అజ్జిక్రు వద్దుఆఉ మినల్ కితాబి వస్సున్న
రచన/కూర్పు: ఫఖీర్ ఇలల్లాహ్ డాక్టర్ సయీద్ బిన్ అలీ బిన్ వహఫ్ అల్ ఖహ్తానీ
(1408 హిజరి షాబాన్ లో సవరించబడినది)
విషయ సూచిక
- తొలి పలుకులు
- దుఆ ప్రాముఖ్యత
- దుఆ చేసే పద్దతులు మరియు దుఆ స్వీకరించబడటానికి కారణాలు
- దుఆ స్వీకరించబడే వేళలు, పరిస్థితులు మరియు ప్రదేశములు
- ఖుర్ఆన్ నుండి దుఆలు
- సున్నత్ నుండి దుఆలు
పుస్తకం
وَلِلَّهِ الْأَسْمَاءُ الْحُسْنَى فَادْعُوهُ بِهَا وَذَرُوا الَّذِينَ يُلْحِدُونَ فِي أَسْمَائِهِ سَيُجْزَوْنَ مَا كَانُوا يَعْمَلُونَ
మరియు అల్లాహ్ పేర్లు! అన్నీ అత్యుత్తమమైనవే; కావున మీరు వాటితో ఆయనను ప్రార్థించండి. మరియు ఆయన పేర్ల విషయంలో సత్యం నుండి వైదొలగిన వారిని విసర్జించండి. వారు తమ కర్మలకు ప్రతిఫలం పొందగలరు.[1]
الله … الأول … الآخر … الظاهر … الباطن … العليّ … الأعلى
అల్లాహ్ మొదటివాడు, చివరివాడు, బాహ్యుడు, అంతర్గతుడు, అత్యున్నతుడు, సర్వొన్నతుడు
المتعال … العظيم … المجيد … الكبير … السميع … البصير … العليم
సర్వోన్నతుడు, గొప్పవాడు, ఘనతకలవాడు, పెద్దరికం గలవాడు, వినేవాడు, వీక్షించేవాడు, తెలుసుకునేవాడు.
الخبير … الحميد … العزيز … القدير … القادر … المقتدر … القويُّ
అన్నీతెలిసినవాడు, ప్రశంసనీయుడు, సర్వాధిక్యుడు, అన్నింటిపై అధికారం కలవాడు, సామర్ధ్యం కలవాడు, ఆధిక్యమును చూపువాడు, బలవంతుడు
المتين … الغني … الحكيم … الحليم … العفوُّ … الغفور … الغفار
దృఢమైనవాడు, అక్కరలేనివాడు, వివేకవంతుడు, ఉదాత్త హృదయుడు, మన్నించేవాడు, క్షమించేవాడు, క్షమాశీలుడు.
التوَّاب … الرقيب … الشهيد … الحفيظ … اللطيف … القريب … المجيب
పశ్చాత్తాపమును స్వీకరించేవాడు, సమీక్షించేవాడు, అనునిత్యం హాజరై ఉండేవాడు, పర్యవేక్షకుడు, సూక్ష్మగ్రాహి, సామిప్యుడు, ప్రార్ధనలను ఆలకించి ఆమోదించువాడు
الودود … الشاكر … الشكور … السيد … الصمد … القاهر … القهار
అమితంగా ప్రేమించేవాడు, ఆదరించేవాడు, సన్మానించేవాడు, నాయకుడు, నిరపేక్షాపరుడు, ఆధిపత్యం కలవాడు, సర్వాధిక్యుడు
الجبار … الحسيب … الهادي … الحكم … القدوس … السلام … البَرُّ
బలపరాక్రమాలు కలవాడు, లెక్కతీసుకునేవాడు, మార్గనిర్దేశకుడు, తీర్పునిచ్చేవాడు, పరిశుద్ధుడు, శాంతిప్రధాత, పుణ్యాలను స్వీకరించేవాడు
الوهَّاب … الرحمن … الرحيم … الكريم … الأكرم … الرءوف … الفتّاح
గొప్ప దాత, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, మర్యాదస్తుడు, దయాశీలి, కృపాశీలుడు, తీర్పులు చేసేవాడు
الرَّازق … الرَّزَّاق … الحي … القَيُّوم … الربّ … الملك … المليك
ఆహారమును ప్రసాదించువాడు, ఆహార ప్రధాత, నిత్యం జీవించి ఉండేవాడు, సృష్టి నిర్వహణలో అతిశయోక్తి కలవాడు, పోషకుడు, రాజు, అధికారం కలవాడు
الواحد … الأحد … المتكبِّر … الخالق … الخلاّق … البارئ … المصوِّر
ఒక్కడు, ఏకైకుడు, పెద్దరికం కలవాడు, సృష్టికర్త, సర్వాన్నిసృష్టించువాడు, ఉనికిని ప్రసాదించువాడు, రూపకల్పన చేయువాడు
المؤمن … المهيمن … المحيط … المقيت … الوكيل … الكافي … الواسع
శాంతి ప్రధాత, పర్యవేక్షకుడు, చుట్టుముట్టేవాడు, ఆహారప్రధాత, కార్యసాధకుడు, సరిపోయేవాడు, విస్తృతి కలవాడు
الحق … الجميل … الرفيق … الحيي … الستير … الإله … القابض
సత్యుడు, అందం గలవాడు, మృదువైనవాడు, సిగ్గు కలవాడు, పరదా కప్పేవాడు, ఆరాధ్యుడు, నేరాలపై పట్టుకునేవాడు
الباسط … المعطي … المقدِّم … المؤخِّر … المبين … المنان … الوليّ
ఆహారమును విస్తృతపరిచేవాడు, ప్రసాదించేవాడు, ముందుకు నెట్టేవాడు, వెనుకకు నెట్టేవాడు, సన్మార్గమును స్పష్టపరిచేవాడు, అధికంగా ఉపకారం చేసేవాడు, స్నేహాన్ని పంచేవాడు
الموْلى … النصير … الشافي … مالك الملك
సంరక్షకుడు, సహాయకుడు, నయం చేసేవాడు, సామ్రాజ్యాధిపతి
جامع الناس … نور السموات والأرض … ذو الجلال والإكرام
ప్రజలను సమీకరించేవాడు, భూమ్యాకాశములకు కాంతినిచ్చువాడు, ఘనత, గౌరవం గలవాడు భూమ్యాకాశములను ఆవిష్కరించినవాడు.[2]
بسم الله الرحمن الرحيم
అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభం.
తొలి పలుకులు
إنَّ الحَمْدَ لِلَّهِ، نَحْمَدُهُ، وَنَسْتَعِينُهُ، وَنَسْتَغْفِرُهُ، وَنَعُوذُ بِاللَّهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا، وَمِنْ سَيِّئَاتِ أَعْمَالِنَا، مَنْ يَهْدِهِ اللَّهُ فَلاَ مُضِلَّ لَهُ، وَمَنْ يُضْلِلْ فَلاَ هَادِيَ لَهُ
ఇన్నల్ హమ్ద లిల్లాహి, నహ్మదుహు, వ నస్తయీనుహు, వనస్తగ్ఫిరుహు, వనఊజు బిల్లాహి మిన్ షురూరి అన్ఫుసినా, వమిన్ సయ్యిఆతి అఅ్మాలినా, మయ్యహ్దిహిల్లాహు ఫలా ముజిల్లలహు, వమయ్యుజ్, లిల్ ఫలా హాదియలహు.
(నిశ్చయంగా స్థుతులన్ని అల్లాహ్ కొరకే, మేము ఆయన స్థుతులను పలుకుతున్నాము, ఆయనతోనే సహాయం అర్ధిస్తున్నాము, ఆయనతో మన్నింపును వేడుకుంటున్నాము. మరియు మా హృదయముల చెడు నుండి మరియు మా దుష్కర్మల నుండి అల్లాహ్ తో మేము శరణు వేడుకుంటున్నాము. అల్లాహ్ సన్మార్గం చూపినవారిని అపమార్గమునకు లోను చేసేవాడు ఎవడూ లేడు మరియు ఆయన అపమార్గమునకు లోను చేసినవారిని సన్మార్గము చూపేవాడు ఎవడూ లేడు.)
وَأَشْهَدُ أَنْ لاَ إِلَهَ إِلاَّ اللَّهُ وَحْدَهُ لاَ شَرِيكَ لَهُ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّداً عَبْدُهُ وَرَسُولُهُ، صَلَّى اللَّهُ عَلَيْهِ وَعَلَى آلِهِ وَأَصْحَابِهَ وَمَنْ تَبِعَهُمْ بِإِحْسَانٍ إِلَى يَوْمِ الدِّينِ، وَسَلَّمَ تَسْلِيمَاً كَثِيرَاً. أمَّا بَعْدُ
వ అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహు లా షరీక లహు, వఅష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వరసూలుహు, సల్లల్లాహు అలైహి వఅలా ఆలిహి వఅస్హాబిహి వమన్ తబిఅహుమ్ బిఇహ్సానిన్ ఇలా యౌమిద్దీని, వసల్లమ తస్లీమన్ కసీరన్. అమ్మా బఅద్ :
(అల్లాహ్ ఒక్కడే తప్ప వేరే ఆరాధ్యదైవం లేడని, ఆయనకు ఎవరు సాటి లేరని నేను సాక్ష్యం పలుకుతున్నాను. మరియు ముహమ్మద్ ఆయన దాసుడని, ఆయన ప్రవక్త అని నేను సాక్ష్యం పలుకుతున్నాను. అల్లాహ్ ఆయనపై మరియు ఆయన కుటుంబముపై, ఆయన సహచరులపై మరియు తీర్పు దినం వరకు దాతృత్వముతో ఆయనను అనుసరించే వారిపై శుభాలను శాంతిని కురిపించుగాక. దీని తరువాత :)
ఇది నా పుస్తకం (అజ్జిక్రు వద్దుఆఉ వల్ ఇలాజు బిర్రుఖా మినల్ కితాబి వస్సున్న) యొక్క సారాంశం. దీనిలో నేను ప్రార్ధన రకాలను తగ్గించాను దాని నుండి ప్రయోజనం చెందటం శులభతరం అవటానికి. మరియు నేను దఆలను మరియు లాభకరమైన ప్రయోజనాలను అధికం చేశాను. ఇన్ షా అల్లాహు తఆలా. మరియు నేను అల్లాహ్ యొక్క మంచి నామముల ద్వారా, ఆయన ఉన్నత గుణముల ద్వారా అల్లాహ్ తో వేడుకుంటున్నాను ఆయన దాన్ని కేవలం ఆయన మన్నత కొరకు చేయమని. నిశ్చయంగా ఆయన దాని సంరక్షకుడు మరియు దాని సామర్ధ్యం కలవాడు.
మరియు అల్లాహ్ మన ప్రవక్త ముహమ్మద్ పై, ఆయన కుటుంబము పై, ఆయన సహచరులపై, ప్రళయదినం వరకు దాతృత్వంతో ఆయనను అనుసరించేవారిపై శుభాలను, శాంతిని కురిపించుగాక.
– సయీద్ బిన్ అలీ బిన్ వహఫ్ అల్ ఖహ్తానీ
దుఆ ప్రాముఖ్యత
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:
మరియు మీ ప్రభువు ఇలా అన్నాడు: “నన్ను ప్రార్థించండి, నేను మీ ప్రార్థనలను అంగీకరిస్తాను. నిశ్చయంగా, ఎవరైతే నా ప్రార్థనల పట్ల దురహంకారం చూపుతారో, వారు తప్పక అవమానితులై నరకంలో ప్రవేశించగలరు“.[3]
మరియు మహాశక్తిసంపన్నుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :
మరియు నా దాసులు, నా గురించి నిన్ను అడిగితే: “నేను (వారికి) అతి సమీపంలోనే ఉన్నాను. పిలిచేవాడు నన్ను పిలిచినప్పుడు నేను అతని పిలుపు విని, జవాబిస్తాను. కాబట్టి వారు సరైన మార్గం పొందటానికి, నా ఆజ్ఞను అనుసరించాలి మరియు నా యందు విశ్వాసం కలిగి ఉండాలి” అని, చెప్పు.[4]
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: నిశ్చయంగా దుఆ యే ఆరాధన.మీ ప్రభువు ఇలా సెలవిచ్చాడు : ((మీరు నన్ను వేడుకోండి నేను మీ కొరకు స్వీకరిస్తాను))[5].
ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: ‘నిశ్చయంగా నీ ప్రభువు దయామయుడు బిడియంగలవాడు, దాసుడు తన వైపు చేతులు చాచి అర్ధించినప్పుడు అతన్ని ఖాళీ చేతులతో మరల్చడానికి అల్లాహ్ సిగ్గు పడతాడు’[6] ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: ఏ ముస్లిం అయినా తాను ఏదైనా దుఆ చేస్తే అందులో ఎటువంటి పాపముగాని బంధుత్వమును త్రెంచే విషయంగాని లేకపోతే అల్లాహ్ దాని ఫలితంగా మూడు విషయాలలో ఒక దానిని అతనికి ఇస్తాడు : అతని దుఆను వెంటనే స్వీకరించి ప్రసాదిస్తాడు లేదా దానిని అతని కొరకు ప్రళయదినంలో నిల్వచేసి ఇస్తాడు లేదా దానికి తగిన విధంగా అతని నుండి చెడును తొలగిస్తాడు. ప్రవక్త అనుచరులు అప్పుడు మేము అధికంగా దుఆ చేస్తాము అన్నారు. ప్రవక్త అల్లాహ్ యొక్క అనుగ్రహము అధికంగా ఉన్నది అని అన్నారు.[7],[8]
దుఆ చేసే పద్దతులు మరియు దుఆ స్వీకరించబడటానికి కారణాలు [9]
- అల్లాహ్ కొరకు చిత్తశుద్ధి. (الإخْلاَصُ للَّهِ)
- అల్లాహ్ పై స్తుతులను మరియు ఆయన పొగడ్తలను పలుకుతూ ఆ తరువాత దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై దరూద్ చదవుతూ ఆరంభించటం. మరియు వాటితో ముగించటం. (أنْ يَبْدَأَ بِحَمْدِ الله، وَالثَّنَاءِ عَلَيْهِ، ثُمّ بِالصَّلاَةِ عَلَى النَّبِيِّ – صلى الله عليه وسلم -، وَيَخْتِمُ بِذَلِكَ)
- దృఢ సంకల్పంతో దుఆ చేయటం మరియు దుఆ స్వీకరించబడటం పై పూర్తి నమ్మకమును కలిగి ఉండటం.
- దుఆలో మొండిగా వ్యవహరించటం మరియు తొందర చేయకుండా ఉండటం.
- దుఆలో మనస్సును ఉనికిలో ఉంచటం.
- కలిమిలో మరియు లేమిలో దుఆ చేయటం.
- అల్లాహ్ ఒక్కడితో మాత్రమే అర్ధించటం
- కుటుంబంపై, సంపదపై, సంతానముపై, ప్రాణంపై బద్దుఆ చేయకుండా ఉండటం.
- బిగ్గరకు, నెమ్మదిగకు మధ్య స్వరమును తగ్గించి దుఆ చేయటం.
- పాపమును అంగీకరించటం, దానికి క్షమాపణను కోరటం, అనుగ్రహమును అంగీకరించటం మరియు వాటిపై అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలుపుకోవటం.
- దుఆ చేసేటప్పుడు రాగాలు తీయటానికి ఇబ్బందిపడకుండా చేయటం.
- వేడుకోవటం, వినయం చూపటం, ఆశించటం మరియు భయపడటం.
- పశ్ఛాత్తాపంతో బాధలను ప్రతిస్పందించటం.
- దుఆను మూడుసార్లు చేయటం.
- ఖిబ్లాకి అభిముఖమవటం.
- దుఆలో చేతులను పైకి ఎత్తడం.
- సౌలభ్యం ఉంటే దుఆను ఆరంభించే ముందు వుజూ చేయటం.
- దుఆ చేయటంలో అతిక్రమించకూడదు.
- దుఅ చేసే వ్యక్తి ఇతరుల కొరకు దుఆ చేసేటప్పుడు తన స్వయం కొరకు దుఆ చేయటముతో ఆరంభించాలి[10].
- అల్లాహ్ మంచి నామములను మరియు ఆయన ఉన్నత గుణాలను లేదా దుఆ చేసే వ్యక్తి స్వయంగా తాను చేసుకున్న ఏదైన సత్కర్మను లేదా జీవించి ప్రత్యక్షంగా ఉన్న పుణ్య పురుషుని ద్వారా దుఆ చేయించటం ద్వారా అల్లాహ్ కు వసీలా చేయటం.
- తినటం, త్రాగటం మరియు తొడగటం హలాల్ దై ఉండాలి.
- ఏదైన పాపము గురించి లేదా బంధుత్వమును తెంచటం గురించి దుఊ చేయకూడదు.
- మంచి గురించి ఆదేశించాలి మరియు చెడు నుండి వారించాలి.
- పాప కార్యములన్నింటి నుండి దూరంగా ఉండటం.
దుఆ స్వీకరించబడే వేళలు, పరిస్థితులు మరియు ప్రదేశములు[11]
- లైలతుల్ ఖద్ర్ (ఘనమైన రాత్రి) లో.
- రాత్రి ఆఖరి జాములో.
- ఫరజ్ నమాజుల తరువాత.
- అజాన్ మరియు ఇఖామత్ మధ్యన.
- ప్రతీ రాత్రిలో ఒక ఘడియ.
- ఫరజ్ నమాజుల కొరకు అజాన్ ఇచ్చే వేళ.
- వర్షం కురిసేటప్పుడు.
- దైవ మార్గంలో సైన్యాలు కవాతు చేసినప్పుడు.
- జుమా రోజున ఒక ఘడియలో.జుమా రోజు అసర్ వేళ ఈ ఘడియ అన్నది వీటి విషయంలో ప్రమాణ బద్ధమైన వాక్కు. అది ఖుత్బా మరియు నమాజు వేళ కూడా కావచ్చు.
- సత్య సంకల్పముతో జమ్ జమ్ నీరు త్రాగేటప్పుడు.
- సజ్దాలలో.
- రాత్రి వేళ నిద్ర నుండి మేల్కొన్నప్పుడు. మరియు ఇందులో దుఆయె మాసూర్ చేయటం.
- వుజూతో నిదురపోయి ఆ తరువాత రాత్రి మేల్కొని దుఆ చేసినప్పుడు.
- లా ఇలాహ ఇల్లా అన్త సుబహానక ఇన్నీ కున్తు మినజ్జాలిమీన్ ద్వారా దుఆ చేసినప్పుడు.
- మృతుని చనిపోయిన తరువాత ప్రజలు అతని కొరకు చేయు దుఆ.
- అల్లాహ్ ను స్తుతించిన తరువాత దుఆ చేయటం మరియు చివరి తషహ్హుద్ లో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై దరూద్ చదవటం.
- అల్లాహ్ యొక్క గొప్ప నామముతో దుఆ చేసినప్పుడు. దాని ద్వారా ఆయనకు దుఆ చేస్తే ఆయన ఆమోదిస్తాడు మరియు దాని ద్వారా ఆయనను అడిగితే ఆయన ప్రసాదిస్తాడు[12].
- పరోక్షంగా ఉన్న తన ముస్లిం సోదరుని కొరకు చేసే ముస్లిం దుఆ.
- అరఫా దినమున అరఫాలో చేసే దుఆ.
- రమజాను మాసములో చేసే దుఆ.
- ప్రార్ధన సమావేశాలలో ముస్లిములు సమావేశమైనప్పుడు.
- ఆపదలో ఇన్నాలిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్, అల్లాహుమ్మ అజుర్నీ ఫీ ముసీబతి, వఅఖ్లిప్లీ ఖైరన్ మిన్హా ద్వారా దుఆ చేసినప్పుడు.
- అల్లాహ్ వైపు మనస్సు మరలిన స్థితిలో మరియు తీవ్రమైన చిత్తశుద్ది స్థితిలో చేసిన దుఆ.
- బాధించబడిన వ్యక్తి బద్దుఆ తనను బాధించిన వారికి వ్యతిరేకంగా చేసినది.
- తన కన్న కొడుకు కొరకు తండ్రి దుఆ, మరియు తన కొడుకుకి వ్యతిరేకంగా చేసిన బద్దువా.
- ప్రయాణికుని దుఆ.
- ఉపవాసి తాను ఉపవాసమును విరమించేంతవరకు చేసే దుఆ.
- ఉపవాసమును విరమించే వేళ ఉపవాసి దుఆ
- కలతకు గురైనవాడి దుఆ.
- న్యాయపరుడైన ఇమామ్ దుఆ.
- తన తల్లిదండ్రుల కొరకు పుణ్య సంతానము యొక్క దుఆ.
- వుజూ తరువాత దుఆ అందులో మాసూర్ దుఆ చేసినప్పుడు.
- జమ్రతుస్సుగ్రా ను కంకర రాళ్ళు కొట్టిన తరువాత దుఆ.
- జమ్రతుల్ వుస్తాను కంకర రాళ్ళు కొట్టిన తరువాత దుఆ.
- కాబా లోపల దుఆ చేయటం. మరియు ఎవరైతే హతీమ్ లోపల నమాజు చేస్తాడో అతను కాబాలో నమాజు చదివినట్లే.
- సఫాపై దుఆ చేయటం.
- మర్వాపై దుఆ చేయటం.
- మష్అరె హరామ్ వద్ద దుఆ చేయటం.
విశ్వాసపరుడు ఎక్కడ ఉన్నా తన ప్రభువును ప్రార్ధిస్తాడు.
అల్లాహ్ అజ్జవజల్ల ఇలా సెలవిచ్చాడు -:
وَإِذَا سَأَلَكَ عِبَادِي عَنِّي فَإِنِّي قَرِيبٌ أُجِيبُ دَعْوَةَ الدَّاعِ إِذَا دَعَانِ فَلْيَسْتَجِيبُوا لِي وَلْيُؤْمِنُوا بِي لَعَلَّهُمْ يَرْشُدُونَ
((మరియు నా దాసులు, నా గురించి నిన్ను అడిగితే: “నేను (వారికి) అతి సమీపంలోనే ఉన్నాను. పిలిచేవాడు నన్ను పిలిచినప్పుడు నేను అతని పిలుపు విని, జవాబిస్తాను. కాబట్టి వారు సరైన మార్గం పొందటానికి, నా ఆజ్ఞను అనుసరించాలి మరియు నా యందు విశ్వాసం కలిగి ఉంటాలి అని, చెప్పు))[13].
కాని ఈ వేళలు, పరిస్థితులు, ప్రదేశములు మరింత జాగ్రత్త వహించటమునకు ప్రత్యేకించబడుతాయి.
ఖుర్ఆన్ మరియు సున్నత్ నుండి దుఆలు
అల్హమ్దులిల్లాహి వహదహ్, వస్సలాతు వస్సలాం అలా మన్లా నబియ్య బఅదహ్.
ఖుర్ఆన్ నుండి దుఆలు
దుఆ – 01
بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ * الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ * الرَّحْمَنِ الرَّحِيمِ * مَالِكِ يَوْمِ الدِّينِ * إِيَّاكَ نَعْبُدُ وَإِيَّاكَ نَسْتَعِينُ * اهْدِنَا الصِّرَاط الْمُسْتَقِيمَ * صِرَاطَ الَّذِينَ أَنْعَمْتَ عَلَيْهِمْ غَيْرِ الْمَغْضُوبِ عَلَيْهِمْ وَلَا الضَّالِّينَ
అనంత కరుణామయుడు అపార కరుణా ప్రధాత అయిన అల్లాహ్ పేరుతో సమస్త స్తోత్రాలన్ని సర్వలోకాలకు ప్రభువైన అల్లాహ్ కు మాత్రమే వర్తిస్తాయి అనంత కరుణామయుడు, అపార కరుణా ప్రధాత తీర్పుదినానికి స్వామి మేము నిన్నే ఆరాధిస్తున్నాము మరియు నీ సహాయాన్నే అర్థిస్తున్నాము మాకు ఋజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేయి నీవు అనుగ్రహించిన వారి మార్గం మాత్రమే (చూపు) నీ ఆగ్రహానికి గురి అయిన వారి (మార్గం కానీ) లేక మార్గభ్రష్టులైన వారి (మార్గం కానీ) కాదు.(15)
దుఆ – 02
رَبَّنَا تَقَبَّلْ مِنَّا إِنَّكَ أَنتَ السَّمِيعُ الْعَلِيمُ
ఓ మా ప్రభూ మా సేవను స్వీకరించు. నీవు మాత్రమే సర్వం వినేవాడవు, సర్వం తెలిసినవాడవు.[14]
దుఆ – 03
وَتُبْ عَلَيْنَآ إِنَّكَ أَنتَ التَّوَّابُ الرَّحِيمُ
మమ్మల్ని క్షమించు. నిశ్చయంగా నీవు మాత్రమే పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడువు, అపారంగా కరుణించేవాడవు.[15]
దుఆ – 04
رَبَّنَا آتِنَا فِي الدُّنْيَا حَسَنَةً وَفِي الآخِرَةِ حَسَنَةً وَقِنَا عَذَابَ النَّارِ
ఓ మా ప్రభువా మాకు ఇహలోకములో మంచిని, పరలోకములో మంచిని ప్రసాదించు మరియు మమ్మల్ని నరక శిక్ష నుండి రక్షించు.[16]
దుఆ – 05
سَمِعْنَا وَأَطَعْنَا غُفْرَانَكَ رَبَّنَا وَإِلَيْكَ الْمَصِيرُ
మేము విన్నాము మరియు విధేయులం అయ్యాము. మా ప్రభూ మేము నీ క్షమాభిక్షను అర్ధిస్తున్నాము. కడకు మేము మరలి రావలసింది నీ వద్దకే.))[17]
దుఆ – 06
رَبَّنَا لاَ تُؤَاخِذْنَا إِن نَّسِينَا أَوْ أَخْطَأْنَا رَبَّنَا وَلاَ تَحْمِلْ عَلَيْنَا إِصْرًا كَمَا حَمَلْتَهُ عَلَى الَّذِينَ مِن قَبْلِنَا رَبَّنَا وَلاَ تُحَمِّلْنَا مَا لاَ طَاقَةَ لَنَا بِهِ وَاعْفُ عَنَّا وَاغْفِرْ لَنَا وَارْحَمْنَآ أَنتَ مَوْلاَنَا فَانصُرْنَا عَلَى الْقَوْمِ الْكَافِرِينَ
ఓ మా ప్రభూ! మేము మరచినా లేక తప్పు చేసినా మమ్మల్ని పట్టకు! ఓ మా ప్రభూ! పూర్వం వారిపై మోపినట్టి భారం మాపై మోపకు. ఓ మా ప్రభూ! మేము సహించలేని భారం మాపై వేయకు. మమ్మల్ని మన్నించు, మమ్మల్ని క్షమించు మరియు మమ్మల్ని కరుణించు. నీవే మా సంరక్షకుడవు, కావున సత్యతిరస్కారులకు విరుద్ధంగా మాకు విజయము (సహాయము) నొసంగు.[18]
رَبَّنَا لاَ تُزِغْ قُلُوبَنَا بَعْدَ إِذْ هَدَيْتَنَا وَهَبْ لَنَا مِن لَّدُنكَ رَحْمَةً إِنَّكَ أَنتَ الْوَهَّابُ
(7) “ఓ మా ప్రభూ! మాకు సన్మార్గం చూపిన తరువాత మా హృదయాలను వక్రమార్గం వైపునకు పోనివ్వకు. మరియు మాపై నీ కారుణ్యాన్ని ప్రసాదించు. నిశ్చయంగా, నీవే సర్వప్రదుడవు[19].
దుఆ – 8
رَبَّنَا إِنَّنَا آمَنَّا فَاغْفِرْ لَنَا ذُنُوبَنَا وَقِنَا عَذَابَ النَّارِ
“ఓ మా ప్రభూ! మేము నిశ్చయంగా విశ్వసించాము, కావున మా తప్పులను క్షమించు మరియు నరకాగ్ని నుండి మమ్మల్ని తప్పించు”[20].
దుఆ – 9
رَبِّ هَبْ لِي مِن لَّدُنْكَ ذُرِّيَّةً طَيِّبَةً إِنَّكَ سَمِيعُ الدُّعَاءِ
(ఓ నా ప్రభూ నీ వద్ద నుండి నాకు మంచి సంతానాన్ని ప్రసాదించు. నిస్సందేహంగా నీవు మొరను ఆలకించేవాడవు) [21]
దుఆ – 10
رَبَّنَا آمَنَّا بِمَا أَنزَلَتْ وَاتَّبَعْنَا الرَّسُولَ فَاكْتُبْنَا مَعَ الشَّاهِدِينَ
“ఓ మా ప్రభూ! నీవు అవతరింపజేసిన సందేశాన్ని మేము విశ్వసించాము మరియు మేము ఈ సందేశహరుణ్ణి అనుసరించాము. కావున మమ్మల్ని సాక్షులలో వ్రాసుకో!”(24)
దుఆ – 11
ربَّنَا اغْفِرْ لَنَا ذُنُوبَنَا وَإِسْرَافَنَا فِي أَمْرِنَا وَثَبِّتْ أَقْدَامَنَا وانصُرْنَا عَلَى الْقَوْمِ الْكَافِرِينَ
మా ప్రభూ! మా పాపాలను క్షమించు. మా పనుల్లో మా వల్ల జరిగిన ‘అతి’ని మన్నించు. మా పాదాలకు నిలకడను ప్రసాదించు. అవిశ్వాస జనులకు వ్యతిరేకంగా మాకు తోడ్పాటునందించు.[22]
దుఆ – 12
رَبَّنَا مَا خَلَقْتَ هَذا بَاطِلاً سُبْحَانَكَ فَقِنَا عَذَابَ النَّارِ * رَبَّنَا إِنَّكَ مَن تُدْخِلِ النَّارَ فَقَدْ أَخْزَيْتَهُ وَمَا لِلظَّالِمِينَ مِنْ أَنصَارٍ * رَّبَّنَا إِنَّنَا سَمِعْنَا مُنَادِيًا يُنَادِي لِلإِيمَانِ أَنْ آمِنُواْ بِرَبِّكُمْ فَآمَنَّا رَبَّنَا فَاغْفِرْ لَنَا ذُنُوبَنَا وَكَفِّرْ عَنَّا سَيِّئَاتِنَا وَتَوَفَّنَا مَعَ الأبْرَارِ * رَبَّنَا وَآتِنَا مَا وَعَدتَّنَا عَلَىرُسُلِكَ وَلاَ تُخْزِنَا يَوْمَ الْقِيَامَةِ إِنَّكَ لاَ تُخْلِفُ الْمِيعَادَ
మా ప్రభూ! నువ్వు ఈ సృష్టిని నిరర్థకంగా చేయలేదు. నువ్వు పవిత్రుడవు. మమ్మల్ని నరకాగ్ని శిక్ష నుంచి కాపాడు. “ఓ మా ప్రభూ! నీవు ఎవడిని నరకాగ్నిలో పడవేస్తావో వాస్తవంగా వానిని నీవు అవమానపరిచావు. మరియు దుర్మార్గులకు సహాయకులు ఎవ్వరూ ఉండరు”. “ఓ మా ప్రభూ! నిశ్చయంగా, మేము: ‘మీ ప్రభువును విశ్వసించండి.’ అని విశ్వాసం వైపుకు పిలిచే అతని (ముహమ్మద్) యొక్క పిలుపు విని విశ్వసించాము. ఓ మా ప్రభూ! మా పాపాలను క్షమించు మరియు మాలో ఉన్న చెడులను మా నుండి తొలగించు మరియు పుణ్యాత్ములతో (ధర్మనిష్ఠాపరులతో) మమ్మల్ని మరణింపజెయ్యి!” “ఓ మా ప్రభూ! మరియు నీ ప్రవక్తల ద్వారా నీవు మాకు చేసిన వాగ్దానాలను పూర్తి చేయి మరియు తీర్పు దినమున మమ్మల్ని అవమాన పరచకు. నిశ్చయంగా, నీవు నీ వాగ్దానాలను భంగం చేయవు”.[23]
దుఆ – 13
رَبَّنَا آمَنَّا فَاكْتُبْنَا مَعَ الشَّاهِدِينَ
మా ప్రభూ! మేము విశ్వసించాము. కాబట్టి మా పేర్లను కూడా సాక్ష్యం పలికేవారితో పాటు వ్రాసుకో.
దుఆ – 14
رَبَّنَا ظَلَمْنَا أَنفُسَنَا وَإِن لَّمْ تَغْفِرْ لَنَا وَتَرْحَمْنَا لَنَكُونَنَّ مِنَ الْخَاسِرِينَ
((మా ప్రభూ! మాకు మేము అన్యాయం చేసుకున్నాము. మరియు నీవు మమ్మల్ని కరుణించకపోతే! మమ్మల్ని క్షమించకపోతే! నిశ్చయంగా, మేము నాశనమై పోయేవారమవుతాము.))[24]
దుఆ – 15
رَبَّنَا لاَ تَجْعَلْنَا مَعَ الْقَوْمِ الظَّالِمِينَ
((ఓ ప్రభూ! మమ్మల్ని ఈ దుర్మార్గులలో చేర్చకు))[25]
దుఆ – 16
اللَّهُمَّ {أَنْتَ وَلِيُّنَا فَاغْفِرْ لَنَا وَارْحَمْنَا وَأَنْتَ خَيْرُ الْغَافِرِينَ* وَاكْتُبْ لَنَا فِي هَذِهِ الدُّنْيَا حَسَنَةً وَفِي الْآخِرَةِ}
ఓ అల్లాహ్ {నువ్వే మా సంరక్షకుడవు. కనుక మాకు క్షమాభిక్ష పెట్టు. మాపై దయజూపు. నీవు క్షమించే వారందరిలోకీ ఉత్తమ క్షమాశీలివి. మా కోసం ప్రపంచంలోనూ, పరలోకంలో కూడా మేలును వ్రాయి}.[26]
దుఆ – 17
حَسْبِيَ اللَّهُ لا إِلَهَ إِلاَّ هُوَ عَلَيْهِ تَوَكَّلْتُ وَهُوَرَبُّ الْعَرْشِ الْعَظِيمِ
((నాకు అల్లాహ్ చాలు! ఆయన తప్ప వేరే ఆరాధ్యనీయుడు లేడు! నేను ఆయననే నమ్ముకున్నాను. మరియు ఆయనే సర్వోత్తమ సింహాసనానికి (అర్ష్ కు) ప్రభువు))[27]
దుఆ – 18
رَبَّنَا لاَ تَجْعَلْنَا فِتْنَةً لِّلْقَوْمِ الظَّالِمِينَ * وَنَجِّنَا بِرَحْمَتِكَ مِنَ الْقَوْمِ الْكَافِرِينَ
((ఓ ప్రభూ! మమ్మల్ని ఈ దుర్మార్గుల పరీక్షా సాధనంగా చేయకు. మరియు నీ కారుణ్యంతో మమ్మల్ని సత్యతిరస్కార ప్రజల నుండి కాపాడు))[28].
దుఆ – 19
رَبِّ إِنِّي أَعُوذُ بِكَ أَنْ أَسْأَلَكَ مَا لَيْسَ لِي بِهِ عِلْمٌ وَإِلاَّ تَغْفِرْ لِي وَتَرْحَمْنِي أَكُن مِّنَ الْخَاسِرِينَ
((ఓ నా ప్రభూ! నిశ్చయంగా, నాకు తెలియని విషయాన్ని గురించి నిన్ను అడిగినందుకు, నేను నీ శరణు వేడుకుంటున్నాను. మరియు నీవు నన్ను క్షమించకపోతే, నన్ను కరణించకపోతే, నేను నష్టపోయిన వారిలో చేరుతాను))[29].
దుఆ – 20
اللَّهُم يا {فَاطِرَ السَّمَوَاتِ وَالْأَرْضِ أَنْتَ وَلِيِّي فِي الدُّنْيَا وَالْآخِرَةِ تَوَفَّنِي مُسْلِمًا وَأَلْحِقْنِي بِالصَّالِحِينَ}
ఓ అల్లాహ్ ((ఓ భూమ్యాకాశాల సృష్టికర్తా ఇహంలోనూ, పరంలోనూ నువ్వే నా సంరక్షకుడవు. ముస్లింగా ఉన్న స్థితిలోనే నాకు మరణంను ప్రసాదించు. నన్ను సజ్జనులలో చేర్చు.))[30]
దుఆ – 21
رَبِّ اجْعَلْ هَذَا الْبَلَدَ آمِنًا وَاجْنُبْنِي وَبَنِيَّ أَننَّعْبُدَ الأَصْنَامَ
((ఓ నా ప్రభూ! ఈ నగరాన్ని (మక్కాను) శాంతి నిలయంగా ఉంచు! మరియు నన్నూ నా సంతానాన్నీ విగ్రహారాధన నుండి తప్పించు!))[31].
దుఆ – 22
رَبِّ اجْعَلْنِي مُقِيمَ الصَّلاَةِ وَمِن ذُرِّيَّتِي رَبَّنَا وَتَقَبَّلْ دُعَاءِ
((ఓ నా ప్రభూ! నన్ను మరియు నా సంతతి వారిని నమాజ్ స్థాపించే వారిగా చేయి. ఓ మా ప్రభూ! నా ప్రార్థనలను స్వీకరించు))[32].
దుఆ – 23
رَبَّنَا اغْفِرْ لِي وَلِوَالِدَيَّ وَلِلْمُؤْمِنِينَ يَوْمَ يَقُومُ الْحِسَابُ
((ఓ మా ప్రభూ! నన్నూ నా తల్లిదండ్రులను మరియు సమస్త విశ్వాసులను లెక్కల పరిష్కారం రోజు క్షమించు))[33].
దుఆ – 24
رَبَّنَا آتِنَا مِن لَّدُنكَ رَحْمَةً وَهَيِّئْ لَنَا مِنْ أَمْرِنَا رَشَدًا
((ఓ మా ప్రభూ నీ వద్ద నుంచి మాకు కారుణ్యాన్ని ప్రసాదించు. మా పనిలో మా కోసం సన్మార్గాన్ని సులభతరం చెయ్యి[34].))
దుఆ – 25
رَبِّ اشْرَحْ لِي صَدْرِي* وَيَسِّرْ لِي أَمْرِي* وَاحْلُلْ عُقْدَةً مِّن لِّسَانِي، يَفْقَهُوا قَوْلِي
((ఓ నా ప్రభూ! నా హృదయాన్ని వికసింపజేయి. మరియు నా వ్యవహారాన్ని నా కొరకు సులభం చేయి. మరియు నా నాలుక ముడిని విప్పు, (దానితో) వారు నా మాటలను సులభంగా అర్థం చేసుకోవటానికి[35].))
దుఆ – 26
رَّبِّ زِدْنِي عِلْمًا
((ప్రభూ నా జ్ఞానమును పెంచు))[36].
దుఆ – 27
لا إِلَهَ إِلا أَنتَ سُبْحَانَكَ إِنِّي كُنتُ مِنَ الظَّالِمِينَ
((నీవు తప్ప వేరే ఆరాధ్యుడు లేడు, నీవు పవిత్రుడవు, నిశ్చయంగా నేనే దోషులలో చేరిన వాణ్ణి))[37].
దుఆ – 28
رَبِّ لا تَذَرْنِي فَرْدًا وَأَنتَ خَيْرُ الْوَارِثِينَ
((నా ప్రభూ నన్ను ఒంటరివానిగా వదలకు. నీవు అందరికన్నా అత్యుత్తమ వారసుడవు))[38].
దుఆ – 29
رَبِّ أَعُوذُ بِكَ مِنْ هَمَزَاتِ الشَّيَاطِينِ * وَأَعُوذُ بِكَ رَبِّ أَنْ يَحْضُرُونِ
((ఓ నా ప్రభూ! షైతానులు రేకెత్తించే కలతల నుండి (రక్షణ పొందటానికి) నేను నీ శరణు వేడుకుంటున్నాను. మరియు ఓ నా ప్రభూ! అవి నా వద్దకు రాకుండా ఉండాలని, నేను నీ శరణు వేడుకుంటున్నాను))[39]
దుఆ – 30
رَبَّنَا آمَنَّا فَاغْفِرْ لَنَا وَارْحَمْنَا وَأَنتَ خَيْرُ الرَّاحِمِينَ
((ఓ మా ప్రభూ మేము విశ్వసించాము. కనుక మమ్మల్ని క్షమించు, మా పై దయచూపు. నువ్వు దయచూపే వారందరిలోకెల్లా శ్రేష్ఠుడవు))[40].
దుఆ – 31
رَّبِّ اغْفِرْ وَارْحَمْ وَأَنتَ خَيْرُ الرَّاحِمِينَ
((ఓ నా ప్రభూ! నన్ను క్షమించు, నన్ను కరుణించు, కరుణించేవారిలో నీవే అత్యుత్తముడవు!))[41].
దుఆ – 32
رَبَّنَا اصْرِفْ عَنَّا عَذَابَ جَهَنَّمَ إِنَّ عَذَابَهَا كَانَ غَرَامًا*إِنَّهَا سَاءَتْ مُسْتَقَرًّا وَمُقَامًا
((మా ప్రభూ మాపై నుంచి నరకశిక్షను తొలగించు. ఎందుకంటే ఆ శిక్ష ఎన్నటికీ వీడనిది. నిశ్చయంగా అది చాలా చెడ్డ చోటు మరియు చెడ్డ నివాస స్థలం))[42].
దుఆ – 33
رَبَّنَا هَبْ لَنَا مِنْ أَزْوَاجِنَا وَذُرِّيَّاتِنَا قُرَّةَ أَعْيُنٍ وَاجْعَلْنَا لِلْمُتَّقِينَ إِمَامًا
((ఓ మా ప్రభూ! మా సహవాసుల (అజ్వాజ్ ల) మరియు సంతానం ద్వారా మా కన్నులకు చల్లదనం ప్రసాదించు. మరియు మమ్మల్ని దైవభీతి గలవారికి నాయకులుగా (ఇమాములుగా) చేయి))[43].
దుఆ – 34
رَبِّ هَبْ لِي حُكْمًا وَأَلْحِقْنِي بِالصَّالِحِينَ* وَاجْعَلْ لِي لِسَانَ صِدْقٍ فِي الآخِرِينَ * وَاجْعَلْنِي مِن وَرَثَةِ جَنَّةِ النَّعِيمِ
((ఓ నా ఫ్రభూ! నాకు వివేకాన్ని ప్రసాదించు మరియు నన్ను సద్వర్తనులలో కలుపు. మరియు తరువాత వచ్చే తరాల వారిలో నాకు మంచి పేరును ప్రసాదించు. మరియు సర్వసుఖాల స్వర్గానికి వారసులయ్యేవారిలో నన్ను చేర్చు))[44].
దుఆ – 35
وَلا تُخْزِنِي يَوْمَ يُبْعَثُونَ * يَوْمَ لَا يَنْفَعُ مَالٌ وَلَا بَنُونَ * إِلَّا مَنْ أَتَى اللَّهَ بِقَلْبٍ سَلِيمٍ
((మరియు అందరూ తిరిగి బ్రతికింపబడే రోజు నన్ను అవమానం పాలు చేయకు. ఏ రోజునైతే ధనసంపత్తులు గానీ, సంతానం గానీ పనికిరావో! కేవలం నిర్మలమైన హృదయంతో అల్లాహ్ సన్నిధిలో హాజరయ్యేవాడు తప్ప!))[45].
దుఆ – 36
رَبِّ أَوْزِعْنِي أَنْ أَشْكُرَ نِعْمَتَكَ الَّتِي أَنْعَمْتَ عَلَيَّ وَعَلَى وَالِدَيَّ وَأَنْ أَعْمَلَ صَالِحًا تَرْضَاهُ وَأَدْخِلْنِي بِرَحْمَتِكَ فِي عِبَادِكَ الصَّالِحِين
((ఓ నా ప్రభూ! నీవు నన్ను – నాకూ మరియు నా తల్లిదండ్రులకు చూపిన అనుగ్రహాలకు – కృతజ్ఞత తెలిపేవానిగా మరియు నీకు నచ్చే సత్కార్యాలు చేసేవానిగా, ప్రోత్సాహపరచు. మరియు నన్ను నీ కారుణ్యంతో సద్వర్తనులైన నీ దాసులలో చేర్చుకో!))[46].
దుఆ – 37
رَبِّ إِنِّي ظَلَمْتُ نَفْسِي فَاغْفِرْ لِي
((నా ప్రభూ నాకు నేనే అన్యాయం చేసుకున్నాను. నన్ను క్షమించు))[47].
దుఆ – 38
رَبِّ نَجِّنِي مِنَ الْقَوْمِ الظَّالِمِينَ
((ప్రభూ నన్ను దుర్మార్గ జనుల చెర నుండి కాపాడు))[48].
దుఆ – 39
عَسَى رَبِّي أَن يَهْدِيَنِي سَوَاءَ السَّبِيلِ
((నా ప్రభువు నన్ను సరైన మార్గంలోనే తీసుకుపోతాడని ఆశిస్తున్నాను))[49].
దుఆ – 40
رَبِّ إِنِّي لِمَا أَنزَلْتَ إِلَيَّ مِنْ خَيْرٍ فَقِيرٌ
((ప్రభూ నువ్వు నా వద్దకు ఏ మేలును పంపినా నాకు దాని అవసరం ఎంతైనా ఉంది))[50].
దుఆ – 41
رَبِّ انصُرْنِي عَلَى الْقَوْمِ الْمُفْسِدِينَ
((ఓ నా ప్రభూ! దౌర్జన్యపరులపై నాకు విజయము నొసంగు))[51].
దుఆ – 42
رَبِّ هَبْ لِي مِنَ الصَّالِحِينَ
((ఓ నా ప్రభూ! నాకు సద్వర్తనుడైన (కుమారుణ్ణి) ప్రసాదించు!))[52].
దుఆ – 43
رَبِّ أَوْزِعْنِي أَنْ أَشْكُرَ نِعْمَتَكَ الَّتِي أَنْعَمْتَ عَلَيَّ وَعَلَى وَالِدَيَّ وَأَنْ أَعْمَلَ صَالِحًا تَرْضَاهُ وَأَصْلِحْ لِي فِي ذُرِّيَّتِي إِنِّي تُبْتُ إِلَيْكَ وَإِنِّي مِنَ الْمُسْلِمِينَ
((నా ప్రభూ నీవు నాపై, నా తల్లిదండ్రులపై కురిపించిన అనుగ్రహ భాగ్యాలకుగాను కృతజ్ఞతలు తెలుపుకునే, నీ ప్రసన్నతను చూరగొనే విధంగా సత్కార్యాలు చేసే సద్బుద్ధిని నాకు ప్రసాదించు. ఇంకా నా సంతానాన్ని కూడా సజ్జనులుగా తీర్చిదిద్దు. నేను నీ వైపునకే మరలుతున్నాను. నేను నీ విధేయులలో ఒకణ్ణి))[53].
దుఆ – 44
رَبَّنَا اغْفِرْ لَنَا وَلِإِخْوَانِنَا الَّذِينَ سَبَقُونَا بِالإِيمَانِ وَلا تَجْعَلْ فِي قُلُوبِنَا غِلاً لِّلَّذِينَ آمَنُوا رَبَّنَا إِنَّكَ رَؤُوفٌ رَّحِيمٌ
((ఓ మా ప్రభూ! మమ్మల్ని మరియు మాకంటే ముందు విశ్వసించిన మా సోదరులను క్షమించు. మరియు మా హృదయాలలో విశ్వాసుల పట్ల ద్వేషాన్ని కలిగించకు. ఓ మా ప్రభూ! నిశ్చయంగా, నీవు చాలా కనికరించేవాడవు, అపార కరుణా ప్రధాతవు!))[54]
దుఆ – 45
رَّبَّنَا عَلَيْكَ تَوَكَّلْنَا وَإِلَيْكَ أَنَبْنَا وَإِلَيْكَ الْمَصِيرُ
((మా ప్రభూ మేము నీపైనే నమ్మకమును కలిగి ఉన్నాము. మరియు మేము నీ వైపునకు మరలుతున్నాము. నిన్నే చేరుకోవలసి ఉంది))[55].
దుఆ – 46
رَبَّنَا لا تَجْعَلْنَا فِتْنَةً لِّلَّذِينَ كَفَرُوا وَاغْفِرْ لَنَا رَبَّنَا إِنَّكَ أَنتَالْعَزِيزُ الْحَكِيمُ
((ఓ మా ప్రభూ! మమ్మల్ని సత్యతిరస్కారుల కొరకు పరీక్షా సాధనంగా చేయకు మరియు ఓ మా ప్రభూ! మమ్మల్ని క్షమించు. నిశ్చయంగా కేవలం, నీవే సర్వశక్తిమంతుడవు, మహా వివేచనాపరుడవు))[56].
దుఆ – 47
رَبَّنَا أَتْمِمْ لَنَا نُورَنَا وَاغْفِرْ لَنَا إِنَّكَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ
((మా ప్రభూ మా కాంతిని మా కొరకు పరిపూర్ణం గావించు. మమ్మల్ని క్షమించు. నిశ్చయంగా నీవు అన్నింటిపై అధికారం కలవాడవు))[57].
దుఆ – 48
رَبِّ اغْفِرْ لِي وَلِوَالِدَيَّ وَلِمَن دَخَلَ بَيْتِيَ مُؤْمِنًا وَلِلْمُؤْمِنِينَ وَالْمُؤْمِنَاتِ
((ఓ మా ప్రభూ! నన్ను, నా తల్లిదండ్రులను మరియు విశ్వాసిగా నా ఇంటిలోనికి ప్రవేశించిన వానిని మరియు విశ్వాసులైన పురుషులను మరియు విశ్వాసులైన స్త్రీలను, అందరినీ క్షమించు))[58].
దుఆ – 49
اللَّهُمَّ اهْدِنِي لِمَا اخْتُلِفَ فِيهِ مِنَ الْحَقِّ بِإِذْنِكَ، إِنَّكَ تَهْدِي مَنْ تَشَاءُ إِلَى صِرَاطٍ مُسْتَقِيمٍ
((ఓ అల్లాహ్ సత్యము నుండి దేనిలోనైతే విభేదించబడినదో దాని కొరకు నీ అనుమతితో నన్ను మార్గనిర్దేశం చేయి. నిశ్చయంగా నీవు తలచుకున్న వారిని ఋజు మార్గం వైపు మార్గనిర్దేశం చేస్తావు))[59].
దుఆ – 50
اللَّهُمَّ آتِني الحِكْمَةَ الَّتي مَنْ أُوتِيهَا فَقَدْ أُوتِيَ خَيْرًا كَثِيرًا
((ఓ అల్లాహ్ నాకు ఆ విజ్ఞతను ప్రసాదించు అది ఎవరికి ఇవ్వబడుతుందో అతను చాలా మేలును ప్రసాదించబడుతాడు))[60].
దుఆ – 51
اللَّهُمَّ ثَبِّتْنِي بِالْقَوْلِ الثَّابِتِ فِي الْحَيَاةِ الدُّنْيَا وَفِي الْآخِرَةِ
((ఓ అల్లాహ్ నీవు ఇహలోక జీవితంలో మరియు పరలోక జీవితంలో స్థిరమైన మాట ద్వారా నాకు నిలకడను ప్రసాదించు))[61].
దుఆ – 52
اللَّهُمَ حَبَّبْ إِلَيْنَا الْإِيمَانَ وَزَيِّنْهُ فِي قُلُوبِنَا، وَكَرِّهْ إِلَيْنَا الْكُفْرَ وَالْفُسُوقَ وَالْعِصْيَانَ، وَاجْعَلْنَا مِنَ الرَّاشِدِينَ
((ఓ అల్లాహ్ నీవు విశ్వాసమును మాకు ప్రియతమం చేయి. మరియు దానిని మా హృదయాలలో శోభాయమానంగా చేయి. మరియు అవిశ్వాసము, దుర్వార్తన పట్ల మరియు అవిధేయత పట్ల మాకు రోత కలిగించు. మరియు మమ్మల్ని సన్మార్గగాములలోంచి చేయి))[62].
దుఆ – 53
اللَّهُمَّ قِنِي شُحَّ نَفْسِي وَاجْعَلْنِي مِنَ الْمُفْلِحِينَ
((ఓ అల్లాహ్ నీవు నా ఆత్మ లోభత్వం నుండి నన్ను రక్షించు . మరియు నన్ను సాఫల్యం చెందేవారిలో నుంచి చేయి))[63].
దుఆ – 54
اللهمّ آتنا في الدنيا حسنة، وفي الآخرة حسنة وقنا عذاب النار
((ఓ మా ప్రభువా మాకు ఇహలోకములో మంచిని, పరలోకములో మంచిని ప్రసాదించు మరియు మమ్మల్ని నరక శిక్ష నుండి రక్షించు))[64].
సున్నత్ నుండి దుఆలు
దుఆ # 55
اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنْ فِتْنَةِ النَّارِ وَعَذَابِ النَّارِ، وَفِتْنَةِ الْقَبْرِ، وَعَذَابِ الْقَبْرِ، وَشَرِّ فِتْنَةِ الْغِنَى، وَشَرِّ فِتْنَةِ الْفَقْرِ، اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنْ شَرِّ فِتْنَةِ الْمَسِيحِ الدَّجَّالِ، اللَّهُمَّ اغْسِلْ قَلْبِي بِمَاءِ الثَّلْجِ وَالْبَرَدِ، وَنَقِّ قَلْبِي مِنْ الْخَطَايَا كَمَا نَقَّيْتَ الثَّوْبَ الْأَبْيَضَ مِنْ الدَّنَسِ، وَبَاعِدْ بَيْنِي وَبَيْنَ خَطَايَايَ كَمَا بَاعَدْتَ بَيْنَ الْمَشْرِقِ وَالْمَغْرِبِ. اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنْ الْكَسَلِ وَالْمَأْثَمِ وَالْمَغْرَمِ
((ఓ అల్లాహ్ నేను నరకాగ్ని యొక్క ఉపద్రవము నుండి, సమాధి ఉపద్రవము నుండి, సమాధి యాతన నుండి, ఐశ్వర్యము యొక్క ఉపద్రవపు కీడు నుండి మరియు పేదరికం యొక్క ఉపద్రవపు కీడు నుండి నీతో శరణు వేడుకుంటున్నాను. ఓ అల్లాహ్ నేను మసీహుద్దజ్జాల్ ఉపద్రవపు కీడు నుండి నీతో శరణు వేడుకుంటున్నాను. ఓ అల్లాహ్ నీవు నా హృదయమును మంచు, వడగళ్ళ నీటితో కడిగివేయి. మరియు నా హృదయమును పాపముల నుండి తెల్లటి బట్ట మురికి నుండి నీవు శుభ్రపరచినట్లు శుభ్రపరచు. మరియు నాకు, నా పాపములకు మధ్య నీవు తూర్పు పడమరల మధ్య దూరం చేసినట్లు దూరమును కలిగించు. ఓ అల్లాహ్ నేను బద్దకము నుండి, పాపముల నుండి అప్పుల బారి నుండి నీతో శరణమును వేడుకుంటున్నాను))[65].
దుఆ # 56
اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنَ الْعَجْزِ، وَالْكَسَلِ، وَالْجُبْنِ، وَالْهَرَمِ، والْبُخْلِ، وَأَعُوذُ بِكَ مِنْ عَذَابِ الْقَبْرِ، وَمِنْ فِتْنَةِ الْمَحْيَاوَالْمَمَاتِ
((అల్లాహుమ్మ ఇన్నీ అఊజు బిక మినల్ అజ్-జీ , వల్ కసలి , వల్ జుబ్ని, వల్ హరమి, వల్ బుఖ్లి, వ అఊజుబిక మిన్ అజాబిల్ ఖబ్రి, వ అఊజు బిక మిన్ ఫిత్నతిల్ మహ్యా వల్-మమాతి))
ఓ అల్లాహ్ నిశ్చయంగా నేను నిస్సహాయత, సోమరితనం, పిరికితనం, వృద్ధాప్యం మరియు పిసినారితనం నుండి నీతో శరణమును కోరుతున్నాను. మరియు సమాధి యాతన నుండి, జీవన్మరణాల పరీక్షల నుండి నీతో నేను శరణమును కోరుతున్నాను.[66]
దుఆ # 57
اللهمَّ إنِّي أعُوذُ بِكَ مِنْ جَهْدِ الْبَلَاءِ، وَدَرَكِ الشَّقَاءِ، وَسُوءِ الْقَضَاءِ، وَشَمَاتَةِ الْأَعْدَاءِ
((ఓ అల్లాహ్ నిస్సందేహంగా నేను కష్టములోని బాధ నుండి, దురదృష్టము సోకడము నుండి, చెడు తీర్పు నుండి మరియు శతృవుల ఆనందము నుండి శరణు కోరుకుంటున్నాను))[67].
దుఆ # 58
اللَّهُمَّ أَصْلِحْ لِي دِينِي الَّذِي هُوَ عِصْمَةُ أَمْرِي، وَأَصْلِحْ لِي دُنْيَايَ الَّتِي فِيهَا مَعَاشِي، وَأَصْلِحْ لِي آخِرَتِي الَّتِي فِيهَا مَعَادِي، وَاجْعَلِ الْحَيَاةَ زِيَادَةً لِي فِي كُلِّ خَيْرٍ، وَاجْعَلِ الْمَوْتَ رَاحَةً لِي مِنْ كُلِّ شَرّ
((అల్లాహుమ్మ అస్లిహ్ లీ దీనీ అల్లజీ హువ ఇస్మతు అమ్రీ, వ అస్లిహ్ లీ దున్యాయ అల్లతీ ఫీహా మఆషీ, వ అస్లిహ్ లీ ఆఖిరతీ అల్లతీ ఫీహా మఆదీ, వజ్అలిల్ హయాత జియాదాతన్ లీ ఫీ కుల్లి ఖైరిన్, వజ్ అలిల్ మౌత రాహతన్ లీ మిన్ కుల్లి షర్రిన్))
ఓ అల్లాహ్ నా ధర్మాన్ని సవరించు దాని ద్వారానే నా జీవిత సమస్యలకు రక్షణ, మరియు నా ఇహ లోకాన్ని సవరించు అందులోనే నేను నా జీవితపు రోజు గడపాలి, మరియు నా పరలోకాన్ని సవరించు అందులోనే ఇహలోక జీవితం తరువాత శాశ్వత నివాసం ఉంది. మరియు జీవితాన్ని నా కొరకు ప్రతి మేలుని ఎక్కువ చేసే కారణంగా చెయ్యి. మరియు మరణాన్ని నా కొరకు ప్రతి కీడు నుండి శాంతినిచ్చే కారణంగా చెయ్యి.[68]
దుఆ # 59
اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ الْهُدَى، وَالتُّقَى،وَالْعَفَافَ، وَالْغِنَى
((అల్లాహుమ్మ ఇన్ని అస్ అలుకల్ హుదా, వత్తుఖా, వల్ అఫాఫ, వల్ ఘినా))
ఓ అల్లాహ్ నిశ్చయంగా నిన్ను నేను మార్గదర్శనాన్ని, దైవభీతిని, రక్షణని మరియు, కలిమిని (సంతృప్తిని) అర్ధిస్తున్నాను.[69].
దుఆ # 60
اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنَ الْعَجْزِ، وَالْكَسَلِ، وَالْجُبْنِ، وَالْبُخْلِ، وَالْهَرَمِ، وَعَذَابِ الْقَبْرِ، اللَّهُمَّ آتِ نَفْسِي تَقْوَاهَا، وَزَكِّهَا أَنْتَ خَيْرُ مَنْ زَكَّاهَا، أَنْتَ وَلِيُّهَا وَمَوْلَاهَا، اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنْ عِلْمٍ لَا يَنْفَعُ، وَمِنْ قَلْبٍ لَا يَخْشَعُ، وَمِنْ نَفْسٍ لَا تَشْبَعُ، وَمِنْ دَعْوَةٍ لَا يُسْتَجَابُ لَهَا
((అల్లాహుమ్మ ఇన్నీ అఊజూబిక మినల్ అజ్-జి, వల్ కసలి వల్ జుబ్ని వల్ బుఖ్లి’ వల్ హరమి, వ అజాబిల్ ఖబరి, అల్లాహుమ్మ ఆతి నఫ్సీ తఖ్వాహా వ జక్కిహా అంత ఖైరు మన్ జక్కాహా’అంత వలియ్యుహా వమౌలాహా, అల్లాహుమ్మ ఇన్నీ అఊజుబిక మిన్ ఇల్మిన్ లా యన్ఫఉ’వ మిన్ ఖల్బిన్ లా యఖ్’షఉ, వ మిన్ నఫ్సిన్ లా తష్’బఉ , వ మిన్ దావతి లా యుస్తజాబు లహా))[70]
ఓ అల్లాహ్ నిశ్చియంగా నేను నిస్సహాయత, సోమరితనం, పిరికితనం, పిసినారితనం, వృద్ధాప్యం మరియు సమాధి యాతన నుండి నీతో శరణం వేడుకుంటున్నాను. ఓ అల్లాహ్ నీవు నా మనస్సుకు దాని భీతిని ప్రసాదించు. మరియు దాన్ని శుద్ధపరచు దానిని మంచిగా శుద్ధపరిచే వాడివి నీవే. నీవు దాని రక్షకుడవు మరియు సంరక్షకుడవు. ఓ అల్లాహ్ నిస్సందేహంగా నేను నిష్ప్రయోజనకరమైన విద్య నుండి, దైవభీతి లేని హృదయం నుండి, ఆత్రం తీరని మనస్సు నుండి మరియు అంగీకరించబడని ప్రార్ధన నుండి నీతో శరణు వేడుకుంటున్నాను.
దుఆ # 61
اللَّهُمَّ اهْدِنِي وَسَدِّدْنِي، اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ الْهُدَى وَالسَّدَادَ
((అల్లాహుమ్మహ్దినీ వసద్దిద్నీ, అల్లాహుమ్మ ఇన్ని అస్ అలుకల్ హుదా వస్సదాద))[71].
ఓ అల్లాహ్ నాకు సన్మార్గం చూపు మరియు నన్ను సవరించు. ఓ అల్లాహ్ నేను నీతో సన్మార్గమును, సవరణను అర్ధిస్తున్నాను.
దుఆ # 62
اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنْ زَوَالِ نِعْمَتِكَ، وَتَحَوُّلِ عَافِيَتِكَ، وَفُجَاءَةِ نِقْمَتِكَ، وَجَمِيعِ سَخَطِكَ
((అల్లాహుమ్మ ఇన్నీ అఊజు బిక మిన్ జవాలి నిమతిక వ తహవ్వులి ఆఫియతిక, వ ఫుజాఅతి నిఖ్మతిక, వ జమీయి సఖ తిక’))[72]
ఓ అల్లాహ్ నిస్సందేహంగా నేను నీ అనుగ్రహమును కోల్పోవటం నుండి, నీవు ప్రసాదించిన ఆరోగ్యము మరలిపోవటం నుండి, అకస్మాత్తుగా వచ్చే నీ శిక్ష నుండి మరియు నీ ఆగ్రహానికి లోను చేసే కార్యములన్నిటి నుండి నీ శరణు వేడుకుంటున్నాను.
దుఆ # 63
اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنْ شَرِّ مَا عَمِلْتُ، وَمِنْ شَرِّ مَا لَمْ أَعْمَلْ
ఓ అల్లాహ్ నిస్సందేహంగా నేను చేసిన చెడు నుండి మరియు నేను చేయని చెడు నుండి నేను నీతో శరణు వేడుకుంటున్నాను.[73]
దుఆ # 64
اللَّهُمَّ أكْثِرْ مَالِي، وَوَلَدِي، وَبَارِكْ لِي فِيمَا أعْطَيْتَنِي وَأطِلْ حَيَاتِي عَلَى طَاعَتِكَ، وَأحْسِنْ عَمَلِي، وَاغْفِرْ لِي
((ఓ అల్లాహ్ నీవు నా సంపదను మరియు నా సంతానమును అధికం చేయి మరియు నీవు నాకు ప్రసాదించిన దానిలో నా కొరకు శుభాలను ప్రసాదించు))[74].(( [మరియు నీ విధేయతపై నా జీవితమును పొడిగించు మరియు నా ఆచరణను మంచిగా చేయి] మరియు నన్ను మన్నించు))[75].
దుఆ # 64
لَا إِلَهَ إِلَّا اللَّهُ الْعَظِيمُ الْحَلِيمُ، لَا إِلَهَ إِلَّا اللَّهُ رَبُّ الْعَرْشِ الْعَظِيمِ، لَا إِلَهَ إِلَّا اللَّهُ رَبُّ السَّمَوَاتِ، وَرَبُّ الْأَرْضِ، وَرَبُّ الْعَرْشِ الْكَرِيمِ
(లా ఇలాహ ఇల్లల్లాహుల్ అజీముల్ హలీం , లా ఇలాహ ఇల్లల్లాహు రబ్బుల్ అర్షిల్ అజీమ్ , లా ఇలాహ ఇల్లల్లాహు రబ్బుస్సమావాతి వ రబ్బుల్ అర్జి వ రబ్బుల్ అర్షిల్ కరీమ్’)
((అల్లాహ్ తప్ప వాస్తవ ఆరాధ్యదైవం లేడు ఆయన మహోన్నతుడు, ఉదాత్త హృదయం కలవాడు, అల్లాహ్ తప్ప వాస్తవ ఆరాధ్యదైవం లేడు ఆయన మహోన్నతమైన పీఠానికి అధిపతి, అల్లాహ్ తప్ప వాస్తవ ఆరాధ్యదైవం లేడు ఆయన ఆకాశములకు ప్రభువు మరియు భూమికి ప్రభువు. మరియు మహోన్నతమైన పీఠమునకు అధిపతి))[76].
దుఆ # 66
اللَّهُمَّ رَحْمَتَكَ أَرْجُو فَلَا تَكِلْنِي إِلَى نَفْسِي طَرْفَةَ عَيْنٍ، وَأَصْلِحْ لِي شَأْنِي كُلَّهُ لَا إِلَهَ إِلَّا أَنْتَ
((ఓ అల్లాహ్ నేను నీ కారుణ్యమును ఆశిస్తున్నాను కావున నీవు నన్ను కను రెప్పపాటు కూడా నా మనస్సుకు అప్పగించకు. మరియు నా కొరకు నా ప్రతీ పనిని తీర్చి దిద్దు, నీవు తప్ప సత్య ఆరాధ్యదైవం ఎవడూ లేడు))[77].
దుఆ # 67
لاَ إِلَهَ إِلاَّ أَنْتَ سُبْحَانَكَ إِنِّي كُنْتُمِنَ الظَّالِمِينَ
((నీవు తప్ప వేరే ఆరాధ్యుడు లేడు, నీవు పవిత్రుడవు, నిశ్చయంగా నేనే దోషులలో చేరిన వాణ్ణి))[78].
దుఆ – 68
اللَّهُمَّ إِنِّي عَبْدُكَ ابْنُ عَبْدِكَ ابْنُ أَمَتِكَ، نَاصِيَتِي بِيَدِكَ، مَاضٍ فِيَّ حُكْمُكَ، عَدْلٌ فِيَّ قَضَاؤُكَ، أَسْأَلُكَ بِكُلِّ اسْمٍ هُوَ لَكَ سَمَّيْتَ بِهِ نَفْسَكَ، أَوْ أَنْزَلْتَهُ فِي كِتَابِكَ، أَوْ عَلَّمْتَهُ أَحَدًا مِنْ خَلْقِكَ، أَوِ اسْتَأْثَرْتَ بِهِ فِي عِلْمِ الْغَيْبِ عِنْدَكَ، أَنْ تَجْعَلَ الْقُرْآنَ رَبِيعَ قَلْبِي، وَنُورَ صَدْرِي، وَجَلَاءَ حُزْنِي، وَذَهَابَ هَمِّي
ఓ అల్లాహ్ నిశ్చయంగా నేను నీ దాసుడను, నీ దాసుడి కుమారుడను, నీ దాసి కుమారుడను, నీ చేతిలో నా నుదుట ఉన్నది. నీ ఆదేశం నాపై నడుస్తున్నది. నా విషయంలో నీ తీర్పు న్యాయపూరితమైనది. నేను నీ ఆ నామములన్ని వేటినైతే నీవు నీ స్వయం కొరకు పెట్టుకున్నావో లేదా వాటిని నీ గ్రంధంలో అవతరింపజేసావో లేదా నీ సృష్టిలోంచి ఎవరికైన నేర్పించావో లేదా నీ వద్ద అగోచర జ్ఞానంలో ఉంచుకోవటమును ఇష్టపడ్డావో వాటి ద్వారా నిన్ను అర్ధిస్తున్నాను నీవు ఖుర్ఆన్ ను నా హృదయము యొక్క వసంతముగా, నా హృదయము యొక్క కాంతిగా చేయి మరియు నా దుఃఖమును, బాధను తొలగించేదిగా చేయి[79].
దుఆ – 69
اللَّهُمَّ مُصَرِّفَ القُلُوبِ صَرِّفْ قُلُوبَنَا عَلَى طَاعَتِكَ
ఓ అల్లాహ్ హృదయములను మరల్చే వాడా మా హృదయములను నీ విధేయతపై మరల్చు[80].
దుఆ – 70
يَا مُقَلِّبَ القُلُوبِ ثَبِّت قَلْبِي عَلَى دِينِكَ
((యా ముఖల్లిబల్ ఖులూబ్ సబ్బిత్ ఖల్బీ అలా దీనిక్)) “ఓ హృదయాలను మలిచే ప్రభువా ! నా హృదయాన్ని నీ ధర్మం పై నిలకడగా ఉంచు”[81].
దుఆ – 71
اللَّهُمَّ إنِّي أسْألُكَ [الْيَقِينَ] و [الْعَفْوَو] الْعَافِيَةَ فِي الدُّنْيَا وَالآخِرَةِ
ఓ అల్లాహ్ నిశ్చయంగా నేను ఇహపరాలలో [నమ్మకమును] మరియు [క్షమాపణను] స్వస్థతను వేడుకుంటున్నాను.[82]
దుఆ – 72
اللهمّ أحْسِنْ عَاقِبَتَنَا فِي الأُمُورِ كُلِّهَا، وَأجِرْنَا مِنْ خِزْيِ الدُّنْيَا وَعَذَابِ الآخِرَةِ
ఓ అల్లాహ్ వ్యవహారములన్నింటిలో మా పర్యవసానమును మంచిగా చేయి మరియు ఇహలోక పరాభవము నుండి మరియు పరలోక శిక్ష నుండి మమ్మల్ని రక్షించు.[83]
దుఆ – 73
رَبِّ أَعِنِّي وَلَا تُعِنْ عَلَيَّ، وَانْصُرْنِي وَلَا تَنْصُرْ عَلَيَّ، وَامْكُرْ لِي وَلَا تَمْكُرْ عَلَيَّ، وَاهْدِنِي وَيَسِّرِ الهُدَى إِلَيَّ، وَانْصُرْنِي عَلَى مَنْ بَغَى عَلَيَّ، رَبِّ اجْعَلْنِي لَكَ شَكَّارًا، لَكَ ذَكَّارًا، لَكَ رَهَّابًا، لَكَ مِطْوَاعًا، إِلَيْكَ مُخْبِتًا أَوَّاهاً مُنِيبًا، رَبِّ تَقَبَّلْ تَوْبَتِي، وَاغْسِلْ حَوْبَتِي، وَأَجِبْ دَعْوَتِي، وَثَبِّتْ حُجَّتِي، وَاهْدِ قَلْبِي، وَسَدِّدْ لِسَانِي، وَاسْلُلْ سَخِيمَةَ قَلْبِي
((రబ్బీ అయిన్నీ వలా తుయిన్ అలయ్య, వన్ సుర్ నీ , వలా తన్సుర్ అలయ్య, వమ్ కుర్ లీ వలా తమ్కుర్ అలయ్య , వహ్దినీ వ యస్సిర్ హుదా ఇలయ్య, వన్ సుర్ నీ అలా మన్ బగా అలయ్య, అల్లాహుమ్మజ్అల్నీ షాకిరన్ లక దాకిరన్, లక రాహిబన్, లక మిత్వాఅన్, ఇలైక ముఖ్బితన్ అవ్వాహన్ మునీబన్ , రబ్బి తఖబ్బల్ తౌబతీ, వగ్సిల్ హౌబతీ వ అజిబ్ దావతీ, వ సబ్బిత్ హుజ్జతీ , వహ్ది ఖల్బీ వ సద్దిద్ లీసానీ, వస్లుల్ సఖీమత ఖల్బీ))
ఓ అల్లాహ్ నాకు సహాయం చేయి, నా వ్యతిరేకులకు సహాయపడకు, నాకు మద్దతు ఇవ్వు నా వ్యతిరేకులకు మద్దతు ఇవ్వకు, నా కొరకు ప్రణాళిక చేయి నా వ్యతిరేకుల ప్రణాళికలు నష్టపరుచు, నాకు సన్మార్గం ప్రసాదించు మరియు సన్మార్గ సాధన నా కొరకు సులభ పరుచు, నన్ను పీడించే వాడికి వ్యతిరేఖంగా నాకు సహాయపడు, ఓ అల్లాహ్ నన్ను కృతజ్ఞుడిగా మరియు జపించేవాడిగా, భయపడేవాడిగా, నీ విధేయునిగా, నీకొరకు దుఖించేవాడిగా, నీ వైపు మరలే దాసుడిగా మార్చు, ఓ నా ప్రభూ ! నా తౌబా ఆమోదించు, నా తప్పులు కడిగేయి, నా దూఆలు ఆమోదించు, నా హృదయాన్ని ఋజుమార్గం పై ధృడపరుచు, నా నాలుకను సంస్కరించి ధృడపరుచు, నా ఆధారాలను రుజువులకు బలం చేకూర్చు, నా హృదయాన్ని అసూయ, ద్వేషాల నుండి స్వచ్ఛపరుచు.[84]
దుఆ – 74
اللَّهُمَّ إِنَّا نَسْأَلُكَ مِنْ خَيْرِ مَا سَأَلَكَ مِنْهُ نَبِيُّكَ مُحَمَّدٌ – صلى الله عليه وسلم -، وَنَعُوذُ بِكَ مِنْ شَرِّ مَا اسْتَعَاذَ مِنْهُ نَبِيُّكَ مُحَمَّدٌ – صلى الله عليه وسلم -، وَأَنْتَ الْمُسْتَعَانُ، وَعَلَيْكَ الْبَلَاغُ، وَلَا حَوْلَ وَلَا قُوَّةَ إِلَّا بِاللَّهِ
ఓ అల్లాహ్ నిశ్చయంగా మేము నీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నిన్ను అర్ధించిన మేలుని నీతో అర్ధిస్తున్నాము మరియు నీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నీతో శరణం వేడుకున్న కీడు నుండి మేము నీతో శరణు వేడుకుంటున్నాను. నీవే సహాయకుడివి. మరియు చేరవేసే బాధ్యత నీపైనే ఉంది. మరియు పాపముల నుండి దూరం ఉండే శక్తి మరియు పుణ్యములను చేసే శక్తి అల్లాహ్ వద్ద నుండే.[85].
దుఆ – 75
اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنْ شَرِّ سَمْعِي، وَمِنْ شَرِّ بَصَرِي، وَمِنْ شَرِّ لِسَانِي، وَمِنْ شَرِّ قَلْبِي، وَمِنْ شَرِّ مَنِيِّي
ఓ అల్లాహ్ నిశ్చయంగా నేను నా చెవుల కీడు నుండి, నా కళ్ళ కీడు నుండి, నా నాలుక కీడు నుండి, నా హృదయము యొక్క కీడు నుండి మరియు నా మర్మాంగము యొక్క కీడు నుండి నీ శరణు వేడుకుంటున్నాను[86].
దుఆ – 76
اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنَ الْبَرَصِ، وَالْجُنُونِ، وَالْجُذَامِ، وَمِنْ سَيِّئِ الأَسْقَامِ
ఓ అల్లాహ్ నిశ్చయంగా నేను తెల్లమచ్చల వ్యాధి నుండి, ఉన్మాదం నుండి, కుష్ఠు వ్యాధి నుండి ఇంకా ఇతర దుర్భర రోగాల బారి నుండి నీ శరణు వేడుతున్నాను.[87]
దుఆ – 77
اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنْ مُنْكَرَاتِ الْأَخْلَاقِ، وَالْأَعْمَالِ، وَالْأَهْوَاءِ
ఓ అల్లాహ్ నిశ్చయంగా నేను చెడు గుణాల నుండి, చెడు చేష్టల నుండి, చెడు కోరికల నుండి నీతో శరణు వేడుకుంటున్నాను[88].
దుఆ – 78
اللَّهُمَّ إِنَّكَ عُفُوٌّ كَرِيمٌ تُحِبُّ الْعَفْوَ فَاعْفُ عَنِّي
ఓ అల్లాహ్ నిశ్చయంగా నీవు మన్నించేవాడివి ఉదారమైనవాడివి, మన్నింపును నీవు ఇష్టపడుతావు కావున నీవు నన్ను మన్నించు.[89].
దుఆ – 79
اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ فِعْلَ الْخَيْرَاتِ، وَتَرْكَ الْمُنْكَرَاتِ، وَحُبَّ الْمَسَاكِينِ، وَأَنْ تَغْفِرَ لِي، وَتَرْحَمَنِي، وَإِذَا أَرَدْتَ فِتْنَةَ قَوْمٍ فَتَوَفَّنِي غَيْرَ مَفْتُونٍ، وَأَسْأَلُكَ حُبَّكَ، وَحُبَّ مَنْ يُحِبُّكَ، وَحُبَّ عَمَلٍ يُقَرِّبُنِي إِلَى حُبِّكَ
((అల్లాహుమ్మ ఇన్నీ అస్ అలుక ఫీలల్ ఖైరాత్’వ తర్కల్ మున్కరాత్’వ హుబ్బల్ మసాకీన్, వ అన్ తగ్ఫిర్ లీ వ తర్హంనీ, వ ఇజా అరద్‘త ఫిత్నత కౌమిన్ ఫ తవఫ్ఫనీ గైర మఫ్తూన్’వ అస్ అలుక హుబ్బక వ హుబ్బ మన్ యుహిబ్బుక, వ హుబ్బ అమలిన్ యుఖర్రిబు ఇలా హుబ్బిక))
ఓ అల్లాహ్ నిశ్చయంగా నేను మంచి పనులను చేయటమును, దుష్చర్యలను వదిలివేయటమును, నిరుపేదలను ప్రేమించటమును, నీవు నన్ను మన్నించి నాపై దయచూపటమును నీతో అర్ధిస్తున్నాను. మరియు నీవు ఏ జాతినైన పరీక్షించదలచినప్పుడు నన్ను పరీక్షకు గురి చేయకుండానే నాకు మరణమును ప్రసాదించు. మరియు నేను నిన్ను ఇష్టపడటమును, నిన్ను ఇష్టపడేవారిని ఇష్టపడటమును మరియు నీ ఇష్టతకు నన్ను దగ్గర చేసే ఆచరణను ఇష్టపడటమును నీతో అర్ధిస్తున్నాను[90].
దుఆ – 80
اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ مِنَ الْخَيْرِ كُلِّهِ: عَاجِلِهِ وَآجِلِهِ، مَا عَلِمْتُ مِنْهُ وَمَا لَمْ أَعْلَمْ، وَأَعُوذُ بِكَ مِنَ الشَّرِّ كُلِّهِ عَاجِلِهِ وَآجِلِهِ، مَا عَلِمْتُ مِنْهُ وَمَا لَمْ أَعْلَمْ. اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ مِنْ خَيْرِ مَا سَأَلَكَ عَبْدُكَ وَنَبِيُّكَ، وَأَعُوذُ بِكَ مِنْ شَرِّ [مَا اسْتَعَاذَ بِكَ] [مِنْهُ] عَبْدُكَ وَنَبِيُّكَ. اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ الْجَنَّةَ، وَمَا قَرَّبَ إِلَيْهَا مِنْ قَوْلٍ أَوْ عَمَلٍ، وَأَعُوذُ بِكَ مِنَ النَّارِ وَمَا قَرَّبَ إِلَيْهَا مِنْ قَوْلٍ أَوْ عَمَلٍ، وَأَسْأَلُكَ أَنْ تَجْعَلَ كُلَّ قَضَاءٍ قَضَيْتَهُ لِي خَيْرًا
ఓ అల్లాహ్ నిశ్చయంగా నేను ఇహపరాల మేలుని అది నాకు తెలిసినది అయిన, నాకు తెలియనిది అయినా నీతో అర్ధిస్తున్నాను. మరియు ఇహపరాల కీడు నుండి అది నాకు తెలిసినదైనా, నాకు తెలియనిదైనా నేను నీతో శరణు వేడుకుంటున్నాను. ఓ అల్లాహ్ నిశ్చయంగా నేను నీ దాసుడు, నీ ప్రవక్త నీతో అర్ధించిన మేలుని నిన్ను అర్ధిస్తున్నాను. మరియు నీ దాసుడు, నీ ప్రవక్త నీతో శరణు వేడుకున్న కీడు నుండి నేను నీతో శరణు వేడుకుంటున్నాను. ఓ అల్లాహ్ నిశ్చయంగా నేను నీతో స్వర్గమును మరియు దానికి దగ్గర చేసే మాటను లేదా చేష్టను అర్ధిస్తున్నాను. మరియు నేను నీతో నరకము నుండి మరియు దానికి దగ్గర చేసే మాట లేదా చేష్ట నుండి శరణు వేడుకుంటున్నాను. మరియు నీవు నా కోసం చేసిన ప్రతీ తీర్పుని నా కొరకు మేలుగా చేయమని నిన్ను అర్ధిస్తున్నాను.[91]
దుఆ – 81
اللَّهُمَّ احْفَظنِي بالإِسْلاَمِ قائِماً، واحْفَظْنِي بالإِسْلاَمِ قاعِداً، واحْفَظنِي بالإِسْلاَمِ راقِداً، ولا تُشْمِتْ بِي عَدُوّاً ولا حاسِداً. اللَّهُمَّ إِنِّي أسْألُكَ مِنْ كُلِّ خَيْر خزائِنُهُ بِيَدِكَ، وأعُوذُ بِكَ مِنْ كُلِّ شَرٍّ خَزَائِنُهُ بِيَدِكَ
ఓ అల్లాహ్ ఇస్లాంతో నన్ను రక్షించు నిలబడి ఉండగా, మరియు ఇస్లాంతో నన్ను రక్షించు కూర్చుని ఉండగా, మరియు ఇస్లాంతో నన్ను రక్షించు పడుకుని ఉండగా, ఏ శతృవుకి గాని అసూయపరుడికిగానీ నాపై నవ్వే అవకాశం ఇవ్వకు, ఓ అల్లాహ్ నిశ్చయంగా నేను ప్రతీ మేలును నీతో అర్ధిస్తున్నాను దాని కోశములు నీ చేతిలోనే ఉన్నాయి మరియు నేను ప్రతీ కీడు నుండి నీతో శరణు వేడుకుంటున్నాను దాని కోశములు నీ చేతిలోనే ఉన్నాయి.[92]
దుఆ – 82
اللَّهُمَّ اقْسِمْ لَنَا مِنْ خَشْيَتِكَ مَا تَحُولُ بِهِ بَيْنَنَا وَبَيْنَ مَعَاصِيكَ، وَمِنْ طَاعَتِكَ مَا تُبَلِّغُنَا بِهِ جَنَّتَكَ، وَمِنَ الْيَقِينِ مَا تُهَوِّنُ بِهِ عَلَيْنَا مَصَائِبَ الدُّنْيَا، اللَّهُمَّ مَتِّعْنَا بِأَسْمَاعِنَا، وَأَبْصَارِنَا، وَقُوَّاتِنَا مَا أَحْيَيْتَنَا، وَاجْعَلْهُ الْوَارِثَ مِنَّا، وَاجْعَلْ ثَأْرَنَا عَلَى مَنْ ظَلَمَنَا، وَانْصُرْنَا عَلَى مَنْ عَادَانَا، وَلَا تَجْعَلْ مُصِيبَتَنَا فِي دِينِنَا، وَلَا تَجْعَلِ الدُّنْيَا أَكْبَرَ هَمِّنَا، وَلَا مَبْلَغَ عِلْمِنَا، وَلَا تُسَلِّطْ عَلَيْنَا مَنْ لَا يَرْحَمُنَا
ఓ అల్లాహ్ మాకు, నీ అవిధేయతకు మధ్య నీవు దేనితోనైతే అడ్డుగా నిలబడుతావో ఆ నీ భయమును, దేనితో నైతే నీవు మమ్మల్ని స్వర్గమునకు చేరవేస్తావో ఆ నీ విధేయతను, దేనితోనైతే నీవు ఇహలోక ఆపదలను మాపై శులభతరం చేస్తావో ఆ నమ్మకమును మాకు ప్రసాదించు. ఓ అల్లాహ్ నీవు మమ్మల్ని ఎప్పటి వరకు జీవింపజేసి ఉంచుతావో అప్పటి వరకు మా చెవుల ద్వారా, మా కళ్ళ ద్వారా, మా శక్తుల ద్వారా మాకు ప్రయోజనం కలిగించు. మరియు దానిని మా తరుపు నుండి వారసునిగా చేయి. మరియు మమ్మల్ని హింసించిన వారితో మా తరుపు నుండి ప్రతీకారము తీసుకో. మరియు మాతో శతృత్వం చేసిన వారికి వ్యతిరేకంగా మాకు సహాయం చేయి. మరియు మా ధర్మం విషయంలో మమ్మల్ని పరీక్షించకు. మరియు ప్రపంచమును మా పెద్ద లక్ష్యముగా, మా జ్ఞానమునకు ముగింపుగా చేయకు. మరియు మా పై దయ చూపనివారికి మాపై ఆధిక్యతను ప్రసాదించకు.[93]
దుఆ – 83
اللَّهُمَّ إنِّي أَعوذُ بِكَ مِنَ الجُبْنِ، وَأعُوذُ بِكَ مِنَ البُخْلِ، وَأعُوذُ بِكَ مِنْ أنْ أُرَدَّ إِلَى أَرْذَلِ العُمُرِ، وَأعُوذُ بِكَ مِنْ فِتْنَةِ الدُّنْيَا وَعَذَابِ القَبْرِ
ఓ అల్లాహ్ నిశ్చయంగా నేను పిరికితనం నుండి నీతో శరణం వేడుకుంటున్నాను మరియు పిసినారితనం నుండి నీతో శరణం వేడుకుంటున్నాను. మరియు నేను నిష్ప్రయోజనమైన వయస్సుకు మరలించబడటం నుండి నీతో శరణు వేడుకుంటున్నాను. మరియు ఇహలోక పరీక్ష నుండి, సమాధి శిక్ష నుండి నీతో శరణు వేడుకుంటున్నాను.[94]
దుఆ – 84
اللَّهُمَّ اغْفِرْ لِي خَطِيئَتِي، وَجَهْلِي، وَإِسْرَافِي فِي أَمْرِي، وَمَا أَنْتَ أَعْلَمُ بِهِ مِنِّي، اللَّهُمَّ اغْفِرْ لِي هَزْلِي، وَجِدِّي، وَ خَطَئي، وَعَمْدِي، وَكُلُّ ذَلِكَ عِنْدِي
ఓ అల్లాహ్ నా కొరకు నా పాపమును, నా అజ్ఞానమును, నా వ్యవహారములో నేను చేసిన అతిని, నా కన్న నీకు బాగా తెలిసిన వాటిని మన్నించు. ఓ అల్లాహ్ నేను హాస్యముగా చేసిన పాపమును, ఖచ్చితంగా చేసిన పాపమును, నా తప్పిదమును, కావాలని చేసిన దాన్ని నా కొరకు మన్నించు. ఇవన్ని నా వద్ద ఉన్నవి.[95]
దుఆ – 85
اللَّهُمَّ إِنِّي ظَلَمْتُ نَفْسِي ظُلْمًا كَثِيرًا، وَلَا يَغْفِرُ الذُّنُوبَ إِلَّا أَنْتَ. فَاغْفِرْ لِي مَغْفِرَةً مِنْ عِنْدِكَ، وَارْحَمْنِي إِنَّكَ أَنْتَ الْغَفُورُ الرَّحِيمُ
((అల్లాహుమ్మ ఇన్నీ జలమ్తు నఫ్సీ జుల్మన్ కసీరన్, వలా యగ్ఫిరుజ్జునూబ ఇల్లా అన్త, ఫగ్ఫిర్లీ మగ్ఫిరతన్ మిన్ ఇందిక వర్హమ్నీ ఇన్నక అన్తల్ గఫూరుర్రహీమ్))
ఓ అల్లాహ్ నిశ్చయంగా నేను నా మనస్సుపై బాగా హింసకు పాల్పడ్డాను, నీవు తప్ప పాపములను మన్నించే వాడు ఎవడూ లేదు, కావున నీవు నీ యందు నుండి నన్ను మన్నించు మరియు నాపై కరుణించు. నిశ్చయంగా నీవే మన్నించేవాడవు కరుణించేవాడవు.[96]
దుఆ – 86
اللَّهُمَّ لَكَ أَسْلَمْتُ، وَبِكَ آمَنْتُ، وَعَلَيْكَ تَوَكَّلْتُ، وَإِلَيْكَ أَنَبْتُ، وَبِكَ خَاصَمْتُ. اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِعِزَّتِكَ لَا إِلَهَ إِلَّا أَنْتَ أَنْ تُضِلَّنِي، أَنْتَ الْحَيُّ الَّذِي لَا يَمُوتُ، وَالْجِنُّ وَالْإِنْسُ يَمُوتُونَ
“అల్లాహుమ్మ లక అస్లంతు, వబిక ఆమంతు, వ అలైక తవక్కల్తు, వ ఇలైక అనబ్తు, వ బిక ఖాసమ్తు, అల్లాహుమ్మ ఇన్నీ అఊజు బి ఇజ్జతిక లా ఇలాహ ఇల్లా అంత ఆన్తుజిల్లనీ, అంతల్ హయ్యుల్లజీ లా యమూతు వల్ జిన్ను వల్ ఇన్సు యమూతూన”
((ఓ అల్లాహ్ నేను నీపై విధేయత చూపాను, నీపై విశ్వాసమును కనబరిచాను, నీపై నమ్మకమును కలిగి ఉన్నాను, నీవైపు మరలాను, నీవు ప్రసాదించిన ఆధారాలతో వాదిస్తాను. ఓ అల్లాహ్ నిశ్చయంగా నీవు నన్ను అపమార్గమునకు లోను చేయటం నుండి నేను నీతో శరణు వేడుకుంటున్నాను. నీవు తప్ప సత్య ఆరాధ్యదైవం ఎవరూ లేరు. నీవు జీవించి ఉండేవాడివి. నీవు మరణించవు. జిన్నులు, మానవులు మరణిస్తారు))[97].
దుఆ – 87
اللَّهُمَّ إنَّا نَسْألُكَ مُوجِباتِ رَحْمَتِكَ، وَعَزائِمَ مَغْفِرَتِكَ، والسَّلامَةَ مِنْ كُلِّ إثمٍ، والغَنِيمَةَ مِنْ كُلِّ بِرٍّ، والفَوْزَ بالجَنَّةِ، والنَّجاةَ مِنَ النَّارِ
“అల్లాహుమ్మ ఇన్నీ అసలుక మూజిబాతి రహ్మతిక వ అజాయిమ మగ్ఫిరతిక, వస్సలామత మిన్ కుళ్లి ఇస్మ్ వల్ గనీమత మిన్ కుళ్లి బిర్ర్, వల్ ఫౌజు బిల్ జన్నహ్ , వన్నజాత మినన్నార్”
(( ఓ అల్లాహ్ నిశ్చయంగా నేను నీ కారుణ్యమును అనివార్యం చేసే వాటిని, నీ మన్నింపును తప్పనిసరి చేసే కారకాలను, ప్రతీ పాపము నుండి భద్రంగా ఉండటమును, ప్రతీ పుణ్యము నుండి లబ్ది చెందటమును, స్వర్గముతో సాఫల్యం చెందటమును మరియు నరకము నుండి విముక్తి పొందటమును నీతో అర్ధిస్తున్నాను))[98].
దుఆ – 88
اللَّهُمَّ اغْفِرْ لِلْمُؤْمِنِينَ وَالْمُؤْمِنَاتِ
ఓ అల్లాహ్ విశ్వాసపర పురుషులను మరియు విశ్వాసపర స్త్రీలను మన్నించు[99].
దుఆ – 89
اللَّهُمَّ اغْفِرْ لِي ذَنْبِي، وَوَسِّعْ لِي فِي دَارِي، وَبَارِكْ لِي فِيمَا رَزَقْتَنِي
ఓ అల్లాహ్ నా పాపమును మన్నించు, మరియు నా కొరకు నా ఇంటిని విశాలపరచు మరియు నీవు నాకు ప్రసాదించిన వాటిలో శుభాలను కలిగించు.[100]
దుఆ – 90
اللَّهُمَّ إنِّي أَسْأَلُك مِنْ فَضْلِكَ وَرَحْمَتِكَ؛ فَإِنَّهُ لاَ يَمْلِكُهَا إِلاَّ أَنْتَ
ఓ అల్లాహ్ నిశ్చయంగా నేను నీ అనుగ్రహమును మరియు నీ కారుణ్యమును నీతో అర్ధిస్తున్నాను. ఎందుకంటే నీకు తప్ప ఎవరికీ వాటి అధికారము లేదు.[101]
దుఆ – 91
اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنَ الهَرَمِ، وَالتَّرَدِّي، وَالْهَدْمِ، وَالْغَمِّ، وَالْغَرَقِ، وَالْحَرَقِ، وَأَعُوذُ بِكَ أَنْ يَتَخَبَّطَنِيَ الشَّيْطَانُ عِنْدَ الْمَوْتِ، وَأَعُوذُ بِكَ أَنْ أَمُوتَ فِي سَبِيلِكَ مُدْبِرًا، وَأَعُوذُ بِكَ أَنْ أَمُوتَ لَدِيغًا
ఓ అల్లాహ్ నిశ్చయంగా నేను నీతో శరణు వేడుకుంటున్నాను వృద్ధాప్యము నుండి, ఎత్తైన ప్రదేశము నుండి క్రింద పడి మరణించటం నుండి, ఏదైన ఇల్లు లేదా గోడ నాపై కూలి మరణించటం నుండి, దుఃఖము నుండి, నీళ్ళలో మునిగి చావటం నుండి, మంటలో కాలి చావటం నుండి. మరణం సమయంలో షైతాను నన్ను ఎగనెత్తి కొనిపోవుట నుండి నేను నీతో శరణు వేడుకుంటున్నాను. మరియు నేను నీ మార్గంలో పోరాటం చేస్తూ వీపు తిప్పి పారిపోతూ మరణించటం నుండి నీ శరణు వేడుకుంటున్నాను. మరియు నేను విష జంతువు కాటుకి గురి అయ్యి మరణించటం నుండి నీ శరణు వేడుకుంటున్నాను.[102]
దుఆ – 92
اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنَ الْجُوعِ؛ فَإِنَّهُ بِئْسَ الضَّجِيعُ، وَأَعُوذُ بِكَ مِنَ الْخِيَانَةِ؛ فَإِنَّهَا بِئْسَتِ الْبِطَانَةُ
ఓ అల్లాహ్ నిశ్చయంగా నేను నీతో ఆకలి నుండి శరణు వేడుకుంటున్నాను. ఎందుకంటే అది అతి చెడ్డ స్నేహితుడు. మరియు నేను అవినీతి నుండి నీతో శరణు వేడుకుంటున్నాను ఎందుకంటే అది అతి చెడ్డ అంతరంగికుడు.[103]
దుఆ – 93
اللَّهُمَّ إنِّي أعُوذُ بِكَ مِنَ العَجْزِ، والكَسَلِ، والجُبْنِ، والبُخْلِ، والهَرَمِ، والقَسْوَةِ، والغَفْلَةِ، والعَيْلَةِ، والذِّلَّةِ، والمَسْكَنَةِ، وأعُوذُ بِكَ مِنَ الفَقْرِ، والكُفْرِ، والفُسُوقِ، والشِّقاقِ، والنِّفاقِ، والسُّمْعَةِ، والرِّياءِ، وأعُوذُ بِكَ مِنَ الصَّمَمِ، والبَكَمِ، والجُنُونِ، والجُذامِ، والبَرَصِ، وَسَيِّىءِ الأَسْقامِ
ఓ అల్లాహ్ నిశ్చయంగా నేను నీతో శరణు వేడుకుంటున్నాను నిస్సహాయత నుండి, సోమరితనం నుండి, పిరికితనం నుండి, పిసినారితనం నుండి, వృధాప్యం నుండి, కృూరత్వం నుండి, నిర్లక్ష్యం నుండి, దీనత్వం నుండి, అవమానం నుండి, దారిద్య్రం నుండి. మరియు నేను నీతో శరణు వేడుకుంటున్నాను పేదరికం నుండి, అవిశ్వాసం నుండి పాపం చేయటం నుండి, విభేదాల నుండి, కపటత్వం నుండి, పేరుప్రఖ్యాతలను ఆశించటం నుండి, ప్రదర్శనాబుద్ధి నుండి. మరియు నేను నీతో శరణు వేడుకుంటున్నాను చెవుడు నుండి, మూగతనం నుండి, ఉన్మాదం నుండి, కుష్ఠు వ్యాధి నుండి, బొల్లి వ్యాధి నుండి మరియు చెడ్డ రోగాల నుండి.[104]
దుఆ – 94
اللهُمَّ إنِّي أَعُوذُ بِكَ مِنَ الْفَقْرِ، [وَالْفَاقَةِ]، وَالْقِلَّةِ، وَالذِّلَّةِ، وَأَعُوذُ بِكَ مِنْ أَنْ أَظْلِمَ أو أُظْلَمَ
ఓ అల్లాహ్ నిశ్చయంగా నేను నీతో పేదరికం నుండి, సంపద తగ్గిపోవటం నుండి, అవమానం నుండి శరణు వేడుకుంటున్నాను. మరియు నేను ఎవరినైనా హింసించటం లేదా నన్ను ఎవరైనా హింసించటం నుండి నీతో శరణు వేడుకుంటున్నాను.[105]
దుఆ – 95
اللَّهُمَّ إنِّي أَعُوذُ بِكَ مِنْ جَارِ السُّوءِ فِي دَارِ الْمُقَامَةِ؛ فَإِنَّ جَارَ الْبَادِيَةِ يَتَحَوَّلُ
ఓ అల్లాహ్ నిశ్చయంగా నేను నివాస ప్రదేశము లోని చెడ్డ పొరుగువాడి నుండి నీతో శరణు వేడుకుంటున్నాను. నిశ్చయంగా బయలు ప్రాంతంలోని పొరుగు వారు మారుతూ ఉంటారు.[106]
దుఆ – 96
اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنْ قَلْبٍ لاَ يَخْشَعُ، ومِنْ َدُعَاءٍ لاَ يُسْمَعُ، وَمِنْ نَفْسٍ لاَ تَشْبَعُ، وَمِنْ عِلْمٍ لاَ يَنْفَعُ، أَعُوذُ بِكَ مِنْ هُؤُلاَءِ الأَرْبَعِ
ఓ అల్లాహ్ నిస్సందేహంగా దైవభీతి లేని హృదయం నుండి, అంగీకరించబడని ప్రార్ధన నుండి , ఆత్రం తీరని మనస్సు నుండి మరియు నిష్ప్రయోజనకరమైన విద్య నుండి నీతో శరణు వేడుకుంటున్నాను. నేను ఈ నాలుగింటి నుండి నీతో శరణు వేడుకుంటున్నాను.[107]
దుఆ – 97
اللَّهُمَّ إنّي أعُوذُ بِكَ مِنْ يَوْمِ السُّوءِ، وَمِنْ لَيْلَةِ السُّوءِ، وَمِنْ سَاعَةِ السُّوءِ، وَمِنْ صَاحِبِ السُّوءِ، وَمِنْ جَارِ السُّوءِ في دَارِ الْمُقامَةِ
ఓ అల్లాహ్ నిశ్చయంగా నేను చెడు దినము నుండి, చెడు రాత్రి నుండి, చెడు ఘడియ నుండి, చెడు స్నేహితుడి నుండి మరియు నివాశ ప్రదేశంలోని చెడు పొరుగువాడి నుండి నీతో శరణు వేడుకుంటున్నాను.[108]
దుఆ – 98
اللَّهُمَّ إنِّي أَسْأَلُكَ الْجَنَّةَ وَأَسْتَجِيْرُ بِكَ مِنَ النَّارِ)) (ثَلاَثَ مَرَّاتٍ
ఓ అల్లాహ్ నిశ్చయంగా నేను నీతో స్వర్గమును వేడుకుంటున్నాను మరియు నీతో నరకము నుండి రక్షణను కోరుకుంటున్నాను (మూడు సార్లు).[109]
దుఆ – 99
فَقِّهْنِي فِي الدِّينِ
ఓ అల్లాహ్ ధర్మం విషయంలో నాకు అవగాహనను కలిగించు.[110]
దుఆ – 100
اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ أَنْ أُشْرِكَ بِكَ وَأَنَا أَعْلَمُ، وَأَسْتَغْفِرُكَ لِمَا لاَ أَعْلَمُ
ఓ అల్లాహ్ నిశ్చయంగా నేను తెలిసీ కూడా నీతో సాటి కల్పించటం నుండి నీ శరణ వేడుకుంటున్నాను. మరియు తెలియక నేను చేసిన పాపము నుండి నీతో మన్నింపు వేడుకుంటున్నాను.[111]
దుఆ – 101
اللَّهُمَّ انْفَعْنِي بِمَا عَلَّمْتَنِي، وَعَلِّمْنِي مَا يَنْفَعُنِي، وَزِدْنِي عِلْمًا
ఓ అల్లాహ్ నీవు నాకు ప్రసాదించిన జ్ఞానం ద్వారా నాకు ప్రయోజనం కలిగించు. మరియు నాకు ప్రయోజనం కలిగించే జ్ఞానమును ప్రసాదించు. మరియు నా జ్ఞానమును పెంపొందించు.[112]
దుఆ – 102
اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ عِلْمًا نَافِعًا، وَرِزْقًا طَيِّبًا، وَعَمَلًا مُتَقَبَّلًا
ఓ అల్లాహ్ నిశ్చయంగా నేను నీతో ప్రయోజనకరమైన జ్ఞానమును, హలాల్ ఆహారోపానిధిని, స్వీకరించబడే ఆచరణను వేడుకుంటున్నాను.[113]
దుఆ – 103
اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ يَا أَللَّهُ بِأَنَّكَ الْوَاحِدُ الْأَحَدُ، الصَّمَدُ، الَّذِي لَمْ يَلِدْ وَلَمْ يُولَدْ، وَلَمْ يَكُنْ لَهُ كُفُوًا أَحَدٌ، أَنْ تَغْفِرَ لِي ذُنُوبِي، إِنَّكَ أَنْتَ الْغَفُورُ الرَّحِيمُ
ఓ అల్లాహ్ నిశ్చయంగా నేను నీ ఆ గుణాలతో నిన్ను వేడుకుంటున్నాను ఓ అల్లాహ్ నీవు సంతానము లేని, సంతానముకాని, ఎవరూ సమానులు లేని ఒక్కడివి, ఏకైకుడివి, నిరపేక్షాపరుడివి నీవు నా పాపములు మన్నించాలని. నిశ్చయంగా నీవు అమితంగా మన్నించేవాడివి, అనంత కరుణామయుడివి.[114]
దుఆ – 104
اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ بِأَنَّ لَكَ الْحَمْدَ، لاَ إِلَهَ إِلاَّ أَنْتَ [وَحْدَكَ لاَ شَرِيكَ لَكَ] الْمَنَّانُ [يَا] بَدِيعَ السَّمَوَاتِ وَالأَرْضِ، يَا ذَا الْجَلالِ وَالإِكْرَامِ، يَا حَيُّ يَا قَيُّومُ، إِنِّي أَسْأَلُكَ [الْجَنَّةَ وَأَعُوذُ بِكَ مِنَ النَّارِ
ఓ అల్లాహ్ నిశ్చయంగా నేను నీ యొక్క గుణముల ద్వారా నిన్ను వేడుకుంటున్నాను. నిశ్చయంగా స్తుతులన్నీ నీ కొరకే, నీవు తప్ప సత్య ఆరాధ్యదైవం లేడు [నీవు ఏకైకుడివి, నీకు ఎవరూ సాటి లేరు], బాగా ఉపకారం చేసే వాడివి, [ఓ] భూమ్యాకాశములను సృష్టించినవాడా, ఓ ఘనత, గౌరవం కలవాడా, ఓ సజీవుడా, ఓ అన్నింటికి మూలాధారుడా నిశ్చయంగా నేను నీతో స్వర్గమును అర్ధిస్తున్నాను మరియు నీతో నరకము నుండి శరణు వేడుకుంటున్నాను.[115]
దుఆ – 105
اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ بِأَنِّي أَشْهَدُ أَنَّكَ أَنْتَ اللهُ لاَ إِلَهَ إِلاَّ أَنْتَ، الأَحَدُ، الصَّمَدُ، الَّذِي لَمْ يَلِدْ، وَلَمْ يُولَدْ، وَلَمْ يَكُنْ لَهُ كُفُوًا أَحَدٌ
ఓ అల్లాహ్ నిశ్చయంగా నేను నీతో వేడుకుంటున్నాను నిశ్చయంగా నీవే అల్లాహ్ నీవు తప్ప ఆరాధ్య దైవం లేడని, ఒక్కడివే అని, నిరపేక్షాపరుడివని, ఎవరిని కనలేదని మరియు ఆయన ఎవరికీ పుట్టలేదని, ఎవరూ ఆయనకు సరిసమానుడు లేడని నేను సాక్ష్యం పలకటం ద్వారా.[116]
దుఆ – 106
رَبِّ اغْفِرْ لِي، وَتُبْ عَلَيَّ، إِنَّكَ أَنْتَ التَّوَّابُ الْغَفُورُ
ఓ నా ప్రభూ నన్ను మన్నించు, నా తౌబాను ఆమోదించు. నిశ్చయంగా నీవే అమితంగా తౌబాను ఆమోదించేవాడివి, మన్నించేవాడివి.[117]
దుఆ – 107
اللَّهُمَّ بِعِلْمِكَ الْغَيْبَ، وَقُدْرَتِكَ عَلَى الْخَلْقِ، أَحْيِنِي مَا عَلِمْتَ الْحَيَاةَ خَيْرًا لِي، وَتَوَفَّنِي إِذَا عَلِمْتَ الْوَفَاةَ خَيْرًا لِي، اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ خَشْيَتَكَ فِي الْغَيْبِ وَالشَّهَادَةِ، وَأَسْأَلُكَ كَلِمَةَ الْحَقِّ فِي الرِّضَا وَالْغَضَبِ، وَأَسْأَلُكَ الْقَصْدَ فِي الْغِنَى وَالْفَقْرِ، وَأَسْأَلُكَ نَعِيمَاً لاَ يَنْفَدُ، وأَسْأَلُكَ قُرَّةَ عَيْنٍ لاَ تَنْقَطِعْ، وَأَسْأَلُكَ الرِّضَا بَعَدَ الْقَضَاءِ، وَأَسْأَلُكَ بَرْدَ الْعَيْشِ بَعْدَ الْمَوْتِ، وَأَسْأْلُكَ لَذَّةَ النَّظَرِ إلَى وَجْهِكَ، وَالشَّوْقَ إِلَى لِقَائِكَ، فِي غَيْرِ ضَرَّاءَ مُضِرَّةٍ، وَلاَ فِتْنَةٍ مُضِلَّةٍ، اللَّهُمَّ زَيِّنَّا بِزِينَةِ الإِيمَانِ، وَاجْعَلْنَا هُدَاةً مُهْتَدِينَ
ఓ అల్లాహ్ నీ అగోచర జ్ఞానంతో, సృష్టిరాసులపై ఉన్న నీ సామర్ధ్యంతో నా కొరకు నీవు ఎప్పటి వరకు జీవనం మేలు అని భావిస్తావో అప్పటి వరకు నాకు జీవనమును ప్రసాదించు. మరియు నా కొరకు మరణం ఎప్పుడు మేలైనదని భావిస్తావో నాకు మరణమును ప్రసాదించు. ఓ అల్లాహ్ నిశ్చయంగా నేను నీతో గోప్య, బహిరంగ పరిస్థితిలో నీ భయమును వేడుకుంటున్నాను. మరియు ఇష్టమైన, క్రోధ పరిస్థితిలో సత్యమాటను పలకటమును నీతో వేడుకుంటున్నాను. మరియు ధనిక, పేద పరిస్థితిలో మితమును నీతో వేడుకుంటున్నాను. మరియు అంతము కాని అనుగ్రహములను నీతో వేడుకుంటున్నాను. మరియు అంతంకాని కంటి చలువను నీతో వేడుకుంటుున్నాను. మరియు తీర్పు తరువాత ఇష్టపడటమును నీతో వేడుకుంటున్నాను. మరియు మరణం తరువాత జీవితం యొక్క చల్లదనమును నీతో వేడుకుంటున్నాను. మరియు నీ ముఖ దర్శనము యొక్క రుచిని నీతో వేడుకుంటున్నాను. మరియు నిన్ను కలుసుకోవటం యొక్క అత్యాశను నీతో వేడుకుంటున్నాను నష్టం కాని బాధ కాని కలగని స్థితిలో. మరియు మార్గభ్రష్టతకు గురిచేసే ఉపద్రవం కాకూడదు. ఓ అల్లాహ్ విశ్వాసము యొక్క అలంకరణతో మమ్మల్ని అలంకరించు. మరియు మమ్మల్ని సన్మార్గం పై నడిచేవారిగా, సన్మార్గం చూపేవారిగా చేయి.[118]
దుఆ – 108
اللَّهُمَّ ارزُقني حُبَّكَ، وحُبَّ مَنْ يَنْفَعُني حُبُّهُ عندَك، اللَّهُمَّ مَا رَزَقْتَني مِمَّا أُحِبُّ فَاجْعَلْهُ قُوَّةً لِي فِيمَا تُحِبُّ، اللَّهُمَ مَا زَوَيْتَ عَنِّي مِمَّا أُحِبُّ فَاجْعَلْهُ فَرَاغاً لِي فِيمَا تُحِبُّ
ఓ అల్లాహ్ నాకు నీ ఇష్టతను మరియు ఎవరి ఇష్టత అయితే నీవద్ద నా కొరకు ప్రయోజనం కలిగించునో అతని ఇష్టతను ప్రసాదించు. ఓ అల్లాహ్ నేను ఇష్టపడేది ఏదైతే నీవు నాకు ప్రసాదించావో దానిని నీవు ఇష్టపడే వాటిని చేయటంలో నా కొరకు బలమును చేకూర్చేదిగా చేయి. ఓ అల్లాహ్ నేను ఇష్టపడేది దేనినైతే నా నుండి ఆపివేసావో దానికి బదులుగా నీవు ఇష్టపడే కార్యాలను చేసే భాగ్యమును ప్రసాదించు.[119]
దుఆ – 109
اللَّهُمَّ طَهِّرْنِي مِنَ الذُّنُوبِ وَالْخَطَايَا، اللَّهُمَّ نَقِّنِي مِنْهَا كَمَا يُنَقَّى الثَّوْبُ الْأَبْيَضُ مِنْ الدَّنَسِ، اللَّهُمَّ طَهِّرْنِي بِالثَّلْجِ وَالْبَرَدِ وَالْمَاءِ الْبَارِدِ
ఓ అల్లాహ్ పాపముల నుండి, తప్పిదముల నుండి నన్ను పరిశుద్ధపరచు. ఓ అల్లాహ్ మురికి నుండి తెల్ల బట్ట పరిశుద్ధపరచబడినట్లు నన్ను దాని నుండి పరిశుద్ధపరచు. ఓ అల్లాహ్ నన్ను వడగండ్లతో, మంచుతో, చల్లటి నీటితో పరిశుద్ధపరచు.[120]
దుఆ – 110
اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنَ الْبُخْلِ، وَالْجُبْنِ، وَسُوءِ الْعُمُرِ، وَفِتْنَةِ الصَّدْرِ، وَعَذَابِ الْقَبْرِ
ఓ అల్లాహ్ నిశ్చయంగా నేను పిసినారితనం నుండి, పిరికితనం నుండి, చెడు వయస్సు నుండి, హృదయ పరీక్ష నుండి, సమాధి యాతన నుండి శరణం వేడుకుంటున్నాను.[121]
దుఆ – 111
اللَّهُمَّ رَبَّ جِبْرَائِيلَ، وَمِيكَائِيلَ، وَرَبَّ إِسْرَافِيلَ، أَعُوذُ بِكَ مِنَ حَرِّ النَّارِ، وَمِنْ عَذَابِ الْقَبْرِ
ఓ అల్లాహ్ జిబ్రయీల్, మీకాయీల్ ప్రభువా, ఇస్రాఫీల్ ప్రభువా నేను నీతో నరకాగ్ని వేడి నుండి మరియు సమాధి యాతన నుండి శరణు వేడుకుంటున్నాను.[122]
దుఆ – 112
اللَّهُمَّ أَلْهِمْنِي رُشْدِي، وَأَعِذْنِي مِنْ شَرِّ نَفْسِي
ఓ అల్లాహ్ నాకు మేలు చేకూర్చే విషయాలు నేర్పించు నా మనోవాంఛల కీడు నుండి రక్షించు.[123]
దుఆ – 113
اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ عِلْمًا نَافِعًا، وَأَعُوذُ بِكَ مِنْ عِلْمٍ لاَ يَنْفَعُ
ఓ అల్లాహ్ నిశ్చయంగా నేను ప్రయోజనం కలిగించే జ్ఞానమును నీతో అర్ధిస్తున్నాను. మరియు నీతో ప్రయోజనం కలిగించని జ్ఞానము నుండి శరణు వేడుకుంటున్నాను.[124]
దుఆ – 114
اللَّهُمَّ رَبَّ السَّمَوَاتِ [السَّبْعِ] وَرَبَّ الْأَرْضِ، وَرَبَّ الْعَرْشِ الْعَظِيمِ، رَبَّنَا وَرَبَّ كُلِّ شَيْءٍ، فَالِقَ الْحَبِّ وَالنَّوَى، وَمُنْزِلَ التَّوْرَاةِ وَالْإِنْجِيلِ وَالْفُرْقَانِ، أَعُوذُ بِكَ مِنْ شَرِّ كُلِّ شَيْءٍ أَنْتَ آخِذٌ بِنَاصِيَتِهِ، اللَّهُمَّ أَنْتَ الْأَوَّلُ فَلَيْسَ قَبْلَكَ شَيْءٌ، وَأَنْتَ الْآخِرُ فَلَيْسَ بَعْدَكَ شَيْءٌ، وَأَنْتَ الظَّاهِرُ فَلَيْسَ فَوْقَكَ شَيْءٌ، وَأَنْتَ الْبَاطِنُ فَلَيْسَ دُونَكَ شَيْءٌ، اقْضِ عَنَّا الدَّيْنَ وَأَغْنِنَا مِنَ الْفَقْرِ
ఓ అల్లాహ్ సప్తాకాశముల ప్రభువా, భూమి యొక్క ప్రభువా, గొప్ప సింహాసనానికి అధిపతి, మా ప్రభూ, ప్రతీ వస్తువు యొక్క ప్రభూ, విత్తనమును, టెంకను చీల్చేవాడా, తౌరాతును, ఇంజీలును, ఖుర్ఆన్ ను అవతరింపజేసినవాడా నేను నీవు నుదుటను పట్టుకున్న ప్రతీ వస్తువు యొక్క కీడు నుండి నీతో శరణు వేడుకుంటున్నాను. ఓ అల్లాహ్ నీవే మొదటివాడివి నీకన్న ముందు ఏ వస్తువు లేదు. నీవే చివరివాడివి నీ తరువాత ఏదీ లేదు, నీవె బహిరంగమైనవాడివి నీపై ఏదీ లేదు, నీవు గోప్యమైనవాడివి నీ నుండి ఏదీ గోప్యంగా లేదు. నీవు మా నుండి రుణము యొక్క భారమును దించు మరియు మమ్మల్ని పేదవారి నుండి ధనికులుగా చేయి.[125]
దుఆ – 115
اللَّهُمَّ أَلِّفْ بَيْنَ قُلُوبِنَا، وَأَصْلِحْ ذَاتَ بَيْنِنَا، وَاهْدِنَا سُبُلَ السَّلَامِ، وَنَجِّنَا مِنَ الظُّلُمَاتِ إِلَى النُّورِ، وَجَنِّبْنَا الْفَوَاحِشَ مَا ظَهَرَ مِنْهَا وَمَا بَطَنَ، وَبَارِكْ لَنَا فِي أَسْمَاعِنَا، وَأَبْصَارِنَا، وَقُلُوبِنَا، وَأَزْوَاجِنَا، وَذُرِّيَّاتِنَا، وَتُبْ عَلَيْنَا إِنَّكَ أَنْتَ التَّوَّابُ الرَّحِيمُ، وَاجْعَلْنَا شَاكِرِينَ لِنِعَمِكَ مُثْنِينَ بِهَا عَلَيْكَ، قَابِلِينَ لَهَا، وَأَتِمِمْهَا عَلَيْنَا
ఓ అల్లాహ్ మా హృదయముల మధ్య జోడించు, మా పరస్పర వ్యవహారములను చక్కదిద్దు, మాకు శాంతి మార్గములను చూపించు, మమ్మల్ని చీకటుల నుండి వెలుగు వైపు రక్షించు, బహిరంగమైన, గోప్యమైన అశ్లీల కార్యాల నుండి మమ్మల్ని రక్షించు, మా కొరకు మా చెవులలో, మా కళ్ళలో, మా హృదయాలలో, మా భార్యలలో, మా సంతానములో శుభాలను ప్రసాదించు, మా తౌబాను ఆమోదించు, నిశ్చయంగా నీవు అమితంగా తౌబా స్వీకరించేవాడివి, అపారంగా కరుణించేవాడివి, మరియు మమ్మల్ని నీ అనుగ్రహాల వలన కృతజ్ఞత చూపే వారిగా, వాటిపై నిన్ను పొగిడేవారిగా, వాటిని స్వీకరించేవారిగా చేయి, నీవు వాటిని మాపై పరిపూర్ణం చేయి.[126]
దుఆ – 116
اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ خَيْرَ الْمَسْأَلَةِ، وَخَيْرَ الدُّعَاءِ، وَخَيْرَ النَّجَاحِ، وَخَيْرَ الْعَمَلِ، وَخَيْرَ الثَّوَابِ، وَخَيْرَ الْحَيَاةِ، وَخَيْرَ الْمَمَاتِ، وَثَبِّتْنِي، وَثَقِّل مَوَازِينِي، وَحَقِّقْ إِيمَانِي، وَارْفَعْ دَرَجَاتِي، وَتَقَبَّلْ صَلاَتِي، وَاغْفِرْ خَطِيئَتِي، وَأَسْأَلُكَ الدَّرَجَاتِ العُلاَ مِنَ الْجَنَّةِ، اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ فَوَاتِحَ الْخَيْرِ، وَخَوَاتِمَهُ، وَجَوَامِعَهُ، وَأَوَّلَهُ، وَظَاهِرَهُ، وَبَاطِنَهُ،
وَالدَّرَجَاتِ الْعُلَا مِنَ الْجَنَّةِ آمِينْ، اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ خَيْرَ مَا آتِي، وَخَيْرَ مَا أَفْعَلُ، وَخَيْرَ مَا أَعْمَلُ، وَخَيْرَ مَا بَطَنَ، وَخَيْرَ مَا ظَهَرَ، وَالدَّرَجَاتِ العُلَا مِنَ الْجَنَّةِ آمِينْ، اللَّهُمَّ إنِّي أَسْأَلُكَ أنْ تَرْفَعَ ذِكْرِي، وَتَضَعَ وِزْرِي، وَتُصْلِحَ أمْرِي، وَتُطَهِّرَ قَلْبِي، وَتُحَصِّنَ فَرْجِي، وَتُنَوِّرَ قَلْبِي، وَتَغْفِرَ لِي ذَنْبِي، وَأَسْأَلُكَ الدَّرَجَاتِ الْعُلَا مِنَ الْجَنَّةِ آمِينْ، اللَّهُمَّ إنِّي أَسْأَلُكَ أنْ تُبَارِكَ فِي نَفْسِي، وَفِي سَمْعِي، وَفِي بَصَرِي، وَفِي رُوحِي، وَفِي خَلْقِي، وَفِي خُلُقِي، وَفِي أَهْلِي، وَفِي مَحْيَايَ، وَفِي مَمَاتِي، وَفِي عَمَلِي، فَتَقَبَّلْ حَسَنَاتِي، وَأَسْأَلُكَ الدَّرَجَاتِ العُلَا مِنَ الْجَنَّةِ، آمِينْ
ఓ అల్లాహ్ నిశ్చయంగా నేను నీతో ఉత్తమమైన అర్ధనను, ఉత్తమమైన దుఆను, ఉత్తమమైన సాఫల్యమును, ఉత్తమమైన ఆచరణను, ఉత్తమమైన ప్రతిఫలమును, ఉత్తమమైన జీవితమును, ఉత్తమమైన మరణమును అర్ధిస్తున్నాను. నీవు నన్ను స్థిరంగా ఉంచు, నా పుణ్యముల త్రాసు పళ్ళెములను బరువుగా ఉంచు, నా విశ్వాసమును ధృడపరచు, నా స్థానములను పెంపొందించు, నా నమాజును స్వీకరించు, నా తప్పిదములను మన్నించు. మరియు నేను నీతో స్వర్గములో ఉన్నత స్థానాలను అర్ధిస్తున్నాను, ఓ అల్లాహ్ నేను నీతో అన్నీ వ్యవహారాల ఉత్తమ ఆరంభమును, ముగింపును, వాటి సమీకరణను, వాటి మొదటిని, వాటి బాహ్యమును, వాటి అంతరంగమును అర్ధిస్తున్నాను.
మరియు స్వర్గములో ఉన్నత స్థానములను అర్ధిస్తున్నాను. ఆమీన్ (అల్లాహ్ స్వీకరించుగాక). ఓ అల్లాహ్ నిశ్చయంగా నేను నీతో నేను తీసుకుని వచ్చిన దాని మేలును, నేను చేసిన దాని మేలును, నేను ఆచరించిన దాని మేలును, గోప్యంగా ఉన్నదాని మేలును, బహిరంగంగా ఉన్నదాని మేలును, స్వర్గములో ఉన్నత స్థానములను అర్ధిస్తున్నాను. ఆమీన్. ఓ అల్లాహ్ నిశ్చయంగా నేను నీవు నా చర్చను ఉన్నత శిఖరాలకు చేర్చమని, నా భారమును దించమని, నా వ్యవహారమును చక్కదిద్దమని, నా హృదయమును శుద్ధపరచమని, నా మర్మాంగమును రక్షించమని, నా మనస్సులో వెలుగు నింపమని, నా పాపములను మన్నించమని నీతో అర్ధిస్తున్నాను. మరియు స్వర్గములో ఉన్నత స్థానములను నీతో అర్ధిస్తున్నాను. ఆమీన్. ఓ అల్లాహ్ నిశ్చయంగా నేను నీతో వేడుకుంటున్నాను నీవు నా మనస్సులో, నా చెవులలో, నా కళ్ళలో, నా ఆత్మలో, నా పుట్టుకలో, నా గుణాలలో, నా కుటుంబంలో, నా జీవితంలో, నా మరణంలో, నా ఆచరణలో శుభాలను ప్రసాదించమని. నీవు నా మంచి కార్యములను స్వీకరించు. మరియు నేను స్వర్గములో ఉన్నత స్థానములను నీతో అర్ధిస్తున్నాను. ఆమీన్.[127]
దుఆ – 117
اللَّهُمَّ جَنِّبْنِي مُنْكَرَاتِ اَلْأَخْلَاقِ، وَالْأَهْوَاءِ، وَالْأَعْمَالِ، وَالْأَدْوَاءِ
ఓ అల్లాహ్ చెడు గుణాల నుండి, చెడు మనోవాంఛల నుండి, చెడు ఆచరణల నుండి, చెడు రోగాల నుండి నన్ను రక్షించు.[128]
దుఆ – 118
اللَّهُمَ قَنِّعْنِي بِمَا رَزَقْتَنِي، وَبَارِكْ لي فِيهِ، وَاخْلُفْ عَلَيَّ كُلَّ غَائِبَةٍ لِي بِخَيْرٍ
ఓ అల్లాహ్ నీవు ప్రసాదించిన దానితో నన్ను సంతృప్తిపరచు మరియు అందులో నా కొరకు శుభమును కలిగించు, నా చేతి నుండి తప్పిపోయిన ప్రతీ దానిపై నాకు మంచి ప్రతిఫలమును ప్రసాదించు.[129]
దుఆ – 119
اللَّهُمَّ حَاسِبْنِي حِسَابَاً يَسِيرَاً
ఓ అల్లాహ్ నాతో సులభతరమైన లెక్కను తీసుకో.[130]
దుఆ – 120
اللَّهُمَّ أعِنَّا عَلَى ذِكْرِكَ، وَشُكْرِكَ، وَحُسْنِ عِبَادَتِكَ
ఓ అల్లాహ్ నీ స్మరణ చేయటంపై, నీకు కృతజ్ఞత తెలుపుకోవటంపై, నీ ఆరాధనను మంచిగా చేయటంపై మాకు సహాయం చేయి.[131]
దుఆ – 121
اللَّهُمّ إِنِّي أَسْأَلُكَ إِيمَانًا لاَ يَرْتَدُّ، وَنَعِيمًا لاَ يَنْفَدُ، وَمُرَافَقَةَ مُحَمَّدٍ – صلى الله عليه وسلم – فِي أَعْلَى جَنَّةِ الْخُلْدِ
ఓ అల్లాహ్ నిశ్చయంగా నేను మతభ్రష్టత లేని విశ్వాసమును, అంతము కాని అనుగ్రహాలను మరియు శాశ్వత స్వర్గము యొక్క ఉన్నత స్థానంలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తోడును నీతో కోరుతున్నాను.[132]
దుఆ – 122
اللَّهُمَّ قِنِي شَرَّ نَفْسِي، وَاعْزِمْ لِي عَلَى أَرْشَدِ أَمْرِي، اللَّهُمَّ اغْفِرْ لِي مَا أَسْرَرْتُ، وَمَا أَعْلَنْتُ، وَمَا أَخْطَأْتُ، وَمَا عَمَدْتُ، وَمَا عَلِمْتُ، وَمَا جَهِلْتُ
ఓ అల్లాహ్ నా మనస్సు కీడు నుండి నన్ను రక్షించు, నా గొప్ప వ్యవహారముపై నాకు తోడ్పడు, ఓ అల్లాహ్ నేను గోప్యంగా చేసిన దానిని, బహిరంగంగా చేసిన దానిని, నేను చేసిన తప్పిదమును, కావాలని నేను చేసిన దానిని, తెలిసి చేసిన దానిని, తెలియక చేసిన దానిని నీవు నా కొరకు మన్నించు.[133]
దుఆ – 123
اللَّهُمَّ إنِّي أَعُوذُ بِكَ مِنْ غَلَبَةِ الدَّيْنِ، وَغَلَبَةِ الْعَدُوِّ، وَشَمَاتَةِ الأعْدَاءِ
ఓ అల్లాహ్ నిశ్చయంగా నేను నీతో ఋణము పెరగటం నుండి, శతృవు ఆధిక్యత నుండి, శతృవుల సంతోషము నుండి శరణు వేడుకుంటున్నాను.[134]
దుఆ – 124
اللَّهُمَّ اغْفِرْ لِي، وَاهْدِنِي، وَارْزُقْنِي، وَعَافِنِي، أَعُوذُ بِاللَّهِ مِنْ ضِيقِ الْمَقَامِ يَوْمَ الْقِيَامَةِ
ఓ అల్లాహ్ నన్ను మన్నించు, నాకు సన్మార్గం చూపు, నాకు ఆహారోపాధిని కల్పించు, నాకు ఆరోగ్యమును ప్రసాదించు. మరియు ప్రళయదినమున ఇబ్బంది గల ప్రదేశమున నిలబడటము నుండి అల్లాహ్ తో నేను శరణు వేడుకుంటున్నాను.[135]
దుఆ – 125
اللَّهُمَّ مَتِّعْنِي بِسَمْعِي، وَبَصَرِي، وَاجْعَلْهُمَا الْوَارِثَ مِنِّي، وَانْصُرْنِي عَلَى مَنْ يَظْلِمُنِي، وَخُذْ مِنْهُ بِثَأْرِي
ఓ అల్లాహ్ నా వినికిడి నుండి, నా చూపు నుండి నాకు ప్రయోజనం కలిగించు, మరియు వాటిని నా వారసులుగా చేయి. మరియు నన్ను హింసించే వారికి వ్యతిరేకంగా నాకు సహాయం చేయి, మరియు అతనితో నా ప్రతీకారం తీర్చుకో.[136]
దుఆ – 126
اللَّهُمَّ إنِّي أسْألُكَ عِيشَةً نَقِيَّةً، ومِيتَةً سَوِيَّةً، ومَرَدّاً غَيْرَ مَخْزٍ ولا فاضِحٍ)
ఓ అల్లాహ్ నిశ్చయంగా నేను నీతో స్వచ్ఛమైన జీవితమును, మంచి మరణమును మరియు పరాభవము, అవమానము లేని మరలింపును వేడుకుంటున్నాను.[137]
దుఆ – 127
اللَّهُمَّ لَكَ الْحَمْدُ كُلُّهُ، اللَّهُمَّ لاَ قَابِضَ لِمَا بَسَطْتَ، وَلاَ بَاسِطَ لِمَا قَبَضْتَ، وَلاَ هَادِيَ لِمَنْ أَضْلَلْتَ، وَلاَ مُضِلَّ لِمَنْ هَدَيْتَ، وَلاَ مُعْطِيَ لِمَا مَنَعْتَ، وَلاَ مَانِعَ لِمَا أَعْطَيْتَ، وَلاَ مُقَرِّبَ لِمَا بَاعَدْتَ، وَلاَ مُبَاعِدَ لِمَا قَرَّبْتَ، اللَّهُمَّ ابْسُطْ عَلَيْنَا مِنْ بَرَكَاتِكَ، وَرَحْمَتِكَ، وَفَضْلِكَ، وَرِزْقِكَ، اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ النَّعِيمَ الْمُقِيمَ الَّذِي لاَ يَحُولُ وَلاَ يَزُولُ، اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ النَّعِيمَ يَوْمَ الْعَيْلَةِ، وَالأَمْنَ يَوْمَ الْخَوْفِ، اللَّهُمَّ إِنِّي عَائِذٌ بِكَ مِنْ شَرِّ مَا أَعْطَيْتَنَا وَشَرِّ مَا مَنَعْتَنَا، اللَّهُمَّ حَبِّبْ إِلَيْنَا الإِيمَانَ وَزِيِّنْهُ فِي قُلُوبِنَا، وَكَرِّهْ إِلَيْنَا الْكُفْرَ وَالْفُسُوقَ وَالْعِصْيَانَ، وَاجْعَلْنَا مِنَ الرَّاشِدِينَ، اللَّهُمَّ تَوَفَّنَا مُسْلِمِينَ، وَأَحْيِنَا مُسْلِمِينَ، وَأَلْحِقْنَا بِالصَّالِحِينَ غَيْرَ خَزَايَا وَلاَ مَفْتُونِينَ، اللَّهُمَّ قَاتِلِ الْكَفَرَةَ الَّذِينَ يُكَذِّبُونَ رُسُلَكَ، وَيَصُدُّونَ عَنْ سَبِيلِكَ، وَاجْعَلْ عَلَيْهِمْ رِجْزَكَ وَعَذَابَكَ، اللَّهُمَّ قَاتِلْ كَفَرَةَ الَّذِينَ أُوتُوا الْكِتَابَ، إِلَهَ الْحَقِّ [آمِينْ]
ఓ అల్లాహ్ స్థుతులన్నీ నీ కొరకే. ఓ అల్లాహ్ నీవు విస్తరపరచిన వాడిని కుదించేవాడు ఎవడూ లేడు. మరియు నీవు కుదించిన వాడిని విస్తరింపజేసేవాడు ఎవడూ లేడు. నీవు అపమార్గమునకు లోను చేసిన వాడిని మార్గదర్శకం చేసేవాడు ఎవడూ లేడు. మరియు నీవు మార్గదర్శకం చేసినవాడిని అపమార్గమునకు గురి చేసేవాడు ఎవడూ లేడు. నీవు ప్రాసాదించనివాడికి ప్రసాదించేవాడు ఎవడూ లేడు. మరియు నీవు ప్రసాదించిన వాడికి ఆటంకపరిచేవాడు ఎవడూ లేడు. నీవు దూరం చేసిన వాడిని దగ్గర చేసేవాడు ఎవడూ లేడు. మరియు నీవు దగ్గర చేసిన వాడిని దూరం చేసేవాడు ఎవడూ లేడు. ఓ అల్లాహ్ నీ శుభాలను, నీ కారుణ్యమును, నీ అనుగ్రహమును, నీ ఆహారోపాధిని మాపై విస్తరంగా కురిపించు. ఓ అల్లాహ్ నేను నీతో మారని, అంతం కాని శాశ్వత అనుగ్రహాలను కోరుతున్నాను. ఓ అల్లాహ్ నేను ఇబ్బంది ఉన్న దినములో అనుగ్రహమును మరియు భయము ఉన్నదినములో శాంతిని నీతో కోరుతున్నాను. ఓ అల్లాహ్ నేను నీవు ప్రసాదించిన దాని కీడు నుండి మరియు నీవు ప్రసాదించకుండా ఉండిన దాని కీడు నుండి నీ శరణు కోరుతున్నాను. ఓ అల్లాహ్ విశ్వాసమంటే మాకు ప్రీతిని కలిగించు మరియు దానిని మన హృదయములలో అలంకరించు. మరియు అవిశ్వాసము నుండి, అవిధేయత నుండి, పాపకార్యముల నుండి మాకు ద్వేషమును కలిగించు. మరియు మమ్మల్ని సన్మార్గం పొందిన వారిలో నుంచి చేయి. ఓ అల్లాహ్ మమ్నల్ని ఇస్లాం స్థతిలో మరణమును ప్రసాదించు, మమ్మల్ని ఇస్లాం స్థితిలో జీవింపజేయి, మమ్మల్ని పరాభవమునకు గురి చేయకుండా, పరీక్షకు గురి చేయకుండా పుణ్యాత్ములతో కలుపు. ఓ అల్లాహ్ నీవు నీ ప్రవక్తలను తిరస్కరించే, నీ మార్గము నుండి ఆపే అవిశ్వాసపరులను నాశనం చేయి, నీ శిక్షను, నీ యాతనను వారిపై కురిపించు, ఓ అల్లాహ్ గ్రంధం ఇవ్వబడిన అవిశ్వాసపరులను నాశనం చేయి. ఓ సత్యఆరాధ్య దైవమా. ఆమీన్.
దుఆ – 128
((اللَّهُمَّ اغْفِرْ لِي، وَارْحَمْنِي، وَاهْدِنِي، وَعَافِنِي، وَارْزُقْنِي))
ఓ అల్లాహ్ నన్ను మన్నించు, నా పై దయ చూపు, నాకు సన్మార్గం చూపించు, నాకు ఆరోగ్యమును ప్రసాదించు, నాకు ఆహారొపాధిని ప్రసాదించు.[138]
(( … وَاجْبُرْنِي، وَارْفَعْنِي))
నాలో ఉన్న లోపాలను పూరించు, నా స్థానమును పెంచు.[139]
దుఆ – 129
اللَّهُمَّ زِدْنَا وَلَا تَنْقُصْنَا، وَأَكْرِمْنَا وَلَا تُهِنَّا، وَأَعْطِنَا وَلَا تَحْرِمْنَا، وَآثِرْنَا وَلَا تُؤْثِرْ عَلَيْنَا، وَأرْضِنَا وَارْضَ عَنَّا
ఓ అల్లాహ్ మమ్మల్ని అధికం చేయి, మమ్మల్ని తగ్గించకు, మమ్మల్ని గౌరవించు, మమ్మల్ని అవమానపరచకు, మమ్మల్ని నిర్భాగ్యులుగా చేయకు, మాకు ఆధిక్యతను ప్రసాదించు, మాపై ఇతరులకు ఆధిక్యతను ఇవ్వకు, మమ్మల్ని సంతుష్ట పరుచు, నీవు మాతో ప్రసన్నుడైపో.[140]
దుఆ – 130
اللَّهُمَّ أَحْسَنْتَ خَلْقِي فَأَحْسِنْ خُلُقِي
ఓ అల్లాహ్ నీవు నన్ను ఉత్తమ రూపునిగా సృష్టించినట్లే నా గుణాలను కూడా ఉన్నతముగా మలుచుము.[141]
దుఆ – 131
اللَّهُمَّ ثَبِّتْنِي وَاجْعَلْنِي هَادِياً مَهْدِيَّاً
ఓ అల్లాహ్ నన్ను స్థిరంగా ఉంచు మరియు నన్ను సన్మార్గం చూపేవానిగా, సన్మార్గం పొందినవాడిగా చేయి.[142]
దుఆ – 132
اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ الثَّبَاتَ فِي الْأَمْرِ، وَالْعَزِيمَةَ عَلَى الرُّشْدِ، وَأَسْأَلُكَ مُوجِبَاتِ رَحْمَتِكَ، وَعَزَائِمَ مَغْفِرَتِكَ، وَأَسْأَلُكَ شُكْرَ نِعْمَتِكَ، وَحُسْنَ عِبَادَتِكَ، وَأَسْأَلُكَ قَلْبَاً سَلِيمَاً، وَلِسَانَاً صَادِقَاً، وَأَسْأَلُكَ مِنْ خَيْرِ مَا تَعْلَمُ، وَأَعُوذُ بِكَ مِنْ شَرِّ مَا تَعْلَمُ، وَأسْتَغْفِرُكَ لِمَا تَعْلَمُ، إِنَّكَ أنْتَ عَلاَّمُ الْغُيُوبِ
ఓ అల్లాహ్ నిశ్చయంగా నేను వ్యవహారములో స్థిరత్వమును మరియు సన్మార్గముపై దృఢ నిశ్చయమును నీతో అర్ధిస్తున్నాను, మరియు నీ కారుణ్యమును అనివార్యం చేసే వాటిని, నీ మన్నింపు నిశ్చయములను నీతో అర్ధిస్తున్నాను, మరియు నీ అనుగ్రహమునకు కృతజ్ఞత తెలుపుకోవటమును, నీ ఆరాధనను మంచిగా చేయటమును నీతో అర్ధిస్తున్నాను, ఆరోగ్యకరమైన హృదయమును, సత్యం పలికే నాలుకను నీతో అర్ధిస్తున్నాను, మరియు నీకు తెలిసిన మేలును నీతో అర్ధిస్తున్నాను. మరియు నీకు తెలిసిన చెడు నుండి నీ శరణం వేడుకుంటున్నాను. మరియు నీకు తెలిసిన వాటి నుండి నీ మన్నింపును కోరుకుంటున్నాను. నిశ్చయంగా అగోచర విషయాల గురించి బాగా తెలిసినవాడివి నీవే.[143]
దుఆ – 133
اللَّهُمَّ إنِّي أَسْأَلُكَ الْفِرْدَوْسَ أَعْلَى الْجَنَّة
ఓ అల్లాహ్ నిశ్చయంగా నేను స్వర్గము యొక్క ఉన్నత స్థానము ఫిర్దౌస్ ను నిన్ను వేడుకుంటున్నాను.[144]
దుఆ – 134
اللَّهُمَّ جَدِّدِ الإيْمَانَ فِي قَلْبِي
ఓ అల్లాహ్ నా హృదయంలో విశ్వాసమును పునరుద్ధరించు.[145]
దుఆ – 135
اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنْ صَلَاةٍ لَا تَنْفَعُ
ఓ అల్లాహ్ నిశ్చయంగా నేను ప్రయోజనం కలిగించని ప్రార్ధన నుండి నీతో శరణు వేడుకుంటున్నాను.[146]
దుఆ – 136
اللَّهُمَّ إنِّي أّعُوذُ بِكَ مِنْ جَارِ السُّوءِ، وَمِنْ زَوْجٍ تُشَيِّبُنِي قَبْلَ المَشِيبِ، وَمِنْ وَلَدٍ يَكُونُ عَليَّ رَبّاً، وَمِنْ مَالٍ يَكُونُ عَلَيَّ عَذَابَاً، وَمِنْ خَلِيْلٍ مَاكِرٍ عَيْنُهُ تَرَانِي، وَقَلْبُهُ يَرْعَانِي؛ إِنْ رَأَى حَسَنَةً دَفَنَهَا، وَإِذَا رَأَى سَيِّئَةً أَذَاعَهَا
ఓ అల్లాహ్ నిశ్చయంగా నేను నీతో శరణు వేడుకుంటున్నాను దుష్టపొరుగువారి నుండి, వృద్దాప్యమునకు చేరక ముందే నన్ను వృద్ధుడిగా చేసే భార్య నుండి, నా యజమానులుగా మారే సంతానము నుండి, నాపై యాతనగా మారే సంపద నుండి మరియు ఆ టక్కరి స్నేహితుని నుండి అతని కళ్ళు నన్ను చూస్తుంటాయి, అతని మనస్సు నా వెనుక పడి ఉంటుంది, ఒక వేళ ఏదైన మంచిని చూస్తే దానిని సమాధి చేస్తాడు. ఒకవేళ చెడును చూస్తే దానిని వ్యాపింపజేస్తాడు.[147]
దుఆ – 137
اللَّهُمَّ لاَ تُخْزِنِي يَوْمَ الْقِيَامَةِ
ఓ అల్లాహ్ ప్రళయదినమున నన్ను పరాభవమునకు గురి చేయకు.[148]
దుఆ – 138
اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ الْمُعَافَاةَ فِي الدُّنْيَا وَالْآخِرَةِ
ఓ అల్లాహ్ నిశ్చయంగా నేను ఇహపరాలలో క్షేమమును నీతో అర్ధిస్తున్నాను.[149]
దుఆ – 139
اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنْ عِلْمٍ لاَ يَنْفَعُ، وَعَمَلٍ لاَ يُرْفَعُ، وَقَلَبٍ لاَ يَخْشَعُ، وَقَولٍ لاَ يُسْمَعُ
ఓ అల్లాహ్ నిశ్చయంగా నేను ప్రయోజనం కలిగించని జ్ఞానము నుండి, స్వీకరించబడని ఆచరణ నుండి, భయపడని హృదయం నుండి, వినిపించబడని మాట నుండి నీతో శరణు వేడుకుంటున్నాను.[150]
దుఆ – 140
اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنَ الْهَمِّ وَالْحَزَنِ، وَالْعَجْزِ وَالْكَسَلِ، وَالْبُخْلِ وَالْجُبْنِ، وَضَلَعِ الدَّيْنِ، وَغَلَبَةِ الرِّجَالِ
ఓ అల్లాహ్ నిశ్చయంగా నేను దిగులు, దుఃఖము, బలహీనత, సోమరితనం, పిరికితనం, పిసినారితనం, రుణభారం, ప్రజలు నాపై ఆధీక్యతను సంపాదించటం నుండి నీ శరణు వేడుకుంటున్నాను.[151]
దుఆ – 141
اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنْ عَذَابِ النَّارِ، وَأَعُوذُ بِكَ مِنْ عَذَابِ الْقَبْرِ، وَأَعُوذُ بِكَ مِنَ الْفِتَنِ مَا ظَهَرَ مِنْهَا وَمَا بَطَنَ، وَأَعُوذُ بِكَ مِنْ فِتْنَةِ الدَّجالِ
ఓ అల్లాహ్ నిశ్చయంగా నేను నీతో నరకాగ్ని శిక్ష నుండి శరణు వేడుకుంటున్నాను, మరియు నీతో సమాది శిక్ష నుండి శరణు వేడుకుంటున్నాను. మరియు బహిరంగమైన, గోప్యమైన ఉపద్రవాల నుండి నీతో శరణు వేడుకుంటున్నాను, మరియు నీతో దజ్జాల్ ఉపద్రవాల నుండి శరణు వేడుకుంటున్నాను.[152]
దుఆ – 142
اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ شَهَادَةً فِي سَبِيلِكَ
ఓ అల్లాహ్ నిశ్చయంగా నేను నీ మార్గంలో వీర మరణమును నీతో కోరుకుంటున్నాను.[153]
దుఆ – 143
اللَّهُمَّ اغْفِرْ لِي، اللَّهُمَّ اجْعَلْنِي يَوْمَ الْقِيَامَةِ فَوْقَ كَثِيرٍ مِنْ خَلْقِكَ مِنَ النَّاسِ، اللَّهُمَّ اغْفِرْ لِي ذَنْبِي، وَأَدْخِلْنِي يَوْمَ الْقِيَامَةِ مُدْخَلاً كَرِيمًا
ఓ అల్లాహ్ నన్ను మన్నించు, ఓ అల్లాహ్ ప్రళయదినమున నన్ను నీ సృష్టి అయిన ప్రజల పై ఉన్నత స్థానమును ప్రసాదించు, ఓ అల్లాహ్ నా పాపములను మన్నించు, మరియు నన్ను ప్రళయదినమున ఉన్నత స్థానములో ప్రవేశింపజేయి.[154]
దుఆ – 144
اللَّهُمَّ اهْدِنِي فِيمَنْ هَدَيْتَ، وَعَافِنِي فِيمَنْ عَافَيْتَ، وَتَوَلَّنِي فِيمَنْ تَوَلَّيْتَ، وَبَارِكْ لِي فِيمَا أَعْطَيْتَ، وَقِنِي شَرَّمَا قْضَيْتَ، إِنَّهُ لا يَذِلُّ مَنْ وَالَيْتَ، تَبَارَكْتَ رَبَّنَا وَتَعَالَيْتَ
ఓ అల్లాహ్ నీవు సన్మార్గం చూపిన వారిలోనే నాకు సన్మార్గం చూపు, నీవు స్వస్థత నిచ్చిన వారిలోనే నాకు స్వస్థత నివ్వు, నీవు మితృనిగా చేసుకున్న వారిలో నన్ను మీతృనిగా చేసుకుని చేర్చు, నీవు ప్రసాదించిన దానిలో నా కొరకు శుభమును ప్రసాదించు, నీవు నిర్ణయించిన కీడు నుండి నన్ను కాపాడు, నీవు మితృనిగా చేసుకున్నవాడు అవమానపాలు కాడు, మా ప్రభూ నీవు శుభవంతుడవు, మహోన్నతుడవు.[155]
దుఆ – 145
رَبِّ اغْفِرْ لِي خَطِيئَتِي يَوْمَ الدِّينِ
ఓ నా ప్రభూ ప్రతిఫల దినమున నా పాపములను మన్నించు.[156]
దుఆ – 146
أسْتَغْفِرُ اللهَ العَظِيمَ الَّذِي لاَ إلَهَ إلاَّ هُوَ، الحَيُّ القَيُّومُ، وَأتُوبُ إلَيهِ
నేను మహోన్నతుడైన అల్లాహ్ ను క్షమాపణ కోరుతున్నాను. సజీవుడు, నిత్యుడు అయిన ఆయన తప్ప మరో నిజ ఆరాధ్యుడు లేడు.మరియు నేను ఆయన వైపే పశ్చాత్తాపం చెందుతున్నాను.[157]
దుఆ – 147
اللَّهُمَّ اغْفِرْ لِي ذَنْبِي، وَأَذْهِبْ غَيْظَ قَلْبِي، وَأَعِذْنِي مِنْ مُضِلاتِ الْفِتَنِ
ఓ అల్లాహ్ నా పాపములను మన్నించు, నా హృదయ క్రోధమును తొలగించు, మరియు ఉపద్రవాల మార్గభ్రష్టతల నుండి నాకు శరణు కల్పించు.[158]
దుఆ – 148
اللَّهُمَّ أَحْيِنِي عَلَى سُنَّةِ نَبِيِّكَ – صلى الله عليه وسلم – وَتَوَفَّنِي عَلَى مِلَّتِهِ، وَأَعِذْنِي مِنْ مُضِلاَّتِ الْفِتَنِ
ఓ అల్లాహ్ నన్ను నీ ప్రవక్త యొక్క సంప్రదాయముపై జీవనమును ప్రసాదించు, మరియు ఆయన ధర్మంపైనే నాకు మరణమును కలిగించు, మరియు ఉపద్రవాల మార్గభ్రష్టతల నుండి నాకు శరణు కల్పించు.[159]
దుఆ – 149
اللَّهُمَّ صَلِّ عَلَى مُحَمَّدٍ، وَعَلَى آلِ مُحَمَّدٍ، كَمَا صَلَّيْتَ عَلَى إِبْرَاهِيمَ، وَعَلَى آلِ إِبْرَاهِيمَ، إِنَّكَ حَمِيدٌ مَجِيدٌ، وَبَارِكْ عَلَى مُحَمَّدٍ، وَعَلَى آلِ مُحَمَّدٍ، كَمَا بَارَكْتَ عَلَى إِبْرَاهِيمَ، وَعَلَى آلِ إِبْرَاهِيمَ، [فِي الْعَالَمِينَ] إِنَّكَ حَمِيدٌ مَجِيدٌ
‘అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్ వ అలా ఆలీ ముహమ్మద్, కమా సల్లైత అలా ఇబ్రాహీమ వఅలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్మజీద్’ అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మద్ వ అలా ఆలీ ముహమ్మద్ కమా బారక్త అలా ఇబ్రాహీమ వఅలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్మజీద్ (ఓ అల్లాహ్! నీవు ఇబ్రాహీం ను ఆయన కుటుంబం వారిని కరుణించినట్లుగానే ముహమ్మద్’ను మరియు ఆయన కుటుంబాన్నికరుణించు’స్తోత్రానికి అర్హుడవు, ఘనత కలవాడవు నీవే’ఓ అల్లాహ్ !ఇబ్రాహీం పై ఆయన కుటుంబం పై శుభాలు కరుణించినట్లుగానే ముహమ్మద్’ మరియు ఆయన కుటుంబంపై శుభాలు కురిపించు[160].
మరియు సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కొరకే ఆయన ఔన్నత్యమునకప, ఆయన గొప్ప అధికారమునకు తగిన విధంగా పొగడ్తలన్ని. ఓ అల్లాహ్ మన ప్రవక్త మపహమ్మద్ పై, ఆయన కుటుంబముపై, ఆయన సహచరులపై, ప్రళయదినం వరకు దాతృత్వంతో అనుసరించిన వారిపై శుభాలను, శాంతిని కలిగించు.
[1] సూరతుల్ ఆరాఫ్ 180వ ఆయతు.
[2]ఈ నామములను ఖుర్ఆన్, హదీసుల ఆధారములతో సహా రచయిత పుస్తకము “షర్హు అస్మాయిల్లాహిల్ హుస్నా ఫీ జౌయిల్ కితాబి వస్సున్న” లో చూడండి.
[3] దీనిని హాకిమ్ ఉల్లేఖించారు 1/541, జవాయిదె ముస్నదుల్ బజ్జార్ 2/442 హదీసు నెంబరు 2177, తబ్రానీ దుఆ లో హదీసు నెంబరు 1435, మజ్మఉజ్జవాయిద్ లో హైసమీ పలికారు 10/179 : ((తబ్రానీ సనద్ మంచిది)).
[4] సూరతుల్ బఖర-ఆయతు 186
[5] అబూదావూద్ 2/78 హదీసు నెంబరు 1481, తిర్మిజీ 5/211 హదీసు నెంబరు 2959, ఇబ్నె మాజా 2/1258 హదీసు నెంబరు 3828, మరియు సహీహుల్ జామిఉస్సగీర్ లో అల్బానీ గారు దీనిని ప్రామాణికమైనదిగా తెలియపరచారు 3/150, సహీహ్ ఇబ్ను మాజా 2/324.
[6] దీనిని అబూదావూద్ 2/78 హదీసు నెంబరు 1488, తిర్మిజీ 5/557 హదీసు నెంబరు 3556, ఇబ్నెమాజా 2/1271 హదీసు నెంబరు 3865 లో ఉల్లేఖించారు. మరియు ఇబ్నే హజర్ దీని సనద్ మంచిదని ప్రస్తావించారు, మరియు సహీహ్ తిర్మిజీ లో అల్బానీ గారు దీనిని ప్రామాణికమైనదిగా తెలియపరచారు 3/179.
[7] దీనిని తిర్మిజీ 5/566, 5/462 హదీసు నెంబరు 3573 మరియు అహ్మద్ 3/18 హదీసు నెంబరు 11150 లో ఉల్లేఖించారు. మరియు సహీహుల్ జామిఉస్సగీర్ 5/116 లో, సహీహు సునన్ తిర్మిజీ 3/140 లో అల్బానీ గారు దీనిని ప్రామాణికమైనదిగా తెలియపరచారు.
[8] మూలమును చూడండి 3/863 -926.
[9] ఈ దుఆ పద్దతులను మరియు దుఆ స్వీకరించబడటానికి కారకాలను వాటి ఆధారాలతో అసల్ (హదీసులో) చూడండి, 3/927 – 975.
[10]దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన స్వయం కోసం దుఆతో ఆరంభించారని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి నిరూపితమై ఉంది. మరియు ఆయన తన స్వయం కోసం దుఆతో ఆరంభించలేదని కూడా నిరూపితమై ఉంది. ఉదాహరణకు ఆయన అనస్, ఇబ్నె అబ్బాస్ మరియు ఉమ్మె ఇస్మాయీల్ మరియు తదితరులు రజియల్లాహు అన్హుమ్ కొరకు దుఆ చేయటం. ఈ విషయంలో వివరణ కొరకు సహీహ్ ముస్లిం యొక్క ఇమామ్ నవవి షరహ్ 15/144 లో, సునన్ తిర్మిజీ షరహ్ తొహ్ఫతుల్ అహ్వజీ 9/328 లో, సహీహ్ బుఖారీ షరహ్ ఫత్హుల్ భారీ 1/281 లో చూడండి.
[11]ఈ వేళలను, పరిస్థితులను మరియు ప్రదేశములను వాటి ఆధారాలతో సవివరంగా అసలు పుస్తకములో చూడండి, 3/975 – 1117.
[12] అల్లాహ్ యొక్క గొప్ప నామమును ఈ పుస్తకములోని హదీసు నెంబరు 203, 104, 105 లను చూడండి.
[13] సూరతుల్ బఖర-ఆయతు 186
[14] సూరతుల్ బఖర-ఆయతు127
[15] సూరతుల్ బఖర-ఆయతు128
[16] సూరతుల్ బఖర-ఆయతు201
[17] సూరతుల్ బఖర-ఆయతు 285
[18] సూరతుల్ బఖర-ఆయతు 286
[19] సూరా ఆలి ఇమ్రాన్ 8వ ఆయతు.
[20] సూరా ఆలి ఇమ్రాన్ 16ఆయతు.
[21] సూరా ఆలి ఇమ్రాన్ 38 ఆయతు.
[22] సూరా ఆలి ఇమ్రాన్ 147 ఆయతు.
[23] సూరా ఆలీ ఇమ్రాన్ 191 – 194
[24] సూరతుల్ అఅ్ రాఫ్ 23’ఆయతు.
[25] సూరతుల్ అఅ్ రాఫ్ 47’ఆయతు.
[26] సూరతుల్ అఅ్ రాఫ్ 155 – 156 ఆయతులు.
[27] సూరతు తౌబా-129 వ ఆయతు
[28] సూరతు యూనుస్ 85 – 86 ఆయతులు
[29] సూరతుల్ హూద్ 47’ఆయతు
[30] సూరతు యూసుఫ్ 101వ ఆయతు, లబ్దిచెందటం కొరకు ఇబ్నె ఖయ్యిమ్ గారి కితాబుల్ ఫవాయిద్ పేజి 436, 437 చూడండి.
[31] సూరతు ఇబ్రాహీమ్ – 35 ఆయతు
[32] సూరతు ఇబ్రాహీమ్ 40 వ ఆయతు
[33] సూరతు ఇబ్రాహీమ్ – 41 ఆయతు
[34] సూరతుల్ కహఫ్ 10ఆయతు.
[35] సూరతు తాహా 25 – 28 ఆయతులు.
[36] సూరతు తాహా – 114వ ఆయతు
[37] సూరతుల్ అంబియా -87’ఆయతు
[38] సూరతుల్ అంబియా -89’ఆయతు
[39] సూరతుల్ మూమినూన్ 97 – 98 ఆయతులు.
[40] సూరతుల్ మూమినూన్ 109’ఆయతు.
[41] సూరతుల్ మూమినూన్ 118’ఆయతు.
[42] సూరతుల్ ఫుర్ఖాన్ 65 – 66 ఆయతులు.
[43] సూరతుల్ ఫుర్ఖాన్ 84 ఆయతు.
[44] సూరతు షుఅరా 83 – 85 ఆయతులు.
[45] సూరతు షుఅరా 87 – 89 ఆయతులు.
[46] సూరతు నమ్ల్ – ఆయతు 19
[47] సూరతుల్ ఖసస్ 16 ఆయతు
[48] సూరతుల్ ఖసస్ 21 ఆయతు
[49] సూరతుల్ ఖసస్ 22 ఆయతు
[50] సూరతుల్ ఖసస్ 24 ఆయతు
[51] సూరతుల్ అన్’కబూత్ 30 ఆయతు
[52] సూరతుస్సాఫ్ఫాత్ 100 ఆయతు
[53] సూరతుల్ అహ్’ఖాఫ్ 15 ఆయతు.
[54] సూరతుల్ హష్ర్ 10 ఆయతు.
[55] సూరతుల్ ముమ్తహిన 4 ఆయతు.
[56] సూరతుల్ ముమ్తహిన-5 ఆయతు
[57] సూరతు తహ్రీమ్ 8’ఆయతు
[58] సూరతు నూహ్ 28’ఆయతు.
[59] సూరతుల్ బఖరా ఆయత్ 213 నుండి తీసుకోబడింది.
[60] సూరతుల్ బఖరా ఆయత్ 269 నుండి తీసుకోబడింది.
[61] సూరతు ఇబ్రాహీం ఆయత్ 27 నుండి తీసుకోబడింది.
[62] సూరతుల్ హుజరాత్ ఆయతు 7 నుండి తీసుకోబడింది.
[63] సూరతు తగాబున్ ఆయత్ 16 నుండి తీసుకోబడింది.
[64] బుఖారి హదీసు నెంబరు 4522, 6389, ముస్లిం హదీసు నెంబరు 2690.
[65] బుఖారీ హదీసు నెంబరు 832, ముస్లిం హదీసు నెంబరు 589
[66] బుఖారీ హదీసు నెంబరు 2823, ముస్లిం హదీసు నెంబరు 2706.
[67] బుఖారీ హదీసు నెంబరు 6347, ముస్లిం హదీసు నెంబరు 2707, దాని పదాలు : దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కష్టములోని బాధ నుండి, దురదృష్టము సోకటం నుండి, చెడు తీర్పు నుండి, శతృవుల ఆనందము నుండి శరణు వేడుకునేవారు.
[68] దీనిని ముస్లిం ఉల్లేఖించారు, హదీసు నెంబరు 2720.
[69] దీనిని ముస్లిం ఉల్లేఖించారు, హదీసు నెంబరు 2721.
[70] దీనిని ముస్లిం ఉల్లేఖించారు, హదీసు నెంబరు 2722.
[71] దీనిని ముస్లిం ఉల్లేఖించారు, హదీసు నెంబరు 2725.
[72] దీనిని ముస్లిం ఉల్లేఖించారు, హదీసు నెంబరు 2739.
[73] ముస్లిం హదీసు నెంబరు 2716.
[74] అనస్ కొరకు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ దుఆ దానిపై సూచిస్తుంది : ((ఓ అల్లాహ్ నీవు ఇతని సంపదను, సంతానమును అధికం చేయి మరియు ఇతనికి నీవు ప్రసాదించిన దానిలో ఇతని కొరకు శుభాలను ప్రసాదించు)) బుఖారి హదీసు నెంబరు 1982, ముస్లిం హదీసు నెంబరు 660.
[75] బుఖారీ అదబుల్ ముఫ్రద్ లో హదీసు నెంబరు 653, ఇమామ్ అల్బానీ గారు సిల్ సిలతుల్ అహాదీసుస్సహీహ లో హదీస్ నెంబరు 2241, సహీహుల్ అదబుల్ ముఫ్రద్ పేజి నెంబరు 244 లో దీనిని ప్రామాణికమైనదిగా తెలియపరచారు. బ్రాకెట్లో ఉన్న దానిపై దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి మాట ఆయనను ప్రజలలో ఉత్తమమైనవారు ఎవరు అని అడిగినప్పుడు ఆయన తెలిపిన మాట సూచిస్తుంది. ఆయన ఇలా పలికారు : ((ఎవరి ఆయుషు పెరిగి అతని ఆచరణ మంచిగా ఉంటుందో అతడు)) తిర్మిజీ హదీసు నెంబరు 2329, అహ్మద్ హదీసు నెంబరు 17716, మరియు అల్బానీ గారు సహీహ్ తిర్మిజీలో దీనిని ప్రామాణికమైనదిగా తెలియపరచారు 2/271, నిశ్చయంగా నేను షేఖ్ బిన్ బాజ్ రహిమహుల్లాహ్ తో దాని ద్వారా దుఆ చేయటం గురించి అది సున్నతా అని అడిగాను. అప్పుడు ఆయన ఆవును అని అన్నారు.
[76] బుఖారీ హదీసు నెంబరు 6345, ముస్లిం హదీసు నెంబరు 2730.
[77] అబూదావూద్ హదీసు నెంబరు 5090, అహ్మద్ 5/42, దీనిని అల్బానీ గారు సహీహ్ అబూదావూద్ 3/250 లో, సహీహుల్ అదబుల్ ముఫ్రద్ 260 లో హసన్ అని తెలియపరచారు. అల్లామా బిన్ బాజ్ కూడా తుహ్ఫతుల్ అఖ్యార్ పేజీ 24 లో దీని సనదును హసన్ అని తెలియపరచారు.
[78] తిర్మిజీ హదీస్ నెంబరు 3505, హాకిమ్, దానిని జహబీ ప్రామాణికమైనదిగా తెలియపరచి ఆమోదించారు 1/505, మరియు అల్బానీ గారు సహీహ్ తిర్మిజీలో దానిని ప్రామాణికమైనదిగా తెలియపరచారు 3/168 మరియు దాని పదాలు : ((దావతు జిన్నూని ఇజ్ దఆహు వహువ ఫీ బతనిల్ హూతి : ((అల్లా ఇలాహ ఇల్లా అన్త సుబహానక ఇన్నీ కున్తు మినజ్జాలిమీన్)) ఫ ఇన్నహు లమ్ యదఉ బిహా రజులున్ ముస్లిమున్ ఫీ షయ్యిన్ ఖత్తు ఇల్లా ఇస్తజాబల్లాహు లహు)) చేప కడుపులో ఉండి చేపవాడు ఆయనను ప్రార్ధించినప్పటి ప్రార్ధన : “నీవు తప్ప సత్య ఆరాధ్యదైవం లేడు. నీవు పరిశుద్ధుడివి. నిశ్చయంగా నేను దుర్మార్గుల చెంత చేరాను”. అయితే ఎవరైనా ముస్లిం ఎప్పుడైన ఏదైన విషయంలో దాని ద్వారా దుఆ చేస్తే అల్లాహ్ అతని కొరకు దాన్ని ఆమోదిస్తాడు.
[79] అహ్మద్ 1/391, 452, హాకిమ్ 1/509, హాఫిజ్ తఖ్రీజుల్ అజ్కార్ లో హసన్ గా ఖరారు చేశారు మరియు అల్బానీ గారు తఖ్రీజుల్ కలిమిత్తయ్యిబ్ పేజి 73 లో ప్రామాణికమైనదిగా తెలియపరచారు.
[80] ముస్లిం హదీసు నెంబరు 2654.
[81] తిర్మిజీ హదీసు నెంబరు 3522, అహ్మద్ 4/182, హాకిమ్ 1/525, 528, మరియు జహబీ గారు దీనిని ప్రామాణికమైనదిగా తెలియపరచి ఆమోదించారు. మరియు అల్బానీ గారు సహీహుల్ జామి 6/309, సహీహ్ తిర్మిజీ 3/171 లో దీనిని ప్రామాణికమైనదిగా తెలియపరచారు. ఉమ్మె సల్మా రజియల్లాహు అన్హా ఇలా తెలియపరచారు : అధికంగా దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ప్రార్ధన ఇలాగే ఉండేది.
[82] తిర్మిజీ హదీసు నెంబరు 3514, బుఖారీ అదబుల్ ముఫ్రద్ లో హదీసు నెంబరు 726, మరియు తిర్మిజీ వద్ద దాని పదాలు : మీరు ఇహపరాలలో స్వస్థతను అల్లాహ్ తో వేడుకోండి. ఇంకా పదాలు : మీరు క్షమాపణను, స్వస్థతను అల్లాహ్ తో వేడుకోండి ఎందుకంటే నమ్మకము తరువాత స్వస్థతకన్న ఉత్తమమైనది ఎవరికి ఇవ్వబడలేదు. మరియు అల్బానీ గారు సహీహ్ ఇబ్నె మాజా 3/180, 3/185, 3/170 లో దీనిని ప్రామాణికమైనదిగా తెలియపరచారు. మరియు ఆయన కొరకు సాక్ష్యాలు కలవు. వాటిని ముస్నదె ఇమామ్ అహ్మద్ లో అహ్మద్ షాకిర్ క్రమం 1/156 – 157 లో చూడండి.
[83] అహ్మద్ 4/181, తబ్రానీ అల్ కబీర్ 1169/2/33 లో, అద్దుఆ లో హదీసు నెంబరు 1436 లో, ఇబ్నెహిబ్బాన్ హదీసు నెంబరు 2424, 2425 (మవారిద్) లో, హాఫిజ్ అల్ హైసమీ మజ్మఉ జ్జవాయిద్ 10/178 లో అహ్మద్ ఉల్లేఖకులు మరియు తబ్రానీ సనద్ యొక్క ఒక ఉల్లేఖకుడు అందరు నమ్మకమైన వారు అని తెలియపరచారు.
[84] బుఖారీ అదబుల్ ముఫ్రద్ లో హదీసు నెంబరు 664, 665, అబూదావూద్ హదీసు నెంబరు 1510, 1511, తిర్మిజీ హదీసు నెంబరు 3551, ఇబ్నెమాజా హదీసు నెంబరు 3830, అహ్మద్ 1/127, మరియు హాకిమ్, దానిని జహబి ప్రామాణికమైనదిగా తెలియపరచి ఆమోదించారు 1/519, మరియు అల్బానీ గారు సహీహ్ అబూదావూద్ 1/414 లో మరియు సహీహ్ తిర్మిజీ 3/178 లో దీనిని ప్రామాణికమైనదిగా తెలియపరచారు.
[85] తిర్మిజీ హదీసు నెంబరు 3521, ఇబ్నె మాజ హదీసు నెంబరు 3846 అదే అర్ధముతో, మరియు తిర్మిజీ ఈ హదీసు హసన్ గరీబ్ అని అన్నారు. అల్బానీ గారు జయీఫు తిర్మిజీ పేజి 387 లో దీనిని బలహీనమైనదిగా తెలియపరచారు.
[86] అబూదావూద్ హదీసు నెంబరు 1551, తిర్మిజీ హదీసు నెంబరు 3492, నసాయీ హదీసు నెంబరు 5470, తదితరులు మరియు అల్బానీ గారు సహీహ్ తిర్మిజీ 3/166 లోసహీహ్ నసాయీ 3/1108 లో దీనిని ప్రామాణికమైనదిగా తెలియపరచారు.
[87] అబూదావూద్ హదీసు నెంబరు 1554, నసాయీ హదీసు నెంబరు 5493, అహ్మద్ 3/192, మరియు అల్బానీ గారు సహీహ్ నసాయీ 3/1116 లో, సహీహ్ తిర్మిజీ 3/184 లో దీనిని ప్రామాణికమైనదిగా తెలియపరచారు.
[88] తిర్మిజీ హదీసు నెంబరు 3591, ఇబ్నె హిబ్బాన్ 2422 (మవారిద్), హాకిమ్ 532/1, తబరానీ ఫిల్ కబీర్ 19/19/36. మరియు అల్బానీ గారు సహీహ్ తిర్మిజీ 3/184 లో దీనిని ప్రామాణికమైనదిగా తెలియపరచారు.
[89] తిర్మిజీ హదీసు నెంబరు 3513, నసాయీ అల్ కుబ్రా హదీసు నెంబరు 7712లో, మరియు అల్బానీ గారు సహీహ్ తిర్మిజీ 3/170 లో దీనిని ప్రామాణికమైనదిగా తెలియపరచారు.
[90] దీనిని అహ్మద్ తన పదాలలో ఉల్లేఖించారు 5/243, తిర్మిజీ హదీసు నెంబరు 3235 మరియు అటువంటిదే, మరియు దీనిని హసన్ అని అన్నారు. మరియు ఇలా పలికారు నేను ముహమ్మద్ బిన్ ఇస్మాయీల్ అంటే బుఖారీతో అడిగాను. ఆయన ఈ హదీసు హసన్, సహీహ్ అని తెలిపారు. మరియు హదీసు చివరిలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు : నిశ్చయంగా ఇది సత్యము మీరు దానిని చదవండి మరియు నేర్చుకోండి. హాకిమ్ 1/521, మరియు అల్బానీ గారు సహీహ్ తిర్మిజీ 3/318 లో దీనిని ప్రామాణికమైనదిగా తెలియపరచారు.
[91] ఇబ్నె మాజ హదీసు నెంబరు 3846 తన పదాలలో, అహ్మద్ 6/134, హాకిమ్ దీనిని ప్రామాణికమైనదిగా తెలియపరచారు. మరియు జహబీ దీనిని ఆమోదించారు 1/521. మరియు అల్బానీ గారు సహీహ్ ఇబ్నె మాజా లో దీనిని ప్రామాణికమైనదిగా తెలిపరచారు 2/327.
[92] హాకిమ్ 1/525, మరియు దీనిని ఆయన ప్రామాణికమైనదన్నారు. మరియు జహబీ దానికి మద్దతు చూపారు. మరియు అల్బానీ గారు సహీహుల్ జామీ 2/398, సిల్సిలతుల్ అహాదీసుస్సహీహ 4/54 హదీసు 1540 లో దీనిని ప్రామాణికమైనదిగా తెలియపరచారు.
[93] తిర్మిజీ హదీసు నెంబరు 3502, హాకిమ్ 1/528, మరియు హాకిమ్ దానిని ప్రామాణికమైనదిగా తెలియపరచారు. మరియు జహబీ దానికి మద్దతు పలికారు. మరియు ఇబ్నె సున్నీ హదీసు నెంబరు 446, మరియు అల్బానీ గారు సహీహ్ తిర్మిజీ 3/168, సహీహుల్ జామీ 1/400 లో దీనిని హసన్ అని తెలిపారు.
[94] బుఖారీ హదీసు నెంబరు 2822.
[95] ముత్తఫఖున్ అలైహి : బుఖారీ హదీసు నెంబరు 6398, ముస్లిం హదీసు నెంబరు 2719.
[96] ముత్తఫఖున్ అలైహి : బుఖారీ హదీసు నెంబరు 834, ముస్లిం హదీసు నెంబరు 2705.
[97] ముత్తఫఖున్ అలైహి : బుఖారీ హదీసు నెంబరు 6396, ముస్లిం హదీసు నెంబరు 2719.
[98] హాకిమ్ 1/525 మరియు ఆయన దీనిని ప్రామాణికమైనదిగా తెలియపరచారు, మరియు జహబీ దానికి మద్దతు పలికారు, మరియు బైహఖీ దావాత్ లో హదీసు నెంబరు 206. చూడండి : నవవీ అజ్కార్ 340 పేజీని. మరియు దీనిని తత్వజ్ఞుడు అబ్దుల్ ఖాదిర్ అర్నవూత్ హసన్ అని తెలిపారు.
[99] ఉబాద రజియల్లాహు అన్హు హదీసు ఆయన ఇలా పలికారు : నేను దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఇలా పలుకుతుండగా విన్నాను : విశ్వాసపర పురుషుల కొరకు మరియు విశ్వాసపర స్త్రీల కొరకు మన్నింపును వేడుకునే వారైన ప్రతీ విశ్వాసపర పురుషుని కొరకు విశ్వాసపర స్త్రీ కొరకు అల్లాహ్ ఒక పుణ్యమును వ్రాస్తాడు. తబ్రానీ అల్ కబీర్ లో 5/202, హదీసు నెంబరు 5092, 3/334, హదీసు నెంబరు 2155, మరియు హైసమీ దీని సనద్ ను మజ్మఉజ్జవాయిద్ లో జయ్యిద్ అని తెలియపరచారు, మరియు అల్బానీ గారు సహీహుల్ జామీ లో దీనిని హసన్ అన్నారు హదీసు నెంబరు 5902, 5/242.
[100] దీనిని అహ్మద్ 4/63 ఉల్లేఖించారు హదీసు నెంబరు 16599, హదీసు నెంబరు 23114, హదీసు నెంబరు 23188, మరియు తిర్మిజీ హదీసు నెంబరు 3500, ముస్నద్ యొక్క తత్వజ్ఞులు 144/27, 38/197 లో, 38/145 లో హసన్ లిగైరిహి అన్నారు. మరియు అల్బానీగారు దీనిని సహీహుల్ జామీ లో హసన్ అన్నారు 1/399.
[101] దీనిని తబ్రానీ ఉల్లేఖించారు. హైసమీ మజ్మఉజ్జవాయిద్ 10/159 లో సహీహ్ యొక్క ఉల్లేఖకుల్లోంచి ముహమ్మద్ ఇబ్నె జియాద్ తప్ప అందరు దీని ఉల్లేఖకులు అని, జియాద్ నమ్మకస్తుడని తెలిపారు. మరియు అల్బానీ గారు దీనిని సహీహుల్ జామీ 1/404 హదీసు నెంబరు 1278 లో ప్రామాణికమైనదిగా తెలియపరచారు.
[102] దీనిని అబూదావూద్ హదీసు నెంబరు 1552, నసాయీ హదీసు నెంబరు 5531 ఉల్లేఖించారు. మరియు అల్బానీ గారు దీనిని సహీహ్ నసాయీ 3/1123, సహీహ్ సునన్ అబూ దావూద్ 425/1 లో దీనిని ప్రామాణికమైనదిగా తెలియపరచారు.
[103] దీనిని అబూదావూద్ హదీసు నెంబరు 1547, నసాయీ హదీసు నెంబరు 5483 ఉల్లేఖించారు. మరియు అల్బానీ గారు సహీహ్ నసాయీ 3/1112 లో దీనిని హసన్ అని తెలియపరచారు.
[104] దీనిని నసాయీ హదీసు నెంబరు 5493, హాకిమ్ 1/530 ఉల్లేఖించారు. మరియు అల్బానీ గారు సహీహుల్ జామీ 1/406, ఇర్వావుల్ గలీల్ హదీసు నెంబరు 852 లో దీనిని ప్రామాణికమైనదిగా తెలియపరచారు.
[105] దీనిని అబూదావూద్ హదీసు నెంబరు 1544, నసాయీ హదీసు నెంబరు 5475 ఉల్లేఖించారు. మరియు అల్బానీ గారు సహీహ్ నసాయీ 3/1111, సహీహుల్ జామీ 1/407 లో ప్రామాణికమైనదిగా తెలియపరచారు. బ్రాకెట్ మధ్యలో ఉన్నది ఇబ్నె హిబ్బాన్ (మవారిద్) వద్ద ఉన్నది. మరియు అల్బానీ గారు సహీహ్ మవారిద్ జమఆన్ 2/455 లో దీనిని ప్రామాణికమైనదిగా తెలియపరచారు.
[106] బుఖారీ అదబుల్ ముఫ్రద్ లో హదీసు నెంబరు 117, హాకిమ్ 1/532 మరియు ఆయన దీనిని ప్రామాణికమైనదిగా తెలియపరచారు. మరియు జహబీ దీనికి మద్దతు పలికారు. మరియు నసాయీ దీనిని ఉల్లేఖించారు హదీసు నెంబరు 5517, మరియు అల్బానీ గారు దీనిని సహీహుల్ జామీ 1/408 మరియు సహీహ్ నసాయీ 3/1118 లో ప్రామాణికమైనదిగా తెలియపరచారు.
[107] తిర్మిజీ హదీసు నెంబరు 3482, అబూ దావూద్ హదీసు నెంబరు 1549, మరియు అల్బానీ గారు దీనిని సహీహుల్ జామీ హదీసు నెంబరు 1295 మరియు సహీహు నసాయీ 3/1113 లో ప్రామాణికమైనదిగా తెలియపరచారు.
[108] దీనిని తబ్రానీ ఉల్లేఖించారు. మరియు హైసమీ జవాయిద్ 10/144 లో సహీహ్ యొక్క ఉల్లేఖులే దీని ఉల్లేఖులు అని తెలిపారు. మరియు అల్బానీ గారు దీనిని సహీహుల్ జామీ 1/411, హదీసు నెంబరు 1290 లో హసన్ అని తెలియపరచారు.
[109] దీనిని తిర్మిజీ హదీసు నెంబరు 2572, ఇబ్నె మాజ హదీసు నెంబరు 3340.నసాయీ హదీసు నెంబరు 5536 ఉల్లేఖించారు. మరియు అల్బానీగారు సహీహ్ తిర్మీజీ 2/319, సహీహ్ నసాయీ 3/1121 లో దీనిని ప్రామాణికమైనదిగా తెలియపరచారు. హదీసు పదాలు ఇలా ఉన్నవి : ఎవరైతే అల్లాహ్ తో స్వర్గమును మూడుసార్లు వేడుకుంటాడో స్వర్గము ఇలా పలుకుతుంది : ఓ అల్లాహ్ అతనిని స్వర్గంలో ప్రవేశింపజేయి. మరియు ఎవరైతే నరకము నుండి మూడుసార్లు శరణు వేడుకుంటాడో నరకము ఇలా పలుకుతుంది : ఓ అల్లాహ్ ఇతనిని నరకము నుండి రక్షణను కల్పించు.
[110] బుఖారీ ముస్లింలో దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇబ్నె అబ్బాస్ రజియల్లాహు అన్హుమా కొరకు చేసిన దుఆ విషయంలో వచ్చిన రివాయతు దీనిపై సూచిస్తుంది. చూడండి బుఖారీ హదీసు నెంబరు 143, ముస్లిం హదీసు నెంబరు 2477.
[111] దీనిని అహ్మద్ 4/404, ఇబ్నె షైబ 10/337 మరియు తబ్రానీ మూజముల్ ఔసత్ 4/284 లో దీనిని ఉల్లేఖించారు. మరియు అల్బానీగారు దీనిని సహీహ్ తర్గీబ్ వతహ్రీబ్ 1/19 లో హసన్ అని తెలిపారు.
[112] దీనిని తిర్మిజీ హదీసు నెంబరు 3599, ఇబ్నె మాజ హదీసు నెంబరు 259 లో ఉల్లేఖించారు. మరియు అల్బానీ గారు సహీహ్ ఇబ్నె మాజ 1/47 లో దీనిని ప్రామాణికమైనదిగా తెలియపరచారు.
[113] దీనిని ఇబ్నె మాజ హదీసు నెంబరు 925 మరియు నసాయీ అమలుల్ యౌమి వల్లైలతి హదీసు నెంబరు 102 లో మరియు అహ్మద్ 6/294, 305 లో ఉల్లేఖించారు. మరియు అల్బానీ గారు సహీహ్ ఇబ్నె మాజ 1/152 లో దీనిని ప్రామాణికమైనదిగా తెలియపరచారు.
[114] దీనిని నసాయీ హదీసు నెంబరు 1300 ఉల్లేఖించారు. పదాలు ఆయనివి, నసాయీ సుననె కుబ్రాలో హదీసు నెంబరు 7665, అబూదావూద్ హదీసు నెంబరు 985. మరియు అల్బానీ గారు సహీహ్ సునన్ నసాయీ 1/147 లో దీనిని ప్రామాణికమైనదిగా తెలియపరచారు.
[115] అబూదావూద్ హదీసు నెంబరు 1495, ఇబ్నె మాజ హదీసు నెంబరు 3858, నసాయీ హదీసు నెంబరు 1299, తిర్మీజీ హదీసు నెంబరు 3544. మరియు అల్బానీ గారు సహీహ్ నసాయీ 1/279, సహీహ్ ఇబ్నె మాజ 2/329 లో దీనిని ప్రామాణికమైనదిగా తెలియపరచారు.
[116] అబూదావూద్ హదీసు నెంబరు 985, తిర్మిజీ 3475, ఇబ్నె మాజ హదీసు నెంబరు 3857, అహ్మద్ 5/360, మరియు అల్బానీ గారు దీనిని సహీహ్ సుననె తిర్మిజీ 3/163 లో ప్రామాణికమైనదిగా తెలియపరచారు.
[117] అబూదావూద్ హదీసు నెంబరు 1518, తిర్మిజీ హదీసు నెంబరు 3434, మరియు పదాలు ఆయనివి, నసాయీ హదీసు నెంబరు 10292, ఇబ్నె మాజ హదీసు నెంబరు 3814, మరియు అల్బానీ గారు సహీహ్ ఇబ్నె మాజ 2/321, సహీహ్ తిర్మిజీ 3/153 లో దీనిని ప్రామాణికమైనదిగా తెలియపరచారు.
[118] నసాయీ హదీసు నెంబరు 1305, అహ్మద్ 4/264, మరియు అల్బానీ గారు దీనిని సహీహ్ నసాయీ లో ప్రామాణికమైనదిగా తెలియపరచారు 1/280, 281/1.
[119] దీనిని తిర్మిజీ ఉల్లేఖించారు హదీసు నెంబరు 3491. మరియు దీనిని హసన్ అని పలికారు. మరియు అబ్దుల్ ఖాదిర్ అర్నవూత్ ఆయన పలికినట్లు హసన్ అని పలికారు. చూడండి ఆయన పుస్తకము జామిఉల్ ఉసూల్ 4/341.
[120] దీనిని ముస్లిం హదీసు నెంబరు 476, నసాయీ హదీసు నెంబరు 400 ఉల్లేఖించారు.
[121] నసాయీ హదీసు నెంబరు 5469, మరియు ఆయన పదాలు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఐదు విషయముల నుండి శరణు వేడుకునేవారు : పిసినారితనం నుండి, చెడు వయస్సు నుండి, హృదయ పరీక్ష నుండి, సమాధి యాతన నుండి. మరియు దీనిని అబూదావూద్ ఉల్లేఖించారు హదీసు నెంబరు 1539, మరియు అర్నవూత్ జామిఉల్ ఉసూల్ యొక్క తన ఉల్లేఖనంలో దీనిని హసన్ అని పలికారు 4/363.
[122] దీనిని నసాయీ హదీసు నెంబరు 1344, అహ్మద్ 6/61, బైహఖీ దావాత్ హదీసు నెంబరు 109 లో ఉల్లేఖించారు. మరియు అల్బానీ గారు సహీహ్ నసాయీ 3/1121 లో, సిల్సిలతుస్సహీహ హదీసు నెంబరు 1544 లో దీనిని ప్రామాణికమైనదిగా తెలియపరచారు.
[123] దీనిని తిర్మిజీ ఉల్లేఖించారు, మరియు పదాలు ఆయనివి 5/519, హదీసు నెంబరు 3483. మరియు అహ్మద్ దీనిని ఉల్లేఖించారు 197/23, హదీసు నెంబరు 19992, మరియు హాకిమ్ లో ఇదేవిధంగా ఉంది 510/1, మరియు హదీసు గురించి అహ్మద్ వద్ద ముస్నద్ తత్వజ్ఞులు ఇలా పలికారు : షేఖైన్ షరతుపై దీని సనద్ ప్రామాణికమైనది. ఇక తిర్మిజీ పదాలను అల్బానీ గారు జయీఫుత్తిర్మిజీ పేజీ 379 లో బలహీనమైనవని తెలిపారు.
[124] దీనిని సుననుల్ కుబ్రా లో నసాయీ హదీసు నెంబరు 7867, ఇబ్నెమాజ హదీసు నెంబరు 3843 ఉల్లేఖించారు. మరియు అల్బానీ గారు సునన్ ఇబ్నెమాజ 2/327 లో దీనిని హసన్ అని పలికారు. మరియు దాని పదాలు : మీరు అల్లాహ్ తో ప్రయోజనకరమైన జ్ఞానమును అడగండి మరియు నిష్ప్రయోజనమైన జ్ఞానము నుండి అల్లాహ్ తో శరణు వేడుకోండి.
[125] దీనిని ముస్లిం ఉల్లేఖించారు హదీసు నెంబరు 2713, అబూహురైరా ఉల్లేఖనం
[126] దీనిని అబూదావూద్ హదీసు నెంబరు 969, హాకిమ్ ఉల్లేఖించారు, ఆయన పదాలు 1/265. మరియు ఈ హదీసు ముస్లిం షరతుపై ప్రామాణికమైనదని తెలిపారు, మరియు జహబీ ఆయనకు మద్దతు పలికారు 1/26, మరియు అల్బానీ గారు దీనిని సహీహ్ అదబుల్ ముఫ్రద్ లో ప్రామాణికమైనదిగా తెలిపారు హదీసు నెంబరు 630.
[127] దీనిని హాకిమ్ ఉమ్మెసల్మా నుండి మర్ఫూగా ఉల్లేఖించారు 520/1, మరియు ప్రామాణికమైనదని తెలిపారు. మరియు జహబీ దానికి మద్దతు పలికారు 1/520, బైహిఖీ దావాత్ లో హదీసు నెంబరు 225, తబ్రానీ అల్ కబీర్ లో 326/23 హదీసు నెంబరు 717.
[128] దీనిని హాకిమ్ ఉల్లేఖించారు, 1/523, మరియు ముస్లిం షరతుపై అది ప్రామాణికమైనదని తెలిపారు. మరియు జహబీ ఆయనకు మద్దతు పలికారు., 1/532, మరియు తబ్రానీ దీనిని మూజముల్ కబీర్ లో ఉల్లేఖించారు 19/19 హదీసు నెంబరు 36. మరియు అల్బానీ గారు దీనిని జిలాలిల్ జన్న లో ప్రామాణికమైనదని తెలిపారు నెంబరు 13.
[129] దీనిని హాకిమ్ ఉల్లేఖించారు 532/1, మరియు దీనిని ఆయన ప్రామాణికమైనదిగా తెలియపరచారు. మరియు జహబీ ఆయనకు మద్దతు పలికారు 1/510. ఇబ్నె అబ్బాస్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం, బైహఖీ అల్ ఆదాబ్ లో హదీసు నెంబరు 1084, దావాతుల్ కబీర్ లో 211, మరియు హాఫిజ్ ఇబ్నె హజర్ గారు ఫుతూహాతె రబ్బానియ్య లో దీనిని హసన్ అని తెలిపారు 383/4.
[130] దీనిని అహ్మద్ 6/48, హాకిమ్ 1\255 ఉల్లేఖించారు. హాకిమ్ ఈ హదీసు ముస్లిం షరతు పై ప్రామాణికమైనది అని తెలిపారు. మరియు జహబీ ఆయనకు మద్దతు పలికారు 1/255, ఆయిషా రజియల్లాహు అన్హా ఇలా తెలుపుతున్నారు : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు నమాజును ముగించిన తరువాత నేను ఆయనతో ఓ దైవప్రవక్తా శులభతరమైన లెక్క ఏమిటి అని ప్రశ్నించాను. దానికి ఆయన సమాధానమిచ్చారు : శులభతర లెక్క ఏమిటంటే అల్లాహ్ దాసుని కర్మల పత్రమును చూసి అతనిని మన్నించివేయటం. ఓ అయిషా ఆ రోజు లెక్క గురించి ఎవరైతే ప్రశ్నించబడుతాడో అతడు నాశనమయ్యాడు. మరియు విశ్వాసపరునికి కలిగే ప్రతీ ఆపదకు బదులుగా అల్లాహ్ అతని పాపములను మన్నించివేస్తాడు. చివరికి అతనికి ముళ్ళు గుచ్చుకున్నా సరే. అల్బానీ గారు మిష్కాతుల్ మసాబీహ్ లో దీని సనద్ మంచిదని తెలిపారు.
[131] దీనిని అహ్మద్ 299/2, హాకిమ్ 1/499 ఉల్లేఖించారు. మరియు హాకిమ్ దీనిని ప్రామాణికమైనదిగా తెలియపరచారు. మరియు జహబీ ఆయనకు మద్దతు పలికారు. వారిద్దరు పలికినట్లే అది ప్రామాణికమైనది. మరియు అది అబూదావూద్ వద్ద హదీసు నెంబరు 1524, నసాయీ వద్ద అస్సుననుల్ కుబ్రా హదీసు నెంబరు 9973 లో ఉన్నది. మరియు అల్బానీ గారు దీనిని సహీహుల్ అదబుల్ మఫ్రద్ లో ప్రామాణికమైనదిగా తెలిపారు హదీసు నెంబరు 534.
[132] దీనిని ఇబ్నె హిబ్బాన్ ఉల్లేఖించారు (మవారిద్) పేజి 604 హదీసు నెంబరు 2436, ఇబ్నె మస్ఊద్ రజియల్లాహు అన్హు మౌఖూఫ్ ఉల్లేఖనం, దీనిని అహ్మద్ వేరే మార్గం నుండి ఉల్లేఖించారు 1/386, 400, మరియు నసాయి అమలుల్ యౌమి వల్లైల లో ఉల్లేఖించారు హదీసు నెంబరు 869, మరియు అల్బానీ గారు దీనిని సిల్సిలతుస్సహీహ లో హసన్ అని తెలిపారు హదీసు నెంబరు 2301.
[133] దీనిని నసాయీ అస్సుననుల్ కుబ్రా లో ఉల్లేఖించారు 6/246, హదీసు నెంబరు 10830, హాకిమ్ 1/510, హాకిమ్ దీనిని ప్రామాణికమైనదిగా తెలిపారు. మరియు జహబీ ఆయనకు మద్దతు పలికారు. అహ్మద్ దీనిని ఉల్లేఖించారు, 4/444, ముస్నదుల్ ముహఖ్ఖఖ్ 197/33 హదీసు నెంబరు 19992, మరియు హాఫిజ్ ఇసాబ లో దీని సనద్ ప్రామాణికమైనదని తెలిపారు. మరియు అల్బానీ గారు దీనిని రియాజుస్సాలిహీన్ తఖ్రీజ్ లో మరియు హదీసుపై తన తాలీఖ్ లో ప్రామాణికమైనదిగా తెలిపారు హదీసు నెంబరు 1495.
[134] దీనిని నసాయీ హదీసు నెంబరు 5475, అహ్మద్ 2\173 ఉల్లేఖించారు. మరియు అల్బానీ గారు దీనిని సహీహ్ నసాయీలో ప్రామాణికమైనదిగా తెలిపారు 3/1113.
[135] నసాయీ హదీసు నెంబరు 1617, ఇబ్నెమాజ హదీసు నెంబరు 1356. మరియు అల్బానీ గారు దీనిని సహీహ్ సుననె నసాయీ లో 1/356, సహీహ్ ఇబ్నె మాజ 1/226 లో ప్రామాణికమైనదిగా తెలిపారు.
[136] దీనిని తిర్మిజీ హదీసు నెంబరు 3681, బుఖారీ అదబుల్ ముఫ్రద్ హదీసు నెంబరు 650 లో, హాకిమ్ 1\523 ఉల్లేఖించారు. మరియు హాకిమ్ దీనిని ప్రామాణికమైనది అన్నారు. మరియు జహబీ ఆయనకు మద్దతు పలికారు. మరియు అల్బానీ గారు దీనిని సహీహ్ తిర్మిజీ లో హసన్ అని పలికారు 3/188.
[137] అహ్మద్ ప్రస్తావించబడిన పదాలతో 3\424, 24\246 హదీసు నెంబరు 15492, బ్రాకెట్ మధ్యలో ఉన్నవి హాకిమ్ వి 1/507, 3\23-24, దీనిని బుఖారీ అదబుల్ ముఫ్రద్ లో ఉల్లేఖించారు హదీసు నెంబరు 699, అల్బానీ గారు ఫిఖ్హుస్సీర ఉల్లేఖనం పేజి 284, బుఖారీ యొక్క సహీహుల్ అదబుల్ ముఫ్రద్ హదీసు నెంబరు 538 పేజీ నెంబరు 259 లో దీనిని ప్రామాణికమైనదిగా తెలియపరచారు. మరియు ముస్నద్ యొక్క తత్వజ్ఞులు 24\246 దీని ఉల్లేఖకులు నమ్మకస్తులని తెలిపారు.
[138] ముస్లిం హదీసు నెంబరు 2696, 2697, ముస్లిం యొక్క ఇంకొక ఉల్లేఖనంలో ఇలా ఉంది : ఈ పదాలన్ని నీ కొరకు ఇహపరాల శ్రేయస్సును సమీకరిస్తాయి. మరియు సుననె అబూదావూద్ హదీసు నెంబరు 850 లో ఇలా ఉంది : పల్లె వాసి మరలి వెళ్తుండగా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు : నిశ్చయంగా అతను తన రెండు చేతులను మేలుతో నింపుకున్నాడు.
[139] చూడండి తిర్మిజీ హదీసు నెంబరు 284, ఇబ్నె మాజ హదీసు నెంబరు 898, అల్బానీ గారు సహీహ్ ఇబ్నె మాజ 1/148, సహీహ్ తిర్మిజీ 1/90 లో దీనిని ప్రామాణికమైనదిగా తెలియపరచారు.
[140] తిర్మిజీ 5\326 హదీసు నెంబరు 3173, హాకిమ్ 2/98, మరియు ఆయన దానిని ప్రామాణికమైనదిగా నిర్ధారించారు, మరియు అబ్దుల్ ఖాదిర్ అల్ అరనౌత్ తన సిద్ధాంతము జామిఉల్ ఉసూల్ లో దానిని హసన్ అని తెలిపారు 11/282, హదీసు నెంబరు 8847.
[141] దీనిని అహ్మద్ 6/68, 155, 1/403 మరియు ఇబ్నె హిబ్బాన్ (2423- మవారిద్).తయాలిసీ 374, ముస్నదె అబీ యాలా హదీసు నెంబరు 5075 ఉల్లేఖించారు. మరియు అల్బానీ గారు దీనిని ఇర్వాఉల్ గలీల్ లో ప్రామాణికమైనదిగా తెలియపరచారు. 1/115 నెంబరు 74.
[142] జరీర్ రజియల్లాహు అన్హు కొరకు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క దుఆ దీనికి ఆధారము. చూడండి బుఖారీ హదీసు నెంబరు 6333, 3020, 3036 మొదలుగునవి.
[143] అహ్మద్ 338/28 హదీసు నెంబరు 17114, 28/338, హదీసు నెంబరు 17133, తిర్మిజీ హదీసు నెంబరు 3407, తబ్రానీ మూజముల్ కబీర్ లో ఆయన పదాలు, హదీసు నెంబరు 7135, హదీసు నెంబరు 7157, 7175, 7176, 7177, 7178, 7179, 7180, ఇబ్నె హిబ్బాన్ దీనిని తన సహీహ్ లో ఉల్లేఖించారు 3/312 హదీసు నెంబరు 935, 5/310, 1974, మరియు షుఐబ్ అల్ అర్నౌత్ దీనిని సహీహ్ ఇబ్నె హిబ్బాన్ లో హసన్ అని పలికారు 5/312, ముస్నద్ యొక్క తత్వజ్ఞులు దీనిని దీని మార్గముల ద్వారా హసన్ అన్నారు 28/338, మరియు అల్బానీ గారు దీనిని సిల్ సిలతుల్ అహాదీసుస్సహీహ యొక్క ఏడవ సంపుటము హదీసు నెంబరు 3228 లో, సహీహ్ మవారిదుజ్జమఆన్ హదీసు నెంబరు 2416, 2418 లో ప్రస్తావించారు. మరియు దానిని సహీహ్ లి గైరిహీ అన్నారు.
[144] ఇది దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మాట -: మీరు అల్లాహ్ తో వేడుకుంటే ఫిర్దౌస్ ను వేడుకోండి. ఎందుకంటే అది స్వర్గము యొక్క మధ్య స్థానము మరియు స్వర్గము యొక్క ఉన్నత స్థానము. దానిపైనే కరుణామయుడి అర్ష్ ఉన్నది. మరియు దాని నుండి స్వర్గ వనాలు ప్రవహించబడుతాయి. బుఖారీ హదీసు నెంబరు 2790, 7423.
[145] ఇది అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ రజియల్లాహు అన్హుమా యొక్క హదీసు నుండి తీసుకోబడినది. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు అని ఆయన పలికారు : నిశ్చయంగా పాత బట్ట శైథిల్యమైనట్లు మీలోని ప్రతి ఒక్కరి హృదయంలో విశ్వాసము శైథిల్యమగును. కావున మీరు మీ హృదయములలో విశ్వాసమును పునరుద్ధరించమని అల్లాహ్ తో వేడుకోండి. హాకిమ్ 1/4. మరియు ఆయన దానిని ప్రామాణికమైనదిగా తెలిపారు. మరియు జహబీ ఆయనకు మద్దతు పలికారు. మరియు హైసమీ మజ్మఉజ్జవాయిద్ లో పలికారు 1/52 : దీనిని తబ్రానీ అల్ కబీర్ లో ఉల్లేఖించారు. మరియు దాని సనద్ హసన్. మరియు అల్బానీ గారు సిల్ సిలతుల్ అహాదీసుస్సహీహ లో దీనిని హసన్ అని పలికారు 4/113 హదీసు నెంబరు 1585.
[146] అబూదావూద్ హదీసు నెంబరు 1549, మరియు అల్బానీ గారు దీనిని సహీహ్ సుననె అబూదావూద్ లో ప్రామాణికమైనదిగా తెలియపరచారు 1/424.
[147] తబ్రానీ అద్దుఆ లో 3/1425 హదీసు నెంబరు 1339, మరియు అల్బానీ గారు సిల్సిలతుల్ అహాదీసుస్సహీహ 7/377, హదీసు నెంబరు 3137 లో నేను ఈ సనద్ మంచిదని, దాని ఉల్లేఖకులు తహజీబ్ ఉల్లేఖకులు అని పలికాను.
[148] అహ్మద్ అల్ ముస్నద్ లో 29/596, హదీసు నెంబరు 18056, ముస్నద్ తత్వజ్ఞులు దీని సనద్ ప్రామాణికమైనదిగా తెలియపరచారు, మరియు తబ్రానీ దీనిని అల్ మూజముల్ కబీర్ లో ఈ పదాలతో ఉల్లేఖించారు 3/20, హదీసు నెంబరు 2524 : ఓ అల్లాహ్ ప్రళయదినాన నన్ను పరాభవమునకు గురి చేయకు. మరియు యుద్ద దినమున నన్ను పరాభవమునకు గురి చేయకు.
[149] ఇబ్నె మాజ 3851, మరియు అల్బానీ గారు దీనిని సహీహ్ ఇబ్నె మాజ 3/259, సిల్సిలతుల్ అహాదీసుస్సహీహ 1138 లో ప్రామాణికమైనదిగా తెలియపరచారు.
[150] దీనిని ఇబ్నె హిబ్బాన్ హదీసు నెంబరు 2440 (మవారిద్) లో ఉల్లేఖించారు. మరియు అల్బానీ గారు సహీహ్ మవారిదు జ్జమఆన్ 2/454 హదీసు నెంబరు 2066 లో దీనిని ప్రామాణికమైనదిగా తెలియపరచారు.
[151] బుఖారీ హదీసు నెంబరు 6363, అనస్ రజియల్లాహు అన్హు ఇలా పలికారు : దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎక్కడికి వెళ్ళినా నేను ఆయన సేవలో ఉండేవాడిని. నేను ఎక్కువగా ఆయనను అల్లాహుమ్మ ఇన్నీ అఊజుబిక మినల్ హమ్మి పలుకుతుండగా వినేవాడిని.
[152] ముస్లిం హదీసు నెంబరు 2867, అందులో ఇలా ఉన్నది : మీరు నరకయాతన నుండి అల్లాహ్ శరణు వేడుకోండి, మీరు సమాధి యాతన నుండి అల్లాహ్ శరణు వేడుకోండి. దాని చివరి వరకు.
[153] ముస్లిం హదీసు నెంబరు 1909, ఇది ప్రవక్త సల్లల్లాహు యొక్క ఈ హదీసు నుండి తీసుకోబడినది : ఎవరైతే అల్లాహ్ తో సత్య హృదయంతో వీర మరణమును కోరుకుంటాడో అల్లాహ్ అతనిని వీరమరణం పొందిన వారి స్థానములకు చేరవేస్తాడు. ఒక వేళ అతను మంచంపై సాధారణ మరణం పొందినా సరే.
[154] బుఖారీ హదీసు నెంబరు 4323, ముస్లిం హదీసు నెంబరు 2498, మరియు అది ఉబేద్ అబీ ఆమిర్ కొరకు దైవప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లం యొక్క దుఆ మరియు అబీ బర్ద రజియల్లాహు అన్హుమా కొరకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క దుఆ నుండి తీసుకోబడినది,
[155] ముస్నద్ లో అహ్మద్ 3/249, హదీసు నెంబరు 1723, మరియు ముస్నద్ తత్వజ్ఞులు 3/249 దీని సనద్ ప్రామాణికమైనదిగా తెలిపారు, ఇది సమగ్రమైన ఉల్లేఖనము, వితర్ ఒక్క దానికే చెందినది కాదు ఎలాగైతే వేరే ఉల్లేఖనంలో వచ్చినదో. ఈ ఉల్లేఖనంలో అనస్ రజియల్లాహు అన్హు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మాకు ఈ దుఆను నేర్పించేవారు అని పలికారు.
[156] ముస్లిం హదీసు నెంబరు 214, దైవప్రవక్త సల్లల్లాహు ఆలైహి వసల్లంతో ఇలా అడగబడినది : ఓ దైవప్రవక్తా ఇబ్నె జుద్ఆన్ అజ్ఞాన కాలంలో బంధుత్వాలను కలిపేవాడు, నిరుపేదలకు భోజనం తినిపించేవాడు మరి అవి అతనికి ప్రయోజనం కలిగిస్తాయా? . దానికి ఆయన అతనికి ప్రయోజనం కలిగించవు ఎందుకంటే అతను ఏ రోజూ ఓ నా ప్రభూ ప్రతిఫల దినమున నా పాపములను మన్నించు అని పలకలేదు అని సమాధానమిచ్చారు.
[157] తిర్మిజీ హదీసు నెంబరు 3577, మరియు అల్బానీ గారు దీనిని సహీహ్ తిర్మిజీలో ప్రామాణికమైనదిగా తెలిపారు 3/469 : దీనిని పలికేవాడు ఒక వేళ యుద్ద మైదానము నుండి పారిపోయినా సరే అల్లాహ్ అతనిని మన్నించివేస్తాడు.
[158] ఆయిషా రజియల్లాహు అన్హా కొరకు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఈ దుఆ నుండి తీసుకోబడినది : ఓ అల్లాహ్ ఆమె యొక్క పాపమును మన్నించు, మరియు ఆమె హృదయం యొక్క క్రోదమును తొలగించు మరియు ఉపద్రవాల మార్గభ్రష్టతల నుండి ఆమెకు శరణం కలిగించు. దీనిని ఇబ్నె అసాకీర్ దాని సనదుతో అల్అర్బఊన ఫీ మనాఖిబి ఉమ్మహాతిల్ మూమినీన్ పేజి నెంబరు 85 లో ఆయిషా రజియల్లాహు అన్హా నుండి ఉల్లేఖించారు. మరియు ఆయన ఈ హదీసు హసన్ అని, బఖియ్యతు ఇబ్నె వలీద్ హదీసు నుండి అని తెలిపారు. మరియు దీనిని ఇబ్నుస్సున్నీ ఇటువంటి దాని ద్వారా అమలుల్ యౌమి వల్లైల హదీసు నెంబరు 457 లో ఉల్లేఖించారు.ఇబ్నుస్సున్నీ యొక్క మరొక సంపుటములో మిన్ ముజిల్లాతిల్ ఫితన్ కి బదులుగా వ అజిర్ నీ మినష్షైతాన్ అని ఉంది. చూడండి దాని ఉల్లేఖనమును అల్బానీ వద్ద జయీఫాలో హదీసు నెంబరు 4207, మరియు అహ్మద్ వద్ద ఉమ్మె సల్మా రజియల్లాహు అన్హా ఉల్లేఖనం ఆయన కొరకు ఆధారంగా ఉన్నది హదీసు నెంబరు 26576, అటువంటిదే 2/44లో, మరియు ఆయన పదాలు “నీవు పలుకు ఓ అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ యొక్క ప్రభూ నీవు నా పాపమును మన్నించు, నా హృదయము యొక్క క్రోధమును తొలగించు, నీవు మమ్మల్ని జీవించి ఉంచినంత కాలం ఉపద్రవాల మార్గభ్రష్టతల నుండి నాకు శరణం కలిగించు”.మరియు హైసమీ దీనిని మజ్మఉజ్జవాయిద్ 10/27 లో హసన్ అని తెలియపరచారు. మరియు అది తబ్రానీ వద్ద అల్ మజ్మఉల్ కబీర్ 23/338, 785 లో మా అహ్యయ్తనా పదాలు లేకుండా ఉంది. మరియు ఉమ్మె హానీ రజియల్లాహు అన్హా యొక్క ఈ హదీసు దానికి ఆధారం : ఆమె ఇలా పలికింది ఓ ప్రవక్త నేను దుఆ చేయటానికి ఒక దుఆను నాకు నేర్పించండి. ఆయన ఇలా పలికారు : నీవు అల్లాహుమ్మగ్ఫిర్లీ జన్బీ ——పూర్తి హదీసు. దీనిని అల్ ఖరాయితీ ఫీ ఈతిలాలిల్ ఖులూబ్ హదీసు నెంబరు 52 లో, మసావిఉల్ అఖ్లాఖ్ హదీసు నెంబరు 323 లో ఉల్లేఖించారు.
[159] దీనిని బైహఖీ సుననుల్ కుబ్రా 5/95 లో ఇబ్నె ఉమర్ దుఆ నుండి ఉల్లేఖించారు. దీనిని ఇబ్నుల్ ములఖిన్ అల్ బదరుల్ మునీర్ 6/309 లో నఖలు చేశారు. మరియు జియా నుండి నఖలు చేస్తూ దీని సనదు జయ్యిద్ అని పలికారు. మరియు ఇబ్నే మస్ఊద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖిస్తూ ఇలా పలికారు : మీలో ఎవరు కూడా ఓ అల్లాహ్ నిశ్ఛయంగా నేను పరీక్షల నుండి నీ శరణు వేడుకుంటున్నాను అని పలకకండి. ఎందుకంటే ఎవరూ పరీక్షలకు లోను కాకుండా ఎవరు లేరు. ఎందుకంటే అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు : మీ సంపదలు, మీ సంతానము మీకు పరీక్ష [తగాబున్ : 15] మీలో నుండి ఎవరైన శరణు వేడుకుంటే ఉపద్రవాల మార్గభ్రష్టతల నుండి అల్లాహ్ తో శరణు వేడుకోండి. దీనిని ఇబ్నె జరీర్ తన ఖుర్ఆన్ వ్యఖ్యానం 13/475 నెంబరు 15912 లో ఉల్లేఖించారు. మరియు దీనిని ఇబ్నె బత్తాల్ సహీహ్ బుఖారీపై తన షరహ్ 4/13 లో ప్రస్తావించారు.
[160] బుఖారీ హదీసు నెంబరు 3370, బ్రాకెట్ల మధ్య ఉన్నది ముస్లిం వద్ద అబూహురైరా రజియల్లాహు అన్హు హదీసు నుండి హదీసు నెంబరు 405.