మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్) (Al-Lulu-wal-Marjaan) .
1వ అధ్యాయం – పశ్చాత్తాప ప్రేరణ, పశ్చాత్తాపం ద్వారా దైవ ప్రసన్నత
في الحض على التوبة والفرح بها
1746 – حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، قَالَ: قَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: يَقُولُ اللهُ تَعَالَى: أَنَا عِنْدَ ظَنِّ عَبْدِي بِي وَأَنَا مَعَهُ إِذَا ذَكَرَنِي فَإِنْ ذَكَرَنِي فِي نَفْسِهِ، ذَكَرْتُهُ فِي نَفْسِي وَإِنْ ذَكَرَنِي فِي ملإٍ، ذَكَرْتُهُ فِي مَلإٍ خَيْرٍ مِنْهُمْ وَإِنْ تَقَرَّبَ إِلَيَّ بِشِبْرٍ، تَقَرَّبْتُ إِلَيْهِ ذِرَاعًا وَإِنْ تَقَرَّبَ إِلَيَّ ذِرَاعًا، تَقَرَّبْتُ إِلَيْهِ بَاعًا وَإِنْ أَتَانِي يَمْشِي، أَتَيْتُهُ هَرْوَلَةً
__________
أخرجه البخاري في: 97 كتاب التوحيد: 15 باب قول الله تعالى (ويحذركم الله نفسه)
1746. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ఉపదేశించారు :-
అల్లాహ్ ఈ విధంగా తెలియజేస్తున్నాడు – “నా దాసుడు నా గురించి ఎలా ఊహించుకుంటాడో నేనతని కోసం అలాగే ఉంటాను. నా దాసుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటూ నా పేరు స్మరిస్తున్నప్పుడు నేనతని వెన్నంటి ఉంటాను. అతను నన్ను మనసులో జ్ఞాపకం చేస్తే నేను కూడా మనసులో జ్ఞాపకం చేస్తాను. అతను గనక ఏదైనా సమావేశంలో నా గురించి ప్రస్తావిస్తే నేను అంతకంటే శ్రేష్ఠమైన (దైవదూతల) సమావేశంలో అతడ్ని గురించి ప్రస్తావిస్తాను. నా దాసుడు నా వైపు ఒక జానెడు జరిగి వస్తే నేనతని వైపుకు ఒక బారెడు జరిగి వస్తాను. అతను నా వైపుకు ఒక బారెడు పురోగమిస్తే నేనతని వైపుకు రెండు బారలు పురోగమిస్తాను. అతను నా వైపుకు నడచి వస్తే నేనతని వైపుకు పరుగెత్తుకొస్తాను.”
(సహీహ్ బుఖారీ:- 97వ ప్రకరణం – అత్ తౌహీద్, 15వ అధ్యాయం – ఖౌలిల్లాహి తఆలా (వయుహజ్జిరుకు ముల్లాహ నఫ్సహు)
1747 – حديث عَبْدِ اللهِ بْنِ مَسْعُودٍ، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: للهُ أَفْرَحُ بِتَوْبَةِ عَبْدِهِ، مِنْ رَجُلٍ نَزَلَ مَنْزِلاً، وَبِهِ مَهْلَكَةٌ، وَمَعَهُ رَاحِلَتُهُ، عَلَيْهَا طَعَامُهُ وَشَرَابُهُ فَوَضَعَ رَأْسَهُ، فَنَامَ نَوْمَةً، فَاسْتَيْقَظَ، وَقَدْ ذَهَبَتْ رَاحِلَتُهُ حَتَّى اشْتَدَّ عَلَيْهِ الْحَرُّ [ص:239] وَالْعَطَشُ، أَوْ مَا شَاءَ اللهُ، قَالَ: أَرْجِعُ إِلَى مَكَانِي فَرَجَعَ، فَنَامَ نَوْمَةً، ثُمَّ رَفَعَ رَأْسَهُ، فَإِذَا رَاحِلَتُهُ عِنْدَهُ
__________
أخرجه البخاري في: 80 كتاب الدعوات: 4 باب التوبة
1747. హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ వూద్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ఉద్బోధించారు :
“ఒక వ్యక్తి ప్రాణాపాయముండే ప్రదేశంలో దిగుతాడు. అతని ఒంటె మీద అన్న పానీయాల సామగ్రి ఉంటుంది. అతనా ప్రదేశంలో దిగి (ప్రయాణ బడలిక వల్ల) కాస్సేపు పడుకుంటాడు. కాని మేల్కొన్న తరువాత చూస్తే ఆ ఒంటె కన్పించక ఎక్కడికోపోతుంది. (అతను ఎంత వెతికినా అది కన్పించదు) చివరికి ఎండ తీవ్రమయిపోయి దప్పికతో అతను తల్లడిల్లిపోతాడు. ఇలాంటి పరిస్థితిలో ఎదురయ్యే బాధలన్నీ అతనికి ఎదురయ్యాయి. అతను (తిరిగి తిరిగి విసిగి వేసారిపోయి) ఇక లాభం లేదు, తాను తన విడిదికి చేరుకోవాలి అని భావించి ఆ ప్రదేశానికి తిరిగొస్తాడు. అలసిపోయి కాస్సేపు పడుకుంటాడు. మేల్కొన్న తరువాత తల పైకెత్తి చూస్తే అతని ఒంటె అతని ఎదురుగా నిలబడి ఉండటం కన్పిస్తుంది. దాన్ని చూసి అతను పరమానంద భరితుడవుతాడు. అయితే అల్లాహ్ తన దాసుని పశ్చాత్తాపం (తౌబా)పట్ల చెందే ఆనందం ఈ బాటసారి చెందిన ఆనందానికి మించి ఉంటుంది.”
(సహీహ్ బుఖారీ:- 80వ ప్రకరణం – అద్దావాత్, 4వ అధ్యాయం – అత్ తౌబా)
1748 – حديث أَنَسٍ رضي الله عنه، قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: اللهُ أَفْرَحُ بِتَوْبَةِ عَبْدِهِ مِنْ أَحَدِكُمْ، سَقَطَ عَلَى بَعِيرِهِ، وَقَدْ أَضَلَّهُ فِي أَرْضٍ فَلاَةٍ
__________
أخرجه البخاري في: 80 كتاب الدعوات: 4 باب التوبة
1748. హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు :-
“ఎలాంటి అన్న పానీయాలు లభించని భయంకర ఎడారి ప్రాంతంలో తప్పిపోయిన తన ఒంటె తిరిగి లభించినపుడు ఒక బాటసారి ఎంత సంతోషిస్తాడో అల్లాహ్ తన దాసుని పశ్చాత్తాపం పట్ల అంతకంటే ఎక్కువ సంతోషిస్తాడు.”
(సహీహ్ బుఖారీ:- 80వ ప్రకరణం – అద్దావాత్, 4వ అధ్యాయం – అత్ తౌబా)
Read More “2.22 – పశ్చాత్తాప ప్రకరణం | మహా ప్రవక్త మహితోక్తులు”