తెలుగు ఇస్లామిక్ క్విజ్: పార్ట్ 75: ప్రశ్న 01- జకాత్ (విధిదానం) ఇవ్వని వారికి శిక్ష [ఆడియో]

బిస్మిల్లాహ్

[8:01 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

మొదటి ప్రశ్నకు సిలబస్ గా ఈ రోజు మీరు ఖుర్ఆనులోని ఈ క్రింది ఆయతులు, వాటి అనువాదం మరియు మీ వద్ద ఉన్న తఫ్సీర్ అహ్సనుల్ బయాన్ లో వ్యాఖ్యానం చదవండీ

9:32 يُرِيدُونَ أَن يُطْفِئُوا نُورَ اللَّهِ بِأَفْوَاهِهِمْ وَيَأْبَى اللَّهُ إِلَّا أَن يُتِمَّ نُورَهُ وَلَوْ كَرِهَ الْكَافِرُونَ

వారు అల్లాహ్‌ జ్యోతిని తమ నోటితో (ఊది) ఆర్పివేయాలని కోరుతున్నారు. అయితే అల్లాహ్‌ – అవిశ్వాసులకు ఎంతగా సహించరానిదైనా సరే – తన జ్యోతిని పరిపూర్ణం చేయకుండా వదలిపెట్టటానికి అంగీకరించడు.

9:33 هُوَ الَّذِي أَرْسَلَ رَسُولَهُ بِالْهُدَىٰ وَدِينِ الْحَقِّ لِيُظْهِرَهُ عَلَى الدِّينِ كُلِّهِ وَلَوْ كَرِهَ الْمُشْرِكُونَ

ఆయనే తన ప్రవక్తకు మార్గదర్శకత్వాన్నీ, సత్యధర్మాన్నీ ఇచ్చి పంపాడు – ముష్రిక్కులకు ఎంత సహించరానిదయినా సరే, ఇతర ధర్మాలపై దానికి ఆధిక్యతను వొసగటానికి!

9:34 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِنَّ كَثِيرًا مِّنَ الْأَحْبَارِ وَالرُّهْبَانِ لَيَأْكُلُونَ أَمْوَالَ النَّاسِ بِالْبَاطِلِ وَيَصُدُّونَ عَن سَبِيلِ اللَّهِ ۗ وَالَّذِينَ يَكْنِزُونَ الذَّهَبَ وَالْفِضَّةَ وَلَا يُنفِقُونَهَا فِي سَبِيلِ اللَّهِ فَبَشِّرْهُم بِعَذَابٍ أَلِيمٍ

ఓ విశ్వసించిన వారలారా! పండితుల (అహ్‌బార్‌)లలో, సన్యాసుల (రుహ్‌బాన్‌)లలో చాలా మంది అక్రమంగా ప్రజల సొమ్ములను స్వాహా చేస్తున్నారు. వారిని అల్లాహ్‌ మార్గం నుంచి ఆపుతున్నారు. ఎవరు వెండీ, బంగారాలను పోగుచేస్తూ వాటిని దైవమార్గంలో ఖర్చు పెట్టడంలేదో వారికి బాధాకరమైన శిక్ష ఉందన్న శుభవార్తను వినిపించు.

9:35 يَوْمَ يُحْمَىٰ عَلَيْهَا فِي نَارِ جَهَنَّمَ فَتُكْوَىٰ بِهَا جِبَاهُهُمْ وَجُنُوبُهُمْ وَظُهُورُهُمْ ۖ هَٰذَا مَا كَنَزْتُمْ لِأَنفُسِكُمْ فَذُوقُوا مَا كُنتُمْ تَكْنِزُونَ

ఏ రోజున ఈ ఖజానాను నరకాగ్నిలో కాల్చి దాంతో వారి నొసటిపై, పార్శ్వాలపై, వీపులపై వాతలు వేయడం జరుగుతుందో అప్పుడు, “ఇదీ మీరు మీ కోసం సమీకరించినది. కాబట్టి ఇప్పుడు మీ ఖజానా రుచి చూడండి” (అని వారితో అనబడుతుంది).

ఇక్కడ ఆడియో వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి

ఆడియో విన్న తర్వాత క్రింది ప్రశ్న ట్రై చెయ్యండి

(1) జకాత్ (విధిదానం) ఇవ్వని వారికి ఏ విధమైన శిక్ష సిద్ధంగా ఉంది?

A] సమాధి శిక్ష
B] ముఖం – వీపు – ప్రక్కలను వాతలు పెట్టె శిక్ష
C] ధన నష్టం

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

తెలుగు ఇస్లామిక్ క్విజ్ (ఆడియో సిరీస్) మెయిన్ పేజీ :
https://teluguislam.net/others/telugu-islamic-quiz

%d bloggers like this: