మానవులు చేసే పనులను (కర్మలను) వ్రాసిపెట్టే కొందరు దేవదూతలు కూడా ఉన్నారు.
وَإِنَّ عَلَيْكُمْ لَحَافِظِينَ كِرَامًا كَاتِبِينَ يَعْلَمُونَ مَا تَفْعَلُونَ
నిశ్చయంగా మీ పైన పర్యవేక్షకులు నియమితులై ఉన్నారు. (వారు మీ కర్మలను నమోదు చేసే) గౌరవనీయులైన లేఖకులు.మీరు చేసేదంతా వారికి తెలుసు సుమా! (అల్-ఇన్ఫితార్ 82:10-12)
مَّا يَلْفِظُ مِن قَوْلٍ إِلَّا لَدَيْهِ رَقِيبٌ عَتِيدٌ
(మనిషి) నోట ఒక మాట వెలువడటమే ఆలస్యం, అతని దగ్గర ఒక పర్యవేక్షకుడు (దాన్ని నమోదు చేయడానికి) సిద్ధంగా ఉంటాడు. (ఖాఫ్ 50:18)
ఇమామ్ అహ్మద్ (రహిమహుల్లాహ్) అనారోగ్యంతో ఉన్నప్పుడు ఇమామ్ అహ్మద్ గారి శిష్యులలో ఒకరు అతన్నిపరామర్శించడానికి వెళ్ళారు. అనారోగ్యం కారణంగా ఇమామ్ అహ్మద్ బాధతో మూలుగుతుండటాన్ని ఆయన గమనించారు. అప్పుడు ఆ శిష్యుడు ఇలా అన్నారు:
“ఓ అబూ అబ్దుల్లాహ్! మీరు మూలుగుతున్నారా? తావూస్ (Tawus) ఇలా అన్నారు: ‘నిశ్చయంగా దేవదూతలు ప్రతి ఒక్కదానిని వ్రాస్తారు, చివరకు రోగి చేసే మూలుగును కూడా. ఎందుకంటే అల్లాహ్ ఇలా అంటున్నాడు: “(మనిషి) నోట ఒక మాట వెలువడటమే ఆలస్యం, అతని దగ్గర ఒక పర్యవేక్షకుడు (దాన్ని నమోదు చేయడానికి) సిద్ధంగా ఉంటాడు“. (ఖాఫ్ 50:18)’”
అందువల్ల, అబూ అబ్దుల్లాహ్ (ఇమామ్ అహ్మద్) మరింత ఓపిక వహించడం మొదలుపెట్టారు మరియు ఆయన మూలగడం మానేశారు [1], ఎందుకంటే ప్రతిదీ వ్రాయబడుతోంది. “అతడు ఏ మాట పలికినా” – అంటే మీరు మాట్లాడే ఏ మాట అయినా వ్రాయబడుతుంది. అయితే, దానికి మీకు పుణ్యం లభించవచ్చు లేదా శిక్ష పడవచ్చు. ఇది పైన చెప్పబడిన విషయంపై ఆధారపడి ఉంటుంది.
[1] సాలిహ్ బిన్ అల్-ఇమామ్ అహ్మద్ ద్వారా నివేదించబడినది, ఆయన ఇలా అన్నారు: “మా నాన్నగారు మరణించడానికి ముందు అనారోగ్యంతో ఉన్నప్పుడు ఇలా అన్నారు: ‘అబ్దుల్లా బిన్ ఇద్రీస్ పుస్తకాన్ని బయటకు తీయి.’ తరువాత ఇలా అన్నారు: ‘అనారోగ్య సమయంలో మూలగడం తావూస్ కు ఇష్టం ఉండేది కాదు అనే లైత్ (Laith) గారి ఉల్లేఖనను నాకు చదివి వినిపించు.’ ఆ తర్వాత ఆయన మరణించే వరకు మా నాన్నగారి నుండి నేను ఎటువంటి మూలుగు వినలేదు.” – సియర్ ఆలామ్ అన్-నుబలా (11:215).
మూలం: అల్-అఖీదా అల్-వాసితియ్య (2 వాల్యూమ్ సెట్) – రచయిత: ముహమ్మద్ బిన్ సాలిహ్ అల్-ఉతైమీన్ – ప్రచురణకర్త: దారుస్సలాం పబ్లిషర్స్ & డిస్ట్రిబ్యూటర్స్.
Source: క్రింది ఇంగ్లీష్ ఆర్టికల్ నుండి తెలుగులోకి అనువదించబడింది
O Abu ‘Abdullah! Are you groaning?
https://abdurrahman.org/2014/11/23/o-abu-abdullah-are-you-groaning/
—
దైవ దూతలు (ملائِكة) – Main page:
https://teluguislam.net/angels/