https://youtu.be/q1WOtndCOOY [31 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఈ సూరా మక్కా కాలానికి చెందినది. ఇందులో 3 ఆయతులు ఉన్నాయి. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)కు అల్లాహ్ ప్రసాదించిన అనుగ్రహాలను ఈ సూరాలో ముఖ్యంగా ప్రస్తావించడం జరిగింది. మొదటి ఆయతులో వచ్చిన ‘కౌసర్’ (సమృద్ధి) అన్న పదాన్నే ఈ సూరాకు పేరుగా పెట్టడం జరిగింది. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)కు ప్రసాదించబడిన అసంఖ్యాక అనుగ్రహాలను ప్రస్తావిస్తూ, అల్లాహ్ ను కొనియాడాలని, ఆయనకు కృతజ్ఞత చూపాలని బోధించడం జరిగింది. అవిశ్వాసుల వైరం, వారి గర్వం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను ఏమాత్రం నష్టపరచలేవని హామీ ఇవ్వడం జరిగింది. ఈ సూరాను సూరతు’న్నహ్ర్’గా కూడా వ్యవహరిస్తారు.
Read More “సూరా అల్ కౌసర్ (అత్యధిక శుభాలు) – ఖురాన్ తఫ్సీర్ (వ్యాఖ్యానం) [వీడియో]”