వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Video Courtesy: Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.
ఈ ఆడియో శుక్రవారం (జుమా) నమాజుకు త్వరగా హాజరు కావడం యొక్క ప్రాముఖ్యతను మరియు దానిని విడిచిపెట్టడం గురించిన తీవ్రమైన హెచ్చరికను వివరిస్తుంది. ఖురాన్ ఆయత్ (సూరా అల్-జుమా) మరియు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హదీసుల ఆధారంగా ఈ విషయం స్పష్టం చేయబడింది. అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించిన హదీసు ప్రకారం, జుమా నమాజుకు వేర్వేరు సమయాలలో (గడియలలో) ముందుగా వచ్చిన వారికి గొప్ప పుణ్యాలు లభిస్తాయి. మొదటి గడియలో వచ్చినవారికి ఒంటెను, రెండవ గడియలో వచ్చినవారికి ఆవును, ఆ తర్వాత గొర్రె, కోడి, మరియు కోడిగుడ్డును బలిదానం చేసినంత పుణ్యం లభిస్తుందని వివరించబడింది. ఇమామ్ ఖుత్బా (ప్రసంగం) ఇవ్వడానికి మింబర్ పైకి వచ్చిన తర్వాత, హాజరైన వారి పేర్లను నమోదు చేసే దేవదూతలు తమ గ్రంథాలను మూసివేసి ప్రసంగాన్ని వింటారని, కాబట్టి ఆలస్యంగా వచ్చేవారు ఈ ప్రత్యేక పుణ్యాన్ని కోల్పోతారని నొక్కి చెప్పబడింది. మరో హదీసులో, జుమా నమాజును నిరంతరంగా వదిలివేసే వారి హృదయాలపై అల్లాహ్ ముద్ర వేస్తాడని, దానివల్ల వారు అశ్రద్ధపరులలో చేరిపోతారని తీవ్రంగా హెచ్చరించబడింది. ముగింపులో, జుమా యొక్క ఘనతను అర్థం చేసుకుని, అజాన్‌కు ముందే మస్జిద్‌కు చేరుకోవాలని, ఈ తప్పనిసరి ప్రార్థనను విడిచిపెట్టే ఘోర పాపానికి దూరంగా ఉండాలని వక్త ఉద్బోధించారు.
అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహ్.సోదర మహాశయులారా, జుమా నమాజ్ కు త్వరగా హాజరవటంలోని ఘనత, దాన్ని కోల్పోవటం గురించి హెచ్చరిక, ఈ అంశానికి సంబంధించి ఒక ఆయత్ మరియు రెండు హదీసులు విందాము.
أَعُوذُ بِاللَّهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِذَا نُودِيَ لِلصَّلَاةِ مِن يَوْمِ الْجُمُعَةِ فَاسْعَوْا إِلَىٰ ذِكْرِ اللَّهِ وَذَرُوا الْبَيْعَ ۚ ذَٰلِكُمْ خَيْرٌ لَّكُمْ إِن كُنتُمْ تَعْلَمُونَ.
ఓ విశ్వాసులారా! శుక్రవారం నాడు నమాజుకు గాను పిలవబడినప్పుడు మీరు అల్లాహ్ ధికర్ వైపునకు పరుగెత్తి రండి మరియు వ్యాపారం వదిలిపెట్టండి. మీరు తెలుసుకున్నట్లయితే ఇది మీకు చాలా మేలైనది.
అన్ అబీ హురైరత రదియల్లాహు అన్హు అన్న రసూలల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లమ ఖాల్
مَنِ اغْتَسَلَ يَوْمَ الْجُمُعَةِ غُسْلَ الْجَنَابَةِ ثُمَّ رَاحَ فَكَأَنَّمَا قَرَّبَ بَدَنَةً وَمَنْ رَاحَ فِي السَّاعَةِ الثَّانِيَةِ فَكَأَنَّمَا قَرَّبَ بَقَرَةً وَمَنْ رَاحَ فِي السَّاعَةِ الثَّالِثَةِ فَكَأَنَّمَا قَرَّبَ كَبْشًا أَقْرَنَ وَمَنْ رَاحَ فِي السَّاعَةِ الرَّابِعَةِ فَكَأَنَّمَا قَرَّبَ دَجَاجَةً وَمَنْ رَاحَ فِي السَّاعَةِ الْخَامِسَةِ فَكَأَنَّمَا قَرَّبَ بَيْضَةً فَإِذَا خَرَجَ الإِمَامُ حَضَرَتِ الْمَلاَئِكَةُ يَسْتَمِعُونَ الذِّكْرَ ”
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రబోధించారని హజరత్ అబూ హురైరా రదియల్లాహు తలా అన్హు ఉల్లేఖించారు: “ఎవరైతే జుమా రోజు జనాబత్ కు చేసే గుసుల్ లాంటి గుసుల్ స్నానం, అంటే సంపూర్ణ విధంగా స్నానం చేసి మస్జిద్ కు అందరికంటే ముందు వెళ్తాడో అతనికి ఒక ఒంటె బలిదానం ఖుర్బానీ చేసినంత పుణ్యం లభిస్తుంది. రెండవ వేళలో వెళ్ళిన వ్యక్తికి ఆవును బలిదానం ఇచ్చినంత పుణ్యం లభిస్తుంది. మూడవ వేళలో వచ్చిన వారికి కొమ్ములు గల గొర్రెను బలిదానం చేసినంత పుణ్యం లభిస్తుంది మరియు నాలుగవ గడియలో వెళ్ళే వారికి ఒక కోడి అల్లాహ్ మార్గంలో బలిదానం చేసినంత పుణ్యం లభిస్తుంది. ఐదవ వేళలో వెళ్ళే వారికి అల్లాహ్ మార్గంలో ఒక కోడి గ్రుడ్డును దానం చేసినంత పుణ్యం లభిస్తుంది. ఆ తర్వాత ఎప్పుడైతే ఇమాం ఖుత్బా ఇవ్వడానికి మింబర్ పైకి వస్తాడో, దేవదూతలు కూడా ప్రసంగం ఖుత్బా వినడానికి హాజరవుతారు.”
అంటే ఏం తెలిసింది? ఈ ఐదు వేళలు ఏవైతే తెలుపబడ్డాయో, అవి కొందరు పండితుల అభిప్రాయం ప్రకారం ఫజర్ తర్వాత లేదా సూర్యోదయం తర్వాత నుండి ఇమాం మెంబర్ పైకి ఎక్కే వరకు. ఇక ఎవరైతే ఇమాం మెంబర్ పై ఎక్కిన తర్వాత మస్జిద్ లోకి ప్రవేశిస్తారో, ఈ దైవదూతలు ప్రత్యేకంగా జుమా కొరకు వచ్చే వారి గురించి తమ యొక్క దఫ్తర్ లలో, తమ యొక్క నోట్ బుక్స్ లలో ఏదైతే వారి పేర్లు రాసుకుంటూ ఉండడానికి వస్తారో వారి యొక్క జాబితాలోకి చేరకోరు. అంటే ఎంతో గొప్ప పుణ్యాన్ని, జుమాకు సంబంధించిన ప్రత్యేక ఘనతను వారు కోల్పోతున్నారు అని భావం.
మూడవ హదీస్, అన్ ఇబ్ని ఉమర రదియల్లాహు అన్హు అన్నహు సమిఅ రసూలల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లమ యఖూల్
لَيَنْتَهِيَنَّ أَقْوَامٌ عَنْ وَدْعِهِمُ الْجُمُعَاتِ أَوْ لَيَخْتِمَنَّ اللَّهُ عَلَى قُلُوبِهِمْ ثُمَّ لَيَكُونُنَّ مِنَ الْغَافِلِينَ
“జుమా నమాజు చేయని వారు, జుమా నమాజును వదిలేవారు, వారు తమ ఈ అలవాటును మానుకోకుంటే త్యజించుకుంటే అల్లాహ్ వారి హృదయాలను మూసివేస్తాడు. వారి హృదయాలపై ముద్ర వేస్తాడు. ఏం జరుగుతుంది? ఆ తర్వాత వారు అశ్రద్ధ వహుల్లోకి చేరిపోతారు” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా తాను విన్నట్లు అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు తలా అన్హు ఉల్లేఖించారు.
అయితే సోదర మహాశయులారా, పై ఆయత్ మరియు హదీసుల నుండి మనకు తెలిసిన విషయాలు ఏమిటి? జుమా నమాజ్ అజాన్ కంటే ముందే మస్జిద్ లోకి వచ్చి హాజరయ్యే, ఖుత్బా శ్రద్ధగా వినే ప్రయత్నం చేయాలి. జుమా నమాజుకు త్వరగా పోవుటలో చాలా ఘనత ఉంది, ఐదు రకాలుగా దాని గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. జుమా నమాజ్ వదిలే వారికి భయంకరమైన హెచ్చరిక ఇవ్వబడింది. అలా చేయుట వల్ల వారి హృదయాలపై ముద్ర వేయడం జరుగుతుంది. మంచి విషయాలు, ధర్మ విషయాలు, అల్లాహ్ యొక్క బోధనలు అర్థం చేసుకోకుండా మూసివేయబడతాయి. అల్లాహు అక్బర్. ఇది ఎంత భయంకరమైన శిక్షనో గమనించండి. అల్లాహ్ తలా మనందరికీ జుమా యొక్క ఘనతను అర్థం చేసుకుని, దానిని పాటించేటువంటి సద్భాగ్యం ప్రసాదించు గాక.
వ ఆఖిరు దఅవానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్.
—
ఇతరములు:

You must be logged in to post a comment.