[సురక్షిత యూట్యూబ్ లింక్: https://safeYouTube.net/w/gbir]
[ 30 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.
ఏ నమాజు యొక్క ఏ సమయం ఉంది, మరియు నమాజు చేయరాని సమయాలు ఏమిటి తెలుసుకోండి, ఇతరులకు తెలుపండి
నమాజు సమయాలు
عَنِ ابْنِ عَبَّاسٍ t قَالَ: قَالَ رَسُولُ اللهِ ﷺ: أَمَّنِي جِبْرِيلُ عَلَيْهِ السَّلَام عِنْدَ الْبَيْتِ مَرَّتَيْنِ، فَصَلَّى بِيَ الظُّهْرَ حِينَ زَالَتِ الشَّمْسُ وَكَانَتْ قَدْرَ الشِّرَاكِ، وَصَلَّى بِيَ الْعَصْرَ حِينَ كَانَ ظِلُّهُ مِثْلَهُ، وَصَلَّى بِيَ يَعْنِي الْمَغْرِبَ حِينَ أَفْطَرَ الصَّائِمُ، وَصَلَّى بِيَ الْعِشَاءَ حِينَ غَابَ الشَّفَقُ، وَصَلَّى بِيَ الْفَجْرَ حِينَ حَرُمَ الطَّعَامُ وَالشَّرَابُ عَلَى الصَّائِمِ، فَلَمَّا كَانَ الْغَدُ صَلَّى بِيَ الظُّهْرَ حِينَ كَانَ ظِلُّهُ مِثْلَهُ، وَصَلَّى بِي الْعَصْرَ حِينَ كَانَ ظِلُّهُ مِثْلَيْهِ، وَصَلَّى بِيَ الْمَغْرِبَ حِينَ أَفْطَرَ الصَّائِمُ، {وفي رواية أبي موسى: وَصَلَّى الْمَغْرِبَ قَبْلَ أَنْ يَغِيبَ الشَّفَقُ} وَصَلَّى بِيَ الْعِشَاءَ إِلَى ثُلُثِ اللَّيْلِ، وَصَلَّى بِيَ الْفَجْرَ فَأَسْفَرَ»
ఇబ్ను అబ్బాస్ రజియల్లాహు అన్హు కథనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారుః జిబ్రీల్ అలైహిస్సలాం కాబా వద్ద రెండు సార్లు నాకు నమాజు చేయించారు;
- పొద్దు వాలి, నీడ చెప్పు గూడంత ఉన్నప్పుడు నాకు జొహ్ర్ నమాజు చేయించారు,
- ప్రతి వస్తువు నీడ దానంత అయినప్పుడు నాకు అస్ర్ నమాజు చేయించారు,
- ఉపవాసమున్న వ్యక్తి ఉపవాసం విరమించే- టప్పుడు మగ్రిబ్ నమాజ్ చేయించారు,
- ఎర్రని కాంతులు మరుగైన తర్వాత ఇషా నమాజ్ చేయించారు,
- ఉపవాసముండే వ్యక్తిపై తినత్రాగడం నిషిద్ధం అయినప్పడు నాకు ఫజ్ర్ నమాజు చేయించారు.
మరుసటి రోజు;
- ప్రతి వస్తువు నీడ దానంత అయినప్పుడు జొహ్ర్ నమాజ్ చేయించారు,
- ప్రతి వస్తువు నీడ దాని రెండింతలు అయినప్పుడు అస్ర్ నమాజ్ చేయించారు,
- ఉపవాసమున్న వ్యక్తి ఉపవాసం విరమించే- టప్పుడు మగ్రిబ్ నమాజ్ చేయించారు, [అబూ మూసా ఉల్లేఖనంలో ఉందిః ఎర్రని కాంతి మరుగుపడే ముందు మగ్రిబ్ నమాజ్ చేయించారు]
- రాత్రి మూడవ భాగం గడిశాక ఇషా నమాజ్ చేయించారు,
- తెలుపుగా ఉన్నప్పుడు ఫజ్ర్ నమాజు చేయించారు. (అబూ దావూద్ 393, 395).
ప్రతి నమాజు తొలి సమయంలో చేయడం ఉత్తమం
عنْ أُمِّ فَرْوَةَ، قَالَتْ: سُئِلَ رَسُولُ اللهِ ﷺ أَيُّ الْأَعْمَالِ أَفْضَلُ؟ قَالَ: «الصَّلَاةُ فِي أَوَّلِ وَقْتِهَا»
ఉమ్మె ఫర్వా ఉల్లేఖనం ప్రకారం, కార్యాల్లో ఏదీ అతిఉత్తమమైనదని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ప్రశ్నించబడినప్పుడు, నమాజు దాని తొలి సమయంలో చేయడం అని సమాధానం ఇచ్చారు. (అబూ దావూద్ 426).
తెలిసీ సమయం దాటనివ్వకూడదు
عَنْ أَبِي ذَرٍّ، قَالَ: قَالَ لِي رَسُولُ اللهِ ﷺ: «كَيْفَ أَنْتَ إِذَا كَانَتْ عَلَيْكَ أُمَرَاءُ يُؤَخِّرُونَ الصَّلَاةَ عَنْ وَقْتِهَا؟ – أَوْ – يُمِيتُونَ الصَّلَاةَ عَنْ وَقْتِهَا؟» قَالَ: قُلْتُ: فَمَا تَأْمُرُنِي؟ قَالَ: «صَلِّ الصَّلَاةَ لِوَقْتِهَا، فَإِنْ أَدْرَكْتَهَا مَعَهُمْ، فَصَلِّ، فَإِنَّهَا لَكَ نَافِلَةٌ»
హజ్రత్ అబూ జర్ర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: మీ నాయకులు నమాజులను ఆలస్యంగా చేసినప్పుడు నీ పరిస్థితి ఏముంటుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అడిగారు, అలాంటప్పుడు నేనేమి చేయాలో మీరే ఆదేశించండి అని విన్నవించుకున్నాను, అప్పుడు ఆయన చెప్పారు: నీవు నమాజు దాని సమయంలో చేసుకో, వారితో కూడా నీకు అదే నమాజు మరోసారి చేయవలసి వచ్చినప్పుడు, వారితో కూడా చేయి, అది నీకు నఫిల్ అవుతుంది. (ముస్లిం 648).
ఇషా నమాజు ఆలస్యం చేయవచ్చును
عَنْ أَبِي هُرَيْرَةَ، قَالَ: قَالَ النَّبِيُّ ﷺ: «لَوْلَا أَنْ أَشُقَّ عَلَى أُمَّتِي لَأَمَرْتُهُمْ أَنْ يُؤَخِّرُوا العِشَاءَ إِلَى ثُلُثِ اللَّيْلِ أَوْ نِصْفِهِ»
ప్రవక్త సల్లల్ల్లాహు అలైహి వసల్లం చెప్పారని హజ్రత్ అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః నా అనుచర సంఘానికి కష్టతరంగా ఉంటుందన్న భయం నాకు లేకుంటే రాత్రి మూడవ భాగం లేదా అర్థ రాత్రి వరకు ఇషా నమాజును ఆలస్యంగా చేయండని ఆదేశించేవాడిని. (తిర్మిజి 167).
అయితే జమాఅతు (సామూహిక) నమాజు వదలి ఆలస్యం చేయకూడదు. ఏదైనా మస్జిదు వారందరూ ఏకమై ఆలస్యం చేస్తే అభ్యంతరం లేదు.
పడుకున్న లేదా మరచిపోయిన వ్యక్తి ఎప్పుడు నమాజు చేయాలి?
عَنْ أَنَسِ بْنِ مَالِكٍ t، قَالَ: قَالَ نَبِيُّ اللهِ ﷺ: «مَنْ نَسِيَ صَلَاةً، أَوْ نَامَ عَنْهَا، فَكَفَّارَتُهَا أَنْ يُصَلِّيَهَا إِذَا ذَكَرَهَا»
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశించారని హజ్రత్ అనస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: ఎవరైనా ఏదైనా నమాజు మరచిపోతే లేదా ఆ నమాజు సమయంలో నిద్రిస్తూ ఉంటే దాని పరిహారం ఏమిటంటే గుర్తు వచ్చిన (లేదా మేల్కొన్న) వెంటనే ఆ నమాజు చేసుకోవాలి. (ముస్లిం 684).
నమాజు చేయరాని సమయాలు
عن عُقْبَةَ بْنِ عَامِرٍ الْجُهَنِيَّ t يَقُولُ: ثَلَاثُ سَاعَاتٍ كَانَ رَسُولُ اللهِ ﷺ يَنْهَانَا أَنْ نُصَلِّيَ فِيهِنَّ، أَوْ أَنْ نَقْبُرَ فِيهِنَّ مَوْتَانَا: «حِينَ تَطْلُعُ الشَّمْسُ بَازِغَةً حَتَّى تَرْتَفِعَ، وَحِينَ يَقُومُ قَائِمُ الظَّهِيرَةِ حَتَّى تَمِيلَ الشَّمْسُ، وَحِينَ تَضَيَّفُ الشَّمْسُ لِلْغُرُوبِ حَتَّى تَغْرُبَ» {مسلم 831}
హజ్రత్ ఉక్బా బిన్ ఆమిర్ అల్ జుహనీ రజియల్లాహు అన్హు కథనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మేము మూడు వేళల్లో నమాజు చేయడం మరియు శవాలను ఖననం చేయడం నుండి వారించేవారుః
- సూర్యోదయం అయ్యే వేళ అది పైకెక్కే వరకూ,
- నడి నెత్తిన మీది కొచ్చిన సూర్యుడు వాలే వరకూ,
- సూర్యాస్తమయం అయ్యే వేళ పూర్తిగా ఆస్తమించే వరకు. (ముస్లిం 831).
عن أَبي سَعِيدٍ الخُدْرِيّ t يَقُولُ: سَمِعْتُ رَسُولَ اللهِ ﷺ يَقُولُ: «لاَ صَلاَةَ بَعْدَ الصُّبْحِ حَتَّى تَرْتَفِعَ الشَّمْسُ، وَلاَ صَلاَةَ بَعْدَ العَصْرِ حَتَّى تَغِيبَ الشَّمْسُ»
నేను ప్రవక్త ﷺ ఉద్బోధించగా విన్నాను అని హజ్రత్ అబూ సఈద్ ఖుద్రీ t ఉల్లేఖించారుః ఉదయం నమాజు నెరవేర్చిన తర్వాత సూర్యోదయం వరకూ మరే నమాజు లేదు. అలాగే అస్ర్ నమాజ్ నెరవేర్చిన తర్వాత సూర్యాస్తమయం వరకూ ఏ నమాజూ లేదు. (బుఖారి 586, ముస్లిం 827).
* ఫజ్ర్ కు ముందు గల సున్నతులు ముందే చేయ లేక పోతే ఫజ్ర్ తర్వాత చేయవచ్చును (తిర్మిజి 422).
కూర్పు: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ
ఇతరములు: