https://youtu.be/sPhvRWKKhMY [19 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
10-దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రవచించారని హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) తెలిపారు:
“మనిషి సామూహికంగా చేసే నమాజు అతను తన ఇంట్లో లేక బజారులో చేసే నమాజుకన్నా ఇరవై రెట్లకు పైగా ఘనమైనది. ఎందుకంటే ఒక వ్యక్తి చక్కగా వుజూ చేసుకుంటాడు, తరువాత నమాజు కోసం మస్జిద్ కు వస్తాడు. నమాజు మాత్రమే అతణ్ణి మస్జిద్కు తీసుకువస్తే – అలాంటి వ్యక్తి మస్జిద్ చేరుకునేంత వరకూ అతను వేసే ఒక్కో అడుగుకు బదులుగా అతని ఒక్కో అంతస్తు పెరుగుతూ ఉంటుంది. అతని వల్ల జరిగిన ఒక్కో పాపం తొలగించబడుతూ ఉంటుంది. ఆ తరువాత మస్జిద్లో ప్రవేశించిన పిదప నమాజు అతన్ని ఆపివుంచినంతసేపూ అతను నమాజు చేస్తున్నట్టుగానే పరిగణించ బడతాడు. మీలో ఎవడైనా నమాజు చేసిన స్థానంలో కూర్చొని ఉన్నంత వరకూ దైవదూతలు అతనిపై అల్లాహ్ కారుణ్యం కురవాలని వేడుకుంటూనే ఉంటారు. ఆ వ్యక్తి పరులకు హాని కలిగించనంతవరకు, అతని వుజూ భంగం కానంతవరకు దైవదూతలు “ఓ అల్లాహ్! ఈ వ్యక్తిని కరుణించు. ఓ అల్లాహ్! ఇతన్ని మన్నించు. ఓ అల్లాహ్! ఇతన్ని కనిపెట్టుకుని ఉండు ‘ అని విన్నవించుకుంటూ ఉంటారు”
(బుఖారీ – ముస్లిం). హదీసు వాక్యాలు మాత్రం ముస్లింలోనివి. హదీసులో వచ్చిన పదం “యన్హజుహూ” అంటే అతన్ని బయటికి తీసుకువస్తుంది లేక అతన్ని లేపుతుందని అర్థం.
రియాదుస్సాలిహీన్ (హదీసు కిరణాలు) – సంకల్ప శుద్ధి (ఇఖ్లాస్)
https://teluguislam.net/2019/10/19/ikhlas/