తే రాదు.

వెనకటి కాలంలో ఉన్న (ఆలోచన ఏమిటంటే) కఠినత్వం, గట్టిగా కొట్టడం వల్లనే పిల్లల్లో శక్తి, బలం, పురుషత్వం లాంటివి పెరుగుతాయి, బాధ్యత వహించే శక్తి వస్తుంది, ఆత్మవిశ్వాసం కలుగుతుంది అని. అయితే ఈ ఆలోచన తప్పు అని రుజువైపోయింది. ఎందుకనగా కఠినత్వం అనేది పిల్లల్లో వ్యదాభరితమైన మానసిక ఒత్తిడికి దారి తీస్తుంది. అది వాళ్ళను తలబిరుసుతనం, శత్రుత్వం లోనికి నెట్టుతుంది. వారి మానసిక వికాసాని (Mental Maturity)కి అడ్డు పడుతుంది. ఎల్లప్పుడూ వారిలో హీనత్వం, తక్కువ స్థాయి మరియు అగౌరవ భావం కలుగజేస్తుంది.

ఏ మాత్రం శిక్షించనేవద్దు అని కూడా దీని భావం కాదు. ఎప్పుడైనా ఒక్క సారి శిక్షించాలి. అయితే ఈ శిక్ష అనేది కరుణ, కటాక్షాల హద్దులకు మించి ఉండకూడదు.



పుస్తకం & ముందు పాఠాలు
సంతాన శిక్షణకై తల్లిదండ్రులకు మార్గదర్శి
https://teluguislam.net/?p=1697


%d bloggers like this: