كتاب فضائل القرآن (ఖుర్ఆన్ ఘనతల పుస్తకం)
సంకలనం: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
జుల్ఫీ ధర్మప్రచార విభాగం (సౌదీ అరేబియా)
[పుస్తకం డౌన్లోడ్]
[PDF] [51 పేజీలు]
ఖుర్ఆన్ ను గట్టిగా పట్టుకునే ఆదేశం
عَنْ جُبَيْرِ بن مُطْعِمٍ رَضِيَ ٱللَّٰهُ عَنْهُ قَالَ : قَالَ رَسُولُ الله ﷺ : (أَبْشِرُوا فَإِنَّ هَذَا الْقُرْآنَ طَرَفُهُ بِيَدِ الله ، وَطَرَفُهُ بِأَيْدِيكُمْ ، فَتَمَسَّكُوا بِهِ ، فَإِنَّكُمْ لَنْ تَهْلَكُوا ، وَ لَنْ تَضِلُّوا بَعْدَهُ أَبَدًا).
1- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని జుబైర్ బిన్ ముత్ఇమ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః
“సంతోషించండి! నిశ్చయంగా ఈ ఖుర్ఆన్, దాని ఒక వైపు భాగం అల్లాహ్ చేతిలో ఉంటే మరో వైపు భాగం మీ చేతుల్లో ఉంది. దాన్ని గట్టిగా పట్టుకోండి. అలా పట్టుకున్నాక మీరు వినాశనానికి మరియు దుర్మార్గానికి ఏ మాత్రం గురి కారు”. (తబ్రానీ, సహీహుల్ జామి 34).
ఈ హదీసులో:
సంబరపరిచే విషయాల శుభవార్త ఇవ్వవచ్చును. సత్కార్యాల సంపాదన ఇహలోక సంపాదన కంటే చాలా గొప్పది. [దానికి ప్రజలు సంబరపడాలి. ప్రజలు కూడబెట్టే వాటన్నింటికంటే అది ఉత్తమమైనది]. (ఖుర్ఆన్ 10: 58).
ఇందులో ఖుర్ఆన్ గొప్పతనం, దానిని గట్టిగా పట్టుకునే ఆదేశం ఉంది. అంటే దాని ఆదేశాలను పాటించడం, దానిలోని నివారణల నుండి దూరముండడం.
అల్లాహ్ కు చేయి ఉందని కూడా రుజువైంది. అయితే అది ఆయన గౌరవానికి తగినట్లు ఉంటుందని విశ్వసించాలి.
ఖుర్ఆన్ ప్రకారం ఆచరించినవాడు మోక్షం పొందుతాడు. దాన్ని త్యజించినవాడు దుర్మార్గుడవుతాడు.[ఎవడు నా ఈ మార్గదర్శ కత్వాన్ని అనుసరిస్తాడో అతడు మార్గము తప్పడు, దౌర్భాగ్యానికి గురికాడు. నా జ్ఞాపికకు (హితోపదేశానికి, ఖుర్ఆనుకు) విముఖుడైన వానికి ప్రపంచంలో జీవితం ఇరుకవుతుంది]. (ఖుర్ఆన్ 20: 123, 124). ఖుర్ఆనును అనుసరించినవానికి భాగ్యము, విజయముందని. దానికి విముఖుడైనవానికి దుర్మార్గం, దౌర్భాగ్యం ఉందని హదీసులో ఉంది. దాసుని మరియు ప్రభువు మధ్య సంబంధంలో అది గొప్ప సబబు.
అల్లాహ్ రక్షణ వలన ఖుర్ఆన్ భద్రంగా ఉంది. ఏలాంటి తారుమారు అందులో జరగలేదు. [అసత్యం దాని మీదకు ముందునుండీ రాజాలదు. వెనుక నుండీ రాజలదు. వివేకవంతుడూ, స్తుతిపాత్రుడూ (అయిన అల్లాహ్ యే) అవతరింపజేసిన గ్రంథం ఇది]. (ఖుర్ఆన్ 41: 42).
తమ అనుచర సంఘ మోక్షానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు ఉన్న కాంక్ష, ఆయన వారి కొరకు కోరే మేలు మరియు వారి పట్ల ఆయనకు ఉన్న సంపూర్ణ జాలి, దయ ఈ హదీసులో ఉట్టిపడుతుంది.