ఇక్కడ వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి (30 సెకండ్లు)
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
ఫజ్ర్ నమాజుకు ముందు రెండు రకాతులు:
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచించారని ఆయిషా (రజియల్లాహు అన్హా) ఉల్లేఖించారు:
عَنْ عَائِشَةَ، عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: رَكْعَتَا الْفَجْرِ خَيْرٌ مِنَ الدُّنْيَا وَمَا فِيهَا
“ఫజ్ర్కు ముందు రెండు రకాతులు ప్రపంచము మరియు అందులో ఉన్నవాటి కంటే ఉత్తమమైనవి”. (ముస్లిం 725).
నాతో పాటు మీరు కూడా ఈ హదీసుపై శ్రద్ధ చూపండి: ఫజ్ర్ సున్నతులు ప్రపంచం, వాటిపై ఉన్న డబ్బు, ధనము,బిల్జింగులు, కార్ల కంటే చాలా మేలైనవి.
నమాజు నిధులు (Treasures of Salah) అను పుస్తకం నుండి
ముస్లింలోని వేరొక ఉల్లేఖనంలో ఇలా ఉంది; “ఆ రెండు రకాతులు నాకు ప్రపంచమంతటి కన్నా ప్రియమైనవి.”
عَنْ عَائِشَةَ، عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، أَنَّهُ قَالَ فِي شَأْنِ الرَّكْعَتَيْنِ عِنْدَ طُلُوعِ الْفَجْرِ: «لَهُمَا أَحَبُّ إِلَيَّ مِنَ الدُّنْيَا جَمِيعًا» مسلم 725

You must be logged in to post a comment.