సహజ సిద్ధ (సృష్టి) ఆచారములు

عن عائشة رضي الله عنها ، أن رسول الله r قال : (عشر من الفطرة قص الشارب وإعفاء اللحية والسواك واستنشاق الماء وقص الأظفار وغسل البراجم ونتف الإبط وحلق العانة وانتقاص الماء قال زكرياء قال مصعب ونسيت العاشرة إلا أن تكون المضمضة) (رواه مسلم)

ఆయెషా రదియల్లాహు అన్హా ఉల్లేఖించిన హదీథ్ ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఒకసారి ఇలా బోధించారు – “పది విషయాలు ఫిత్రాలో (సహజ ధర్మంలో) ఉన్నాయి –  మీసాలు కత్తిరించడం, గెడ్డాన్ని వదలటం, మిస్వాక్ (పళ్ళు తోముకునే పుల్ల) వాడటం, ముక్కులో నీరు పంపి శుభ్రపరచుకోవటం, గోళ్ళను కత్తిరించడం, వ్రేళ్ళ మధ్య కడగటం, చంకలలోని వెంట్రుకలను తొలగించటం, మర్మాంగం దగ్గర (నాభి క్రింద) పెరిగే వెంట్రుకలను తొలగించటం, మర్మాంగాలను నీటితో శుభ్రపరచుకోవటం” ఉల్లేఖకురాలు ఇంకా ఇలా తెలిపారు: “నేను పదవ విషయాన్ని మరచిపోయాను, కాని బహుశా అది నోటిని పుక్కిలించటం అయివుంటుంది” ముస్లిం హదీథ్ గ్రంథం.

ఇంకో హదీథ్ లో అబూ హురైరా రదియల్లాహు అన్హు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం  బోధించిన విషయాన్ని ఇలా ఉల్లేఖించారు – “ప్రకృతికి  అనుగుణమైన ఐదు విషయాలున్నాయి.

 1. ఖత్నా (వడుగు) చేసుకోవడం
 2. నాభి క్రింది వెంట్రుకలు తొలగించడం
 3. చంకలోని వెంట్రుకలు తొలగించటం
 4. గోళ్ళు కత్తిరించడం
 5. మీసాలు కత్తిరించడం” సహీహ్ బుఖారీ హదీథ్ గ్రంథం

కాబట్టి కనీస సృష్టి ఆచారములు ఇలా ఉన్నాయి

 1. మిస్వాక్ (తోముడు పుల్ల)తో నోటిని మరియు దంతములను ఎల్లప్పుడు శుభ్రపరచుకొనుట.
 2. బొడ్డు క్రింద  మరియు చంకలలోని వెంట్రుకలను తొలిగించుట.
 3. సున్నతి (ఖత్నా, ఒడుగులు) చేయించుట.
 4. మీసాలను కత్తిరించుట, గెడ్డము పెంచుట.
 5. గోళ్ళను కత్తిరించుట
 6. పూర్తిగా శుభ్రత పాటించుట
%d bloggers like this: