సంతాన శిక్షణ – పార్ట్ 04 [వీడియో]

బిస్మిల్లాహ్

[31:46 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

10. సంతానం మధ్య న్యాయం

సంతానం పట్ల తల్లిదండ్రుల వ్యవహారంలో వ్యత్యాసం వల్ల వారు అతి తొందరగా ప్రభావితులవుతారు. అనేక సందర్భాల్లో సోదరుల మధ్య కపట, ద్వేషాల పరిస్థితులు అలుముకోడానికి మూలకారణం తల్లిదండ్రులు వారి మధ్య న్యాయం చేయకపోవటమే.

తల్లిదండ్రుల ప్రేమను కోల్పయారన్న అధిక భయం మరియు ఆ ప్రేమ సంతానంలో ఎవరో ఒకరివైపునకే మరలుట వల్ల మిగిత సంతానంలో అతని గురించి శత్రుత్వ గుణం జనిస్తుంది. ప్రవక్త యూసుఫ్ (అలైహిస్సలాం) సోదరులు ఇలాంటి తప్పుడు భావానికే గురై, వారి తండ్రి యూసుఫ్ కే వారిపై అధిక్యత ఇస్తున్నాడని భ్రమ చెందారు, అందుకే ఇలా అన్నారుః

[إِذْ قَالُوا لَيُوسُفُ وَأَخُوهُ أَحَبُّ إِلَى أَبِينَا مِنَّا وَنَحْنُ عُصْبَةٌ] {يوسف:8}

వాస్తవానికి మనదొక పెద్ద బలగమైనప్పటికీ యూసుఫ్, అతని సొంత సోదరుడూ ఇద్దరూ అంటే మన తండ్రికి, మన అందరికంటే ఎక్కువ ఇష్టం. (యూసుఫ్ 12: 8).

ఈ దుష్భావనయే తమ సోదరుడైన యూసుఫ్ పట్ల వారి దౌర్జన్యానికి కారణమయ్యింది. అదే విషయం ఖుర్ఆనులో ఇలా ప్రస్తావించబడిందిః

[اقْتُلُوا يُوسُفَ أَوِ اطْرَحُوهُ أَرْضًا يَخْلُ لَكُمْ وَجْهُ أَبِيكُمْ] {يوسف:9}

యూసుఫ్ ను చంపెయ్యండి లేదా అతణ్ణి ఎక్కడైనా పార వెయ్యండి, మీ తండ్రి ధ్యాస కేవలం మీపైనే ఉండేందుకు.”

దీని వెనక వారి ఉద్దేశం ఒకటే, అదేమిటంటే; యూసుఫ్ వీడి పోయాక వారు వారి తండ్రి ప్రేమను, శ్రద్ధను పొందుతారని.

ఒక తండ్రి స్వయంగా చెప్పిన సంఘటన ఇదిః అతను తన ఇద్దరి కుమారులతో ఇంటి బైటికి ఓ ఎడారి ప్రదేశంలో వెళ్ళాడు. అక్కడ వారు ఒక దీర్ఘ సీరియల్ ఫిల్మ్ వీక్షిస్తూ ఆనందోత్సవాల్లో గడిపారు. ఆ మధ్యలో అతని ఎనిమిది సంవత్సరాల చిన్న కుమారుడు నిద్రపోయాడు. అందుకు తండ్రి తను ధరించి ఉన్న కోటు తీసి అతని మీద కప్పాడు. ఆ సమావేశం సమాప్తమైన తర్వాత చిన్న కుమారుడిని ఎత్తుకొని బండిలో కూర్చున్నాడు. ఇంటికి తిరిగి వెళ్తూ దారిలో తండ్రి తన 12 సంవత్సరాల కొడుకుతో అతని అమూర్తాలోచన మరియు మౌనాన్ని చూసి, “ఇప్పటి వరకు చూసిన ఫిల్మ్ తో ఏ ప్రయోజనం పొందావు? అని అడిగాడు. దానికి కొడుకు “ఫిల్మ్ చూస్తూ చూస్తూ నేను కూడా పడుకుంటే, నాపై కూడా మీరు మీ కోట్ కప్పుతారా? నన్ను కూడా ఎత్తుకొని బండిలో పడుకోబెడతారా? అని తను అడిగిన ప్రశ్నకు ఏ సంబంధం లేని ప్రశ్న కొడుకు అడిగినందుకు తండ్రి ఆశ్చర్యపడ్డాడు.

అందుకే ఒకసారి నౌమాన్ బిన్ బషీర్ (రదియల్లాహు అన్హు) ప్రవక్త ﷺ వద్దకు వచ్చి తాను తన కొడుకుకు ఇచ్చిన ఓ బహుమానానికి ప్రవక్త ﷺ సాక్ష్యంగా ఉండాలని కోరాడు. “నీ సంతానంలో ప్రతి ఒక్కరికీ ఇలాంటి బహుమానమే ఇచ్చావా?” అని ప్రవక్త ﷺ అడిగి, మళ్ళీ చెప్పారుః “మీ సంతాన విషయంలో అల్లాహ్ కు భయపడండి, మీ సంతానం మధ్య న్యాయం పాటించండి“. (బఖారి). మరో ఉల్లేఖనంలో ఉందిః “అన్యాయ విషయాల్లో నేను సాక్షుడ్ని కాను“. (అహ్మద్).

11. క్రియాత్మక ఆదర్శంతో కూడిన శిక్షణ

ఏ విషయాలు ఆచరించాలని పిల్లవానితో చెప్పబడుతుందో, అవి అతనికి ఆదర్శంగా ఉన్న వారిలో ఆచరణ రూపం దాల్చి ఉన్నది అతను చూచుట చాలా ముఖ్యం. ప్రత్యేకంగా తల్లిదండ్రులు మరియు శిక్షకుల్లో.

నిశ్చయంగా ఆదర్శవంతమైన శిక్షణ ప్రవక్తగారి పిల్లల మరియు టీనేజరుల శిక్షణలో అతి ముఖ్య భాగం. ప్రవక్తగారి జీవిత కార్యాల్లో ప్రతీది మన కొరకు ఆదర్శమే. చదవండి అల్లాహ్ ఆదేశం సూరతుల్ అహ్ జాబ్ (33:21)లో

لَقَدْ كَانَ لَكُمْ فِي رَسُولِ اللهِ أُسْوَةٌ حَسَنَةٌ لِمَنْ كَانَ يَرْجُو اللهَ وَاليَوْمَ الآَخِرَ

నిశ్చయంగా అల్లాహ్ ప్రవక్తలో మీకు ఒక మంచి ఆదర్శం ఉంది; మీలో అల్లాహ్ పై, అంతిమ దినంపై నమ్మకం కలిగి ఉన్న వారికి.”

ప్రవక్తగారి ఈ చరిత్ర గోప్యంగా, ఎవరికి తెలియకుండా ఏదో కొందరిప్రత్యేకులకుతెలియునట్లు లేకుండెను. బహిరంగంగా అందరికి తెలిసినట్లుండెను. పిన్నలు, పెద్దలు అందరికీ తెలిసి యుండెను.

ఇది ఎంత సంపూర్ణమైన శిక్షణ; ఇబ్ను అబ్బాస్ అనే బాలుడు తనకు ఆదర్శనకర్త అయిన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వద్ద ఒక రాత్రి గడుపుతాడు. అతడు “సగం రాత్రి గడిసిన తర్వాత ప్రవక్త మేలుకొని వుజూ చేసి తహజ్జుద్ నమాజు చేయునది” చూశాడు. (బుఖారి, ముస్లిం).

ఇలాంటి క్రియాత్మక సంఘటనే పిల్లలకు అల్లాహ్ పట్ల స్వచ్ఛత, ఆయన భయం, తహజ్జుద్ నమాజు ద్వారా ఆయన సన్నిధానం పొందే శిక్షణ ఇస్తుంది. వేరుగా శిక్షకుడు ప్రోత్సహకరమైన మాటలు చెప్పే అవసరమే ఉండదు.

నేటి కాలంలో ఆదర్శనకర్తలు, ప్రసిద్ధి చెందిన వ్యక్తులు సినీ తారలు, క్రీడాకారులు అయిపోయారు. వాస్తవానికి వారు ఈ కొత్త తరానికి, వారి శిక్షణకు మరియు వారికి కావలసిన విలువలకు ఏ మాత్రం అర్హులు కారు. అంతెందుకు వారి క్రియాత్మక వ్యవహారం ఈ విలువలకు, వాటి వైపు ఆహ్వానానికి సయితం తోడ్పడదు. అందుకే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి ఆదర్శనాల అవసరం చాలా ఉంది. వాటిని టీనేజరుల ముందు ఆకర్శవంతమైన పరిపూర్ణ పద్ధతిలో పెట్టాలి. అది వారి పంచేద్రియాలకు అబ్బునట్లు ఉండాలి. వారు ఏ కాలంలో జీవిస్తున్నారో దానికి అనుగుణంగా ఉండాలి. వాటికి తోడుగా శిక్షకుల ఆదర్శం ఉండాలి.



పుస్తకం & ముందు పాఠాలు
సంతాన శిక్షణకై తల్లిదండ్రులకు మార్గదర్శి
https://teluguislam.net/?p=1697


%d bloggers like this: