దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
రచన: ఫజీలతుష్షేక్ అల్లామ ముహమ్మద్ బిన్ సాలిహ్ అల్ ఉసైమీన్ (అల్లాహ్ ఆయనను,ఆయన తల్లిదండ్రులను మరియు సమస్తముస్లింలను మన్నించుగాక!)
అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభం.
సమస్త స్తుతులు అల్లాహ్’కు మాత్రమే అంకితం, మేము ఆయనను స్తుతిస్తున్నాము, ఆయనతో సహాయం అర్ధిస్తున్నాము, ఆయనతో మన్నింపులు వేడుకుంటున్నాము మరియు ఆయన వైపుకు మాత్రమే మరలుతున్నాము!అలాగే మా హృదయాల కీడు నుండి, దుష్కర్మల నుండి అల్లాహ్’తో శరణు వేడుకొంటున్నాము.ఎవరికైతే అల్లాహ్ సన్మార్గం చూపుతాడో అతన్ని ఎవరు మార్గభ్రష్టుడిగా మార్చలేరు, ఎవరినైతే ఆయన మార్గబ్రష్టుడిగా చేస్తాడో అతనికెవరూ సన్మార్గం చూపరు.ఇంకా అల్లాహ్ తప్ప మరో నిజఆరాధ్యుడు లేడని, ఆయన ఏకైకుడని, ఆయనకు ఎవ్వరూ భాగస్వాములు లేరని నేను సాక్ష్యమిస్తున్నాను.మరియు ముహమ్మద్ ఆయన యొక్క దాసుడు, ప్రవక్త అని సాక్ష్యమిస్తున్నాను.ఆయనపై,ఆయన కుటుంబీకులపై,ఆయన సహచరులపై మరియు ప్రళయదినం వరకు ఆయనను అత్యుత్తమంగా అనుసరించే అనుచరసమాజం పై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు వర్షించుగాక!
అమ్మాబాద్! నిస్సందేహంగా స్త్రీలు క్రమంగా సహజ రుతుస్రావం, ఇస్తిహాజా మరియు (నిఫాస్) పురిటిరక్తానికి లోనవుతూ ఉంటారు, ఇది ప్రధాన అంశాలలో ఒకటి కనుక దీనికి సంబంధించిన ఆదేశాలను వివరించడం, అవగాహన కల్పించడం మరియు విజ్ఞులు చెప్పిన విషయాలలో తప్పుడు వివరణల నుండి సరైన జ్ఞానం వైపుకు మార్గదర్శనం చేయడం చాలా అవసరం.కాబట్టి ప్రముఖులు చెప్పిన మాటల్లో సమంజసమైనవి లేక బలహీనమైనవి ఏమిటి అని ఖరారు చేయడంలో మేము ఖుర్ఆను మరియు సున్నతు మార్గాన్ని అవలంభిస్తాము.
1-ఎందుకంటే ఈ రెండు ప్రధాన మూలాలు, వీటి ఆధారంగానే షరీఅతుకు సంబంధించిన ఆదేశాలు, ఆరాధనలు మరియు విధులు దాసులకు నిర్దేశించ బడతాయి.
2-ఈ విధంగా ఖుర్ఆను మరియు సున్నతులను ఆధారం చేసుకోవడం వలన మనసుకు శాంతి చేకూరుతుంది,హృదయాలు తెరుచుకుంటాయి ఆత్మకు తృప్తికలుగుతుంది మరియు బాధ్యతలు తీరుతాయి.
3- కావున ఈ రెండు కాకుండా ఇతర మూలాల కోసం సాక్ష్యం తీసుకోబడింది కానీ వాటినే సాక్ష్యంగా పరిగణించబడదు.
ఎందుకంటే,ప్రామాణిక అభిప్రాయం ప్రకారం, హుజ్జతు (రుజువు) కేవలం అల్లాహ్ వాక్కుయగు ఖుర్ఆను మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మాటలలో మాత్రమే ఉంది, అలాగే పండితులగు సహాబాల తీర్పులలో ఉంది, ఆయితే ఆ తీర్పులు ఖుర్ఆను మరియు సున్నత్ లకు విరుద్ధంగా ఉండకూడదు.అలాగే మరొక సహాబీ అభిప్రాయం దీనికి వ్యతిరేకంగా ఉండకూడదు ఒకవేళ అది ఖుర్ఆను మరియు సున్నతులకు వ్యతిరేకంగా ఉన్నట్లయితే అప్పుడు ఖుర్ఆను సున్నతులోని ఆదేశాన్ని పాటించడం తప్పనిసరి అవుతుంది.ఒకవేళ ఈ సహాబీ అభిప్రాయానికి మరొక సహాబీ అభిప్రాయం విరుద్ధంగా ఉంటే, అప్పుడు ఈ రెండు అభిప్రాయాల మధ్య తర్జీహ్ అవసరం పడుతుంది ఆ రెండింటిలో ప్రాధాన్యత పర్చబడ్డ రాజిహ్ అభిప్రాయం తీసుకోబడుతుంది
.لقوله تعالى: {فَإِن تَنَازَعْتُمْ فِي شَيْءٍ فَرُدُّوهُ إِلَى اللّهِ وَالرَّسُولِ إِن كُنتُمْ تُؤْمِنُونَ بِاللّهِ وَالْيَوْمِ الآخِرِ ذَلِكَ خَيْرٌ وَأَحْسَنُ تَأْوِيلا } [النساء:59]. అల్లాహ్ సెలవిచ్చాడు:{“ఒకవేళ ఏ విషయంలోనయినా మీ మధ్య వివాదం తలెత్తితే దానిని అల్లాహ్ మరియు ప్రవక్త వైపునకు మరల్చండి -మీకు నిజంగానే అల్లాహ్ పై, అంతిమ దినంపై నమ్మకం ఉన్నట్లయితే (మీరిలా చేయటం అనివార్యం).ఇదే మేలైన పద్ధతి. పరిణామం రీత్యా కూడా ఇదే అన్నింటికంటే ఉత్తమమైనది”.}(అల్ నిసా:59)
ఇది స్త్రీల సహజ రక్తసంబంధిత విషయాలు మరియు ఆదేశాలను వివరించే చిరుపుస్తకం, వీటిని వివరించే పుస్తకం చాలా అవసరం.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
సంకలనం: అమల్ అన్-నష్వాన్. సమీక్ష: సనావుల్లాహ్ సిద్ధీఖి, ప్రత్యక్ష వ్యాఖ్యాత, అల్ మస్జిద్ అల్ హరమ్. తెలుగు అనువాదం: ముహమ్మద్ కరీముల్లాహ్.
బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్ అనంత కరుణాప్రదాత, అపార కృశీలుడైన అల్లాహ్ పేరుతో
తొలి అభిప్రాయం
బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్
సకల ప్రశంసలు, స్తోత్రములు, కృతజ్ఞతలు సర్వ లోకాల ప్రభువైన అల్లాహ్ కే శోభిస్తాయి మరియు అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, ఆయన కుటుంబీకులపై మరియు ఆయన సహచరులపై అనేక దీవెనలు వర్షించు గాక!
అమల్ బింత్ ఇబ్రాహీం అన్-నష్వాన్ రచించిన “దుఆ: అల్లాహ్ అనుబంధానికి తాళంచెవి” అనే సంకలనం గురించి నాకు తెలిసినది. ఇది కీలకమైన ప్రముఖ సమస్యలను వివరించే ప్రయోజనకరమైన సంకలనం అని గుర్తించాను. దీనిని సంకలనం చేయడంలో అనుసరించిన ఆచరణాత్మక విధానాలు పూర్తిగా ప్రయోజనకరంగా మరియు అత్యుత్తమంగా ఉన్నాయి. దీనిని అమూల్యమైనదిగా చేయమని మరియు ఈ ప్రయోజనకరమైన పనికి బదులుగా దీని రచయిత్రికి తగిన ప్రతిఫలం ప్రసాదించమని నేను అల్లాహ్ ను అర్థిస్తున్నాను. రచయిత్రి యొక్క అభ్యర్థన మేరకు, నేను ఈ తొలి అభిప్రాయాన్ని వ్రాసాను.
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, ఆయన కుటుంబీకులపై మరియు ఆయన సహచరులపై అనేక దీవెనలు వర్షించు గాక!
డాక్టర్ ఫాలిహ్ బిన్ ముహమ్మద్ అస్-సగీర్.
విషయసూచిక
1.తొలి అభిప్రాయం 2. అంకితం 3. ఒక అద్భుత ఆశాకిరణం 4. పీఠిక 5. దుఆ: ఒక అనుగ్రహం, దీవెన, ఆశీర్వాదం 6. దుఆ యొక్క ప్రాముఖ్యత 7. దుఆలో పాటించవలసిన ఆవశ్యకతలు మరియు మర్యాదలు 8. కొన్ని యథార్థ గాథలు 9. చివరి మాట
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
2వ పాఠం : ‘కలిమా’లోని కోణాలన్నీ మీకు తెలిసి వుండాలి
అసలు ‘కలిమా‘ అంటే ఏమిటి?
“లా ఇలాహ ఇల్లల్లాహ్, ముహమ్మదుర్రసూలుల్లాహ్”
అనువాదం: అల్లాహ్ తప్ప వేరొక నిజ ఆరాధ్య దైవం లేడు. ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అల్లాహ్ యొక్క ప్రవక్త, సందేశహరులు”.
– కలిమా అంటే ఇదే!
మీ విశ్వాసానికి బలం ‘కలిమా’ భావం
ఇస్లాంలో ప్రవేశించటానికి ఏకైక ద్వారం కలిమా. ‘కలిమా’ను ఎంతగా అర్థం చేసుకుంటే అంతగా విశ్వాసం బలపడుతుంది. తద్వారా ఇతరులకు కూడా ఇస్లాం గురించి చక్కగా బోధించటానికి వీలవుతుంది.
ఇస్లాంలో ప్రవేశించటానికి బాప్తిజం (Baptism) అవసరం లేదు
ఈ పాఠంలో చెప్పబడిన ప్రకారంగా కలిమా (సద్వచనం)ను మనసా, వాచా, కర్మణా పఠించిన వారెవరైనా ముస్లింలు అవుతారు. ముస్లిం కావటానికి మతపెద్దల ద్వారా బాప్తిజము పొందవలసిన అవసరం లేదు. మరే పూజలూ, ఆచారాలు ఇస్లాంలో ప్రవేశించటానికి అవసరం ఉండవు.
సద్వచనం (కలిమా) సారాంశం
విశ్వాసానికి (ఈమాన్ కు) మూలమైన “లా ఇలాహ ఇల్లల్లాహ్, ముహమ్మదుర్రసూలుల్లాహ్” అనే కలిమాలో రెండు అంశాలున్నాయి.
ఒకటి : లా ఇలాహ ఇల్లల్లాహ్. రెండవది: ముహమ్మదు రసూలుల్లాహ్.
‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ అంటే అల్లాహ్ తప్ప వేరొక నిజ ఆరాధ్య దైవం లేడని అర్థం. ఇందులో కూడా రెండు భావనలు ఇమిడి ఉన్నాయి.
1) తిరస్కరణ (మనఃపూర్వకంగా నిరాకరించటం) 2) ధృవీకరణ (మనసారా ఒప్పుకుంటూ పైకి గట్టిగా చెప్పటం)
మొదటిది:
దైవత్వం అనేది మహోన్నతుడైన అల్లాహ్ కు స్వంతం. కాబట్టి ఒక్కడైన అల్లాహ్ ను కాదని వేరెవరికయినా దైవత్వాన్ని ఆపాదించటాన్ని కలిమా (సద్వచనం)లోని ఈ భాగం ఖండిస్తుంది. ఉదాహరణకు: దైవదూతలు, ప్రవక్తలు, పుణ్యపురుషులు, వలీలు, స్వాములు, విగ్రహాలు, ప్రపంచ రాజ్యాధికారులు – వీరెవరూ దేవుళ్ళు కారు. కాబట్టి వీరిలో ఏ ఒక్కరూ ఆరాధనలకు, సృష్టి దాస్యానికి అర్హులు కారు.
రెండవది :
కలిమాలోని రెండవ భాగం ప్రకారం అల్లాహ్ మాత్రమే నిజ ఆరాధ్య దైవం. కనుక ఈ మొత్తం కలిమాను అంగీకరించిన వారు అల్లాహ్ యే నిజ ఆరాధ్య దైవమని నమ్మి నడుచుకోవాలి. తమ సమస్త ఆరాధనలను, ఉపాసనలను ఆయనకే ప్రత్యేకించుకోవాలి. దైవత్వంలో అల్లాహ్ కు భాగస్వామిగా వేరొకరిని నిలబెట్టకూడదు. అంటే అల్లాహ్ ఆరాధనతో పాటు ఇతరులను ఆరాధించకూడదు.
ముహమ్మదుర్రుసూలుల్లాహ్ అంటే…
“ఓ అల్లాహ్ ! ముహమ్మద్ (సఅసం) నీ సందేశహరుడు” అని నోటితో పలకటమేగాక హృదయపూర్వకంగా ఈ వాక్కును విశ్వసించటం. అంటే అల్లాహ్ ఆజ్ఞలను శిరసావహించిన మీదట, అంతిమ దైవప్రవక్త అయిన ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) చూపిన మార్గమే అనుసరణీయమని మీరు మాటిస్తు న్నారు.
అల్లాహ్ స్వయంగా ఇలా సెలవిచ్చాడు-
“ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) మీ మగవారిలో ఎవరికీ తండ్రికారు. అయితే ఆయన అల్లాహ్ యొక్క సందేశహరుడు. ప్రవక్తల పరంపరను పరిసమాప్తం చేసే (చివరి) వారు. అల్లాహ్ ప్రతిదీ తెలిసినవాడు.” (ఖుర్ఆన్ 33: 40)
“దైవప్రవక్త మీకు ఇచ్చిన దానిని (సంతోషంగా) పుచ్చుకోండి. ఆయన ఏ విషయం నుండైనా మిమ్మల్ని వారిస్తే, దాన్ని వదిలి పెట్టండి.” (ఖుర్ఆన్ 59 : 7)
(ఓ ప్రవక్తా) వారికి చెప్పు:
“మీకు నిజంగానే అల్లాహ్ పట్ల ప్రేమ ఉంటే మీరు నన్ను అనుసరించండి.” (ఖుర్ఆన్ 3: 31)
దివ్యఖుర్ఆన్లోని పై వాక్యాల ద్వారా బోధపడేదేమిటంటే ఇస్లాం ధర్మంలో అల్లాహ్ మరియు ఆయన అంతిమ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పినట్లుగా నడుచుకోవాలి. ఇతరత్రా వ్యక్తుల అభిప్రాయాలు అల్లాహ్ గ్రంథానికి (ఖుర్ఆను), దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) విధానానికి, ఆయన సూచించిన చట్టాలకు, ఆయన ఇచ్చిన ఆజ్ఞలకు, ఆరాధనా పద్ధతులకు, ప్రవచనాలకు (ఒక్క మాటలో చెప్పాలంటే ప్రవక్త సున్నతుకు) అనుగుణంగా ఉంటే స్వీకరిం చాలి. లేదంటే వాటిని త్రోసిపుచ్చాలి.
‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ మన నుండి కోరేదేమిటి?
1. జ్ఞానం: అల్లాహ్ యే సిసలైన ఆరాధ్యదైవమని మనం తెలుసుకోవాలి. మన ఆరాధనలు, ఉపాసనలు ఆయనకు మాత్రమే ప్రత్యేకించ బడాలి. అల్లాహ్ తప్ప వేరితర దేవుళ్ళంతా మిథ్య, అసత్యం, బూటకం. వారిలో ఏ ఒక్కరూ లాభంగానీ, నష్టంగానీ కలిగించ లేరన్న వాస్తవాన్ని గుర్తెరగాలి.
2. దృఢ నమ్మకం: అల్లాహ్ ఒక్కడే నిజదైవమనీ, దైవత్వం ఆయనకే సొంతమని విశ్వసించటంలో ఎలాంటి సందేహానికి, సంకోచానికి, ఊగిసలాటకు తావు ఉండరాదు.
3. సమ్మతి, అంగీకారం: ఈ ప్రకటనతో ముడిపడి ఉన్న నియమ నిబంధనలను, షరతులన్నింటినీ ఒప్పుకోవాలి.
4. సమర్పణ : అల్లాహ్ యే ప్రభువు, పోషకుడనీ, ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అల్లాహ్ తరఫున మానవ మార్గదర్శకత్వం నిమిత్తం పంపబడిన ఆఖరి ప్రవక్త అనే విషయానికి కట్టుబడి ఉంటానని మాట ఇవ్వాలి. ఆ మాటను కడదాకా నిలబెట్టుకోవాలి. దానిపట్ల ఆత్మసమర్పణా భావంతో మసలుకోవాలి.
5. నిజాయితి: కలిమా కోరే అంశాలను మనస్ఫూర్తిగా, నిజాయితీగా నెరవేర్చాలి.
6. చిత్తశుద్ధి : అల్లాహ్ ను ఆరాధించే విషయంలో ఎలాంటి కల్మషం, కపటత్వం ఉండకూడదు. నిష్కల్మషమైన మనసుతో ధర్మాన్ని అల్లాహ్ ప్రత్యేకించుకుని మరీ ఆరాధించాలి. అన్ని రకాల ఆరాధనలను కేవలం అల్లాహు మాత్రమే అంకితం చేయాలి.
7. ప్రేమ: మహోన్నతుడైన అల్లాహు ను, ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను, వారికి విధేయులై ఉండే సాటి సోదరులందరినీ, అనగా ముస్లింలందరినీ హృదయపూర్వకంగా ప్రేమించాలి.
మొత్తమ్మీద అర్థమయ్యేదేమిటంటే అల్లాహ్ కు ఆజ్ఞాబద్ధులై నడుచు కోవాలి. ఆయనకు విధేయత చూపాలి. ఆయన చేయమన్న దానిని చేయాలి. చేయకూడదన్న దానికి దూరంగా ఉండాలి. అప్పుడే మన మనస్సుల్లో విశ్వాస (ఈమాన్) బీజం నాటుకుంటుంది. అల్లాహ్ కు విధేయత చూపటమంటే ఆయన్ని ప్రేమించటం, ఆయన విధించే శిక్షలకు భయపడటం, ఆయన ప్రతిఫలం ఇస్తాడని ఆశపడటం, క్షమాపణకై ఆయన్ని వేడుకోవటం, మహాప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉపదేశాలను, ఆదేశాలను ఖచ్చితంగా అనుసరించటం.
అల్లాహ్ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)కు షరీఅతును (ఇస్లామీయ చట్టాలను, ధార్మిక నియమావళిని) ఇచ్చి పంపాడు. ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) షరీఅతు రాకతో గతకాలపు చట్టాలు, ధార్మిక నిబంధనలు అన్నీ రద్దయిపోయాయి. ఇప్పుడు ఈ షరీఅతు అన్ని విధాలుగా గత షరీఅతులన్నిటి కంటే సమున్నతంగా, సంపూర్ణంగా ఉంది.
—
ప్రతి ముస్లింకు ప్రాథమిక పాఠాలు[PDF][మొబైల్ ఫ్రెండ్లీ] సంకలనం : అబ్దుల్ అజీజ్ సాలెహ్ అష్ షౌమార్,సౌదీఅరేబియా. ఈ పుస్తకం షేఖ్ ఇబ్నె బాజ్ (రహిమహుల్లాహ్) గారి మూలరచన “అద్దురూసుల్ ముహిమ్మ లిఆమ్మతిల్ ఉమ్మహ్” యొక్క వ్యాఖ్యానంతో కూడుకున్న పుస్తక సంకలనం
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
మీ చుట్టూ వున్న ఈ భూప్రపంచంలోని వస్తువులను పరిశీలించండి. మొక్కలు, వృక్షాలు, జంతువులు, పక్షులు, చేపలు అన్నిటి పై యోచన చేయండి. ఏం అర్థమవుతోంది? అన్నీ తమదంటూ వున్న ఒక నిర్ణీత పద్ధతిలో జీవితం గడుపుతున్నట్లు కనిపించటం లేదూ?! ఆకాశంలోని సూర్య చంద్ర నక్షత్రాలను, మేఘాలను ఓసారి గమనించండి. అన్నీ సవ్యం గానే పని చేస్తున్నాయి కదా! అవి సవ్యంగా పనిచేయకపోతే ఈ భూమ్మీద మనిషికి మనుగడ ఉండేదా? అవన్నీ మన కోసమే పని చేస్తున్నట్లు ఉన్నాయి కదూ?!
ఎంతో దూరం ఎందుకు? మిమ్మల్ని మీరే పరిశీలించుకోండి. మీ దేహాల్ని, మీ శరీర అవయవాలను, ఇంకా మీ శరీరంలోని జీవన ప్రక్రియలను గురించి కాస్తంత లోతుగా ఆలోచించండి. ఆరోగ్యవంతమైన మీ జీవితాన్ని కాపాడేందుకు అవి తపనపడి పోతున్నట్లు లేదూ? మిమ్మల్ని క్షేమంగా బతికించి ఉంచేందుకు మీ దేహంలోని వివిధ వ్యవస్థలు పరస్పరం ఎంత సమన్వయంగా పనిచేస్తున్నాయో చూడండి!
ఈ అద్భుత వస్తువులను ఎవరు సృష్టించారు? క్షణం కూడా ఆగకుండా సక్రమంగా పనిచేస్తున్న ఈ అంతుబట్టని వ్యవస్థకు సృష్టికర్త ఎవరు? అనంతమైన, ఊహలకు సైతం అందని ఈ సువిశాల విశ్వాన్ని నడుపుతున్నది ఎవరు?
ఈ విశ్వమంతటినీ తానే సృష్టించానని ప్రకటించిన సాహసవంతుడు ఇంతవరకు ఎవరూ పుట్టలేదు? కనీసం తమలో ఆ శక్తి వుందని చెప్పిన ఘనులు కూడా లేరు?
ఈ విశ్వమంతటినీ సృష్టించినది, ఇంకా దీనిని నడిపిస్తున్నది ఒకే ఒక్కరు అని మాత్రం మానవ జ్ఞానానికి అర్థమవుతుంది. కారణం; ఇందులో ఒకరి కంటే ఎక్కువ మందికి భాగస్వామ్యం వున్నట్లయితే ఆకాశాల్లో, ఈ భూప్రపంచంలో ఒక రకమైన గందరగోళం, గజిబిజి నెలకొని వుండేది. ఆ ఒక్కరు ఎవరో కాదు, ఆయనే అల్లాహ్. ఒకే ఒక్క నిజ ఆరాధ్య దేవుడు. మరి అలాంటప్పుడు దేవుడు అసలు లేడని గాని, అనేక దేవుళ్ళు ఉన్నారని గాని అనటానికి ఎక్కడ వీలుంది?
దేవుడు ఉన్నాడు. ఆయన ఒకే ఒక్కడు. ఆయన పేరే అల్లాహ్. ఈ అంతులేని విశ్వాన్ని సృష్టించిన ఏకైక సృష్టికర్త. సకల లోకాలను నడిపిస్తున్న వాడు. కనుక మనం ఆయన పట్ల కృతజ్ఞులుగా మసలుకోవాలి. మన ఆత్మల్ని ఆయనకు సమర్పించుకోవాలి. అంటే మన చేతలు, ఆఖరికి మన మనసుల్లో మెదిలే భావాలు, భావనలు, కోరికలను సైతం దేవుడు నిర్ణయిం చిన విధానానికి అనుగుణంగా మలచుకోవాలి. మనిషి ఆలోచించేవాటిలో అత్యంత తెలివైన, వివేచన గల ఆలోచన ఇదే!
అల్లాహ్ మనందరికి సవ్యంగా ఆలోచించి, సక్రమంగా అర్థం చేసు కునే మంచి బుద్ధిని ప్రసాదించాడు. అంతేకాదు, ఆ తర్వాత మంచి మార్గాన్ని ఎన్నుకునే స్వేచ్ఛనూ అనుగ్రహించాడు. తన ప్రవక్తలను పంపించి మానవులకు సన్మార్గం అందించాడు. ఈ ప్రవక్తల పరంపర అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)తో ముగిసింది. మనుషులకు సత్యం బోధపరచటానికి ఆకాశగ్రంథాలను కూడా అల్లాహ్ అవతరింపజేశాడు. చిట్టచివరగా వచ్చిన దివ్యఖుర్ఆన్తో ఆ గ్రంథావతరణ అనుగ్రహం కూడా పూర్తి అయింది.
ఇక మనముందు రెండే రెండు మార్గాలున్నాయి. ఒకటి; ఇహపర లోకాల్లో సంతోషాన్ని, సాఫల్యాన్ని సాధించటం. అది ఇస్లాం ద్వారానే సాధ్యమవుతుంది. రెండోది; ఇహలోకంలో మనోవాంఛల వెంటపడి, అవసరాలు, కోరికలు తీరనందుకు ఈ లోకంలో అసంతృప్తితో, దుఃఖ దాయక జీవితం గడపటం, పరలోకంలో శాశ్వత నరక శిక్షలకు గురవటం. నిర్ణయం మన చేతుల్లోనే ఉంది. దేన్ని ఎంచుకుందాం? అల్లాహ్ మనందరికీ మంచిమార్గం, తిన్నటి మార్గం చూపించుగాక! ఆమీన్.
—
ప్రతి ముస్లింకు ప్రాథమిక పాఠాలు[PDF][మొబైల్ ఫ్రెండ్లీ] సంకలనం : అబ్దుల్ అజీజ్ సాలెహ్ అష్ షౌమార్,సౌదీఅరేబియా. ఈ పుస్తకం షేఖ్ ఇబ్నె బాజ్ (రహిమహుల్లాహ్) గారి మూలరచన “అద్దురూసుల్ ముహిమ్మ లిఆమ్మతిల్ ఉమ్మహ్” యొక్క వ్యాఖ్యానంతో కూడుకున్న పుస్తక సంకలనం
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
السَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ ٱللَّٰهِ وَبَرَكَاتُهُ. نَحْمَدُهُ وَنُصَلِّي عَلَى رَسُولِهِ الْكَرِيمِ أَمَّا بَعْدُ అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు. నహ్మదుహు వ నుసల్లీ అలా రసూలిహిల్ కరీమ్ అమ్మాబాద్.
సోదరులారా! ఈరోజు మనము తెలుసుకోబోయే అంశము హృదయ ఆచరణలు నాలుగవ భాగం. ప్రియమైన సోదరులారా, ప్రియమైన ధార్మిక సోదరీమణులారా! ఈరోజు మనము తెలుసుకోబోయే విషయము మన హృదయాలను ఏ విధంగా మనం నిర్మలమైన హృదయాలుగా, భక్తి కలిగిన హృదయాలుగా, ఉత్తమ హృదయాలుగా మార్చుకోవాలి. ఆ విధంగా మన హృదయాలను మార్చటానికి ఏ ఆచరణ మనము చేయాలి. ఆ ఆచరణలో కొన్ని బయటకు కనిపించే ఆచరణలు ఉన్నాయి మరికొన్ని బయటకు కనిపించని ఆచరణలు ఉన్నాయి. అందులో కొన్ని వాజిబ్ (కచ్చితంగా చేయాల్సిన ఆచరణలు) మరికొన్ని ముస్తహబ్బాత్ (అభిలషణీయమైన ఆచరణలు).
ఇబ్నె ఖయ్యీమ్ రహమహుల్లాహ్ ఇలా తెలియజేస్తున్నారు, అల్లాహ్ యొక్క దాసులు చేసే సత్కార్యాలు అనగా అల్లాహ్ యొక్క దాస్యము మరియు అల్లాహ్ యొక్క విధేయత మొదలైనవి. వాటి ప్రభావం మనిషి జీవితములో కనిపిస్తుంది. ఇలా చెప్పటం జరిగింది:
إِنَّ لِلْحَسَنَةِ نُورًا فِي الْقَلْبِ، وَقُوَّةً فِي الْبَدَنِ، وَضِيَاءً فِي الْوَجْهِ، وَزِيَادَةً فِي الرِّزْقِ، وَمَحَبَّةً فِي قُلُوبِ الْخَلْقِ ఇన్న లిల్ హసనతి నూరన్ ఫిల్ ఖల్బ్, వ కువ్వతన్ ఫిల్ బదన్, వ జియా అన్ ఫిల్ వజ్హ్, వ జియాదతన్ ఫిర్రిజ్క్, వ మహబ్బతన్ ఫీ ఖలూబిల్ ఖల్క్ ఎవరైతే సత్కార్యాలు చేస్తారో వారి హృదయాలలో అల్లాహ్ ఒక వెలుగును, కాంతిని జనింపజేస్తాడు. వారి శరీరంలో శక్తి మరియు బలము జనిస్తుంది. వారి ముఖవర్చస్సుపై ఒక రకమైన కాంతి వెలుగు జనిస్తుంది. వారి ఉపాధిలో వృద్ధి మరియు శుభము కలుగుతుంది. మరియు ప్రజల హృదయాలలో వారిపై ప్రేమను కలిగించటం జరుగుతుంది.
మరియు అదే విధంగా దుష్కార్యాలు, పాప కార్యాల యొక్క ప్రభావం కూడా మనిషి జీవితంపై పడుతుంది. ఎవరైతే పాపాలు చేస్తూ ఉంటారో వారి హృదయం చీకట్లతో నిండిపోతుంది. శరీరం బలహీనపడిపోతుంది. ఉపాధి లాక్కోబడుతుంది. మరియు ప్రజల హృదయాలలో వారిపై ద్వేషాన్ని కలిగించటం జరుగుతుంది.
చూస్తున్నాము కదా సోదరులారా ఏ విధంగా పాప కార్యాల ప్రభావం మన జీవితాలలో ఉంటుందో. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ ఆయన రక్షణలో ఉంచు గాక ఆమీన్.
ఆ తర్వాత సోదరులారా మన హృదయాలను మనము నిర్మలమైన హృదయాలుగా మార్చుకోవటానికి దోహదపడే మరికొన్ని ఆచరణలలో ఒక మహోన్నత ఆచరణ ఇంతకుముందు ప్రస్తావించబడిన విధంగా అల్లాహ్ యొక్క జిక్ర్ ప్రియులారా. అల్లాహ్ యొక్క నామస్మరణ ప్రియులారా. ఖురాన్ యొక్క పారాయణం ప్రియులారా. ఖురాన్ యొక్క పారాయణంతో మన హృదయాలు సంస్కరించబడతాయి ప్రియులారా.
సలఫ్‌కు చెందిన వారిలో సులైమాన్ అల్ ఖవ్వాస్ రహమహుల్లాహ్ జిక్ర్ కు సంబంధించి ఆయన తెలియజేస్తున్నారు:
لِلْقَلْبِ بِمَنْزِلَةِ الْغِذَاءِ لِلْجَسَدِ లిల్ ఖల్బి బి మన్జిలతిల్ గిజాయి లిల్ జసద్ అల్లాహ్ స్మరణ హృదయానికి ఎలాంటిది అంటే శరీరానికి ఆహారము లాంటిది.
ఏ విధంగానైతే శరీరానికి ఆహారము లేకపోతే శరీరం బలహీనపడిపోతుందో హృదయానికి అల్లాహ్ యొక్క జిక్ర్ లేకపోతే హృదయం బలహీనపడిపోతుంది ప్రియులారా. ఆ తర్వాత ఒక వ్యాధిగ్రస్తుడైన వ్యక్తి ముందు ఎంత మంచి ఆహారం పెట్టినా అది అతని వ్యాధి మూలంగా అందులో అతనికి రుచి అనిపించదు. అదే విధంగా మన హృదయాలలో ప్రాపంచిక భోగ భాగ్యాలు, ప్రాపంచిక ప్రేమ మనం ఉంచుకొని మనము కూడా ఎంత జిక్ర్ చేసినా ఆ జిక్ర్ హృదయానికి మాధుర్యము కలిగించదు ప్రియులారా. ఎందుకంటే పెదవులపై అయితే అల్లాహ్ యొక్క జిక్ర్ చేయబడుతుంది, కానీ హృదయాలలో ప్రాపంచిక వ్యామోహం ఉంది ప్రియులారా. అందుకే సులైమాన్ అల్ ఖవ్వాస్ రహమహుల్లాహ్ తెలియజేస్తున్నారు,
دواء القلب خمسة أشياء దవావుల్ ఖల్బి ఖమ్సతు అష్ యా హృదయానికి చికిత్స ఐదు విషయాలలో ఉంది.
ప్రతిదానికి మందు ఉన్నట్లే హృదయానికి కావలసిన మందు ఐదు విషయాలలో ఉంది.
మొదటి విషయం ప్రియులారా:
قِرَاءَةُ الْقُرْآنِ بِالتَّدَبُّرِ ఖిరాఅతుల్ ఖుర్ఆని బిత్తదబ్బుర్ ఖురాన్ గ్రంథాన్ని ఆలోచిస్తూ ఏకాగ్రతతో అవగాహన చేసుకుంటూ మనం ఖురాన్ గ్రంథాన్ని పఠించాలి.
ఈరోజు సోదరులారా మనం కేవలం ఖురాన్ గ్రంథాన్ని అరబీ భాషలో చదువుకుంటూ వెళ్ళిపోతున్నాం, దాని అర్థము చేసుకోవటానికి, దాని యొక్క అర్థము తెలుసుకోవటానికి మనం ప్రయత్నము చేయటం లేదు ప్రియులారా. లేదు సోదరులారా మనం ఖురాన్ గ్రంథాన్ని అరబీ భాషలో పఠిస్తూ కచ్చితంగా దాని యొక్క అర్థము కూడా మనకు తెలిసిన భాషలో తెలుసుకోవటానికి ప్రయత్నము చేయాలి.
ఆ తర్వాత రెండవ విషయం ప్రియులారా:
خَلَاءُ الْبَطْنِ ఖలావుల్ బతన్ పొట్టలో కాస్త ఖాళీ స్థలం ఉంచాలి.
మనం భుజించాలి, పొట్ట నిండాలి కానీ ప్రియులారా మరీ ఎక్కువగా తిని ఆరాధన చేయలేనంతగా మనం మన పొట్టను నింపకూడదు ప్రియులారా. అల్లాహ్ త’ఆలా ప్రవక్తలతో అంటూ ఉన్నారు,
يَا أَيُّهَا الرُّسُلُ كُلُوا مِنَ الطَّيِّبَاتِ وَاعْمَلُوا صَالِحًا యా అయ్యుహర్రుసులు కులూ మినత్ తయ్యిబాతి వ’అమలూ సాలిహా ఓ ప్రవక్తలారా పరిశుద్ధమైన వాటి నుండి తినండి మరియు సత్కార్యాలు చేయండి.
కాబట్టి సోదరులారా మనం తినాలి కానీ మరీ అంతగా తినకూడదు ఆరాధన చేయలేనంతగా. పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు మనిషికి అల్లాహ్ యొక్క జ్ఞాపకం వస్తుంది ప్రియులారా, మనిషికి అల్లాహ్ గుర్తుకు వస్తాడు. మనం మన నడుం నిలబడటానికి ఎంత అవసరమో అంత తినాలి ప్రియులారా, తద్వారా మనం అల్లాహ్‌ను ఆరాధించగలగాలి.
ఆ తర్వాత హృదయ చికిత్సకు సంబంధించిన విషయాలలో మూడవ విషయం:
قِيَامُ اللَّيْلِ ఖియాముల్లైల్ రాత్రి పూట ఆరాధన
ప్రియులారా రాత్రి పూట ఆరాధన, తహజ్జుద్ ఆరాధన, అల్లాహ్ ముందు రాత్రి పూట నిలబడాలి. ఇది కూడా మన హృదయాలకు ఒక మంచి చికిత్స ప్రియులారా.
ఆ తర్వాత సోదరులారా నాలుగవ మాట:
التَّضَرُّعُ عِنْدَ السَّحَرِ అత్తదర్రువు ఇందస్ సహర్ సహ్రీ సమయములో అల్లాహ్‌ను వేడుకోవాలి
ఇది చాలా గొప్ప విషయం ప్రియులారా అనగా సహ్రీ సమయములో అల్లాహ్‌ను వేడుకోవాలి. సహ్రీ సమయములో అల్లాహ్ ముందు మన విషయాలను అల్లాహ్ ముందు అడగాలి ప్రియులారా. అనేకమందికి ఈ భాగ్యం లభించదు. కొంతమంది పడుకుంటారు, కొంతమంది మేల్కొని ఉన్నా కూడా ఆ సమయాన్ని వృధా చేస్తారు. ఫోన్లో అనవసర విషయాలలో సమయాన్ని వృధా, ఇతరత్రా విషయాలలో కూడా మనం సమయాన్ని వృధా చేస్తాం. లేదు ప్రియులారా, సహ్రీ సమయం కూడా అత్యంత శుభాలతో కూడిన సమయం ప్రియులారా. ఆ సమయములో మనం అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాను కడు దీనంగా వేడుకోవటానికి అది ఉత్తమ సమయం.
ఆ తర్వాత హృదయ చికిత్సకు సంబంధించిన విషయాలలో ఐదవ మాట ప్రియులారా:
مُجَالَسَةُ الصَّالِحِينَ ముజాలసతుస్ సాలిహీన్ ఉత్తమ వ్యక్తుల సాంగత్యం
ఉత్తమ వ్యక్తులతో మనం కూర్చోవాలి, ఉత్తమ వ్యక్తులతో గడపాలి ప్రియులారా.
ఈ విధంగా సోదరులారా మన హృదయానికి సంబంధించిన చికిత్సలో ఖురాన్ గ్రంథాన్ని అవగాహనతో అర్థము చేసుకుంటూ మనం పఠించాలి ప్రియులారా. అదే విధంగా పొట్టను కాస్త ఖాళీగా ఉంచాలి ప్రియులారా. ఆ తర్వాత ఖియాముల్లైల్ రాత్రి పూట అల్లాహ్ ముందు మనము నమాజులో నిలబడాలి సోదరులారా. నాలుగవ మాట సహ్రీ సమయములో అల్లాహ్ ముందు మనము కడు దీనంగా వేడుకోవాలి ప్రియులారా. ఐదవ మాట మంచి వారి సాంగత్యములో మనం మన జీవితాన్ని గడుపుతూ ఉండాలి ప్రియులారా.
ఈ విధంగా మనం మన హృదయానికి చికిత్స చేయగలం, దానిని సంస్కరించుకోగలం, దానిని అల్లాహ్ వైపునకు మరలే హృదయంగా, నిర్మలమైన హృదయంగా తయారు చేసుకోవటంలో ఇన్షా అల్లాహ్ త’ఆలా మనం ముందుకు వెళ్ళగలం ప్రియులారా.
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించు గాక, మనందరికీ అల్లాహ్ త’ఆలా మనల్ని మనం సంస్కరించుకునే భాగ్యాన్ని ప్రసాదించు గాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్.
وَالسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ ٱللَّٰهِ وَبَرَكَاتُهُ వస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
హృదయ ఆచరణలు పన్నెండవ భాగంలో మనము తెలుసుకోబోయే విషయము అల్లాహ్ కోసం మాత్రమే ఇతరులను ప్రేమించటం.
ప్రియులారా, హృదయ ఆచరణలు ఏదైతే అంశాన్ని మనం వింటూ ఉన్నామో ఇది చాలా ప్రాధాన్యత కలిగిన అంశము మరియు అత్యంత ఆవశ్యకమైన అంశం. ఎందుకంటే స్వర్గంలో ఉన్నత స్థానాలను అధిరోహించటానికి హృదయ ఆచరణ ఒక ముఖ్యమైన కారకం, స్వర్గం. దాని గురించి ఇలా చెప్పటం జరిగింది, మీరు అర్ధిస్తే జన్నతుల్ ఫిర్దౌస్‌ను అర్ధించండి.
అనేకమంది సహాబాలు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సాహచర్యాన్ని స్వర్గంలో పొందాలని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో కలిసి స్వర్గంలో ఉండాలని కోరుకునేవారు. మరి స్వర్గంలో ఉన్నత స్థానాలను అధిరోహించటానికి హృదయ ఆచరణ ఒక ముఖ్యమైన కారకం. మరి అందులో నుండి మరొక ముఖ్యమైన ఆచరణ అల్లాహ్ కోసం మాత్రమే ఇతరులను ప్రేమించటం.
మనిషి కేవలం అల్లాహ్ కోసం మాత్రమే ఇతరులను ప్రేమించటం అనేది చాలా గొప్ప విషయం సోదరులారా. సాధారణంగా ప్రజలు తమ అవసరాల కోసం ప్రజలతో సంబంధాలు ఏర్పరచుకుంటారు. ఈ రోజులలో ప్రజలు ఇతరుల గురించి చాలా తక్కువగా ఆలోచిస్తారు, చాలా తక్కువగా ఇతరుల బాగోగుల గురించి యోగక్షేమాల గురించి తెలుసుకుంటారు. కానీ ఇలాంటి కాలంలో ప్రస్తుత క్లిష్టతర పరిస్థితులలో ఎవరైనా ఒక వ్యక్తి అల్లాహ్ యొక్క దాసులను కేవలం అల్లాహ్ కోసం మాత్రమే ప్రేమిస్తే అలాంటి వ్యక్తికి స్వర్గంలో ఇన్షా అల్లాహ్ ఉన్నత స్థానం లభిస్తుంది ప్రియులారా.
తబ్రానీ గ్రంథంలో ఉల్లేఖించబడిన ఒక సహీ హదీసు ప్రకారం హజరతే ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు త’ఆలా అన్హు హదీసు ఉల్లేఖిస్తున్నారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు సోదరులారా. ప్రళయ దినాన కొంతమంది అల్లాహ్‌తో కలిసి కూర్చుంటారు. హదీసులో చెప్పబడింది,
إِنَّ لِلَّهِ جُلَسَاءَ ఇన్న లిల్లాహి జులసా కొంతమంది అల్లాహ్‌తో కలిసి కూర్చుంటారు.
మరియు ఆ సమావేశం గురించి చెప్పబడింది:
عَنْ يَمِينِ الْعَرْشِ అన్ యమీనిల్ అర్ష్ అర్ష్ యొక్క కుడివైపున వారు కూర్చుంటారు. అంటే అల్లాహ్ యొక్క కుడివైపున వారు కూర్చుంటారు.
وَكِلْتَا يَدَيِ اللَّهِ يَمِينٌ వ కిల్తా యదైల్లాహి యమీనున్ మరియు అల్లాహ్ యొక్క రెండు చేతులు కుడి చేతులే.
ఇక్కడ చెప్పడం జరుగుతుంది అల్లాహ్ యొక్క రెండు చేతులు కుడి చేతులే. దీన్ని బట్టి మనకి తెలుస్తున్న విషయం ఏమిటంటే అల్లాహ్‌కు చేతులు ఉన్నాయి. మరి ఆ చేతులను గురించి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ఆ రెండు చేతులు కుడి చేతులు.
ఇక్కడ మనము అల్లాహ్ యొక్క చేతులకు సంబంధించి షేఖ్ సాలెహ్ అల్ ఉసైమీన్ రహమహుల్లాహ్ వారు తెలియజేసిన విషయాలను తెలుసుకుందాం. ఎప్పుడైతే అల్లాహ్ యొక్క రెండు చేతులు కుడి చేతులు అన్న విషయాన్ని మనం వింటామో, వాస్తవానికి కొన్ని హదీసులలో ఎడమ చేతి ప్రస్తావన కూడా ఉంది. ఈ హదీసులో దైవ ప్రవక్త వారి మాటను మనం ఎలా అర్థం చేసుకోవాలి, అల్లాహ్ యొక్క రెండు చేతులు కుడి చేతులు అన్న విషయాన్ని? అంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన దాని ఉద్దేశం ఏమిటంటే అల్లాహ్ యొక్క రెండు చేతులు మంచిలో, శుభాలలో, మంచిలో మరియు శుభాలలో పూర్తిగా సరిసమానమైనవే. ఎవరూ దానిని ఇలా అర్థం చేసుకోకూడదు ఎలాగైతే మనిషి చేతులు ఉంటాయో ఆ విధంగా ఎవరూ కూడా అల్లాహ్ యొక్క చేతులను పోల్చకూడదు. అల్లాహ్ మనల్ని రక్షించు గాక. ఆ తర్వాత దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎడమ చేతితో ఇవ్వటాన్ని వారించారు, ఎడమ చేతితో పుచ్చుకోవటాన్ని వారించారు, ఎడమ చేతితో భోజనం చేయటం నుండి వారించారు, నీళ్లు త్రాగటాన్ని వారించారు. కానీ మనము అల్లాహ్ యొక్క చేతులను ఈ విధంగా మనం ఎంత మాత్రమూ ఊహించకూడదు. వాస్తవానికి అల్లాహ్ యొక్క రెండు చేతులు మేలులో, మంచిలో, సరిసమానమైనవే అన్న విషయాన్ని ఇక్కడ మనకి తెలియజేయటం జరిగింది. ఎలాగైతే హదీసులో మనము విన్నామో. ఆ తర్వాత దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హదీసులో ఇలా తెలియజేస్తున్నారు:
وَكِلْتَا يَدَيِ اللَّهِ يَمِينٌ عَلَىٰ مَنَابِرِهِمْ مِنْ نُورٍ వ కిల్తా యదైల్లాహి యమీనున్ అలా మనాబిరిహిమ్ మిన్ నూర్ అల్లాహ్ ఎవరినైతే తనతో కూర్చోబెడతారో వారు కాంతిలీనుతున్న మింబర్లపై కూర్చుంటారు.
وُجُوهُهُمْ مِنْ نُورٍ వుజూహుహుమ్ మిన్ నూర్ వారి ముఖాలు కాంతిలీనుతూ ఉంటాయి.
لَيْسُوا بِأَنْبِيَاءَ وَلَا شُهَدَاءَ وَلَا صِدِّيقِينَ లైసూ బి అంబియా వలా షుహదా వలా సిద్దీఖీన్ ఎవరైతే కాంతిలీనుతున్న మింబర్లపై కూర్చుంటారో, ఎవరి ముఖాలైతే దగదగా మెరిసిపోతూ ఉంటాయో, వారు ప్రవక్తలు కాదు, షహీదులు కాదు, సిద్దీఖులు కారు.
మరి ఎందుకు వారికి అలాంటి ఘనత దక్కింది? అడగటం జరిగింది,
قِيلَ يَا رَسُولَ اللَّهِ مَنْ هُمْ؟ ఖీల యా రసూలల్లాహి మన్ హుమ్? అడగబడింది, ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, వారు ఎవరు?
ప్రవక్త వారు సమాధానం ఇచ్చారు,
هُمُ الْمُتَحَابُّونَ بِجَلَالِ اللَّهِ تَبَارَكَ وَتَعَالَى హుముల్ ముతహాబ్బూన బి జలాలిల్లాహి తబారక వ త’ఆలా వారు అల్లాహ్ యొక్క ఘనత కోసం, అల్లాహ్ యొక్క గొప్పతనం కోసం, కేవలం అల్లాహ్ కోసం ఒండొకరిని ప్రేమించేవారు, అల్లాహ్ కోసం ఇతరులను ప్రేమించేవారు.
ఎవరైతే అల్లాహ్‌కు విధేయత చూపుతారో, అల్లాహ్‌కు దాస్యం చేస్తారో అలాంటి వారిని వీరు ప్రేమిస్తారు. ఏ ముస్లింనైనా వారు కేవలం అల్లాహ్ యొక్క ప్రసన్నత కోసం వారు ప్రేమిస్తారు. అది తప్ప వేరే ఎలాంటి ఉద్దేశము వారికి ఉండదు. ఇలాంటి వారినే అల్లాహ్ తన అర్ష్ యొక్క కుడివైపున కూర్చోబెడతాడు. దీన్ని బట్టి తెలుస్తున్న విషయం ఏమిటంటే మనం అల్లాహ్ కోసం ఇతరులను ప్రేమించాలి. ఎవరైతే అల్లాహ్ కోసం ఇతరులను ప్రేమిస్తారో అలాంటి వారికి అల్లాహ్ త’ఆలా గొప్ప సన్మానాన్ని ఇస్తాడు.
కాబట్టి ఈ హదీసు ద్వారా మనకు తెలిసిన విషయము కొంతమంది అల్లాహ్‌తో పాటు అల్లాహ్ యొక్క అర్ష్ యొక్క కుడివైపున వారు కూర్చుంటారు. వారి ముఖాలు దగదగా మెరిసిపోతుంటాయి. అల్లాహ్ యొక్క రెండు చేతుల ప్రస్తావన ఉంది. ఆ తర్వాత ఎవరైతే ఆ ప్రళయ దినాన కూర్చుంటారో వారు అల్లాహ్ యొక్క అర్ష్ కు కుడివైపున మింబర్లపై కూర్చుంటారని, వారి ముఖాలు దగదగా మెరిసిపోతాయని చెప్పబడింది. అయినప్పటికీ వారు ప్రవక్తలు కానీవారు, షహీదులు కానీవారు, సిద్దీఖులు కానీవారు కానీ ప్రవక్తతో అడిగారు మరి ఎవరు ప్రవక్త? “హుముల్ ముతహాబ్బూన్ బి జలాలిల్లాహి తబారక వ త’ఆలా“, వారు అల్లాహ్ కోసం ఇతరులను ప్రేమించేవారు అన్న విషయం మనకు తెలుస్తుంది.
ఆ తర్వాత ఇదే విధంగా హృదయ ఆచరణలలో ఇతర నైతిక ఉత్తమ నైతిక కార్యాలు కూడా ఉన్నాయి. ఒకటి అల్ హయా అనగా సిగ్గు బిడియం మనిషి బిడియాన్ని కలిగి ఉండటం. అదే విధంగా రధా, అల్లాహ్‌ను ఇష్టపెట్టే ప్రయత్నము చేయటం. వస్సబ్ర్ ఓర్పు సహనాన్ని కలిగి ఉండటం. ఇవన్నీ హృదయ ఆచరణలకు సంబంధించిన విషయాలు.
అదే విధంగా హజరతే అబూ దర్దా రదియల్లాహు త’ఆలా అన్హు వారి ఉల్లేఖనం ప్రకారం వేరే హృదయ ఆచరణ, ఉత్తమ హృదయ ఆచరణ ప్రళయ దినాన మనిషికి గౌరవాన్ని తీసుకువచ్చే ఆరాధన ప్రవక్త వారు అన్నారు,
ప్రవక్త వారు అన్నారు ఏమన్నారు, “మా మిన్ షైయిన్”, ఆ ప్రళయ దినాన ఏ వస్తువు ఉండదు, “అస్ఖలు ఫిల్ మీజానిల్ ము’మిన్” అంటే ఆ విశ్వాసి యొక్క ఆ త్రాసులో ఏ వస్తువు వేరేది బరువైనది ఉండదు, “యౌమల్ ఖియామతి యౌమల్ ఖియామతి” ప్రళయ దినాన దేనికంటే “మిన్ హుస్నిల్ ఖులుఖ్”, ఉత్తమ నడవడిక కంటే వేరే మంచి వస్తువు ఏదీ ఉండదు.
కాబట్టి ప్రియులారా ఈ హదీసులో మనకి తెలిసిన విషయము, ప్రళయ దినాన విశ్వాసి యొక్క త్రాసులో అన్నింటి కంటే బరువైన వస్తువు అతని ఉత్తమ నైతికత. కాబట్టి సోదరులారా మనిషి ప్రజలతో మంచిగా ప్రవర్తించాలి, ప్రజలను అల్లాహ్ కోసం ప్రేమించాలి, కష్టకాలంలో మనిషి ఓర్పు సహనాన్ని కలిగి ఉండాలి, మనిషిలో సిగ్గు బిడియం కూడా ఉండాలి, అల్లాహ్‌ను మనం ఇష్టపెట్టే కార్యాలు చేయాలి. వీటన్నింటి ద్వారా మనకి ప్రళయ దినాన అల్లాహ్ వద్ద గొప్ప గౌరవం లభిస్తుంది ప్రియులారా. ఇక చిట్టచివరిగా ఈ రోజుల్లో మనం మంచి ప్రవర్తన ప్రజల పట్ల కలిగి ఉందాం. ప్రజలకు ఈ కష్టకాలంలో ప్రజల యొక్క కష్ట నష్టాలలో వారితో మనం పాలుపంచుకోవాలి, వారికి సహాయపడాలి. ఎవరైతే ప్రజల కష్టాలు తీర్చటంలో వారికి తోడుగా ఉంటారో అలాంటి వారి కష్టాలను అల్లాహ్ త’ఆలా ప్రళయ దినాన వారి కష్టాలను అల్లాహ్ దూరము చేస్తాడు.
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ కేవలం అల్లాహ్ కోసం ఇతరులను ప్రేమించే సద్భాగ్యాన్ని ప్రసాదించు గాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్.
وَالسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ ٱللَّٰهِ وَبَرَكَاتُهُ వస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.