శత సంప్రదాయాలు (100 సునన్ ) [పుస్తకం & వీడియో పాఠాలు]

Sata Sampradayaalu (100 Sunan)
From Saheeh Hadith (Mostly Bukhari and Muslim)

100 Sunan - Sata Sampradayaalu

[ఇక్కడ చదవండి / డౌన్లోడ్ చేసుకోండి]
[PDF] [ మొబైల్ ఫ్రెండ్లీ బుక్] [45 పేజీలు]

శత సంప్రదాయాలు (100 Sunan) – యూట్యూబ్ ప్లే లిస్ట్:
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV27XmLiRnxNDRJ4vQPx2c2O

విషయ సూచిక 

[పూర్తి పుస్తకం క్రింద చదవండి]

గౌరవనీయులైన పాఠకులారా! నేడు ముస్లిం సమాజంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సాంప్రదాయాల పట్ల శ్రద్ధ లేనట్లుగా, వాటిని తమ జీవిత వ్యవహారాల్లో పాటించ- నట్లుగా చూస్తున్నాము -ఏ కొద్ది మందో తప్ప!. ఈ కొద్ది మంది మూలంగానే బహుశా అల్లాహ్ కరుణ కురుస్తుందేమో! అందుకే ప్రవక్త సాంప్రదాయాల్లో కొన్నిటిని ఈ చిరు పుస్తక రూపంలో మీ ముందుకు తీసుకరాదలిచాము. అవును! చిరు పుస్తక రూపములోనే. అది మీరు ఎల్లవేళల్లో మీ వెంట ఉంచుకోవడంలో సులభంగా ఉండటానికి మరియు మీ సమస్త కార్యాల్లో ప్రవక్త సాంప్రదాయాన్ని గుర్తు చేయటానికి. దీనిని “శత సాంప్రదాయాలు” అని నామకరణ చేశాము. దీని ఉద్దేశం ప్రవక్త సాంప్రదాయాలు కేవలం ఇవేనని కాదు, వాటిలో కొన్ని మాత్రమే సమకూర్చి, అల్లాహ్ దయతో మీ ముందుంచగలిగాము. వీటిని ఆచరణ రూపంలో తీసుకొచ్చే భాగ్యం ప్రసాదించాలని ఆ ఏకైక విధాత అయిన అల్లాహ్ నే వేడుకుంటున్నాము.

ప్రవక్త సాంప్రదాయ పద్ధతులు

عَنْ أَبِي هُرَيْرَةَ ﷜ قَالَ: قَالَ رَسُولُ اللهِ ﷑: (إِنَّ اللهَ قَالَ: مَنْ عَادَى لِي وَلِيًّا فَقَدْ آذَنْتُهُ بِالْـحَرْبِ وَمَا تَقَرَّبَ إِلَيَّ عَبْدِي بِشَيْءٍ أَحَبَّ إِلَيَّ مِمَّا افْتَرَضْتُ عَلَيْهِ وَمَا يَزَالُ عَبْدِي يَتَقَرَّبُ إِلَيَّ بِالنَّوَافِلِ حَتَّى أُحِبَّهُ فَإِذَا أَحْبَبْتُهُ كُنْتُ سَمْعَهُ الَّذِي يَسْمَعُ بِهِ وَبَصَرَهُ الَّذِي يُبْصِرُ بِهِ وَيَدَهُ الَّتِي يَبْطِشُ بِهَا وَرِجْلَهُ الَّتِي يَمْشِي بِهَا وَإِنْ سَأَلَنِي لَأُعْطِيَنَّهُ وَلَئِنِ اسْتَعَاذَنِي لَأُعِيذَنَّهُ وَمَا تَرَدَّدْتُ عَنْ شَيْءٍ أَنَا فَاعِلُهُ تَرَدُّدِي عَنْ نَفْسِ الْـمُؤْمِنِ يَكْرَهُ الْـمَوْتَ وَأَنَا أَكْرَهُ مَسَاءَتَهُ).

అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు, అల్లాహ్ ఇలా తెలిపాడని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారుః

“నా ‘వలీ’ (ప్రియతముని)తో శత్రుత్వం వహించేవాడు నాతో యుద్ధానికి సిద్ధమవ్వాలని ప్రకటిస్తున్నాను. నా దాసుడు నా సాన్నిధ్యం కోరి ఆచరించే వాటిలోకెల్లా నేను అతనిపై విధిగా నిర్ణయించినవి నాకు ప్రియమైనవి. నా దాసుడు నఫిల్ (అదనపు) సత్కార్యాల ద్వారా నాకు ఇంకా ఎంతో చేరువవుతాడు. కడకు అతడు నా ప్రేమకు పాత్రుడవుతాడు. అతడు నాకు ప్రీతి పాత్రుడు అయినప్పుడు నేను, అతడు వినే చెవినవుతాను, అతడు చూసే కన్నునవుతాను, అతడు పట్టుకునే చెయ్యినవుతాను, అతడు నడిచే కాలునవుతాను. ఇక అతడు నన్ను అడిగితే నేను తప్పక ప్రసాదిస్తాను, శరణు కోరితే నేను శరణు ఇస్తాను. నేను చేసే ఏ పనిలోనూ తటపటా- యించను, విశ్వాసుని ప్రాణం తీయునప్పుడు తప్ప. అతను మరణం అంటే ఇష్టపడడు, అతనికి హాని కలగించడం అంటే నేను ఇష్టపడను. (కాని అది జరగక తప్పదు). (బుఖారీ 6502).

[A] నిద్ర నియమాలు

1- వుజూ చేసుకొని పడుకోవాలి

النوم على وضوء:
قَـالَ النَّبِيُّ لِلْبَرَاءِ بنِ عازب : (إِذَا أَتَيْتَ مَضْجَعَكَ فَتَوَضَّأْ وُضُوءَكَ لِلصَّلَاةِ ثُمَّ اضْطَجِعْ عَلَى شِقِّكَ الْأَيْمَنِ… ).

బరా బిన్ ఆజిబ్ రజియల్లాహు అన్హును ఉద్దేశించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారుః

“నీవు నీ పడకపై వచ్చినప్పుడు నమాజు కొరకు చేసినట్లు వుజూ చేసి, కుడి ప్రక్కన తిరిగి పడుకో”. (బుఖారీ 247. ముస్లిం 2710).

2- పడుకునే ముందు ఈ సూరాలు చదవాలి

قراءة سورة الإخلاص ، والمعوذتين قبل النوم: عَنْ عَائِشَةَ ؅ أَنَّ النَّبِيَّ ﷑ كَانَ إِذَا أَوَى إِلَى فِرَاشِهِ كُلَّ لَيْلَةٍ جَمَعَ كَفَّيْهِ ثُمَّ نَفَثَ فِيهِمَا فَقَرَأَ فِيهِمَا قُلْ هُوَ اللهُ أَحَدٌ وَ قُلْ أَعُوذُ بِرَبِّ الْفَلَقِ وَ قُلْ أَعُوذُ بِرَبِّ النَّاسِ ثُمَّ يَمْسَحُ بِهِمَا مَا اسْتَطَاعَ مِنْ جَسَدِهِ يَبْدَأُ بِهِمَا عَلَى رَأْسِهِ وَوَجْهِهِ وَمَا أَقْبَلَ مِنْ جَسَدِهِ يَفْعَلُ ذَلِكَ ثَلَاثَ مَرَّاتٍ.

ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనం:

ప్రవక్త మహనీయులు (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రతి రాత్రి తమ పడకపై వచ్చి, “ఖుల్ హువల్లాహు అహద్, ఖుల్ అఊజు బిరబ్బిల్ ఫలఖ్, ఖుల్ అఊజు బిరబ్బిన్నాస్” సూరాలు పూర్తిగా చదివి, రెండు అరచేతుల్లో ఊదుకొని, ముఖము మరియు తల నుండి మొదలుపెట్టి శరీర ముందు భాగంపై సాధ్యమైనంత వరకు తుడుచుకునేవారు. ఇలా మూడు సార్లు చేసేవారు. (బుఖారీ 5018).

3- నిద్రించునప్పుడు జిక్ర్

التكبير والتسبيح عند المنام: عَن عَلِيٍّ  ﷜ أَنَّ رَسُولَ الله ﷑ قَالَ حِينَ طَلَبَتْ مِنهُ فَاطِمَةُ ؅ خَادمًا: (أَلَا أَدُلُّكُمَا عَلَى مَا هُوَ خَيْرٌ لَكُمَا مِنْ خَادِمٍ إِذَا أَوَيْتُمَا إِلَى فِرَاشِكُمَا أَوْ أَخَذْتُمَا مَضَاجِعَكُمَا فَكَبِّرَا ثَلَاثًا وَثَلَاثِينَ وَسَبِّحَا ثَلَاثًا وَثَلَاثِينَ وَاحْمَدَا ثَلَاثًا وَثَلَاثِينَ فَهَذَا خَيْرٌ لَكُمَا مِنْ خَادِمٍ ).

అలీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం: ఫాతిమా రజియల్లాహు అన్హా ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో పనిమనిషి కావాలని అడిగినప్పుడు “మీ కొరకు పనిమనిషికన్నా మేలైన విషయం తెలుపనా?” అని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారుః “మీరిద్దరూ పడకపై చేరుకున్నప్పుడు 34 సార్లు “అల్లాహు అక్బర్”, 33 సార్లు “సుబ్ హానల్లాహ్”, 33 సార్లు “అల్ హందులిల్లాహ్” పఠించండి. ఈ స్మరణ మీ కోసం సేవకుడి కంటే ఎంతో శ్రేష్ఠమైన సంపద“. (బుఖారీ 6318. ముస్లిం 2727).

4- నిద్ర మధ్యలో మేల్కొంటే చదవండీ

الدعاء حين الاستيقاظ أثناء النوم: عَن عُبَادَة بْن الصَّامِتِ ﷜ عَن النَّبِيِّ قَالَ: (مَنْ تَعَارَّ مِنَ اللَّيْلِ فَقَالَ لَا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ لَهُ الْـمُلْكُ وَلَهُ الْـحَمْدُ وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ الْـحَمْدُ لله وَسُبْحَانَ الله وَلَا إِلَهَ إِلَّا اللهُ وَاللهُ أَكْبَرُ وَلَا حَوْلَ وَلَا قُوَّةَ إِلَّا بِالله ثُمَّ قَالَ اللَّهُمَّ اغْفِرْ لِي أَوْ دَعَا اسْتُجِيبَ لَهُ فَإِنْ تَوَضَّأَ وَصَلَّى قُبِلَتْ صَلَاتُهُ).

“ఎవరు రాత్రి వేళ నిద్ర నుండి మేల్కొని ‘లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహూ లా షరీకలహూ, లహుల్ ముల్కు వలహుల్ హందు, వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్. అల్ హందులిల్లాహ్, వ సుబ్ హానల్లాహ్, వల్లాహు అక్బర్, వలాహౌల వలాఖువ్వత ఇల్లాబిల్లాహ్’ చదివి, ‘అల్లాహ్ నన్ను క్షమించు’ అని లేదా మరేదైనా దుఆ చేసుకున్నచో అది అంగీకరింపబడుతుంది. ఒకవేళ వుజూ చేసుకొని నమాజ్ చేస్తే అదీ స్వీకరించబడుతుంది” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారని అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. (బుఖారీ 1154).

5- నిద్ర నుండి మేల్కొని ఇలా చదవాలి

الدعاء عند الاستيقاظ من النوم:
(اَلْـحَمْدُ لله الَّذِي أَحْيَانَا بَعدَمَا أَمَاتَنَا وَإِلَيهِ النُّشُور).

అల్ హందు లిల్లాహిల్లాజి అహ్యానా బఅద మా అమాతనా వఇలైహిన్నుషూర్.
(మమ్మల్ని నిర్జీవావస్థకు గురిచేసిన తర్వాత జీవం పోసిన ఆ అల్లాహ్ కే సర్వ స్తోత్రములు. మేము తిరిగి ఆయన సమక్షంలోనే లేచి నిలబడే వారము). (బుఖారీ 6312లో హుజైఫా ఉల్లేఖనం).

[B] వుజూ మరియు నమాజు యొక్క ధర్మములు

6- ఒకే చులుకం నీళ్ళు తీసుకొని కొన్నిటితో పుక్కిలించి, మరికొన్ని ముక్కులో ఎక్కించాలి

المضمضة والاستنشاق من غرفة واحدة: عَن عَبدِالله بنِ زَيدٍ ﷜ أنَّ رَسولَ الله ﷑: (تَمَضْمَضَ ، وَاسْتَنْشَقَ مِنْ كَفٍّ وَاحِدَةٍ).

అబ్దుల్లాహ్ బిన్ జైద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం:

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒకే చులుకం నీళ్ళు తీసుకొని కొన్నిటితో పుక్కిలించేవారు. మరికొన్ని ముక్కులో ఎక్కించేవారు. (ముస్లిం 235).

7- స్నానానికి ముందు వుజూ

الوضوء قبل الغُسل : عَن عَائشَةَ  ؅ أنَّ النبي : (كَانَ إِذَا اغْتَسَلَ مِنَ الْـجَنَابَةِ بَدَأَ فَغَسَلَ يَدَيْهِ ثُمَّ يَتَوَضَّأُ كَمَا يَتَوَضَّأُ لِلصَّلَاةِ ثُمَّ يُدْخِلُ أَصَابِعَهُ فِي الْـمَاءِ فَيُخَلِّلُ بِهَا أُصُولَ شَعَرِهِ ثُمَّ يَصُبُّ عَلَى رَأْسِهِ ثَلَاثَ غُرَفٍ بِيَدَيْهِ ثُمَّ يُفِيضُ الْـمَاءَ عَلَى جِلْدِهِ كُلِّهِ).

ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనం ప్రకారం:

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం లైంగిక అశుద్ధత నుండి పరిశుద్ధత పొందే నిమిత్తం స్నానానికి ఉపక్రమించినపుడు (మర్మాంగ స్థలాన్ని కడుక్కున్న తర్వాత) చేతులు కడుక్కునేవారు. మళ్ళీ నమాజు కోసం చేసుకునే విధంగా వుజూ చేసి, నీళ్ళు తీసుకొని తన చేతివేళ్ళతో తలవెంట్రుకల వ్రేళ్ళ భాగం సయితం తడిసేలా నీరు పోసేవారు. ఆ పైన దోసిట్లో నీళ్ళు తీసుకుని మూడుసార్లు తలపై నీరు పోసేవారు. ఆపైన శరీరమంతటిపై నీళ్ళు పోసుకునేవారు. (బుఖారీ 248, ముస్లిం 316).

8- వుజూ తరువాత దుఆ

التشهد بعد الوضوء:عَن عُمَرَ بنِ الخَطَّاب قَالَ: قَالَ رَسُولُ الله ﷑: (مَا مِنكُمْ مِنْ أحدٍ يَتَوَضَّأُ فَيُسبِغُ الْوُضُوءَ ثُمَّ يَقُولُ : أَشْهَدُ أن لاَّ إِلَهَ إِلاَّ اللهُ، وَأنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ إِلاَّ فُتِحَتْ لَهُ أبْوَابُ الْجَنَّةِ الثَّمَانِيَة، يَدخُلُ مِنْ أَيِّهَا شَاءَ).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు:

మీలో ఎవ్వరైనా మంచివిధంగా వుజూ చేసిన పిదప “అష్ హదు అల్లాఇలాహ ఇల్లల్లాహు వ అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు” చదివితే అతని కొరకు స్వర్గం యొక్క ఎనిమిది ద్వారాలు తెరువబడుతాయి. అతను తాను ఇష్టపడిన ఏ ద్వారం గుండానైనా ప్రవేశించవచ్చు.” (ముస్లిం 234).

9- నీళ్ళు తక్కువ ఖర్చు చేయటం

الاقتصاد في الماء: عن أنس ﷜ قَالَ: (كَانَ النَّبِيُّ ﷑ يَغْتَسِلُ بِالصَّاعِ إلَى خَمْسَةِ أَمْدَادٍ ، وَيَتَوَضَّأُ بِالْـمُد).

అనస్  రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం:

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నాలుగు నుండి ఐదు ‘ముద్’ల వరకు నీళ్ళతో స్నానం చేసేవారు. ఒక ‘ముద్’ నీటితో వుజూ చేసేవారు. (బుఖారీ 201. ముస్లిం 325).

* ముద్ అంటే ప్రవక్త కాలంనాటి ఒక కొలమానం. ఒక ముద్ అన్నది సుమారు 700 గ్రాముల బియ్యానికి సమానం.

10- వుజూ తరువాత రెండు రకాతుల నమాజు చేయటం

صلاة ركعتين بعد الوضوء: قَالَ النَّبِيُّ ﷑: (مَنْ تَوَضَّأ نَحْوَ وُضُوئِي هَذَا، ثُمَّ صَلَّى رَكَعْتَينِ لاَ يُحَدِّثُ فِيهِمَا نَفْسَهُ، غُفِرَ لَهُ مَا تَقَدَّمَ مِنْ ذَنْبِه).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని, ఉస్మాన్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు:

“ఎవరు నేను చేసిన విధంగా వుజూ చేసి రెండు రకాతుల నమాజు చేస్తాడో – నమాజుకు సంబంధం లేని విషయాలు మాట్లాడడో- అతని పూర్వ పాపాలన్నియు మన్నించ బడతాయి. (బుఖారీ 164. ముస్లిం 226).

11- ముఅజ్జిన్  పలికినట్లు పలికి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై దరూద్ చదవటం

الترديد مع المؤذن ثم الصلاة على النبي r: عَنْ عَبدِالله بنِ عَمرٍو ﷜ أنَّهُ سَمِـعَ النَّبِيَّ ﷑ يَقُــولُ: (إِذَا سَمِعْتُمُ الْـمُؤَذِّنَ فَقُولُوا مِثْلَ مَا يَقُولُ، ثُمَّ صَلُّوا عَلَيَّ، فَإِنَّهُ مَنْ صَلَّى عَلَيَّ صَلاَةً ، صَلَّى اللهُ عَلَيهِ بِهَا عشرًا … الحديث).  ثُمَّ يَقُولُ بَعْدَ الصَّلَاةِ عَلَى النَّبِي ﷑: (اللَّهُمَّ رَبَّ هَذِهِ الدَّعْوَةِ التَّامَّةِ ، وَالصَّلاَةِ الْقَائِمَةِ ، آتِ مُحَمَّدًا الْوَسِيلَةَ وَالْفَضِيلَةَ ، وَابْعَثْهُ مَقَامًا مَحْمُودًا الَّذِي

وَعَدتَّه ). مَنْ قَالَ ذَلِكَ حَلَّتْ لَهُ شَفَاعَةُ النَّبِي ﷑.

అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ రజియల్లాహు అన్హు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా విన్నారు:

మీరు అజాన్ విన్నప్పుడు ముఅజ్జిన్ పలికినట్లుగానే పలకండి. పిదప నాపై దరూద్ చదవండి. ఎవరు నాపై ఒకసారి ‘దరూద్’ చదువుతారో, అందుకు అల్లాహ్ అతనిపై పదిసార్లు దరూద్ పంపుతాడు…..“. (ముస్లిం 849). దరూద్ తరువాత ఈ క్రింది దుఆ చదివినవారు ప్రళయదినాన ప్రవక్త ﷺ సిఫారసుకు అర్హులవుతారు. “అల్లాహుమ్మ రబ్బ హాజిహిద్ దఅవతిత్ తామ్మతి వస్సలాతిల్ ఖాఇమతి ఆతి ముహమ్మదనిల్ వసీలత వల్ ఫజీలత వబ్అస్ హు మఖామమ్ మహ్మూద నిల్లజీ వఅత్తహూ“. (ముస్లిం 384).

దరూద్:

అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదివ్ వఅలా ఆలి ముహమ్మదిన్ కమా సల్లైత అలా ఇబ్రాహీమ వఅలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్మజీద్. అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మదివ్ వఅలా ఆలి ముహమ్మదిన్ కమా బారక్ త అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్మజీద్.

12- అధికంగా మిస్వాక్ చేయుట

الإكثار من السواك: عَن أَبِي هُرَيرَةَ ﷜ أَنَّ رَسُولَ الله ﷑ قَالَ: (لَولاَ أَنْ أَشُقَّ عَلَى أُمَّتِي ، لَأَمَرْتُهُمْ بِالسِّوَاكِ عِنْدَ كُلِّ صَلاَةٍ).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారని అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు:

“నా అనుచర సమాజానికి కష్టతరమవుతుందన్న సంశయం నాకు లేకుండినట్లయితే ప్రతి నమాజ్ సమయంలో మిస్వాక్ చేయాలని ఆజ్ఞాపించి ఉండేవాణ్ణి”. (బుఖారీ 887. ముస్లిం 252).

* (1) నిద్ర నుండి మేల్కొని, (2) వుజూ సమయం లో, (3) నోటి వాసనలో మార్పు వచ్చినప్పుడు, (4) ఖుర్ఆన్ చదివే ముందు, (5) ఇంట్లో ప్రవేశించే ముందు మిస్వాక్ చేయడం ధర్మం.

13- శీఘ్రముగా మస్జిద్ కు వెళ్ళటం

التبكير إلى المسجد : عَن أبي هُرَيرَةَ قَالَ: قَالَ رَسُولُ الله :(… وَلَو يَعْلَمُونَ مَا فِي التَّهْجِيرِ [التَّبْكِير] لاَسْتَبَقُوا إلَيه … الحديث).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు:

“వేళ కాగానే తొలి సమయంలో నమాజు చేయడంలో ఎంత పుణ్యం ఉందో తెలిస్తే అందులో ప్రజలు ఒకర్నొకరు మించిపోవడానికి పోటీపడతారు”. (బుఖారీ 615. ముస్లిం 437).

14- మస్జిద్ కు నడచి వెళ్లటం

الذهاب إلى المسجد ماشيا: عَنْ أبي هُرَيرَةَ t أَنَّ رَسُولَ الله ﷑ قَالَ: (أَلاَ أَدُلُّكُمْ عَلَى مَا يَمْحُو اللهُ بِهِ الْـخَطَايَا ، وَيَرْفَعُ بِهِ الدَّرجَاتِ) قَالُوا: بَلَى يَا رَسُولَ الله. قَالَ: (إِسبَاغُ الْوُضُوء عَلَى الْـمَكَارِه ، وَكَثْرَةُ الـْخُطَا إِلَى الْـمَسَاجِد ، وَانْتِظَارُ الصَّلاَةِ بَعدَ الصَّلاَةِ، فَذَلِكُمُ الرِّبَاط).

అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త మహనీయులు సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అడిగారుః “పరమ ప్రభువైన అల్లాహ్ ఏ విషయాల ఆధారంగా అపరాధాలను మన్నిస్తాడో, స్థాయిని ఉన్నతం చేస్తాడో నేను మీకు తెలుపనా?” దానికి సహచరులు ‘దైవప్రవక్తా తప్పక సెలవీయండి’ అని బదులిచ్చారు. అప్పుడాయన ఇలా బోధించారుః “వాతవరణం, పరిస్థితులూ ప్రతీకూలంగా ఉన్నప్పటికీ వుజూ పూర్తిగా చెయ్యటం.  మస్జిద్ వైపునకు అధికంగా అడుగులు వెయ్యడం. ఒక నమాజ్ తరువాత మరో నమాజ్ కొరకు నిరీక్షించడం – ఇది రిబాత్ తో సమానం ([1])”. (ముస్లిం 251).

15- నమాజ్ కొరకు నిదానంగా, ప్రశాంతంగా రావాలి

إتيان الصلاة بسكينة ووقار: عَن أَبِي هُـرَيرَةَ t قَالَ: سَمِعتُ رَسولَ الله يَقُولُ: (إِذَا أُقِيمَتِ الصَّلاَةُ فَلاَ تَأتُوهَا تَسْعَونَ، وَأتُوهَا تَمْشُونَ، وَعَلَيْكُمُ السَّكِينَةُ، فَمَا أَدْرَكْتُمْ فَصَلُّوا ، وَمَا فَاتَكُمْ فَأَتِـمُّوا).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం  ఇలా చెప్పగా తాను విన్నాను అని అబూహురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు:

నమాజ్ కొరకు ఇఖామత్ ఇవ్వబడినప్పుడు అందులో చేరడానికి పరుగిడుతూ రాకండి. నిదానంగా నడచి వెళ్ళండి. సామూహిక నమాజులో మీకు ఏ మేరకు లభిస్తే ఆ మేరకు చేయండి. మిగిలిన భాగాన్ని వ్యక్తిగతంగా చేసి నమాజు పూర్తి చేసుకోండి“. (బుఖారీ 908. ముస్లిం 602).

16- మస్జిద్ లో ప్రవేశించినప్పుడు మరియు బైటికి వెళ్ళినప్పుడు ఇలా చదవాలి

الدعاء عند دخول المسجد، و الخروج منه: عَن أبي حُميد الساعدي ﷜ أو عن أبي أُسيد ﷜ قَالَ: قَالَ رَسُولُ الله ﷑: (إذَا دَخَلَ أَحَدُكُمُ الْـمَسْجِدَ فَلْيَقُلْ: اَللَّهُمَّ افْتَحْ لِي أَبْوَابَ رَحْمَتِكَ ، وَإِذَا خَرَجَ فَلْيَقُلْ: اَللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ مِنْ فَضْلِكَ).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం  ఇలా ఆదేశించారని అబూహుమైద్ సాఇదీ రజియల్లాహు అన్హు లేక అబూ ఉసైద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు:

“మీలో ఎవరైనా మస్జిద్ లో ప్రవేశించినప్పుడు ‘అల్లాహుమ్మఫ్ తహ్ లీ అబ్వాబ రహ్మతిక’ చదవాలి. బైటికి వచ్చినప్పుడు ‘అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక మిన్ ఫజ్ లిక’ చదవాలి”)[ఓ అల్లాహ్! మా కొరకు నీ కరుణ ద్వారాలు తెరుచు/ ఓ అల్లాహ్! నీ దయను వేడుకుంటున్నాను].(ముస్లిం 713

17- సుత్రా పెట్టుకొని నమాజ్ చేయాలి

الصلاة إلى سترة: عَن طَلحَةَ t قَالَ: قَالَ رَسُولُ الله ﷑: (إِذَا وَضَعَ أَحَدُكُمْ بَيْنَ يَدَيْهِ مِثلَ مُؤَخَّرَةِ الرَّحلِ فليُصَلِّ ، وَلاَ يُبَالِ مَنْ مَرَّ وَرَاءَ ذلِك).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారని తల్ హా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “మీలో ఎవరైనా తన ముందు ఒంటెపై కట్టబడే పల్లకీ వెనుకభాగపు ఎత్తుకు సమానంగా ఏదైనా వస్తువు పెట్టుకొని నమాజ్ చేయాలి. దాని అవతల నుండి ఎవరు దాటినా ఇక అతనికి అనవసరం“. (ముస్లిం 499).

*‘సుత్రా’ అంటే నమాజ్ చేసే వ్యక్తి తాను సజ్దా చేసే స్థలానికి ముందు అడ్డుగా ఉపయోగించుకునే వస్తువు. అది గోడ కావచ్చు, స్థంభం కావచ్చు, అడ్డు తెర కావచ్చు, కర్ర కావచ్చు, లేదా అటువంటిదే మరేదైనా వస్తువు కావచ్చు. ఈ సుత్రా నమాజ్ చేసే వ్యక్తికీ, అతని ముందు నుంచి నడచిపోయే వారికీ మధ్య అడ్డుగా ఉంటుంది.

18- రెండు సజ్దాల మధ్యలో మడమలపై కూర్చోవటం

الإقعاء بين السجدتين: عَن أَبِي الزُّبَيرِ أَنَّهُ سَمِعَ طَاوُوسًا يَقُولُ: قُلْنَا لِابْنِ عَبَّاسٍ ؆ فِي الْإقْعَاءِ عَلَى الْقَدَمَينِ ، فَقَالَ : (هِيَ السُّنَّة)، فَقُلْنَا لَهُ: إَنَّا لَنَرَاهُ جَفَاءً بِالرَّجُلِ ، فَقَالَ ابنُ عَبَّاس: (بَلْ هِيَ سُنَّةُ نَبِيِّكَ ﷑).

తావూస్ చెప్పగా అబుజ్జుబైర్ విని ఉల్లేఖిస్తున్నారుః మేము ఇబ్ను అబ్బాస్ రజియల్లాహు అన్హుమా తో (నమాజులో రెండు సజ్దాల మధ్యలో) పాదాలు నిలబెట్టి మడిమలపై కూర్చోవటమెలా అని అడిగాము. దానికి అతను ‘అది సున్నత్’ అని చెప్పాడు. ఇది మనిషికి చాలా కష్టంగా ఉంటుంది అని మేమన్నాము. దానికి అతను ‘ఇది మీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సున్నత్’ అని చెప్పాడు. (ముస్లిం: 536).

19- చివరి తషహ్హుద్ లో తవర్రుక్ చేయుట

التورك في التشهد الثاني: عَن أَبِي حُمَيد السَّاعِدِي t قَالَ: (كَانَ رَسُولُ اللهِ ﷑ إذَا جَلَسَ فِي الرَّكَعَةِ الآخِرَةِ ، قَدَّمَ رِجْلَهُ الْيُسْرَى ، وَنَصَبَ الْأُخْرَى، وَقَعَدَ عَلَى مَقْعَدَتِهِ).

అబూహుమైద్ సాఇదీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చివరి తషహ్హుద్ లో కూర్చునేటప్పుడు ఎడమ పాదం కుడి వైపు తీసుకొని, కుడి పాదాన్ని నిలబెట్టి ఎడమ పిరుదును భూమికి ఆనించి కూర్చుండేవారు. (బుఖారీ 828).

20- సలాంకు ముందు అధికంగా దుఆ చేయాలి

الإكثار من الدعاء قبل التسليم: عَن عَبدِالله ﷜ قَالَ: قَالَ النَّبِيُّ ﷑: … (ثُمَّ يَتَخَيَّرُ مِنَ الدُّعَاءِ أَعْجَبَهُ إِلَيْهِ فَيَدْعُو).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారని అబ్దుల్లాహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “… తనకు ఇష్టమున్న దుఆలు ఎన్నుకొని వాటి ద్వారా దుఆ చేయాలి”. (బుఖారీ: 835).

21- సున్నతె ముఅక్కద

أداء السنن الرواتب: عَن أُمِّ حَبِيبَةَ ؅ أَنَّهَا سَمِعَـتْ رَسُولَ اللهِ ﷑ يَقُولُ: (مَا مِنْ عَبدٍ مُسْلِمٍ يُصَلِّي لِلهِ كُلَّ يَوْمٍ ثِنْتَيْ عَشَرَةَ رَكَعَةٍ تَطَوُّعًا غَيْرِ الْفَرِيْضَةِ، إِلاَّ بَنَى اللهُ لَهُ بَيْتًا فِي الـْجَنَّةِ).

ఉమ్మె హబీబ రజియల్లాహు అన్హా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా విని ఉల్లేఖించారుః “ఏ ముస్లిం భక్తుడు అల్లాహ్ కొరకు ప్రతి రోజూ పన్నెండు రకాతుల నఫిల్ నమాజు చేస్తాడో అల్లాహ్ అతని కొరకు స్వర్గంలో ఒక ఇల్లు నిర్మిస్తాడు. (ముస్లిం: 728).

అవిః జొహ్ర్ కు ముందు 4, దాని తరువాత 2, మగ్రిబ్ తరువాత 2, ఇషా తరువాత 2 మరియు ఫజ్ర్ కు ముందు 2.

22- చాష్త్ నమాజ్

صلاة الضحى: عَنْ أَبِي ذَرٍّ t  عَنِ النَّبِيِّ ﷑ أَنَّهُ قَالَ: (يُصْبِحُ عَلَى كُلِّ سُلَامَى مِنْ أَحَدِكُمْ صَدَقَةٌ فَكُلُّ تَسْبِيحَةٍ صَدَقَةٌ وَكُلُّ تَحْمِيدَةٍ صَدَقَةٌ وَكُلُّ تَهْلِيلَةٍ صَدَقَةٌ وَكُلُّ تَكْبِيرَةٍ صَدَقَةٌ وَأَمْرٌ بِالْـمَعْرُوفِ صَدَقَةٌ وَنَهْيٌ عَنِ الْـمُنْكَرِ صَدَقَةٌ وَيُجْزِئُ مِنْ ذَلِكَ رَكْعَتَانِ يَرْكَعُهُمَا مِنْ الضُّحَى).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని అబూ జర్ర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “మీలో ఉన్న ప్రతి అవయవానికి బదులుగా ఒక సదఖా చేయడం మీపై విధిగా ఉంది. అయితే ఒకసారి సుబ్ హానల్లాహ్ అని పలకడం ఒక సదఖా. ఒకసారి అల్ హందులిల్లాహ్ అనడం ఒక సదఖా. ఒకసారి లా ఇలాహ ఇల్లల్లాహ్ అని స్మరించడం కూడా సదఖా. ఒకసారి అల్లాహు అక్బర్ అనడమూ సదఖాయే. మంచిని ఆదేశించడం ఒక సదఖా. చెడు నుండి వారించడం ఒక సదఖా. అయితే రెండు రకాతుల చాష్త్ నమాజు వీటన్నిటికి సరిపోతుంది”. (ముస్లిం 720).

* దీని ఉత్తమ సమయం: పొద్దెక్కి, ఎండ తాపం పెరిగిన తరువాత నుండి జొహ్ర్ సమయానికి ముందు వరకు. కనీసం రెండు రకాతులు. ఎక్కువ చేయుటకు హద్దు లేదు.

23- తహజ్జుద్ నమాజ్

قيام الليل: عَن أبِي هُرَيرَةَ t أَنَّ رَسُولَ الله ﷑ سُئِلَ : أَيُّ الصَّلاَةِ أفْضَلُ بَعدَ الْـمَكْتُوبَةِ؟ فَقَالَ: (أفْضَلُ الصَّلاَةِ بَعدَ الصَّلاَةِ الْـمَكْتُوبَةِ، اَلصَّلاَةُ فِي جَوفِ اللَّيل).

అబూహురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం, ఫర్జ్ నమాజు తరువాత ఎక్కువ ఘనతగల నమాజు ఏది? అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను అడిగినప్పుడు “ఫర్జ్ నమాజు తరువాత ఎక్కువ ఘనతగల నమాజు అర్థ రాత్రి తరువాత చదివే తహజ్జుద్ నమాజు” అని బదులిచ్చారు. (ముస్లిం 1163).

24- విత్ర్ నమాజు

صلاة الوتر: عَنِ بنِ عُمَرَ ؆ أنَّ النَّبِيَّ قَالَ:(اِجْعَلُوا آخِرَ صَلاَتِكُمْ بِاللَّيلِ وِتْرًا).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశించారని ఇబ్ను ఉమర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖించారుః

మీరు రాత్రి యొక్క చివరి నమాజును విత్ర్ రూపంలో చేయండి“. (బుఖారీ 998. ముస్లిం 1755).

25- శుభ్రంగా ఉన్న చెప్పులతో నమాజు చేయవచ్చు

الصلاة في النعلين إذا تحققت طهارتهما: سُئلَ أنَسُ بنُ مَالِكٍ t: أَكَانَ النَّبِيُّ ﷑ يُصَلِّي فِي نَعْلَيهِ؟  قَالَ: (نَعم).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పులు వేసుకొని నమాజు చేసేవారా? అని అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) ని ప్రశ్నించినప్పుడు ‘అవును’ అని ఆయన జవాబిచ్చారు. (బుఖారీ 386).

26- మస్జిదె ఖుబాలో నమాజు

الصـلاة في مسجد قباء: عَنِ بنِ عُمَرَ t قَالَ: (كَانَ النَّبِيُّ ﷑ يَأتِي مَسْجِدَ قُبَاءٍ رَاكِبًا وَمَاشِيًا) زَادَ ابنُ نُمَير: حدثنا عبيدالله، عن نافع: (فيصلي فيه ركعتين).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక్కోసారి కాలినడకన, మరోసారి వాహనం మీద ఖుబా మస్జిద్ కు వస్తుండేవారు, అని ఇబ్ను ఉమర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అందులో రెండు రకాతుల నమాజు కూడా చేసేవారు అని ఈ హదీసు ఉల్లేఖన కర్త నాఫె చెప్పారుః. (బుఖారీ 1194. ముస్లిం 1399).

27- నఫిల్ నమాజు ఇంట్లో చేయాలి

أداء صلاة النافلة في البيت: عَنْ جَابِرٍ t قَالَ: قَالَ رَسُولُ الله ﷑: (إِذَا قَضَى أَحَدُكُمْ الصَّلَاةَ فِي مَسْجِدِهِ فَلْيَجْعَلْ لِبَيْتِهِ نَصِيبًا مِنْ صَلَاتِهِ فَإِنَّ اللهَ جَاعِلٌ فِي بَيْتِهِ مِنْ صَلَاتِهِ خَيْرًا).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారని జాబిర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “మీలో ఒకరు ఫర్జ్ నమాజు మస్జిద్ లో పూర్తి చేసి, తన నమాజు యొక్క కొంత భాగం తన ఇంట్లో చేయాలి. అందువల్ల అల్లాహ్ అతని ఇంట్లో మేలే చేకూర్చుతాడు”. (ముస్లిం 778).

28- ఇస్తిఖారా నమాజ్

صلاة الاستخارة: عَنْ جَابِرِ بنِ عَبدِاللهِ ﷜ قَالَ: (كَانَ رَسُولُ اللهِ ﷑ يُعَلِّمُنَا الاِسْتِخَارَةَ فِي الأُمُورِ كَمَا يُعَلِّمُنَا السُّورَةَ مِنَ الْقُرْآن). ((اللَّهُمَّ إِنِّي أَسْتَخِيرُكَ بِعِلْمِكَ، وَأَسْتَقْدِرُكَ بِقُدْرَتِكَ، وَأَسْأَلُكَ مِنْ فَضْلِكَ الْعَظِيمِ، فَإِنَّكَ تَقْدِرُ وَلَا أَقْدِرُ، وَتَعْلَمُ وَلَا أَعْلَمُ، وَأَنْتَ عَلَّامُ الْغُيُوبِ، اللَّهُمَّ إِنْ كُنْتَ تَعْلَمُ أَنَّ هَذَا الْأَمْرَ خَيْرٌ لِي فِي دِينِي وَمَعَاشِي وَعَاقِبَةِ أَمْرِي، فَاقْدُرْهُ لِي، وَيَسِّرْهُ لِي ، ثُمَّ بَارِكْ لِي فِيهِ، وَإِنْ كُنْتَ تَعْلَمُ أَنَّ هَذَا الْأَمْرَ شَرٌّ لِي فِي دِينِي وَمَعَاشِي وَعَاقِبَةِ أَمْرِي فَاصْرِفْهُ عَنِّي وَاصْرِفْنِي عَنْهُ وَاقْدُرْ لِي الْـخَيْرَ حَيْثُ كَانَ ثُمَّ أَرْضِنِي بِهِ )).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మాకు ఖుర్ఆను సూరాలు నేర్పినట్లు ప్రతి పనిలో ఇస్తిఖారా చేయడాన్ని గురించి బోధించేవారని జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. (బుఖారీ 1162).

* దాని విధానం: రెండు రకాతుల నమాజు చేసి, తరువాత ఇలా దుఆ చేయాలి. అల్లాహుమ్మ ఇన్నీ అస్తఖీరుక బిఇల్మిక, వ అస్తఖ్దిరుక బిఖుద్రతిక, వ అస్అలుక మిన్ ఫజ్లికల్ అజీం, ఫఇన్నక తఖ్ దిరు వలా అఖ్ దిరు, వ తఅలము వలా అఅలము, వ అంత అల్లాముల్ గుయూబ్, అల్లాహుమ్మ ఇన్ కుంత తఅలము అన్న హాజల్ అమ్ర(2) ఖైరున్ లీ ఫీ దీనీ, వ మఆషీ, వ ఆఖిబతి అమ్రీ, ఫఖ్ దుర్ హులీ, వయస్సిర్ హులీ, సుమ్మ బారిక్ లీ ఫీహి, వ ఇన్ కుంత తఅలము అన్న హాజల్ అమ్ర([2]) షర్రున్ లీ ఫీ దీనీ, వ మఆషీ, వఆఖిబతి అమ్రీ, ఫస్రిఫ్ హు అన్నీ, వస్రిఫ్ నీ అన్హు, వఖ్ దుర్ లియల్ ఖైర హైసు కాన సుమ్మ అర్ జినీ బిహీ).

ఈ దుఆ యొక్క భావం:  ఓ అల్లాహ్! నీ జ్ఞానం సాక్షిగా నేను శ్రేయస్సును అర్థిస్తున్నాను. నీ శక్తి పేరిట నేను నీ మహత్తర కటాక్షాన్ని అభ్యర్థిస్తు- న్నాను. నీవే సర్వశక్తిమంతుడివి, నాకు రవ్వంత కూడా శక్తి లేదు. నీవు సర్వజ్ఞుడివి. నేను జ్ఞానం లేనివాణ్ణి. అగోచరమైన విషయాలన్నీ నీకే బాగా తెలుసు. అల్లాహ్! నీ దృష్టిలో ఈ పని నా ఇహపరాల రీత్యా, పరిణామాల రీత్యా నాకు శ్రేయస్కరమైనదయితే దానిని నాకు ప్రాప్తం చెయ్యి. దానిని నాకు శుభకరమైనదిగా చెయ్యి. ఒకవేళ నీ దృష్టిలో ఈ పని నా ఇహపరాల రీత్యా, పరిణామ ఫలం రీత్యా నా పాలిట చెడుదైతే, ఆ పని నుండి నన్ను దూరంగా ఉంచు, దాని నుండి నన్ను కాపాడు. నా శ్రేయోశుభాలు ఎందులో ఉన్నాయో దానిని నాకు ప్రాప్తం చెయ్యి. తరువాత దాని మీద నాకు మక్కువ, ఏకాగ్రతలు కూడా కలిగించు.

29- ఫజ్ర్ నమాజు తరువాత నమాజు చేసుకున్న స్థలంలో సూర్యోదయం వరకు కూర్చోవటం

الجلوس في المصلى بعد صلاة الفجر حتى تطلع الشمس: عَنْ جَابِرِ بنِ سَمُرَةَ t: ( أَنَّ النَّبِيَّ ﷑ كَانَ إِذَا صَلَّى الْفَجْرَ جَلَسَ فِي مُصَلاَّهُ حَتَّى تَطلُعَ الشَّمسُ حَسَنًا).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఫజ్ర్ నమాజు చేసుకొని అదే స్థలంలో స్పష్టంగా సూర్యోదయం అయ్యే వరకు కూర్చునేవారని జాబిర్ బిన్ సముర రజియల్లాహు అన్హు తెలిపారు. (ముస్లిం 670).

30- జుమా రోజు స్నానం చేయటం

الاغتسال يوم الجمعة : عَن ابنِ عُمَرَ ؆ قَالَ: قَالَ رَسُولُ الله ﷑: (إِذَا جَاءَ أحَدُكُمُ الْـجُمُعَةَ فَلْيَغْتَسِلْ).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారని ఇబ్ను ఉమర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖించారుః “మీలో ఎవరైనా జుమా నమాజుకు వచ్చినప్పుడు స్నానం చేయాలి”. (బుఖారీ 877. ముస్లిం 845).

31- శీఘ్రముగా జుమా నమాజు కొరకు వెళ్ళటం

التبكير إلى صلاة الجمعة: عَنْ أَبِي هُرَيرَةَ t قَالَ: قَالَ رَسُولُ الله ﷑: (إِذَا كَانَ يَوْمُ الْـجُمُعَةِ وَقَفَتِ الْـمَلَائِكَةُ عَلَى بَابِ الْـمَسْجِدِ يَكْتُبُونَ الْأَوَّلَ فَالْأَوَّلَ وَمَثَلُ الْـمُهَجِّرِ كَمَثَلِ الَّذِي يُهْدِي بَدَنَةً ثُمَّ كَالَّذِي يُهْدِي بَقَرَةً ثُمَّ كَبْشًا ثُمَّ دَجَاجَةً ثُمَّ بَيْضَةً فَإِذَا خَرَجَ الْإِمَامُ طَوَوْا صُحُفَهُمْ وَيَسْتَمِعُونَ الذِّكْرَ).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని అబూహురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “జుమా రోజు దైవ దూతలు మస్జిద్ యొక్క ద్వారంపై నిలబడి ఉంటారు. ఎవరు ఎంత ముందు వస్తారో వారి పేరు అంత ముందు వ్రాసుకుంటారు. అందరికంటే ముందు వచ్చిన వ్యక్తికి లభించే పుణ్యం ఒక ఒంటెను ఖుర్బానీ ఇచ్చిన వ్యక్తిని పోలినది. ఆ తరువాత గడియలో వచ్చేవారికి ఒక ఆవు ఖుర్బానీ ఇచ్చినంత, ఆ తరువాత వారికి ఒక పొట్టేలు ఖుర్బానీ ఇచ్చినంత, ఆ తర్వాత వారికి కోడి, ఆ తర్వాత వారికి గ్రుడ్డు అల్లాహ్ మార్గంలో సదఖా చేసినంత పుణ్యం లభిస్తుంది. ఇమాం మెంబర్ పై వచ్చాక దైవదూతలు తమ రిజిస్టర్లను చుట్టుకొని, ఖుత్బా వింటారు. (అంటే ఆ తరువాత వచ్చేవారు ఆ దైవదూతల రిజస్టర్లో లిఖించబడరు). (బుఖారీ 929. ముస్లిం 850).

32- జుమా రోజు దుఆ అంగీకార గడియ అన్వేషణ

تحري ساعة الإجابة يوم الجمعة: عَن أَبِي هُرَيرَةَ t أَنَّ رَسُولَ الله ﷑ ذَكَرَ يَوْمَ الْـجُمُعَةِ فَقَالَ: (فِيهِ سَاعَةٌ لَا يُوَافِقُهَا عَبْدٌ مُسْلِمٌ وَهُوَ قَائِمٌ يُصَلِّي يَسْأَلُ اللهَ تَعَالَى شَيْئًا إِلَّا أَعْطَاهُ إِيَّاهُ) وَأَشَارَ بِيَدِهِ يُقَلِّلُهَا.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జుమా రోజు గురించి ప్రస్తావించి ఇలా చెప్పారని అబూహురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “ఆ రోజు ఓ ప్రత్యేక శుభ గడియ ఉంది. ఆ గడియలో ఎవరైనా ముస్లిం నమాజు స్థితిలో అల్లాహ్ ను ఏదైనా వేడుకుంటే అల్లాహ్ అతని కోరికను తప్పకుండా తీర్చుతాడు”. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ సంగతి చెబుతూ “ఆ గడియ అతి స్వల్పంగా ఉంటుంది” అని చేత్తో సైగ చేశారు. (బుఖారీ 935. ముస్లిం 852).

33- పండుగ నమాజు కొరకు ఒక దారి నుండి వెళ్ళి మరో దారి నుండి తిరిగి రావటం

الذهاب إلى مصلى العيد من طريق، والعودة من طريق آخر: عَنْ جَابِرٍ t قال: (كَانَ النَّبِيُّ ﷑ إِذَا كَانَ يَومُ عِيدٍ خَالَفَ الطَّرِيقَ).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పండుగ రోజు దారి మార్చి పండుగకు (ఈద్గాహ్ కు) వచ్చిపోయేవారని జాబిర్ రజియల్లాహు అన్హు తెలిపారు. (బుఖారీ 986).

34- జనాజా నమాజ్

الصلاة على الجنازة: عَنْ أَبِي هُرَيرَةَ t قَالَ: قَالَ رَسُولُ الله ﷑: (مَنْ شَهِدَ الْـجَنَازَةَ حَتَّى يُصَلَّى عَلَيهَا فَلَهُ قِيرَاطٌ ، وَمَنْ شَهِدَهَا حَتَّى تُدْفَنَ فَلَهُ قِيرَاطَانِ) قِيلَ: وَمَا الْقِيرَاطَانِ؟  قَالَ: (مَثَلُ الْـجَبَلَيْنِ الْعَظِيمَين).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారని అబూహురైరా రజి- యల్లాహు అన్హు ఉల్లేఖించారుః “ఎవరైతే జనాజా వెంట వెళ్తాడో, జనాజా నమాజ్ పూర్తి అయ్యే వరకు ఉంటాడో అతనికి ఒక ‘ఖీరాత్’కు సమానంగా పుణ్యఫలం లభిస్తుంది. మరెవరయితే ఖననం చేసే వరకూ ఉంటాడో అతనికి రెండు ‘ఖీరాత్’ల పుణ్యం లభిస్తుంది”. రెండు ‘ఖీరాత్’లంటే ఎంత? అని ప్రశ్నించగా “అవి రెండు పెద్ద కొండలకు సమానమ”ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధానమిచ్చారు. (బుఖారీ 1325. ముస్లిం 945).

35- సమాధుల సందర్శన

زيارة المقابر: عَنْ بُرَيدَةَ t قَالَ: قَالَ رَسُولُ الله ﷑: (كُنتُ نَهَيتُكُمْ عَنْ زِيَارَةِ الْقُبُورِ فَزُورُوهَا … ).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారని, బురైద రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “నేను మిమ్మల్ని సమాధుల సందర్శన నుండి నివారించి యుంటిని, కాని ఇక మీరు వాటి దర్శనానికి వెళ్ళండి….”. (ముస్లిం 977).

* గమనార్హం: శ్మశానవాటిక దర్శనం స్త్రీలకు నిషిద్ధం. ఇదే ఫత్వా ఇచ్చారు షేఖ్ బిన్ బాజ్ మరియు ధర్మవేత్తల ఒక పెద్ద సంఖ్య.

[C] ఉపవాస (రోజా) ధర్మములు

36- సహరీ భుజించడం

السحور: عَنْ أَنَسٍ t قَالَ : قَالَ رَسُولُ اللهِ ﷑: (تَسَحَّرُوا ؛ فَإِنَّ فِي السُّحُورِ بَرَكَة).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని అనస్ రజియల్లా- హు అన్హు ఉల్లేఖించారుః “సహరీ భుజించండి (ఫజ్ర్ కంటే ముందు రోజా ఉద్దేశంతో తినండి). నిశ్చయంగా సహరీ భుజించడంలో శుభం ఉంది”. (బుఖారీ 1923. ముస్లిం 1095).

37- సూర్యాస్తమయం అయిన వెంటనే త్వరగా ఇఫ్తార్ చేయాలి

تعجيل الفطر ، وذلك إذا تحقق غروب الشمس: عَنْ سَهلِ بنِ سَعدٍ t قَالَ: قَالَ رَسُولُ الله ﷑: (لاَ يَزَالُ النَّاسُ بِخَيْرٍ مَا عَجَّلُوا الْفِطْرَ).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని సహల్ బిన్ సఅద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “ప్రజలు ఇఫ్తార్ (ఉపవాస విరమణ) కొరకు త్వరపడినంత కాలం మంచికి కట్టుబడి ఉంటారు”. (బుఖారీ 1957. ముస్లిం 1098).

38- తరావీహ్ నమాజ్

قيام رمضان: عَنْ أَبِي هُرَيرَةَ t أَنَّ رَسُولَ الله ﷑ قَالَ: (مَنْ قَامَ رَمَضَانَ إيمانًا وَاحْتِسَابًا غُفِرَ لَهُ مَا تَقَدَّمَ مِن ذَنْبِهِ).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా శుభవార్త ఇచ్చారని, అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “రమజాన్ నెలలో ఎవరు ధృడ విశ్వాసంతో, పుణ్యఫలాపేక్షతో రాత్రిళ్ళు తరావీహ్ నమాజు చేస్తారో వారి గత పాపాలన్నీ క్షమించబడ- తాయి”. (బుఖారీ 36, 2014. ముస్లిం 759).

39- రమజానులో ఏతికాఫ్. ప్రత్యేకంగా దాని చివరి దశలో

الاعتكاف في رمضان ، وخاصة في العشر الأواخر منه: عَنِ ابنِ عُمَرَ ؆ قَالَ: (كَانَ رَسُولُ الله ﷑ يَعْتَكِفُ الْعَشْرَ الآوَاخِرَ مِنْ رَمَضَانَ).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రమజాను చివరి దశకంలో ఏతికాఫ్ చేసేవారని ఇబ్ను ఉమర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖించారు. (బుఖారీ 2025. ముస్లిం 1171).

40- షవ్వాల్ యొక్క ఆరు ఉపవాసాలు

صوم ستة أيام من شوال: عَنْ أَبِي أَيُّوبَ الأنصَارِي t أَنَّ رَسُولَ الله ﷑ قَالَ: (مَنْ صَامَ رَمَضَانَ، ثُمَّ أَتْبَعَهُ سِتًا مِنْ شَوَّالَ، كَانَ كَصِيَامِ الدَّهرِ).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఆదేశించారని అబూ అయ్యూబ్ అన్సారీ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “ఎవరైనా రమజాన్ ఉపవాసాలు పాటించి, ఆ తరువాత షవ్వాల్ నెలలో కూడా 6 ఉపవాసాలు పాటిస్తే, ఒక సంవత్సర పొడవూ ఉపవాసం ఉన్నంత పుణ్యం లభిస్తుంది”. (ముస్లిం 1164).

41- ప్రతి నెలలో మూడు రోజుల ఉపవాసాలు

صوم ثلاثة أيام من كل شهر: عَنْ أَبِي هُرَيرَةَ t قَالَ: (أَوْصَانِي خَلِيلِي بِثَلَاثٍ لَا أَدَعُهُنَّ حَتَّى أَمُوتَ صَوْمِ ثَلَاثَةِ أَيَّامٍ مِنْ كُلِّ شَهْرٍ وَصَلَاةِ الضُّحَى وَنَوْمٍ عَلَى وِتْرٍ).

అబూహురైరా రజియల్లాహు అన్హు చెప్పారుః ‘నా ప్రాణ స్నేహితులైన దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నాకు మూడు విషయాలను గురించి హితబోధ చేశారు. నేను వాటిని నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకూ వదలి పెట్టను. ఆ మూడు విషయాలు ఇవిః (1) ప్రతి నెల మూడు రోజులు ఉపవాసాలు పాటించడం. (2) చాష్త్ నమాజ్ చేయడం. (3) విత్ర్ నమాజు చేసి నిద్రపోవడం. (బుఖారీ 1178. ముస్లిం 721).

42- అరఫా దినాన ఉపవాసం

صوم يوم عرفة: عَن أَبِي قَتَادَةَ t أَنَّ رَسُولَ الله ﷑ قَالَ: (صِيَامُ يَومِ عَرَفةَ، أَحْتَسِبُ عَلَى اللهِ أن يُكَفِّرَ السَّنَةَ الَّتِي قَبْلَه، وَالسَّنَةَ الَّتِي بَعْدَه).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బోధించారని అబూ ఖతాద రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “అరఫా దినాన ఉపవాసం వల్ల, గడచిన సంవత్సరం పాపాలనూ, రాబోయే సంవత్సరం పాపాలనూ అల్లాహ్ మన్నిస్తాడని నాకు నమ్మకం ఉంది”. (ముస్లిం 1162).

43- ఆషూరా దినపు ఉపవాసం

صوم يوم عاشوراء: عَنْ أَبِي قَتَادَةَ t قَالَ: قَالَ رَسُولُ الله ﷑: (صِيَامُ يَومِ عَاشُورَاء ، أَحْتَسِبُ عَلَى اللهِ أَن يُكَفِّرَ السَّنَةَ الَّتِي قَبْلَهُ).

అబూ ఖతాద రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారుః “ఆషూరా దినపు ఉపవాసం వలన అల్లాహ్ గడిచిన ఒక సంవత్సరపు పాపాలను దూరం చేస్తాడని నాకు నమ్మకం ఉంది”. (ముస్లిం 1162).

[D] ప్రయాణపు నియమాలు

44- ప్రయాణంలో నాయకుని ఎన్నిక

اختيار أمير في السفر: عَن أبي سَعِيدٍ ، وَأبي هُرَيرَةَ ؆ قَالاَ: قَالَ رَسُولُ الله ﷑: (إِذَا خَرَجَ ثَلاَثَةٌ فِي سَفَرٍ فَلْيُؤَمِّرُوا أَحَدَهُم).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని అబూ సఈద్ రజియల్లాహు అన్హు మరియు అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “ఎవరైనా ముగ్గురు మనుషులు కలసి ప్రయాణానికి వెళ్తే వారు తమలో ఒకరిని నాయకునిగా ఎన్నుకోవాలి”. (అబూదావూద్ 2608).

45- ఎత్తు ఎక్కుతూ అల్లాహు అక్బర్, పల్లంలో దిగుతూ సుబ్ హానల్లాహ్ పలకడం

التكبير عند الصعود والتسبيح عند النزول: عَنْ جَابِرٍ t قَالَ: (كُنَّا إِذَا صَعِدْنَا كَبَّرْنَا ، وَإِذَا نَزَلْنَا سَبَّحْنَا).

మేము ఎత్తు ప్రదేశంలో ఎక్కెటప్పుడు అల్లాహు అక్బర్ అని, ఎత్తు నుండి దిగేటప్పుడు సుబ్ హానల్లాహ్ అని అనేవారమని జాబిర్ రజియల్లాహు అన్హు తెలిపారు. (బుఖారీ 2994).

46- మజిలీ వచ్చినప్పుడు చదవవలసిన దుఆ

الدعاء حين نزول منزل: عَنْ خَولَةَ بِنتِ حَكِيمٍ ؅ قَالَتْ: سَمِعْتُ رَسُولَ الله ﷑ يَقُولُ: (مَنْ نَزَلَ مَنْزِلًا ثُمَّ قَالَ: أَعُوذُ بِكَلِمَاتِ الله التَّامَّاتِ مِنْ شَرِّ مَا خَلَقَ لَمْ يَضُرَّهُ شَيْءٌ حَتَّى يَرْتَحِلَ مِنْ مَنْزِلِهِ ذَلِكَ ).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా తాను విన్నానని ఖౌలా బిన్తె హకీం రజియల్లాహు అన్హా ఉల్లేఖించారుః “ఎవరైనా ప్రయాణం చేస్తూ ఏదైనా ప్రాంతంలో మజిలీ చేసినప్పుడు ఈ దుఆ చదివితే వారు అక్కడి నుండి బయలుదేరే వరకూ వారికి ఏ హానీ కలగదుః అఊజు బికలిమాతిల్లా హిత్తామ్మాతి మిన్ షర్రి మా ఖలఖ్. (నేను అయన సృష్టి కీడు నుండి అల్లాహ్ యొక్క సంపూర్ణ వచనాల శరణు కోరుతున్నాను). (ముస్లిం 2708).

47- ప్రయాణం నుండి వచ్చీరాగానే మస్జిద్ కు వెళ్ళడం

البدء بالمسجد إذا قدم من السفر: عَنْ كَعبِ

بنِ مَالِكٍ t قَالَ: (كَانَ النَّبِيُّ ﷑ إِذَا قَدِمَ مِنْ سَفَرٍ بَدَأَ بِالْـمَسْجِدِ فَصَلَّى فِيهِ).

కఅబ్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రయాణం నుండి తిరిగి రాగానే ముందు మస్జిద్ కు వెళ్ళి రెండు రకాతుల నమాజు చేసేవారు. (బుఖారీ 443. ముస్లిం 716).

[E] వస్త్రధారణ మరియు అన్నపానీయాల ధర్మాలు

48- క్రొత్త దుస్తులు ధరించినప్పుడు దుఆ

الدعاء عند لبس ثوب جديد: عَنْ أَبِي سَعِيدٍ الْخُدْرِيِّ t قَالَ: كَانَ رَسُولُ الله ﷑ إِذَا اسْتَجَدَّ ثَوْبًا سَمَّاهُ بِاسْمِهِ إِمَّا قَمِيصًا أَوْ عِمَامَةً ثُمَّ يَقُولُ: (اللَّهُمَّ لَكَ الْـحَمْدُ أَنْتَ كَسَوْتَنِيهِ أَسْأَلُكَ مِنْ خَيْرِهِ وَخَيْرِ مَا صُنِعَ لَهُ وَأَعُوذُ بِكَ مِنْ شَرِّهِ وَشَرِّ مَا صُنِعَ لَهُ).

అబూ సఈద్ ఖుద్రీ రజియల్లాహు అన్హు ఇలా చెప్పారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం క్రొత్త దుస్తులు ధరిస్తున్నప్పుడు దాని పేరు చెప్పేవారు. ఉదాః కమీజు, తలపాగా అని. తర్వాత ఈ దుఆ చదివేవారు:

అల్లాహుమ్మ లకల్ హందు, అంత కసౌతనీహి, అస్అలుక మిన్ ఖైరిహీ, వఖైరి మా సునిఅ లహూ, వ అఊజు బిక మిన్ షర్రిహీ, వ షర్రి మా సునిఅ లహూ. (అల్లాహ్! అన్ని విధాల స్తోత్రములు నీకే. నీవే ఈ దుస్తులు నాకు ధరింప- జేశావు. అందులోని మేలును, ఏ ఉద్దేశంతో చేయబడిందో ఆ మేలును నేను కాంక్షిస్తున్నాను. దాని కీడు నుండి మరియు ఏ కీడునుద్దేశించి చేయబడిందో దాని నుండి నేను నీ శరణు కోరుచున్నాను). (అబూదావూద్ 4020).

49- కుడి చెప్పు ముందు తొడగటం

لبس النعل باليمين: عَنْ أَبِي هُرَيْرَةَ t أَنَّ رَسُولَ اللهِ ﷑ قَالَ: (إِذَا انْتَعَلَ أَحَدُكُمْ فَلْيَبْدَأْ بِالْيُمْنَى وَإِذَا خَلَعَ فَلْيَبْدَأْ بِالشِّمَالِ وَلْيُنْعِلْهُمَا جَمِيعًا أَوْ لِيَخْلَعْهُمَا جَمِيعًا).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారని అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు:

“చెప్పులు తొడిగేటప్పుడు మొదట కుడి కాలికి తొడుక్కోవాలి. విడిచేటప్పుడు మొదట ఎడమ కాలి చెప్పు విడువాలి. మరియు తొడిగితే రెండు చెప్పులు తొడుక్కోవాలి. విడిస్తే రెండు చెప్పులు విడువాలి”. (బుఖారీ 5855. ముస్లిం 2097).

50- తినేటప్పుడు బిస్మిల్లాహ్ పఠించాలి

التسمية عند الأكل: عَن عُمَرَ بْنِ أَبِي سَلَمَةَ t قَالَ: كُنْتُ فِي حَجْرِ رَسُولِ اللهِ ﷑ وَكَانَتْ يَدِي تَطِيشُ فِي الصَّحْفَةِ فَقَالَ لِي: (يَا غُلَامُ سَمِّ اللهَ وَكُلْ بِيَمِينِكَ وَكُلْ مِمَّا يَلِيكَ).

ఉమర్ బిన్ అబూ సల్మా రజియల్లాహు అన్హు తెలిపారు: నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సంరక్షణలో పెరుగుతుండేవాణ్ణీ. అన్నం తినేటప్పుడు నా చేయి కంచెంలో అన్ని వైపులా కదలాడేది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఓసారి చూసి,

“ఓ అబ్బాయీ! (అన్నం తినేముందు) బిస్మిల్లాహ్ అని పఠించాలి. కుడి చేత్తో తినాలి. కంచంలో నీ ముందు భాగం నుండి తినాలి” అని ఉపదేశించారు. (బుఖారీ 5376. ముస్లిం 2022).

51- తిని త్రాగిన తర్వాత అల్ హందులిల్లాహ్ అనాలి

احمد الله بعد الأكل والشرب: عَنْ أَنَسِ بْنِ مَالِكٍ t قَالَ: قَالَ رَسُولُ اللهِ ﷑: (إِنَّ اللهَ لَيَرْضَى عَنْ الْعَبْدِ أَنْ يَأْكُلَ الْأَكْلَةَ فَيَحْمَدَهُ عَلَيْهَا أَوْ يَشْرَبَ الشَّرْبَةَ فَيَحْمَدَهُ عَلَيْهَا).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు:

“దాసుడు భోజనం చేసిన తర్వాత మరియు నీళ్ళు త్రాగిన తర్వాత అల్ హందు లిల్లాహ్ అని పఠించటాన్ని అల్లాహ్ మెచ్చుకుంటాడు”. (ముస్లిం 2734).

52- నీళ్ళు కూర్చొని త్రాగండి

الجلوس عند الشرب: عَنْ أَنَسٍ t عَنِ النَّبِيِّ ﷑ : (أَنَّهُ نَهَى أَن يَشْرَبَ الرَّجُلُ قَائِمًا).

మనిషి నిలబడి నీళ్ళు త్రాగటాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నివారించార“ని అనస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. (ముస్లిం 2024).

53- పాలు త్రాగి పుక్కిలించాలి

المضمضة من اللبن: عَنْ ابنِ عَبَّاٍس ؆ أَنَّ رَسُولَ الله ﷑ شَرِبَ لبنًا فَمَضْمَضَ، وَقَالَ: (إنَّ لَهُ دَسمًا).

ఇబ్ను అబ్బాస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం:

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పాలు త్రాగిన తరువాత నీటితో నోరు పుక్కిలించి “పాలు త్రాగడం వల్ల నోరు తైలయతమవుతుంది (అంచేత నీళ్ళతో పుక్కిలించి నోరు శుభ్రపరుచుకోవాలి)” అని అన్నారు. (బుఖారీ 211.  ముస్లిం 358).

54- అన్నంలో లోపాలు వెదకరాదు

عدم عيب الطعام: عَنْ أَبِي هُرَيرَةَ t قَالَ: (مَا عَابَ رَسُولُ اللهِ ﷑ طَعامًا قَطُّ، كَانَ إِذَا اشَتَهَاهُ أَكَلَهُ ، وَإِنْ كَرِهَهُ تَرَكَهُ).

అబూ హురైర రజియల్లాహు అన్హు చెప్పారుః

“ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎన్నడూ ఏ ఆహారంలో కూడా లోపం ఎత్తి చూపలేదు. ఆయనకు ఇష్టమయితే తినేవారు. ఇష్టం లేకపోతే మానేసేవారు“. (బుఖారీ 5409. ముస్లిం 2064).

55- మూడు వ్రేళ్ళతో తినటం

الأكل بثلاثة أصابع: عَنْ كَعبِ بنِ مَالِكٍ t قَالَ: (كَانَ رَسُولُ الله ﷑ يَأْكُلُ بِثَلاَثِ أَصَابِعَ ، وَيَلْعَقُ يَدَهُ قَبلَ أن يَمْسَحَهَا).

కఅబ్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు కథనం:

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మూడు వ్రేళ్ళతో తినేవారు. వాటిని నాకి శుభ్రపరిచేవారు“. (ముస్లిం 2032).

56- స్వస్థత పొందే ఉద్దేశంతో జమ్ జమ్ నీళ్ళు త్రాగటం

الشرب والاستشفاء من ماء زمزم: عَنْ أَبِي ذَرٍّ t قَالَ: قَالَ رَسُولُ الله ﷑ عَنْ مَاءِ زَمْزَمَ: (إِنَّهَا مُبَارَكَةٌ ، إِنَّهَا طَعَامُ طُعْمٍ). رواه مسلم و زاد الطيالسي: (وَشِفَاءُ سُقْمٍ).

అబూ జర్ర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జమ్ జమ్ నీళ్ళ విషయంలో ఇలా బోధించారు:

అది శుభమైన నీరు. అది ఆకలిగొన్నవారికి ఆహారపు పని జేస్తుంది. (ఇది ముస్లిం 2473 ఉల్లేఖనం, తయాలిసిలో అదనంగా ఈ పదాలున్నాయిః) మరియు అది రోగ నివారిణి కూడాను“.  

57- రమజాను పండుగరోజు ఈద్గాహ్ కు వెళ్ళే ముందు తినటం

الأكل يوم عيد الفطر قبل الذهاب للمصلى: عَنْ أَنَسِ بنِ مَالِكٍ t قَالَ: (كَانَ رَسُولُ الله ﷑ لاَ يَغْدُو يَومَ الْفِطْرِ حَتَّى يَأكُلَ تَمرَاتٍ) وفي رواية: (وَيَأْكُلُهُنَّ وِترًا).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రమజాను పండుగ రోజు ఖర్జూరపు పండ్లు తినే దాకా ఈద్గాహ్ వెళ్ళేవారు కాదు అని అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు తెలిపారు. మరో ఉల్లేఖనంలో ఉంది: “ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం బేసి సంఖ్యలో తినేవారు“. (బుఖారీ 953).

అల్లాహ్ స్మరణ & దుఆలు

58- అధికంగా ఖుర్ఆన్ పారాయణం చేయుట

الإكثار من قراءة القرآن: عَنْ أَبِي أُمَامَةَ الْبَاهِلِيِّ t قَالَ: سَمِعتُ رَسُولَ الله ﷑ يَقُولُ: (اقْرَءُوا الْقُرْآنَ فَإِنَّهُ يَأْتِي يَوْمَ الْقِيَامَةِ شَفِيعًا لِأَصْحَابِهِ).

నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా విన్నానని అబూ ఉమామ బాహ్లీ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు:

“ఖుర్ఆన్ పారాయణం చేయండి. నిశ్చయంగా అది ప్రళయదినాన తన్ను చదివినవారి కోసం సిఫారసు చేస్తుంది”. (ముస్లిం 804).

59- సుమధుర స్వరంతో ఖుర్ఆన్ పారాయణం

تحسين الصوت بقراءة القرآن: عَنْ أَبِي هُرَيْرَةَ t أَنَّهُ سَمِعَ النَّبِيَّ ﷑ يَقُولُ: (مَا أَذِنَ اللهُ لِشَيْءٍ مَا أَذِنَ لِنَبِيٍّ حَسَنِ الصَّوْتِ بِالْقُرْآنِ يَجْهَرُ بِهِ ).

అబూ హూరైరా రజియల్లాహు అన్హు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా విని ఉల్లేఖిస్తున్నారు:

“సుమధుర స్వరంతో ఖుర్ఆన్ పారాయణం చేసే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కంఠస్వరాన్ని అల్లాహ్ ఎంతో శ్రద్ధగా ఆలకిస్తాడు. ఆయన అంత శ్రద్ధగా మరే స్వరాన్నీ వినడు”. మంచి స్వరం అంటే (చక్కని ఉచ్ఛారణతో) బిగ్గరగా పారాయణం చేయడమని అర్థం. (బుఖారీ, 5024. ముస్లిం 792).

60- సర్వావస్థల్లో అల్లాహ్ స్మరణ

ذكر الله على كل حال: عَنْ عَائِشةَ ؅ قَالَتْ: (كَانَ رَسُولُ اللهِ ﷑ يَذْكُرُ اللهَ عَلَى كُلِّ أَحْيَانِهِ).

ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనం ప్రకారం: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్ని వేళల్లో అల్లాహ్ ను స్మరించేవారు. (ముస్లిం 373).

61- సుబ్ హానల్లాహ్ శ్రేష్ఠత

التسبيح: عَنْ جُوَيْرِيَةَ ؅ أَنَّ النَّبِيَّ ﷑ خَرَجَ مِنْ عِنْدِهَا بُكْرَةً حِينَ صَلَّى الصُّبْحَ وَهِيَ فِي مَسْجِدِهَا ثُمَّ رَجَعَ بَعْدَ أَنْ أَضْحَى وَهِيَ جَالِسَةٌ فَقَالَ: (مَا زِلْتِ عَلَى الْحَالِ الَّتِي فَارَقْتُكِ عَلَيْهَا) قَالَتْ: نَعَمْ قَالَ النَّبِيُّ ﷺ: (لَقَدْ قُلْتُ بَعْدَكِ أَرْبَعَ كَلِمَاتٍ ثَلَاثَ مَرَّاتٍ لَوْ وُزِنَتْ بِمَا قُلْتِ مُنْذُ الْيَوْمِ لَوَزَنَتْهُنَّ سُبْحَانَ اللَّهِ وَبِحَمْدِهِ عَدَدَ خَلْقِهِ

وَرِضَا نَفْسِهِ وَزِنَةَ عَرْشِهِ وَمِدَادَ كَلِمَاتِهِ).

జువైరియా రజియల్లాహు అన్హా ఉల్లేఖనం ప్రకారం: ఆమె నమాజు చేసిన స్థలంలోనే ఉండగా ఫజ్ర్ నమాజ్ చేయించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆమె వద్ద నుండి వెళ్ళారు. చాష్త్ సమయంలో తిరిగి వచ్చారు. అప్పటికి ఆమె అక్కడే కూర్చొని ఉండటం చూసి, “నేను ఇంతకు ముందు నిన్ను వదలిన స్థితిలోనే ఇప్పటి వరకున్నావా నీవు?” అని అడిగారు. ఆమె ‘అవును’ అని సమాధాన- మిచ్చింది. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు: “నీ దగ్గరి నుండి వెళ్ళి నేను నాలుగు పదాలు మూడు సార్లు పలికాను. వీటిని మరియు నీవు ఉదయం నుండి పలికిన పదాలను తూకం వేస్తే నేను పలికిన పదాలు బరువుగా తేలుతాయి. అవి: సుబ్ హానల్లాహి వబి హందిహి, అదద ఖల్ఖిహీ, వ రిజా నఫ్ సిహీ, వ జినత అర్షిహీ వ మిదాద కలిమాతిహీ”. [భావం: అల్లాహ్ సృష్టిరాసుల సంఖ్యలో, ఆయన స్వయంగా కోరిన పరిణామంలో, ఆయన అర్ష్ (సింహాసనం) విలువంత మరియు ఆయన వచనాల పరిణామంలో ఆయనకు పవిత్రతలు మరియు స్తోత్రాలు]. (ముస్లిం 2726).

62- తుమ్మినవారు అల్ హందులిల్లాహ్ అంటే దానికి బదులివ్వటం

تشميت العاطس: عَنْ أَبِي هُرَيرَةَ t عَنِ النَّبِيِّ ﷑ قَالَ: (إِذَا عَطَسَ أَحُدُكُم فَليَقُلْ: اَلْـحَمْدُ لله ، وَلْيَقُلْ لَهُ أَخُوهُ أَو صَاحِبُه : يَرْحَمُكَ الله. فَإِذَا قَالَ لَهُ: يَرْحَمُكَ اللهُ ، فَلْيَقُلْ: يَهْدِيكُمُ اللهُ ويُصْلِحُ بالكم).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “మీలో ఎవరైనా తుమ్మితే “అల్ హందులిల్లాహ్” అనాలి. అది విన్న అతని సోదరుడు లేక మిత్రుడు “యర్ హముకల్లాహ్” అనాలి. మళ్ళీ తుమ్మిన వ్యక్తి “యహ్ దీకుముల్లాహు వ యుస్లిహు బాలకుం” అనాలి. (బుఖారీ 6224).

63- రోగిని పరామర్శించి దుఆ చేయుట

الدعاء للمريض: عَنِ ابنِ عَبَّاسٍ ؆ أَنَّ رَسُولَ الله ﷑ دَخَلَ عَلَى رَجُلٍ يَعُودُهُ ، فَقَالَ ﷑: (لاَ بَأسَ طَهُورٌ،  إِنْ شَاءَ الله).

ఇబ్ను అబ్బాస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక రోగిని పరామర్శించడానికి వెళ్ళి ఇలా దుఆ చేశారుః “లా బాస తహూరున్ ఇన్షాఅల్లాహ్”. [చింతించకు, అల్లాహ్ తలిస్తే ఈ వ్యాధి నిన్ను (నీ పాపాల నుండి) ప్రక్షాళనం చేస్తుంది]. (బుఖారీ 5662).

64- నొప్పి ఉన్న చోట చేయి పెట్టి దుఆ చేయాలి

وضع اليد على موضع الألم، مع الدعاء: عَنْ عُثْمَانَ بْنِ أَبِي الْعَاصِ الثَّقَفِيِّ ﷜ أَنَّهُ شَكَا إِلَى رَسُولِ اللهِ ﷑ وَجَعًا يَجِدُهُ فِي جَسَدِهِ مُنْذُ أَسْلَمَ فَقَالَ لَهُ رَسُولُ الله ِ﷑: (ضَعْ يَدَكَ عَلَى الَّذِي تَأَلَّمَ مِنْ جَسَدِكَ وَقُلْ بِاسْمِ الله ثَلَاثًا وَقُلْ سَبْعَ مَرَّاتٍ أَعُوذُ بِالله وَقُدْرَتِهِ مِنْ شَرِّ مَا أَجِدُ وَأُحَاذِرُ).

ఉస్మాన్ బిన్ అబుల్ ఆస్ కథనం: అతను ఇస్లాం స్వీకరించినప్పటి నుండి తన శరీరంలోని ఓ భాగంలో నొప్పి వస్తుందని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్ద ఫిర్యాదు చేశాడు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించారుః

నీ శరీరంలో నొప్పి ఉన్న చోట చేయి పెట్టి మూడు సార్లు “బిస్మిల్లాహ్” అని, ఏడు సార్లు “అఊజు బిల్లాహి వ ఖుద్రతిహీ మిన్ షర్రి మా అజిదు వ ఉహాజిరు” చదువు. [నేను అల్లాహ్ మరియు అల్లాహ్ యొక్క శక్తిసామర్థ్యాల శరణులో వస్తున్నాను నాకు ఉన్న అవస్త మరియు నేను భయపడుతున్న దానితో]. (ముస్లిం 2202).

65- కోడి కూతను, గాడిద ఓండ్రను విన్నప్పుడు

الدعاء عند سماع صياح الديك ، والتعوذ عند سماع نهيق الحمار: عَنْ أَبِي هُرَيْرَةَ t أَنَّ النَّبِيَّ ﷑ قَالَ: (إِذَا سَمِعْتُمْ صِيَاحَ الدِّيَكَةِ فَاسْأَلُوا اللهَ مِنْ فَضْلِهِ فَإِنَّهَا رَأَتْ مَلَكًا وَإِذَا سَمِعْتُمْ نَهِيقَ الْحِمَارِ فَتَعَوَّذُوا بِاللهِ مِنَ الشَّيْطَانِ فَإِنَّهُ رَأَى شَيْطَانًا).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారని, అబూహురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు:

“మీరు కోడికూత విన్నప్పుడు “అల్లాహుమ్మ ఇన్నీ అస్అలు మిన్ ఫజ్లిక” అనండి. (ఓ అల్లాహ్! నేను నీ దయానుగ్రాహాన్ని కోరుతున్నాను). అది అప్పుడు దైవదూతను చూస్తుంది. గాడిద ఓండ్రను విన్నప్పుడు “అఊజు బిల్లాహి మినష్షైతా నిర్రజీం” చదవండి. (శాపగ్రస్తుడైన షైతాన్ బారి నుండి అల్లాహ్ శరణు గోరుతున్నాను). గాడిద షైతాన్ని చూసి ఓండ్ర పెడుతుంది”. (బుఖారీ 3303. ముస్లిం 2729).

66- వర్షం కురిసినప్పుడు దుఆ

الدعـاء عند نزول المطر: عَنْ عَـائِشَةَ ؅ أَنَّ رَسُولَ الله ﷑ كَانَ إِذَا رَأَى الْـمَطَرَ قَالَ: (اللَّهُمَّ صيبًا نافعًا).

ఆయిషా రజియల్లాహు అన్హా కథనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వర్షం కురుస్తున్నది చూసి, “అల్లాహుమ్మ సయ్యిబన్ నాఫిఅ” అనేవారు. (ఓ అల్లాహ్! మాకు లాభం చేకూర్చే వర్షం కుర్పించు). (బుఖారీ 1032).

67- ఇంట్లో ప్రవేశిస్తూ అల్లాహ్ ను స్మరించండి

ذكر الله عند دخول المنزل: عَنْ جَابِرِ بْنِ عَبْدِ الله ؆ أَنَّهُ سَمِعَ النَّبِيَّ ﷑ يَقُولُ: (إِذَا دَخَلَ الرَّجُلُ بَيْتَهُ فَذَكَرَ اللهَ عِنْدَ دُخُولِهِ وَعِنْدَ طَعَامِهِ قَالَ الشَّيْطَانُ لَا مَبِيتَ لَكُمْ وَلَا عَشَاءَ وَإِذَا دَخَلَ فَلَمْ يَذْكُرْ اللهَ عِنْدَ دُخُولِهِ قَالَ الشَّيْطَانُ أَدْرَكْتُمْ الْمَبِيتَ وَإِذَا لَمْ يَذْكُرْ اللهَ عِنْدَ طَعَامِهِ قَالَ أَدْرَكْتُمْ الْمَبِيتَ وَالْعَشَاءَ).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా తాను విన్నానని జాబిర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు:

“మనిషి తనింట్లో ప్రవేశిస్తూ మరియు భోజనంపై కూర్చుంటూ అల్లాహ్ ను స్మరిస్తే (ఆ సందర్భంలో చదవవలసిన ప్రవక్త నేర్పిన దుఆలు చదివితే), షైతాన్ (తన మిత్రులతో) అంటాడుః “ఇక్కడ మీరు నిద్రించడానికీ మరియు రాత్రి భోజనం చేయుటకు ఏ అవకాశమూ లేదు”. ఇక ఇంట్లో ప్రవేశించి- నప్పుడు అల్లాహ్ ను స్మరించకున్నట్లయితే షైతాన్ ఇలా అంటాడుః “మీరు నిద్రించడానికి స్థలం పొందారు”. భోజనం చేసేటప్పుడు అల్లాహ్ ను స్మరించకున్నట్లయితే అంటాడుః మీరు నిద్రించటానికి మరియు భోంచేయటానికి అవకాశం కలిగింది. (ముస్లిం 2018)

68- సమావేశాల్లో అల్లాహ్ యొక్క స్మరణ

ذكر الله في المجلس: عَنْ أَبِي هُرَيْرَةَ t عَنْ النَّبِيِّ ﷑ قَالَ: (مَا جَلَسَ قَوْمٌ مَجْلِسًا لَمْ يَذْكُرُوا اللهَ فِيهِ وَلَمْ يُصَلُّوا عَلَى نَبِيِّهِمْ إِلَّا كَانَ عَلَيْهِمْ تِرَةً (أي: حسرة) فَإِنْ شَاءَ عَذَّبَهُمْ وَإِنْ شَاءَ غَفَرَ لَـهُمْ).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారని, అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు:

“ప్రజలు ఏదైనా సమావేశంలో కూర్చొని, అల్లాహ్ ను స్మరించకుంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై  దరూద్ పంపకుంటే, ఆ సమావేశం, వారి అనుతాపానికే కారణమగును. అల్లాహ్ తలుచుకుంటే వారిని శిక్షించవచ్చు లేదా క్షమించనూ వచ్చు”. (తిర్మిజి 3380).

69- మరుగుదొడ్లో ప్రవేశిస్తూ దుఆ

الدعاء عند دخول الخلاء: عَنْ أَنَسِ بنِ مَالِكٍ t قَالَ: كَانَ النَّبِيُّ ﷑ إِذَا دَخَلَ (أي: أَرَادَ دُخُولَ) الْخَلاَءَ قَالَ: (اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنَ الْـخُبُثِ وَالْـخَبَائِثِ).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరుగుదొడ్లో ప్రవేశించాలనుకున్నపుడు “అల్లాహుమ్మ ఇన్నీ అఊజుబిక మినల్ ఖుబుసి వల్ ఖబాఇసి” అని పలికేవారని అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. [అల్లాహ్! దుష్ట జిన్నాతు స్త్రీ పురుషుల నుండి నీ శరణు కోరుచున్నాను]. (బుఖారీ 6322. ముస్లిం 375).

70- తీవ్రంగా వీచే గాలిని చూసి దుఆ

الدعاء عندما تعصف الريح: عَنْ عَائِشَةَ ؅ أَنَّهَا قَالَتْ كَانَ النَّبِيُّ ﷑ إِذَا عَصَفَتِ الرِّيحُ قَالَ: (اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ خَيْرَهَا وَخَيْرَ مَا فِيهَا وَخَيْرَ مَا أُرْسِلَتْ بِهِ وَأَعُوذُ بِكَ مِنْ شَرِّهَا وَشَرِّ مَا فِيهَا وَشَرِّ مَا أُرْسِلَتْ بِهِ).

ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖించారుః తీవ్రంగా వీచే గాలిని చూసినపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ దుఆ చదివేవారుః “అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక ఖైరహా వ ఖైర మా ఫీహా, వ ఖైర మా ఉర్సిలత్ బిహీ, వ అఊజు బిక మిన్ షర్రిహా వషర్రి మా ఫీహా, వషర్రి మా ఉర్సిలత్ బిహీ”. [అల్లాహ్! నేను దాని మేలును, దానిలోని మేలును, అది ఏ మేలుతో పంపబడిందో దాన్ని కోరుతున్నాను. దాని కీడు, దానిలోని కీడు మరియు అది ఏ కీడుతో పంపబడిందో దాని నుండి నీ శరణు కోరుతున్నాను]. (ముస్లిం 899).

71- ముస్లిం సోదరుని కోసం అతని పరోక్షంలో దుఆ చేయుట

الدعاء للمسلمين بظهر الغيب: عَنْ أَبِي الدَّرْدَاءِ t أَنَّهُ سَمِعَ رَسُولَ الله ﷑ يَقُولُ: (مَنْ دَعَا لِأَخِيهِ بِظَهْرِ الْغَيبِ، قَالَ المَلَكُ المُوَكَّلُ به: آمين ، ولك بمثل).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా విని ఉల్లేఖిస్తున్నారు అబూ దర్దా రజియల్లాహు అన్హు:

“ఎవరు తన సోదరుని కోసం అతని పరోక్షంలో దుఆ చేస్తాడో, అక్కడ ఒక దైవదూత నియమింపబడి ఉంటాడు, అతడు దానిపై ఆమీన్, నీకూ ఇలాంటి మేలే కలుగుగాక! అని దీవిస్తాడు”. (ముస్లిం 2732).

72- కష్టం వచ్చినపుడు ఈ దుఆ చదవాలి

الدعاء عند المصيبة: عَنْ أُمِّ سَلَمَةَ ؆ أَنَّهَا قَالَتْ سَمِعْتُ رَسُولَ الله ﷑ يَقُولُ: (مَا مِنْ مُسْلِمٍ تُصِيبُهُ مُصِيبَةٌ فَيَقُولُ مَا أَمَرَهُ اللهُ إِنَّا لِله وَإِنَّا إِلَيْهِ رَاجِعُونَ اللَّهُمَّ أْجُرْنِي فِي مُصِيبَتِي وَأَخْلِفْ لِي خَيْرًا مِنْهَا إِلَّا أَخْلَفَ اللهُ لَهُ خَيْرًا مِنْهَا).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా విన్నానని ఉమ్మె సల్మా రజియల్లాహు అన్హా ఉల్లేఖించారు:

“ఎవరైనా ముస్లింకు ఏదైనా ఆపద ఎదురైనప్పుడు అల్లాహ్ ఆదేశించినట్లు “ఇన్నా లిల్లాహి వఇన్నా ఇలైహి రాజిఊన్, అల్లాహుమ్మఅజుర్ నీ ఫీ ముసీబతీ వఅఖ్ లిఫ్ లీ ఖైరమ్ మిన్ హా” అని చదివితే అల్లాహ్ అతనికి మేలైనదాన్ని ప్రసాదిస్తాడు. (అనువాదం: మేమందరమూ అల్లాహ్ కు చెందినవారమే, మరియు మేము ఆయన వైపునకు తిరిగి పోవలసినవారము, ఓ అల్లాహ్! నా ఆపదకు బదులుగా ఉత్తమ ఫలితం ప్రసాదించు, దీనికంటే మేలైనది నాకు ప్రసాదించు). (ముస్లిం 918).

73- సలాంను వ్యాపింప జేయటం

إفشاء السلام: عَنِ البَراءِ بن عَازِبٍ t قَالَ: (أمَرنا النبي ﷑ بِسَبع ، وَنَهَانَا عَن سَبع: أُمِرْنَا بِعِيَادَةِ الْـمَرِيض، … وَإفشَاء السلام ،… الحديث).

బరా బిన్ ఆజిబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం:

“ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏడు విషయాల గురించి మాకు ఆదేశించారు, ఏడు విషయాలను నివారించారు. మాకు ఆదేశించినవాటిలో రోగులను పరామర్శించాలని మరియు సలాంను వ్యాప్తి చేయాలని ఉంది“. (బుఖారీ 5175. ముస్లిం 2066)

[G] వివిధ రకాల సున్నతులు

74- విద్యాభ్యాసం

طلب العلم: عَنْ أبي هُرَيرَةَ t قَالَ: قَالَ رَسُولُ الله ﷑: (مَنْ سَلَكَ طَرِيقًا يَلْتَمِسُ فِيهِ عِلْمًا سَهَّلَ الله لَهُ بِه طريقًا إلى الجنة).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని, అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు:

“విద్యాభ్యాసం కొరకు ఎవరైనా ఒక దారిన వెళ్తే అతని కొరకు అల్లాహ్ ఆ దారిని స్వర్గం వైపునకు సులభం చేస్తాడు”. (ముస్లిం 2646).

75- ఎవరింట్లోనైనా ప్రవేశించే ముందు మూడు సార్లు అనుమతి కోరటం

الاستئذان قبل الدخول ثلاثاً: عَنْ أَبِي مُوسَى الأشْعَرِيِّ t أَنَّ رَسُولَ الله ﷑ قَالَ: (الاستئذان ثلاثٌ، فإن أُذن لك، و إلا فَارْجِعْ).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని, అబూ మూసా అష్అరీ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు:

“మూడు సార్లు అనుమతి కోరాలి. మీకు అనుమతివ్వ బడితే సరి. లేనిచో తిరిగి వెళ్ళండి”. (బుఖారీ 6245. ముస్లిం 2153).

76- పిల్లవాడు పుట్టగానే ‘తహ్ నీక్’ చేయటం

تحنيك المولود: عَنْ أَبِي مُوسَى t قَالَ: (وُلِدَ لِي غُلَامٌ فَأَتَيْتُ بِهِ النَّبِيَّ ﷑ فَسَمَّاهُ إِبْرَاهِيمَ فَحَنَّكَهُ بِتَمْرَةٍ وَدَعَا لَهُ بِالْبَرَكَةِ … الحديث).

అబూ మూసా అష్అరీ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: “నాకొక పిల్లవాడు పుడితే నేనతడ్ని తీసుకొని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధికి వెళ్ళాను. ఆ పిల్లవాడికి ఆయన ఇబ్రాహీం అని పేరు పెట్టారు. ఖర్జూర పండు నమిలి అతని నోట్లో పెట్టారు”. (దీనినే ‘తహ్ నీక్’ అంటారు. ఇది ఖర్జూరపు పండుతో చేస్తే ఉత్తమం, కాని ఇది లేనప్పుడు మరే తీపి పదార్థంతోనయినా చేయవచ్చును). (బుఖారీ. 5467. ముస్లిం 2145).

77- అఖీఖా

العقيقة عن المولود: عَنْ عَائِشَةَ ؅ قَالَتْ: (أَمَرَنَا رَسُولُ الله ﷑ أَنْ نَعُقَّ عَنِ الْجَارِيَةِ شَاةٌ ، وَعَنِ الْغُلاَمِ شَاتَينِ).

ఆడ పిల్ల అయితే ఒక మేక, మగ పిల్లవాడైతే రెండు మేకలతో అఖీఖా చేయాలని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశించారని ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖించారు. (అహ్మద్ 25764).

78- వర్షం కురిసినపుడు శరీరం కొంత భాగం తడుపుకొనటం

كشف بعض البدن ليصيبه المطر: عَنْ أَنَسٍ t قَالَ: أَصَابَنَا وَنَحْنُ مَعَ رَسُولِ الله ﷑ مَطَرٌ قَالَ فَحَسَرَ رَسُولُ الله r ثَوْبَهُ حَتَّى أَصَابَهُ مِن المَطَرِ فَقُلْنَا: يَا رَسُولَ الله لِمَ صَنَعْتَ هَذَا قَالَ: (لِأَنَّهُ حَدِيثُ عَهْدٍ بِرَبِّهِ تَعَالَى).

అనస్ రజియల్లాహు అన్హు తెలిపారుః మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెంట ఉండగా వర్షం కురిసింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ శరీరంలో కొంత భాగం నుండి వస్త్రాన్ని ప్రక్కకు జరిపారు. ‘మీరిలా ఎందుకు చేశార’ని మేమడిగాము. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “అల్లాహ్ నుండి అవతరించిన ఈ సంవత్సరపు తొలి వర్షం ఇది” అని సమాధానం ఇచ్చారు. (ముస్లిం 898).

79- రోగిని పరామర్శించుట

عيادة المريض: عَنْ ثَوبَانَ مَولَى رَسولِ الله ﷑ عَن رَسُولِ الله ﷑  قَالَ: (مَنْ عَادَ مَرِيضًا ، لَـمْ يَزَلْ فِي خُرفَةِ الْـجَنَّة) قِيلَ : يَا رَسُولَ الله! وَمَا خُرفةُ الجنة؟ قَالَ: (جناها).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం సేవకుడైన సౌబాన్ రజియల్లాహు అన్హు ఉల్లేఖిస్తున్నారు:

ఎవరు రోగిని పరామర్శించ టానికి వెళ్తారో అతను (తిరిగి వచ్చే వరకు) స్వర్గపు తోటలో ఉంటాడు“. (ముస్లిం 2568).

80- చిరునవ్వు

التبسم: عَنْ أَبِي ذَرٍّ t قَالَ: قَالَ لِي النَّبِي ﷑: (لاَ تَحقِرَنَّ مِنَ الْـمَعْرُوفِ شَيئًا ، وَلَو أنْ تَلْقَى أَخَاكَ بِوَجْهٍ طَلِق).

ఏ చిన్న సత్కార్యాన్ని కూడా విలువలేనిదిగా భావించకు. అది నీ తోటి సోదరునితో చిరునవ్వుతో కలుసుకోవట మైనా సరే“నని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నన్ను ఉద్దేశించి చెప్పారని అబూ జర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః (ముస్లిం 2626).

81- అల్లాహ్ కొరకు పరస్పర దర్శనం

التزاور في الله: عَنْ أَبِي هُرَيْرَةَ t عَنْ النَّبِيِّ ﷑ قَالَ: (أَنَّ رَجُلًا زَارَ أَخًا لَهُ فِي قَرْيَةٍ أُخْرَى فَأَرْصَدَ اللهُ لَهُ عَلَى مَدْرَجَتِهِ مَلَكًا فَلَمَّا أَتَى عَلَيْهِ قَالَ أَيْنَ تُرِيدُ قَالَ أُرِيدُ أَخًا لِي فِي هَذِهِ الْقَرْيَةِ قَالَ هَلْ لَكَ عَلَيْهِ مِنْ نِعْمَةٍ تَرُبُّهَا قَالَ لَا غَيْرَ أَنِّي أَحْبَبْتُهُ فِي الله عَزَّ وَجَلَّ قَالَ فَإِنِّي رَسُولُ الله إِلَيْكَ بِأَنَّ اللهَ قَدْ أَحَبَّكَ كَمَا أَحْبَبْتَهُ فِيهِ).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారని అబూ హురైరా  రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు:

“ఒక వ్యక్తి తన సోదరున్ని దర్శించుటకు వేరే గ్రామానికి వెళ్ళాడు. ఆ దారిలో అల్లాహ్ ఒక దైవదూతను మాటు వేసి యుండుటకు పంపాడు. ఆ వ్యక్తి రాగానే దైవదూత “నీవు ఎటు వెళ్తున్నావు?” అని అడిగాడు. “ఆ గ్రామంలో నా ధార్మిక సోదరుడు ఒకడున్నాడు అతన్ని కలుసుకోవటానికి వెళ్తున్నాను” అన్నాడతను. “అతడు నీకు ఏదైనా మేలు చేశాడని, నీవు దాన్ని తీర్చడానికి వెళ్తున్నావా?” అని అడిగాడు దైవదూత. “అదేం కాదు. నేను అల్లాహ్ కొరకే అతన్ని ప్రేమించాను” అని ఆ మనిషి జవాబిచ్చాడు. దానికి ఆ దూత ఇలా చెప్పాడు: “నేను అల్లాహ్ యొక్క దూతను, అల్లాహ్ నన్ను ఈ శుభవార్తతో నీ వైపు పంపాడు. నీవు అతన్ని అల్లాహ్ కొరకే ప్రేమించినందుకు అల్లాహ్ నిన్ను ప్రేమించాడు”. (ముస్లిం 2567).

82- మనిషి తాను ప్రేమిస్తున్నది తన సోదరునికి తెలియ జేయాలి

إعلام الرجل أخاه أنه يحبه : عَنِ الْـمِقدامِ بنِ مَعدِي كَرب t أنَّ النَّبِيَّ ﷑ قَالَ: (إِذَا أَحَبَّ أَحَدُكُمْ أَخَاهُ ، فليُعْلِمه أنه يُحِبُّه).

మిఖ్దామ్ బిన్ మఅదీ కరబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారుః

మీలో ఎవరైనా (అల్లాహ్ కొరకు) తన సోదరుణ్ణి ప్రేమిస్తున్నప్పుడు ఆ విషయం అతనికి తెలియజేయాలి“. (అహ్మద్, తిర్మిజి 2392. అబూ దావూద్ 5124).

83- ఆవలింపును అపుట

رد التثاؤب: عَنْ أَبِي هُرَيْرَةَ t عَنْ النَّبِيِّ ﷑ قَالَ: (التَّثَاؤُبُ مِنْ الشَّيْطَانِ فَإِذَا تَثَاءَبَ أَحَدُكُمْ فَلْيَرُدَّهُ مَا اسْتَطَاعَ فَإِنَّ أَحَدَكُمْ إِذَا قَالَ هَا ضَحِكَ الشَّيْطَانُ).

“ఆవలింపు షైతాన్ తరఫున ఉంటుంది. అందుకే మీలో ఎవరైనా ఆవలించినపుడు సాధ్యమైనంత వరకు దాన్ని ఆపుకోవాలి. మీలో ఎవరైనా ఆవలిస్తూ ‘హా…’ అన్నపుడు షైతాన్ నవ్వుతాడు” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారని, అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. (బుఖారీ 3289. ముస్లిం 2994).

84- ప్రజల పట్ల మంచి అభిప్రాయం కలిగి ఉండాలి

إحسان الظن بالناس: عَنْ أَبِي هُرَيرَةَ t أنَّ رَسُولَ الله ﷑ قَالَ: (إِيَّاكُمْ وَالظَّنَّ، فَإنَّ الظَّنَّ أَكْذَبَ الْحَدِيثِ).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు:

లేనిపోని అనుమా నాలకు పోకండి. లేనిపోని అనుమానం అన్నింటికంటే పెద్ద అబద్ధం”. (బుఖారీ 6067. ముస్లిం 2563).

85- ఇంటి పనిలో ఇల్లాలికి సహకరించుట

معاونة الأهل في أعمال المنزل: عَنْ الْأَسْوَدِ قَالَ: سَأَلْتُ عَائِشَةَ ؅ مَا كَانَ النَّبِيُّ ﷑ يَصْنَعُ فِي بَيْتِهِ؟ قَالَتْ: (كَانَ يَكُونُ فِي مِهْنَةِ أَهْلِهِ تَعْنِي خِدْمَةَ أَهْلِهِ فَإِذَا حَضَرَتْ الصَّلَاةُ خَرَجَ إِلَى الصَّلَاةِ ).

అస్వద్ ఉల్లేఖనం ప్రకారం: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంట్లో ఏమి చేసేవారని, ఆయిషా రజియల్లాహు అన్హాని అడిగాను. దానికి ఆమె ఇలా సమాధానమిచ్చింది:

ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తమ ఇల్లాలికి (ఇంటి పనుల్లో) సహకరిస్తూ ఉండేవారు, నమాజు సమయం అయిన వెంటనే నమాజు కొరకు వెళ్ళేవారు“. (బుఖారీ 676).  

86- సహజ గుణాలు

سُنن الفطرة: عَنْ أَبِي هُرَيْرَةَ t عَنِ النَّبِيِّ ﷑ قَالَ: (الْفِطْرَةُ خَمْسٌ أَوْ خَمْسٌ مِنْ الْفِطْرَةِ الْخِتَانُ وَالِاسْتِحْدَادُ وَتَقْلِيمُ الْأَظْفَارِ وَنَتْفُ الْإِبِطِ وَقَصُّ الشَّارِبِ).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారని అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః

“ప్రకృతికి అనుగుణమైన అయిదు విషయాలు ఉన్నాయి. 1. ఖత్నా (వడుగు) చేయడం. 2. నాభి క్రింది వెంట్రుకలు తీసివేయడం. 3. చంకలోని వెంట్రుకలు తొలగించటం. 4. గోళ్ళు కత్తిరించడం. 5. మీసాలు కత్తిరించడం”. (బుఖారీ 5889, ముస్లిం 257).

87- అనాథ సంరక్షణ

كفالة اليتيم: عَنْ سَهلِ بنِ سَعدٍ t عَنِ النَّبِيِّ ﷑ قَالَ: (أَنَا وَكَافِلُ الْيَتِيمِ فِي الْجَنَّةِ هَكَذا). وَ قَالَ بِإِصْبَعَيهِ السَّبَّابَةِ وَالوُسطَى.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ శుభవార్త ఇచ్చారని  సహల్ బిన్ సఅద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు:

“నేను మరియు అనాథల సంరక్షకుడు స్వర్గంలో ఇలా ఉంటాము” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చూపుడు వ్రేలు మరియు మధ్య వ్రేలును కలిపి చూపించారు. (బుఖారీ 6005).

88- ఆగ్రహానికి దూరముండుట

تجنب الغضب: عَن أبي هريرة t أَنَّ رَجُلاً قَالَ لِلنَّبِيِّ ﷑: أَوصِنِي ، قَالَ: (لاَ تَغْضَبْ). فَرَدَّدَ مِرَارًا ، قَالَ: (لاَ تَغْضَبْ).

అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త మహనీయులు సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు ఒక వ్యక్తి వచ్చి, ఏదైనా బోధించండి అని అర్థించాడు. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “ఆగ్రహం చెందకు” అని ఉపదేశించారు. ఆ వ్యక్తి ఇదే ప్రశ్న మాటిమాటికి వేశాడు, దానికి ప్రవక్త కూడా “నీవు ఆగ్రహం చెందకు” అనే బోధించారు. (బుఖారీ 6116).

89- అల్లాహ్ భయంతో కన్నీరు కార్చుట

البكاء من خشية الله: عَنْ أَبِي هُرَيرَةَ t عَنِ النَّبِيِّ ﷑ قَالَ: (سَبْعَةٌ يُظِلُّهُمُ اللهُ فِي ظِلِّهِ ، يَومَ لاَ ظِلَّ إِلاَّ ظِلُّهُ … وَذَكَرَ مِنْهُمْ :  وَرَجُلٌ ذَكَرَ اللهَ خَالِيًا فَفَاضَتْ عَيْنَاهُ).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశించారని అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః

“అల్లాహ్ ఛాయ తప్ప మరెలాంటి ఛాయ లభించని (ప్రళయ)దినాన అల్లాహ్ ఏడు రకాల మనుషుల్ని తన నీడ పట్టున ఆశ్రయమిస్తాడు. అందులో ఒకడుః ఏకాంతంలో అల్లాహ్ ను తలుచుకొని కంట తడి పెట్టే వ్యక్తి”. (బుఖారీ 660. ముస్లిం 1031).

90- ఎడతెగని దానం

الصدقة الجارية: عَنْ أَبِي هُرَيْرَةَ t أَنَّ رَسُولَ الله ﷑ قَالَ: (إِذَا مَاتَ الْإِنْسَانُ انْقَطَعَ عَنْهُ عَمَلُهُ إِلَّا مِنْ ثَلَاثَةٍ إِلَّا مِنْ صَدَقَةٍ جَارِيَةٍ أَوْ عِلْمٍ يُنْتَفَعُ بِهِ أَوْ وَلَدٍ صَالِحٍ يَدْعُو لَهُ).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారని, అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః

మనిషి చనిపోయినపుడు అతని ఆచరణ అంతమయి పోతుంది. అయితే మూడు రకాల ఆచరణలు మటుకు అంతం కావు. (వాటి పుణ్య ఫలం మనిషికీ లభిస్తూనే ఉంటుంది). (1) సదకా జారియ. (2) ప్రజలకు ఉపయోగపడుతున్న జ్ఞానం. (3) అతనికోసం దుఆ చేసే ఉత్తమ సంతానం. (ముస్లిం 1631).

91- మస్జిద్ నిర్మాణం

بناء المساجد: عَنْ عُثْمَانَ بْنِ عَفَّانَ t يَقُولُ عِنْدَ قَوْلِ النَّاسِ فِيهِ حِينَ بَنَى مَسْجِدَ الرَّسُولِ ﷑ إِنَّكُمْ أَكْثَرْتُمْ وَإِنِّي سَمِعْتُ النَّبِيَّ ﷑ يَقُولُ: (مَنْ بَنَى مَسْجِدًا) قَالَ بُكَيْرٌ: حَسِبْتُ أَنَّهُ قَالَ: (يَبْتَغِي بِهِ وَجْهَ اللهِ بَنَى اللهُ لَهُ مِثْلَهُ فِي الْجَنَّةِ).

ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రజియల్లాహు అన్హు మస్జిదె నబవి (ప్రవక్త మస్జిదు)ని పునర్నిర్మించినపుడు ప్రజలు అతన్ని ఏవేవో మాటలు అన్నారు. ఉస్మాన్ రజియల్లాహు అన్హు ఆ మాటలు విని ఇలా అన్నారు. మీరు లేనిపోని మాటలు అంటున్నారు గాని నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా విన్నాను, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారుః “కేవలం అల్లాహ్ ప్రసన్నత కొరకు ఎవరైనా మస్జిదు నిర్మిస్తే అతని కోసం అల్లాహ్ అలాంటిదే ఒక ఇల్లు స్వర్గంలో నిర్మిస్తాడు“. (బుఖారీ 450. ముస్లిం 533).

92- క్రయవిక్రయాల్లో నెమ్మది

السماحة في البيع والشراء: عَنْ جَابِرِ بنِ عَبدِالله t أَنَّ رَسُولَ الله ﷑ قَالَ: (رَحِمَ اللهُ رَجُلاً سَمْحًا إذَا بَاعَ ، وَ إِذَا اشْتَرَى ، وَإذَا اقْتَضَى).

ప్రవక్త మహనీయులు సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారని జాబిర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు:

క్రయవిక్రయాల్లోనూ, అప్పు వసూలు చేసేటప్పుడునూ నెమ్మదిని, విశాలహృదయతనూ చూపే వ్యక్తిపై అల్లాహ్ కారుణ్యం కురుస్తుంది“. (బుఖారీ 2076).

93- బాధాకరమైన వస్తువును దారి నుండి తొలిగించటం

إزالة الأذى عن الطريق: عَنْ أَبِي هُرَيْرَةَ t أَنَّ رَسُولَ الله ﷑ قَالَ: (بَيْنَمَا رَجُلٌ يَمْشِي بِطَرِيقٍ وَجَدَ غُصْنَ شَوْكٍ عَلَى الطَّرِيقِ فَأَخَّرَهُ فَشَكَرَ اللهُ لَهُ فَغَفَرَ لَهُ).

అబూహురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు:

ఒక వ్యక్తి దారిన నడచిపోతుంటే దారిలో ఒక ముళ్ళ కంప పడి ఉండటం చూశాడు. అతను దాన్ని తీసి పక్కన పారేసి వెళ్ళిపోయాడు. అతను చేసిన ఈ పుణ్యకార్యాన్ని అల్లాహ్ స్వీకరించి అతడ్ని మన్నించాడు“. (బుఖారీ 654, ముస్లిం 1914).

94- సదకా

الصدقة : عَنْ أَبِي هُرَيْرَةَ t قَالَ: قَالَ رَسُولُ الله ﷑: (مَنْ تَصَدَّقَ بِعَدْلِ تَمْرَةٍ مِنْ كَسْبٍ طَيِّبٍ وَلَا يَقْبَلُ اللهُ إِلَّا الطَّيِّبَ وَإِنَّ اللهَ يَتَقَبَّلُهَا بِيَمِينِهِ ثُمَّ يُرَبِّيهَا لِصَاحِبِهِ كَمَا يُرَبِّي أَحَدُكُمْ فَلُوَّهُ حَتَّى تَكُونَ مِثْلَ الْجَبَلِ).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని, అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః

ఎవరైనా తన పవిత్ర సంపాదన నుండి ఒక ఖర్జూరపుటంత దానం చేస్తే -అల్లాహ్ పవిత్ర వస్తువును మాత్రమే స్వీకరిస్తాడు- అల్లాహ్ దాన్ని తన కుడిచేత్తో స్వీకరిస్తాడు. ఆ తర్వాత మీరు గుర్రపు పిల్లను పెంచి పెద్ద చేసినట్లు ఆయన ఆ దానాన్ని వృద్ధి పరుస్తాడు. అలా వృద్ధి చెందుతూ చివరికది పెరిగి పర్వతం మాదిరిగా అయి పోతుంది“. (బుఖారీ 1410. ముస్లిం 1014).

95- జిల్ హజ్జ మొదటి దశకంలో అధికంగా సత్కార్యాలు చేయటం

الإكثار من الأعمال الصالحة في عشر ذي الحجة: عَنْ ابْنِ عَبَّاسٍ ؆ عَنْ النَّبِيِّ ﷑ أَنَّهُ قَالَ: (مَا الْعَمَلُ فِي أَيَّامٍ أَفْضَلَ مِنْهَا فِي هَذِه)ِ ( يعني أيام العشر) قَالُوا: وَلَا الْجِهَادُ؟ قَالَ: (وَلَا الْجِهَادُ إِلَّا رَجُلٌ خَرَجَ يُخَاطِرُ بِنَفْسِهِ وَمَالِهِ فَلَمْ يَرْجِعْ بِشَيْءٍ).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని, ఇబ్ను అబ్బాస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు:

జిల్ హజ్జ మొదటి దశకంలో చేసిన సత్కార్యాలకు ఉన్నంత ఘనత వేరే రోజుల్లో చేసే సత్కార్యాలకు లేదు”. జిహాద్ కు సయితం ఆ పుణ్యం లేదా? అని సహచరులు అడిగారు. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “అవును జిహాద్ కు కూడా లేదు. కేవలం తన ధనప్రాణంతో సహా జిహాద్ కు వెళ్ళి తిరిగిరాని అమరవీరునికి తప్ప” అని జవాబిచ్చారు. (బుఖారీ 969).

96- బల్లిని చంపుట

قتل الوزغ: عَنْ أَبِي هُرَيْرَةَ t قَالَ: قَالَ رَسُولُ الله ﷑: (مَنْ قَتَلَ وَزَغًا فِي أَوَّلِ ضَرْبَةٍ كُتِبَتْ لَهُ مِائَةُ حَسَنَةٍ وَفِي الثَّانِيَةِ دُونَ ذَلِكَ وَفِي الثَّالِثَةِ دُونَ ذَلِكَ).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశించారని, అబూహురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు:

ఒక దెబ్బకే బల్లిని చంపినవారికి 100 పుణ్యాలు లభిస్తాయి. రెండు దెబ్బల్లో చంపినవానికి అంతకన్నా తక్కువ. మూడు దెబ్బల్లో చంపినవానికి అంతకన్నా తక్కువ“. (ముస్లిం 2240).

97- విన్న ప్రతీది చెప్పుకుంటూ తిరగటం వారించబడింది

النهي عن أن يُحَدِّث المرء بكل ما سمع: عَنْ حَفْصِ بنِ عَاصِمٍ t قَالَ: قَالَ رَسُولُ الله ﷑: (كَفَى بِالْمَرْءِ إِثماً أن يُحَدِّث بِكُلِّ مَا سَمِعَ).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారని, హఫ్స్ బిన్ ఆసిం రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు:

విన్న ప్రతి మాటా చెప్పుకు తిరుగుటయే మనిషి పాపంలో పడిపోవటానికి సరిపోతుంది“. (అబూ దావూద్ 4992).

98- ఇంటివారిపై ఖర్చు చేస్తూ పుణ్యాన్నుద్దేశించుట

احتساب النفقة على الأهل: عَنْ أَبِي مَسْعُود الْبَدرِي t عَنِ النَّبِيِّ ﷑ قَالَ: (إنَّ الْمُسْلِمَ إذَا أنْفَقَ عَلَى أهْلِهِ نَفَقَةً ، وَهُوَ يَحْتَسِبُهَا، كَانَتْ لَهُ صَدَقَةً).

అబూ మస్ఊద్ బద్రీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారు:

“మనిషి పరలోకంలో సత్ఫలితం పొందే ఉద్దేశ్యంతో తన ఇంటివారిపై ఖర్చు చేస్తే, అది అతని ‘సదఖా’ (మంచి దానం)గా పరిగణించ బడుతుంది”. (బుఖారీ 55. ముస్లిం 1002).

99- కాబా ప్రదక్షిణలో వడివడిగా నడవటం

الرَّمل في الطواف: عَنِ بنِ عُمَرَ t قَالَ: (كَانَ رَسُولُ الله ﷑ إذَا طَافَ الطَّوَافَ الأَوَّلَ، خَبَّ (أي:رَمَلَ) ثلاثًا ومشى أربعًا …) الحديث.

ఇబ్ను ఉమర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖించారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాబా గృహం చుట్టూ మొదటి విడత ప్రదక్షిణం చేస్తున్నప్పుడు చిన్న చిన్న అడుగులతో వడివడిగా నడుస్తూ మూడు చుట్లు తిరిగేవారు. ఆ తర్వాత నాలుగు ప్రదక్షిణలు సాధారణ నడకలో నడిచి చేసేవారు. ....(బుఖారీ 1644. ముస్లిం 1261).

100- ఏదైనా నఫిల్ సత్కార్యం అది తక్కువైనా నిరంతరం చేయుట

المداومة على العمل الصالح وإن قل: عَنْ عَائِشَةَ ؅ أَنَّهَا قَالَتْ: سُئِلَ رَسُولُ الله ﷑: أَيُّ الأعْمَالِ أَحَبُّ إِلَى الله؟ قَالَ: (أدوَمُهَا وإن قلَّ).

ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనం ప్రకారం ‘అల్లాహ్ కు అన్నింటికంటే ఎక్కువగా ఏ పని అంటే ఇష్టం?‘ అని ప్రవక్తను ప్రశ్నించగా, “అల్లాహ్ కు నిత్యం క్రమం తప్పకుండా చేసే పని అంటే ఎంతో ఇష్టం, అది తక్కువైనా సరే” అని సమాధాన మిచ్చారు. (బుఖారీ 6465. ముస్లిం 1828).

وصلى الله وسلم وبارك على نبينا محمد وعلى آله وصحبه أجمعين.


[1] రిబాత్ అంటే సత్యాసత్యాల మధ్య పోరాటం సాగే రోజుల్లో రాత్రిళ్ళు పహరా కాయడం అన్న మాట. శాంతి కాలంలో నమాజ్ పట్ల మక్కువ, పోరాటపు రోజుల్లో ప్రాణాలొడ్డి పహరా కాయడంతో సమానమని అర్థం.

([2]) ఇక్కడ ‘హాజల్ అమ్ర’కు బదులుగా తన అవసరాన్ని పేర్కొనాలి. లేదా ‘హాజల్ అమ్ర’ అంటూ తన అవసరాన్ని ఆలోచించుకోవాలి.