
మొదటి ప్రశ్నకు సిలబస్ గా మీరు ఖుర్ఆనులోని ఈ క్రింది ఆయతులు, వాటి అనువాదం మరియు మీ వద్ద ఉన్న తఫ్సీర్ అహ్సనుల్ బయాన్ లో వ్యాఖ్యానం చదవండీ
9:36 إِنَّ عِدَّةَ الشُّهُورِ عِندَ اللَّهِ اثْنَا عَشَرَ شَهْرًا فِي كِتَابِ اللَّهِ يَوْمَ خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ مِنْهَا أَرْبَعَةٌ حُرُمٌ ۚ ذَٰلِكَ الدِّينُ الْقَيِّمُ ۚ فَلَا تَظْلِمُوا فِيهِنَّ أَنفُسَكُمْ ۚ وَقَاتِلُوا الْمُشْرِكِينَ كَافَّةً كَمَا يُقَاتِلُونَكُمْ كَافَّةً ۚ وَاعْلَمُوا أَنَّ اللَّهَ مَعَ الْمُتَّقِينَ
నిశ్చయంగా నెలల సంఖ్య అల్లాహ్ దగ్గర – అల్లాహ్ గ్రంథంలో పన్నెండు మాత్రమే. ఆయన ఆకాశాలను, భూమిని సృష్టించిన రోజునుంచీ (ఈ లెక్క ఇలాగే సాగుతున్నది). వాటిలో నాలుగు మాసాలు నిషిద్ధమైనవి (గౌరవప్రదమైనవి.) ఇదే సరైన ధర్మం. కాబట్టి ఈ మాసాలలో మీకు మీరు అన్యాయం చేసుకోకండి. ముష్రిక్కులు మీ అందరితో పోరాడుతున్నట్లే మీరు కూడా వారందరితో పోరాడండి. అల్లాహ్ భయభక్తులుగల వారికి తోడుగా ఉంటాడన్న సంగతిని తెలుసుకోండి.
9:37 إِنَّمَا النَّسِيءُ زِيَادَةٌ فِي الْكُفْرِ ۖ يُضَلُّ بِهِ الَّذِينَ كَفَرُوا يُحِلُّونَهُ عَامًا وَيُحَرِّمُونَهُ عَامًا لِّيُوَاطِئُوا عِدَّةَ مَا حَرَّمَ اللَّهُ فَيُحِلُّوا مَا حَرَّمَ اللَّهُ ۚ زُيِّنَ لَهُمْ سُوءُ أَعْمَالِهِمْ ۗ وَاللَّهُ لَا يَهْدِي الْقَوْمَ الْكَافِرِينَ
నెలలను ముందుకు, వెనక్కి మార్చటం ఓ అదనపు అవిశ్వాస చేష్ట. ఈ చేష్ట ద్వారా అవిశ్వాసులు మార్గభ్రష్టతలో పడవేయబడుతున్నారు. ఒక ఏడాది వారు దాన్ని ధర్మసమ్మతం చేసుకుని, మరో ఏడాది దాన్నే నిషిద్ధంగా ఖరారు చేసుకుంటారు. అల్లాహ్ నిషిద్ధ పరచిన మాసాల గణనలో సారూప్యం సాధించడానికి, అల్లాహ్ నిషేధించిన దానిని ధర్మసమ్మతం చేసుకోవటానికి (వారు ఇలా చేస్తారు). వారి దుష్టచేష్టలు వారికి అందమైనవిగా చూపబడ్డాయి. అవిశ్వాస జనులకు అల్లాహ్ సన్మార్గం చూపడు
ఇక్కడ ఆడియో వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి (8:41 నిముషాలు)
[1] గౌరవప్రదమైన – నిషిద్ద నెలలు ఎన్ని ,వాటిలో ఏమి చెయ్య కూడదు?
A) 1 – నిఖాలు చెయ్య కూడదు
B) 4 – అన్యాయం (ఆత్మ దౌర్జన్యం) చేసుకోకూడదు
C) 3 – ఏమీ చెయ్యకూడదు
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
తెలుగు ఇస్లామిక్ క్విజ్ (ఆడియో సిరీస్) మెయిన్ పేజీ :
https://teluguislam.net/others/telugu-islamic-quiz
You must be logged in to post a comment.