హదీథ్ :׃ 07
فضل السلام والأمر بإفشائه అభివాదము & అన్నదానం యొక్క ఔన్నత్యం –
عَنْ عَبْدِاللهِ بْنِ عَمْرٍو (رضي الله أَنهُ) أَنَّ رَجُلاً سَأَلَ رَسُوْلَ اللهِ ^ :
أَىُّ الإِسْلاَمِ خَيْرٌ ؟ قَالَ تُطْعِمُ الطَّعَامَ وَ تَقْرَأُ السَّلَامَ عَلَى مَنْ عَرَفْتَ وَ مَنْ لَـمْ تَعَرِفْ (رواه البخارى)
అన్ అబ్దిల్లాహ్ ఇబ్నె అమర్ బిన్ అల్ ఆస్ రదియల్లాహు అన్హుమా అన్న రజులన్ సఅల రసూలుల్లాహి సల్లల్లాహుఅలైహివసల్లం “అయ్యుల్ ఇస్లామి ఖైర్?” ఖాల “తుత్ఇముత్తఆమ వ తఖ్రవుస్సలామ అలా మన్ అరఫ్త వ మల్లమ్ తఆరిఫ్” రవాహ్ అల్ బుఖారి
తాత్పర్యం:- అన్ = ఉల్లేఖన, అబ్దిల్లాహ్ ఇబ్నె అమర్ బిన్ అల్ ఆస్ = అమర్ బిన్ అల్ ఆస్ కుమారుడు అబ్దుల్లాహ్, రదిఅల్లాహు అన్హుమా = అల్లాహ్ వారితో ఇష్టపడుగాక, అన్న= ఖచ్ఛితంగా, రజులన్ = ఓ వ్యక్తి, సఅల = ఇలా ప్రశ్నించాడు, రసూలుల్లాహి = అల్లాహ్ యొక్క సందేశహరుడు (సల్లల్లాహు అలైహి వసల్లమ్)తో, అయ్యు = ఏది, అల్ ఇస్లామి = ఇస్లాంలో, ఖైర్ = ఉత్తమమైనది? ఖాల = తెలిపారు (ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లమ్), తుత్ఇముత్తఆమ = నీవు భోజనం చేయించు(అన్నంపెట్టు), వ = మరియు, తఖ్రవు = నీవు చదువు (చేయుము), అస్సలామ = సలాం(అభివాదం), అలా = పైన, మన్ = ఎవరైతే, అరఫ్త = నీకు పరిచయం ఉన్నారో, వ = మరియు, మన్ = ఎవరైతే, లమ్ తఆరిఫ్ = నీకు అపరిచితులో. రవాహ్అల్ బుఖారి=సహీబుఖారి హదీథ్ గ్రంథంలో రికార్డు చేయబడినది.
అనువాదం:- అబ్దిల్లాహ్ ఇబ్నె అమ్ర్ బిన్ అల్ ఆస్ రదియల్లాహు అన్హుమా ఇలా ఉల్లేఖించారు – ఒక వ్యక్తి ప్రవక్త(ముహమ్మద్)సల్లల్లాహు అలైహి వసల్లం తో ఇలా ప్రశ్నించాడు “ఇస్లాంలో అన్నింటికంటే ఉత్తమమైన విషయం ఏది?” ప్రవక్త (సల్లల్లాహుఅలైహి వసల్లం) ఇలా జవాబిచ్చారు “నీవు అన్నం తినిపించు. మరియు నీవు సలాం చేయి, తెలిసిన వారికైనా మరియు తెలియనివారికైనా సరే” సహీబుఖారి అనే హదీథ్ గ్రంథంలో రికార్డుచేయబడినది.
వివరణ:- అల్ సలామ్ (శాంతి) అనేది అల్లాహ్ యొక్క అనేక శుభనామాలలో ఒకటి. అస్సలాము (మీపై శాంతి కురువుగాక) అనడం అంటే మీరు అల్లాహ్ రక్షణలో శాంతిగా ఉండమని అర్ధం లేదా అల్లాహ్ సాంగత్యంలో మీరు ఉండండి అని అర్ధం. ఆ విధంగానే, ఆకలితో ఉన్నవారికి, పేదవారికి, ఏ ఆధారంలేని వారికి (దిక్కులేనివారికి) అన్నంపెట్టడం అలాగే వారి అవసరాలలో, ఆపత్సమయాల్లో ఆదుకోవడం అనేది ఉన్నతమైన గుణాలలో, ఉత్తమమైన సంస్కారాలలో లెక్కించ బడును. అలాగే మనకు పరిచయం ఉన్న వారికైనా, లేనివారికైనా అభివాదం చేస్తూ “అస్సలాము అలైకుమ్” అనడం (అంటే వారిపై అల్లాహ్ యొక్క శాంతి కురవాలని – వారు అల్లాహ్ రక్షణలో, ప్రశాంతంగా, క్షేమంగా ఉండాలని కోరుకోవడం) ఉన్నతమైన సుగుణం. పై హదీథ్ లో సూచించబడిన ఈ రెండు పనులు (అన్నార్తులకు అన్నం పెట్టడం, ఇతరులకు అభివాదం చేయడం) సమాజంలో పరస్పర ప్రేమాభిమానాలను పెంపొందించి, పగ, ద్వేషం, వైరభావం, ఒకరిపట్ల మరొకరిలో దురాలోచనలను దూరం చేస్తాయి. ఎటువంటి అభివాదం కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పిన “అస్సలాము అలైకుమ్” అనే అభివాదానికి సరితూగదు, ప్రత్యామ్నాయం అసలే కాజాలదు.
సలాం చేసే విధానం:- మూడురకాలుగా సలాం చేస్తుండడం మనం గమనిస్తుంటాము.
1. అస్సలాము అలైకుమ్
మీ పై అల్లాహ్ యొక్క శాంతి (వర్షించు) అవతరించుగాక
2. అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహ్
మీ పై అల్లాహ్ యొక్క శాంతి మరియు కరుణ (వర్షించు) అవతరించుగాక
3. అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతహు
మీ పై అల్లాహ్ యొక్క శాంతి, కరుణ మరియు ఆశీర్వాదం (వర్షించు) అవతరించుగాక
అల్లాహ్ వద్ద అన్నింటికంటే ఎక్కువ పుణ్యాన్ని (ప్రతిఫలాన్ని) ఆర్జించి పెట్టేది పైన తెలిపిన వాటిలో మూడవ విధంగా (సంపూర్ణంగా) అభివాదం చేయడం.
ఈ హదీథ్ అమలు చేయడం వలన కలిగే లాభాలు׃
- సలాం చేయడమనేది ఐచ్ఛికమైన విషయం కానీ జవాబుగా ప్రతి సలాం చేయడం విధి తప్పనిసరి బాధ్యత.
- పాశ్చాత్య విధానంలో లాగా “గుడ్ మార్నింగ్” లేదా “గుడ్ ఈవినింగ్” అనడం ఎంతమాత్రమూ ఇస్లామిక్ అభివాదం కాదు.
- మనకు పరిచయం ఉన్న వారికైనా, లేనివారికైనా సలాం చేసే అలవాటును అలవరచుకోవాలి.
- ఎదుటి వ్యక్తి మన శబ్దం వినలేనంత దూరంలో ఉన్నట్లైతే సలాం యొక్క పదాలను (ఉదా,, అస్సలాము అలైకుమ్ లేదా అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహ్ లేదా అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతహు) ఉచ్ఛరిస్తూ (పలుకుతూ) చేయి పైకెత్తి సంజ్ఞ ద్వారా సలాం చేయవచ్చును.
- ఫోన్లో ముందుగా సలాంచేసి, తర్వాత మాటలు ప్రారంభించటం అలవర్చుకోవాలి
- ఎవరివద్దనైనా సెలవు తీసుకుంటున్నప్పుడు సలాం చేస్తూ సెలవు తీసుకోవడం అలవర్చుకోవాలి.
- పేదవారికి, అన్నార్తులకు సహాయం చేయడాన్ని, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పిన విధంగా సలాం (అభివాదం) చేయడాన్ని విధిగా ప్రోత్సహించాలి.
హదీథ్ ఉల్లేఖించినవారి పరిచయం:- అబ్దుల్లాహ్ ఇబ్నె అమర్ బిన్ అల్ ఆస్ బిన్ వాయల్ అస్సహామి రదియల్లాహు అన్హుమా ఖురైష్ వంశస్థులు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తాతగారైన కాబ్ బిన్ లోయి మరియు అబ్దుల్లాఇబ్నె అమర్ తాతగారు ఒక్కరే. తొలికాలంలోనే ఇస్లాం స్వీకరించారు. ఎక్కువ హదీసులు ఉల్లేఖించిన వారిలో వీరు కూడా ఒకరు.
ప్రశ్నలు
1. “ఇస్లాంలో అన్నింటికంటే ఉత్తమమైనది ఏది?” ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహుఅలైహి వసల్లం ఇలా జవాబిచ్చారు________,_______ మీకు తెలిసినవారైనా, తెలియనివారైనా కూడా”
2. అన్నార్తులకు, పేదవారికి అన్నం పెట్టడం, పరిచయం ఉన్నవారికీ లేనివారికీ కూడా అభివాదం చేయడం సమాజంలో _________________ పెంపొందించి & పగ, ద్వేషం, వైరభావం, ఒకరిపట్ల మరొకరిలో _________________ దూరం చేస్తాయి
3. సలాం చేయడం లోని మూడు విధానాలు?
a)
b)
c)
4. సలాం చేయడం అనేది __________ కానీ జవాబుగా ప్రతి సలాము చేయడం ________ తప్పనిసరి బాధ్యత.
5. పాశ్చాత్య విధానంలో లాగా “గుడ్ మార్నింగ్” లేదా “గుడ్ ఈవినింగ్” అనడం ఎంతమాత్రమూ ____________ అభివాదం కాదు
6. మనకు పరిచయం ఉన్న______,_______ సలాం చేయడం మనం అలవరచుకోవాలి
7. మనం సలాం చేస్తున్న వ్యక్తి మన శబ్దం వినలేనంత దూరంలో ఉన్నట్లైతే సలాము యొక్క పదాలను ఉచ్ఛరిస్తూ (పలుకుతూ) _____________________ సలాం చేయవచ్చును.
8. _______________సహాయం చేయడాన్ని, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పిన విధంగా ____________ చేయడాన్ని విధిగా ప్రోత్సహించాలి.
9. అబ్దిల్లాహ్ ఇబ్నె అమర్ బిన్ ఆస్ రదియల్లాహు అన్హుమా గురించి వ్రాయండి.
Source : హదీథ్ – మొదటి స్థాయి (రబువ జాలియాత్ – రియాద్)
అనువాదం : – సయ్యద్ యూసుఫ్ పాషా
25.349808
55.394526
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.