Telugu Islamic Quiz (తెలుగు ఇస్లామిక్ క్విజ్) – పార్ట్ 55
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
రమజాన్ ప్రత్యేక క్విజ్ ప్రశ్నల పత్రం – 05
(1) ఉపవాసం ఎవరిపై విధిగా లేదు?
A) రోగిపై, ప్రయాణికినిపై
B) స్త్రీలపై
C) ధర్మాన్ని బోధించే వారిపై ( శక్తి గలవారు)
(2) ఉపవాసం ఉండలేని వయోవృద్ధులు తమ ఉపవాసానికి బదులుగా ఏమి చేయాలి?
A) జిక్ర్ చేయాలి
B) ఇస్తిగ్ ఫార్ చేయాలి
C) ఒక రోజుకు బదులుగా ఒక బీదవానికి అన్నం పెట్టాలి.
(3) ప్రతి సత్కార్యం యొక్క పుణ్యం ఎన్ని రెట్లు ఎక్కువ ఉంటుంది?
A) లెక్కలేనంత
B) పది నుండి ఏడు వందల రెట్లు
C) మన ఇష్టమున్నంత
క్విజ్ 55: సమాధానాలు & వివరణ ఇక్కడ వినండి /డౌన్లోడ్ చేసుకోండి [9:09 నిమిషాలు]
(1) ఉపవాసం ఎవరిపై విధిగా లేదు?
A) రోగిపై, ప్రయాణికినిపై
2:184 فَمَن كَانَ مِنكُم مَّرِيضًا أَوْ عَلَىٰ سَفَرٍ فَعِدَّةٌ مِّنْ أَيَّامٍ أُخَرَ ۚ
2:184. “అయితే మీలో వ్యాధిగ్రస్తులుగానో, ప్రయాణీకులుగానో ఉన్నవారు ఆ ఉపవాసాల లెక్క ఇతర దినాలలో పూర్తి చేసుకోవాలి”
(2) ఉపవాసం ఉండలేని వయోవృద్ధులు బదులుగా ఏమి చేయాలి?
C) ఒక రోజుకు బదులుగా ఒక బీదవానికి అన్నం పెట్టాలి.
బుఖారీ 4505లో ఉంది: ఇబ్ను అబ్బాస్ చెప్పారు “వయో వృద్ధులు ఉపవాసం ఉండే శక్తి లేకుంటే వారు ఒక రోజు ఉపవాసానికి బదులుగా ఒక పేదవారికి అన్నం పెట్టాలి.”
బుఖారీలోనే 4505కు ముందు ఉంది, అనస్ (రజియల్లాహు అన్హు) ముసలివారయ్యాక ఒక లేదా రెండు సంవత్సరాలు ఉపవాసం ఉండలేకపోయారయితే పేదవారికి అన్నం పెట్టేవారు.
(3) ప్రతి సత్కార్య యొక్క పుణ్యం ఎన్ని రెట్లు ఎక్కువ ఉంటుంది?
B) పది నుండి ఏడు వందల రెట్లు
కానీ ఉపవాసం పుణ్యం లెక్కలేనంతగా ఉంటుంది
عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ، قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: ” كُلُّ عَمَلِ ابْنِ آدَمَ يُضَاعَفُ، الْحَسَنَةُ عَشْرُ أَمْثَالِهَا إِلَى سَبْعمِائَة ضِعْفٍ، قَالَ اللهُ عَزَّ وَجَلَّ: إِلَّا الصَّوْمَ، فَإِنَّهُ لِي وَأَنَا أَجْزِي بِهِ، يَدَعُ شَهْوَتَهُ وَطَعَامَهُ مِنْ أَجْلِي “
ముస్లిం 1151 – “మనిషి చేసే ప్రతి సత్కార్యం పెంచి పుణ్యం ఇవ్వడం జరుగుతుంది. ఒక సత్కార్యం యొక్క పుణ్యం పది నుండి ఏడు వందల రెట్ల వరకు పెంచడం జరుగుంది. అల్లాహ్ చెప్పాడు, కాని ఉపవాస, నిశ్చయంగా అది నా కొరకు, నేను ప్రతిఫలం ప్రసాదిస్తాను, అతను నా కొరకు మాత్రమే మనోవాంఛ, తినత్రాగడం మానుకుంటాడు“
ఇతరములు :
తెలుగు ఇస్లామిక్ క్విజ్ (ఆడియో సిరీస్) మెయిన్ పేజీ :
https://teluguislam.net/others/telugu-islamic-quiz
రమదాన్ మెయిన్ పేజీ :
https://teluguislam.net/five-pillars/ramadhan-telugu-islam/
You must be logged in to post a comment.