హజ్రత్ అబూహురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు : మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉపదేశించారు-
“ప్రళయదినం నాడు అల్లాహ్ అవశ్యంగా అడుగుతాడు: ‘ఓ ఆదం కుమారా! నేను వ్యాధిగ్రస్తుడినయ్యాను. నువ్వు నన్ను పరామర్శించలేదు’ అతనంటాడు: ‘ఓ!” ప్రభూ! నేను నిన్ను పరామర్శించడమేమిటి? నువ్వైతే సమస్త లోకాల పాలకుడవు?’ అల్లాహ్ అంటాడు: ‘నా ఫలానా దాసుడు వ్యాధిగ్రస్తుడైన సంగతి నీకు తెలీదా? కాని నువ్వతన్ని పరామర్శించలేదు. నువ్వతన్ని పరామర్శించి ఉంటే నన్నక్కడ పొందేవాడివి కాదా?’
‘ఓ ఆదం పుత్రుడా! నేను నిన్ను అన్నం అడిగాను. కాని నువ్వు నాకు అన్నం పెట్టలేదు.’ అతనంటాడు : ‘నా దేవా! నేన్నీకు ఎలా అన్నం పెట్టగలను? నువ్వైతే నిఖిల జగతికి పరిపోషకుడివి.’ అల్లాహ్ అంటాడు: ‘నా ఫలానా దాసుడు భోజనం కోసం నిన్ను మొరపెట్టుకున్న సంగతి నీకు తెలీదా? అయితే నువ్వతనికి భోంచేయించలేదు. ఒకవేళ నువ్వతనికి అన్నం పెట్టివుంటే దాని (ఫలాన్ని) నా దగ్గర పొందేవాడివి కాదా?’
‘ఓ ఆదం కుమారుడా! నేన్నిన్ను మంచినీళ్ళడిగాను. నువ్వు నాకు త్రాపలేదు.’ అతనంటాడు : ‘ఓ నా స్వామీ! నేన్నీకు మంచినీళ్ళు ఎలా త్రాపగలను? నువ్వు సకల లోకాల స్వామివి కదా!’ అల్లాహ్ అంటాడు: ‘నా ఫలానా దాసుడు నిన్ను నీరు కోసం వేడుకున్నాడు. కాని నువ్వతనికి నీరు త్రాపలేదు. ఒకవేళ నువ్వతనికి నీరు త్రాగించి ఉంటే దాన్ని బహుమతిని నా వద్ద పొందేవాడివి.” (ముస్లిం)
Read More “మానవ సేవ – ఆపదలో ఉన్న మనిషిని ఆదుకోవడంలో అల్లాహ్ ప్రసన్నత ఇమిడి ఉంది – కలామే హిక్మత్ “