నీ దేవుడు ఇతడేనా? (من هو إلهك)
https://www.youtube.com/watch?v=Sukuaeb6NQg [ 3 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
ఈ ప్రసంగం ఖురాన్‌లోని సూరా రూమ్, 40వ ఆయతుపై దృష్టి పెడుతుంది. అల్లాహ్‌కు మాత్రమే ఉన్న నాలుగు ప్రత్యేక శక్తులను ఇది వివరిస్తుంది: సృష్టించడం, జీవనోపాధిని ప్రసాదించడం, మరణాన్ని ఇవ్వడం మరియు పునరుత్థానం చేయడం (తిరిగి బ్రతికించడం). అల్లాహ్‌తో పాటు పూజించబడే ఇతర భాగస్వాములు (దైవాలు) ఈ పనులలో ఏ ఒక్కటైనా చేయగలరా అని ఈ ఆయతు ప్రశ్నిస్తుందని వక్త నొక్కిచెప్పారు. వారు ఏమీ చేయలేరని, కాబట్టి అలాంటి భాగస్వామ్యాల నుండి అల్లాహ్ పవిత్రుడు మరియు ఉన్నతుడని స్పష్టం చేశారు. అందువల్ల, మానవులు ఈ నాలుగు గుణాలు ఉన్న ఏకైక సత్య దేవుడైన అల్లాహ్‌ను మాత్రమే ఆరాధించాలని, ఎందుకంటే మరణం తర్వాత ప్రతి ఒక్కరూ ఆయన వద్దకే తిరిగి వెళ్ళాలని మరియు అక్కడ ఆయనే తప్ప మరెవరూ సహాయం చేయలేరని ఇది ఒక శక్తివంతమైన పిలుపు.
أَعُوذُ بِاللَّهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ
(అ’ఊజు బిల్లాహి మినష్-షైతానిర్-రజీమ్)
(శపించబడిన షైతాన్ నుండి నేను అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను).
اللَّهُ الَّذِي خَلَقَكُمْ ثُمَّ رَزَقَكُمْ ثُمَّ يُمِيتُكُمْ ثُمَّ يُحْيِيكُمْ
(అల్లాహుల్లజీ ఖలఖకుమ్ సుమ్మ రజఖకుమ్ సుమ్మ యుమీతుకుమ్ సుమ్మ యుహ్యీకుమ్)
సూరా రూమ్‌లోని ఆయతు నంబర్ 40లో అల్లాహుతాలా చెప్పాడు,
“అల్లాహ్! ఆయనే మిమ్మల్ని సృష్టించాడు. ఆయనే మీకు ఉపాధి ప్రసాదించాడు. మరియు ఆయనే మీకు మరణం ప్రసాదిస్తాడు. ఆ తర్వాత మళ్లీ మిమ్మల్ని బ్రతికిస్తాడు.”
ఈ నాలుగు విషయాలు అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ తెలిపిన తర్వాత ఏమంటున్నాడో కొంచెం గమనించండి:
هَلْ مِن شُرَكَائِكُم مَّن يَفْعَلُ مِن ذَٰلِكُم مِّن شَيْءٍ
(హల్ మిన్ షురకా’ఇకుమ్ మన్ యఫ్’అలు మిన్ జాలికుమ్ మిన్ షై’)
“మీరు ఆ అల్లాహ్‌ను వదిలి ఎవరినైతే ఆరాధిస్తున్నారో, ఎవరెవరినైతే సాటి కల్పిస్తున్నారో, వారిలో ఏ ఒక్కరైనా ఈ నాలుగు, నాలుగిటిలో ఏ ఒక్క విషయం చేసేటటువంటి శక్తి గలవారా?”
ఏంటి ఈ నాలుగు? సృష్టించడం, మరియు ఉపాధిని ప్రసాదించడం, బ్రతికి ఉన్న వారికి మరణం ప్రసాదించడం, మరియు అందరూ చనిపోయిన తర్వాత ప్రళయం సంభవించిన తర్వాత మరోసారి వారందరినీ బ్రతికింపజేసి, వారందరినీ లేపి, సమూహపరచి, వారితో లెక్క తీసుకోవడం. ఈ నాలుగు విషయాలు గానీ, నాలుగిటిలో ఏదైనా ఒకటి గానీ, మీ ఈ సాటి కల్పింపబడేవారు ఎవరైనా చేయగలుగుతారా? వాస్తవానికి ఎవరూ చేయలేరు. అందు గురించే అల్లాహ్ స్వయంగా ఏమంటున్నాడు:
سُبْحَانَهُ وَتَعَالَىٰ عَمَّا يُشْرِكُونَ
(సుబ్హానహూ వ త’ఆలా అమ్మా యుష్రికూన్)
“వారు ఆ అల్లాహ్‌తో పాటు ఎవరెవరినైతే సాటి కల్పిస్తున్నారో, భాగస్వాములుగా చేస్తున్నారో, అలాంటి భాగస్వామ్యానికి ఆ అల్లాహ్ ఎంతో అతీతుడు మరియు ఎంతో ఉన్నతుడు. అలాంటి ఏ అవసరం అల్లాహ్‌కు లేదు.”
అందుగురించే మానవులారా! మానవులారా! ఇలాంటి నాలుగు రకాల క్వాలిటీస్ ఉన్న ఆ సత్య ప్రభువును మాత్రమే మీరు పూజించండి. ఎవరెవరినైతే పూజిస్తున్నారో, వారిలో ఇలాంటి శక్తి ఏదైనా ఉందా లేదా ముందే మీరు పరిశీలించుకోండి. లేదా అంటే, ఒక రోజు కాకున్నా ఒక రోజు మనం చనిపోయేవాళ్ళం. ఆ తర్వాత ఆ సృష్టికర్త వద్దకే మనం మరలింపబడతాము. అక్కడ మనకు ఆ అల్లాహ్ తప్ప ఇంకా ఎవరూ కూడా పనికిరారు. అల్లాహ్ మనందరికీ సన్మార్గం చూపుగాక.
وَآخِرُ دَعْوَانَا أَنِ الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
(వ ఆఖిరు ద’వానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్)
(మరియు మా చివరి ప్రార్థన సర్వలోకాల ప్రభువైన అల్లాహ్‌కే సర్వ స్తోత్రములు).
السَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ
(అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహ్)
(మీపై శాంతి మరియు అల్లాహ్ కారుణ్యం కురియుగాక).
ఇతరములు:
- [విశ్వాసము]
- తౌహీద్ (ఏక దైవారాధన) అంటే ఏమిటి? దాని రకాలు ఏమిటి? [వీడియో]
- అల్లాహ్ యేతరులతో దుఆ చేయు నష్టాలు [వీడియో]
- తౌహీద్ ప్రభోదిని (తఫ్ హీం తౌహీద్ )
- కితాబుత్ తౌహీద్ (ఏక దైవారాధన పుస్తకం) – Shaykh Muhammad bin AbdulWahhab
- Shirk – అష్షిర్క్ – దైవత్వంలో భాగస్వాములను చేర్చటం
- షిర్క్ (బహు దైవారాధన లేదా విగ్రహారాధన) ఎలా ప్రారంభమైనది ?
- షిర్క్ (బహుదైవారాధన) దేనినంటారు? దాని నష్టాలు ఎలా ఉంటాయి? [వీడియో]