Telugu Islamic Quiz (తెలుగు ఇస్లామిక్ క్విజ్) – పార్ట్ 51
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
రమజాన్ ప్రత్యేక క్విజ్ ప్రశ్నల పత్రం -01
(1) ఉపవాసం దేని యొక్క మూలస్తంభాలలో ఒకటి?
A) ఈమాన్ మూలస్తంభాలలో ఒకటి
B) ఇహ్ సాన్ మూలస్తంభాలలో ఒకటి
C) ఇస్లాం మూలస్తంభాలలో ఒకటి
(2) ఉపవాసమున్నవారి కోసం దైవదూతలు ఎప్పటి వరకు దుఆ చేస్తారు?
A) సహరీ వరకు
B) జొహ్ర్ వరకు
C) ఇఫ్తార్ వరకు
(3) మేఘాలు క్రమ్ముకొని ఉన్నప్పుడు ఉపవాసాల ఎన్ని రోజుల లెక్క పూర్తి చేయాలి?
A) 30 రోజుల లెక్క పూర్తి చేయాలి
B) 32 రోజుల లెక్క పూర్తి చేయాలి.
C) 29 రోజుల లెక్క పూర్తి చేయాలి
క్విజ్ 51: సమాధానాలు & వివరణ ఇక్కడ వినండి /డౌన్లోడ్ చేసుకోండి [13:43 నిమిషాలు]
(1) ఉపవాసం దేని యొక్క మూలస్తంభాలలో ఒకటి?
(C) ఇస్లాం మూలస్తంభాలలో ఒకటి
రమజాను ఉపవాసాలు ఇస్లాం ఐదు మూల స్తంభాలలో ఒకటి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఈ ఆదేశానుసారం:
بُنِيَ الْإِسْلَامُ عَلَى خَمْسٍ: شَهَادَةِ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ وَأَنَّ مُحَمَّدًا رَسُولُ الله وَإِقَامِ الصَّلَاةِ وَإِيتَاءِ الزَّكَاةِ وَالْحَجِّ وَصَوْمِ رَمَضَانَ
ఇస్లాం పునాది ఐదు మూలస్తంభాలపై ఉంది: (1) సత్య ఆరాధ్యనీయుడు అల్లాహ్ తప్ప మరెవ్వడూ లేడు, ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అల్లాహ్ యొక్క ప్రవక్త అని సాక్ష్యమిచ్చుట. (2) నమాజు స్థాపించుట. (3) జకాత్ (విధిదానం) చెల్లించుట. (4) హజ్ చేయుట. (5) రమజాన్ ఉపవాసాలు పాటించుట. (బుఖారి 8, ముస్లిం 16).
(2) ఉపవాసమున్నవారి కోసం దైవదూతలు ఎప్పటి వరకు దుఆ చేస్తారు?
C ) ఇఫ్తార్ వరకు
وتستغفر لهم الملائكةُ حتى يُفطروا
ఈ హదీసును తమ హదీసు గ్రంథాలలో ప్రస్తావించిన ఇమాముల్లో: ఇమాం అహ్మద్, 7917, ఇమాం బజ్జార్ 963, ముహమ్మద్ బిన్ నస్ర్ మిర్వజీ ఖియాము రమజాను 112లో, ఇమాం బైహఖీ షుఅబుల్ ఈమాన్ 3602లో
حَدَّثَنَا يَزِيدُ، أَخْبَرَنَا هِشَامُ بْنُ أَبِي هِشَامٍ، عَنْ مُحَمَّدِ (1) بْنِ الْأَسْوَدِ، عَنْ أَبِي سَلَمَةَ بْنِ عَبْدِ الرَّحْمَنِ، عَنْ أَبِي هُرَيْرَةَ
ఈ హదీసును ఇంత మంది ఇమాములు ఉల్లేఖించినప్పటికీ ఇది జఈఫ్, దీనికి కారణం ఈ హదీసు పరంపరలో ఒకరు హిషామ్ బిన్ అబీ హిషామ్ జఈఫ్ అని హదీసు శాస్త్రవేత్తలందరూ ఏకీభవించారు. ఇక ముహమ్మద్ బిన్ అస్వద్ గురించి మజ్ హూలుల్ హాల్ అని చెప్పడం జరిగింది. ఇది జఈఫ్ అన్న విషయం మీకు తెలియజేస్తూ కొంత వివరణ ఇవ్వడానికే ఈ ప్రశ్న తీసుకురావడం జరిగింది.
అయితే దైవదూతలు సర్వ సామాన్యంగా విశ్వాసుల కొరకు ఇస్తిగ్ఫార్ చేస్తూ ఉంటారు. ఈ ప్రస్తావన సూర ఘాఫిర్ 40:7 లో వచ్చి ఉంది.
الَّذِينَ يَحْمِلُونَ الْعَرْشَ وَمَنْ حَوْلَهُ يُسَبِّحُونَ بِحَمْدِ رَبِّهِمْ وَيُؤْمِنُونَ بِهِ وَيَسْتَغْفِرُونَ لِلَّذِينَ آمَنُوا رَبَّنَا وَسِعْتَ كُلَّ شَيْءٍ رَّحْمَةً وَعِلْمًا فَاغْفِرْ لِلَّذِينَ تَابُوا وَاتَّبَعُوا سَبِيلَكَ وَقِهِمْ عَذَابَ الْجَحِيمِ * رَبَّنَا وَأَدْخِلْهُمْ جَنَّاتِ عَدْنٍ الَّتِي وَعَدتَّهُمْ وَمَن صَلَحَ مِنْ آبَائِهِمْ وَأَزْوَاجِهِمْ وَذُرِّيَّاتِهِمْ ۚ إِنَّكَ أَنتَ الْعَزِيزُ الْحَكِيمُ * وَقِهِمُ السَّيِّئَاتِ ۚ وَمَن تَقِ السَّيِّئَاتِ يَوْمَئِذٍ فَقَدْ رَحِمْتَهُ ۚ وَذَٰلِكَ هُوَ الْفَوْزُ الْعَظِيمُ
అర్ష్ (అల్లాహ్ సింహాసనం)ను మోసేవారు, దాని చుట్టూ ఉన్న వారు (దైవదూతలు) స్తోత్రసమేతంగా తమ ప్రభువు పవిత్రతను కొనియాడుతున్నారు. వారు ఆయన్ని విశ్వసిస్తున్నారు. విశ్వాసుల మన్నింపు కొరకు ప్రార్థిస్తూ వారు ఇలా అంటారు: “మా ప్రభూ! నీవు ప్రతి వస్తువును నీ దయానుగ్రహంతో, పరిజ్ఞానంతో ఆవరించి ఉన్నావు. కనుక పశ్చాత్తాపం చెంది, నీ మార్గాన్ని అనుసరించినవారిని నీవు క్షమించు. ఇంకా వారిని నరక శిక్ష నుంచి కూడా కాపాడు. “మా ప్రభూ! నువ్వు వారికి వాగ్దానం చేసివున్న శాశ్వితమైన స్వర్గవనాలలో వారికి ప్రవేశం కల్పించు. మరి వారి పితామహులలోని, సతీమణులలోని, సంతానంలోని సజ్జనులకు కూడా (స్వర్గంలో స్థానం కల్పించు). నిశ్చయంగా నీవు సర్వసత్తాధికారివి, వివేక సంపన్నుడివి. “వారిని చెడుల నుండి కూడా కాపాడు. యదార్థమేమిటంటే ఆనాడు నీవు చెడుల నుంచి కాపాడినవారిపై నీవు (అమితంగా) దయ జూపినట్లే. గొప్ప సాఫల్యం అంటే అదే!”
(3) మేఘాలు క్రమ్ముకొని ఉన్నప్పుడు ఉపవాసాల ఎన్ని రోజుల లెక్క పూర్తి చేయాలి?
A) 30 రోజుల లెక్క పూర్తి చేయాలి
فَإِنْ غُمَّ عَلَيْكُمْ فَأَكْمِلُوا الْعِدَّةَ ثَلَاثِينَ
“మేఘాలు క్రమ్ముకొని ఉన్నప్పుడు మీరు 30 రోజుల లెక్క పూర్తి చేయండి” (బుఖారి 1907, ముస్లిం 1081)
ఇతరములు :
తెలుగు ఇస్లామిక్ క్విజ్ (ఆడియో సిరీస్) మెయిన్ పేజీ :
https://teluguislam.net/others/telugu-islamic-quiz