351. హజ్రత్ అబూ ఖతాదా (రధి అల్లాహు అన్హు) కధనం:-
మేమంతా ఓ రోజు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తొ కలిసి నమాజు చేస్తుంటే, కొందరు పరిగెత్తుకొస్తున్న అడుగుల చప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కు విన్పించింది. నమాజు ముగిసిన తరువాత ఆయన వారిని ఉద్దేశించి
“ఏమిటీ, ఏమయింది మీకు అలా పరిగెత్తుకు వచ్చారు?”
అని అడిగారు. దానికి వారు
“మేము త్వరగా జమాఅత్ (సామూహిక నమాజు)లో కలవడానికి పరిగెత్తాము”
అని విన్నవించుకున్నారు.
అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హితవు చేస్తూ
“ఇక నుండి అలా చేయకండి. నమాజు చేయడానికి వచ్చినప్పుడల్లా హుందాగా, నింపాదిగా నడచి రండి. సామూహిక నమాజులో ఎంత భాగం లభిస్తే అంతే చేయండి. మిగిలిన భాగాన్ని మీరంతగా మీరు (వ్యక్తిగతంగా) చేసి నమాజును పూర్తి చేసుకోండి”
అని అన్నారు.