గడ్డం తప్పనిసరి అని ఏదైనా హాదీసులో చెప్పబడినదా?
https://youtu.be/nbYQWiZ3Q0k [9 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
అల్లాహ్ యొక్క ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా చెప్పారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు:
“మీసాలను దగ్గరగా కత్తిరించండి (ట్రిమ్ చెయ్యండి) మరియు గడ్డాలు పెంచుకోండి మరియు మాజియన్లను (పర్షియన్ అగ్ని ఆరాధకులు) వ్యతిరేకించండి.” [సహీహ్ ముస్లిం # 501]
ఒక సందర్భంలో, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కిస్రా (పర్షియన్ రాజు) యొక్క రెండు [1] దూతలను స్వీకరించినప్పుడు, వారు గడ్డం తీయించుకున్నారని (షేవ్ చేసుకున్నారని) మరియు పెరిగిన మీసాలతో ఉన్నారని చూసినప్పుడు వాటిని చూడటం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇష్టపడలేదు.
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా అన్నారు:
“నీకు దీన్ని చేయమని మిమ్మల్ని ఎవరు ఆదేశించారు?” వారు ఇలా అన్నారు: “మా ప్రభువు” (వారి రాజు కిస్రా అని అర్థం)”.
అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా అన్నారు:
“అయితే నా గడ్డం పెరగనివ్వమని మరియు మీసాలను కత్తిరించమని నా రబ్ (అల్లాహ్) నన్ను ఆదేశించాడు.” [2]
[1] కిస్రా: ఖోస్రు, పెర్షియన్ రాజు. కిస్రా అనేది సాధారణంగా పెర్షియన్ రాజుల హోదా.
[2] హదీత్ హసన్ అని రచయిత చెప్పారు:
మూలం: https://abdurrahman.org/2015/02/22/the-beard-why-sheikh-dr-muhamad-ismaaeel-dr-saleh-as-saleh/
[ఆడియో టెక్స్ట్]
ఈ ప్రసంగంలో, ఇస్లాంలో గడ్డం పెంచడం యొక్క ఆవశ్యకత గురించి ఒక ప్రశ్నకు సమాధానం ఇవ్వబడింది. వక్త ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను అంతిమ ఆదర్శంగా అనుసరించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు, సాధారణ వ్యక్తులను కాదు, మత పెద్దలను కూడా. గడ్డం పెంచడాన్ని ఆజ్ఞాపించే హదీసులను ఉటంకిస్తూ, యూదులు మరియు ముష్రికుల నుండి తమను తాము వేరు చేసుకోవడానికి గడ్డాన్ని పూర్తిగా పెరగనివ్వాలని మరియు మీసాలను కత్తిరించాలని ప్రవక్త ముస్లింలను ఆదేశించారని ఆయన వివరించారు. గడ్డం ఉన్న కొందరి చెడు ప్రవర్తన, అసంపూర్ణ పెరుగుదల లేదా రూపురేఖల గురించిన ఆందోళనల వంటి సాధారణ అభ్యంతరాలను వక్త తిరస్కరించారు, గడ్డం పురుషుని సహజ సృష్టిలో ఒక భాగమని మరియు పురుషత్వానికి చిహ్నమని స్పష్టం చేశారు.
ప్రశ్న: గడ్డం తప్పనిసరి అని ఏదైనా హాదీసులో చెప్పబడినదా? మరి సౌదీలోని చాలామంది గడ్డం ట్రిమ్మింగ్ (కత్తిరించడం) చేసుకున్నట్లు చూస్తాము. అలాగే, మక్కాలో ఇమామ్ లకు కూడా. మరి అది ఎంతవరకూ సమంజసమైనది?
చూడండి, ఇస్లాం ధర్మం అల్లాహ్ పంపినటువంటి ధర్మం. సర్వసామాన్యంగా స్టూడెంట్స్ ఎప్పుడైతే టీచర్ చదువు చెబుతాడో, ఏదైనా పుస్తకం ఇచ్చి దాని గురించి బోధ చేస్తాడో, మా టీచర్ ఎంత ఆదర్శవంతంగా ఉన్నాడు అనేది కూడా టీచర్ వైపునకు చూడడం పిల్లల యొక్క అలవాటుగా ఉంటుంది. వారి యొక్క స్వభావంలో ఉంది. అందుకొరకే అల్లాహు త’ఆలా ఎప్పుడైతే ఖురాన్ హదీసుల ద్వారా మనకు ధర్మ జ్ఞానం ప్రసాదించాడో, మనకు ఆదర్శంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని నిలిపాడు. మరియు ఆ ప్రవక్త గురించి స్వయంగా అల్లాహ్‌యే సర్టిఫికేట్ ఇచ్చేశాడు.
إِنَّكَ لَعَلَىٰ خُلُقٍ عَظِيمٍ
(ఇన్నక ల’అలా ఖులుఖిన్ అజీమ్)
నిశ్చయంగా మీరు అత్యున్నత గొప్ప నడవడిక మరియు మంచి సద్వర్తనలో ఉన్నారు
అంతేకాకుండా,
وَمَا آتَاكُمُ الرَّسُولُ فَخُذُوهُ وَمَا نَهَاكُمْ عَنْهُ فَانتَهُوا
(వమా ఆతాకుముర్రసూలు ఫఖుదూహు వమా నహాకుమ్ అన్హు ఫన్తహూ)
ప్రవక్త ఇచ్చినది మీరు తీసుకోండి, ఆయన మిమ్మల్ని నిషేధించిన వాటికి దూరంగా ఉండండి
అంతేకాకుండా సూరతుల్ అహ్‌జాబ్‌లో,
لَّقَدْ كَانَ لَكُمْ فِي رَسُولِ اللَّهِ أُسْوَةٌ حَسَنَةٌ
(లఖద్ కాన లకుమ్ ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసనహ్)
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిలో మీకు ఉత్తమమైన ఆదర్శం ఉంది
అందుకొరకే, ఎప్పుడైనా షైతాన్ గాని, ఇంకా వేరే ఎవరైనా గాని, అరేయ్ నీ మౌల్వీ సాబును చూడురా, అరే నీ గురువుగారిని చూడురా ఏం చేస్తుండో, అరే వాణ్ని చూడురా ఎట్లున్నాడో అని ప్రజల వైపునకు లేదా ప్రస్తుతం మన కళ్ళల్లో మన దృష్టిలో మన యొక్క కని విని వినికిడిలో ఏ మంచి వ్యక్తి ఉన్నాడో అతడిలో ఏదైనా లోపం చూపించి, అరే వాళ్లారా నువ్వు ఇంతవరకు ఫాలో అవుతున్నది చూడు ఏం చేస్తున్నాడో, ఇలా చూపించి ఇస్లాం పట్ల విరక్తి, ఇస్లాం పట్ల ఒక అయిష్టత ఏర్పడే అటువంటి ప్రయత్నాలు జరుగుతాయి. అందుకొరకు ఆ సందర్భంలో అల్లాహ్‌ను మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని బలంగా పట్టుకొని వారి గురించి అధికంగా చదివి వారి యొక్క ఉత్తమ అల్లాహ్ ఆదేశాలను మరియు ప్రవక్త యొక్క ఉత్తమ ఆదర్శాన్ని ముందు పెట్టుకోండి.
మీ ప్రశ్నలోని రెండవ భాగం దానికి నేను ఇంత విడమరిచి చెప్పవలసి వచ్చింది. అల్లాహ్ స్వీకరించుగాక చెప్పడానికి, ఆచరించేటువంటి భాగ్యం మనందరికీ ప్రసాదించుగాక. అయితే మనం గడ్డం విషయానికి వస్తే కూడా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితం ఎలా ఉండింది? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏడు వేరు వేరు పదాల్లో, అరబీలో వేరు వేరు పదాల్లో గడ్డాన్ని దాని స్థితిలో పూర్తిగా పెంచుతూ మీసాలు కత్తిరిస్తూ ఉండండి అని చెప్పారు.
وَفِّرُوا اللِّحَى
(వఫ్ఫిరుల్-లుహా)
గడ్డాన్ని ఘనంగా, సంపూర్ణంగా ఉంచండి.
أَوْفُوا اللِّحَى
(అవ్‌ఫుల్-లుహా)
పూర్తిగా.
ఇంకా వేరే ఎన్నో,
أَرْخُوا
(అర్ఖూ)
దాని స్థితిలో అలాగే పొడుగ్గా వదిలేయండి.
ఇలాంటి ఏడు రకాల పదాలు అరబీలో వచ్చి ఉన్నాయి. రెండవది, ఆ ఏడు రకాల పదాలు చేస్తే మంచిది అన్నటువంటి ఫార్మెట్లో లేవు, ఆర్డర్ ఫార్మెట్. వఫ్ఫిరూ, అవ్‌ఫిరూ, అర్ఖూ, ఆర్డర్, అంటే హుకుమ్. గమనిస్తున్నారా? ఇది ఒక వైపు ఇలా ఉండగా, మరోవైపు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా యూదులకు మీరు వ్యతిరేకత పాటిస్తూ గడ్డాన్ని వదలండి, ముష్రికులకు భిన్నంగా, మజూస్‌కు భిన్నంగా. ఇక ఈ విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యూదులను, ముష్రికులను, మజూసులను ప్రస్తావించి మనల్ని సంపూర్ణంగా గడ్డం ఉంచండి అని చెప్పాడంటే వారిలో షేవ్ చేసేవారు ఉన్నారు, వారిలో ట్రిమ్ చేసేవారు ఉన్నారు, వారిలో రకరకాల డిజైన్లు చేసేవారు ఉన్నారు, అలాంటి వారి ఏ పోలిక మీరు పాటించకుండా ప్రవక్త యొక్క ఆదర్శాన్ని పాటించి వారి విధంగా పూర్తిగా గడ్డం వదలండి.
అంతేకాదు, మరో రకంగా మనం గమనించామంటే ఇందులో మరో గొప్ప విషయం, అదేమిటి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ జీవితంలో ఒక్కసారైనా, నవూజుబిల్లాహ్ అస్తగ్‌ఫిరుల్లాహ్, అర్థం కావడానికి కేవలం చెబుతున్నాను, ప్రవక్త విషయంలో ఈ మాట చెప్పినందుకు తప్పు ఉంటే అల్లాహ్ నన్ను క్షమించుగాక, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ జీవితంలో ఒక్కసారి కూడా షేవ్ చేయలేదు, ట్రిమ్ చేయలేదు, కత్తెర పెట్టలేదు, డిజైన్ చేయలేదు, ఏలాంటి ఏ అలంకరణలు చేయడానికి గడ్డానికి చేయి పెట్టలేదు. చేయి పెట్టలేదు అంటే కత్తిరించే విషయంలో. ఈ ఒక్క సహీ హదీస్ లేదు ఇప్పటివరకు.
గడ్డం మరియు సహజ స్వభావం (ఫిత్ర్)
అందుకొరకే గడ్డం, ఇది మన ప్రకృతి విషయాల్లో ఒకటి. ప్రకృతిపరంగా మనం తీయవలసిన వెంట్రుకలు తీస్తాము, గోళ్లు పెరుగుతూ ఉంటే తీస్తాము. దీనికి వ్యతిరేకంగా చేసేవారు ఏందిరా పశువా, జంతువా, ఇంక ఇట్లా పెంచుకున్నావ్ ఏంటి అని అంటారు కదా, అలాగే గడ్డాన్ని పెంచాలి. గడ్డం ఇది ప్రకృతికి, మన అందానికి అడ్డం కాదు, ఇది అనుకూలమైన విషయం. అందుగురించి పశువుల్లో కూడా, జంతువుల్లో కూడా మగవాళ్లకు గడ్డం లేదా గడ్డం లాంటి ఒక గుర్తు ఉంది.
గడ్డం గురించిన అభ్యంతరాలు
ఇంతటితో మీకు తృప్తి కాకుంటే మరో విషయం కూడా మీరు తెలుసుకోండి. అదేమిటంటే, గడ్డం గురించి ఎవరైతే అభ్యంతరం వ్యక్తం చేస్తారో వారిలో ఒక విషయం ఏంటో తెలుసా, అరే ఎందరో గడ్డం ఉన్నవారిని చూసామయ్యా, గడ్డం అడ్డుగా ఏదో ఎన్నో రకాల చెడు పనులు చేస్తారు. అందుకొరకు ఆ గడ్డం పెట్టుకొని ఆ పనులు చేయకపోవడమే మంచిది. అస్తగ్‌ఫిరుల్లాహ్, అస్తగ్‌ఫిరుల్లాహ్. ఇది గడ్డంకు అడ్డం ఇంత మాత్రం కాదు. ఎందుకంటే గమనించండి, గడ్డం పెట్టి ఎవరైనా ఏదైనా పొరపాట్లు చేస్తున్నారు అంటే గడ్డం వల్ల చేయడం లేదు అది. అలా అనుకుంటే మరి గడ్డం లేకుండా అన్నీ మంచి పనులు చేసేవారు ఉన్నారా? అందుకొరకు ఈ టాపిక్‌నే తీసుకురాకూడదు. ఈ ఆబ్జెక్షనే తప్పు, రాంగ్.
మరి కొందరు ఏమంటారు, అరే గడ్డం పెట్టాలి కరెక్టే కానీ ఒకసారి ఇక్కడ కొన్ని వెంట్రుకలు ఉంటాయి, ఇటువైపున ఉండవు. ఇక్కడ ఉంటాయి, ఇక్కడ ఉండవు. ఉండేది ఉంటే మొత్తం ఉండాలి, మంచిగా అనిపిస్తది. గడ్డం ఇది అల్లాహు త’ఆలా ఇస్తున్నది, దాని స్థితిలో మనం పెంచాలి. ఈ ఆటంకాలు చెప్పుకుంటూ మనం అల్లాహ్ ఆదేశానికి వ్యతిరేకంగా, ప్రవక్త ఆదర్శానికి వ్యతిరేకంగా పాటించకూడదు, పాపంలో పడిపోతాము.
మరి కొందరు ఉన్నారు, ఏమంటారు, గడ్డం ఉన్న వారిని ఎంతమంది చూస్తాము, అంతా ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, పాడుగా కనబడుతుంది, మంచిగా అందంగా కనబడరు. గడ్డాన్ని వాళ్లు కొంచెం, ఇది వారి తప్పు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసుల్లో వచ్చి ఉంది,
أَكْرِمُوا شَعَرَكُمْ
(అక్రిమూ షా’రకుమ్)
మీ యొక్క వెంట్రుకల్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని వాటిని అలంకరిస్తూ ఉండండి.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నూనె కూడా పెట్టుకునేవారు. మనం అడపాదడపా దువ్వుకుంటూ, అటు ఇటు పోకుండా, చిందరవందరంగా లేకుండా మనం దీన్ని కాపాడుకోవాలి. ఎవడైనా కాపాడుకోకుంటే అతడు మనకు దలీల్ ఆధారం కాదు మరియు వాని యొక్క పని అనేది మనం దానివల్ల గడ్డం ఉంచకూడదు అని చెప్పలేము. బహుశా గడ్డనికి సంబంధించి ఈ విషయాలు గడ్డం ఉంచడానికి మనకు ప్రోత్సాహం కలిగిస్తాయి అని ఆశిస్తున్నాను.
అల్లాహ్ మనందరికీ సద్భాగ్యం, మరింత అధిక జ్ఞానం, దాని ప్రకారం ఆచరించేటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక, ఆమీన్.
ఈ పోస్ట్ లింక్ : https://teluguislam.net/?p=10797
ఇతరములు:
- ధర్మాన్ని పరిహసించటం, ధార్మిక చిహ్నాలను కించపరచటం – డా. సాలెహ్ అల్ ఫౌజాన్