ఖతీబ్: మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ, జుబైల్, సౌదీ ఆరేబియ
అనువాదం:అబ్దుల్ మాబూద్ జామయీ
‘ఇస్లామీయ జుమా ప్రసంగాలు’ అనే పుస్తకం నుండి
అంశము: ఇస్లాం నుంచి బహిష్కరించే 3వ విషయము: ఇతరుల పద్దతి ప్రవక్త ﷺ పద్ధతి కన్నా ఉత్తమమైనదిగా భావించడం
అంశము : మూడవ బహిష్కరణ
ఎవరైతే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి పద్ధతి కాకుండా వేరే వాళ్ళ పద్ధతి ప్రవక్త పద్ధతి కన్నా ఉత్తమమైనదిగా భావిస్తే అతను కుఫ్ర్ కు (అవిశ్వాసానికి) పాల్పడినట్టే. ఇదే విధంగా ఏ వ్యక్తి అయితే అల్లాహ్ ఆజ్ఞ, తీర్పు కాకుండా వేరే వాళ్ళ ఆజ్ఞ, తీర్పు ఉత్తమమైనది అని భావిస్తే అతను కూడా అవిశ్వాసి అయినట్టే (ఎలాగంటే కొందరు మిధ్య దైవాల నిర్ణయాలను మరియు సొంతగా సృష్టించుకున్న చట్టాలను అల్లాహ్ తీర్మానం, ఆజ్ఞ కన్నా ఉత్తమంగా భావిస్తున్నారు)
ప్రధమ ఖుత్బా:
إنَّ الْحَمْدَ لِلَّهِ، نَحْمَدُهُ وَنَسْتَعِينُهُ وَنَسْتَغْفِرُهُ، وَنَعُوذُ بِاللَّهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وسَيِّئَاتِ أَعْمَالِنَا، مَنْ يَهْدِهِ اللَّهُ فَلَا مُضِلَّ لَهُ، وَمَنْ يُضْلِلْ فَلَا هَادِيَ لَهُ، وَأَشْهَدُ أَنْ لَا إلـٰه إِلَّا اللَّهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ.
స్తోత్రాలు,మరియు దరూద్ తరువాత :
ప్రవక్త గారి పద్ధతి అందరికన్నా గొప్పది మరియు సంపూర్ణమైనది
అల్లాహ్ దాసులారా! అల్లాహ్ భీతి కలిగి ఉండండి, ఆయనను గౌరవించండి, ఆయన ఆజ్ఞ పాలన చేయండి, ఆయన ఆజ్ఞను తిరస్కరించకండి. ఇంకా గుర్తుంచుకోండి! ముహమ్మద్ రసూల్ (ముహమ్మద్ వారిని ప్రవక్త గా స్వీకరిస్తున్నాను) అనే ఈ ప్రవచనానికి సాక్ష్యం ఇవ్వటం అంటే ప్రవక్త వారి పద్ధతి అన్ని పద్దతులలో కెల్లా ఉత్తమైనది, అన్నిటికల్లా సంపూర్ణమైనది అని ప్రకటించడం. ఏ పద్ధతినైతే ప్రవక్త వారు అఖీదాలో (విశ్వాసాలలో), ఆరాధనలలో, వ్యవహారాలలో, నైతికతల్లో, నిర్ణయాల్లో, రాజకీయాల్లో ప్రతి దాంట్లో ఆచరించి చూపించారో, దీని ప్రస్తావన ఖురాన్ మరియు ప్రామాణికమైన హదీసుల ద్వారా వివరించబడినదో.
అల్లాహ్ దాసులారా! ప్రవక్త గారి పద్ధతి అన్నిట్లో కల్లా ఉత్తమమైనది. ఎందుకంటే ఇది ప్రవక్త వారు అల్లాహ్ తరపు నుంచి పొందిన పద్ధతి. ప్రవక్త గారి ఈ పద్ధతి జీవితం యొక్క ప్రతి రంగంలో ఆవరించి ఉన్నది. ఆరాధనల్లో, నైతికతల్లో, రాజకీయంగా, నిర్ణయాలు తీసుకునే విషయంలో, సామాజికంగా, విద్యాపరంగా, మొదలైనవి ప్రతి రంగము ఇందులో భాగమే. ప్రవక్త గారి పద్ధతే ఉత్తమైనది అనడానికి అల్లాహ్ చెప్పిన ఈ మాట ఆధారము:
لَّقَدْ كَانَ لَكُمْ فِي رَسُولِ اللَّهِ أُسْوَةٌ حَسَنَ
నిశ్చయంగా దైవప్రవక్తలో మీ కొరకు అత్యుత్తమ ఆదర్శం ఉంది. (33: 21)
ప్రవక్త వారు తమ ప్రసంగంలో ఇలా ప్రవచించేవారు:
(అన్నిటికన్నా ఉత్తమమైన మాట అల్లాహ్ గ్రంధం మరియు ఉత్తమైన పద్ధతి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిది)
అఖీదా విషయంలో అన్నిటికన్నా ఉత్తమమైన విధానం ప్రవక్త వారిది
అల్లాహ్ దాసులారా! మహా ప్రవక్త వారి జీవిత చరిత్రను పరిశీలించిన తర్వాత అర్థమవుతున్న విషయం ఏమిటంటే: ప్రవక్త గారి విధానమే అన్నిటికన్నా ఉత్తమైనది, ఎందుకంటే అఖిదా (విశ్వాస) రంగంలో ప్రవక్త గారు బోధించిన అధ్యాయాలు మరియు సమస్యలు ఉన్నాయో , అవి అల్లాహ్ పట్ల విశ్వాసము, దైవదూతల పట్ల, గ్రంథాల పట్ల, ప్రవక్తల పట్ల, మరణాంతర జీవితం మరియు తలరాత విషయంలో మానవ జీవితానికి అవసరం ఉన్న అన్ని విషయాలు బోధించబడ్డాయి. ఈ విశ్వాసము గతించిన ప్రవక్తల విశ్వాసాన్ని సమర్థిస్తుంది మరియు అందులో మార్పులు చేర్పులు చేయకుండా నివారిస్తుంది.
ఆరాధన విషయంలో ప్రవక్త గారి పద్ధతే అత్యుత్తమైనది
ఆరాధన విషయంలో ప్రవక్త వారి పద్ధతి అతి ఉత్తమమైనది. ఇందులో ఎటువంటి హెచ్చు తేగ్గులు లేవు, ఇందులో సన్యాసత్వం లేదు, ఇందులొ సోమరితనం లేదు. దైవప్రవక్త సల్లలాహు అలైహి వ సల్లం వారు ఇలా అన్నారు : “నిస్సందేహంగా ఇస్లాం ధర్మం చాలా సులువైనది మరి ఎవరైతే ఈ ధర్మంలో కాఠిన్యతను ప్రదర్శిస్తాడో ధర్మం అతనిపై ఆవరిస్తుంది, అందువలనే మధ్యమార్గాన్ని అవలంబించాలి మరియు అందులోనే సంతోషంగా ఉండండి”. (సహీహ్ బుఖారి / అబూ హురైరా వారి ఉల్లేఖనం)
దైవ ప్రవక్త వారు ఆరాధనలో అలసిపోయిన తమ యొక్క సహచరున్ని ఇలా అన్నారు: నీ శరీరం పై కూడా నీ హక్కు ఉన్నది, మరొక సహచరుడు నేను మాంసం తినను అని , మరొకరు నేను స్త్రీల నుంచి దూరంగా ఉంటానని ఇక పెళ్లి చేసుకోను అన్నప్పుడు, మూడో వ్యక్తి నేను ఎల్లప్పుడు ఉపవాసాలు పాటిస్తూనే ఉంటాను, మరొకరు నేను రాత్రంతా నమాజులు చదువుతూనే ఉంటాను, నిద్రపోను అని చెప్తే వాళ్ళని ఉద్దేశించి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు “నేను ఉపవాసం పాటిస్తాను మరి మానేస్తాను కూడా, నేను రాత్రిపూట నమాజ్ కూడా చదువుతాను మరియు నిద్రపోతాను, నేను వివాహం కూడా చేసుకుంటాను, మరియు ఏ వ్యక్తి అయితే నా సున్నత్ కి , పద్ధతి , (సాంప్రదాయానికి ) విముఖుత చూపుతాడో అతను మాలో నుంచి కాడు అన్నారు“. (ఈ హదీసును ఇమామ్ బుఖారి మరియు ముస్లిం వారు ఇదే పదాలతో అనస్ బిన్ మాలిక్ నుంచి ఉల్లేఖించారు)
నైతికత అధ్యాయంలో ప్రవక్త వారి పద్ధతి అతి ఉత్తమమైనది
నైతికత అధ్యాయంలో మనం చూస్తే దైవ ప్రవక్త నైతికతలో సంపూర్ణమైన వారు. ఇందులో ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అల్లాహ్ యే ప్రవక్త క్రమశిక్షణ, విద్య బోధన బాధ్యతను తీసుకున్నాడు కాబట్టి. కనుక అల్లాహ్ యే స్వయంగా ప్రవక్త యొక్క అత్యున్నతమైన నైతికతల గురించి వివరించారు. అల్లాహ్ ఇలా అన్నారు:
(وإنك لعلى خلق عظيم )
ఇంకా, నీవు నైతికంగా అత్యున్నత స్థానంలో ఉన్నావు.(68:4)
ఇంటి వాళ్ళ పట్ల, అనుయాయుల పట్ల , ఇరుగుపొరుగు వాళ్ళ పట్ల ప్రవక్త గారి వ్యవహారం ఎలా ఉండేదో దానిని గమనిస్తే ప్రవక్త గారి నైతికత మనకు అర్థమవుతుంది. ప్రవక్త ఎల్లప్పుడూ చిరునవ్వుతో కలిసేవారు, క్షమాపణ మరియు దయతో మెలిగేవారు, చివరికి ప్రవక్త కు మాంసంలో విషం కలిపి ఇచ్చిన యూద స్త్రీని కూడా క్షమించేశారు, ఆ విషం ప్రభావము భరించారు. ప్రజల పట్ల దయతో మెలిగారు, చివరికి యుద్ధ సందర్భంలో కూడా శత్రువుల పట్ల దయ చూపారు, ఎవరైతే యుద్ధంలో పాల్గొనలేదో అతనిని చంపమాకండి అని ఆదేశించేవారు, వృద్ధులు، స్త్రీలు, పిల్లలు, మరియు ధన దోపిడి నుంచి، నమ్మక ద్రోహాన్ని నిషేధించేవారు (యుద్ధ ధనం పంచక ముందు చెప్పకుండా తీసుకోవడాన్ని నిషేధించేవారు, అల్లాహ్ ఆజ్ఞతో ప్రవక్త యే పంచేవారు) మరియు శవాల కాళ్లు చేతులు, చెవి కోసి ప్రతి కారం తీసుకోవడాన్ని చేయటాన్ని నిషేధించేవారు. వాగ్దాన భంగం చేయటాన్ని, మోసం చేయటాన్ని నిషేధించేవారు. ఖైదీలను ఎటువంటి పరిహారం లేకుండా విడుదల చేసేవారు. ఆ ఖైదీలలో కొందరిని ప్రతికారం రీత్యా కొందరిని చంపేస్తే మరికొందరిని పరిహారం లేకుండా విడుదల చేసేవారు, మరికొందరిని విశ్వాసులను పరిహారం లేకుండా విడుదల చేసినందుకు విడుదల చేసేవారు, ఇదంతా ప్రవక్త కొన్ని కారణాలు సందర్భాలు వల్ల చేసేవారు.
అల్లాహ్ దాసులారా! మహా ప్రవక్త వారి ఉత్తమమైన నైతికతల గురించి తౌరాత్ మరియు ఇంజిల్ గ్రంథాలలో కూడా ప్రస్తావన ఉన్నది .
అతా బిన్ యసార్ ఉల్లేఖనం: నేను అబ్దుల్లాహ్ బిన్ అమర్ ను కలిసి ఇలా అడిగాను: దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గురించి తౌరాత్లో ఏమి వివరించబడిందో నాకు చెప్పండి అని ప్రశ్నించగా, దానికి ఆయన ఇలా జవాబు ఇచ్చారు. “ఆయన గురించి ఖురాన్ లో ప్రస్తావించబడిన కొన్ని గుణగణాల వివరణ తౌరాత్లో కూడా ఉన్నాయి, “నిశ్చయంగా మేము నిన్ను మానవజాతి పై సాక్షిగా పంపాము. మరియు శుభవార్తలు ఇచ్చే వానిగా ఇతరులను హెచ్చరించే వానిగా , సామాన్యుల సంరక్షకునిగా చేసి పంపాను. మరియు నీవు నా దాసుడివి మరియు సందేశహరుడువి; నేను నిన్ను ముతవక్కిల్(నమ్మదగినవాడు) అని పిలుస్తాను, నీవు దుష్ట స్వభావం కలిగిన వాడివి కాదు, చెడ్డవాడివి కాదు, నీవు రాతి మనసు కలిగిన వాడివి కూడా కావు, మరియు బజారులో కాలక్షేపం చేసే వాడివి కూడా కావు, నీవు అపకారానికి బదులు అపకారం చేయవు, కానీ క్షమిస్తావు మరియు మన్నిస్తావు. అల్లాహ్ నీ ద్వారా తలబిరుసుతనం వహించే ఓ జాతికి సన్మార్గం చూపిస్తాడు, చివరికి వాళ్ళు “లా ఇలాహ ఇల్లల్లాహ్” పలికే వరకు మరియు వారు సత్యాన్ని స్పష్టంగా చూడనంతవరకు, వినే వరకు, వాళ్ల హృదయాలు గమనించినంతవరకు నేను అతనికి మరణాన్ని ప్రసాదించను”.(సహీహ్ బుఖారి )
వ్యవహారాల అధ్యాయంలో కూడా ప్రవక్త గారి పద్ధతి ఉత్తమమైనది
వ్యాపార వ్యవహారాల విషయంలో కూడా ప్రవక్త గారి పద్ధతి ప్రతి రంగంలోనూ ఆవరించి ఉన్నది. ఉదాహరణకు వ్యాపార లావాదేవీల విషయము, వేతన విషయము, న్యాయవాదన విషయము, అప్పు తీసుకోవడం, ఇవ్వటం మొదలైనవి. అదేవిధంగా మీ జీవితము, వ్యాపార రంగంలో ఉన్న అన్ని కోణాలను వివరిస్తుంది. మరియు ఆర్థికంగా నష్టాలను వాటిల్లే విషయాలను కూడా వివరిస్తుంది, ఉదాహరణకు వడ్డీ, మోసము, లంచము మొదలైనవి. ఇబ్నుల్ ఖైయ్యిం రహిమహుల్లాహ్ తమ పుస్తకము జాదుల్ మఆద్ లో దాదాపు 80 పేజీలలో ప్రవక్త గారి వ్యాపార నియమ నిబంధనలను పూర్తిగా వివరించారు.
రాజకీయ అధ్యాయంలో కూడా ప్రవక్త గారి పద్ధతి అతి ఉత్తమమైనది
రాజకీయపరంగా కూడా ప్రవక్త గారి పద్ధతి అతి ఉత్తమమైనది, సంపూర్ణమైనది. ధార్మిక విషయాలలో నిజాయితీగల వ్యక్తులతో మషూరా (సంప్రదింపులు) చేసేవారు, మరి కొన్ని సందర్భాల్లో తమ భార్యలతో కూడా మషూరా చేసేవారు, ఎలాగైతే బద్ర్, ఖందఖ్, హుదైబియా సందర్భాలలో చేశారో. ఈ మషూరాలు సరైన నిర్ణయం తీసుకునే దానికి తోడ్పడేవి, మరియు విజయం ప్రాప్తమయ్యేది, అవిశ్వాసులతో శాంతి ఒప్పందం చేసుకునేవారు, వాళ్ళ రాయబారుల పట్ల దయతో, ఉత్తమ రీతిలో మెలిగేవారు, ప్రవక్త వద్దకు వచ్చే అవిశ్వాసులకు పూర్తిగా శాంతిని కల్పించేవారు, తీరా వాళ్ళు తమ గమ్యానికి, నివాసానికి చేరేవారు, వాళ్లతో చేసిన వాగ్దానాలు , హామీలను నెరవేర్చేవారు, ప్రవక్త వాగ్దాన భంగం చేయరు, మోసం చేయరు అన్న విషయంలో ప్రఖ్యాతి పొంది ఉన్నారు, అవిశ్వాసులు ప్రవక్త పట్ల ద్రోహం చేసినప్పటికీ ప్రవక్త అలా చేసేవారు కారు, యుద్ధ రంగంలో దౌర్జన్యానికి పాల్పడే వాళ్ళని కూడా క్షమించి వదిలేవారు, మక్కా విజయం సందర్భంలో ప్రవక్త మక్కా వాసులపై అధికారం పొందారు, ఎవరైతే ప్రవక్త తో యుద్ధాలు చేశారో, ప్రవక్తను సహాబాలను చిత్రహింసలు పెట్టారో , మక్కా నుంచి వారిని వెళ్లగొట్టారో అలాంటి వాళ్ళందరినీ ఆ రోజు ప్రవక్త క్షమించి వదిలేసారు, తలచుకుంటే పూర్తి ప్రతీకారం తీర్చుకునే అధికారం ప్రవక్త కు ఉన్నది, ప్రవక్త ని నిందించే, ప్రశ్నించే వాడు కూడా లేడు.
తీర్పు ఇవ్వటము, నిర్ణయం తీసుకునే అధ్యాయంలో కూడా ప్రవక్త గారి పద్ధతి ఉత్తమమైనది.
తీర్పు ఇవ్వటము నిర్ణయం తీసుకునే విషయంలో ప్రవక్త గారి పద్ధతి అతి ఉత్తమమైనది, న్యాయపూరితమైనది, సంపూర్ణమైనది, ఇబ్నుల్ ఖయ్యిమ్ (రహిమహుల్లాహ్) తమ పుస్తకము “జాదుల్ మఆద్ ” లో దాదాపు ఐదు వందల (500) పేజీలలో అనేక అధ్యాయాలు నిర్మించి ప్రవక్త గారి తీర్మా , నిర్ణయాల పద్ధతులను వివరించారు.
వైద్య (చికిత్స) అధ్యాయములో కూడా ప్రవక్త గారి పద్ధతి అతి ఉత్తమమైనది
వైద్య అధ్యాయంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పద్ధతి అతి ఉత్తమమైనది, సంపూర్ణమైనది కూడా. ఇబ్నుల్ ఖయ్యిమ్ (రహిమహుల్లాహ్) తమ పుస్తకం ” జాదుల్ మఆద్” లో దాదాపు నాలుగు వందల (400) పేజీలలో ప్రవక్త వారు బోధించిన శరీర, గుండె వ్యాధులకు సంబంధించి చికిత్స మరియు దాని విధానాన్ని వివరించారు.
అల్లాహ్ దాసులారా! జ్ఞానం కలిగిన అనేక అవిశ్వాసులు ప్రవక్త గారి ఈ పద్ధతి గురించి సాక్ష్యం ఇచ్చారు, ఇది అతి ఉత్తమమైన పద్ధతి అని మరియు అనేకులు ఇస్లాం స్వీకరించారు ఎందుకంటే వాళ్లు సత్యాన్ని గ్రహించారు ఇలాంటి క్లుప్తమైన ఉత్తమమైన పద్ధతి ఒక మానవుడు తమ తరఫునుంచి బోధించలేడు కానీ ప్రవక్త తప్ప, ఆయనకి అల్లాహ్ తరఫునుంచి సహాయం అందుతుంది.
అల్లాహ్ దాసులారా! ప్రవక్త గారి పద్ధతి అతి ఉత్తమమైన పద్ధతి, ఉత్తమమైన ఆదర్శము ,సంపూర్ణమైన విధానము తెలుసుకోవడానికి ఇది లాభకరమైన సందర్భం. ఎవరైతే దీనిని అర్థం చేసుకుంటాడో అతని ముందు ప్రవక్త గారి పై ప్రేమ, ప్రవక్త గారి విధానాన్ని అనుసరించే , కాపాడే ద్వారాలు, మార్గాలు, తెరుచుకుంటాయి.
అల్లాహ్ నా పై మరియు మీ పై ఖుర్:ఆన్ యొక్క శుభాలను అనుగ్రహించు గాక, మనందరికీ వివేకంతో, హితోపదేశంతో కూడిన ఖురాన్ వాక్యాల నుంచి లాభం చేకూర్చు గాక, నేను ఇంతటితో నా మాటను ముగిస్తూ అల్లాహ్ తో మనందరి క్షమాపణ కొరకు ప్రార్థిస్తున్నాను, మరియు మీరు కూడా అల్లాహ్ తో క్షమాపణ కోరండి, నిస్సందేహంగా ఆయన క్షమించేవాడు మరియు అమిత దయామయుడు.
రెండవ ఖుత్బా:
స్తోత్రాలు మరియు దరూద్ తరువాత :
ప్రవక్త గారి పద్ధతి ప్రతి కాలము , ప్రతి చోట అనుకూలమైనది, తగినది
అల్లాహ్ దాసులారా! అల్లాహ్ భీతి కలిగి ఉండండి. మరి గుర్తుంచుకోండి: ప్రవక్త గారి పద్ధతి ప్రతి కాలము, ప్రతి చోట అనుకూలమైనది తగినది. అది ఒక దృఢమైన వ్యవస్థ, అందులో ఎటువంటి మార్పు రాదు, ఎందుకంటే అది అల్లాహ్ తరపున అవతరింపబడే దైవవాణి పై ఆధారపడి ఉన్నది, ఆ అల్లాహ్ కూడా తమ జ్ఞానములో, వివేకములో, కారుణ్యంలో సంపూర్ణమైన వాడు. ప్రజల కొరకు మేలు ప్రసాదించే విషయంలో సంపూర్ణమైన వాడు. ఆ పద్ధతినే ప్రవక్త దైవవాణి ద్వారా ప్రజలకు చేరవేశారు, ఇదే అల్లాహ్ సవ్యమైన మార్గంము మరియు మితవాద మతం (మధ్యగల) ధర్మము, ఈ ధర్మాన్నే అల్లాహ్ ప్రజల కొరకు ఇష్టపడ్డాడు, ఎన్నుకున్నాడు. ఇది తప్ప మరో ధర్మాన్ని ఇష్టపడలేదు, స్వీకరించడు.
ఎవరైతే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి పద్ధతి కాకుండా వేరే వాళ్ళ పద్ధతి ప్రవక్త పద్ధతి కన్నా ఉత్తమమైనదిగా భావిస్తే అతను కుఫ్ర్ కు పాల్పడినట్టే, ఇదేవిధంగా ఏ వ్యక్తి అయితే అల్లాహ్ ఆజ్ఞ, తీర్పు కాకుండా వేరే వాళ్ళ ఆజ్ఞ, తీర్పు ఉత్తమమైనది అని భావిస్తే అతను కూడా అవిశ్వాసి అయినట్టే (ఎలాగంటే కొందరు మిధ్య దైవాల నిర్ణయాలను మరియు సొంతగా సృష్టించుకున్న చట్టాలను అల్లాహ్ తీర్మానం, ఆజ్ఞ కన్నా ఉత్తమంగా భావిస్తున్నారు)
ఇప్పుడు దాకా వివరించబడిన వివరణ ప్రకారం ఏ వ్యక్తి అయితే ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి పద్ధతి కాకుండా వేరే వాళ్ళ పద్ధతి ఉత్తమమైనది అని భావిస్తే, ప్రకటిస్తే అతను అవిశ్వాసానికి (కుఫ్ర్ కి) పాల్పడినట్టే. ఎందుకంటే ఇలాంటి వ్యక్తి అల్లాహ్ ధర్మాన్ని, షరియత్ని అవమానించినట్టే. ఉదాహరణకు ఒక వ్యక్తి సెక్యులరిజం, లేబరిజం, ప్రజాస్వామ్యం లాంటి సృష్టించిన నియమాలను జీవిత విధానం కొరకు ఇస్లాం ధర్మం కన్నా ఉత్తమైనదిగా అని ప్రాధాన్యత ఇస్తే , లేదా మానవుడు సృష్టించిన నియమాలు షరియత్ కన్నా ఉత్తమైనది అని భావించినా ,విశ్వసించినా, లేదా 20 శతాబ్దంలో ఇస్లామీయ నియమాలు, వ్యవస్థ అనవసరము, తగినది కాదు అని నమ్మినా, లేదా ఇస్లామీయ వ్యవస్థ వెనకబడడానికి కారణమని భావిస్తున్న, లేదా ఇస్లామీయ వ్యవస్థను దాసుడు మరియు దైవానికి సంబంధించిన వ్యవస్థ అని జీవిత యొక్క అనేక కోణాల నుంచి ఇస్లామియా షరియత్ ను తొలగించినా, లేదా దొంగ చేసిన వ్యక్తి ఒక చేతులు నరకటం, పెళ్లయిన వివాహితుడు వ్యభిచారినీ సంగ్సార్( రాళ్లతో కొట్టి చంపటం) ఇవన్నీ ప్రస్తుత కాలానికి సరైనది కాదు అని భావించటం, లేదా వ్యవహారాలలో మరియు శిక్షలు విధించే విషయంలో ఇస్లామియా ధర్మ ప్రకారం కాకుండా వేరే చట్ట ప్రకారం నిర్ణయాలు తీసుకోవచ్చు అని నమ్మకం కలిగి ఉన్న ఇలాంటి వ్యక్తి కుఫ్ర్ కి పాల్పడినట్టే (అవిశ్వాసి అయినట్టే). ఎందుకంటే ఈ ఉద్దేశం వలన అతను దైవ నిర్ణయాలు కన్నా దాసుల నిర్ణయాలు మిన్న అని ప్రాధాన్య ఇచ్చాడు మరియు అజ్ఞానమైన నిర్ణయాలను అంగీకరించాడు. ఇంకా అతను దైవేతరలను, వాళ్ల నిర్ణయాలను అల్లాహ్ మరియు ప్రవక్త నిర్ణయాల కన్నా ఉత్తమైనదిగా అంగీకరించాడు. ఇంకా ఏ విధంగా అయితే అల్లాహ్ తాగూత్ ని నిరాకరించి దానినీ కుఫ్ర్ (అవిశ్వాసం) అని ఆదేశించాడో అతను ప్రకారంగా ఆచరణ చేయట్లేదు:
فَمَن يَكْفُرْ بِالطَّاغُوتِ وَيُؤْمِن بِاللَّهِ فَقَدِ اسْتَمْسَكَ بِالْعُرْوَةِ الْوُثْقَىٰ لَا انفِصَامَ لَهَا
కనుక ఎవరయితే అల్లాహ్ తప్ప వేరితర ఆరాధ్యులను (తాగూత్‌ను) తిరస్కరించి అల్లాహ్‌ను మాత్రమే విశ్వసిస్తారో వారు దృఢమైన కడియాన్ని పట్టుకున్నారు. అది ఎన్నటికీ తెగదు. (2:256)
ఇంకా ఎవరైతే అల్లాహ్ హరాంగా చేసిన (నిషేధించిన) వాటిని హలాల్ చేసుకుంటాడో అతను అల్లాహ్ తో శత్రుత్వం పెట్టుకున్నటే, మరి అతను కాఫిర్ అయినట్టే (మజ్మూ ఫతావ/ ఇబ్నే బాజ్)
అల్లాహ్ దాసులారా! ఎవరైతే ప్రవక్తకు విధేయత చూపడో మరియు మీ నిర్ణయాల నుంచి విముఖత పాల్పడుతాడో అతను కపటుడు, విశ్వాసి కాదు, అల్లాహ్ ఆజ్ఞ ఎలా ఉన్నది:
(وإذا دعوا إلى الله ورسوله ليحكم بينهم رأيت المنافقين يصدون عنك صدودا)
”అల్లాహ్ అవతరింపజేసిన దాని వైపుకు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వైపుకు రండి” అని వారితో అన్నప్పుడల్లా, ఈ కపటులు నీ నుండి అయిష్టంగా ముఖం త్రిప్పుకుని పోవటాన్ని నీవు గమనిస్తావు”.(4: 61)
ఇబ్నే తైమియహ్ (రహిమహుల్లాహ్) అంటున్నారు: ఏ వ్యక్తి అయితే ప్రవక్త విధేయత నుంచి విముఖత చూపుతాడో, మీ నిర్ణయాన్ని స్వీకరించడో అతను కపటుడు. విశ్వాసి కాలేడు అని అల్లాహ్ స్పష్టం చేసేసారు. విశ్వాసులంటేనే “మేము విన్నాము, ఆచరించాము” అనే స్వభావం కలిగి ఉంటారు. ప్రవక్త వారి నిర్ణయాన్ని నిరాకరించి వేరే వాళ్ళ నిర్ణయాలను, పద్ధతిని స్వీకరించడం వలన, కోరడం వలన విశ్వాసం వృధా అయిపోయింది మరియు కపటం స్పష్టమవుతుంది ( అస్ సారిముల్ మస్లూల్/పేజీ38).
ప్రసంగం ముగింపు
అల్లాహ్ ప్రజలందరికీ తౌహీద్ పై జీవితాంతం స్థిరంగా ఉండే భాగ్యాన్ని ప్రసాదించుగాక, ఎందుకంటే ఏ వ్యక్తి అయితే షరియత్ ప్రకారం జీవితాన్ని గడుపుతాడో, స్థిరంగా ఉంటాడో అతనికి తౌహీద్ పైనే మరణం లభిస్తుంది. అలాంటి వ్యక్తి ఎటువంటి ప్రశ్నోత్తరాలు లెక్క లేకుండా స్వర్గంలో ప్రవేశిస్తాడు .
మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, అల్లాహ్ మీకు ఒక గొప్ప విషయం గురించి తెలియచేశాడు. అల్లాహ్ ఆదేశం:
(إن اللَّهَ وَمَلَائِكَتَهُ يُصَلُّونَ عَلَى النَّبِيِّ يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا صَلُّوا عَلَيْهِ وَسَلِّمُوا تسليما)
నిశ్చయంగా అల్లాహ్, ఆయన దూతలు కూడా దైవప్రవక్తపై కారుణ్యాన్ని పంపిస్తున్నారు. ఓ విశ్వాసులారా! మీరు కూడా అతనిపై దరూద్ పంపండి. అత్యధికంగా అతనికి ‘సలాములు’ పంపుతూ ఉండండి. (33: 56)
اللهم صل وسلم على عبدك ورسولك محمد، وارض عن أصحابه الخلفاء، الأئمة الحنفاء، وارض عن التابعين ومن تبعهم بإحسان إلى يوم الدين.
ఓ అల్లాహ్ మాకు ప్రపంచంలో మేలును, పుణ్యాన్ని పరలోకంలో సాఫల్యాన్ని ప్రసాదించు, మరియు నరక శిక్షల నుండి మమ్ములను కాపాడు.
للهم صل على نبينا محمد وآله وصحبه وسلِّم تسليما كثيرا
—
రచన: మాజిద్ బిన్ సులేమాన్ అర్రస్సి
జుబైల్ పట్టణం సౌదీ అరేబియా
అనువాదం : అబ్దుల్ మాబూద్ జామయీ
పుస్తకం నుండి – ఇస్లామీయ జుమా ప్రసంగాలు – షేఖ్ మాజిద్ బిన్ సులైమాన్