Telugu Islamic Quiz (తెలుగు ఇస్లామిక్ క్విజ్) – పార్ట్ 38
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
బంధుమిత్రులతో విని ప్రవక్త జీవిత ఘట్టాలు, క్విజ్ రూపంలో సహీ ఆధారాలతో తెలుసుకుంటున్నందుకు అల్లాహ్ కృతజ్ఞత చెల్లిస్తూ ఆనందించండి అల్ హందులిల్లాహ్, సుమ్మ అల్ హందులిల్లాహ్
ప్రశ్నల పత్రం – 38
1) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వంశం పేరు ఏమిటి?
A] గిఫ్ఫారి తెగ
B] హాషిం
C] ఖురైజా
2] దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం ) వారి తండ్రి మరియు తాత యొక్క పేర్లు ఏమిటి?
(బుఖారీ, కితాబుల్ మనాఖిబ్, బాబు మబ్అసిన్నబియ్యి సల్లల్లాహు అలైహి వసల్లం)
ముహమ్మద్ బిన్ అబ్దుల్లాహ్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్ బిన్ హాషిమ్ బిన్ అబ్ది మనాఫ్ బిన్ ఖుసై బిన్ కిలాబ్ బిన్ ముర్రహ్ బిన్ కఅబ్ బిన్ లుఐ బిన్ ఘాలిబ్ బిన్ ఫిహ్ ర్ బిన్ మాలిక్ బిన్ నజ్ర్ బిన్ కినాన బిన్ ఖుజైమ బిన్ ముద్రిక బిన్ ఇల్యాస్ బిన్ ముజర్ బిన్ నిజార్ బిన్ మఅద్ద్ బిన్ అద్నాన్
3] దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారు పుట్టుకకు కాస్త ముందు పవిత్ర కాబా పరిసరాలలో జరిగిన ఘటన ఏమిటి?
B] ఏనుగుల సంఘటన
البخاري 2434:- «إِنَّ اللَّهَ حَبَسَ عَنْ مَكَّةَ الفِيلَ
బుఖారీ 2434లో ఉంది: ఒక సందర్భంలో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు: నిశ్చయంగా అల్లాహ్ మక్కాలో ప్రవేశించకుండా ఏనుగులను ఆపి ఉంచాడు.
105:1 أَلَمْ تَرَ كَيْفَ فَعَلَ رَبُّكَ بِأَصْحَابِ الْفِيلِ
ఏమిటీ, నీ ప్రభువు ఏనుగుల వారి పట్ల వ్యవహరించిన తీరును నీవు చూడలేదా?
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
పై హదీసు భావం: హజ్రత్ కఅబ్ బిన్ ఉజర్ (రజి అల్లాహు అన్హు) తెలిపారు : ఒక రోజు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం ) మింబర్ తీసుకుని రమ్మని పురామాయించారు , దాన్ని తెచ్చాక మొదటి మెట్టుపై కాలు పెట్టగానే “ఆమీన్” అన్నారు . తరవాత రెండవ మెట్టుపై కాలు పెట్టి “ఆమీన్ ” అన్నారు , మూడవ మెట్టుపై కాలు పెట్టగానే మళ్లీ “ఆమీన్” అన్నారు .! ప్రసంగం ముగిసిన తర్వాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం ) క్రిందికి దిగి వచ్చారు. అప్పుడు సహాబా (రజియల్లాహు అన్హుమ్) అడిగారు : మేము ఈ రోజు విన్నటువంటి మాట ఇంతకు ముందు ఎన్నడూ వినలేదు అని విన్నవించారు, దానికి దైవప్రవక్త (ﷺ) అన్నారు ::
జిబ్రాయిల్ (అలైహిస్సలాం) వచ్చి రమజాన్ మాసం పొంది ఎవరు తన పాపాలను ప్రక్షాళన చేసుకోలేదో.. అతడు నాశనం అయ్యాడు .అన్నారు అది విని నేను “ఆమీన్” అన్నాను.
నేను రెండవ మెట్టుపై అడుగుపెట్టిన ప్పుడు జిబ్రాయిల్ (అలైహిస్సలాం) అన్నారు : ఎవరి ముందు దైవప్రవక్త (ﷺ) పేరు తీసుకోబడుతుందో అది వినికుడా దరూద్ పఠించక పోతే అతడు నాశనం అయ్యాడు అని శపించారు.అది విని నేను ‘ఆమీన్’ అన్నాను,
మూడవ మెట్టుపై కాలు పెట్టగానే తల్లి తండ్రి ని లేదా ఇద్దరిలో ఒకరిని వృద్ధాప్యంలో ఉండగా వారికి సేవ చేసి స్వర్గం పొందలేని వానిపై అభిశాపం పడుగాక అన్నారు అది విని నేను ‘ఆమీన్’ అన్నాను.
[హాకిమ్ – సహీహ్]
2] ఏ ఆచరణ గూర్చి వారిస్తూ అల్లాహ్ మరియు ఆయన సందేశహరునితో యుద్ధానికి సిద్ధం అవ్వండి అని తెలుపబడింది?
“ఓ విశ్వసించినవారలారా! అల్లాహ్‌కు భయపడండి. మీరు నికార్సయిన విశ్వాసులే అయినట్లయితే మిగిలి వున్న వడ్డీని విడిచి పెట్టండి. ఒకవేళ మీరు గనక అలా చేయనట్లయితే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తతో యుద్ధానికి సిద్ధంకండి. ఒకవేళ మీరు పశ్చాత్తాపం చెందితే మీ అసలు సొమ్ము మీకే ఉంటుంది. మీరూ ఒకరికి అన్యాయం చేయకూడదు. మీకు కూడా అన్యాయం జరుగకూడదు. ఒకవేళ రుణగ్రస్తుడు యిబ్బందుల్లో ఉంటే అతని పరిస్థితి మెరుగుపడేవరకూ అతనికి గడువు ఇవ్వాలి. లేదా మన్నించి దానంగా వదలి పెట్టండి. మీరే గనక తెలుసుకోగలిగితే ఇది మీ కొరకు శ్రేయోదాయకం.” (సూర బఖరా 2:278-280)
3) సృష్టి తొలి కాలంలో ఒక కాకి ద్వారా సమాధి చేసే పద్దతి నేర్చుకున్నది ఎవరు?
తర్వాత అతని మనసు తన సోదరుని హత్యకే పురికొల్పింది. అతణ్ణి హత్యచేసి అతడు నష్టపోయిన వారిలో చేరిపోయాడు. ఆ తరువాత సోదరుని శవాన్ని ఎలా దాచాలో అతనికి చూపించటానికి అల్లాహ్ ఒక కాకిని పంపాడు. అది నేలను త్రవ్వసాగింది. అతను (ఆ దృశ్యాన్ని చూసి,) “అయ్యో! నా సోదరుని శవాన్ని దాచే విషయంలో నేను ఈ కాకిపాటి వాణ్ణి కూడా కాలేకపోయానే” అంటూ సిగ్గుతో కుమిలిపోయాడు.
మిష్కాత్ 211:- ”ప్రపంచంలో అన్యాయంగా చంపబడిన ప్రతి వ్యక్తికి బదులు, ఆదమ్ (అలైహిస్సలాం) కుమారుడైన ఖాబిల్కు ఒక పాపం చుట్టు కుంటుంది. ఎందుకంటే హత్యను మొట్ట మొదట ప్రారంభించిన వాడు అతడే!”
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
షిర్క్ అవుతుందని ఏదైతే సమాధానం మీరు చదివారో, దీని వివరం తెలుసుకునేకి ముందు ఒక హదీసు విందాము :
ముఆవియా (రజియల్లాహు అన్హు) ఒక చోట వచ్చారు, ఆయన్ని చూసి అబ్దుల్లాహ్ బిన్ ఆమిర్ (తాబిఈ) నిలబడ్డారు, అబ్దుల్లాహ్ బిన్ జుబైర్ (రజియల్లాహు అన్హుమా) (సహాబి బిన్ సహాబీ) కూర్చొని ఉన్నారు. ఇది చూసి ముఆవియ (రజియల్లాహు అన్హు) అబ్దుల్లాహ్ బిన్ ఆమిర్ తో చెప్పారు : “కూర్చో, నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా విన్నాను:
“ప్రజలు తన కొరకు నిలబడాలని ఎవడు ఇష్టపడతాడో అతను తన నివాసం నరకంలో ఏర్పరుచుకోవాలి”. అబు దావూద్ లో ‘అహబ్బ’అనే పదం ఉంది అంటే ఇష్టపడతాడో, కోరుకుంటాడో, తిర్మిజిలో ఉంది: ‘సర్ర’అంటే నచ్చుతుందో, సంతోషం ఏర్పడుతుందో. అంటే అతడ్ని చూసి నిలబడని వారిని సంతోషంగా చూడడు, వారితో ప్రేమగా ఉండడు, నిలబడినవారి పట్ల సంతోషంగా వ్యవహరిస్తాడు.
ఈ సమస్య అంటే “ఒకరిని చూసి నిలబడటం” అనే విషయంలో కొన్ని వివరాలు ఉన్నాయి తెలుసుకోవడం చాలా అవసరం.
1- నేను ఏదైనా సమావేశంలో వస్తే, లేదా ప్రజలు నన్ను చూస్తే నిలబడాలని ఇష్టపడడం, కాంక్షించడం నిషిద్ధం.
ఇది గర్వానికి దారి తీస్తుంది, అప్పుడు గర్వం లేకున్నా గర్వ చిహ్నాల్లోకి వస్తుంది.
2- మనిషి ఇలాంటి కోరిక, కాంక్ష వల్ల నరకం పాలవుతాడని హెచ్చరించడం జరిగింది.
3- ఈ కోరిక, కాంక్ష ఉన్నవారిని చూసి నిలబడేవారు, ఓ నిషిద్ధ కార్యానికి సహాయం చేసినవారవుతారు.
4- ఇలాంటి కోరిక లేనివారి కొరకు కూడా నిలబడకూడదు, ఈ నిలబడటం అనే అలవాటు వారిలో ఆ కోరికను జనింపజేసే ప్రమాదముంది.
5- ఇక ఎవరైతే తమ ధర్మపరమైన బడాయితనాన్ని చాటుకుంటున్నారో, అనుయాయులు వారిని గౌరవించాలి, మర్యాద పాటించాలని కోరుకుంటున్నారో వారు నిజసృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క గౌరవమర్యాదలో జోక్యం చేసుకుంటున్నారు, కనుక అలాంటివారి కొరకు నిలబడుట షిర్క్ లోకి నెట్టేసే ప్రమాదం ఉంది.
6- ఇంట్లో పెద్దలు వస్తే పిల్లలు, నిలబడుట లేదా టీచర్లు క్లాస్ రూంలోకి వస్తే స్టూడెంట్స్ నిలబడుట కూడా మంచి అలవాటు కాదు.
7- కొందరు ఒక చోట ఉన్నారు ఎవరైనా వారి బంధువు, గురువు లాంటి పెద్దలు వచ్చారు అప్పుడు వారు నిలబడి, రెండు అడుగులు ముందుకు వచ్చి వచ్చే వ్యక్తికి స్వాగతం పలుకుతే పాపం కాదు. సహీ బుఖారీ 3043లో ఉంది: ఒక సందర్భంలో సఅద్ (రజియల్లాహు అన్హు) వచ్చినప్పుడు ప్రవక్త ఔస్ వంశంవారితో మీ నాయకుడైన సఅద్ వచ్చారు నిలబడి స్వాగతించండని ఆదేశించారు.
అలాగే ప్రయాణం నుండి వచ్చినవారిని స్వాగతించడానికి నిలబడి సలాం చేయడం, ముసాఫహా (కరచాలనం), ముఆనఖ (హగ్, అలాయిబలాయి) చేయడం యోగ్యమే. ప్రవక్త తమ కూతురింటికి వెళ్ళినప్పడూ, కూతురు ప్రవక్త ఇంటికి వచ్చినప్పుడు నిలబడి స్వాగతం పలికేవారని అబూ దావూద్ 5217 మరియు ఇతర హదీసుల్లో ఉంది.
(ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు కూడా ఉన్నాయి, ఫత్ హుల్ బారీ 11/49-51 మరియు షేఖ్ అల్బానీ గారి సహీహాలోని హదీసు 357, మరియు షేఖ్ ఇబ్ను ఉసైమీన్ గారి మజ్మూఉల్ ఫతావా 24/2 చూడవచ్చును)
2) మనకు ఏదయినా నష్టం జరిగినప్పుడు “నేను ఒక వేళ అలా చెయ్యకపోతే బాగుండేది” అని అనవచ్చునా?
”దృఢమైన, పరిపూర్ణ విశ్వాసి బలహీనుడైన విశ్వాసి కంటే గొప్పవాడు. వాడి ప్రతిపనిలో మేలు ఉంటుంది. కావున లాభం చేకూర్చే దాన్ని కోరుకో, అల్లాహ్ తఆలా సహాయంకోరు. బలహీనత ప్రదర్శించకు. ఒకవేళ ఏదైనా ఆపదవస్తే, ”ఒకవేళ నేను అలా చేస్తే ఇలా అయ్యేదని అనకు.” అల్లాహ్ తఆల కోరింది అయ్యిందని, నా విధిలో ఉన్నది జరిగిందని భావించు. ఎందుకంటే ఒకవేళ అనేది షై’తాన్ ద్వారాన్ని తెరచి వేస్తుంది”.(సహీ ముస్లిం).
3) ప్రళయదినం నాడు అత్యధిక శిక్ష పడేది వీరిలో ఎవరికి ?
A) బొమ్మలు గీసే వాళ్లకు
وَعَنْ عَبْدِ اللهِ بْنِ مَسْعُوْدٍ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “أَشَدُّ النَّاسِ عَذَابًا عِنْدَ اللهِ الْمُصَوِّرُوْنَ”.
4497. ‘అబ్దుల్లాహ్ బిన్ మస్’ఊద్ (రజియల్లాహు అన్హు) కథనం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను, ”ప్రాణుల చిత్రాలు తయారుచేసే వారిని తీర్పుదినం నాడు అందరి కంటే కఠినంగా శిక్షించడం జరుగుతుంది.” (బు’ఖారీ, ముస్లిమ్)
وَعَنْهَا عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “أَشَدُّ النَّاسِ عَذَابًا يَوْمَ الْقِيَامَةِ الَّذِيْنَ يُضَاهُوْنَ بِخَلْقِ اللهِ”.
4495. ‘ఆయి’షహ్ (రజియల్లాహు అన్హు) కథనం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచనం, ”తీర్పు దినం నాడు అల్లాహ్ తఆలా సృష్టించిన ప్రాణుల నకిలీ చిత్రాలు చేసేవారిని, అంటే ప్రాణుల చిత్రాలు తయారుచేసే వారిని అందరికంటే కఠినంగా శిక్షించటం జరుగుతుంది.” (బు’ఖారీ, ముస్లిమ్)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “قَالَ اللهُ تَعَالى: )وَمَنْ أَظْلَمُ مِمَّن ذَهَبَ يَخْلُقُ كَخَلْقِيْ فَلْيَخْلُقُوْا ذَرَّةً أَوْ لِيَخْلُقُوْا حَبَّةً أَوْ شَعِيْرَةً”(. متفق عليه.
4496. అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు కథనం: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను. అల్లాహ్ ఆదేశం, ”నేను సృష్టించే వాటిలా సృష్టించే అంటే చిత్రాలు వేసేవాడి కంటే దుర్మార్గుడు మరెవడు కాగలడు? అతడిని ఒక చీమ లేదా ఒక గోధుమ గింజ సృష్టించి చూపమనండి.” (బు’ఖారీ, ముస్లిమ్)
వివరణ-4496: ఇలా ఎందుకు ఆగ్రహించడం జరిగిందంటే, చీమను లేదా గోధుమ గింజను సృష్టించలేడు. అందు వల్ల ప్రాణుల చిత్రాలుగానీ ఫోటోలను గానీ తీయ రాదు అని హెచ్చరించడం జరిగింది
وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “كُلُّ مُصَوِّرٍفِي النَّارِيَجْعَلُ لَهُ بِكُلِّ صُوْرَةٍ صَوَّرَهَا نَفْسًا فَيُعَذِّبُهُ فِيْ جَهَنَّمَ”. قَالَ ابْنُ عَبَّاسٍ: فَإِنْ كُنْتُ لَابُدَّ فَاعِلًا فَاصْنَعِ الشَّجَرَوَمَا لَا رُوْحَ فِيْهِ.
4498.’అబ్దుల్లాహ్ బిన్ ‘అబ్బాస్ (రజియల్లాహు అన్హు) కథనం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను, ”ప్రాణుల చిత్రాలు తయారు చేసే ప్రతి ఒక్కరినీ నరకంలో వేయబడును. ఇంకా వారితో, చేసిన చిత్రాలన్నింటిలో ప్రాణం పోయమని ఆదేశించటం జరుగును. వారు ఎలాగూ ప్రాణం పోయలేరు, అందువల్ల నరకంలోనే ఉండవలసి వస్తుంది”. ఇబ్నె ‘అబ్బాస్ (రజియల్లాహు అన్హు) అభిప్రాయం, ”ఒకవేళ చిత్రం వేసే అవసరం వస్తే చెట్లు, నిర్జీవ వస్తువుల చిత్రాలు వేసుకోండి.” (బు’ఖారీ, ముస్లిమ్) అంటే బట్టలపై, దుస్తులపై నిర్జీవ ఫలాల, ఆకుల, వస్తువుల చిత్రాలు వేసుకోవచ్చును.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
“అల్లాహ్ మీ వద్దకు ఏ నిదర్శనాన్నీ అవతరింపజేయనప్పటికీ మీరు అల్లాహ్‌కు భాగస్వాములను కల్పించే విషయానికి భయపడటం లేదు. మరి అటువంటప్పుడు అల్లాహ్‌కు సహవర్తులుగా మీరు నిలబెట్టే వాటికి నేనెలా భయపడతాను? కాబట్టి ఈ రెండు పక్షాలలో సురక్షిత స్థితికి అర్హులెవరో మీకు తెలిస్తే కాస్త చెప్పండి.”(సూరా అల్ అన్ ‘ఆమ్ 6:81)
“విశ్వసించి, తమ విశ్వాసాన్ని దుర్మార్గం (షిర్కు)తో కలగా పులగం చేయకుండా ఉండేవారే సురక్షితంగా ఉన్నవారు. సన్మార్గంపై ఉన్నవారు కూడా వారే”. (సూరా నూహ్ 6:82)
“ఇబ్రాహీము (అలైహిస్సలాం) తన జాతి వారిని ఎదుర్కొనటానికిగాను మేము అతనికి ఇచ్చిన మా ‘నిదర్శనం’ ఇది! మేము తలచుకున్నవారి అంతస్తుల్ని పెంచుతాము. నిశ్చయంగా నీ ప్రభువు వివేకవంతుడు, గొప్ప పరిజ్ఞానం కలవాడు.”(సూరా నూహ్ 6:83)
“ఇంకా మేము అతనికి ఇస్‌హాఖును, యాఖూబ్‌ను ప్రసాదించాము. వారిలో ప్రతి ఒక్కరికీ మేము సన్మార్గం చూపించాము. అంతకు మునుపు మేము నూహ్‌కు సన్మార్గం చూపించి ఉన్నాము. ఇంకా అతని సంతతి వారిలోనుంచి దావూదు సులైమానులకు, అయ్యూబు యూసుఫులకు, మూసా హారూనులకు మేము సన్మార్గం చూపాము. సత్కార్యాలు చేసేవారికి మేము ఇలాగే ప్రతిఫలం ఇస్తూ ఉంటాము.”(సూరా నూహ్ 6:84)
“ఇంకా – ఇస్మాయీలుకు, యసఆకు, యూనుసు లూతులకు కూడా (మేము మార్గదర్శకత్వం వహించాము). వారిలో ప్రతి ఒక్కరికీ మేము లోకవాసులందరిపై శ్రేష్ఠతను అనుగ్రహించాము”.(సూరా నూహ్ 6:86)
“అంతేకాదు, వారి పితామహులలో (తాత ముత్తాతలలో), వారి సంతానంలో, వారి సహోదరులలో కూడా కొందరిని (మేము కటాక్షించాము.) వారిని (మా సేవకోసం) ఎన్నుకున్నాము. వారిని రుజుమార్గం వైపుకు నడిపించాము.”(సూరా నూహ్ 6:87)
“ఇదీ అల్లాహ్ మార్గదర్శకత్వం. ఆయన తన దాసులలో తాను కోరిన వారిని ఈ మార్గంపై నడిపింపజేస్తాడు. ఒకవేళ వీరు సైతం, దైవత్వంలో భాగస్వామ్యానికి (షిర్కుకు) ఒడిగట్టి ఉంటే, వారు చేసుకున్న కర్మలన్నీ కూడా వృధా అయిపోయేవి.”(సూరా నూహ్ 6:88)
అలాగే సూర జుమర్ 39:65లో ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)ను ఉద్దేశించి ఇలా చెప్పడం జరిగింది
నిశ్చయంగా నీ వద్దకు, నీ పూర్వీకులైన ప్రవక్తల వద్దకు పంపబడిన సందేశం (వహీ) ఇది : “ఒకవేళ నువ్వు గనక బహుదైవారాధనకు పాల్పడితే నువ్వు చేసుకున్నదంతా వృధా అయిపోతుంది. మరి నిశ్చయంగా నువ్వు నష్టపోయినవారిలో చేర్తావు.” (సూర జుమర్ 39:65)
అబూ హురైరా (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు: అల్లాహ్ ఇలా తెలిపాడు: “భాగస్వాములందరికంటే ఎక్కువగా నేను షిర్క్ కు అతీతుడ్ని. ఎవరైనా ఒక సత్కార్యం చేసి అందులో ఎనరినైనా నాకు భాగస్వామిగా చేస్తే నేను అతడ్ని అతని షిర్క్ తో పాటు వదిలేస్తాను.” (ముస్లిం 2985)
2] నమాజ్ లో రెండు సజ్దాల మధ్య రబ్బిగ్ ఫిర్లీ అని పలికే దువా భావం ఏమిటి?
B] నా ప్రభూ నన్ను మన్నించు
النسائي 1069 ، أبو داود 874:- وَبَيْنَ السَّجْدَتَيْنِ: «رَبِّي اغْفِرْ لِي، رَبِّي اغْفِرْ لِي»
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) రెండు సజ్దాల మధ్యలో రబ్బిగ్ ఫిర్లీ, రబ్బిగ్ ఫిర్లీ అనేవారు.
3] అల్లాహ్ మనతోపాటు ఏ విధంగా అతి దగ్గరలోనే ఉన్నాడు?
“(ఓ ప్రవక్తా!) నా దాసులు నా గురించి నిన్ను అడిగితే, నేను (వారికి) అత్యంత సమీపంలోనే ఉన్నాననీ, పిలిచేవాడు నన్ను ఎప్పుడు పిలిచినా నేను అతని పిలుపును ఆలకించి ఆమోదిస్తానని (నువ్వు వారికి చెప్పు). కాబట్టి వారు కూడా నా ఆదేశాన్ని శిరసావహించాలి, నన్ను విశ్వసించాలి (ఈ విషయం నీవు వారికి తెలియజేయి). తద్వారానే వారు సన్మార్గ భాగ్యం పొందగల్గుతారు.”(సూర బఖర 2:186)
అల్లాహ్ మనతో పాటు ఉన్నాడన్న విశ్వాసం “అల్లాహ్ పై విశ్వాసం”లోని ఓ ముఖ్యమైన భాగం. అరబీలో ‘మఇయ్యతుల్లాహ్’ అనబడుతుంది. అల్లాహ్ తనకు తగిన రీతిలో ఏడు ఆకాశాల పైన తన అర్ష్ పై ఉన్నాడు. ఇందులో ఏ అనుమానం లేదు. ఖుర్ఆనులో ఎన్నో ఆయతులున్నాయి. ఉదాహరణకు చూడండి సూర తాహా 20:5
అయితే ఇది (‘మఇయ్యతుల్లాహ్’) రెండు రకాలు 1: ‘మఇయ్య ఆమ్మ’ 2: ‘మఇయ్య ఖాస్స’
1: ‘మఇయ్య ఆమ్మ’అంటే అల్లాహ్ తన అర్ష్ పై ఉండి కూడా సర్వ సృష్టి వెంట ఉన్నాడు, అంటే సర్వ సృష్టిపై దృష్టి పెట్టి ఉన్నాడు, వారిని చూస్తూ వింటూ ఉన్నాడు. దీనికి దివ్య ఖుర్ఆన్ సూర హదీద్ 57:4 లో ఉంది:
“ఆయనే భూమ్యాకాశాలను ఆరు రోజులలో సృష్టించాడు. ఆ తరువాత సింహాసనాన్ని అధిష్టించాడు. భూమి లోపలికి పోయేదీ, అందులో నుంచి బయల్పడేదీ, ఆకాశం నుంచి క్రిందికి దిగేదీ, మరందులోకి ఎక్కిపోయేదీ – అంతా ఆయనకు (బాగా)తెలుసు. మీరెక్కడ ఉన్నా ఆయన మీతోనే ఉంటాడు. మరి మీరు చేసే పనులన్నింటినీ అల్లాహ్ చూస్తూనే ఉన్నాడు.” (సూర హదీద్ 57:4)
2: ‘మఇయ్య ఖాస్స’: అంటే పై భావంతో పాటు ప్రత్యేకంగా తన ప్రవక్తల, విశ్వాసులకు తోడుగా, మద్దతుగా, సహాయంగా ఉన్నాడని కూడా భావం వస్తుంది.
“బాధపడకు. నిశ్చయంగా అల్లాహ్ మనకు తోడుగా ఉన్నాడు” అని ఓదార్చినప్పుడు అల్లాహ్‌యే వారికి తోడ్పడ్డాడు. (ఆ ఘడియలో) అల్లాహ్ తన తరఫునుంచి అతనిపై ప్రశాంతతను అవతరింపజేశాడు. మీకు కానరాని సైన్యాలతో అతన్ని ఆదుకున్నాడు. (సూర తౌబా 9:40)
పై మూడు ఆయతుల వ్యాఖ్యానంలో ఇమాం ఇబ్ను తైమియా (రహిమహుల్లాహ్) చెప్పారు:
“అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) మరియు అబూ బక్ర్ కు తోడుగా ఉండి, సహాయ పడ్డాడు అబూ జహల్ మరియు ఇతర శత్రువులకు వ్యెతిరేకంగా, మూసా (అలైహిస్సలాం) మరియు హారూన్ (అలైహిస్సలాం)కు తోడుగా ఉండి, సహాయం అందించాడు ఫిర్ఔన్ కు వ్యెతిరేకంగా, ఇంకా భక్తిపరులకు, సద్వవర్తనులకు తోడుగా ఉండి, సహాయపడ్డాడు పాపాత్ములు, దౌర్జన్యపరులకు వ్యెతిరేకంగా.”
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
Telugu Islamic Quiz (తెలుగు ఇస్లామిక్ క్విజ్) – పార్ట్ 34
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
ప్రశ్నల పత్రం – 34
1) మనల్ని రాత్రంతా ఆరాధనా, పగలంతా ఉపవాసం పాటించినంత స్థాయికి చేర్చేది ఏది?
A) అవివాహం
B) అజ్ఞాత వాసం
C) ఉత్తమ నడవడిక
2] మనకు ఏదైనా కష్టం కల్గితే ” إِنَّا لِلَّهِ وَإِنَّآ إِلَيْهِ رَٰجِعُونَ”(ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజివూన్) అంటాము దీని భావం ఏమిటి ?
A) అల్లాహ్ మాత్రమే సజీవుడు మనమంతా చనిపోయేవారము
B) నిశ్చయంగా మేమంతా అల్లాహ్ కు చెందినవారము, మరియు మేము ఆయన వైపునకే మరలిపోతాము.
C) అల్లాహ్ అధికారమే నెరవేరుతుంది మేము నిమిత్తమాత్రులం
3] దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం ) వారికి ఇవ్వబడిన ప్రత్యేకతలలో ఈ క్రింద రెండు ఉన్నాయి అవి ఏవి?
A) తయమ్ముమ్ చేయుట (పరిశుభ్ర మట్టితో శుద్ధి )
B) భూభాగం అంతా సజ్దా చేసే చోటు (వారించిన కొన్ని స్థలాలు తప్ప)
C) ఎవ్వరికీ నమాజ్ విషయంలో తీర్పు ఉండదు
దీని వ్యాఖ్యానంలో అబుత్తయ్యిబ్ షమ్సుల్ హఖ్ అజీమాబాదీ రహిమహుల్లాహ్ ఔనుల్ మఅ’బూద్ లో ఇలా చెప్పారు: “ఉత్తమ నడవడిక గల వ్యక్తికి ఇంతటి గొప్ప ఘనత ఎందుకు ఇవ్వబడిదంటే; ‘సాయిమ్’ (ఉపవాసం ఉండేవాడు), ‘ఖాయిమ్’ (రాత్రి నమాజు చేసేవాడు), తమ మనోవాంఛలకు వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటారు, కాని ఉత్తమ నడవడిక అవలంబించే వ్యక్తి విభిన్న తత్వాలు, గుణాలు గల ప్రజలతో పోరాడుతూ ఉంటాడు అందుకే అతను సాయిమ్, ఖాయిమ్ ల స్థానాలను అందుకుంటాడు. ఇలా వారు స్థానంలో సమానులవుతారు, ఒకప్పుడు వీరే ఎక్కువ స్థానం పొందుతారు“. (ఔనుల్ మఅ’బూద్ షర్హు సునన్ అబీ దావూద్ 13/ 154, హదీసు నంబర్ 4798).
ప్రజలతో మంచి విధంగా వ్యవహరించడం, వారికి ఏ కష్టం కలిగించకుండా ఉండడమే ఉత్తమ నడవడిక, సద్వర్తన. నిశ్చయంగా మనిషికి విశ్వాసం తర్వాత సద్వర్తన కంటే ఉత్తమమైన మరే విషయం ఇవ్వబడలేదు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తమ ప్రభువుతో ఉత్తమ నడవడిక ప్రసాదించమని అర్థించేవారు. జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అల్లాహు అక్బర్ అని నమాజు ప్రారంభించాక ఇలా చదివేవారుః
“ఇన్న సలాతీ వ నుసుకీ వ మహ్ యాయ వ మమాతీ లిల్లాహి రబ్బిల్ ఆలమీన్, లాషరీక లహూ వ బిజాలిక ఉమిర్తు వ అన మినల్ ముస్లిమీన్, అల్లాహుమ్మహ్ దినీ లిఅహ్సనిల్ అఅ’మాలి వ అహ్సనిల్ అఖ్లాక్, లా యహ్ దీ లి అహ్సనిహా ఇల్లా అంత, వ ఖినీ సయ్యిఅల్ అఅ’మాలి వ సయ్యిఅల్ అఖ్లాక్, లా యఖీ సయ్యిఅహా ఇల్లా అంత.”
(భావం: నిశ్చయంగా నా నమాజ్, నా ఖుర్బానీ (బలిదానం), నా జీవన్మరణాలు సర్వ లోకాల ప్రభువైన అల్లాహ్ కొరకే, ఆయనకు ఎవడూ భాగస్వామి లేడు. ఈ ఆదేశమే నాకు ఇవ్వబడినది, నేను ముస్లిములోని వాడిని. ఓ అల్లాహ్! నాకు సత్పవర్తన మరియు సదాచరణ వైపునకు మార్గదర్శకత్వం చేయు, వాటి వైపునకు మార్గదర్శకత్వం చూపేవాడు నీ తప్ప ఎవ్వడూ లేడు. నన్ను దుష్పవర్తన మరియు దుష్కార్యాల నుండి కాపాడు. నన్ను వాటి నుండి కాపాడేవాడు నీ తప్ప ఎవ్వడూ లేడు). (ముస్లిం 771, తిర్మిజి 3421, నిసాయి 897 హదీసు పదాలు).
అలాగే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అద్దంలో చూసినప్పుడల్లా ఇలాగే దుఆ చేసేవారు. ఇబ్ను మస్ఊద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: ప్రవక్త ﷺ అద్దంలో చూసినప్పుడల్లా ఇలా అనేవారు:
اللَّهُمَّ كَمَا حَسَّنْتَ خَلْقِي فَحَسِّنْ خُلُقِي అల్లాహుమ్మ కమా హస్సన్త ఖల్ఖీ ఫ హస్సిన్ ఖులుఖీ “ఓ అల్లాహ్! నీవు నా సృష్టిని (ఆకారాన్ని) సరిదిద్దినట్లు నా నడవడికను కూడా సరిదిద్దు”. (ఇబ్ను హిబ్బాన్ 959,
అహ్మద్ 1/ 403, అబూ యాలా 5075, తయాలిసి 374, తబ్రానీ ఫిద్దుఆ 368, అఖ్లాఖున్నబీ: అబుష్షేఖ్ అల్ అస్బహానీ 493, సహీహుల్ జామిః అల్బానీ 1307. (షేఖ్ అల్బానీ రహిమహుల్లాహ్ ఇర్వాఉల్ ఘలీల్74లో వ్రాసారు: అద్ధం చూస్తూ ఈ దుఆ చదవాలని వచ్చిన హదీసులన్నీ జఈఫ్, అయితే సామాన్య స్థితుల్లో ఒక దుఆగా చదవవచ్చును).
సద్వర్తన గల వ్యక్తి ప్రజల్లో ప్రవక్తకు అతిప్రియుడైనవాడు మరియు ప్రళయదినాన ఆయనకు సమీపాన కూర్చుండేవాడు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలిపారని జాబిర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు:
అల్లాహ్ ఉత్తమ నడవడిక గల వ్యక్తికి, సత్ఫలితార్థం మరియు గౌరవార్థం ఉన్నతస్వర్గంలో ఒక కోట (మంచి ఇల్లు) ప్రసాదిస్తాడు. ప్రవక్త ﷺ సెలవిచ్చారని అబూ ఉమామ బాహిలీ (రదియల్లాహు అన్హు)ఉల్లేఖించారు:
“నేను బాధ్యత వహిస్తున్నాను స్వర్గం పరిసరాల్లో ఒక గృహం ఇప్పించాడానికి ఎవరైతే ధర్మం తన వైపు ఉన్నప్పటికి వివాదాన్ని విడనాడుతాడో. మరియు స్వర్గం మధ్యలో ఒక గృహం ఇప్పంచడానికి ఎవరైతే పరిహాసానికైనా అబద్ధం పలకనివానికి. ఇంకా స్వర్గంలో ఎత్తైన ప్రదేశంలో ఒక గృహం ఇప్పించడానికి ఎవరైతే తమ నడవడికను సరిదిద్దుకుంటారో”.
నీ ఉత్తమ నడవడిక అనేది నీకు దూర సంబంధికులైన వారి వరకే పరిమితమయి, నీ దగ్గరి సంబంధికులను మరచిపోవడం సమంజసం కాదు. అది నీ తల్లిదండ్రులు, నీ కుటుంబికులకు వ్యాపించి ఉండాలి. కొందరు ప్రజల పట్ల ఉల్లాసంగా, విశాల హృదయం మరియు సద్వర్తనతో ఉంటారు, అదే వారి భార్య పిల్లలతో వాటికి భిన్నంగా ఉంటారు.
2] మనకు ఏదైనా కష్టం కల్గితే ” إِنَّا لِلَّهِ وَإِنَّآ إِلَيْهِ رَٰجِعُونَ”(ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్) అంటాము దీని భావం ఏమిటి?
B) నిశ్చయంగా మేమంతా అల్లాహ్ కు చెందినవారము, మరియు మేము ఆయన వైపునకే మరలిపోతాము.
ముస్లిం వ్యక్తికి ఏదైనా ఆపద ఎదురైనప్పుడు, అతను అల్లాహ్ ఆదేశ ప్రకారం “ఇన్నా లిల్లాహి వఇన్నా ఇలైహి రాజిఊన్ అల్లాహుమ్మఅ’జుర్నీ ఫీ ముసీబతీ వఖ్లుఫ్ లీ ఖైరమ్ మిన్హా”
(అంటే: నిశ్చయంగా మేమంతా అల్లాహ్ కు చెందినవారము, మరియు మేము ఆయన వైపునకే మరలిపోతాము, ఓ అల్లాహ్! నా ఈ ఆపదలో నాకు పుణ్యం ప్రసాదించు, మరియు దీనికంటే ఉత్తమమైన దానిని నాకు నొసంగు). అని చదువుతారో అల్లాహ్ అతనికి దానికంటే ఉత్తమ దానిని ప్రసాదిస్తాడు.
3] దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారికి ఇవ్వబడిన ప్రత్యేకతలలో ఈ క్రింద రెండు ఉన్నాయి అవి ఏవి?
A] తయమ్ముమ్ చేయుట (పరిశుభ్ర మట్టితో శుద్ధి )
B] భూభాగం అంతా సజ్దా చేసే చోటు (వారించిన కొన్ని స్థలాలు తప్ప)
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
చివరకు వారంతా ఒక చీమల లోయకు చేరుకున్నప్పుడు ఒక చీమ ఇలా ప్రకటించింది: “ఓ చీమల్లారా! సులైమాను, అతని సైన్యాలు తెలీకుండా మిమ్మల్ని నలిపివేసే స్థితి ఏర్పడకుండా ఉండేందుకు, మీరు మీ మీ పుట్టలలోనికి దూరిపోండి.”
2) ప్రస్తుత లాక్ డౌన్ కాలంలో విధి వ్రాతపై నమ్మకం ఉంచి ఇంట్లోనే (Quarantine) ఉండేవారి ఘనత ఏమిటి?
ఆయిషా (రజియల్లాహు అన్హా) ఉల్లేఖించారు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు:
“ఎక్కడ ప్లేగు వ్యాధి వ్యాపిస్తుందో అక్కడ మనిషి ఓపిక సహనాలతో, అల్లాహ్ తో పుణ్యాన్ని ఆశిస్తూ తన ప్రాంతంలోనే ఉంటాడో (ముస్నద్ అహ్మద్ లో ఉంది: తన ఇంట్లోనే ఉంటాడో) ఇంకా అల్లాహ్ వ్రాసి పెట్టింది తప్ప ఏమీ జరగదు అని తెలుసుకొని పూర్తి నమ్మకంతో ఉంటాడో అతనికి షహీద్ కు లభించే అటువంటి పుణ్యం లభిస్తుంది.”
[బుఖారీ 3474, ముస్నద్ అహ్మద్ 26139]
3) పూర్తి ప్రపంచం విపత్తులో ఉన్నప్పుడు నిర్బంధ ఆశ్రయం (Quarantine)లో క్షేమంగా ఉన్న ప్రవక్త ఎవరు?
C) నూహ్ (అలైహిస్సలాం)
నూహ్ అలైహిస్సలాం ప్రస్తావన ఖుర్ఆనులోని 13 సూరాలలో ఉంది
అయినప్పటికీ వాళ్లు ఆయన (మాట)ను అసత్యమని ధిక్కరించారు. మేము నూహును, నావలో అతని వెంట ఉన్న అతని సహచరులను రక్షించి, మా ఆయతులను ధిక్కరించిన వారందరినీ ముంచి వేశాము. నిశ్చయంగా వారు మరీ గ్రుడ్డి జనులుగా వ్యవహరించారు.
తుదకు మాఆదేశం వచ్చి, పొయ్యి పొంగినప్పుడు, “ఈ ఓడలోకి ప్రతి (జీవ)రాసి నుంచి రెండేసి (ఒకటి ఆడ, ఇంకొకటి మగ జంతువు) చొప్పున ఎక్కించుకో. నీ ఇంటి వారలను కూడా తీసుకో. ఎవరి విషయంలోనయితే ముందుగానే మాట ఖరారయిందో వారిని వదిలేయి. ఇంకా విశ్వాసులందరిని కూడా ఎక్కించుకో” అని మేము (అతనికి) చెప్పాము. అయితే అతనితో బాటు విశ్వసించిన వారు బహుకొద్ది మంది మాత్రమే. * “మీరు ఈ ఓడలో కూర్చోండి, అల్లాహ్ పేరుతోనే, దీని గమనం, దీనిఆగటం. నిశ్చయంగా నాప్రభువు అపారంగా క్షమించేవాడు, అమితంగా కరుణించేవాడు” అని (నూహు) అన్నాడు.
మరి నువ్వూ, నీ వెంటవచ్చిన వారూ ఓడలో పయన మయ్యాక, “దుర్మార్గుల బారి నుంచి మమ్మల్ని రక్షించిన అల్లాహ్‌కు కృతజ్ఞతలు” అని పలుకు. ఇంకా ఈ విధంగా వేడుకో: “నా ప్రభూ! నన్ను శుభప్రదమైన చోట దించు. నీవు ఎంతో సురక్షితంగా (క్షేమంగా) దించేవాడవు.”
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
Telugu Islamic Quiz (తెలుగు ఇస్లామిక్ క్విజ్) – పార్ట్ 32
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
ప్రశ్నల పత్రం – 32
1) నక్షత్రాల వల్ల కలిగే ప్రయోజనాలు ఏవి?
A) రాశి ఫలాలు – జ్యోతిష్యం కొరకు
B) వర్షం కురిసేందుకు – కోర్కెలు తీర్చేందుకు
C) ఆకాశపు అలంకరణ – షైతాన్ లను తరిమేందుకు – చీకటిలో మార్గం తెలుసు కునేందుకు
D) పై వాటిలో ఏదీకాదు
2) ఏ ప్రవక్తను ఉద్దేశించి అతని పట్ల వారు హద్దు మీరినట్లుగా ! మీరు నా విషయంలో హద్దు మీరి పొగడకండి అని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం ) తెలిపారు?
A) మూసా (అలైహిస్సలాం)
B) ఆదం (అలైహిస్సలాం)
C) ఈసా (అలైహిస్సలాం)
D) యహ్య (అలైహిస్సలాం)
3) ఇషా మరియు ఫజర్ నమాజ్ జమాఅత్ తో చెయ్యటం వల్ల ఎంత పుణ్యం లభిస్తుంది?
A) జీవితాంతం నమాజ్ చేసినంత
B) రోజంతా ఉపవాసం చేసినంత
C) పూర్తి రాత్రి తహజ్జుద్ చేసినంత
D) దినమంతా నమాజ్ చేసినట్లు
నిశ్చయంగా మేము ఆకాశంలో బురుజులను నిర్మించాము. చూపరుల కోసం దానిని అందంగా ముస్తాబు చేశాము. ఇంకా, దానిని ధూత్కారి అయిన ప్రతి షైతాను బారి నుంచి రక్షించాము. కాకపోతే దొంగచాటుగా (ఎవడైనా అక్కడి రహస్య విషయాలను) వినటానికి ప్రయత్నించినప్పుడు స్పష్టమైన అగ్నిజ్వాల ఒకటి వాడ్ని వెంటాడుతుంది.
“చీకట్లలోనూ, భూమిలోనూ, సముద్రంలోనూ మీరు మార్గం తెలుసుకునేందుకుగాను ఆయనే మీ కోసం నక్షత్రాలను సృష్టించాడు. మేము జ్ఞానం కలవారి కోసం మా సూచనలను బాగా విడమరచి చెప్పాము.”
2) ఏ ప్రవక్తను ఉద్దేశించి అతని పట్ల వారు హద్దు మీరినట్లుగా ! మీరు నా విషయంలో హద్దు మీరి పొగడకండి అని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం ) తెలిపారు?
C) ఈసా (అలైహిస్సలాం)
البخاري 3445:- عن عُمَرَ رَضِيَ اللَّهُ عَنْهُ، يَقُولُ عَلَى المِنْبَرِ: سَمِعْتُ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ: «لاَ تُطْرُونِي، كَمَا أَطْرَتْ النَّصَارَى ابْنَ مَرْيَمَ، فَإِنَّمَا أَنَا عَبْدُهُ، فَقُولُوا عَبْدُ اللَّهِ، وَرَسُولُهُ»
బుఖారీ 3445లో ఉంది, ఉమర్ (రజియల్లాహు అన్హు) మెంబర్ పై చెప్పారు, నేను ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పగా విన్నాను: “క్రైస్తవులు ఈసా బిన్ మర్యమ్ అలైహిస్సలాం విషయంలో హద్దులు మీరినట్లు మీరు నా విషయంలో హద్దులు మీరకండీ. నిశ్చయంగా నేను అల్లాహ్ యొక్క దాసుడ్ని, కనుక మీరు అల్లాహ్ దాసుడు మరియు అతని ప్రవక్త అని అనండి.”
3) ఇషా మరియు ఫజర్ నమాజ్ జమాఅత్ తో చెయ్యటం వల్ల ఎంత పుణ్యం లభిస్తుంది?
C) పూర్తి రాత్రి తహజ్జుద్ చేసినంత
ఇషా మరియు ఫజ్ర్ నమాజ్ సామూహికంగా (జమాఅత్ తో) చేయుట
ప్రవక్త ﷺ ఇలా సంబోధించారని, ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
నీ ప్రభువు ఆదం సంతతి వీపుల నుండి వారి సంతానాన్ని తీసి, స్వయంగా వారినే వారికి సాక్షులుగా పెట్టి, “నేను మీ ప్రభువును కానా?” అని అడిగినప్పుడు “ఎందుకు కావు? (నువ్వే మా ప్రభువువి). ఈ విషయానికి మేమంతా సాక్షులుగా ఉన్నాం” అని వారు చెప్పారు. ‘దీని గురించి మాకేమీ తెలియదు’ అని ప్రళయ దినాన మీరు అనకుండా ఉండటానికీ * లేదా “మొదట్లో మా పూర్వీకులు షిర్కుకు పాల్పడ్డారు. మేము వారి తరువాతివారి సంతతిలో పుట్టినవారము. ఆ దుర్జనులు చేసిన పాపానికి నువ్వు మమ్మల్ని వినాశానికి గురిచేస్తావా?!” అని మీరు అనకుండా ఉండటానికిగాను (మేము ముందే మీ నుండి ఈ విధంగా ఖరారు చేయించాము.) * వారు (బహుదైవారాధన నుండి ఏకదైవారాధన వైపుకు) మరలివస్తారేమోనని మేము ఈ విధంగా ఆయతులను విడమరచి చెబుతున్నాము.
సహీ ముస్లిం 2865లో ఉంది, ఇయాజ్ బిన్ హిమార్ (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు: అల్లాహ్ ఇలా తెలిపాడని: “నేను నా దాసులను ముస్లిములుగా, సత్యాన్ని స్వీకరించి బహుదైవత్వాలకు దూరంగా ఉండేవారిగా పుట్టించాను, కాని షైతానులు వారి వద్దకు వచ్చి వారిని సత్యధర్మం నుండి దూరం చేశారు, నేను వారి కొరకు హరాం (నిషిద్ధం) చేసిన దానిని హరాం చేశారు”.
అనస్ బిన్ మాలిక్ ఉల్లేఖించారు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు: “అల్లాహ్ ప్రళయదినాన అతితక్కువ నరక శిక్ష అనుభవిస్తున్న వ్యక్తిని అల్లాహ్ అడుగుతాడు: భూమిలో ఉన్న సమస్తం నీదై ఉంటే దానిని పరిహారంగా చెల్లించి నరకం నుండి రక్షణ పొందాలనుకుంటున్నావా? అతడు అవును అని అంటాడు, అప్పుడు అల్లాహ్ అంటాడు: నీవు ఆదం వీపులో ఉండగానే నేను నీతో దీనికంటే ఎంతో తేలికైన విషయం ఒకటి కోరాను: నీవు నాతో పాటు ఎవ్వరినీ భాగస్వామిగా చేయకు అని, కాని నీవు తిరస్కరించావు, నాకు భాగస్వాములకు నిలబెట్టావు”.
2) జ్యోతిష్యుని వద్దకు వెళ్లి సమాచారం అడిగేవాని ఎన్ని రోజుల నమాజ్ స్వీకరించబడదు?
C) 40 రోజుల
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారని సఫియ్య (రజియల్లాహు అన్హా) ప్రవక్తగారి ఒక భార్య ద్వారా ఉల్లేఖించారు:
“ఎవరైనా జ్యోతిష్యుని వద్దకు వచ్చి దేని గురించైనా అతన్ని ప్రశ్నిస్తే అతని నలబై రోజుల నమాజు స్వీకరించబడదు”. (ముస్లిం పదాలు 2230).
ఇది మనుషుల రూపంలో ఉన్నవారి వద్దకు వెళ్ళి అడగడం వరకే పరిమితం కాదు. ఈ రోజుల్లో కొందరు తమ జాతకలు తెలుసుకోడానికి టీవిలలో కొన్ని ప్రోగ్రామ్స్ ఫాలో అవుతుంటారు. మరి కొందరు స్మార్ట్ ఫోన్లో వచ్చిన ఆప్స్ లను ఫాలో అవుతారు
గుర్తుంచుకోండి:
వెబ్ సైట్లోకెల్లి జాతకం గురంచి వెతకడం కూడా ఈ హదీసులో వస్తుంది అందుకే చాలా జాగ్రత్తగా ఉండండి
మరో ముఖ్య విషయం: 40 రోజుల నమాజు అంగీకరింపబడదని అంటే వాటి పుణ్యం లభించదని భావం, కాని చేయకుండా ఉంటే అది మరింత ఘోరమైన పాపం అవుతుంది.
3) జనాజ నమాజ్ చేసి దానివెంట వెళ్లి ఖననం అయ్యేవరకు పాల్గొంటే ఎన్ని ఖిరాతుల పుణ్యం దొరుకుతుంది?
C) 02 ఖిరాతులు
జనాజ వెంట వెళ్ళడం, జనాజ నమాజు చేయడం
గొప్ప పుణ్య కార్యాల్లో ఒకటి; జనాజ వెంట వెళ్ళడం, జనాజ నమాజు చేయడం, దానిపై లభించే పుణ్యం బరువు మానవుని త్రాసులో ఉహద్ పర్వతం కంటే అధికిమించి ఉంటుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారని ఉబై బిన్ కఅబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః
“ఎవరు నమాజు మరియు (ఖననం) అయ్యే వరకు జానాజ వెంట ఉంటాడో అతనికి రెండు ఖీరాతులు, మరెవరయితే కేవలం నమాజు అయ్యే వరకు దాని వెంట ఉంటాడో అతనికి ఒక ఖీరాతు లభిస్తుంది. నా ప్రాణం ఎవరి చేతిలో ఉందో ఆయన (అంటే అల్లాహ్) సాక్షి! ఒక్క ఖీరాత్ బరువు అల్లాహ్ వద్ద ఉన్న త్రాసులో ఉహద్ పర్వతంకంటే ఎక్కువ ఉండును”. (అహ్మద్ 5/ 131 ఇది సహీ హదీస్).
ప్రవక్త ﷺ తెలిపారని, అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు;
“ఎవరు జనాజలో పాల్గొని నమాజు చేస్తాడో అతనికి ఒక ఖీరాత్, మరెవరయితే (నమాజు మరియు) ఖననం అయ్యే వరకు పాల్గొంటాడో అతనికి రెండు ఖీరాతులు లభించును”. రెండు ఖీరాతులంటే ఏమిటి? అని ప్రశ్న వచ్చినప్పుడు, ప్రవక్త చెప్పారు: “రెండు పెద్ద కొండల వంటివి”. (బుఖారి 1325, ముస్లిం 945, తిర్మిజి 1040, నిసాయి 1940, ఇబ్ను మాజ 1539, అహ్మద్ 2/ 401, ఇబ్ను హిబ్బాన్ 3080)
ముస్లింలో ఉంది; ఇబ్ను ఉమర్ (రజియల్లాహు అన్హు) జనాజ నమాజు చేసుకొని వెళ్ళేవారు, ఎప్పుడయితే వారికి అబూహురైరా (రజియల్లాహు అన్హు) గారి ఈ హదీసు చేరిందో ‘వాస్తవానికి మనం అనేక ఖీరాతులు పోగుట్టుకున్నాము’ అని బాధ పడ్డారు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
1) ఒక వ్యక్తి పుణ్యం మరియు పేరు ప్రఖ్యాతుల కొరకు పోరాటం చేస్తే అతనికి ఏమి దక్కుతుంది?
C] అతనికి ఏ పుణ్యం దక్కదు
ప్రతి కార్యానికి పునాది సంకల్పశుద్ధి. ఏ కార్యం ఎంత సంకల్ఫశుద్ధితో కూడుకొని ఉంటుందో త్రాసులో అంతే బరువుగా ఉంటుంది, అది కొంచమైనా సరే. ఒకవేళ చూపుగోలు, పేరు, ప్రఖ్యాతులతో సమ్మిళితమై ఉంటే త్రాసు తేలికగా ఉంటుంది, అది ఎంత ఎక్కువగా అయినప్పటికీ సూక్ష్మకణాలుగా, దుమ్ము, ధూళివలే అయిపోతుంది (అంటే రవ్వంత పుణ్యం లభించదు). అల్లాహ్ సుబ్ హానహు వతఆలా వద్ద కర్మల ఘనత, వాటిని చేసేవారి మనస్సులో ఉండే సంకల్పశుద్ధిని మరియు వారిలో ఉండే అల్లాహ్ పట్ల ప్రేమను బట్టి పెరుగుతూ, తరుగుతూ ఉంటుంది.
అబూ ఉమామహ్ బాహిలీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు ఓ మనిషి వచ్చి, ‘ఒక వ్యక్తి పుణ్యఫలం మరియు పేరుప్రఖ్యాతులనుద్దేశించి పోరాడుతుంటే అతనికి ప్రాప్తమయ్యేదేమిటి?’ అని అడిగాడు. “అతనికి ఏ పుణ్యమూ దక్కదు” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధానమిచ్చారు. ఆ మనిషి తిరిగి మూడు సార్లు అదే ప్రశ్న అడిగాడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “అతనికి ఏ పుణ్యమూ దక్కదు” అని మూడు సార్లు జవాబిచ్చారు, మళ్ళీ ఆ తర్వాత ఇలా చెప్పారు: “అల్లాహ్ సంకల్పశుద్ధితో, ఆయన అభీష్టాన్ని కోరుతూ చేసిన సత్కార్యాన్ని మాత్రమే స్వీకరిస్తాడు”. (నిసాయి 3140, తబ్రానీ కబీర్ 7628, సహీహుల్ జామి 1856).
అబ్దుల్లాహ్ బిన్ ముబారక్ రహిమహుల్లాహ్ చెప్పారు: ‘ఒక చిన్న కార్యాన్ని సంకల్పం గొప్పదిగా, పెద్దదిగా చేయవచ్చు, ఒక పెద్ద కార్యాన్ని సంకల్పం చిన్నదిగా చేయవచ్చు’. (జామిఉల్ ఉలూమి వల్ హికం, రచయితః ఇబ్ను రజబ్ అల్ హంబలీ 1/71).
మైమూన్ బిన్ మహ్రాన్ రహిమహుల్లాహ్ చెప్పారు: ‘మీ ఆచరణలు ఉన్నవే చాలా తక్కువ, ఆ తక్కువవాటిని సంకల్పశుద్ధితో ఆచరించండి’. (హిల్ యతుల్ ఔలియా వ తబ్ ఖతుల్ అస్ఫియా, రచయితః అబూ నుఐమ్ 4/92).
ఇఖ్లాస్ (సంకల్పశుద్ధి)తో కూడుకొని ఉన్న సత్కార్యం యొక్క పుణ్యం ఎలా పెరుగుతుందో ఈ హదీసు చదవండి. అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: ప్రవక్త ﷺ చెప్పారు:
“ఒక దిర్హమ్ ఒక లక్ష దిర్హములపై గెలుపొందింది”. అదెలా ప్రవక్తా! అని సహచరులు అడగ్గా, ఇలా సమాధానమిచ్చారుః “ఒక వ్యక్తి వద్ద రెండే రెండు దిర్హములు ఉండగా అతను అందులో నుండి ఒక దిర్హమ్ దానం చేశాడు, మరో వ్యక్తి తన ధన బంఢారం వైపనకు వెళ్ళి అందులో నుండి ఒక లక్ష దానం చేశాడు”.
“ما أهلَّ مُهِلٌّ قط إلا بُشِّرَ، ولا كَبَّر مُكَبِّرٌ قط إلا بُشِّرَ”. قيل: يا رسول الله! بالجنة؟ قال: “نعم”.
తల్బియా చదివిన మరియు అల్లాహు అక్బర్ అని పలికిన వారికి శుభవార్త ఇవ్వడం జరుగుతుంది, ప్రవక్తా! స్వర్గ శుభవార్తనా? అని అడిగారు, అందుకు ప్రవక్త అవును అని చెప్పారు.
3) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం ) తెల్పినటువంటి ” నాలుకపై సులభంగానూ ..త్రాసులో బరువుగానూ ఉండే ఆ రెండు వాక్యాలు ఏవి ?
సహీ బుఖారీలోని చివరి హదీసు, అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త ﷺ తెలిపారుః
كَلِمَتَانِ خَفِيفَتَانِ عَلَى اللِّسَانِ، ثَقِيلَتَانِ فِي المِيزَانِ، حَبِيبَتَانِ إِلَى الرَّحْمٰنِ: سُبْحَانَ الله وَبِحَمْدِهِ ، سُبْحَانَ الله العَظِيمِ
“రెండు పదాలున్నాయి, అవిః నాలుకపై చాలా సులభంగా, త్రాసులో బరువుగా మరియు కరుణామయునికి చాలా ప్రియమైనవి. అవేః సుబ్ హానల్లాహి వబిహందిహీ సుబ్ హానల్లాహిల్ అజీం”. (బుఖారి 6406, ముస్లిం 2694).
అనేక మందికి ఈ రెండు పదాల ఘనత తెలుసు, కాని త్రాసు బరువు కావటానికి చదివేవారు చాలా అరుదు. (మరికొందరికైతే) ఏదైనా కల్చరల్ ప్రోగ్రాముల్లో పోటాపోటీలు, కాంపిటేషన్లు జరుగుతున్నప్పుడు అందులో ఇలాంటి ప్రశ్న ఏదైనా వచ్చినప్పుడు అవి గుర్తుకు వస్తాయి. (ఇది ఎంత దారుణంॽॽॽ).
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.