తెలుగు ఇస్లామిక్ క్విజ్: పార్ట్ 33 [ఆడియో]

బిస్మిల్లాహ్

Telugu Islamic Quiz (తెలుగు ఇస్లామిక్ క్విజ్) – పార్ట్ 33
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ప్రశ్నల పత్రం – 33

1) పొంచిఉన్న ప్రమాద హెచ్చరిక అందిన వెంటనే బాధ్యతతో తమ ఇంటిలోకి (Quarantine) వెళ్లిన ఆ జీవ సమూహం ఏది ? (ఖుర్ఆన్ నుండి)

A) తేనెటీగల గుంపు
B) సాలె పురుగులు
C) చీమల దండు

2) ప్రస్తుత లాక్ డౌన్ కాలంలో విధి వ్రాతపై నమ్మకం ఉంచి ఇంట్లోనే (Quarantine) ఉండేవారి ఘనత ఏమిటి ?

A) హాజీ
B) షహీద్
C) ముస్లిం

3) పూర్తి ప్రపంచం విపత్తులో ఉన్నప్పుడు నిర్బంధ ఆశ్రయం (Quarantine)లో క్షేమంగా ఉన్న ప్రవక్త ఎవరు ?

A) మూసా (అలైహిస్సలాం)
B) ఈసా (అలైహిస్సలాం)
C) నూహ్ (అలైహిస్సలాం)

క్విజ్ 33: సమాధానాలు & వివరణ ఇక్కడ వినండి /డౌన్లోడ్ చేసుకోండి [7:52 నిమిషాలు]


1) పొంచిఉన్న ప్రమాద హెచ్చరిక అందిన వెంటనే బాధ్యతతో తమ ఇంటిలోకి (Quarantine)వెళ్లిన ఆ..జీవ సమూహం ఏది ? (ఖుర్ఆన్ నుండి)

C] చీమల దండు

النمل 27:18 حَتَّىٰ إِذَا أَتَوْا عَلَىٰ وَادِ النَّمْلِ قَالَتْ نَمْلَةٌ يَا أَيُّهَا النَّمْلُ ادْخُلُوا مَسَاكِنَكُمْ لَا يَحْطِمَنَّكُمْ سُلَيْمَانُ وَجُنُودُهُ وَهُمْ لَا يَشْعُرُونَ

చివరకు వారంతా ఒక చీమల లోయకు చేరుకున్నప్పుడు ఒక చీమ ఇలా ప్రకటించింది: “ఓ చీమల్లారా! సులైమాను, అతని సైన్యాలు తెలీకుండా మిమ్మల్ని నలిపివేసే స్థితి ఏర్పడకుండా ఉండేందుకు, మీరు మీ మీ పుట్టలలోనికి దూరిపోండి.”

2) ప్రస్తుత లాక్ డౌన్ కాలంలో విధి వ్రాతపై నమ్మకం ఉంచి ఇంట్లోనే (Quarantine) ఉండేవారి ఘనత ఏమిటి?

B] షహీద్

البخاري 3474 ، مسند أحمد 26139:- لَيْسَ مِنْ أَحَدٍ يَقَعُ الطَّاعُونُ، فَيَمْكُثُ فِي بَلَدِهِ صَابِرًا مُحْتَسِبًا، يَعْلَمُ أَنَّهُ لاَ يُصِيبُهُ إِلَّا مَا كَتَبَ اللَّهُ لَهُ، إِلَّا كَانَ لَهُ مِثْلُ أَجْرِ شَهِيدٍ»

ఆయిషా (రజియల్లాహు అన్హా) ఉల్లేఖించారు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు:

“ఎక్కడ ప్లేగు వ్యాధి వ్యాపిస్తుందో అక్కడ మనిషి ఓపిక సహనాలతో, అల్లాహ్ తో పుణ్యాన్ని ఆశిస్తూ తన ప్రాంతంలోనే ఉంటాడో (ముస్నద్ అహ్మద్ లో ఉంది: తన ఇంట్లోనే ఉంటాడో) ఇంకా అల్లాహ్ వ్రాసి పెట్టింది తప్ప ఏమీ జరగదు అని తెలుసుకొని పూర్తి నమ్మకంతో ఉంటాడో అతనికి షహీద్ కు లభించే అటువంటి పుణ్యం లభిస్తుంది.”

[బుఖారీ 3474, ముస్నద్ అహ్మద్ 26139]

3) పూర్తి ప్రపంచం విపత్తులో ఉన్నప్పుడు నిర్బంధ ఆశ్రయం (Quarantine)లో క్షేమంగా ఉన్న ప్రవక్త ఎవరు?

C) నూహ్ (అలైహిస్సలాం)

నూహ్ అలైహిస్సలాం ప్రస్తావన ఖుర్ఆనులోని 13 సూరాలలో ఉంది

సూర ఆరాఫ్ 7:59-64

7:64 فَكَذَّبُوهُ فَأَنجَيْنَاهُ وَالَّذِينَ مَعَهُ فِي الْفُلْكِ وَأَغْرَقْنَا الَّذِينَ كَذَّبُوا بِآيَاتِنَا ۚ إِنَّهُمْ كَانُوا قَوْمًا عَمِينَ

అయినప్పటికీ వాళ్లు ఆయన (మాట)ను అసత్యమని ధిక్కరించారు. మేము నూహును, నావలో అతని వెంట ఉన్న అతని సహచరులను రక్షించి, మా ఆయతులను ధిక్కరించిన వారందరినీ ముంచి వేశాము. నిశ్చయంగా వారు మరీ గ్రుడ్డి జనులుగా వ్యవహరించారు.

సూర యూనుస్ 10:71-74

సూర హూద్ 11:25-48 చదవండి,

11:40 حَتَّىٰ إِذَا جَاءَ أَمْرُنَا وَفَارَ التَّنُّورُ قُلْنَا احْمِلْ فِيهَا مِن كُلٍّ زَوْجَيْنِ اثْنَيْنِ وَأَهْلَكَ إِلَّا مَن سَبَقَ عَلَيْهِ الْقَوْلُ وَمَنْ آمَنَ ۚ وَمَا آمَنَ مَعَهُ إِلَّا قَلِيلٌ * وَقَالَ ارْكَبُوا فِيهَا بِسْمِ اللَّهِ مَجْرَاهَا وَمُرْسَاهَا ۚ إِنَّ رَبِّي لَغَفُورٌ رَّحِيمٌ

తుదకు మాఆదేశం వచ్చి, పొయ్యి పొంగినప్పుడు, “ఈ ఓడలోకి ప్రతి (జీవ)రాసి నుంచి రెండేసి (ఒకటి ఆడ, ఇంకొకటి మగ జంతువు) చొప్పున ఎక్కించుకో. నీ ఇంటి వారలను కూడా తీసుకో. ఎవరి విషయంలోనయితే ముందుగానే మాట ఖరారయిందో వారిని వదిలేయి. ఇంకా విశ్వాసులందరిని కూడా ఎక్కించుకో” అని మేము (అతనికి) చెప్పాము. అయితే అతనితో బాటు విశ్వసించిన వారు బహుకొద్ది మంది మాత్రమే. * “మీరు ఈ ఓడలో కూర్చోండి, అల్లాహ్‌ పేరుతోనే, దీని గమనం, దీనిఆగటం. నిశ్చయంగా నాప్రభువు అపారంగా క్షమించేవాడు, అమితంగా కరుణించేవాడు” అని (నూహు) అన్నాడు.

సూర అంబియా 21:76-77
సూరా మూ‘మినూన్ 23:23-31

23:28 فَإِذَا اسْتَوَيْتَ أَنتَ وَمَن مَّعَكَ عَلَى الْفُلْكِ فَقُلِ الْحَمْدُ لِلَّهِ الَّذِي نَجَّانَا مِنَ الْقَوْمِ الظَّالِمِينَ * وَقُل رَّبِّ أَنزِلْنِي مُنزَلًا مُّبَارَكًا وَأَنتَ خَيْرُ الْمُنزِلِينَ

మరి నువ్వూ, నీ వెంటవచ్చిన వారూ ఓడలో పయన మయ్యాక, “దుర్మార్గుల బారి నుంచి మమ్మల్ని రక్షించిన అల్లాహ్‌కు కృతజ్ఞతలు” అని పలుకు. ఇంకా ఈ విధంగా వేడుకో: “నా ప్రభూ! నన్ను శుభప్రదమైన చోట దించు. నీవు ఎంతో సురక్షితంగా (క్షేమంగా) దించేవాడవు.”

సూర ఫుర్కాన్ 25:37
సూర షుఅరా 26:105-122
సూర అన్కబూత్ 29:14-15
సూర సాఫ్ఫాత్ 37:75-82
సూర జారియాత్ 51:46
సూర ఖమర్ 54:9-16
సూర తహ్రీమ్ 66:10
సూర నూహ్ 71:1-28

ఇతరములు :

తెలుగు ఇస్లామిక్ క్విజ్ (ఆడియో సిరీస్) మెయిన్ పేజీ :
https://teluguislam.net/others/telugu-islamic-quiz

%d bloggers like this: