ఉదయం సాయంత్రం దుఆలు చదివే సరిఅయిన సమయం ఏమిటి? [వీడియో, టెక్స్ట్]

[0:39 నిముషాలు ]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

ఆ ఉదయ సమయంలో ఫజర్ నమాజ్ తర్వాత నుండి మొదలుకొని సూర్యోదయం వరకు చాలా మేలైన సమయం. ఏదైనా కారణంగా ఎవరైనా అప్పటివరకు చదవకుంటే జోహర్ కంటే ముందు వరకు కూడా చదవవచ్చు అని కొందరు ఉలమాల యొక్క ఫత్వాలు ఉన్నాయి. ఇక సాయంకాలపు దువాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సమయం అసర్ తర్వాత నుండి మొదలవుతుంది. వాటిలో కొన్ని దువాలు మగ్రిబ్ తర్వాత చదివేవి ఉన్నవి. ఎవరైనా ఇషా వరకు ఇషా తర్వాత చదివినా గాని అభ్యంతరం లేదు. కానీ ఉత్తమమైన సమయం ఫజర్ తర్వాత మరియు అసర్ తర్వాత మగ్రిబ్ సమయంలో.