383. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు :-
కపట విశ్వాసులకు ఫజ్ర్, ఇషా నమాజుల కంటే మరే నమాజు భారంగా ఉండదు. అయ్యో! ఈ రెండు నమాజులకు ఎంత పుణ్యం లభిస్తుందో తెలిస్తే వారీ నమాజుల్లో పాల్గొనడానికి మోకాళ్ళ మీద కుంటుకుంటూ రావలసి వచ్చినా సరే తప్పకుండా వస్తారు (కాని ఈ కపటుల కసలు నా మాటల మీద నమ్మకమే లేదాయే). ముఅజ్జిన్ కు ఇఖామత్ (పిలుపు) ఇవ్వమని చెప్పి, నమాజు చేయించడానికి (నా స్థానంలో) మరొకరిని నిలబడమని ఆజ్ఞాపించి నేను స్వయంగా అగ్నిజ్వాల తీసుకొని నమాజుకు ఇంకా రాని వారి ఇండ్లను తగలబెడదామని (ఎన్నోసార్లు) అనుకున్నాను.
[సహీహ్ బుఖారీ : 10 వ ప్రకరణం – అజాన్, 34 వ అధ్యాయం – ఫజ్లిల్ ఇషాయి ఫిల్ జమాఅత్]
ప్రార్ధనా స్థలాల ప్రకరణం – 42 వ అధ్యాయం – సామూహిక నమాజు ప్రాముఖ్యం, దీనిని పోగొట్టుకున్న వారికి హెచ్చరిక. మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు (Al-Loolu Wal Marjan ) vol-1. సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్