1204. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు :-
ఎవరు నాకు విధేయుడయ్యాడో అతను వాస్తవానికి అల్లాహ్ కి విధేయుడయ్యాడు – మరెవరు నాకు అవిధేయుడయ్యాడో అతను నిజానికి అల్లాహ్ కే అవిధేయుడయిపోయాడు. అలాగే ఎవరు నేను నియమించిన నాయకునికి విధేయత చూపాడో అతను నాకు విధేయత చూపినట్లే; మరెవరు నేను నియమించిన నాయకునికి అవిధేయుడయ్యాడో అతను స్వయంగా నాకు ఆవిధేయుడయి పోయాడన్నమాట.(*)