ఇస్లాం అంటే ఏమిటి? మనమెందుకు పుట్టించబడ్డాము? [వీడియో]

బిస్మిల్లాహ్

సంక్షిప్త రూపంలో ఇస్లాం పరిచయం తెలియజేయడంం జరిగింది. స్వయంగా లాభం పొంది ఇతరులకు లాభం చేకూర్చండి.

[సురక్షిత యూట్యూబ్ లింక్: https://safeYouTube.net/w/H83r]
[5 నిమిషాల వీడియో]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్) 
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia

ఇస్లాం అంటే ఏమిటో తెలుసుకోవాలంటే మరియు మీ ముస్లిమేతరుల ఫ్రెండ్స్ & బంధువులకు క్రింద ఇచ్చిన పుస్తకం చదవండి &చదివించండి :

ముందు మాట

మనిషి తను జీవిస్తున్న ఈ ధర్తి, సుందర విశాలమైన ఈ జగం, ఆశ్చర్యంలో పడవెసే నక్షత్రాలతో నిండియున్న ఆకాశం, అంతయూ పటిష్టమైన వ్యవస్థతో నడుస్తున్నదని ఆలోచిస్తాడు. భూమి, అందులో ఉన్న పర్వతాలు, లోయలు, సెలయెర్లు, చెట్లు, గాలి, నీరు, సముద్రం, ఎడారి మరియు రాత్రి పగలన్నిటిని చూసి వీటన్నిటిని సృష్టించినవాడెవడూ? అన ప్రశ్న తప్పకుండా తలెత్తుతుంది.

ఈ నీరు లేనిది జీవిత భావమే శూన్యం, దీనిని ఆకాశం నుండి కురిపించేదెవరు? దాని ద్వారా పంటలు, చెట్లు, పుష్పాలు, ఫలాలు వెలికి తీసేవాడెవడు? మనుషులకు, పశువులకు దానిని ఉపయోగకరమైనదిగా చేసినవాడెవడు? నీరును తన గర్బంలో భద్రపరిచే శక్తి భూమికిచ్చిందెవరు?

ప్రతి వస్తువును అవసరమున్నంత ప్రమాణంలో మాత్రమే ఆకర్షించుకునే శక్తి భూమికి ఇచ్చిందెవరు? అవసరానికి మించి ఆకర్షించదు, చలనమే కష్టం అవుతుంది గనక. అవసరానికంటే తక్కువ ఆకర్షిస్తే ప్రతి వస్తువు ఈదుతూ ఉంటుంది.

మనిషిని అందమైన ఆకారంలో సృష్టించినవాడెవడు?

అంతెందుకూ! మనిషి స్వయం తన ఆకృతి గురించి గమనిస్తే ఆశ్చర్యపడతాడు. నీ శరీరములో ఉన్న అవయవాలపై ఒకసారి దృష్టి సారించు, ఒక నిర్దిష్టమైన పద్దతిలో అవి పని చేస్తున్నాయి. వాటి పని విధానం గురించి నీకు తెలియునది అతితక్కువ. అలాంటప్పుడు దాని గురించి ఖచ్చితమైన నిర్ణయం ఎలా చేయగలవు?

నీవు పీల్చుతున్న ఈ గాలిని గమనించు! అది ఒక క్షణమైనా ఆగితే నీ జీవితమే అంతమవుతుంది. అయితే దాన్ని ఉనికిలోకి తెచ్చిందివరు?

నీవు త్రాగుతున్న నీరు, నీవు తింటున్న ఆహారం, నీవు నడుస్తున్న ఈ నేల, నీకు వెలుతురునిస్తున్న సూర్యుడు, ఇంకా నీవు తిలకిస్తున్న ఆకాశ చంద్రతారలన్నింటని సృష్టించినవాడెవడు?

అల్లాహ్‌. నిశ్చయంగా అల్లాహ్ యే.

అవును, అల్లాహ్‌యే ఈ జగమంతటినీ సృష్టించాడు. ఆయన ఒక్కడే దాన్ని నడుపుతున్నాడు. అందులో మార్పులు చేస్తున్నాడు. ఆయనే నీ ప్రభువు, నిన్ను సృజించాడు, ప్రాణం పోశాడు, ఆహారం ఇస్తున్నాడు, చివరికి మరణానికి గురిచేస్తాడు. ఆయనే నిన్ను, ఈలోకాన్ని సైతం శూన్యం నుండి ఉనికిలోకి తెచ్చినవాడు.

ఇదంతా తెలిశాక, ఎవరైనా బుద్ధిమంతుడు, ఈ లోకమంతా వృధాగా పుట్టంచబడిందని, మనుషులు జన్మిస్తున్నారు, కొంత కాలం జీవించి చనిపోతున్నారు, ఇలా అంతా సమాప్తమవుతుంది అని అనగలడా?

అయితే. వాస్తవం ఏమిటంటే: మనం మానవులం ఎందుకు పుట్టంచబడ్డాము? అనే ముఖ్య విషయాన్ని మనం తెలుసుకోవాలి.

మనమెందుకు పుట్టించబడ్డాము?

అల్లాహ్‌ మనల్ని పుట్టించింది కేవలం ఆయనను ఆరాధించడానికే. ఆ ఆరాధన విధానం తెలియజేయడానికి ప్రవక్తల్ని పంపాడు. గ్రంథాల్ని అవతరింపజేశాడు. ఎవరయితే ఆయన్నే పూజించి ఆయనకు విధేయులుగా ఉండి, ఆయన నివారించిన వాటి నుండి దూరంగా ఉంటాడో అతడే ఆయన సంతృష్టిని పొందినవాడు. మరెవరయితే ఆయన ఆరాధన నుండి విముఖుడై, ఆయన విధేయతను నిరాకరిస్తాడో అతడే ఆయన ఆగ్రహానికి, శిక్షకు గురైనవాడు.

అల్లాహ్‌ ఈ లోకాన్ని ఆచరణ మరియు పరీక్ష కొరకు పుట్టించాడు. మానవులు చనిపోతూ ఉంటారు. ఓ రోజు ప్రళయం సంభవిస్తుంది. అల్లాహ్‌ తీర్పు చేసి ఫలితాలు ఇవ్వడానికి మానవులను వెలికి తీస్తాడు. అల్లాహ్‌ అక్కడ వివిధ వరాలతో ఓ స్వర్గం సిద్దపరిచాడు. దానిని ఏ కన్నూ చూడలేదు. ఏ చెవీ వినలేదు. అది ఊహలకూ అతీతమైనది. విశ్వసించి, ఆయన ఆజ్ఞా పాలన చేసినవారి కొరకు అల్లాహ్‌ దానిని సిద్ధపరిచాడు.

అలాగే మానవులు ఊహించని రకరకాల శిక్షలతో కూడిన నరకాన్ని తయారు చేశాడు. అల్లాహ్‌ ను తిరస్కరించి, ఇతరుల్ని పూజించి, ఇస్లామేతర మతాలను అవలంభించిన వారి కొరకు అది సిద్ధంగా ఉంది.

ఇస్లాం అంటేమిటి?

ఇస్లాం అల్లాహ్‌ ఇష్టపడిన ధర్మం. అనగా అద్వితీయుడైన అల్లాహ్‌ను మాత్రమే ఆరాధించుట మరియు అల్లాహ్‌ యొక్క ప్రవక్త ముహమ్మద్‌ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క విధేయతను పాటించుట. ఏ వ్యక్తి అయినా సరే ఇస్లాం తప్ప ఇతర ధర్మాన్ని అవలంబిస్తే  దాన్ని అల్లాహ్‌ ఎన్నటికీ స్వీకరించడు. ఇది మానవ సమాజంలో ఏదో కొందరిది కాదు, సర్వ మానవులకు చెందినది.

అల్లాహ్‌ మానవులకు కొన్ని ఆదేశాలిచ్చాడు, మరికొన్ని విషయాలను నిషేధించాడు. ఎవడైతే ఇందులో అల్లాహ్‌కు విధేయత చూపుతాడో అతడు సాఫల్యం మరియు (నరకం నుండి) రక్షణ పొందుతాడు. ఎవడైతే అవిధేయత చూపుతాడో అతడు విఫలుడౌతాడు మరియు నష్టపోతాడు.

ఇస్లాం కొత్త ధర్మం కాదు. మానవులు భూమి మీద జీవిస్తున్నప్పటి నుండీ అల్లాహ్‌ వారి కొరకు ఇష్టపడిన ధర్మం.

మానవ సృష్టి

ఈ గాథ ‘ఆదం’ (అలైహిస్సలాం) ను అల్లాహ్‌ పుట్టించినప్పటి నుండి ప్రారంభం అవుతుంది. అల్లాహ్‌ అతడ్ని మట్టితో పుట్టించి, అతనిలో ఆత్మను ఊదాడు. సర్వ వస్తువుల పేర్లు అతనికి నేర్పాడు. అతని గౌరవ, ప్రతిష్టల ఉన్నతి కొరకు అతని ముందు సాష్టాంగ పడాలని దైవదూతలను ఆదేశించాడు. అందరూ సజ్దా చేశారు, కాని ఇబ్లీసు ఆదంతో తనకున్న ఈర్ష్య వలన సజ్దా చేయుటకు నిరాకరించి, అహంభావానికి గురి అయ్యాడు. అందుకు అల్లాహ్‌ అతడ్ని ఆకాశాల్లో ఉన్నటువంటి సౌకర్యాల నుండి తరిమి, అవమానం పాలు చేసి, తన కారుణ్యానికి దూరం చేశాడు. అతనిపై శాపం, థౌర్బాగ్యం మరియు నరకం విధించాడు. అప్పుడు అతడు అల్లాహ్‌తో ప్రళయం వరకు వ్యవధి కోరాడు. అల్లాహ్‌ అతనికి వ్యవధి ఇచ్చాడు. అక్కడే అతడు ఆదం సంతానాన్ని సన్మార్గం నుండి తప్పిస్తానని ప్రమాణం చేశాడు.

ఆదం చెలిమి, చనువు మరియు సుఖ, శాంతులు పొందుటకు అల్లాహ్‌ అతని నుండి అతని సహవాసి హవ్వాను సృజించాడు. ఏ మానవుని ఊహలకు అందనటువంటి భోగభాగ్యాలతో నిండివున్న స్వర్గంలో ఉండాలని ఆదేశించాడు. వారిద్దరి శత్రువైన ‘ఇబ్లీసు’ గురించి తెలియజేశాడు. వారిద్దరిని పరీక్షించడానికి స్వర్గంలో ఉన్న వృక్షాల్లో ఒక వృక్షం నుండి తినుటను నివారించాడు. అప్పుడు ‘షైతాన్’ వారిని ప్రేరేపించి ఆ వృక్షం నుండి తినుట మనోహరమైనదిగా చేసి, ‘నేను మీ నిజమైన శ్రేయోభిలాషిని’ అని ప్రమాణం చేసి ఇలా అన్నాడు: మీరు ఈ వృక్షం నుండి తింటే మీకు శాశ్వతమైన జీవితం లభిస్తుందని చెప్తూ వారిని అపమార్గం పట్టించే వరకు అతడు పట్టు విడవ లేదు. చివరికి వారు ఆ వృక్షం నుండి తినేశారు. తమ ప్రభువు యొక్క అవిధేయతకు పాల్పడ్డారు. పిదప తాము చేసినదానిపై పశ్చాత్తాప్పడి, తమ ప్రభువుతో క్షమాపణ కోరారు, ఆయన వారిని క్షమించాడు. కాని వారిని స్వర్గము నుండి భూమిపైకి దించాడు. ఆదం (అలైహిస్సలాం) తన భార్యతో భూమిపై నివసించారు. అల్లాహ్‌ వారికి సంతానం ప్రసాదించాడు. సంతానం యొక్క సంతానం ఇలా ఇప్పటికి పెరుగుతునే ఉన్నారు.

ఆదం సంతానాన్ని మార్గదర్శకత్వం నుండి తప్పించడానికి, సర్వ మంచితనాల నుండి అభాగ్యుల్ని చేయడానికి, చెడును మనోహరమైనది (ఆకర్షణేయమైనది)గా చేయడానికి, అల్లాహ్‌ కు ప్రియమైన వాటి నుండి దూరంగా ఉంచడానికి మరియు ప్రళయదినాన నరకం పాలు చేయడానికి ఇబ్లీసు మరియు అతని సంతానం ఎల్లవేళల్లో పోరాటానికి సిద్ధమైయున్నారు.

అయితే అల్లాహ్‌ మానవుల్ని నిర్లక్ష్యంగా వదలలేదు. ధర్మం, సత్యం అంటేమిటో స్పష్టపరచడానికి, వారి మోక్షం ఎందులో ఉందో తెలుపడానికి వారి వద్దకు ప్రవక్తల్ని పంపాడు.

ఆదం అలైహిస్సలాం చనిపోయిన తరువాత పది శతాబ్దాల వరకు వారి సంతానం ఏకత్వపు (తౌహీద్‌) సిద్దాంతం, అల్లాహ్‌ విధేయత పైనే ఉన్నారు. ఆ తరువాత అల్లాహ్‌ తో పాటు అల్లాహ్‌ యేతరులను ఆరాధించడం మొదలై షిర్క్‌ సంభవించింది. ప్రజలు విగ్రహాలను సయితం ఆరాధించడం మొదలుపెట్టారు. అప్పుడు ప్రజల్ని అల్లాహ్‌ వైపునకు పిలవడానికి, విగ్రహారాధన నుండి నిరోధించడానికి తొలి ప్రవక్త ‘నూహ్‌’ (అలైహిస్సలాం)ను అల్లాహ్‌ పంపాడు. ఆ తరువాత ప్రవక్తల పరంపర ఆరంభమయింది. వారు ప్రజల్ని (ఇస్లాం) వైపునకు అంటే అల్లాహ్‌ అద్వితీయుని ఆరాధన చేయుట, ఇతరుల ఆరాధనను త్యజించుటకు ఆహ్వానిస్తుండేవారు.

అల్లాహ్‌ ఆరాధనలో ఇతరులను సాటి కల్పించుట

అదే పరంపరలో హజ్రత్ ‘ఇబ్రహీం’ (అలైహిస్సలాం) ఒకరు. ఆయన కూడా తమ జాతి వారిని “విగ్రహారాధన వదలండనీ, అల్లాహ్‌ అద్వితీయున్నే ఆరాధించండని” బోధించారు. ఆయన తరువాత ప్రవక్త పదవి ఆయన ఇద్దరు సుకుమారులైన ‘ఇస్మాఈల్‌ (అలైహిస్సలాం) మరియు ‘ఇస్‌హాఖ్‌ (అలైహిస్సలాం)కు, వారి తరువాత మళ్ళీ ‘ఇస్‌హాఖ్‌ సంతానానికి లభించింది. ‘ఇస్‌హాఖ్‌’ సంతానంలో గొప్ప జ్ఞానం గలవారు: ‘యాఖూబ్‌’, ‘యూసుఫ్‌’, ‘మూసా’, ‘దావూద్‌, ‘సులైమాన్‌ మరియు ఈసా’ అలైహిముస్సలాం. ‘ఈసా’ (అలైహిస్సలాం) తరువాత ‘ఇస్‌హాఖ్‌ (అలైహిస్సలాం) సంతానంలో ఏ ప్రవక్తా రాలేదు.

అక్కడి నుండి ప్రవక్త పదవి ఇస్మాఈల్‌ (అలైహిస్సలాం) సంతతికి మరలింది. అందులో ఏకైక ప్రవక్త ముహమ్మద్‌ సల్లల్లాహు అలైహి వసల్లంను చిట్టచివరి ప్రవక్తగా, ప్రవక్తల అంతిమమునకు ముద్రగా మరియు ఆయన తీసుకువచ్చిన ధర్మమే చివరి వరకు ఉండాలని అల్లాహ్‌ ఎన్నుకున్నాడు. ఆయనపై అవతరించిన దివ్యగ్రంథం ఖుర్‌ఆనే మానవులకు అల్లాహ్‌ యొక్క అంతిమ సందేశం. అందుకే అది అరబ్బులకు, అరబ్బేతరులకు అంతే కాదు సర్వ మానవులకు మరియు జిన్నాతుల కొరకు కూడా చెందినది. ప్రతి కాలానికి మరియు యుగానికి అనుకూలమైనది. ప్రతి మేలును గురించి ఆదేశించినది. ప్రతి చెడును నివారించినది. ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై తీసుకువచ్చిన ఈ ధర్మం తప్ప, ఏ వ్యక్తి నుండీ మరే ధర్మాన్ని అల్లాహ్‌ స్వీకరించడు.

ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం)

అల్లాహ్‌ అద్వితీయుని ఆరాధన గురించి ప్రజలకు మార్గదర్శకత్వం చేయడానికి, దీనికి విరుద్ధంగా వారు పాటిస్తున్న విగ్రహాల ఆరాధనను ఖండించడానికి అల్లాహ్‌ ముహమ్మద్‌ సల్లల్లాహు అలైహి వసల్లంని అంతిమ ప్రవక్తగా పంపాడు. ఆయనతో అంతిమ సందేశాన్ని పంపాడు. మక్కా నగరములో, నలబై సంవత్సరాల వయస్సులో ఉండగా ముహమ్మద్‌ సల్లల్లాహు అలైహి వసల్లంకు ప్రవక్త పదవి లభించినది. ప్రవక్త పదవికి ముందు నుంచే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తమ జాతివారిలోనే కాదు, సర్వ మానవుల్లోకెల్లా ఉత్తమ నడవడిక, సద్వర్తన కలిగి యున్నారు. సత్యాన్ని పాటించడం, అమానతులను కాపాడటంలో ఆయనకు ఆయనే సాటి. సభ్యతా, సంస్కారంలో కూడా ఉన్నత శిఖరాన్ని అందుకున్నవారు ఆయనే. అందుకే తమ జాతివారే ఆయనకు “అమీన్‌” (విశ్వసనీయుడు) అన్న బిరుదునిచ్చారు. ఆయన “ఉమ్మీ” అంటే చదవడం, వ్రాయడం రానివారు. అటువంటి వారిపై అల్లాహ్‌ దివ్య ఖుర్‌ఆన్‌ అవతరింపచేసి, సర్వ మానవులు ఏకమై కూడా దీని వంటిది తీసుకురాలేరని ఛాలెంజ్‌ చేశాడు.

పూర్తి పుస్తకం క్రింద చదవండి:

<span>%d</span> bloggers like this: