Telugu Islamic Quiz (తెలుగు ఇస్లామిక్ క్విజ్) – పార్ట్ 46
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
అబీసీనియా వైపు విశ్వాసుల 2వ హిజ్రత్(వలస) ఘటన గూర్చిన ప్రశ్నలు
1) విశ్వాసులు అబీసీనియా హిజ్రత్ చేసినప్పుడు అక్కడ ఉండేడుకు అభయమిచ్చిన క్రైస్తవ చక్రవర్తి ఎవరు?
A) హెరక్లస్
B) నజాషీ
C) ముఖీఖిస్
2) అబీసీనియా రాజ దర్భారులో ఇస్లాం యొక్క సుగుణాలను వివరించినది ఎవరు?
A) హజ్రత్ జాఫర్ బిన్ అబీతాలిబ్ (రజి యల్లాహు అన్హు)
B) హజ్రత్ అలీ బిన్ అబీ తాలిబ్ (రజి యల్లాహు అన్హు)
C) హజ్రత్ అమృ బిన్ ఆస్(రజి యల్లాహు అన్హు)
3) అబీసీనియా క్రైస్తవ దర్భారులో సహాబా (రజి యల్లాహు అన్హు) ఏ సూరహ్ లో కొన్ని ఆయాత్ లు పఠిస్తే అక్కడున్న చక్రవర్తి – ఫాదరీ ల గెడ్డాలు తడిచేటట్లు ఏడ్చారు?
A) సూరహ్ తాహా
B) సూరహ్ ఆలీఇమ్రాన్
C) సూరహ్ మర్యం
క్విజ్ 46: సమాధానాలు & వివరణ ఇక్కడ వినండి /డౌన్లోడ్ చేసుకోండి [14:59 నిమిషాలు]
పూర్తిగా మొదటి మరియు రెండవ అబీసీనియా హిజ్రత్ (వలస) గురుంచి క్రింద ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి చదవండి :
సీరత్: అబిసీనియా వైపు హిజ్రత్ (వలస) –
https://teluguislam.net/2020/04/15/seerah-hijrah-to-abyssinia/
1] విశ్వాసులు అబీసీనియా హిజ్రత్ చేసినప్పుడు అక్కడ ఉండేదుకు అభయమిచ్చిన (శాంతివంతమైన నివాసం ఇచ్చిన) క్రైస్తవ చక్రవర్తి ఎవరు?
B] నజాషీ
బుఖారీ ముస్లిం సహీ హదీసుల్లో ఈ ప్రస్తావన వచ్చింది. కొన్ని ఆధారాలు మనం 45వ క్విజ్ లో విన్నాము.
البخاري 1320:- جَابِرَ بْنَ عَبْدِ اللَّهِ رَضِيَ اللَّهُ عَنْهُمَا، يَقُولُ: قَالَ النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: «قَدْ تُوُفِّيَ اليَوْمَ رَجُلٌ صَالِحٌ مِنَ الحَبَشِ، فَهَلُمَّ، فَصَلُّوا عَلَيْهِ»
బుఖారీ 1320లోని ఈ హదీసులో ఉంది: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలిపారు: “హబషలోని పుణ్య పురుషుడు చనిపోయాడు. మీరందరూ విచ్చేసెయ్యండీ, జనాజా నమాజు చదవండీ.”
బుఖారీలోనే 3136లో ఉంది. అబూ మూసా అష్అరీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: మేము కొంత మంది యమన్ నుండి పడవలో సముద్ర ప్రయాణం చేసి హబషలో నజ్జాషీ వద్దకు చేరుకున్నాము. ముందే అక్కడికి హిజ్రత్ చేసిన జఅఫర్ బిన్ అబీ తాలిబ్ మరియు అతని మిత్రులను కలుసుకున్నాము.
బుఖారీలోనే 4231లో ఉంది: “పడవలో సముద్రపు ప్రయాణం చేసినవారికి డబల్ హిజ్రత్ పుణ్యముంటుంది” అని ప్రవక్త శుభవార్త ఇచ్చారు.
2) అబీసీనియా రాజ దర్భారులో ఇస్లాం యొక్క సుగుణాలను వివరించినది ఎవరు?
A) హజ్రత్ జాఫర్ బిన్ అబీతాలిబ్ (రజి యల్లాహు అన్హు)
ముస్నద్ అహ్మద్ 1740, 22498లో చాలా పొడవైన రెండు హదీసులున్నాయి.
3) అబీసీనియా క్రైస్తవ దర్భారులో సహాబా (రజి యల్లాహు అన్హు) ఏ సూరహ్ లో కొన్ని ఆయాత్ లు పఠిస్తే అక్కడున్న చక్రవర్తి – ఫాదరీ ల గడ్డాలు తడిచేటట్లు ఏడ్చారు?
C) సూరహ్ మర్యం
దీని వివరణ పైన పేర్కొన్ని ముస్నద్ అహ్మద్ హదీసులోనే ఉంది.
ఇతరములు :
తెలుగు ఇస్లామిక్ క్విజ్ (ఆడియో సిరీస్) మెయిన్ పేజీ :
https://teluguislam.net/others/telugu-islamic-quiz
You must be logged in to post a comment.